
చంఢిఘర్: పంజాబ్ రాష్ట్ర పీసీపీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు. ఆయన సెప్టెంబర్ 28న పంజాబ్ రాష్ట్ర పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాతో పంజాబ్ కాంగ్రెస్‌లో పలు కీలక పరిణామాలు చేటు చేసుకున్నాయి. తాజాగా సిద్ధూ శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన పీసీసీ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామా వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించారు.
చదవండి: జమ్మూ కశ్మీర్: ఆస్పత్రిలోకి చొరబడి ఉగ్రదాడి
తాను తీసుకున్న నిర్ణయం వ్యక్తిగతమైంది కాదని, మళ్లీ పీసీసీ అధ్యక్ష పదని చేపడతానని పేర్కొన్నారు. కొత్త అడ్వకేట్ జనరల్(ఏజీ), డీజీపీ నియామకం త్వరలో జరగనుందని సిద్ధూ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment