సాక్షి, హైదరాబాద్: అమృత్ పథకం టెండర్ల విషయంలో తనపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్‌కు సృజన్ రెడ్డి లీగల్ నోటీసులు ఇచ్చారు. తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలుచేసినందుకు కేటీఆర్, బీఆర్‌ఎస్ పార్టీకి నోటీసులు అందించారు. తప్పుడు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని సృజన్ రెడ్డి డిమాండ్ చేశారు
కాగా రేవంత్ రెడ్డి ఆధీనంలో ఉన్న పురపాలక శాఖ ద్వారా కేంద్రం అమలు చేస్తున్న అమృత్ టెండర్ల విషయంలో భారీగా అక్రమాలకు పాల్పడ్డారని కేటీఆర్ ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని బంధువులకు మోసపూరితంగా వందల కోట్ల రూపాయల కాంట్రాక్టులు దక్కేలా చేశారని ఆయన ఆరోపించారు.
రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధించి అర్హత లేని కంపెనీలకు కాంట్రాక్టుల కేటాయింపులో జరిగాయని ఆరోపించారు. సీఎం బావమరిది సృజన్‌రెడ్డికి చెందిన సంస్థకు ఏకంగా రూ.8,888కోట్ల విలువైన టెండర్‌ను అక్రమంగా కట్టబెట్టారని ఆరోపించారు. అయితే కేటీఆర్ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ నేతలతో పాటు, బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఖండించారు
అమృత్ టెండర్లపై కేటీఆర్‌కుు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని అన్నారు. సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డికి సొంత బావమరిది కాదని, తనకు అల్లుడని తెలిపారు. సృజన్ రెడ్డికి రాజకీయాలతో సంబంధం లేదని అన్నారు. వ్యాపారంలో జాయింట్ వెంచర్లు సహజమని, అమృత్ టెండర్లలోనూ అదే జరిగిందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment