amarinder singh
-
Lok Sabha Election 2024: పొలిటికల్ టాప్ గన్స్.. రాజకీయాల్లో రాణించిన సైనికాధికారులు
వారు కదన రంగంలో శత్రువుల భరతం పట్టిన వీర సైనికులు. రెండో ఇన్సింగ్స్‌లో రాజకీయ రణరంగంలోనూ అంతే గొప్పగా రాణించారు. త్రివిధ దళాల్లో పలు హోదాల్లో దేశానికి సేవలందించిన సైనిక ఉన్నతాధికారులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులుగా చక్రం తిప్పారు. జశ్వంత్‌సింగ్, రాజేశ్ పైలట్ మొదలుకుని తాజాగా ఎయిర్ చీఫ్ మార్షల్ (రిటైర్డ్) బదౌరియా దాకా ఈ జాబితా పెద్దదే...జశ్వంత్ సింగ్ బహుముఖ ప్రజ్ఞాశీలి సైనికాధికారిగా శత్రువులతో పోరాడిన జశ్వంత్ రాజకీయాల్లో చేరి రక్షణ మంత్రిగా త్రివిధ దళాలకు బాస్ అయ్యారు. 1965లో ఇండో–పాక్ యుద్ధంలో పాల్గొన్న జశ్వంత్ మేజర్ హోదాలో 1966లో పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. భారతీయ జన సంఘ్, ఆర్ఎస్ఎస్ సభ్యుడు. బీజేపీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. 1980లో బీజేపీ తరఫున తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2004 దాకా ఐదుసార్లు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. 1989లో సొంత రాష్ట్రం రాజస్తాన్‌లోని జో«ద్‌పూర్ నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో 1998 నుంచి 2004 దాకా కీలకమైన ఆర్థిక, విదేశీ వ్యవహారాలు, రక్షణ వంటి శాఖలు చూశారు. ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్‌గా, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అత్యధిక కాలం పార్లమెంటు సభ్యునిగా కొనసాగిన కొద్దిమందిలో జశ్వంత్ ఒకరు. రాజేశ్ ‘పైలట్’ అసలు పేరు రాజేశ్వర్ ప్రసాద్ బిధూరి. పైలట్ వృత్తినే పేరులోనే చేర్చుకుని రాజకీయాల్లో వెలుగు వెలిగారు. భారత వైమానిక దళంలో బాంబర్ పైలట్‌గా 1971 భారత్–పాక్ యుద్ధంలో పోరాడారు. స్క్వాడ్రన్ లీడర్ హోదాలో రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాజీవ్‌కు సన్నిహితుడు. 1980లో కాంగ్రెస్ తరఫున భరత్పూర్ లోక్‌సభ స్థానం నుంచి ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి 1999 దాకా ఎంపీగా గెలిచారు. కేంద్రంలో పలు కీలక శాఖలకు మంత్రిగా చేశారు. 2000 జూన్‌లో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన తనయుడు సచిన్ పైలట్ కాంగ్రెస్‌లో కీలక నేతగా కొనసాగుతున్నారు.అమరీందర్ కెప్టెన్ టు సీఎం కెపె్టన్ అమరీందర్ సింగ్ జవాన్ల కుటుంబం నుంచి వచ్చారు. 1965 ఇండో–పాక్ యుద్ధంలో శత్రువుకు చుక్కలు చూపించారు. కెపె్టన్ హోదాలో రిటైరైన ఆయన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది రాజీవ్. అమరీందర్ 1980లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1999 నుంచి 2017 దాకా మూడుసార్లు పంజాబ్ పీసీసీ చీఫ్‌గా, 2002 నుంచి 2007 దాకా సీఎంగా చేశారు. 2017లో మళ్లీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చి రెండోసారి సీఎం అయ్యారు. కాంగ్రెస్ వర్గ విభేదాలతో పార్టీకి, సీఎం పదవికి రాజీనామా చేసి సొంత పార్టీ పెట్టారు. తర్వాత దాన్ని బీజేపీలో విలీనం చేశారు. బి.సి.ఖండూరీ స్వర్ణ చతుర్భుజి సారథి మిలిటరీ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నత విద్యనభ్యసించిన భువన్ చంద్ర ఖండూరీ 1954 నుంచి 1990 దాకా భారత సైన్యంలో సేవలందించారు. ఇండియన్ ఆర్మీ చీఫ్ ఇంజనీర్ స్థాయి నుంచి ఆర్మీ ఇంజనీర్ ఇన్ చీఫ్ విభాగంలో అదనపు డైరెక్టర్ జనరల్ దాకా కీలక హోదాల్లో పని చేశారు. 1971 ఇండో–పాక్ యుద్ధంలో రెజిమెంట్ కమాండర్‌గా పోరాడారు. మేజర్ జనరల్ హోదాలో రిటైరయ్యారు. 1991లో తొలిసారి ఉత్తరాఖండ్‌లోని గఢ్వాల్ లోక్‌సభ స్థానం నుంచి నెగ్గారు. ఐదుసార్లు ఎంపీ అయ్యారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో రహదారులు, హైవేల మంత్రిగా చేశారు. దేశ నలు దిక్కులను కలిపిన స్వర్ణ చతుర్భుజి హైవేల ప్రాజెక్టును దిగ్విజయంగా అమలు చేసిన ఘనత ఖండూరీదే. నిజాయితీకి మారుపేరైన ఆయన ఉత్తరాఖండ్ రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని విజేతగా నిలిపి సీఎం అయ్యారు.అయూబ్ ఖాన్ వార్ హీరో సైనికుల కుటుంబం నుంచి వచ్చిన అయూబ్ ఖాన్ 1965 ఇండో పాక్ యుద్ధంలో వీరోచితంగా పోరాడారు. భారత సైన్యంలోని 18వ సాయుధ అశి్వక దళంలో రిసాల్దార్గా పని చేస్తున్న అయూబ్‌ను యుద్ధంలో జమ్మూకశీ్మర్ సియాల్కోట్ సెక్టార్లో నియమించారు. పాకిస్తాన్ సైన్యం యుద్ధ ట్యాంకులతో మన జవానులను చుట్టుముడుతున్న తరుణంలో నాలుగు పాక్ యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేయడంతో పాటు ఒక ట్యాంకును స్వా«దీనం చేసుకుని శత్రువుకు చుక్కలు చూపించారు. ఆ యుద్ధంలో పరాక్రమానికి వీర్ చక్ర పురస్కారం అందుకున్నారు. గౌరవ కెపె్టన్ హోదా కూడా దక్కింది. ‘నేను పాక్ అధ్యక్షుడు జనరల్ అయూబ్ ఖాన్‌ను కలుసుకోలేదు గానీ భారతీయ అయూబ్‌ను కలిసినందుకు గర్వంగా ఉంది’ అంటూ నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఈ వీర సైనికున్ని హత్తుకోవడం విశేషం. 1983లో రిటైరయ్యాక అయూబ్ రాజకీయాల్లోనూ సత్తా చాటారు. నాటి ప్రధాని రాజీవ్ గాంధీ అయూబ్‌ను ఒప్పించి మరీ ఎన్నికల్లో నిలబెట్టారు. రాజస్తాన్‌లోని ఝుంఝును నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. ఆ రాష్ట్రం నుంచి తొలి ముస్లిం ఎంపీగా కూడా చరిత్ర సృష్టించారు. 1991లో రెండోసారి విజయం సాధించి, పీవీ కేబినెట్లో వ్యవసాయ శాఖ సహాయ మంత్రిగా పని చేశారు.కాండెత్ గోవా విముక్తి వీరుడు దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చినా గోవాలో మాత్రం 1961 దాకా పోర్చుగీసు వలస పాలనే సాగింది. 1961లో భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ ద్వారా గోవాను విలీనం చేసుకుంది. ఈ కీలక సైనిక చర్యకు సారథ్యం వహించిన ధీరుడు కేరళకు చెందిన మేజర్ జనరల్ కున్హిరామన్ పాలట్ కాండెత్. తర్వాత కొంతకాలం గోవా రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్‌గా చేశారు. 1971 ఇండో–పాక్ యుద్ధంలో పశి్చమ కమాండ్ సైనిక బలగాన్ని నడిపించారు. పరమ విశిష్ట సేవా మెడల్‌తో పాటు పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. 1972లో లెఫ్టినెంట్ జనరల్‌గా రిటైరయ్యారు. 1990ల్లో బీజేపీలో చేరారు. పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్‌గా చేశారు. జనరల్ వీకే సింగ్... రాజకీయాల్లో సక్సెస్ భారత సైన్యంలో కమాండో స్థాయి నుంచి ఆర్మీ ఛీఫ్ అయిన తొలి వ్యక్తి జనరల్ విజయ్ కుమార్ సింగ్. 1971 ఇండో–పాక్ యుద్ధంతో సహా అనేక ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించారు. 2010 నుంచి 2012 దాకా సైనిక దళాధిపతిగా చేశారు. రిటైరయ్యాక 2014లో బీజేపీలో చేరారు. స్వరాష్ట్రం యూపీలోని ఘాజియాబాద్ నుంచి ఎంపీ అయ్యారు. 2019లో రెండోసారి విజయం సాధించారు. మోదీ ప్రభుత్వంలో రెండుసార్లు మంత్రిగా చేశారు.విష్ణు భగవత్... గురి తప్పిన టార్పెడో భారత నావికాదళంలో అత్యంత ప్రతిభాపాటవాలతో అత్యున్నత పదవికి చేరుకున్న అడ్మిరల్ విష్ణు భగవత్... వివాదాస్పద వ్యవహార శైలితో అపకీర్తిని కూడా మూటగట్టుకున్నారు. 1971 ఇండో–పాక్ యుద్ధంలో, పోర్చుగీస్ చెర నుంచి గోవాకు విముక్తి కలి్పంచిన ఆపరేషన్ విజయ్‌లో కీలక పాత్ర పోషించారు. ఎన్డీఏ ప్రభుత్వంతో విభేదాల కారణంగా 1998లో ఉద్వాసనకు గురయ్యారు. నేవీ చీఫ్‌గా ఉంటూ వేటుకు గురైన తొలి వ్యక్తి ఆయనే. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అడ్మిరల్ హోదానూ కోల్పోయారు. తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బిహార్ రాజకీయాల్లో కొంతకాలం చురుగ్గా వ్యవహరించారు. ‘ఉత్తమ’ ఫైటర్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి. వైమానిక దళంలో మిగ్ 21, మిగ్ 23 వంటి ఫైటర్ జెట్లు నడిపి శత్రువులపై పోరాడారు. రాజకీయాల్లోనూ రియల్ ఫైటర్‌గా కొనసాగుతున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఉత్తమ్ 1982 నుంచి 1991 దాకా ఎయిర్‌ఫోర్స్‌లో ఫైటర్ పైలట్‌గా చేశారు. 1994లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలి ఎన్నికల్లో కోదాడ నుంచి ఓడినా 1999లో అక్కడి నుంచే విజయఢంకా మోగించారు. మూడు దశాబ్డాల రాజకీయ జీవితంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి నల్లగొండ ఎంపీగా, పీసీసీ అధ్యక్షునిగా, మంత్రిగా చేశారు. తాజాగా హుజారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, తెలంగాణలో తొలి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. ఉత్తమ్ భార్య పద్మావతి కూడా రెండుసార్లు కోదాడ ఎమ్మెల్యేగా గెలిచారు. 2016లో వచి్చన టెర్రర్ అనే తెలుగు సినిమాలో ఆయన సీఎం పాత్ర పోషించడం విశేషం!జేజే సింగ్... తొలి సిక్కు ఆర్మీ చీఫ్ జోగిందర్ జస్వంత్ సింగ్. తొలి సిక్కు ఆర్మీ జనరల్. 2005 నుంచి 2007 దాకా దేశ 21వ ఆర్మీ చీఫ్‌గా సేవలందించారు. రిటైరయ్యాక 2008లో అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా అయ్యారు. 2017లో అకాలీదళ్‌లో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో కెపె్టన్ అమరీందర్ సింగ్ చేతిలో ఓడారు. 2019లో అకాలీదళ్ (తక్సలీ)లో నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు. 2022లో బీజేపీలో చేరారు. వీకే సింగ్ తర్వాత కాషాయం తీర్థం పుచ్చుకున్న రెండో జనరల్‌గా నిలిచారు.బదౌరియా... పొలిటికల్ టేకాఫ్ రాజకీయాల్లోకి వచి్చన తొలి వైమానిక దళపతిగా ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ బదౌరియా చరిత్ర సృష్టించారు. ఎయిర్‌ఫోర్స్ ఫైటర్‌గా విధుల్లో చేరిన ఆయన 41 ఏళ్ల కెరీర్లో 26 రకాల ఫైటర్ జెట్స్, రవాణా విమానాలు నడిపిన విశేష ప్రతిభావంతుడు. స్వదేశీ యుద్ధ విమానం తేజస్ చీఫ్ టెస్ట్ పైలట్‌గా, ప్రాజెక్ట్ టెస్టింగ్ డైరెక్టర్‌గా కూడా వ్యవహరించారు. 2019 నుంచి 2021 దాకా ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా చేసి రిటైరయ్యారు. ఇటీవలే బీజేపీలో చేరారు. రాథోడ్ గురి పెడితే... టార్గెట్ తలొంచాల్సిందే! యుద్ధభూమి అయినా, క్రీడా మైదానమైనా ఆయన గురి పెడితే టార్గెట్ తలొంచాల్సిందే! ఆయనే కల్నల్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్. విశ్వ క్రీడా ప్రపంచంలో భారత్‌కు ఘన కీర్తి సాధించి పెట్టిన అభినవ అర్జునుడు. చదువులోనూ, ఆటలోనూ ‘గోల్డెన్’ బాయ్‌గా నిలిచిన రాథోడ్ కార్గిల్ యుద్ధంలో పోరాడారు. 2002 కామన్వెల్త్ క్రీడల్లో గోల్డ్ మెడల్ కొట్టారు. ఆ ఈవెంట్లో ఆయన నెలకొలి్పన రికార్డులు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. 2004 గ్రీస్ ఒలింపిక్స్ డబుల్ ట్రాప్ ఈవెంట్లో వెండి పతకం కొట్టడంతో రాథోడ్ పేరు మారుమోగింది. ఒలింపిక్స్‌లో భారత్‌కు అదే తొలి వ్యక్తిగత వెండి పతకం! కెరీర్లో ఏకంగా 25 అంతర్జాతీయ పతకాలను సొంతం చేసుకున్నారు. 2013లో ఆర్మీ నుంచి రిటైరై బీజేపీలో చేరారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచారు. మోదీ ప్రభుత్వంలో సమాచార, క్రీడా మంత్రిగా చేశారు. 2019లోనూ ఎంపీగా గెలిచారు. 2023లో రాజస్తాన్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించి రాష్ట్ర క్రీడా శాఖ మంత్రిగా ఉన్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
బీజేపీలోకి కెప్టెన్ అమరీందర్.. పార్టీ కూడా విలీనం
చండీగఢ్: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ) చీఫ్ కెప్టెన్ అమరీందర్ సింగ్ (80) వచ్చే వారం బీజేపీలో చేరనున్నారు. పీఎల్సీని బీజేపీలో విలీనం చేయనున్నారు. ఫిబ్రవరిలో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పీఎల్సీ, బీజేపీ, సుఖ్‌దేవ్ సింగ్ నేతృత్వంలోని అకాలీదళ్‌తో కలిసి పోటీ చేయడం, అమరీందర్ ఓడిపోవడం తెలిసిందే. చదవండి: (బీజేపీ హర్ట్ అయ్యింది.. కారణం ఇదే: కేజ్రీవాల్) -
కంచు కోటలు బద్దలు కొట్టారు.. చరిత్ర సృష్టించారు!
పంజాబ్ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకుడు భగవంత్ మాన్ బుధవారం ప్రమాణం చేశారు. పంజాబ్‌లో ఆప్ ఘన విజయం సాధించడంతో ఆయన సీఎం అయ్యారు. అయితే తాజా ఎన్నికల్లో ఆప్ అభ్యర్థులు హేమాహేమీలను మట్టికరిపించి సంచలనం సృష్టించారు. సామాన్య పౌరులు.. కాంగ్రెస్ సీఎంతో సహా సీనియర్ నాయకులను ఓడించి సరికొత్త చరిత్ర సృష్టించారు! చన్నీకి ఉగోకే చెక్ పంజాబ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఘోరంగా ఓడిపోవడం అతిపెద్ద సంచలనం. ఆయన ఓడించింది సీనియర్ నాయకుడు కాదు.. సామాన్య యువకుడు. చిన్న మొబైల్ రిపేర్ షాప్ నడుపుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యకర్త లాభ్ సింగ్ ఉగోకే అనే యువకుడు బదౌర్ నియోజకవర్గంలో చన్నీపై 34,000 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో విజయం సాధించాడు. ఉగోకే తండ్రి డ్రైవర్ కాగా, తల్లి ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్‌గా సేవలు అందిస్తోంది. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఉగోకేకు హీరో హోండా మోటార్‌సైకిల్ మాత్రమే ఉంది. డాక్టర్ సాబ్‌కే జై చమ్‌కౌర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి కూడా చన్నీకి ‘ఆప్’చేతిలో చుక్కెదురైంది. వృత్తిరీత్యా వైద్యుడైన 55 ఏళ్ల చరణ్‌జిత్ సింగ్ ఇక్కడ నుంచి విజయం సాధించారు. గత ఎన్నికల్లోనూ చన్నీకి వ్యతిరేకంగా ఆప్ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 12,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అయినప్పటికీ నియోజకవర్గాన్ని వదలిపెట్టకుండా, ప్రజల మధ్యే ఉంటూ వారి మన్ననలు పొందారు. ఈసారి 7,942 ఓట్ల తేడాతో చన్నీని ఓడించగలిగారు. నవజ్యోత్ వర్సెస్ జీవన్ జ్యోత్ ప్రజల దృష్టిని ఆకర్షించిన మరో ఆప్ అభ్యర్థి జీవన్ జ్యోత్ కౌర్. పంజాబ్ ఎన్నికల్లో ఇద్దరు ప్రముఖ నాయకులను ఆమె ఓడించారు. అమృత్సర్ తూర్పు నుంచి కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ, శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి బిక్రమ్ మజిథియాలపై 6,750 ఓట్ల తేడాతో ఆమె గెలుపొందారు. ఆమ్ ఆద్మీ పార్టీలో వలంటీర్‌గా చేరి, పార్టీ జిల్లా అర్బన్ అధ్యక్షురాలిగా మారడానికి ముందు.. కౌర్ సామాజిక కార్యకర్తగా చురుగ్గా పనిచేశారు. ‘షీ’అనే స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేసి మహిళలకు రుతుక్రమ పరిశుభ్రత గురించి అవగాహన కల్పించారు. శానిటరీ ప్యాడ్ల వాడకం, రుతుక్రమ పరిశుభ్రత తెలియజేస్తూ 'ప్యాడ్‌వుమన్'గా ఆమె ప్రాచుర్యం పొందారు. (క్లిక్: సోనియా సీరియస్ ఆదేశాలు.. దిగొచ్చిన సిద్ధూ.. పదవికి గుడ్ బై) కౌర్ చేతిలో సింగ్లా చిత్తు సంగ్రూర్‌లో ఆప్ యువనేత నరీందర్ కౌర్ భరాజ్.. సిట్టింగ్ కాంగ్రెస్ క్యాబినెట్ మంత్రి విజయ్ ఇందర్ సింగ్లాతో పోటీ పడి భారీ విజయాన్ని అందుకున్నారు. సింగ్లాను 36,430 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడించి తానేంటో నిరూపించుకున్నారు. కోట్లకు పడగెత్తిన వ్యాపారవేత్త, బీజేపీ అభ్యర్థి అరవింద్ ఖన్నా మూడో స్థానానికి పరిమితమయ్యారు. (క్లిక్: మమతా బెనర్జీ అనూహ్య నిర్ణయం..) లా గ్రాడ్యుయేట్ అయిన కౌర్ జనవరిలో ఎన్నికల సమయంలో తన తల్లితో కలిసి స్కూటర్‌పై వచ్చి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అప్పట్లో ఈ వీడియోలో తెగ వైరల్ అయింది. రూ. 24,000 విలువైన ఆస్తులు మాత్రమే ఉన్నట్టు నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న ఆమె.. ద్విచక్ర వాహనంపైనే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎవరెంత హేళన చేసినా లెక్కచేయక పోటీలో నిలబడి ఘన విజయం సాధించారు. బాదల్‌కు జగదీప్ బ్రేక్ శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ కంచుకోట జలాలాబాద్‌లో ఆప్ పాగా వేసింది. 2009 నుంచి అప్రతిహతంగా గెలుస్తూ వస్తున్న బాదల్‌కు ఆప్ అభ్యర్థి జగదీప్ కాంబోజ్ బ్రేక్ వేశారు. కాంగ్రెస్ నాయకుడైన జగదీప్ గతేడాది ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. తాజా ఎన్నికల్లో బాదల్‌పై దాదాపు 31,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. టిక్కెట్ నిరాకరించడంతో మూడేళ్ల క్రితం కాంగ్రెస్‌ను వీడిన కాంబోజ్ 2019 ఉపఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసినా 5,000 ఓట్లకు మించి సాధించలేకపోయారు. ఈ ఎన్నికల్లో ఆప్ మరో ‘జెయింట్ కిల్లర్’అజిత్‌పాల్ సింగ్ కోహ్లి. అకాలీదళ్ మాజీ నాయకుడైన అజిత్‌పాల్.. పటియాలా నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌ను ఓడించి అందరి దృష్టిని ఆకర్షించాడు. గతంలో మేయర్‌గా పనిచేసిన ఆయన పెద్దగా అంచనాలు లేకుండానే పోటీకి దిగి విజయం సాధించడం విశేషం. -
సిక్కు ప్రముఖులతో మోదీ భేటీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం పలువురు సిక్కు మత ప్రముఖులతో తన నివాసంలో సమావేశమయ్యారు. సిక్కు మతస్తుల కోసం తమ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను వారికి వివరించారు. పంజాబ్ అసెంబ్లీకి మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగనుండగా జరిగిన ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్, అకాలీదళ్ తిరుగుబాటు వర్గం నేత సుఖ్‌దేవ్ సింగ్ థిండ్సాలతో ఏర్పడిన తమ కూటమి బలమైందని చూపి, సిక్కు వర్గం ఓట్లు, వారి మద్దతు కూడగట్టేందుకు బీజేపీ శాయశక్తులా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా జరిగిన ఈ సమావేశానికి ఢిల్లీ గురుద్వారా కమిటీ అధ్యక్షుడు హర్మీత్ సింగ్ కల్కా, పద్మశ్రీ గ్రహీత బాబా బల్బీర్ సింగ్ సిచేవాల్, యమునానగర్‌కు చెందిన మహంత్ కరంజీత్ సింగ్, కర్నాల్‌కు చెందిన బాబా జోగా సింగ్, అమృత్‌సర్‌కు చెందిన సంత్ బాబా మెజోర్ సింగ్ సహా పలువురు సిక్కు ప్రముఖులు హాజరైనట్లు అధికారవర్గాలు తెలిపాయి. దేశ సేవ,, రక్షణతోపాటు, సిక్కు సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేయడంలో సిక్కు నేతలు ముందున్నారని అనంతరం ప్రధాని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. -
సిద్ధూను మంత్రిని చేయమని పాక్ కోరింది: అమరీందర్ సింగ్
న్యూఢిల్లీ: నవజోత్ సింగ్ సిద్ధూను మంత్రిగా తొలగించిన తర్వాత తిరిగి ప్రభుత్వంలోకి తీసుకోవాలని తనకు పాకిస్తాన్ నుంచి సందేశం వచ్చిందని పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఆరోపించారు. సిద్ధూ తమ ప్రధానికి పాత స్నేహితుడని, అందువల్ల ఆయన్ను తిరిగి పదవిలోకి తీసుకోవాలని తనను కోరారన్నారు. ఈ విషయమై స్పందించేందుకు సిద్ధూ నిరాకరించారు. సిద్ధూకు పదవినిస్తే ఇమ్రాన్ ఖాన్ సంతోషిస్తారని తనకు చెప్పారని అమరీందర్ తెలిపారు. అయితే సిద్ధూ అసమర్ధుడనే తాను తొలగించానని, 70 రోజులు పదవీలో ఉండి ఆయన కనీసం ఒక్క ఫైలును చూడలేదని దుయ్యబట్టారు. తర్వాత తనకు పాకిస్తాన్ నుంచి రాయబారాలు వచ్చాయని చెప్పారు. రెండోమారు పదవి ఇచ్చాక పనితీరు కనబరచకపోతే అప్పుడు తొలగించమని తనను పాకిస్తాన్ వర్గాలు కోరాయన్నారు. అయితే ఎవరి నుంచి ఈ సందేశం వచ్చిందో చెప్పలేదు. సరిహద్దు అవతల నుంచి భారీగా భారత్‌లోకి ఆయుధాలు అక్రమంగా వస్తున్నాయని అమరీందర్ ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: Yogi Adityanath: ఆయనొక క్రౌడ్ పుల్లర్.. మాటలు తూటాల్లా పేలుతాయ్.. అక్రమ ఇసుక మైనింగ్‌తో సంబంధం ఉన్న ఎంఎల్ఏలకు సిద్ధూ ఆశ్రయమిచ్చాడని అమరీందర్ ఆరోపించారు. ఇందులో సిద్ధూ సొంత ప్రయోజనాలున్నాయన్నారు. ఇలాంటివారిపై చర్యలు తీసుకోవాలని పార్టీ అధ్యక్షుడిని కోరితే ఆయన నిరాకరించడం తనను ఆశ్చర్యపరిచిందన్నారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాక కూడా తనపై సిద్దూ ఆరోపణలు గుప్పించడం చూస్తే, ఆయన ఎంత అభద్రతా భావనతో ఉన్నారో అర్ధమవుతోందన్నారు. చదవండి: ఓబీసీ నేతల జంప్.. కీలకంగా మారిన కేశవ్ ప్రసాద్.. యోగి లేకుంటే సీఎం అయ్యేవారే! -
ఇమ్రాన్ ఖాన్‌తో లాబీయింగ్ చేయించిన సిద్ధూ!
పంజాబ్ ఎన్నికల వేళ.. విమర్శలు-ప్రతివిమర్శలతో రాజకీయ ప్రచారాలు వాడీవేడిగా ముందుకు సాగుతున్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్.. ఇవాళ సీట్ల పంపకాన్ని ఓ కొలిక్కి తెచ్చుకున్నారు కూడా. తదనంతరం ప్రత్యర్థి నవజ్యోత్ సింగ్ సిద్ధూ పై షాకింగ్ కామెంట్లు చేశారాయన. తాను ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో సిద్ధూను కేబినెట్ నుంచి బయటికి పంపించేశాక.. ఒకరోజు ఆయనకు ఒక ఫోన్ కాల్ వచ్చిందట. అది పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తరపు నుంచి విజ్ఞప్తి. సిద్ధూను కేబినెట్లోకి తీసుకుంటే బాగుంటుందని, అతను తన పాత స్నేహితుడని, ఒకవేళ అతను గనుక సరిగా పని చేయకుంటే అప్పుడు తొలగించాలంటూ ఇమ్రాన్ ఖాన్ తరపున రిక్వెస్ట్ అందిందట. సిద్ధూ ఆ స్థాయిలో లాబీయింగ్ జరిపాడని, కానీ, దానికి తాను స్పందించలేదని అమరీందర్ వెల్లడించారు. ఇదిలా ఉంటే కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆరోపణలు చేసిన కాసేపటికి మీడియా ముందుకు వచ్చిన సిద్ధూ.. పై ఆరోపణలపై స్పందించేందుకు మాత్రం ఇష్టపడలేదు. సిద్ధూ-అమరీందర్ సింగ్ విభేధాల వల్లే పంజాబ్ రాజకీయంలో కిందటి ఏడాది కీలక పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ పీఎంగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లి.. అక్కడ ఆర్మీ ఛీఫ్ ఖ్వామర్ జావెద్ బజ్వాను సిద్ధూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడంపై కెప్టెన్ అమరీందర్ సింగ్ బహిరంగంగానే విమర్శలు గుప్పించారు కూడా. ఇదిలా ఉంటే అమరీందర్ సింగ్ పంజాబ్ లోక్ కాంగ్రెస్, SAD సంయుక్త్‌లతో పొత్తు పెట్టుకుంటున్నట్టు ప్రకటించిన బీజేపీ.. సోమవారం సీట్ల పంపకాలను ఖరారు చేసింది. మొత్తం 117 స్థానాల్లో.. పంజాబ్ లోక్ కాంగ్రెస్ 37, ఎస్ఏడీ సంయుక్త్ 15, బీజేపీ 65 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. మరోవైపు.. ఆదివారం 22 మందితో కూడిన తొలి జాబితాను అమరీందర్ సింగ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ సంగతి ఏమోగానీ, కాంగ్రెస్, ఆప్ పార్టీలు ఎన్నికల్లో పోటాపోటీగా సత్తా చాటే అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెప్తున్నాయి. ఫిబ్రవరి 20వ తేదీన ఒకే దశలో పంజాబ్ పోలింగ్ జరగనుండగా.. మార్చి 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది. -
పంజాబ్ ఎన్నికల్లో అందరిదీ సేఫ్ గేమే!..
వచ్చే నెలలో జరుగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ దిగ్గజాలు ఈసారి సేఫ్‌గేమ్ ఆడుతున్నారు. అన్ని పార్టీల్లోని పెద్ద నేతలంతా ఒకరిపై ఒకరు పోటీ చేయొద్దన్న ధోరణితో బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, ప్రస్తుత ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ సహా అనేకమంది బాదల్ కుటుంబంపై పోటీ చేసేందుకు ముందుకు వచ్చి చేతులు కాల్చుకోవడంతో ఈసారి మాత్రం ఒకరిపై ఒకరు పోటీచేసేందుకు వెనక్కి తగ్గారు. మిగతా కొందరి ప్రముఖుల స్థానాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఎవరు ఎక్కడి నుంచి.. నవజ్యోత్ సింగ్ సిద్ధూ: కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన పాత సీటు అమృత్సర్ ఈస్ట్ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఈసారి సిద్ధూ మజీఠా సీటులో బిక్రమ్ మజీఠియాపై లేదా పాటియాలా స్థానంలో కెప్టెన్ అమరీందర్ సింగ్‌పై పోటీ చేస్తారని ముందుగా ఊహించారు. బిక్రమ్ మజీఠియా: మజీఠా సిట్టింగ్ ఎమ్మెల్యే, శిరోమణి అకాలీదళ్ యువనేత అయిన బిక్రమ్ మజీఠియాకు పోటీగా కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీలు పెద్ద నేతలను నిలబెట్టలేదు. ఇక్కడ నుంచి ఆప్ తరఫున లాలీ మజీఠియా, కాంగ్రెస్ నుంచి జగ్గా మజీఠియాలు బరిలో ఉన్నారు. చరణ్‌జిత్ చన్నీ: చమ్‌కౌర్ సాహిబ్ స్థానం నుంచి సీఎం చరణ్‌జిత్ చన్నీ పోటీ చేస్తున్నారు. అయితే ఆయన రెండు స్థానాల నుంచి పోటీ చేసేలా చర్చలు జరిగినా, పార్టీ అధిష్టానం అందుకు అంగీకరించలేదు. చదవండి: (Punjab Assembly Election 2022: వ్యూహకర్త బాదల్) కెప్టెన్ అమరీందర్ సింగ్: కెప్టెన్ అమరీందర్ సింగ్ పాటియాలా అర్బన్ నుం చి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఆయన తన సొంత జిల్లా పాటియాలాను వదిలి వేరే దగ్గర పోటీ చేసే పరిస్థితి లేదు. అయితే కెప్టెన్ అమృత్సర్ ఈస్ట్ నుంచి సిద్ధూపై పోటీ చేస్తారనే ప్రచారం గతంలో జరిగింది. సుఖ్బీర్ బాదల్: అకాలీదళ్–బీఎస్పీ కూటమి సీఎం అభ్యర్థి అయిన సుఖ్బీర్ బాదల్ ఈసారి కూడా జలాలాబాద్ నుంచి పోరాడుతున్నారు. ప్రస్తుత ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ 2017 ఎన్నికల్లో సుఖ్బీర్ బాదల్‌పై పోటీ చేసి ఓడిపోయారు. భగవంత్ మాన్: ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ ధురి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన ధురి నుంచి ఆధిక్యం సాధించారు. అందుకే ఆయనకు ఎలాంటి ఆటంకం రాకుండా పార్టీ అధిష్టానం సేఫ్ సీటు ఎంపిక చేసింది. అయితే కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దల్బీర్ గోల్డీ, అకాలీదళ్ నుంచి ప్రకాశ్ చంద్ గార్గ్‌లను ఆ రెండు పార్టీలు రంగంలోకి దింపాయి. – సాక్షి, న్యూఢిల్లీ -
ఢిల్లీలో పంజాబ్ హీట్.. అమిత్‌షాతో అమరీందర్ సింగ్ భేటీ
న్యూఢిల్లీ: పంజాబ్‌లో రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పంజాబ్ రాజకీయాలు హీట్‌ను పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా, ఢిల్లీలో కేంద్రమంత్రి అమిత్ షా నివాసంలో.. పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, సుఖ్‌దేవ్ సింగ్ ధిడ్సాల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ లోక్ కాంగ్రెస్, బీజేపీ, శిరోమణి అకాళిదళ్ పార్టీ(సాడ్)లో సంయుక్తంగా పోటీ చేయనున్నట్లు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ సోమవారం ప్రకటించారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, పంజాబ్ బీజేపీ ఇంచార్జీ గజేంద్ర సింగ్ షెకావత్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే కెప్టెన్ అమరీందర్ సింగ్ వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఎన్నికల పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శిరోమణి అకాళిదళ్ కూడా బీజేపీతో కలవటం ప్రస్తుతం ఆసక్తి కరంగా మారింది. కాగా, మరికొద్ది రోజుల్లో ఆయా పార్టీల నుంచి ఇద్దరు చొప్పున నాయకులు కలిసి వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహలు , సీట్ల కేటాయింపులు, మేనిఫెస్టో తదితర అంశాల గురించి చర్చించనున్నట్లు తెలిపారు. అదే విధంగా షెకావత్ జలంధర్‌లో బీజేపీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ దేశాన్ని భ్రష్టుపట్టించిందని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే పంజాబ్‌లో మళ్లీ స్వర్ణయుగం వచ్చేలా చర్యలు చేపడతామని అన్నారు. పంజాబ్ ఎన్నికలలో ఏ పార్టీకి మద్దతివ్వాలో రైతులకు బాగా తెలుసన్నారు. కాగా, ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ చేస్తున్న ఆరోపణలను బలంగా తిప్పికొడుతుంది. అరవింద్ కేజ్రీవాల్.. ఆప్ ఆద్మీ పార్టీ కూడా తమదైన శైలీలో ప్రచారం నిర్వహిస్తున్నాయి. -
చతుర్ముఖ పోరులో... పంజాబ్ షేర్ ఎవరో?
వచ్చే ఏడాది ఫిబ్రవరి– మార్చి నెలల్లో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యంత కీలక రాష్ట్రం పంజాబ్. ఎందుకంటే మిగతా మూడు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ చిన్న రాష్ట్రాలు. సాగు చట్టాలకు వ్యతిరేక ఉద్యమంలో కీలక భూమిక పోషించిన పంజాబ్ రైతులు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు, ఎవరి పక్షాన నిలుస్తారు... అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే పంజాబ్ రాజకీయం బాగా వేడెక్కింది. శిరోమణి అకాలీదళ్, ఆమ్ ఆద్మీ పార్టీలైతే ఏడాదికాలంగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయి. దీనికి తోడు ఇటీవల స్వర్ణదేవాలయం, కపుర్తలాలలో సిక్కుల మతచిహ్నాలను అపవిత్రం చేసే ప్రయత్నాలు జరగడం, లుథియానా కోర్టులో పేలుడు వెనుక ఖలిస్థాన్ గ్రూపుల హస్తమున్నట్లు వార్తలు రావడంతో... రాజకీయాలకు మతం రంగు పులిమేందుకు, ఎన్నికల వేళ రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించేందుకు భారీ కుట్రలు జరుగుతున్నాయనే ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ సీఎం అమరీందర్ సింగ్ పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ) పేరిట కొత్త పార్టీని పెట్టి బీజేపీతో జట్టు కట్టడంతో పంజాబ్ ఎన్నికలు చతుర్ముఖ పోరుగా మారాయి. రాజకీయం రసకందాయంలో పడింది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల తాజా పరిస్థితిపై విశ్లేషణ... దళిత ఓటుపై గంపెడాశలు పదేళ్లు అధికారంలో ఉండి... తీవ్రమైన అవినీతి ఆరోపణలు, రాష్ట్రం డ్రగ్స్ ఊబిలో కూరుకుపోవడంతో 2017లో శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) ఘోర పరాభవాన్ని మూట గట్టుకుంది. కేవలం 15 సీట్లతో మూడోస్థానానికి పరిమితమైంది. పంజాబ్ రైతాంగంలో రగులుతున్న అసంతృప్తిని పసిగట్టిన అకాలీదళ్ 2020లో మూడు సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ బీజేపీతో రెండు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకుంది. పార్టీ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ సతీమణి హర్సిమ్రత్ కౌర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత అకాలీదళ్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ వస్తోంది. రాష్ట్ర జనాభాలో 32 శాతం దళితులు ఉండటాన్ని దృష్టిలో పెట్టుకొని... మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)తో ఈ ఏడాది జూన్‌లోనే పొత్తు పెట్టుకుంది. 20 సీట్లకు బీఎస్పీకి వదిలిపెట్టింది. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి 111 స్థానాల్లో బరిలోకి దిగిన బీఎస్పీ 110 నియోజకవర్గాల్లో డిపాజిట్లు పోగొట్టుకుంది. 1.59 శాతం ఓట్లు మాత్రమే సాధించింది. అయితే అంతకుముందు 2007లో 4.17 శాతం, 2012లో 4.3 శాతం ఓట్లను బీఎస్పీ పొందింది. దళితులపై పట్టున్న డేరాల ప్రభావం తగ్గడం, డేరా సచ్చా సౌధా అధిపతి గుర్మీత్ రామ్‌రహీమ్ సింగ్ జైలుకెళ్లడంతో... దళితల ఓట్లను కూడగట్టడంతో మాయావతి తొడ్పడగలరని అకాలీదళ్ అంచనా. అయితే సొంత రాష్ట్రం యూపీలో కూడా ఎన్నికలున్న నేపథ్యంలో పంజాబ్ ప్రచారానికి మాయావతి ఎంత సమయాన్ని కేటాయించగలరనేది ప్రశ్న. మరోవైపు సుఖ్బీర్ చాలా ముందునుంచే 2022లో పోటీచేసే అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పటికి 91 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేశారు. 21 కొత్త ముఖాలను దింపారు. ముందే ఖరారు కావడంతో నియోజకవర్గంలో స్వేచ్ఛగా పనిచేసుకోవడానికి, తగినంత సమయం వెచ్చించడానికి అకాలీదళ్ అభ్యర్థులకు వీలు చిక్కింది. కొత్త పొత్తు... కాంగ్రెస్ పొమ్మనకుండా పొగబెట్టడం తో పాటియాలా రాజు.. అమరీందర్ ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’ పేరిట సొంతకుంపటి పెట్టుకున్నారు. సాగు చట్టాలను రద్దు చేస్తే బీజేపీతో కలిసి బరిలోకి దిగుతానని ప్రకటించిన కెప్టెన్ అన్నట్లుగానే పొత్తును ఖరారు చేసుకున్నారు. ఎవరెన్ని సీట్లలో పోటీచేయాలనేది ఇంకా తేల్చుకోలేదు. అకాలీ చీలికవర్గ నేతలను కూడా కూటమిలో చేర్చుకుంటామని కెప్టెన్ ఇదివరకే స్పష్టం చేశారు. అకాలీదళ్‌తో పొత్తులో భాగం గా 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 23 స్థానాల్లో పోటీచేసిన బీజేపీ కేవలం మూడు స్థానాల్లో నెగ్గింది. 5.39 శాతం ఓట్లను సాధించింది. అయితే 2019 లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి పోటీచేసిన మూడింటిలో రెండు నెగ్గి...9.63 శాతం ఓట్లు పొందింది. అమరీందర్ కాంగ్రెస్ ఓట్లను ఎన్నింటిని చీల్చగలరు, సాగు చట్టాల రద్దు ఈ కూటమికి ఏ మేరకు లబ్ధి చేకూరుస్తుంది, మోదీ కరిష్మా రాబోయే ఎన్నికల్లో ఎన్ని ఓట్లను రాల్చ గలదు... ఇవన్నింటిపై ఈ కూటమి ఎన్ని చోట్ల గెలుస్తుందనేది ఆధారపడి ఉంటుంది. సొంతగూటిని చక్కదిద్దాలి.. ఒత్తిడికి తలొగ్గి అనుభవజ్ఞుడైన ముఖ్య మంత్రి అమరీందర్ సింగ్‌ను మార్చడం, తర్వాత అదేపనిగా పీసీసీ అధ్యక్షుడు నవ జ్యోత్ సింగ్ సిద్ధూ అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపిస్తుండటంతో కాంగ్రెస్‌కు సొంత గూటిని సరిదిద్దుకోవడానికే ఎక్కువ సమయం సరిపోతోంది. పీసీసీ అధ్యక్షుడే సొంత ప్రభుత్వంపై బౌన్సర్లు సంధిస్తుంటే... తలబొప్పి కట్టడం ఖాయం. ప్రస్తుతం సిద్ధూతో కాంగ్రెస్ పెద్దలు ఇదే అవస్థను ఎదుర్కొంటున్నారు. పంజాబ్ జనాభాలో దాదాపు 32 శాతం దళిత ఓట్లు ఉండటాన్ని దృష్టిలో పెట్టుకొని... ఆ వర్గానికి చెందిన చరణ్‌జిత్ సింగ్ చన్నీని ఈ ఏడాది సెప్టెంబరులో సీఎం పీఠంపై కూర్చోబెట్టింది కాంగ్రెస్. ఎన్నికల్లో దళిత కార్డుగా ఉపయోగించుకోవడానికే చన్నీని అందలం ఎక్కించారని.. ఆర్నెళ్ల సీఎంగా మిగిలిపోతారని... కాంగ్రెస్‌కు దమ్ముంటే 2022 ఎన్నికల్లో కూడా ఆయన్నే సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ హస్తం పార్టీ అలా చేయలేదు. సర్వం తన కనుసన్నల్లో నడవాలనుకునే సిద్ధూకు కోపం తెప్పించే సాహసం కాంగ్రెస్ చేయలేదు. అలాగని ఆయన్ని సీఎం అభ్యర్థిగా ప్రకటించి ముందుకెళ్తే... దళిత ఓటు పోటును ఎదుర్కోవాల్సిన సంకట స్థితి. సిద్ధూ మాటల మాంత్రికుడు. చక్కటి హావభావాలతో సూటిగా ప్రజల మనసుల్లో ముద్రవేయగల వాగ్భాణాలను సంధిస్తారు. పంజాబ్ లో కాంగ్రెస్‌కు పర్యాయపదంగా మారిన అమరీందర్ లేని లోటును సిద్ధూ ఏమేరకు పూడ్చగలరు, ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి తన చరిష్మాతో మళ్లీ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేయగలరా? వేచి చూడాలి. కేజ్రీవాల్‌పైనే భారం ఢిల్లీకే పరిమితమైన ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌పై బాగా ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో బల మైన పునాది కలిగిన అకాలీదళ్‌కు వెనక్కి నెట్టి... 20 స్థానాలతో ఆప్ పంజాబ్ అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 23.72 శాతం ఓట్లు రావడంతో గత ఐదేళ్లుగా ప్రణాళిక ప్రకారం పంజాబ్‌లో బలపడేందుకు ప్రయత్నిస్తోంది. గతంలో లోక్ ఇన్సాఫ్ పార్టీకి ఆరుస్థానాలను (రెండు నెగ్గింది) వదిలిన ఆప్ ఇప్పుడు ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుంది. పూర్తిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రజాకర్షణపైనే ఆధారపడుతోంది. ఢిల్లీలో పాఠశాలల్లో నాణ్యత మెరుగుపడటం, మొహల్లా క్లినిక్‌లు విజయవంతం కావడం, పేదలకు ఉచిత విద్యుత్... తదితర ఢిల్లీ మోడల్ పాలనను అందిస్తామని వాగ్ధానం చేస్తోంది. సిక్కునే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఇప్పటికే నాలుగు విడతల్లో 73 మంది అభ్యర్థుల పేర్లను ఆప్ ప్రకటించింది. -
సొంత పార్టీపై గళమెత్తిన రావత్.. ఆయన దారి కెప్టెన్ దారేనా? లేక
సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ నాయకత్వ లేమిపై సీనియరత్ నేతల అసమ్మతి.. మరోవైపు వరుస ఎదురుదెబ్బలతో సమతమతమవుతున్న కాంగ్రెస్‌కు మరో సమస్య వచ్చిపడింది. ఉత్తరాఖండ్ మాజీ సీఎం, పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ హరీష్ రావత్ అసంతృప్తి గళం వినిపించడం కలకలం రేపుతోంది. గాంధీ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడిగా.. ట్రబుల్ షూటర్‌గా పేరున్న రావత్ యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2014 నుంచి 2017 వరకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. మొన్నటి వరకు పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఓ వెలుగు వెలిగారు. అయితే అమరీందర్‌సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్దూ మధ్య విభేదాలను పరిష్కరించడంలో విఫలమయ్యారనే కారణంతో ఆయన్ను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. దానికితోడు ఉత్తరాఖండ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఇటీవల నియమితులైన దేవేంద్ర యాదవ్‌కు, రావత్‌కు పొసగడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో హరీష్ రావత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. (చదవండి: ఒమిక్రాన్‌పై ఊరటనిచ్చే విషయం.. కేసులు తక్కువ, రికవరీ ఎక్కువ.. ఇంకా) వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఉత్తరాఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు కొనసాగే అవకాశముందనే వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని ముందుండి నడిపించాల్సిన రావత్ ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇంటా బయట చర్చనీయాంశమయ్యాయి. పార్టీలో తనకు కాళ్లు, చేతులు కట్టేసినట్టుగా ఉందని.. ఇక విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందేమోనని ట్వీట్ చేయడమే కాకుండా భవిష్యత్ కార్యాచరణపై కొత్త సంవత్సరంలో నిర్ణయం తీసుకుంటానని ప్రకటించడం దుమారానికి కారణమైంది. వెంటనే హైకమాండ్ జోక్యం చేసుకుని రావత్‌ను బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా ఉత్తరాఖండ్ సీఎల్పీ నేత ప్రీతమ్‌సింగ్, పీసీసీ చీఫ్ గణేశ్ గొడియాల్, హరీష్ రావత్‌ను శుక్రవారం ఢిల్లీకి రావాలని పిలిచింది. అయితే అధిష్ఠానం జోక్యంతో రావత్ మెత్తబడతారా లేక కెప్టెన్ అమరీందర్ సింగ్ తరహాలో తిరుగుబాటు బావుటా ఎగరేసి చికాకులు తెస్తారా అనే చర్చ హస్తిన వర్గాల్లో సాగుతుండడం ఆసక్తికరంగా మారింది. రావత్ మాత్రం సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానని ప్రకటించడం మరింత ఉత్కంఠ రేపుతోంది. (చదవండి: మేం ఎన్నికల్లో పాల్గొనడం లేదు) -
పంజాబ్‌లో అమరీందర్‌తో కాషాయదళం పొత్తు
న్యూఢిల్లీ: రానున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ లోక్ కాంగ్రెస్(పీఎల్సీ)తో కలిసి బరిలోకి దిగనున్నట్లు బీజేపీ ప్రకటించింది. పీఎల్సీ చీఫ్, పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్‌తో బీజేపీ పంజాబ్ ఇంఛార్జ్ గజేంద్ర షెకావత్ సమావేశం అనంతరం రెండు పార్టీల మధ్య పొత్తును శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ఇరుపార్టీల పొత్తుతో రానున్న ఎన్నికల్లో గెలుపు ఖాయమని, సీట్ల పంపకాల వివరాలను సరైన సమయంలో వెల్లడిస్తామని వారు తెలిపారు. ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన అనంతరం కాంగ్రెస్‌ను వదిలిన అమరీందర్.. పంజాబ్ లోక్ కాంగ్రెస్‌ను స్థాపించారు. ఇక శిరోమణి అకాలీదళ్‌తో బీజేపీకి ఉన్న చిరకాల బంధం మూడు వ్యవసాయ చట్టాల సమస్యతో తెగిపోయింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు కూడా సమీపిస్తుండటంతో బీజేపీ, పీఎల్సీతో సంప్రదింపులు మొదలుపెట్టింది. -
కాంగ్రెస్‌లో చేరిన వివాదాస్పద గాయకుడు..
చంఢీఘడ్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పంజాబ్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అమరీందర్ సింగ్, సిద్ధూల మధ్య పరస్పర ఆరోపణలు, రాజీనామాల తర్వాత.. కాంగ్రెస్‌లో అనేక పలు ఆసక్తికర మార్పులు సంభవించిన విషయం తెలసిందే. తాజాగా, పంజాబ్ వివాదాస్పద గాయకుడు సిద్ధూ మూసేవాలా కాంగ్రెస్‌లో చేరారు. ఆయన పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ, పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. మూసేవాలా.. గతంలో ‘సంజు’ అనే పాటల వీడియోలో తుపాకీలను ఉపయోగించారు. ఆ పాట వివాదాస్పదంగామారి, పలు కేసులు కూడా నమోదయ్యాయి. మూసేవాలా చేరికపై సీఎం ఛన్నీ స్పందించారు. మూసేవాలా.. ప్రజల మనస్సులు గెలుచుకున్నారని తెలిపారు. ఆయన తండ్రి మాజీ సైనికాధికారి, తల్లి మాన్సా గ్రామానికి సర్పంచ్‌గా పనిచేశారని తెలిపారు. అదే విధంగా, మూసేవాలా రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మూసేవాలా మాట్లాడుతూ.. తాను మూడేళ్ల కిందట పాటలను పాడటం ఆరంభించానని తెలిపారు. ప్రస్తుతం ఒక కొత్త మార్పు రావాలనే సంకల్పంతో.. ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. మాన్సా గ్రామం చాలా వెనుక బడి ఉందని, గ్రామాభివృద్ధి కోసమే.. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. మూసేవాలా.. కాంగ్రెస్ పార్టీని గర్వపడేలా చేస్తారనే నమ్మకం ఉందని ఛన్నీ అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా.. నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. మూసేవాలాను ‘చాంప్’ గా కూడా అభివర్ణించారు. కాగా, సిద్ధూ మూసేవాలా అసలు పేరు.. శుభ్ దీప్ సింగ్ సిద్ధూ. ఆయన ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. సంగీతం నేర్చుకున్నారు. సిద్ధూ మూసేవాలా తన స్వగ్రామమైన మాన్సా నుంచి బరిలో దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. -
‘ మీ భార్య కాంగ్రెస్‌ను వీడుతుందా..?’: నవజ్యోత్ సింగ్ సిద్ధూ
చంఢీఘడ్: పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్, సిద్ధూల మధ్య పరస్పర ఆరోపణలు కొనసాగుతున్నాయి. తాజాగా, పంజాబ్ మాజీ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. అమరీందర్ సింగ్‌ను ఉద్దేశించి వివాదాస్పద ట్వీట్ చేశారు. ‘‘మీ సతీమణి, మేడం ప్రణీత్ కౌర్.. మీతో పాటు కాంగ్రెస్‌కు రాజీనామా చేశారా.. లేదా’’ అంటూ ప్రశ్నించారు. మీ భార్య మీ నిర్ణయాలకు సానుకూలంగా.. నిలబడలేరని విమర్శించారు. అమరీందర్ సింగ్ పిడుగుపాటులో చనిపోతున్న బాతులాంటి వాడని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, అమరీందర్ సింగ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి నిన్న(మంగళవారం) ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’ అనే కొత్త పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. అమరీందర్ సింగ్ తన రాజీనామా లేఖలో సిద్ధూని.. పాక్‌కు అంతరంగిక బంటూ అంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా, పంజాబ్‌లో అమరీందర్ సింగ్, నవజ్యోత్సింగ్ల మధ్య విబేధాలు కొనసాగుతునే ఉన్నాయి. -
కొత్త పార్టీని ప్రకటించిన పంజాబ్ మాజీ సీఎం..
చండీగఢ్: పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ మంగళవారం కొత్త పార్టీ పేరుని ప్రకటించారు. దీంతో కొన్ని నెలలుగా ఆయన.. బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కొత్త పార్టీ పేరును ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’ అని అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. పార్టీ గుర్తు ఎన్నికల సంఘం పరిశీలనలో ఉందన్నారు. త్వరలోనే నూతన పార్టీ గుర్తును కూడా వెల్లడిస్తానని తెలిపారు. అదే విధంగా అమరీందర్ సింగ్.. తన రాజీనామాను ట్విటర్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పంపినట్లు తెలిపారు. ఈ లేఖలో రాజీనామాకు గల కారణాలను పొందుపర్చానని అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. పంజాబ్ ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా తన పార్టీ పనిచేస్తోందని అన్నారు. బీజేపీతో.. తమ పార్టీకి పొత్తు ఉంటుందని ఎక్కడ ప్రకటించలేదన్నారు. కేంద్రం రైతు చట్టాల సమస్యను పరిష్కరిస్తే.. ఆ తర్వాత పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. I have today sent my resignation to @INCIndia President Ms Sonia Gandhi ji, listing my reasons for the resignation. ‘Punjab Lok Congress’ is the name of the new party. The registration is pending approval with the @ECISVEEP. The party symbol will be approved later. pic.twitter.com/Ha7f5HKouq — Capt.Amarinder Singh (@capt_amarinder) November 2, 2021 -
పంజాబ్‌లో మారనున్న రాజకీయ సమీకరణాలు
చంఢీగడ్: త్వరలోనే తాను.. కొత్త పార్టీ పేరు, గుర్తును ప్రకటిస్తానని పంజాబ్ కాంగ్రెస్ పార్టీ.. మాజీ సీఎం అమరీందర్ సింగ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం అనుమతి కోసం వేచిచూస్తున్నామని... ఆ ప్రక్రియ కాగానే పార్టీ పేరును ప్రకటిస్తానని అమరీందర్ సింగ్ అన్నారు. బీజేపీతో ఎలాంటి పోత్తు ఉండబోదని స్పష్టం చేశారు. కొందరు కావాలనే తనపై చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము 117 స్థానాల్లో పోటీకి దిగుతామని అన్నారు. ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ నాయకులు తనతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. తాను పంజాబ్ సీఎంగా ఉన్నప్పుడే.. 90 శాతానికి పైగా ఎన్నికల వాగ్దానాలను పూర్తి చేశానని పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ తెలిపారు. చదవండి: తమిళనాడులో కేంద్రం కొత్త ఆట.. రసవత్తరంగా రాజ్‌భవన్ రాజకీయం..! -
కొత్త పార్టీ ఏర్పాటుకు అమరీందర్ సింగ్ సన్నాహాలు
-
కొత్త పార్టీ ఏర్పాటుకు అమరీందర్ సింగ్ సన్నాహాలు
న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం కొనసాగుతుంది. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో 15 రోజుల్లో కొత్త పార్టీ పేరును ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, కెప్టెన్ అమరీందర్‌తో ఇప్పటికే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు,రైతు నేతలు టచ్‌లో ఉన్నట్లు సమాచారం. కాగా, అమరీందర్ సింగ్ పంజాబ్ వికాస్ పార్టీ పేరుతో కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. సన్నిహితులతో, కార్యకర్తలతో చర్చించాక భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని అమరీందర్ సింగ్ సన్నిహితులు తెలిపారు. కాంగ్రెస్,ఆప్, అకాలీదళ్ అసంతృప్త నేతలను అమరీందర్ కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, సిద్ధూ పంజాబ్ వంటి సరిహద్దు రాష్ట్రానికి సరైన వ్యక్తి కాదని.. ఆయన ఎన్నికలలో.. ఏ స్థానం నుంచి బరిలోకి దిగిన గెలవనిచ్చేది లేదని అమరీందర్ సింగ్ ఇది వరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. చదవండి: శాంతించిన సిద్ధూ..! -
కలిసొచ్చిన అదృష్టం?
కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన కొడుకు అంటే ఇదేనేమో! దేశరాజధాని నుంచి తమ సామ్రాజ్యాన్ని పంజాబ్ సహా ఇతర రాష్ట్రాలకు విస్తరించడానికి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు ఇంతకు మించిన మంచి అవకాశం రాదు. సరిగ్గా నెల రోజుల్లో ప్రత్యర్థుల తప్పులతో పంజాబ్‌లో తమ పార్టీ ఇంతగా పుంజు కుంటుందని చివరకు ‘ఆప్’ సైతం ఊహించలేదు. కాంగ్రెస్‌లోని అంతర్గత విభేదాలు, ఆ పార్టీ సీఎం అమరీందర్ రాజీనామా, పీసీసీ పీఠమెక్కినంత వేగంగానే సిద్ధూ కిందకు దిగిపోతానని అలకపాన్పు ఎక్కడం– అన్నీ ఇప్పుడు ‘ఆప్’కు కలిసొస్తున్నాయి. సర్వశక్తులూ కేంద్రీకరిస్తే, మరో అయిదు నెలల్లో పంజాబ్‌లో జెండా ఎగరేయడం కష్టమేమీ కాదని ఆ పార్టీకి అర్థమైంది. ‘ఆప్’ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రెండురోజుల పంజాబ్ పర్యటన, కురిపించిన హామీలే అందుకు నిదర్శనం. జూలై ఆఖరున జరిపిన తమ ఆఖరి సర్వేలో పంజాబ్‌లో 20 శాతం మేర కాంగ్రెస్ ప్రజాదరణ తగ్గిందనీ, ‘ఆప్’ ఆదరణ పెరిగిందనీ సాక్షాత్తూ అమరీందరే చెబుతున్నారు. మరోపక్క సీ–ఓటర్ లాంటి జాతీయ సంస్థల సర్వే సైతం ఈసారి ‘ఆప్’ అతి పెద్ద పార్టీగా అవతరించనుందని అంచనా వేస్తోంది. ఆ పార్టీ, దాని అధినేత దూకుడు పెంచింది అందుకే. అధికారంలోకొస్తే గృహ వినియోగానికి 300 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామన్నారు. తాజాగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత పరీక్షలు, సర్జరీలు, ఢిల్లీ తరహాలోనే పంజాబ్‌లో 16 వేల గ్రామక్లినిక్లు అంటూ రెండో భారీ వాగ్దానం చేశారు. నిజానికి ‘ఆప్’ దళిత కార్డూ వాడదలిచింది. కొత్త సీఎంగా చన్నీ రూపంలో కాంగ్రెస్ ముందే ఆ కార్డు వాడడంతో ‘ఆప్’కు ఓ అస్త్రం పోయింది. అయితేనేం, కాంగ్రెస్ దళిత ప్రేమ కేవలం ఎన్నికలయ్యే దాకా మూడు నెలల ముచ్చటేనని ఎదురుదాడికి దిగింది. కాంగ్రెస్‌లా హిందూ ముద్రకు దూరం జరగలేదు. మధ్యేమార్గ జాతీయవాదపార్టీగా హిందూ ఓటర్లను ఆకర్షించే యత్నం చేస్తోంది. ఈసారి సిక్కులకే సీఎం పీఠమని తేల్చేసింది. అలా అన్ని వర్గాలనూ తనవైపు తిప్పుకొనే పనిలో ‘ఆప్’ ఉంది. కాంగ్రెస్‌కు సొంత ఇంటిని సర్దుకోవడంతోనే సరిపోతోంది. కొత్త సీఎం చన్నీతో గురువారం 3 గంటల పైగా చర్చ తర్వాత, పీసీసీ పీఠానికి రాజీనామా విషయంలో సిద్ధూ రాజీకి వచ్చినట్టు వార్త. కానీ, వరుస అనాలోచిత, దుందుడుకు చర్యలతో ఆయనకూ, కాంగ్రెస్ పార్టీకీ జరగకూడని నష్టం జరిగిపోయింది. ఈ మొత్తంలో చివరకు గెలుపు ఎవరిదన్నది పక్కన పెడితే, నష్టపోయింది నిస్సందే హంగా కాంగ్రెస్సే. బుధవారం అమిత్‌షానూ, గురువారం అజిత్ దోవల్‌నూ కలిసిన అమరీందర్ బీజేపీలో చేరట్లేదని అన్నారు. కానీ, ఏదో సామెత చెప్పినట్టు పెళ్ళిలో నాగవల్లి నాటి మాట సదస్యా నికి ఉంటుందా అన్నది ప్రశ్న. రానున్న అయిదు నెలల్లో ఏం జరుగుతుందో చెప్పలేం. సీనియర్లను ఘోరంగా అవమానిస్తున్న కాంగ్రెస్‌ను మాత్రం వదిలేస్తున్నట్టు అయిదు దశాబ్దాల పైచిలుకు రాజకీయ అనుభవజ్ఞుడు అమరీందర్ సింగ్ కరాఖండిగా చెప్పేశారు. ఎట్టి పరిస్థితుల్లో సిద్ధూను గెలవనిచ్చేది లేదనీ మరోసారి తొడగొట్టారు. ఇవన్నీ కలిసి కాంగ్రెస్ పుట్టి ముంచేలా ఉన్నాయి. పంజాబ్‌లో కెప్టెన్ అమరీందర్ సత్తా తెలిసిన విశ్లేషకులు చెబుతున్న జోస్యం ఒకటే – సిద్ధూను ఆయన మట్టి కరిపించడం ఖాయం. కాంగ్రెస్ అధిష్ఠానానికి తప్పు తెలిసొచ్చేలా చేయడమూ ఖాయం. అదే నిజమైతే, కాంగ్రెస్ మరో రాష్ట్రాన్ని చేజేతులా వదులుకున్నట్టు అవుతుంది. పంజాబ్‌లో బీజేపీ, దాని మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్‌కు ఎలాగూ ఇప్పుడు పెద్ద బలం లేదు గనక, ‘ఆప్’కు ఇప్పుడు అన్నీ మంచి శకునములే. అలాగని ‘ఆప్’కు సమస్యలే లేవని కాదు. గత రెండేళ్ళుగా ఆ పార్టీ పంజాబ్ విభాగం అంతర్గత విభేదాలతో సతమతమవుతోంది. గెలుపు వాసనలు పసిగట్టిన అసంతృప్త నేతలు ఇప్పుడిప్పుడే దారికొస్తున్నారు. అకాలీదళ్, ఇప్పుడు కాంగ్రెస్ పాలనల్లోని లోటుపాట్లను ప్రచారోపన్యాసాల్లో పదే పదే ప్రస్తావిస్తున్నారు. ‘ఆప్’కు ‘ఒక్క ఛాన్సివ్వండి’ అంటున్నారు. 2017 పంజాబ్ ఎన్నికల్లో ‘ఆప్’ 20 సీట్లు గెలిచి, ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. అప్పట్లో స్థానికులెవరినీ సీఎం అభ్యర్థిగా ప్రకటించక, లోకల్ సెంటిమెంట్‌లో దెబ్బతింది. ఈసారి ఆ పొరపాటు చేయదలుచుకోలేదు. ఇంకా సస్పెన్స్ ముడి విప్పకపోయినా, ఈసారి సిక్కు వర్గీయులే తమ అభ్యర్థి అని జూన్‌లోనే ప్రకటించేసింది. ఢిల్లీ తరహా పాలన, ఉచిత పథకాల హామీలే ఆసరాగా పైకి ఎగబాకాలని చూస్తోంది. అయితే, ఢిల్లీలో ‘ఆప్’ పాలనంతా అద్భుతమనీ నమ్మలేం. కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రచారానికి తెగ ఖర్చు చేస్తోంది. బీ కేటగిరీ రాష్ట్రమైన ఢిల్లీలో తలసరి ప్రభుత్వ ప్రకటనల ఖర్చు దేశమంతటిలోకీ అత్యధికమట. రాజధాని పేపర్లలో రోజూ ఏదో ఒక మూల ‘ఆప్’ ప్రకటన ఉండాల్సిందేనంటున్నారు పరిశీలకులు. కరోనా కాలంలో రాజధాని వదిలి గ్రామాలకు వెళ్ళిన వలస జీవుల ఇంటి అద్దెలు తామే కడతామన్న తలకు మించిన హామీలూ ‘ఆప్’ అధినేత ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికల వేళ పంజాబ్‌లోనూ వాగ్దానాల వర్షం కురిపిస్తున్నారు. రేపు నిజంగా అధికారం లోకి వస్తే అవన్నీ ఆచరణ సాధ్యమా అన్నది ప్రశ్న. గత ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదన్నదే వర్తమాన కాంగ్రెస్ సర్కారుపై సొంత నేత సిద్ధూ సహా ప్రతిపక్షాలు చేస్తున్న ప్రధాన ఆరోపణ. వచ్చిన సానుకూలతను ‘ఆప్’ వాడుకోవడం వరకు ఓకే కానీ, ఓట్ల కోసం చందమామను చేతిలో పెడతామంటేనే చిక్కు. ఎందుకంటే, ఓటర్లకిచ్చిన మాట నిలబెట్టుకోవడం ఎంత కష్టమో ఢిల్లీలో ఆ పార్టీకి ఇప్పటికే తెలిసొచ్చింది. తస్మాత్ జాగ్రత్త! -
బీజేపీలో చేరికపై అమరీందర్ సింగ్ కీలక వ్యాఖ్యలు
చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో పూటకో మలుపు చోటు చేసుకుంటుంది. అమరీందర్ సింగ్ రాజీనామా.. చన్నీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం.. సిద్ధూ రాజీనామా చేయడం వంటి సంఘటనలతో పంజాబ్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ చోటు చేసుకుంది. ఈ క్రమంలో అమరీందర్ సింగ్ బుధవారం అమిత్ షాతో భేటీ కావడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. త్వరలోనే కెప్టెన్ బీజేపీలో చేరతారనే ఊహాగానాలు జోరుగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అమరీందర్ సింగ్ ఈ వార్తలపై స్పందించారు. బీజేపీలో చేరికపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉండనని.. అలా అని బీజేపీలో కూడా చేరనని అమరీందర్ స్పష్టం చేశారు. ఎన్డీటీవీకిచ్చిన ఇంటర్వ్యూలో అమరీందర్ పలు అంశాలపై మాట్లాడారు. (చదవండి: అమిత్‌తో అమరీందర్ భేటీ) అమరీందర్ మాట్లాడుతూ.. ‘‘గత 52 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. నాకంటూ కొన్ని విలువలు, నియమాలు ఉన్నాయి. ఉదయం 10.30 గంటలకు ఫోన్ చేసి నన్ను రాజీనామా చేయమన్నారు.. ఎందుకు ఏంటి అనే ప్రశ్నలు వేయలేదు. సాయంత్రం 4 గంటలకు గవర్నర్‌ను కలిసి నా రాజీనామాను సమర్పించాను. 50 ఏళ్ల తర్వాత పార్టీకి నా మీద, నా విశ్వసనీయత మీద అనుమానం కలిగింది. నా మీద నమ్మకం లేనప్పుడు నేనేందుకు పార్టీలో ఉండాలి’’ అని ప్రశ్నించారు. (చదవండి: Navjot Singh Sidhu: సిద్ధూ ఆప్‌లో చేరబోతున్నాడా?) ‘‘పార్టీ నా పట్ల ప్రవర్తించిన తీరు సరిగా లేదు. నేను ఇంకా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదు.. కానీ ఇలాంటి పరిస్థితుల్లో నేను పార్టీలో ఎలా కొనసాగగలను. నేను నిమిషాల వ్యవధిలో నిర్ణయం తీసుకునే వ్యక్తిని కాను. కాంగ్రెస్‌లో కొనసాగను.. బీజేపీలో చేరను’’ అని అమరీందర్ స్పష్టం చేశారు. ‘‘సిద్ధూకి పరిపక్వత లేదు.. తను స్థిరంగా ఉండలేడు.. జట్టును నడిపించలేడు.. ఒంటరి ఆటగాడు. అలాంటి వ్యక్తి పంజాబ్ కాంగ్రెస్‌ని ఎలా నడిపించగలడు. పార్టీని నడిపించాలంటే టీమ్ ప్లేయర్ కావాలి.. సిద్ధూ అలా ఉండలేడు. తాజా సర్వేల ప్రకారం పంజాబ్‌లో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతుంది.. ఆప్ ఎదుగుతుంది’’ అని అమరీందర్ తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొందరు అమరీందర్‌ని బుజ్జగించే పనిలో ఉన్నారని.. కానీ ఆయన మాత్రం ఎవరిని కలవడానికి ఇష్టపడటంలేదని సమాచారం. (చదవండి: పార్టీలో కిరికిరి... రాజకీయ హరకిరి) -
Navjot Singh Sidhu: సిద్ధూ ఆప్‌లో చేరబోతున్నాడా?
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్‌లో రాజకీయ పరిణామాలు రోజురోజుకు అనూహ్యంగా మారుతున్నాయి. కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి, పీసీసీ అధ్యక్ష పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేయడంతో సరికొత్త మలుపులు తిరుగుతోంది. ఇద్దరు బలమైన నేతలు రాజీనామాలు చేయడంతో కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడింది. అయితే నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆప్ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్.. సిద్దూ చేరిక ఊహాగానాలపై స్పందిస్తూ.. పంజాబ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా బలమైన నేతను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని అన్నారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆప్‌లో చేరుతారనేది ఊహాత్మకమైన విషయమని తెలిపారు. అటువంటి పరిస్థితులు పంజాబ్ చోటు చేసుకుంటే తామే వెల్లడిస్తామని తెలిపారు. మరోసారి బలంగా చెబుతున్నానని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ తరఫున బలమైన నేతను సీఎం అభ్యర్థిగా నిలబెడతామని స్పష్టం చేశారు. అది ఎవరనేది త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతానికి ఆ విషయానికి సంబంధించి తాము ఆలోచించడంలేదని పేర్కొన్నారు. దీంతో నవజ్యోత్ సింగ్ ఆప్‌లో చేరుతారని వస్తున్న వార్తలకు బలం చేకూరుతోంది. నవజ్యోత్ సింగ్ గతంలో ఆప్‌లో కీలక నేతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇక మరోవైపు కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరుతారని వార్తలు వస్తున్నాయి. అదే విధంగా ఆయన బుధవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కావటంతో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
తెగేసి చెప్పిన కెప్టెన్
-
మోదీతో కెప్టెన్ కీలక భేటీ !
-
ఓర్నీ.. మీరెక్కడ తయారయ్యార్రా బాబూ
టెక్నాలజీ వల్ల ఎంత మంచి జరుగుతుందో.. ఒక్కోసారి అంతే ఇబ్బందులూ ఎదురవుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో నడిచే కమ్యూనికేషన్.. చిన్న చిన్న పొరపాట్ల వల్ల మిస్ కమ్యూనికేషన్ మారుతుంది కూడా. కేవలం టెక్నికల్ అంశాల్ని పరిగణనలోకి తీసుకుని.. వ్యవహారంతో సంబంధం లేనివాళ్లను ఇబ్బంది పెడుతుండటం తరచూ చూస్తుంటాం. అలాంటిదే ఈ ఘటన. ప్రస్తుతం పంజాబ్ రాజకీయ సంక్షోభం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా అనంతర పరిణామాలు ఆసక్తిగా మారాయి. అయితే ఈ వ్యవహారంలోకి సంబంధం లేని వ్యక్తి పేరు తెర మీదకు రాగా.. అది సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. అమరీందర్ సింగ్.. ఇండియన్ ఫుట్‌బాల్ టీం గోల్ కీపర్. అయితే ఈ అమరీందర్ సింగ్‌ను.. కెప్టెన్ అమరీందర్ సింగ్‌గా పొరపడి మీడియా ఛానెల్స్, వెబ్సైట్లు, నెటిజన్స్ ఎగబడి ట్విటర్లో ట్యాగ్ చేస్తున్నారట. Dear News Media, Journalists, I am Amrinder Singh, Goalkeeper of Indian Football Team 🇮🇳 and not the Former Chief Minister of the State Punjab 🙏😂 Please stop tagging me. — Amrinder Singh (@Amrinder_1) September 30, 2021 దీంతో ఈ ట్యాగుల గోల భరించలేక ట్విటర్లో రియాక్ట్ అయ్యాడు గోల్ కీపర్ అమరీందర్ సింగ్. దయచేసి ట్యాగ్ చేయడం ఆపండంటూ మీడియా హౌజ్‌లకు రిక్వెస్ట్‌లు చేశాడాయన. మనోడి రిక్వెస్ట్‌కి మీడియా పేజీల సంగతేమోగానీ.. నెటిజన్స్ మాత్రం భలేగా రియాక్ట్ అవుతున్నారు. గోల్‌కీపర్ అమరీందర్.. జట్టుకు కెప్టెన్ అయ్యి ఉంటే సరిగ్గా సరిపోయి ఉండేదని ఒకరు, సీఎం అయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టమని మరొకరు.. ఇలా ఒక్కోక్కరు సరదా సంభాషణలతో గోల్‌కీపర్ అమరీందర్ టైం లైన్‌ను నింపేస్తున్నారు. Please dont accept captaincy of the team for some time. Otherwise definitely you will be made CM candidate. — Mudisu Drejine (@magicdheer) September 30, 2021 😂😂 pic.twitter.com/dvzbGUZbg2 — Superpower Football (@SuperpowerFb) September 30, 2021 Indian Media ryt now 👇😂 pic.twitter.com/sk41ow9PFY — 90ndstoppage (@90ndstoppage) September 30, 2021 -
పార్టీలో కిరికిరి... రాజకీయ హరకిరి
పూటకో మలుపు.. రోజుకో మార్పు.. వారానికో అజెండా.. నెలకో కొత్త పాత్ర.. సినిమాల్లోనూ లేనంతటి ఉత్కంఠ. పంజాబ్‌లో కాంగ్రెస్ రాజకీయం డైలీ సీరియల్ భావోద్వేగాలను మించి నడుస్తోంది. పార్టీని విజయపథంలో నడిపిస్తున్న అమరీందర్ సింగ్‌ను రాజీనామా గుమ్మం ఎక్కించి, రాష్ట్రంలో 32 శాతం ఉన్న దళితులకు ప్రతినిధిగా చన్నీని పీఠం ఎక్కించి పట్టుమని పదిరోజులైనా కాలేదు. ఇంతలోనే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష స్థానమెక్కిన 72 రోజులకే ‘‘విలువలతో రాజీపడలే’’నంటూ నవజోత్ సింగ్ సిద్ధూ కాడి కింద పడేశారు. ఆయన రాజీనామాపై పార్టీలో మల్లగుల్లాలు పడుతుండగానే, బీజేపీలో చక్రం తిప్పుతున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను అమరీందర్ బుధవారం ఢిల్లీలో కలవడంతో కథ కొత్త మలుపు తిరిగింది. ఒకపక్క పంజాబ్ కుంపటి, మరోపక్క ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలోనూ రగులుతున్న అసమ్మతి. అధిష్ఠానంపై మళ్ళీ నిరసన గళం విప్పిన 23 మంది అసమ్మతి నేతల ‘జీ–23’ బృందం. వెరసి, కేంద్రంలోని ప్రతిపక్ష కాంగ్రెస్ ఇప్పుడు అధికార బీజేపీతో కాకుండా, అంతర్గత పోరాటాలతో పొద్దుపుచ్చుతున్న పరిస్థితి. చాలాసార్లు నిర్ణయాలే తీసుకోకపోవడం, తీసుకున్న కొద్ది నిర్ణయాల్లో అనేక తప్పులు– ఇప్పుడు ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీని పట్టిపీడిస్తున్నాయి. యువవారసులు రాహుల్, ప్రియాంకల రాజకీయ పరిణతికి ఇది సవాలు. 2022 పంజాబ్ ఎన్నికల్లో అమరీందర్ బదులు ఆయన ప్రత్యర్థి సిద్ధూను ఎంచుకున్న తప్పు వారిని చిరకాలం వెంటాడనుంది. అధిష్ఠానం కోరితెచ్చుకున్న కుంపట్లే ఇందులో ఎక్కువ. నిన్నటిదాకా పంజాబ్ కాంగ్రెస్‌లో అమరీందర్, సిద్ధూ – వైరి వర్గాలు రెండే. సునీల్ జాఖడ్, రణ్ధవాలను కాదని, చన్నీని సీఎంను చేయడంతో రాష్ట్రంలో పార్టీ ఇప్పుడు అయిదు వర్గాలైంది. నిత్యపోరాటం సిద్ధూ శైలి. స్వపక్షీయులా, విపక్షీయులా అన్నదానితో సంబంధం లేకుండా రోజూ ఎవరో ఒకరితో పోరాడకపోతే నిద్రపట్టని రాజకీయ అపరిపక్వత ఆయనది. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మీదుగా కాంగ్రెస్ దాకా జెండాలు, అజెండాలు మార్చుకుంటూ వచ్చిన ఆయన, అమరీందర్‌ను గద్దె దింపే దాకా నిద్రపోలేదు. తీరా ఇప్పుడు కొత్త సీఎం, ఆయన చేపట్టిన నియామకాలు తన చెప్పుచేతల్లో లేవని అలిగారు. కళంకితులకు పదవులిచ్చారనే ఆరోపణలు సరేసరి. పదవికి రాజీనామా చేసినా, పార్టీ కోసం పనిచేస్తానని సిద్ధూ ఇప్పటికైతే అన్నారు. కానీ, ఇప్పటికిప్పుడు సీఎం అయ్యే ఛాన్స్ పోయాక, పీసీసీ పీఠమూ వదులుకున్నాక, వచ్చే ఎన్నికలలో నిలిచేదెవరో – గెలిచేదెవరో తేలని పరిస్థితుల్లో సిద్ధూ ఎన్నాళ్ళు తన మాట మీద ఉంటారో తనకే తెలీదు. కొత్త సీఎం చన్నీకి ఇప్పుడు పరిపాలన కన్నా పార్టీలో సర్దుబాట్లకే సమయం సరిపోతోంది. రాష్ట్ర డీజీపీ సహా పలువురిని మారిస్తే – తన రాజీనామాపై పునరాలోచిస్తానంటూ సిద్ధూ షరతులు పెట్టినట్టు ఓ వార్త. ఇప్పటికే రకరకాల షరతులతో కాంగ్రెస్‌లో అనూహ్యంగా ఈ స్థాయికొచ్చిన ఈ మాజీ క్రికెటర్ ఒత్తిడికి అధిష్ఠానం మళ్ళీ తలొగ్గుతుందా అన్నది ఆసక్తికరం. అదే చేస్తే కోరి నెత్తినపెట్టుకున్న సిద్ధూకు అధిష్ఠానం లొంగిపోయినట్టు ఉంటుంది. పోనీ సిద్ధూను కాదని, ‘ప్లా¯Œ బి’తో మరొకరిని పార్టీ ప్రెసిడెంట్‌ను చేసినా అదీ కష్టమే. అటు అమరీందర్నూ, ఇటు సిద్ధూను వదులుకొని, రేపు రాష్ట్ర ఎన్నికలకు బలమైన సారథి లేకుండానే పంజాబ్ బరిలోకి కాంగ్రెస్ దిగాల్సిన దుఃస్థితి. కాంగ్రెస్‌కు ఇది ముందు నుయ్యి, వెనుక గొయ్యి. బీజేపీ అమిత్‌షాతో కాంగ్రెస్ మాజీ సీఎం అమరీందర్ ముప్పావు గంట భేటీ భవిష్యత్ పరిణామాలకు బలమైన సూచిక. ఈ భేటీలో కొత్త సాగుచట్టాలు, రైతు ఉద్యమంపై మాట్లాడుకున్నామని ఈ అసంతృప్త కాంగ్రెస్ నేత ట్వీటారు. కానీ, భేటీ ముగిసిపోగానే, ఈ మాజీ ఆర్మీ ఆఫీసర్ మీడియాకు దొరక్కుండా వెనుక గేటు నుంచి వెళ్ళిపోవడం కథలో కొత్త మసాలా. ‘కిలోమీటర్ల మేర అంతర్జాతీయ సరిహద్దు పంచుకుంటున్న పంజాబ్ విషయంలో జాతీయ ప్రయోజనాలే కీలకం, సిద్ధూను గెలవనిచ్చేది లేద’న్నది అమరీందర్ కొద్దికాలంగా పదే పదే చేస్తున్న భీష్మప్రతిజ్ఞ. మరి, దేశీయాంగ శాఖ మంత్రితో తాజా భేటీ దేశ ప్రయోజనం కోసమా, లేక అమరీందర్ పార్టీ మారనున్నారనడానికి సంకేతమా? ఇవాళ కాకుంటే, రేపు అది బయటపడనుంది. వరుస సంక్షోభాల్లో ఉన్న కాంగ్రెస్ వాటి నుంచి ఎలా బయటపడుతుందన్నదే బేతాళప్రశ్న. ఇప్పటికే జితిన్ ప్రసాద్, సుస్మితా దేవ్, గోవా మాజీ సీఎం ఫెలీరో– ఇలా కాంగ్రెస్ కీలక నేతలు పలువురు పార్టీని వీడారు. ‘జీ–23’ గ్రూపు అసమ్మతి నేతలు ఇదే అదనుగా మళ్ళీ గళమెత్తారు. ‘‘మాది జీ హుజూర్ గ్రూపు కాదు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కావాల్సిందే’’ అన్నది సిబాల్ ధిక్కారం. మరోపక్క బుధవారమే ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డజను మందికి పైగా ఢిల్లీకి రావడం రానున్న మరో సంక్షోభానికి సూచన. బిహారీ యువనేత కన్హయ్య కుమార్, గుజరాతీ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ లాంటివారిని తెచ్చుకొని, పార్టీని బలోపేతం చేస్తున్నామని సంబరపడుతున్న అధిష్ఠానానికి ఇవన్నీ చిత్తాన్ని చీకాకుపరిచే చెప్పులోని రాళ్ళు, చెవిలోని జోరీగలు. అంతర్గత కలహంతో పంజాబ్‌లో ‘ఆప్’కూ, పడక్కుర్చీ రాజకీయాలతో జాతీయస్థాయిలో తృణమూల్ కాంగ్రెస్‌కూ ఈ జాతీయపార్టీ తన ఎన్నికల సానుకూలతను కోల్పోతోంది. ఈ రాజకీయ ‘హరకిరి’కి (ఆత్మహత్యకు) ఆ పార్టీ తనను తాను తప్ప వేరెవరినీ తప్పు పట్టడానికి లేదు! -
అమిత్‌తో అమరీందర్ భేటీ
న్యూఢిల్లీ: పంజాబ్ తాజా మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ బుధవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఇరువురి మధ్య దాదాపు 45 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. పంజాబ్‌లో మరో ఐదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో విభేదిస్తున్న అమరీందర్ సింగ్ తన భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెట్టారు. ఆయన భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమిత్ షాను కలవడం ఆసక్తికరంగా మారింది. పంజాబ్‌లో రైతుల సమస్యలు, అంతర్గత భద్రతపై కేంద్ర హోంమంత్రితో అమరీందర్ సింగ్ చర్చించినట్లు ఆయన మీడియా సలహాదారు రవీన్ థుక్రాల్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలు, వాటికి వ్యతిరేకంగా సుదీర్ఘంగా కొనసాగుతున్న రైతుల ఆందోళనపైనా ఇరువురి నడుమ చర్చ జరిగినట్లు చెప్పారు. మూడు చట్టాలను రద్దు చేయడం ద్వారా ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని, పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) కల్పించాలని అమరీందర్ కోరినట్లు వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో అమరీందర్ అతి త్వరలో మరోసారి సమావేశమవుతారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలిసి మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలిపాయి. చదవండి: Punjab Congress Crisis: పార్టీనే సుప్రీం.. చర్చలతో సమస్యను పరిష్కరించుకుందాం: చన్నీ -
మ్యాగజైన్ స్టోరీ 29 September 2021
-
పంజాబ్‌లో కొనసాగుతున్న రాజీనామాల పర్వం
చంఢీఘడ్: పంజాబ్ కాంగ్రెస్‌లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా, పంజాబ్ క్యాబినెట్ మంత్రి రజియా సుల్తానా సిద్ధూబాటలోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సదరు మంత్రి మాలేర్ కోట్లా నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా, నవజ్యోతి సింగ్ విలువలు ఉన్న నాయకుడని ఆమె కొనియాడారు. పంజాబ్ ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే నేతగా సిద్ధూను రజియా సుల్తానా అభివర్ణించారు.. ఆయన బాటలోనే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఒక సామాన్య కార్యకర్తగా పార్టీకి సేవలందిస్తానని తెలిపారు.. రజాయా సుల్తానాతో పాటు... పంజాబ్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ యోగిందర్ ధింగ్రా.. అదే విధంగా పంజాబ్ కాంగ్రెస్ పార్టీ క్యాషియర్ గుల్జార్ ఇండర్ ఛహల్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వరుస రాజీనామాలతో పంజాబ్‌లో కాంగ్రెస్ తీవ్ర అనిశ్చితి ఏర్పడింది. కాగా, గతంలో కెప్టెన్ అమరీందర్ సింగ్, నవజ్యోత్ సింగ్‌ల మధ్య పలు అంశాలలో బేధాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి చాలా సార్లు ప్రయత్నించింది. ఈ క్రమంలో.. సిద్ధూకి కాంగ్రెస్ అధినాయకత్వం పీసీసీ పదవి అప్పగించింది. కొన్ని రోజుల పాటు వీరిద్దరి మధ్య సయోధ్య కుదిరిందని కాంగ్రెస్ వర్గాలు భావించాయి. కానీ ఆ తర్వాత కూడా సిద్ధూ ఆరోపణలు చేస్తుండటంతో కెప్టెన్ అమరీందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత అనూహ్యంగా చరణ్‌జిత్ సింగ్ ఛన్నీని పంజాబ్ సీఎంగా ఎన్నుకున్నారు. అయితే, సిద్ధూ.. చరణ్ జిత్‌సింగ్ ఛన్నీ ఎన్నిక పట్ల అంతగా సానుకూలంగా లేరు. తాజాగా, ఛన్నీ చేసిన క్యాబినెట్ మార్పుల పట్ల కూడా తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈరోజు (మంగళవారం) సిద్ధూ కాంగ్రెస్ పీసీసీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగా, పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా ఆ పార్టీని వీడటం ఆ పార్టీని కలవర పరుస్తోంది. చదవండి: కాంగ్రెస్‌కు మరో షాక్: పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా చదవండి: Charan Singh Channi: సిద్ధూ రాజీనామాపై నాకు సమాచారం లేదు -
Charan Singh Channi: సిద్ధూ రాజీనామాపై నాకు సమాచారం లేదు
చండీగఢ్: నవజ్యోత్ సింగ్ సిద్ధూ పంజాబ్ పీసీసీ పదవికి రాజీనామా చేయడంతో పంజాబ్ రాజకీయాల్లో ఒక్కసారిగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ ఛన్నీ స్పందించారు. సిద్ధూ రాజీనామాపై తనకు ఎలాంటి సమాచారం లేదని అన్నారు. నవజ్యోత్ సింగ్‌పై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని అన్నారు. సిద్ధూ రాజీనామాపై మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తనదైన శైలిలో స్పందించారు. నవజ్యోత్ సింగ్ నిలకడలేని వ్యక్తని.. తాను ఎప్పుడో చెప్పానని ఘాటుగా విమర్శించారు. పంజాబ్ వంటి సరిహద్దు రాష్ట్రానికి సిద్ధూ సరైన వ్యక్తి కాదని అన్నారు. అయితే, ప్రస్తుతం పంజాబ్‌లో ఇద్దరు కీలక నేతల రాజీనామాలతో కాంగ్రెస్‌పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. చదవండి: కాంగ్రెస్‌కు మరో షాక్: పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా -
పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా
-
కాంగ్రెస్‌కు మరో షాక్: పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా
చండీగఢ్: పంజాబ్‌లో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. కెప్టెన్ అమరీందర్ సింగ్ తన సీఎం పదవికి ఇటీవల రాజీనామా చేయగా, తాజాగా పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. మంగళవారం తన రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపించారు సిద్ధూ. తన రాజీనామా లేఖలో పరోక్షంగా అమరీందర్ సింగ్‌ను వ్యవహరాన్ని ప్రస్తావించారు. ఆయనకు వ్యక్తిత్వం లేదని పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తారని అమరీందర్ సింగ్‌పై మండిపడ్డారు. ఆయన స్వలాభం కోసం పంజాబ్ భవిష్యత్తు, ప్రజల సంక్షేమంపట్ల వివక్షతకు పాల్పడుతున్నారని అన్నారు. అందుకే తాను రాజీనామా చేస్తున్నానని వివరించారు. కాగా, ఈ రోజు (మంగళవారం) సాయంత్రం బీజేపీ నేతలను కలిసేందుకు అమరీందర్ సింగ్ ఢిల్లీకి పయనమైనట్లు వార్తలు వస్తున్నాయి. పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన 72 రోజులకే సిద్దూ రాజీనామా చేయడంతో పంజాబ్ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఈ రోజు మధ్యాహ్నం వరకు పంజాబ్‌లోనే ఉన్నారు. కాగా, వీరు వెళ్లగానే సిద్దూ రాజీనామా అస్త్రాన్నిసంధించారు. తన రాజీనామాలో సిద్ధూ.. మనం రాజీపడిన రోజు మన వ్యక్తిత్వం పతనమైనట్లే అని ఘాటుగా స్పందించారు. ఎన్నికలకు ఆరునెలల ముందు కాంగ్రెస్‌కు జీర్ణించుకోలేని పరిణామాలు సంభవించాయి. సిద్దూ ఆరోపణల నేపథ్యంలో అమరీందర్‌సింగ్‌ను సీఎం పదవి నుంచి కాంగ్రెస్ దించిన విషయం తెలిసిందే. ఇటు అమరీందర్ సింగ్‌ను.. అటూ సిద్దూను కాంగ్రెస్ ఇద్దరిని దూరం చేసుకుని ఇరకాటంలో పడింది. Amarinder Singh Delhi Tour: అమరీందర్ సింగ్ బీజేపీలో చేరనున్నారా? జనసేనలో భగ్గుమన్న విభేదాలు -
కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరుతున్నారా...?
-
కాంగ్రెస్‌కు భారీ షాక్: బీజేపీలో చేరనున్న మాజీ సీఎం?
చండీగఢ్: పంజాబ్ రాజకీయ రగడ ఇంకా సద్దుమణగలేదు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి అమరీందర్ సింగ్ అసహనంతో ఉన్నారు. పార్టీని పల్లెత్తు మాట అనని రాజకీయ దురంధరుడు హస్తం వీడి కమలం గూటికి చేరనున్నట్టు తెలుస్తోంది. ఈ వార్తల నేపథ్యంలోనే అమరీందర్ సింగ్ ఢిల్లీకి వెళ్లడం కలకలం రేపుతోంది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం కానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అనంతరం పార్టీలో చేరతారని సమాచారం. చదవండి: మహిళ పోలీస్ అధికారి బాత్రూమ్లో కెమెరా.. స్నానం చేస్తుండగా ఈ పరిణామంతో పంజాబ్ రాజకీయం మరింత వేడెక్కింది. అయితే అమరీందర్ సింగ్ బీజేపీలో చేరితే మాత్రం కాంగ్రెస్‌కు ఊహించని దెబ్బ తగలనుంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో విబేధాలు తారస్థాయికి చేరాయి. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూకు, అమరీందర్ సింగ్‌కు అసలు పొసగడం లేదు. ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఈ విబేధాలు కొనసాగుతున్నాయి. అయితే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ అధిష్టానం మధ్యే మార్గంగా అమరీందర్‌సింగ్‌ను దింపేసి దళిత వర్గానికి చెందిన చన్నీని ముఖ్యమంత్రిగా నియమించింది. చదవండి: అంగన్వాడీ టీచర్‌పై అమానుషం.. దుస్తులు చింపి.. సెల్‌ఫోన్ లాగేసుకుని అయితే ఈ నిర్ణయం ఎవరికీ ఆమోదయోగ్యంగా లేదు. పార్టీ నిర్ణయం మేరకు సిద్ధూ అంగీకరించినా మాజీ ముఖ్యమంత్రిగా మారిన అమరీందర్ సింగ్ మాత్రం జీర్ణించుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే పార్టీ మారే ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లోనే ఉంటానని చెప్పిన అమరీందర్ సింగ్ పార్టీ అధిష్టానం పిలిచి సముదాయించలేదు. పిలిచి మాట్లాడకపోవడం.. అసలు పట్టించుకోకపోవడంతో ఆయన తన దారి చూసుకుంటున్నారని సమాచారం. కొన్ని గంటల్లో ఏం జరగనుందో తెలియనుంది. -
రాహుల్, ప్రియాంకలకు అనుభవం లేదు: అమరీందర్
చండీగఢ్: కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాలకు రాజకీయ అనుభవం లేదని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెపె్టన్ అమరీందర్ సింగ్ అన్నారు. ఆయన పలు వార్తా సంస్థలకు ఇచి్చన ఇంటర్వ్యూల్లో మాట్లాడారు. ‘రాహుల్ గాంధీ, ప్రియాంక నా పిల్లల్లాంటి వాళ్లు. నన్ను అవమానకరంగా సీఎం పదవి నుంచి తప్పించారు. ఎమ్మెల్యేలను నేను విమానాల్లో గోవాకు తీసుకెళ్లలేదు. అది నా విధానం కాదు. అనుభవం లేని రాహుల్, ప్రియాంకలను వారి సలహాదారులు తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని విమర్శించారు. పంజాబ్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూపై బలమైన అభ్యరి్థని పోటీకి దించుతానని చెప్పారు. సిద్ధూ జాతి వ్యతిరేక శక్తి, ప్రమాదకరమైన వ్యక్తి అని అమరీందర్ ఆరోపించారు. పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యరి్థత్వం సిద్ధూకు దక్కకుండా చేయడమే తన ధ్యేయమని, అందుకోసం పోరాటం సాగిస్తానన్నారు. సిద్ధూ లాంటి ప్రమాదరకమైన వ్యక్తుల నుంచి దేశాన్ని కాపాడడానికి ఎలాంటి త్యాగాలకైనా తాను సిద్ధంగా ఉన్నానని తేల్చిచెప్పారు. వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధూను ఓడిస్తానని ప్రతినబూనారు. పంజాబ్‌లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తర్వాత మరొకరిని ముఖ్యమంత్రి చేయాలని సోనియా గాం«దీని కోరానని, అయినా ఆమె పట్టించుకోలేదని అన్నారు. సన్నిహితులు, అనుచరులతో చర్చించిన తర్వాత తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానన్నారు. తనకు వయసు అనేది ఒక అడ్డంకి కాదని 79 ఏళ్ల అమరీందర్ చెప్పారు. -
‘అతడిని ముఖ్యమంత్రిని కానివ్వను.. ఏమైనా చేస్తా’
చండీగఢ్: పంజాబ్ అధికార పార్టీలో ఇంకా విబేధాలు సద్దుమణగలేదు. పంజాబ్ పరిణామాలతో కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రాజీనామాతో ఆ విబేధాలు తారస్థాయికి వెళ్లాయి. పీసీసీ అధ్యక్షుడు నవ్‌జ్యోత్ సిద్ధూ, అమరీందర్ సింగ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత స్థాయిలో ఉన్నాయి. అయితే తన రాజీనామాకు కారణమైన సిద్ధూను వదిలే ప్రసక్తే లేదని తాజా మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రకటించారు. చదవండి: ఈ ద్రాక్ష పండ్ల గుత్తి రూ.లక్షల్లో.. ఒక్క పండు రూ.33 వేలంట.. రాజీనామా అనంతరం కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని చెప్పిన అమరీందర్ సింగ్ అయితే భవిష్యత్‌లో సిద్ధూను మాత్రం ముఖ్యమంత్రిగా కానివ్వను అని స్పష్టం చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధూను కచ్చితంగా ఓడిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా సిద్ధూపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిద్ధూపై పోటీగా బలమైన అభ్యర్థిని నిలబెడతానని చెప్పారు. సిద్ధూ పంజాబ్‌తో పాటు దేశానికి కూడా ప్రమాదకరమని తెలిపారు. సిద్ధూ సీఎం కాకుండా అడ్డుకునేందుకు ఎలాంటి పని చేయడానికైనా సిద్ధమని ప్రకటించారు. రాహుల్, ప్రియాంకగాంధీ తన పిల్లల్లాంటి వారని పేర్కొన్నారు. ముగింపు ఇలా ఉండాల్సింది కాదని ఈ పరిణామాలతో తాను తీవ్ర మనస్తాపానికి లోనట్లు తెలిపారు. -
పంజాబ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చరణ్‌జిత్ సింగ్ చన్నీ
చండీగఢ్: పంజాబ్ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రమాణస్వీకారం అనంతరం చన్నీ కెప్టెన్ అమరీందర్‌ను కలవనున్నారు. (చదవండి: ఎవరీ చన్నీ? ) పంజాబ్‌లో దళిత వర్గానికి సీఎం పదవి దక్కడం ఇదే ప్రథమం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చరణ్‌జిత్ సింగ్ చన్నీ 1972 ఏప్రిల్ 2న పంజాబ్‌లోని మక్రోనా కలాన్ గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అజ్మేర్ కౌర్, హర్సా సింగ్. దళితుల్లో రామదాసియా సిక్కు (చర్మకారులు) వర్గానికి చెందిన వారు. (చదవండి: Amarinder Singh: కెప్టెన్ కథ కంచికి చేరిందిలా!) చన్నీ చాంకౌర్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.2015-16లె పంజాబ్ విధానసభలో విపక్షనేతగా ఉన్నారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రభుత్వంలో సాంకేతిక విద్య, పారిశ్రామిక శిక్షణశాఖ బాధ్యతలు నిర్వహించారు. చదవండి: విందుకు అందని పిలుపు.. వివాదానికి ఆజ్యం పోసిన ప్రమోషన్ -
Amarinder Singh: కెప్టెన్ కథ కంచికి చేరిందిలా!
ఒకప్పుడు పంజాబ్ కాంగ్రెస్‌ను విజయతీరాలకు నడిపించిన సింగ్ సాబ్ చివరకు అవమానకరంగా నిష్క్రమించారు. కర్ణుడి చావుకు కారణాలనేకం అన్నట్లు అమరీందర్ రాజీనామాకు కూడా చాలా కారణాలున్నాయి. కానీ ఎన్ని కారణాలున్నా, పట్టుమని ఎన్నికలకు 5 నెలల సమయం కూడా లేని ఈ సమయంలో అమరీందర్‌ను తొలగిస్తారని చాలామంది ఊహించలేదు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది. రాబోయే ఎన్నికల్లో గెలిచి పంజాబ్‌లో పాగా వేయాలని ఆప్, పునర్వైభవం దక్కించుకోవాలని ఆకాళీదళ్, ఒంటరిగా సత్తా చూపాలని బీజేపీ.. మల్లగుల్లాలు పడుతుంటే, ఇవేమీ పట్టనట్లుగా ఉన్నట్లుండి సీఎంను మార్చాలని కాంగ్రెస్ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. పార్టీ లో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోవడంతో తప్పక ఈ నిర్ణయం తీసుకున్నామని పార్టీ వర్గాలు చెప్పాయి. పంజాబ్ రాజకీయాలు తెలిసి కూడా కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకోవడం దుస్సాహసమేనని రాజకీయ పండితుల అభిప్రాయం. మరి ఉన్నట్లుండి అమరీందర్‌ను తొలగించారా? కాంగ్రెస్ హైకమాండ్‌ను ఇందుకోసం ప్రేరేపించిన అంశాలేంటి? అనేవి శేష ప్రశ్నలు. వీటికి సమాధానంగా కొందరు రాజకీయ విశ్లేషకుల అంచనాలు ఇలా ఉన్నాయి... ► మసకబారుతున్న ప్రభ: సంవత్సరాలుగా పంజాబ్ కాంగ్రెస్‌లో ఎదురులేని నేతగా ఉన్న అమరీందర్ ప్రతిష్ట క్రమంగా మసకబారుతోందని కొన్ని సర్వేలు ఎత్తి చూపాయి. ఉదాహరణకు 2019లో ఆయన రేటింగ్ 19శాతం ఉండగా, 2021 ఆరంభంలో 9.8శాతానికి పడిపోయింది. కాంగ్రెస్ సొంతంగా రాష్ట్రంలో నిర్వహించిన సర్వేలో కూడా కెపె్టన్ పట్ల ప్రతికూలత కనిపించినట్లు సమాచారం. ► డ్రగ్ మాఫియా: పంజాబ్ యువతను పీలి్చపిప్పి చేస్తున్న డ్రగ్ మాఫియాపై అమరీందర్ ఉక్కుపాదం మోపుతారని, ఆయన గురు గ్రంధ్ సాహిబ్‌పై ప్రమాణం చేయగానే అంతా ఆశించారు. కానీ గత ప్రభుత్వ హయంలో లాగానే డ్రగ్స్, ఇసుక మాఫి యాపై ఎలాంటి తీవ్ర చర్యలు కెప్టెన్ తీసుకోలేదు. ► బాదల్స్తో సంబంధాలు: 2015లో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో గొడవలకు బాదల్స్ కారణమని ప్రజలు భావించారు. వీరిపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశించారు. కానీ బాదల్స్‌పై ఆరోపణలను హైకోర్టు తోసిపుచి్చంది. దీంతో కెప్టెన్‌పై ప్రజల్లో వ్యతిరేకత ప్రబలింది. పైగా సిక్కు యువత ఎక్కువగా ఉపా కేసుల్లో అరెస్టు కావడం అమరీందర్‌కు ప్రతికూలించింది. ► నెరవేరని ఆశలు: ఎన్నికల హామీల్లో కీలకమైన ఉద్యోగ కల్పన, నిరుద్యోగ భృతి వంటివాటిని అమరీందర్ ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది. పెద్దల పింఛను సక్రమంగా అందడం లేదన్న ఆరోపణలు వచ్చాయి. ► ఆందోళనలు: అమరీందర్ పదవీ కాలంలో రాష్ట్రంలో పలు విషయాలపై ఆందోళనలు పెరిగాయి. ప్రభుత్వ ఉద్యోగులు, పారా టీచర్లు, రైతులు, ఆశా వర్కర్లు, నిరుద్యోగులు, దళితులు.. ఇలా అనేక వర్గాలు వారి బాధలు తీరడంలేదంటూ ఆందోళనలు ముమ్మరం చేశాయి. రైతు ఆందోళనలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తున్నాయన్న కెప్టెన్ వ్యాఖ్యలు ఆయనపై విముఖత పెంచాయి. ► అందుబాటులో ఉండరు: అమరీందర్ అందుబాటులో ఉండరనేది ఆయనపై ఎంఎల్ఏల ఆరోపణ. ఎక్కువగా మొహాలీ ఫామ్‌హౌస్‌లో ఉంటారని, ప్రజలను, పారీ్టనేతలను కలవరని, అధికారులపై అతిగా ఆధారపడతారని చాలామందిలో అసంతృప్తి ఉంది. ► సిద్ధూ బ్యాటింగ్: గతంలో కూడా అమరీందర్‌పై పార్టీలో అసంతృప్తులుండేవారు. కానీ వారి గొంతు పెద్దగా వినిపించేది కాదు. ఈసారి సిద్ధూ రూపంలో కెపె్టన్‌కు అతిపెద్ద అసమ్మతి ఎదురైంది. ఇతర అసంతృప్తి నేతల అండ దొరకటం, మంత్రి పదవి పోవటంతో సిద్దూ చూపంతా అమరీందర్‌ను దింపడంపైనే ఉంది. చివరకు తన బ్యాటింగ్ ఫలించి కెపె్టన్ ఇంటిబాట పట్టారు. కానీ అంతమాత్రాన కెప్టెన్‌ను తక్కువగా తీసిపారేయడానికి వీల్లేదు. ఆయన మద్దతుదారులు రాబోయే ఎన్నికల్లో ఏం చేస్తారన్నది పంజాబ్‌లో కాంగ్రెస్ పరిస్థితిని డిసైడ్ చేస్తుందని విశ్లేషకుల భావన. – నేషనల్ డెస్క్, సాక్షి -
పంజాబ్ సీఎం అమరీందర్ రాజీనామా
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్(79) రాజీనామా చేశారు. అవమానభారంతో పదవి నుంచి వైదొలుగుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూను తదుపరి సీఎంగా ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించనని కుండబద్దలు కొట్టారు. కొత్త సీఎంను ఎన్నుకునే అధికారాన్ని అధినేత్రి సోనియాకు అప్పగిస్తూ పంజాబ్ సీఎల్పీ నిర్ణయించింది. సింగ్ రాజీనామాతో పంజాబ్ కాంగ్రెస్‌లో అసమ్మతికి తెరదించినట్లయింది, కానీ రాబోయే ఎన్నికల్లో ఎవరు సారథ్యం వహిస్తారనే ప్రశ్న మొదలైంది. పంజాబ్‌లో పతనావస్థలో ఉన్న పారీ్టకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తినివ్వడంలో అమరీందర్ పాత్ర చాలా ఉంది. కానీ చివరకు అసమ్మతి రాజకీయాలకు తలొగ్గి, సోనియాతో చర్చల అనంతరం సీఎల్పీ సమావేశానికి ముందు రాజీనామాను సమర్పించారు. ఇప్పటికి ఇది మూడో సీఎల్పీ సమావేశమని, తాజా సమావేశంపై తనకు కనీస సమాచారం లేదని ఆయన చెప్పారు. తనపై అపనమ్మకాన్ని అవమానంగా భావిస్తున్నట్లు రాజీనామాను గవర్నర్‌కు సమర్పించిన అనంతరం అమరీందర్ వ్యాఖ్యానించారు. 50కిపైగా కాంగ్రెస్ ఎంఎల్ఏలు కెప్టెన్‌ను మార్చాలంటూ సోనియాకు లేఖ రాశారు. అమరీందర్ రాజీనామాతో సిద్ధూకు, తనకు జరుగుతున్న పోరులో సిద్దూదే పైచేయి అయినట్లయింది. అమరీందర్ ఇష్టానికి వ్యతిరేకంగా సిద్ధూను పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌ను చేయడం తెల్సిందే. సమయం వచ్చినప్పుడు చెప్తా రాజీనామా అనంతరం భవిష్యత్ ప్రణాళికలపై అమరీందర్ స్పందించారు. అన్నింటికీ ఒక ఆప్షన్ ఉంటుందని, తనకు సమయం వచి్చనప్పుడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటానని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తన అనుచరులతో కలిసి భవిష్యత్‌పై సమాలోచన జరుపుతానని చెప్పారు. అధిష్టానం ఎవరిని కావాలనుకుంటే వారిని సీఎం చేయవచ్చన్నారు. కానీ తనను ఎందుకు తొలగించాలని నిర్ణయించుకున్నారో అర్ధం కావడం లేదని వాపోయారు. కాంగ్రెస్‌లో తాను 52 సంవత్సరాలున్నానని, ముఖ్యమంత్రిగా 9ఏళ్లకు పైగా పనిచేశానని గుర్తు చేశారు. ఎంఎల్ఏలు డిమాండ్ చేసిన సమావేశానికి అజయ్ మాకెన్, హరీష్ చౌదరీలను అధిష్టానం పరిశీలకులుగా పంపింది. పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ప్రతినిధి హరీష్ రావత్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో కాంగ్రెస్ కుమ్ములాటలు పారీ్టకి చేటు చేస్తాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. పోరాటాల కెప్టెన్ పాటియాలా రాజవంశానికి చెందిన అమరీందర్ సింగ్ తొలుత సైన్యంలో పనిచేశారు. వారిది సైనిక కుటుంబం, 1965, 1971 యుద్ధాల్లో ఆయన పాల్గొన్నారు. డెహ్రాడూన్, ఎన్డీఏల్లో విద్యాభ్యాసం చేశారు. రిటైర్మెంట్ తర్వాత అప్పటి కాంగ్రెస్ యువ నేత రాజీవ్‌కు సన్నిహితుడయ్యారు. తర్వాత ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికయ్యారు, కానీ బ్లూస్టార్ ఆపరేషన్‌కు నిరసనగా రాజీనామా చేశారు. 1985లో అకాళీదళ్‌లో చేరి ఎంఎల్ఏగా ఎన్నికయ్యారు. 1998లో కాంగ్రెస్ గూటికి చేరారు. 2002–07లో పంజాబ్ సీఎం అయ్యారు. 2014లో బీజేపీకి చెందిన అరుణ్‌జైట్లీని ఓడించి ఎంపీ అయ్యారు. 2017 పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను బలంగా తీర్చిదిద్ది అకాళీదళ్ ఓటమిలో కీలకపాత్ర పోషించారు. పదేళ్ల తర్వాత పంజాబ్‌లో గెలిపించినందుకు ఆయన్నే అధిష్టానం సీఎంగా చేసింది. సీఎం అయ్యాక రైతు రుణమాఫీ చేసి రైతాంగంలో ఇమేజ్ పెంచుకున్నారు. సిద్దూ కాంగ్రెస్‌లో చేరిన తర్వాత సింగ్‌కు పార్టీపై పట్టు తగ్గుతూ వచ్చింది. సిద్దూను మచ్చిక చేసుకునేందుకు తనకు కేబినెట్ పోస్టును సింగ్ ఇచ్చారు. కానీ ఇద్దరి మధ్య సయోధ్య కుదరలేదు. 2019లో సిద్దూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటినుంచి అమరీందర్‌పై విమర్శలు పెంచారు. సింగ్ రాజీనామా అనంతరం పంజాబ్ సీఎల్పీ సమావేశం జరిగింది. ‘సిద్ధూ పాక్ తొత్తు’ తన పదవికి ఎసరు పెట్టిన సిద్ధూపై కెప్టెన్ విమర్శలు చేశారు. సిద్దూను సీఎంగా అంగీకరించనన్నారు. సిద్ధూ దేశానికే వ్యతిరేకమని, పాకిస్తాన్ తొత్తు అని తీవ్రంగా నిదించారు. సిద్ధూ అంటేనే సంక్షోభమని, అతను ప్రమాదకారి, అసమర్ధుడు, అస్థిరత్వానికి కారకుడని ధ్వజమెత్తారు. పాకిస్తాన్‌తో కలిసిపోయినవాడు దేశానికి, పంజాబ్‌కు ప్రమాదకరమన్నారు. అలాంటివాడు దేశాన్ని నాశనం చేస్తానంటే అంగీకరించనని, ప్రజలకు చెడు చేసే అంశాలపై పోరాటం చేస్తానని తెలిపారు. పాక్ నాయకత్వంతో సిద్దూకు సత్సంబంధాలున్నాయంటూ.. ఇమ్రాన్ ప్రమాణ స్వీకారానికి సిద్దూ హాజరవడ్డాన్ని, ఇమ్రాన్‌ను, పాక్ ఆర్మీ చీఫ్ బజ్వాను సిద్ధూ గతంలో ఆలింగనం చేసుకోవడాన్ని, వారిని ప్రశంసించడాన్ని గుర్తు చేశారు. పంజాబ్ అంటే దేశ రక్షణ అని, అలాంటి రాష్ట్రానికి సిద్ధూ లాంటివాడు సీఎం కావడాన్ని అంగీకరించనని చెప్పారు. ఒక్క మంత్రిత్వ శాఖనే సరిగ్గా నిర్వహించలేని అసమర్థుడు మొత్తం పంజాబ్‌ను నడిపించడం జరగని పని అని ఎద్దేవా చేశారు. సిద్ధూకు ఎలాంటి సామర్ధ్యం లేదని, తన మాట కాదని సిద్ధూని సీఎంగా చేస్తే అన్ని విధాలుగా వ్యతిరేకిస్తానని హెచ్చరించారు. సిద్ధూ శకుని పాత్ర పోషిస్తున్నందున తాను సీఎంగా ఉండడని గతంలోనే సోనియాకు చెప్పానని, అప్పుడు రావత్ కూడా అక్కడే ఉన్నారని అమరీందర్ వెల్లడించారు. కానీ అప్పుడు ఆమె తన అభ్యర్ధన మన్నించలేదన్నారు. కాంగ్రెస్‌కు తాను శక్తిమేర పనిచేశానని గుర్తు చేసుకున్నారు. రాజకీయాలను విరమించే ప్రసక్తి లేదని అమరీందర్ స్పష్టం చేశారు. సోనియా, రాహుల్‌తో ఉన్న అనుబంధం దృష్ట్యా తనకు ఇంత అవమానం జరుగుతుందని ఊహించలేదని, కానీ చివరకు తనను తప్పించాలని ఎందుకు నిర్ణయించారో తెలియలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రాజీనామా
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. కొన్ని నెలలుగా సాగుతున్న ప్రచారానికి శనివారంతో తెరపడింది. రాజ్‌భవన్‌కు చేరుకుని అమరీందర్ సింగ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. సీఎల్పీ భేటికి ముందే రాజీనామా చేయడం గమనార్హం. సీఎంతో పాటు మంత్రులు కూడా రాజీనామా సమర్పించారు. 2017 మార్చి 16న సీఎంగా అమరీందర్ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌లో విబేధాలు కొనసాగుతున్నాయి. రాజీనామా సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఉదయం సోనియాగాంధీతో మాట్లాడా. నమ్మకం లేని చోట నేను ఉండను. ఇప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేలతో సమావేశాలు పెట్టారు. ఇది నాకు అవమానకరంగా అనిపించింది. ప్రభుత్వాన్ని నడపలేనని అనుకున్నట్లున్నారు. ఎవరి మీద నమ్మకముంటే వారిని సీఎం చేసుకోమని చెప్పా’ అని తెలిపారు. అయితే తన భవిష్యత్ కార్యాచరణపై కొన్ని సంకేతాలు ఇచ్చారు. ‘రాజకీయ భవిష్యత్ గురించి నాకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అవసరమైనప్పుడు ప్రత్యామ్నాయాలు వినియోగిస్తా. నా వెంట ఉన్నవారితో మాట్లాడి భవిష్యత్‌పై నిర్ణయం’ అని అమరీందర్ సింగ్ చెప్పారు. ఈ రాజీనామాతో పంజాబ్ కాంగ్రెస్‌లో వివాదం మరింత ముదిరింది. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూతో విభేదాలు తారస్థాయికి చేరాయి. తాజా పరిణామాల నేపథ్యంలో అమరీందర్ సింగ్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చదవండి: మొన్నటి వరకూ కేంద్రమంత్రి.. ఇప్పుడు టీఎంసీ గూటికి -
ఇక ఈ అవమానాలు నావల్లకాదు: పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం?
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్ వివాదం మరింత ముదిరినట్టు కనిపిస్తోంది. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూతో విభేదాలు, తాజా పరిణామాల నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు తాను అధికారంలో కొనసాగలేనంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసినట్టు సమాచారం. సోనియా మాట ప్రకారం, ఇన్నాళ్లూ అన్ని రాజకీయ మార్పులను అంగీకరించానని, కానీ ఇకపై పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. ఈ అవమానాలు చాలని , ఇలా జరగడం ఇది మూడోసారని సింగ్ ఆవేదన వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. పీసీసీ చీఫ్ నవజ్యోత్ సిద్ధూ శనివారం సాయంత్రం సీఎల్పీ సమావేశానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా నాయకత్వ మార్పుపై ఎమ్మెల్యేల సమావేశంలో చర్చించనున్నారని తీవ్ర ఊహాగానాలు చెలరేగాయి. గత కొన్ని నెలలుగా కెప్టెన్ అమరీందర్ సింగ్‌పై ఒక వర్గం ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించారు. కొత్త నాయకత్వాన్ని డిమాండ్ చేశారు. దీనికి తోడు పలు సర్వేల అనంతరం 2022, ఫిబ్రవరిలో జరగనున్న రాష్ట్ర ఎన్నికలకు ముందు పంజాబ్‌లో సీఎంను మార్చాలని హైకమాండ్ ఇప్పటికే నిర్ణయించిందని అంచనా. మరోవైపు సునీల్ జాఖర్, పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ ప్రతాప్ సింగ్ బజ్వా, బియాంత్ సింగ్ మనవడు ఎంపీ రవనీత్ సింగ్ బిట్టూలలో ఒకర్ని కొత్త సీఎంగా నియమించ నున్నారనే అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. కాగా పంజాబ్ పీసీసీ పగ్గాలను ఎమ్మెల్యే సిద్దూకు అప్పగించే విషయమై పార్టీలో దుమారం రేగింది. ఆయనకు అధ్యక్ష బాధ్యతలను అప్పజెప్పేందుకు అమరీందర్ ససేమిరా అన్నారు. అయినా సిద్దూనే పీసీసీ అధ్యక్షుడు అంటూ కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే. -
‘ఢిల్లీలో ఏమన్న చేసుకోండ్రి.. మా రాష్ట్రంలో ఏందీ లొల్లి: సీఎం యూటర్న్
చండీగఢ్: మూడు కొత్త వ్యవసాయ చట్టాల రద్దుకు సంవత్సరానికి పైగా పోరాడుతున్న రైతులపై తొలిసారి పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు ఉద్యమంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల ఆందోళనపై యూటర్న్ తీసుకున్నారు. రైతుల నిరసన కార్యక్రమాలతో తమ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని పేర్కొన్నారు. ‘ఢిల్లీలో ఇష్టమొచ్చినట్టు చేసుకోండి.. కానీ పంజాబ్‌లో ఎందుకు’ అని ప్రశ్నించారు. కేంద్రంపై పోరాడేందుకు ఢిల్లీలో ఉద్యమం చేయాలని సూచించారు. చదవండి: అమ్మా దొంగా ఇక్కడున్నావా? ఇది చూస్తే మీ స్ట్రెస్ హుష్‌కాకి సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాడేందుకు రైతులు తమ శక్తియుక్తుల్ని ఉపయోగించాలని చెప్పారు. రాష్ట్రంలో కాదని పేర్కొన్నారు. పంజాబ్‌కు ఎందుకు నష్టం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. హరియాణా, ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేసుకోండి అని సూచించారు. రైతులు ఢిల్లీ, హరియాణాలోని 113 ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్నారు అని తెలిపారు. ‘మీ ఆందోళనతో రాష్ట్ర అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడడం ఆందోళనకరం’ అని ఆరోపించారు. రాష్ట్రం ఆదాయం కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: రజనీకాంత్ స్టైల్లో మంత్రి హరీశ్‌రావు డ్యాన్స్ పంజాబ్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో సీఎం అమరీందర్‌సింగ్ ఈ విధంగా యూటర్న్ తీసుకున్నారని తెలుస్తోంది. నల్ల చట్టాల రద్దుకు రైతులు పంజాబ్‌లో భారీ స్థాయిలో ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. పది నెలలుగా రైతులు నల్ల చట్టాల రద్దుకు ఉద్యమాన్ని తీవ్రస్థాయిలో కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. కొత్త వ్యవసాయ చట్టాలతో తమకు మద్దతు ధర దక్కదని.. వ్యవసాయం కార్పొరేటు పరం అవుతుందనే ఆందోళనతో రైతులు ఉద్యమ బాట పట్టారు. -
ఉద్యోగుల్లారా వ్యాక్సిన్ వేసుకోకుంటే మీకంతే సంగతులు
చండీగఢ్: మహమ్మారి కరోనా వైరస్ మూడో దశ తీవ్రస్థాయిలో దాడి చేస్తుందనే వార్తల నేపథ్యంలో భారత ప్రభుత్వం వ్యాక్సినేషన్ వేగవంతం చేసింది. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నారు. 18 ఏళ్లలోపు వయసు వారందరూ వేసుకోవాలని చెబుతున్నా కొందరు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పటివరకు ఒక్క వ్యాక్సిన్ డోస్ కూడా వేసుకోని వారు ఇంకా కోట్లలోనే ఉన్నారు. వారిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉండడంపై పంజాబ్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. వారి విషయంలో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకోని ఉద్యోగులు సెలవుపై వెళ్లాల్సిందేనని ఆదేశాలు ఇచ్చారు. సెప్టెంబర్ 15వ తేదీ తర్వాత ఒక్క వ్యాక్సిన్ డోస్ కూడా వేసుకోని ఉద్యోగులు ఉంటే వారు సెలవుపై వెళ్లాలని స్పష్టం చేశారు. వారు వ్యాక్సిన్ వేసుకునే దాక సెలవుపై ఉండాల్సిందే. వ్యాక్సిన్ వేసుకునే కార్యాలయంలోకి అడుగుపెట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఈ ఆదేశాలు జారీ చేశారు. కరోనాపై శుక్రవారం నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు సీఎం అమరీందర్ తెలిపారు. వ్యాక్సిన్ ఉద్యోగులందరికీ చేరాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. వ్యాక్సినేషన్ పూర్తికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. -
త్వరలో సిద్ధూ, అమరీందర్‌లతో రావత్ చర్చలు
న్యూఢిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య విభేదాలకు ఫుల్స్టాప్ పెట్టేందుకు పంజాబ్ వ్యవహారాల ఇన్చార్జ్ హరీశ్ రావత్ ముందుకొచ్చారు. త్వరలో పంజాబ్‌లో పర్యటించి అమరీందర్, సిద్ధూలను కలుస్తానని, సయోధ్యకు ప్రయత్నిస్తానని రావత్ ప్రకటించారు. పంజాబ్ కాంగ్రెస్‌లో విభేదాలపై పార్టీ నేత రాహుల్‌గాంధీతో ఆయన శనివారం చర్చించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రెండు మూడు రోజుల్లో నేను పంజాబ్‌కి వెళతాను. సయోధ్య కుదిర్చేందుకు అమరీందర్, సిద్ధూలతో మాట్లాడతాను. పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేత లందరితోనూ మాట్లాడతాను’ అని రావత్ చెప్పారు. గత కొన్ని నెలలుగా అంతర్గత పోరుతో కాంగ్రెస్ పార్టీ అల్లాడిపోతోంది. సిద్ధూకి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినా ఈ వర్గ పోరు ఒక కొలిక్కి రాలేదు. సిద్ధూ సలహాదారు మాల్వీందర్ సింగ్ కశ్మీర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో సీఎం శిబిరం ఒత్తిడితో ఆయన సలహాదారు బాధ్యతల నుంచి తప్పుకున్నారు. మరోవైపు తాను డమ్మీ చీఫ్‌గా ఉండలేనని, నిర్ణయాలు తీసుకునే స్వతంత్రం కావాలని సిద్ధూ డిమాండ్ చేయడం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఈ సమస్యని అధిష్టానం ఎలా పరిష్కరించనుందో వేచి చూడాలి. -
నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛనివ్వండి
న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్‌లో సిద్ధూ– అమరీందర్ సింగ్ మధ్య ఆధిపత్య పోరు మరింత ముదురుతోంది. ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ నాయకత్వంలోనే పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగుతుందని కాంగ్రెస్ పంజాబ్ వ్యవహారాల ఇన్చార్జి హరీశ్ రావత్ స్పష్టంచేయడంతో పార్టీ రాష్ట్ర చీఫ్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ నిరసన స్వరం మరింత పెంచారు. ఒక రాష్ట్ర విభాగానికి అధ్యక్ష హోదాలో తనను స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోనివ్వాలని, లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని కాంగ్రెస్ అధిష్టానాన్ని ఉద్దేశిస్తూ సిద్ధూ వ్యాఖ్యానించారు. కీలు బొమ్మలాగా, కేవలం ప్రదర్శనకు ఉంచిన ఒక వస్తువులాగా ఉండిపోదల్చుకోలేదని ఆయన అన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేల అసమ్మతిని తగ్గించేందుకు సీఎం అమరీందర్ గురువారం పరోక్షంగా బల ప్రదర్శన చేశారు. గురువారం చండీగఢ్‌లో క్రీడల శాఖ మంత్రి రాణా గుర్మీత్‌సింగ్ ఇంట్లో జరిగిన విందు కార్యక్రమానికి దాదాపు 55 మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలు హాజరయ్యారు. ఇది మంత్రుల భేటీగా వార్తలొచ్చినా.. సీఎం పరోక్షంగా బలప్రదర్శన చేశారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సిద్ధూ దీటుగా స్పందించారు. పార్టీ నియమ నిబంధనలకు లోబడి స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే హక్కు పార్టీ రాష్ట్ర విభాగాల అధ్యక్షులు ఉందని కాంగ్రెస్ గతంలోనే ప్రకటించిందని సిద్ధూ గుర్తుచేశారు. శుక్రవారం అమృత్‌సర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సిద్దూ మాట్లాడారు. ‘నన్నూ నిర్ణయాలు తీసుకోనివ్వండి. అలా అయితేనే పార్టీ మరో 20 ఏళ్లుపాటు అధికారంలోనే ఉండేలా చేస్తా. ఇందుకు ప్రణాళికలు సైతం సిద్ధంచేశా. నిర్ణయాలు తీసుకునే అధికారం ఇవ్వకుంటే అందుకు తగ్గ పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని సిద్ధూ ధిక్కార స్వరంతో మాట్లాడారు. ఇన్చార్జ్గా తప్పించండి: హరీశ్ రావత్ సొంత రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని, అక్కడ కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షునిగా బిజీగా ఉంటానని, అందుకే పంజాబ్ వ్యవహారాల ఇన్చార్జ్ బాధ్యతల నుంచి తనను తప్పిస్తే బాగుంటుందని హరీశ్ రావత్ అన్నారు. తర్వాత ఆయన ఢిల్లీకి వచ్చి పార్టీ చీఫ్ సోనియాగాంధీతో ఈ విషయమై చర్చించారు. ‘ఇంతకాలం పంజాబ్ వ్యవహారాలు చూశా. ఇకపైనా చూడమంటే చూస్తా. అధిష్టానానిదే తుది నిర్ణయం’ అని రావత్ వ్యాఖ్యానించారు. సిద్ధూ వ్యాఖ్యలపైనా రావత్ స్పందించారు. ‘సిద్ధూ ఏ ఉద్దేశంతో ఆ మాటలన్నారో కనుక్కుంటా. రాష్ట్ర అధ్యక్షులది నిర్ణయాత్మక పాత్ర కానపుడు ఇంకెవరి నిర్ణయాలను అమలుచేస్తారు? ’ అని రావత్ అన్నారు. మరోవైపు, కశ్మీర్, పాక్ అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సిద్ధూ సలహాదారు మల్వీందర్ సింగ్ ఇకపై ఆ పదవిలో కొనసాగబోనని చెప్పారు. సలహాలు ఇవ్వడం ఆపేస్తే మంచిదని రావత్ వ్యాఖ్యల నేపథ్యంలో శుక్రవారం మల్వీందర్ తప్పుకోవడం గమనార్హం. -
పంజాబ్ కాంగ్రెస్‌లో మళ్లీ సంక్షోభం.. సీఎం అమరీందర్‌పై తిరుగుబావుటా..
చండీగఢ్: పంజాబ్‌లో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. పంజాబ్‌లో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఒంటరవుతున్నట్లు తెలుస్తోంది. తాగాజా పంజాబ్ కాంగ్రెస్‌లో మళ్లీ సంక్షోభం తలెత్తింది. సీఎం అమరీందర్‌పై నమ్మకం పోయిందంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు తిరుగుబాటు ఎగరవేశారు. దీనిపై చర్చించడానికి నలుగురు మంత్రులు, 30 మంది ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. చదవండి: సోనియమ్మకు థాంక్స్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈ విషయంపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు బయల్దేరినట్లు సమాచారం. కాగా ఇటీవల పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన 62 మంది ఎమ్మెల్యేలు హాజరైన విషయం తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి బలం తగ్గినట్టు అప్పట్లో గుసగుసలు వినిపించాయి. చదవండి: వివాదంలో బీజేపీ నేత..ఇంటిలో అర్ధనగ్నంగా కూర్చుని -
టీకా రెండు డోసులు తీసుకుంటేనే మా రాష్ట్రానికి రండి..!
చండీగఢ్: కరోనా వైరస్‌కు సంబంధించి రెండు టీకా డోసులు తీసుకోవడం లేదా ఆర్‌పీసీఆర్ పరీక్ష నివేదిక ఉన్నవారికి మాత్రమే సోమవారం నుంచి పంజాబ్‌లోకి ప్రవేశించడానికి అనుమతి ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తెలిపారు. పొరుగున ఉన్న హిమాచల్ ప్రదేశ్, జమ్మూ నుంచి వచ్చే ప్రజలను ఖచ్చితంగా తనిఖీలు చేస్తామని ఆయన అన్నారు. పంజాబ్‌లోని పాఠశాలలు, కళాశాలల్లో పూర్తిగా టీకాలు వేసుకున్న టీచింగ్, బోధనేతర సిబ్బంది లేదా ఇటీవల కోవిడ్ -19 నుంచి కోలుకున్న వారు మాత్రమే భౌతికంగా బోధించడానికి హాజరు కావచ్చని వెల్లడించారు. కాగా పంజాబ్‌లో శుక్రవారం 88 కోవిడ్ కేసులు, జీరో మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య దాదాపు ఆరు లక్షలకు చేరుకుంది. ఇక పంజాబ్ ప్రభుత్వం పాఠశాలను తిరిగి తెరిచిన తర్వాత కోవిడ్ పరీక్షను వేగవంతం చేసింది. పాఠశాలల నుంచి ప్రతిరోజూ కనీసం 10,000 మందికి ఆర్‌పీసీఆర్ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా పంజాబ్‌తో పాటు, హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌లోని పాఠశాలల్లో కూడా ఆఫ్‌లైన్ తరగతులు తిరిగి ప్రారంభమైనందున గత వారంలో చాలా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం.. హిమాచల్ ప్రదేశ్, దేశంలోని ఇతర ప్రాంతాల్లో పెరుగుతున్న కేసుల కారణంగా పంజాబ్‌లో కోవిడ్ పాజిటివిటీ రేటు స్వల్పంగా 0.2 శాతానికి పెరిగింది. -
చల్లారని రగడ: పీసీసీ చీఫ్ వరుస ట్వీట్లు.. నేడు ఢిల్లీకి సీఎం
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్, పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధు మధ్య విభేదాలు ఇంకా సద్దుమణిగినట్లు కనిపించడం లేదు. సిద్ధుకు రాష్ట్ర నాయకత్వ పగ్గాలు అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన అమరీందర్ సింగ్.. ఆ తర్వాత అధిష్టాన నిర్ణయంతో ఏకీభవించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలన్న సిద్ధు విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి ఆయనతో కలిసి పనిచేస్తానని పేర్కొన్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కలిసికట్టుగా ముందుకు సాగేందుకు నిర్ణయించుకున్నారు. అయితే, నవజ్యోత్ సింగ్ సిద్ధు మాత్రం మరోసారి అమరీందర్ సర్కారును ఇరుకునపెట్టేలా వరుస ట్వీట్లు చేయడం చర్చనీయాంశమైంది. డ్రగ్స్ వ్యవహారంపై పంజాబ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందంటూ సిద్ధు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ మేరకు.. ‘‘పంజాబ్ పోలీసులు ఏం చేస్తున్నారు? మాదక ద్రవ్యాల సరఫరా కట్టడికై ప్రభుత్వం ఏయే చర్యలు తీసుకుంది? స్పెషల్ టాస్క్ ఫోర్స్‌కు నాయకత్వం వహిస్తున్న ఏడీజీపీ హర్‌ప్రీత్ సిద్ధు 2018 ఫిబ్రవరిలో పంజాబ్, హర్యానా హైకోర్టులో డ్రగ్స్ విషయమై స్టేటస్ రిపోర్టు ఫైల్ చేశారు. కానీ, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ రెండేళ్లలో ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదు. ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి. పారదర్శకంగా ముందుకు సాగాలి. సదరు నివేదికను పబ్లిక్ డొమైన్‌లోకి తీసుకురండి’’ అని నవజోత్ సింగ్ సిద్ధు డిమాండ్ చేశారు. కేబినెట్ విస్తరణ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, అదే విధంగా ఇండో- పాక్ సరిహద్దులో ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసేందుకు అమరీందర్ సింగ్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో సిద్ధు ఈ మేరకు ట్వీట్లు చేయడం గమనార్హం. -
సిద్ధూ ప్రమాణస్వీకారంలో అపశ్రుతి: ముగ్గురి మృతి
ఛండీఘడ్: కాంగ్రెస్ పార్టీ పంజాబ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ ప్రమాణస్వీకారంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమానికి వెళ్తున్న కార్యకర్తలు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. కార్యకర్తలు ప్రయాణిస్తున్న బస్సు, ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధితులకు సత్వర వైద్య సేవలు అందించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఘటన తనను కలచి వేసిందని పార్టీ అధ్యక్షుడు నవ్‌జ్యోత్ సింగ్ తెలిపారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా నవ్‌జ్యోత్ సింగ్ శుక్రవారం ఉత్సాహ వాతావరణంలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలలా నుంచి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి మోగ జిల్లాలోని లోహరా గ్రామం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఛండీఘర్‌లో జరిగే సిద్ధూ కార్యక్రమానికి మినీ బస్సులో బయల్దేరారు. మార్గమధ్యలో మార్గమధ్యలో ఆర్టీసీ బస్సును వీరి బస్సు వేగంగా ఢీకొట్టింది. మినీ బస్సు నుజ్జునుజ్జయ్యింది. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు. తీవ్ర గాయాలవడంతో వెంటనే స్పందించిన స్థానికులు పోలీసుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. Saddened to learn of the bus accident in Moga district in which 3 Congress workers have reportedly died & many persons are injured. Have directed DC Moga to immediately provide full medical treatment to all the injured and to send a report to the Government. — Capt.Amarinder Singh (@capt_amarinder) July 23, 2021 -
ఒంటరైన సీఎం: 62 మంది ఎమ్మెల్యేలకు సిద్ధూ విందు
ఛండీగఢ్: పంజాబ్‌లో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఒంటరవుతున్నట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన నవజ్యోత్ సింగ్ సిద్ధూ తాజాగా బుధవారం అల్పాహార విందు ఏర్పాటుచేశాడు. ఈ విందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన 62 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. దీంతో ముఖ్యమంత్రి బలం తగ్గినట్టు కనిపిస్తోంది. అయితే ఈ అల్పాహార విందుకు కొందరు అనివార్య కారణాలతో రాలేనట్లు తెలుస్తున్నా వారంతా ముఖ్యమంత్రి వర్గానికి చెందిన వారు. తాజా పరిణామంతో సీఎం అమరీందర్ సింగ్ ఒంటరైనట్లు తెలుస్తోంది. 80 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండగా వారిలో 62 మంది హాజరు కావడంతో సీఎం బలం తగ్గినట్టే. ఈ సమావేశం అనంతరం ‘గాలిలో మార్పులు’ అంటూ సిద్ధూ ఓ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. వద్దని వారిస్తున్నా సిద్దూకు పార్టీ రాష్ట్ర బాధ్యతలు అధిష్టానం అప్పగించడంతో సీఎం అమరీందర్ సింగ్ అసహనంతో ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైనప్పటి నుంచి సిద్ధూ సీఎం అమరీందర్ సింగ్‌ను కలవలేదు. సిద్ధూ క్షమాపణ కోరితేనే తనను కలిసేందుకు అవకాశం ఇస్తానని సీఎం వర్గీయులు చెబుతున్నారు. దీనికి సిద్ధూ ససేమిరా అంటున్నాడు. దీంతో వీరిద్దరి మధ్య విబేధాలు తారస్థాయికి చేరాయి. పార్టీ అధ్యక్షుడు అల్పాహార విందు ఏర్పాటు చేయడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ముఖ్యమంత్రిని కాదని వెళ్లారు. ఆ విందుతో సిద్దూ వేరే కుంపటి పెట్టినట్టుగా మారింది. కొన్ని నెలల్లో ఎన్నికలు రాబోతుండడంతో అధిష్టానం ఆశీర్వాదం ఉన్న సిద్ధూకు పార్టీ ఎమ్మెల్యేలంతా జై కొట్టారు. సిద్దూ ఆధ్వర్యంలోనే ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధం కాబోతోంది. ఈ పరిణామంతో పార్టీ సీనియర్ నాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పార్టీ తనను పట్టించుకోకపోవడంపై గుస్సాగా ఉన్నారు. అధిష్టానం పట్టించుకోకపోవడం.. వయసు మీదపడడం వంటి సమస్యలతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉండేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ కాలం అయిపోయేంత వరకు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే ఆలోచనలో ఉన్నారు. ఎన్నికల అనంతరం ఫలితాలు ఎలా ఉన్నా ఆయన రాజకీయ సన్యాసం చేసే అవకాశాలు ఉన్నాయి. 117 అసెంబ్లీ స్థానాలు ఉన్న పంజాబ్‌లో కొన్ని నెలల్లోనే ఎన్నికలు రానున్నాయి. ప్రస్తుతం పంజాబ్‌లో బలాబలాలు ఇలా ఉన్నాయి. కాంగ్రెస్ 80, ఆమ్ ఆద్మీ పార్టీ 16, శిరోమణి అకాలీదల్ 14, బీజేపీ 2, ఎల్ఐపీ 2 ఉండగా.. మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మరోసారి ప్రభుత్వంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తోంది. రైతుల పోరాటానికి కాంగ్రెస్ మద్దతుగా ఉండడం కలిసొచ్చే అవకాశం ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ, శిరోమణి అకాలీదల్ కాంగ్రెస్‌కు గట్టిపోటీని ఇచ్చేలా ఉన్నాయి. Winds of Change - Of the People By the People For the People | Chandigarh to Amritsar | 20 July 2021 pic.twitter.com/CRBQLqMJk2 — Navjot Singh Sidhu (@sherryontopp) July 21, 2021 -
‘బహిరంగ క్షమాపణ చెప్పేవరకు సిద్ధూని సీఎం కలవరు’
చండీగఢ్: పంజాబ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఇంకా ముగియలేదు. కాంగ్రెస్ అధిష్టానం నవజోత్ సింగ్ సిద్ధూకి పంజాబ్ పీసీసీ బాధ్యతలు అప్పగించడం పట్ల ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. సిద్ధూ తనకు క్షమాపణలు చెప్పే వరకు తనను కలిసేది లేదని ఇంతకుముందే అమరీందర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన ఇదే మాటకు కట్టుబడి ఉన్నట్లు తాజా పరిణామాలు చూస్తే అర్థం అవుతుంది. ఈ క్రమంలో అమరీందర్ సింగ్ మీడియా అడ్వైజర్ రవీన్ థుక్రాల్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ‘‘నవజోత్ సింగ్ సిద్ధూ ముఖ్యమంత్రిని కలిసేందుకు సమయం ఇవ్వాల్సిందిగా కోరారు అనే వార్తలు అవాస్తవం. ఏది ఏమైనా ముఖ్యమంత్రి నిర్ణయంలో మార్పు లేదు. నవజోత్ సింగ్ సిద్ధూ సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రిపై చేసిన ఆరోపణలకు బహిరంగ క్షమాపణలు చెప్పే వరకు అమరీందర్ సింగ్ సిద్ధూని కలవరు.. అతడికి సమయం ఇవ్వరు’’ అని స్పష్టం చేశారు. మరోవసై పంజాబ్ మినిస్టర్ బ్రహ్మ్ మోహింద్రా కూడా సిద్ధూని కలవడానికి ఇష్టపడలేదు. ఈ మేరకు ఆయన ‘‘సిద్ధూని పంజాబ్ పీసీసీ చీఫ్‌గా నియమించడాన్ని స్వాగతిస్తున్నాను. కానీ సిద్ధూ ముఖ్యమంత్రిని కలిసి.. వారిద్దరి మధ్య ఉన్న విబేధాలను పరిష్కరించుకునే వారికి నేను సిద్ధూని కలను’’ అని ప్రకటించారు. -
Navjot Singh Sidhu: నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది
చండీగఢ్: తన ప్రయాణం ఇప్పుడే మొదలైందని పంజాబ్ కాంగ్రెస్ నూతన చీఫ్, మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ పేర్కొన్నారు. సిద్ధూ, సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి కొత్త అధ్యక్షుడిగా అధిష్టానం ఆయన్ను ఆదివారం నియమించిన విషయం తెలిసిందే. సోమవారం సిద్ధూ చండీగఢ్ చేరుకుని పలువురు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలను కలుసుకున్నారు. తనపై నమ్మకం ఉంచి, కీలక బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీకి, రాహుల్, ప్రియాంకలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘నా ప్రయాణం మొదలైంది. విధేయత కలిగిన కార్యకర్తగా ‘జీతేగా పంజాబ్’మిషన్ సాకారానికి పంజాబ్ కాంగ్రెస్ కుటుంబంలోని ప్రతి ఒక్కరితోనూ కలిసి పనిచేస్తా. పంజాబ్ మోడల్, అధిష్టానం సూచించిన 18 అంశాల ఎజెండాతో ప్రజల అధికారాన్ని తిరిగి ప్రజలకే అప్పగిస్తా’అని ట్విట్టర్లో పేర్కొన్నారు. పాటియాలాలో పలువురు ఎమ్మెల్యేలు, నేతలను కలుసుకుని మొహాలీలోని ఎమ్మెల్యే కుల్జీత్ సింగ్ నగ్రా నివాసానికి వెళ్లారు. అక్కడ కేక్ కట్ చేసి, స్వీట్లు పంచారు. అనంతరం పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ జాకఢ్, మంత్రులు రజియా సుల్తానా, తృప్త్ రజీందర్ సింగ్, మాజీ సీఎం రజీందర్ కౌర్ నివాసాలకు వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా అమృత్‌సర్‌లో కాంగ్రెస్ శ్రేణులు, సిద్దూ మద్దతుదారులు స్వీట్లు పంచుకున్నారు. ఇలా ఉండగా, సీఎం అమరీందర్ తీవ్ర వ్యతిరేకత నడుమ సిద్ధూను పీసీపీ చీఫ్‌గా పార్టీ అధిష్టానం నియమించిన విషయం తెలిసిందే. తనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన సిద్ధూ క్షమాపణ చెప్పే వరకు అతనితో సమావేశమయ్యేది లేదని సీఎం ఇప్పటికే స్పష్టం చేశారు. సిద్దూ నియామకంపై ఆయన వర్గం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. సోమవారం సీఎం అమరీందర్ తన అధికార నివాసంలో పార్టీ నేతలు, కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. -
విందుకు అందని పిలుపు.. వివాదానికి ఆజ్యం పోసిన ప్రమోషన్
చండీగఢ్: పంజాబ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం ముగిసిపోయిందని భావిస్తున్న సమయంలో ఓ ‘విందు’ ఆ సంక్షోభాన్ని మరింత పెంచేలా ఆజ్యం పోస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఒక వర్గంగా, నవజోత్ సింగ్ సిద్ధూ మధ్య విబేధాలు తారస్థాయికి చేరాయి. కాంగ్రెస్ అధిష్టానం సిద్ధూకు పంజాబ్ పీసీసీ బాధ్యతలు అప్పగించి పదోన్నతి కల్పించింది. దీంతో వివాదం సమసిపోయిందని అనుకుంటుండగా తాజాగా ముఖ్యమంత్రి ఏర్పాటు చేయబోతున్న ఓ విందు విబేధాలు ఇంకా తొలగిపోలేదని స్పష్టం చేస్తోంది. జూలై 21వ తేదీన పంచకులలో సీఎం అమరీందర్ సింగ్ విందు ఏర్పాటుచేశారు. భోజనానికి పంజాబ్‌లోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను సీఎం ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన నవజోత్ సింగ్ సిద్ధూకు మాత్రం ఆహ్వానం పంపలేదు. సిద్ధూను అధ్యక్షుడిగా ప్రకటించిన మరుసటి రోజే సీఎం అమరీందర్ ఈ విందు ఏర్పాటు చేయడం ఆసక్తిగా మారింది. తాజాగా పార్టీ నియమించిన పీసీసీ కార్యవర్గంలో సీఎం అమరీందర్ వర్గానికి ప్రాధాన్యం దక్కలేదు. పైగా ఇంకా సిద్దూపై కోపంతోనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం తన బలం ప్రదర్శించేందుకు ఈ విందు ఏర్పాటు చేశారని పంజాబ్‌లో చర్చ సాగుతోంది. తనకు క్షమాపణలు చెప్పేంత వరకు సిద్ధూను కలిసే ప్రసక్తే లేదని పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి సీఎం అమరీందర్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య విబేధాలు పార్టీకి ప్రతికూలంగా మారాయి. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నా కాంగ్రెస్‌లో విబేధాలు సద్దుమణగకపోవడంతో పార్టీ భారీ మూల్యం చెల్లించుకుంటుందని రెండో స్థాయి నాయకులు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి ఇలానే ఉంటే అధికారం కోల్పోయే ప్రమాదం ఉందని, వెంటనే నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. -
పంజాబ్ పీసీసీ చీఫ్‌గా సిద్ధూ
న్యూఢిల్లీ: పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా నవజ్యోత్ సింగ్ సిద్ధూని కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. రాష్ట్ర కాంగ్రెస్‌లో సిద్ధూ, ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌ల మధ్య తీవ్ర స్థాయిలో విబేధాలు నెలకొని ఉన్న సమయంలో పార్టీ చీఫ్ సోనియాగాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే సంవత్సరం పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పీసీసీ చీఫ్‌గా సిద్దూని నియమించిన సోనియా.. మరో నలుగురిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమించారు. వివిధ సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని సంగత్ సింగ్ గిల్జియాన్, సుఖ్వీందర్ సింగ్ డానీ, పవన్ గోయెల్, కుల్జీత్ సింగ్ నాగ్రాలను వర్కింగ్ ప్రెసిడెంట్స్‌గా నియమించారు. ఒకే పార్టీలో కీలక నేతలుగా ఉన్న అమరీందర్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ బహిరంగంగానే పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. రాష్ట్ర కాంగ్రెస్ కూడా వారిద్దరి మద్దతుదారులతో రెండు వర్గాలుగా విడిపోయిన పరిస్థితి నెలకొంది. వారిద్దరి మధ్య సయోధ్య కోసం పార్టీ అధిష్టానం కూడా ప్రయత్నించింది. ‘పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, తక్షణమే అమల్లోకి వచ్చేలా, నవజ్యోత్ సింగ్ సిద్ధూని నియమిస్తున్నాం’ అని కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు పీసీసీ చీఫ్‌గా ఉన్న సునీల్ జాఖడ్ సేవలను ఈ ప్రకటనలో పార్టీ కొనియాడింది. 2017లో గత అసెంబ్లీ ఎన్నికల ముందు సిద్ధూ బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఆ తరువాత క్రమంగా, పార్టీలో పట్టు సాధించారు. పీసీసీ చీఫ్ నియామకం విషయంలో సీఎం అమరీందర్ సింగ్ వ్యతిరేకతను కాదని, సిద్ధూ వైపే అధిష్టానం మొగ్గు చూపడం గమనార్హం. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధూ నాయకత్వంతో పార్టీ శ్రేణులు కొత్త ఉత్సాహంతో పనిచేస్తాయని అధిష్టానం భావించినట్లు తెలుస్తోంది. సిద్ధూ ప్రసంగ శైలి ప్రజలను ఆకట్టుకుంటుందని, ఎన్నికల ప్రచారంలో సిద్ధూ సేవలు అవసరమని సోనియాగాంధీ తదితర సీనియర్ నాయకులు విశ్వసించారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా కూడా సిద్ధూ వైపే మొగ్గు చూపారని వెల్లడించాయి. అమరిందర్ సింగ్‌తో సయోధ్య, ఒకవేళ అది కుదరని పక్షంలో ఆయన వర్గీయుల వ్యతిరేకతను తట్టుకుని పార్టీని ఏకం చేయడం, పార్టీ నాయకులను, కార్యకర్తలను ఎన్నికల కోసం సిద్ధం చేయడం నూతనంగా పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను స్వీకరిస్తున్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ ముందున్న ప్రధాన సవాళ్లు. తనపై చేసిన ఆరోపణలు తప్పు అని అంగీకరిస్తూ, బహిరం గంగా క్షమాపణలు కోరితే తప్ప సిద్ధూని కలిసే ప్రసక్తే లేదని ఇటీవల ఢిల్లీలో పార్టీ చీఫ్ సోనియాతో సీఎం అమరీందర్ చెప్పారని సమాచారం. సీనియర్ నేతల మధ్య విబేధాలు తొలగనట్లయితే, రానున్న ఎన్నికల్లో పార్టీ అధికారం కోల్పోవడం ఖాయమని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. అమరీందర్ ప్రభుత్వంలో మంత్రిగా సిద్ధూ ఉన్నప్పటి నుంచే వారి మధ్య విబేధాలు ఉన్నాయి. అమరీందర్ వ్యతిరేకతను పట్టించుకోకుండా, అయన మంత్రివర్గంలో ఉన్న సిద్ధూ పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడం, పాక్ ఆర్మీ చీఫ్ బాజ్వాను కౌగిలించుకోవడం.. మొదలైనవి ఇరువురి మధ్య విబేధాలు తీవ్రమవడానికి కారణమయ్యాయి. -
పంజాబ్ రాజకీయ సంక్షోభం కొలిక్కి
చండీగఢ్: పంజాబ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం సమసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, అసంతృప్త నేత నవజోత్ సింగ్ సిద్ధూల మధ్య సయోధ్య కుదరకపోయినప్పటికీ అమరీందర్ ఒక మెట్టు దిగారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏ నిర్ణయం తీసుకున్నా తమందరికీ ఆమోదయోగ్యమేనని అమరీందర్ శనివారం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఇష్టానికి వ్యతిరేకంగా నవజోత్ సింగ్ సిద్ధూని పీసీసీ అధ్యక్షుడిని చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పంజాబ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ హరీశ్ రావత్ చండీగఢ్ వెళ్లారు. రావత్‌తో సమావేశానంతరం అమరీందర్ సింగ్ సోనియా ఏ నిర్ణయం తీసుకున్నా తమకు అంగీకారమేనంటూ ప్రకటన విడుదల చేశారు. అమరీందర్ వ్యక్తం చేసిన కొన్ని అంశాల్ని సోనియా దృష్టికి తీసుకువెళతానని రావత్ హామీ ఇచ్చినట్టు సీఎం సన్నిహితులు తెలిపారు. తనకు వ్యతిరేకంగా చేసిన ట్వీట్లు, విమర్శలకు బహిరంగంగా క్షమాపణ చెప్పేవరకు సిద్ధూని కలవబోనని అమరీందర్ రావత్‌కి చెప్పినట్టుగా కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. వరస సమావేశాలతో సిద్ధూ బిజీ సిద్ధూని పంజాబ్ పీసీసీ అ«ధ్యక్షుడిని చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన రోజంతా బిజీ బిజీగా గడిపారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు సునీల్ జాఖడ్, పార్టీ ఎమ్మెల్యేలు, సీఎం అమరీందర్‌కు విధేయులైన నాయకుల్ని కలుసుకొని మంతనాలు సాగించారు. కెప్టెన్ సాబ్ కీలక ప్రకటన చేశారు : రావత్ అధినేత్రి సోనియా నిర్ణయానికి కట్టుబడి ఉంటానంటూ ముఖ్యమంత్రి అమరీందర్ çకీలకమైన ప్రకటన చేశారని హరీష్ రావత్ అన్నారు. బయట జరుగుతున్న చర్చల్లో చాలా అంశాలు అవాస్తవాలని తనకు అర్థమైందని, అందుకు సంతోషంగా ఉందని అన్నారు. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికలో సోనియా నిర్ణయాన్ని తాను కూడా పూర్తిగా గౌరవిస్తానంటూ ట్వీట్ చేశారు. -
కాంగ్రెస్ హైకమాండ్ రాంగ్ సిగ్నల్?
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్‌లో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. అధికార కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తెరదించేందుకు అధిష్టానం సర్వశక్తులు ఒడ్డుతోంది. అందులోభాగంగా ఎన్నికలకు కెప్టెన్ సారథ్యం వహిస్తారని, సిద్ధూకి పీసీసీ అధ్యక్ష పదవి వంటి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయంటూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ హరీష్ రావత్ గురువారం ఇచ్చిన స్నిగల్ పరిస్థితిని చక్కదిద్దకపోగా, మరింత ఆందోళనలకు కారణమైంది. కెప్టెన్ అమరీందర్‌పై సిద్ధూ అసంతృప్తి, తిరుగుబాటు శైలిని చూసి రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించాలనుకున్న హైకమాండ్ ప్లాన్ క్యాంపు రాజకీయాలకు ఆజ్యం పోసినట్లయింది. సిద్ధూ, కెప్టెన్ తమకు అనుకూలంగా ఉన్న మంత్రులు, శాసనసభ్యులతో క్యాంపు సమావేశాలు జరిపారు. నవ్‌జ్యోత్‌సింగ్ సిద్ధూ శుక్రవారం ఢిల్లీలో సోనియాగాంధీని కలవడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. సిద్ధూ అంతకుముందు జూన్ 30 న ఢిల్లీకి వచ్చి ప్రియాంకా గాంధీని కలిశారు. అదే సమయంలో కెప్టెన్ అమరీందర్ సింగ్ సైతం పార్టీ అధినేత్రితో భేటీ అయ్యారు. సోనియాతో జరిగిన సమావేశంలో రాహుల్‌గాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ హరీష్ రావత్ పాల్గొన్నారు. కాగా సిద్ధూ సోనియాగాంధీని కలిసే ముందే ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ పార్టీ అధినేత్రికి ఒక లేఖ పంపించారని తెలిసింది. వచ్చే ఏడాది జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కెప్టెన్, సిద్ధూలు కలిసి పనిచేయగల శాంతి సూత్రాన్ని కేంద్ర నాయకత్వం రూపొందిస్తోందని రావత్ అభిప్రాయపడ్డారు. సమావేశం తరువాత మీడియాతో మాట్లాడిన రావత్ ‘నేను పంజాబ్‌లో పార్టీకి సంబంధించి నివేదికను సమర్పించడానికి పార్టీ అ«ధినేత్రిని కలిశాను. పంజాబ్ కాంగ్రెస్ విషయంలో పార్టీ అధ్యక్షురాలు తీసుకున్న నిర్ణయం గురించి నాకు సమాచారం వచ్చిన వెంటనే, మీ అందరికీ చెబుతాను’అని అన్నారు. అంతేగాక సిద్ధూను పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా చేస్తున్నారంటూ తను చేసిన వ్యాఖ్యలను మీడియా తప్పుగా అర్థం చేసుకుందన్నారు. కాగా, పంజాబ్‌లో సిద్ధూ, ఆయన ప్రత్యర్థి శిబిరం మధ్య పోస్టర్ల యుద్ధం మొదలైంది. సిద్ధూ మద్దతుదారులు అమృత్సర్, లూధియానాతో సహా పంజాబ్‌లోని పలు చోట్ల వేసిన పోస్టర్లలో లూధియానాలో కొన్ని పోస్టర్లను చింపేశారు. పార్టీ తీసుకొనే కొన్ని నిర్ణయాలపై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ అసంతృప్తిగా ఉన్నారన్న ఊహాగానాలకు హరీష్ రావత్ తెరదించారు. ఈ విషయంలో కెప్టెన్‌కి ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే, దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నిస్తామని రావత్ అన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు సన్నిహితుడైన ఎంపీ, సీనియర్ నేత మనీష్ తివారీ కూడా ఈ వివాదంలో తనదైన శైలిలో అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. సామాజిక సమూహాల మధ్య సమతుల్యతను కాపాడటం ముఖ్యమని, సమానత్వం సామాజిక న్యాయానికి పునాది అని వ్యాఖ్యానించారు. పంజాబ్‌లో సిక్కులు 57.75 శాతం, హిందువులు 38.49 శాతం, దళితులు 31.94 శాతం ఉన్నారని తెలిపారు. లోక్‌సభ సభ్యుడు మనీష్ తివారీ తన ట్వీట్లో కాంగ్రెస్ పంజాబ్ ఇన్ఛార్జ్ హరీష్ రావత్‌ను ట్యాగ్ చేశారు. దీంతో సిద్ధూకి చెక్ పెట్టేలా సీఎం అమరీందర్‌కు అనుకూలంగా తివారీ ఈ ట్వీట్ చేసినట్లు భావిస్తున్నారు. -
సయోధ్య సాధ్యమేనా..?
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అసమ్మతికి చెక్ పెడుతూ కాంగ్రెస్ అధిష్టానం వ్యూహ రచన పూర్తి చేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అనుసరించాల్సిన ప్రణాళికను హైకమాండ్ సిద్ధం చేసింది. అందులో భాగంగా పంజాబ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ హరీష్ రావత్ కీలక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ నాయకత్వంలోనే వచ్చే ఎన్నికల్లో పార్టీ పోరాడనున్నట్లు ఆయన గురువారం స్పష్టం చేశారు. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సంబంధించిన మరో కీలక నిర్ణయం తీసుకుంది. నవజోత్ సింగ్ సిద్ధూని పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా నియమించవచ్చని హరీష్ రావత్ సూచించారు. గతంలో సిద్ధూ, అమరీందర్ సింగ్ ఇద్దరూ ఒకరిపై ఒకరు బహిరంగంగానే మాటల యుద్ధం చేశారు. ఇద్దరి మధ్య నెలకొన్న అంతరాన్ని తగ్గించేందుకు పార్టీ హైకమాండ్ ఏర్పాటు చేసిన మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ప్యానెల్ పంజాబ్‌లో పర్యటించి ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను సేకరించి నివేదికను హైకమాండ్‌కు సమర్పించింది. అనంతరం ఇరువురు నాయకులు పార్టీ పెద్దలతో వేరువేరుగా భేటీ అయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. 2022 అసెంబ్లీ ఎన్నికలలో కెప్టెన్ అమరీందర్ సింగ్ నాయకత్వంలోనే కాంగ్రెస్ పోరాడనుండగా, అదే సమయంలో నవజోత్ సింగ్ సిద్ధూకు కూడా పూర్తి గౌరవం ఇచ్చేలా ఒక వ్యూహాన్ని సిద్ధం చేశారు. పంజాబ్‌లో తిరిగి అధికారంలోకి రావడం ఎంత అవసరమో, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం భవిష్యత్ నాయకులను కాపాడటం కూడా అంతే ముఖ్యమని పార్టీ అధిష్టానం భావిస్తోంది. అందుకే నవజోత్‌సింగ్ సిద్ధూకి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. పంజాబ్ కాంగ్రెస్‌లో నెలకొన్న గందరగోళానికి తెరదించేందుకు త్వరలో కీలక ప్రకటన జరగవచ్చని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పంజాబ్ కాంగ్రెస్‌కు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం ఫార్ములా సిద్ధం చేసిందని సమాచారం. ఒకవేళ నవజోత్‌సింగ్ సిద్ధూ పంజాబ్ పీసీసీ అధ్యక్షుడైతే, ఇద్దరు లేదా ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించే యోచనలో ఉంది. అదే సమయంలో ఇటీవల నవజోత్ సింగ్ సిద్దూ చేసిన ట్వీట్ పంజాబ్ రాజకీయాల్లో ప్రకంపనలను తీవ్రతరం చేసింది. ఈ నేపథ్యంలో అమరీందర్, సిద్ధూల మధ్య దూరాన్ని తగ్గించేందుకు సిద్ధూని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌గా చేయడంవల్ల పరిస్థితి ఇప్పుడు చల్లబడినప్పటికీ, రాబోయే రోజుల్లో గొడవ మరింత ముదిరే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల తర్వాత సిద్ధూ ముఖ్యమంత్రి కావాలని భావిస్తున్నందున అమరీందర్ విధేయులు ఎమ్మెల్యేలుగా గెలవాలని ఆయన కోరుకొనే పరిస్థితి ఉండదని తెలిపారు. ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపులో తమ విధేయులకు ఎక్కువ టికెట్లు కోరుతూ ఎవరికి వారు పోటీపడే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. కానీ పంజాబ్‌లో సిద్ధూకి ఉన్న ప్రజాదరణ కారణంగా ఆయనను పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా నియమించాల్సిన పరిస్థితి కాంగ్రెస్ హైకమాండ్ ముందు నెలకొంది. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి రిస్క్ చేయదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ సైతం సిద్ధూపై దృష్టి సారించినందుకు వీలైనంత త్వరగా పరిస్థితిని చక్కదిద్దాలని హైకమాండ్ యోచిస్తోంది. -
పంజాబ్ పీసీసీ చీఫ్‌గా నవజోత్ సింగ్ సిద్ధూ..?
చండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగున్న నేపథ్యంలో అంతర్గిత కుమ్మలాటపై కాంగ్రెస్ హైకమండ్ దృష్టి సారించింది. సీఎం అమరీందర్ సింగ్, నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య రాజీ కుదిర్చేలా ఓ డీల్ తెరపైకి తెచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరికీ తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచిస్తుంది. ఈ క్రమంలో పంజాబ్ పీసీసీ చీఫ్‌గా సిద్ధూని నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం.అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుత పంజాబ్ పీసీసీ చీఫ్ సునీల్ జక్కర్ స్థానంలో సిద్దూను నియమించనున్నారు. మరో ఇద్దరు సీనియర్ నేతలను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించే అవకాశం ఉంది. పంజాబ్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జీ హరీశ్ రావత్ బుధవారం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో సిద్దుకు పంజాబ్ పార్టీ బాధ్యతలు అప్పగించే అంశంపై చర్చించినట్లు సమాచారం.ఈ నేపథ్యంలోనే పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను నవజ్యోత్ సింగ్ సిద్దుకు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. -
‘సిద్ధు’కు షాకిచ్చిన రాహుల్ గాంధీ!
న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన విభేదాలను పరిష్కరించే క్రమంలో అధిష్టానం కొన్నిరోజులుగా నేతలతో ఢిల్లీలో మంతనాలు జరుపుతోంది. ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ, పలువురు పంజాబ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే, రాహుల్ తాజా వ్యాఖ్యలతో.. పార్టీ చీలికకు ముఖ్యకారణంగా భావిస్తున్న నవజ్యోత్ సింగ్ సిద్ధుకు గట్టి షాక్ తగిలినట్లయింది. తాను ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలుస్తానని సిద్ధు చెప్పగా అలాంటిదేమీ ఉండబోదని.. రాహుల్ కుండబద్దలుకొట్టారు. కాగా మంగళవారం, జన్‌పథ్ 10లోని తన నివాసం నుంచి తన తల్లి, పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంటికి పయనమైన రాహుల్ గాంధీ ఏఎన్ఐతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ‘‘సిద్ధుతో సమావేశం ఉండదు’’ అని స్పష్టం చేశారు. ఇక పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, అసంతృప్త నేత నవజోత్ సింగ్ సిద్ధూ వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరడంతో అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సంక్షోభాన్ని రూపుమాపేందుకు ఇప్పటికే ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. కాగా ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలైన అర్జున్ ప్రతాప్‌సింగ్ బజ్వా, భీష్మ పాండే కుమారులకు కారుణ్య నియామకాల కింద ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం అమరీందర్ తీసుకున్న నిర్ణయం వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో పరస్పర విమర్శలతో సీఎం, సిద్ధు వర్గం దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలో సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ హరీష్ రావత్, సీనియర్ నేత జేపీ అగర్వాల్‌లతో కూడిన ఈ కమిటీ రంగంలోకి దిగింది. ఈ ప్యానెల్ ఎదుట హాజరైన సీఎం అమరీందర్ సింగ్ గట్టిగానే తన వాదనలు వినిపించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సిద్ధుతో మీటింగ్ ఉండబోదంటూ రాహుల్ వ్యాఖ్యానించడం ఆయన వర్గానికి మింగుడుపడటం లేదు. చదవండి: సీఎం VS సిద్ధూ.. అసలేం జరుగుతోంది? -
సీఎం VS సిద్ధూ
సంకీర్ణంలో భాగస్వామిగా కాకుండా సొంతంగా అధికారంలో ఉన్నది మూడంటే మూడు రాష్ట్రాల్లో.. అన్ని రాష్ట్రాల్లోనూ ముఠా తగాదాలు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారాయి. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో సమస్యలు చక్కదిద్దలేక కాంగ్రెస్ అధిష్టానం సతమతమవుతోంది. మరీ ముఖ్యంగా పంజాబ్ కాంగ్రెస్‌లో నేతలు రెండు వర్గాలుగా చీలిపోయారు. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, అసంతృప్త నేత నవజోత్ సింగ్ సిద్ధూ వర్గాల మధ్య పోరు తారస్థాయికి చేరుకోవడంతో సీన్ హస్తినకి మారింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో ఢీ అంటే ఢీ అంటూ వస్తున్న మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ గళానికి మరికొందరు నేతలు ఇప్పుడు జత కలిశారు. ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలైన అర్జున్ ప్రతాప్‌సింగ్ బజ్వా, భీష్మ పాండే కుమారులకు కారుణ్య నియామకాల కింద (వారి తాతలు వేర్పాటు ఉద్యమ కాలంలో ఖలిస్థాన్ ఉగ్రవాదుల చేతుల్లో హతమయ్యారని) ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి అమరీందర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారి ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు సునీల్ ఝాకర్, రాష్ట్ర మంత్రి సుఖ్జీందర్ రాంధ్వా సీఎం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కెప్టెన్ వ్యవహారశైలి ఇలాగే ఉంటే రాజీనామా చేస్తామని హెచ్చరికలు చేశారు. వారిద్దరితో మంత్రులు రాజీందర్ సింగ్ బాజ్వా, రజియా సుల్తానా, చరణ్‌జిత్ సింగ్, ఇంకొందరు ఎమ్మెల్యేలు గళం కలిపారు. డిప్యూటీ సీఎం లేదంటే పీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న నవజోత్ సింగ్ సిద్ధూ సీఎంపై నేరుగానే మాటల తూటాలు సంధించారు. ట్విట్టర్ వేదికగా, మీడి యా ఇంటర్వ్యూల్లోనూ అమరీందర్‌ను అబద్ధాల కోరుగా వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఈ తలనొప్పుల్ని పరిష్కరిం చడానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఒక కమిటీ వేసి రాష్ట్రంలో పరిస్థితుల్ని రెండు వారాల్లో చక్కదిద్దాలని డెడ్‌లైన్ విధించారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే, పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ హరీష్ రావత్, సీనియర్ నేత జేపీ అగర్వాల్‌లతో కూడిన కమిటీ ఎదుట హాజరైన సీఎం అమరీందర్ సింగ్ తన వాదనని సమర్థంగా వినిపించినట్టు తెలుస్తోంది. సిద్ధూ వర్గం చేసిన ప్రతీ ఫిర్యాదుకి ఆయన కౌంటర్లు ఇచ్చినట్టుగా సీఎం వర్గం చెబుతోంది. సిద్ధూకి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడానికి మాత్రం ఆయన ససేమిరా అంటున్నారు. మరోవై పు రాహుల్ గాంధీని కూడా పలువురు నేతలు కలుసుకొని రాష్ట్ర పరిస్థితుల గురించి వివరించారు. రాజీ ఫార్ములా ? సీఎంకి, సిద్ధూకి మధ్య రాజీ ఫార్ములా కుదిర్చే దిశగా అధిష్టానం అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక ముఖ్యమంత్రిగా అమరీందర్ సింగ్ వివిధ సర్వేల్లో అట్టడుగు స్థానంలో ఉండడం ఆయనకు మైనస్‌గా మారితే, నవజోత్ సింగ్ సిద్ధూ బహిరంగంగానే సీఎంను తూలనాడడం ఆయనకు మైనస్‌గా మారింది. సిద్ధూ వ్యాఖ్యలు విపక్షాలకు అస్త్రాలుగా మారడం కాంగ్రెస్‌ను కలవరపెడుతోంది. రాహుల్ గాంధీ ప్రస్తుతానికి సిద్ధూ çపక్షాన ఉన్నప్పటికీ ఎంతవరకు పార్టీలో ఆయనను కాపాడగలరన్న సందేహాలైతే ఉన్నాయి. అమరీందర్ ఢిల్లీకి వచ్చినప్పటికీ సోనియా, రాహుల్‌ల అపాయింట్మెంట్ ఆయనకు దొరకలేదని చెబుతున్నారు. సిద్ధూ లేవనెత్తిన పలు అంశాల్లో దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎంను ఆదేశించింది. తద్వారా సిద్ధూని బుజ్జగించినట్లు అవుతుందని, ప్రజల కోసం మాట్లాడానని, సమస్యలు పరిష్కరించగలిగానని ఆయన చెప్పుకోవడానికి వీలుంటుందని భావిస్తోంది. ఇప్పటికే సిద్ధూని ఢిల్లీకి రమ్మని పిలవడంతో సోనియాగాంధీ వీరి ఇరువురి మధ్య సయోధ్య కుదురుస్తారని, ఎన్నికల వేళ ఎలాంటి మార్పులు చేపట్టినా మొదటికే మోసం వస్తుందని అధిష్టానం భావిస్తున్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సీఎంపై సిద్ధూ వర్గం చేస్తున్న ఫిర్యాదులు ► కెప్టెన్ అమరీందర్ నేతృత్వంలో వచ్చే ఏడాది ఎన్నికలకి వెళితే కాంగ్రెస్ గెలిచే చాన్స్ లేదు ► అమరీందర్ సింగ్ అకాలీదళ్‌తో కలిసి రాష్ట్రంలో మాదక ద్రవ్య మాఫియాను పెంచిపోషిస్తున్నారు ► 2015లో సిక్కుల పవిత్ర గ్రంథమైన గురుగ్రంథసాహిబ్ను అపవిత్రం చేసిన ఘటనల్లో, కాల్పుల్లో ఇద్దరు యువకులు చనిపోవడానికి కారకులైన పోలీసులపై చర్యలు తీసుకోవడంలో అమరీందర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ► ఇసుక, రవాణా మాఫియాలతో కుమ్మక్కై కోట్లాది రూపాయల అవినీతి కుంభకోణాలు ► నిరుపేదల సంక్షేమ కార్యక్రమాల అమలులో వైఫల్యం ► ఉద్యోగులు, రైతులు, దళితులు, ఆశ వర్కర్లు సీఎంకు వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలు. అమరీందర్‌పై సిద్ధూ సిక్సర్లు ‘‘ఆయన నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు చెబుతారు. నేను ఆప్‌తో చేతులు కలుపుతున్నానని అంటున్నారు. దానికి ఆధారాలున్నా యా? ఏం మాట్లాడుతున్నారో ఆయనకేమైనా అర్థమవుతోందా? ఒక ముఖ్యమంత్రిగా అస లేం చేశారు? రిపోర్టు కార్డు ఇవ్వండి. అమరీం దరే అకాలీదళ్ చేతుల్లోకి వెళ్లిపోయారు’’ ‘‘మీకు కావాలనుకుంటే ఎన్నికల ప్రచారానికి తీసుకువెళ్లి గెలిచిన తర్వాత నన్ను తిరిగి అల్మారాలో పెట్టేయడానికి నేనేమీ షో పీస్‌ని కాను. అందుకే మీ పని తీరుని నేను గమనిస్తూనే ఉన్నాను. రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసి, స్వప్రయోజనాలు చూసుకుంటున్నారు. ఇది నేను భరించలేను’’ ‘‘ప్రశాంత్ కిశోర్ నన్ను 60 సార్లు కలుసుకున్నాకే నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను. గత ఎన్నికల్లో నేను 56 స్థానాల్లో ప్రచారం చేస్తే 54 సీట్లలో పార్టీ గెలిచింది. అప్పట్నుంచి నాకున్నది ఒక్కటే ఎజెండా. పంజాబ్ ప్రజల ఎజెండా. ఈ విషయాన్ని అప్పట్లోనే నేను స్పష్టం చేశాను. ఇప్పటికీ దానికే కట్టుబడి ఉన్నాను’’ – నేషనల్ డెస్క్, సాక్షి -
భారీ ఎత్తున నిరసనలు.. సీఎం నివాసం ముట్టడి
చండీగఢ్/సిస్వాన్: పంజాబ్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ శిరోమణి అకాళీదళ్ నేతలు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ నివాసాన్ని మంగళవారం ముట్టడించారు. ఆరోగ్య మంత్రిపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. కోవిడ్ నిబంధనలు పట్టించుకోకుండా భారీ సంఖ్యలో ఆందోళనకారులు ఒక్కసారిగా దూసుకురావడంతో సీఎం ఇంటి వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు శిరోమణి అకాళీదళ్ చీఫ్ సుఖ్బీర్సింగ్ బాదల్‌ను అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. తుపానును ఆపలేరు ఈ సందర్భంగా సుఖ్బీర్సింగ్ మాట్లాడుతూ... ‘‘తన బలగాన్నంతా ఉపయోగించినప్పటికీ.. ఇప్పుడు చెలరేగిన తుపానును కెప్టెన్ ఆపలేరు. వ్యాక్సినేషన్లో కుంభకోణం.. ఫతే కిట్ కిట్‌లో స్కాం.. ఎస్సీ స్కాలర్షిప్ విషయంలోనూ ఇదే తంతు... రైతుల నుంచి భూసేకరణ అంశంలోనూ ఇదే రకమైన వైఖరి’’ అంటూ అమరీందర్ సింగ్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు.కాగా పోస్ట్ మెట్రిక్ ఉపకారవేతన నిధుల అంశంలో అవకతవకలు జరిగాయంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సోమవారం సీఎం అధికారిక నివాసాన్ని ముట్టడించిన విషయం తెలిసిందే. ఆప్ ఎమ్మెల్యే హర్పాల్ సింగ్ చీమా నేతృత్వంలో ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ తీరును ఎండగడుతూ సామాజిక సంక్షేమ మంత్రి సధూ సింగ్ ధరమ్‌సోత్‌ను పదవి నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేశారు. తక్షణమే ఉపకార వేతన బకాయి నిధులను విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకోగా ప్రతిపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక అణగారినవర్గాలకు అందాల్సిన స్కాలర్‌షిప్‌నకు సంబంధించిన 64 కోట్ల నిధులు దారి మళ్లాయంటూ గతేడాది అమరీందర్ సింగ్ ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ అంశంపై విచారణ చేపట్టాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆయన ఆదేశించారు. చదవండి: ఎన్నికల వేళ: మాయావతికి ఎదురుదెబ్బ -
‘మోదీ, పంజాబ్ సీఎం మధ్య రహస్య స్నేహం ఉంది’
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ మధ్య రహస్య స్నేహ బంధం ఉందని ఆప్ పార్టీ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు. 2019-20 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన సామర్ధ్య గ్రేడింగ్ సూచీ (పీజీఐ)లో పంజాబ్ తొలి ర్యాంక్‌లో నిలిచిన అనంతరం సిసోడియా ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో పంజాబ్‌లో దాదాపు 800 ప్రభుత్వ పాఠశాలలను కెప్టెన్ సింగ్ మూసివేశారని విమర్శించారు. దీనికితోడు అనేక పాఠశాలలు ప్రైవేట్ సంస్థలకు అప్పగించారని.. కానీ పంజాబ్ అగ్రస్థానంలో ఉందంటూ ఎద్దేవా చేశారు. పంజాబ్‌లో ప్రభుత్వ పాఠశాలలు దయనీయంగా ఉంటే అమరీందర్ సింగ్ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు పంజాబ్ స్కూళ్లు అద్భుతంగా ఉన్నాయని ప్రధాని నివేదిక ఇచ్చారని మండిపడ్డారు. పంజాబ్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా సౌకర్యాలు సరిగా లేవని, ఎక్కువశాతం తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నారని ఆయన ఆరోపించారు. ఇరువురు నేతల మధ్య దోస్తీని ఇది వెల్లడిస్తోందని వ్యాఖ్యానించారు. కాగా వచ్చే ఏడాది ప్రారంభంలో పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రతిపక్ష పార్టీగా ఉంది. బీజేపీ పంజాబ్‌లో మరో ప్రతిపక్ష పార్టీగా ఉంది. చదవండి: పంజాబ్: జతకట్టిన శిరోమణి అకాలీదళ్, బీఎస్పీ! BKU: ఢిల్లీ సరిహద్దులకు చేరుతున్న రైతులు -
పంజాబ్‌లో మరోసారి రాజుకున్న పోస్టర్ వివాదం..
చత్తీస్‌గఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, అమృత్సర్ ఎమ్మెల్యే నవజ్యోత్ సిద్ధూల మధ్య తరచుగా ఏదో ఒక వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరు ఒక పోస్టర్ వివాదంతో మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే, నవజ్యోత్ సింగ్ సిద్దూ గత కొన్ని రోజులుగా అమృత్ సర్ నుంచి పాటియాలకు తన రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేయసాగారు. కాగా, కెప్టెన్ అమరీందర్‌సింగ్‌కు పాటియాలా కంచుకోటలాగా భావిస్తారు. ఇప్పుడిదే వీరిద్దరి మధ్య వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ క్రమంలో నవజ్యోత్ సింగ్ కనిపించడంలేదని అమృత్‌సర్‌లో పలుచోట్ల పోస్టర్లు.. దానిపై సిద్ధూని పట్టిస్తే, 50 వేల రూపాయల రివార్డని కూడా ప్రకటించారు. అదే విధంగా, షాహిద్ బాబా దీప్ సింగ్ సేవా సోసైటీ అనే ఒక ఎన్జీవో సంస్థ (గుమ్షుడా డి తలాష్) తప్పిపోయిన ఎమ్మెల్యేను వెతకండి అని పోస్టర్లను విడుదల చేసింది. అదే విధంగా, పాటియాలలో కూడా కొన్ని పోస్టర్లు వెలిశాయి. దీంతో వీరిద్దరి రచ్చ కాస్త కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి వెళ్లింది. ఇప్పటికే కెప్టెన్ అమరీందర్ సింగ్ పనితీరుపై 20 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని పలు నివేదికలు కాంగ్రెస్‌కు చేరాయి. దీని వెనుక సిద్ధూ హస్తం ఉందని భావిస్తారు. వీరి మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి కాంగ్రెస్ అధిష్ఠానం ముగ్గురు సభ్యులతో ఒక ప్యానల్‌ను నియమించింది. ఈ కమిటీకి మల్లి ఖార్జున్ ఖర్గేను నాయకత్వం వహించనున్నారు. పంజాబ్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ హరిష్ రావత్, మాజీ ఎంపీ జేపీ అగర్వాల్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. చదవండి: ఇక్కడ నుంచి కదలరు.. ఎస్సై, సీఐ, ఏసీపీ.. ఏ ప్రమోషన్ వచ్చినా.. -
టీకా వివాదం.. వెనక్కి తగ్గిన అమరీందర్ సర్కార్
చండీగఢ్: ఓ వైపు జనాలు కోవిడ్ టీకాల కొరతతో ఇబ్బంది పడుతుంటే.. మరో వైపు ప్రభుత్వాలు ప్రైవేట్ ఆస్పత్రులకు టీకాలను కేటాయిస్తూ.. జనాలకు అన్యాయం చేస్తున్నాయి. తాజాగా పంజాబ్‌లో ఇదే ఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో టీకాల దందాపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పంజాబ్ సర్కారు ప్రైవేటు హాస్పిటల్స్ కు టీకాల సరఫరా నిలిపివేసింది. ప్రభుత్వం టీకాలు మళ్లించి కోట్లు దండుకుంటున్నట్టు విపక్ష అకాలీదళ్ ఆరోపణలో నేపథ్యంలో అమరీందర్ సింగ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 18-44 సంవత్సరాల వయసువారికి సింగిల్ డోస్ వ్యాక్సిన్ ప్రైవేటు హాస్పిటల్స్ ద్వారా సమకూర్చేందుకు పంజాబ్ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై విపక్ష అకాలీదళ్ మండిపడింది. భారీ లాభాలకు కోవాగ్జిన్ టీకాలను మళ్లించిందని ఆరోపించింది. 400 రూపాయలకు వచ్చే టీకాను సర్కారు ప్రైవేటు హాస్పిటల్స్‌కు 1060 రూపాయలకుకి అమ్ముతున్నదని, ఆస్పత్రులు దానిని ప్రజలకు 1560 రూపాయలకు అమ్ముతున్నాయని శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ ట్విట్టర్లో ఆరోపించారు. ప్రజల్లో కూడా టీకాల వ్యవహారంపై ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో సర్కారు తన ఉత్తర్వులను శుక్రవారం సాయంత్రానికి ఉపసంహరించుకున్నది. ఈ వ్యవహారాన్ని గమనించిన కేంద్ర సర్కారు మొత్తం టీకాల లెక్క తెలియజేయమని పంజాబ్‌లోని అమరీందర్ సర్కారును ఆదేశించింది. చదవండి: షాకింగ్‌గా ఉంది.. ఇలా జరగాల్సింది కాదు! -
'నేను పార్టీ మారానా.. దమ్ముంటే నిరూపించండి'
అమృత్సర్: పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, అమృత్సర్ ఎమ్మెల్యే నవజ్యోత్ సింగ్ సిద్దూ మధ్య కోల్డ్‌వార్ నడుస్తూనే ఉంది. తాజగా తాను కాంగ్రెస్‌ను వీడి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను సిద్దూ ఖండించారు. తాను పార్టీ మారుతున్నట్లు సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. దమ్ముంటే అది నిరూపించాలని సీఎం అమరీందర్‌కు సవాల్ విసిరారు. దీంతో పంజాబ్ రాజకీయాల్లో వీరిద్దరి మధ్య రగులుతున్న వివాదం మరోసారి ఆసక్తికరంగా మారింది. సిద్దూ కాంగ్రెస్‌లో ఉంటూ క్రమశిక్షణా రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని.. ఆయన ఆప్‌లో చేరుతున్నట్లుగా తమకు సమాచారం అందిందని సీఎం అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. దీనిపై సిద్దూ ట్విటర్ వేదికగా ధీటుగా బదులిచ్చారు. ''నేను ఇతర పార్టీ నేతలతో భేటీ అయినట్లు నిరూపిస్తారా? ఈరోజు వరకూ నేనెవర్నీ నాకు ఒక పోస్ట్ కావాలని అడగలేదు. ఇప్పటికే నన్ను చాలా మంది ఆహ్వానించి.. కేబినెట్ బెర్త్ ఇస్తామని హామీ ఇచ్చారు. అయినా నేను పార్టీకి ద్రోహం తలపెట్టకూడదని వాటిని తిరస్కరించా. నేను కోరుకునేది కేవలం పంజాబ్ ప్రజల శ్రేయస్సు మాత్రమే. ప్రస్తుత పరిస్థితుల్లో హైకమాండ్ జోక్యం చేసుకోవాల్సిందే. అప్పటి వరకూ వేచి చూడండి'' అంటూ ట్వీట్ చేశారు. కాగా సిద్దూ తనకు కాంగ్రెస్‌తో ఉన్న అనుబంధాన్ని చూపిస్తూ ట్విటర్లో ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో సిద్ధూ కలిసి దిగిన ఫోటోలు ఉన్నాయి. చదవండి: చర్చలకు సిద్ధం: ప్రధానికి రైతు సంఘాల లేఖ Prove one meeting that I have had with another Party’s leader ?! I have never asked anyone for any post till date. All I seek is Punjab’s prosperity !! Was invited & offered Cabinet berths many times but I did not accept Now, Our Esteemed High Command has intervened, Will wait... pic.twitter.com/bUksnEKMxk — Navjot Singh Sidhu (@sherryontopp) May 22, 2021 -
వైరల్ వీడియో: చిన్నారికి పంజాబ్ ముఖ్యమంత్రి సాయం
-
సీఎంని కదిలించిన 10 ఏళ్ల బాలుడి పరిస్థితి.. వీడియో వైరల్
లుధియానా: పలకా బలపం పట్టి బడికి పోవాల్సిన చిన్నారులు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బిక్షాటన చేయడం, లేదా చిన్ని చిన్న వస్తువులను అమ్ముకుంటున్న దృశ్యాలు మనందరికీ రోజు కనిపించేవే. అలాంటి సంఘటన ఒకటి పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్‌ను కదిలించింది. వెంటనే ఆ చిన్ని తమ్ముడిని ఆదుకునేందుకు రంగంలోకి దిగిపోయారు. తక్షణమే రూ. 2 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. అంతేకాదు అధికారులతో మాట్లాడి ఆ బాలుడు తన చదువును కొనసాగించేలా చూడాలని ఆదేశించారు. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రే ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రిని కదిలించిన ఆ బాలుడి విశేషాలు : పదేళ్ల వయసున్న వన్ష్ సింగ్ అనే చిన్నారి లూధియానాలోని ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర సాక్సులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రెండ తరగతిలోనే బడి మానేసిన బాలుడు సాక్సులమ్మి కుటుంబానికి చేయూతగా నిలుస్తున్నాడు. దీన్ని గమనించిన కారులోని ఒకవ్యక్తి చిన్నారి మీద జాలితో వ్యక్తి డబ్బులివ్వడానికి ప్రయత్నించాడు. కానీ దాన్ని వన్షు తిరస్కరించాడు. దీన్ని గమనించిన మరో వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోనే సీఎం కంటపడింది. వెంటనే ఆయన బాలుడితో వీడియో ఫోన్ ద్వారా మాట్లాడారు. డిప్యూటీ కమిషనర్‌తో మాట్లాడి పాఠశాలలో చేర్పించేలా చూస్తానని, శ్రద్ధగా చదువుకోవాలని వన్షుకి హితవు పలికారు. కుటుంబ ఖర్చులను తాను చూసుకుంటానంటూ హామీ ఇచ్చారు. దీంతో అటు వన్షు ఆత్మగౌవరం, నిజాయితీ పైనా, ఇటు సీఎం ఔదార్యంపైనా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అమరేందర్ సింగ్‌ను "నిజమైన సీఎం" అంటూ ప్రశాంత్ దహిభేట్ అనే ట్విటర్ యూజర్ కొనియాడారు. అలాగే పంజాబ్‌లోని ఏ పిల్లవాడూ ఇకపై చదువుకు దూరం కాకుండా ప్రభుత్వం చూడాలని మరొకరు కామెంట్ చేయడం విశేషం. -
కోవిడ్‌తో సీనియర్ నటుడు కన్నుమూత
చండీగఢ్: ‘మహాభారతం’ సీరియల్ ఫేమ్, సీనియర్ నటుడు ఒకరు కరోనా బారిన పడి మృతి చెందారు. ప్రముఖ నటుడు సతీష్ కౌల్(66) కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వారం రోజుల క్రితం సతీష్ కౌల్‌కు కరోనా సోకింది. దాంతో ఆయన పంజాబ్ లుథియానా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. సతీష్ కౌల్ బీఆర్ చోప్రా నిర్మించిన మహాభారతం సీరియల్‌తో పాటు కర్మ, ప్రేమ్ ప్రభాత్, వారెంట్, గునాహో కా ఫైస్లా వంటి హిందీ చిత్రాల్లో నటించారు. పలు నాటక ప్రదర్శనల్లో కూడా పాల్గొన్నారు. గత కొద్ది కాలంగా సతీష్ కౌల్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయం చేయాల్సిందిగా అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. Wish iconic Punjabi actor Satish Kaul ji good health and recovery. Have released Rs 5 lakh for his medical treatment through DC Ludhiana. We stand committed to helping all those who have contributed to our state & it's culture. pic.twitter.com/RnawROE7Yg — Capt.Amarinder Singh (@capt_amarinder) January 12, 2019 ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ) 1969 బ్యాచ్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన సతీష్ కౌల్.. 1954 సెప్టెంబర్ 8న కశ్మీర్లో జన్మించారు. బాలీవుడ్ నటులు జయ బచ్చన్, షత్రుఘ్న సిన్హా, జరీనా వహాబ్, డానీ డెంజోంగ్పా, ఆశా సచ్‌దేవా, ఓం పూరి వంటి వారు ఎఫ్టీఐఐలో అతని బ్యాచ్ మేట్స్. సతీష్ కౌల్ ప్రధానంగా పంజాబీ సినిమాల్లో నటించారు. అతను 300 కి పైగా చిత్రాలలో పనిచేశారు. అందులో 85 చలన చిత్రాలలో ప్రధాన పాత్ర పోషించారు. సతీష్ కౌల్ ముఖ్యంగా మహాభారతం, విక్రమ్ ఔర్ బేతాల్ అనే టెలివిజన్ షోలలో నటించి మెప్పించారు. బీఆర్ చోప్రా నిర్మించిన మహాభారతం సీరియల్లో ఇంద్ర పాత్ర పోషించారు. చదవండి: కరీంనగర్లో అమానుషం: పగవాడికి కూడా ఈ కష్టం వద్దు -
పంజాబ్ ఉప ముఖ్యమంత్రిగా మాజీ క్రికెటర్!
న్యూఢిల్లీ : 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ అధిష్టానం కొత్త ఎత్తులు వేస్తోంది. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, మాజీ క్రికెటర్, ఆ పార్టీ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూల మధ్య ఉన్న వివాదాలను సద్దుమణిగించే దిశగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో సిద్ధూకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వజూపుతోంది. బుధవారం సిద్ధూ సీఎం అమరీందర్ సింగ్‌ను కలిసే అవకాశం ఉంది. కాగా, సిద్ధూకు ముఖ్యమంత్రికి మధ్య 2019, మే నెలలో వివాదాలు మొదలైన సంగతి తెలిసిందే. 2019 లోక్ సభ ఎన్నికల సందర్బంగా సిద్ధూ పని తీరు బాగాలేదని సీఎం వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహించిన ఆయన తన కేబినెట్ పదవికి రాజీనామా చేశారు. అప్పటినుంచి పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. గత సంవత్సరం హైదరాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ నా కెప్టెన్ రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ.. కెప్టెన్( అమరీందర్ సింగ్)కు కెప్టెన్’’ అని వ్యాఖ్యానించారు. ప్యాన్ ఇండియా సెలెబ్రిటీ అయిన సిద్ధూను కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకునే ఆలోచనలో లేనట్లు తెలుస్తోంది. 2022లో జరగబోయే ఎన్నికల్లో స్టార్ క్యాంపైనర్‌గా ఆయనను రంగంలోకి దించే ఆలోచన చేస్తోంది. చదవండి : మేము పోటీ చెయ్యం.. అభ్యర్థులకు ప్రచారం చేస్తాం -
పెళ్లిలో జోష్‌గా స్టెప్పులేసిన కశ్మీర్ మాజీ సీఎం..
చంఢీగఢ్: రాజకీయాల్లో బిజీగా ఉండే జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా తాజాగా ఓ పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ మనవరాలి వివాహం ఢిల్లీకి చెందిన బిజినెస్మెన్ ఆదిత్యానారంగ్తో జరిగింది. చండీగఢ్‌లో జరిగిన ఈ పెళ్లి వేడుకకు ఫరూఖ్ అబ్దుల్లా హాజరయ్యారు. కాగా, ఏనభై ఏళ్ళ వయస్సులోను ఫరూఖ్.. కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో కలిసి స్టేజీ పైన జోష్‌గా స్టెప్పులేశారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో అమరీందర్ సింగ్ పాడుతూంటే దానికి తగ్గట్టుగా అబ్దుల్లా స్టెప్పులు వేసి అక్కడి వారిలో మరింత జోష్‌ను నింపుతున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఈ వయస్సులో కూడా ఇంత ఉత్సాహంగా డ్యాన్స్ చేయడాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. అయితే .. వీరిద్దరు కలిసి గతంలో మహమ్మద్ రఫీ పాడిన ‘ఆజ్ కల్ తేరే మేరే ప్యార్ కె చర్చే..’, ‘గులాబీ ఆంఖే జో తెరి దేఖీ..’ అనే పాటల పైన జోష్‌గా స్టెప్పులేశారు. చదవండి: వైరల్: భర్తను కోల్పోయిన టీచర్‌కు స్టూడెంట్ ఓదార్పు -
పెళ్ళిలో ఫుల్ జోష్‌గా కశ్మీర్ మాజీ సీఎం..
-
ఒక రూపాయి జీతం.. సీఎంకు ప్రధాన సలహాదారుగా పీకే
చండీగఢ్: 2022లో పంజాబ్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడం కోసం పంజాబ్ ముఖ్యమంత్రి అమరేంద్ర సింగ్ ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించారు. అందులో భాగంగానే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. సోమవారం ప్రశాంత్ కిషోర్.. సీఎం కెప్టెన్ అమరేంద్ర సింగ్‌కు ప్రధాన సలహాదారుగా నియమితులయ్యారు. ఈ విషయాన్ని సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్ ట్విటర్లో పేర్కొన్నారు. ‘ప్రశాంత్ కిషోర్ నాకు ప్రధాన సలహాదారుగా నియమితులవడం చాలా సంతోషంగా ఉంది. పంజాబ్ ప్రజల శ్రేయస్సు కోసం తాము ఇద్దరు కలిసి పనిచేయడానికి ఎదురు చేస్తున్నా’ అని ఆయన తెలిపారు. Happy to share that @PrashantKishor has joined me as my Principal Advisor. Look forward to working together for the betterment of the people of Punjab! — Capt.Amarinder Singh (@capt_amarinder) March 1, 2021 ప్రశాంత్ కిషోర్‌ను ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు పంజాబ్ మంత్రి మండలి ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పదవి కేబినెట్ ర్యాంక్‌తో సమానం. మంత్రి మండలి విడుదల చేసిన నియామక నోటిఫికేషన్లో ఆయన ఈ పదవిలో జీతంగా రూ.1 మాత్రమే తీసుకోనున్నట్లు పేర్కొంది. ప్రభుత్వం అందించే అన్ని సౌర్యాలను ఆయన పొందుతారు. ఇక 2017లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీకీ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. రాష్ట్రంలోని మొత్తం 117 సీట్లకు గాను కాంగ్రెస్ 77 సీట్లను కైవసం చేసుకుంది. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కూడా ప్రధాన సలహాదారుగా పని చేస్తున్న విషయం తెలిసిందే. చదవండి: విద్యార్థులతో రాహుల్ గాంధీ స్టెప్పులు : వైరల్ -
ఆ పార్టీ తప్ప ఒకే మాటపై అన్ని పార్టీలు
అమృత్సర్: ఒక్క పార్టీ మినహా పంజాబ్‌లోని పార్టీలన్నీ ఒకే మాటపై నిలబడ్డాయి. రైతులకు సంకటంగా మారిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ పంజాబ్‌లోని అన్ని పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశం తీర్మానం చేసింది. అయితే ఈ సమావేశానికి బీజేపీ దూరంగా ఉంది. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని.. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. ఈ మేరకు సీఎం అమరీందర్ సింగ్ మీడియాతో మాట్లాడారు. (చదవండి: రేపు దేశవ్యాప్త నిరసనలకు పిలుపు ) అమృత్‌సర్‌లో సీఎం అమరీందర్ సింగ్ అధ్యక్షతన మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. చట్టాల రద్దుతో పాటు గణతంత్ర దినోత్సవం రోజు జరిగిన పరిణామాలపై ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ భేటిలో ఆమ్ ఆద్మీ పార్టీ అర్ధంతరంగా బయటకు వచ్చేసింది. ఢిల్లీలో పంజాబ్ పోలీసులు కూడా రక్షణ కల్పిస్తున్నారనే అంశంపై చర్చ సందర్భంగా జరిగిన సంవాదంతో ఆప్ వాకౌట్ చేసింది. ఇక గణతంత్ర రైతు పరేడ్‌లో పాల్గొన్న రైతులు అదృశ్యమయ్యారని వారి ఆచూకీ కనిపెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్, శిరోమణి అకాలీదల్, బీఎస్పీ, సీపీఐ, సీపీఐ (ఎం), ఎస్ఏడీ (ప్రజాస్వామ్యం) పార్టీలు పాల్గొన్నాయి. ఆయా పార్టీలకు చెందిన ప్రతినిధులు సమావేశంలో చర్చించి చివరకు ఓ తీర్మానం చేశారు. ఏకగ్రీవంగా వ్యవసాయ చట్టాల రద్దును డిమాండ్ చేశారు. కొత్త విద్యుత్ చట్టం, పర్యావరణ పరిరక్షణ చట్టం రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని ఆ పార్టీలు డిమాండ్ చేశాయి. మొత్తం 8 అంశాలపై తీర్మానం చేశారు. -
‘స్లీపర్ సెల్స్ ఇప్పుడు యాక్టివ్ అయ్యాయి’
చండీగఢ్: రైతు ఆందోళనల నేపథ్యంలో పాకిస్తాన్ దుశ్చర్యలకు పాల్పడే అవకాశం ఉందని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ అన్నారు. చైనాతో కలిసి దాయాది దేశం, భారత్‌లో అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని, కాబట్టి అనుక్షణం జాగ్రత్తగా ఉండాలని కేంద్రాన్ని అప్రమత్తం చేశారు. రైతు నిరసనలు మొదలైన నాటి నుంచి పాకిస్తాన్ నుంచి దేశంలోకి పెద్ద మొత్తంలో ఆయుధాలు, డబ్బు, హెరాయిన్ వంటివి డ్రోన్ల ద్వారా డెలివరీ అవుతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నదాతల ఆందోళనలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పాక్ స్లీపర్ సెల్స్ ప్రస్తుతం పూర్తిగా యాక్టివ్ అయ్యాయయని, చొరబాటుకు యత్నించే అవకాశం ఉందని అమరీందర్ పేర్కొన్నారు. (చదవండి: ఢిల్లీ పేలుడు : ఉగ్రదాడి కావచ్చు) కాగా ఎన్డీయే సర్కారు ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా.. రైతులు గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జనవరి 26న ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా పోలీసులు, రైతుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ నేపథ్యంలో అమరీందర్ సింగ్ మాట్లాడుతూ... ‘‘ఇలాంటి ఘటనల్లో తప్పెవరిది అనేది కచ్చితంగా చెప్పలేం. దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయి. నిజానికి ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచే పాక్ వైపు నుంచి డ్రోన్ డెలివరీ ఎందుకు జరుగుతోంది? డబ్బు, ఆయుధాలు, హెరాయిన్ ఎందుకు ఇక్కడకు వస్తోంది? అన్న ప్రశ్నలు నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. దాదాపు 30 డ్రోన్లను మేం గుర్తించాం. ఈ విషయాల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి కూడా తీసుకువెళ్లాను’’ అని పేర్కొన్నారు. #WATCH | "Since the farmers' struggle started, the number of weapons coming into Punjab has trebled. It is drones that are bringing it in...," says Punjab CM Captain Amarinder Singh pic.twitter.com/kECHvf93yS — ANI (@ANI) January 29, 2021 -
పంజాబ్ సర్కార్ పై బీజేపి చీఫ్ జెపి నడ్డా ఫైర్..
సాక్షి, న్యూఢిల్లీ : పంజాబ్‌లో నెలకు పైగా రైలు సర్వీసులు నిలిచిపోవడానికి పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగే కారణమంటూ బీజేపీ చీఫ్ జేపీ నడ్డా మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ, సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు మిస్టర్ సింగ్ ప్రభుత్వం మద్దతు ఇచ్చిందన్నారు. నా దృష్టి లో పంజాబ్ లో ఆందోళనకరమైన పరిస్థితి ఏర్పడానికి మీరు పూర్తిగా బాధ్యత వహిస్తారు అని బహిరంగ లేఖలో రాశారు. అమరీందర్ సింగ్ ఇంకా తన లేఖను స్వీకరించలేదని ఆయన అన్నారు. గూడ్స్ రైళ్లను నిలిపివేయడం పై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆదివారం అమరీందర్ సింగ్ జేపీ నడ్డాకు బహిరంగ లేఖ రాశారు. ఇది రాష్ట్రానికి సరఫరా తగ్గి పోవడానికి దోహద పడుతుందని రాష్ట్రంలో ఇప్పటికే బొగ్గు సరఫరా తక్కువగా వుంది. ఇది ఒక సంక్షోభానికి దారి తీస్తుంది.ఎరువులు,అవసరమైన వస్తువులు కోసం రైతులు ఆందోళన చెందుతున్నారుని లేఖలో రాశారు. దానికి బదులుగా భారత ప్రభుత్వం పంజాబ్‌లో రైళ్లు నడపడానకి చాలా ఆసక్తిగా వుంది కాని మీరు మీ ప్రభుత్వం రాష్ట్ర్రంలో ఆశించిన పాత్రను ప్రదర్శంచడం లేదని నడ్డా తిరిగి లేఖ రాశారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్ని పరిమితులను దాటి" ఆందోళనలను మిస్టర్ సింగ్ మరియు కాంగ్రెస్ బహిరంగంగా ప్రోత్సహించాయి అని అన్నారు. పంజాబ్ ప్రభుత్వం ఆందోళనకారుల పైన ఎటువంటి చర్యలు తీసుకోమని బహిరంగ ప్రకటన చేసిందని అందువల్ల ఆందోళనకారులు రోడ్డు ధర్నాలు, రైల్వే ట్రాక్‌లు పై ధర్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతులుంటే బీజేపీకి ఎంతో గౌరవంని, వారి అభివృద్ది కోసం పార్టీ, ప్రభుత్వం ఎల్లప్పడూ సానుకూలమైన చర్యలు తీసుకుంటుందని రాశారు. చైనా, పాకిస్తాన్ రెండింటి నుంచి పెరుగుతున్న దూకుడు చర్యల మధ్య సాయుధ దళాలు అవసరమైన సామాగ్రిని కోల్పోతే పరిస్థితి దేశానికి చాలా ప్రమాదకరంగా మారుతుందనిఆయన లేఖ రాశారు. ఢిల్లీలో జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో పాల్గోన్నఅమరీందర్ సింగ్ కేంద్రం ఆర్థిక దిగ్బంధనం లాంటి పరిస్థితిని సృష్టించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. -
షాకింగ్‌గా ఉంది.. ఇలా జరగాల్సింది కాదు!
కోల్‌కతా/చండీఘడ్: పశ్చిమ బెంగాల్ సచివాలయ ముట్టడికై ‘‘ఛలో నబన్నా’’ పేరుతో బీజేపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై సిక్కు సోదరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసనకారులకు, పోలీసులకు మధ్య హౌరాలో జరిగిన గురువారం నాటి ఘర్షణలో బల్వీందర్ సింగ్ అనే వ్యక్తి పట్ల అనుచితంగా ప్రవర్తించి, తమ మనోభావాలు గాయపరిచారంటూ మండిపడుతున్నారు. కాగా ఆందోళనకారులను అదుపుచేసే క్రమంలో బెంగాల్ పోలీసులు టియర్‌గ్యాస్, నీటి ఫిరంగులు ప్రయోగించి లాఠీచార్జ్ చేస్తూ వారిని చెదరగొట్టే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భాటిండాకు చెందిన బల్వీందర్ సింగ్ వద్ద తుపాకీ ఉందన్న అనుమానంతో అతడిని కిందపడేసి కొడుతూ టర్బన్ లాగిపడేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సిక్కు సమాజం నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.( చదవండి: బీజేపీ కార్యకర్తలపై దాడి.. దీదీపై నడ్డా ఫైర్) పంజాబ్ సీఎం దిగ్భ్రాంతి ఈ విషయంపై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, క్రికెటర్ హర్భజన్ సింగ్, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ తదితరులు స్పందించారు. ‘‘ఇలా జరగాల్సింది కాదు. సిక్కు వ్యక్తిని అరెస్టు చేసే క్రమంలో అతడి టర్బన్ తొలగించిన అమానుష ఘటన పట్ల ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు’’అంటూ సీఎం అమరీందర్ సింగ్ మీడియా సలహాదారు రవీన్ తుక్రాల్ శుక్రవారం ట్వీట్ చేశారు. ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలకు ఆదేశించాల్సిందిగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. అదే విధంగా.. ‘‘దయచేసి ఈ విషయంపై విచారణ జరిపించండి. అసలు ఇలా జరిగి ఉండాల్సింది కాదు’’అని హర్భజన్ సింగ్ ట్విటర్ వేదికగా బెంగాల్ ప్రభుత్వాన్ని కోరాడు. ఇక ఇదొక విద్వేషపూరిత దాడి అంటూ బాదల్ పోలీసుల తీరుపై మండిపడ్డారు. బల్వీందర్ సింగ్ సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్నాడని, అతడి వద్ద గన్ ఉందంటూ ఇలాంటి అమానుష చర్యకు దిగి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కుల మనోభావాలు దెబ్బతీశారంటూ ధ్వజమెత్తారు. సిక్కులను అవమానపరిచిన పశ్చిమ బెంగాల్ పోలీసుల తీరును ఖండిస్తున్నామని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రకటన విడుదల చేశారు. మా డ్యూటీ మేం చేశాం.. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో పశ్చిమ బెంగాల్ పోలీసులు ట్విటర్ వేదికగా శుక్రవారం తమ స్పందన తెలియజేశారు. ‘‘నిన్నటి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సదరు వ్యక్తి(బల్వీందర్ సింగ్) ఆయుధాలు కలిగి ఉన్నారు. అతడిని అడ్డుకునే క్రమంలో పగ్రీ(టర్బన్) కిందపడిందే తప్ప, ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. ఒక వర్గం మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం మాకు లేదు. మేం అన్ని మతాలను గౌరవిస్తాం. నిజానికి అరెస్టుకు ముందే టర్బన్ ధరించాల్సిందిగా సూచించాం. మా కర్తవ్యానికి కట్టుబడి, శాంతి భద్రతలు కాపాడేందుకు మా డ్యూటీ మేం చేశాం’’అంటూ బల్వీందర్ సింగ్ టర్బన్ ధరించి ఉన్న ఫొటోను షేర్ చేశారు. -
రైతులకు అన్యాయం జరగనివ్వం
పంజాబ్: కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని రాహుల్ గాంధీ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా 'ఖేతీ బచావో యాత్ర' పేరుతో పంజాబ్‌లో మూడు రోజుల పాటు ర్యాలీలు నిర్వహించనున్నారు. రైతులతో వరుస పబ్లిక్ మీటింగ్స్ ఏర్పాటు చేసి ఆ మూడు బిల్లులపై కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతను చాటాలని నిర్ణయించారు. పంజాబ్‌లోని మోగా జిల్లాలో ఏర్పాటు చేసిన సభకు హాజరై... అనంతరం అక్కడి నుంచి లూదియానా వరకు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించనున్నారు. ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయడం, కనీస మద్దతు ధర (ఎంఎస్పీ), ప్రభుత్వ ఆధ్వర్యంలో హోల్‌సేల్ మార్కెట్లు.. ఇలా రైతులకు ఉపయోగపడే విధానాలను నాశనం చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నింస్తోందని ఆయన విమర్శించారు. ఈ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ బైఠాయించిన మరుసటి రోజే రాహుల్ గాంధీ సభ ఏర్పాటు చేయడం గమనార్హం. పలు రాష్ట్రాల్లో నిరసనలు గత నెలలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్‌తో సహా పలు రాష్ట్రాల్లో తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. ఈ బిల్లుల ద్వారా కార్పొరేటు శక్తులు వ్యవసాయ రంగంలో ప్రవేశించే అవకాశం ఉందని, అందువల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నా... కేంద్ర ప్రభత్వం మాత్రం ఇవి రైతులకు ఉపయోగపడే బిల్లులని అంటున్నారు. -
ప్రశాంత్ కిషోర్‌తో మరో సీఎం ఒప్పందం!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలను ఉపయోగించుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో ఎన్నికల రంగంలోకి దిగేందుకు హస్తం పార్టీ సమయాత్తమవుతోంది. దీనిలో భాగంగానే ప్రశాంత్ కిషోర్‌ను ఎన్నికల సలహాదారుడిగా నియమించుకోవాలని ఆ పార్టీ పంజాబ్ నాయకత్వం భావిస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆయనతో మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. ఎన్నికలకు ముందే ప్రశాంత్ కిషోర్‌తో ఒప్పందం కుదుర్చోవాలని సీఎం నిర్ణయించారు. మేనిఫెస్టో తయారీ, అభ్యర్థుల ఎంపిక, పథకాల రూపల్పన వంటి అంశాలపై చర్చించాలని ప్రణాళికలు రచించారు. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలు గల పంజాబ్ శాసనసభ గడువు మరో 15 నెలల్లో ముగియనుంది. దీంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, శిరోమణీ అకలీదళ్, ఆమ్ఆద్మీ పార్టీలు ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి. దశాబ్ధాలుగా బీజేపీతో ఉన్న స్నేహనికి అకాలీదళ్ గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. దీంతో సుఖ్బీర్సింగ్ను తమవైపునకు తిప్పుకోవాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దీనిలో భాగంగానే ప్రశాంత్ సేవలను ఉపయోగించుకోవాలని అమరీందర్ సింగ్ ప్రణాళికలు రచిస్తున్నారు. కాగా గత (2017) అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రశాంత్ కృషి చేసిన విషయం తెలిసిందే. మరోసారి అలాంటి ఫలితాలనే పునరావృత్తం చేయాలనుకుంటున్న కెప్టెన్.. వ్యూహకర్తతో ఒప్పందానికి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ నేతలు చేసిన ప్రతిపాదనకు ప్రశాంత్ ఇప్పటికే సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఇరు వర్గాల నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.(ప్రశాంత్ కిషోర్‌కు పోటీగా సునీల్) గతంలో అనేక మందికి వ్యూహకర్తగా వ్యహరించి విజయాలను కట్టబెట్టిన విషయం తెలిసిందే. మరోవైపు తమిళనాడులోని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌తో జట్టు కట్టేందుకు ప్రశాంత్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్‌తో కలిసి పనిచేయనున్నారు. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీలతో ప్రశాంత్ ప్రయాణం చేసిన విషయం తెలిసిందే. ఇక 2014 సార్వత్రిక ఎన్నికల్లో నరంద్రే మోదీని అద్భుతమైన విజయాన్ని అందించి దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. -
కేజ్రీవాల్‌కు పంజాబ్ సీఎం వార్నింగ్!
చండీగఢ్ : పంజాబ్ వ్యవహారాల్లో తలదూర్చరాదని, కోవిడ్-19 వ్యాప్తిపై తమ రాష్ట్ర ప్రజల్లో అపోహలు పెంచడం మానుకోవాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ హెచ్చరించారు. కరోనా వైరస్‌తో తాము పోరాడుతున్న సమయంలో సరిహద్దు రాష్ట్రంలో సమస్యలు సృష్టించేందుకు భారత వ్యతిరేక శక్తులు చేస్తున్న కుట్రలో పావుగా మారవద్దని హితవు పలికారు. పంజాబ్‌కు సంబంధించి కేజ్రీవాల్ చేసిన ప్రకటనలు పంజాబ్ ప్రజలను తప్పుదారిపట్టించే భారీ కుట్రలో ఆప్ పాత్రపై సందేహాలు కలిగిస్తున్నాయని సింగ్ ఆరోపించారు. కోవిడ్-19పై నకిలీ వీడియోను వ్యాప్తి చేస్తూ అరెస్ట్ అయిన ఆప్ కార్యకర్తకు ఎవరెవరితో సంబంధాలున్నాయో నిగ్గుతేల్చాలని అమరీందర్ సింగ్ పంజాబ్ డీజీపీని ఆదేశించారు. గ్రామాల్లో నివసించే ప్రజల ఆక్సిజన్ స్ధాయిలను పరీక్షించాలని ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల పంజాబ్‌లో తమ పార్టీ కార్యకర్తలను కోరారు. ఇక పంజాబ్‌లో కోవిడ్-19పై తప్పుదారిపట్టించే రెచ్చగొట్టే నకిలీ వీడియోలు వ్యాప్తి చెందడం కలకలం రేగింది. వీటిలో ఒక వీడియో పాకిస్తాన్ నుంచి వ్యాప్తి చెందినట్టు పోలీసులు చెబుతున్నారు. ఆప్ కార్యకర్త ఒకరు ఈ వీడియోను పంజాబ్‌లో విస్తృతంగా వ్యాప్తి చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఓ మృతదేహంతో కూడిన ఈ నకిలీ వీడియోను వ్యాప్తి చేయడంపై ఇటీవల పట్టుబడ్డ ఆప్ కార్యకర్తను పంజాబ్ పోలీసులు ప్రశ్నిస్తున్నాయి. మరణించిన కోవిడ్-19 రోగుల అవయవాలను పంజాబ్ ఆరోగ్య శాఖ తొలగిస్తోందనే రీతిలో రూపొందిన ఈ నకిలీ వీడియో ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని అధికారులు పేర్కొన్నారు. చదవండి : ఇందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు! -
స్వీయ నిర్బంధంలోకి పంజాబ్ సీఎం
చండీఘడ్ : పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఇవాళ సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లారు. నిన్న(శుక్రవారం) నిర్వహించిన అసెంబ్లీ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలకు కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. దీంతో వైద్యుల సలహా మేరకు ముఖ్యమంత్రి నేటి నుంచి 7 రోజులపాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు మీడియా అధికారి రవీన్ తుక్రాల్ ట్వీట్ చేశారు. కాగా రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు, మంత్రులు కలిపి 29 మంది కరోనా బారిన పడ్డారని ముఖ్యమంత్రి ఇటీవల తెలిపిన విషయం తెలిసిందే. అయితే కరోనా సోకిన ఎమ్మెల్యేతో సన్నిహితంగా మెలిగిన వారు శాసనసభ సమావేశానికి హాజరు కావొద్దని ముఖ్యమంత్రి కోరారు. (23 మంది ఎమ్మెల్యేలకు కరోనా: పంజాబ్ సీఎం) శాసనసభ సజావుగా నిర్వహించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అమరీందర్ సింగ్ ఆదేశించారు. పంజాబ్ భవన్, ఎమ్మెల్యేల హాస్టల్స్ వద్ద తర్వతగతిన కరోనా పరీక్షలు నిర్వహించేదుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. అదే విధంగా అసెంబ్లీ సమావేశమైన 48 గంటల్లో నెగిటీవ్ వచ్చిన వారిని మాత్రమే హాజరుకావడానికి అనుమతించారు. కరోనా నెగటివ్ రిపోర్టు చూపించిన తర్వాతే అసెంబ్లీలో ప్రవేశించేందుకు వీలు ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు పంజాబ్‌లో 47,800 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 1,256 మంది ప్రాణాలు కోల్పోయారు. (జర్నలిస్టులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా) -
23 మంది ఎమ్మెల్యేలకు కరోనా: సీఎం
చండీఘడ్: రాష్ట్రంలో ఇప్పటివరకు 23 మంది ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తెలిపారు. మరో రెండు రోజుల్లో(ఆగష్టు 28) అసెంబ్లీ సమావేశం జరుగనున్న నేపథ్యంలో మొత్తం 117 మంది ఎమ్మెల్యేలకు కరోనా టెస్టులు నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కరోనా నెగటివ్ రిపోర్టు చూపించిన తర్వాతే అసెంబ్లీలో ప్రవేశించేందుకు వీలు ఉంటుందని స్పష్టం చేశారు.(చదవండి: జర్నలిస్టులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా) కరోనా పరిస్థితులపై ఏడుగురు ఎన్డీయేతర ముఖ్యమంత్రులతో కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అమరీందర్ సింగ్ ఈ మేరకు తమ రాష్ట్రంలోని పరిస్థితుల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో 23 మంది ప్రజాప్రతినిధులకు కరోనా సోకింది. మంత్రులు, ఎమ్మెల్యేల పరిస్థితే ఇలా ఉందంటే.. క్షేత్రస్థాయిలో పరిస్థితులో ఎంత ఘోరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు’’ అని వ్యాఖ్యానించారు.(చదవండి: పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీస్తాం : సోనియా) కోవిడ్ బారిన పడిన పంజాబ్ మంత్రులు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి- త్రిప్త్ రాజేందర్ బజ్వా(ప్రస్తుతం కోలుకున్నారు) జైళ్లు, సహకార శాఖ మంత్రి- సుఖ్జిందర్ సింగ్ రాంధ్వా రెవెన్యూ మంత్రి- గుర్ప్రీత్ కంగర్ పరిశ్రమల శాఖా మంత్రి- శ్యామ్ సుందర్ అరోరా వీరితో పాటు విధాన సభ స్పీకర్ అజైబ్ సింగ్ భాటీ, అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పర్గాత్ సింగ్, మదన్‌లాల్ జలాల్పూర్, హరిదయాళ్ కాంబోజ్‌లకు కరోనా సోకింది. రేపు సాయంత్రానికి పూర్తి వివరాలు: స్పీకర్ ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు మంజీత్ సింగ్ బిలాస్పూర్, కుల్వంత్ సింగ్ పండోరిలకు మంగళవారం కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఆప్ రెబల్ ఎమ్మెల్యే నజర్ సింగ్ మన్‌సాహియా కూడా కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. వీరితో పాటు శిరోమణి అకాలీదళ్ పార్టీకి చెందిన మన్‌ప్రీత్ సింగ్ అయాలీ, కన్వర్జిత్ సింగ్ రోజీ బర్కందీ, లఖ్బీర్ సింగ్ లోధినాంగల్, హరీందర్ పాల్ సింగ్ చందుమజ్రా, గుర్ప్రతాప్ సింగ్ వడాలాలకు కూడా కరోనా సోకినట్లు సమాచారం. ఇక ఎమ్మెల్యేల్లో ఎంత మంది ప్రస్తుతం కరోనాతో బాధ పడుతున్నారనే విషయం గురువారం వెల్లడి కానుందని స్పీకర్ రాణా కేపీ సింగ్ తెలిపారు. -
జర్నలిస్టులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా
చండీగఢ్: కరోనా విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టు కుటుంబాల సంక్షేమానికి పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారం అందజేయనున్నట్టు మంగళవారం ప్రకటించారు. అయితే, గుర్తింపు పొందిన(అక్రిడిటేటడ్) జర్నలిస్టులకు మాత్రమే ఇది వర్తిస్తుందని ఆయన తెలిపారు. కాగా, కరోనా బారినపడిన పటియాలాకు చెందిన 28 ఏళ్ల జైదీప్ అనే జర్నలిస్టు ఆదివారం మృతి చెందాడు. దైనిక్ భాస్కర్, దైనిక్ సేవా సవేరా గ్రూపులలో పనిచేసిన జైదీప్ జర్నలిస్టుగా గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలోనే సీఎం అమరీందర్ జర్నలిస్టు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించాలనే నిర్ణయించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 44,557 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. ఇప్పటివరకు 1178 మంది వైరస్ బాధితులు ప్రాణాలు విడిచారు. 29,145 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,254 యాక్టివ్ కేసులున్నాయి. (చదవండి: ‘టిక్‌టాకర్లతో పాటు మమ్మల్నీ పట్టించుకోండి’) -
ప్రభుత్వ తీరుపై స్టార్ బాక్సర్ అసంతృప్తి
న్యూఢిల్లీ: పంజాబ్ ప్రభుత్వం తనకు ఇచ్చిన హామీలు మరిచిందని టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన స్టార్ బాక్సర్ సిమ్రన్‌జిత్ కౌర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐదు నెలల క్రితం ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ హామీలు ఇవ్వగా ఏవీ నెరవేరలేదని మంగళవారం ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. టిక్‌టాక్ స్టార్లకు మాత్రం ప్రభుత్వం ప్రకటించిన వెంటనే ఆర్థికం సాయం చేసిందని ఆమె విమర్శించారు. తనకు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చాలని, ఆర్థిక కష్టాల్లో ఉన్నాని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పంజాబ్ ప్రభుత్వం ఏ విషయాలను పరిగణనలోకి తీసుకుని సాయం అందిస్తుందో తెలియడం లేదని సిమ్రన్ వాపోయారు. కాగా, సిమ్రన్‌జిత్ కౌర్ జనవరిలో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంతో మీడియా ద్వారా ఆమె ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న సీఎం అమరీందర్ సింగ్ అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. రూ. 5 లక్షల ఆర్థిక సాయం, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీనిచ్చారు. (చదవండి: కుంబ్లేతో మా పని సులువవుతుంది) -
గాంధీ కుటుంబానికి ఇద్దరు సీఎంల బాసట
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలు గాంధీ కుటుంబ నాయకత్వాన్ని సవాల్ చేసిన నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ గాంధీ కుటుంబానికి బాసటగా నిలిచారు. దేశ రాజ్యాంగ, ప్రజాస్వామిక వ్యవస్థలను కూలదోస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన ఈ సమయంలో ఇలాంటి అంశాన్ని లేవనెత్తడం తగదని అమరీందర్ సింగ్ అన్నారు. బ్రిటిష్ పాలన నుంచి దేశ స్వాతంత్ర్యం సాధించడం నుంచి గాంధీ కుటుంబం దేశ పురోగతికి తీవ్రంగా శ్రమించిందని గుర్తుచేశారు. పార్టీని ముందుండి నడిపించేందుకు గాంధీ కుటుంబ నేతలే సరైన వారని అన్నారు. దేశంలో బలమైన విపక్షం లేనందునే ఎన్డీయే అప్రతిహత విజయం సాధిస్తోందని, ఈ సమయంలో పార్టీ ప్రక్షాళనకు కొందరు నేతలు చేస్తున్న ప్రయత్నాలు పార్టీ, దేశ ప్రయోజనాలకు విఘాతమని సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ ప్రస్తుతం సరిహద్దుల వెలుపల కాకుండా అంతర్గతంగానూ పలు సవాళ్లు ఎదుర్కొంటోందని అన్నారు. దేశ సమాఖ్య వ్యవస్ధకు ముప్పు నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏకతాటిపై నిలిచిన కాంగ్రెస్ ఒక్కటే దేశాన్ని,ప్రజలను కాపాడగలదని చెప్పారు. మరోవైపు సోనియా గాంధీ నాయకత్వానికి మద్దతు తెలుపుతూ చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భాగేల్ సైతం రాహుల్ గాంధీకి లేఖ రాశారు. పార్టీలో ఎలాంటి సవాల్ ఎదురైనా సోనియా, రాహుల్ చొరవ చూపి పరిష్కరించేవారని, మేమంతా మీతో ఉన్నామని లేఖలో సీఎం పేర్కొన్నారు. ఇక పార్టీలో నాయకత్వ మార్పు చేపట్టాలని కోరుతూ 23 మంది సీనియర్ నేతలు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాయడం కలకలం రేపింది. పార్టీలో నాయకత్వ మార్పును కోరుతూ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆదివారం పార్టీ అధ్యక్ష పదవి నుంచి సోనియా వైదొలిగినట్లు తెలుస్తోంది. అయితే సోమవారం జరుగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆమె రాజీనామాను అధికారికంగా ప్రకటిస్తారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరి రాహుల్‌కు మళ్లీ పార్టీ పగ్గాలు అప్పగిస్తారా లేక కొత్త నేత వైపు మొగ్గుచూపుతారా అనేది ఆసక్తికరంగా మారింది. చదవండి : కాంగ్రెస్ ప్రక్షాళనకు సీనియర్ల డిమాండ్ -
పంజాబ్: కొత్త లాక్డౌన్ నిబంధనలు
ఛండీఘర్: కరోనా మహమ్మరి కట్టడికి పంజాబ్ ప్రభుత్వం మరోసారి కఠిన చర్యలు తీసుకుంది. రాత్రి 7 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. దీనిని ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. కేవలం పెళ్లిలకు, అంత్యక్రియలకు మాత్రమే ఎక్కువ మంది జనం పాల్గొనన్నడానికి అనుమతినిచ్చింది. ఆగస్టు 31 వరకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి. ఈలోపు రాజకీయపార్టీలకు కూడా ర్యాలీలు, పార్టీ మీటింగ్‌లు నిర్వహించడానికి అనుమతినివ్వద్దని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు కూడా ఉద్యోగుల సంఖ్యను సగానికి తగ్గించాలని కోరారు. రవాణా వాహనాలు కూడా ప్రయాణీకుల పరిమితిని 50 శాతానికి తగ్గించుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో 36000 కరోనా కేసులు నమోదు కాగా, ఈ మహమ్మారి బారిన పడి 900 మంది ప్రాణాలు కోల్పోయారు. వారందరి మృతి పట్ల సీఎం విచారణ వ్యక్తం చేశారు. గురువారం నుంచి కర్ఫ్యూ అమలులోకి వస్తుందని సీఎం తెలిపారు. చదవండి: ఎన్నికలకు ముందు బిహార్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ -
నిరుద్యోగులకు శుభవార్త
చండీగఢ్ : రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ వరాల జల్లు ప్రకటించారు. 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో సీఎం మాట్లాడుతూ.. నిరుద్యోగులకు 6లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వీటిలో ప్రభత్వ రంగంలో లక్ష ఉద్యోగాలు, ప్రయివేట్ రంగంలో 5లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం ఘర్ ఘర్ రోజ్గర్ పథకం ద్వారా 13లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కల్పించిందని, భూమి లేని రైతులు, కూలీలకు రూ.520కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. త్వరలోనే కౌలు రైతుల కోసం తమ ప్రభుత్వం కొత్త చట్టాన్ని ప్రవేశ పెడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే మౌలిక సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు జాతీయ రహదారుల కల్పనకు రాబోయే రెండేళ్లలో రూ.12,000కోట్లు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఆరోగ్య కార్యకర్తలు ధైర్యంతో సేవలందిస్తున్నారని అమరీందర్ సింగ్ కొనియాడారు. చదవండి: విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ఫోన్లు -
విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ఫోన్లు
చండీగఢ్ : రాష్ర్టంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 12వ తరగతి విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అందించాలని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ నిర్ణయించారు. రేపు (ఆగస్టు 12) యువత దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తామని వెల్లడించారు. కరోనా కారణంగా విద్యార్థులకు ఆన్లైన్లోనే పాఠాలు నిర్వహిస్తున్నందున, పేద విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. రాష్ర్టంలోని వివిధ పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో విద్యార్థులకు పోన్లను పంపిణీ చేస్తామన్నారు. ఈ పథకం విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుందని సీఎం అన్నారు.గతంలోనే రాష్ర్టంలోని యువతకు ఉచితంగా స్మార్ట్ఫోన్లను ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా సంక్షోభంలో సీఎం అమరీందర్ సింగ్ పథకాన్ని ప్రారంభించనున్నారు. మొదటిదశలో సుమారు 1.75 లక్షల ఫోన్లను ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. (ప్రణబ్‌కు బ్రెయిన్ సర్జరీ) -
‘గురుద్వార్‌ను మసీదుగా మార్చడాన్ని ఖండిస్తున్నాం’
చండీగఢ్ : లాహోర్‌లోని చారిత్రాత్మక గురుద్వార్‌ను మసీదుగా మార్చడానికి పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మంగళవారం ఖండించారు. ఈ అంశంపై భారత్ ఇప్పటికే పాకిస్థాన్‌పై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై పంజాబ్ సీఎం స్పందిస్తూ..సిక్కుల సమస్యలను పొరుగు దేశానికి తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ‘లాహోర్‌లోని పవిత్ర గురుద్వార్ శ్రీ షాహిది అస్తాన్‌ను మసీదుగా మార్చడానికి చేసిన ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సిక్కుల గౌరవ ప్రదేశాలను కాపాడటానికి పంజాబ్ ఆందోళనలను పాకిస్తాన్‌కు బలంగా తెలియజేయాలని విదేశాంగ మంత్రి జైశంకర్‌ను కోరుతున్నాం’ అని సింగ్ ట్వీట్ చేశారు. (పంజాబ్‌లో పెన్షన్ స్కామ్ కలకలం) కాగా గురుద్వార్ షాహిది అస్తాన్ 1745లో భాయ్ తరు సింగ్ ప్రాణాంతకంగా గాయపడిన ప్రదేశంలో నిర్మించిన చారిత్రక మందిరం. గురుద్వార్ సిక్కులకు పవిత్ర పుణ్యక్షేత్రం. లాహోర్‌లోని గురుద్వార్‌ను మసీదుగా మారుస్తున్నట్లు వచ్చిన వార్తలపై పాకిస్తాన్ హైకమిషన్‌కు భారత్ సోమవారం తీవ్ర నిరసన తెలిపింది. ఈ సంఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని, ఈ విషయంపై దర్యాప్తు జరిపి తక్షణ పరిష్కార చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్‌కు పిలుపునిచ్చినట్లు ఎంఈఎం ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. పాకిస్తాన్లో మైనారిటీ సిక్కు సమాజానికి న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు. (కరోనా కల్లోలం: భారత్‌లో కొత్తగా 47,704 కేసులు) -
పంజాబ్‌లో లాక్డౌన్ ఆంక్షలు మరింత కఠినం
చండీగఢ్: కరోనా కట్టడికి మరింత కఠినంగా ఆంక్షలను విధిస్తూ సోమవారం పంజాబ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బహిరంగ సభలన్నింటినీ నిషేధించిన రాష్ర్టం.. వివాహాలు, ఇతర సామాజిక కార్యక్రమాలకు సంబంధించి పరిమితులు విధించింది. ఎవరైనా ఆంక్షలను ఉల్లంఘిస్తే తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. బహిరంగ సమావేశాల్లో ఐదుగురికి మించి ఉండరాదని, వివాహాల్లో అతిధుల సంఖ్యను 50కి బదులుగా 30కి తగ్గిస్తూ ప్రకటన విడుదల చేసింది. (కరోనా: అవి వాడాకా ఒక్కరు కూడా చనిపోలేదు ) వివాహ వేడుకలకు 50, అంత్యక్రియలకు 20 మందికి మించరాదని కేంద్రం మే నెలలోనే స్పష్టంచేసింది. పలు రాష్ర్టాలు సైతం దీన్నే అవలంభిస్తున్నాయి. అయితే తాజాగా కరోనా కేసులు అధికమవుతున్నందున ఆంక్షలను మరింత కఠినం చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. దేశంలోనే అత్యధిక కరోనా ప్రభావిత రాష్ర్టాలైన మహారాష్ర్ట, ఢిల్లీ, తమిళనాడు జాబితాల్లోకి పంజాబ్ వెళ్లాలనుకోవడం లేదని అందుకే ఆంక్షలు మరింత కఠినం చేస్తున్నట్లు సీఎం అమరీందర్ సింగ్ ప్రకటించారు. రాష్ర్ట వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లోనే 234 కొత్త కరోనా కేసులు నిర్దారణ కాగా నలుగురు మరణించారు. ఇప్పటివరకు 7,821 కరోనా కేసులు నమోదు కాగా 5,392మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో పంజాబ్‌లో ప్రస్తుతం 2,230 యాక్టివ్ కేసులే ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. (అంత్యక్రియలకు హాజరైన 20 మందికి కరోనా) Mandatory FIRs shall be filed against those found violating the curb on public gatherings, which now stand strictly disallowed: Punjab Chief Minister's Office (CMO). #COVID19 https://t.co/st1RPLmgPe — ANI (@ANI) July 13, 2020 -
చైనాకు హెచ్చరికలు జారీ చేయండి : సీఎం
చండీగఢ్ : ముగ్గురు జవాన్ల మృతదేహాలకు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ నివాళులు అర్పించారు. గాల్వాన్‌లో చైనా, భారత జవాన్లకు మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లేహ్ నుంచి చండీగఢ్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చెరుకున్న ముగ్గురు ఆర్మీ జవాన్ల మృతదేహాలకు అమరీందర్‌సింగ్ శుక్రవారం నివాళులు అర్పించారు. (మణిపూర్‌లో బీజేపీ పడిపోతుందా లేదా!?) భారత భూభాగాన్ని వెంటనే ఖాళీ చేసి వెళ్లకపోతే, ధీటుగా ప్రతి దాడి చేస్తామని చైనాకు హెచ్చరికలు జారీ చేయాలని కేంద్ర ప్రభాత్వాన్ని అమరీందర్ సింగ్ కోరారు. దీని వల్ల ఎలాంటి పర్యావసనాలు ఎదురైనా, అవి శాశ్వతంగా ఉండవన్నారు. 60 ఏళ్ల దౌత్యం విఫలమయిందని, 20 మంది జవాన్లను దారుణంగా దాడిచేసి హతమార్చారని పేర్కొన్నారు. 60 ఏళ్ల దౌత్యం పనిచేయలేదు, చైనా అగ్రదేశం అయితే, భారత్ కూడా అందుకు సమానమే అని పేర్కొన్నారు. ఇప్పుడు కాదు 1962 నుంచి చైనా ఆక్రమణలు చేస్తూనే ఉన్నారని అమరీందర్ తెలిపారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ 1963-1966 మధ్య ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. (ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రకు ప్లాస్మా థెరఫీ) -
ఒక్క జవాను మృతికి ఐదుగురిపై ప్రతీకారం
చంఢీగఢ్ : గాల్వన్ లోయలో భారత్-చైనా మధ్య చోటుచేసుకున్న ఘర్ణణలో భారత జవాన్ల మృతిపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. చైనా దొంగదెబ్బకు ప్రతీకారం తీసుకోవాల్సిందేనని ప్రజలంతా ముక్తకంఠంతో నినదిస్తున్నారు. డ్రాగన్ ఉద్దేశపూర్వకంగానే భారత జవాన్లపైకి దాడికి పాల్పడిందని, ఎలాంటి ప్రణాళికలు లేకుండా ఘర్షణకు దిగే ప్రయత్నం చేసేవీలులేదని మాజీ సైనికులు తమ అనుభవాలను పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులపై సైన్యంలో పనిచేసిన అనుభవమున్న పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ స్పందించారు. శుక్రవారం ఉదయంం ఓ జాతీయ మీడియాతో సీఎం మాట్లాడుతూ.. భారత్-చైనా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఆయుధాలు లేకుండా భారత సైనికులను సరిహద్దుకు ఎందుకు పంపారని ప్రశ్నించారు. దీనికి సమాధానం ఎవరు చెప్పాలో కేంద్రమే నిర్ణయించుకోవాలని అన్నారు. (చైనా కాఠిన్యం: భారత జవాన్లపై కర్కశం) భారత సైనికుల మృతికి చైనాపై తప్పనిసరిగా ప్రతీకారం తీసుకోవాల్సిందేనని, వారు ఒక్కళ్లు చంపితే మనం ఐదుగురిని చంపాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశారు. పుల్వామా, బాలాకోట్ ఉగ్రదాడులకు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందించిందో.. చైనా దుస్సాహాసాన్ని కూడా అదే రీతితో తిప్పికొట్టాలని అమరిందర్ సింగ్ స్పష్టం చేశారు. అయితే చైనాతో యుద్ధమంటే పాకిస్తాన్‌తో పోరాడినంత సులువు కాదని, చైనా ఆర్మీ ప్రత్యర్థిపై అత్యంత కాఠిన్యంగా వ్యవహరిస్తుందని తన అనుభవాలను పంచుకున్నారు. తాను సైన్యంలో చేరిన తొలినాళ్లలో చైనా సరిహద్దులో విధులు నిర్వర్తించానని, వారి ఆగడాలను ఎదుర్కొవడం అంత సమాన్యమైన విషయం కాదని గుర్తుచేసుకున్నారు. ఇప్పటికైనా కేంద్రం ప్రభుత్వం మేలుకోని పాకిస్తాన్, చైనా, నేపాల్ సరిహద్దుల్లో గస్తీకాస్తున్న జవాన్లకు అత్యాధునికమైన ఆయుధాలను అందించాలని కోరారు. (భారత్‌ను దెబ్బతీసేందుకు త్రిముఖ వ్యూహం) కాగా ఈనెల 16వ తేదీని ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో భారత్‌కు చెందిన 20 మంది చైనాకు చెందిన మరికొంత జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజా ఘటన నేపథ్యంలో భారత్-చైనా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పేందుకు ఇరు పక్షాల జరనల్ స్థాయి అధికారులు చర్చలు జరుపుతున్నారు. -
మరింత కఠినంగా లాక్డౌన్ అమలు!
చండీగఢ్: మహమ్మారి కరోనా విజృంభణ నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వారాంతాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో లాక్డౌన్ నిబంధనలు మరింత కఠినతరంగా అమలు చేయాలని గురువారం ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ రోజుల్లో పరిశ్రమలు తెరిచేందుకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. కాగా గురువారం నాటికి పంజాబ్‌లో 2887 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ చర్యలపై సమీక్ష నిర్వహించిన సీఎం అమరీందర్ సింగ్.. సామాజిక వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వైద్య, పారిశుద్ద్య, ఇతర అత్యవసర సేవా విభాగాల సిబ్బంది తప్ప ఇతరులెవరైనా తప్పనిసరి ప్రయాణాలకు కరోనా వైరస్ అలర్ట్ యాప్ నుంచి ఇ-పాసులు డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. (‘వారిని పశువుల కన్నా హీనంగా చూస్తున్నారు’) అదే విధంగా పెద్ద సంఖ్యలో పౌరులు ఒక్కచోట చేరకుండా తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ దిన్కర్ గుప్తాను సీఎం అమరీందర్ సింగ్ ఆదేశించారు. ఇప్పటి వరకు కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి రానందున స్వీయ నియంత్రణ చర్యలు తీసుకుంటూ మహమ్మారితో పోరాడాలని.. ఇందుకోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యంగా ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో కొంతమంది బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారన్న విషయం తన దృష్టికి వచ్చిందన్న సీఎం.. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. వారంతా తప్పనిసరిగా పరీక్షలు చేయించుకుని.. హోం క్వారంటైన్లో ఉండాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా అధిక బిల్లు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల తీరును ఉపేక్షించబోమని.. ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న బెడ్ల వివరాలు పబ్లిక్ డొమైన్లో పొందుపరిచేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.(‘రీలాక్ ఢిల్లీ’ వార్తలపై స్పందించిన సత్యేంద్ర జైన్) -
‘ఇది 1962 కాలం కాదు’
చండీగఢ్: భారత్–చైనా సరిహద్దుల మధ్య వివాదాలు ముదురుతున్న వేళ పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ దీనిపై స్పందించారు. ఇది 1962 కాలం కాదని.. చైనా ఇప్పుడు మనల్ని తేలీకగా తీసుకోకూడదని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘కేంద్రం చైనాతో సరిహద్దు వివాదాన్ని దౌత్య ప్రయత్నాల ద్వారా పరిష్కరించలేకపోతే.. ఉక్కు పిడికిలితో సమాధానం చెప్పాలి. భారత్, చైనా వంటి సార్వభౌమ దేశాలు సమస్యకు దౌత్యపరమైన పరిష్కారం కనుగొనాలి. భారతదేశం యుద్ధాన్ని కోరుకోదు. కాని చైనా బెదిరింపులను మేము అంగీకరించము. మాకు శాంతి కావాలి. అలానే చైనీయులు భారత భూభాగం నుంచి వెనక్కు వెళ్లాలి. చైనీయుల దూకుడుకు మనం భయపడకూడదు. వారిని ధైర్యంగా ఎదుర్కొవాలి’ అన్నారు. (బాయ్‌కాట్ చైనా) అలానే చైనా తాను ఆక్రమించిన భారత భూభాగాన్ని వదిలి వెళ్లాలని.. దానిపై చైనాకు ఎలాంటి హక్కు లేదని ఆయన తెలిపారు. ప్రస్తుతం భారత సాయుధ బలగాలు.. 1962 కంటే బలంగా, మరింత ఆధునికీకరించబడ్డాయని అన్నారు. ఇప్పుడు చైనా భారత్‌ను తేలికగా తీసుకోకూడదని అమరీందర్ హెచ్చరించారు. -
ఇకపై మద్యం హోం డెలివరీ..ఇవిగో టైమింగ్స్
ఛండీగర్ : కేంద్రం ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో అనేక రాష్ర్టాల్లో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. సామాజిక దూరం పాటించాలన్న నిబందనలు గాలికొదిలేసి మద్యం ప్రియులు అత్యుత్సాహం చూపిస్తున్న ఘటనలు అనేకం. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని నివారించే చర్యల్లో భాగంగా పంజాబ్ ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని నిబంధనల మధ్య మద్యం విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే హామ్ డెలివరీకి అనుమతినిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు మాత్రమే మద్యం విక్రయాలు జరపాలి. అదే విధంగా మధ్యాహ్నం 1 నుంచి 6 గంటల వరకు డోర్ డెలివరీకి అనుమతిస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రకటించారు. (మద్యంబాబులకు షాక్.. షాప్స్ క్లోజ్ ) నిబంధనలు పాటించకపోతే మద్యం షాపుల లైసెన్సులను రద్దు చేస్తామని తెలిపారు. చాలా ప్రాంతాల్లో అధిక రద్దీ కారణంగా, సామాజిక దూరం పాటించడం లేదని దీని ద్వారా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున లిక్కర్ డోర్ డెలివరీకి అనుమతిస్తున్నమని వివరించారు. ఇక ఛత్తీస్‌ఘడ్‌లోనూ గ్రీన్జోన్లలో ఆన్లైన్ ద్వారా మద్యం పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఛత్తీస్గడ్ స్టేట్ మార్కెటింగ్ కార్పోరేషన్ లిమిటెడ్ (సీఎస్ఎంసీఎల్ ) అనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వొచ్చు. (మద్యం డోర్ డెలివరీ : అందుబాటులో యాప్ ) -
పంజాబ్‌లో లాక్డౌన్ పొడిగింపు
చండీగఢ్/కోల్‌కతా: మే 3 తర్వాత లాక్ డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్లు పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ బుధవారం ప్రకటించారు. ఇందులో కొంత మేర సడలింపులు ఉన్నప్పటికీ, రెడ్ జోన్లలో సడలింపులు ఉండబోవన్నారు. మే 17 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన తమ వారిని వెనక్కు తీసుకొస్తామని, అయితే వారు 21 రోజుల లాక్ డౌన్ లో ఉండాల్సిందేనని చెప్పారు. కరోనాను అదుపులో ఉంచేందుకు మే చివరి వరకూ లాక్ డౌన్ విధించక తప్పదని, ఈ విషయాన్ని పలువురు నిపుణులు, వైద్యులు చెబుతున్నారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. -
సింగ్ కోలుకున్నారు.. చాలా హ్యాపీ
చండీగఢ్: కరోనా మహమ్మారిపై పోరులో ముందుండి పోరాడిన సాహస సబ్ఇన్స్పెక్టర్ హర్జీత్ సింగ్ పూర్తిగా కోలుకున్నారని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ వెల్లడించారు. హర్జీత్ సింగ్ చేయి మునుపటిలా పనిచేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. లాక్డౌన్ సమయంలో పటియాలా జిల్లా సనౌర్ పట్టణంలో ఏప్రిల్ 12న నిహంగ్(సిక్కుల్లోని ఓ వర్గం)లు హర్జీత్ సింగ్ చేతిని కత్తితో నరికారు. ఆయనను వెంటనే పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(పీజీఐఎంఈఆర్)కు తరలించగా వైద్య బృందం హర్జీత్ సింగ్ తెగిపోయిన చేతిని ఏడున్నర గంటలపాటు సర్జరీ చేసి విజయవంతంగా అతికించింది. (కరోనా వైరస్.. మరో దుర్వార్త) ‘రెండు వారాలుగా పీజీఐఎంఈఆర్‌లో చికిత్స పొందుతున్న హర్జీత్ సింగ్ కోలుకున్నారు. వైద్యులు ఎంతో శ్రమించి ఆయన చేతిని తిరిగి అతికించారు. జీఐఎంఈఆర్ వైద్యులు, సిబ్బందికి ధన్యవాదాలు. హర్జీత్ సింగ్ ఇప్పుడు చేయిని మళ్లీ కదలించగలుతున్నార’ని సీఎం అమరీందర్ సింగ్ ట్విటర్లో పేర్కొన్నారు. హర్జీత్ సింగ్ వీడియోను కూడా ట్విటర్లో షేర్ చేశారు. కాగా, తాజా సమాచారం ప్రకారం పంజాబ్‌లో ఇప్పటివరకు 313 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 18 మంది మృత్యువాత పడ్డారు. 71 మంది కోవిడ్ బారి నుంచి కోలుకున్నారు. (లాక్డౌన్ సడలింపా.. అదేం లేదు: సీఎం) Sharing latest video of braveheart frontline #Coronawarrior, Sub-Inspector Harjeet Singh whose hand was amputated at Patiala Mandi two weeks ago. All thanks to dedication and hardwork of PGI staff, Harjeet's hand has started regaining movements, watch here. #PunjabFightsCorona pic.twitter.com/duM2qCp5fB — CMO Punjab (@CMOPb) April 27, 2020 -
లవ్లీ ప్రొఫెషన్ల్ యునివర్సిటీకి నోటీసులు
చండీగఢ్ : లాక్డౌన్ నిబంధనలను ఉల్లఘింనందుకు పంజాబ్‌లోని లవ్లీ ఫ్రొఫెషనల్ యునివర్సటీ యాజమాన్యానికి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ శనివారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అత్యవసర సేవలు మినహా మిగతావన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదని కేంద్ర, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఇందుకు పంజాబ్ ప్రభుత్వం మార్చి 13నుంచే రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యా సంస్థలును మూసివేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలవుతున్న వేళ పగ్వారాలోని కపుర్తలా జిల్లాలో ఉన్న లవ్లీ ప్రొఫెషన్ల్ యునివర్సిటీ నిబంధనలను బేఖాతరు చేసింది. దాదాపు 3వేల మందిని( విద్యార్థులు, ఫ్యాకల్టీతో కలిపి) క్యాంపస్ అనుబంధ హాస్టల్లో ఉండేదుకు యునివర్సిటీ యాజమాన్యం అనుమతులు ఇచ్చింది. తాజాగా ఏప్రిల్ 12న యునివర్సిటీలో ఉంటున్న విద్యార్థికి కరోనా పాజిటివ్ రావడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు ఉల్లఘించిన సదరు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వెంటనే రంగంలోకి దిగిన ఉన్నత విద్యాశాఖ అధికారులు ఎల్పీయూ యాజమన్యం తీరును తప్పుబడుతూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. (డ్రగ్స్ కేసులో పంజాబ్ సింగర్ అరెస్ట్) కరోనా విస్తరిస్తున్న వేళ ఇలా వేలమందిని ఒక దగ్గరే ఉంచి వారిని ప్రమాదంలోకి నెట్టేస్తారా అంటూ మండిపడింది. ఇంత ఆపత్కాల సమయంలో నిర్లక్ష్యం, బాధ్యతారహితంగా ఉంటారా అంటూ చివాట్లు పెట్టింది. ఎల్పీయూ యాజమాన్యానికి ఏడు రోజుల గడువును నిర్ధేశించిన అధికారులు సమయంలోగా అన్ని వివరాలు తెలపాలని ఆదేశించింది. వేల మందిని హాస్టల్లో ఉంచడానికి అనుమతులు ఎవరు ఇచ్చారని, ఎన్వోసీ చూపించాలని షోకాజ్ నోటీసులో పేర్కొంది. అంతకుముందు ఎమ్మెల్యే రాణా గురుజిత్ సింగ్ ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ద్రుష్టికి తీసుకెళ్లారు. దీంతో అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందు జాగ్రత్తగా వారందరికి కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాయి. ఇప్పటివరకు పంజాబ్ రాష్ట్రంలో 200కు పైగా కరోనా పాజిటివ్ కేసులు రాగా, మృతుల సంఖ్య 13గా ఉంది. తాజా ఉదంతంతో పంజాబ్ రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో చూడాలి. -
డ్రగ్స్ కేసులో పంజాబ్ సింగర్ అరెస్ట్
చండీగడ్ : అనారోగ్యం కారణంగా హాస్పటిల్‌లో చేరగా, పరీక్షలు నిర్వహిస్తే అతను మోతాదుకు మించి డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. పంజాబీ గాయకుడు గురీందర్ పాల్ సింగ్ అలియాస్ బడ్డా గ్రెవాల్ 30 గ్రాముల ఓపియమ్(నల్లమందు) తీసుకోవడంతో.. అనారోగ్యం కారణంగా సొహానాలోని ఎస్‌జీహెచ్‌ఎస్ ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు ఇచ్చిన సమాచారం మేరకు సోహనా పోలీసులు శుక్రవారం గురీందర్‌ను అరెస్ట్ చేశారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ (ఎన్పిడిఎస్) చట్టంలోని 27, 18 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని సబ్ ఇన్స్పెక్టర్ హర్జిందర్ సింగ్ తెలిపారు. మరోవైపు పంజాబ్‌లో యువత మాదకద్రవ్యాలు ఎక్కువగా వాడుతున్నట్లు ఇప్పటికే బహిర్గతమైంది. దీనిపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కూడా ప్రధాని మోదీకి గతంలో లేఖ రాశారు. ఈ సమస్యను పరిష్కరించడానికి హోంశాఖ, ఆరోగ్య, న్యాయ శాఖలతో చర్చించి మరింత కట్టుదిట్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా కోరారు. -
పోలీసులపై షాకింగ్ అటాక్!
-
లాక్డౌన్: పోలీసులపై షాకింగ్ అటాక్!
చంఢీగర్: కరోనా లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేస్తున్న క్రమంలో పంజాబ్‌లో పోలీసులపై దాడి జరిగింది. కారులో వచ్చిన ఓ వర్గానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బారికేడ్లను ఢీకొట్టి ముందుకు కదిలారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని ప్రశ్నించడంతో కోపోద్రిక్తుడైన ఓ వ్యక్తి ఏఎస్ఐ హర్జీత్ సింగ్‌పై తల్వార్‌తో దాడి చేశాడు. దీంతో అతని చేయి తెగిపడింది. మరో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటన పటియాల జిల్లాలోని ఓ కూరగాయల మార్కెట్ వద్ద ఆదివారం ఉదయం ఆరు గంటలకు చోటుచేసుకుంది. ఘటనలో ప్రమేయం ఉన్న ముగ్గురిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించామని, మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు ఉన్నతాధికారులు తెలిపారు. (చదవండి: లాక్డౌన్ బేఖాతరు: విదేశీయులకు శిక్ష) తీవ్రంగా గాయపడిన హర్జీత్ సింగ్‌ను చంఢీగర్‌లోని పీజీఐ ఆస్పత్రికి తరలించామని పంజాబ్ డీజీపీ దినకర్ గుప్తా తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కాగా, కోవిడ్-19 నియంత్రణకు మే 1 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ శుక్రవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా, దేశంలో లాక్డౌన్ పొడిగించిన రెండో రాష్ట్రంగా పంజాబ్ నిలిచింది. దీనికన్నా ముందు ఒడిశా ప్రభుత్వం ఏప్రిల్ నెలాఖరు వరకు లాక్డౌన్ పొడిగించింది. ఇక పంజాబ్ 151 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. 11 మంది మరణించారు. ఐదుగురు కోలుకున్నారు. (చదవండి: లాక్డౌన్: పంజాబ్ సంచలన నిర్ణయం) -
మే 1 వరకూ లాక్డౌన్ పొడిగింపు
చండీగఢ్: కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే లాక్‌డౌన్‌ను మించిన మార్గం లేదని పంజాబ్ ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మే 1 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. అయితే ప్రస్తుతం పంట చేతికచ్చే సమయం కాబట్టి రబీ రైతులకు పంట కోతకు అనుమతిస్తామని తెలిపింది. శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేబినెట్ మంత్రులతో లాక్డౌన్ కొనసాగింపుపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైరస్ వ్యాప్తి గురించి నిపుణులు అంచనాలు భయంకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. (మాస్క్ ధరించకుంటే రూ. 200 ఫైన్) పీజీఐఎమ్ఈఆర్ అధ్యయనం ప్రకారం ఇప్పుడు కరోనా వైరస్‌ను నివారించలేకపోతే.. సెప్టెంబర్ నాటికి దేశంలో 58 శాతం జనాభా దీని బారిన పడుతుందని, అంటే రాష్ట్రంలోని సుమారు 87 శాతం మందికి ఇది సోకుతుందని పేర్కొన్నారు. కనుక ఇప్పుడే దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధపడిందని అమరీందర్ సింగ్ తెలిపారు. ప్రభుత్వ సంచలన నిర్ణయంతో దేశంలో లాక్డౌన్ పొడిగించిన రెండో రాష్ట్రంగా పంజాబ్ నిలిచింది. దీనికన్నా ముందు ఒడిశా ప్రభుత్వం ఏప్రిల్ నెలాఖరు వరకు లాక్డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు సైతం ఇదే బాటలో నడిచే అవకాశం లేకపోలేదు. కాగా పంజాబ్‌లో ఇప్పటివరకు 132 కరోనా కేసులు నమోదవగా ఇందులో 11 మంది మృతి చెందారు. (లాక్డౌన్: ఒడిశా కీలక నిర్ణయం) -
90 వేల మంది ఎన్నారైలు..పలువురికి కరోనా లక్షణాలు
చండీగఢ్ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్(కోవిడ్-19) విజృంభణ నేపథ్యంలో దాదాపు 90 వేల మంది ఎన్నారైలు రాష్ట్రానికి వచ్చారని పంజాబ్ ప్రభుత్వం వెల్లడించింది. కరోనా వ్యాప్తిని కట్టడి చేసే చర్యల్లో భాగంగా రాష్ట్రానికి రూ.150 కోట్ల నిధులు కేటాయించాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి బల్బీర్ సింగ్ సిధు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌కు లేఖ రాశారు. ‘‘దేశ వ్యాప్తంగా అత్యధిక మంది ఎన్నారైలు పంజాబ్‌కు చెందినవారే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేవలం 90,000 మంది మాత్రమే ఈ నెలలో రాష్టానికి వచ్చారు. వారిలో చాలా మందిలో కోవిడ్-19 లక్షణాలు బయటపడ్డాయి. రోజురోజుకీ వారి సంఖ్య పెరుగుతోంది. కావున వారందరి భద్రత దృష్ట్యా.. పారిశుద్ధ్యం, వైద్య పరంగా సన్నద్ధమయ్యేందుకు రూ. 150 కోట్ల నిధులు కేటాయించగలరు’’అని లేఖలో విజ్ఞప్తి చేశారు. కాగా పంజాబ్‌లో ఇప్పటివరకు 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఒక మరణం సంభవించింది. (కరోనాను అడ్డుకునే సామర్థ్యం భారత్ సొంతం) ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి 31 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిబంధనలను ఉల్లంఘించిన 48 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదే విధంగా హోం క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని చట్టపరంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమం దృష్ట్యా ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కాగా భారత్‌లో కరోనా ప్రభావం తీవ్రతరమవుతున్న విషయం తెలిసిందే. సోమవారం నాటికి కరోనా బాధితుల సంఖ్య 468కు చేరుకుంది. దేశ వ్యాప్తంగా తొమ్మిది మరణాలు సంభవించాయి. -
మేరీకోమ్ బాధ్యతారాహిత్యం!
న్యూఢిల్లీ: ఆమె ఒలింపిక్ పతక విజేత, ఆరుసార్లు ప్రపంచ చాంపియన్, జాతీయ రెండో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ గ్రహీత కావడంతో పాటు పార్లమెంట్ సభ్యురాలు కూడా. కానీ కరోనాతో దేశం అల్లకల్లోలమవుతున్న వేళ తన బాధ్యత మరచింది. విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత కనీసం 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలనే నిబంధనను ఉల్లంఘించింది. ఇదంతా భారత మహిళా బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ గురించే. జోర్డాన్‌లో ఈ నెల 3 నుంచి 11 వరకు జరిగిన ఆసియా క్వాలిఫయింగ్ బాక్సింగ్ టోర్నీలో ఆమె పాల్గొంది. ఆ టోర్నీ నుంచి తిరిగి వచ్చిన భారత బాక్సర్లంతా రెండు వారాల పాటు బయటకు వెళ్లకుండా స్వీయ నిర్బంధంలో ఉండాలని బాక్సింగ్ సమాఖ్య ముందే చెప్పింది. దీనిని జట్టు సభ్యులంతా కచ్చితంగా పాటించాలని కోచ్ శాంటియాగో నీవా కూడా బాక్సర్లకు ముందే స్పష్టం చేసి దానికి తగినట్లుగా వారు ఇంట్లో చేసుకునేందుకు ఫిట్నెస్ షెడ్యూల్‌ను కూడా సూచించారు. ఈ బాక్సర్లంతా ఈ నెల 13న భారత్‌కు చేరుకున్నారు. కానీ మేరీకోమ్ మాత్రం దీనిని పట్టించుకున్నట్లుగా లేదు. ఈ నెల 18న రాష్ట్రపతి భవన్లో జరిగిన అల్పాహార విందులో ఆమె పాల్గొంది. రాష్ట్రపతి అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేసిన చిత్రాలలో ఇతర పార్లమెంట్ సభ్యులతో పాటు మేరీకోమ్ కూడా ఉంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చిన విందులో తాను పాల్గొన్న విషయాన్ని మేరీకోమ్ కూడా నిర్ధారించింది. అయితే తాను ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని ఆమె స్పష్టం చేసింది. ‘జోర్డాన్ నుంచి వచ్చిన తర్వాత నేను ఇంట్లోనే ఉన్నాను. ఒక్క రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమానికి మాత్రమే వెళ్లాను. ఆ కార్యక్రమంలో ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్న రాజస్తాన్ సీఎం వసుంధర రాజే తనయుడు, పార్లమెంట్ సభ్యుడు దుష్యంత్ సింగ్‌ను కలవడం గానీ కరచాలనం చేయడం గానీ చేయలేదు. జోర్డాన్ పర్యటన తర్వాత నిర్దేశించిన నా స్వీయ నిర్బంధం ముగిసింది. అయినా సరే రాబోయే 3–4 రోజులు ఇంట్లోనే ఉంటాను’ అని ఆమె స్పష్టం చేసింది. సిమ్రన్‌జిత్ కూడా... పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్‌తో సిమ్రన్ మేరీకోమ్ కంటే ముందుగా భారత్‌కే చెందిన మరో మహిళా బాక్సర్ సిమ్రన్‌జిత్ కౌర్ కూడా స్వీయ నిర్భంధం నిబంధనను ఉల్లంఘించింది. జోర్డాన్‌లోనే జరిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో సిమ్రన్‌జిత్ పాల్గొని 60 కేజీల విభాగంలో ఫైనల్ చేరి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. పంజాబ్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి మహిళా బాక్సర్‌గా గుర్తింపు పొందింది. మార్చి 13న స్వదేశానికి తిరిగి వచ్చాక 14 రోజులపాటు స్వీయ నిర్భంధంలో ఉండాల్సిన సిమ్రన్‌జిత్ మార్చి 16న పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను... రాష్ట్ర క్రీడల మంత్రి రాణా గుర్మీత్ సింగ్ సోధిని... శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు సుఖ్బీర్ సింగ్ బాదల్‌ను కలిసింది. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించినందుకు సిమ్రన్‌జిత్‌కు పంజాబ్ ప్రభుత్వం రూ. 5 లక్షలు... శిరోమణి అకాలీదళ్ పార్టీ తరఫున సుఖ్బీర్ సింగ్ బాదల్ రూ. లక్ష నగదు పురస్కారం అందజేశారు. జోర్డాన్‌లోనూ కోవిడ్–19 వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు జోర్డాన్‌లో 69 కోవిడ్–19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. -
సీఏఏకు వ్యతిరేకంగా పంజాబ్ అసెంబ్లీ తీర్మానం
చండీగఢ్ : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పంజాబ్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. సీఏఏకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్న నేపథ్యంలో పంజాబ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ విషయంపై గత నెలలో కేరళ కూడా తీర్మానం చేసిన విషయం తెలిసిందే. తాజాగా సీఏఏను రద్దు చేయాలని అధికార కాంగ్రెస్ తీసుకు వచ్చిన ఈ తీర్మానాన్ని పంజాబ్ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. దీంతో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మాణం చేసిన రెండో రాష్ట్రంగా పంజాబ్ నిలిచింది. పంజాబ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర మంత్రి బ్రహ్మ మహింద్రా ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు.(నేను కేవలం రబ్బర్ స్టాంప్‌ను కాదు..) ‘పంజాబ్‌తో సహా దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చోటుచేసుకున్నాయి. అందుకే ఈ చట్టాన్ని రద్దు చేయాలని తీర్మానం చేస్తున్నాం’ అని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. కాగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేసిన మొదటి రాష్ట్రంగా కేరళ ఉండగా రెండో రాష్ట్రంగా పంజాబ్ నిలిచింది. ‘పౌరసత్వ సవరణ చట్టాన్ని అందరికీ ఆమోదయోగ్యంగా మార్చడానికి తగిన మార్పులు చేయాలని మేము కేంద్రానికి ఒక ముసాయిదా పంపాము. ఇప్పుడు జనాభా గణన జరుగుతోంది, ఇది పాత పద్దతిలోనే జరుగుతుంది. ప్రతి పౌరుడు ముస్లిం, హిందూ, సిక్కు, క్రిస్టియన్ లేదా ఎవరైనా భారతీయ పౌరుడుగానే గుర్తింపడతారు’ అని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించిన తరువాత తెలిపారు. -
‘మహిళలను ఉచితంగా డ్రాప్ చేస్తాం’
చండీగఢ్ : దేశంలో చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో బయట ఒంటరిగా ఉన్న మహిళలను పోలీసులే ఉచితంగా వారి ఇళ్ల వద్ద దిగబెట్టనున్నట్టు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. ఇందుకోసం మహిళలు 100, 112, 181 నెంబర్లకు ఫోన్ చేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సౌకర్యాన్ని అందుబాటులో ఉండేలా చూడాలని డీజీపీ దిన్కర్ గుప్తాను సీఎం ఆదేశించారు. మహిళలు చేరుకోవాల్సిన ప్రదేశానికి టాక్సీ గానీ, భద్రతతో కూడిన రవాణా సదుపాయం గానీ లేకపోతే పోలీసులు వారికి సాయం అందిచనున్నారు. వారిని గమ్యస్థానాలకు చేర్చే సమయంలో ఒక మహిళ కానిస్టేబుల్ తోడుగా ఉండనున్నారు. ఇందుకోసం కేటాయించిన వాహనాలు రాష్ట్రంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయాలతో పాటు, ఇతర ముఖ్య నగరాల్లో అందుబాటులో ఉంఉనున్నాయి. జిల్లా స్థాయిలో డీఎస్పీ గానీ, ఏసీపీ గానీ ఈ పథకానికి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. కాగా, ఇటీవల హైదరాబాద్ నగర శివార్లలో వైద్యురాలిపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
'అడ్డువస్తే నకిలీ కేసులు పెట్టి బెదిరించేవారు'
జలాలాబాద్ : పంజాబ్ రాష్ట్రంలోని జలాలాబాద్ నియోజకవర్గం శిరోమణి అకాలీదల్ పార్టీకీ కంచుకోటలాంటిది. పంజాబ్‌కు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన సుఖ్బీర్ సింగ్ బాదల్ ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు విజయం సాధించారు. దీంతో అకాలీదల్ పార్టీకి ఇక్కడ మంచి పట్టుంది. తాజాగా జలాలాబాద్‌కు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు చెందిన రమీందర్ ఆవ్లా విజయం సాధించారు. ఈ సందర్భంగా రమీందర్ తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. అకాలీదల్‌కు మంచి పట్టున్న జలాలాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవడం తనకు చాలా సంతోషం కలిగించిందని పేర్కొన్నారు. బీజేపీ- అకాలీదల్ పాలనలో ఇక్కడ గూండారాజ్యం కొనసాగిందని, అడ్డు వచ్చిన వారిపై నకిలీ కేసులు పెట్టి బెదిరించేవారని తెలిపారు. చెడుపై మంచి ఎప్పుడు గెలుస్తుందనడానికి తన గెలుపు ఒక కారణమని రమీందర్ వెల్లడించారు. 2017లో సుఖబీర్‌సింగ్ విజయం సాధించినా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ బీజేపీ- అకాలీదల్ పాలనలో వారు పెట్టిన నకిలీ కేసులను ఒక్కొక్కటిగా పరిష్కరించారని గుర్తుచేశారు.దీంతో అకాలీదల్ 10 ఏళ్ల పాలనలో జరిగిన అన్యాయాలు ప్రజలు గుర్తిస్తున్నారని తెలిపారు. అయితే ఇదే నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉప ముఖ్యమంత్రి పదవిని అధిష్టించిన సుఖ్బీర్ సింగ్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి తన బాధ్యతను విస్మరించారు. అందుకే తాజాగా జరిగిన ఉప ఎన్నికలో అకాలీదల్‌ను కాదని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారని వెల్లడించారు. ఈ సందర్భంగా తనను ఎమ్మెల్యేగా గెలిపించిన జలాలాబాద్ ప్రజలకు రమీందర్ కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని.. రైస్ మిల్లర్ వ్యాపారులకు ఆశించినంత మేర వ్యాపారం జరగకపోవడంతో ఎక్కువ మొత్తంలో మిల్లులు మూసివేయడం గుర్తించాను. అలాగే ఈ ప్రాంతంలోని స్థానికులకు ఉపాధి కల్పించేందుకు ఒక్క పరిశ్రమ కూడా లేకపోవడం దారుణం అని వెల్లడించారు. ఇక్కడి చుట్టు పక్కల గ్రామాల్లో మాదకద్రవ్యాల అక్రమ రవాణా బలంగా ఉంది. ఈ సమస్యలన్నింటిని ఒక్కొక్కటిగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. అలాగే త్వరలోనే ముఖ్యమంత్రి అమరీందర్సింగ్ని కలిసి నియోజకవర్గ అభివృద్ధి గురించి చర్చిస్తానని తెలిపారు. -
భారీ వర్ష సూచన.. రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్
చండీగఢ్: రానున్న రెండు రోజుల్లో పంజాబ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ శుక్రవారం రాత్రి ఈ మేరకు ప్రకటన చేశారు. పంజాబ్‌లో రెండు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు భారతీయ వాతావరణశాఖ తాజాగా హెచ్చరించింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అధికారులను అప్రమత్తం చేశారు. ముందుస్తు చర్యల్లో భాగంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు. అధికారులంతో సహాయ చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. రెవన్యూ, డ్రెయినేజీ, హెల్త్, ఫుడ్, యానిమల్ హజ్బెండ్రీ శాఖలకు సీఎం కార్యాలయం నుంచి ఇప్పటికే ఆదేశాలు అందాయి. వరద తాకిడి పెరగడంతో ముందుస్తు జాగ్రత్తగా బాక్రా డ్యామ్ గేట్లను ఎత్తేశారు. సట్లజ్తో పాటు జలంధర్ లోతట్టు ప్రాంతాల్లో ఉండేవారికి హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లను ఇప్పటికే భారీ వర్షాలు హోరెత్తింస్తున్న విషయం తెలిసిందే. -
రూ. 23 లక్షలు పోగొట్టుకున్న సీఎం భార్య!
చండీగఢ్ : అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేటి డిజిటల్ యుగంలో ఆన్లైన్ మోసాలు పెచ్చుమీరుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ప్రతీ ఒక్కరూ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారు. తాజాగా పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ భార్య, ఎంపీ ప్రణీత్ కౌర్ కూడా ఈ జాబితాలో చేరిపోయారు. బ్యాంకు మేనేజర్ పేరిట వచ్చిన కాల్ కారణంగా 23 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. ఈ క్రమంలో ఆమె ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. వివరాలు.. పార్లమెంటు సమావేశాలకు వెళ్తున్న సమయంలో కాంగ్రెస్ ఎంపీ ప్రణీత్ కౌర్‌కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. తాను బ్యాంకు మేనేజర్‌ను అని, ఎంపీ జీతం డిపాజిట్ చేసే అకౌంట్ అప్డేట్ కోసమే కాల్ చేసినట్లు చెప్పాడు. ఈ మేరకు అకౌంట్ నంబరు, ఏటీఎం పిన్ నంబరు, సీవీసీ నంబరు తదితర వివరాలు ఇవ్వాల్సిందిగా కోరాడు. అతడి మాటలు నమ్మిన ప్రణీత్ కౌర్ వివరాలతో సహా ఓటీపీ కూడా చెప్పారు. ఈ క్రమంలో కొన్ని నిమిషాల తర్వాత ఆమె అకౌంట్ నుంచి 23 లక్షల రూపాయలు డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. తాను మోసపోయినట్లుగా గుర్తించిన ప్రణీత్ కౌర్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జార్ఖండ్‌కు చెందిన వ్యక్తిని నిందితుడిగా గుర్తించారు. అక్కడే అతడిని అరెస్టు చేసి పంజాబ్ తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. -
ఆ అనుబంధం కంటే గొప్పదేదీ లేదు : సీఎం
చండీగఢ్ : పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ‘ఫ్రెండ్షిప్ డే’ సందర్భంగా భారత ఆర్మీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆర్మీలో పనిచేసినప్పటి బ్లాక్ అండ్ వైట్ ఫొటోను ట్విటర్లో పోస్టు చేసి పలు విషయాలు పంచుకున్నారు. ‘ఇండియన్ ఆర్మీతో ఉన్న అనుబంధం కంటే గొప్పదేదీ లేదు. దేశ రక్షణ కోసం పనిచేసే చోట నాకు లభించిన స్నేహితులు, ఆదరణ చాలా గొప్పది. మన వెన్నంటి ఉండే స్నేహితులందరికీ వరల్డ్ ప్రెండ్షిప్ డే శుభాకాంక్షలు’అన్నారు. అమరీందర్ సింగ్ సిక్కు రెజిమెంట్ 2వ బెటాలియన్‌లో 1963 నుంచి 69 వరకు కెప్టెన్‌గా సేవలందించారు. కుటుంబ సమస్యల నేపథ్యంలో ఆర్మీలో చేరిన కొద్ది కాలానికే ఆయన ఇంటికి తిరిగొచ్చేశారు. అయితే, దేశ రక్షణకై సేవలందిచడం ఎంతో ఇష్టంగా భావించే ఆయన భారత్-పాక్ యుద్ద (1965) సమయంలో మళ్లీ ఆర్మీలో చేరారు. అమరీందర్ తండ్రి లెఫ్టినెంట్ జనరల్ మహారాజా యద్వీర్సింగ్ కూడా దేశ రక్షణకై పనిచేశారు. -
కార్గిల్ యుద్ధ వీరుడికి డబుల్ ప్రమోషన్!
చండీగఢ్: భారతదేశ చరిత్రలో కార్గిల్ యుద్ధానికి ప్రత్యేకం స్థానం ఉంది. మంచుకొండలపై మాటు వేసి భారత్‌ను దొంగ దెబ్బ తీయాలన్న పాక్ పన్నాగాన్ని మన సైన్యం సమర్థంగా ఎదుర్కొని ఆ దేశాన్ని చావుదెబ్బ కొట్టింది. కార్గిల్ యుద్ధంలో మన జవాన్లు చూపిన అసమాన పోరాటమే భారత్‌కు విజయాన్ని అందించింది. అమర జవాన్ల పోరాటాన్ని స్మరించుకునేందుకు భారత్ ఏటా జులై 26న ‘విజయ్ దివస్’ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా నాడు దేశం కోసం వీరోచితంగా పోరాడిన యుద్ధ వీరుడు సత్పాల్ సింగ్ గురించి మీడియాలో ప్రత్యేక కథనాలు వెలువడ్డాయి. నాడు యుద్ధంలో సత్పాల్ చూపిన ధైర్యసాహసాలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనకు ‘వీర్ చక్ర’ అవార్డు కూడా ప్రదానం చేసింది. సైన్యం నుంచి బయటకు వచ్చిన అనంతరం ప్రస్తుతం సత్పాల్ సింగ్ పంజాబ్‌లోని ఓ చిన్న పట్టణంలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. నిన్న కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సత్పాల్ గురించి ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అది కాస్త పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ దృష్టికి వెళ్లడం.. ఆయన వెంటనే సత్పాల్కు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ ఇస్తూ ఆదేశాలు జారీ చేయడం క్షణాల్లో జరిగిపోయాయి. అంతేకాక సత్పాల్ కొడుకు పీజీ పూర్తి చేసి ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్నాడు. సత్పాల్ కథనానికి స్పందించిన ఓ విద్యాసంస్థల చైర్మన్, కూల్ డ్రింక్స్ కంపెనీలు సత్పాల్ కొడుకుకు ఉద్యోగం ఇవ్వడానికి ఆసక్తి చూపాయి. దీని గురించి ఇప్పటికే సత్పాల్ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడినట్లు సమాచారం. దీంతో సత్పాల్ కొడుకు కూడా త్వరలోనే ఉద్యోగంలో చేరనున్నట్లు తెలుస్తోంది. Glad to report that Punjab CM @capt_amarinder has just announced that Head Constable Satpal Singh, Vir Chakra has immediately been promoted Assistant Sub Inspector.@IndianExpress https://t.co/idpTIuj9H0 — Man Aman Singh Chhina (@manaman_chhina) July 26, 2019 -
కేబినెట్ నుంచి సిద్ధూ నిష్క్రమణ
చండీగఢ్: మాజీ క్రికెటర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే నవ్‌జోత్ సింగ్ సిద్ధూ పంజాబ్ మంత్రివర్గం నుంచి వైదొలిగారు. గత నెలలోనే ఆయన రాజీనామా చేసినప్పటికీ తాజాగా వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో విభేదాలు, మంత్రివర్గంలో కీలక శాఖల నుంచి తప్పించడం వంటి పరిణామాల నేపథ్యంలో జూన్‌లోనే రాజీనామా చేసినట్లు ఆదివారం ఆయన ట్విట్టర్లో ప్రకటించారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌కు పంపిన ఆ లేఖను సీఎంకు కూడా పంపుతానన్నారు. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ జూన్ 6వ తేదీన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఇందులో భాగంగా పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాలు, స్థానిక పాలన శాఖల బాధ్యతల నుంచి సిద్ధూను తప్పించి ఇంధనం, పునర్వినియోగ ఇంధన శాఖలను కేటాయించారు. దీంతోపాటు పలు ప్రభుత్వ కమిటీల్లో సిద్దూకు స్థానం కల్పించలేదు. ఈ పరిణామాలతో తీవ్ర అసంతృప్తి చెందిన సిద్దూ గత నెల 9వ తేదీన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని కలిసి, పరిస్థితిని వివరించడంతోపాటు ఒక లేఖను కూడా అందజేసినట్లు సమాచారం. అప్పటి నుంచి ఆయన తనకు కేటాయించిన కొత్త మంత్రిత్వశాఖల బాధ్యతలను చేపట్టలేదు. దీంతో సిద్ధూ, సీఎం సింగ్‌ల మధ్య విభేదాలను పరిష్కరించే బాధ్యతను సీనియర్ నేత అహ్మద్ పటేల్‌కు పార్టీ అప్పగించింది. అయితే, సమస్య పరిష్కారం అవుతుందనే ఆశాభావంతో నెల రోజులపాటు వేచి చూసినా ఎలాంటి ఫలితం కనిపించకనే తాజాగా సిద్ధూ తన రాజీనామా లేఖను బహిర్గతం చేసినట్లు సమాచారం. ఈ నెల రోజులు కూడా సిద్ధూ మీడియా, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉన్నారు. సీఎం, సిద్ధూ విభేదాలు ఏమిటి?: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ ప్రభావం కనిపించకపోవటానికి స్థానిక పాలన శాఖ బాధ్యతలను నిర్వహిస్తున్న సిద్ధూయే కారణమంటూ సీఎం అమరీందర్ బాహాటంగా ఆరోపించారు. గత ప్రభుత్వం హయాంలో మత విశ్వాసాలకు భంగం కలిగించిన బాదల్ కుటుంబీకులపై కేసు ఎందుకు నమోదు చేయలేదంటూ అంతకుముందు ఎన్నికల ప్రచారంలో సీఎంను సిద్దూ ప్రశ్నించారు. అదేవిధంగా, తనకు కెప్టెన్ రాహుల్ గాంధీయేనని, తన కెప్టెన్(సీఎం)కు కూడా ఆయనే కెప్టెన్ అంటూ గత ఏడాది సిద్దూ వ్యాఖ్యానించడం విభేదాలకు ఆజ్యం పోసింది. -
మంత్రి పదవికి సిద్ధూ రాజీనామా!
చండీఘడ్ : టీమిండియా మాజీ క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్‌సింగ్ సిద్ధూ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి రాసిన లేఖను ట్వీటర్లో పంచుకున్నారు. జూన్ 10నే ఈ లేఖను రాహుల్ గాంధీకి ఇచ్చారు. ముఖ్యమంత్రి అమరీందరసింగ్ ఇటీవల చేపట్టిన మంత్రివర్గం విస్తీరణతో సిద్ధూ తీవ్ర అసంతృప్తికి గురైన విషయం తెలిసిందే. తాజా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఈ ఇద్దరి నేతల మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. అమరీందర్ నేతృత్వంలో ఇటీవల జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) భేటీలోనూ సిద్ధూ పాల్గొనలేదు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సమీక్షకు ఉద్దేశించిన ఈ సమావేశంలో సిద్ధూ పనితీరుపై అమరీందర్ ఘాటు విమర్శలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి చేదు ఫలితాలు రావడానికి సిద్ధూ అసమర్థతే కారణమని ఆయన నిందించారు. ఈ నేపథ్యంలో సిద్ధూ నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖల్లో కీలకమైన స్థానిక సంస్థల శాఖను తొలగిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. దీంతో సిద్ధూ కేవలం పర్యాటకం, సాంస్కృతిక శాఖకు పరిమితమయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాహుల్ గాంధీతో సిద్ధూ గత నెల 10న ప్రత్యేకంగా సమావేశంమయ్యారు. తనకు ప్రాధాన్యత లేని శాఖను కేటాయించారని రాహుల్ వద్ద సిద్ధూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. My letter to the Congress President Shri. Rahul Gandhi Ji, submitted on 10 June 2019. pic.twitter.com/WS3yYwmnPl — Navjot Singh Sidhu (@sherryontopp) July 14, 2019 -
రాహుల్‌కు బుజ్జగింపులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసే విషయంలో పట్టువదలని విక్రమార్కుడిలా ఉన్న రాహుల్ గాంధీని బుజ్జగించేందుకు సోమవారం కాంగ్రెస్ ముఖ్యమంత్రులంతా రంగంలోకి దిగారు. రాజస్తాన్, పంజాబ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరిల సీఎంలు వరుసగా అశోక్ గహ్లోత్, అమరీందర్ సింగ్, కమల్‌నాథ్, భూపేశ్ బఘేల్, వి.నారాయణస్వామిలు రాహుల్‌ను ఢిల్లీలో కలిశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర ఓటమిపై వారు దాదాపు రెండు గంటలపాటు చర్చించి, తమ అభిప్రాయాలను పంచుకున్నారు. పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాల్సిందిగా రాహుల్‌ను వారంతా అభ్యర్థించారు. భేటీ అనంతరం గహ్లోత్ మాట్లాడుతూ ‘మేమంతా రాహుల్‌తో మనసువిప్పి మాట్లాడుకున్నాం. పార్టీ కార్యకర్తల అభిప్రాయాల గురించి కూడా రాహుల్‌కు వివరించాం. పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని కోరాం. ఆయన మా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్ మాత్రమే పార్టీని నడిపించగలరని గట్టిగా నమ్ముతున్నాం’ అని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని రాహుల్ చెప్పడం, అప్పటి నుంచి కాంగ్రెస్ నేతలు ఆయనను బుజ్జగిస్తుండటం తెలిసిందే. ఇటీవలే 150 మంది కాంగ్రెస్ నాయకులు కూడా ఓటమికి తమదే బాధ్యత అంటూ రాజీనామా చేయడం తెలిసిందే. -
స్థానిక సంస్థల మంత్రిగా సిద్ధూ ఔట్
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తన కేబినెట్ సహచరుడు నవజ్యోత్‌సింగ్ సిద్ధూపై కొరడా ఝుళిపించారు. చండీగఢ్‌లో గురువారం కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టిన పంజాబ్ సీఎం స్థానిక సంస్థలు, టూరిజం, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి బాధ్యతల నుంచి సిద్ధూను తప్పించారు. అనంతరం విద్యుత్, పునరుత్పాదక ఇంధనవనరుల మంత్రిత్వశాఖను సిద్ధూకు అప్పగించారు. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్‌లోని పట్టణ, నగర ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రదర్శనపై సీఎం అమరీందర్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా సిద్ధూ సరిగ్గా వ్యవహరించలేదనీ, అందువల్లే కాంగ్రెస్ నిరాశాజనక ప్రదర్శన చేసిందని అభిప్రాయపడ్డారు. తన అనాలోచిత చర్యలతో కాంగ్రెస్ లక్ష్యాలను దెబ్బతీశారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో చండీగఢ్‌లో గురువారం నిర్వహించిన కేబినెట్ భేటీకి సిద్ధూ గైర్హాజరయ్యారు. మరోవైపు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టిన అనంతరం సీఎం అమరీందర్ మాట్లాడుతూ.. తాజా మార్పుల వల్ల పాలనలో మరింత పారదర్శకతతో పాటు ప్రభుత్వ విభాగాలను మరింత సమర్థవంతంగా నడపడం వీలవుతుందని అభిప్రాయపడ్డారు. కాగా, ఇప్పటివరకూ సిద్ధూ నిర్వహించిన స్థానిక సంస్థలు టూరిజం శాఖను ఛత్రంజి సింగ్‌కు అమరీందర్ అప్పగించారు. ఆరోగ్యం–కుటుంబ సంక్షేమ శాఖను బల్బీర్ సిద్ధూకు, త్రిప్త్ బజ్వాకు ఉన్నత విద్య, పశుపోషణ–డైరీ, చేపల పెంపకం మంత్రిత్వశాఖలను కేటాయించారు. గుర్ప్రీత్ సింగ్‌కు రెవెన్యూశాఖను, విజయేందర్ సింగ్లాకు పాఠశాల విద్య, రవాణా శాఖను రజియా సుల్తాన్‌కు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖను అరుణా చౌదరికి సీఎం అప్పగించారు. నన్ను బలిపశువును చేశారు: సిద్ధూ సీఎం అమరీందర్ సింగ్ విమర్శలను మంత్రి సిద్ధూ తిప్పికొట్టారు. ‘పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో నేను కీలకపాత్ర పోషించా. నాకు కష్టపడకుండా ఏదీ రాలేదు. గత 40 ఏళ్లుగా నేను అంతర్జాతీయ క్రికెటర్‌గా, క్రికెట్ వ్యాఖ్యాతగా, టీవీ కార్యక్రమాల్లో రాణిస్తున్నా. అలాగే యువతలో స్ఫూర్తి పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా 1300కుపైగా మోటివేషనల్ కార్యక్రమాల్లో ప్రసంగించాను. పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం రూ.10,000 కోట్లు కేటాయించాం. దీంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పంజాబ్‌లోని అమృత్సర్, జలంధర్, పటియాలా, ఎస్ఏఎస్నగర్ సహా పలు పట్టణాల్లో గెలిచింది. కానీ సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ప్రదర్శనకు అందరూ నా శాఖనే బాధ్యులుగా చేశారు. నేను అమరీందర్‌ను నా పెద్దన్నగా భావిస్తాను. ఆయన మాటలను ఎల్లప్పుడూ గౌరవించాను. ఏదైనా విషయముంటే నన్ను వ్యక్తిగతంగా పిలిచి అమరీందర్ మాట్లాడాల్సింది. కానీ ఆయన తీరు నాకు బాధ కలిగించింది. ఇప్పుడు మంత్రిమండలి సమిష్టి బాధ్యత ఏమైంది? సీఎం కుర్చీ నా కుర్చీకి 3 అంగుళాల దూరంలోనే ఉన్నప్పటికీ నాపై అమరీందర్‌కు విశ్వాసం లేదు. నా పేరు, విశ్వసనీయత, పనితీరుపై వచ్చే విమర్శలను దీటుగా తిప్పికొడతా. నేను ఎప్పటికీ కాంగ్రెస్‌వాదినే’ అని సిద్ధూ స్పష్టం చేశారు. -
సీఎంతో విభేదాలు.. కేబినెట్ భేటీకి డుమ్మా!
చండీగఢ్ : మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ గురువారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశానికి డుమ్మా కొట్టారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తీరుపై ఆయన తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్ మంత్రివర్గంలో భారీ మార్పులు, చేర్పులకు ఉద్దేశించి.. సీఎం అమరీందర్ కేబినెట్ సమావేశం నిర్వహించగా.. దానికి హాజరుకాకుండా సిద్ధూ తన అసమ్మతిని తెలియజేశారు. ఈ క్రమంలో సిద్ధూకు అమరీందర్ సింగ్ షాక్ ఇచ్చారు. సిద్ధూ నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖలలో కీలకమైన స్థానిక సంస్థల శాఖను తొలగిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. దీంతో సిద్ధూ కేవలం పర్యాటకం, సాంస్కృతిక శాఖకు పరిమితమయ్యారు. తాజా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి కాంగ్రెస్ నేతలైన అమరీందర్, సిద్ధూల మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. అమరీందర్ నేతృత్వంలో ఇటీవల జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) భేటీలోనూ సిద్ధూ పాల్గొనలేదు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సమీక్షకు ఉద్దేశించిన ఈ సమావేశంలో సిద్ధూ పనితీరుపై అమరీందర్ ఘాటు విమర్శలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి చేదు ఫలితాలు రావడానికి సిద్ధూ అసమర్థతే కారణమని ఆయన నిందించారు. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన సిద్ధూ.. అమరీందర్ విమర్శలను తిప్పికొట్టారు. తన పేరును ప్రస్తావించి మరీ.. ఫలితాల విషయంలో తనను నిందిస్తున్నారని, నిజానికి తనకు అప్పగించిన రెండు జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు రాబట్టిందని ఆయన అన్నారు. ఇష్టమొచ్చినట్టుగా తనపై విమర్శలు చేయడం సరిసకాదని, తాను కష్టపడి పనిచేస్తున్నానని, తాను పంజాబ్ ప్రజలకు జవాబుదారుడినని సిద్ధూ అన్నారు. -
‘రైతుల కష్టాలకు పరిష్కారం ఇదే’
చండీగఢ్ : దేశవ్యాప్తంగా రైతు రుణాలను మాఫీ చేస్తూ జాతీయ స్ధాయిలో ఈ పథకాన్ని వర్తింప చేయాలని పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. రైతుల కష్టాలకు ఇది సరైన పరిష్కారమని ప్రధాని మోదీకి రాసిన లేఖలో అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. పంజాబ్‌లో తమ ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీ పథకం రైతుల కష్టాలను పూర్తిగా పరిష్కరించలేదని గతంలో అమరీందర్ సింగ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. తమ ప్రభుత్వం రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న రూ రెండు లక్షల వరకూ రుణాలను మాఫీ చేసిందని, ఇప్పటికే ఐదు లక్షల మంది రైతులు తీసుకున్న రుణాల మాఫీ కోసం రూ 4468 కోట్లు సమకూర్చామని లేఖలో సింగ్ పేర్కొన్నారు. మిగిలిన రైతులకూ త్వరలో ఈ పథకం ద్వారా ప్రయోజనాలను అందిస్తామని చెప్పారు. జాతీయ స్ధాయిలో రైతు రుణాల మాఫీతో పాటు ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజనను గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడేలా అవసరమైన మార్పులు చేయాలని ప్రధాని మోదీకి రాసిన లేఖలో సింగ్ కోరారు. -
కాంగ్రెస్‌కు మరో పీసీసీ రాజీనామా
చండీగఢ్: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. ఇప్పటికే పలు రాష్ట్రాల పీసీసీలు పదవి నుంచి వైదొలగగా.. తాజాగా పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సునిల్ జక్కర్ పదవికి రాజీనామా చేశారు. గురుదాస్ పూర్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన పోటీ చేసిన విషయం తెలిసిందే. బీజేపీ అభ్యర్థి, నటుడు సన్నీ డియోల్ చేతిలో ఆయన ఓటమిచెందారు. అయితే 2017లో బీజేపీ ఎంపీ వినోద్ ఖన్నా మరణంతో ఖాళీ అయిన ఈ స్థానంలో ఉప ఎన్నిక జరగగా.. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన సునిల్ జక్కర్ గెలుపొందారు. ఈ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా వీచిన మోదీ గాలి.. గురుదాస్పూలోర్నూ ప్రభావం చూపించింది. దీంతో సన్నీ డియోల్ చేతిలో ఆయన ఓటమి చెందారు. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ..తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు జక్కర్ ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ పంపారు. కాగా జక్కర్ రాజీనామాపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ అసహనం వ్యక్తం చేశారు. ఓటమి చెందినంత మాత్రనా పదవికి రాజీనామ చేయాల్సిన అవసరంలేదని అన్నారు. కాగా పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్థానాల్లో అధికార కాంగ్రెస్ ఎనిమిది స్థానాలను సొంతం చేసుకున్న విజయం తెలిసిందే. -
‘సీఎం కావాలన్నది సిద్ధూ కల’
చండీగఢ్ : మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ పంజాబ్ తదుపరి ముఖ్యమంత్రిగా తన స్దానంలో అధికార పగ్గాలు చేపట్టాలని కోరుకుంటున్నారని ఆ రాష్ట్ర సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా తన వ్యాఖ్యలతో సిద్ధూ కాంగ్రెస్‌ను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల తుది విడత పోలింగ్‌లో సింగ్ ఆదివారం తన ఓటు హక్కును వినియోగించుకునే ముందు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, సిద్ధూతో తనకేమీ వివాదం లేదని, ఆయన సీఎం కావాలని కోరుకుంటే ప్రజల ఆకాంక్షలు వారికి ఉంటాయని అన్నారు. సిద్ధూ చిన్నతనం నుంచే తనకు తెలుసని, ఆయనతో అభిప్రాయబేధాలు లేవని చెప్పారు. సీఎం కావాలన్నదే ఆయన వ్యాపకమని విమర్శించారు. కాగా సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి కేంద్రంలో యూపీఏ 3 ఏర్పాటవుతుందని సింగ్ ధీమా వ్యక్తం చేశారు. -
పంజాబ్ సీఎం సంచలన ప్రకటన
-
‘నా భార్య ఎప్పటికీ అబద్ధం చెప్పదు’
చండీగఢ్ : పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తనకు అమృత్సర్ లోక్‌సభ నియోజకవర్గ టికెట్ రాకుండా అడ్డుపడ్డారని.. కాంగ్రెస్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధు భార్య నవజోత్ కౌర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో నవజోత్ సింగ్ సిద్ధు తన భార్యకు మద్దతుగా నిలిచారు. సీఎం తన భార్యకు టికెట్ ఇవ్వకుండా అడ్డుపడటమే కాక, అమృత్ సర్ నుంచి పోటీ చేసేందుకు ఆమె నిరాకరించిందని చెప్పడం తప్పని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సిద్ధు మాట్లాడుతూ.. ‘నా భార్య కౌర్ ధైర్యవంతురాలు.. నైతిక విలువలున్న మనిషి. తను ఎన్నడూ అబద్ధాలు చెప్పదు’ అని వ్యాఖ్యానించారు. గత ఏడాది దసరా పండుగ నాడు జరిగిన రైలు ప్రమాదం దృష్ట్యా అమృత్సర్ నుంచి పోటీ చేస్తే ఓడిపోతానని భావించిన అమరీందర్ సింగ్ తనకు అమృత్సర్ ఎంపీ టికెట్ ఇవ్వలేదని నవజోత్ కౌర్ ఆరోపించారు. అంతేకాక సీఎం మహిళలకు గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలన్నారు. అమరీందర్ సింగ్ మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడతారు. కానీ చదువుకుని.. ప్రజలకు సేవ చేయాలని భావించే తనలాంటి వారికి టికెట్లు ఇవ్వకుండా అబద్ధాలు చెప్తారని నవజోత్ కౌర్ విమర్శించారు. ఈ విమర్శలపై సీఎం అమరీందర్ సింగ్ స్పందించారు. టికెట్ల కేటాయింపు విషయం తన చేతిలో ఉండదని.. ఢిల్లీ హైకమాండ్ నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. అంతేకాక నవజోత్ కౌర్ చండీగఢ్ నుంచి పోటీ చేయాలని భావించారని.. అది పంజాబ్ కిందకు రాదని ఆయన తెలిపారు. అమృత్ సర్ నియోజకవర్గం నుంచి అయినా పోటీ చేసేందుకు కౌర్ సంసిద్ధత వ్యక్తం చేయగా.. అక్కడ సిట్టింగ్ అభ్యర్థి గుర్జిత్ సింగ్‌కు టిక్కెట్ ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. -
పంజాబ్ సీఎం సంచలన ప్రకటన
చంఢీగడ్: లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తానని, పంజాబ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘పంజాబ్‌లో పార్టీ అత్యధిక స్థానాలు గెలిచే లక్ష్యంతో పని చేస్తున్నాం. పార్టీ అధిష్టానం మాపై ఆ బాధ్యత ఉంచింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ప్రతి ఒక్కరు ఇదే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందిన దానికి బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేస్తాను’’ అని అన్నారు. రాష్ట్రంలోని మొత్తం 13 స్థానాల్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం మూడు స్థానాలకే పరిమితమైన విషయం తెలిసిందే. బీజేపీ ఆరు, ఆప్ 4 స్థానాల్లో విజయం సాధించాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘన విజయం సాధించి పెట్టిన అమరిందర్పైనే ఈసారి కూడా పార్టీ ఆశలు పెట్టుకుంది. రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తామని కెప్టెన్ ధీమా వ్యక్తం చేశారు. చివరివిడత ఎన్నికల్లో భాగంగా మే 19న పంజాబ్‌లో పోలింగ్ జరగనుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాలకు గాను 77 స్థానాల్లో విజయం సాధించి సీఎంగా అమరీందర్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. -
‘ఆ నటులంతా కేవలం షో పీసులే’
చండీగఢ్ : బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ అభ్యర్థి సన్నీ డియోల్‌పై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ విమర్శలు గుప్పించారు. సన్నీకి పరిఙ్ఞానం లేదని, ఆయనో షో పీస్ అంటూ మండిపడ్డారు. సన్నీ డియోల్ పంజాబ్‌లోని గురదాస్‌పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన..‘ రాజకీయాలకు మాత్రమే నేను కొత్త. ప్రజాసేవకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటా. బాలాకోట్‌లోని ఉగ్రస్థావరాలపై మెరుపు దాడుల గురించి నాకు ఎక్కువగా తెలియకపోవచ్చు. అదేవిధంగా పాకిస్తాన్‌తో భారత్‌కు ఉన్న దౌత్యపరమైన సంబంధాల గురించి అంతగా అవగాహన లేకపోవచ్చు. ఒకవేళ నేను గెలిస్తే ఇటువంటి విషయాలపై ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటా. ప్రస్తుతానికైతే వీటిపై నాకు పూర్తి అవగాహన లేదు’ అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో సన్నీ వ్యాఖ్యలపై స్పందించిన అమరీందర్ సింగ్.. ప్రధాని నరేంద్ర మోదీ, సన్నీ డియోల్, అతడి మారుతల్లి, బీజేపీ ఎంపీ హేమమాలిని లక్ష్యంగా విమర్శలు సంధించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ బాలాకోట్‌లో దాడులు చేశామంటూ మోదీ క్రెడిట్ కొట్టేయాలని చూస్తుంటే.. ఈ వ్యక్తి(సన్నీ)కి పాపం కనీసం అక్కడ ఏం జరిగిందో కూడా తెలియదట. జాతీయ భద్రతపై దృష్టి సారించాం అంటూ బీజేపీ పదే పదే చెబుతుంది. అయితే సన్నీ మాటలు వింటుంటే ఆ పార్టీ అభ్యర్థుల ఆలోచనా సామర్థ్యం ఏమిటో అర్థమవుతోంది. ఇక బీజేపీ ఎంపీ హేమమాలిని ఐదేళ్లుగా మథురకు ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కానీ ఒక్కరోజు ప్రజల తరఫున లోక్‌సభలో తన గొంతు వినిపించలేదు. ఇటువంటి నటులంతా కేవలం షోపీసులే’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చదవండి : బాలాకోట్ ఎటాక్ : న్యూ ట్విస్ట్ కాగా సార్వత్రిక ఎన్నికల వేళ పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా బాలాకోట్ ఉగ్ర శిబిరాలపై జరిపిన మెరుపు దాడుల బీజేపీ నాయకులు ప్రచారాస్త్రంగా మార్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రతిపక్షాలు మాత్రం బాల్కోట్ ఉదంతంపై విమర్శలు గుప్పిస్తూ, ఆధారాలు చూపాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటలీ జర్నలిస్ట్ ఫ్రాన్సెస్కా మెరినో.. భారత వైమానిక దళం జరిపిన దాడిలో 130-170 మంది వరకు జైషే మహ్మద్ ఉగ్రవాదులు చనిపోయారంటూ వివరణాత్మక కథనం వెలువరించి సంచలనం రేపారు. పాకిస్తాన్ ఈ విషయంలో వాస్తవాలను దాచిపెట్టి ప్రపంచాన్ని మోసం చేయాలని చూస్తోందని ఆమె మండిపడ్డారు. ఖాళీ ప్రదేశంలో దాడి చేసినట్లు పాకిస్తాన్ పేర్కొందనీ, ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లలేదంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిందని తన కథనంలో మెరినో ఆరోపించారు. -
‘ఇమ్రాన్‌కు చేతకాదు.. ఆ పని మేమే చేస్తాం’
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో ఎన్నికల ఏడాది కనుకనే ఎలాంటి ఆధారాలు లేకుండా పుల్వామా ఉగ్రదాడి విషయంలో పాక్‌ను నిందిస్తున్నారని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానింంచిన సంగతి తెలిసిందే. ఇమ్రాన్ వ్యాఖ్యలపై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మండిపడ్డారు. జైషే చీఫ్ మసూద్ అజహర్‌ను పెంచిపోషిస్తూ నంగనాచి కబుర్లు చెబుతున్నారంటూ ట్విటర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఐఎస్ఐ మద్దతుగా ఉగ్ర కార్యకలాపాలు చేస్తున్న మసూద్ బహవల్పూర్లోనే ఉన్నాడని అమరీందర్ ఆరోపించారు. మసూద్ అరెస్టు విషయంలో ఇమ్రాన్‌కు చేతకాకపోతే ఏం చేయాలో తమకు తెలుసునని అన్నారు. ఇమ్రాన్ కోసం తామే ఆ పని చేస్తామని హెచ్చరించారు. (పుల్వామా ఉగ్రదాడిపై స్పందించిన పాక్) ఇదిలాఉండగా.. కశ్మీర్లో 40మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలితీసుకున్న ‘పుల్వామా ఆత్మాహుతి ఉగ్రదాడి’కి సూత్రధారిగా భావిస్తున్న కమ్రాన్ అలియాస్ అబ్దుల్ ఘాజీ రషీద్‌సహా ముగ్గురు జైషే మహ్మద్ ముష్కరులను భద్రతా దళాలు హతమార్చాయి. సోమవారం జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఓ ఆర్మీ మేజర్ సహా ఐదుగురు భద్రతా సిబ్బంది, ఓ పౌరుడు అమరులయ్యారు. పోలీస్ డీఐజీసహా 9 మంది సిబ్బంది గాయపడ్డారు. పుల్వామా ఉగ్రదాడి జరిగిన ప్రదేశానికి 12 కి.మీ.ల దూరంలోని పింగ్లాన్‌లో ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. Dear @ImranKhanPTI you have Jaish chief Masood Azhar sitting in Bahawalpur & masterminding the attacks with ISI help. Go pick him up from there. If you can’t let us know, we’ll do it for you. BTW what has been done about the proofs of Mumbai’s 26/11 attack. Time to walk the talk. pic.twitter.com/Zct6I7QieY — Capt.Amarinder Singh (@capt_amarinder) February 19, 2019 -
‘తనొక క్రికెటర్.. కానీ నేనొక సైనికుడిని’
చండీగఢ్ : ‘సిద్ధు ఒకనాడు క్రికెటర్ అయితే.. నేను ఒకనాటి సైనికుడిని. ఈ ఘటనను మేము చూసే విధానంలో, మా అభిప్రాయాల్లో భేదాలు ఉంటాయి’ పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ అన్నారు. పుల్వామా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ పంజాబ్ అసెంబ్లీ సోమవారం తీర్మానం చేసింది. ఈ సందర్భంగా ఉగ్రవాదానికి జాతి, మతం ఉండదన్న పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు తీరును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.(పుల్వామా ఉగ్రదాడి : సిద్ధు వివాదాస్పద వ్యాఖ్యలు) ఈ క్రమంలో సీఎం అమరీందర్ సింగ్ మాట్లాడుతూ..‘ సిద్ధు మాజీ క్రికెటర్. సరిహద్దుల్లో ఉండే ఇబ్బందులు తనకి అర్థం కావు. కానీ నేనో సైనికుడిని అక్కడి పరిస్థితులు ప్రత్యక్షంగా చూసిని వాడిని. అందుకే మా ఇద్దరి అభిప్రాయాల్లో తేడా కచ్చితంగా ఉంటుంది. పుల్వామా దాడికి తక్షణం ప్రతీకారం తీర్చుకోవాలని దేశం కోరుకుంటోంది. పాకిస్తాన్ అండతో ఉగ్రవాదులు 41 మంది జవాన్లను బలి తీసుకున్నారు. ఇందుకు ప్రతిగా వారి 82 మంది సైనికులను చంపి బదులు తీర్చుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. పాక్‌పై సైనిక, దౌత్య, ఆర్థికపరంగా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.(‘చాలు.. ఇక చాలు.. గుణపాఠం చెప్పాల్సిందే’) కాగా పుల్వామా ఉగ్రదాడి గురించి స్పందిస్తూ... భారత్ పాకిస్తాన్ల మధ్య చర్చలు జరిగినపుడు మాత్రమే ఇలాంటి ఘటనలు జరగవని, ఉగ్రవాదులు చేసిన దాడి కారణంగా ఒక జాతి మొత్తాన్ని విమర్శించడం తగదంటూ సిద్ధు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గతంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకోవడం, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సావానికి హాజరుకావడం వంటి చర్యలతో వివాదానికి దారి తీసిన సిద్ధుపై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
మనం 82 మందిని చంపాలి!
ఛండీగఢ్: పుల్వామా దాడికి తక్షణం ప్రతీకారం తీర్చుకోవాలని దేశం కోరుకుంటోందని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ అన్నారు. పాకిస్తాన్ దన్నుతో ఉగ్రవాదులు 41 మంది జవాన్లను బలి తీసుకోగా, ‘కంటికి కన్ను, పంటికి పన్ను’ సిద్ధాంతం ప్రకారం భారత్ 82 మందిని చంపి బదులు తీర్చుకోవాలని వ్యాఖ్యానించారు. కశ్మీర్లో భారత్ సైనికులను చంపుతూ మూర్ఖంగా వ్యవహరిస్తున్న పాక్‌పై సైనిక, దౌత్య, ఆర్థికపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేల కొరిగిన ప్రతి భారత సైనికుడికి బదులుగా ఆ దేశానికి చెందిన ఇద్దరు సైనికులను హతమార్చాలన్నారు. ఇలా తక్షణమే చర్యకు దిగాలని భారత్ కోరుకుంటోందని చెప్పారు. భారత్‌పైకి అణ్వాయుధాలు ఉపయోగిస్తామన్న పాకిస్తాన్ బెదిరింపులు వట్టివేనన్నారు. శాంతి చర్చలకు కాలం చెల్లిందని, పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసనమైందని పేర్కొన్నారు. పాకిస్తాన్ డబుల్ గేమ్ ఆడుతోందని దుయ్యబట్టారు. ‘పాక్ ప్రధాని (ఇమ్రాన్ ఖాన్) శాంతి చర్చల గురించి మాట్లాడతారు. ఆర్మీ జనరల్ (ఖామర్ జావేద్ బాజ్వా) మాత్రం యుద్ధం గురించి మాట్లాడతార’ని అమరీందర్ సింగ్ తెలిపారు. పాకిస్తాన్ సరైన గుణపాఠం చెప్పకపోతే ఉగ్రదాడులు పునరావృతం అవుతూనే ఉంటాయన్నారు. కాగా, పుల్వామా దాడి ఖండిస్తూ పంజాబ్ శాసనసభ సోమవారం తీర్మానాన్ని ఆమోదించింది. -
‘చాలు.. ఇక చాలు.. గుణపాఠం చెప్పాల్సిందే’
చండీగఢ్ : ‘చాలు.. ఇక చాలు.. శాంతి మంత్రం జపించాల్సిన అవసరం లేకుండా చేశారు. వాళ్లకు గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఇందుకు సంబంధించి భారత ప్రభుత్వం సరైన సమయంలో స్పందిస్తుందని భావిస్తున్నాను’ అంటూ పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ భావోద్వేగానికి లోనయ్యారు. పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తూ పంజాబ్ అసెంబ్లీ శనివారం తీర్మానం చేసింది. ఈ క్రమంలో అమరీందర్ సింగ్ మాట్లాడుతూ... పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శాంతి అంటూ ప్రసంగాలు చేస్తుంటే.. ఇక ఆ దేశ ఆర్మీ జనరల్ కమర్ జావేద్ బజ్వా మాత్రం యుద్ధం గురించి మాట్లాడి అసలు నిజాన్ని బట్టబయలు చేస్తారు అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పంజాబీ(పాక్) అయిన జావేద్ బజ్వా... తానెంతటి ధైర్య సాహసాలు ప్రదర్శించగలడో.. భారత పంజాబీలు కూడా అంతటి ధైర్యవంతులేనన్న విషయం గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. పంజాబ్ జోలికి రావాలని చూస్తే బజ్వాను ఎలా దారికి తేవాలో ఇక్కడి పంజాబీలకు తెలుసునని హెచ్చరించారు. మరోసారి దుస్సాహసానికి పాల్పడకుండా ఉండాలంటే.. ‘పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురునానక్ దేవ్ యూనివర్సిటీ స్థాపించి గురుద్వార సాహిబ్ సేవ చేస్తానంటారు. కానీ ఆయన ఐఎస్ఐ మాత్రం ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది. ద్వంద్వ విధానాలకు ఇది నిదర్శనం. ఆ దేశ ఆర్మీ జనరల్ బజ్వా మద్దతుతో గద్దెనెక్కిన ఇమ్రాన్ ఖాన్ ఇంతకన్నా ఏం చేస్తారు. చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి హేయమైన ఘటనలు ఆపండి. మరొక విషయం.. కొన్ని దేశాల ప్రోద్బలంతో 2020లో రిఫరెండం చేపట్టాలని చూస్తున్న కలిస్థాన్ వేర్పాటువాదుల ఆటలు కూడా ఇకపై కొనసాగవు’ అని అమరీందర్ సింగ్ హెచ్చరికలు జారీ చేశారు. ‘వాళ్లు(ఉగ్రవాదులు) అతిగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోనట్లైతే వారు మరోసారి దుస్సాహసానికి పాల్పడే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా పాకిస్తాన్ ఎత్తుగడలను సరైన విధంగా అంచనా వేయాలి. వారికి బుద్ధి చెప్పాలి’ అని కేంద్ర ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. కాగా సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న ముష్కరులపై యావత్ భారతావని ఆవేశంతో రగిలిపోతోంది. జవాన్ల త్యాగాలు వృథా కాకుండా ఉండాలంటే ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు సరైన జవాబు ఇచ్చి తీరాల్సిందేనంటూ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఓ స్కార్పియో ఎస్‌యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఆత్మాహుతి దళసభ్యుడు తన కారుతో.. జవాన్ల కాన్వాయ్‌లోని ఓ బస్సును ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. -
పంచాయితీ పోరులో కాంగ్రెస్ హవా
చండీగఢ్ : పంజాబ్‌లో ఆదివారం జరిగిన పంచాయితీ ఎన్నికల్లో పాలక కాంగ్రెస్ సత్తా చాటింది. 13,000కు పైగా గ్రామాల్లో జరిగిన ఎన్నికల్లో అత్యధిక పంచాయితీలను అధికార కాంగ్రెస్ చేజిక్కించుకుంది. గెలుపొందిన సర్పంచ్‌లు, పంచాయితీల సభ్యులకు కాంగ్రెస్ పార్టీ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేసింది. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా గ్రామీణ భారతంలో సానుకూల మార్పులకు ఈ ఎన్నికల్లో విజేతలు శ్రీకారం చుట్టాలని కోరింది. కాగా, పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన వారికి పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు.మరోవైపు ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ చేయడం ద్వారా విజయం సాధించిన కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని విపక్ష ఆప్, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) ఆరోపించాయి. ప్రజలకు ఎలాంటి మేలు చేయని కాంగ్రెస్ ఎన్నికలను ఎదుర్కొనేందుకు ధైర్యం లేక హింసకు పాల్పడిందని, ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేసిందని ఎస్ఏడీ అధ్యక్షుడు సుక్భీర్ సింగ్ బాదల్ ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలు బూత్‌లను స్వాధీనం చేసుకుని యధేచ్చగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఎస్ఏడీ సీనియర్ నేత దల్జీత్ సింగ్ ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజని విపక్ష నేత, ఆప్ సీనియర్ నాయకుడు హర్పాల్ చీమ ఆందోళన వ్యక్తం చేశారు. -
రాజీవ్ విగ్రహానికి అవమానం
లూథియానా/చండీగఢ్: లూథియానాలోని సలేమ్ తబ్రీ ప్రాంతంలో ఉన్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానికి మంగళవారం ఇద్దరు స్థానిక యువకులు రంగు పులమడం సంచలనమైంది. విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ నేతలు వెంటనే రంగంలోకి దిగి విగ్రహాన్ని శుభ్రపరిచారు. 1984 నాటి సిక్కు అల్లర్ల ఘటనకు సంబంధించి రాజీవ్ గాంధీపై ఆరోపణలు ఉన్న కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న రాజీవ్ విగ్రహాలను తొలగించడంతో పాటుగా భారత ప్రభుత్వం ఆయనకిచ్చిన భారతరత్న అవార్డును వెనక్కి తీసుకోవాలని ఆ యువకులు డిమాండ్ చేసినట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ స్పందిస్తూ.. ‘ఇది శిరోమణి అకాలీదళ్ పార్టీ పనే. దీనికి ఆ పార్టీ అధ్యక్షుడు సుఖ్వీర్ సింగ్ బాదల్ క్షమాపణ చెప్పాలి. అకాలీదళ్ ఇటువంటి చిల్లర రాజకీయాలకు పాల్పడితే వచ్చే లోక్‌సభలో ఆ పార్టీకి తగిన ప్రజలు బుద్ధి చెబుతారు. ఆ అల్లర్లకు గాంధీ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేనప్పటికీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం గాంధీ కుటుంబానికి చెందిన వారి పేర్లను బలవంతంగా అందులో ఇరికించారు’ అని అన్నారు. -
సిద్ధూపై మంత్రుల గుస్సా
చండీగఢ్/జైపూర్: తన కెప్టెన్ రాహుల్ గాంధీయే తప్ప, ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కాదంటూ పంజాబ్ మంత్రి నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాహుల్ గాంధీ సలహా మేరకే పాక్‌లో కర్తార్‌పూర్ కారిడార్ పనుల ప్రారంభానికి వెళ్లినట్లు సిద్ధూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. వీటిపై సొంత కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేయడంతో సిద్దూ కాస్తంత వెనక్కి తగ్గి..‘పాక్‌లో నా పర్యటన విషయంలో రాహుల్‌గాంధీ జోక్యం ఏమీ లేదు. పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ వ్యక్తిగత ఆహ్వానం మేరకు నేను అక్కడికి వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే’ అంటూ పరిస్థితిని చక్కదిద్దుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సిద్ధూపై తోటి మంత్రివర్గ సభ్యుల ఆగ్రహం తగ్గలేదు. దీనిపై మంత్రులు తృప్త్ రాజీందర్ సింగ్ బజ్వా, సుఖ్బీందర్ సింగ్ సర్కారియా, రాణా గుర్మీత్ సింగ్ సోధి మాట్లాడుతూ.. ‘రాహుల్ గాంధీ మా నేత. పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆయన. పంజాబ్‌లో మా ప్రభుత్వ కెప్టెన్ అమరీందర్. ఆయన కెప్టెన్సీలోని మంత్రి వర్గంలో సిద్ధూయే కాదు సీఎం అమరీందర్‌ను కెప్టెన్‌గా అంగీకరించని వారెవరైనా మంత్రి వర్గం నుంచి వెంటనే తప్పుకోవాలి. లేదా క్షమాపణ చెప్పి పంజాబ్‌లో సీఎం అమరీందరే కెప్టెన్ అన్న విషయం అంగీకరించాలి’ అని అన్నారు. కాగా, సిద్ధూ వ్యాఖ్యల వ్యవహారం సోమవారం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనూ ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. -
‘అవును... నన్ను పాకిస్తాన్‌కు పంపించింది ఆయనే’
సాక్షి, హైదరాబాద్ : సిక్కు యాత్రికుల కోసం నిర్మిస్తున్న కర్తార్‌పూర్ కారిడార్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యేందుకు పాకిస్తాన్‌కు వెళ్లిన నాటి నుంచి పంజాబ్ మంత్రి, కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధుపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆయన ఖలిస్తాన్ వేర్పాటువాద నాయకుడు గోపాల్ సింగ్ చావ్లాతో ఫొటో దిగడం వివాదానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో బీజేపీ, అకాలీదళ్ పార్టీ నాయకులు.. ‘సిద్ధు పాకిస్తాన్ ఏజెంట్’ అంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సిద్ధు ప్రవర్తన తీరుపై ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టత ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. (రాహుల్ జీ.. స్పష్టత ఇవ్వండి!) ఈ నేపథ్యంలో తనపై వస్తున్న విమర్శలపై సిద్ధు స్పందించారు. ‘నా కెప్టెన్ రాహుల్ గాంధీ. ఆయన నన్ను ఎక్కడికి పంపాలని భావిస్తే అక్కడికి పంపిస్తారు. పాకిస్తాన్‌కు కూడా ఆయనే పంపించారు. అయినా నాకు నేనుగా కర్తార్‌పూర్ కారిడార్ శంకుస్థాపనకు వెళ్లలేదు. 20 మంది సీనియర్ నేతలు అక్కడికి వెళ్లాల్సిందిగా నన్ను కోరారు. పార్టీ అధిష్టానం నిర్ణయం కూడా అదే. అందుకే మా ‘కెప్టెన్’ (పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్‌ను ఉద్దేశించి)కు నేను కచ్చితంగా పాకిస్తాన్ వెళ్తున్నానని చెప్పాను. ఆయనకు కూడా రాహుల్‌జీనే కెప్టెన్ కదా. అమరీందర్ సింగ్ అయితే ఆర్మీ కెప్టెన్ మాత్రమే’ అని సిద్ధు వ్యాఖ్యానించారు. కాగా తెలంగాణ ఎన్నికల ప్రచార నిమిత్తం సిద్ధు శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. #WATCH Navjot Singh Sidhu, Congress in Hyderabad: Mere captain Rahul Gandhi hain, unhone toh bheja hai har jagah (for #KartarpurCorridor). Hamare Captain sahab ke bhi Captain Rahul Gandhi ji hain' pic.twitter.com/XmagrUgfWw — ANI (@ANI) November 30, 2018 -
అమృత్సర్ దాడి ఉగ్రచర్యే
అమృత్సర్: అమృత్‌సర్‌లోని నిరంకారీ భవన్లో భక్తులపై దాడి ఉగ్రచర్యేనని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అన్నారు. ఆదివారం దాడికి గురయిన ఆద్లివాల్లోని నిరంకారీ భవన్‌ను సోమవారం ఆయన సందర్శించారు. ఈ ఘటనలో లభ్యమైన ఆధారాల సాయంతో బాధ్యుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నామన్నారు. దాడికి కారకులైన వారిపై సమాచారం అందించిన వారికి రూ.50లక్షల పారితోషికం అందజేస్తామని ప్రకటించారు. ‘నిరంకారీ భవన్‌పై దాడి వెనుక పాకిస్తాన్ ప్రోద్బలం ఉంది. ఈ దాడిలో వాడిన గ్రెనేడ్ పాక్ ఆర్మీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారైన గ్రెనేడ్ మాదిరిగానే ఉంది’ అని అమరీందర్ అన్నారు. ‘ఇలాంటి హెచ్‌జీ–84 రకం గ్రెనేడ్ ఒక దానిని గత నెలలో ఉగ్ర స్థావరాలపై దాడిలో రాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీన్నిబట్టి ఈ ఘటన ఐఎస్ఐ ప్రోద్బలంతో ఖలిస్తాన్ లేదా వేర్పాటువాదుల పనేనని భావిస్తున్నాం.’ అని చెప్పారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. -
పంజాబ్‌లో బహుపరాక్!
పంజాబ్‌లో తిరిగి ఉగ్రవాదం తలెత్తే ప్రమాదం కనబడుతున్నదని సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ బిపిన్ రావత్ హెచ్చరించిన కొద్దిరోజులకే అమృత్సర్ శివారులోని నిరంకారి భవన్‌పై ఆదివారం గ్రెనేడ్ దాడి జరిగింది. ఇంటెలిజెన్స్ సంస్థలు సైతం ఉగ్రవాద కదలికలపై ముందస్తు సమాచారమిచ్చాయని చెబుతున్న నేపథ్యంలో ఈ దాడి దిగ్భ్రాంతికలిగిస్తుంది. ఇది ఉగ్రవాద దాడే నని, దీనికి మతంతో సంబంధం లేదని ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్ చెబుతున్నా సిక్కులకూ, నిరంకారీలకూ మధ్య అక్కడుండే వైరుధ్యాలు... గతంలో ఉగ్రవాదంతో ఆ రాష్ట్రం అట్టుడికిన తీరు గుర్తుకుతెచ్చుకుంటే ఎవరికైనా ఆందోళన కలుగుతుంది. ఈ దాడిని ఏదో చిన్న ఘటనగా కొట్టి పారేయడానికి లేదు. ఇందులో ముగ్గురు మరణించడంతోపాటు 23మంది గాయాలపాలయ్యారు. ఈ ఉదంతానికి రెండురోజుల ముందు పఠాన్‌కోట్ జిల్లాలో నలుగురు దుండగులు రివాల్వర్లు చూపి బెదిరించి ఒక కారును అపహరించినట్టు ఫిర్యాదు వచ్చింది. వారు ఉగ్రవాదులే కావొచ్చునని అను మానిస్తూ పోలీసులు రాష్ట్రమంతటా హై అలెర్ట్ ప్రకటించారు. ఢిల్లీలో ఉగ్రవాద చర్యలకు పాల్ప డేందుకు దాదాపు ఏడుగురు ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి పంజాబ్‌లోకి ప్రవేశించారని అయిదు రోజులక్రితం ఇంటెలిజెన్స్ సంస్థలు హెచ్చరించాయి. ఇన్ని హెచ్చరికలున్నా ముందస్తు చర్యలు సరి గాలేవని ఈ ఉదంతం నిరూపిస్తోంది. ఘటన జరిగిన ప్రాంతం ఏదో మారుమూల లేదు. అది అమృత్సర్ శివారు గ్రామం. పైగా అంతర్జాతీయ విమానాశ్రయానికి చాలా సమీపంలో ఉంది. ఇక నిరంకారిల సమావేశం జరుగుతున్నచోట సర్వసాధారణంగా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేస్తారు. కానీ ఘటన జరిగినచోట అదేమీ లేదు. పంజాబ్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రం. ఇటీవలికాలంలో చెప్పుకోదగ్గ ఘటనలేమీ జరగకపోయినా...అక్కడ సిక్కులకూ, నిరంకారీలకూ మధ్య ఉన్న వైషమ్యాలు అందరికీ తెలిసినవే. 1929లో ప్రారంభమైన సంత్ నిరంకారీ మిషన్‌తో ఆదినుంచీ సిక్కుల్లోని ప్రధాన వర్గానికి పేచీ ఉంది. సిక్కు మత గ్రంథం గురుగ్రంథ్ సాహిబ్‌కు నిరంకారీలు అపచారం చేస్తున్నారన్నది వారి ప్రధాన ఆరోపణ. ఈ వైషమ్యాలు తీవ్ర స్థాయికి పోయి 1978 ఏప్రిల్‌లో బైశాఖి ఉత్సవం రోజున నిరంకారీలకు, సిక్కులకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. అందులో 13మంది సిక్కులు మర ణించారు. అనంతరకాలంలో రెండు వర్గాల మధ్యా కొనసాగిన ఘర్షణలు, పరస్పర హననం ఆ రాష్ట్రాన్ని అట్టుడికించి ఉగ్రవాదానికి దారితీశాయి. 1980లో ప్రస్తుత ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో అప్పటి నిరంకారీ పీఠం అధిపతి బాబా గురుబచన్సింగ్ను దుండగులు హత్య చేశారు. సిక్కుల్లో ఉన్న అసంతృప్తిని ఆసరా చేసుకుని భింద్రన్‌వాలే రంగంలోకొచ్చి మిలిటెంట్ సంస్థల్ని నెలకొల్పడం చరిత్ర. అనంతరం దశాబ్దకాలంపాటు ఉగ్రవాద చర్యలతో పంజాబ్ అట్టుడికింది. ఉగ్రవాద చర్యల్లో, దానికి వ్యతిరేకంగా పోలీసులు ప్రారంభించిన పోరాటంలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. 2009లో ఎక్కడో వియన్నాలో ఉన్న గురుద్వారాలో దేరా సచ్‌ఖంద్ వర్గానికి చెందిన గురువును కొందరు దుండగులు హత్య చేసినప్పుడు పంజాబ్‌లోని అనేక నగరాలు అల్లర్లతో అట్టుడికాయి. భారీయెత్తున ఆస్తుల విధ్వంసం చోటు చేసుకుంది. ప్రధాన నగరాల్లో కర్ఫ్యూ విధించాల్సివచ్చింది. అలాంటి రాష్ట్రంలో నిరంకారీ ఉత్సవం జరుగుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో పోలీసులకు ఎవరూ చెప్పనవసరం లేదు. పైగా పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు ప్రవే శించారన్న సమాచారం అందాక రెట్టించిన అప్రమత్తత అవసరమవుతుంది. కానీ ఆ విషయంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగానే వ్యవహరించిందని చెప్పాలి. నిరంకారీ భవన్ వద్ద లభించిన గ్రెనేడ్ శకలాలు పరీక్షిస్తే అవి పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారయ్యాయని తెలుస్తున్నదని ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్ చెబుతున్నారు. గత నెలలో పోలీసులు స్వాధీనం చేసుకున్న 84 గ్రెనేడ్లు కూడా ఈ తరహావేనని ఆయన అంటున్నారు. తాజా ఉదంతం సిక్కులకూ, నిరంకారీల వివాదం కానేకాదని వివరిస్తున్నారు. అయితే ఇలాంటి ప్రకటనలు ఉపశమనాన్ని ఇవ్వవు. సామాజిక మాధ్యమాల ప్రాధాన్యత పెరిగిన ప్రస్తుత కాలంలో పరస్పర అనుమానాలు, అపోహలు పెను వేగంతో వదంతులకు దారితీస్తాయి. అందువల్లే అవాంఛనీయ ఘటనల్ని నివారించటానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించటం చాలా అవసరం. ఇప్పుడు ఈ ఉదంతం చోటుచేసుకున్న ప్రాంతంలోగానీ, రాష్ట్రంలోని మరికొన్ని ఇతర ప్రాంతాల్లో కానీ సీసీ టీవీ కెమెరాలు లేవని చెబుతున్నారు. సరిహద్దు ప్రాంతంలోని రాష్ట్రంగా శాంతిభద్రతల విషయంలో అన్నివిధాలుగా అప్రమత్తతతో వ్యవహరించాల్సినచోట కనీసం సీసీ టీవీ కెమెరాలు కూడా లేవంటే ఆశ్చర్యం కలుగుతుంది. పంజాబ్ ప్రాంతంలో పాకిస్తాన్‌తో మనకు 553 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఇనుప కంచెతో దీన్ని మూసివేశారు. గత ఏడాదిన్నరకాలంలో రాష్ట్రంలో 15 ఉగ్రవాద ముఠా లను పట్టుకోగలిగామని, శాంతిభద్రతల విషయంలో తామెంతో అప్రమత్తంగా ఉన్నామనడానికి ఇదే రుజువని అమరీందర్ చెబుతున్న మాటలు ఎవరినీ సంతృప్తిపర్చవు. ఎన్నిటిని నివారించినా, ఒక్క ఉదంతం చాలు... మొత్తం కృషిని నీరుగారుస్తుంది. ఉగ్రవాదులకు ఎక్కడలేని ధైర్యాన్నిస్తుంది. ఈ ఘటన ద్వారా ఇరు వర్గాల మధ్య చిచ్చు రగిల్చి శాంతిభద్రతల సమస్య తలెత్తేలా చేద్దామని దుండగులు పథకం రచించి ఉండొచ్చు. విధి నిర్వహణలో పోలీసులు చూపే నిర్లక్ష్యం అలాంటి ఎత్తుగడలకు పాల్పడేవారికి ఊతాన్నిస్తుంది. దశాబ్దకాలంపాటు ఉగ్రవాదంతో అట్టుడికిన రాష్ట్రంలో దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే పోలీసులు ఎంతో అప్రమత్తంగా ఉంటారని అందరూ అను కుంటారు. కానీ ఘటన జరిగి 24 గంటలు గడుస్తున్నా దీని వెనకున్నదెవరో పోలీసులు రాబట్ట లేకపోయారు. పంజాబ్‌లో పోలీసు యంత్రాంగాన్ని ప్రక్షాళన చేసి ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని అమరీందర్ గుర్తించాలి. -
అమృత్‌సర్‌లో పేలుడు.. ముగ్గురి మృతి
అమృత్సర్(పంజాబ్): అమృత్సర్ జిల్లా రాజస్సని ప్రాంతంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 10మందికి పైగా గాయపడ్డారు. ఆధ్యాత్మిక మందిరమైన నీరంకరి భవన్ వద్ద ఈ పేలుడు చోటు చేసుకుంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో పేలుడు సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రార్థనా మందిరం వద్దకు ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనం మీద వచ్చి పేలుడు పదార్థాలు విసిరినట్లు తెలుస్తోందని స్థానిక పోలీస్ అధికారి సురీందర్ సింగ్ తెలిపారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పంజాబ్ సీఎం కెప్టెన్ అమరిందర్‌సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతిచెందిన కుటుంబాలకు రూ. 5లక్షల పరిహారం అందించనున్నట్లు ప్రకటించిన సీఎం.. గాయపడ్డవారికి ఉచిత వైద్యం అందివ్వనున్నట్లు స్పష్టం చేశారు. -
అమృత్‌సర్‌లో పేలుడు.. ముగ్గురి మృతి
-
రైలు ప్రమాదం: రాజకీయ దుమారం..!
అమృత్సర్ : అమృత్సర్ రైలు ప్రమాదంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన నాయకులు ప్రమాదానికి కారణం మీరంటే మీరేనని ఒకరిపై మరోకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రతిపక్ష శిరోమణి అకాలీదళ్, బీజేపీలు అధికార పక్షమైన కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తున్నాయి. రైల్వే ట్రాక్ పక్కన రావణ దహనం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీనే పరోక్షంగా ప్రమాదానికి కారణమైందని కేంద్రమంత్రి, శిరోమణి అకాలీదళ్‌కు చెందిన హర్సిమ్రత్ కౌర్ బాదల్ విమర్శించారు. కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేకుండా, రైల్వే శాఖకు ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా రావణ దహనం చేశారని నిర్వహకులుపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇవ్వన్నీ ఇలా ఉండగా ప్రమాదంపై తమ తప్పేమీ లేదని, సిగ్నల్స్ అన్నీ క్లియర్‌గా ఉన్నందుకే రైలు వేగంగా దూసుకుని వెళ్లిందని రైల్వే శాఖ ప్రకటించి చేతులు దులుపుకుంది. నాయకులు ప్రకటనలపై సామన్య ప్రజలు దుమ్మెతిపోస్తున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సిందిపోయి మీరంటే మీరే కారణమని ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం ఏంటిని కొందరు ప్రశ్నిస్తుండగా.. ప్రమాదాన్ని కూడా కొంతమంది రాజకీయం చేస్తుండడం బాధకరమని ప్రముఖలు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఉన్న పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ భార్య నవజ్యోత్కౌర్ సిద్దు తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఉన్న ఆమె కనీసం ఘటన స్థలికి వెళ్లకుండా ప్రమాదం జరిగిన వెంటనే ఆమె వెళ్లిపోయారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు రైల్వే ట్రాక్‌పై మేం నిలుచోమని చెప్పామా.. వాళ్లపై నుంచి వెళ్లమని ట్రైన్‌కు మేం చెప్పామా అంటూ దురుసుగా వ్యాఖ్యానించారు. ఘటనపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ ప్రకటించారు. కాగా ప్రమాదంపై ఇప్పటివరకూ ఏఒక్కరిపై కేసు నమోదు కాకపోవడం గమనార్హం. -
ప్రమాదంలో మా తప్పు లేదు : రైల్వే శాఖ
సాక్షి, న్యూఢిల్లీ : అమృత్‌సర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో తమ తప్పేమిలేదని రైల్వే శాఖ ప్రకటించింది. రైల్వే ట్రాక్ పక్కన వందలాది మంది గుమ్మికూడి ఉంటారని తమకు ముందస్తుగా సమాచారం లేదని రైల్వే అధికారుల తెలిపారు. తమను సమాచారం లేకపోవడంతోనే రైల్ వెళ్లడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని రైల్వే డివిజన్ మేనేజర్ వివేక్ కుమార్ తెలిపారు. ప్రమాదం జరగడం దురదృష్టకరమని.. దీనిలో తమ తప్పేమి లేదని తెలిపారు. ప్రమాదంపై రైలు డ్రైవర్ మాట్లాడుతూ.. ట్రాక్ సమీపంలో వందల మంది గుమ్మిగూడి ఉన్నారని తనకు తెలిదని.. గ్రీన్ సిగ్నల్ ఉన్నందునే టైన్ వేగంగా వెళ్లిందని అన్నారు. దసరా వేడుకలు సందర్భంగా అమతృసర్ సమీపంలో శుక్రవారం జరిగిన దుర్ఘటనలో 61 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. రైల్వే ట్రాక్ పక్కన రావణ దహనం నిర్వహిస్తుండగా పట్టాలపై నిలుచుని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిపై హవ్డా ఎక్స్‌ప్రెస్ దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగింది. కాగా ట్రాక్ పక్కన రావణ దహన కార్యక్రమాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ నిర్వహించడంతో ఇప్పటి వరకు ఎవ్వరిపై కూడా కేసు నమోదు కాలేదు. పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ ఘటన స్థలాన్ని పరిశీలించి మృతులకు సంతాపం తెలిపారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తామని సీఎంతో పాటు, కేంద్ర రైల్వే సహాయక మంత్రి మనోజ్ సిన్హా అన్నారు. కాగా రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాల్లో దసర ఉత్సవాలు జరగుతున్నాయని ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంపై స్థానిక అధికారులపై రైల్వే శాఖ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. పండగ రోజునే ప్రమాదం జరగడంతో దేశ వ్యాప్తంగా విషాదం నిండుకుంది. -
తదుపరి సీఎంలు కూడా వీరే..!
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ నాయకత్వాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని గత అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్, ఢిల్లీలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలకు రానున్న ఎన్నికల్లో కూడా ప్రజలు భ్రమ్మరథం పట్టే అవాకాశం కనిపిస్తోంది. ఈ మేరకు తదుపరి సీఎంగా ఎవ్వరు ఉండాలనే అంశంపై పొలిటికల్ స్టాక్ ఎక్స్చేంజ్ (పీఎస్ఈ) పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఓ సర్వేను నిర్వహించింది. దేశ రాజధాని ఢిల్లీలో సీఎంగా ఆమ్ ఆద్మీ కన్వీనర్, ప్రస్తుతం సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతుగా 47 శాతం మంది నిచిచారు. గత మూడేళ్లుగా ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రవేశపెట్టిన పథకాలకు ప్రజలు ఆమోద ముద్ర వేశారు. చాలా ఏళ్లుగా నీటీ సమస్యతో బాధ పడుతున్న ఢిల్లీ వాసులకు ఆప్ ప్రభుత్వం ఈ సమస్యను తీర్చిందని సర్వేలో పాల్గొన్న వారు తెలిపారు. రాజధానిని 15 ఏళ్ల పాటు నిరంతరంగా పాలించిన షీలా దీక్షిత్ (కాంగ్రెస్)పై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అమరిందరే కావాలి.. షీలా పాలనతో విసిగిపోయిన ప్రజలు.. ఆమెను తదుపరి సీఎంగా 19 శాతం మంది కావాలనుకుంటున్నట్లు సర్వే తేల్చింది. పరిపాలనలో కూడా ఆప్ సరైన మార్పులను తీసుకువచ్చినట్లు పీఎస్ఈ ప్రకటించింది. విద్యా, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలక కల్పనలో ఆప్ మెరుగైన ఫలితం సాధించింది. ఇక పంజాబ్ సీఎంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రస్తుత సీఎం అమరిందర్ సింగ్‌కు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పంజాబీలు మరోసారి సీఎంగా పట్టంకట్టే అవకాశం ఉన్నట్లు సర్వే తెలిపింది. 42శాతం పంజాబ్ ప్రజలు సింగ్నే తదుపరి సీఎంగా కోరుకుంటున్నట్లు.. ఆయన ప్రవేశపెట్టిన పథకాలపై ప్రజల్లో మంచి స్పందన ఉందని పీఎస్ఈ వెల్లడించింది. కాగా రెండు రాష్ట్రాల్లో కూడా నిరుద్యోగమే ప్రధాన సమస్యగా ఎత్తిచూపారు. ఉద్యోగాలు కల్పించడంలో కేంద్రంతోపాటు.. రాష్ట్రాలు కూడా విఫలమైయ్యాయని సర్వే తెలిపింది. 2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను ఆప్ 67 సీట్లల్లో విజయం సాధించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో తదుపరి ప్రధానిగా ఎవరుండాలనే అంశంపై పీఎస్ఈ పలు అంశాలను వెల్లడించింది. 49 శాతం మంది ప్రధానిగా నరేంద్ర మోదీనే కోరుకుంటుండగా.. 43 శాతం మంది రాహుల్ గాంధీనే తదుపరి ప్రధాని కావాలని అనుకుంటున్నట్లు సర్వేలో పాల్గన్న వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక దేశ వ్యాప్తంగా బగ్గుమంటున్న పెట్రోల్ ధరలపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నట్లు.. 8 శాతం మంది ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వన్ని వ్యతిరేకిస్తున్నట్లు సర్వే తెలిపింది. 22 శాతం మంది మాత్రం పెట్రోల్ ధరల పెరుగుదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని తీర్పునిచ్చారు. -
సొంత ప్రభుత్వంపై సిద్ధు సంచలన వ్యాఖ్యలు!
చండీఘడ్ : సుమారు 8 వేల అక్రమ కాలనీల నిర్మాణాలను క్రమబద్దీకరిస్తూ పంజాబ్ ప్రభుత్వం తీసుకువచ్చిన విధానంపై పంజాబ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం జరగిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తాను. కానీ నాకు కూడా కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ప్రజలు ఓట్లు వేసి నన్ను గెలిపించింది ప్రజా సమస్యలపై నోరు మెదపకుండా ఉండటానికి కాదని’ సిద్ధు వ్యాఖ్యానించారు. ప్రతీ ప్రజా ప్రతినిధి ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, వారి సమస్యలపై పోరాడాలన్నారు. బాస్ నిర్ణయానికే ప్రాధాన్యం ఉంటుంది.. కేబినెట్ సమావేశంలో భాగంగా తన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవపోవడాన్ని ప్రస్తావిస్తూ.. అక్రమ కాలనీల క్రమబద్ధీకరణను పూర్తిగా వ్యతిరేకించానని, అయితే ప్రభుత్వానికి బాస్‌గా ఉన్న సీఎం తీసుకునే నిర్ణయాలే అంతిమంగా చెల్లుబాట అయినప్పటికీ వాటి కోసం తన అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. సొంత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అన్న ప్రశ్నకు బదులుగా.. విమర్శలు వస్తున్నాయంటే నేను ఎంతో కొంత నిజాయితీగా పనిచేస్తున్నానే అర్థం కదా అంటూ సిద్ధు చమత్కరించారు. కాగా పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు చోటుచేసుకుంటున్నాయని వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో సిద్ధు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ అండదండలు పుష్కలంగా ఉన్న సిద్ధు ఉప ముఖ్యమంత్రి పదవి ఆశించారు. కానీ ఆయనకు పర్యాటక, సాంస్కృతిక, స్థానిక సంస్థలు వంటి అంతగా ప్రాధాన్యం లేని శాఖలు కేటాయించడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. -
ఆ కేసులో పంజాబ్ సీఎంకు ఊరట..
చండీగఢ్ : పదేళ్ల కిందట ప్రైవేట్ డెవలపర్‌కు భూమి బదలాయింపు కేసులో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ సహా 17 మందికి విముక్తి లభించింది. నిందితుల్లో పంజాబ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, సహా ఇద్దరు మాజీ మంత్రులు మరణించారు. అమృత్సర్ ట్రస్ట్‌కు సంబంధించిన 32 ఎకరాల భూమిని ప్రైవేట్ డెవలపర్‌కు అభివృద్ధి పరిచే నిమిత్తం బదలాయించడంలో 18 మంది నిందితులు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని విజిలెన్స్ బ్యూరో (వీబీ) నివేదిక ఆధారంగా కేసును మూసివేస్తున్నట్టు మొహాలీ ప్రత్యేక న్యాయమూర్తి జస్వీందర్ సింగ్ స్పష్టం చేశారు. పంజాబ్ అసెంబ్లీ సూచనతో 2008లో విజిలెన్స్ బ్యూరో వీరిపై కేసు నమోదు చేసింది. న్యాయస్ధానానికి హాజరైన అమరీందర్ సింగ్ ఇతర నిందితులు తీర్పును స్వాగతించారు. చివరికి న్యాయం గెలిచిందని వ్యాఖ్యానించారు. రాజకీయ కక్షసాధింపుతోనే తమపై విజిలెన్స్ బ్యూరోను ప్రేరేపించి కేసులో ఇరికించారని అప్పటి అకాలీదళ్-బీజేపీ ప్రభుత్వాన్ని ఉటంకిస్తూ అమరీందర్ సింగ్ అన్నారు. ఒత్తిళ్లకు తలొగ్గిన విజిలెన్స్ బ్యూరో అధికారులపై ఎలాంటి చర్యలూ చేపట్టబోమని ఆయన స్పష్టం చేశారు. -
సీఎంపై డోప్ టెస్ట్ నిర్వహించాలన్న బీజేపీ నేత
చండీగఢ్ : పంజాబ్‌లో ప్రభుత్వ ఉద్యోగులందరికీ డోప్ టెస్ట్‌లు విధిగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సీఎం, ఆయన మంత్రివర్గ సహచరులపైనా ఈ పరీక్షలు నిర్వహించాలని ఓ బీజేపీ నేత కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల నియామకం నుంచి సర్వీసులోని వివిధ దశల్లో వారికి డోప్ టెస్ట్‌లు నిర్వహించేలా మార్గదర్శకాలు రూపొందించి, అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో డ్రగ్ సమస్యను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చర్యపై బీజేపీ నేత హర్జిత్ సింగ్ గ్రెవాల్ స్పందిస్తూ డోప్టెస్ట్ను కేవలం పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగుల వరకే ఎందుకు పరిమితం చేశారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, ఆయన కేబినెట్ సహచరులపై కూడా డోప్ టెస్ట్‌లు నిర్వహించాలని గ్రెవాల్ కోరారు. డ్రగ్ కళంకిత రాజకీయ నేతలు ప్రభుత్వంలో ఉంటే వారు డ్రగ్ స్మగ్లర్లు, సరఫరాదారులకు సహకరించడం కొనసాగిస్తారని అన్నారు. -
సంచలనం.. ప్రభుత్వ ఉద్యోగులకు డ్రగ్స్ టెస్ట్
అమృత్సర్ : డ్రగ్ మాఫియాను అంతమొందించేందుకు పంజాబ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. నిషేధిత డ్రగ్స్ విక్రయించే, అక్రమ రవాణాకు పాల్పడే వారికి ఉరిశిక్ష విధించేలా కఠిన చట్టాన్ని రూపొందిస్తున్నామని కెప్టెన్, సీఎం అమరీందర్ సింగ్ ఇటీవల ప్రకటించారు. ఇకనుంచి ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డ్రగ్స్ టెస్ట్ నిర్వహించి డోపీలుగా తేలితే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని అమరిందర్ బుధవారం హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల అనంతరం చేసే ఎంపిక ప్రక్రియ సమయంలో కొత్త అభ్యర్థులకు సైతం డ్రగ్స్ టెస్ట్‌లు చేస్తామని తెలిపారు. ప్రతి ఏడాది ఉద్యోగులకు వైద్య పరీక్షలతో పాటు డ్రగ్స్ లాంటి ఉత్ప్రేరకాలకు సంబంధించిన టెస్ట్‌లు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. డ్రగ్స్ కారణంగా రాష్ట్ర యువత పెడదోవ పడుతోందని, ఇప్పటికే ఏడాది ఎంతో మంది మాదకద్రవ్యాల కారణంగా మృత్యువాత పడుతున్నారని ఆరోపణలున్నాయి. దీనిపై మంత్రి తృప్త్ సింగ్ బజ్వా జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. పోలీస్‌శాఖలోనూ డీజీపీ నుంచి మొదలు అందరూ పోలీసులకు డోపింగ్ టెస్టులు నిర్వహిస్తాం. కొందరు పోలీసులు ఇప్పటికే డ్రగ్స్‌కు బానిసలు అయ్యుంటారు. మొహాలిలోని చీఫ్ మెడికల్ ఆఫీసర్ వద్దకు వెళ్లి నేను కూడా బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి టెస్టులు చేపించుకుంటా. మంత్రివర్గంలోని అందరూ ఈ వైద్య పరీక్షలకు తప్పనిసరి హాజరు కావాల్సి ఉంటుందని’ వివరించారు. కాగా, తాము అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ మాఫియాను అంతం చేస్తామన్న హామీకి అమరీందర్ కట్టుబడి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న స్మగ్లర్లకు మరణశిక్ష విధించాల్సిందిగా కోరుతూ అమరీందర్ సింగ్ కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన విషయం తెలిసిందే. సంబంధిత చట్టంలో మార్పులు తీసుకురావాలని కోరారు. ఈ క్రమంలో పలు కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనకాడబోమని తమ చర్యలతో కెప్టెన్ మరోసారి నిరూపించారు. సీఎం అమరీందర్ నిర్ణయంపై ఇతర పార్టీల నేతలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ -
‘డ్రగ్ ఫ్రీ పంజాబ్’ కోసం సంచలన నిర్ణయం...
చండీఘడ్ : డ్రగ్ మాఫియాను అంతమొందించేందుకు పంజాబ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై నిషేధిత డ్రగ్స్ విక్రయించే, అక్రమ రవాణాకు పాల్పడే వారికి ఉరిశిక్ష విధించేలా కఠిన చట్టాన్ని రూపొందించేందుకు తమ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సీఎం అమరీందర్ సింగ్ తెలిపారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు పంపినట్లు ఆయన పేర్కొన్నారు. ‘తరతరాలను నాశనం చేయగల శక్తి డ్రగ్స్‌కు ఉంది. వీటిని నివారించేందుకు కఠిన శిక్షలు విధించాల్సిన అవసరం ఉంది. డ్రగ్ ఫ్రీ పంజాబ్ పట్ల శ్రద్ధ వహిస్తానన్న మాటకు కట్టుబడి ఉన్నానంటూ’ అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు. డ్రగ్ మాఫియాను అరికడతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినఅమరీందర్ సింగ్ ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదంటూ ప్రతిపక్షం శిరోమణి అకాళీదళ్ గత కొన్ని రోజులుగా విమర్శల దాడి పెంచింది. ఈ నేపథ్యంలో అమరీందర్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకోవడం గమనార్హం. My govt has decided to recommend the death penalty for drug peddling/smuggling. The recommendation is being forwarded to the Union government. Since drug peddling is destroying entire generations, it deserves exemplary punishment. I stand by my commitment for a drug free Punjab. pic.twitter.com/dXZTsDwVpf — Capt.Amarinder Singh (@capt_amarinder) July 2, 2018 -
ఆ హామీలు నెరవేర్చాలంటే..
సాక్షి, చండీఘర్ : అధికారానికి పదేళ్లు దూరంగా ఉన్న పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ పాలనాపగ్గాలు అందుకునేందుకు ఇచ్చిన హామీలు ఇప్పుడు సీఎం అమరీందర్ సింగ్‌ను చిక్కుల్లో పడేశాయి. రైతులకు రుణ మాఫీ, యువతకు ఉద్యోగాలు, స్మార్ట్ ఫోన్ల పంపిణీ వంటి పలు వరాలు గుప్పించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా వాటి అమలు దిశగా అడుగులు వేయలేదు. రుణమాఫీ కాకుండానే ఇతర హామీల అమలుకు రూ 10,000 వేల కోట్ల నిధులు అవసరమవుతుండగా, బ్యాంకులు, ఆర్థిక సంస్ధలకు రైతుల రుణ బకాయిలు రూ 90,000 కోట్లు పేరుకుపోయాయి. మొత్తంమీద ఎన్నికల హామీలను నెరవేర్చాలంటే అమరీందర్ సర్కార్‌కు రూ లక్ష కోట్ల నిధులు అందుబాటులో ఉండాలి. నిధుల కొరత వెంటాడుతుండటంతో ఈ హామీల అమలుకు పంజాబ్ ప్రభుత్వం ఇప్పటికిప్పుడు చేసేదేమీలేదు. వ్యవసాయ రుణాల మాఫీని ప్రభుత్వం ఇటీవల ప్రకటించినా అది పలు పరిమితులతో అరకొరగా సాగుతోంది. రానున్న నాలుగేళ్లలో హామీలన్నీ నెరవేరుస్తామని సర్కార్ నమ్మబలుకుతోంది. మరోవైపు అమరీందర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పంజాబ్‌లో 360 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని విపక్ష నేత సుఖ్‌పాల్ సింగ్ ఖైరా ఆరోపించారు. వ్యవసాయ రుణాల మాఫీతో పాటు ఇంటికో ఉద్యోగం, డ్రగ్స్ నిర్మూలన, అవినీతికి చరమగీతం, యువతకు స్మార్ట్ఫోన్ల పంపిణీ వంటి పలు హామీలను నెరవేర్చడం పాలక కాంగ్రెస్‌కు సవాల్‌లా మారింది. నిధుల కొరతతో ఇటీవల కొన్నినెలల పాటు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలే చెల్లించలేని పరిస్థితి నెలకొంది. పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నుంచి సరైన ఆర్థిక సహకారం లభించకపోవడం ప్రభుత్వానికి మరింత ఇబ్బందికరంగా మారింది. -
డీఎస్పీగా మహిళా టీ20 కెప్టెన్
ఛండీగర్ : భారత మహిళల క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, డిప్యూటీ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీసుగా కొత్త బాధ్యతలు చేపట్టారు. నేటి(గురువారం) నుంచి ఆమె ఈ బాధ్యతలు స్వీకరించారు. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(డీజీపీ) సురేష్ అరోరాలు హర్మన్ ప్రీత్ కౌర్ యూనిఫాంకు స్టార్లను పిన్ చేసి నూతన బాధ్యతలు అప్పజెప్పారు. ''యంగ్ క్రికెటర్ హర్మన్ ప్రీత్‌కు ఈ బాధ్యతలు అప్పజెప్పడంలో పాల్గొనడం ఎంతో గర్వకారణం. హర్మన్ ప్రీత్ పంజాబ్ పోలీసు విభాగంలో డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. హర్మన్ ప్రీత్ మాకు ఎంతో గర్వకారకంగా నిలిచింది. ఆమె ఇలానే కొనసాగిస్తుందని నేను నమ్ముతున్నా. నా శుభాకాంక్షలు ఆమెతో ఎప్పటికీ ఉంటాయి'' అని అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు. గతేడాది జరిగిన ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో భారత జట్టు ఫైనల్‌కు రావడంతో హర్మన్‌ప్రీత్ కీలక పాత్ర పోషించింది. దీంతో హర్మన్ ప్రీత్ కౌర్‌కు పంజాబ్ ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగం ఇస్తున్నట్లు గత జులైలో ప్రకటించింది. పోలీసు ఉద్యోగం అంటే బాగుంటుందని కాబట్టి డీఎస్పీ పోస్టుని తీసుకునేందుకు గాను హర్మన్ ప్రీత్ తాను చేస్తున్న రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేసింది. అయితే పశ్చిమ రైల్వేతో ఐదేళ్ల ఒప్పందం కుదుర్చుకోవడంతో రిలీవ్ చేసేందుకు అధికారులు నిరాకరించారు. అయినా వెళ్లాలనుకుంటే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఐదేళ్ల వేతనం రూ.27 లక్షలు చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ వ్యవహారంలో పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ జోక్యం చేసుకుని, రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాస్తూ హర్మన్ సమస్యను వేరే కోణంలో చూడాలని, ఆమె రాజీనామాను ఆమోదించాలని కోరారు. ముఖ్యమంత్రి లేఖతో దిగివచ్చిన రైల్వే, హర్మన్ ప్రీత్‌తో కుదుర్చుకున్న బాండ్‌ను రద్దు చేసింది. దీంతో పోలీసు ఉద్యోగంలో చేరేందుకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఈ క్రమంలో ఆమె నేడు డీఎస్పీగా పదవీ బాధ్యతలు స్వీకరించింది. Proud to join DGP Suresh Arora in pinning the stars on the uniform of this young cricketer @ImHarmanpreet as she takes over as DSP in @PunjabPolice. This lady has done us proud and I’m confident she’ll continue to do so. My best wishes are with her. pic.twitter.com/0yuDOdr6j7 — Capt.Amarinder Singh (@capt_amarinder) March 1, 2018 -
'పంజాబ్‌కు ఏం కాదు.. కలిసే ఉంటుంది'
సాక్షి, అమృత్సర్ : ఐక్య భారత్‌కే తమ దేశం కట్టుబడి ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అన్నారు. భారత్‌లోగాని, మరెక్కడైనాగానీ విభజన ఉద్యమాలకు తమ దేశం మద్దతివ్వబోదని చెప్పారు. ఖలిస్థాన్ డిమాండ్ తగ్గుముఖం పట్టేందుకు కూడా తన వంతు కృష్టి చేస్తానంటూ పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్‌కు ట్రూడో హామీ ఇచ్చారు. పంజాబ్ ఎప్పటికీ కలిసే ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లో విడిపోదని ఆయన హామీ ఇచ్చారు. కెనడాలో కొంతమంది సిక్కులు ఖలిస్తాన్ డిమాండ్ చేస్తుండటంతో ట్రూడో పంజాబ్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఖలిస్తాన్ డిమాండ్ సరైనది కాదని, ఐక్య పంజాబ్ తమకు కావాలని, ఈ డిమాండ్ తగ్గుముఖం పట్టేందుకు తమకు సహకరించాలని ట్రూడోను సీఎం అమరిందర్ సింగ్ కోరారు. 'నేను ట్రూడోకు చాలా స్పష్టంగా చెప్పాను. ఇక్కడ ఖలిస్తాన్ అనేది ప్రధాన సమస్య. దీనికోసం వివిధ దేశాల నుంచి డబ్బులు వస్తున్నాయి. ముఖ్యంగా కెనడా నుంచి ఎక్కువగా వస్తున్నాయి. పంజాబ్‌ను అల్లకల్లోలం చేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. వాటికి మీరు సహకరించొద్దు. ఐక్యభారత్కు సహకరించాలి' అని తాను ట్రూడోను కోరినట్లు చెప్పారు. అందుకు ట్రూడో నుంచి సానుకూల ప్రకటన వెలువడింది. -
రేపు ట్రూడోతో అమరీందర్ భేటీ
చండీగఢ్/అహ్మదాబాద్/గాంధీనగర్: పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో బుధవారం భేటీ కానున్నారు. ట్రూడోకు రెడ్‌కార్పెట్‌తో స్వాగతం పలకాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు. ‘ట్రూడోతో సమావేశం కోసం ఎదురుచూస్తున్నా. ఈ భేటీతో భారత్–కెనడా వ్యాపార సంబంధాలు పటిష్టం కావడంతో పాటు ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలు మెరుగవుతాయని ఆశిస్తున్నా’ అని అమరీందర్ ట్వీట్ చేశారు. కెనడాలో పెద్దఎత్తున స్థిరపడ్డ పంజాబీలు ఇరుదేశాల మధ్య సత్సంబంధాల పటిష్టానికి ఎంతో కృషి చేశారన్నారు. స్వర్ణ మందిరాన్ని సందర్శించుకున్న అనంతరం ట్రూడో అమరీందర్‌తో భేటీ కానున్నారు. గతంలో పంజాబ్‌కు వచ్చిన కెనడా రక్షణమంత్రి హర్జిత్ సజ్జన్‌ను ఖలిస్తాన్ సానుభూతిపరుడిగా అభివర్ణించిన అమరీందర్, ఆయన్ను కలుసుకోవడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే. 2016లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేళ కెనడాలోని పంజాబీ ఎన్నారైలను కలుసుకునేందుకు కెనడా అనుమతించకపోవడంపై అమరీందర్ ట్రూడోకు ఘాటుగా లేఖ రాశారు. మహిళలకు అవకాశం కల్పించట్లేదు: ట్రూడో మహిళలు పూర్తిస్థాయిలో తమ శక్తిసామర్థ్యాలను నిరూపించుకునేందుకు వీలుగా సమాజం తగిన అవకాశాలు కల్పించడం లేదని ట్రూడో అభిప్రాయపడ్డారు. 50 శాతం జనాభా(మహిళల) భాగస్వామ్యం లేకుండా సమాజం, ఆర్థికవ్యవస్థ అభివృద్ది చెందడం సాధ్యంకాదని తేల్చిచెప్పారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) అహ్మదాబాద్ విద్యార్థులతో సోమవారం నాడిక్కడ సమావేశమైన ఆయన, పలు అంశాలపై మాట్లాడారు. ‘21వ శతాబ్దం వేర్వేరుజాతులు కలసిమెలసి జీవించే సమాజానిదే. ఈ వైరుధ్యాలను బలంగా ఎలా మార్చుకుంటామన్నదే సమాజం ముందున్న సవాలు. విభిన్న సంస్కృతులు, జాతులున్న భారత్, కెనడాలు ఈ సమస్యను చక్కగా ఎదుర్కొన్నాయి’ అని ఆయన అన్నారు. కెనడియన్ కావాలంటే రంగు, రూపంతో ఎలాంటి పనిలేదనీ, చేసే వృత్తితో పాటు ఫ్యాషన్‌పై మక్కువ ఉంటే చాలని వ్యాఖ్యానించారు. ఈ భేటీకి ముందు ట్రూడో దంపతులు భారతీయ వస్త్రధారణతో సబర్మతీ ఆశ్రమాన్ని, స్వామి నారాయణ్ అక్షర్ధామ్ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం గుజరాత్ సీఎంతో భేటీ అయ్యారు. మోదీపై కెనడా మీడియా ఆగ్రహం భారత పర్యటనకు వచ్చిన ట్రూడోకు స్వాగతం పలకడానికి ప్రధాని మోదీ విమానాశ్రయానికి వెళ్లకపోవడంపై కెనడా మీడియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖలిస్తాన్ వేర్పాటువాదులకు ట్రూడో ప్రభుత్వం మద్దతుగా నిలవడమే ఇందుకు కారణమని ఆరోపించింది. ఈ చర్యతో మోదీ ట్రూడోను అవమానించారని మండిపడింది. మరోవైపు ఈ ఊహాగానాలను భారత అధికారులు ఖండించారు. ట్రూడోను ఆహ్వానించేందుకు ప్రోటోకాల్ ప్రకారం కేంద్ర మంత్రి వెళ్లారని గుర్తుచేశారు. సాధారణంగా విదేశీ పర్యటన ప్రారంభంలోనే ఇరుదేశాల అధినేతలు భేటీ అవుతారనీ, కానీ ఈ పర్యటన చివర్లో ప్రధాని మోదీతో ట్రూడో భేటీ అయ్యేలా షెడ్యూల్‌ను కెనడా అధికారులు రూపొందించడం తమకు ఆశ్చర్యం కలిగించిందని వెల్లడించారు. గుజరాత్లో ట్రూడోతో మోదీ కలసి పర్యటించేందుకు ముఖ్యమైన అంశాలేవీ లేవని పేర్కొన్నారు. -
ఆరోపణలతో ఇరిగేషన్ మంత్రి రాజీనామా
అమృతసర్ : పంజాబ్ విద్యుత్, నీటిపారుదల శాఖ మంత్రి రాణా గుర్జిత్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. నిన్న (సోమవారం) ఆయన తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు సమర్పించారు. కాగా ఇసుక క్వారీల వేలంపాట వ్యవహారంలో మంత్రి గుర్జిత్ సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కోట్ల రూపాయల మేరకు ముడుపులు అందుకున్నట్లు మంత్రితో పాటు ఆయన సిబ్బందిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో గుర్జిత్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి పదవికి రాజీనామా చేసిన వెల్లడించారు. తన రాజీనామాపై తుది నిర్ణయం పార్టీ హైకమాండ్‌తో పాటు, ముఖ్యమంత్రిదేనని గుర్జిత్ తెలిపారు. కాగా మంత్రి గురిజిత్ వంటమనిషి 26కోట్లు వెచ్చించి ఇసుక క్వారీలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వేలంలో నాలుగు గనులు మంత్రి బినామీలు సొంతం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
విజయదుందుభి మోగించిన కాంగ్రెస్
చండీఘడ్ : పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయపతాకం ఎగరవేసింది. ఈ ఏడాది ప్రథమార్థంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ.. ఆదివారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం సత్తా చాటింది. జలంధర్, పటియాలా, అమృతసర్‌లలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుపై మాట్లాడిన పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్.. కాంగ్రెస్ పార్టీ పాలసీలకు ప్రజలు మరోసారి పట్టం కట్టారని అన్నారు. విద్వేషపూరిత భావజాలాన్ని ప్రచారం చేస్తున్న ప్రతిపక్షానికి మున్సిపల్ ఎన్నికల తీర్పు చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. కాగా, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంపై ప్రతిపక్షాలు పలు ఆరోపణలు గుప్పించాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేసిందని, పటియాలలో భారీగా రిగ్గింగ్‌కు పాల్పడిందని బీజేపీ, అకాళీదళ్‌ల కూటమి ఆరోపించింది. జలంధర్ మున్సిపల్ కార్పొరేషన్లో 80 స్థానాలకు గాను 66 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించగా.. బీజేపీ, అకాళీదళ్‌ల కూటమి 12 స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది. రెండు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. పటియాలాలో 60 సీట్లకు గాను 58 సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది. అమృతసర్‌లో సైతం కాంగ్రెస్ హవా నడిచింది. మొత్తం 85 స్థానాల్లో 63 స్థానాలను అధికార కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. -
పాక్ గూఢచారికి ముఖ్యమంత్రి ఆశ్రయం
సాక్షి, చండీగఢ్ : పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన విమర్శలు చేసింది. పాకిస్తాన్ గూఢచారి అరూసా ఆలమ్‌కు పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ ఆశ్రయం కల్పించారని ఆప్ పార్టీ నేత సుఖ్‌పాల్ సింగ్ ఖైరా తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో అరూసా ఆలం ప్రస్తుతం బస చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అరూసా ఆలం గురించిన ఖచ్చతమైన సమాచారంతోనే తాను మాట్లాడుతున్నాని సుఖ్‌పాల్ సింగ్ చెప్పారు. పంజాబ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోనూ.. సుఖ్‌పాల్ సింగ్ ఈ అంశంపైనే ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్‌ను లక్ష్యంగా చేసుకుని రాయడానికి వీలుకాని భాషలో విమర్శలు చేశారు. అసూరా అలంపై కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా సుఖ్‌పాల్ సింగ్ ఖైరా విమర్శలపై తీవ్రంగా స్పందించింది. ఖైరా మతిభ్రమించి మాట్లాడుతున్నారని మంత్రి నవజ్యోత్‌సింగ్ సిద్ధూ అభిప్రాయపడ్డారు. -
పద్మావతిపై కాంగ్రెస్ సీఎంల్లో చీలిక
సాక్షి,న్యూఢిల్లీ: వివాదాస్పద పద్మావతి మూవీ ప్రకంపనలు రాజకీయ పార్టీల్లోనూ సెగలు రేపుతున్నాయి. ఈ చిత్రంపై కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల సీఎంల్లో చీలిక నెలకొంది. పద్మావతికి కాంగ్రెస్ పాలిత కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బాసటగా నిలిస్తే అదే పార్టీకి చెందిన పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ వ్యతిరేకించారు. చరిత్రను వక్రీకరించే సినిమాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. పటియాలా రాజకుటుంబానికి చెందిన అమరీందర్ సింగ్ కర్నాటక సీఎంతో విభేదించారు. చరిత్రను ఇష్టానుసారం వక్రీకరిస్తే నిరసనలు తెలపడం ప్రజాస్వామిక హక్కని అమరీందర్ అన్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పద్మావతిపై నిరసనలను తోసిపుచ్చారు. మూవీ హీరోయిన్ దీపికా పడుకోన్‌కు వస్తున్న హెచ్చరికలను తీవ్రంగా ఖండించారు. మహిళలను బెదిరించడం పెరుగుతున్న అసహనానికి మరో సంకేతమని, బీజేపీ స్వార్థపూరిత రాజకీయాల్లో ఇది భాగమని వ్యాఖ్యానించారు. దీపిక కుటుంబానికి కర్ణాటక ప్రభుత్వం పూర్తి భద్రత కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. -
ముఖ్యమంత్రుల మాటల యుద్ధం
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీని ఆవరించిన పొగమంచు, వాతావరణ కాలుష్యం ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య మాటల యుద్ధానికి కారణంగా నిలిచింది. ఢిల్లీ వాతావరణ కాలుష్యంపై సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో చర్చించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విటర్ వేదికగా కేజ్రీవాల్, అమరేందర్ సింగ్ పరస్పరం వాగ్బాణాలు సంధించుకున్నారు. పంజాబ్‌లో పంటలను తగలబెట్టడం వల్ల ఢిల్లీలో వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది, దాన్ని తక్షణం నిలుపుచేయండి.. అంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, అమరేందర్ సింగ్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఢిల్లీ పరిస్థితులకు ఒకరకంగా మీరే కారణం అంటూ కేజ్రీవాల్ మాటల దాడి చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆవేదనను నేను అర్థం చేసుకోగలను.. కానీ పరిస్థితులు నా చేతులు దాటి వెళ్లిపోయాయి. కాలుష్య నివారణకు జాతీయ స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిందే.. అంటూ పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ ట్వీట్ ద్వారానే సమాధానం చెప్పారు. My office continuously trying to take time from CMs of Punjab n Haryana for me to meet the two CMs. Its an emergency — Arvind Kejriwal (@ArvindKejriwal) 8 November 2017 Share your concern over stubble burning and pollution @ArvindKejriwal, Centre alone can solve the problem given its national implications. — Capt.Amarinder Singh (@capt_amarinder) 8 November 2017 I agree sir that Centre shud take lead. But pl grant me time to discuss if together we can present a plan to centre. Del is choking sir https://t.co/qMQJX6Y4It — Arvind Kejriwal (@ArvindKejriwal) 8 November 2017 Situation is serious but Punjab helpless as problem is widespread & state has no money to compensate farmers for stubble management (1/2). — Capt.Amarinder Singh (@capt_amarinder) 8 November 2017 -
నిర్మలపై అమర్ మండిపాటు
సాక్షి, న్యూఢిల్లీ: ముంబైలోని ఎల్ఫినోస్టోన్ రైల్వేస్టేషన్లో బ్రిడ్జి నిర్మాణానికి ఆర్మీని రంగంలోకి దింపినట్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మంగళవారం ప్రకటించారు. ఎల్ఫిన్‌స్టోన్ రైల్వేస్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జీపై తొక్కిసలాట జరిగి.. 23మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ స్టేషన్‌తోపాటు మరో రెండు రైల్వే స్టేషన్లలో ఫుట్ ఓవర్ బ్రిడ్జీలను కట్టేందుకు ఆర్మీ సహకారం తీసుకుంటున్నట్టు సీఎం ఫడ్నవిస్ తెలిపారు. వచ్చే జనవరి 31నాటికి వీటి నిర్మాణం పూర్తవుతుందని ఆయన ప్రకటించారు. తొక్కిసలాట జరిగిన ఎల్ఫిన్‌స్టోన్ రైల్వేస్టేషన్‌ను సందర్శించేందుకు కేంద్ర రక్షణమంత్రి నిర్మలా సీతారామన్, రైల్వేమంత్రి పీయూష్ గోయల్ ముంబైకి వచ్చిన సందర్భంగా ఫడ్నవిస్ ఈ ప్రకటన చేశారు. అయితే, సీఎం ఫడ్నవిస్ ప్రకటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్మీ మాజీ జవాన్ అయిన పంజాబ్ సీఎం అమరిందర్‌సింగ్ ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. ఆర్మీ, నిర్మలా సీతారామన్‌లను ట్విట్టర్లో ట్యాగ్ చేస్తూ.. సివిల్ పనుల కోసం ఆర్మీ వనరులను వాడుకోవడం ఎంతమాత్రం సరికాదని నిర్మలను తప్పుబట్టారు. 'ఆర్మీ కర్తవ్యం యుద్ధం కోసం శిక్షణ పొందడం కానీ, సివిల్ పనుల కోసం ఉపయోగించుకోవడం కాదు నిర్మలాజీ. రక్షణ వనరులను పౌర పనుల కోసం వినియోగించరాదు. 1962 చైనా యుద్ధం సమయంలోనూ జనరల్ కౌల్ ఇదే విధంగా వ్యవహరించారు. ఇలా చేయడం సరైన సంప్రదాయం కాదు. దీనిని నివారించండి ప్లీజ్' అంటూ ఆయన కామెంట్ చేశారు. జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ సైతం ఈ విధానాన్ని ట్విట్టర్లో తప్పుబట్టారు. అత్యవసర పరిస్థితుల్లో ఆర్మీని వాడుకోవడం చూశాం కానీ, ఇప్పుడు రోడ్ల మీద గుంతలు పడినా..ఆర్మీని పిలిచేలా కనిపిస్తోందని మండిపడ్డారు.