CM candidate
-
TS: సీఎం ఎవరు..?ఏఐసీసీ చీఫ్ ఖర్గే కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ సీఎం ఎవరు? కొత్త మంత్రులు ఎవరనేదానిపై ఉత్కంఠకు ఇవాళ తెరపడే ఛాన్సుంది. పార్లమెంట్‌లోని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఛాంబర్లో ఇండియా కూటమి సమావేశానికి వెళ్తూ ఖర్గే ఈ విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం ఎవరనేది సాయంత్రానికల్లా వెల్లడిస్తామని చెప్పారు. కాగా, సీఎం అభ్యర్థిని నిర్ణయించేందుకుగాను ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో చర్చించడానికి సోమవారమే డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్లారు. ఇవాళ ఆయన ఖర్గేతో సమావేశమై చర్చించిన అనంతరం నిర్ణయం వెలువడే ఛాన్సుంది. మరోవైపు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొద్దిసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. ఖర్గేతో డీకేఎస్ భేటీకి ముందు భట్టి, ఉత్తమ్‌లు డీకేఎస్‌తో సమావేశమై సీఎం, మంత్రివర్గ కూర్పుపై తమ వాదనలు బలంగా వినిపించనున్నట్లు తెలుస్తోంది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన ఎంపీ పదవికి ఇవాళే రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఇదీచదవండి..సీం ఎవరు..? సాయంత్రానికి సస్పెన్స్‌కు తెర! -
TS: సీల్డ్ కవర్‌తో హైదరాబాద్‌కు డీకే శివకుమార్ !
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ సీఎం ఎవరనే సస్పెన్స్‌కు ఇవాళ సాయంత్రానికి తెరపడనున్నట్లు తెలుస్తోంది. సోమవారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో భేటీ తర్వాత ఢిల్లీ వెళ్లిన ఏఐసీసీ ముఖ్య పరిశీలకుడు డీకే శివకుమార్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో భేటీ కానున్నారు. సీఎం, మంత్రుల జాబితాపై ఖర్గేతో చర్చించి ఫైనల్ చేయనున్నారు. అనంతరం డీకేఎస్‌తో పాటు మిగిలిన పరిశీలకులు సీల్డ్ కవర్‌తో మధ్యాహ్నమే హైదరాబాద్ బయలుదేరనున్నారు. డీకే శివకుమార్ నేరుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బస చేసిన ఎల్లా హోటల్‌కు వెళ్లి వారతో సమావేశమవుతారు. అక్కడ సీల్డ్ కవర్లో ఉన్న సీఎం పేరును ప్రకటిస్తారు. అనంతరం ముఖ్యమైన పోర్ట్‌ఫోలియోలకు మంత్రులెవరనేది కూడా వెల్లడిస్తారు. మొత్తానికి సీఎం పదవి చేపట్టనుందెవరనేది సాయంత్రానికి తేలిపోయే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం ప్రమాణ స్వీకారం ఎప్పుడుంటుందనేదానిపై పేరు ప్రకటించిన తర్వాతే క్లారిటీ వచ్చే ఛాన్సుంది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 సీట్లు గెలిచి మ్యాజిక్ ఫిగర్ సాధించిన విషయం తెలిసిందే. లెజిస్లేచర్ పార్టీ లీడర్ (సీఎల్పీ) నేతను ఎన్నుకోవడానికి గెలిచిన ఎమ్మెల్యేలంతా గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో సోమవారం సమావేశమయ్యారు. అయితే ఈ విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో సీఎం ఎంపిక బాధ్యతను అధిష్టానానికి అప్పగిస్తూ ఎమ్మెల్యేలు ఏకవ్యాఖ్య తీర్మానం చేసి పంపించారు. తర్వాత డీకే శివకుమార్ సహా ఏఐసీసీ పరిశీలకులు ఢిల్లీ వెళ్లారు. ఇదీచదవండి..గ్రేటర్ హైదరాబాద్‌లో మంత్రి పదవి వరించేదెవరిని... -
TS: సీఎం పదవి పంచాయితీ..ఢిల్లీకి సీనియర్లు..?
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ మార్కు రాజకీయం మళ్లీ స్టార్టయింది. ఎన్నికల ఫలితాల్లో పార్టీ గెలిచిన వెంటనే జరగాల్సిన సీఎం ఎంపిక తంతు వాయిదాపడింది. సీఎం పదవి ఎవరికివ్వాలనే పంచాయితీ అంత ఈజీగా తేలేలా కనిపించడం లేదు. సీఎం ఎంపిక కోసం సోమవారం హైదరాబాద్‌లో జరగిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. గచ్చిబౌలిలోని ఓ హోటల్లో జరిగిన ఎమ్మెల్యేల మీటింగ్‌లో సీఎం అభ్యర్థిపై ఏకాభిప్రాయం రాలేదు. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సీఎం ఎవరనేది నిర్ణయించే బాధ్యతను ఎమ్మెల్యేలలంతా కలిసి ఏకవాక్య తీర్మానం ద్వారా అధిష్టానానికి అప్పగించారు. దీంతో సీన్ ఒక్కసారిగా ఢిల్లీకి మారిపోయింది. ఏఐసీసీ ముఖ్య పరిశీలకునిగా వచ్చిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఎమ్మెల్యేల సమావేశం నుంచి అలిగి బయటికి వెళ్లిన భట్టి విక్రమార్కతో పాటు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ కూడా ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ వెళ్లి లాబీయింగ్..? సీఎం పదవిపై ఇప్పటికే రేసులో ఉన్న అగ్రనేతలెవరూ పట్టు వీడటం లేదని తెలుస్తోంది. తామూ పదవికి అర్హులమేనని ఢిల్లీ వెళ్లి హై కమాండ్‌కు మొర పెట్టుకోనున్నట్లు సమాచారం. దీంతో రేసులో ఉన్నవారందరి పేర్లు పరిగణలోకి తీసుకుని త్వరలో ఏఐసీసీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం అభ్యర్థి ఎవరనేది వెల్లడవుతుందనుకుని ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసిన ప్రభుత్వ అధికారులు, పోలీసులు పార్టీ నుంచి ఏ నిర్ణయం రాకపోవడంతో రాజ్‌భవన్ నుంచి ఇవాళ సాయంత్రం వెళ్లిపోయారు. ఎల్లా హోటల్లోనే ఎమ్మెల్యేలు.. అయితే సీఎం ఎవరనేదానిపై మంగళవారం క్లారిటీ వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన డీకే శివకుమార్, ఇతర ఏఐసీసీ పరిశీలకులు రేపు ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో సమావేశమై చర్చించనున్నారు. భేటీ తర్వాత సీఎం ఎవరనే నిర్ణయాన్ని ఖర్గే వెల్లడిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఢిల్లీకి రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు క్యూ కట్టనుండడంతో ఒక్కరోజులో అధిష్టానం సీఎం అభ్యర్థిని ఫైనల్ చేస్తుందా లేదా అన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సోమవారం సమావేశమైన గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా బస చేస్తున్నారు. సీఎం అభ్యర్థి ఫైనలయ్యేదాకా వారంతా అక్కడే ఉండాలని పార్టీ ఆదేశించినట్లు సమాచారం. ఇదీచదవండి..ఓటమి తర్వాత కేసీఆర్ తొలిసారి ఇలా.. ఆసక్తికర వ్యాఖ్యలు -
TS: సీఎం ప్రమాణస్వీకారం వాయిదా
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ సీఎం అభ్యర్థి విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ ఎన్నికల ముఖ్య పరిశీలకుడు డీకే శివకుమార్‌తో పాటు మరో నలుగురు అబ్జర్వర్లు కూడా ఢిల్లీకి వెళ్లారు. మంగళవారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పరిశీలకులు సమావేశమవనున్నారు.దీంతో ఇవాళ సీఎల్పీ నేత ప్రకటన లేనట్లేనని సమాచారం. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేల(సీఎల్పీ)సమావేశం సోమవారం ఉదయం గచ్చిబౌలిలోని ఎల్లాహోటల్లో జరిగింది. ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఏఐసీసీ పరిశీలకులు ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్నారు. ఏకాభిప్రాయం రాకపోవడంతో సీఎల్పీ నేతల ఎన్నిక బాధ్యతను అధిష్టానానికి అప్పగిస్తూ ఏకవాఖ్య తీర్మానం చేసి హైకమాండ్‌కు పంపారు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి సీఎల్పీ నేత పేరుపై క్లారిటీ వస్తుందని అంతా ఎదురు చూశారు. కానీ చివరకు డీకే శివకుమార్ సహా నలుగురు ఏఐసీసీ పరిశీలకులు ఢిల్లీకి పయనమయ్యారు. దీంతో సీఎల్పీ నేత ఎంపిక వాయిదా పడింది. మరోపక్క తెలంగాణ రెండవ అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్ మూడో శాసనసభను గెజిట్‌లో నోటిఫై చేశారు. జీఏడీ అధికారులు కూడా సీఎం ప్రమాణ స్వీకారానికి రాజ్‌భవన్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొత్త సీఎం కోసం కొత్త కాన్వాయ్‌ని కూడా రెడీ చేశారు. కాంగ్రెస్ అధిష్టానం సీఎల్పీ నేత ఎవరో వెల్లడించిన వెంటనే కొత్త సీఎం ప్రమాణస్వీకారం ఉంటుందని అంతా భావించారు. చివరకు పరిశీలకులు ఢిల్లీ వెళ్లడంతో సీఎల్పీనేత ఎంపికతో పాటు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం కూడా ఇవాళ లేనట్లేనని తేలిపోయింది. సీఎం ప్రమాణ స్వీకారం వాయిదాపడిందని తెలియడంతో రాజ్‌భవన్ నుంచి పోలీసులు, అధికారులు వెళ్లిపోయారు. ఇదీచదవండి..తెలంగాణలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. అప్డేట్స్ -
మిజోరం జెయింట్ కిల్లర్..ఎవరంటే..!
ఐజ్వాల్: మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో జోరామ్ పీపుల్స్ మూమెంట్(జెడ్‌పీఎమ్) పార్టీ ఘన విజయం సాధించింది. 27 సీట్లతో అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే ఈ ఎన్నికల్లో జెడ్‌పీఎమ్ పార్టీ తరపున ఐజ్వాల్ ఈస్ట్-1 నియోజకవర్గం నుంచి గెలిచిన లాల్తన్సంగా వార్తల్లో నిలిచారు. మూడుసార్లు మిజోరం ముఖ్యమంత్రిగా చేసిన జోరంతంగాను ఓడించి 2 వేల ఓట్ల మెజారిటీతో లాల్ గెలిచారు. ఈ సందర్భంగా లాల్తన్సంగా మాట్లాడుతూ ‘మిజోనేషనల్ ఫ్రంట్(ఎమ్ఎన్ఎఫ్), కాంగ్రెస్ పార్టీలది కేవలం అధికారదాహం. పార్టీ నాకు ఐజ్వాల్ ఈస్ట్-1 టికెట్ ఇచ్చినపుడు నేను సర్వే చేసుకున్నాను. నియోజకవర్గంలో జోరంతంగా బలం అంతగా లేదని నాకు అప్పుడే తెలిసింది. ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా జోరంతంగా నాయకత్వంపై ప్రజలు అంత సంతృప్తిగా లేరు’అని లాల్ తెలిపారు. ‘కాంగ్రెస్, ఎమ్ఎన్ఎఫ్ పార్టీలు కేవలం డబ్బుపైనే ఆధారపడి రాజకీయాలు చేస్తాయి.నిజంగా డబ్బు ప్రభావమే ఉంటే జోరంపై నేను గెలిచేవాడిని కాదు’అని లాల్ చెప్పారు. సోమవారం ప్రకటించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మిజోరంలో జెడ్‌పీఎమ్ పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది. మిజోరం అసెంబ్లీలో మొత్తం 40 సీట్లుండగా జెడ్‌పీఎమ్ 27 సీట్లు గెలిచింది. ఇవీ చూడండి..మిజోరం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ అప్డేట్స్ -
ఢిల్లీ 'చేతి'కి తెలంగాణ
-
ఈరోజే సీఎం ప్రమాణ స్వీకారం !..రాజ్ భవన్ లో భారీ ఏర్పాట్లు
-
తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ కసరత్తు
-
సీఎం ఎవరు ?..ఇవాళ సీఎల్పీ సమావేశం
-
రాజస్థాన్ సీఎం పీఠం ఎవరిది? జైపూర్ కీ బేటీ? బాలక్‌నాథ్?
రాజస్థాన్‌లో భారతీయ జనతా పార్టీ రాజస్థాన్‌ను కాంగ్రెస్ నుండి కైవసం చేసుకునేందుకు సిద్ధంగా ఉంది. తాజా గణాంకాల ప్రకారం, బీజేపీ 17 స్థానాల్లో విజయం సాధించి, 98 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ ఇప్పటి వరకు ఐదు స్థానాల్లో విజయం సాధించి 64 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మేజిక్ ఫిగర్ ఒక పార్టీకి 101 స్థానాలు కావాల్సి ఉంది. అయితే రాజస్థాన్‌లో బీజేపీ తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకుంటుంది అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సీఎం రేసులో ఉన్న పేర్లు వసుంధర రాజే: రాజస్థాన్ తొలి మహిళా ముఖ్యమంత్రి ,ఐదుసార్లు ఎంపీగా ఎన్నికైన రాజే ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. 2003 నుండి రాజస్థాన్‌లోని ఝల్రాపటన్ సీటును నిలబెట్టు కుంటూ వస్తున్నారు. 2018 ఎన్నికలలో బీజేపీ ఓటమి తర్వాత, రాజే పార్టీ సమావేశాలు, కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. కానీ ప్రస్తుత ఎన్నికల్లో ఆమెను ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టాలని రాజే మద్దతుదారులు పిలుపునిచ్చినప్పటికీ, బీజేసీ అగ్ర నాయకత్వం పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. గజేంద్ర సింగ్ షెకావత్: 56 ఏళ్ల కేంద్ర మంత్రి , బీజేపీకి చెందిన ప్రముఖ రాజ్‌పుత్ నాయకుడు గజేంద్ర సింగ్ షెకావత్ సీఎం రేసులో ఉన్న మరో కీలక అభ్యర్థి. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ కుమారుడు వైభవ్‌ను ఓడించి జోధ్‌పూర్ నుండి 2019 లోక్‌సభ ఎన్నికలలో విజయం సాధించడంతో అతని ప్రాముఖ్యత పెరిగింది. అర్జున్ రామ్ మేఘ్వాల్: రాజస్థాన్ ముఖ్యమంత్రి స్థానానికి కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మరో ముఖ్యమైన పోటీదారు అని చెప్పొచ్చు. ప్రధానమంత్రి మోడీతో బలమైన బంధంతో, మూడుసార్లు పార్లమెంటేరియన్ అయిన మేఘవాల్ రాజస్థాన్‌లోని దళిత ముఖాలలో ఒకరిగా కనిపిస్తారు. దియా కుమారి: 'జైపూర్ కి బేటీ' దియా కుమారి కూడా ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన రేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు. జైపూర్ రాజకుటుంబంలో యువరాణిగా జన్మించిన దియా, సెప్టెంబరు 10, 2013న అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధాని మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ , వసుంధర రాజే సమక్షంలో బీజేపీలో చేరారు. ఆ తర్వాత రాష్ట్ర, లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆమె విజయకేతనం ఎగురవేశారు. బాలక్‌నాథ్ యోగి: రోహ్తక్లోని బాబా మస్త్‌నాథ్ మఠానికి చెందిన మహంత్ బాబా బాలక్‌నాథ్, తిజారా అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. ఆయన దాదాపు 10707 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ ఖాన్‌పై విజయం సాధించారు. బాబా బాలక్‌నాథ్‌ను రాజస్థాన్ ముఖ్యమంత్రిని చేయాలని సాధువులు డిమాండ్ చేశారు.ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాదిరిగానే, బాలక్‌నాథ్ నాథ్ కమ్యూనిటీకి చెందినవాడు. అల్వార్‌లో పాపులర్ అయిన నేత. 6 ఏళ్ల వయసులోనే సన్యాసం స్వీకరించిన వ్యక్తి. తన సేవ ద్వారా సమాజానికి తోడ్పడాలనే తన జీవితకాల ఆకాంక్షను బాలక్‌నాథ్ చాలా సార్లు ప్రకటించారు. సతీష్ పూనియా: అయితే అంబర్ నియోజకవర్గం నుంచిపోటీచేసిన సతీష్ పూనియా కాంగ్రెస్ అభ్యర్థి ప్రశాంత్ శర్మ చేతిలో ఓడిపోయారు. దీంతో ఈయన సీఎం రేసు నుంచి తప్పుకున్నట్టే. తాజా ఫలితాలు తాజా ఈసీ సమాచారం ప్రకారం బీజేపీ 71 స్థానాల్లో విజయం సాధించగా, 44 చోట్ల ఆధిక్యంలోఉంది. అలాఏ కాంగ్రెస్ 39 స్థానాల్లో విజయం సాధించగా 30 చోట్ల ఆధిక్యంలో ఉంది. అలాగే భారత ఆదివాసీ పార్టీ 2 స్థానాల్లో గెలుపొందగా, 3 చోట్ల ఆధిక్యంలో ఉంది. బీఎస్పీ ఒక చోట విజయం సాధించగా, మరో స్థానంలో లీడింగ్‌లో ఉంది. -
సీఎంగా రేవంత్.. రేపు ప్రమాణ స్వీకారం?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు తెలుస్తోంది. రేపు(సోమవారం) రేవంత్ ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు సమాచారం. ఇక, ప్రమాణ స్వీకారం గురించి రేవంత్.. తెలంగాణ డీజీపీకి కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎల్బీ స్టేడియంలో రేవంత్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి, మంత్రుల ప్రమాణానికి ఏర్పాటు పరిశీలిస్తున్నట్టు సమాచారం. దేశ నలుమూలల నుంచి వీఐపీలు వస్తారని ఈ నేపథ్యంలో తగిన భద్రతపై డీజీపీతో చర్చించినట్టు సమాచారం. ఇందులో భాగంగానే రేపు ఉదయం గాంధీభవన్‌లో సీఎల్పీ నేతలు సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌కు వెళ్లి కేసీఆర్ తన రాజీనామా లేఖను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు అందించారు. అయితే, సీఎం కాన్వాయ్ లేకుండానే కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లడం విశేషం. -
రేవంత్ రెడ్డే సీఎం..!
-
ఈసారి ఛత్తీస్‌గఢ్ సీఎం ఎవరు..? సీనియర్ కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే రానుందని ఎగ్జిట్ పోల్స్ ప్రెడిక్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి సీఎం ఎవరనేదానిపై రాష్ట్రంలోని పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఈ విషయమై సీనియర్ కాంగ్రెస్ నేత, రాష్ట్ర డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్‌దేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పడం సంతోషంగా ఉంది. అయితే ఈసారి మేం అటు ఇటుగా 60 సీట్లతో అధికారంలోకి రాబోతున్నాం. సీఎం ఎవరనేది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుంది. హై కమాండ్ నిర్ణయించిన వ్యక్తిని సీఎంగా ఏకగగ్రీవంగా ఎన్నుకుంటాం. రెండున్నరేళ్ల పవర్ షేరింగ్ లాంటి ప్రతిపాదనలేవీ లేవు’ అని సింగ్ దేవ్ చెప్పారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఎస్ సింగ్ దేవ్ సీఎం పదవి కోసం పోటీపడ్డారు. అయితే భూపేష్ భగేల్‌ను ఆ పదవి వరించింది. ఈ ఏడాది జూన్ దాకా క్యాబినెట్ మంత్రిగా ఉన్న సింగ్‌దేవ్‌ను జూన్‌లో డిప్యూటీ సీఎంగా నియమించారు. తాజాగా కాంగ్రెస్ అధికారంలోకి రానుందన్న అంచనాల నేపథ్యంలో సింగ్ దేవ్ మళ్లీ సీఎం రేసులోకి రావడం విశేషం. #WATCH | On CM face, Chhattisgarh Dy CM and Congress leader T S Singh Deo says, "...In the last five years, our experience related to two and a half years was not good... We decided unanimously that what the high command decides is final... We do not want speculation, as it… pic.twitter.com/txIJ0QROvc — ANI (@ANI) December 1, 2023 ఇదీచదవండి..ఆ ఆటలన్నీ ఆడాం: టన్నెల్ వర్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ -
బీజేపీకి సీఎం అభ్యర్థే లేరు
జైపూర్: రాజస్తాన్‌లో బీజేపీ చెల్లాచెదురయిందని, అందుకే ఆ పార్టీకి సీఎం అభ్యర్థే లేకుండాపోయారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఎద్దేవా చేశారు. దుంగార్పూర్ జిల్లా సగ్వారాలో శుక్రవారం ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడారు. బీజేపీకి సీఎం అభ్యర్థి దొరక్క ప్రధాని మోదీ చేసేది లేక తన పేరుతోనే ఓట్లభ్యర్థిస్తున్నారన్నారు. మతం, మనోభావాలను వాడుకుంటూ ఓట్లడిగే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. బీజేపీ పాలనలో ద్రవ్యోల్బణం కారణంగా రైతులతోపాటు ప్రజలు అవస్థలు పడుతున్నారని విమర్శించారు. ‘దేశంలో రైతుల సరాసరి ఆదాయం రోజుకు కేవలం రూ.27 మాత్రమే కాగా, ప్రధాని మోదీ ప్రత్యేక మిత్రుడు అదానీ మాత్రం రోజుకు రూ.16 వేల కోట్లు సంపాదిస్తున్నారు. ఆయన రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం వద్ద రైతు రుణాలు రద్దు చేసేందుకు మాత్రం డబ్బుల్లేవు’అని ధ్వజమెత్తారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం వెన్నుచూపుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తే ప్రజల కోసం ద్రవ్యోల్బణ సహాయక శిబిరాలను నిర్వహిస్తుందని ప్రకటించారు. బీజేపీ అధికారంలోకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ కార్యక్రమాలన్నిటినీ నిలిపివేస్తుందని ప్రియాంకా గాంధీ ప్రజలను హెచ్చరించారు. -
బీజేపీ ఐదో జాబితా! ఈటల సీఎం అభ్యర్థి రేసులో బండి సంజయ్
-
బీజేపీ బీసీ సీఎం అభ్యర్థి !?..రెండు చోట్ల నుండి ఈటల పోటీ
-
పోన్లెండీ! డిప్యూటీ సీఎం అభ్యర్థి అందాం..!
పోన్లెండీ! డిప్యూటీ సీఎం అభ్యర్థి అందాం..! -
సిద్ధరామయ్యను వరించిన సీఎం పీఠం
-
ఢిల్లీలో పవర్ ప్లే.. పదవిపై పట్టువీడని ఇద్దరు నేతలు
న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక సీఎం అభ్యర్థిని తేల్చేందుకు కాంగ్రెస్ పెద్దలు హస్తినలో మల్లగుల్లాలు పడుతున్నారు. పదవి కోసం మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తీవ్రంగా తలపడుతుండటంతో రెండు రోజులుగా రాష్ట్రంలో రాజకీయం వేడెక్కడం తెలిసిందే. సీఎల్పీ భేటీలోనూ పీటముడి వీడకపోవడంతో సంప్రదింపుల కోసం వారిద్దరినీ అధిష్టానం హస్తినకు పిలిచింది. దాంతో సిద్ధరామయ్య సోమవారం సాయంత్రమే ఢిల్లీ చేరగా డీకే మాత్రం ‘ఆరోగ్య కారణాల’తో బెంగళూరుకే పరిమితమై మరింత సస్పెన్స్‌కు తెర తీశారు. ఢిల్లీ వెళ్తున్నట్టు మధ్యాహ్నం దాకా చెబుతూ వచ్చిన ఆయన చివరికి పర్యటనను రద్దు చేసుకున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య వెంటే ఉన్నారన్న వార్తలను మీడియా ప్రస్తావించగా, తాను మొత్తం 135 మంది ఎమ్మెల్యేలకూ నాయకుడినంటూ డీకే నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు సోమవారం ఉదయం బెంగళూరులో డీకే 61వ పుట్టినరోజు వేడుకల్లో సిద్ధరామయ్య కూడా పాల్గొన్నారు. ఆ వెంటనే ఒకరు హస్తినలో, మరొకరు బెంగళూరులో తమ ప్రయత్నాలకు పదును పెడుతూ రాజకీయ వేడిని మరింత పెంచుతున్నారు. అసెంబ్లీ పోరులో పార్టీని కలసికట్టుగా విజయ తీరాలకు చేర్చిన వీరిద్దరిలో ఎవరూ పట్టు వీడకపోవడం, వారి మద్దతుదారులైన ఎమ్మెల్యేలు, నేతలు రెండు శిబిరాలుగా చీలిన నేపథ్యంలో ఈ చిక్కుముడిని అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. అగ్ర నేతలు సోనియా, రాహుల్‌గాంధీలతో చర్చించి మంగళవారం సాయంత్రానికల్లాల సీఎం అభ్యర్థిని అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖరారు చేస్తారని చెబుతున్నారు. సీఎం అభ్యర్థి ఎంపికకు ఆదివారం రాత్రి పొద్దుపోయేదాకా ముగ్గురు అధిష్టానం ప్రతినిధుల పర్యవేక్షణలో జరిగిన సీఎల్పీ భేటీ ఎటూ తేల్చలేకపోవడం, నేతలతో, ఎమ్మెల్యేలతో దూతల విడివిడి చర్చలు, రహస్య బ్యాలెట్ వంటివి ఏ ఫలితమూ ఇవ్వకపోవడంతో అభ్యర్థి ఎంపిక అధికారాన్ని పార్టీ అధ్యక్షునికే కట్టబెడుతూ సీఎల్పీ తీర్మానం చేయడం తెలిసిందే. సీక్రెట్ బ్యాలెట్ బాక్సులతో ఢిల్లీ ప్రతినిధులు సోమవారం ఢిల్లీ చేరారు. ఖర్గేకు పరిస్థితి వివరించడంతో పాటు నివేదిక కూడా అందజేశారు. -
క్లైమాక్స్ ఏంటి?.. సీఎం ఎవరు?.. నేడు ఢిల్లీకి సిద్దూ, డీకే?
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి ఎంపిక అంత తేలికగా ముగిసేలా కనిపించడంలేదు. సీఎం అభ్యర్థిని నిర్ణయించే అధికారాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకే నూతన ఎమ్మెల్యేలు కట్టబెట్టారు. ఆదివారం సాయంత్రం బెంగళూరులోని ఓ హోటల్లో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయానికి కారకులైన నాయకులు, కార్యకర్తలు, కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ తొలుత పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది. అనంతరం సీఎం ఎంపిక అధికాన్ని ఖర్గేకు అప్పగిస్తూ మాజీ సీఎం సిద్దరామయ్య ప్రవేశపెట్టిన ఏక వాక్య తీర్మానాన్ని కూడా ఎమ్మెల్యేలు ఆమోదించినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. అధిష్టానం తరఫున ఖర్గే నియమించిన ముగ్గురు పరిశీలకులు సీఎం అభ్యర్థిపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకుంటారని చెప్పారు. ఆదివారం ఈ తతంగం పూర్తి చేసి సోమవారానికల్లా ఖర్గేకు వారు నివేదిక అందజేస్తారన్నారు. ఖర్గే నియమించిన పరిశీలకుల కమిటీలో మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌కుమార్ షిండే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జితేంద్ర సింగ్, ఏఐసీసీ మాజీ కార్యదర్శి దీపక్ బబారియా ఉన్నారు. వీరు, వేణుగోపాల్ అంతకుముందు సీఎం రేసులో ఉన్న సిద్దరామయ్య, డీకే శివకుమార్‌లతో వేర్వేరుగా భేటీ అయ్యారు. చదవండి: ఓవర్ టు రాజస్తాన్ కార్యకర్తల హడావుడి సీఎల్పీ భేటీ జరిగిన హోటల్ బయట కాంగ్రెస్ కార్యకర్తల హడావుడి కనిపించింది. సిద్దరామయ్య, శివకుమార్ వర్గీయులు బ్యానర్లు, జెండాలు చేతబూని తమ నేతే సీఎం అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు ఇద్దరు నేతలు తమకు మద్దతు తెలిపే ఎమ్మెల్యేలతో వేర్వేరుగా భేటీలు జరిపారు. రెండు వర్గాలు పోటాపోటీగా పోస్టర్లు వేశాయి. ఇద్దరు నేతల నివాసాల వద్ద కూడా పోస్టర్లు కనిపించాయి. ఎన్నికలకు ముందు పార్టీ నేతలను ఒకే తాటిపైకి తేవడంలో సఫలీకృతమైన కాంగ్రెస్ పార్టీ ఫలితాల తర్వాత అదే ఐక్యతను కొనసాగించడానికి ఇబ్బందులు పడుతోంది. కర్ణాటక అసెంబ్లీ గడువు ఈ నెల 24తో ముగియనుంది. తాజా ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజారిటీ సాధించిన కాంగ్రెస్ ఆలోపు ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంది. -
సీఎం ఈయనే.. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ అభిమానుల పోస్టర్ వార్..
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అందరి దృష్టి సీఎం ఎంపికపైనే ఉంది. సీనియర్ లీడర్ సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌లలో అధిష్టానం ముఖ్యమంత్రిగా ఎవరిని ఖరారు చేస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ ఇద్దరి నేతల అభిమానులు మాత్రం పోస్టర్ల వార్‌కు దిగారు. తమ నేతనే సీఎంగా ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తూ డీకే ఫ్యాన్స్ ఆయన ఇంటి ముందు బ్యానర్లు ఏర్పాటు చేశారు. అటు సిద్ధరామయ్య మద్దతుదారులు కూడా తమ నేతనే సీఎంగా ప్రకటించాలని ఆయన నివాసం బయట పోస్టర్లు కట్టారు. దీంతో అధిష్టానం నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. #WATCH | Karnataka Congress President DK Shivakumar's supporters put up a poster outside his residence in Bengaluru, demanding DK Shivakumar to be declared as "CM" of the state. pic.twitter.com/N6hFXSntJy — ANI (@ANI) May 14, 2023 #WATCH | Supporters of senior Congress leader Siddaramaiah put up a poster outside Siddaramaiah's residence in Bengaluru, referring to him as "the next CM of Karnataka." pic.twitter.com/GDLIAQFbjs — ANI (@ANI) May 14, 2023 మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ.. పోస్టర్లు, బ్యానర్లు కట్టినంత మాత్రాన వారిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయరని పేర్కొన్నారు. అధిష్టానమే అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకుని సీఎం ఎవరనేదని ఖరారు చేస్తుందని వ్యాఖ్యానించారు. కాగా.. సీఎం ఎంపిక కోసం కర్ణాటక శాసనసభ పక్షం బెంగళూరులో సమావేశమైంది. ఈ భేటీకి ఏఐసీసీ పరీశీలకులుగా సుషీల్ కుమార్ షిండే, దీపక్ బవారియా, భన్వార్ జీతేంద్ర సింగ్ హాజరవుతున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణయాన్ని అధిష్టానానికి నివేదికలో సమర్పించనున్నారు. నివేదిక అందిన అనంతరం కర్ణాటక సీఎం ఎవరని అధిష్టానం ప్రకటించనుంది. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుంది. ఎన్నో త్యాగాలు చేశా.. సిద్ధ రామయ్యతో తనకు ఎలాంటి విభేదాలు లేవని డీకే శివకుమర్ మరోమారు స్పష్టం చేశారు. పార్టీ కోసం ఎన్నోసార్లు త్యాగం చేసి ఆయనకు మద్దతుగా నిలిచానని తెలిపారు. సిద్ధరామయ్యకు పూర్తి సహకారం అందించినట్లు సీఎల్పీ సమావేశానికి ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. చదవండి: కర్ణాటకలో కాంగ్రెస్ విజయదుందుభి.. 135 సీట్లతో భారీ మెజార్టీ -
సీఎల్పీ సమావేశంలో సీఎం అభ్యర్థిని ఖరారు చేసే ఛాన్స్
-
Karnataka Assembly Election 2023: ఎన్నికలు ముగిశాకే సీఎం ఎంపిక: ఖర్గే
శివాజీనగర: కర్ణాటకలో ఎన్నికలు ముగిసిన తరువాతే ముఖ్యమంత్రి ఎంపిక ఉంటుందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించి, హైకమాండ్ చర్చించి ముఖ్యమంత్రిని ఎంపిక చేస్తుందని తెలిపారు. ఎన్నికలకు ముందుగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడం తమ సంప్రదాయం కాదని చెప్పారు. సోమవారం చిక్కమగళూరులో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ లింగాయత్ ముఖ్యమంత్రిని ప్రకటించాలన్న బీజేపీ సవాల్‌పై స్పందిస్తూ తమ పార్టీలో కులాల వారీగా సీఎంను ప్రకటించడం లేదన్నారు. బీజేపీలో అవినీతి ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రజలు విసుగెత్తారని, అదే ఇతరులపై చిన్న ఆరోపణ వస్తే వెంటనే సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేస్తారని ఆరోపించారు. -
మీ ఇద్దరిలో సీఎం అభ్యర్థి ఎవరు?
చిత్తూరు జిల్లా: చంద్రబాబు.. పవన్‌కల్యాణ్.. ఇద్దరిలో ఎవరు సీఎం అభ్యర్థి అనేది ప్రజలకు స్పష్టం చేయాలని లోక్‌సభ ప్యానల్ స్పీకర్, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి ప్రశ్నించారు. సోమవారం పుంగనూరు మున్సిపాలిటీలో ఎంపీ రెండోరోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ రెడ్డెప్పతో కలసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. సీఎం అభ్యరి్థగా చెప్పుకునే జనసేన నాయకుడు పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుతో జతకట్టడం సిద్ధాంతాలు లేకపోవడమేనన్నారు. ఎంపీ మిథున్ రెడ్డి స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు ఎత్తుగడలు, పవన్‌కల్యాణ్ అభిమానులను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయన్నారు. పవన్ కల్యాణ్ షోలతో చంద్రబాబుకు జనం ఓట్లు వేయరన్నారు. రాజకీయం సినిమా కాదని.. కాపుల ఓట్ల కోసం చంద్రబాబు వల విసురుతున్నాని చెప్పారు. 2019లో వారిద్దరూ జతకట్టి, కాపుల ఓట్ల కోసం డ్రామాలాడి అభ్యర్థులను నిలబెట్టారని ఎంపీ ఆరోపించారు. రాష్ట్రంలో బాబు, ఆయన దత్త పుత్రుడు ఒక్కటైనా వారికి ఓట్లు పడవని, వారికి తగిన గుణపాఠం నేర్పుతారని స్పష్టంచేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని వారు ఆర్భాటాలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించడమేనన్నారు. చంద్రబాబునాయుడు సభలు, ర్యాలీల్లో అమాయకులను బలిచేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కుప్పం సభకు ఆయన అనుమతి తీసుకోకపోవడం చట్టాన్ని అతిక్రమించడమేనన్నారు. చట్టాన్ని గౌరవించలేని వారు సమాజాన్ని ఏవిధంగా పాలిస్తారని నిలదీశారు. సభలు, రోడ్ షోల నిర్వహణపై ఇచ్చిన జీవోను వాళ్లిదరూ చదవాలని సూచించారు. చిరంజీవి, బాలకృష్ణ, పవన్‌కల్యాణ్ కూడా సినిమా ఈవెంట్లు అనుమతి పొంది నిర్వహించారని తెలియజేశారు. కుప్పంలో చంద్రబాబు నకిలీ పేషెంట్లకు ఆస్పత్రిలో చికిత్సలు చేయించి షో చేశారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు చేసిన సేవలు గుర్తించి ఓట్లు వేయమని కోరుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం, పీకెఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా పాల్గొన్నారు. -
'2025 వరకు ఆగడం ఎందుకు.. ఆయనను ఇప్పుడే సీఎం చేయండి'
పాట్నా: బిహార్‌లో 2025 అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘట్బంధన్ను తేజస్వీ యాదవే ముందుండి నడిపిస్తారని సీఎం నితీశ్ కుమార్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో రానున్న ఎన్నికల్లో తేజస్వీ సీఎం అభ్యర్థి అని స్పష్టమైంది. అయితే నితీశ్ వ్యాఖ్యలపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పందించారు. 2025 దాకా వేచి చూడటం ఎందుకు తేజస్వీకి ఇప్పుడే సీఎంగా బాధ్యతలు అప్పగించవచ్చు కదా అని నితీశ్‌కు సూచించారు. తేజస్వీ యాదవ్‌ను ఇప్పుడే సీఎం చేస్తే ఆయన పాలనా సామర్థ్యం గురించి ప్రజలందరికీ తెలుస్తుందని ప్రశాంత్ కిశోర్ అన్నారు. 2025 ఎన్నికల్లో ప్రజలు తమకు ఎవరు కావాలో సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. బిహార్‌లో ఆర్జేడీనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయినందున తేజస్వీని సీఎం చేయడంలో తప్పేం లేదన్నారు. చదవండి: కాంగ్రెస్ కోమాలో ఉంది : పంజాబ్ సీఎం భగవంత్ మాన్ -
Himachal Pradesh: సీఎం పీఠం మా నేతకే...
సిమ్లా/న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్‌లో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోవడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శుక్రవారం సమావేశమయ్యారు. సీఎం అభ్యర్థి ఎంపిక చేసే బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడికి కట్టబెడుతూ ఈ భేటీలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. పార్టీ కేంద్ర పరిశీలకులుగా చత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, హరియాణా మాజీ సీఎం భూపీందర్‌సింగ్ హుడా వచ్చారు. హిమాచల్‌లో తదుపరి ముఖ్యమంత్రి రేసులో ప్రతిభా సింగ్, ముకేశ్‌సింగ్ అగ్నిహోత్రి, సుఖ్వీందర్ సింగ్ సుఖు ముందంజలో ఉన్నారు. సీఎల్పీ సమావేశంలో పాల్గొనేందుకు వారు తమ మద్దతుదారులతో కలిసి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు కేంద్ర పరిశీలకులు రాష్ట్ర గవర్నర్‌ను కలిశారు. నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేల జాబితాను అందజేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుకు గడువు కోరారు. ఇదీ చదవండి: హిమాచల్‌లో బీజేపీ ఓటమి.. అనురాగ్ ఠాకూర్‌పై విమర్శల వెల్లువ -
Himachal Pradesh: కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ
షిమ్లా: గుజరాత్ ఫలితంతో ఢీలా పడిన కాంగ్రెస్ పార్టీ.. హిమాచల్ ప్రదేశ్‌లో మాత్రం ఘన విజయంతో శ్రేణులు కాస్త ఊరట చెందాయి. ఈ తరుణంలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చూస్తోంది. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఇవాళ(శుక్రవారం) కీలక సమావేశం నిర్వహించనుంది. అంతకు ముందు.. ఫలితాల ఊగిసలాట సమయంలో ఆపరేషన్ లోటస్‌కి భయపడి కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యేలను ఛండీగఢ్‌కు ఆహ్వానించాలని భావించింది. అయితే.. స్పష్టమైన మెజారిటీ రావడంతో ఆ ఆలోచనను విరమించుకుంది. కొత్త లెజిస్లేచర్ పార్టీ నేతను ఎనుకున్నేందుకు శుక్రవారం సిమ్లాలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా భేటీ కాన్నుట్లు కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్ వ్యవహారాల ఇన్‌ఛార్జి రాజీవ్ శుక్లా మీడియాకు వెల్లడించారు. మరోవైపు ఈ వ్యవహారాన్ని చూసుకునేందుకు ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బాఘేల్, సీనియర్ నేత భూపిందర్ హుడాలను పర్యవేక్షకులుగా అక్కడికి పంపనుంది. ఇదిలా ఉంటే.. ఒక్కో దఫా ఒక్కో పార్టీకి అధికారం కట్టబెట్టే హిమాచల్ ప్రజలు.. ఈసారి కూడా అదే ఆనవాయితీ కొనసాగించారు. కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. మొత్తం 68 స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో.. 40 స్థానాలు కైవసం చేసుకుని ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది కాంగ్రెస్. మరోవైపు హిమాచల్ కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్ సీఎం అభ్యర్థి రేసులో ఉన్నారు. మాజీ సీఎం వీరభద్ర సింగ్ భార్య కావడం ఈమెకు కలిసొచ్చే అంశం. అయితే ఇంతకు ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న సుఖ్వీందర్ సుఖు, ముఖేష్ అగ్నిహోత్రిలు కూడా సీఎం రేసులో ఉండడంతో ఇవాళ్టి భేటీపై ఆసక్తి నెలకొంది. బీజేపీకి రెబల్స్ దెబ్బ పడిందని విశ్లేషకులు అభిప్రాయపడినప్పటికీ.. అలాంటిదేం లేదని తేల్చారు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేడీ నడ్డా. మొత్తం 68 స్థానాల్లో 21 చోట్ల రెబల్స్ పోటీ చేయగా.. కేవలం ఇద్దరు మాత్రమే గెలుపొందడం గమనార్హమని ఆయన గుర్తు చేస్తున్నారు. -
హిమాచల్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ
-
గుజరాత్ ఆప్ సీఎం అభ్యర్థిగా ఇసుదన్ గాధ్వి
-
గుజరాత్ ఆప్ సీఎం అభ్యర్థిగా మాజీ దూరదర్శన్ జర్నలిస్ట్..
Isudan Gadhvi.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గుజరాత్లో గెలుపు కోసం అధికార పార్టీ సహా, ప్రతిపక్ష పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. కాగా, ఈసారి జరగబోయే ఎన్నికల్లో తమ గెలుపు తథ్యమంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అయితే, గుజరాత్లో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కాకముందు నుంచే ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. రాష్ట్రంలో పలుమార్లు పర్యటించారు. ఆప్‌ను గెలిపించాలంటూ గుజరాతీలకు భారీ ఆఫర్లు సైతం ప్రకటించారు. కాగా, తాజాగా ఆప్.. తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. ఆప్ జాతీయ కార్యదర్శి ఇసుదన్ గాధ్విని గుజరాత్ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా బరిలోకి దించుతున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. కాగా, పంజాబ్ తరహాలోనే పోల్ నిర్వహించి సీఎం అభ్యర్థిని కేజ్రీవాల్ ప్రకటించడం విశేషం. ఈ సందర్భంగా ఇసుదన్ గాధ్వి మాట్లాడుతూ.. “నాపై విశ్వాసంతో నాలాంటి సామాన్యుడికి ఇంత పెద్ద బాధ్యత ఇచ్చినందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి, అరవింద్ కేజ్రీవాల్‌కి ముఖ్యంగా గుజరాత్ ప్రజలకు ధన్యవాదాలు. నేను ఎల్లప్పుడూ ప్రజలకు సేవకుడిగానే ఉంటాను. ప్రజా ప్రయోజనాల కోసం పని చేస్తానని వాగ్దానం చేస్తున్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక, సీఎం అభ్యర్థి గాధ్వి.. జర్నలిస్టుగా పనిచేశారు. మొదట దూరదర్శన్‌లో పనిచేశారు. తర్వాత జర్నలిస్టుగా తన కెరీర్లో, గుజరాత్‌లోని డాంగ్ జిల్లాలో 150 కోట్ల అటవీ నిర్మూలన కుంభకోణాన్ని బయటపెట్టాడు. ఈ క్రమంలో అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. కాగా, 2021లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. మరోవైపు.. గుజరాత్లో రెండు దశల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ ఒకటో తేదీన తొలి దఫా, ఐదో తేదీన రెండో దఫా ఎన్నికలను నిర్వహించనున్నారు. డిసెంబర్ 8వ తేదీన ఫలితాలను వెల్లడించనున్నట్లు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. 182 అసెంబ్లీ స్థానాలకు గానూ.. తొలి విడుతలో 89 స్థానాలకు, రెండవ విడుతలో 93 స్థానాలకు పోలింగ్ జరుగనుంది. A former TV journalist, @isudan_gadhvi is the CM face for #AAP in #Gujarat. He speaks on #BJP’s efforts to “divert” people from real issues, the #Congress’s decline, and AAP’s silence on issues like the Kheda flogging. #IsudanGadhvi Read: https://t.co/od5kjRdkan pic.twitter.com/qsyCVFvFSZ — The Indian Express (@IndianExpress) November 4, 2022 -
గుజరాత్లో పంజాబ్ ఫార్ములాను ఫాలో అవుతున్న కేజ్రీవాల్..
గాంధీనగర్: ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిగా ఎవరుండాలని ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్. ఈ సర్వేలో భగవంత్ మాన్‌కే అందరూ పట్టంగట్టారు. దీంతో ఆయన్నే తమ సీఎం అభ్యర్థిగా ప్రకటించారు కేజ్రీవాల్. అనంతరం ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. ఢిల్లీ తర్వాత పంజాబ్‌లో జెండా ఎగురవేసింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లోనూ పంజాబ్ ఫార్ములానే రిపీట్ చేస్తున్నారు కేజ్రీవాల్. సీఎం అభ్యర్థిని ఎన్నుకునే ఛాయిస్‌ను అక్కడి ప్రజలకే ఇచ్చారు. శనివారం మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. గుజరాత్లో ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరుంటే బాగుంటుందో నవంబర్ 3లోగా చెప్పాలని ఓ ఫోన్ నంబర్, ఈమెయిల్ ఇచ్చారు. అలాగే గుజరాత్లో అధికార బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. వచ్చే ఐదేళ్లకు ఆ పార్టీ వద్ద ఎలాంటి ప్రాణాళిక లేదన్నారు. రాష్ట్రంతో పాటు దేశంలో ధరల పెరుగుదల సమస్యగా మారిందని పేర్కొన్నారు. ఏడాది క్రితం సీఎం విజయ్ రూపానిని తప్పించి భూపేంద్ర పటేల్‌ను ముఖ్యమంత్రిగా బిజేపీ నియమించిందని గుర్తు చేశారు. కానీ ఒక్కరి అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా సీఎంను మార్చారని చెప్పారు. తాము బీజేపీలా కాదని, సీఎం అభ్యర్థిని ఎంపిక చేసుకునే విషయం పూర్తిగా ప్రజలకే వదిలేస్తామని వివరించారు. గుజరాత్లో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని ఆప్ పట్టుదలతో ఉంది. అందుకే అరవింద్ కేజ్రీవాల్ తరచూ గుజరాత్లో పర్యటిస్తున్నారు. బీజేపీకి బలంగా ఉన్న హిందూ ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కరెన్సీ నోట్లపై గాంధీతో పాటు లక్షీదేవి, వినాయకుడి ఫోటోలను కూడా ముద్రించాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాశారు. చదవండి: కోర్టులో మహిళా లాయర్ల సిగపట్లు.. వీడియో వైరల్.. -
నయా ట్విస్ట్.. మణిపూర్ సీఎం రేసులో ఆరెస్సెస్ అభ్యర్థి!
ఇంఫాల్: మణిపూర్ ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సస్పెన్స్‌ఇంకా కొనసాగుతూనే వస్తోంది. బీరెన్ సింగ్ నేతృత్వంలోనే పార్టీ ఘన విజయం సాధించడంతో ఆయన్నే మరో దఫా సీఎంగా కొనసాగించాలని కొందరు బీజేపీ అధిష్టానాన్ని కోరుతున్నారు. అయితే వర్గ పోరు గనుక చెలరేగితే ప్రభుత్వ ఏర్పాటు అవకాశం గల్లంతు అవ్వొచ్చనే ఆందోళన నెలకొంది బీజేపీలో.. బీజేపీ మాత్రం సీఎం క్యాండిడేట్ ఎవరనే విషయంపై ఇంకా సస్పెన్స్ నడిపిస్తోంది. బీరెన్ సింగ్‌తో పాటు సీఎం పోస్టుకు బిస్వాజిత్ సింగ్ పేరును సైతం అధిష్టానం పరిశీలిస్తోంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు మూడో పేరు ముఖ్యమంత్రి రేసులో తెరపైకి వచ్చింది. ఆరెస్సెస్ బలపరుస్తున్న యుమ్నమ్ ఖేమ్‌చంద్ సింగ్ పేరు ఇప్పుడు ఈ లిస్ట్‌లో చేరింది. ఈ మేరకు ఖేమ్‌చంద్‌కు ఢిల్లీకి నుంచి శనివారం పిలుపు సైతం అందించింది. బీరెన్, బిస్వాజిత్ మధ్య పోటీని నివారించేందుకే మూడో అభ్యర్థి పేరును తెర మీదకు తీసుకొచ్చింది బీజేపీ. అంతేకాదు ఖేమ్‌చంద్‌కు ఆరెస్సెస్ మద్దతు ఇప్పుడు మణిపూర్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. నిన్నంతా బీరెన్, బిస్వాజిత్, ఖేమ్‌చంద్‌లతో విడివిడిగా బీజేపీ కీలక నేతలు సమావేశం అయ్యారు. ఆదివారం ఉదయం వాళ్లంతా తిరిగి మణిపూర్‌కు చేరుకోగా.. ఆ వెంటనే కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కిరెన్ రిజ్జులు రాజధాని ఇంఫాల్‌కు క్యూ కట్టడం విశేషం. ఈ నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌కు కాబోయే సీఎం ఎవరనేదానిపై జోరుగా చర్చ నడుస్తోంది. నిజానికి బిస్వాజిత్ సింగ్, బీరెన్ సింగ్ కంటే సీనియర్. పార్టీలో ఎప్పటి నుంచో కొనసాగుతున్నారు. 2017లోనే ఆయన సీఎం అవుతారని అంతా భావించారు. కానీ, అది జరగలేదు. మొత్తం 60 సీట్లున్న మణిపూర్ అసెంబ్లీలో బీజేపీ తాజా ఎన్నికల్లో 32 సీట్లు గెల్చుకుని సుస్థిర ప్రభుత్వ ఏర్పాటునకు సిద్ధమైంది. ఈ తరుణంలో వర్గ పోరు పరిస్థితిని మార్చేయొచ్చన్న ఆందోళనలో అధిష్టానం ఉంది. అయితే తామంతా ఒకే తాటిపై ఉన్నామంటూ బిస్వాజిత్ సింగ్ ప్రకటన ఇవ్వడం కొసమెరుపు. ఇదిలా ఉండగా.. మణిపూర్ అసెంబ్లీ గడువు మార్చి 19వ తేదీతోనే ముగియగా.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా బీరెన్ సింగ్ కొనసాగుతున్నారు. -
Bhagwant Mann: కమెడియన్ నుంచి సీఎం స్థాయికి..
హాస్యం.. మనిషిని కవ్వించేది. అలాంటప్పుడు విరుద్ధమైన రాజకీయం ఆయన ఎందుకు ఎంచుకున్నాడనే అనుమానాలు రావొచ్చు. జనాల్ని నవ్వించడమే కాదు.. అవసరమైతే ప్రజల కన్నీళ్లూ తుడవాలని తండ్రి చెప్పిన మాటకు కట్టుబడే రాజకీయాల్లో అడుగుపెట్టాడు భగవంత్ మాన్. ప్రజాభిప్రాయంతోనే ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిగా నిలిచాడు. పంజాబ్ కోటలో పాగా వెయ్యాలని వ్యూహాలు పన్నిన ఆప్‌కు.. ఒక బూస్టర్ షాట్లా పనికొచ్చాడు. ఆప్ ఘన విజయంలో ముఖ్యభూమిక పోషించి.. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నాడు 48 ఏళ్ల భగవంత్ మాన్. ‘ఒకప్పుడు జనం నన్ను చూసి తెగ నవ్వేవారు. కానీ ఇప్పుడు అందరూ రోదిస్తున్నారు. తమను కాపాడమని కోరుతున్నారు’ సీఎం అభ్యర్థిగా ఎంపికైన రోజు మాన్ చేసిన వ్యాఖ్యలు ఇవి. అదే రోజు నుంచి ఆయనలో నవ్వు మాయమై.. రాజకీయాలపై సీరియనెస్ మొదలైంది. భగవంత్ సింగ్ మాన్.. 1973, అక్టోబర్ 17న పంజాబ్‌లోని సంగ్రూర్‌లో ఓ జాట్ సిక్కు కుటుంబంలో జన్మించారు. సాధారణ రైతు కుటుంబం ఆయనది. కాలేజీ రోజుల్లోనే ఉండగానే కామెడీ షోలతో గుర్తింపు దక్కించుకున్నాడాయన. సునామ్‌లో ఎస్‌యూఎస్ ప్రభుత్వ∙కాలేజీ తరఫున రెండు గోల్డ్ మెడల్స్ గెలిచారు. కానీ యాక్టింగ్ వల్ల కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయనివ్వలేదు. ఆపై ఇందర్‌ప్రీత్ కౌర్‌ని పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. 2015లో తన భార్యతో విడాకులు తీసుకున్నారు. పిల్లలిద్దరూ ఇప్పుడు విదేశాల్లో ఉన్నారు. ►మొదట్లో.. నటుడు జగ్తర్ జగ్గీతో కలిసి కామెడీ ఆల్బమ్ చేశారు. జుగ్ను ఖెండా హై అనే టీవీ సీరియల్‌తో తన పాపులారిటీ పెంచుకున్నారు. రాజకీయ నాయకులపై సెటైర్లు వేస్తూ కార్యక్రమాన్ని రక్తికట్టించారు. 2008లో గ్రేట్ ఇండియా లాఫ్టర్ చాలెంజ్ అనే రియాల్టీ షోలో పాల్గొన్న తర్వాత దేశవ్యాప్తంగా భగవంత్ మాన్ పేరు మారు మోగిపోయింది. జాతీయ అవార్డు లభించిన ‘‘మైనే మా పంజాబ్ దీ’’ సినిమాలో అద్భుతమైన నటనని ప్రదర్శించారు. ► 2011లో మన్‌ప్రీత్ బాదల్‌కు చెందిన పీపుల్స్ పార్టీ ఆఫ్ పంజాబ్ తీర్థం పుచ్చుకొని రాజకీయ అరంగేట్రం చేశారు. 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లెహ్రా నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2014లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరి సంగ్రూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2 లక్షల పై చిలుకు మెజార్టీతో విజయం సాధించారు. 2014, 2019లలో సంగ్రూర్ లోక్ సభ నియోజక వర్గం నుంచి ఆప్ ఎంపీగా వరుస విజయాలు సాధించారు. ప్రస్తుతం పంజాబ్ ఆప్ శాఖకు కూడా మాన్ చీఫ్ గా ఉన్నారు. ► 2017లో అసెంబ్లీ ఎన్నికల్లో అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ బాదల్‌పై ఆప్ భగవంత్ మాన్‌ను నిలబెట్టింది. కానీ ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. మళ్లీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో సంగ్రూర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2019 జనవరిలో ఆప్ పార్టీ పంజాబ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ప్రచారంలో దిట్ట.. లోక్ లెహర్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను విజయవంతంగా నడుపుతూ ప్రజల్లో వారికున్న హక్కులపై అవగాహన పెంచుతున్నారు. కలుషిత నీరు తాగి రోగాలపాలవుతున్న ప్రజలకి సాయపడుతున్నారు. టీవీ సెలబ్రిటీగా దక్కిన పేరుతో.. పంజాబ్‌లో ఆప్ పార్టీలో క్రౌడ్ పుల్లర్‌గా పేరు తెచ్చుకున్నారు భగవంత్ మాన్. ఆప్ సీఎం అభ్యర్థి ఎంపిక కోసం దేశంలో మరే పార్టీ చేయని విధంగా టెలి ఓటింగ్ పెడితే, అందులో ఏకంగా 93శాతం ఓట్లను కొల్లగొట్టారు. స్టాండప్ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న భగవంత్ మాన్.. పంజాబ్ బహుముఖ పోటీలో ఆప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ► నయా పంజాబ్ పిలుపు.. నిరుద్యోగం పంజాబ్‌ను వేధిస్తున్న ప్రధాన సమస్య. అందుకే అధికారంలోకి వస్తే ఆ సమస్యపైనే మొదటి ఫోకస్ ఉంటుందని చెప్పాడు భగవంత్. ‘అతనో పచ్చి తాగుబోతు.. డ్రగ్స్ కూడా వాడతాడు.. నిత్యం నిషాలో జోగుతుండే మాన్. బఫూన్ వేశాలేసుకునేటోడు. అతన్నే గనుక గెలిపిస్తే పంజాబ్ మొత్తాన్నీ మత్తులో ముంచేస్తాడు.. ’ ఇదీ.. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులు భగవంత్ మాన్‌పై చేసిన ఆరోపణ. భగవంత్ మాన్ మద్యం సేవించి పార్లమెంటుకు వస్తారని ఆరోపణలున్నాయి. సహచర ఎంపీలు ఆయన నుంచి వచ్చే మద్యం వాసన భరించలేక ఫిర్యాదులు కూడా చేశారు. అయితే.. రెండేళ్ల క్రితం బర్నాలాలో జరిగిన ఒక ర్యాలీలో తాను ఇంక మద్యం జోలికి వెళ్లనంటూ ప్రజలందరి మధ్య ప్రతిజ్ఞ చేశారు. మద్యం మానేశానని, ప్రజాప్రతినిధిగా, పంజాబ్ సీఎంగా కళ్లు నెత్తికెక్కించుకోకుండా.. బాధ్యతగా మసలుకుంటానని ఎన్నికల ప్రచారంలో మాన్ ప్రజలకు చెప్పారు. ఆ మాటలను నమ్మే భారీ మెజార్టీతో ఆయనకు, ఆప్‌కు పంజాబ్ ప్రజలు పట్టం కట్టారు. ::సాక్షి, వెబ్‌స్పెషల్ -
చన్నీ మంత్రం ఫలించేనా?
అందరి దృష్టీ ఉత్తర ప్రదేశ్ (యూపీ), పంజాబ్‌ల మీదే నెలకొన్న వేళ... కాంగ్రెస్ పార్టీ తన సాధారణ పద్ధతికి భిన్నంగా పంజాబ్‌లో ముందుగానే తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. రకరకాల ఊహాగానాలొస్తున్న నేపథ్యంలో మరో తడవ అధికారంలోకి వస్తే ఇప్పుడున్న దళిత ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీనే సీఎంగా కొనసాగించనున్నట్టు ఆ పార్టీ ఎట్టకేలకు ఆదివారం ప్రకటించింది. సొంత పార్టీలోనే సీఎం పీఠాన్ని ఆశిస్తున్న మిగతా పోటీదారుల సమక్షంలో కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ ఈ ప్రకటనతో తాంబూలాలు ఇచ్చేశారు. దీంతో పార్టీలో కుమ్ములాటలు ఏ మలుపు తిరుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ‘టీమ్ పంజాబ్ కాంగ్రెస్’ సమష్టిగా ఎన్నికల పోరాటం చేస్తుందని పైకి చెబుతున్నా, పార్టీలో ప్రకంపనలు ఆగడం లేదు. అభ్యర్థిగా చన్నీని ప్రకటించిన కాసేపటికే, రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు – సీఎం కావాలని తపిస్తున్న మరో ఆశావహుడు సునీల్ జాఖడ్ క్రియాశీల రాజకీయాలకు గుడ్‌బై కొడుతున్నానన్నారు. అయిదు నెలల క్రితమే సీఎం మార్పు వేళ కూడా తన పేరును పరిశీలించ లేదని అలిగిన జాఖడ్ మళ్ళీ అలకపాన్పు ఎక్కేశారు. పార్టీ ఇచ్చిన పని చేస్తానంటూనే, పంజాబ్‌లో సీఎం కాగల సత్తా ఉన్న నేతలు చాలామంది ఉన్నారంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. తన మనసులోని ఇదే బాధ సిద్ధూకు కూడా ఉంటుందంటూ, ఆయననూ గిల్లే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి, అధిష్ఠానానికి కావాల్సిందల్లా ఢిల్లీ నుంచి తాము చెప్పినట్టల్లా ఆడే బలహీన ముఖ్యమంత్రి మాత్రమేనంటూ పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్ధూ శనివారమే ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కానీ, ఆదివారం నాటి సభలో మాత్రం రాహుల్ ముందు కాస్తంత తగ్గి, తనకు కావాల్సింది పదవి కాదు, పంజాబ్ ప్రజల జీవితాల బాగు అని ప్లేటు తిప్పారు. ఆయన ఈ మాటకు కట్టుబడి ఎన్నాళ్ళు సొంత పార్టీ, సొంత సీఎంపై బాణాలు సంధించకుండా ఉంటారో ఎవరూ చెప్పలేరు. ఆ మాటకొస్తే ప్రతిక్షణం పాదరసంలా జారిపోయే సిద్ధూ కూడా చెప్పలేరు. కాకపోతే, ఈ సరిహద్దు రాష్ట్రంలోని దాదాపు ప్రధాన పార్టీలన్నిటితోనూ ఖటీఫ్ చెప్పి, కాంగ్రెస్‌కు వచ్చిన సిద్ధూకు ఇప్పటికిప్పుడు పెద్దగా ప్రత్యామ్నాయాలు లేవు. ప్రస్తుతానికి తాను పోటీ చేస్తున్న అమృత్సర్ తూర్పు స్థానంలో గెలిచి, సమయం కోసం వేచి చూడడమే కీలకమని ఆయనకూ తెలుసు. పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ అయిన సునీల్ జాఖడ్ కారులోనే చన్నీ, సిద్ధూలతో కలిసొచ్చి మరీ పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించడం ద్వారా అందరూ కలిసే ఉన్నారని సంకేతించాలని రాహుల్ శ్రమించారు. అంతర్గత విభేదాలు ఎన్ని ఉన్నా, దళిత సీఎం చన్నీని కాదని మరొకరి పేరు ప్రకటిస్తే, మొదటికే మోసం వస్తుందని ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీకి బాగా తెలుసు. అధికారంలో ఉన్న కాసిన్ని రాష్ట్రాలనూ కాపాడుకోవడానికీ శతవిధాల ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలు ఓ అగ్నిపరీక్ష. మునుపటి దామోదరం సంజీవయ్య, భోలా పాశ్వాన్, జగన్నాథ్ పహాడియా, సుశీల్ కుమార్ షిండేల వరసలో చన్నీతో దళిత బాంధవ పార్టీగా నిలవాలనీ, పంజాబ్‌లోని 31 శాతం ఉన్న దళిత ఓటర్ల మనసు గెలవాలనీ కాంగ్రెస్ ఆలోచన. ఇక, గత ఏడాది సెప్టెంబర్ 20న పంజాబ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన 58 ఏళ్ళ చన్నీకేమో ఇది ఊహించని అవకాశం. షెడ్యూల్డ్ కులాల వర్గం నుంచి పంజాబ్ పీఠమెక్కిన తొలి వ్యక్తిగా ఆయనకు రికారై్డతే దక్కింది. కానీ, రామ్‌దాసియా, రవిదాసియా అని పంజాబీ దళితుల్లో రెండు వర్గాలున్నాయి. తొలి వర్గానికి చెందిన చన్నీ అందరినీ ఆకట్టుకొని, అయిదు నెలలైనా కాక ముందే పార్టీని గెలిపించడం అత్యవసరమైంది. గ్రామీణ పంజాబ్‌లోని పేద కుటుంబం నుంచి పైకొచ్చిన ఈ మృదుభాషికీ కాంగ్రెస్ సంస్కృతిలో భాగమైన అసమ్మతి సహజగుణమే. మునుపటి కాంగ్రెస్ సీఎం అమరీందర్ సింగ్‌పై ధ్వజమెత్తినవారిలో చన్నీ కూడా ఉన్నారు. తీరా అమరీందర్ స్థానంలో తనకే సీఎం పీఠం వస్తుందని ఆయన ఊహించలేదు. గద్దెనెక్కాక ఇంటిపోరు ఆయనకూ అనుభవంలోకి వచ్చింది. ఒకే విడతలో ఫిబ్రవరి 20న జరిగే పంజాబ్ ఎన్నికల ప్రధాన ప్రచారకర్తల జాబితాలో తన పేరు మినహాయించడం లోక్‌సభ కాంగ్రెస్ ఎంపీ మనీశ్ మల్హోత్రాకు కినుక తెప్పించింది. ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన వేళ ఏర్పడ్డ భద్రతా వైఫల్యంపై మనీశ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ కథనానికి దగ్గరగా ఉండడమే అందుకు కారణమని కథనం. ఆయనా ఇప్పుడు తిరుగుబాటు జెండా పట్టే పనిలో ఉన్నారు. ఈ అనైక్యతా రాగం చన్నీ మాటెలా ఉన్నా పార్టీని ఇరుకున పెడుతోంది. దీనివల్ల విజయావకాశాలు దెబ్బ తింటే చన్నీకి పెద్దగా పోయేదేమీ లేదేమో కానీ, పార్టీకే నష్టం. అనైక్యతను భరిస్తూ, ఎన్నికల్లో గెలుపు చన్నీకి సవాలే. మరోపక్క చన్నీ సన్నిహితగణంపై కేంద్ర దర్యాప్తు సంస్థల తాకిడీ మొదలైపోయింది. చన్నీ మేనల్లుణ్ణి ఇసుక అక్రమ తవ్వకాల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. వీటన్నిటి మధ్య ఆమ్ ఆద్మీ పార్టీ, కొందరు రైతుల కొత్త జెండా ఎస్ఎస్ఎం, బీజేపీ– అమరీందర్ సింగ్‌ల పీఎల్సీ, అకాలీదళ్ – బీఎస్పీలతో బహుముఖ పోరులో చన్నీ విజేతగా బయట పడగలరా? దారిద్య్రం నుంచి పైకొచ్చిన చన్నీకి ప్రజల కష్టాలు తెలుసన్నారు రాహుల్. ప్రజలదే కాదు... ప్రస్తుతం దేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రతిపక్షానికే పరిమితమైన కాంగ్రెస్‌ని బాధిస్తున్న అధికార దారిద్య్రం కూడా ఆయనకు తెలుసు. పంజాబ్‌లో పార్టీని మరోసారి గెలిపించి, ఆ దారిద్య్రాన్ని ఆయన పోగొట్టగలరా అన్నదే శేషప్రశ్న. -
సాక్షి కార్టూన్ 07-02-2022
నాకేం తెలుసు! నన్నే ప్రకటిస్తారని అలా అన్నాను!! -
పంజాబ్ సీఎం అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికలు సమీపిస్తుండటంతో పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ప్రస్తుత సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ వైపే మొగ్గుచూపింది. లుధియానాలో ఆదివారం జరిగిన వర్చువల్ ఎన్నికల ప్రచారంలో పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ఈ మేరకు ప్రకటించారు. ‘సీఎం అభ్యర్థిని నిర్ణయించడం ఇబ్బందికర పరిస్థితే. అయితే, పేదల కష్టాన్ని ఓ పేద బిడ్డ మాత్రమే అర్థం చేసుకుంటారని పంజాబ్ ప్రజలు భావిస్తున్నారు. అందుకనే చన్నీనే పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తున్నాం’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. (చదవండి: ఆరునెలల్లోనే సీఎం అభ్యర్థి రేంజ్‌కి.. ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ) -
సీఎం అభ్యర్థిని ప్రకటించండి!
చండీగఢ్: పంజాబ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. వచ్చే 7– 10 రోజుల్లో పంజాబ్ కాంగ్రెస్ అభ్యర్థి పేరును ప్రకటించాలని రాహుల్‌గాంధీకి పీపీసీసీ చీఫ్ నవ్‌జోత్‌సింగ్ సిద్ధూ గురువారం డెడ్‌లైన్ విధించారు. జలంధర్‌లో జరుగుతున్న ప్రచారంలో రాహుల్‌ను సిద్ధూ ప్రశ్నించారు. తనను షోకేస్‌లో బొమ్మలాగా ఎల్లకాలం చూపాలని కోరడం లేదని సిద్ధూ స్పష్టం చేశారు. సీఎం అభ్యర్ధి విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ తక్షణం నిర్ణయం తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్‌ను ఎవరు నడిపిస్తారో పంజాబ్ ప్రజలకు వెల్లడించాలని, అప్పుడే కాంగ్రెస్ సులభంగా 70 సీట్లు నెగ్గుతుందని చెప్పారు. ఇదే వేదికపై ఉన్న ప్రస్తుత సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ కూడా అదే డిమాండ్‌ను వినిపించారు. వేదికపై సిద్దూను ఆలింగనం చేసుకొని తమ మధ్య ఏలాంటి విభేదాలు లేవని చెప్పారు. అయితే సీఎం అభ్యర్ధి పేరును ప్రకటించడం ద్వారా అరవింద్ కేజ్రీవాల్ నోరు మూయించాలని చన్నీ కోరారు. పంజాబ్ కోసం తాను ప్రాణమిస్తానని, అయితే ప్రజలు ఈ రోజు సీఎం అభ్యర్ధి ఎవరని అడుగుతున్నారని చెప్పారు. రాహుల్ తనకు ఎన్నో ఇచ్చారన్నారు. సీఎం కేండిడేట్‌గా ఎవరిని ప్రకటించినా తనకు సంతోషమేనన్నారు. కాంగ్రెస్‌కు పెళ్లికొడుకు ( సీఎం అభ్యర్ధి) లేరనే కేజ్రీవాల్ విమర్శలు వినదలుచుకోలేదని చెప్పారు. త్వరలో నిర్ణయిస్తాం పంజాబ్ కాంగ్రెస్ కార్యకర్తలను సంప్రదించిన అనంతరం సీఎం అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామని రాహుల్‌గాంధీ ప్రకటించారు. అలా ప్రకటించాల్సిన అవసరం ఉందో, లేదో కూడా కార్యకర్తలను అడుగుతామన్నారు. ఎవరో ఒక్కరే పార్టీని ముం దుండి నడిపిస్తారని చెప్పారు. ఒకరికి అవకాశం ఇస్తే మరొకరు మద్దతు ఇస్తామని ఇద్దరూ(చన్నీ, సిద్ధూ) వాగ్దానం చేశారని, ఇద్దరి గుండెల్లో కాంగ్రెస్ ఉందని ఆయన వ్యాఖ్యానించారు. -
చన్నీ వర్సెస్ సిద్ధూల మధ్య వివాదం.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
చండీగఢ్: కాంగ్రెస్ పార్టీ పంజాబ్ ప్రజలకు తీపికబురు అందించింది. త్వరలోనే పంజాబ్ సీఎం అభ్యర్థిని ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. రాహుల్ గాంధీ పంజాబ్‌లోని జలంధర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ సభలో.. పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ, పీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పాల్గోన్నారు. కాగా, తాము.. సీఎం పదవి కోసం ఆశపడబోమని ఆ సభలో బహిరంగంగా హమీ ఇచ్చారు. కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. అదే విధంగా ఒకరు నాయకత్వం వహిస్తే మరొకరు వారికి సహకారం అందిస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పలు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ లేదా పంజాబ్ కోరుకుంటే త్వరలోనే సీఎం అభ్యర్థిని ప్రకటిస్తుందని అన్నారు’. ఈ ప్రకటనతో చన్నీ వర్సెస్ సిద్ధూల మధ్య పోటీకి తెరపడినట్లు తెలుస్తోంది. ఇద్దరు వ్యక్తులు నాయకత్వం వహించలేరు.. ఒకరు మాత్రమే సరైన నాయకుడిగా ఉండగలరని ఆయన అన్నారు. సీఎం అభ్యర్థిని ఎవరు ఉండాలనే దాన్ని కాంగ్రెస్ కార్యకర్తలనే అడుగుతామన్నారు. అయితే, చన్నీ, నవజ్యోత్ సింగ్ ఇద్దరు నాయకులు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తారని తెలుస్తుందన్నారు. ఈ సందర్భంగా సిద్ధూ మాట్లాడుతూ.. క్రమశిక్షణ కల్గిన కాంగ్రెస్ సైనికుడిలా పనిచేస్తానని అన్నారు. తనను ‘షోపీస్’లా ట్రీట్ చేయోద్దని అన్నారు. ‘ మనమంతా పంజాబ్‌లో కాంగ్రెస్‌ను అధికారంలో తేవడానికి ఐక్యంగా పోరాడదామన్నారు’. ఇదే వేదికపై ఉన్న చన్నీ కూడా.. సిద్ధూ దగ్గరకు వెళ్లి తమ ఐక్యతను చూపే ప్రయత్నం చేశారు. ఈ సభలో సీఎం చన్నీకూడా మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి పదవికి ఎవరి పేరును ప్రతిపాదించిన అభ్యంతరంలేదన్నారు.’ ఎవరి పేరు ప్రతిపాదించిన ప్రచారం కోసం పనిచేసే మొదటి వ్యక్తి తానేనని చన్నీ స్పష్టం చేశారు. ఆ తర్వాత చన్నీ.. అరవింద్ కేజ్రీవాల్‌పై ఫైర్ అయ్యారు. అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత పోరు ఉందని వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని చురకలంటించారు. చదవండి: ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌కు షాక్.. బహిష్కరణకు గురైన మరుసటి రోజే -
కాంగ్రెస్ సీఎం అభ్యర్థిత్వంపై ప్రియాంక క్లారిటీ.. ‘అసలేం జరిగిందంటే’
UP Assembly Election 2022: ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని తానే అని అర్థం వచ్చేలా ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించడంతో ఎన్నికల వేడి మరింత పెరిగింది. ప్రియాంక రాకతో పోటీ రసవత్తరం కానుందనే విశ్లేషణలు వెలువడ్డాయి. శుక్రవారం జరిగిన కాంగ్రెస్ యూత్ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఆమె యూపీ సీఎం అభ్యర్థి ఎవరు అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘అంతటా నేనే కనిపిస్తున్నా.. మీకు ఇంకెవరైనా కనిపిస్తున్నారా ?. మీరు నన్నే ఎందుకు అనుకోకూడదు’ అని అన్నారు. దీంతో ఆ విషయం హాట్ టాపిక్ అయింది. అయితే, తన వ్యాఖ్యలపట్ల శనివారం ఆమె స్పష్టతనిచ్చారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని తానే అని చెప్పలేదని అన్నారు. విలేకర్లు అదేపనిగా కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరని ప్రశ్నలు గుప్పించడంతో ‘చిరాకు’తో అలా కామెంట్ చేశానని పేర్కొన్నారు. ఇక ఎన్నికల్లో పోటీ చేయడం గురించి మాట్లాడుతూ.. పోటీ గురించి ఇప్పుడైతే ఏ నిర్ణయం తీసుకోలేదని అన్నారు. (చదవండి: కాంగ్రెస్ హైకమాండ్‌పై చన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు) కాగా, సమాజ్‌వాదీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్.. ప్రస్తుత సీఎం యోగి ఆదిత్యనాథ్ తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే ప్రియాంక గాంధీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకోగా తాజాగా ఆమె ‘యూటర్న్’ తీసుకున్నారు. ఇక యూపీలో ప్రధాన పోటీ బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల మధ్యే ఉండనుందనే విశ్లేషణల నేపథ్యంలో కాంగ్రెస్ సీఎం క్యాండిడేట్ అంశం పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నారు. (చదవండి: సమోసా-చాయ్ నుంచి బీఎండబ్ల్యూ వరకు.. ఇవే ధరలు) -
చన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు.. సిద్ధూని సీఎం అభ్యర్థిగా ప్రకటించినా ‘నోప్రాబ్లమ్’
చండీగఢ్: పంజాబ్‌లో రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీఎం చన్నీ, పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్‌లు తమ ఆధిపత్యం కోసం పోటాపోటీగా ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా, సీఎం చన్నీ ఒక మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో.. ‘త్వరలో జరగనున్న ఎన్నికలలో కాంగ్రెస్ అధిష్టానం పంజాబ్ సీఎం అభ్యర్థిగా.. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూని పేరుని యోచిస్తుందా ’ అని ప్రశ్నించారు. దీనిపై చన్నీ తనదైన శైలీలో స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి తాను ఒక సేవకుడినని.. అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్న దాన్ని గౌరవిస్తానని స్పష్టం చేశారు. సిద్ధూ తనకు సోదరుడు లాంటి వాడని, దీనిపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా చన్నీ.. మాజీ సీఎం అమరీందర్ సింగ్‌పై ఆరోపణలు గుప్పించారు. కాగా, ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ సీఎం అభ్యర్థిగా భగవంత్‌మాన్ పేరును ప్రకటించడంపై కూడా స్పందించారు. కేజ్రీవాల్ పంజాబ్ నుంచి నాయకుడిగా ఎదగాలన్నారు. పంజాబ్ ప్రజల నుంచి తగినంత మద్దతు కనబడకపోవడంతో చివరి నిమిషంలో భగవంత్ మాన్ పేరును ప్రతిపాదించారని తెలిపారు. కాగా, చన్నీ తాను పోటికి దిగుతున్న చామ్‌కౌర్ సాహిబ్ స్థానం నుంచి ఓడిపోతారని కేజ్రీవాల్ విమర్శించారు. అదే సమయంలో చన్నీ మేనల్లుడి ఇంట్లో కోట్లాది రూపాయలను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకోవడం కలకలంగా మారిన విషయం తెలిసిందే. పంజాబ్‌లో ఫిబ్రవరి 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. చదవండి: ప్రధాని మోదీ అరుదైన రికార్డు.. బైడెన్ కంటే -
పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థి సిక్కు వర్గం నుంచే..
అమృత్సర్: 2022లో పంజాబ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిగా సిక్కు వర్గానికి చెందిన వ్యక్తే ఉంటారని పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సోమవారం స్పష్టం చేశారు. దీనిపై పార్టీలో అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయని, నిర్ణయం తీసుకోగానే చెబుతామని అన్నారు. మాజీ ఐపీఎస్ అధికారి కున్వర్ విజయ్ ప్రతాప్‌సింగ్... కేజ్రీవాల్ సమక్షంలో ఆప్‌లో చేరారు. ఆప్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా దళితవర్గం నుంచి ఎవరైనా ఉంటారా? అంటూ మీడియా ప్రశ్నించింది. కేజ్రీవాల్ స్పందిస్తూ.. ప్రకటించబోయే వ్యక్తి వల్ల యావత్ రాష్ట్రం గర్విస్తుందని, ఆ వ్యక్తి సిక్కువర్గం నుంచి ఉంటారని స్పష్టం చేశారు. విజయ్ ప్రతాప్‌సింగ్ ఏ స్థానం నుంచి పోటీ చేయాలన్న విషయాన్ని తర్వాత నిర్ణయిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూతో చర్చలు జరుగుతున్నాయా అని ప్రశ్నించగా... ‘సిద్ధూ కాంగ్రెస్ నేత అని, సీనియర్ నాయకుడు. ఆయన్ను నేనెంతో గౌరవిస్తాను. అందువల్ల ఏ నేత గురించీ అనవసర మాటలొద్దు. ఒకవేళ సిద్ధూతో భేటీ అయితే, ముందుగా ఆ విషయాన్ని మీడియాకే చెబుతా’నని తెలిపారు. -
కొనసాగుతున్న ఉత్కంఠ: హస్తినకు అసోం రాజకీయం
సాక్షి,ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీని నిలబెట్టుకున్నప్పటికీ అక్కడ ప్రభుత్వ ఏర్పాటులో ఇంకా ప్రతిష్టంభన కొసాగుతోంది. ఫలితాలొచ్చి అయిదు రోజులైనా సీఎం ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు ఇంకా తెరపడలేదు. దీంతో అసోం రాజకీయం హస్తినకు చేరింది. తదుపరి ముఖ్యమంత్రిపై అనిశ్చితి మధ్య నాయకత్వ సమస్యలపై చర్చించడానికి అసోం సిట్టింగ్ ముఖ్యమంత్రి శర్వానంద్ సోనోవాల్, హిమాంత్ బిశ్వలను బీజేపీ అధిష్ఠానం ఢిల్లీకి పిలిపించింది. కొత్త సీఎం ఎవరనేది శనివారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇరువురు నేతలూ ఢిల్లీకి చేరుకుని, బీజేపీ జాతీయధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమవుతారు. నడ్డా నివాసంలో హోంమంత్రి అమిత్ షా, బీఎల్ సంతోష్ సమాశానికి తొలుత హిమంత బిశ్వ శర్మను పిలిపించిన అధిష్టానం శర్వానంద్ సోనో వాల్ని కూడా పిలిపించడం విశేషం. ఈ సమాశానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా హాజరుకానున్నారని తెలుస్తోంది. హిమంత బిశ్వ శర్మ తనకు 40 మంది ఎమ్మెల్యేలతోపాటు మిత్ర పక్షాల మద్దతు ఉందని అంటుండగా, సీఎం తన పరిపాలనకే ప్రజలు ఓటు వేశారని శర్వానంద్ వాదిస్తున్నారు. అటు 50 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీయే, హిమాంత బిశ్వ శర్మకు మద్దతుగా నిలుస్తోంది. తమ పార్టీకి చెందిన 29 ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తారని కాంగ్రెస్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. దీంతో అనిశ్చిత రాజకీయం వాతావరణం మరింత వేడెకింది. ఈ నేపథ్యంలో నాయకత్వ సమస్యను సామరస్యంగా పరిష్కరించే దిశగా అధిష్టానం పావులు కదుపుతోంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో అంతిమ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా అసోంలోని మొత్తం 126 స్థానాలకుగానూ 75 సీట్లలో బీజేపీ నాయకత్వంలోని ఎన్ఏడీ కూటమి విజయం సాధించగా, బీజేపీ 60 సీట్లలో గెలిచింది. ఎన్నికల జరిగిన మిగతా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరినా అసోంలో మాత్రం సీఎం ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికలకు ముందు బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించని సంగతి తెలిసిందే. -
మూడో కూటమి సీఎం అభ్యర్థిగా కమల్ ఖరారు
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామాలు సంభవించాయి. మూడు పార్టీలతో ఏర్పడిన మూడో కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ‘మక్కల్ నీది మయ్యం’(ఎంఎన్ఎం) అధ్యక్షుడు, నటుడు కమల్‌హాసన్ పేరు ఖరారు కాగా, సీట్ల పంపకం కుదరక ఏఐఏడీఎంకే కూటమితో తెగదెంపులు చేసుకుంటున్నట్లు డీఎండీకే ప్రకటించింది. దీంతో డీఎండీకేని మూడో కూటమిలో చేర్చుకునేందుకు కమల్ ప్రయత్నాలు ప్రారంభించారు. అన్నాడీఎంకే కూటమిలో కొనసాగిన ‘ఇండియా జన నాయక కట్చి’(ఐజేకే) గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో చేరింది. ఐజేకే వ్యవస్థాపక అధ్యక్షుడు పారివేందర్ పెరంబలూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే నుంచి 1, 2 స్థానాలు మాత్రమే దక్కే పరిస్థితి ఎదురవడంతో కూటమి నుంచి వైదొలిగారు. తన కుమారుడు రవి పచ్చముత్తును పార్టీ అధ్యక్షునిగా చేసి మూడో కూటమి సన్నాహాలు మొదలుపెట్టారు. సీట్ల సర్దుబాటుపై పిలుపు రాకపోవడంతో అలిగిన ‘సమత్తువ మక్కల్ కట్చి’ అధ్యక్షుడు శరత్‌కుమార్ అన్నాడీఎంకే కూటమిని వీడి ఐజేకే కూటమిలో చేరారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ మినహా మరే కూటమిలోనైనా చేరేందుకు ఎదురుచూస్తున్న కమల్ ఈ కూటమిలో చేరారు. ఐజేకే కూటమి సీఎం అభ్యర్థిగా కమల్ బరిలోకి దిగుతున్నట్లు శరత్‌కుమార్ ప్రకటించారు. వీరి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఎంఎన్ఎం 154, ఎస్ఎంకే, ఐజేకే చెరో 40 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ప్రజలకు విరోధులుగా వ్యవహరించే ప్రతి ఒక్కరినీ తాము లక్ష్యంగా చేసుకుంటామని కమల్ ప్రకటించారు. అన్నాడీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చిన డీఎండీకేని కూడా కమల్ తమ కూటమిలోకి ఆహ్వానించారు. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే కూటమిలో సీట్ల పంపకం కొలిక్కి వచ్చింది. 234 స్థానాలకు గాను డీఎంకే 186 చోట్ల పోటీ చేయనుంది. కూటమిలోని కాంగ్రెస్‌కు 25, సీపీఐ, సీపీఎం, ఎండీఎంకే, వీసీకేలకు ఆరు చొప్పున, ఐయూఎంఎల్, ఎంఎంకేలకు కలిపి 5 సీట్లు కేటాయించింది. -
బీజేపీ సీఎం అభ్యర్థిగా ‘మెట్రోమ్యాన్’!
తిరువనంతపురం: దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని భావిస్తోన్న బీజేపీ అందుకు తగ్గట్లుగా పావులు కదుపుతోంది. మరి కొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. వీటిలో దక్షిణాది రాష్ట్రాలు కేరళ, తమిళనాడు కూడా ఉన్నాయి. తమిళ ప్రజలు బీజేపీ పట్ల అంత విశ్వాసం చూపరు. ఈ క్రమంలో కాషాయ పార్టీ కేరళలో పాగా వేసేందుకు సీరియస్‌గా ట్రై చేస్తోంది. దానిలో భాగంగా మెట్రో మ్యాన్ ఈ. శ్రీధరన్‌ని తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. ఈ మేరకు గురువారం కేరళ బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ కే సురేంద్రన్ ప్రకటన విడుదల చేశారు. కేరళ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మెట్రోమ్యాన్ శ్రీధరన్ పేరును ప్రకటించారు. మిగతా వారి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. శ్రీధరన్ గత వారం బీజేపీలో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన కేరళలో బీజేపీ అధికారంలోకి వస్తే తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధం అని తెలిపారు. తాజాగా బీజేపీ ఆయననే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. శ్రీధరన్‌కున్న క్లీన్ ఇమేజ్ తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. ఈ సందర్భంగా శ్రీధరన్ మాట్లాడుతూ.. ‘‘ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే దాని గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎక్కడ నుంచి పోటీ చేసినా నేను గెలుస్తాననే నమ్మకం ఉంది. ఈ సారి బీజేపీ అధికారంలోకి వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. అయితే, నేను ఇప్పుడు నివసిస్తున్న మలప్పురంలోని పొన్నానికి సమీపంగా ఉండే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నాను”అని తెలిపారు. కొచ్చి మెట్రో ప్రాజెక్టుకు గురువుగా ఉన్న శ్రీధరన్ తాను ఇంటింటికి వెళ్లి ఓట్లు అడిగే సంప్రదాయాన్ని పాటించనని తెలిపారు. ‘‘నేను ఇళ్లకు, దుకాణాలకు, ఊర్లకు వెళ్లను. కానీ నా సందేశం ఓటర్లందరికి చేరుతుంది’’ అన్నారు. వృద్ధులను పక్కకు పెడుతున్న బీజేపీ తాజాగా 88 ఏళ్ల శ్రీధరన్‌ను తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. చదవండి: మెట్రోమ్యాన్ లక్ష్యం నెరవేరేనా? లవ్ జిహాద్‌పై శ్రీధరన్ సంచలన వ్యాఖ్యలు! -
చిన్నమ్మకు చెక్ పెట్టినట్టేనా..
అన్నాడీఎంకే కుర్చీ వివాదానికి తెర పడింది. సామరస్య పూర్వకంగా నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. సీఎం పళనిస్వామికి పట్టం కట్టారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి పళనిస్వామి అని బుధవారం ఆ పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరుసెల్వం స్వయంగా ప్రకటించారు. అలాగే, పార్టీకి 11 మందితో కూడిన మార్గదర్శక కమిటీ ఏర్పాటు చేశారు. ఇందు లో చిన్నమ్మ శశికళకు వ్యతిరేకంగా మొదటి నుంచి గళం విప్పుతున్న వాళ్లే ఉండడం గమనార్హం. సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో సాగుతున్న రాజకీయ వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీఎం ఎవరో, మార్గదర్శక కమిటీలో ఎవరెవరు ఉండాలో అన్న అంశాలపై అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరుసెల్వం, కో కన్వీనర్ పళనిస్వామి నివాసాల్లో బుధవారం వేకువజామున మూడు గంటల వరకు సీనియర్ మంత్రుల మంతనాలు వేర్వేరుగా సాగడంతో ఉత్కంఠ తప్పలేదు. ఎట్టకేలకు ఉత్కంఠకు తెరదించే రీతిలో రాయపేటలోని అన్నాడీఎంకే కార్యాలయంలో ఉదయం 10 గంటలకు సమావేశం సాగింది. ఈ సమావేశం నిమిత్తం ముందుగా పన్నీరు సెల్వం అక్కడికి వచ్చారు. ఎంజీఆర్, జయలలిత విగ్రహాల వద్దకు చేరుకుని అంజలి ఘటించి లోనికి వెళ్లారు. ఆ తర్వాత పళనిస్వామి రావడంతో ఆయన మద్దతుదారుల హంగామా అంతా ఇంతా కాదు. పూల వర్షంలో ఆయన కాన్వాయ్ తడిసి ముద్దయింది. ముందుగా మార్గదర్శక కమిటీ.. పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి పన్నీరు, పళని హాజరు కాగా, సంయుక్త కన్వీనర్లు, ఎంపీలు వైద్యలింగం, కేపీ మునుస్వామి నేతృత్వం వహించారు. ముందుగా పళనిస్వామి అన్నాడీఎంకే మార్గదర్శక కమిటీని ప్రకటించారు. ఇందులో మంత్రులు దిండుగల్ శ్రీనివాసన్, తంగమణి, ఎస్పీ వేలుమణి, జయకుమార్, సీవీ షణ్ముగం, ఆర్ కామరాజ్‌లకు చోటు కల్పించారు. పార్టీ నిర్వాహక కార్యదర్శులు జేసీడీ ప్రభాకర్, మాజీ ఎంపీ పీహెచ్ మనోజ్‌పాండియన్, మాజీ మంత్రి మోహన్, మాజీ ఎంపీ గోపాలకృష్ణన్, చోళవందాన్ ఎమ్మెల్యే మాణిక్యంలకు అవకాశం కల్పించారు. సీఎం అభ్యర్థి పళని.. పన్నీరుసెల్వం ప్రసంగిస్తూ అన్నాడీఎంకే 2021 ఎన్నికలకు సిద్ధమైందని, పార్టీ నేతృత్వంలో కూట మి ఏర్పాటు అంటూ, సీఎం అభ్యర్థిగా పళనిస్వామి ని ఏకగ్రీవంగా ఎంపిక చేశామని ప్రకటించారు. సంబరాల్లో సేన.. పళనిస్వామి సీఎం అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ, ఏకగ్రీవ ఎంపిక ప్రకటనను పన్నీరు చేశారో లేదో, రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే వర్గాలు సంబరాల్లో మునిగాయి. అన్నాడీఎంకే కార్యాలయం పరిసరాల్లో బాణసంచా పేల్చుతూ, స్వీట్లు పంచారు. పళనిస్వామిని ప్రసన్నం చేసుకునేందుకు పార్టీ నేతలు పుష్పగుచ్ఛాలతో బారులు తీరారు. సమావేశాన్ని ముగించుకున్న నేతలందరూ మెరీనా తీరం వైపుగా కదిలారు. అక్కడి ఎంజీఆర్, జయలలిత సమాధుల వద్ద పుష్పాంజలి ఘటించారు. సీఎం ఎడపాడి పళనిస్వామి బుధవారం సాయంత్రం పన్నీరు సెల్వం ఇంటికెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. చిన్నమ్మకు చెక్ పెట్టినట్టేనా.. జైలు నుంచి బయటకు వచ్చే శశికళ అన్నాడీఎంకేను కైవసం చేసుకోవడం ఖాయం అన్న ప్రచారానికి మార్గదర్శక కమిటీతో చెక్ పెట్టినట్టున్నారు. శశికళ వ్యతిరేకులకు ఈ కమిటీలో చోటు దక్కడం గమనార్హం. పార్టీలో, ప్రభుత్వంలో తటస్థంగా వ్యవహరించే మంత్రులు జయకుమార్, కామరాజ్ కమిటీలో ఉన్నారు. వీరూ చిన్నమ్మ వ్యతిరేకులే. మిగిలిన నలుగురు మంత్రులు సీఎం మద్దతుదారులు. పన్నీరు మద్దతుదారులుగా ఓ ఎమ్మెల్యే, నలుగురు మాజీలు ఈ కమిటీలో ఉన్నారు. వీరంతా మొదటి నుంచి చిన్నమ్మకు వ్యతిరేకంగా అన్నాడీఎంకేలో గళాన్ని స్వరాన్ని వినిపిస్తున్న వాళ్లే. ఇక, ఈ కమిటీలో పదవి కోసం మహిళా నేతలు ప్రయత్నించినా ఫలితం శూన్యం. అలాగే, మంత్రి ఓఎస్.మణియన్, సెల్లూరు రాజుతో పాటు మరో ఇద్దరు, అన్వర్‌రాజా వంటి సీనియర్ల ప్రయత్నాలు చేసినా, వీరు అప్పుడప్పుడు పరోక్షంగా చిన్నమ్మకు అనుకూలంగా నోరు జారిన వాళ్లే కావడం గమనార్హం. -
అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి పళని
సాక్షి, చెన్నై: తమిళనాడులోని అన్నాడీఎంకే పార్టీలో ఇద్దరు అగ్రనాయకులు పళనిస్వామి, పన్నీర్ సెల్వం మధ్య ఆధిపత్య పోరుకి తెరపడింది. ముఖ్యమంత్రి కె. పళనిస్వామినే తిరిగి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా పార్టీ ఖరారు చేసింది. వచ్చే ఎన్నికల్లో పార్టీ మళ్లీ అధికారం చేపట్టడానికి ఇరువురు అగ్ర నేతలు కలిసి పనిచేయాలని నిర్ణయించడంతో పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సా హాలు వెల్లువెత్తాయి. బుధవారం నాడు పార్టీ ప్రధాన కార్యాల యంలో స్వయంగా పన్నీర్ సెల్వం నేతల హర్షధ్వానాల మధ్య సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరుని ప్రకటించారు. ‘‘నా ప్రియ సోదరుడు పళనిస్వామిని ముఖ్య మంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. 2021 ఎన్నికల్లో ఆయన విజేతగా నిలుస్తారు’’అని పళనిస్వామి అన్నా రు. ఆ తర్వాత 11 మంది సభ్యులతో కూడిన స్టీరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఎప్పట్నుంచో పన్నీర్ సెల్వం ఈ స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటుకు పట్టుబడుతూ ఉంటే, పళనిస్వామి దానిని వ్యతిరేకిస్తున్నారు. ఇక సీఎం అభ్యర్థిత్వంపైనా ఇరువురు నేతల మధ్య గత కొన్నాళ్లుగా విభేదాలున్నాయి. సెప్టెంబర్ 28న పార్టీ కార్యనిర్వాహక సమావేశంలో ఇద్దరూ సీఎం పదవి తనకి కావాలంటే, తనకంటూ తీవ్ర వాగ్వాదానికి దిగడంతో పార్టీ నేతలు దిగ్భ్రాంతి చెందారు. స్టీరింగ్ కమిటీ ఏర్పాటు పైనా కూడా ఇద్దరి మ«ధ్య మాటా మాటా పెరిగింది. అప్పట్నుంచి పన్నీర్ సెల్వం ప్రభుత్వ కార్యక్రమాలకు గైర్హాజరవుతూ వచ్చారు. కొందరు నాయకుల చొరవతో మళ్లీ ఇద్దరూ రాజీకి రావడంతో సంక్షోభం ముగిసింది. వచ్చే ఏప్రిల్, మేలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పన్నీర్‌ను మించిపోయేలా జయలలిత మృతి తర్వాత సీఎం అయ్యే అవకాశం తొలుత పన్నీర్ సెల్వంకే వచ్చింది. అయితే కొన్నాళ్లకే ఆయన శశికళపై తిరుగుబాటు చేసి పార్టీని చీల్చారు. కానీ సరిపడినంత ఎమ్మెల్యేల బలం లేక పదవిని కోల్పోయారు. అదే సమయంలో శశికళకి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష పడడంతో ఆమెకు అత్యంత విధేయుడిగా పేరు పడిన పళనిస్వామిని శశికళ సీఎంని చేశారు. ఆమె జైలుకి వెళ్లిన అనంతరం పన్నీర్‌తో చేతులు కలిపిన పళనిస్వామి ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళ, ఆమె మేనల్లుడు దినకరన్‌ని పార్టీ నుంచి గెంటేశారు. క్రమక్రమంగా ఆయన తనకున్న రాజకీయ చాతుర్యంతో పార్టీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. జయలలిత మరణానంతరం పార్టీ, ప్రభుత్వంలో శశికళ తర్వాత అంతటి పట్టు సాధించిన వారు పళని. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌కి పోటీ ఇవ్వగలిగిన నాయకుడు ఏఐఏడీఎంకేలో పళనిస్వామి తప్ప మరొకరు లేరన్న అభిప్రాయం ఉంది. -
అమ్మాయికి చెప్పు.. ఎందుకీ రాజకీయాలు
బిహార్ రాజకీయాల్లోకి ఒక కొత్త అమ్మాయి వచ్చింది. ఒక కొత్త పార్టీతో వచ్చింది. తనే సీఎం అభ్యర్థిని అని కూడా ప్రకటించుకుంది. ఆమె పేరు పుష్పం ప్రియా చౌదరి. ఆమె పెట్టిన పార్టీ పేరు ‘ప్లూరల్స్’. ఈ ఏడాది అక్టోబర్‌లో జరగబోతున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జెడియు (ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ), ఆర్జేడీ (ప్రతిపక్షంలో ప్రధాన పార్టీ) లను ఢీకొని మరీ.. ముఖ్యమంత్రిని కాగలననే ఆమె నమ్ముతోంది. జెడి(యు) నాయకుడు వినోద్ చౌదరి కూతురు ప్రియ. ఆ పార్టీలో ఆమె పైకి ఎదిగే అవకాశాలు ఉన్నా.. సొంతంగా ఎదగాలని బయటికి వస్తోంది. ‘లవ్ బిహార్, హేట్ పాలిటిక్స్’.. ఇదీ ఆమె ట్విట్టర్ హ్యాండిల్‌లోని నినాదం. తన వెబ్సైట్లో బిహార్ ప్రజలకు ఒక బహిరంగ లేఖ కూడా రాసింది. ప్రపంచం ముందుకు వెళుతుంటే.. మనమెందుకు ఇక్కడే ఉండిపోయాం! కారణం మన రాజకీయ నాయకుల విధానాలు’’ అని ఆ లేఖ సారాంశం. ఈ మార్చి 8న మహిళా దినోత్సవం రోజు రాజకీయాల్లోకి వచ్చారు ప్రియ. బిహార్‌లోని దర్భంగా ఆమె జన్మస్థలం. చిన్న చదువులన్నీ అక్కడే. పెద్ద చదువుల కోసం లండన్ వెళ్లారు. డెవలప్మెంట్ స్టడీస్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. తర్వాత... పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో ఇంకో మాస్టర్స్ డిగ్రీ. ప్రియ తండ్రి మాజీ ఎమ్మెల్సీ. ‘‘అమ్మాయికి చెప్పి చూడవయ్యా.. ఎందుకీ రాజకీయాలు’’ అని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారని అప్పుడే వార్తలు బయటికి వచ్చేశాయి. ప్రియ ఆగేలా లేదు. రాజకీయాల్ని ప్రక్షాళన చేయకుండా వదిలే లానూ లేదు. -
బీజేపీకి పక్కలో బల్లెం!
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్‌లో నెలకొన్న రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ నేతలందరితో సుదీర్ఘంగా మంతనాలు జరిపిన పార్టీ చీఫ్ రాహుల్‌గాంధీ.. సీనియర్ నేత భూపేశ్ బఘేల్(57)ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఖరారు చేశారు. అనంతరం ఆదివారం నాడిక్కడ సమావేశమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బఘేల్‌ను శాసన సభాపక్ష(సీఎల్పీ) నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర పరిశీలకుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ..‘నిజంగా ఇది కఠినమైన నిర్ణయమే. ఎందుకంటే బఘేల్, చరణ్‌దాస్ మహంత్, టి.ఎస్. సింగ్‌దేవ్, తామ్రధ్వజ్ సాహూ కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలకంగా వ్యవహరించారు. పార్టీలో ఈ నలుగురి హోదా సమానమే. వీరందరితో పలు దఫాలుగా చర్చించిన మీదట బఘేల్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాహుల్ ఎంపిక చేశారు. ఇదే విషయాన్ని రాష్ట్ర శాసన సభ్యులకు తెలియజేశాం. వారంతా ఏకగ్రీవంగా బఘేల్‌ను సీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. రాయ్‌పూర్‌లోని సైన్స్ కాలేజ్ మైదానంలో బఘేల్ సోమవారం సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు. బఘేల్‌తో పాటు ఇంకెవ్వరూ మంత్రులుగా ప్రమాణం చేయడంలేదు’ అని తెలిపారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చినందున తమముందు చాలా సవాళ్లు ఉన్నాయని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని నిలబెట్టుకుంటామనీ, బఘేల్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారని ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఖరారైన బఘేల్‌కు కాంగ్రెస్ పార్టీ శుభాకాంక్షలు తెలిపింది. బఘేల్ ఎంపికకు ముందు కాంగ్రెస్ పార్టీలో హైడ్రామా నడిచింది. నలుగురు నేతలు సీఎం పదవి కోసం పోటీపడటంతో పార్టీ చీఫ్ రాహుల్‌గాంధీ వీరితో పలు దఫాలుగా చర్చలు జరిపారు. చివరికి రాహుల్ ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేస్తారో వారికే మద్దతు ప్రకటిస్తామని ఈ నెల 12న సీఎల్పీ చేత తీర్మానం చేయించారు. మొత్తం 90 స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ 68 సీట్లతో ఘనవిజయం సాధించగా, బీజేపీ 15 స్థానాలకు పరిమితమైంది. రుణమాఫీపైనే తొలి సంతకం: బఘేల్ ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతుల రుణమాఫీపైనే తొలి సంతకం పెడతానని కాబోయే ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ తెలిపారు. అలాగే 2013లో మావోయిస్టుల చేతిలో కాంగ్రెస్ నేతల ఊచకోతపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణకు ఆదేశిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలోని రైతులు, ఆదివాసీలు, యువత, మహిళలు, చిరువ్యాపారుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. దుర్గ్ జిల్లాలోని పతన్ నియోజకవర్గం నుంచి బఘేల్ గెలుపొందారు. 2013, మే 25న ఛత్తీస్‌గఢ్‌లోని జీరమ్ లోయ ప్రాంతంలో కాంగ్రెస్ నేతల కాన్వాయ్‌పై మావోయిస్టులు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో సల్వాజుడుం వ్యవస్థాపకుడు, కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మ, రాష్ట్ర పీసీసీ చీఫ్ నందకుమార్ పటేల్, ఆయన కుమారుడు దినేశ్ సహా 25 మంది కీలక నేతలు, కార్యకర్తలు చనిపోయారు. బీజేపీకి పక్కలో బల్లెం ఛత్తీస్‌గఢ్ లో దాదాపు 15 ఏళ్ల బీజేపీ పాలనకు చరమగీతం పాడటంలో కీలకంగా వ్యవహరించిన భూపేశ్ బఘేల్ మధ్యప్రదేశ్‌లోని(ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్) దుర్గ్ జిల్లాలో ఓ సాధారణ రైతు కుటుంబంలో 1961, ఆగస్టు 23న జన్మించారు. చందూలాల్ చంద్రశేఖర్ ప్రోద్బలంతో 1980 దశకం ప్రారంభంలో రాజకీయాల్లోకి ప్రవేశించారు. అనంతరం ఐదేళ్లకే యూత్ కాంగ్రెస్‌లో చేరారు. 1994–95లో మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. క్రమంగా మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. కుర్మి సామాజిక వర్గానికి చెందిన భూపేశ్‌కు రాష్ట్రంలో ఉన్న 52 శాతం మంది ఓబీసీల్లో మంచి పలుకుబడి ఉంది. దుర్గ్ జిల్లా పటాన్ నియోజకవర్గం నుంచి బఘేల్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1993లో మధ్యప్రదేశ్ అసెంబ్లీకి తొలిసారి ఎన్నికైన బఘేల్.. అజిత్ జోగీతో పాటు దిగ్విజయ్ సింగ్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. భూపేశ్ బఘేల్ సంఘ సంస్కర్తగా పేరుపొందారు. పేదలు ఆర్థికంగా చితికిపోకుండా ఉమ్మడి మధ్యప్రదేశ్(2000, నవంబర్ 1న మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్ అనే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారు)లో సామూహిక వివాహాలు జరిపించారు. అంతేకాకుండా బీజేపీ నేతలకు పక్కలో బల్లెంలా తయారయ్యారు. ప్రతీ సందర్భంలోనూ బీజేపీని ఇరుకున పెట్టేలా మాట్లాడటంతో పాటు ఓ బీజేపీ నేతకు సంబంధించిన అశ్లీల దృశ్యాల సీడీని విడుదల చేసి వివాదాల్లో చిక్కుకున్నారు. ఈ వ్యవహారంలో బఘేల్ జైలుకు సైతం వెళ్లాల్సి వచ్చింది. ఆతర్వాత బఘేల్‌తో పాటు ఆయన భార్య భూకబ్జాలకు పాల్పడ్డారని రమణ్‌సింగ్ ప్రభుత్వం కేసులు పెట్టి వేధించింది. అంతేకాకుండా సొంత పార్టీలోనూ ఆయనకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అన్నింటిని ఓపికగా సహించిన భూపేశ్ బఘేల్, నేడు ఛత్తీస్‌గఢ్ మూడో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. బఘేల్‌కు ముందు అజిత్ జోగి(మూడేళ్లు), రమణ్‌సింగ్(15 సంవత్సరాలు) ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. -
‘పార్టీకి పట్టం కట్టేందుకే పాటుపడ్డా’
న్యూఢిల్లీ : పార్టీని అధికారంలోకి తేవడానికే కసితో పనిచేశానని, సీఎం పదవిని చేపట్టాలనే దాహం తనకు లేదని మధ్యప్రదేశ్ సీఎం పగ్గాలు చేపట్టనున్న కమల్‌నాథ్ పేర్కొన్నారు. తాను దశాబ్ధాలుగా రాజకీయాల్లో ఉన్నానని, మధ్యప్రదేశ్‌లో తిరిగి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చే లక్ష్యంతో ముందుకెళ్లానన్నారు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. సీఎం ఆశావహులు జ్యోతిరాదిత్య సింధియా, దిగ్విజయ్ సింగ్‌లకు ప్రభుత్వంలో ఎలా భాగస్వామ్యం కల్పిస్తారన్న ప్రశ్నకు బదులిస్తూ ప్రభుత్వంలో అందరికీ ప్రాతినిధ్యం ఉంటుందని చెప్పారు. పార్టీలో సింధియా క్యాంప్, దిగ్విజయ్ క్యాంప్, కమల్‌నాథ్ క్యాంప్ అంటూ ఏమీ లేవన్నారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. మోదీ, అమిత్ షా విన్నింగ్ కాంబినేషన్‌కు మధ్యప్రదేశ్‌లో చెక్ పెట్టామని చెప్పుకొచ్చారు. మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే గవర్నర్‌ను కలవడంపై కమల్‌నాథ్ స్పందిస్తూ గోవాలో బీజేపీకి తగినంత సంఖ్యాబలం లేకున్నా ప్రభుత్వం ఏర్పాటు చేశారని, మధ్యప్రదేశ్‌లో తమకు తగినంత మెజారిటీ ఉన్నందునే గవర్నర్‌తో భేటీ అయ్యామన్నారు. మాయావతితో తాను మాట్లాడానని, తమకు మద్దతు ఇచ్చేందుకు ఆమె అంగీకరించారని, ఎస్పీ సైతం సహకరించేందుకు ముందుకువచ్చిందని అన్నారు. వారు బేషరతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారని చెప్పారు. తమ ప్రభుత్వంలో అన్ని కులాలు, మతాలకు సమ ప్రాతినిధ్యం ఉంటుందని కమల్‌నాథ్ వెల్లడించారు. అవి తప్పుడు ఆరోపణలు 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో తనపై ఎలాంటి అభియోగాలు లేవని, తనపై ఆరోపణలున్నాయని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని చెప్పారు. సిక్కు వ్యతిరేక ఘర్షణలపై ఏర్పాటైన నానావతి కమిషన్ సరైన ఆధారాలు లేవంటూ కమల్‌నాథ్‌పై అభియోగాలను తోసిపుచ్చింది. కాగా సిక్కుల ఊచకోతలో ప్రమేయం ఉన్న కమల్‌నాథ్‌కు మధ్యప్రదేశ్ సీఎం పదవి కట్టబెట్టడాన్ని సిక్కు సంఘాల ప్రతినిధులు వ్యతిరేకిస్తున్నారు. మధ్యప్రదేశ్ సీఎంగా కమల్ నాథ్‌ను ఎంపిక చేస్తే దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఢిల్లీకి చెందిన అకాలీదళ్ నేత మంజిందర్ సింగ్ సిర్సా హెచ్చరించారు. -
సీఎం ఎవరు?
ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ 15 ఏళ్ల తరువాత అధికారం దక్కించుకోవడంతో ఇప్పుడు అందరి దృష్టి సీఎం అభ్యర్థి ఎవరనే దానిపైనే ఉంది. ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భూపేశ్ బాగెల్ సీఎం అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మరో ముగ్గురు కూడా పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. పటన్ స్థానం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికైన భూపేష్ బాగెల్.. 1980లలో యువజన కాంగ్రెస్ సభ్యునిగా రాజకీయాల్లోకి వచ్చారు. దిగ్విజయ్ సింగ్ ప్రభుత్వం (ఉమ్మడి మధ్యప్రదేశ్)లో మంత్రిగా పనిచేశారు. ఎంపీ నుంచి ఛత్తీస్‌గఢ్ విడిపోయిన తర్వాత ఏర్పడిన అజిత్ జోగి ప్రభుత్వంలో మంత్రిగా విధులు నిర్వర్తించారు. 2013లో మహేంద్రకర్మ అనే మాజీ మంత్రిని హత్య చేసేందుకు మావోయిస్టులు జరిపిన దాడిలో (ఇందులో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది) ప్రాణాలతో బయటపడిన భూపేశ్.. ఆ తరువాత పార్టీ నిర్మాణంలో తనదైన పాత్ర పోషించడం ద్వారా మంచి పేరు సంపాదించుకున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా పనిచేసిన టీఎస్ సింగ్‌దేవ్ కూడా సీఎం రేసులో ఉన్నారు. ఈయన కాంగ్రెస్ పార్టీ ధనిక అభ్యర్థుల్లో ఒకరు. సీతాస్వయంవరం తరహాలో సీఎం ఎంపిక జరగాలనేది ఈయన అభిప్రాయం. ఆ స్వయంవరంలో పాల్గొని పదవిని వరించాలని తహతహలాడుతున్నారు. లౌక్యమున్న నేతగా పేరున్న సింగ్‌దేవ్ అంబికాపూర్ నుంచి గెలుపొందారు. ఓబీసీ నేత తమ్రద్వాజ్ సాహూ కూడా బాగెల్, సింగ్‌దేవ్‌లకు పోటీనిస్తున్నారు. కుల సమీకరణల నేపథ్యంలో.. సాహూకు అవకాశం వస్తే రావచ్చు. ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రయోజనం పొందవచ్చేనేది కాంగ్రెస్ ఆలోచన. సీఎం రేసులో ఉన్న నాలుగో వ్యక్తి శక్తి నియోజకవర్గం నుంచి గెలుపొందిన చరణ్ దాస్ మహంత్. ఈయన దిగ్విజయ్ సింగ్ మంత్రివర్గంలో మంత్రిగా, కేంద్రంలో మన్మోహన్ సింగ్ కేబినెట్లో సహాయ మంత్రిగా పని చేశారు. -
కమల్‌నాథ్ X సింధియా
భోపాల్: మధ్యప్రదేశ్‌లో అధికారం చేపట్టేదెవరో ఇంకా తేలనప్పటికీ ఆ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. హంగ్ అసెంబ్లీ ఏర్పడినా కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్‌లో అత్యధిక స్థానాలు గెలుచుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ గనుక ఇతర పార్టీలు లేదా స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు పూనుకుంటే ఆ పార్టీ తరఫున ముఖ్యమంత్రి ఎవరవుతారనే దానిపై సందిగ్ధత నెలకొంది. కాంగ్రెస్‌లో యువనాయకుడు, ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా పేరున్న జ్యోతిరాదిత్య సింధియాతోపాటు మరో సీనియర్ నేత కమల్ నాథ్ కూడా కాంగ్రెస్ తరఫున మధ్యప్రదేశ్ సీఎం రేసులో ఉన్నారు. అనుభవజ్ఞుడికే బాధ్యతలు ఇస్తారా? చింద్వారా లోక్‌సభ నియోజకవర్గం నుంచి కమల్‌నాథ్ 9 సార్లు ఎంపీగా గెలిచారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి అత్యంత సన్నిహితుడు. ఓ సారి ఇందిర చింద్వారాకు ఎన్నికల ప్రచారానికి వచ్చి, నా మూడో కొడుకు కమల్‌నాథ్‌ను గెలిపించండి అని ప్రజలను కోరారు. ఇవి చాలు రాజకీయాల్లో కమల్‌నాథ్‌కు ఉన్న అనుభవమేమిటో చెప్పడానికి. ఇప్పుడు అనుభవజ్ఞుడైనందున కమల్‌నాథ్ వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపొచ్చనే అంచనాలున్నాయి. మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు కాస్త ముందు పీసీసీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన కమల్‌నాథ్ సీఎం రేసులో ముందున్నారు. ఎన్నికల ప్రచారాన్ని కమల్‌నాథ్ అంతా తన భుజస్కం«ధాలపైనే నడిపించారు. నిధుల కొరత ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అత్యంత ధనవంతుడైన పార్లమెంటేరియన్ కమలనాథ్కు ఏరికోరి ఎన్నికల వేళ పీసీసీ పగ్గాలు అప్పగించిందనే విశ్లేషణలైతే ఉన్నాయి. కానీ మాస్ ఫాలోయింగ్‌లో ఆయన వెనుకబడే ఉన్నారు. మాస్ ఫాలోయింగ్ జ్యోతిరాదిత్యకే మధ్యప్రదేశ్ సీఎం రేసులో ఉన్న మరో కాంగ్రెస్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా. గ్వాలియర్ రాచ కుటుంబానికి చెందిన సింధియా జనాకర్షణ కలిగిన నేత. గత కొన్నేళ్లుగా గ్రామ స్థాయి పర్యటనలు చేస్తూ తన పట్టు పెంచుకున్నారు. 32 శాతం మంది ప్రజలు జ్యోతిరాదిత్య సీఎం కావాలని కోరుకున్నారంటే ఆయనకు ఏ స్థాయిలో ప్రజల్లో ఆదరణ ఉందో అర్థమవుతోంది. ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా ఆయన మధ్యప్రదేశ్‌లో విస్తృతంగా పర్యటించారు. కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్ వంటి నేతలతో ఎల్లప్పుడూ విభేదిస్తూనే వచ్చారు. కాంగ్రెస్ మాజీ నేత మాధవరావు సింధియా కుమారుడు కావడం, రాహుల్ గాంధీకి కుడి భుజంగా ఉండడం జ్యోతిరాదిత్యకు కలిసొచ్చే అంశాలు. మరో నాలుగు నెలల్లోనే లోక్‌సభ సాధారణ ఎన్నికలున్నందున ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని సింధియాకు కాంగ్రెస్ సీఎంగా అవకాశం ఇవ్వొచ్చని కూడా ప్రచారం జరుగుతోంది. -
కూటమి వస్తే సీఎం రేవంత్ రెడ్డేనా?
సాక్షి, హైదరాబాద్ : సీఎం కుర్చీపై కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు హస్తం పార్టీ నేతల్లో కలకలం రేపుతున్నాయి. ‘ఈరోజు సీఎం కుర్చీలో కేసీఆర్ ఉన్నారు. రేపు అదే కుర్చీలో రేవంత్ రెడ్డి కూడా ఉండొచ్చు’ అంటూ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. దీనిపై పార్టీ సీనియర్ నేతల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. కూటమి అధికారంలోకి వస్తే సీఎం ఎవరు? రేవంత్ రెడ్డెనా? ఎన్నికల కీలక దశలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇదే చర్చకు దారితీశాయి. ఆయన వ్యూహత్మకంగా అన్నారా లేక, ఆయాచితంగా అన్నారా? అనే ప్రశ్న సీనియర్ నేతలను వెంటాడుతోంది. కాగా సీఎం రేసులో ఇదివరకే జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు పలువురు సీనియర్లు కూడా పోటీపడుతున్న విషయం తెలిసిందే. పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి సపోర్టుతో కాంగ్రెస్‌లో కీలక నేతగా ఎదిగిన రేవంత్.. ఆయన పరిచయాలతోనే టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన పలువురు నేతలకు టికెట్లు దక్కించుకోగలిగారు. కొడంగల్‌లోని రేవంత్ నివాసంలో ఆయనను పరామర్శించిడానికి వెళ్లిన ఆజాద్ సీఎం పీఠంపై వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
‘హైకమాండే సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తుంది’
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలలో పొత్తులు, ఎన్నికల అనంతరం అప్పటి పరిస్థితులకు అనుగుణం గా సీఎం అభ్యర్థి ఎంపిక విషయాల్లో పార్టీ హైకమాండే నిర్ణయం తీసుకుంటుందని మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అన్నారు. బుధవారం గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ కాంగ్రెస్‌లో మార్పులుంటాయనే విషయం తనకు తెలియదని చెప్పారు. కేసీఆర్‌కు జాతీయ స్థాయిలో క్రెడిబిలిటీ లేదని, ఆయనను జాతీయ నేతలు నమ్మడం లేదన్నారు. బీజేపీ కూడా ఆయనను అవసరం మేరకు ఉపయోగిం చుకుంటుందే తప్ప పూర్తిగా నమ్మడం లేదన్నా రు. తాను నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచే పోటీచేస్తానని తెలిపారు. డీఎస్ కాంగ్రెస్‌లోకి వస్తున్నారనడం అవాస్తవమన్నారు. -
నేడు యడ్యూరప్ప ప్రమాణం
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయ సస్పెన్స్‌కు తాత్కాలికంగా తెరపడింది. బుధవారం చోటుచేసుకున్న పలు నాటకీయ పరిణామాల అనంతరం.. ప్రభుత్వం ఏర్పాటుచేయాలంటూ బీజేపీ పక్షనేత యడ్యూరప్పను గవర్నర్ వజూభాయ్ వాలా ఆహ్వానించారు. బలనిరూపణకు 15 రోజుల గడువిచ్చారు. ఈలోగా విశ్వాసపరీక్షను ఎదురుకోవాలన్నారు. దీంతో గురువారం ఉదయం 9 గంటలకు యడ్యూరప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మాజీ అటార్నీ జనరల్‌లు సోలీ సొరాబ్జీ, ముకుల్ రోహత్గీలను సంప్రదించిన తర్వాతే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. కాగా, తమకు అవసరమైన బలముందని లేఖలు సమర్పించినా.. బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వటాన్ని కాంగ్రెస్, జేడీఎస్ తీవ్రంగా ఖండించాయి. గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ అర్ధరాత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును తక్షణమే విచారణకు స్వీకరించాలని సీజేఐని కోరింది. అటు, కాంగ్రెస్, జేడీఎస్ రిసార్టు రాజకీయాలను ప్రారంభించాయి. తమ ఎమ్మెల్యేలు చేజారకుండా కాంగ్రెస్, జేడీఎస్‌లు వారందరినీ బెంగళూరు శివార్లలోని ఈగల్టన్ రిసార్టులోకి ప్రత్యేక బస్సుల్లో తరలించాయి. యడ్డీ ఒక్కరే! కాంగ్రెస్–జేడీఎస్ నేతల వ్యతిరేకతలు, హెచ్చరికల మధ్య బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు. దీంతో బీజేపీ పక్షనేత యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా గురువారం ఉదయం 9 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బలనిరూపణలో గెలిచిన తర్వాతే మంత్రులతో ప్రమాణం చేయిస్తారు. యడ్డీ ప్రమాణానికి ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా హాజరుకాకపోవచ్చని సమాచారం. బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తే ఆందోళనలు చేస్తామంటూ కాంగ్రెస్ నేతలు హెచ్చరించిన నేపథ్యంలో రాజ్‌భవన్ చుట్టూ భద్రత కట్టుదిట్టం చేశారు. నగరంలోనూ భద్రతను పటిష్టం చేయాలని పోలీసుశాఖను ఆదేశించినట్లు తెలిసింది. ఉదయం నుంచీ హైడ్రామా! హంగ్ తీర్పుతో రాజుకున్న కన్నడ రాజకీయాల్లో బుధవారం కూడా సస్పెన్స్ కొనసాగింది. ప్రభుత్వం ఎవరు ఏర్పాటుచేస్తారు? గవర్నర్ ఎవరిని ఆహ్వానిస్తారనేదానిపై స్పష్టత రాకపోవడం. బలాన్ని కాపాడుకునేందుకు జేడీఎస్–కాంగ్రెస్ కూటమి, బలం పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేయటంతో పరిస్థితి ఆసక్తికరంగా మారింది. అయితే, సోమవారం గవర్నర్‌కు సమర్పించిన కూటమి ఎమ్మెల్యేల మద్దతు లేఖలో ముగ్గురు ఎమ్మెల్యేల సంతకాల్లేకపోవటం మధ్యాహ్నం కలకలం రేపింది. వీరంతా బీజేపీతోనే ఉన్నారనే ప్రచారం జోరందుకుంది. దీనికి తోడు బీజేపీ కూడా కాంగ్రెస్‌లోని లింగాయత్ ఎమ్మెల్యేలు, జేడీఎస్ కూటమిలోని ఆరుగురు తమతోనే ఉన్నారని లీకులు ఇవ్వడంతో ప్రత్యర్థి కూటమిలో ఆందోళన నెలకొంది. జేడీఎస్‌తో జవదేకర్ చర్చలు! బీజేపీ ఎమ్మెల్యేలంతా బుధవారం ఉదయం పార్టీ కార్యాలయంలో సమావేశమై యడ్యూరప్పను తమపక్ష నేతగా ఎన్నుకున్నారు. అనంతరం, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ బుధవారం ఉదయం జేడీఎస్ అధినేత కుమారస్వామితో రహస్యంగా మంతనాలు జరిపారు. ఇవి విఫలం కావడంతో జేడీఎస్‌లో తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవాలనే ఆందోళన పెరిగింది. కాగా, రాణీ బెన్నూరు స్వతంత్ర ఎమ్మెల్యే శంకర్ కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ సీనియర్‌నేత ఈశ్వరప్పపై కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒక్క ఎమ్మెల్యేను కాపాడుకోలేరా?’ అని మండిపడ్డారు. అయితే, శంకర్ బుధవారం బీజేపీకి మద్దతు ప్రకటించారు. అటు, పలువురు కాంగ్రెస్ నేతలు రాష్ట్ర నాయకత్వంతో టచ్‌లో లేకుండా పోయారన్న వార్తలను ఆ పార్టీ నేత, మాజీ మంత్రి డీకే శివకుమార్ ఖండించారు. వారు ఎక్కడున్నా తమకే మద్దతు తెలుపుతారన్నారు. బీజేపీ ప్రలోభాలు: కుమారస్వామి తమ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభపెడుతోందని జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామి ఆరోపించారు. ‘ఆపరేషన్ కమల్’ను ఎట్టిపరిస్థితుల్లో విజయవంతం కానీయబోమన్నారు. బుధవారం బెంగళూరులోని ఓ ప్రముఖ హోటల్లో జేడీఎస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. కుమారస్వామిని తమ పక్షనేతగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘మా ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తోంది. ఒక్కొక్కరికి రూ.100 కోట్ల నగదుతో పాటు మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేస్తోంది. మేం తలుచుకుంటే బీజేపీ నుంచి రెట్టింపు ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వస్తారు’ అని పేర్కొన్నారు. కాగా సమావేశానికి ఇద్దరు జేడీఎస్ ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. వీరిద్దరూ ఫోన్లోనూ అందుబాటులో లేరని తెలుస్తోంది. కాగా, తను బీజేపీతో చేతులు కలుపుతున్నట్లు వచ్చిన వదంతులను దేవేగౌడ రెండో కుమారుడు, ఎమ్మెల్యే రేవణ్ణ తోసిపుచ్చారు. కుమారస్వామిని జేడీఎస్ పక్ష నేతగా ఎన్నుకున్నామని తెలిపారు. కుమారస్వామి ఆరోపణలను జవదేకర్ ఖండించారు. అంతపెట్టి ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం లేదన్నారు. మోదీ ప్రోద్బలంతోనే తమ ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలు జరుపుతోందని సిద్దరామయ్య అన్నారు. శెట్టర్ గెలుపును నిర్ధారించిన ఈసీ సాక్షి, బళ్లారి: హుబ్లీ–ధార్వాడ సెంట్రల్ నియోజకవర్గంలో బీజేపీ నేత, మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం(ఈసీ) ప్రకటించింది. మంగళవారం ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా పోలైన ఓట్లకు, ఈవీఎంలో నమోదైన ఓట్ల మధ్య స్వల్ప తేడా వచ్చింది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్ నలవాడ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడంతో ఫలితాన్ని నిలిపివేశారు. సమగ్ర పరిశీలన అనంతరం మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత శెట్టర్ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో బీజేపీ బలం 104కు చేరుకుంది. రాజ్‌భవన్‌కు క్యూ కట్టిన పార్టీలు .బుధవారం మధ్యాహ్నం రాజ్‌భవన్ ముందు ఆసక్తికర పరిస్థితులు నెలకొన్నాయి. యడ్యూరప్ప, ఇతర బీజేపీ సీనియర్ నేతలు తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వాలని కోరారు. అతిపెద్ద పార్టీగా నిలిచినందుకు తమకే అవకాశమివ్వాలని కోరారు. మరోవైపు, 2008 తరహాలోనే ఈసారి కూడా తమ ఎమ్మెల్యేలను లాక్కుంటుందనే అనుమానంతో కాంగ్రెస్‌పార్టీ చాలా జాగ్రత్తపడింది. వెంటనే పార్టీ రాష్ట్ర కార్యాలయానికి రావాలని ఆదేశించింది. అనంతరం జేడీఎస్–కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకున్న ఈ పార్టీ నేతలు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే సంఖ్యా బలం తమకుందని ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలంటూ కోరారు. అయితే ఇరు పక్షాలకూ గవర్నర్ ఒకే సమాధానం ఇచ్చారు. రాజ్యాంగ, న్యాయ నిపుణులతో చర్చించి వీలయినంత త్వరగా నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. -
హిమాచల్ కొత్త సీఎంపై నేడు ప్రకటన?
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ కొత్త సీఎం ఎవరనేదానిపై ఆదివారం కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇటీవలే ఎన్నికలు జరిగిన హిమాచల్‌లో బీజేపీ భారీ మెజారిటీతో గెలిచినప్పటికీ ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రేమ్ కుమార్ ధూమల్ ఓటమి పాలవ్వడం తెలిసిందే. కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జై రాం ఠాకూర్ తదితరుల పేర్లు సీఎం రేసులో వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ప్రకటనా లేదు. ఈ నేపథ్యంలో ఆదివారం బీజేపీ కేంద్ర కమిటీ సభ్యుల అధ్యక్షతన ఆ పార్టీ ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రిని ఈ సమావేశంలోనే ప్రకటించే అవకాశం ఉందనీ, అయితే అది ఇప్పుడే తాము కరాఖండీగా చెప్పలేమని కొందరు బీజేపీ సీనియర్ నేతలు అంటున్నారు. సమావేశానికి అధ్యక్షత వహించేందుకు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నరేంద్ర సింగ్ తోమర్లు రేపు హిమాచల్‌కు రానున్నారని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సత్పాల్ సింగ్ చెప్పారు. కాగా, గుజరాత్లో సీఎం విజయ్ రూపానీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఈనెల 26వ తేదీన కొలువుదీరనుంది. -
‘హిమాచల్’కు చేరుకున్న బీజేపీ పరిశీలకులు
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో కొత్త సీఎం అభ్యర్థి ఎంపికపై పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకునేందుకు బీజేపీ కేంద్ర పరిశీలకులు నిర్మలా సీతారామన్, నరేంద్రసింగ్ తోమర్లు గురువారం సిమ్లా చేరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థి ప్రేమ్‌కుమార్ ధుమల్ ఓడిపోవడంతో కొత్త సీఎం అభ్యర్థి ఎంపిక ప్రక్రియను బీజేపీ ప్రారంభించింది. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్ మంగళ్ పాండేతో పాటు ఎమ్మెల్యేలతో వీరు సమావేశం కానున్నారు. దీంతోపాటు బీజేపీ కోర్‌కమిటీ సభ్యులైన ధుమల్, రాష్ట్ర పార్టీ చీఫ్ సత్పాల్æసింగ్, మరో ఐదుగురు ఎంపీలతోనూ పరిశీలకులు భేటీ అవుతారు. ప్రతి ఎమ్మెల్యేను వ్యక్తిగతంగా కలిసి సీఎం అభ్యర్థిపై వారి అభిప్రాయాలను పరిశీలకులు సేకరించనున్నారు. ప్రస్తుతం సీఎం అభ్యర్థిగా కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో పాటు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జైరామ్ ఠాకూర్ పేర్లు బాగా వినిపిస్తున్నాయి. -
ముఖ్యమంత్రి పీఠం ఎవరిది?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ/అహ్మదాబాద్/సిమ్లా: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ విజయం సాధించినా.. ముఖ్యమంత్రుల ఎంపిక ఆ పార్టీ అధినాయకత్వానికి తలనొప్పిగా మారింది. బీజేపీ గెలిస్తే.. గుజరాత్లో ప్రస్తుత సీఎం విజయ్ రూపానీ, హిమాచల్ ప్రదేశ్‌లో ప్రేమ్ కుమార్ ధూమల్‌లు సీఎంలు అవుతారని ఆ పార్టీ ముందుగానే ప్రకటించింది. అయితే గుజరాత్లో అత్తెసరు మెజార్టీతో గెలవడం, హిమాచల్‌లో ఏకంగా సీఎం అభ్యర్థే ఓడిపోవడంతో కొత్త ముఖ్యమంత్రుల ఎంపికపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్ సీఎం రేసులో ప్రస్తుత సీఎం విజయ్ రూపానీతో పాటు కేంద్ర సహాయ మంత్రి మన్సుఖ్ లాల్ మాండవీయ, డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, ప్రస్తుత కర్ణాటక గవర్నర్ వజుభాయ్ వాలా, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ పేర్లు వినిపిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జైరాం ఠాకూర్, అజయ్ జమ్వాల్, కేంద్ర మంత్రి నడ్డాలు రేసులో ఉన్నారు. సీఎం విజయ్ రూపానీ, డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ నేతృత్వంలోనే గుజరాత్ ఎన్నికల్లో తలపడుతున్నామని ప్రచారంలో బీజేపీ చీఫ్ అమిత్ షా స్పష్టం చేశారు. అయితే బీజేపీ అనుకున్నన్ని స్థానాలు గెలవకపోవడంతో.. ముఖ్యమంత్రి మార్పుపై బీజేపీ నాయకత్వం యోచిస్తోందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయంలో ప్రధాని మోదీ, పార్టీ పార్లమెంటరీ బోర్డుదే తుది నిర్ణయమని ఆ వర్గాలు తెలిపాయి. తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న ప్రశ్నకు రూపానీ స్పందిస్తూ.. ‘ఈ ఎన్నికల్లో నా పేరిట బీజేపీ పోరాడింది. అయితే ముఖ్యమంత్రి ఎంపికపై పార్టీ పార్లమెంటరీ బోర్డు తుది నిర్ణయం తీసుకుంటుంది’ అని చెప్పారు. గుజరాత్ అసెంబ్లీలోని మొత్తం 182 స్థానాలకు గాను పటీదార్ వర్గం నుంచి 47 మంది ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆ వర్గానికి చెందిన వారికి సీఎం పదవి ఇవ్వాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పటేల్ వర్గానికి చెందిన కేంద్ర ఉపరితల రవాణా శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ లాల్ మాండవీయ, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ పేర్లు విన్పిస్తున్నాయి. ఈ నిర్ణయంతో హార్దిక్ పటేల్‌కు కూడా చెక్ పెట్టవచ్చనే ఆలోచనలో ఉంది. సీఎం రేసులో పటేల్ వర్గానికి చెందిన సీనియర్ నేత, కర్ణాటక గవర్నర్ వజుభాయ్‌వాలా పేరు కూడా వినిపిస్తోంది. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ పేరు తెరపైకి వచ్చినా.. పార్టీ వర్గాలు మాత్రం స్పందించలేదు. నేడు గుజరాత్‌కు జైట్లీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని పరిశీలక బృందం నేడు గుజరాత్‌కు వెళ్లనుంది. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో విస్తృతంగా చర్చించి ముఖ్యమంత్రి పేరుపై ఏకాభిప్రాయానికి ప్రయత్నించనుంది. అనంతరం ఎమ్మెల్యేల నిర్ణయాన్ని బీజేపీ పార్లమెంటరీ బోర్డుకు తెలియచేస్తుంది. కాగా గుజరాత్లో డిసెంబర్ 25న కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం ఉండొచ్చని పార్టీ వర్గాల సమాచారం. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ పుట్టినరోజు కావడంతో ఆ రోజునే ప్రమాణ స్వీకారం ఉంటుందని భావిస్తున్నారు. హిమాచల్‌లో జైరామ్ ఠాకూర్ ముందంజ హిమాచల్ ప్రదేశ్‌లో సీఎం అభ్యర్థి ప్రేమ్ కుమార్ ధూమల్ ఓటమితో సీఎం ఎంపిక పార్టీ నాయకత్వానికి ఇబ్బందిగా మారింది. ధూమల్ ఓటమితో ఆయనకు దారులు పూర్తిగా మూసుకుపోయాయి. హిమాచల్‌లో 35% ఓటర్లు రాజ్‌పుత్ వర్గానికి చెందిన వారే. ఈ నేపథ్యంలో ఆ వర్గానికే చెందిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జైరామ్ ఠాకూర్ సీఎం రేసులో ముందు వరుసలో ఉన్నారు. మరో రాజ్‌పుత్ నేత అజయ్ జమ్వాల్ పేరు కూడా విన్పిస్తోంది. కేంద్ర అధినాయకత్వంతో సన్నిహిత సంబంధాలున్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు కూడా అవకాశముందని భావిస్తున్నారు. అయితే ఎమ్మెల్యేల నుంచే సీఎం అభ్యర్థిని ఎంపిక చేయవచ్చని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నడ్డా బ్రాహ్మణ వర్గ నేత కావడంతో ఆయనకు అవకాశం లేదని చెబుతున్నారు. అలాగే ఏడుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన మొహిందర్ సింగ్, మరో సీనియర్ నేత రాజీవ్ బిందాల్, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు సురేశ్ భరద్వాజ్, మరో నేత క్రిష్ణన్ కపూర్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ రాష్ట్రానికి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నరేంద్ర సింగ్ తోమర్‌లను పార్టీ పరిశీలకులుగా బీజేపీ ప్రకటించింది. -
సీఎం అభ్యర్ధి ధుమాల్ ఓటమి
-
‘గుజరాత్ సీఎం అభ్యర్థి అహ్మద్ పటేల్’
సాక్షి, సూరత్ : గుజరాత్ సీఎంగా అహ్మద్ పటేల్‌ను అత్యున్నత పదవిలో నిలిపేందుకు కాంగ్రెస్‌కు ఓటేయాలని ముస్లింలకు పిలుపు ఇస్తూ సూరత్‌లోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. అహ్మద్ పటేల్ సీఎం అభ్యర్థి అంటూ వెలిసిన పోస్టర్లు కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారడంతో అహ్మద్ పటేల్ స్పందించారు. తాను కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని కాదని, భవిష్యత్‌లోనూ సీఎం రేసులో ఉండబోనని స్పష్టం చేశారు. ఓటమి భయంతో బీజేపీ దుష్ప్రచారం సాగిస్తోందని ఆరోపించారు. పార్టీ చీఫ్‌గా ఎన్నికవనున్న రాహుల్ గాంధీ గుజరాత్ ప్రచార బరిలో సర్వం తానై ముందుండి నడిపిస్తున్నారు. గుజరాత్ సీఎం అభ్యర్థిగా ఆ పార్టీ ఏ ఒక్కరి పేరునూ ఇంతవరకూ ప్రతిపాదించలేదు. తాజా సర్వేల్లో కాంగ్రెస్ బలం పుంజుకుందని వెల్లడవుతుండటంతో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రంలో బీజేపీని మట్టికరిపిస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాగా, గుజరాత్లో 1998 నుంచి బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. -
‘కొడుకుకే కిరీటం’
సాక్షి, పాట్నా: తదుపరి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడు తేజస్వి యాదవ్ ఆర్జేడీ సీఎం అభ్యర్థిగా పార్టీని ముందుండి నడిపిస్తారని ఆ పార్టీ చీఫ్ లాలూ ప్రసాద్ శుక్రవారం ప్రకటించారు.తేజస్వి నాయకత్వంలో ఆర్జేడీ 2020లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని లాలూ స్పష్టం చేశారు. పార్టీ సీనియర్ నేతలు అబ్ధుల్ బరి సిద్ధిఖి, రఘవంశ్ ప్రసాద్ సింగ్‌లతో భేటీ అనంతరం లాలూ ఈ ప్రకటన చేశారు. తేజస్వి పార్టీకి అందిస్తున్నసేవలను ఈ సందర్భంగా లాలూ ప్రశంసించారు. ఈనెల 9న 28వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన తేజస్వి ప్రస్తుతం బీహార్ అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్నారు.అయితే తేజస్వి సీఎం అభ్యర్థిత్వంపై పార్టీలో స్పష్టత రాలేదని పార్టీవ ర్గాలు పేర్కొనడం గమనార్హం. అంతకుముందు ఆర్జేడీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్ పుర్వే బీహార్ తదుపరి సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్ పేరును ప్రతిపాదించగా, సిద్ధికీ, సింగ్‌లు పుర్వే అభిప్రాయంతో విభేదించడంతో పార్టీలో ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. -
సీఎం ఎవరు? బాహుబలి ఎవరు? కాంగ్రెస్ అద్వానీ ఎవరు?
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవిపై కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికరమైన చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై సీఎల్పీ నాయకుడు జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీ అద్వానీలాంటివాడినని, ముఖ్యమంత్రి పదవిని అడగబోనని చెప్పారు. కానీ, అందరూ కోరితే సీఎం పదవి చేపట్టేందుకు సిద్ధం అంటూ తన మనస్సులోని మాటను చెప్పకనే చెప్పేశారు. మంగళవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని ఎవరు గెలిపిస్తే.. వారే బాహబలి అని అన్నారు. పార్టీలో చేరగానే బాహుబలి కారంటూ పరోక్షంగా రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలోనూ బాహుబలి ఉన్నాడని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలను ఆయన గట్టెక్కిస్తాడని హస్తం శ్రేణుల్లో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీలో కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైనా జానారెడ్డి విమర్శలు చేశారు. అసెంబ్లీలో సర్కారు ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, వాయిదా తీర్మానాలను తిరస్కరించాలని బీఏసీ ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం కాదని అన్నారు. 'ప్రభుత్వం సభలో మా గొంతు నొక్కుతోంది. మీడియా కూడా ఆవేదనను ప్రజలకు తెలుపడం లేదు. ఇక మేం ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వంపై పోరాడుతాం' అని జానారెడ్డి అన్నారు. -
బీజేపీ హిమాచల్ సీఎం అభ్యర్థిగా ధుమల్
సాక్షి,సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో అధికార పగ్గాలు చేపట్టేందుకు తహతహలాడుతున్న బీజేపీ సీఎం అభ్యర్థిపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రేమ్ కుమార్ ధుమల్‌ను తమ పార్టీ తరపున సీఎం అభ్యర్థిగా మంగళవారం ప్రకటించింది. సీనియర్ నేత ధుమల్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించినట్టు బీజేపీ చీఫ్ అమిత్ షా ట్వీట్ చేశారు. ప్రేమ్ కుమార్ ధుమల్ నేతృత్వంలో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోరాడుతుందని ట్విట్టర్లో అమిత్ షా పేర్కొన్నారు. ధుమల్ నాయకత్వంలో భారీ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వస్తుందని షా ధీమా వ్యక్తం చేశారు. హిమాచల్‌లో బీజేపీ విజయం సాధిస్తే సీనియర్ నేత సీఎం పగ్గాలు చేపడతారని అంతకుముందు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. బీజేపీ సీఎం అభ్యర్థులుగా ప్రేమ్ కుమార్ ధుమల్తో పాటు కేంద్ర మంత్రి జేపీ నడ్డా పోటీ పడ్డారు. హిమాచల్ ప్రదేశ్‌లో నవంబర్ 9న ఎన్నికలు జరగనుండగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం డిసెంబర్ 18న ఇరు రాష్ర్టాల ఓట్ల లెక్కింపు చేపడతారు. -
హిమాచల్ సీఎం అభ్యర్థి వీరభద్ర సింగ్: రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రస్తుత సీఎం వీరభద్ర సింగ్‌ను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అధికారికంగా ప్రకటించారు. హిమాచల్‌ప్రదేశ్ మండీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శనివారం ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో మాట్లాడుతూ.. నిరుద్యోగం, నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి అంశాల్లో మోదీ ప్రభుత్వ విధానాల్ని తప్పుపట్టారు. ‘మీరు ఆరు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఏడోసారి కూడా సీఎం అవుతారని నేను గట్టిగా చెబుతున్నా. మొత్తం కాంగ్రెస్ పార్టీ మీ వెంట ఉంది’ అని ర్యాలీలో వీరభద్ర సింగ్‌నుద్దేశించి రాహుల్ అన్నారు. అయితే రాహుల్ నిర్ణయం హిమాచల్ కాంగ్రెస్‌లో చీలికకు కారణమవుతుందా?, అధిష్టానం నిర్ణయాన్ని సింగ్ వ్యతిరేకులు ఆమోదిస్తారా? లేదా? అన్నది తెలియాలంటే వేచిచూడాల్సిందే. వీరభద్రసింగ్‌పై పీసీసీ అధ్యక్షుడు సుఖ్విందర్ సింగ్ సుక్కు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అయితే, అధిష్టానం బుజ్జగింపులతో సింగ్ దిగొచ్చినట్లు తెలుస్తుంది. -
మా ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనే: రాహుల్
ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచార పర్వం పూర్తిస్థాయిలో వేడెక్కింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పంజాబ్‌లో ప్రచారం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఇన్నాళ్లుగా అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న విషయమై కొనసాగుతున్న సస్పెన్స్‌కు ఆయన తెరదించారు. అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి అయ్యి తీరుతారని కుండ బద్దలు కొట్టారు. రైతులు బాదల్ (మేఘాలు) చూస్తే సంతోషపడతారని, కానీ పంజాబ్‌లో మాత్రం బాదల్ (సీఎం) నీళ్లు ఇవ్వడం లేదని చమత్కరించారు. 'అంతా నీదే' అని గురునానక్ అంటారు గానీ, అకాలీదళ్ మాత్రం 'అంతా నాదే' అంటుందని ఎద్దేవా చేశారు. నాలుగేళ్ల క్రితం తాను వచ్చినప్పుడు పంజాబ్ యువతలో 70 శాతం మంది డ్రగ్స్ బారిన పడ్డారని చెప్పానని, అప్పట్లో బాదల్ కుటుంబ సభ్యులు తనను వెక్కిరించారని, కానీ ఇప్పుడు మొత్తం పంజాబ్ అంతా తాను చెప్పిందే చెబుతోందని రాహుల్ అన్నారు. ప్రతి పరిశ్రమలోను, వ్యాపారంలోను ఒక్క కుటుంబ ఏకస్వామ్యం నడుస్తోందని మండిపడ్డారు. పంజాబ్‌లో ఎక్కడకు వెళ్లాలన్నా బాదల్ బస్సులలోనే వెళ్లాల్సి ఉంటుందని విమర్శించారు. తానిక్కడ కేవలం రెండు మూడు విషయాలు మాత్రమే చెబుతానని, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా తాము ఒక చట్టం చేస్తామని.. ఆ తర్వాత కనీసం డ్రగ్స్ అన్న ఆలోచన వచ్చినా వణుకు పుడుతుందని చెప్పారు. పంజాబ్‌ను ఎవరు గాయపరిచారో వాళ్లను తాము జైల్లో వేసి చూపిస్తామని, పంజాబ్ కోసమే తమ పోరాటం ఉంటుందని రాహుల్ తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ తాను అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు చెబుతారని, అలాంటప్పుడు ఆయన అకాలీదళ్‌ను ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. పంజాబ్‌ను అకాలీదళ్ సర్వనాశనం చేసిందని చెప్పారు. -
‘ఎన్నికల తర్వాతే సీఎం ఎవరనేది చెప్తాం’
గోవా: ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే బీజేపీ గోవాలో జోరు చూపించనుంది. ఎన్నికల తర్వాత గోవా ముఖ్యమంత్రి ఎవరనే విషయం తేలుస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మంగళవారం స్పష్టం చేశారు. దీంతో గతంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గతంలో చెప్పిన మాటల్ని అమిత్ షా నిజం చేసినట్లయింది. గతంలో గోవా పర్యటనకు వచ్చిన నితిన్ గడ్కరీ మాట్లాడుతూ గోవాకు ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచే వస్తాడని, అయితే, ఆయన ఎవరనే విషయం చెప్పబోమని తెలిపారు. దీంతో మరోసారి ప్రస్తుత రక్షణ శాఖ మంత్రిగా ఉన్న మనోహర్‌పారికర్‌ను ముఖ్యమంత్రిగా పంపిస్తారని ఊహాగానాలు వచ్చాయి. వాటినే అమిత్ షా తాజాగా ఆమోదించినట్లు తెలుస్తోంది. -
పంజాబ్ సీఎం అభ్యర్థిగా కేజ్రీవాల్?
-
పంజాబ్ సీఎం అభ్యర్థిగా కేజ్రీవాల్?
ఇప్పటివరకు పెద్దగా చడీ చప్పుడు లేని పంజాబ్ ఎన్నికల రంగం ఒక్కసారిగా వేడెక్కింది. అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రి కావాలనుకుని ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేయాలంటూ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా పిలుపునిచ్చారు. మొహాలీలో జరిగిన ఓ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో కేజ్రీవాల్ పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగుతారా అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. పంజాబ్‌లో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉన్నా, ప్రత్యామ్నాయం ఎవరన్న ప్రశ్న గట్టిగా ఉంది. కాంగ్రెస్ పార్టీ మీద జాతీయ స్థాయిలోనే నమ్మకం కొరవడిన ప్రజలు.. అటు పంజాబ్‌లో కూడా వాళ్లు ఇంతకుముందు చేసింది, తర్వాత చేసేది ఏమీ లేదనే భావిస్తున్నారు. అందువల్ల ఆ పార్టీని సరైన ప్రత్యామ్నాయంగా భావించడం లేదు. ఆమ్ ఆద్మీపార్టీ పంజాబ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి మీద కూడా అవినీతి ఆరోపణలు రావడంతో, ఆ పార్టీ పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ఊపు తేవాలనే అన్నారో, లేదా నిజంగానే కేజ్రీవాల్ పంజాబ్ వెళ్తారో గానీ మనీష్ సిసోదియా వ్యాఖ్యలు కలకలం రేపాయి. -
వీడిన ఎస్పీ సంక్షోభం అఖిలేశే మళ్లీ సీఎం
-
అఖిలేశే మా ముఖ్యమంత్రి అభ్యర్థి
ములాయం సింగ్ యూ టర్న్ • పార్టీలో అంతా కలిసే ఉంటాం.. కుటుంబంలో విభేదాల్లేవని స్పష్టీకరణ • నేడు అఖిలేశ్–ములాయం ప్రత్యేక భేటీ! • యూపీలో పార్టీ అభ్యర్థుల ఎంపికపై చర్చించే అవకాశం లక్నో/సాక్షి,న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలో నెలకొన్న సంక్షోభానికి తనే స్వయంగా ముగింపు పలకాలని పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ నిశ్చయించారు. పార్టీ గుర్తుపై ఎన్నికల సంఘం సమక్షంలో వాదోపవాదాలు పూర్తయి.. తీర్పుపై ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో సోమవారం రాత్రి అనూహ్య ప్రకటన చేశారు. యూపీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరపున సీఎం అభ్యర్థిగా కుమారుడు అఖిలేశ్ పేరును ప్రకటించారు. ‘ఎస్పీ సీఎం అభ్యర్థి అఖిలేశ్ యాదవ్. ఇకపై పార్టీలో అందరం కలిసే ఉంటాం. మాలో ఎవరికీ భేదాభిప్రాయాల్లేవు’ అని స్పష్టం చేశారు. ‘మేమంతా ఒకటేనని చెప్పేందుకు త్వరలోనే యూపీలో పర్యటిస్తాం. ఎస్పీలో నెలకొన్న అనిశ్చితికి చరమగీతం పాడతాం’ అని ములాయం వెల్లడించారు. తనే పార్టీ చీఫ్‌నని అభ్యర్థులకు తనే బీఫారాలిస్తానంటూ సాయంత్రం ఢిల్లీలో ప్రకటించిన కొద్ది గంటల్లోనే.. ఈ ప్రకటన చేయటం రాజకీయంగా ఆసక్తి కలిగించింది. కాగా, మంగళవారం ఉదయం అఖిలేశ్ – ములాయం భేటీఅయ్యే అవకాశాలున్నాయి. అ తర్వాతేతదుపరి అంశాలపై స్పష్టత రానుంది. ఢిల్లీలో కాదని.. లక్నోలో సై అని.. ములాయం సింగ్ యాదవ్ సోమవారం సాయంత్రం వరకూ పార్టీకి తానే జాతీయాధ్యక్షుడినని.. పార్టీపై సర్వహక్కులూ తనవేనన్నారు. కేంద్ర ఎన్నికల అధికారులను కలిసి తనే పార్టీ చీఫ్‌నని.. సైకిల్ గుర్తు తనకే కేటాయించాలని కోరారు. ‘ఒక వ్యక్తి’ కారణంగానే పార్టీలో అంతా జరుగుతోందని.. పరోక్షంగా రాంగోపాల్‌పై విమర్శలు చేశారు. అంతటితో ఆగకుండా రాంగోపాల్ యాదవ్‌ను పార్టీ రాజ్యసభ పక్ష నాయకుడి పదవినుంచి తప్పించాలంటూ రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీకి లేఖ రాశారు. కానీ తిరుగుప్రయాణమై లక్నోలో కాలు పెట్టగానే.. అఖిలేశ్ వర్గానికి రాజీ ఫార్ములాను ప్రతిపాదించారు. మొన్నటివరకు ఎన్నికలయ్యాకే సీఎం అభ్యర్థిని పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని.. తెగేసి చెప్పిన ములాయం.. ఇంత హఠాత్తుగా నిర్ణయం మార్చుకోవటం విశేషం. తర్వాత ఎలా?: ఎస్పీ సీఎం అభ్యర్థిగా అఖిలేశ్ పేరును ప్రకటించటంతోనే యాదవ కుటుంబంలో వివాదం సమసిపోలేదు. నామినేషన్ల సమయం సమీపిస్తుండటంతో అభ్యర్థుల ఎంపికపై మళ్లీ పేచీ పెట్టకుండా ములాయం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే.. అఖిలేశ్‌తో ములాయం రాజీ కుదుర్చుకున్నా శివ్‌పాల్, అమర్‌సింగ్‌ల పాత్ర తగ్గుతుందనుకోవటానికి వీల్లేదు. దీంతో ఎన్నికలు సమీపిస్తున్న కీలకమైన తరుణంలో అఖిలేశ్, శివ్‌పాల్ వర్గాలను ములాయం ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది ఆసక్తికరంగా మారనుంది. మీ నాన్న మొండి వాడమ్మా! లక్నోలో అఖిలేశ్, ములాయం ఇళ్లు పక్కపక్కనే ఉంటాయి. దీంతో అఖిలేశ్, డింపుల్‌ల పిల్లలు తాతయ్య ఇంట్లోకి వచ్చి వెళ్లటం సాధారణమే. పార్టీలో ఆధిపత్యపోరు జరుగుతున్నా పెద్దోళ్లు.. పిల్లలపై ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. దీంతో అఖిలేశ్ కూతుళ్లు ఆదితి (15), టీనా (10) తాత (ములాయం) ఇంట్లోకి వెళ్లి ఆడుకుని వస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తనను కలిసేందుకు వచ్చిన టీనాతో ములాయం సరదాగా ‘మీ నాన్న చాలా మొండి వాడమ్మా!’ అని అన్నారు. ఈ సందేశాన్ని టీనా నేరుగా అఖిలేశ్‌కు చేరవేసింది. దీనికి అఖిలేశ్ స్పందిస్తూ.. ‘అవును నేను మొండి వాడినే’ అని నవ్వుతూ సమాధానమిచ్చారు. -
నేను సీఎం అభ్యర్థిగా తప్పుకుంటా!
లక్నో: సీఎం అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీతో పొత్తుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమని ఆ పార్టీ సీఎం అభ్యర్థి షీలా దీక్షిత్ స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగరా మోగిన నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్-ఎస్పీల మధ్య ఎన్నికల పొత్తు కుదిరితే.. పార్టీ సీఎం అభ్యర్థిగా తాను తప్పుకొనేందుకు సిద్ధమని అన్నారు. హిందుత్వ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని ఎదుర్కొనేందుకు లౌకికవాద భావసారూప్యమున్న పార్టీలు ఏకం కావాల్సిన అవసరముందని ఆమె అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్- ఎస్పీ మధ్య పొత్తు కుదుర్చుకునేందుకు ఇప్పటికే తెరవెనుక మంతనాలు కొనసాగుతున్నట్టు సమాచారం. అయితే, అధికార సమాజ్‌వాదీ పార్టీలో కుటుంబ అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరడంతో ఈ పొత్తు చర్చలు ఒక కొలిక్కి రాలేదని సమాచారం. ఉత్తరప్రదేశ్‌లో పెద్దగా రాజకీయ అవకాశాలు లేని కాంగ్రెస్ పార్టీ ఎస్పీతో పొత్తు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ పొత్తు ద్వారా కనీసం వంద సీట్లైనా అడుగాలని ఆ పార్టీ కోరుకుంటోంది. -
షీలాదీక్షిత్ ఎవరి ఎంపికో తెలుసా?
ఎన్నికల వ్యూహకర్తగా ప్రసిద్ధిచెందిన ప్రశాంత్ కిషోర్ రచించిన స్క్రీన్ ప్లే ప్రకారమే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన కొనసాగుతోందని స్పష్టంగా చెప్పవచ్చు. ఆయన చేసిన ప్రతిపాదన మేరకే యూపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను రంగంలోకి దింపడం అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. ఓ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందే పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ సంప్రదాయం కాదు. కానీ ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పట్టుబట్టారు. బ్రాహ్మణ వర్గం నుంచే సీఎం అభ్యర్థి ఉండాలని కూడా సూచించారు. ఆయన మొదటి ప్రాధాన్యం ప్రియాంక గాంధీకాగా, రెండో ప్రాధాన్యం షీలా దీక్షిత్. రాహుల్‌కు పార్టీలో ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ప్రియాంకను రంగంలోకి దించడం పార్టీ అధిష్టానానికి ఏ మాత్రం ఇష్టం లేదు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అవినీతి ఆరోపణలు ఉన్నా.. షీలా దీక్షిత్‌ను రంగంలోకి దింపక తప్పలేదు. ముందుగా పార్టీ సీనియర్ నాయకుల నుంచి రాజ్‌బబ్బర్ పేరు తెరమీదకు రాగా, పార్టీలో ప్రశాంత్ కిషోర్ వ్యూహరచన కూడా సాగడం లేదనే వదంతులు వచ్చాయి. యూపీలో ఉన్న 12 శాతం బ్రాహ్మణ ఓటర్లను ఆకట్టుకోవాలంటే షీలాదీక్షిత్‌ను రంగంలోకి దించక తప్పదనే ప్రశాంత్ కిషోర్ వాదనతో కాంగ్రెస్ అధిష్ఠానం ఏకీభవించింది. యాదవులు, జాట్లకు వ్యతిరేకంగా బ్రాహ్మణులను ఆకర్షించక తప్పని పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. యాదవులు, దళితుల్లో ఇప్పటికే ఎస్పీ, బీఎస్పీ పార్టీలకు పట్టు ఎక్కువగా ఉంది. బీజేపీని ప్రస్తుతం రాష్ట్రంలో వ్యతిరేకిస్తున్న బ్రాహ్మణవర్గాన్ని ఆకర్షించడమే సులువైన మార్గమన్నది కిషోర్ అభిప్రాయం. పైగా షీలా దీక్షిత్ యూపీ కోడలు కూడా. ఆమె మామ ఉమా శంకర్ దీక్షిత్ యూపీలో పేరుపొందిన బ్రాహ్మణ నాయకుడు. ఓ వ్యక్తిపైనే ప్రధానంగా ప్రచారాన్ని కేంద్రీకరించి పనిచేయడం ప్రశాంత్ కిషోర్‌కు అలవాటు. ఆయన 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీపైనా, ఆ తర్వాత బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్‌పైనా దృష్టిని కేంద్రీకరించే ప్రచారవ్యూహాన్ని అమలు చేసి.. విజయం సాధించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ఈసారి కూడా ప్రచారం చేయనున్నా.. పార్టీ ప్రచార బాధ్యతలను ఆమెకు పూర్తిగా అప్పగించడం లేదు. ఇదివరకు రాహుల్ గాంధీ విషయంలో చేసిన పొరపాటును ప్రియాంక గాంధీ విషయంలో చేయరాదన్నది పార్టీ అధిష్టానం ఉద్దేశం. అందుకనే పార్టీ ఈసారి అన్ని సామాజిక వర్గాల నుంచి ఎంపికచేసిన నాయకులకు పార్టీ ప్రచార బాధ్యతలను అప్పగించింది. ఫలితం ఎలా ఉంటుందో చూడాలని స్థానిక పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తుండగా, కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైతే ఆ పరాభవం బాధ్యతను ప్రియాంక గాంధీ పంచుకోవాల్సిన అవసరం లేకుండా పోయిందని ఆమె మద్దతుదారులు వ్యాఖ్యానిస్తున్నారు. -
షీలాకు యూపీ బాధ్యతలు?
సీఎం అభ్యర్థిగా ప్రకటించే యోచనలో కాంగ్రెస్ న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సీనియర్ నేత షీలా దీక్షిత్‌ను ప్రకటించే అంశంపై కాంగ్రెస్ తీవ్ర సమాలోచనలు చేస్తోంది. పంజాబ్ రాష్ట్ర పార్టీ ఇన్చార్జిగా నియమించే అవకాశాలపై కూడా ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ పరిణామాల మధ్య షీలాగురువారం పార్టీ చీఫ్ సోనియాగాంధీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దేశంలోనే కీలకమైన యూపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గతంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా ఉన్న బ్రాహ్మణుల్ని ఆకర్షించాలంటే సీఎం అభ్యర్థిగా ఆ వర్గానికి చెందినవారినే ప్రకటించాలని ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇప్పటికే తేల్చిచెప్పారు. షీలా పేరును హైకమాండ్‌కు ఆయనే సూచించినట్లు సమాచారం. దీంతో మూడు సార్లు ఢిల్లీ సీఎంగా పనిచేసిన షీలాకు యూపీ నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. మందిర్-మండల్ రాజకీయాల అనంతర పరిస్థితుల్లో అప్పటి వరకూ కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా ఉన్న బ్రాహ్మణులు బీజేపీ వైపు మళ్లారు. 2012 ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో వారు బీఎస్పీకి మద్దతిచ్చారు. ఇప్పుడు ఆ అవకాశాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ యత్నిస్తోంది. యూపీ మధ్య, తూర్పు ప్రాంతంలోని అనేక సీట్ల ఫలితాల్ని వీరే ప్రభావితం చేస్తున్నారు. పంజాబ్ ఇన్చార్జిగా తెరపైకి దీక్షిత్ పేరు మరోవైపు షీలాను పంజాబ్ కాంగ్రెస్ ఇన్చార్జిగా నియమిస్తారనే వార్తలూ వినిపిం చాయి. సిక్కు అల్లర్ల ఆరోపణలతో ఇన్చార్జి కమల్‌నాథ్ తప్పుకోవడం తెలిసిందే. ఆ రాష్ట్రంతో సంబంధాలున్న షీలాను ఇన్చార్జిగా నియమిస్తే అధికారంలోకి రావడం సులభమని కాంగ్రెస్ ఆలోచన. కాగా, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ను యూపీలో పార్టీ అధినేతగా చేస్తారన్న వార్తలను గులాం నబీ ఆజాద్ తోసిపుచ్చారు. -
సీఎం రేసులో లేను: కేంద్ర మంత్రి
మథుర: తాను ముఖ్యమంత్రి రేసులో లేనని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా ప్రకటించారు. మథుర రైల్వేస్టేషన్ వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలలో బీజేపీ తరఫున సీఎం అభ్యర్థిగా తాను పోటీ చేయడం లేదని తనపై వస్తున్న వార్తలను ఈ సందర్భంగా ఆయన ఖండించారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తాను ఉన్న పొజిషన్ పై చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పారు. ప్రజలకు సేవ చేయడానికి పార్టీ తనకు అవకాశం ఇచ్చిందని, నిజాయతీగా వ్యవహరించి తాను చేయాల్సింది చేస్తానన్నారు. సీఎం అభ్యర్థిగా మీ పేరు వినిపిస్తుందని మీడియా ప్రశ్నించగా, తాను రేసులో లేనని వెల్లడించారు. మథుర రైల్వే స్టేషన్ ను ప్రపంచంలోనే అత్యుత్తమ స్టేషన్ గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్ విషయంపై ఆరు నెలల కిందటే నిర్ణయం తీసుకుందని మంత్రి మనోజ్ సిన్హా పేర్కొన్నారు. -
రాహుల్ కన్నా ప్రియాంకే బెటర్
వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రియాంక గాంధీని ప్రకటించాలని రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు డిమాండ్ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడే మే 19వ తేదీకన్నా ముందే ప్రియాంకగాంధీ పేరును ఖరారు చేసి ప్రకటించాలని వారు కోరుతున్నారు. తొలుత రాహుల్ గాంధీ గానీ, ప్రియాంక గాంధీ గానీ పోటీ చేయాలని పట్టుబట్టిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎందుకు ప్రియాంకనే కోరుకుంటున్నారన్నది తాజా ప్రశ్న. గతంలో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ప్రచార సారథ్యాన్ని స్వీకరించిన రాహుల్ గాంధీ పార్టీని విజయపథాన నడిపించలేక పోయారని, ఆయన పేరు వెంట ఓటమి వెన్నంటే వస్తోందని స్థానిక పార్టీ నాయకులు భావిస్తున్నారు. రాహుల్ కన్నా ప్రియాంక పట్లనే ప్రజల్లో ఎక్కువ అభిమానం ఉంటుందని, ఆమె ప్రచారం కారణంగా ఓడిపోయిన వారు లేరని వారంటున్నారు. పైగా సోనియా గాంధీ వారసుడిగా పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సిన రాహుల్ గాంధీని రాష్ట్ర రాజకీయాల స్థాయికి దిగజార్చలేమని కూడా వారంటున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికల నాటికి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయవచ్చని, తద్వారా దేశవ్యాప్తంగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని దీటుగా ఎదుర్కోవచ్చని పార్టీ అధిష్ఠానానికి నచ్చజెప్పేందుకు రాష్ట్ర పార్టీ నాయకత్వం ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో అగ్రవర్ణాల వారు, ముఖ్యంగా బ్రాహ్మణులు ఎక్కువ ఉండటం ప్రియాంక గాంధీకి కలిసొచ్చే అంశం అని స్థానిక కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని బ్రాహ్మణుల్లో 31 శాతం మంది కాంగ్రెస్ పార్టీకే ఓటేశారని 'సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్' లెక్కలు తేల్చాయి. ఒక్క సామాజిక గ్రూప్ నుంచి ఇంత మంది కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి. 31 శాతం బ్రాహ్మణుల ఓట్ల ద్వారా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం నుంచి 21 లోక్‌సభ స్థానాలను గెలుచుకొంది. 2007లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి 19 శాతం మంది బ్రాహ్మణులు ఓటేశారు. రాష్ట్రం మొత్తం జనాభాలో 20 శాతం మంది అగ్రవర్ణాల వారు ఉన్నారు. వారిలో 9 శాతం మంది బ్రాహ్మణులు. ఈసారి ప్రియాంక గాంధీని బరిలోకి దించితే వారంతా కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారని రాష్ట్ర పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సాధారణంగా భారతీయ జనతా పార్టీకి ఓటేసే అగ్రవర్ణాల వారు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఓబీసీ సంక్షేమ నినాదం ఎత్తుకోవడం పట్ల ఆగ్రహంతో ఉన్నారని, ఓబీసీకి చెందిన కేశవ్ ప్రసాద్ మౌర్యాను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని చేయడం కూడా వారికి మింగుడు పడడం లేదని కాంగ్రెస్ పార్టీ వారు భావిస్తున్నారు. -
కెప్టెన్‌గానే..
ప్రజా సంక్షేమ కూటమికి ‘కెప్టెన్’ చేకూరాడు. వైగో నేతృత్వంలో సాగుతున్న కూటమిలో డీఎండీకే చేరడం ద్వారా విజయకాంత్ ఒంటరి పోరుకు తెరదించాడు. అలాగే పొత్తులు పెట్టుకున్నా సీఎం అభ్యర్థిగా మాత్రమే ఎన్నికల బరిలోకి దిగుతాననే పంతాన్ని కెప్టెన్ ఎట్టకేలకూ నెగ్గించుకున్నాడు. చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు, ఎత్తులతో రాజకీయపార్టీల వ్యూహాలన్నీ ఒక కొలిక్కివచ్చినా డీఎండీకే మాత్రం నాన్చుడు ధోరణిని అవలంభించింది. ఇదిగో వస్తా, అదిగో చె బుతా అంటూ డీఎంకే, బీజేపీలను ఊరిం చి ఉడికించింది. చివరకు డీఎండీకే ఒంటి రి పోరుకు సిద్ధపడినట్లు ఇటీవల విజయకాంత్ ప్రకటించాడు. రాజకీయపార్టీలన్నీ విజయకాంత్ ప్రకటనతో నివ్వెరపోయాయి. డీఎండీకేపై బీజేపీ ఆశలు వదులుకోగా డీఎంకే మాత్రం ‘వస్తాడు నా రాజు ఈరోజు’ అంటూ సోమవారం వర కు పాటలు పాడుకుంటూ ఆశతో ఎదురు చూసింది. ఖంగు తినిపించిన విజయకాంత్: రాజకీయ నిర్ణయాల్లో ఆచీతూచీ అడుగేస్తున్నట్లుగానే వ్యవహరిస్తూ పొత్తు లు, కూటములపై జాప్యం చేస్తూ వచ్చిన విజయకాంత్ ప్రజా సంక్షేమ కూటమిలో చేరడం ద్వారా అందరినీ ఖంగుతినిపించాడు. కూటమి నేత వైగో, విజయకాంత్ సూలైలోని ఒక స్నేహితుని ఇంటిలో రెండురోజుల క్రితం కలుసుకున్నారు. విజయకాంత్ సతీమణి ప్రేమలత, బావమరిది సుదీష్లు కెప్టెన్ వెంట ఉన్నారు. ఈ సమావేశానికి కొనసాగింపుగా వైగో సోమవారం కూటమినేతలో మరోసారి సమావేశం అయ్యారు. దీంతో డీఎండీకేతో పొత్తు కుదిరింది. మంగళవారం ఉదయం 9.45 గంటలకు విజయకాంత్, సుదీష్ తదితర ముఖ్యనేతలు కోయంబేడులోని పార్టీ కార్యాలయానికి వెనుకవైపు ద్వారం గుండా చేరుకున్నారు. 9.50 గంటలకు వైగో, వీసీకే అధ్యక్షులు తిరుమావలవన్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జీ రామకృష్ణన్ వచ్చి విజయకాంత్‌తో చర్చలు జరిపారు. సుహృద్భావ వాతావరణంలో చర్చలు ముగియగా పొత్తు ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నారు. ప్రజా సంక్షేమ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయకాంత్ పేరును నిర్దారించారు. అలాగే డీఎండీకేకు 124సీట్లు, వైగో బృందానికి 110 సీట్లు కేటాయించేలా ఒప్పందం జరిగింది. వైగో మాట్లాడుతూ తమ కూటమి అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. విజయకాంత్ ప్రజా సంక్షేమ కూటమిలో చేరడం హాస్యాస్పదమని పీఎంకే అధికార ప్రతినిధి బాలు వ్యాఖ్యానించారు. కూటమి నేతలు ఇంతవరకు ప్రజలకు ఇచ్చిన హామీలు నీరుగారిపోయాయని ఎద్దేవా చేశారు. విజయకాంత్ తన రాజకీయ జీవితాన్ని వృథా చేసుకున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సానుభూతి వ్యక్తం చేశారు. -
కెప్టెన్ సీఎం
సాక్షి, చెన్నై : బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్ ప్రకాష్ జవదేకర్ వ్యాఖ్యలతో బుధవారం తమిళ మీడియాల్లో వెలువడ్డ సమాచారం డీఎంకే, డీఎండీకే కేడర్‌నే కాదు, కమలం వర్గాల్ని విస్మయంలో పడేశాయి. అనూహ్యంగా రాజకీయ మలుపు తిరగడంతో చర్చ బయలు దేరింది.పది శాతం ఓటు బ్యాంక్ కల్గిన డీఎండీకే అధినేత విజయకాంత్ చుట్టూ రాజకీయం సాగుతున్న విషయం తెలిసిందే. నాన్చుడు ధోరణి అనుసరించే విజయకాంత్ ఇంత వరకు తన మదిలో మాటను బయటకు పెట్ట లేదు. భవిష్యత్తు దృష్ట్యా,ప్రాంతీయ పార్టీలతో కలిసి నడవడమే శ్రేయస్కరం అన్న నిర్ణయంతో ఆయన ఉన్నట్టు సంకేతాలు ఉన్నాయి. అయితే, తమ వైపుకు విజయకాంత్‌ను తిప్పుకునేందుకు జాతీయ పార్టీ కమలం తీవ్రంగానే కుస్తీలు పడుతున్నది. అదే సమయంలో ఊహా జనిత కథనాలపై ఇన్నాళ్లు నోరు మెదపని డీఎంకే అధినేత ఎం కరుణానిధి మంగళవారం విజయకాంత్ తమ వెంటే అని ప్రకటించేశారు. దీంతో కమలం ఆశలు అడియాశలైనట్టు అయ్యాయి. ఒక ఒంటరిగా మిగాల్సిన పరిస్థితి వారికి రాష్ట్రంలో ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో బుధవారం ఢిల్లీలో తమిళ మీడియాతో బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జ్ , కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియాతో మాట్లాడినట్టుగా తమిళ మీడియాల్లో వచ్చిన సమాచారం రాజకీయంగా కొత్త మలుపును తిప్పినట్టు అయింది. కెప్టెన్ సీఎం : జవదేకర్ మాట్లాడినట్టుగా కొన్ని చానళ్లు ఫ్లాష్ ..న్యూస్‌లతో సమాచారాల్ని ప్రసారం చేశాయి. డీఎండీకే నేతృత్వంలో ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్టు జవదేకర్ వ్యాఖ్యానించారని అందులో పేర్కొన్నారు. అలాగే, డీఎండీకేకు 50 శాతం సీట్లు, ప్రజా కూటమిలో ఉన్న వీసీకే కలిసి వస్తే కొన్నిసీట్లు, ఇతర చిన్న పార్టీలకు సర్దుబాటు పోగా, మిగిలిన స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని ప్రకటించారు. ఇక, డీఎండీకే నేతృత్వంలోని కూటమికి సీఎం అభ్యర్థిగా విజయకాంత్‌ను ప్రకటి ంచేందుకు తాము సిద్ధం అని జవదేకర్ వ్యాఖ్యానించినట్టుగా వచ్చిన ఆ ఫ్లాష్..న్యూస్..డీఎంకేకు షాక్ ఇచ్చినట్టు చేసింది. అలాగే, విజయకాంత్ సతీమణి ప్రేమలత పొత్తు మంతనాల్లో ఉన్నారని వ్యాఖ్యానించడంతో ఇక, పండు పక్వానికి వచ్చి పాలల్లో పడుతుందనుకుంటే, పక్కదారి పట్టిందేంటబ్బా...? అన్న డైలమాలో డిఎంకే వర్గాలు పడ్డాయి. అదే సమయంలో డీఎండీకే వర్గాలు సైతం విస్మయంలో పడ్డాయి. ప్రేమలత విజయకాంత్ జవదేకర్‌తో ఎప్పుడు సంప్రదింపులు జరిపినట్టు, ఢిల్లీ పెద్దల అపాయింట్ మెంట్‌ఎప్పుడు తీసుకున్నట్టు అన్న సందిగ్ధంలో పడ్డారు. ఇక, బీజేపీ వర్గాలకు సైతం ఈ ఫ్లాష్ ..న్యూస్‌లు ఆశ్చర్యాన్ని కల్గించాయి. తమతో కనీసం సంప్రదింపులు జరపకుండా జవదేకర్ ఎలా ప్రకటిస్తారన్న సందిగ్దంలో పడ్డారు. చివరకు ఢిల్లీకి వ్యవహారం చేరడంతో అవన్నీ తమిళ మీడియా సృష్టిగా తేలాయి. రాజ్య సభలో జవదేకర్ ఉన్నారని, అలాంటప్పుడు ఆయన మీడియాతో ఎలా మాట్లాడటం జరిగిందంటూ ఢిల్లీ నుంచి ప్రకటన వెలువడింది. అలాగే, రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ స్పందిస్తూ, తమతో సంప్రదింపులు జరపకుండా జవదేకర్ ఎలా ప్రకటిస్తారని, పొత్తు ,సీట్ల పందేరాల వ్యవహారాల్లో తమ ప్రమేయం కూడా ఉంటుందన్న విషయాన్ని మీడియా గుర్తించాలని ఈ సందర్భంగా ఆయన చురకలు అంటించారు. ఇక, డీఎంకే వర్గాలు మాత్రం, తమతో డీఎండీకే పొత్తును చెడగొట్టడం లక్ష్యంగానే కొన్ని మీడియాలు ఈ ఫ్లాష్.... సృష్టించి ఉన్నాయని ఆయన మండి పడుతున్నారు. కేడర్‌లో గందరగోళం సృష్టించే విధంగా వ్యవహారాలు సాగిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన ధ్వజమెత్తారు. -
యూపీ సీఎం అభ్యర్థిగా ప్రియాంక గాంధీ!
రానున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీని రంగంలోకి దించాలనే వాదన పార్టీలో బలంగా వినిపిస్తోంది. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఇలాంటి వాదన రావడం సహజమే అయినా, గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్న నేపథ్యంలో ప్రియాంక గాంధీ ఎన్నికల బరిలోకి దిగడం కలసి వస్తుందన్న ప్రచారం బాగా జరగుతోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లోనే ఆమెను ఎన్నికల సమరంలోకి తీసుకొచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని కూడా పార్టీ వర్గాలు అంటున్నాయి. యూపీ ఎన్నికల ప్రచారానికి ప్రధాన వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్‌ను తీసుకొస్తున్న నేపథ్యంలో ప్రియాంక గాంధీని కూడా రంగంలోకి దింపితే విజయావకాశాలు బాగా మెరుగుపడతాయని ఆమె నాయకత్వాన్ని కోరుకుంటున్న పార్టీ వర్గాలు వాదిస్తున్నాయి. ఈ విషయంలో అధికారికంగా పార్టీ నుంచి ఎలాంటి ఫీలర్లు వెలువడలేదు. -
మౌనం దేనికి అంగీకారమో?
* కులదైవానికి కెప్టెన్ పూజలు * మీడియా ఎదుట మౌనం సాక్షి, చెన్నై: డీఎండీకే అధినేత విజయకాంత్ రానున్న ఎన్నికల్లో ఏదో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అది ఏమిటో అన్నది మాత్రం ప్రశ్నార్థకమే. మంగళవారం తన కుల దైవం వీర చిన్నమ్మాల్ సన్నిధిలో సతీమని ప్రేమలతతో కలిసి విజయకాంత్ ప్రత్యేక పూజలు చేశారు. పొత్తు పై మీడియా గుచ్చి గుచ్చి ప్రశ్నల్ని సంధించినా, మౌన ముద్రతో ముందుకు సాగారు. డీఎండీకే అధినేత విజయకాంత్ ఎన్నికల ముందు కీలక నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏదేని కీలక ప్రకటనలు చేయాలన్న ముందుగా తన కుల దైవం ఆలయాన్ని సందర్శించడం జరుగుతూ వస్తున్నది. తాజాగా, అసెంబ్లీ ఎన్నికల్లో తన చుట్టూ రాజకీయం తిరుగుతుండటంతో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న మల్లగుల్లాల్లో విజయకాంత్ పడి ఉన్నారు. ఓవైపు బీజేపీ, మరో వైపు డిఎంకే, ఇంకో వైపు ప్రజా కూటములు ఆహ్వానం పలికి ఉండటంతో ఏదో ఒక కూటమిని ఎంపిక చేసుకునేందుకు సిద్ధం అయ్యారు. డిఎంకే కూటమి వైపుగా వస్తారన్న ప్రచారం ఉన్నా, ఆయన సతీమణి ప్రేమలత వ్యాఖ్యలు గందరగోళంలోకి నెట్టి ఉన్నాయి. బీజేపీ వైపుగా నడుస్తారా..? లేదా, ప్రజా కూటమిలో సీఎం అభ్యర్థిగా నేతృత్వ పగ్గాలు చేపడుతారా..? అన్న ప్రశ్న బయలు దేరి ఉన్నది. ఈ సమయంలో తన నిర్ణయం ఏమిటో ప్రకటించేం దుకు తగ్గ మహానాడుకు వేదికగా కాంచీపురంను ఎంపిక చేసుకున్న విజయకాంత్, అందుకు తగ్గ పనుల్లో బిజీగా నే ఉన్నారు. ఈనెల 20వ తేదీన జరగనున్న ఈ మహానా డుద్వారా కీలక ప్రకటన చేయడానికి ఆయన సిద్ధం అయ్యారని చెప్పవచ్చు. ఇందుకు అద్దం పట్టే విధంగా మంగళవారం తన కుల దైవాన్ని దర్శించుకుని, మహానాడు ఆహ్వాన పత్రికకు పూజలు చేయడం గమనార్హం. కుల దైవానికి పూజలు : తన సతీమణి ప్రేమలతతో కలసి మదురై జిల్లా తిరుమంగళం సమీపంలోని కాంగేయంకు ఉదయం విజయకాంత్ చేరుకున్నారు. అక్కడ కొలువు దీరి ఉన్న తన కుల దైవం వీర చిన్నమ్మాల్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ ఆలయంలోకి వెళ్లే సమయంలో మరొకరి సాయంతో ముందుకు సాగిన విజయకాంత్ పూజల అనంతరం మౌనంగా బయటకు వచ్చారు. మీడియా చుట్టుముట్టినా, ఏమీ మాట్లాడకుండా మౌనంగానే ముందుకు సాగారు. అయితే, ప్రేమలత మాత్రం తమ కులదైవాన్ని సందర్శించే విషయం తెలిసిందే గా అని సమాధానం ఇచ్చి కదిలారు. తదుపరి శ్రీవిళ్లి పుత్తూరు అండాల్ అమ్మవారి ఆలయంలో పూజలు చేసిన విజయకాంత్, తదుపరి తిరుమల శ్రీవారి దర్శించుకునే ఏర్పాట్ల మీద పడ్డారు. ఈ ఆలయబాట తదుపరి ఆయన కీలక నిర్ణయం ప్రకటించడం ఖాయం. అయితే, ఆ నిర్ణయం ఏమిటో అన్న ఉత్కంఠ బీజేపీ, డీఎంకే, ప్రజా కూటమికి మరికొద్ది రోజులు తప్పదు. -
అయితే, ప్రేమికులు ఎక్కువగా వస్తారులే!
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల రేసులో తానూ ఉన్నానని పీఎంకే యువజన నేత, ఎంపీ అన్బుమణి వెల్లడించారు. ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధం అవుతోన్నట్టు తెలిపారు. తనయుడు, పార్టీ యువజన నేత అన్బుమణిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తూ పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు ఓ కూటమిని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగని అన్బుమణి, ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో ఆ అనుభవాన్ని ఎదుర్కోక తప్పలేదు. ధర్మపురి నుంచి బరిలో దిగి, చివరి క్షణంలో సామాజిక వర్గం ఓట్లతో గట్టెక్కి ఎంపీగా పార్లమెంట్ మెట్లు ఎక్కారు. రాజ్య సభ పదవులతో కాలం నెట్టకొచ్చిన అన్బుమణి తొలి సారిగా ఎన్నికల్లో గెలవడం పీఎంకే వర్గాలకు ఆనందమే. తాజాగా ఆయన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడంతో మార్పు తమతో అన్న నినాదాన్ని అందుకుని ప్రజల్లోకి దూసుకెళ్లే పనిలో పడ్డారు. గతంలో వలే మార్చి మార్చి కూటముల్లోకి దూరకుండా, ఈసారి తమ నేతృత్వంలోనే కూటమి ప్రకటించుకుని ప్రజాకర్షణ దిశగా ఉరకలు తీస్తున్నారు. సీఎం అభ్యర్థి రేసులో తాను ఉన్నానని, తాను తప్పకుండా అధికార పగ్గాలు చేపట్టి తీరుతానన్న ధీమాతో ప్రజల్లో చొచ్చుకు వెళ్లే పనిలో పడ్డ అన్భుమణి రాందాసు, ఈ సారి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధం అని ప్రకటించారు. మంగళవారం నగరంలోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగబోతున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం లక్ష్యంగా పీఎంకే శ్రమిస్తున్నదని, రాష్ట్రంలో మార్పు అన్నది తమతోనే సాధ్యమన్న విషయాన్ని ప్రజలు గుర్తించి ఉన్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలో అన్నది అధిష్టానం నిర్ణయిస్తుందని, వారు సూచించే స్థానం నుంచి బరిలో దిగి భారీ అధిక్యంతో గెలవడమే కాదు, అధికార పగా్గాలు చేపట్టి తీరుతామన్న ధీమాను వ్యక్తం చేశారు. ధర్మపురి నుంచే బరిలోకి దిగుతారా..? అని ప్రశ్నించగా, అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడే అని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం కదా..? ఆరోజున మహానాడుకు పిలుపు నిచ్చారేమిటో అని ప్రశ్నించగా..? అవునా...ప్రేమికుల దినోత్సవమా..!. అయితే, ప్రేమికులు ఎక్కువగా వస్తారులే అని చమత్కరించి ముందుకు సాగారు. అసెంబ్లీలో తొలి సారిగా అన్భుమణి అడుగు పెట్టిన పక్షంలో, ఎంపీ పదవికి రాజీనామా చేయక తప్పదేమో..!. ఈ దృష్ట్యా, ధర్మపురికి మళ్లీ ఉప ఎన్నిక వచ్చేనా?, లేదా అధికారం చే జిక్కని పక్షంలో ఎంపీ పదవే బెస్ట్ అని, ఎమ్మెల్యే పదవిని వదులుకునేనా..?అన్నది వేచి చూడాల్సిందే. నేటి నుంచి దరఖాస్తుల పర్వం : పీఎంకే తరఫున ఎన్నికల బరిలో నిలబడే ఆశావహుల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానించేందుకు ఆ పార్టీ వ్యవస్థాపకుడు రాందాసు నిర్ణయించారు. బుధవారం నుంచి ఈ పర్వం ఆరంభం కానున్నది. రూ.ఐదు వేలు చెల్లించి దరఖాస్తును తీసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తుల్ని విల్లుపురం జిల్లా దిండివనం సమీపంలోని తైలాపురం ఎస్టేట్‌లో ఉన్న పీఎంకే కార్యాలయంలో స్వీకరించాల్సి ఉంటుంది. ప్రతి రోజు ఉదయం పది నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు దరఖాస్తులు స్వీకరించవచ్చు. ఫిబ్రవరి ఐదో తేదీ చివరి గడవు. -
నేనే సీఎం అభ్యర్థి
- అన్భుమణి స్పష్టీకరణ పీఎంకే ఇప్పటికే తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు... తానే తమిళనాడు సీఎం అభ్యర్థి అని ఆ పార్టీ యువజన నేత అన్భుమణి రాందాసు స్పష్టం చేశారు. పీఎంకే ఎన్నికల వ్యూహాలకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రచారాలను ఆయన తీవ్రంగా ఖండించారు. చెన్నై: డీఎంకే, అన్నాడీఎంకేలతో చేతులు కలిపే ప్రసక్తే లేదన్న నిర్ణయానికి పీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు రాందాసు వచ్చిన విషయం తెలిసిందే. తమ నేతృత్వంలోనే కూటమి అని ప్రకటించి, తమ సీఎం అభ్యర్థిగా తనయుడు, యువజన నేత అన్భుమణి రాందాసు పేరును ప్రకటించేశారు. ప్రజాకర్షణ దిశగా అన్భుమణి రాష్ర్టంలో ఉరుకలు పరుగులు తీస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో పీఎంకే మనసు మార్చుకోవచ్చన్న సంకేతాలు బయల్దేరాయి. డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా ఇతర పార్టీలన్నీ ఒకే కూటమి ఏర్పాటుతో ఎన్నికల్ని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం బయల్దేరింది. ఇందుకు తగ్గట్టుగానే ప్రజా కూటమి ఆవిర్భవించినా, అటు వైపుగా రాందాసు తొంగి చూడ లేదు. ఈ పరిస్థితుల్లో పీఎంకే ప్రజా కూటమి వైపుగా తొంగి చూసే అవకాశాలు కన్పిస్తున్నాయని, డిప్యూటీ ఇచ్చినా సర్దుకునే పరిస్థితులు ఉన్నట్టుగా ప్రచారం ఊపందుకుంది. అదే సమయంలో ఓ మీడియాకు అన్భుమణి ఇచ్చిన ఇంటర్వ్యూ ఆ ప్రచారానికి బలం చేకూర్చేట్టుగా మారింది. దీంతో మేల్కొన్న అన్భుమణి రాందాసు తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేనే లేదన్న సంకేతాల్ని పార్టీ వర్గాలకు, ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలో పడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ప్రజా కూటమితో కలసి పనిచేయడానికి సిద్ధం అన్నట్టుగా వచ్చిన వార్తల్ని ఖండించారు. కూటమి పాలనకు సిద్ధం అన్నామే గానీ, కూటమిగా ఇతరులతో కలసి ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు సిద్ధం అని చెప్పలేదని స్పష్టం చేశారు. డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం అధికారంలోకి రావాలన్న తపనతో తమ పయనం సాగుతోందని, అంతే గానీ ఇతరులతోకలసి ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇప్పటికే తాము తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని, పీఎంకే నేతృత్వంలో పనిచేయడానికి వచ్చే పార్టీలను ఆహ్వానిస్తామని, ఆ కూటమికి తానే సీఎం అభ్యర్థి అని తెలిపారు.