సాక్షి,న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి, భారత వైమానిక దళాల దాడులపై అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రధాని మోదీయే టార్గెట్‌గా కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. పుల్వామా ఉగ్రదాడిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. పుల్వామాలో జరిగింది ఉగ్రదాడి కాదని, అది ప్రమాదవశాత్తు జరిగిందని వ్యాఖ్యానించారు. దాని ద్వారా బీజేపీ ప్రభుత్వం లబ్ధిపొందాలని ప్రయత్నిస్తోందని దిగ్గిరాజా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై తమకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.(ఆధారాలు కావాలా.. బాలాకోట్ వెళ్లండి!)
బాలాకోట్‌లో భారత వైమానిక దళాలు జరిపిన మెరుపు దాడుల్లో మృతిచెందిన ఉగ్రవాదుల సంఖ్యను ప్రధాని మోదీ అధికారికంగా ఎందుకు విడుదల చేయలేదని దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు. బీజేపీలో ఒక్కొక్కరు ఒక్కో సంఖ్య ప్రకటిస్తున్నారని అన్నారు. మెరుపు దాడుల్లో 250 మంది ఉగ్రదాదులను అంతంచేశామని అమిత్ షా, 500 మంది అని యోగి ఆదిత్యానాథ్ చెప్పినట్లు గుర్తుచేశారు. కానీ ఇంతవరకు కేంద్రం మాత్రం ప్రకటించలేదని అన్నారు. ఈమేరకు బుధవారం ఆయన వరుస ట్వీట్లు చేశారు. బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులకు ఆధారాలు చూపించాలని కాంగ్రెస్ సీనియర్‌నేత కపిల్ సిబాల్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
हमें हमारी सेना पर उनकी बहादुरी पर गर्व है व सम्पूर्ण विश्वास है। सेना में मैंने मेरे अनेकों परिचित व निकट के रिश्तेदारों को देखा है किस प्रकार वे अपने परिवारों को छोड़ कर हमारी सुरक्षा करते हैं। हम उनका सम्मान करते हैं।
— digvijaya singh (@digvijaya_28) 5 March 2019
Comments
Please login to add a commentAdd a comment