న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్‌సింగ్‌కు గట్టి షాక్ ఎదురైంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను పోటీచేస్తున్న భోపాల్‌లో జరిగిన ఓ ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా నరేంద్రమోదీ గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు రూ. 15 లక్షలు మీ ఖాతాల్లోకి వచ్చాయా? అని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వేదిక మీదకు వచ్చి చెప్పండి అంటూ జన్నాన్ని ఉత్సాహ పరిచారు.
ఓ యువకుడు చేయి ఎత్తడంతో అతన్ని స్టేజీ మీదకు పిలిచి.. ‘మీ అకౌంట్‌లోకి 15 లక్షలు వచ్చాయా? ప్రజలకు చెప్పు’ అంటూ దిగ్విజయ్ ప్రశ్నించగా.. అందరినీ ఆశ్చర్యపరిచేలా ఆ యువకుడు బదులిచ్చాడు. ‘మోదీజీ సర్జికల్ స్ట్రైక్స్ జరిపి.. ఉగ్రవాదులను చంపేశాడు’ అంటూ అతను బదులివ్వడంతో డిగ్గిరాజాతోపాటు ఇతర కాంగ్రెస్ నేతలు కంగుతిన్నారు. వెంటనే ఆ యువకుడిని వేదిక మీద నుంచి తరిమేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కూల్‌గా వేదిక మీదకు వచ్చి.. ఏమాత్రం తడబడకుండా తాపీగా మోదీ మీద ప్రశంసల జల్లు కురిపించిన ఓ యువకుడిని ఓ వైపు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మరోవైపు దిగ్విజయ్‌కు ఆ యువకుడు గట్టిగా బుద్ధి చెప్పాడని, ఆయనకు తగిన బదులు దొరికిందని విమర్శనాస్త్రలు సంధిస్తున్నారు.
డిగ్గిరాజాకు యువకుడి దిమ్మతిరిగే షాక్..!
Published Mon, Apr 22 2019 7:24 PM | Last Updated on Mon, Apr 22 2019 7:31 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment