PCC Cheif
-
ఆ ఇద్దరిలో ఒక్కరికి పీసీసీ చీఫ్ పదవి
-
ఈ ఇద్దరిలో ఎవరో?
మంత్రివర్గ విస్తరణపై అస్పష్టత రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా ఉత్సుకతతో ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ పెద్దలు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. తాజా భేటీలో మంత్రివర్గ కూర్పుపై అభిప్రాయ సేకరణకు పరిమితమైన అధిష్టానం.. దానిపై మరోమారు చర్చిద్దామంటూ వాయిదా వేసినట్లు తెలిసింది. పీసీసీ అధ్యక్షుడి నియామకమయ్యాక దీనిపై చర్చిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక బీఆర్ఎస్ నుంచి పారీ్టలో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కాలె యాదయ్య, సంజయ్‌కుమార్, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలకు సంబంధించి కొన్ని డిమాండ్లు ఉన్నాయంటూ.. వీరికి కార్పొరేషన్ పదవులు కట్టబెట్టాలనే ప్రతిపాదనను హైకమాండ్ ముందు రాష్ట్ర నేతలు ఉంచినట్లు తెలిసింది. దీనికి హైకమాండ్ అంగీకరించినట్లు సమాచారం. సాక్షి, న్యూఢిల్లీ: టీపీసీసీకి కొత్త అధ్యక్షుడి ఎంపిక వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చింది. తెలంగాణ పార్టీ పగ్గాలను బీసీ నేతకు అప్పగించాలనే అభిప్రాయానికి ఢిల్లీ పెద్దలు వచ్చి నట్లు తెలుస్తోంది. రాష్ట్ర నేతలు వెలిబుచ్చిన అభిప్రాయాలు, సామాజిక సమీకరణాలు పరిగణనలోకి తీసుకున్న హైకమాండ్.. బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతలైన మహేశ్‌కుమార్ గౌడ్, మధుయాష్కీ గౌడ్‌లలో ఒకరికి పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ పార్టీ ముఖ్యులతో జరిగిన చర్చల్లో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక కసరత్తు ఓ కొలిక్కి వచ్చిందని, ఏ క్షణమైనా ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడి నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, జిల్లాల వారీ ప్రాతినిధ్యం, సామాజిక సమీకరణలు, పారీ్టలో పనిచేసిన అనుభవం ఆధారంగా కొత్త మంత్రులపై నిర్ణయం ఉంటుందని సమాచారం. సుదీర్ఘ చర్చలు..: కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికతో పాటు ప్రభుత్వంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న కేబినెట్ పదవుల భర్తీపై గత నెల రోజులుగా తీవ్ర కసరత్తు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే పలుమార్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్‌గాం«దీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లతో చర్చలు జరిపారు. మరోవైపు అధిష్టానం కూడా ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిల అభిప్రాయాన్ని తీసుకుంది.తాజాగా ఆయా అంశాలపై చర్చించేందుకు శుక్రవారం ఢిల్లీ వచ్చిన రేవంత్‌రెడ్డి, భట్టి, ఉత్తమ్‌లు పార్టీ ప్రధాన కార్యాలయంలో ఖర్గే, రాహుల్‌గాం«దీ, కేసీలతో మరోమారు భేటీ అయ్యారు. సుమారు రెండు గంటల పాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అధిష్టానం ముఖ్య నేతలతో విడివిడిగా కూడా సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకుంది. చర్చకు వచ్చిన ఆరు పేర్లు పీసీసీ పదవికి ప్రధానంగా ఆరుగురు నేతల పేర్లపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. బీసీ సామాజికవర్గం నుంచి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ఎస్సీ సామాజికవర్గం నుంచి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, ఎస్టీ సామాజికవర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్, ఓసీ సామాజికవర్గం నుంచి మంత్రి శ్రీధర్‌బాబుల పేర్లను పరిశీలించినట్లు సమాచారం. అయితే రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రతిపక్ష పారీ్టలను ధీటుగా ఎదుర్కోవాల్సిన ఆవశ్యకతతో పాటు సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకుని బీసీ సామాజికవర్గ నేతలకే పదవి కట్టబెట్టాలనే నిర్ణయానికి వచ్చారు.ముఖ్యంగా బీసీ నేతలకు కేంద్ర ప్రభుత్వ, పార్టీ పదవుల్లో బీజేపీ మొదటి ప్రాధాన్యత ఇస్తూ వారిని మచ్చిక చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు పరిగణనలోకి తీసుకుని బీసీ వర్గ నేతలవైపే హైకమాండ్ పెద్దలు మొగ్గు చూపినట్లు తెలిసింది. వారిలో పార్టీ కార్యకలాపాల్లో మొదటినుంచీ చురుగ్గా ఉన్న మహేశ్‌గౌడ్ వైపు మెజార్టీ నేతలు మొగ్గు చూపగా, ఆయన ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉండటంతో పాటు ఎమ్మెల్సీగా కొనసాగుతున్న దృష్ట్యా, మధుయాష్కీ పేరును పరిశీలించాలని మరికొందరు నేతలు అభిప్రాయపడినట్లు తెలిసింది.అయితే దీనిపై నిర్ణయాధికారం తమకు అప్పగించాలని, ఎవరి పేరును ప్రకటించినా పార్టీ నేతలంతా కలిసి పనిచేయాలని హైకమాండ్ పెద్దలు సూచించినట్లు తెలిసింది. మరోవైపు ఓసీ, ఎస్టీ, ఎస్సీ సామాజిక వర్గాలకు సైతం ప్రాధాన్యం ఇచ్చేలా ముగ్గురు వైస్ ప్రెసిడెంట్లను నియమించాలనే దానిపై భేటీలో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. -
తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త చీఫ్.. భారీ పోటీ!
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఆరు నెలలు అవుతోంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సైతం 8 సీట్లను గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ మెరుగైన ప్రదర్శన ఇచ్చిది. అయితే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త చీఫ్‌ను నియమించాల్సిన సమయం వచ్చింది. కొత్త చీఫ్‌తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్స్, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఛైర్మన్ల మార్పుపై కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. ఈ నెలాఖరులోగా కొత్త చీఫ్‌పై ఏఐసీసీ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 27న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా సీఎం రేవంత్ రెడ్డి పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త చీఫ్ ఎంపికపై కాంగెస్ పార్టీ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. పీసీసీ చీఫ్‌తో పాటు, వర్కింగ్ ప్రెసిండెంట్స్కు సీనియర్, కీలక నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. పీసీసీ చీఫ్ పోటీలో మంత్రి పొన్నం ప్రభాకర్, మహేష్‌కుమార్ గౌడ్, మధుయాష్కిలు ఉన్నారు. అదే విధంగా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, సంపత్ కుమార్ తదితరులు పీసీసీ చీఫ్ ఆశావహుల్లో ఉన్నారు. మరోవైపు.. పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ పదవులను కోసం సైతం పలువురి మధ్య పోటీ నెలకొంది. వాటిని కాంగ్రెస్ నేతలు రవళి రెడ్డి, కమల్ ఆశిస్తున్నట్లు సమాచారం. -
T Congressకి కొత్త తలనొప్పి తప్పదా?
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ కాంగ్రెస్‌కు సంబంధించిన నిర్ణయాల కోసం హైకమాండ్ ఎంతగా మల్లగుల్లాలు పడుతోంది గత కొన్ని నెలలుగా చూస్తున్నాం. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికల తర్వాత.. కాంగ్రెస్ హైకమాండ్‌కు కొత్త తలనొప్పి తప్పదనిపిస్తోంది. తెలంగాణ పీసీసీ చీఫ్‌గా ఎవరిని ఎంపిక చేయబోతోంది. గాంధీభవన్‌కు కొత్త బాస్ ఎవరు కానున్నారు?.. సీనియర్ల అభ్యంతరాలు-గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టి ఆ నియామకాన్ని కాంగ్రెస్ ఎలా పూర్తి చేయబోతోంది?.. పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రిగా జోడు పదవులు నిర్వహిస్తున్న ఎనుముల రేవంత్ రెడ్డి స్థానంలో.. పార్టీకి కొత్త చీఫ్‌గా ఎవరు రాబోతున్నారు?. అసలు ఆ రేసులో ఉన్న నాయకులు ఎవరు? ఈసారి అగ్ర వర్ణాలకు ఇస్తారా? బీసీలకు ప్రాధాన్యమిస్తారా? లేక ఎస్సీ వర్గంలో సీనియర్ నేతకు ఛాన్స్ ఇస్తారా? అసలు కాంగ్రెస్ హైకమాండ్ మదిలో ఏముంది? పార్టీ నాయకత్వం దృష్టిని ఆకర్షించినవారు ఎవరు?.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి...పార్టీ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో వెంటనే పీసీసీ అధ్యక్షుడిని మారిస్తే ఇబ్బంది అవుతుందని భావించిన హైకమాండ్ ఎన్నికల తర్వాతే కొత్త పీసీసీ చీఫ్ వస్తారని తెలిపింది. ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ముగిసాయి గనుక.. ఫలితాలు రాగానే కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్త నేత వస్తారంటున్నారు. రేవంత్‌రెడ్డి కూడా పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుని పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టాలనుకుంటున్నారు. ఇక హైకమాండ్ కూడా గాంధీభవన్‌కు కొత్త బాస్‌గా ఎవరిని నియమించాలనే విషయంపై కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ ఎవరిని నియమిస్తే బాగుంటుందనే చర్చ కాంగ్రెస్ క్యాడర్లో విస్తృతంగా జరుగుతోంది. తర్వాత పీసీసీ చీఫ్ గా ఎవరు వస్తారనే విషయాన్ని సీఎం రేవంత్ దగ్గర ప్రస్తావిస్తే ఆ విషయం తన పరిధిలో లేని అంశమని, హై కమాండ్ ఎవరిని నియమించినా తనకు సమ్మతమేనని రేవంత్ రెడ్డి చెప్తున్నారట. పార్టీని ప్రతిపక్షం నుంచి అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి స్థాయిలో పనిచేయగలిగే వ్యక్తి ఎవరున్నారనే అంశంపై పార్టీ అధిష్ఠానం ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుంది? ఎవరైతే నేతలందరినీ కలుపుకొని వెళ్ళగలరు అనే దానిపై హై కమాండ్ సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.పీసీసీ చీఫ్ పదవిపై చాలా మంది సీనియర్ నేతలు ఆశలు పెట్టుకున్నట్లు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని చాలారోజుల నుండి అడుగుతున్నారు. ఇప్పుడు కూడా తాను పీసీసీ చీఫ్ రేసులో ఉన్నట్లు చెబుతున్నారు. ఇక ఎమ్మేల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సైతం తనకు పీసీసీ చీఫ్ పదవి కావాలని హై కమాండ్ కి రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి పీసీసీ చీఫ్ పదవి రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వరనే వాదన బలంగా వినిపిస్తోంది. దీంతో బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల నేతలు పీసీసీ చీఫ్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీసీసీ చీఫ్ తనకి ఇవ్వాలని చాలా రోజుల నుండి అడుగుతున్నారట. కర్ణాటకలో డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంతో పాటు పీసీసీ చీఫ్ గా ఉన్నారని తెలంగాణలో సైతం అలాంటి నిర్ణయాన్నే తీసుకోవాలని భట్టి పట్టుపడుతున్నట్లు సమాచారం. మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం పీసీసీ చీఫ్ రేసులో ఉన్నారు. తాను విద్యార్థి దశ నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నానని తనకి అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే బాగుంటుందని కాంగ్రెస్ పెద్దల దగ్గర చెబుతున్నట్లు సమాచారం. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సైతం పీసీసీ రేసులో తాను ఉన్నట్లు ప్రకటించారు. మరో బీసీ నేత మధుయాష్కీ గౌడ్ కూడా పీసీసీ చీఫ్ రేసులో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఏఐసీసీ సెక్రటరీ సంపత్‌కుమార్ సైతం పీసీసీ పదవి తనకి వస్తుందనే ధీమాలో ఉన్నారు. మొన్న నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఆశించారు. మాదిగలకు కాంగ్రెస్ సరైన గౌరవం ఇవ్వడం లేదనే చర్చ నేపథ్యంలో పార్టీ అధ్యక్ష పదవి మాదిగ సామాజికవర్గానికి చెందిన సంపత్ కి ఇస్తే బాగుంటుందనే వాదన నడుస్తోంది. ఇక మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళ పేర్లు కూడా పీసీసీ చీఫ్ పదవి కోసం పరిశీలనలో ఉన్నట్లు వినిపిస్తోంది. అయితే ప్రధానంగా జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, సంపత్ కుమార్ ల మధ్యే ప్రధాన పోటీ ఉన్నట్లు సమాచారం.అధికార పార్టీ అధ్యక్ష పదవి కోసం పదికి పైగా మంది నేతలు సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు. రెడ్డి సామాజికవర్గం నుంచి సీఎం ఉండడంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నేతలనుంచి ఒకరికి పీసీసీ పదవి దక్కనుందని గాంధీభవన్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. -
కాంగ్రెస్‌కు షాక్.. ఢిల్లీ పీసీసీ చీఫ్ రాజీనామా
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు ఢిల్లీలో షాక్ తగిలింది. ఢిల్లీ పీసీసీ అధ్యక్ష పదవికి అరవిందర్ సింగ్ లవ్లీ రాజీనామా చేశారు. అవినీతి కేసులు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆప్ పార్టీతో పొత్తు పెట్టుకోవడంపై అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయాలకు భిన్నంగా పార్టీ అధిష్టానం ఆప్‌తో పెట్టుకోవడంపై నిరసనగా రాజీనామా చేశారు. అధిష్టానం తన అభిప్రాయాలను పట్టించుకోవడంలేదని కాంగ్రెస్‌కు రాసిన రాజీనామా లేఖ పేర్కొన్నారు. Arvinder Singh Lovely resigns from the position of Delhi Congress president."The Delhi Congress Unit was against an alliance with a Party which was formed on the sole basis of leveling false, fabricated and malafide corruption charges against the Congress Party. Despite that,… https://t.co/Y1A360fuut pic.twitter.com/hLP9RtnzUE— ANI (@ANI) April 28, 2024 -
‘కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ రాజు’
సాక్షి, హైదరాబాద్: తాను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) పదవి అడగడం కొత్త కాదని.. అవకాశం వచ్చిన ప్రతి సారి తాను అడుగుతానని కాంగ్రెస్ నేత జాగ్గారెడ్డి అన్నారు. ఆయన మంగళవారం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. ‘ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పీసీసీ అవకాశం ఇస్తే ఓకే. రెడ్డిలలో ఎవరికైనా అవకాశం ఇస్తే ఆ పోటీ పడే లిస్ట్‌లో నేను ఉంటాను. రాహుల్ గాంధీ కుటుంబానికి ఎల్లప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నా. రాహుల్ గాంధీ అధికారం కోసం ఎప్పుడు అడ్డదారులు తొక్కలేదు. రాహుల్ గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం. బీజేపీ పదవుల కోసమే ఏర్పడ్డ పార్టీ. రాజ్యాంగం తీసుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ. విషయ అవగాహన లేని మంత్రి కిషన్ రెడ్డి. ఆర్థిక వనరుల సమీకరణ, బతుకు తెరువు కోసం పీకే సర్వే సంస్థ ఏర్పాటు చేసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మాదిగలు. మాదిగలు అంటేనే కాంగ్రెస్ పార్టీ. దామోదర రాజనర్సింహకు, మీరా కుమార్‌కు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీకి లాభం చేకూర్చేలా మంద కృష్ణమాదిగ మాట్లాడుతున్నారు. వర్షాకాలంలో వర్షాలు పడుతాయి. ఎండ కాలంలో వర్షాలు పడవు. కనీసం బుద్ధి లేకుండా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. నేను ఒక కాంగ్రెస్ అభిమానిగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ రాజు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఓడినా ఆయన రాజే. కేసీఆర్ ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. మా వంద రోజుల పాలన గురించి మమ్మలని అడగకండి. ఆర్టీసి బస్సులలో ప్రయాణం చేసే మహిళలను అడగండి వాళ్ళు చెపుతారు. ఫిరాయింపుల మీద నేను మాట్లాడలేను. నేను కూడా రెండు సార్లు పార్టీ మారాను. పదవుల కోసం నేను కక్కుర్తి పడను’అని జగ్గారెడ్డి అన్నాఉ. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అవమానం తక్కువ, రాజపూజ్యం ఎక్కువ ఉందని, రాజ పూజ్యం 16, అవమానం 2 ఉందని తెలపారు. -
ఎమ్మెల్యేలు జంప్.. పీసీసీ చీఫ్ రాజీనామా
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వేళ అరుణాచల్‌ప్రదేశ్ పీసీసీ చీఫ్ రాజీనామా చేశారు. అరుణాచల్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు నబమ్ టుకీ తన పదవికి రాజీనామా చేసినట్లు ఆ పార్టీ నాయకుడు ఒకరు శనివారం తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఇటీవల బీజేపీలోకి ఫిరాయించిన నేపథ్యంలో నబమ్ టుకీ తన రాజీనామాను శుక్రవారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి పంపినట్లు తెలిసింది. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి ఫిరాయించకుండా అడ్డుకోలేకపోయిందుకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేసినట్లు ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి గ్యామర్ తానా చెప్పారు. నబమ్ టుకీ రాష్ట్రంలోని సగాలీ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీఎల్పీ నాయకుడు, తూర్పు సియాంగ్ జిల్లాలోని మెబో నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన లాంబో తాయెంగ్ ఇటీవల బీజేపీలో చేరారు. అలాగే గత నెలలో మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నినాంగ్ ఎరింగ్, వాంగ్లిన్ లోవాంగ్‌డాంగ్ బీజేపీలో చేరారు. -
తెలంగాణ కొత్త పీసీసీపై కాంగ్రెస్ ఫోకస్.. భట్టికా.. బీసీకా?
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ)కి కొత్త అధ్యక్షుడి ఎంపికపై దృష్టి సారించిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కొత్త ఏడాది తొలినాళ్లలో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది. మరో మూడు నెలల్లో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పది, పదిహేను రోజుల్లోనే కొత్త అధ్యక్షుడి ఎంపిక పూర్తి చేయాలని భావిస్తోంది. దీనికై ఇప్పటికే ఏఐసీసీ పరిశీలకులు, రాష్ట్ర ముఖ్య నేతల నుంచి అభిప్రాయ సేకరణచేసిన హైకమాండ్ పెద్దలు ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఒక పేరును, బీసీ సామాజిక వర్గం నుంచి నలుగురి పేర్లను పరిశీలిస్తోంది. కష్టకాలంలో నిలబడిన తనను గుర్తించాలంటున్న భట్టి ఏఐసీసీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేరు పరిశీలనలో ఉందని తెలుస్తోంది. కర్ణాటకలో డీకే శివకుమార్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటే పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టిన మాదిరే తనకు కూడా ఆ పదవి ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిసింది. మంగళవారం రాత్రి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత సోనియాగాంధీని కలిసిన సమయంలో ఇదే విషయాన్ని ఆయన వెల్లడించినట్లు తెలుస్తోంది. పీసీ సీ అధ్యక్షుడిగా మల్లు అనంతరాములు చేసిన సేవలతో పాటు సీఎల్పీ నేతగా తా ను కష్టకాలంలో నిలబడిన తీరును పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లుగా సమాచారం. బీసీ వర్గానికే ఎక్కువ చాన్స్... ప్రస్తుతం ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గం, ఉప ముఖ్యమంత్రి ఎస్సీ సామాజిక వర్గం అయినందున పీసీసీ అధ్యక్షుడి బాధ్యతలు బీసీ సామాజిక వర్గానికి కట్టబెట్టాలనే డిమాండ్ సైతం బలంగా ఉంది. దీనిని పరిగణనలోకి తీసుకుంటున్న హైకమాండ్ బీసీ వర్గానికి చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్,మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావు పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో పొన్నం ఇప్పటికే మంత్రిగా కొనసాగుతుండటం, మధుయాష్కీ ఇటీవలే ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన దృష్ట్యా, మహేశ్ గౌడ్, వీహెచ్‌ల పేర్లపై చర్చ జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఆ ఇద్దరిలో ఒకరికి రేవంత్ మద్దతు? ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం మహేశ్ గౌడ్, వీహెచ్లలో ఒకరికి మద్దతుగా నిలుస్తున్నారని సమాచారం. మొత్తంగా ‘జనవరి రెండో వారానికల్లా తెలంగాణకు కొత్త అధ్యక్షుడు రావొచ్చు. దీనిపై ఇప్పటికే ఏఐసీసీ పరిశీలన చేస్తోంది. బీసీ సామాజిక వర్గ నేతను ఎంపిక చేసేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి’అని ఏఐసీసీలోని కీలక నేత ఒకరు వెల్లడించారు. -
నేను వెన్నుపోటు పొడవను.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు..
బెంగళూరు: కర్ణాటక సీఎంగా కాంగ్రెస్ అధిష్ఠానం ఎవరిని ఎంపిక చేస్తుందనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సమయంలో పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికి నచ్చినా నచ్చకపోయినా బాధ్యతయుతంగా ఉంటానని స్పష్టం చేశారు. తాము 135 సీట్లు గెలిచామని, ఎవరినీ విడగొట్టాలని అనుకోవడం లేదని చెప్పారు. సీఎం ఎంపిక విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు తాను కట్టుబడి ఉంటానని డీకే స్పష్టం చేశారు. వెన్నుపోటు పొడవనని, బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయనని గాంధీ కుటుంబం పట్ల తన విధేయతను చాటుకున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్‌కు 20 సీట్లు తేవడమే తము ముందున్న సవాల్ అని డీకే తెలిపారు. చరిత్రలో తన గురించి తప్పుగా ఉండాలని కోరుకోవడం లేదని, చెడ్డపేరుతో వెళ్లాలనుకోట్లేదని చెప్పుకొచ్చారు. సీఎం ఎంపికపై చర్చించేందుకు అధిష్ఠానం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లడానికి ముందు ఏఎన్ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శివకుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా.. తిరుగుబాటు ఉండదనే సంకేతాలు ఇచ్చారు. రెండున్నరేళ్లు వద్దు..! కాగా.. కర్ణాటక సీఎం కుర్చీ కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్యీ తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. అంతిమ నిర్ణయం ఏఐసీసీ అధ్యక్షుడిదేనని సీఎల్పీ ఇప్పటికే ఏకగ్రీవంగా తీర్మానించింది. అయితే సీఎంగా ఇద్దరికీ చెరో రెండేళ్లు ఇస్తామని హైకమండ్ చేసిన ప్రతిపాదనకు డికే ససేమిరా అన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో ఢిల్లీలో రెండు రోజులుగా ఈ విషయంపై అదిష్ఠానం మంతనాలు జరుపుతోంది. సిద్ధరామయ్య కూడా ఢిల్లీలోనే ఉన్నారు. డీకే శివకుమార్‌ను కూడా సోమవారమే ఢిల్లీకి పిలిచినప్పటికీ అనారోగ్య కారణాల వల్ల ఆయన వెళ్లలేదు. ఒక రోజు ఆలస్యంగా మంగళవారం వెళ్తున్నారు. సాయంత్రంలోగా కర్ణాటక సీఎం ఎవరనే విషయంపై స్పష్టత అవకాశం ఉంది. నూతన సీఎం ప్రమాణస్వీకారం గురువారం జరగనుంది. మంత్రులు కూడా ఆరోజే ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జన్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు. మే 10 జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 135 సీట్లు కైవసం చేసుకుని తిరుగులేని మెజార్టీ సాధించింది. అధికార బీజేపీ కేవలం 66 స్థానాలకే పరిమితమైంది. జేడీఎస్ 19 సీట్లతో సరిపెట్టకుంది. ఇతరులు నాలుగు చోట్ల గెలిచారు. చదవండి: గహ్లోత్‌కు సచిన్ పైలట్ అల్టిమేటం -
Karnataka assembly election 2023: ‘సార్వత్రిక’ విజయానికి ఈ ఎన్నికలే సింహద్వారం
బెంగళూరు: కర్ణాటకలో శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని రాష్ట్రంలో ఆ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక పీసీసీ సారథి డీకే శివకుమార్ బల్లగుద్ది చెప్పారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన పలు విషయాలు చెప్పారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ► నా 35 ఏళ్ల రాజకీయ అనుభవం, సర్వే ఫలితాలను అనుసరించి చెప్తున్నా.. కన్నడ నాట ఈసారి 141 శాసనసభ స్థానాల్లో విజయఢంకా మోగిస్తాం ► దక్షిణభారతంలో మోదీమేనియా పనిచేయదు. ఇక్కడ స్థానిక, అభివృద్ధి అంశాలే ఎన్నికల్లో కీలకంగా నిలుస్తాయి ► ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల విజయానికి సింహద్వారంగా నిలుస్తుంది ► గెలిచాక పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయ్యేది సిద్దరామయ్యనా లేక నేనా అనేది అనవసర చర్చ. ఇక్కడ బీజేపీని ఓడించడమే అసలైన లక్ష్యం. ► రాష్ట్రం జ్ఞాన రాజధాని. బీజేపీవారు హిజాబ్, హలాల్ వంటి నాటకాలు ఆడుతున్నారు. కర్ణాటక ప్రజల్లో ఎంతో పరిణతి ఉంది. రాష్ట్రాభివృద్ధికి ఇలాంటివి కొత్త సమస్యలు తెస్తాయని జనం భయపడుతున్నారు ► బీజేపీ అగ్రనేతల మేజిక్ ఇక్కడ పనిచేయదు. తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్‌లలో మోదీ ఛరిష్మా పనిచేసిందా? ప్రజల కడుపు నింపితేనే, చక్కని పాలన అందిస్తేనే మీ గురించి జనం ఆలోచిస్తారు. ఈసారి ఇక్కడా జరిగేది అదే. -
పీసీసీపై ప్రియాంకకు ఫిర్యాదు చేశా.. నేను ఉన్నానని భరోసానిచ్చారు
సాక్షి, నల్లగొండ రూరల్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో పీసీసీ అధ్యక్షుడు ఎందుకు ప్రచారం చేయలేదో విచారణ చేయాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. తనకు తెలియకుండా మునుగోడులో సమావేశం పెట్టి తనను తిట్టడంపై కూడా విచారణ చేపట్టాలని కోరారు. మార్ఫింగ్ వీడియోల కథ తేల్చాలన్నారు. ఆయన మంగళవారం నల్లగొండలో తన కుమారుడు ప్రతీక్‌రెడ్డి వర్దంతి సందర్భంగా ప్రభుత్వ కళాశాలల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పరిశీలకునిగా దిగ్విజయ్‌సింగ్‌ను నియమించడం సంతోషదాయకమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. దిగ్విజయ్ నియామక విషయం ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫోన్ చేసి చెప్పారని తెలిపారు. పీసీసీ వ్యవహార శైలిపై ప్రియాంక గాంధీకి తెలియచేశానని.. నేను ఉన్నానని ప్రియాంక గాంధీ తనకు భరోసా ఇచ్చినట్లు వెంకట్‌రెడ్డి చెప్పారు. పీసీసీ అధ్యక్షుడి నియామకమై 20 మాసాలు అవుతున్నా జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించలేదన్నారు. గాంధీ భవన్ పైరవీకారులు ఇచ్చిన లిస్టును జిల్లా సీనియర్ నాయకులతో చర్చించకుండా కమిటీలు వేశారని ఆయన మండిపడ్డారు. నల్లగొండ జిల్లా కమిటీతోపాటు పీసీసీ కమిటీలో బలమైన నాయకులకు చోటు ఇవ్వలేదని ఆరోపించారు. చదవండి: పెళ్లి పేరుతో సంపన్న యువతులకు గాలం.. సీఐడీ, సీబీఐ, రా.. ఇలా అన్ని పేర్లతో ఏపీ తరహాలో ఇక్కడ ఎందుకు చేయడం లేదు రైతుల కోసం జనవరి నుంచి పాదయాత్ర చేయబోతున్నట్లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకుంటానన్నారు. అనేక ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తున్న సీఎం కేసీఆర్ .. బి.వెల్లంల ప్రాజెక్టుకు, శ్రీశైలం సొరంగమార్గం పనులకు నిధులు ఇవ్వడం లేదని నిలదీశారు.లోటు బడ్జెట్ ఉన్న ఏపీలో సీఎం జగన్మోహన్రెడ్డి వెలిగొండ ప్రాజెక్టును చేపట్టి 36 కిలోమీటర్ల సొరంగాన్ని పూర్తి చేశారన్నారు. ఏపీ తరహాలో ఆరోగ్యశ్రీ ఇక్కడ ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. నల్లగొండలోని ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ఫర్నీచర్ కోసం రూ.10 లక్షల చెక్కు అందజేస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి -
రామారావు పార్టీ మారితే నేను మారతానా?
సాక్షి, హైదరాబాద్: పార్టీ మారుతున్నానని ప్రచారం జరిగిన ప్రతిసారీ తాను ఖండిస్తూ వివరణ ఇచ్చుకోవాల్సి రావడం బాధాకరంగా ఉందని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ మారాల్సిన అవసరం లేదని, ఏదైనా సమస్య ఉంటే హైకమాండ్‌తో మాట్లాడి పరిష్కరించుకునే చనువు, అవకాశం తనకున్నాయని అన్నారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు రామారావు పార్టీ మారితే నాపై కూడా అదే ప్రచారం చేయడం సమంజసంగా లేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రామారావుకు సీనియర్ నేత కె.జానారెడ్డి, ఎమ్మెల్యే హరిప్రియకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇప్పించారు. అయినా వారిద్దరూ పార్టీ మారారు. అలా అని జానారెడ్డి, రేవంత్‌రెడ్డి కూడా పార్టీ మారుతారని అనుమానిస్తారా?’అని ఏలేటి ప్రశ్నించారు. కాంగ్రెస్ పారీ్టలోకి ఎల్లో, పింక్, ఆరెంజ్ పారీ్టల నుంచి వచి్చనవారు ఉన్నారని, వారిలో ఎవరు తనపై కుట్రలు చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం పనిచేస్తున్నవారికి పొగబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పారీ్టనేనని, పార్టీ అంతర్గత విషయాల గురించి బహిరంగంగా మాట్లాడబోనని ఏలేటి స్పష్టం చేశారు. -
ఆర్ఎస్ఎస్ చీఫ్‌కు జాతీయ జెండా పంపిన మోహన్ మార్కం, ఎందుకంటే?
రాయ్‌పూర్: ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్‌కు జాతీయ జెండాను కొరియర్లో పంపారు ఛత్తీస్‌గఢ్ పీసీసీ అధ్యక్షుడు మోహన్ మార్కం. ఖాదీతో తయారు చేసిన ఆ త్రివర్ణ పతాకాన్ని మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఎగురవేయాలని కోరారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఆగస్టు 2 నుంచి 15 వరకు ప్రతి ఒక్కరు జాతీయ జెండాను తమ డీపీలుగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. అలాగే ఆగస్టు 15న ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాలని కోరారు. మోదీ పిలుపుతో విపక్ష నాయకులు, ప్రముఖులు ఇప్పటికే తమ డీపీలను మార్చుకున్నారు. కానీ ఆర్ఎస్ఎస్, దాని చీఫ్ మోహన్ భగవత్ మాత్రం డీపీని మార్చలేదు. దీంతో ఆర్ఎస్ఎస్ చీఫ్‌ను సంస్థ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసేలా విజ్ఞప్తి చేయాలని ప్రధాని మోదీని కోరారు మోహన్ మార్కం. గత 52 ఏళ్లుగా ఆ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేయలేదని పేర్కొన్నారు. అందుకే ఈసారైనా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించాలన్నారు. చదవండి: ఉప రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధం -
పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా
-
కాంగ్రెస్‌కు మరో షాక్: పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా
చండీగఢ్: పంజాబ్‌లో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. కెప్టెన్ అమరీందర్ సింగ్ తన సీఎం పదవికి ఇటీవల రాజీనామా చేయగా, తాజాగా పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. మంగళవారం తన రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపించారు సిద్ధూ. తన రాజీనామా లేఖలో పరోక్షంగా అమరీందర్ సింగ్‌ను వ్యవహరాన్ని ప్రస్తావించారు. ఆయనకు వ్యక్తిత్వం లేదని పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తారని అమరీందర్ సింగ్‌పై మండిపడ్డారు. ఆయన స్వలాభం కోసం పంజాబ్ భవిష్యత్తు, ప్రజల సంక్షేమంపట్ల వివక్షతకు పాల్పడుతున్నారని అన్నారు. అందుకే తాను రాజీనామా చేస్తున్నానని వివరించారు. కాగా, ఈ రోజు (మంగళవారం) సాయంత్రం బీజేపీ నేతలను కలిసేందుకు అమరీందర్ సింగ్ ఢిల్లీకి పయనమైనట్లు వార్తలు వస్తున్నాయి. పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన 72 రోజులకే సిద్దూ రాజీనామా చేయడంతో పంజాబ్ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఈ రోజు మధ్యాహ్నం వరకు పంజాబ్‌లోనే ఉన్నారు. కాగా, వీరు వెళ్లగానే సిద్దూ రాజీనామా అస్త్రాన్నిసంధించారు. తన రాజీనామాలో సిద్ధూ.. మనం రాజీపడిన రోజు మన వ్యక్తిత్వం పతనమైనట్లే అని ఘాటుగా స్పందించారు. ఎన్నికలకు ఆరునెలల ముందు కాంగ్రెస్‌కు జీర్ణించుకోలేని పరిణామాలు సంభవించాయి. సిద్దూ ఆరోపణల నేపథ్యంలో అమరీందర్‌సింగ్‌ను సీఎం పదవి నుంచి కాంగ్రెస్ దించిన విషయం తెలిసిందే. ఇటు అమరీందర్ సింగ్‌ను.. అటూ సిద్దూను కాంగ్రెస్ ఇద్దరిని దూరం చేసుకుని ఇరకాటంలో పడింది. Amarinder Singh Delhi Tour: అమరీందర్ సింగ్ బీజేపీలో చేరనున్నారా? జనసేనలో భగ్గుమన్న విభేదాలు -
నిజామాబాద్: కాంగ్రెస్ పార్టీలో పెరిగిన జోష్
అసెంబ్లీ ఎన్నికల్లో వరుస ఓటములతో పూర్తి నిస్తేజం ఆవరించిన జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఒక్క సారిగా జోష్ పెరిగింది. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకంతో పాటు జిల్లా నుంచి సీనియర్ నేతలు మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌కు ప్రచార కమిటీ చైర్మన్, మహేశ్ కుమార్ గౌడ్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు దక్కాయి. వీరిద్దరు బుధవారం జిల్లాకు రానుండడంతో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగత కార్యక్రమాలు ఏర్పాట్లు చేశాయి. ఇందల్వాయి నుంచి జిల్లా కేంద్రానికి భారీ బైక్‌లు, కార్ల ర్యాలీ తీయనున్నారు. సాక్షి, నిజామాబాద్ : అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్ పారీ్టలో గతంలో వివిధ వర్గాల వారీగా కార్యక్రమాలు చేస్తూ వచ్చేవారు. అయినప్పటికీ కాంగ్రెస్ పారీ్టకి ఉన్న సంప్రదాయ ఓటు బ్యాంకు కారణంగా మంచి విజయాలు సా ధిస్తూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో రెండు సంవత్సరాలుగా నాయకుల్లో, శ్రేణుల్లో నిస్తేజం ఆవరించింది. తెలంగాణ తామే ఇచ్చామని చెప్పుకున్నప్పటికీ వరుసగా 2014, 2018 శాసనసభ ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. గత ఎన్నికల్లో ఓటమి తరువాత పార్టీ శ్రేణు ల్లో మరింత స్తబ్ధత ఆవరించింది. ఈ క్రమంలో గత లోక్‌సభ ఎన్నికల్లోనూ మరింతగా దెబ్బతిన్నది. ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత ఓ టమిపాలైంది. ఎ న్నికల్లో ఆమెకు ఉన్న వ్యతిరేక పవనాలను కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మ లుచుకోలేకపోయింది. సంప్రదాయ ఓటు బ్యాంకు తగ్గిపోవడంతో పాటు యువతరం ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపగా అనూహ్యంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి అరి్వంద్ విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమైంది. తరువాత వరుసగా జరిగిన మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్, మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ పార్టీ మూడో స్థానంలోనే నిలిచింది. చివరకు నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో అయితే కేవలం రెండు స్థానాలతో నాలుగో స్థానానికి పడిపోయింది. పరిస్థి తి ఎలా తయారైందంటే పార్టీ కార్యాలయాల్లో నిర్వహించే కార్యక్రమాలకే కాంగ్రెస్ నేతలు పరిమితమ య్యారు. ఇలాంటి నేపథ్యంలో ఇటీవల పీసీసీ అ ధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని పార్టీ అధిష్టానం నియమించడంతో రాష్ట్రవ్యాప్తంగా శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది. జిల్లా నుంచి మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌కు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ గా, మహేష్‌కుమార్ గౌడ్‌కు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పదవులు ఇవ్వడంతో జిల్లా పారీ్టలోనూ జోష్ వచ్చింది. ఇద్దరు నేతలు.. పదవులు పొందిన తర్వాత ఇద్దరు నేతలు బుధవారం జిల్లాకు రానుండడంతో ఇందల్వాయి నుంచి నగరంలోని లక్ష్మి కల్యాణ మండపం వరకు ర్యాలీ కార్యక్రమం చేపట్టా రు. దీని కోసం గతానికి భిన్నంగా వర్గాలతో సంబంధం లేకుండా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ముందుకు కదులుతుండడం గమనార్హం. భారీ ద్విచక్రవాహనాలు, కార్ల ర్యాలీ తీయనున్నారు. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మారిన తరువాత గత మూడు వారా ల్లో మూడుసార్లు చలో హైదరాబాద్ కార్యక్రమాలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలివెళ్లారు. రైతు సమస్యలపై నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఇవి గాక గతంలో చెప్పుకోదగిన కార్యక్రమం సైతం రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కాకముందు గత జనవరి 30న ఆర్మూర్‌లో పసుపు రైతుల సమస్యలపై భారీ కార్యక్రమం నిర్వహించారు. డీసీసీ అ ధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, బీసీ సెల్ జి ల్లా అధ్యక్షుడు శేఖర్‌గౌడ్ తదితర నాయకుల ఆధ్యర్యంలో ర్యాలీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డీసీసీ అధ్యక్ష పదవి రేసు మొదలైంది. బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు శేఖర్‌గౌడ్, పార్టీ నగర అధ్యక్షుడు కేశ వేణు డీసీసీ పీఠం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. -
కరీంనగర్‌కు మొండి ‘చెయ్యి’..
సాక్షి , కరీంనగర్: ఎన్నో ఏళ్ల ఎదురుచూపు తర్వాత ప్రకటించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ఉమ్మడి కరీంనగర్‌కు మొండిచెయ్యి మిగిలింది. పీసీసీ అధ్యక్ష పీఠం రేసులో నిలిచిన నాయకులకు గానీ, పీసీసీలో కీలక పదవుల్లో వెలుగొందిన నేతలు గానీ ఢిల్లీ పెద్దలు ప్రకటించిన కమిటీలో స్థానం దక్కలేదు. ఓవైపు కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరగబోతుండగా.. ఉమ్మడి జిల్లా నుంచి ఏ నాయకుడిని కూడా కమిటీలోకి తీసుకోకపోవడం కాంగ్రెస్ పార్టీ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరైన కాంగ్రెస్‌లో పీసీసీ అధ్యక్షుడిగా మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డిని ప్రకటించిన ఏఐసీసీ.. ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను, పది మంది సీనియర్ ఉపాధ్యక్షులను, ప్రచార కమిటీని శనివారం రాత్రి ప్రకటించింది. ఏ కమిటీలోనూ ఉమ్మడి కరీంనగర్‌లోని నాలుగు జిల్లాలకు చెందిన సీనియ ర్లు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు చోటుదక్కకపోవడం గమనార్హం. చదవండి: Revanth Reddy: టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి -
కాంగ్రెస్ బలహీన పార్టీ కాదు : జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ బలహీనం కాలేదని, సంస్థాగతంగా ఇంకా బలంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అయితే పీసీసీ అధ్యక్షుడి కోసం మొదటిసారి ఇలా అభిప్రాయ సేకరణ జరగడం దురదృష్టకరమన్నారు. గతంలో ఇలా ఎన్నడూ జరగలేదని తెలిపారు. ఈసారి పీసీసీ అధ్యక్షుడి కోసం చాలా కాంపిటీషన్ ఉందని, రేసులో తనతో పాటు మరికొంతమంది ఉన్నట్లు తెలిపారు. మరోవైపు పీసీసీ అధ్యక్షుడి నియామకంపై పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఈ విషయంపై నేడు సాయంత్రం 4 గంటలకు పార్టీ ఇంచార్జ్ మానిక్కమ్ ఠాగూర్ హైదరాబాద్ రానున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కోర్ కమిటీ సమావేశంలో అన్ని వర్గాల వారి అభిప్రాయ సేకరణ తీసుకొని పీసీసీ అధ్యక్షుడిని నియమించనున్నారు. అనేకమంది అశావహులు ఉన్న నేపథ్యంలో పీసీసీ ఎవరికి వరిస్తుందనే ఆసక్తి నెలకొంది. -
బీజేపీ ఓడితేనే ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం..
మడకశిర : కర్నాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడితేనే ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని పీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి అన్నారు. ఆయన శనివారం శిర అసెంబ్లీ నియోజక వర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి, మంత్రి టీబీ జయచంద్ర తరపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. దాదాపు 23 గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాగోడు గ్రామంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. దీంతో కర్నాటక ప్రజలు మోదీ మాటలు నమ్మి మోస పోవద్దన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను ప్రధాని నిండా ముంచారని పీసీసీ చీఫ్ ధ్వజమెత్తారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి బుద్ధి నేర్పాలన్నారు. కర్నాటకలో బీజేపీని ఓడిస్తే ఏపీ ప్రజలకు న్యాయం జరుగుందని ఆయన అన్నారు. ఎన్నికలలో బీజేపీని ఓడిస్తే ఏపీకీ ప్రత్యేక హోదా వస్తుందని తెలిపారు. కాంగ్రెస్‌ను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. కర్నాటక ఓటర్లు ఎంతో విజ్ఞత ఉన్న వారని.. ఈ ఎన్నికల్లో ప్రజల సత్తా ఏంటో బీజేపీకి రుచి చూపించాలని పీసీసీ చీఫ్ రఘువీరా కోరారు. -
కాంగ్రెస్ సీనియర్లకు ‘వయసు’ గుబులు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నాయకులకు ‘వయసు’ గుబులు పట్టుకుంది. 70 ఏళ్లు దాటిన వారికి ఈసారి ఎన్నికల్లో టికెట్ ఉండదని, వారి సేవలను పార్టీకి ఉపయోగించుకుంటామని ఇటీవల జరిగిన ప్లీనరీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించడంతో తమకు సీట్లు వస్తాయా రావా అనే సందేహం వారిని వేధిస్తోంది. రాహుల్ చెప్పినట్టు చేస్తే రాష్ట్రం నుంచి ఐదారుగురు ముఖ్య నేతల టికెట్లు గల్లంతయ్యే అవకాశముందన్న చర్చ టీపీసీసీ వర్గాల్లో జరుగుతోంది. ఈ లెక్కన ముఖ్యమంత్రి రేసులో ఉన్న నాయకుల టికెట్లు సైతం గల్లంతయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ జాబితాలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, నల్లగొండ జిల్లా సీనియర్ నేత కె.జానారెడ్డి, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, జాతీయ విపత్తు నివారణ సంస్థ మాజీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి ఉన్నారు. వీరందరి వయసు 70 కన్నా ఎక్కువ ఉండటంతో ఈసారి వీరికి టికెట్లు రావన్న చర్చ గాంధీభవన్‌లో జరుగుతోంది. లోలోన గుబులుగానే ఉన్నా తమకు టికెట్ కచ్చితంగా వస్తుందని వారు పేర్కొంటున్నా రు. పార్టీ అధికారంలోకి వస్తే సీఎం పగ్గాలు చేపట్టాలన్న ఆశతో ఉన్న జానారెడ్డి.. తనతోపాటు తన కుమారుడికి కూడా టికెట్ తెచ్చుకుంటానని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. పొన్నాల లక్ష్మయ్య సైతం ఈసారి తన గెలుపు కచ్చితమన్న అంచనాతో ఉన్నారు. గీతారెడ్డి తన కుమార్తెను రాజకీయ రంగంలోకి తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నా.. ఈసారికి తానే పోటీ చేయాలని యోచిస్తున్నారు. ఇక జైపాల్‌రెడ్డి పరిస్థితి ఎలా ఉంటుందన్న అంశంపైనా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన్ను టార్గెట్‌గా చేసుకుని మాజీ మంత్రి డీకే అరుణ ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తుండటం సీనియర్లకు తలనొప్పిగా మారింది. జైపాల్‌కు పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయిన వర్కింగ్ కమిటీలో అవకాశం ఇస్తారని అంటున్నారు. ఆయన మాత్రం మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానంలో పోటీచేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. మర్రిÔ¶ శశిధర్‌రెడ్డి పార్టీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్‌గా క్రియాశీలకంగా వ్యవహరిస్తూనే టికెట్‌పై ఆశతో ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లోని కొందరు యువనేతలు ప్రచారం చేస్తున్నట్టు వీరి ఆశలు నిరాశలవుతాయా? లేదా రాహుల్ ప్రత్యేక నిర్ణయం తీసుకుని వీరికి అవకాశం కల్పిస్తారా అన్నది వేచి చూడాల్సిందే! వారసులొస్తారా? వచ్చే ఎన్నికల్లో 70 ఏళ్లు దాటిన వారు పోటీ చేసే అవకాశం లేదని పార్టీ కచ్చితంగా నిర్ణయిస్తే ఆయా నేతల వారసులకు లైన్‌క్లియర్ అవుతుందని టీపీసీసీ వర్గాలంటున్నాయి. సీనియర్ కాంగ్రెస్ నేతల్లో జైపాల్‌రెడ్డికి రాజకీయంగా వారసులు లేకపోయినా జానా కుమారుడు రఘువీర్‌రెడ్డి, పొన్నాల కోడలు వైశాలి, శశిధర్‌రెడ్డి కుమారుడు ఆదిత్యరెడ్డి, గీతారెడ్డి కుమార్తె మేఘనారెడ్డి లాంటి యువ నాయకత్వం ఈసారి బరిలో ఉంటుందనే చర్చ జరుగుతోంది. రాహల్ మదిలో ఏముంది? వాస్తవానికి కాంగ్రెస్‌లో ఎప్పుడూ సీనియర్ల హవానే కనిపిస్తుంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు పెద్ద వయసున్న నేతలే అటు పార్టీలోనూ, ఇటు ప్రజాక్షేత్రంలోనూ కనిపిస్తుంటారు. అయితే రాహుల్ ఏఐసీసీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు ముందే పార్టీలో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. పార్టీ అనుబంధంగా ఉండే విద్యార్థి, యువజన విభాగాలకు ఎన్నికలు నిర్వహించడం మొదలు పార్టీలో సీనియర్లు, జూనియర్లను ఎలా వినియోగించుకోవాలనే దానిపై ఆయన తనదైన ఆలోచనతో ఉన్నారని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. ‘‘20–40 ఏళ్ల వయసున్న వారిని వర్కింగ్ యూత్‌గా, 40–60 వరకు సీనియర్ యూత్‌గా, 60–70 సలహా సంఘంగా, 70 కన్నా ఎక్కువ వయసున్న వారిని పూర్తిగా పార్టీకి ఉపయోగించుకోవాలనే ఆలోచనలో ఆయన ఉన్నారు. 60–70 ఏళ్ల వయసున్న వారికి టికెట్లు ఇచ్చే విషయంలో కొంత రిజర్వ్డ్గానే ఉండాలని ఆయన ఉన్నారు. ఇదే విషయాన్ని ప్లీనరీలో ప్రకటించారు’’ అని టీపీసీసీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. ఎక్కడా చెప్పలేదు: ఉత్తమ్ సీనియర్ నేతలకు టికెట్ల అంశంపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడారు. 70 ఏళ్లు దాటిన నాయకులకు టికెట్లు ఇవ్వబోమని పార్టీలో ఎక్కడా చెప్పలేదంటూనే.. ఈసారి యువతకు, కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని రాహుల్ చెప్పినట్లు వ్యాఖ్యానించడం గమనార్హం. -
ఆయన రాజీనామా చేయలేదు
సాక్షి, మాంద్య (కర్ణాటక) : ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి బాధ్యతల నుంచి రాజ్‌బబ్బార్ తప్పుకోలేదని, రాజీనామా చేయలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రమోద్ తివారీ స్పష్టం చేశారు. 'నేను మీకు ఓ విషయం చెప్పదలుచుకున్నాను. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ బాధ్యతలకు రాజ్ బబ్బార్ రాజీనామా చేయలేదు. ఆయన రాజీనామా చేశారంటూ వచ్చిన వార్తలన్నీ నిరాధారమైనవి' అని తివారీ అన్నారు. అంతకుముందు ఓ వార్తా సంస్థలో వచ్చిన వార్తల ప్రకారం రాజ్ బబ్బార్ ఇలా చెప్పారు . 'కాంగ్రెస్ పార్టీలో కొత్త మార్పులు చోటుచేసుకున్నాయి. పార్టీ అధ్యక్షుడు నాకు ఎలాంటి కొత్త బాధ్యతలు అప్పగించినా స్వీకరిస్తాను. వాటిని నిర్వర్తిస్తూ 2019 ఎన్నికలకు అనుగుణంగా పనిచేస్తాను. నేను ఏం చెప్పాలో అది మా పార్టీ అధ్యక్షుడికి చెబుతాను. కాంగ్రెస్ పార్టీ గత కొద్దికాలంగా ఓడిపోతూ వస్తోంది.. ఓడిపోతుంది' అంటూ ఆయన చెప్పారు. గోరఖ్‌పూర్, పుల్పూర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అతిపేలవమైన ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. -
రాహుల్ స్పీచ్ అదిరిపోయింది.. రిజైన్ చేశా
సాక్షి, పనాజీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మాటలు తనను అమితంగా ఆకర్షించాయని, అందుకే తాను పార్టీ చీఫ్ బాధ్యతల నుంచి తప్పుకున్నానని గోవా కాంగ్రెస్ చీఫ్‌గా పనిచేసిన శాంతారాం నాయక్ అన్నారు. యువ నాయకత్వానికి పార్టీ సీనియర్లే మార్గం వేయాలని, వారికి రాజకీయాల్లో అవకాశం ఇవ్వాలని, కాంగ్రెస్ పార్టీలో యువనాయకత్వాన్ని నింపాలని చెప్పిన రాహుల్ మాటలతో తాను మనస్ఫూర్తిగా ఏకీభవిస్తున్నానని చెప్పారు. అందుకే తన స్థానంలో యువ నాయకత్వానికి అవకాశం ఇచ్చేందుకు తాను పార్టీ చీఫ్ బాధ్యత నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో రాహుల్‌గాంధీ మాట్లాడుతూ పార్టీలో సీనియర్లు తప్పుకొని యువకులకు అవకాశం ఇవ్వాలని చెప్పారు. దాంతో గోవా కాంగ్రెస్ చీఫ్‌గా ఉన్న 71ఏళ్ల శాంతారాం నాయక్ తన బాధ్యతలకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ తన రాజీనామా లేఖను ఏఐసీసీ ప్రెసిడెంట్ రాహుల్‌గాంధీకి పంపించానని, అలాగే, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీకి మరో లేఖను పంపించినట్లు చెప్పారు. అలాగే, ఉత్తరప్రదేశ్‌లోని రాజ్‌బబ్బార్, గుజరాత్‌లోని భరత్‌సింహ సోలంకీ కూడా పార్టీ చీఫ్ బాధ్యతలకు రాజీనామా చేసి ఆ లేఖలు పంపించారని, అందుకు తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. రాహుల్ ఇచ్చిన పిలుపుమేరకు సీనియర్లు సానుకూలంగా స్పందిస్తూ సహకరిస్తున్నారని, ఇది చాలా మంచి పరిణామం అని ఆయన తెలిపారు. 'రాహుల్ మాటలు నన్ను ఎంతో ఆకర్షించాయి. ఆ క్షణంలోనే రాజీనామా చేద్దామనుకున్నాను. అయితే, ఒక విశిష్టకార్యక్రమం జరుగుతున్న సమయంలో రాజీనామా చేయడం సబబు కాదని ఆగాను. అయితే, నా స్థానంలో ఎవరు వస్తారనే విషయం మాత్రం నేను చెప్పను. ఎందుకంటే అది పార్టీ నాయకత్వం చూసుకుంటుంది. అయితే, కనీసం పదేళ్లపాటు పార్టీకోసం పనిచేసిన యువకుడిని పెడితే బాగుంటుందని మాత్రమే నా ఉద్దేశం. రాష్ట్ర పార్టీ సారథిగా వచ్చే వారికి పార్టీపై ప్రేమ, అంకితభావం ఉండాలి. రాహుల్ గాంధీ బాధ్యతలు తీసుకున్న నేపధ్యంలో యువతి వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు' అని ఆయన చెప్పారు. -
‘అదంతా డ్రామా’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో సోమవారం జరిగిన ఘటనను ఓ డ్రామాగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివర్ణించారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్ చేత సీఎం కేసీఆర్ నాటకం ఆడిస్తున్నారని ఆరోపించారు. చైర్మన్‌కు దెబ్బతగలడం నిజమైతే ఆ వీడియోను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. చైర్మన్ ఒకవైపు కూర్చుంటే మరో వైపు ఉన్న కంటికి ఎలా దెబ్బ తగిలిందని నిలదీశారు. నాలుగేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిందని, తప్పులను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిందని మండిపడ్డారు. అప్పుడు హరీష్ చేయలేదా? గతంలో గవర్నర్ ప్రసంగ సమయంలో హరీశ్‌రావు బెంచీల మీద దూకుతూ వెల్‌లోకి దూసుకెళ్లలేదా అని గుర్తు చేశారు. ఆయన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలానే వ్యవహరించిందా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లపై స్పందించని స్పీకర్ మమల్ని సస్పెండ్ చేయడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. స్పీకర్ విధుల నిర్వహణలో పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని పీసీసీ చీఫ్ ఆరోపించారు. పార్లమెంట్లో కేసీఆర్ కూతురు స్పీకర్ ముఖం మీద ప్లకార్డులు ప్రదర్శిస్తోందని, ఇక్కడ మేం మాత్రం నిరసన చేపట్టొద్దా.. ఇదెక్కడి న్యాయమని ఆయన ప్రశ్నించారు. బడ్జెట్లో రైతులు, గిరిజనుల గురించి ప్రస్తావన లేదని, ప్రధాన అంశాలు లేవని మేము చెప్పడానికి వెళితే మాపై 50 మంది పోలీసులతో దాడి చేయించారన్నారు. చివరి బడ్జెట్ సమావేశంలో.. సమాధానాలు ఇవ్వొద్దనే ఉద్దేశంతో మాపై సస్పెన్షన్ వేటు వేశారని ఆయన ఆరోపించారు. తెలంగాణ బాగుపడాలంటే కేసీఆర్ లాంటి నియంతలు అధికారంలోకి రావద్దంటూ ఈ సందర్భంగా ‘కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో’ అనే నినాదాన్ని ఇచ్చారు. -
అధిష్టానం ఆదేశిస్తే మునుగోడు నుంచి పోటీ..
యాదాద్రి భువనగిరి : అధిష్టానం ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ నుంచి పోటీచేస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ..నయీమ్ ఎన్కౌంటర్ జరిగి రెండేళ్లు అవుతున్నా ...అతని వల్ల లబ్ధిపొందిన వారిని అరెస్ట్ చేయలేదని విమర్శించారు. 24 గంటల కరెంటు వల్ల భూస్వాములకే లాభమన్నారు. మునుగొడు, భువనగిరి నియోజకవర్గాలలో పీసీసీ పెట్టిన ఇంచార్జిలను తాము గుర్తించటం లేదని అన్నారు. పార్టీ హైకమాండ్... పీసీసీ బాధ్యతలను కోమటిరెడ్డి సోదరులకు అప్పగిస్తే తెలంగాణలో పాదయాత్ర చేసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకు వస్తామని తెలిపారు. -
ప్రజలకు అందుబాటులో ఉండని సీఎం
హుజూర్నగర్: ప్రజలకు అందుబాటులో ఉండని ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా విద్యా సదస్సులో ఆయన మాట్లాడారు. రూ. కోట్ల ప్రజాధనంతో బహుళ అంతస్తుల భవనం నిర్మించుకొని ఒక వైపు ప్రజలకు, మరోవైపు ప్రజాప్రతినిధులకు కూడా అందుబాటులో ఉండకుండా నియంతృత్వ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉపాధ్యాయులు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉద్యోగుల పాలిట పెనుప్రమాదంగా ఉన్న సీపీఎస్ విధానాన్ని రద్దు చేసేందుకు, హెల్త్ కార్డులు అందరికీ అందజేసేందుకు, కేజీ టు పీజీ అమలుకు ఉపాధ్యాయులతో కలసి పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఉత్తమ్ చెప్పారు. మూడున్నరేళ్లలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ఒక్క డీఎస్సీని కూడా నిర్వహించలేదని విమర్శించారు. నల్ల ధనాన్ని వెలికి తీస్తామని పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ విమర్శించారు. రూ.500, రూ. వెయ్యి నోట్లు రద్దు చేసి రూ. 2 వేల నోట్లు ముద్రించి కుబేరులను మరింతగా ప్రోత్సహించినట్లయిందన్నారు. గుజరాత్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే 120 వస్తువులపై జీఎస్టీ మినహాయింపు చేసిందని ఆయన విమర్శించారు.