న్యూఢిల్లీ: పూల్వామా ఉగ్రవాద దాడి ఘటనను ‘ప్రమాదం’గా అభివర్ణించి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి ఘాటుగా ట్వీట్ చేశారు. పూల్వామా ట్వీట్ నేపథ్యంలో దమ్ముంటే ప్రధాని మోదీ తనపై కేసు పెట్టి విచారణ జరపాలని సవాల్ విసిరారు.
‘నేను చేసిన ట్వీట్‌తో నేను పాకిస్థాన్ మద్దతుదారుడినని, దేశద్రోహినని మీరు, మీ మంత్రులు ముద్ర వేస్తున్నాను. నేను ఈ ట్వీట్‌ను ఢిల్లీలో చేశాను. ఢిల్లీలో పోలీసులు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నారు. మీకు దమ్ముంటే నాపై కేసు పెట్టండి’ అని దిగ్విజయ్ ట్వీట్ చేశారు.
పూల్వామా ప్రమాదం తర్వాత భారత్ జరిపిన వైమానిక దాడులపై విదేశీ మీడియా అనుమానాలు వ్యక్తం చేసిందంటూ దిగ్విజయ్ మంగళవారం చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. 40మందికి పైగా జవాన్లను పొట్టనబెట్టుకున్న పూల్వామా ఉగ్రవాద దాడిని కేవలం ప్రమాదంగా అభివర్ణిస్తూ దిగ్విజయ్ ట్వీట్ చేశారంటూ ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు ఆయనపై మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment