alligations
-
కమిషనర్ పులి శ్రీనివాసులు అక్రమాలకు పాల్పడ్డారు: మనోహర్ నాయుడు
-
పీట్ హెగ్సెత్కు మహిళలంటే గౌరవం లేదు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన సొంత టీమ్‌ను ఏర్పాటు చేసుకొనే పనిలో నిమగ్నమయ్యారు. కీలక శాఖలకు మంత్రులుగా ఇప్పటికే పలువురి పేర్లు ప్రకటించారు. అధ్యక్షుడిగా ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వీరంతా మంత్రులుగా మారబోతున్నారు. కానీ, ట్రంప్ ఎంపికల పట్ల విమర్శలు వస్తున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని, లైంగిక వేధింపుల కేసుల్లో ఇరుక్కున్నవారిని ట్రంప్ మంత్రులుగా ఎంపిక చేశారంటూ అసంతృప్త స్వరాలు గట్టిగానే వినిపిస్తున్నా యి. ఆయన వినిపించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. అమెరికా రక్షణ శాఖ మంత్రిగా ఎంపికైన పెటీ హెగ్సెత్(44)పై ఆయన సొంత తల్లి పెనెలోప్ హెగ్సెత్ ఆరోపణలు చేయడం సంచలనాత్మకంగా మారింది. తన కుమారుడికి మహిళలంటే ఏమాత్రం గౌరవం లేదని, చులకనగా చూస్తాడని ఆమె తప్పుపట్టారు. చాలాఏళ్లు మహిళలతో అతడు అభ్యంతకరంగా ప్రవర్తించాడని ఆక్షేపించారు. తన బిడ్డ ప్రవర్తన సరైంది కాదని పేర్కొన్నారు. ఈ మేరకు 2018లో తన కుమారుడికి పెనెలోప్ పంపించిన ఈ–మెయిల్‌ను న్యూయార్క్ టైమ్స్ పత్రిక బహిర్గతం చేసింది. ‘‘నువ్వు(పీట్ హెత్సెత్) మహిళలతో అనుచితంగా ప్రవర్తిస్తుంటారు. వారిని చాలా చులకనగా చూడడం నీకు అలవాటు. ఆడవాళ్ల గురించి నోటికొచ్చినట్లు అబద్ధాలు చెప్తుంటావు. తప్పుడు ప్రచారం చేయడం నీకు ఇష్టం. అందుకే నిన్ను నేను ఎప్పటికీ గౌరవించలేను. ఒక తల్లిగా నీ ప్రవర్తన పట్ల మౌనంగా ఉండాలని ప్రయత్నించా. కానీ, నీ భార్యను ఘోరంగా వేధించావు. ఆమె చాలా మంచి అమ్మాయి. ఆమె అనుభవించిన బాధ ను తెలుసుకొని సహించలేకపోయాను. నీ ప్ర వర్తన పట్ల మేమంతా విసుగెత్తిపోయాం’’అని ఈ–మెయిల్లో పెనెలోప్ తన ఆవేదన వ్యక్తం చేశారు. హెగ్సెత్ రక్షణ శాఖ మంత్రిగా ఎంపిక కావడంతో ప్రస్తుతం ఈ అంశం అమెరికాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో పెనెలోప్ స్పందించారు. కోపం, ఆవేశంతో అప్పట్లో తన కుమారుడిపై ఆగ్ర హం వ్యక్తం చేస్తూ ఈ–మెయిల్ పంపించానని, ఆ తర్వాత అతడికి క్షమాపణ చెప్పానని వెల్లడించారు. ఇదిలా ఉండగా, పీట్ హెగ్సెత్కు వివాహేతర సంభంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సంబంధంతో ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చినట్లు సమాచారం. -
కేటీఆర్‌కు సృజన్ రెడ్డి లీగల్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: అమృత్ పథకం టెండర్ల విషయంలో తనపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్‌కు సృజన్ రెడ్డి లీగల్ నోటీసులు ఇచ్చారు. తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలుచేసినందుకు కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీకి నోటీసులు అందించారు. తప్పుడు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని సృజన్ రెడ్డి డిమాండ్ చేశారుకాగా రేవంత్ రెడ్డి ఆధీనంలో ఉన్న పురపాలక శాఖ ద్వారా కేంద్రం అమలు చేస్తున్న అమృత్ టెండర్ల విషయంలో భారీగా అక్రమాలకు పాల్పడ్డారని కేటీఆర్ ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని బంధువులకు మోసపూరితంగా వందల కోట్ల రూపాయల కాంట్రాక్టులు దక్కేలా చేశారని ఆయన ఆరోపించారు.రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధించి అర్హత లేని కంపెనీలకు కాంట్రాక్టుల కేటాయింపులో జరిగాయని ఆరోపించారు. సీఎం బావమరిది సృజన్‌రెడ్డికి చెందిన సంస్థకు ఏకంగా రూ.8,888కోట్ల విలువైన టెండర్‌ను అక్రమంగా కట్టబెట్టారని ఆరోపించారు. అయితే కేటీఆర్ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ నేతలతో పాటు, బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఖండించారుఅమృత్ టెండర్లపై కేటీఆర్‌కుు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని అన్నారు. సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డికి సొంత బావమరిది కాదని, తనకు అల్లుడని తెలిపారు. సృజన్ రెడ్డికి రాజకీయాలతో సంబంధం లేదని అన్నారు. వ్యాపారంలో జాయింట్ వెంచర్లు సహజమని, అమృత్ టెండర్లలోనూ అదే జరిగిందని పేర్కొన్నారు. -
సోనియాపై ఆరోపణలు.. కంగనాకు కాంగ్రెస్ వార్నింగ్
హిమాచల్ ప్రభుత్వం, సోనియా గాంధీపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. విపత్తు సాయం కోసం ఉద్ధేశించిన నిధులను హిమాచల్ ప్రభుత్వం.. వాటిని సోనియా గాంధీకి అక్రమంగా బదిలీ చేసినట్లు కంగన చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరింది. లేని పక్షంలో ఆమెపై పరువునష్టం కేసు నమోదు చేస్తామని హెచ్చరించింది.ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. కంగనా రనౌత్ తన ఆరోపణలను ఉపసంహరించుకోవాలని లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ‘కంగన తన ప్రకటనను ఉపసంహరించుకోకపోతే.. మేం పరువు నష్టం దావా వేస్తాం. ఆమె ఆధారాలతో అలాంటి ప్రకటన చేసింది? సోనియా గాంధీ లాంటి నాయకురాలిపై ఆమె అలాంటి ప్రకటన చేయడం చాలా దురదృష్టకరం.కేంద్రం నుంచి వచ్చే నిధులు లేదా రాష్ట్ర అభివృద్ధికి కేటాయించిన నిధులు సోనియా గాంధీకి ఇస్తున్నారని చెప్పడం కంటే పెద్ద మూర్ఖపు ప్రకటన మరొకటి ఉండదు. ఒక్క రూపాయి అయినా దారి మళ్లినట్లు రుజువు చేయాలి. లేదంటే నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి క్షమాపణ చెప్పాలి. లేకుంటే ఆమెపై కాంగ్రెస్ పరువునష్టం కేసు పెడుతుంది’ అని తెలిపారు.కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఖజానాను ఖాళీ చేశాయన్న విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు కంగనా రనౌత్. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అప్పులు చేసి మరి సోనియా గాంధీకి నిధులు బదిలీ చేసినట్లు ఆరోపించారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు గండి పడిందని అన్నారు. ‘కేంద్రం విపత్తు నిధులు ఇస్తే, అది సీఎం రిలీఫ్ ఫండ్‌కు వెళుతుంది. అయితే హిమాచల్‌లో సోనియా రిలీఫ్ ఫండ్‌కు వెళుతుంది’ అని మనాలిలో ఆదివారం జరిగిన బీజేపీ కార్యక్రమంలో పేర్కొన్నారు. -
లైంగిక ఆరోపణలు.. జానీ మాస్టర్‌పై నామమాత్రపు చర్యలు
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై ఓ యువతి లైంగిక ఆరోపణలు చేయడం అటు సినీ ఇండస్ట్రీలో.. ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ.. జానీ మాస్టర్ వద్ద కొన్నాళ్లుగా పనిచేస్తున్న ఓ మహిళా డ్యానర్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును నార్సింగి పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం యువతి ఆరోపణలపై నార్సింగి పోలీసులు విచారణ చేపట్టారు.కాగా పవన్ కల్యాణ్ అభిమాని అయిన జానీ మాస్టర్.. గత ఎన్నికల ముందు జనసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అదే సమయంలో పార్టీ జానీ మాస్టర్‌ను స్టార్ క్యాంపెయినర్‌గా కూడా నియమించింది. ఈ క్రమంలో ఆయనపై అత్యాచార ఆరోపణలు రావడంతో.. జనసేన పార్టీ కేవలం నామమాత్రపు చర్యలు మాత్రమే తీసుకుంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని మాత్రమే జనసేన ఆదేశించింది. ఆయనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన క్రమంలో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపింది. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వచ్చినట్లుగా పేర్కొంది. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే జానీ మాస్టర్‌పై కేసు నమోదైనా కేవలం పార్టీ కార్యక్రమాలకు మాత్రమే దూరంగా ఉండాలని చెప్పడం గమనార్హం.అయితే జానీ మాస్టర్‌పై నమోదైన ఎఫ్ఐఆర్లో మహిళా కొరియోగ్రాఫర్ కీలక విషయాలు వెల్లడించింది. 2017లో డీషోలో జానీ మాస్టర్ తో పరిచయం అయిందని, ఆ తర్వాత జానీ మాస్టర్ టీం నుంచి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా ఉండాలంటూ ఫోన్ రావడంతో 2019లో జానీ మాస్టర్ టీంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేరినట్లు తెలిపింది.చదవండి: జానీ మాస్టర్ కేసు.. బయటకొస్తున్న నిజాలు!?ఓ షో కోసం జానీ మాస్టర్ తో పాటు మరో ఇద్దరితో కలిసి ముంబైకి వెళ్లిన సమయంలోఅక్కడ హోటల్లో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడు అని ఆరోపించింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించారని ఆరోపించింది. షూటింగ్‌కు సంబంధించిన వాహనంలోనూ పలుమార్లు వేధింపులకు పాల్పడ్డారని పోలీసులకు తెలిపింది.పలుమార్లు షూటింగ్ సమయంలో జానీ మాస్టర్ చెప్పినట్లు వినకపోతే అసభ్యంగా ప్రవర్తించేవాడని చెప్పింది. మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం కూడా చేశారని పేర్కొంది. గత నెల 28న అనుమానాస్పద పార్శిల్ తన ఇంటి ముందు ఉందని.. దానిపై ‘ఇదే నీ చివరి షూటింగ్’ అని రాసి ఉన్నట్లు బాధితురాలు తెలిపారు. తనకు అవకాశాలు లేకుండా చేస్తున్నారని.. జానీ మాస్టర్ నుంచి ప్రాణహాని ఉన్నట్లు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. -
తుపాకీతో రైతులను బెదిరింపు.. పూజా ఖేద్కర్ తల్లి అరెస్ట్
ముంబై: అధికార దుర్వినియోగం, తప్పుడు ధృవీకరణ పత్రాల కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. భూ వివాదంలో రైతులను తుపాకీతో బెదిరించిన పూజా తల్లి మనోరమ అరెస్ట్ అయ్యారు. అక్రమంగా ఆయుధాలు కలిగిఉన్నారన్న ఆరోపణల కింద ఆమెను గురువారం పుణె పోలీసులు అరెస్టు చేశారు. కొద్దిరోజులుగా పూజాపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్న ఇటీవల ూణే జిల్లాలోని ముల్షి గ్రామంలో భూ వివాదంపై స్థానిక రైతులతో ఆమె పిస్తోల్‌తో బెదిరిస్తున్నట్లున్న వీడియో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.కాగా పుణెలో అదనపు కలెక్టర్‌గా శిక్షణా విధులు నిర్వర్తిస్తున్న పూజా ఖేద్కర్ బ్యూరోక్రాట్‌గా తన పదవిని దుర్వినియోగం చేయడం, ఇతర డిమాండ్లతో వివాదాస్పదమయ్యారు. ఆమె తన ప్రైవేటు ఆడీ కారుకు సైరన్, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్, వీఐపీ నంబర్ ప్లేట్లను అనుమతి లేకుండా వాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రొబేషన్‌లో రెండేళ్లపాటు ఉండే ఐఏఎస్‌లకు ఈ సౌకర్యాలు ఉండవు. దీంతో ఆమెను మహారాష్ట్ర ప్రభుత్వం వాసిమ్కు బదిలీ చేసింది.మరోవైపు ఆమె యూపీఎస్సీ అభ్యర్థిత్వంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2022 ఏప్రిల్‌లో తొలిసారి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు పిలువగా ఆమె కొవిడ్ సాకుగా చూపించి వెళ్లలేదు. ఆ తర్వాత కూడా కొన్ని నెలలపాటు తప్పించుకు వచ్చారు. చివరికి ఆరోసారి పిలవగా.. పాక్షికంగా పరీక్షలు చేయించుకున్నారు. దృష్టి లోపాన్ని అంచనావేసే కీలకమైన ఎమ్మారై పరీక్షకు ఆమె హాజరుకాలేదు. కానీ, ఆమె సివిల్ సర్వీసెస్ అపాయింట్మెంట్ ఏదోరకంగా పూర్తయింది. ఆ తర్వాత కమిషన్ ఆమె ఎంపికను ట్రైబ్యూనల్‌లో సవాలు చేసింది. 2023 ఫిబ్రవరిలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అయినా.. తన నియామకాన్ని కన్ఫర్మ్ చేసుకుంది.పూజాపై వివాదాలు ముదరడంతో ప్రభుత్వం ఆమెపై చర్యలు మొదలుపెట్టింది. ఆమెను శిక్షణ విధుల నుంచి రిలీవ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈనెల 23వ తేదీలోగా ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. -
పూజా ఖేద్కర్‌కు బిగ్ షాక్
ఢిల్లీ: వివాదాస్పద ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌కు భారీ షాక్ తగిలింది. అధికార దుర్వినియోగం, తప్పుడు ధృవీకరణ పత్రాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పూజాపై చర్యలు తీసుకున్నారు. మహారాష్ట్రలో ఆమె ట్రైనింగ్‌ను హోల్డ్‌లో పెట్టారు. ఈ మేరకు ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ ఆడ్మినిస్ట్రేషన్ రీకాల్ ఉత్తర్వులు జారీ చేసింది. సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఎంపిక అయ్యేందుకు వైకల్యం,ఓబీసీ సర్టిఫికేట్లను తారుమారు చేశారనే ఆరోపణల నేపథ్యంలో.. పూజా ఖేద్కర్ శిక్షణను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. అవసరమైన తదుపరి చర్యల నిమిత్తం ఆమెను జూలై 23లోగా అకాడమీకి రావాల్సిందిగా తెలిపింది.ఐఏఎస్ ఉద్యోగంలో చేరేందుకు పూజా ఖేద్కర్ తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్న విషయం తెలిసిందే. 2018, 2021లో అహ్మద్‌నగర్ జిల్లా సివిల్ హాస్పిటల్ అందించిన రెండు సర్టిఫికేట్లను బెంచ్‌మార్క్ డిజేబిలిటీస్ (PwBD) కేటగిరీ కింద యూపీఎస్సీకి సమర్పించారు. అయితే వైద్య పరీక్షల కోసం ఆమెను ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌కు యూపీఎస్సీ సిఫార్సు చేసింది. కానీ ఆమె 2022 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఆరుసార్లు మెడికల్ టెస్టులకు డుమ్మా కొట్టింది.మరోవైపు పూజా ఖేద్కర్ తనకు కంటి సమస్యలు ఉన్నట్లు ఆగష్టు 2022లో పూణేలోని ఔంధ్ ప్రభుత్వ ఆసుపత్రి నుండి వైకల్య ధృవీకరణ పత్రం కోసం పూజా దరఖాస్తు చేసుకోగా.. వైద్య పరీక్షల తర్వాత ఆమె దరఖాస్తు తిరస్కరణకు గురైంది. అయినప్పటికీ ఆమె సివిల్ సర్వీసెస్ అపాయింట్మెంట్ ఏదో ఒక రకంగా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఐఏఎస్‌గా పూజా ఖేద్కర్ ఎంపికను.. కమిషన్ ట్రిబ్యూనల్‌లో సవాలు చేయగా.. 2023 ఫిబ్రవరిలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు కూడా వచ్చింది. అయినా.. పూజా ఖేద్కర్ మాత్రం ఐఏఎస్‌గా ట్రైనింగ్ పొందడం గమనార్హం. ఈమె వివాదంపై దర్యాప్తునకు కేం ద్రం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. -
బైడెన్ తప్పుకోవడమే మంచిది: హాలీవుడ్ హీరో
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌పై రోజురోజుకీ వ్యతిరేకత ఎక్కువవుతోంది. ప్రత్యర్థులతోపాటు సొంత పార్టీ నుంచి సైతం బైడెన్ అభ్యర్ధిత్వంపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల బైడెన్ సొంత పార్టీకి చెందిన మహిళా సెనేటర్ నాన్సీ పెలోసి బైడెన్.. ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని అన్నారు.తాజాగా డెమోక్రాటిక్ పార్టీకి పెద్ద ఎత్తున ఫండ్స్ అందుస్తున్న ప్రముఖ నటుడు, దర్శకుడు జార్జ్ క్లూనీ సైతం అద్యక్షుడు జో బైడెన్‌పై పోటీపై పెదవి విరిచారు. రాబోయే అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి బైడెన్ తప్పుకోవాలని కోరారు. ఆయనతో ఎన్నికలకు వెళ్తే గెలవడం కష్టమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదే జరిగితే డెమోక్రాటిక్ పార్టీ అటు ప్రతినిధుల సభతో పాటు సెనేట్‌లోనూ మెజారిటీ కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ మేరకు బైడెన్ ఎన్నికల ప్రచారాన్ని ముగించాలని కోరుతూ ప్రముఖ వార్తా ప్రతిక న్యూయార్క్ టైమ్స్‌లో భావోద్వేగమైన లేఖ చేశారు.బైడెన్‌తో సుదీర్ఘకాలంగా సన్నిహిత సంబంధం కలిగి ఉన్న జార్జ్.. డెమొక్రాటిక్ పార్టీకి మద్దతునిచ్చే హాలీవుడ్ ఎలైట్ సభ్యులలో ఒకరు. పార్టీ కోసం ఎన్నోసార్లు నిధులు కూడా సేకరించారు. క్లూనీ తను రాసిన లేఖలో.. బైడెన్ తనకు మంచి మిత్రుడని, అతన్ని ఎంతో నమ్ముతానని చెప్పారు. గతంలో తన కోసం ఎంతో పనిచేశానని గుర్తు చేశారు.అయితే అప్పటి బైడెన్ కు.. ఇప్పుడున్న బైడెన్ కు చాలా తేడా ఉందని రాశారు. అతను సమయానికి వ్యతిరేకంగా గెలవలేని ఒక యుద్ధంతో పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. "నాకు చెప్పేందుకు మాటలు రావడం లేదు. కానీ మూడు వారాల క్రితం ఫండ్ రైజర్‌లో నేను కలిసిన జో బైడెన్.. ఒకప్పటి ఓ బైడెన్ వేరు. అతనిలో చాలా మార్పులు వచ్చాయి. 2010, 2020 చూసిన బైడెన్ కూడా కాదు. ఆయనలో ఎలాంటి ఉత్సాహం లేదు. బైడెన్ అంటే ఇటీవల డిబెట్లో చూసిన వ్యక్తినే మనం చూశాం.. ట్రంప్ తో జరిగిన చర్చలో తన ప్రదర్శన పేలవంగా ఉంది.డెమొక్రాటిక్ చట్టసభ సభ్యులు బిడెన్‌ను ఉపసంహరించుకోవాలని బహిరంగంగా పిలుపునివ్వంతో పరిస్థితి మరింత దిగజారింది. ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు. ప్రతీ చట్ట సభ్యుడు, గవర్నర్ ఇదే భావిస్తున్నారు. వారందరితో నేను వ్యక్తిగతంగా మాట్లాడాను. ఇక బైడెన్ తనంటే తానే తప్పుకోవడం మంచిది." అని భావోద్వేగంగా లేఖలో రాశారుఅయితే ఎన్నికలకు నాలుగు నెలలముందు బైడెన్ తప్పుకుంటే డెమొక్రాట్ పార్టీలో నాయకత్వ సంక్షోభం ఏర్పడుతుందనే వాదనను క్లూనీ కొట్టి పారేశారు. బైడెన్ స్థానంలో కొత్త అభ్యర్థి ఎవరనే అంశాన్ని ఆగస్టులో జరిగే డెమొక్రాట్ మీటింగ్ లో వైస్ ప్రెసిడెంట్ కమాలా హ్యారిస్, మేరీల్యాండ్ గవర్నర్ వెస్ మూర్, ఇతర నాయకులంతా కలిసి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.మరోవైపు జో బైడెన్.. తాను అధ్యక్ష ఎన్నికల్లో తప్పకుండా పోటీచేస్తానని.. తప్పుకునే ప్రసక్తే లేదని చెప్పారు. ఇక బైడెన్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించే వాళ్లలో చక్ షుమర్, హకీమ్ జెఫ్రీస్, నాన్సీ పెలోసి లాంటి అగ్రనాయకులతో పాటు.. డెమొక్రాట్ పార్టీకి చెందిన కొందరు సేనేటర్లు కూడా ఉన్నారు. అందుకే వారంతా బైడెన్ ని తప్పకోవాలని బహిరంగంగా చెబుతున్నారు. -
ట్రైనింగ్‌లోనే వీఐపీ డిమాండ్లు.. మహిళా ఐఏఎస్ అధికారి బాగోతం ఇది
ఓ మహిళ ట్రైనీ ఐఏఎస్ అధికారిపై మహారాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది.ప్రొబేషనరీ సమయంలోనే సదరు మహిళా అధికారి అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఫిర్యాదులు అందడంతో ఆమెను మరో చోటుకు బదిలీ చేసింది.ఆమెనె.. 2023 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి డాక్టర్ పూజా ఖేద్కర్. పుణె నుంచి వాషిమ్‌కు బదిలీ అయ్యారు. ఇక మిగిలిన శిక్షణ పదవీకాలాన్ని అక్కడే పూర్తి చేయనున్నారు. జూలై 30, 2025 వరకు అక్కడ "సూపర్‌న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్"గా పనిచేస్తుందని ప్రభుత్వం తమ ఉత్వర్వుల్లో పేర్కొంది. కాగా పుణె కలెక్టర్ డాక్టర్ సుహాస్ దివాసే సీఎస్‌కు లేఖ రాసిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు.అసలు ఆమె ఏం చేసిందంటేట్రైనీ అధికారి అయిన ఖేద్కర్.. పుణె కలెక్టరేట్ కార్యాలయంలో పనిచేస్తున్న సమయంలో అనేక అనుచిత ప్రవర్తనలు పాల్పడినట్లు తేలింది. ఆమె తన ప్రైవేట్ వాహనాన్ని ఉపయోగిస్తూ దానిపై వీఐపీ నంబర్ ప్లేట్‌ను పెట్టుకుంది. జిల్లా అదనపు కలెక్టర్ అజయ్ మోరే అందుబాటులో లేకపోవడంతో ఆయన కార్యాలయాన్ని కూడా ఆమె ఆక్రమించుకున్నట్లు సమాచారం. ఆయన లేని సమయంలో తన ఛాంబర్ డోర్ మీద పేరుతో బోర్డు ఉంచి ఆ స్థలాన్ని తన స్వంత కార్యాలయ గదిగా మార్చుకుందిఖేద్కర్ అధికారులపై అనేక డిమాండ్లను పెట్టినట్లు తెలుస్తోంది. వీఐపీ నంబర్ ప్లేట్ కలిగిన అధికారిక కారు, వసతి, తగినంత సిబ్బందితో అధికారిక ఛాంబర్, ఓ కానిస్టేబుల్ కావాలని కోరినట్లు సమాచారం. అయితే నిబంధనల ప్రకారం ట్రైనీకి పైన పేర్కొన్న సౌకర్యాలేవి ఉండవు.అయినా ఖేద్కర్ ఇంతటితో ఆగలేదు. అదనపు కలెక్టర్ ముందస్తు అనుమతి లేకుండా కుర్చీలు, సోఫాలు, టేబుల్లతో సహా అన్ని మెటీరియల్‌లను కార్యాలయం నుంచి తొలగించారు. అనంతరం ఆమె పేరు మీద లెటర్ హెడ్, విజిటింగ్ కార్డ్, పేపర్ వెయిట్, నేమ్‌ప్లేట్, రాజముద్ర, ఇంటర్‌కామ్ అందించాలని రెవెన్యూ అసిస్టెంట్‌ను ఆదేశించారు.ఇదిలా ఉండగా యూపీఎస్సీ పరీక్షలో 841 ఆల్ ఇండియా ర్యాంక్) సాధించిన ఖేద్కర,.. రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి కూతురు. తండ్రి కూడా మాజీ ఐఏఎస్ కావడంతో తన కూతురు డిమాండ్లను నెరవేర్చాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంపై ఆయన ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. కూతురికి ఏదైనా లోటు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించినట్లు సమాచారం -
డ్రగ్స్‌ను అరికట్టడంలో డీఎంకే ప్రభుత్వం విఫలమైంది: నటుడు విజయ్
చెన్నై: తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కజగం పార్టీ అధినేత విజయ్.. డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతోందని, దీనిని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విజయ్ ధ్వజమెత్తారు. మాదకద్రవ్యాలను నియంత్రించేందుకు స్టాలిన్ సర్కార్ ఏ ప్రయత్నం చేయడం లేదని ఆరోపించారు.విజయ్ మాట్లాడుతూ.. 'ఇటీవల కాలంలో తమిళనాడు యువతలో డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉంది. ఒక పేరెంట్‌గా, రాజకీయ పార్టీ నాయకుడిగా నేనే దీని గురించి భయపడుతున్నాను. యువతను డ్రగ్స్ నుంచి రక్షించడం ప్రభుత్వ కర్తవ్యం. కానీ ఈ విషయంలో ప్రస్తుత ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రాష్ట్రంలో మంచి నాయకులు రావాల్సిన అవసరం ఉందిస అని పేర్కొన్నారు.కాగా స్టాలిన్ ప్రభుత్వంపై విజయ్ నేరుగా విమర్శలు చేయడం ఇదే తొలిసారి. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ చేయనున్న విషయం తెలిసిందే. ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టాలని యోచిస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా.. తమిళనాడులోని కళ్లకురిచిలో ఇటీవల కల్తీ సారా తాగడం వల్ల 60 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ మరణాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా విచారణ చేపట్టి, వారంలోగా వివరణాత్మక నివేదిక ఇవ్వాలని కోరుతూ తమిళనాడు ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్‌కు నోటీసులు జారీ చేసింది. నివేదికను దాఖలు చేసేందుకు మద్రాసు హైకోర్టు జూలై 3 వరకు గడువు ఇచ్చింది. -
పొన్నం ప్రభాకర్‌పై సంచలన ఆరోపణలు
సాక్షి, కరీంనగర్: కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ అతిపెద్ద స్కాం చేశాడని బీఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. మంత్రి అండగదండలతో రామగుండంలో ఫ్లై యాష్ బూడిదను ఉచితంగా తరలిస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీపీసీలో నుంచి వస్తున్న యాష్‌ను లోడ్ రికార్డు లేకుండానే బయటకు పంపిస్తున్నారని అన్నారు. అయితే లారీ లోడు ఖాళీగా చూపిస్తూ వే బ్రిడ్జి ఇస్తున్నారని విమర్శించారు. .కలెక్షన్ బాయ్‌గా పొన్నం ప్రభాకర్ అన్న కొడుకు అనూప్ ఈ వ్యవహారాలు చూస్తున్నాడని కౌశిక్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. స్థానికంగా దీనిపై వార్తలు రాస్తున్న రిపోర్టర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ క్రమంలో రెండు లారీలను సీజ్ చేసి, మిగితా 13 లారీలను వదిలిపెట్టారని తెలిపారు.ఇంత పెద్ద స్కాంపై బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ పొన్నం ప్రభాకర్‌ను ప్రశ్నించారు. తమ ఆరోపణలపై దమ్ముంటే మంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు. `నా దిష్టి బొమ్మ తగలబెట్టడం కాదు. ఈ స్కాం పై మీరు మాట్లాడాలి. ఆధారాలతో సహా మేము బయట పెడుతున్నాం. రేపటి నుంచి లా అండ్ ఆర్డర్ అదుపు తప్పితే మేము బాధ్యులం కాదు. పేద పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.` అంటూ మండిపడ్డారు.కాగా రెండు రోజుల క్రితం ఓవర్ లోడ్‌తో రామగుండం నుంచి ఖమ్మం వెళ్తున్న బూడిద లారీలను హుజురాబాద్ వద్ద ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు. వే బిల్లు లేకుండా ప్లై యాష్ బూడిద తరలించడాన్ని గుర్తించి సంబంధించిన అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు సకాలంలో స్పందించకపోవడంతో ఆందోళనకు దిగి అధికారుల తీరు, మంత్రి పొన్నం వైఖరిపై మండిపడ్డారు.రవాణా శాఖ మంత్రి అండదండలతోనే అక్రమ దందా సాగుతుందని ఆరోపించారు. అధికారులకు పిర్యాదు చేసిన మంత్రి ప్రోద్బలంతో పట్టించుకోవడం లేదని విమర్శించారు. అక్రమ దందాకు చేస్తున్న మంత్రి పొన్నం ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. -
29 ఏళ్లుగా వేధిస్తున్నారు.. షాకింగ్ విషయాలు చెప్పిన నారాయణ మరదలు
హైదరాబాద్: ఏపీ మాజీమంత్రి పొంగూరు నారాయణపై ఆయన తమ్ముడు సుబ్రహ్మణ్యం భార్య కృష్ణప్రియ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. 29 ఏళ్లుగా నారాయణ, భర్త సుబ్రహ్మణ్యం అలియాస్ మణి తనను మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నారని ఆదివారం ఉదయం రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న తాను ఎదుర్కొన్న అనుభవాలను పోస్టు చేశానని, రాజకీయంగా వారికి ఇబ్బంది కలుగుతోందని భావించి తన ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్‌ను మూసివేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం గచ్చి బౌలిలోని బాంబూస్ మీనాక్షి విల్లాస్ ఎదుట కృష్ణప్రియ మీడియాతో మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే.. పెళ్లయిన రెండో రోజు నుంచే బావ నారాయణ లైంగిక వేధింపులు మొదలుపెట్టాడు. ఆయనకు లొంగకపోవడంతో 29 ఏళ్లుగా ఆయన పెట్టే బాధలు భరిస్తున్నాను. ఆయన స్త్రీలోలుడు. నారాయణ విద్యా సంస్థల్లో పనిచేసే కొందరు మహిళలు ఆయన దగ్గరకు వెళ్లాల్సిందే. సోదరి వరుసైన వారు స్నానం చేస్తున్నప్పుడు బాత్రూమ్లోకి తొంగి చూసేవాడు. ఈ విషయం మొదట్లో వాళ్ల వాళ్లే చెప్పారు. నేను లొంగకపోవడంతో వేధింపులు ప్రారంభించాడు. నాకు మానసిక సమస్య ఉన్నట్లుగా నా భర్త తప్పుడు సర్టిఫికెట్లు చూపించి యూట్యూబ్ వేదికగా ప్రచారం చేయడం చాలా బాధేసింది. నారాయణ మెడికల్ కాలేజీలో పనిచేసే డాక్టర్ శేషమ్మ నుంచి మెడికల్ సర్టిఫికెట్ తీసుకురావడం వారికి పెద్ద సమస్య కాదు. అలాగే, నారాయణ పిల్లలకు మానసిక సమస్యలు ఉన్నాయి. డాక్టర్ విరించి వారికి చికిత్స చేస్తున్నారు. విరించి నుంచి కూడా సర్టిఫికెట్ తేవడం పెద్ద కష్టమేమి కాదు. ఒకరోజు మా నాన్నపై అరుస్తుంటే గుంటూరులో ఓ డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. నిద్రలేమితో నిద్రమాత్రలు వేసుకుంటున్నట్లు డాక్టర్‌కు చెప్పాను. మానసిక ఒత్తిడితోనే నిద్రలేమి సమస్య ఉండవచ్చని డాక్టర్ చెప్పారు. నేను ఇటీవల ఏఐజీ ఆస్పత్రిలో చేరిన విషయం నిజమే. ఇక రక్త సంబంధం ఉంది కాబట్టే నారాయణకు నా భర్త పెట్గా మారాడు. కేసు నమోదు చేయలేదు: సీఐ కృష్ణప్రియ ఫిర్యాదును పరిశీలిస్తున్నామని, ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదని రాయదుర్గం సీఐ మహేష్ తెలిపారు. -
‘ప్రజలను చంపుకొని తినే క్రూరమైన ప్రభుత్వమిది’.. సంజయ్ రౌత్‌పై కేసు
సాక్షి, ముబై: ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేసిన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఎంపీ సంజయ్ రౌత్‌పై శుక్రవారం మెరైన్‌లైన్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. శిందే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యేలు సంజయ్ శిర్సాట్, భరత్ గోగవావలే కిరణ్ పావస్కర్ మెరైన్ లైన్స్ పోలీసు స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ నీలేశ్ బాగుల్‌కు ఫిర్యాదు చేశారు. రౌత్ చేసిన ఆరోపణలు సమాజంలో విభేదాలు సృష్టించే విధంగా ఉన్నాయంటూ ఫిర్యాదుదారులు ఆరోపించారు. న్యూ ముంబై ఖార్ఘర్లో గత ఆదివారం జరిగిన మహారాష్ట్ర భూషణ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో వడదెబ్బ తగలి చనిపోయిన వారు 14 మంది కాదని దాదాపు 50-75 మంది ఉన్నారని గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రౌత్ ఆరోపించారు. అంతేగాకుండా మృతుల సంఖ్యను తక్కువ చూపించేందుకు మృతుల కుటుంబ సభ్యులు, బందువుల ఇళ్లకు వెళ్లి లక్షల్లో డబ్బులు ఎరచూసాన విమర్శించారు. శిందే నోటికి తాళం పడిందా? అసలు మృతుల సంఖ్య ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. మననుషల ప్రాణాలకు విలువలేదు. డబ్బుతో వెల కడుతున్నారని దుయ్యబట్టారు. నిర్వాహకుల నిర్లక్ష్యంవల్లే ఇంతమంది చనిపోయారని, మృతులకు కారకులైన శిందే, ఫడ్నవీస్ పదవుల్లో కొనసాగే అధికారం లేదని, కింటనే రాజీనామా చేయలని డిమాండ్ చేశారు. ప్రజలను చంపుకు తినే క్రూరమైన ప్రభుత్వమిదని మండిపడ్డారు. మొత్తం 14 మంది మృతుల్లో 12 మంది ఏడు గంటలకుపైగా ఎండతో ఉపవాసంతో ఉండటంవల్ల మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదిక పేర్కొంది. దీంతో రౌత్ చేసిన ఆరోపణలకు మరింత బలం చేకూర్చినట్లైంది. కాగా, శిందే, ఫడ్నవీస్‌లపై మనుష్యవథ కేసు నమోదు చేయాలని సంఘటన జరిగిన తరువాత అదే రోజు అజిత్‌పవార్, సంజయ్ రౌత్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. కానీ గురువారం విలేకరుల ఎదుట సంజయ్ చేసిన విమర్శలు సమాజంలో విభేదాలు సృష్టించేలు ఉన్నాయంటూ కేసు నమోదు చేశారు. -
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై మహిళ తీవ్ర ఆరోపణలు
-
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై మహిళ తీవ్ర ఆరోపణలు
సాక్షి, మంచిర్యాల: బీఆర్ఎస్ నేత, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యేపై మహిళా తీవ్ర ఆరోపణలు చేశారు. తమను నమ్మించి మోసం చేశారంటూ అరిజిన్ పాల సంస్థ భాగస్వామి శైలజ ఆరోపించారు. తమ డబ్బులు తీసుకొని, తిరిగి తమ మీదనే కేసులు బనాయించి రిమాండ్‌కు పంపించాడని తెలిపారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో తనకు ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆడియోలో.. ‘దుర్గం చిన్నయ్య అనే వ్యక్తిని తొలిసారి మా బ్రాంచ్ ఓపెనింగ్ రోజు కలిశాము. మీ కంపెనీలో మాకు తెలిసన వాళ్లకు షేర్స్ ఇవ్వండి.. మీకు ఫుల్ సపోర్ఠ్ చేస్తాను, మీకు ఏం కావాలన్నా చేసి పెడతాను అని చెప్పారు. మేము దానికి ఓకే చెప్పాము. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తరుచూ బిజినెస్ పనుల కోసం మాట్లాడేవాళ్లం. కొన్నిసార్లు మాతో పాటు మా దగ్గర పనిచేసే ఒక అమ్మాయి కూడా వచ్చేది. ఒకరోజు ఎమ్మెల్యే కాల్ చేసి మీతోపాటు ఒక అమ్మాయి వచ్చింది కదా.. ఆమెను ఒకరోజుకు నాతో పంపిస్తారా అని అడిగారు. ఆ అమ్మాయి అలాంటిది కాదని చెప్పాం. కానీ ఎవరో ఒక అమ్మాయిని తప్పకుండా తన దగ్గరికి పంపాలని ఎమ్మెల్యే అడిగారు. లేకపోతే మీ ఇష్టం అంటూ బెదిరించారు. దీంతో చేసేదేం లేక తెలిసిన వాళ్ల ద్వారా బ్రోకర్ల నెంబర్లు ఇస్తే మేము డైరెక్ట్‌గా ఆయనకు అప్పజెప్పాం. వాళ్లతో ఆయన టచ్‌లో ఉన్నారు. తరువాత దళితబంధు సమావేశమని మళ్లీ ఒకసారి మమ్మల్ని పిలిపించి మందు ఏర్పాటు చేశారు. నాతో బలవంతంగా తాగించేందుకు ప్రయత్నించాడు. నన్ను లైంగిక వేధింపులకు గురిచేశాడు. నేను అక్కడి నుంచి వెళ్లిపోయాను. మా దగ్గర డబ్బులు తీసుకొని తన పర్సనల్ పనులకు వాడుకున్నాడు. చెప్పింది చేయకుంటే మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశాడు. చాలా మోసం చేశాడు. మళ్లీ దళిత బంధు గురించే మట్లాడాలని ఒత్తిడి చేసి బెల్లంపల్లిలోని ఆయన ఇంటికి పిలిపించాడు. తరువాత ఆయన అక్కడున్న పోలీసులకు మమ్మల్ని అప్పగించి 3 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచారు. మేం ఏం తప్పులు చేయకున్నా తప్పుడు కేసులు పెట్టి పోలీసులు టార్చర్ చేశారు. మాకు సంబంధం లేదు అని చెబితే కూడా మీరు ఏమున్నా ఎమ్మెల్యేతో మాట్లాడుకోండి అని చెప్పారు. ఆయన చెప్పిన దానికి ఒప్పుకోవడం లేదని నన్ను రిమాండ్‌కు పంపించారు. రిమాండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా రెండు తప్పుడు కేసులు పెట్టి ఇరికించారు. ఏ కేసులతో నాకు ఏలాంటి సంబంధం లేదు. తప్పుడు కేసులకు సంబంధించి మా దగ్గర అన్నీ ఆధారాలు ఉన్నాయి. వీటిని చూపిస్తుంటే కూడా పోలీసులు.. మాకు ఇవ్వన్నీ సంబంధం లేదన్నట్లు మాట్లాడుతున్నారు. దుర్గం చిన్నయ్య, వాళ్ల మనుషుల నుంచి నాకు ప్రాణహాని ఉంది. నాకు మీడియా సపోర్ట్ కావాలి. నన్ను ఈ సమస్య నుంచి బయటకు తీసుకు రావాలి’ అని శైలజ విజ్ఞప్తి చేశారు. -
ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై మహిళా సర్పంచ్ సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి వరంగల్ బీఆర్ఎస్ పార్టీలో పెను ప్రకంటపనలు మొదలయ్యాయి. మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. రాజయ్యపై జానకీపురం మహిళ సర్పంచ్ నవ్య తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే తనకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని.. లైంగికంగా వేధిస్తున్నారని మండిపడ్డారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్యే కాల్ చేసి బయటకు రమ్మంటున్నారని నవ్య ఆరోపణలు చేస్తున్నారు. రాజయ్య మాట్లాడిన కాల్ రికార్డ్స్ ఉన్నాయని పేర్కొన్నారు. సమయం చూసి అవన్నీ భయటపెడతానని అన్నారు. తన వెనక ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఎవరో చెప్పిన మాటలు వినాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఇటువంటి వేధింపులు ఎదుర్కొంటూ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ‘నీ మీద కోరికతోనే పార్టీ టికెట్ ఇచ్చానని అన్నారు. పక్కన నిలబడితే ఎక్కడెక్కడో చేయి వేస్తారు. హగ్ చేసుకోవడానికి వస్తారు. బిడ్డలాంటి దాన్ని అని చెప్పినా మారరా. మీకు సహకరించకుంటే నా బతుకు నాశనం చేస్తారా. రావాల్సిన నిధులు రాకుండా అడ్డుకుంటారా. దయచేసి ఇప్పటికైనా ఈ అరాచకాలు మానండి. ఇలాంటి వారితో పార్టీకి చెడ్డ పేరు వస్తోంది. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలి’ అని తెలిపారు. మరోవైపు తనపై చేస్తున ఆరోపణలపై ఎమ్మెల్యే రాజయ్య స్పందించారు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయని, గతంలో జరిగినట్లు రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని అన్నారు.ప్రజల్లో లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇంటి దొంగలే శిఖండి పాత్ర పోషించి తనను అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ను కలిసి అన్ని విషయాలు వివరిస్తానని తెలిపారు. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. -
ఫొటో చూడు.. క్యాష్ ఎంత ఇస్తావో చెప్పేయ్.. అమ్మాయిలు మస్త్ మస్త్‌గా ఉన్నారు!
ఫొటో చూడు.. క్యాష్ ఎంత ఇస్తావో చెప్పేయ్.. సమయాన్ని బట్టి ధర..నాకు ఎంత.. పోలీసోళ్లను కూడా చూసుకోవాలి.. మా వాళ్లే అన్ని చూసుకుంటారు.. ఇబ్బంది లేకుండా.. కొంత ఎక్కువే చెప్పండి.. ఇదే కాదు, ఇంకా చాలా ఫొటోలు ఉన్నాయి.. అమ్మాయిలు మస్త్ మస్త్‌గా ఉన్నారు.. లెక్క కుదిరితే తీసుకెళ్తా.. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఓ బ్రోకర్ అదే జిల్లాకు చెందిన యువకుడితో ఇటీవల సంభాషించిన మాటలు ఇవి. జిల్లాలో వ్యభిచార దందా ఏ విధంగా సాగుతుందో దానితోపాటు ఖాకీల చెడు సావాసానికి ఇది అద్దం పడుతోంది. న్యూడ్‌కాల్స్ వ్యవహారానికి సంబంధించి ‘డర్టీ పిక్చర్’ సంఘటనను జోగుళాంబ గద్వాల జిల్లా ప్రజలు ఇంకా మరిపోనేలేదు. జిల్లా ప్రతిష్ట మసక బార్చేలా వ్యవహరింన తీరుపై అప్పట్లో ప్రభుత్వ పెద్దలు, పోలీస్ ఉన్నతాధికారులు జిల్లా యంత్రాంగంపై సీరియస్ అయ్యారు. అయినా ఆ శాఖలోని పలువురు అవినీతి ఖాకీలు తమ పంథాను మార్చుకోలేదు. జిల్లాలో వ్యభిచార దందా మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్లు కొనసాగడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. దీనికంతటికీ ఆమ్యామ్యాల కక్కుర్తే కారణం. అనుమానం వచ్చి ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే తప్ప ఎలాంటిచర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అసాంఫిక కార్యకలాపాలపై పకడ్బందీగా నిఘా పెట్టి ఉక్కు పాదం మోపాల్సిన వారే.. అక్రమార్కులకు ప్రత్యక్షంగా, లేకుంటే పరోక్షంగా సహకారం అందిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సృజన ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. వ్యభిచార దందాకు సహకరిస్తున్న కీలక పోలీసులు ఎవరు..రాజకీయ నేతల పాత్ర ఏమిటి.. ఎవరి ఒత్తిళ్లు ఏఅధికారిపై ఉన్నాయి.. అనే కోణంలో గుట్టుచప్పుడు కాకుండా ఆరా తీస్తున్నారు. ఈనేపథ్యంలో సాక్షి ప్రత్యేక కథనం. అరోపణలు ఇలా ► ఫిబ్రవరి 19న గద్వాల పట్టణం భీం నగర్ కాలనీలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేశారు. వ్యభిచారకేంద్రం నిర్వాహకురాలితో పాటు ఓ యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపైనే కేసు పెట్టారు. కానీ.. ఈ సంఘటనలో కొందరిని తప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ► 2022 ఆగస్టు 7న గద్వాల బీరోలు రోడ్డు (తాయమ్మ గుడి) సమీపంలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా సభ్యురాలు, ఇద్దరు మహిళలు, ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరు పరారీలో ఉన్నారని.. వారిని అదుపులోకి తీసుకుంటామని చెప్పినప్పటికీ ఎవరి పైనా చర్యలు లేకుండాపోయాయి. ►2021 మే 6న గద్వాల పట్టణంలోని సాయిహోంకాలనీలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుపోలీసులకు సమాచారం అందింది. తెల్లవారుజామునే సోదాలు చేసి ముగ్గురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. రెండురోజుల పాటు విచారణ చేశారు. ఓ అధికారప్రజాప్రతినిధికి చెందిన ముఖ్య అనుచరుడితో పాటు పలువురు చోటామోటా నాయకులు వ్యభిచారం చేస్తూ పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడినప్పటికీ కేసు నమోదుచేయలేదు. పెద్ద మొత్తంలో డబ్బులు చేతులుమారినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. ఇతర రాష్ట్రాల నుంచి యువతులు విజయవాడకు చెందిన ముఠాసభ్యులు గద్వాల కేరాఫ్ అడ్రాస్గాఎంచుకుని గుట్టుగా శివారు కాలనీలో ఇళ్లను అద్దెకు తీసుకుంటున్నారు. ఎవరికి అనుమానం కలుగకుండా ఒక్కో యువతిని దిగుమతి చేసుకుంటూ.. ఇళ్లు మారుస్తూ వ్యభిచార దందా నడిపిస్తున్నారు. ప్రధానంగా గద్వాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలు, విజయవాడ, కర్నూలు, గుంటూరు జిల్లాలతోపాటు తెలంగాణలోని హైదరాబాద్, కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరునుంచి అమ్మాయిలను తీసుకొచ్చి పడుపువృత్తి చేయిస్తున్నారు. -
అత్యాచార ఆరోపణలు.. అండమాన్ మాజీ సీఎస్ అరెస్ట్
సామూహిక అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అండమాన్ నికోబార్ మాజీ చీఫ్ సెక్రటరీ జితేంద్ర నరైన్‌ను అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే ఈ కేసులో విచారణకు హాజరు కావాలని జితేంద్రకు సమన్లు జారీ చేశారు. పోర్ట్ బ్లెయిర్‌లో గురువారం విచారణకు హాజరైన అయన్ను అక్కడే అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఆయన బెయిల్ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది. క అండమాన్ నికోబార్ చీఫ్ సెక్రటరీగా ఉన్న సమయంలో జితేంద్ర నరైన్.. మరికొందరితో కలిసి ఒ మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయనపై విచారణకు ఆదేశించడంతో దర్యాప్తు జరిపిన పోలీసులు.. తమ నివేదికను హోం మంత్రిత్వ శాఖకు పంపారు. దాంతో నరైన్‌ను అక్టోబర్ నెలలో హోంశాఖ సస్పెండ్ చేసింది. నరైన్ తన అధికారాన్ని దుర్వినియోగపరిచారని, మున్ముందు కూడా దుర్వినియోగపరిచే అవకాశాలు ఉన్నాయని పోలీసులు శాఖ తన నివేదికలో పేర్కొంది. ఈ కేసును అండమాన్ నికోబార్ పోలీసులు, ప్రత్యేక దర్యాప్తు బృందం విడివిడిగా దర్యాప్తు చేస్తోంది. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తే ఏమాత్రం సహించమని.. నిందితుల స్థాయి, హోదాతో సంబంధం లేకుండా క్రమశిక్షణా రహిత చర్యలు తీసుకుంటామని నరైన్ సస్పెన్షన్ నోట్లో హోం మంత్రిత్వశాఖ పేర్కొంది. -
రాచకొండ పోలీసులను బురిడీ కొట్టించిన సీఐ నాగేశ్వరరావు
సాక్షి, హైదరాబాద్: వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహితను బెదిరించి అత్యాచారం చేసిన సీఐ నాగేశ్వరరావు రాచకొండ పోలీసులను బురిడీ కొట్టించాడు. నాగేశ్వరరావును అరెస్ట్ చేసేందుకు శనివారం సాయంత్రం ఎస్ఓటీ పోలీసులు రాగా.. డ్యూటీలో ఉన్నానని ఉదయం లొంగిపోతానని చెప్పాడు. అయితే అర్ధరాత్రి 12.15 నుంచి మొబైల్ స్వీచ్చాఫ్ చేశాడు. రెండు రోజులుగా నాగేశ్వరరావు పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. సీఐ కోసం నాలుగు బృందాలు రంగంలోకి దిగాయి.ఇదిలా ఉండగా సీఐ నాగేశ్వరరావు అక్రమాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఓ కేసులో అక్రమంగా బీఎండబ్ల్యూ కారును తన వద్దే ఉంచుకొని సీజ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కాగా సీఐ నాగేశ్వరరావును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్బీ నగర్‌లోని ఏసీపీ కార్యాలయాన్ని కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు. డీసీపీ కార్యాలయం ముందు బైఠాయించి మహిళ లు, యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులే మహిళపై అత్యాచారం చేసి బెదిరింపులకు పాల్పడితే ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని డిమాండ్ చేశారు. .24 గంటల్లో సీఐ నాగేశ్వరరావుని అరెస్ట్ చేయకపోతే తెలంగాణ వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. కాగా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నాయకులను వెంటనే అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్‌కు తరలించారు. -
లైంగిక ఆరోపణలు.. మనస్తాపంతో మాజీ మంత్రి ఆత్మహత్య
డెహ్రాడూన్: కోడలి ఫిర్యాదుతో తీవ్ర మనస్తాపం చెందిన ఉత్తరాఖండ్ మాజీ మంత్రి రాజేంద్ర బహుగుణ(59) బలవన్మరణానికి పాల్పడ్డారు. బహుగుణ బుధవారం హల్ద్వాని ప్రాంతంలోని తన నివాసంలో వాటర్ ట్యాంక్ ఎక్కి తుపాకీతో కాల్చుకొని చనిపోయాడు. కాగా తన కూతురిని లైంగిక వేధిస్తున్నట్లు కోడలు మామ రాజేంద్రపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోడలు ఫిర్యాదు మేరకు బహుగుణపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఇది జరిగిన మూడు రోజులకే బహుగుణ ఇలా ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం. బహుగుణ ఆత్మహత్యకు పాల్పడే ముందు ఇక తాను బతకలేనని, చనిపోతున్నట్లు పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకునేలోపే బహుగుణ ఇంటి ముందు ఉన్న వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కాడు. అయితే లౌడ్ స్పీకర్ ఉపయోగించి ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడవద్దని, కిందికి దిగి రావాలని పోలీసులు మాజీ మంత్రిని వేడుకున్నారు. అయినప్పటికీ పోలీసుల మాటలు వినకుండా ‘నేను ఏం తప్ప చేయలేదు. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు’ అంటూ పదేపదే గట్టిగా అరిచాడు. ఒకానొక సమయంలో బహుగుణ పోలీసుల విజ్ఞప్తి మేరకు కిందికి దిగివస్తడనుకున్న క్రమంలో అనుహ్యంగా వాటర్ ట్యాంక్‌పై తుపాకీతో కాల్చుకొని ప్రాణాలు విడిచాడు. చదవండి: హరియాణా మాజీ ముఖ్యమంత్రికి షాక్! నాలుగేళ్ల జైలు శిక్ష పోలీసులు, ఇంటి పొరుగువారు చూస్తుండగానే బహుగుణ ఈ దారుణానికి ఒడిగట్టాడు. అయితే కోడలు చేసిన ఆరోపణలపై తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అధికారులు తెలిపారు.మరోవైపు తండ్రి ఆత్మహత్యకు ప్రేరేపించారని కొడుకు అజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోడలు, ఆమె తండ్రి అలాగే మరో వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నాయకుడైన బహుగుణ 2004-5లో ఎన్డీ తివారీ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. -
GHMC: హవ్వ.. ఇదేం పాలన?
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీలోని కోటిమందికి వివిధ రకాల సేవలందించాల్సిన బల్దియాలో ఉన్నతాధికారుల నిష్క్రియాపరత్వంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. డిప్యుటేషన్ల నుంచి వివిధ అంశాల్లో పట్టింపు లేకపోవడంతో కొందరు ఆడింది ఆటగా సాగుతోంది. డిప్యుటేషన్లు ముగిసినా బల్దియా నుంచి వెళ్లని వారితోపాటు.. ఎవరు ఎక్కడ ఏంచేసినా చెల్లుతుందనే అభిప్రాయాలు నెలకొన్నాయి. బాధ్యతల వికేంద్రీకరణ పేరిట జోన్ల అధికారులకు పూర్తిస్థాయి అధికారాలివ్వడంతో అధికార వికేంద్రీకరణ బదులు అవినీతి వికేంద్రీకరణ జరుగుతోంది. కఠిన చర్యలు లేకపోవడంతో మహిళలను వేధించేవారి ఆగడాలకు అడ్డేలేకుండాపోయింది. జాయింట్ కమిషనర్ల పోస్టుల పేరిట కొందరిని ఖాళీగా కూర్చోబెట్టి జీతాలిస్తున్నారు. అయిదేళ్ల డిప్యుటేషన్ ముగిసినా మాతృశాఖకు వెళ్లకుండా.. పొడిగింపును కమిషనర్ అడ్డుకున్నా.. మరోమార్గంలో తిష్టవేసేందుకు కొందరు అధికారులు పావులు కదుపుతున్నారు. ఇలా.. చెబుతూపోతే.. ఇంకా ఎన్నో.. ఎన్నెన్నో.. కదలరు.. వదలరు.. ► ఇటీవల ఒకరి డిప్యుటేషన్ అయిదేళ్ల కాలం ముగిసిపోయింది. తిరిగి పొడిగింపునకు ప్రయత్నించారు. కమిషనర్ నిక్కచ్చిగానే ససేమిరా కాదన్నారు. కానీ.. మరో మార్గంలో జీహెచ్ఎంసీలోనే మరో విభాగం నుంచి సదరు అధికారి డిప్యుటేషన్ కోసం ఒక అడిషనల్ కమిషనర్, విభాగాధిపతి, మరికొందరు ప్రయత్నాలు చేసి సఫలమయ్యారంటే ఏమనుకోవాలి? కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు.. సదరు పోస్టులో మరొకరిని అప్పటికే ప్రభుత్వం నియమించడంతో ఆ అంకానికి తాత్కాలికంగా తెరపడినా.. ఏం జరగనుందో వేచి చూడాల్సిందే. ► మరో విభాగంలోని ఓ అధికారి అయిదేళ్ల డిప్యుటేషన్ ముగిసినా ఇంకా కొనసాగుతున్నారు. పై పెచ్చు పొడిగింపు వచ్చిందని ప్రచారం చేసుకుంటున్నట్లు తెలిసింది. కేవలం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. సదరు ఫైల్ కదలదు. వీరు కదలరు. అయినా పట్టించుకున్నవారే లేరు. సారు.. చాలా బిజీ.. ► ఇక దోమల విభాగం తీరే ప్రత్యేకం. ఫాగింగ్ మెషిన్లు, డ్రోన్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మస్కూట్స్ పేరిట జరుగుతున్న దోపిడీకి అంతేలేకుండాపోయింది. ఈ విభాగంలో ‘కలెక్షన్’ చేసి పెట్టేవారికి రెండు జోన్ల బాధ్యతలు అప్పగిస్తుంటారనేది అంతా తెలిసిన విషయమే. ► ఇక జోనల్స్థాయిలోని అధికారులు జోన్లను తమ రాజ్యాలుగా భావిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రజలకు సేవ కోసం ప్రభుత్వం సదుపాయాలు కల్పిస్తే.. వారు ఎవరికీ ఫోన్లు ఎత్తరు. ‘సారు చాలా బిజీ’ అనే అర్థంలో స్వీయ సందేశంతో ఆటోమేటిక్ మెసేజ్‌లు మాత్రం వెళ్తాయి. ► ఇక వీరి పర్యవేక్షణలో పనిచేసే వారు సైతం తామూ తక్కువేమీ తీసిపోలేదన్నట్లు..డిప్యూటీ కమిషనర్లయినా, వైద్యాధికారులైనా, ఇంజినీర్లయినా, మరొకరయినా సరే జోన్లు, సర్కిళ్లలో ఉండరు. ప్రజలెవరైనా తమ సమస్యల కోసం అక్కడకు వెళ్తే సీట్లలో ఉండరు. ఫీల్డ్ అంటారు. లేకుంటే హెడ్డాఫీసుకు వెళ్లారంటారు. కానీ ఎక్కడా ఉండరు. మరి ఎక్కడుంటారో తెలియదు. జోనల్ పెద్దసారుకు అనుకూలంగా ఉంటే చాలు.. ఎక్కడున్నా పనిచేసినట్లే. గదిలో కునుకు తీస్తున్నా బాగా పనిచేసినట్లే లెక్క. పైవారితో ‘లెక్క’ సరిగ్గా ఉంటే అంతా భేషే! ► వికేంద్రీకరణ పేరిట అధికారాలతోపాటు జీతాలు, బిల్లుల చెల్లింపులు, తదితరమైనవన్నీ జోన్లలోనే జరుగుతున్నాయి. పనుల తనిఖీలు, పర్యవేక్షణలు చేసే పెద్దసారుతో సవ్యంగా ఉంటే చాలు. ప్రధాన కార్యాలయం అలంకార ప్రాయం. బల్దియా బాస్ నామ్‌కే వాస్తే అన్న అభిప్రాయం బలంగా నెలకొంది. గోడు వెళ్లబోసుకున్న బాధితురాలు.. ► కొంతకాలం క్రితం ఓ డిప్యూటీ కమిషనర్ మహిళలతో కలిసిన ఫొటోలు వైరల్ కావడంతో అతడికి స్థానచలనం కలిగించారు. డిప్యూటీ కమిషనర్ కాస్తా జాయింట్ కమిషనర్‌గా మారారు. అంతే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ► ఓ స్టాటిస్టికల్ ఆఫీసర్.. మహిళా కంప్యూటర్ ఆపరేటర్‌ను వేధిస్తున్న విషయం తెలిసినా.. సంబంధిత విభాగం ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. పైగా తప్పుచేసిన వారిని రక్షించే ప్రయత్నాలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితురాలు మేయర్‌ను కలిసి గోడు వెళ్లబోసుకుంటే కానీ విషయం బయటకు రాలేదు. ఏళ్లకేళ్లుగా పొడిగింపు.. ► బల్దియాలోకి ఒకసారి వస్తే.. పాతుకుపోతారనే ప్రచారం ఉంది. లక్ష డబుల్బెడ్రూం ఇళ్లు నిర్మిస్తున్నప్పుడు అవసరమని దాదాపు 250 మంది ఇంజినీర్లను ఔట్‌సోర్సింగ్‌పై తీసుకున్నారు. దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి. కేవలం పది శాతం పనుల కోసం మళ్లీ అంతమంది పొడిగింపు కోసం ప్రయత్నిస్తున్నారు. వారిలో చాలామంది బల్దియాలోని వారికి ఏదో రకంగా దగ్గరివారే. అందుకే పని చేయకున్నా, పని లేకున్నా జీతం వస్తోంది. అలా ఏళ్లకేళ్లు పొడిగింపునిస్తుంటారు. ► కమిషనర్ స్వీయనిర్ణయాలు తీసుకోక, బల్దియాలో పాత కాపులైన ఒకరిద్దరు అధికారులు చెప్పిందే వేదమన్నట్లు నడుచుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. సచివాలయం స్థాయిలోని ఉన్నతాధికారులకు, సంబంధిత మంత్రులకు వారు దగ్గరవడమే కారణమని బల్దియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. -
MAA Elections 2021: ‘మా’ గొడవ మాదే
దాదాపు నాలుగైదు నెలలుగా ఎక్కడ చూసినా ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల గురించి జరుగుతున్న చర్చల్లో ప్రధాన అంశాలివి. ‘మా గొడవ మాదే.. మేమంతా ఒక్కటే’ అంటూనే రాజకీయ ఎన్నికలను తలపించే రీతిలో ‘మా’ ఎన్నికల తీరు కనిపిస్తోంది. గత 28 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా వివాదాలు, విమర్శలకు తోడు ఒకదశలో అభ్యంతరకర పదజాలంతో దూషణలూ వినిపించాయి. ఈ నెల 10న ‘మా’ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ అంశంపై ఓ రౌండప్.. లోకల్.. నాన్‌లోకల్.. ‘సినిమా బిడ్డలం’ ప్యానల్ అంటూ ప్రకాశ్‌రాజ్, ‘మాకోసం మనమందరం’ అంటూ మంచు విష్ణు ‘మా’ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా రెండు పక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు ఘాటుగా సాగుతున్నాయి. మొదట్లో ‘‘ప్రకాష్‌రాజ్ నాన్‌లోకల్. షూటింగ్లకే సరిగా రాడు. ఇక ‘మా’ సమస్యలు పట్టించుకునే తీరిక ఎక్కడుంటుంది?’’ అనే ఆరోపణలు వచ్చాయి. అయితే.. ‘‘మూడు దశాబ్దాలుగా ఇక్కడ సినిమాలు చేస్తున్నాను. తెలంగాణలో గ్రామాన్ని దత్తత తీసుకున్నప్పుడు ఎవరూ నన్ను నాన్ లోకల్ అనలేదు. ఇప్పుడు ఎందుకు నాన్ లోకల్ అవుతాను’’ అని ప్రకాశ్‌రాజ్ తన వాదన వినిపించుకున్నారు. ఆయనకు మద్దతుగా నాగబాబు మూడు రోజుల కింద ఓ వీడియో విడుదల చేశారు. ‘‘మెగాస్టార్ చిరంజీవి మద్దతు ప్రకాశ్‌రాజ్‌కే. ఆయన ఉంటే ‘మా’ అసోసియేషన్ బాగుపడుతుంది. మన తెలుగువాళ్లు వేరే భాషల్లో నటించడం లేదా?’’ అని పేర్కొన్నారు. మరోవైపు.. ‘మీకు ఏ సమస్య వచ్చినా నేనిక్కడే ఉంటా.. ఈ ఊళ్లోనే ఉంటా’ అని మంచు విష్ణు ప్రకటించారు. ఆయన తండ్రి మోహన్‌బాబు కూడా.. ‘‘ఈ ఊళ్లోనే ఉండే నా కుమారుడు ఏ సమస్య వచ్చినా మీ పక్కన నిలబడి ఉంటాడని నేను మాట ఇస్తున్నాను. మీ ఓటును మంచు విష్ణుకు, అతడి పూర్తి ప్యానల్‌కు వేసి సమర్థవంతమైన పాలనకు సహకరించాలని కోరుకుంటున్నాను’’ అని శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. మెగా వర్సెస్ మంచు! మోహన్‌బాబు ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణును నిలబెట్టాలనుకున్నప్పుడు చిరంజీవిని మద్దతు అడిగారని.. కానీ అప్పటికే ప్రకాశ్‌రాజ్‌కు సపోర్టు చేస్తానని మాటిచ్చానని చిరంజీవి చెప్పారనే వార్తలు వెలువడ్డాయి. దానిపై స్పందించిన మోహన్‌బాబు.. మెగాస్టార్ కుటుంబానికి చెందిన రామ్‌చరణ్, నాగబాబు వంటి వారు ఎన్నికల్లో నిలబడితే తాను మరో ఆలోచన లేకుండా మద్దతు తెలిపేవాడినని పేర్కొన్నారు. ఇలా ‘మా’ ఎన్నికలు ‘మెగా వర్సెస్ మంచు’లా మారాయి. పోస్టల్ బ్యాలెట్ వర్సెస్ ఈవీఎం తాము గెలిస్తే ఈవీఎం ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణలు వచ్చే అవకాశముందని, పేపర్ బ్యాలెట్ పెట్టాలని మంచు విష్ణు కోరగా.. ఎన్నికల అధికారి పేపర్ బ్యాలెట్‌ను ఆమోదించారు. అయితే విష్ణు 60 మంది సీనియర్ నటులతో తనకు అనుకూలంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేయించుకున్నారని ప్రకాశ్‌రాజ్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ‘మా’ ఎప్పుడు మొదలైంది? తెలుగు సినిమా నటీనటుల సంక్షేమం కోసం ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ని 1993లో ఏర్పాటు చేశారు. చిరంజీవి వ్యవస్థాపక అ«ధ్యక్షుడిగా, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, కృష్ణంరాజు, మురళీమోహన్ వంటి వారు ముఖ్య సలహాదారులుగా వ్యవహరించారు. అసోసియేషన్ ప్రారంభంలో 150 మంది సభ్యులు ఉండేవారు. ఇప్పుడు దాదాపు 900 మందికిపైగా ఉన్నారు. పెద్దదిక్కు ఎవరు? ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇరువర్గాల సభ్యులు పరుషంగానే మాటల తూటాలు విసురుకున్నారు. ఈ సందర్భంలో చాలామంది ‘దాసరి నారాయణరావు’ను గుర్తు చేసుకున్నారు. పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా దాసరి సామరస్యంగా పరిష్కరించేవారని.. ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేకపోవడం వల్లే ఇంత రచ్చ జరుగుతోందని అభిప్రాయపడ్డారు. కాగా.. సినిమా అంటే వినోదం అని.. ఇప్పుడు నటీనటులు ‘మా’ ఎన్నికల రూపంలో బయట వినోదం పంచుతున్నారనే వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇంతా చేసి ‘మా’ ఎన్నిక కాగానే మేమంతా ఒక్కటే అన్నట్టు కలసిపోతారని ఇండస్ట్రీ అంటున్న మాట. చదవండి: MAA Elections 2021: రెండు రోజుల్లో ఎన్నికలు.. ‘మా’కు సీవీఎల్ షాక్ -
తొడగొట్టి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన మంత్రి మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘నువ్వు అబద్ధాలు, బ్లాక్మెయిల్ వ్యవహారాల్లో నంబర్ వన్ కదా. రేపు నేను నా మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. దమ్మూ ధైర్యం ఉంటే నువ్వు పీసీసీ చీఫ్, ఎంపీ పదవులకు రాజీనామా చేస్తావా..’అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సవాల్ విసిరారు. ‘నువ్వు గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఇప్పుడు, రేపు, రెండేళ్లు ఆగు అని సవాల్ చేసుడు కాదు.. దమ్ముంటే ఇప్పుడు పోటీ చేసి గెలిచి ట్రైలర్ చూపించు. ఓడినోళ్లు ముక్కు నేలకు రాసి ఇంటికి పోవాలే’అని మల్లారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మల్లారెడ్డి బుధవారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘ఆయన పార్లమెంటులో నా కాలేజీ మీద ప్రశ్న అడిగాడు. నేను మచ్చలేని మహారాజును.. తప్పు చేయకుండా రూపాయి రూపాయి కష్టపడి సంపాదించా. నీలాగా బ్లాక్మెయిల్, సమాచార హక్కు చట్టం అడ్డు పెట్టుకుని అ క్రమాలు చేయలేదు. పాలు, పూలు అమ్ముడు త ప్పా. నన్ను బ్రోకర్, జోకర్ అన్నందుకే స్పందిస్తున్నా’అని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. ‘దళిత ఆత్మ గౌరవ సభలు అం టూ నువ్వు చెడి పోయి మమ్మల్ని చెడ గొడతవా.. మా నోట్లో మన్ను పో స్తవా అని స్థానికులు తిట్టారు. సర్కస్‌లా గా టెంట్ సామాను తెచ్చి ఐదేసి వందలు ఇస్తే వచ్చిన వాళ్ల ముందు తిట్టడమే రేవంత్ పనిగా పెట్టుకున్నాడు. నాలుగు పార్టీలు మారి పైసలిచ్చి పీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నావు. పీసీసీ అధ్యక్ష పదవికి ఎవరూ దిక్కులేకనే.. నీకు పదవిస్తే పైసలు వసూలు చేసి పార్టీని నడిపిస్తావని ఇచ్చారు’అని మల్లారెడ్డి అన్నారు. ‘సీఎం ఎన్నో గొప్ప పనులు చేస్తున్నా కనపడతలేదా.. 17 లక్షల కుటుంబాలకు దళితబంధు తరహాలో ఇతరులకు కూడా అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అంబేడ్కర్ తర్వాత మా కేసీఆరే’అని మల్లారెడ్డి అన్నారు. చదవండి: పదిసార్లు తిరిగినా.. కళ్లకు కనిపిస్తలేనా.. పింఛన్ ఎందుకివ్వరు? -
ఆయన మంత్రి కాదు.. సీడీల బాబా.. అనేక మంది రాసలీలల..
సాక్షి, యశవంతపుర(కర్ణాటక): ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న మంత్రి మురుగేశ్ నిరాణి వద్ద ఐదు వందల సీడీలు ఉన్నట్లు సామాజిక కార్యకర్త ఆలం పాషా ఆరోపించారు. ఆయన మంగళవారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. మురుగేశ్ నిరాణి వద్ద ఐదు వందల సీడీలున్నాయి. అందులో ఎవరివైనా ఉండవచ్చన్నారు. మురుగేశ్‌ను సీడీ బాబా అని వర్ణిస్తూ అనేక మంది రాసలీల సీడీలు ఆయన వద్ద ఉన్నాయన్నారు. నకిలీ పేర్లతో ఆయన బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకున్నారని అన్నారు. -
పట్టపగలు ప్రభుత్వ ఆసుపత్రిలో వార్డుబాయ్ దారుణం..
సాక్షి, కరీంనగర్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే మహిళా సిబ్బందికి రక్షణ లేకుండాపోయింది. ఆసుపత్రిలో పనిచేసే ఓ యువతిపై కాంట్రాక్టు విధానంలో పనిచేసే వార్డుబాయ్ అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఆసుపత్రివర్గాలను ఆందోళనకు గురిచేస్తుంది. గురువారం ఉదయం ఆసుపత్రిలో ఓ వార్డులో విధులు నిర్వహిస్తున్న యువతి అదే వార్డులో స్టాక్ ఉండే గదిలోకి వెళ్లగా వార్డుబాయ్ ఆమె వెనకాలే వచ్చి గది తలుపులు బిగించి అత్యాచార యత్నానికి పాల్పడినట్లు తెలిసింది. ఈ ఘటన ఆసుపత్రి అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు సమాచారం. వార్డుబాయ్‌ని శుక్రవారం బాధితురాలి బంధువులు ఆసుపత్రిలోనే చితకబాదినట్టు తెలిసింది. ఉదయం షిప్టులోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటే ఇక రాత్రిపూట పనిచేసే మహిళా ఉద్యోగుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. గతంలోనే ఇదేవార్డుబాయ్ పై పలు ఆరోపణలు ఉన్నా వైద్యాధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వెనక మతలబు ఏమిటన్నది ఆసుపత్రిలో చర్చజరుగుతోంది. ఇద్దరి మధ్య సయోధ్యకుదిర్చేయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం ఉంది. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి మహిళా సిబ్బంది ప్రజలకు వైద్యాసేవలందిస్తుంటే ఇలాంటి వారితో ఆసుపత్రిలో రక్షణ లేకుండా పోతోందని , వార్డుబాయ్ చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
‘ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలు’
అమరావతి: ఏపీకి ఇంటెలిజేన్స్ విభాగంలో చీఫ్‌గా పనిచేసిన మాజీ ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశిస్తూ ఏపీ ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. ఆయన అఖిల భారత సర్వీసు రూల్స్‌కు విరుద్ధంగా ఇతర అధికారులపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారని ఆరోపించింది. అదే విధంగా గోప్యంగా ఉంచాల్సిన అధికారిక సమాచారాన్ని కూడా బహిర్గతం చేశారంటు ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి. కాగా, దీనిపై 30 రోజుల్లోపు వ్యక్తిగతంగా హజరవ్వడంతో పాటు,లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుని ఆదేశించింది. ఒకవేళ సరైన వివరణ ఇవ్వనట్లైతే, సాక్ష్యాధారాల ఆధారంగా తదుపరి చర్యలుంటాయని తెలిపింది. -
సాగర్ ఎన్నికలు: ఆ అభ్యర్థి పై అనర్హత వేటు వేయాలి!
హైదరాబాద్: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తప్పుడు ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేశారని, ఆయనపై విచారణ జరిపి అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. కాంగ్రెస్ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, జి.నిరంజన్, మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి గురువారం ఇక్కడ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ) శశాంక్ గోయెల్‌ను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. 2009, 2018 ఎన్నికల్లో రోహిత్ రెడ్డి దాఖలు చేసిన అఫిడవిట్లు, అసెంబ్లీ వెబ్సైట్లో ఆయన బయోడేటా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఆయన సమర్పించిన కోర్సు కంప్లీషన్ సర్టిఫికెట్లను పరిశీలిస్తే ఆయన వివిధ సందర్భాల్లో తన విద్యార్హతల విషయంలో పొంతన లేని సమాచారం ఇచ్చారని తేలిందన్నారు. స్వీడన్‌లోని బీటీహెచ్ వర్సిటీ నుంచి బీటెక్, ఎంఎస్ చేసినట్టు తప్పుడు వివరాలు ఇచ్చారని ఆరోపించారు. పోస్టు గ్రాడ్యుయేషన్ కంప్లీషన్ సర్టిఫికెట్ కోసం కనీసం 60 క్రెడిట్ పాయింట్లు కావాల్సి ఉండగా, రోహిత్ రెడ్డి సమర్పించిన సర్టిఫికెట్లో 30 పాయింట్లు మాత్రమే వచ్చినట్టు ఉందని, ఇది డిగ్రీగా చెల్లుబాటు కాదన్నారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రోహిత్ రెడ్డి దొంగ ఓటు వేశారని ఆరోపించారు. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ల ముఠాతో రోహిత్‌కు సంబంధాలున్నాయన్నారు. ఈ అంశంపై డీజీపీతో విచారణ జరిపించాలన్నారు. తమ ఫిర్యాదుపై స్పందించిన సీఈఓ శశాంక్ గోయెల్, జిల్లా కలెక్టర్‌తో విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారని శశిధర్ రెడ్డి తెలిపారు. ఈ అంశంపై త్వరలో గవర్నర్‌తో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి సైతంఫిర్యాదు చేస్తామన్నారు. -
చేనేత సంఘాలకు అవినీతి మరక!
సాక్షి, రామన్నపేట(నల్గొండ) : చేతివృత్తులలో ప్రధానమైనది చేనేత. దేశంలో వ్యవసాయం తరువాత ఎక్కువమంది కార్మికులకు ఉపాధి కల్పి స్తోంది చేనేత పరిశ్రమే. అటువంటి చేనేత పరిశ్రమను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సహకార వ్యవస్థను రూపొందించింది. చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి వారు ఎనలేని కృషి చేయారు. అంతటి ప్రాధాన్యం ఉన్న ఆ చేతివృత్తి పరిశ్రమ ఇప్పుడు అవినీతి ఆరోపణల్లో కొట్టుమిట్టాడుతోంది. ఎంతో సదుద్దేశంతో ఏర్పాటు చేయబడిన చేనేత సహకార సంఘాలు చాలా వరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో.. యాదాద్రి భువనగిరి జిల్లాలో చేనేత జౌళిశాఖ ఆధ్వర్యంలో మొత్తం 24 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. అన్ని సంఘాల్లో కలిపి 3600మంది వాటాదారులు ఉన్నారు. సహకారేతర రంగంలో మరో 3600మంది చేనేత కార్మికులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 5600 జియోట్యాగ్ వేయబడిన మగ్గాలు ఉన్నాయి. జియోట్యాగ్ వేయబడిన మగ్గాల ద్వారా 16,800మంది అనుబంధ కార్మికులు ఉపాధి పొందుతున్నారు. కానీ ఇటీవలి కాలంలో చేనేత సహకార వ్యవస్థ క్రమేపి నిర్వీర్యమై పోతుంది. చేనేత సహకార సంఘాల నిర్వహణపై అవినీతి ఆరోపణలు రావడం, ఆరోపణలు వచ్చిన సంఘాల పాలక వర్గాల బాధ్యతలను నిలిపి వేసి విచారణల పేరుతో స్పెషలాఫీసర్లను నియమించడంతో ఆ సంఘాలు పూర్తిగా కుదేలు అవుతున్నారు. ఆర్డర్ ఫారాల ద్వారా పని కల్పించవలసిన సంఘాలకు అవినీతి మరక అంటుకోవడంతో కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. సగం సంఘాలపై ఆరోపణలు జిల్లాలో 24 చేనేత సహకార సంఘాలు ఉండగా వాటిలో సగం సంఘాలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఐదు చేనేత సంఘాలు సెక్షన్ 51 విచారణను ఎదుర్కొంటుండగా మ రో నాలుగు సంఘాలలో పిటిషన్ ఎంక్వయిరీ నడుస్తోంది. పోచంపల్లి, సిరిపురం, ఇంద్రపాలనగరం, నేలపట్ల, వెలువర్తి సంఘాలపై సెక్షన్ 51 ఎంక్వయిరీ నడుస్తోంది. ఆలేరు, పుట్టపాక, రామన్నపేట సిల్క్, చౌటుప్పల్ సంఘాలపై పిటిషన్ ఎంక్వయిరీ కొనసాగుతోంది. మరో నా లుగు సంఘాలలో సాధారణ విచారణ జరుగుతోంది. సెక్షన్ 51 ఎంక్వయిరీ నడుస్తున్న సంఘాల పాలకవర్గాల స్థానంలో చేనేత జౌళిశాఖకు చెందిన డవలప్మెంట్ అధికారులను పర్సన్ ఇన్చార్జిలుగా నియమించడం జరిగింది. విచారణను ఎదుర్కొంటున్న సంఘాలలోని వాటా దారులకు సరైన ఉపాధి దొరకడం లేదు. తాము నేసిన వస్త్రాలను ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోవలసిన దుస్థితి ఏర్పడింది. పైగా ఆ సంఘాల్లోని వస్త్రాలను కొనుగోలు చేయడానికి టెస్కో ప్రోక్యూర్మెంట్ అధికారులు సైతం ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. అవినీతి ఆరోపణలకు కారణాలు.. సాధారణంగా పాలకవర్గాలు బ్యాంకులు ఇచ్చే క్యాష్క్రెడిట్ను డ్రా చేసి సొంతంగా వాడుకోవడం, నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేయడం ద్వారా, వాటాదారుడికి ఆర్డర్ ఫారంపై అతడికి తెలియకుండానే వస్త్రాలు అమ్మినట్లు రికార్డ్‌చేసి వచ్చే లాభంను వాడుకోవడం, ప్రభుత్వ సబ్సిడీలను దుర్వినియోగపరచడం వంటి సందర్భాల్లో ఆరోపణలు వస్తుంటాయి. అటువంటి ఆరోపణలు తీవ్రంగా వచ్చినప్పుడు తెలంగాణ సహకార సంఘాల చట్టం 1964 లోని 51 సెక్షన్ ప్రకారం విచారణ జరుపుతారు. 51 సెక్షన్ ప్రకారం విచారణ.. సంఘాల నిధులు దుర్వినియోగం అయినట్లు ఆరోపణలు వచ్చిన సందర్భంలో, సంఘం నిర్వహణపై 2/3వంతు సభ్యులు విచారణ కోరినప్పుడు లేదా సంఘం నిర్వహణపై రిజిస్ట్రార్ అసంతృప్తిగా ఉన్న సందర్భంలో తెలంగాణ సహకార సంఘాల చట్టం 1964లోని 51వ సెక్షన్ ప్రకారం విచారణ జరపాల్సి ఉంటుంది. ఆ సందర్భంలో జిల్లా చేనేత జౌళిశాఖ సహాయ సంచాలకుడు విచారణ అధికారిగా వ్యవహరిస్తారు. ఆరోపణలు తీవ్రంగా ఉన్న సందర్భంలో కమిషర్చే నియమించబడిన అధికారిచే విచారణ కొనసాగుతుంది. విచారణ నివేదికను సర్వసభ్య సమావేశాల్లో చర్చించి బాధ్యులపై చర్యలకు తీర్మానం చేస్తారు. చేనేత పరిశ్రమలో ఉమ్మడి జిల్లా ప్రసిద్ధి.. ఉమ్మడి నల్లగొండ జిల్లా చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి చెందింది. పోచంపల్లి, పుట్టపాక పట్టు చీరలు, సిరిపురం బెడ్షీట్లు, మోత్కూరు, గుండాలలో ఉత్పత్తి అయ్యే దోవతులు, టవళ్లు, కొయ్యలగూడెం, వెల్లంకి, బోగారం, ఆలేరు, భువనగిరి ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే డ్రెస్ మెటీరియల్స్ ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. విచారణ కొనసాగుతోంది అవినీతి ఆరోపణలు వచ్చిన సంఘాల పనితీరుపై విచారణ కొనసాగుతోంది. ఐదు సంఘాలపై సెక్షన్ 51 ఎంక్వయిరీ జరుగుతోంది. ఇప్పటి వరకు ఒక సంఘం విచారణ పూర్తయింది. నాలుగు సంఘాలపై ఇంకా పిటిషన్ ఎంక్వయిరీ నడుస్తోంది. విచారణ నడుస్తున్న సంఘాలలోని సభ్యులకు పని కల్పించడానికి ప్రత్యేక అధికారులు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం త్రిఫ్డ్స్కీం, నూలు సబ్సిడీ పథకాలు అమలు అవుతున్నాయి. – వెంకటేశ్వర్లు చేనేత జౌళిశాఖ సహాయ సంచాలకుడు, యాదాద్రిభువనగిరి -
నా భార్య ఇంట్లో లేదు.. వచ్చి వంట చేయి!
డెహ్రాడూన్: విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ప్రొఫెసరే వక్రమార్గం పట్టారు. హాస్టల్ విద్యార్ధినికి అసభ్యకరమైన రీతిలో సందేశాలు పంపుతూ.. వేధింపులకు గురిచేశాడు. విద్యార్ధిని పట్ల పిచ్చి వేషాలు వేసిన ఆ ప్రొఫెసర్‌కు గవర్నర్ ఇచ్చిన ఆదేశాలతో దెబ్బకు దిమ్మతిరిగింది. ఉత్తరాఖండ్‌లోని జీబీ పంత్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీలోని మహిళల హాస్టల్ వార్డెన్ అదే యూనివర్సిటిలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఈ నేపథ్యంలో క్యాంపస్ హస్టల్లో చదువుకుంటున్న ఓ విద్యార్థినికి ప్రొఫెసర్ అర్ధరాత్రి ఫోన్ చేసి ‘ప్రస్తుతం నా భార్య ఇంట్లో లేదు. నువ్వు వచ్చి వంట చేయి’ అని పిలిచాడు. అయితే అప్పటికే ప్రొఫెసర్ పలుమార్లు ఫోన్లు, మెసేజ్‌లు చేయడంతో విసిగిపోయిన విద్యార్థిని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌కు ఫిర్యాదు చేసింది. అయితే తన ఫిర్యాదుపై అధికారులు ఎలాంటి చర్య తీసుకోలేదని వాపోయిన సదరు విద్యార్థి విశ్వవిద్యాలయ క్రమశిక్షణా కమిటీ సమావేశంలో ఈ సమస్యను లేవనెత్తింది. దీనికితోడు ప్రొఫెసర్ నుంచి వచ్చిన సందేశాలను ఆధారాలుగా చూపించింది. ఈ వ్యవహారం కాస్తా గవర్నర్ బేబీ రాణి మౌర్య దృష్టికి వెళ్లింది. దీంతో ఈ విషయంపై స్పందించిన గవర్నర్ గురువారం ప్రొఫెసర్‌పై దర్యాప్తుకు ఆదేశించారు. ఇంత వరకు సమస్యపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. అయితే విద్యార్ధి రాతపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు ఇవ్వనందున నిందితుడిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని యూనివర్సిటీ డీన్ సలీల్ తివారి తెలిపారు. అనంతరం ఈ విషయంపై వెంటనే దర్యాప్తు జరపాలని, వార్డెన్ దోషిగా తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే బాలికల హాస్టళ్ల నిర్వహణపై గవర్నర్ నివేదిక కోరారు. హస్టల్లోని అమ్మాయిలకు సురక్షితమైన వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు. గవర్నర్ ఆదేశాల మేరకు దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటామని యూనివర్పిటీ రిజిస్టార్ శర్మ తెలిపారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని ఇలాంటి సమస్యలు పునరావృత్తం కాకుండా చూసుకుంటామన్నారు. కాగా తాజా ఘటనపై విద్యార్థి సంఘాలు, విద్యార్థినులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినులనే వేధింపులకు గురిచేస్తున్న అధ్యాపకులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
కొమర భాస్కర్‌పై చర్యలు తీసుకోండి
సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలో సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ ఇచ్చిన శిక్షకులకు వేతనాలు చెల్లించినప్పటికీ చెల్లించలేదంటూ అధికారులను, పోలీసులను తప్పదోవ పట్టిస్తున్న కొమర భాస్కర్‌పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డిని న్యూ తైక్వాండో అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి చెరుకూరి వెంకటరమణ కోరారు. ఈ మేరకు ఆయన జిల్లా ఎస్పీ స్పం దన కార్యక్రమంలో సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ ఇచ్చిన శిక్షకులకు ఇప్పటికే తమ అసోసియేషన్ నుంచి వేతనాలు అందజేశామని, ఇంకా ఎవరిౖMðనా చెల్లించనట్లయితే వారు తమను నేరుగా సంప్రదిస్తే వారి అకౌంట్‌కు డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. ఇదివరకే భాస్కర్‌ను సస్పెండ్ చేశాం గతంలో నిధులు దుర్వినియోగం చేసిన కొమర భాస్కర్‌ను న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ సస్పెండ్ చేయడం జరిగిందని తెలియజేశారు. షోకాజ్ నోటీసు ఇచ్చి విచారణకు హాజరై వివరాలను సమర్పించాలని కోరినప్పటికీ ఆయన అందజేయలేదన్న విషయాన్ని ఎస్పీకి వివరించారు. అప్పట్లో శిక్షకులకు భాస్కర్ జీతాలు చెల్లించలేదన్న విషయం తెలుసుకొని రాష్ట్ర అసోసియేషన్ నేరుగా జిల్లాకు విచ్చేసి శిక్షకులకు వేతనాలు అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. కానీ భాస్కర్ మాత్రం తాము వేతనాలు బకాయి పడ్డామని, శిక్షకులకు చెల్లించలేదంటూ తప్పుడు ప్రచారం చేస్తూ అధికారులకు తప్పుడు ఫిర్యాదులు ఇస్తున్నారని వివరించారు. కొమర భాస్కర్‌ను ఇప్పటికే సస్పెండ్ చేసినా ఆయన మాత్రం నిబంధనలకు విరుద్ధంగా న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్, టీఎఫ్ఐ, డబ్ల్యూటీఎఫ్ పేరు, లోగోలను ఉపయోగించుకుని లబ్ధి పొందాలని చూస్తున్నారని పేర్కొన్నారు. దానిపై అసోసియేషన్ పరంగా చర్యలకు సిద్ధమైనట్లుగా ఎస్పీకి వివరించారు. నేరుగా సంప్రదించండి ఇప్పటివరకు తమను సంప్రదించిన 114 ప్రభుత్వ స్కూల్స్, 4 కేజీబీవీ స్కూళ్లలో శిక్షణ ఇచ్చిన శిక్షకులకు వేతనాలు అందజేసినట్లుగా ఆయన వివరించారు. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే 7702234995 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని కోరారు. శిక్షకులకు వేతనాలు చెల్లించిన విషయాన్ని పూర్తి ఆధారాలతో జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులకు తెలియజేసినట్లు పేర్కొన్నారు. -
టెక్ జెయింట్ల పోరుకు ఫుల్స్టాప్
అమెరికా టెక్ జెయింట్లు యాపిల్, క్వాల్కామ్ తమ మధ్య ఉన్న వైరానికి ముగింపు పలికాయి. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన రాయల్టీ చెల్లింపుల యుధ్దానికి ఫుల్స్టాప్ పెట్టాయి. ఈ మేరకు ఒక ఒప్పందం కుదిరిందని యాపిల్, అమెరికన్ మైక్రోచిప్ తయారీదారు క్వాల్కామ్ సంయుక్తంగా మంగళవారం ప్రకటించాయి. పరస్పర దాఖలు చేసుకున్న అన్ని వ్యాజ్యాలను ఉపసంహరించుకున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించాయి. ఇందుకు ఇరు కంపెనీల మధ్య ఆరు సంవత్సరాల లైసెన్స్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ లెసెన్స్‌ను అవసరమైతే మరో రెండేళ్లపాటు విస్తరించుకునే ఆప్షన్‌కు కూడా ఇందులో జోడించాయి. ఈ ఒప్పందం వైర్లెస్ పరిశ్రమకు లబ్ది చేకూరుస్తుందని విశ్లేషకుడు ప్రాటిక్ మూర్హెడ్ వ్యాఖ్యానించారు. కాలిఫోర్నియాలో కోర్టులో వాదనల చివరి నిమిషంలో యాపిల్, క్వాల్కామ్ ఈ పరిష్కారానికి రావడం విశేషం. గత రెండు సంవత్సరాలుగా, కంపెనీ మధ్య న్యాయ పోరాటం జరుగుతోంది. దీంతో కోట్లాది రూపాయలకు చెల్లింపులనుంచి క్వాల్కామ్ బయటపడింది. దీంతో వాల్‌స్ట్రీట్‌లో క్వాల్కం 23 శాతానికి పైగా పెరిగింది. దాదాపు 20 ఏళ్లలో ఇది ఉత్తమమైన లాభంగా మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. టెక్ దిగ్గజం యాపిల్, చిప్ తయారీ సంస్థ క్వాల్కామ్ మధ్య పేటెంట్, లైసెన్సింగ్ విధానంపై పోరు న్యాయ స్థానానికి చేరింది. 2017 ఆరంభంలో, అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమీషన్ వద్ద క్వాలాకామ్ తమతో సహా స్మార్ట్‌ఫోన్ తయారీదారులకు లైసెన్సుల విక్రయంలో యాంటీట్రస్ట్ చట్టాన్ని ఉల్లంఘించిందంటూ దావా వేసింది. క్వాల్ కామ్ కంపెనీ మోనోపలి చెలాయిస్తోందన్నది యాపిల్ ఆరోపణ. -
‘రాజ్‌కుమార్ హిరాణీ నాపై లైంగిక దాడి చేశాడు’
సాక్షి, న్యూఢిల్లీ: మీటూ ఉద్యమం బాలీవుడ్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీపై లైంగిక దాడి ఆరోపణలు రావడం సంచలనం రేపుతోంది. హిరాణీ తనపై లైంగిక దాడి చేశాడని ఆయన వద్ద పనిచేసిన సహాయ దర్శకురాలు ఆరోపణలు చేశారు. సంజు సినిమాకు సహాయ దర్శకురాలిగా పనిచేసిన ఆమెపై సినిమా పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో 2018 మార్చి-సెప్టెంబర్ మధ్యకాలంలో హిరాణీ తనపై లైంగిక దాడి చేశాడని, తనను లైంగికంగా వేధించాడని బాధితురాలు ఆరోపించారు. ఈ మేరకు ఈ ఘటన గురించి సంజు సినిమా నిర్మాత విధూవినోద్ చోప్రాకు ఆమె ఈమెయిల్ పంపినట్లు తెలిసింది. ‘హిరాణీ మంచి పేరున్న దర్శకుడు. నేను కేవలం ఆయన వద్ద పనిచేస్తున్న అసిస్టెంట్‌ను. నా పట్ల జరిగినది చాలా పెద్ద తప్పు. నా పట్ల జరిగిన దారుణాన్ని ఎవరికీ చెప్పుకోలేను. ఆయన కారణంగా నా మనసు, శరీరం పాడైపోయాయి. అలా ఆరు నెలల పాటు హిరాణీ నన్ను లైంగికంగా వేధించారు. ఉద్యోగాన్ని పోగొట్టుకోలేక మౌనంగా ఉండాల్సి వచ్చింది. ఒకవేళ ఈ ఉద్యోగాన్ని వదిలేసినా మరో ఉద్యోగం దొరకదేమోనన్న భయం. తప్పని పరిస్థితుల్లో మౌనంగా ఉండాల్సిం వచ్చింది’’ అని ఆమె మెయిల్ ద్వారా తన ఆవేదనను వ్యక్తపరిచారు. తనపై వస్తున్న ఆరోపణలను హిరాణీ తీవ్రంగా ఖండించారు. ఆయన తరఫు న్యాయవాది ఆనంద్ దేశాయ్ మీడియాతో మాట్లాడుతూ.. హిరాణీపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఆయపై కావాలనే ఎవరో తప్పడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆయన పేరు చెడగొట్టడానికి ఎవరో ఇలా చేయిస్తున్నారని అన్నారు. రాజ్‌కుమార్ హిరాణీ వంటి పెద్ద దర్శకుడిపై ఓ సహాయ దర్శకురాలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో మళ్లీ మీటూ ఉద్యమం తీవ్రతరమైంది. -
‘ఖాకీ’ రాసలీలలు గుట్టురట్టు!
సాక్షి, కర్నూలు : కోడుమూరు పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఓ మహిళతో సాగిస్తున్న రాసలీలలు గుట్టురట్టయ్యాయి. కర్నూలు శివారులోని కోడుమూరు రోడ్డులోని రాజీవ్ గృహకల్పలోని మూడవ అంతస్థులో గదిని అద్దెకు తీసుకుని కోడుమూరు పట్టణానికి చెందిన మహిళతో కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం భర్తకు తెలిసింది. బుధవారం కానిస్టేబుల్ ఆన్‌డ్యూటీలోనే ఉంటూ కర్నూలుకు వచ్చి ఫోన్ చేసి మహిళను పిలిపించుకుని గదిలో ఉండగా ఇరుగుపొరుగు వారు గదికి తాళం వేసి బంధించి నాల్గవ పట్టణ పోలీసులకు పట్టించారు. కానిస్టేబుల్‌గా పనిచేస్తూ తప్పుడు వ్యవహారానికి పాల్పడటంపై కాలనీ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పోలీసు పరువు పోతుందన్న ఉద్దేశంతో కొద్దిసేపు అతనిని స్టేషన్లో ఉంచుకుని గుట్టుచప్పుడు కాకుండా వదిలేశారు. ప్రేమ జంటను బెదిరించిన కేసులో రౌడీషీట్ కర్నూలు శివారులోని జగన్నాథగట్టు వద్ద ప్రేమ జంటను బెదిరించి బంగారు నగలను లాక్కోవడమే కాక అత్యాచారానికి పాల్పడినట్లు గతంలో ఇతనిపై ఆరోపణలు ఉన్నాయి. తాలూకా పోలీస్‌స్టేషన్‌లో పనిచేసేటప్పుడు జగన్నాథగట్టు వద్ద ప్రేమ జంటలను బెదిరించడం, డబ్బులు, బంగారు నగలు లాక్కోవడం వంటి నేరాలకు పాల్పడి సస్పెండ్‌కు గురైనట్లు సమాచారం. వ్యభిచారం, మోటర్‌సైకిళ్ల దొంగతనం వంటి పలు నేరాలకు పాల్పడి సస్పెన్షన్‌కు గురికావడమే కాక కొంతకాలం వీఆర్‌లో ఉండి ఏడాది క్రితం కోడుమూరుకు బదిలీపై వెళ్లారు. అక్కడ పనిచేసే ఓ ఏఎస్ఐతో కానిస్టేబుల్‌కు విభేదాలు ఉన్నాయి. కోడుమూరు పట్టణానికి చెందిన మహిళతో రాజీవ్ గృహకల్పలో ఉన్నట్లు ఏఎస్ఐ స్వయంగా భర్తకు సమాచారం ఇచ్చి పట్టించినట్లు పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది. అయితే ఎలాంటి కేసు నమోదు చేయకుండా అతనిని పోలీసులు వదిలేయడంపై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
‘శ్రీరెడ్డి నన్ను కూడా టార్గెట్ చేస్తుందేమో..’
టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్‌పై పోరాటాన్ని కొనసాగిస్తూ సంచలనం సృష్టిస్తున్న నటి శ్రీరెడ్డికి, నేచురల్ స్టార్ నానికి మధ్య జరుగుతున్న వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత కొద్దిరోజులుగా నానిపై శ్రీరెడ్డి పలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై నాని సైతం స్పందిస్తూ.. సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందని ఆమెకు లీగల్ నోటీసులు పంపించారు. అయితే తాజాగా ఈ వివాదంపై హీరో విశాల్ స్పందించాడు. ‘నాని నాకు చాలా కాలంగా తెలుసు. అతను నాకు మంచి స్నేహితుడు. అంత మాత్రాన నేను అతడిని సమర్థించను. తాజాగా నానిపై శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు వివాదాస్పదంగా ఉన్నాయి. నాని గురించి తెలిసిన వాళ్లందరికీ అతని ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసు. ఏదో పబ్లిసిటీ కోసం ఆరోపణలు చేయడం కాకుండా, ఆమె వద్ద ఏమైనా ఆధారాలు ఉంటే బయటపెట్టాలి. ఇదంతా చూస్తుంటే ఒకరి తర్వాత ఒకరిపై ఆమె వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. పోనుపోనూ ఆమె నన్ను కూడా టార్గెట్ చేస్తుందేమో. కాబట్టి ఇలాంటి ఆరోపణలు చేసినప్పుడు అందుకు తగిన ఆధారాలు కూడా చూపించాలి. సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనేది వాస్తవం. కానీ దానిని సాకుగా చూపి ప్రముఖులపై ఆరోపణలు చేయడం సరైన పద్దతి కాదు’ అని అన్నారు. ‘అభిమన్యుడు’ విజయోత్సవ యాత్రలో భాగంగా విశాల్ ఈ వ్యాఖ్యలు చేశాడు . విశాల్, సమంత జంటగా నటించిన అభిమన్యుడు సినిమా భారీ విజయాన్ని అందుకుని మంచి కలెక్షన్లతో దూసుకెళ్తోంది. -
వ్యక్తిగత కారణాలతో మహిళ ఆత్మహత్య
సాక్షి, విజయనగరం : జిల్లాలోని కురుపాం గ్రామానికి చెందిన పత్తిక మణిమాల(30) పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక బుధవారం మృతి చెందింది. ఈమె భర్త శంకర్ రావు వృత్తి రీత్యా టీచర్. ఇతను గుమ్మలక్ష్మీపురం మండలం అచ్చబా గ్రామంలో మండలపరిషత్ స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. కొన్ని రోజులుగా భార్య, భర్తల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరుగుతున్నాయి. శంకర్ రావే తన భార్యను చంపి, దాన్ని ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
చంద్రబాబు డిప్రెషన్లో ఉన్నాడు
-
ఆరోపణలతో ఇరిగేషన్ మంత్రి రాజీనామా
అమృతసర్ : పంజాబ్ విద్యుత్, నీటిపారుదల శాఖ మంత్రి రాణా గుర్జిత్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. నిన్న (సోమవారం) ఆయన తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు సమర్పించారు. కాగా ఇసుక క్వారీల వేలంపాట వ్యవహారంలో మంత్రి గుర్జిత్ సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కోట్ల రూపాయల మేరకు ముడుపులు అందుకున్నట్లు మంత్రితో పాటు ఆయన సిబ్బందిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో గుర్జిత్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి పదవికి రాజీనామా చేసిన వెల్లడించారు. తన రాజీనామాపై తుది నిర్ణయం పార్టీ హైకమాండ్‌తో పాటు, ముఖ్యమంత్రిదేనని గుర్జిత్ తెలిపారు. కాగా మంత్రి గురిజిత్ వంటమనిషి 26కోట్లు వెచ్చించి ఇసుక క్వారీలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వేలంలో నాలుగు గనులు మంత్రి బినామీలు సొంతం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
ఇది సెంట్రల్... మాదే కంట్రోల్
టీడీపీ ముఠా అక్రమాలకు అడ్డాగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం - ఉత్సవాలకు చందాల పేరిట వ్యాపారుల వద్ద వసూళ్ల దందా - ఖాళీ స్థలాలు స్వాహా... ఆపై బలవంతపు సెటిల్మెంట్లు - చోద్యం చూస్తున్న పోలీసులు ఓ వ్యాపారి రానున్న దసరా ఉత్సవాలకు రూ.50 వేల చందా పంపించారు. టీడీపీ ప్రజాప్రతినిధి అనుచరులు ఆ చందాను తిరస్కరించారు. ‘రూ.లక్షకు తక్కువ తీసుకోవద్దని సార్ చెప్పారు. వెళ్లి రూ.లక్ష తెండి. లేకపోతే మీ ఇష్టం. జరగాల్సింది జరుగుతుంది’ అంటూ హుకుం జారీచేశారు. విధిలేని పరిస్థితుల్లో ఆ వ్యాపారి రూ.లక్ష చందా సమర్పించుకున్నారు. ప్రతి పండుగనూ ప్రతి వివాదాన్నీ ఆ ప్రజాప్రతినిధి సొమ్ముచేసుకుంటున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితి ఇదీ... సాక్షి, అమరావతి బ్యూరో : విజయవాడ నడిబొడ్డున ఉన్న సెంట్రల్ నియోజకవర్గం అధికార టీడీపీ అక్రమాలకు అడ్డగా మారింది. టీడీపీ ప్రజాప్రతినిధి సన్నిహిత ముఠా తమ ఆగడాలతో అందర్నీ బెంబేలెత్తిస్తోంది. కొన్నేళ్లుగా మరుగునపడిపోయిన వసూళ్ల దందాను మళ్లీ తెరపైకి తెచ్చింది. రాష్ట్రస్థాయిలో వాణిజ్య కేంద్రంగా గుర్తింపుపొందిన స్థానిక మార్కెట్‌ను తమ అక్రమార్జనకు వనరుగా మార్చుకుంది. ఖాళీ స్థలాలను ఆరగిస్తూ.. ఇతరత్రా వివాదాల్లో జోక్యం చేసుకుంటూ సొమ్ముచేసుకుంటోంది. రాజకీయ ఒత్తిడికి పోలీసులు తలొగ్గడంతో ఆ ముఠా ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. వ్యాపారాన్ని బట్టి టార్గెట్లు మార్కెట్‌ను ప్రజాప్రతినిధి ముఠా గుప్పిటపట్టింది. వందల సంఖ్యలో ఉన్న దుకాణాల నుంచి వివిధ రూపాల్లో వసూళ్ల దందా సాగిస్తోంది. డూండీ వినాయక ఉత్సవాల కమిటీ అంశాన్ని వ్యూహాత్మకంగా వివాదాస్పదం చేసింది. ప్రశ్నించినవారిపై పోలీసులు ఏకపక్షంగా కేసు నమోదు చేసి మార్గం సుగమం చేశారు. ఇదే అదనుగా ఆ ముఠా రానున్న ఉత్సవాలకు చందాల పేరిట వసూళ్ల దందా సాగిస్తోంది. వ్యాపారాన్ని బట్టి రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకు టార్గెట్లు నిర్ణయించి మరీ వసూలు చేస్తోంది. ఈ వసూళ్ల ఎన్ని కోట్లు ఉంటుందనేది అంచనా వేయలేమని వ్యాపారులు పేర్కొంటున్నారు. వసూలు చేసిన మొత్తంలో 25 శాతానికి మించి ఉత్సవాలకు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదని, మిగిలినదంతా ప్రజాప్రతినిధి ఖజానాకేనని స్పష్టం చేస్తున్నారు. ఖాళీ స్థలాలపై కన్ను ఏలూరు రోడ్డుకు సమీపంలోని ఓ స్థలంపై ప్రజాప్రతినిధి బంధువు కన్నుపడింది. మార్కెట్ విలువ ప్రకారం ఆ స్థలం ధర రూ.3 కోట్ల వరకు ఉంటుంది. అందులో కొన్ని దుకాణాల నిర్మాణానికి స్థల యజమాని సిటీ ప్లానింగ్ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కార్పొరేషన్ అధికారులు అనుమతివ్వకుండా జాప్యం చేస్తున్నారు. దీనిపై అధికారులను ఆయన ఆరా తీయగా వెళ్లి ప్రజాప్రతినిధి బంధువుతో మాట్లాడమని సూచించారు. ఆయన తనకు ఆ స్థలాన్ని కోటి రూపాయలకు అమ్మాలని చెప్పారు. అందుకు ఆయన సమ్మతించలేదు. దీంతో ఇప్పటికీ ఆ స్థలంలో భవన నిర్మాణానికి అధికారులు అనుమతి ఇవ్వలేదు. అదే ప్రాంతంలో హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబానికి చెందిన పూర్వికుల ఇంటిని అతితక్కువ మొత్తానికి బలవంతంగా తమపేరిట రాయించుకున్నారు. దీనిపై ఆ కుటుంబం పోలీసులను ఆశ్రయించినా ఫలితంలేకపోయింది. ‘అన్న’ చెబితే అంతే ప్రజాప్రతినిధిని అనుచరులు అన్నగా సంబోధిస్తారు. తమ దృష్టికి వచ్చిన ప్రైవేటు వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారు. అన్న చెప్పారంటూ... తమతో డీల్ కుదుర్చుకునేవారికి అనుకూలంగా వ్యవహారాన్ని ఏకపక్షంగా ముగిస్తున్నారు. - ఓ మహిళ ఇటీవల ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందడం వివాదాస్పదమైంది. దానిపై రోగి బంధువులు ఆందోళన చేశారు. ప్రజాప్రతినిధి ముఠా ఆస్పత్రి యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ బాధితులను బెదిరించింది. మృతదేహం సహా వారిని బలవంతంగా బయటకు పంపించింది. ఈ వ్యవహారంలో ఆ ముఠా రూ.10 లక్షలు వసూలు చేసిందని పోలీసులే చెప్పడం గమనార్హం. - అదే ప్రాంతంలో మరో ఆస్పత్రిలో కూడా ఓ శస్త్రచికిత్స వికటించి ఒకరు మృతిచెందడం వివాదాస్పదమైంది. ఆ వ్యవహారంలో కూడా ప్రజాప్రతినిధి సన్నిహిత ముఠా రంగంలోకి దిగింది. ఆస్పత్రి యాజమాన్యానికి అనుకూలంగా పెదరాయుడి తరహాలో తీర్పునిచ్చింది. యాజమాన్యం నుంచి రూ.10 లక్షలు వసూలు చేసింది.