
అమృతసర్ : పంజాబ్ విద్యుత్, నీటిపారుదల శాఖ మంత్రి రాణా గుర్జిత్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. నిన్న (సోమవారం) ఆయన తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు సమర్పించారు. కాగా ఇసుక క్వారీల వేలంపాట వ్యవహారంలో మంత్రి గుర్జిత్ సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కోట్ల రూపాయల మేరకు ముడుపులు అందుకున్నట్లు మంత్రితో పాటు ఆయన సిబ్బందిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో గుర్జిత్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి పదవికి రాజీనామా చేసిన వెల్లడించారు. తన రాజీనామాపై తుది నిర్ణయం పార్టీ హైకమాండ్‌తో పాటు, ముఖ్యమంత్రిదేనని గుర్జిత్ తెలిపారు. కాగా మంత్రి గురిజిత్ వంటమనిషి 26కోట్లు వెచ్చించి ఇసుక క్వారీలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వేలంలో నాలుగు గనులు మంత్రి బినామీలు సొంతం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.