చండీగఢ్: పంజాబ్‌లో రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీఎం చన్నీ, పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్‌లు తమ ఆధిపత్యం కోసం పోటాపోటీగా ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా, సీఎం చన్నీ ఒక మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో.. ‘త్వరలో జరగనున్న ఎన్నికలలో కాంగ్రెస్ అధిష్టానం పంజాబ్ సీఎం అభ్యర్థిగా.. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూని పేరుని యోచిస్తుందా ’ అని ప్రశ్నించారు. దీనిపై చన్నీ తనదైన శైలీలో స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి తాను ఒక సేవకుడినని.. అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్న దాన్ని గౌరవిస్తానని స్పష్టం చేశారు.
సిద్ధూ తనకు సోదరుడు లాంటి వాడని, దీనిపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా చన్నీ.. మాజీ సీఎం అమరీందర్ సింగ్‌పై ఆరోపణలు గుప్పించారు. కాగా, ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ సీఎం అభ్యర్థిగా భగవంత్‌మాన్ పేరును ప్రకటించడంపై కూడా స్పందించారు. కేజ్రీవాల్ పంజాబ్ నుంచి నాయకుడిగా ఎదగాలన్నారు.
పంజాబ్ ప్రజల నుంచి తగినంత మద్దతు కనబడకపోవడంతో చివరి నిమిషంలో భగవంత్ మాన్ పేరును ప్రతిపాదించారని తెలిపారు. కాగా, చన్నీ తాను పోటికి దిగుతున్న చామ్‌కౌర్ సాహిబ్ స్థానం నుంచి ఓడిపోతారని కేజ్రీవాల్ విమర్శించారు. అదే సమయంలో చన్నీ మేనల్లుడి ఇంట్లో కోట్లాది రూపాయలను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకోవడం కలకలంగా మారిన విషయం తెలిసిందే. పంజాబ్‌లో ఫిబ్రవరి 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment