
చంఢీఘడ్: పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్, సిద్ధూల మధ్య పరస్పర ఆరోపణలు కొనసాగుతున్నాయి. తాజాగా, పంజాబ్ మాజీ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. అమరీందర్ సింగ్‌ను ఉద్దేశించి వివాదాస్పద ట్వీట్ చేశారు. ‘‘మీ సతీమణి, మేడం ప్రణీత్ కౌర్.. మీతో పాటు కాంగ్రెస్‌కు రాజీనామా చేశారా.. లేదా’’ అంటూ ప్రశ్నించారు. మీ భార్య మీ నిర్ణయాలకు సానుకూలంగా.. నిలబడలేరని విమర్శించారు. అమరీందర్ సింగ్ పిడుగుపాటులో చనిపోతున్న బాతులాంటి వాడని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, అమరీందర్ సింగ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి నిన్న(మంగళవారం) ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’ అనే కొత్త పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. అమరీందర్ సింగ్ తన రాజీనామా లేఖలో సిద్ధూని.. పాక్‌కు అంతరంగిక బంటూ అంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా, పంజాబ్‌లో అమరీందర్ సింగ్, నవజ్యోత్‌సింగ్‌ల మధ్య విబేధాలు కొనసాగుతునే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment