చండీగఢ్: పంజాబ్‌లో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. కెప్టెన్ అమరీందర్ సింగ్ తన సీఎం పదవికి ఇటీవల రాజీనామా చేయగా, తాజాగా పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. మంగళవారం తన రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపించారు సిద్ధూ. తన రాజీనామా లేఖలో పరోక్షంగా అమరీందర్ సింగ్‌ను వ్యవహరాన్ని ప్రస్తావించారు.
ఆయనకు వ్యక్తిత్వం లేదని పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తారని అమరీందర్ సింగ్‌పై మండిపడ్డారు. ఆయన స్వలాభం కోసం పంజాబ్ భవిష్యత్తు, ప్రజల సంక్షేమంపట్ల వివక్షతకు పాల్పడుతున్నారని అన్నారు. అందుకే తాను రాజీనామా చేస్తున్నానని వివరించారు. కాగా, ఈ రోజు (మంగళవారం) సాయంత్రం బీజేపీ నేతలను కలిసేందుకు అమరీందర్ సింగ్ ఢిల్లీకి పయనమైనట్లు వార్తలు వస్తున్నాయి.
పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన 72 రోజులకే సిద్దూ రాజీనామా చేయడంతో పంజాబ్ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఈ రోజు మధ్యాహ్నం వరకు పంజాబ్‌లోనే ఉన్నారు. కాగా, వీరు వెళ్లగానే సిద్దూ రాజీనామా అస్త్రాన్నిసంధించారు. తన రాజీనామాలో సిద్ధూ.. మనం రాజీపడిన రోజు మన వ్యక్తిత్వం పతనమైనట్లే అని ఘాటుగా స్పందించారు.
ఎన్నికలకు ఆరునెలల ముందు కాంగ్రెస్‌కు జీర్ణించుకోలేని పరిణామాలు సంభవించాయి. సిద్దూ ఆరోపణల నేపథ్యంలో అమరీందర్‌సింగ్‌ను సీఎం పదవి నుంచి కాంగ్రెస్ దించిన విషయం తెలిసిందే. ఇటు అమరీందర్ సింగ్‌ను.. అటూ సిద్దూను కాంగ్రెస్ ఇద్దరిని దూరం చేసుకుని ఇరకాటంలో పడింది.
Amarinder Singh Delhi Tour: అమరీందర్ సింగ్ బీజేపీలో చేరనున్నారా?
Comments
Please login to add a commentAdd a comment