సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిపై ఓ దేశాన్ని (పాకిస్తాన్) నిందించడం తగదని పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తగా, తాజాగా సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ సైతం సిద్ధూను ట్రోల్ చేశారు. పాక్ దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ ఉవ్విళ్లూరుతుండగా పాక్ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌ను అనుకూలంగా సిద్దూ వ్యాఖ్యలున్నాయని నెటిజన్లు మండిపడిన సంగతి తెలిసిందే.
ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాక్‌ను అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేయాలని భారత్ భావిస్తున్న క్రమంలో సిద్దూ వ్యాఖ్యల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సిద్ధూపై తాజాగా సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘నవజోత్ సింగ్ సిద్ధూజీ..మీ స్నేహితుడు ఇమ్రాన్ భాయ్‌ను పరిస్థితిని అర్ధం చేసుకునేలా వ్యవహరించండ’ని ఆయన ట్వీట్ చేశారు. ‘ఇమ్రాన్ వల్లే మీరు విమర్శలు ఎదుర్కొంటున్నా’రని మరో ట్వీట్‌లో వ్యాఖ్యానించారు. కాగా ఈ నెల 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మందికి పైగా సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment