
చండీగఢ్ : ముగ్గురు జవాన్ల మృతదేహాలకు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ నివాళులు అర్పించారు. గాల్వాన్‌లో చైనా, భారత జవాన్లకు మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లేహ్ నుంచి చండీగఢ్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చెరుకున్న ముగ్గురు ఆర్మీ జవాన్ల మృతదేహాలకు అమరీందర్‌సింగ్ శుక్రవారం నివాళులు అర్పించారు. (మణిపూర్‌లో బీజేపీ పడిపోతుందా లేదా!?)
భారత భూభాగాన్ని వెంటనే ఖాళీ చేసి వెళ్లకపోతే, ధీటుగా ప్రతి దాడి చేస్తామని చైనాకు హెచ్చరికలు జారీ చేయాలని కేంద్ర ప్రభాత్వాన్ని అమరీందర్ సింగ్ కోరారు. దీని వల్ల ఎలాంటి పర్యావసనాలు ఎదురైనా, అవి శాశ్వతంగా ఉండవన్నారు. 60 ఏళ్ల దౌత్యం విఫలమయిందని, 20 మంది జవాన్లను దారుణంగా దాడిచేసి హతమార్చారని పేర్కొన్నారు. 60 ఏళ్ల దౌత్యం పనిచేయలేదు, చైనా అగ్రదేశం అయితే, భారత్ కూడా అందుకు సమానమే అని పేర్కొన్నారు. ఇప్పుడు కాదు 1962 నుంచి చైనా ఆక్రమణలు చేస్తూనే ఉన్నారని అమరీందర్ తెలిపారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ 1963-1966 మధ్య ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. (ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రకు ప్లాస్మా థెరఫీ)
Comments
Please login to add a commentAdd a comment