navjyot singh sidhu
-
పంజాబ్‌కు ఆప్ ద్రోహం చేస్తోంది: సిద్ధూ
చంఢీఘడ్: కాంగ్రెస్ నేత నవజ్యోత్‌సింగ్ సిద్ధూ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై మంగళవారం విమర్శలు గుప్పించారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించిన విజయం తెలిసిందే. పంజాబ్‌లో పదవి కాలం ముగిసన రాజ్యసభ స్థానాలకు ఆప్ ఐదుగురు అభ్యుర్థులను నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఆప్ నామినేట్ చేసిన ఐదుగురు అభ్యర్థుల్లో.. నలుగురు ఢిల్లీలో రిమోట్ కంట్రోల్‌కి కోత్త బ్యాటరీలని ఎద్దేవా చేశారు. పంజాబీయేతరులు, బయటి వ్యక్తులను.. రాజ్యసభకు నామినేట్ చేసి పంజాబ్ ప్రజలను మోసం చేశారని ఆప్‌పై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సిద్ధూ తాజా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆప్ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ దేశ రాజధాని ఢిల్లీలో కూర్చుని పంజాబ్ ప్రభుత్వాన్ని నియంత్రిస్తున్నారని ఆరోపించారు. రాజ్యసభకు నానిమినేట్ చేసిన ఐదుగురిలో హర్భజన్ సింగ్ తప్ప మిగతా నలుగురు.. ఢిల్లీ రిమోట్ కంట్రోల్‌కి కొత్త బ్యాటరీలని ఎద్దేవా చేశారు. వారిని ఎంపిక చేయడం పంజాబ్ ప్రజలకు ద్రోహం చేయడమేనని సిద్ధూ మండిపడ్డారు. ఆప్ అభ్యర్థులుగా ఢిల్లీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా, క్రికెటర్ హర్భజన్ సింగ్, ఢిల్లీ ఐఐటి ప్రొఫెసర్ సందీప్ పాఠక్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్పీయూ) వ్యవస్థాపకుడు, ఛాన్సలర్ అశోక్ మిట్టల్, పారిశ్రామికవేత్త సంజీవ్ అరోరాలను రాజ్యసభకు నామినేట్ చేసిన విషయం తెలిసిందే. మార్చి 31న రాజ్యసభ సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. -
సోనియా సీరియస్ ఆదేశాలు.. దిగొచ్చిన సిద్ధూ.. పదవికి గుడ్ బై
ఛండీగఢ్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీని మరింత ఆందోళనకు గురి చేశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడటంతో కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశం వాడివేడిగా సాగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సంచలన ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చూసిన రాష్ట్రాల్లో అధ్యక్షులను తప్పుకోవాలని ఆదేశించారు. ఈ క్రమంలో పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ తన పదవికి బుధవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపినట్టు ట్విట్టర్ వేదికగా తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారణంగా సోనియా ఆదేశాల మేరకు తాను రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్ చీఫ్‌లు తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా.. పీసీసీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపారు. మరోవైపు.. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేస్తున్నట్టు గణేశ్ గోడియాల్ ప్రకటించారు. ఇదిలా ఉండగా, సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం.. పార్టీ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని సోనియా ప్రకటించారు. సమావేశంలో అసమ్మతి నేతలు సహా అందరి అభిప్రాయాలను ఆమె తెలుసుకున్నారు. అయితే సంస్థాగత ఎన్నికల వరకు సోనియా నాయకత్వం కొనసాగించాలని ప్రతి సభ్యుడు కోరారని సూర్జేవాలా చెప్పారు. ఆగస్టు 21– సెప్టెంబర్ 20 మధ్య కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందన్నారు. కాంగ్రెస్‌ను బలహీనపరిచేందుకు బీజేపీ– ఆర్ఎస్ఎస్ గాంధీ కుటుంబంపై బురద జల్లుతున్నాయని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. As desired by the Congress President I have sent my resignation … pic.twitter.com/Xq2Ne1SyjJ — Navjot Singh Sidhu (@sherryontopp) March 16, 2022 -
కాంగ్రెస్‌కు పోటీయే లేదు.. పంజాబ్ మళ్లీ మాదే
కాంగ్రెస్‌దే గెలుపన్న ఆత్మవిశ్వాసం. కలిసికట్టుగా పనిచేస్తే ఎవరూ పోటీకి రాలేరన్న ధీమా, కేజ్రివాల్‌పై విమర్శలు, భగవంత్ మాన్‌పై వ్యక్తిగత దాడి.. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఒక చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో తన మనోగతాన్ని ఇలా బయటపెట్టారు. ప్రశ్న : సీఎం అభ్యర్థి కోసం పోటీ పడినపీసీసీ అధ్యక్షుడు సిద్ధూతో మీ సంబంధాలు ఎలా ఉన్నాయి? జవాబు: ముఖ్యమంత్రి అభ్యర్థిగా హైకమాండ్ ఎవరిని ఎంపిక చేసినా కట్టుబడి ఉంటానని సిద్ధూ చెప్పారు. అధిష్టానం నన్ను ఎంపిక చేసింది. ఇక మా మధ్య విభేదాలు ఎందుకుంటాయి? మేము ఈ ఎన్నికల్లో కలిసి పని చేస్తాం. టీమ్ వర్క్ చేసి మూడింట రెండు వంతుల మెజార్టీ సాధిస్తాం. ప్రశ్న : కాంగ్రెస్ గెలిస్తే మీరు మరబొమ్మ సీఎంగా మారిపోతారని మాయావతి అంటున్నారు? దళితులు ఢిల్లీ చేతుల్లో ఉండాలా అన్న ఆమె ప్రశ్నలకు మీ సమాధానం? జవాబు: మాయావతి పంజాబ్‌లో కేవలం 20 స్థానాల్లోనే పోటీ చేస్తున్నారు. మిగిలిన అన్ని సీట్లలోనూ శిరోమణి అకాలీదళ్ పోటీ పడుతోంది. అంటే దళితులు ఎవరి చేతుల్లో ఉన్నారు? ఈ విషయం ఆమె తెలుసుకోవాలి. నాకు ఈ కులాల రాజకీయాలు తెలీవు. పార్టీలో నాకు మద్దతు ఉందని సీఎం అభ్యర్థిని చేశారు. దళితుడినని చెయ్యలేదు. ప్రశ్న : ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ దూకుడుని అడ్డుకోగలరా ? జవాబు: అరవింద్ కేజ్రివాల్ పంజాబ్ ముఖ్యమంత్రి కావాలని కలలు కన్నారు. మొదట్లో ఆయన ఆబ్కీ బార్ కేజ్రివాల్ పేరిటప్రచారానికి రూ.200–400 కోట్లు ఖర్చు చేశారు. ప్రజలు దానిని ఆమోదించకపోవడంతో భగవంత్ మాన్‌ను తీసుకువచ్చారు. కేజ్రివాల్ కన్న కలలు పంజాబ్‌లో నెరవేరవు. ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్‌తో పాలించే నాయకుల్ని ప్రజలు తిరస్కరిస్తారు. ప్రశ్న : భగవంత్ మన్ మీతో పోటీ పడగలరా ? జవాబు: భగవంత్ మన్ నాకు ఎప్పటికీ పోటీ కాలేరు. పన్నెండో తరగతి పాస్ కావడానికి ఆయనకు మూడేళ్లు పట్టింది. నేను పీజీ చేశాను. ఇప్పుడు పీహెచ్డీ చేస్తున్నాను. ఆయన తాగుడు మానేశానని అంటున్నారు. ఒక్కసారి సాయంత్రం 4 గంటల తర్వాత ఆయనకి ఫోన్ చేసి చూడండి. మీకే అర్థమవుతుంది. -
సాక్షి కార్టూన్ 07-02-2022
నాకేం తెలుసు! నన్నే ప్రకటిస్తారని అలా అన్నాను!! -
చన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు.. సిద్ధూని సీఎం అభ్యర్థిగా ప్రకటించినా ‘నోప్రాబ్లమ్’
చండీగఢ్: పంజాబ్‌లో రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీఎం చన్నీ, పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్‌లు తమ ఆధిపత్యం కోసం పోటాపోటీగా ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా, సీఎం చన్నీ ఒక మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో.. ‘త్వరలో జరగనున్న ఎన్నికలలో కాంగ్రెస్ అధిష్టానం పంజాబ్ సీఎం అభ్యర్థిగా.. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూని పేరుని యోచిస్తుందా ’ అని ప్రశ్నించారు. దీనిపై చన్నీ తనదైన శైలీలో స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి తాను ఒక సేవకుడినని.. అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్న దాన్ని గౌరవిస్తానని స్పష్టం చేశారు. సిద్ధూ తనకు సోదరుడు లాంటి వాడని, దీనిపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా చన్నీ.. మాజీ సీఎం అమరీందర్ సింగ్‌పై ఆరోపణలు గుప్పించారు. కాగా, ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ సీఎం అభ్యర్థిగా భగవంత్‌మాన్ పేరును ప్రకటించడంపై కూడా స్పందించారు. కేజ్రీవాల్ పంజాబ్ నుంచి నాయకుడిగా ఎదగాలన్నారు. పంజాబ్ ప్రజల నుంచి తగినంత మద్దతు కనబడకపోవడంతో చివరి నిమిషంలో భగవంత్ మాన్ పేరును ప్రతిపాదించారని తెలిపారు. కాగా, చన్నీ తాను పోటికి దిగుతున్న చామ్‌కౌర్ సాహిబ్ స్థానం నుంచి ఓడిపోతారని కేజ్రీవాల్ విమర్శించారు. అదే సమయంలో చన్నీ మేనల్లుడి ఇంట్లో కోట్లాది రూపాయలను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకోవడం కలకలంగా మారిన విషయం తెలిసిందే. పంజాబ్‌లో ఫిబ్రవరి 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. చదవండి: ప్రధాని మోదీ అరుదైన రికార్డు.. బైడెన్ కంటే -
సిద్ధూకు తలొగ్గిన చన్నీ సర్కార్
ఛండీగఢ్: సొంత పార్టీలోనే నిరసన గళం వినిపించే నవ్‌జ్యోత్‌సింగ్ సిద్ధూ డిమాండ్‌కు పంజాబ్‌లోని కాంగ్రెస్ సర్కార్ తలొగ్గింది. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ సిద్ధూ డిమాండ్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం డీజీపీని మార్చింది. ఇక్బాల్ ప్రీత్ సింగ్సహోతాను తొలగించి, సీనియర్ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి శాశ్వత ప్రాతిపదికన డీజీపీని నియమించేంతవరకు ఛటోపాధ్యాయ కొనసాగుతారని పేర్కొంది. ప్రస్తుతం విజిలెన్స్ బ్యూరో చీఫ్ డైరెక్టర్‌గా ఉన్న సిద్ధార్థ్ ఆ బాధ్యతల్లోనూ కొనసాగుతారు. సెప్టెంబర్‌లో చరణ్‌జిత్‌సింగ్ చన్నీ సీఎంగా ప్రమాణం చేయగానే ఐపీఎస్ అధికారి సహోతాను డీజీపీగా నియమించారు. అయితే తన మీద వచ్చిన ఆరోపణల విచారణకోసం బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందానికి నాయకత్వం వహించిన సహోతాను డీజీపీగా నియమించడాన్ని సిద్ధూ తీవ్రంగా వ్యతిరేకించారు. డీజీపీగా సిద్ధార్థ్‌ను నియమించాలని ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. -
Punjab: సిద్ధూకు నా సెల్యూట్: సీఎం కేజ్రీవాల్
ఛండీఘర్: పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ.. ఆ పార్టీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ మాటాలను అణచివేస్తోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆయన మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పంజాబ్ ప్రభుత్వం నకిలీ హామీలపై నవజ్యోత్ సింగ్ ధైర్యంగా ఖండిస్తున్నారని అన్నారు. అయితే సోమవారం సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ.. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఇసుక మాఫీయాను రూపుమాపి ధరలు తగ్గించిందన్నారని పేర్కొన్నారు. చదవండి: గతంలో నేనూ ఆటో డ్రైవర్‌నే.. పెండింగ్ చలాన్లు రద్దు చేస్తా: సీఎం అయితే వెంటనే సీఎం చన్నీ వ్యాఖ్యలను సిద్ధూ ఖండించారని తెలిపారు. సీఎం చన్నీ చెప్పే విషయం సత్యం కాదని స్పష్టం చేశారని పేర్కొన్నారు. ఇసుక మాఫీయా ఇంకా కొనసాగుతోందన్నారని తెలిపారు. అయితే ఇలా తమ ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపినందుకు సిద్ధూకు సెల్యూట్ చేస్తున్నానని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. చన్నీ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, మొత్తం కాంగ్రెస్ పార్టీ సిద్ధూ గొంతును అణచివేస్తోందని చెప్పారు. గతంలో అమరేందర్ సింగ్.. ప్రస్తుతం సీఎం చన్నీ సిద్ధూను అణచివేస్తున్నారని పేర్కొన్నారు. సిద్ధూ అవకాశవాది అని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం సిద్ధూ ఆప్‌లో చేరనున్నట్లు అమరేందర్ సింగ్ పలుమార్లు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. చదవండి: పశ్చిమబెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.. అదే విధంగా ఆప్ పంజాబ్ సీఎం అభ్యర్థిపై కొనసాగుతున్న ఊహాగానాలకు సీఎం కేజ్రీవాల్ చెక్ పెట్టారు. పంజాబల్‌లో కాంగ్రెస్ తమ సీఎం అభ్యర్థి చన్నీనా? లేదా సిద్ధూనా? అని ప్రకటించలేదన్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్‌లో కూడా బీజేపీ తమ సీఎం అభ్యర్థి యోగినా? మరోకరా? అనే దానిపై స్పష్టత ఇవ్వడం లేదని పేర్కొన్నారు. అదే విధంగా గోవా, ఉత్తరఖండ్‌లో కూడా ఎవరు తమ సీఎం అభ్యర్థులను ప్రకటించలేదన్నారు. అందరి కంటే తామే ముందుగా పంజాబ్ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
పంజాబ్ కాంగ్రెస్: నవజ్యోత్ సింగ్ సిద్ధూ కీలక నిర్ణయం
చంఢిఘర్: పంజాబ్ రాష్ట్ర పీసీపీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు. ఆయన సెప్టెంబర్ 28న పంజాబ్ రాష్ట్ర పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాతో పంజాబ్ కాంగ్రెస్‌లో పలు కీలక పరిణామాలు చేటు చేసుకున్నాయి. తాజాగా సిద్ధూ శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన పీసీసీ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామా వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించారు. చదవండి: జమ్మూ కశ్మీర్: ఆస్పత్రిలోకి చొరబడి ఉగ్రదాడి తాను తీసుకున్న నిర్ణయం వ్యక్తిగతమైంది కాదని, మళ్లీ పీసీసీ అధ్యక్ష పదని చేపడతానని పేర్కొన్నారు. కొత్త అడ్వకేట్ జనరల్(ఏజీ), డీజీపీ నియామకం త్వరలో జరగనుందని సిద్ధూ తెలిపారు. -
‘ మీ భార్య కాంగ్రెస్‌ను వీడుతుందా..?’: నవజ్యోత్ సింగ్ సిద్ధూ
చంఢీఘడ్: పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్, సిద్ధూల మధ్య పరస్పర ఆరోపణలు కొనసాగుతున్నాయి. తాజాగా, పంజాబ్ మాజీ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. అమరీందర్ సింగ్‌ను ఉద్దేశించి వివాదాస్పద ట్వీట్ చేశారు. ‘‘మీ సతీమణి, మేడం ప్రణీత్ కౌర్.. మీతో పాటు కాంగ్రెస్‌కు రాజీనామా చేశారా.. లేదా’’ అంటూ ప్రశ్నించారు. మీ భార్య మీ నిర్ణయాలకు సానుకూలంగా.. నిలబడలేరని విమర్శించారు. అమరీందర్ సింగ్ పిడుగుపాటులో చనిపోతున్న బాతులాంటి వాడని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, అమరీందర్ సింగ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి నిన్న(మంగళవారం) ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’ అనే కొత్త పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. అమరీందర్ సింగ్ తన రాజీనామా లేఖలో సిద్ధూని.. పాక్‌కు అంతరంగిక బంటూ అంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా, పంజాబ్‌లో అమరీందర్ సింగ్, నవజ్యోత్సింగ్ల మధ్య విబేధాలు కొనసాగుతునే ఉన్నాయి. -
సాక్షి కార్టూన్ 19-10-2021
-
లఖీంపూర్ ఘటన పూర్తి బాధ్యత యోగి సర్కారుదే : అసదుద్దీన్ ఒవైసీ
లక్నో: కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ తెచ్చిన నూతన సాగుచట్టాలకు వ్యతిరేకంగా యూపీలోని లఖీంపూర్ ఖేరీలో ఆదివారం రైతులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతి చెందిన రైతులను పరామర్శించేందుకు వెళ్లిన విపక్షనేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ ఘటనపై పూర్తి బాధ్యత యోగి సర్కారుదే అన్నారు. లఖీంపూర్ వెళ్లకుండా విపక్షాలను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. యూపీ పోలీసుల దర్యాప్తుతో న్యాయం జరగదని అన్నారు. దీనిపై విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ చేపట్టాలని అసుదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ఇదే ఘటనపై పంజాబ్ కాంగ్రెస్ కూడా ఆందోళన చేపట్టింది. చంఢీగఢ్లోని రాజ్‌భవన్ వద్ద యూపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపింది. ఈ నిరసనలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ పాల్గోన్నారు. దీంతో చంఢీగఢ్ పోలీసులు సిద్ధూను కూడా అరెస్ట్ చేశారు. అదే విధంగా, ఉత్తరప్రదేశ్ భవన్‌వద్ద యూత్ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. ఈ ఘటనను నిరసిస్తూ.. కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. దీంతో ఆందోళన కారులను పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం యూపీ భవన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. లఖీంపూర్‌ఖేరీ పరిధిలో రాజకీయ నేతల ప్రవేశంపై నిషేదాజ్ఞలు విధించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు మృతిచెందిన రైతుల సంఖ్య 9 కి చేరింది. ప్రస్తుతం యూపీలో పోలీసులు 144 సెక్షన్ విధించి, ప్రత్యేకంగా బారికెడ్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆందోళన చేపట్టిన విపక్షనేతలు ప్రియాంకగాంధీ, అఖిలేష్ యాదవ్‌లను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చదవండి: Lakhimpur Incident: ‘మృతుల కుటుంబాలకు రూ.45లక్షల పరిహారం’ -
Navjot Singh Sidhu: పదవి ఉన్నా, లేకున్నా వారి పక్షాన నిలబడతా
చండీగఢ్: పంజాబ్‌లో ఇద్దరు కీలక నేతలు నవ జ్యోత్‌సింగ్ సిద్ధూ, కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామాలతో కాంగ్రెస్ పార్టీలో రాజకీయ సంక్షోభం నెలకొంది. ఇరువురు నేతలు తీసుకునే నిర్ణయాలు రోజుకో కొత్త మలుపు తీసుకుంటున్నాయి. తాజాగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్పందిస్తూ.. తనకు పదవి ఉన్నా.. లేకపోయినా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాల పక్షాన అండగా నిలబడతానని అన్నారు. చదవండి: పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగేందుకు అంగీకారం శనివారం జాతి పిత మహత్మా గాంధీజీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రీ జయంతి సందర్భంగా ట్వీట్ చేశారు. ‘తాను గాంధీ, శాస్త్రీల సిద్ధాంతాలను పాటిస్తాను. నాకు కాంగ్రెస్ పార్టీలో పదవి ఉన్నా.. లేకున్నా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాల పక్షాన నిలబడతాను. వ్యతిరేక శక్తులు నన్ను కిందకు తోయాలని చూసినా అంతకు మించిన ఆశావాదంతో పంజాబ్‌లో ప్రతి పౌరుడి గెలుపు కోసం కృషి చేస్తాను’ అని ట్విటర్లో పేర్కొన్నారు. గురువారం పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీతో భేటీ అయిన సిద్దూ.. తిరిగి పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగేందుకు అంగీకరించినట్లు సమాచారం. పంజాబ్‌లో డీజీపీ, అడ్వొకేట్ జనరల్ నియామకంపై సిద్ధూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఒక నియామకాన్ని నిలిపివేస్తామని సీఎం చన్నీ హామీ ఇవ్వడంతో సిద్ధూ మెత్తబడినట్లు తెలుస్తోంది. Will uphold principles of Gandhi Ji & Shastri Ji … Post or No Post will stand by @RahulGandhi & @priyankagandhi ! Let all negative forces try to defeat me, but with every ounce of positive energy will make Punjab win, Punjabiyat (Universal Brotherhood) win & every punjabi win !! pic.twitter.com/6r4pYte06E — Navjot Singh Sidhu (@sherryontopp) October 2, 2021 -
కొత్త పార్టీ ఏర్పాటుకు అమరీందర్ సింగ్ సన్నాహాలు
న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం కొనసాగుతుంది. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో 15 రోజుల్లో కొత్త పార్టీ పేరును ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, కెప్టెన్ అమరీందర్‌తో ఇప్పటికే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు,రైతు నేతలు టచ్‌లో ఉన్నట్లు సమాచారం. కాగా, అమరీందర్ సింగ్ పంజాబ్ వికాస్ పార్టీ పేరుతో కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. సన్నిహితులతో, కార్యకర్తలతో చర్చించాక భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని అమరీందర్ సింగ్ సన్నిహితులు తెలిపారు. కాంగ్రెస్,ఆప్, అకాలీదళ్ అసంతృప్త నేతలను అమరీందర్ కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, సిద్ధూ పంజాబ్ వంటి సరిహద్దు రాష్ట్రానికి సరైన వ్యక్తి కాదని.. ఆయన ఎన్నికలలో.. ఏ స్థానం నుంచి బరిలోకి దిగిన గెలవనిచ్చేది లేదని అమరీందర్ సింగ్ ఇది వరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. చదవండి: శాంతించిన సిద్ధూ..! -
Navjot Singh Sidhu: సిద్ధూ ఆప్‌లో చేరబోతున్నాడా?
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్‌లో రాజకీయ పరిణామాలు రోజురోజుకు అనూహ్యంగా మారుతున్నాయి. కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి, పీసీసీ అధ్యక్ష పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేయడంతో సరికొత్త మలుపులు తిరుగుతోంది. ఇద్దరు బలమైన నేతలు రాజీనామాలు చేయడంతో కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడింది. అయితే నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆప్ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్.. సిద్దూ చేరిక ఊహాగానాలపై స్పందిస్తూ.. పంజాబ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా బలమైన నేతను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని అన్నారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆప్‌లో చేరుతారనేది ఊహాత్మకమైన విషయమని తెలిపారు. అటువంటి పరిస్థితులు పంజాబ్ చోటు చేసుకుంటే తామే వెల్లడిస్తామని తెలిపారు. మరోసారి బలంగా చెబుతున్నానని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ తరఫున బలమైన నేతను సీఎం అభ్యర్థిగా నిలబెడతామని స్పష్టం చేశారు. అది ఎవరనేది త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతానికి ఆ విషయానికి సంబంధించి తాము ఆలోచించడంలేదని పేర్కొన్నారు. దీంతో నవజ్యోత్ సింగ్ ఆప్‌లో చేరుతారని వస్తున్న వార్తలకు బలం చేకూరుతోంది. నవజ్యోత్ సింగ్ గతంలో ఆప్‌లో కీలక నేతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇక మరోవైపు కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరుతారని వార్తలు వస్తున్నాయి. అదే విధంగా ఆయన బుధవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కావటంతో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
Charan Singh Channi: సిద్ధూ రాజీనామాపై నాకు సమాచారం లేదు
చండీగఢ్: నవజ్యోత్ సింగ్ సిద్ధూ పంజాబ్ పీసీసీ పదవికి రాజీనామా చేయడంతో పంజాబ్ రాజకీయాల్లో ఒక్కసారిగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ ఛన్నీ స్పందించారు. సిద్ధూ రాజీనామాపై తనకు ఎలాంటి సమాచారం లేదని అన్నారు. నవజ్యోత్ సింగ్‌పై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని అన్నారు. సిద్ధూ రాజీనామాపై మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తనదైన శైలిలో స్పందించారు. నవజ్యోత్ సింగ్ నిలకడలేని వ్యక్తని.. తాను ఎప్పుడో చెప్పానని ఘాటుగా విమర్శించారు. పంజాబ్ వంటి సరిహద్దు రాష్ట్రానికి సిద్ధూ సరైన వ్యక్తి కాదని అన్నారు. అయితే, ప్రస్తుతం పంజాబ్‌లో ఇద్దరు కీలక నేతల రాజీనామాలతో కాంగ్రెస్‌పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. చదవండి: కాంగ్రెస్‌కు మరో షాక్: పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా -
పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా
-
కాంగ్రెస్‌కు మరో షాక్: పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా
చండీగఢ్: పంజాబ్‌లో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. కెప్టెన్ అమరీందర్ సింగ్ తన సీఎం పదవికి ఇటీవల రాజీనామా చేయగా, తాజాగా పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. మంగళవారం తన రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపించారు సిద్ధూ. తన రాజీనామా లేఖలో పరోక్షంగా అమరీందర్ సింగ్‌ను వ్యవహరాన్ని ప్రస్తావించారు. ఆయనకు వ్యక్తిత్వం లేదని పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తారని అమరీందర్ సింగ్‌పై మండిపడ్డారు. ఆయన స్వలాభం కోసం పంజాబ్ భవిష్యత్తు, ప్రజల సంక్షేమంపట్ల వివక్షతకు పాల్పడుతున్నారని అన్నారు. అందుకే తాను రాజీనామా చేస్తున్నానని వివరించారు. కాగా, ఈ రోజు (మంగళవారం) సాయంత్రం బీజేపీ నేతలను కలిసేందుకు అమరీందర్ సింగ్ ఢిల్లీకి పయనమైనట్లు వార్తలు వస్తున్నాయి. పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన 72 రోజులకే సిద్దూ రాజీనామా చేయడంతో పంజాబ్ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఈ రోజు మధ్యాహ్నం వరకు పంజాబ్‌లోనే ఉన్నారు. కాగా, వీరు వెళ్లగానే సిద్దూ రాజీనామా అస్త్రాన్నిసంధించారు. తన రాజీనామాలో సిద్ధూ.. మనం రాజీపడిన రోజు మన వ్యక్తిత్వం పతనమైనట్లే అని ఘాటుగా స్పందించారు. ఎన్నికలకు ఆరునెలల ముందు కాంగ్రెస్‌కు జీర్ణించుకోలేని పరిణామాలు సంభవించాయి. సిద్దూ ఆరోపణల నేపథ్యంలో అమరీందర్‌సింగ్‌ను సీఎం పదవి నుంచి కాంగ్రెస్ దించిన విషయం తెలిసిందే. ఇటు అమరీందర్ సింగ్‌ను.. అటూ సిద్దూను కాంగ్రెస్ ఇద్దరిని దూరం చేసుకుని ఇరకాటంలో పడింది. Amarinder Singh Delhi Tour: అమరీందర్ సింగ్ బీజేపీలో చేరనున్నారా? జనసేనలో భగ్గుమన్న విభేదాలు -
కాంగ్రెస్‌కు భారీ షాక్: బీజేపీలో చేరనున్న మాజీ సీఎం?
చండీగఢ్: పంజాబ్ రాజకీయ రగడ ఇంకా సద్దుమణగలేదు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి అమరీందర్ సింగ్ అసహనంతో ఉన్నారు. పార్టీని పల్లెత్తు మాట అనని రాజకీయ దురంధరుడు హస్తం వీడి కమలం గూటికి చేరనున్నట్టు తెలుస్తోంది. ఈ వార్తల నేపథ్యంలోనే అమరీందర్ సింగ్ ఢిల్లీకి వెళ్లడం కలకలం రేపుతోంది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం కానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అనంతరం పార్టీలో చేరతారని సమాచారం. చదవండి: మహిళ పోలీస్ అధికారి బాత్రూమ్లో కెమెరా.. స్నానం చేస్తుండగా ఈ పరిణామంతో పంజాబ్ రాజకీయం మరింత వేడెక్కింది. అయితే అమరీందర్ సింగ్ బీజేపీలో చేరితే మాత్రం కాంగ్రెస్‌కు ఊహించని దెబ్బ తగలనుంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో విబేధాలు తారస్థాయికి చేరాయి. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూకు, అమరీందర్ సింగ్‌కు అసలు పొసగడం లేదు. ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఈ విబేధాలు కొనసాగుతున్నాయి. అయితే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ అధిష్టానం మధ్యే మార్గంగా అమరీందర్‌సింగ్‌ను దింపేసి దళిత వర్గానికి చెందిన చన్నీని ముఖ్యమంత్రిగా నియమించింది. చదవండి: అంగన్వాడీ టీచర్‌పై అమానుషం.. దుస్తులు చింపి.. సెల్‌ఫోన్ లాగేసుకుని అయితే ఈ నిర్ణయం ఎవరికీ ఆమోదయోగ్యంగా లేదు. పార్టీ నిర్ణయం మేరకు సిద్ధూ అంగీకరించినా మాజీ ముఖ్యమంత్రిగా మారిన అమరీందర్ సింగ్ మాత్రం జీర్ణించుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే పార్టీ మారే ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లోనే ఉంటానని చెప్పిన అమరీందర్ సింగ్ పార్టీ అధిష్టానం పిలిచి సముదాయించలేదు. పిలిచి మాట్లాడకపోవడం.. అసలు పట్టించుకోకపోవడంతో ఆయన తన దారి చూసుకుంటున్నారని సమాచారం. కొన్ని గంటల్లో ఏం జరగనుందో తెలియనుంది. -
స్థానిక సంస్థల మంత్రిగా సిద్ధూ ఔట్
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తన కేబినెట్ సహచరుడు నవజ్యోత్‌సింగ్ సిద్ధూపై కొరడా ఝుళిపించారు. చండీగఢ్‌లో గురువారం కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టిన పంజాబ్ సీఎం స్థానిక సంస్థలు, టూరిజం, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి బాధ్యతల నుంచి సిద్ధూను తప్పించారు. అనంతరం విద్యుత్, పునరుత్పాదక ఇంధనవనరుల మంత్రిత్వశాఖను సిద్ధూకు అప్పగించారు. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్‌లోని పట్టణ, నగర ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రదర్శనపై సీఎం అమరీందర్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా సిద్ధూ సరిగ్గా వ్యవహరించలేదనీ, అందువల్లే కాంగ్రెస్ నిరాశాజనక ప్రదర్శన చేసిందని అభిప్రాయపడ్డారు. తన అనాలోచిత చర్యలతో కాంగ్రెస్ లక్ష్యాలను దెబ్బతీశారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో చండీగఢ్‌లో గురువారం నిర్వహించిన కేబినెట్ భేటీకి సిద్ధూ గైర్హాజరయ్యారు. మరోవైపు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టిన అనంతరం సీఎం అమరీందర్ మాట్లాడుతూ.. తాజా మార్పుల వల్ల పాలనలో మరింత పారదర్శకతతో పాటు ప్రభుత్వ విభాగాలను మరింత సమర్థవంతంగా నడపడం వీలవుతుందని అభిప్రాయపడ్డారు. కాగా, ఇప్పటివరకూ సిద్ధూ నిర్వహించిన స్థానిక సంస్థలు టూరిజం శాఖను ఛత్రంజి సింగ్‌కు అమరీందర్ అప్పగించారు. ఆరోగ్యం–కుటుంబ సంక్షేమ శాఖను బల్బీర్ సిద్ధూకు, త్రిప్త్ బజ్వాకు ఉన్నత విద్య, పశుపోషణ–డైరీ, చేపల పెంపకం మంత్రిత్వశాఖలను కేటాయించారు. గుర్ప్రీత్ సింగ్‌కు రెవెన్యూశాఖను, విజయేందర్ సింగ్లాకు పాఠశాల విద్య, రవాణా శాఖను రజియా సుల్తాన్‌కు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖను అరుణా చౌదరికి సీఎం అప్పగించారు. నన్ను బలిపశువును చేశారు: సిద్ధూ సీఎం అమరీందర్ సింగ్ విమర్శలను మంత్రి సిద్ధూ తిప్పికొట్టారు. ‘పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో నేను కీలకపాత్ర పోషించా. నాకు కష్టపడకుండా ఏదీ రాలేదు. గత 40 ఏళ్లుగా నేను అంతర్జాతీయ క్రికెటర్‌గా, క్రికెట్ వ్యాఖ్యాతగా, టీవీ కార్యక్రమాల్లో రాణిస్తున్నా. అలాగే యువతలో స్ఫూర్తి పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా 1300కుపైగా మోటివేషనల్ కార్యక్రమాల్లో ప్రసంగించాను. పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం రూ.10,000 కోట్లు కేటాయించాం. దీంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పంజాబ్‌లోని అమృత్సర్, జలంధర్, పటియాలా, ఎస్ఏఎస్నగర్ సహా పలు పట్టణాల్లో గెలిచింది. కానీ సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ప్రదర్శనకు అందరూ నా శాఖనే బాధ్యులుగా చేశారు. నేను అమరీందర్‌ను నా పెద్దన్నగా భావిస్తాను. ఆయన మాటలను ఎల్లప్పుడూ గౌరవించాను. ఏదైనా విషయముంటే నన్ను వ్యక్తిగతంగా పిలిచి అమరీందర్ మాట్లాడాల్సింది. కానీ ఆయన తీరు నాకు బాధ కలిగించింది. ఇప్పుడు మంత్రిమండలి సమిష్టి బాధ్యత ఏమైంది? సీఎం కుర్చీ నా కుర్చీకి 3 అంగుళాల దూరంలోనే ఉన్నప్పటికీ నాపై అమరీందర్‌కు విశ్వాసం లేదు. నా పేరు, విశ్వసనీయత, పనితీరుపై వచ్చే విమర్శలను దీటుగా తిప్పికొడతా. నేను ఎప్పటికీ కాంగ్రెస్‌వాదినే’ అని సిద్ధూ స్పష్టం చేశారు. -
‘సీఎం కావాలన్నది సిద్ధూ కల’
చండీగఢ్ : మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ పంజాబ్ తదుపరి ముఖ్యమంత్రిగా తన స్దానంలో అధికార పగ్గాలు చేపట్టాలని కోరుకుంటున్నారని ఆ రాష్ట్ర సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా తన వ్యాఖ్యలతో సిద్ధూ కాంగ్రెస్‌ను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల తుది విడత పోలింగ్‌లో సింగ్ ఆదివారం తన ఓటు హక్కును వినియోగించుకునే ముందు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, సిద్ధూతో తనకేమీ వివాదం లేదని, ఆయన సీఎం కావాలని కోరుకుంటే ప్రజల ఆకాంక్షలు వారికి ఉంటాయని అన్నారు. సిద్ధూ చిన్నతనం నుంచే తనకు తెలుసని, ఆయనతో అభిప్రాయబేధాలు లేవని చెప్పారు. సీఎం కావాలన్నదే ఆయన వ్యాపకమని విమర్శించారు. కాగా సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి కేంద్రంలో యూపీఏ 3 ఏర్పాటవుతుందని సింగ్ ధీమా వ్యక్తం చేశారు. -
‘సిద్ధూ..ఇమ్రాన్ భాయ్‌కు అర్థమయ్యేలా వ్యవహరించండి’
సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిపై ఓ దేశాన్ని (పాకిస్తాన్) నిందించడం తగదని పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తగా, తాజాగా సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ సైతం సిద్ధూను ట్రోల్ చేశారు. పాక్ దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ ఉవ్విళ్లూరుతుండగా పాక్ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌ను అనుకూలంగా సిద్దూ వ్యాఖ్యలున్నాయని నెటిజన్లు మండిపడిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాక్‌ను అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేయాలని భారత్ భావిస్తున్న క్రమంలో సిద్దూ వ్యాఖ్యల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సిద్ధూపై తాజాగా సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘నవజోత్ సింగ్ సిద్ధూజీ..మీ స్నేహితుడు ఇమ్రాన్ భాయ్‌ను పరిస్థితిని అర్ధం చేసుకునేలా వ్యవహరించండ’ని ఆయన ట్వీట్ చేశారు. ‘ఇమ్రాన్ వల్లే మీరు విమర్శలు ఎదుర్కొంటున్నా’రని మరో ట్వీట్లో వ్యాఖ్యానించారు. కాగా ఈ నెల 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. -
సిద్ధూపై మంత్రుల గుస్సా
చండీగఢ్/జైపూర్: తన కెప్టెన్ రాహుల్ గాంధీయే తప్ప, ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కాదంటూ పంజాబ్ మంత్రి నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాహుల్ గాంధీ సలహా మేరకే పాక్‌లో కర్తార్‌పూర్ కారిడార్ పనుల ప్రారంభానికి వెళ్లినట్లు సిద్ధూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. వీటిపై సొంత కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేయడంతో సిద్దూ కాస్తంత వెనక్కి తగ్గి..‘పాక్‌లో నా పర్యటన విషయంలో రాహుల్‌గాంధీ జోక్యం ఏమీ లేదు. పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ వ్యక్తిగత ఆహ్వానం మేరకు నేను అక్కడికి వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే’ అంటూ పరిస్థితిని చక్కదిద్దుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సిద్ధూపై తోటి మంత్రివర్గ సభ్యుల ఆగ్రహం తగ్గలేదు. దీనిపై మంత్రులు తృప్త్ రాజీందర్ సింగ్ బజ్వా, సుఖ్బీందర్ సింగ్ సర్కారియా, రాణా గుర్మీత్ సింగ్ సోధి మాట్లాడుతూ.. ‘రాహుల్ గాంధీ మా నేత. పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆయన. పంజాబ్‌లో మా ప్రభుత్వ కెప్టెన్ అమరీందర్. ఆయన కెప్టెన్సీలోని మంత్రి వర్గంలో సిద్ధూయే కాదు సీఎం అమరీందర్‌ను కెప్టెన్‌గా అంగీకరించని వారెవరైనా మంత్రి వర్గం నుంచి వెంటనే తప్పుకోవాలి. లేదా క్షమాపణ చెప్పి పంజాబ్‌లో సీఎం అమరీందరే కెప్టెన్ అన్న విషయం అంగీకరించాలి’ అని అన్నారు. కాగా, సిద్ధూ వ్యాఖ్యల వ్యవహారం సోమవారం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనూ ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. -
శ్రవణ్ విజయాన్ని ఆపలేరు: మాజీ క్రికెటర్ సిద్ధూ
మాజీ స్టార్ క్రికెటర్లు, కాంగ్రెస్ నేతలు శుక్రవారం నగర రాజకీయాలను వేడెక్కించారు. పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఖైరతాబాద్ ప్రజాఫ్రంట్ అభ్యర్థి దాసోజు శ్రవణ్‌కుమార్‌కు మద్దతుగా ప్రచార ర్యాలీ తీయగా, మరో క్రికెటర్ అజారుద్దీన్ జూబ్లీహిల్స్ అభ్యర్థి పి.విష్ణువర్ధన్‌రెడ్డి తరఫున ఎర్రగడ్డ, రహమత్‌నగర్‌లలో ప్రచారం చేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎవరికి వారే మాటల తూటాలు పేల్చారు. ఖైరతాబాద్: హిమాలయాలను ఎలా కదిలించలేరో.. భూమిని ఎలా ఎత్తలేరో.. సముద్రాన్ని ఎలా ఎండగట్టలేరో.. సూర్యుడి తాపాన్ని ఎలా ఆపలేరో అలాగే ఖైరతాబాద్‌లో దాసోజు శ్రవణ్ విజయాన్ని ఆపలేరని మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్‌సింగ్ సిద్ధు అన్నారు. శుక్రవారం సాయంత్రం ఖైరతాబాద్ ప్రజాఫ్రంట్ అభ్యర్థి దాసోజు శ్రవణ్‌కుమార్‌కు మద్దతుగా ప్రచారలో పాల్గొన్న ఆయన సోమాజిగూడ నుంచి ఖైరతాబాద్ లైబ్రరీ చౌరస్తా వరకు రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధూ మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్ల పాలనలో కేసీఆర్ ప్రజల సమస్యలను గాలికొదిలేశారని విమర్శించారు. మిలుగు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. ప్రస్తుతం రాజకీయ వాతావరణంలో మార్పు అవసరమని, ఇదే అవకాశంగా సిక్స్ కొట్టి చూపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అభ్యర్థి శ్రవణ్‌కుమార్ మాట్లాడుతూ.. అవినీతికి, నిజానికి మధ్య యుద్ధం జరుగుతోందని, వాగ్దానాలు అమలు చేయమంటే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పే పార్టీలను నమ్మొద్దన్నారు. తనను గెలిపిస్తే ఖైరతాబాద్‌లో ప్రతి గల్లీకి ఓ ఎమ్మెల్యేను తయారు చేసి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దుతానన్నారు. ఖైరతాబాద్‌లో కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి హాస్పిటల్ బిల్డింగ్ నిర్మిస్తే సిబ్బందిని, కనీస వసతులు కల్పించలేని నాయకులకు మరోసారి అవకాశం ఇవ్వవద్దన్నారు. చింతల రామచంద్రారెడ్డి టోకెన్లతో మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని, ఓట్లు దండుకొని బానిసలుగా మార్చే వారికి ఓటుతోనే గుణపాఠం చెప్పాలన్నారు. ఈ రోడ్‌షోలో కూటమి నాయకులు బి.ఎన్.రెడ్డి, రోహిన్‌రెడ్డి, మహేష్‌యాదవ్, ఎస్.కె.షరీఫ్, మధుకర్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులు శ్రవణ్‌కు మద్దతు తెలిపారు. -
ఆయన పాలనంతా డొల్లే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్ పాలన వెదురు బొంగులా లోపలంతా డొల్లగా ఉందని కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ పైకి చాలా గొప్పలు చెబుతున్నా.. తెలంగాణ ఆర్థిక పరిస్థితి మాత్రం దారుణంగా మారిందన్నారు. ప్రజల కోసం ప్రభుత్వం ఉండాలి కానీ.. ఇక్కడ ఒక కుటుంబం కోసం ప్రభుత్వంగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో 75 శాతం ప్రజలు అరకొర సంపాదనతో కాలం వెల్లదీస్తుంటే, కేసీఆర్ మాత్రం తన కోసం రూ.300 కోట్ల బంగ్లా కట్టుకుని బయటికి రాకుండా పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ రూ.17 వేల కోట్ల మిగులు రాష్ట్రాన్ని రూ.2 లక్షల 40 వేల కోట్ల అప్పులమయం చేశారని ఆరోపించారు. కేటీఆర్ ఆస్తుల్ని నాలుగు వందల రేట్లు పెంచుకున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ బాబా.. చార్ చోర్ ఆలీబాబా చాలీస్ చోర్లా తెలంగాణలో కేసీఆర్ బాబా చార్ చోర్‌గా పరిస్థితి ఉందని, కేసీ ఆర్ ఆలీబాబా అయితే.. నలుగురు దొంగలు కేటీఆర్, కవిత, హరీశ్, సంతోష్లని సిద్ధూ అభివర్ణించారు. ‘మహిళల సాధికారత అంటే కేసీఆర్ దృష్టిలో ఆయన కూతురు ఒక్కరే.. ఎన్ని ఉద్యోగాలిస్తామని ఎన్ని ఇచ్చారు.. మీ హామీ మేరకు ముస్లిం యువకులు రిజర్వేషన్ అడిగితే తప్పేంటి’అని సీఎం కేసీఆర్‌ను సిద్ధూ ప్రశ్నించారు. టీఆర్ఎస్ను విలీనం చేస్తానని, దళిత సీఎం అని ఊసరవెల్లి కంటే వేగంగా రం గులు మార్చి గద్దె పైన కూర్చున్న ఘనుడు కేసీఆర్ అని దుయ్యబట్టారు. కేసీఆర్ ఓ జాదూగర్ అని.. ఒక్క ప్రాణహిత ప్రాజెక్టులోనే రూ.40 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. దొందూ దొందే.. ప్రధాని మోదీ.. కేసీఆర్.. దొందూ దొందే అని సిద్ధూ విమర్శించారు. మోదీ కూడా విదేశాల్లో దాచిన రూ.90 లక్షల కోట్ల నల్లధనాన్ని తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని చెప్పి ఇప్పటివరకు చేసింది ఏం లేదన్నారు. రూ.వేల కోట్ల అప్పులు చేసిన అదానీ, అంబానీలను కనీసం పట్టించుకోరని విమర్శించారు. రైతులకు మోదీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదన్నారు. -
సిద్ధూ చేసింది తప్పే..
చండీగఢ్/లాహోర్ : అటు క్రికెట్‌లోను.. ఇటు రాజకీయాల్లోను నవజ్యోత్ సింగ్ సిద్ధూకు వివాదాలు కొత్తేమీ కాదు. అయితే భారత్–పాక్ సంబంధాలు దిగజారిన ప్రస్తుత తరుణంలో.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారంలో ఆ దేశ ఆర్మీ చీఫ్‌తో కౌగిలింతలు, ముచ్చట్లపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాజ్‌పేయి మరణంతో విషాదంలో ఉన్న దేశ ప్రజల మనోభావాల్ని సిద్ధూ విస్మరించారని, అతను క్షమాపణ చెప్పాలని బీజేపీ, అకాళీదళ్‌లు ఇప్పటికే డిమాండ్ చేయగా.. ఇప్పుడు పంజాబ్ సీఎం అమరీందర్ కూడా తన కేబినెట్ సహచరుడి చర్య సమర్ధనీయం కాదంటూ గట్టి షాకిచ్చారు. సిద్ధూ మాత్రం తన తప్పేమీ లేదని సమర్ధించుకున్నారు. నిజానికి సిద్ధూ పాకిస్తాన్ వెళ్లడాన్ని ఎవరూ పెద్దగా తప్పుపట్టలేదు. అయితే పాక్ ఆర్మీ చీఫ్‌ను ఆప్యాయంగా హత్తుకుని ముచ్చటించడం, పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రధాని పక్కన కూర్చోవడం వివాదాస్పమైంది. ఆర్మీ కెప్టెన్‌గా కూడా పనిచేసిన అమరీందర్ సింగ్ మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పట్ల సిద్ధూ వాత్సల్యం సరికాదు. ప్రతి రోజూ మన జవాన్లు అమరులవుతున్న విషయం అర్థం చేసుకోవాలి’అని ఘాటుగా స్పందించారు. సిద్ధూ పర్యటన అతని వ్యక్తిగతమని, అలాగే తన పక్కన కూర్చున్న వ్యక్తి పీఓకే చీఫ్ అన్న విషయం తెలిసుండకపోవచ్చని మరో ప్రశ్నకు అమరీందర్ సమాధానమిచ్చారు. దేశ ప్రతిష్టను సిద్ధూ ప్రమాదంలోకి నెట్టారని బీజేపీ విమర్శించగా.. పాక్ పర్యటనతో మన మర్యాదను మంటగలిపారని శిరోమణి ఆకాలీదళ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకే పీఓకే చీఫ్ పక్కన కూర్చున్నా: సిద్ధూ ఇక ఆదివారం అట్టారి– వాఘా సరిహద్దు వద్ద భారత్ భూభాగం చేరుకున్నాక సిద్ధూ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఒకరు(పాక్ ఆర్మీ చీఫ్) నా వద్దకు వచ్చి.. మనం ఒకే సంస్కృతికి చెందినవారం. గురునానక్ దేవ్ 550వ జయంతి వేడుకల నాటికి పాకిస్తాన్‌లోని గురుద్వారా కర్తార్‌పూర్ షాహిబ్ సందర్శనకు మార్గం సుగమం చేయాలని కోరినప్పుడు నేనేం చేయాలి?’అని ప్రశ్నించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రధాని పక్కనే కూర్చోవడంపై వివరణిస్తూ.. ‘మీరు ఎక్కడికైనా అతిథిగా వెళ్తే.. వారు కేటాయించిన చోట కూర్చోవాలి. నిజానికి నేను వేరే చోట కూర్చున్నాను. అయితే నన్ను పీఓకే చీఫ్ పక్కన కూర్చోమన్నారు’అని చెప్పారు. భారత్ చేరుకోక ముందు లాహోర్‌లో మాట్లాడుతూ.. ‘ఇక్కడ లభించిన ప్రేమానురాగాలకు నేనెంతో ముగ్ధుడినయ్యాను. రెండు దేశాల మధ్య శాంతి కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను’అని సిద్ధూ అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాల పునరుద్ధరణకు తాను సానుకూలమని.. ఐపీఎల్, పీఎస్‌ల్ విజేతల మధ్య పోటీ మంచి ఆలోచనని చెప్పారు. మరోవైపు వాఘా వద్ద సిద్ధూకు నిరసన సెగ తగిలింది. భారత్‌కు చేరుకునే సమయంలో ‘పగ్రీ సంబాల్ జట్టా’సంస్థకు చెందిన కార్యకర్తలు సిద్ధూకి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించడంతో పాటు నల్ల జెండాలతో నిరసన తెలిపారు.