Punjab Assembly Election 2022
-
నవ సంక్షేమంపై ఆశలు రేపిన విజయం
దేశం యావత్తూ మౌలిక పరివర్తన వైపు నడవాలంటే నాణ్యమైన విద్య తప్పనిసరి. భారతదేశం చారిత్రకంగానే నిరక్షరాస్యత, కుల వివక్షతో కూడినది కాబట్టి గ్రామీణ విద్యలో సంస్కరణలు కీలకమైనవి. ఢిల్లీ తర్వాత పంజాబ్ వంటి రాష్ట్రంలో పూర్తిగా కొత్త ముఖాలతో ‘ఆప్’ సాధించిన విజయం భారతీయ సంక్షేమ ప్రజాస్వామ్యానికి సరికొత్త దిశను తీసుకొచ్చింది. విభజనానంతర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి చేస్తూ సంపూర్ణ ఇంగ్లిష్ మీడియం అమలును ప్రారంభించారు. ఏపీలో లాగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం, ఢిల్లీలో లాగా పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించడం ‘ఆప్’ ప్రభుత్వం పంజాబ్‌లో కూడా చేస్తే ఆ రాష్ట్ర స్వరూపమే మారిపోతుంది. అయిదు రాష్ట్రాల్లో ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 1. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఘన విజయం సాధించడం, 2. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తుడిచి పెట్టుకుపోవడం. పంజాబ్ వంటి రాష్ట్రంలో పూర్తిగా కొత్త ముఖాలతో ఆప్ సాధించిన విజయం భారతీయ సంక్షేమ ప్రజాస్వామ్యానికి సరికొత్త దిశను తీసుకొచ్చింది. స్వాతంత్య్రానంతర పంజాబ్‌లో అటు కాంగ్రెస్, ఇటు శిరోమణి అకాలీదళ్ మాత్రమే పాలిస్తూ వచ్చిన పంజాబ్‌లో ఇది సరికొత్త పరిణామమే మరి! ఇందిరాగాంధీ హత్య, తదనంతరం సిక్కులపై దాడుల తర్వాత కూడా పంజాబ్ ఎన్నికల క్షేత్రంలో కాంగ్రెస్ పెద్దగా నష్టపోకుండా తన పట్టును నిలబెట్టుకుంటూ వచ్చింది. మరోవైపున మత ప్రాతిపదికను ఉపయోగిస్తున్నప్పటికీ, మతతత్వాన్ని ప్రేరేపించకుండా మనుగడ సాధిస్తూ వచ్చిన సిక్కు మితవాద పార్టీ అకాలీ దళ్ పంజాబ్‌లో అధికారం కైవసం చేసుకుంటూ వస్తోంది. అయితే పంజాబ్‌లో ప్రపంచీకరణ అనంతర సంక్షేమ చర్యలను ఈ రెండు పార్టీలూ ప్రారంభించలేకపోయాయి. సాంప్రదాయికమైన భూస్వామ్య ప్రభువుల నియంత్రణలోనే ఈ రెండు పార్టీలూ కొనసాగుతూ వచ్చాయి. సంస్కరణలు కీలకం... పూర్తిగా కొత్త ముఖాలతో ఢిల్లీలో ఆప్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి, పేదల అనుకూల సంక్షేమ పథకాలను అది చేపట్టింది. ఆప్ చేపట్టిన సంస్కరణల్లో నాలుగు అతి కీలకమైనవి. పాఠశాల విద్యా సంస్కరణ; ఆసుపత్రుల సంస్కరణ, ఆరోగ్య సేవల విస్తరణ; ఢిల్లీ మురికివాడలకు చక్కగా విద్యుత్ సరఫరా (ముంబై, కోల్‌కతా తర్వాత మురికివాడలు ఎక్కువగా ఉన్న నగరం ఢిల్లీ); ఢిల్లీ నగరవాసులందరికీ సమృద్ధిగా నీటి సౌకర్యం కల్పించడం. ఆప్ ఇతర సంస్కరణలను కూడా మొదలెట్టినప్పటికీ ఈ నాలుగు సంస్కరణలూ కీలకమైనవని నా అభిప్రాయం. గత అయిదు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్, బీజేపీ రాజకీయ, భావజాలపరమైన ప్రయోగాల నడుమనే జీవిస్తూ వచ్చిన మనకు, ఈ రెండు పార్టీలూ విద్యా, ఆరోగ్య సంస్కరణలను నత్తనడకతో మొదలెట్టాయని తెలుసు. ఈ రెండు పార్టీలూ ప్రజల డిమాండ్ మేరకు కొన్ని సంస్కరణలను తీసుకురాగా, మరికొన్నింటిని ఎన్నికల పోటీలో భాగంగా తీసుకొచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రధానంగా అమలవుతూ వచ్చిన ఈ సంస్కరణ పథకాలు దేశంలో ప్రాంతీయ పార్టీల హవా మొదలైన తర్వాత మాత్రమే వేగం పుంజుకున్నాయి. ఉత్తర భారతదేశంలో 1960లలోనే చరణ్ సింగ్ భారతీయ క్రాంతి దళ్‌తో ప్రాంతీయ పార్టీలు ఉనికిలోకి వచ్చినప్పటికీ, ఉత్తరప్రదేశ్‌లో సోషలిజం సిద్ధాంత భూమికగా కలిగివున్న సమాజ్‌వాదీ పార్టీ, బిహార్‌లో రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ వెలుగులోకి వచ్చిన తర్వాతే ప్రాంతీయ పార్టీల హవా మొదలైంది. అయితే ఈ రెండు పార్టీలూ సంక్షేమ హామీల కంటే దిగువ కులాల ఆత్మగౌరవ సాధనే ప్రధానంగా పనిచేసేవి. పీడిత కులాల ఆత్మగౌరవ నినాదం సైతం ఈ రెండు పార్టీలకు ఎలెక్టోరల్ భూమికను సృష్టించాయి. అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో నూతన విద్యా, ఆరోగ్య సంస్కరణలను ఇవి కూడా ప్రారంభించలేకపోయాయి. తర్వాత వచ్చిన బహుజన్ సమాజ్ పార్టీ సైతం ఎలాంటి ప్రాథమిక సంస్కరణలనూ మొదలెట్టలేకపోయింది. ఈ పార్టీ కూడా దళితుల ఆత్మగౌరవ నినాదాన్నీ, చారిత్రక ప్రతీకలనూ ప్రోత్సహిస్తూ రావడం ద్వారానే మనగలుగుతూ వచ్చింది. నాణ్యమైన విద్య మౌలిక అవసరం భారతీయ గ్రామీణ ప్రజారాశులకు కావలసింది– పల్లెల్లో, పట్టణాల్లో ఉంటున్న పాఠశాలల్లో బాల్యం నుంచే చక్కటి విద్య అందుబాటులోకి రావడమే! తమ గ్రామ పరిధిలోనే 1 నుంచి 12వ తరగతి వరకు బాలబాలికలందరూ నాణ్యమైన విద్యను పొందగల గాలి. దేశం యావత్తూ మౌలిక పరివర్తన వైపు నడవాలంటే నాణ్యమైన విద్య తప్పనిసరి అవసరం. భారతదేశం చారిత్రకంగానే నిరక్షరాస్యత, కులపరమైన వివక్షతో కూడిన దేశం కాబట్టి ప్రధానంగా విద్యలో, గ్రామీణ విద్యలో సంస్కరణలు కీలకమైనవి. భారతీయ ప్రజాస్వామ్యం ఎదుగుతున్నందున... భాషా సమానత్వం, మౌలిక వసతుల కల్పన నిత్యం జరగడం వంటివి పాలకవర్గాల ప్రాథమ్యంగా ఉండాలి. కానీ దీర్ఘకాలంగా ఉనికిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గానీ, బీజేపీ గానీ మొదటి నుంచీ ప్రైవేట్ రంగంలో ఇంగ్లిష్ మీడియం, ప్రభుత్వ రంగంలో ప్రాంతీయ భాషా విద్యను ఆయా రాష్ట్రాల్లో అమలు పరుస్తూ వచ్చాయి. ప్రైవేట్ రంగం వ్యూహాత్మకంగా కులీన వర్గాల పిల్లలకు ఇంగ్లిష్ మీడియం విద్యను అనుమతిస్తుండగా, గ్రామీణ పిల్లలు అత్యంత పేలవమైన వాతావరణంలో ప్రాంతీయ భాషా విద్యకు పరిమితం అయిపోతూ వచ్చారు. కమ్యూనిస్టు విద్యావిధానంలో గానీ, ఉదారవాద విద్యా విధానంలో గానీ పేదలకు తమ ప్రాంతీయ భాషా పరిధిలోనే నాణ్యమైన విద్యను అందించడం గురించి గొప్పగా చెబుతూవచ్చాయి. అయితే నాణ్యమైన విద్యను ఉమ్మడి మీడియంతో కలిపి మనదేశంలో ఎన్నడూ చూడలేదు. దేశంలోని పిల్లలందరికీ నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్య గురించి మాట్లాడాలంటేనే భయపడే పరిస్థితిని ఏ పార్టీ కానీ మేధావి వర్గం కానీ అధిగమించలేకపోయాయి. 1956లో భాషా ప్రాతిపదికన తెలుగు భాషా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భాషా ప్రాంతాలకు సంబంధించిన మనోభావాలు పెరుగుతూ వచ్చాయి. 1960లు, 70లలో దేశంలో పలు భాషా ప్రాతిపదిక ఉద్యమాలు చెలరేగాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు స్కూల్ విద్యలో రాష్ట్ర భాషపై దృష్టి పెట్టాయి. కానీ ఇంగ్లిష్, ప్రాంతీయ భాషను సమతౌల్యం చేయడంపై ఇవి ఎలాంటి దృష్టీ పెట్టలేదు. ఇక పాఠశాల మౌలిక వ్యవస్థకు ఇవి ఎలాంటి ప్రాధాన్యమూ ఇవ్వలేదు. నమూనా అధ్యయనం చేయాలి 2019లో విభజనానంతర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తూ మిగతా సబ్జెక్టుల్లో సంపూర్ణ ఇంగ్లిష్ మీడియం అమలును ప్రారంభించారు. అలాగే పాఠశాల మౌలిక అవసరాల కల్పనకు ఆయన కీలక ప్రాధాన్యం ఇవ్వడం మొదలెట్టారు. పిల్లలను పాఠశాలలకు పంపే ప్రతి తల్లి ఖాతాకు 15 వేల రూపాయలను ‘అమ్మ ఒడి’ పేరుతో ఇస్తూ వచ్చారు. తెలం గాణలో కూడా ఇదే విద్యా నమూనాను 2022–23 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించారు. పంజాబ్ ప్రభుత్వం కూడా ఏపీ నమూనాను అధ్యయనం చేసి అమలు చేస్తుందని ఆశిద్దాం. కోవిడ్–19 సంక్షోభ సమయంలో ఆప్ ప్రభుత్వం ఢిల్లీలో ఆసుపత్రుల మెరుగుదల, క్రమబద్ధీకరణపై చర్యలు తీసుకుని ఆరోగ్య సమస్యను పరిష్కరించింది. అలాగే ఢిల్లీలో నీరు, విద్యుత్ సరఫరా గణనీయంగా మెరుగుపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయనప్పటికీ ఆప్ ప్రభుత్వం ఇన్ని మార్పులు తీసుకురాగలిగింది. పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం విద్యా, ఆరోగ్య సంస్కరణల ఎజెండాను తీసుకున్నట్లయితే, దేశవ్యాప్తంగా అది గొప్ప ప్రభావం కలిగిస్తుంది. పంజాబ్ లాంటి రాష్ట్రంలో చాలామంది అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు వలస వెళ్లడం తెలిసిందే. ఏపీలో లాగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం, ఢిల్లీలో లాగా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనను ఆప్ ప్రభుత్వం పంజాబ్‌లో కూడా తీసుకొస్తే ఆ రాష్ట్ర స్వరూపమే మారిపోతుంది. వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
పంజాబ్‌లో కొలువు దీరిన ఆప్ సర్కార్.. కేబినెట్ మంత్రులు వీరే..
చంఢీగఢ్: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సర్కార్ కొలువుదీరిసింది. చండీగఢ్‌లోని రాజ్‌భవన్‌లో శనివారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. మంత్రివర్గంలో 10 మందిని తీసుకోగా.. ఒకే ఒక్క మహిళకు ప్రస్తుతం చోటు లభించింది. పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ మంత్రులతో ప్రమాణం చేయించారు. ఈరోజు కొత్తగా ఏర్పడిన కేబినెట్‌తో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తొలి సమావేశం నిర్వహించనున్నారు. శనివారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో.. హర్పాల్ సింగ్ చీమా, డాక్టర్ బల్జీత్ కౌర్, హర్బజన్ సింగ్, డాక్టర్ విజయ్ సింగ్లా, లాల్ చంద్, గుర్మిత్ సింగ్, కుల్దీప్ సింగ్ ధలివాల్, లల్జిత్ సింగ్ భుల్లార్, బ్రామ్ శంకర్(జింపా), హర్జోత్ సింగ్ బెయిన్స్లు ఉన్నారు. కొత్త కేబినెట్లో హర్జోత్ సింగ్ బెయిన్స్ అత్యంత యువ మంత్రి కావడం విశేషం. చదవండి: కంచు కోటలు బద్దలు కొట్టారు.. చరిత్ర సృష్టించారు! ਅੱਜ ਪੰਜਾਬ ਦੇ ਨਵੇਂ ਮੰਤਰੀ ਮੰਡਲ ਨੇ ਸਹੁੰ ਚੁੱਕੀ ਅਤੇ ਨਾਲ਼ ਹੀ ਲੋਕਾਂ ਦੀਆਂ ਉਮੀਦਾਂ ਨੂੰ ਪੂਰਾ ਕਰਨ ਦਾ ਵੀ ਪ੍ਰਣ ਲਿਆ। ਸਾਰੇ ਨਵੇਂ ਮੰਤਰੀਆਂ ਨੂੰ ਸ਼ੁਭਕਾਮਨਾਵਾਂ। ਸਾਨੂੰ ਮਿਲ਼ ਕੇ ਪੰਜਾਬ ਦੇ 3 ਕਰੋੜ ਲੋਕਾਂ ਲਈ ਪੂਰੀ ਇਮਾਨਦਾਰੀ ਨਾਲ਼ ਕੰਮ ਕਰਨਾ ਹੈ, ਪੰਜਾਬ ਨੂੰ ਫ਼ਿਰ ਤੋਂ ਸੁਨਿਹਰਾ ਬਣਾਉਣਾ ਹੈ। pic.twitter.com/PFYVTvUwZT — Bhagwant Mann (@BhagwantMann) March 19, 2022 కాగా శుక్రవారం ట్విట్టర్ ద్వారా తన మంత్రుల జాబితాను ప్రకటించిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్ వారికి అభినందనలు తెలిపారు అలాగే పంజాబ్ ప్రజలకు నిజాయితీతో కూడిన ప్రభుత్వాన్ని అందించడానికి మంత్రులు కష్టపడి పనిచేయాలని సూచించారు. చదవండి: పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం.. ఇంతలోనే వివాదంలో సీఎం భగవంత్ మాన్..! ఇక ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాలకు గానూ ఆమ్ ఆద్మీ పార్టీ 92 సీట్లు వైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ కాకుండా పంజాబ్‌లో తొలిసారి మరో పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ విప్లవవీరుడు భగత్ సింగ్ స్వగ్రామమైన ఖాట్కర్ కలాన్‌లో ఇటీవలే ప్రమాణ స్వీకారం చేశారు. -
కాంగ్రెస్ పరువు తీసిన సిద్ధూ.. ఎందుకిలా అన్నాడు..?
ఛండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. 117 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా.. కేవలం 18 స్థానాల్లో విజయం సాధించింది. అటు బీజేపీ పార్టీ సైతం ఆప్ ఎదుట నిలువలేకపోయింది. ఇదిలా ఉండగా.. పంజాబ్‌లో భారీ మెజార్టీతో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పంజాబ్ సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం మాన్కు శుభాకాంక్షలు తెలుపుతూ సిద్ధూ చేసిన ట్వీట్ కాంగ్రెస్ అధిష్టానికి బిగ్ షాకిచ్చింది. సిద్ధూ తన ట్విట్లో ఆప్‌ను ప్రశంసించడం చర్చనీయాంశంగా మారింది. పంజాబ్‌లో సరికొత్త మాఫియా వ్యతిరేక శకాన్ని భగవంత్ మాన్ ప్రారంభించారు. ఎవరూ ఊహించని వ్యక్తి సంతోషకరమైన వ్యక్తి భగవంత్ మాన్. అంచనాలు అందుకుంటూ, ప్రజా అనుకూల విధానాలతో పంజాబ్‌ను తిరిగి గాడిన పెడతారనే నమ్మకం ఉందని ఆశిస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేశారు. అయితే, పంజాబ్‌లో ఓటిమి కారణంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశాలతో పంజాబ్ పీసీసీ పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇలా రాజీనామా చేసిన తర్వాతి రోజే సిద్ధూ పరోక్షంగా అంతకు ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసినట్టు.. ఆప్‌ను ప్రశంసించడం సంచలనంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ జీ-23 అసమ్మతి నేతలు పార్టీలో ప్రక్షాళన అవసరం అంటూ విమర్శలకు దిగుతున్న తరుణంలో సిద్ధూ ఇలా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సతరించుకుంది. The happiest man is the one from whom no one expects … Bhagwant Mann unfurls a new anti - Mafia era in Punjab with a mountain of expectations …hope he rises to the occasion , brings back Punjab on the revival path with pro - people policies … best always — Navjot Singh Sidhu (@sherryontopp) March 17, 2022 -
హర్భజన్ సింగ్ కు అరవింద్ కేజ్రీవాల్ భారీ ఆఫర్
-
పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం.. ఇంతలోనే వివాదంలో సీఎం భగవంత్ మాన్..!
ఛండీగఢ్ : ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ మెజార్జీ సాధించి.. జాతీయ పార్టీలకు షాకిచ్చింది. ఈ క్రమంలో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇంతలోనే ఆప్ ప్రభుత్వం ఓ వివాదంలో చిక్కుకుంది. ఓ ఘటన పంజాబ్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, బుధవారం పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్.. ఖట్కర్ కలాన్ గ్రామంలో ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం భగవంత్ మాన్.. సీఎం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. సీఎం భగవంత్ మాన్ సంతకం పెడుతున్న సందర్భంగా సీఎం వెనుకల గోడపై భగత్ సింగ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటోలు మాత్రమే కనిపించాయి. కాగా, సీఎం ఆఫీసులో షేర్ ఏ పంజాబ్ మహారాజా రంజిత్ సింగ్ ఫొటోను తొలగించడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ పంజాబ్ ప్రధాన కార్యదర్శి సుభాష్ శర్మ మాట్లాడుతూ.. బీఆర్ అంబేద్కర్, భగత్ సింగ్ ఫొటోలు పెట్టడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కానీ, మహారాజా రంజిత్ సింగ్ చిత్రాన్ని ఎందుకు తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సీఎం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, అంతకు ముందు పంజాబ్‌కు సీఎంలుగా పనిచేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్ సమయంలో ఆఫీసులో రంజిత్ సింగ్ ఫొటో ఉండటం విశేషం. -
ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం.. హర్భజన్ సింగ్‌కు బంపర్ ఆఫర్
Harbhajan Singh As AAP Rajya Sabha MP: పంజాబ్‌లో నూతనంగా కొలువుదీరిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్‌ను తమ పార్టీ తరఫున రాజ్యసభకు నామినేట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. భగవంత్ మాన్ పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కొన్ని గంటల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఢిల్లీలోని ఆప్ వర్గాల సమాచారం. తాజా ఎన్నికల్లో ఎమ్మెల్యేల సంఖ్యా బలం ప్రకారం ఆప్‌కు కొత్తగా రెండు రాజ్యసభ బెర్తులు లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే భజ్జీని పెద్దల సభకు పంపాలని పార్టీ కేంద్ర కార్యవర్గం కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. పంజాబ్‌లో క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించే నిమిత్తం భజ్జీకి మరో కీలక బాధ్యత కూడా అప్పజెప్పాలని ఆప్ యోచిస్తోంది. రాష్ట్రంలో త్వరలో ఏర్పాటు చేయబోయే జలంధర్ స్పోర్ట్ యూనివర్శిటీ బాధ్యతలను కూడా భజ్జీకే అప్పగించాలని భావిస్తుంది. ఆప్ తమ ఎన్నికల మేనిఫెస్టోలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రధాన అస్త్రంగా వాడుకుంది. దీంతో ఎన్నికల్లో యువత భారీ సంఖ్యలో చీపురు గుర్తుకు ఓట్లేశారు. కాగా, పంజాబ్ కొత్త సీఎం భగవంత్ సింగ్ మాన్‌తో హర్భజన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. తాజా ఎన్నికల ఫలితాల్లో ఆప్ బంపర్ మెజార్టీ సాధించాక మాన్కు హర్భజన శుభాకాంక్షలు కూడా చెప్పారు. ఇటీవల వెలువడిన పంజాబ్ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 117 సీట్లకు గాను ఆప్ 92 స్థానాల్లో జయకేతనం ఎగురవేసి, ఢిల్లీ తర్వాత రెండో రాష్ట్రంలో గద్దెనెక్కింది. చదవండి: ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికా విజయం.. పాపం న్యూజిలాండ్! -
ఒక్క రోజూ వేస్ట్ చేయను
ఎస్బీఎస్ నగర్ (పంజాబ్): ‘‘పంజాబ్ అభివృద్ధి కోసం ఈ రోజు నుంచే రంగంలోకి దిగుతాం. ఒక్క రోజు కూడా వృథా చేయం. మనమిప్పటికే 70 ఏళ్లు ఆలస్యమయ్యాం. అవినీతి, నిరుద్యోగాలను రాష్ట్రం నుంచి పారదోలతాం’’ అని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు భగవంత్ సింగ్ మాన్ (48) ప్రతిజ్ఞ చేశారు. పంజాబ్ 18వ ముఖ్యమంత్రిగా బుధవారం ఆయన ప్రమాణస్వీకారం చేశారు. భగత్‌సింగ్ స్వగ్రామం కట్కర్‌కలాన్‌లో భారీ జన సందోహం సమక్షంలో గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. భగత్‌సింగ్‌కు అత్యంత ఇష్టమైన రంగ్ దే బసంతి పాట మారుమోగుతుండగా, జనం హర్షధ్వానాల మధ్య కార్యక్రమం జరిగింది. ఆప్ ఎమ్మెల్యేలతో పాటు పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆయన మంత్రివర్గ సహచరులు భగత్‌సింగ్‌కు చిహ్నంగా భావించే పసుపురంగు తలపాగాలు ధరించి కార్యక్రమంలో పాల్గొన్నారు. జనం కూడా అవే తలపాగాలు ధరించి కన్పించారు. వారినుద్దేశించి మాన్ మాట్లాడారు. ముందుగా ఇంక్విలాబ్ జిందాబాద్, భారత్ మాతా కీ జై, జో బోలే సో నిహాల్ అంటూ నినదించి జనాల్లో జోష్ నింపారు. వాళ్లు కూడా ఆయనతో ఉత్సాహంగా గొంతు కలిపారు. ఆప్‌కు బంపర్ మెజారిటీ కట్టబెట్టి రాష్ట్ర ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని మాన్ కొనియాడారు. ‘‘రాష్ట్రంలో స్కూళ్లు, ఆస్పత్రులను ఢిల్లీ తరహాలో మెరుగుపరుస్తాం. వాటిని చూసేందుకు విదేశాల నుంచి కూడా జనం వచ్చేలా చేస్తాం’’ అని చెప్పారు. అహంకారానికి తావివ్వొద్దని, వినయ విధేయతలతో మసలుకోవాలని ఆప్ ఎమ్మెల్యేలకు సూచించారు. పంజాబ్ చరిత్రలో ఇది మరిచిపోలేని రోజుగా మిగిలిపోతుందని కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. అమెరికా నుంచి వచ్చిన మాన్ కూతురు సీరత్ (21), దిల్షాన్ (17) ప్రమాణ స్వీకారంలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. మాన్ దంపతులు 2015లో విడిపోయారు. అప్పటినుంచీ పిల్లలు తల్లితో పాటు అమెరికాలో ఉంటున్నారు. కమెడియన్ నుంచి సీఎం దాకా... ప్రమాణ స్వీకారం తర్వాత చండీగఢ్‌లోని సీఎం కార్యాలయంలో మాన్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఆయనొక్కరే ప్రమాణం చేశారు. ఆయన మంత్రివర్గం శనివారం రాజ్‌భవన్‌లో బాధ్యతలు స్వీకరిస్తుందని ఆప్ తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు, ఒడిశా సీఎంలు ఎంకే స్టాలిన్, నవీన్ పట్నాయక్ తదితరులు మాన్‌ను అభినందించారు. పంజాబ్ సంక్షేమానికి, రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి కలిసి పని చేద్దామని మాన్‌తో మోదీ చెప్పారు. కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించిన మాన్ ఆ తర్వాత రాజకీయాల్లోకి దిగి రెండుసార్లు సంగ్రూర్ నుంచి ఎంపీగా గెలిచారు. 2022 ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీ బరిలోకి దిగారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 117 సీట్లకు ఏకంగా 92 స్థానాల్లో ఆప్ ఘనవిజయం సాధించడం తెలిసిందే. -
ఆరి... ‘భగవంతు’డా!
విప్లవ వీరుడు భగత్ సింగ్ గ్రామం ఖత్కర్ కలన్‌లో బుధవారం భారీ జనసందోహం మధ్య సాగిన పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి పదవీ ప్రమాణ స్వీకారోత్సవం మారనున్న ఆ రాష్ట్ర ముఖచిత్రానికి సంకేతమా? అవును అంటున్నారు... భగత్ సింగ్ ఫక్కీలోనే పసుపుపచ్చ తలపాగా ధరించి, ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాదంతో ప్రసంగాన్ని ముగించిన ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ (ఆప్) కొత్త సీఎం భగవంత్ సింగ్ మాన్. భగత్ సింగ్, బాబాసాహెబ్ అంబేడ్కర్ల స్వప్నసాకారం కోసం తనతో పాటు యావత్ 3 కోట్ల పంజాబ్ ప్రజలూ పదవీ ప్రమాణ స్వీకారం చేసినట్టే అన్నది మాన్ మాట. తాజా ఎన్నికలలో పంజాబ్‌లోని 117 సీట్లకు గాను 92 సీట్లు గెలిచి, అఖండ విజయం సాధించిన తమ పార్టీ అవినీతిని సమూలంగా నిర్మూలిస్తుందని ఆయన వాగ్దానం. అయితే, అవినీతి, డ్రగ్స్ మత్తులో మునిగిన ‘ఉఢ్తా పంజాబ్’గా దుష్కీర్తి సంపాదించుకొని, ఆర్థిక వనరుల కోసం అల్లాడుతున్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ‘బఢ్తా పంజాబ్’గా మార్చడం భగవంత్ సింగ్ చెప్పినంత సులభమా? గమనిస్తే, ‘ఆప్’ సాధించిన అపూర్వ ఎన్నికల విజయం సైతం అంత సులభమైనదేమీ కాదు. ముగ్గురు మాజీ సీఎంలతో సహా కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ)లకు చెందిన కొమ్ములు తిరిగిన నేతల్ని ‘ఆప్’లోని కొత్త తరం ఓడించిన తీరు ఓ నవ చరిత్ర. ఈ సరిహద్దు రాష్ట్రంలో ప్రధానంగా త్రిముఖంగా సాగిన పోటీలో కాంగ్రెస్ 23 శాతం, ఎస్ఏడీ 20.2 శాతం ఓట్లు సాధిస్తే, ఏకంగా 42 శాతం ఓట్లు ‘ఆప్’ సొంతమయ్యాయి. అయిదేళ్ళ క్రితం 2017లో కేవలం 23.7 శాతం ఓట్లతో, పట్టుమని 20 సీట్లే గెలిచి, ప్రధానంగా దక్షిణ మాల్వా ప్రాంతానికే పరిమితమైన ఓ పార్టీకి ఇది ఘన విజయమే. ఈసారి మాల్వా, దోవబ్, మాఝా ప్రాంతాలు మూడింటిలోనూ గణనీయమైన ఓటు షేర్‌తో రాష్ట్రం మొత్తాన్నీ తన ఎన్నికల చిహ్నం చీపురుతో ఊడ్చేసింది. కేంద్ర ప్రభుత్వ కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పోరాటంతో బీజేపీ–ఎస్ఏడీ పొత్తు విడిపోవడంతో, ఏడాది క్రితం పంజాబ్‌లో అధికార కాంగ్రెసే మరోసారి గెలుపు గుర్రం. కానీ, 2017లో గెలిచినప్పుడు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంపై దృష్టి పెట్టాల్సిన కాంగ్రెస్ అధిష్ఠానం సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను మార్చడం మీద శ్రద్ధ పెట్టింది. క్షణానికోలా మాట్లాడుతూ, ఏ పార్టీలో ఎంతకాలం ఉంటారో తెలియని మాజీ క్రికెటర్ సిద్ధూను నమ్ముకొని నట్టేట మునిగింది. రాష్ట్రానికి తొలిసారి దళిత సీఎం అంటూ ఆఖరు నిమిషంలో చన్నీతో చేసిన ప్రయోగం ఫలితమివ్వకపోగా, పార్టీలోని అధికార ఆశావహులతో కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. అటు కేంద్ర, ఇటు రాష్ట్ర అధికార పక్షాలతో విసిగిపోయి, అంతకు మునుపు ఎస్ఏడీ అవినీతి పాలన అనుభవం మర్చిపోని ఓటర్లు ఏకైక ప్రత్యామ్నాయం ‘ఆప్’కు బ్రహ్మరథం పట్టడం అర్థం చేసుకోదగినదే! పంజాబ్ ఎన్నికలలో సాధించిన ఘన విజయం స్ఫూర్తితో మరిన్ని రాష్ట్రాలకు రెక్కలు చాచాలని కూడా ‘ఆప్’ ఉత్సాహపడుతోంది. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ లాంటి ఉత్తర, పశ్చిమ రాష్ట్రాలకు సైతం పార్టీని విస్తరింపజేయాలన్న ఆకాంక్షను ‘ఆప్’ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే బయటపెట్టారు. నిజానికి, ఇటీవలి ఎన్నికలలో గోవా లాంటి చోట్ల ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కానీ, 2023లో జరిగే రాజస్థాన్ ఎన్నికలలోనూ పంజాబ్ తరహా మేజిక్ చేయాలని భావిస్తోంది. నాలుగేళ్ళ క్రితం 2018 రాజస్థాన్ ఎన్నికల్లోనూ 200 స్థానాలకు 140కి పైగా సీట్లకు ‘ఆప్’ పోటీ చేసింది. అప్పట్లో ఒక్క సీటైనా గెలవని ఆ పార్టీ ఇప్పుడు పంజాబ్ ఇచ్చిన జోష్‌తో మళ్ళీ బరిలోకి దూకాలని చూస్తోంది. విద్యుచ్ఛక్తి సమస్యలు, భారీ విద్యుత్ రేట్లతో సతమతమవుతున్న రాజస్థాన్ ప్రజలకు ఢిల్లీ, పంజాబ్‌లలో లాగా పరిష్కారం చూపుతామన్నది ‘ఆప్’ చెబుతున్న మాట. హామీలివ్వడం తేలికే... నిలబెట్టుకోవడమే కష్టం. ‘ఆప్’ ముందున్న సవాల్ అదే. నాణ్యమైన ప్రభుత్వ పాఠశాలలు, తక్కువ ఖర్చుకే వైద్యసేవల ‘మొహల్లా’ క్లినిక్‌లు, ఉచిత విద్యుత్ లాంటి ‘ఢిల్లీ నమూనా’తోనే దేశరాజధానిలో ఆ పార్టీ రెండోసారి గద్దెనెక్కింది. పంజాబ్‌లోనూ అదే బాటలో ఢిల్లీ పౌరుల కన్నా 100 యూనిట్లు ఎక్కువగా 300 యూనిట్ల ఉచిత విద్యుత్, పాఠశాలల ఉన్నతీకరణ, 16 వేల క్లినిక్‌లు, ఉచిత ఔషధాలు – శస్త్రచికిత్సల ఆరోగ్య హామీ పథకం వగైరా ‘ఆప్’ ప్రకటించింది. విస్తీర్ణంలో ఢిల్లీ (1484 చ.కి.మీ) కన్నా పంజాబ్ (50,362 చ.కి.మీ) చాలా పెద్దది. జనాభా సైతం ఢిల్లీ కన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువ. మిగులు ఆదాయ బడ్జెట్‌తో నడిచే ఢిల్లీతో పోలిస్తే పంజాబ్ ఖజానాలో నిత్యం కటకట. తాజా మాజీ కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఋణభారం రూ. 2.6 లక్షల కోట్లకు పెరిగింది. ఇది కాక కరోనా ఆపత్కాల ఖర్చులు, ప్రజాకర్షక పథకాల పుణ్యమా అని రాష్ట్ర అప్పులు, స్థూల రాష్ట్ర ఉత్పత్తి(జీఎస్డీపీ) నిష్పత్తి ఈ ఆర్థిక సంవత్సరం 50శాతం దాటుతుందని అంచనా. అంటే హామీలు తీర్చే ఆర్థిక వనరులకై భగవంత్ సారథ్యంలో ‘ఆప్’ అల్లాడి ఆకులు మేయక తప్పదు. డ్రగ్స్ అక్రమరవాణా, శాంతిభద్రతల సమస్యలు ఈ సరిహద్దు రాష్ట్రాన్ని ఎప్పటి నుంచో పీడిస్తున్నాయి. వాటిని అరికట్టాలంటే పోలీసు యంత్రాంగ విస్తరణ, నూతన శిక్షణ తప్పవు. ఢిల్లీలో లాగా పోలీసు శాఖ కేంద్ర అధీనంలో ఉందనీ, లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డుకుంటున్నారనీ పంజాబ్‌లో చెప్పడానికి వీలుండదు. అలా ఇప్పుడు ‘ఆప్’కూ, అధినేత కేజ్రీవాల్‌కూ, రాజకీయాల్లోకి వచ్చిన 12 ఏళ్ళకే సీఎం స్థాయికి ఎదిగిన హాస్యనటుడైన 48 ఏళ్ళ భగవంత్ సింగ్ మాన్‌కూ అందరికీ ఇది అగ్నిపరీక్షే. ఢిల్లీలో లాగానే పంజాబ్‌లోనూ హామీలు నెరవేర్చి, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అందిస్తారా? -
కంచు కోటలు బద్దలు కొట్టారు.. చరిత్ర సృష్టించారు!
పంజాబ్ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకుడు భగవంత్ మాన్ బుధవారం ప్రమాణం చేశారు. పంజాబ్‌లో ఆప్ ఘన విజయం సాధించడంతో ఆయన సీఎం అయ్యారు. అయితే తాజా ఎన్నికల్లో ఆప్ అభ్యర్థులు హేమాహేమీలను మట్టికరిపించి సంచలనం సృష్టించారు. సామాన్య పౌరులు.. కాంగ్రెస్ సీఎంతో సహా సీనియర్ నాయకులను ఓడించి సరికొత్త చరిత్ర సృష్టించారు! చన్నీకి ఉగోకే చెక్ పంజాబ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఘోరంగా ఓడిపోవడం అతిపెద్ద సంచలనం. ఆయన ఓడించింది సీనియర్ నాయకుడు కాదు.. సామాన్య యువకుడు. చిన్న మొబైల్ రిపేర్ షాప్ నడుపుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యకర్త లాభ్ సింగ్ ఉగోకే అనే యువకుడు బదౌర్ నియోజకవర్గంలో చన్నీపై 34,000 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో విజయం సాధించాడు. ఉగోకే తండ్రి డ్రైవర్ కాగా, తల్లి ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్‌గా సేవలు అందిస్తోంది. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఉగోకేకు హీరో హోండా మోటార్‌సైకిల్ మాత్రమే ఉంది. డాక్టర్ సాబ్‌కే జై చమ్‌కౌర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి కూడా చన్నీకి ‘ఆప్’చేతిలో చుక్కెదురైంది. వృత్తిరీత్యా వైద్యుడైన 55 ఏళ్ల చరణ్‌జిత్ సింగ్ ఇక్కడ నుంచి విజయం సాధించారు. గత ఎన్నికల్లోనూ చన్నీకి వ్యతిరేకంగా ఆప్ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 12,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అయినప్పటికీ నియోజకవర్గాన్ని వదలిపెట్టకుండా, ప్రజల మధ్యే ఉంటూ వారి మన్ననలు పొందారు. ఈసారి 7,942 ఓట్ల తేడాతో చన్నీని ఓడించగలిగారు. నవజ్యోత్ వర్సెస్ జీవన్ జ్యోత్ ప్రజల దృష్టిని ఆకర్షించిన మరో ఆప్ అభ్యర్థి జీవన్ జ్యోత్ కౌర్. పంజాబ్ ఎన్నికల్లో ఇద్దరు ప్రముఖ నాయకులను ఆమె ఓడించారు. అమృత్సర్ తూర్పు నుంచి కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ, శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి బిక్రమ్ మజిథియాలపై 6,750 ఓట్ల తేడాతో ఆమె గెలుపొందారు. ఆమ్ ఆద్మీ పార్టీలో వలంటీర్‌గా చేరి, పార్టీ జిల్లా అర్బన్ అధ్యక్షురాలిగా మారడానికి ముందు.. కౌర్ సామాజిక కార్యకర్తగా చురుగ్గా పనిచేశారు. ‘షీ’అనే స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేసి మహిళలకు రుతుక్రమ పరిశుభ్రత గురించి అవగాహన కల్పించారు. శానిటరీ ప్యాడ్ల వాడకం, రుతుక్రమ పరిశుభ్రత తెలియజేస్తూ 'ప్యాడ్‌వుమన్'గా ఆమె ప్రాచుర్యం పొందారు. (క్లిక్: సోనియా సీరియస్ ఆదేశాలు.. దిగొచ్చిన సిద్ధూ.. పదవికి గుడ్ బై) కౌర్ చేతిలో సింగ్లా చిత్తు సంగ్రూర్‌లో ఆప్ యువనేత నరీందర్ కౌర్ భరాజ్.. సిట్టింగ్ కాంగ్రెస్ క్యాబినెట్ మంత్రి విజయ్ ఇందర్ సింగ్లాతో పోటీ పడి భారీ విజయాన్ని అందుకున్నారు. సింగ్లాను 36,430 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడించి తానేంటో నిరూపించుకున్నారు. కోట్లకు పడగెత్తిన వ్యాపారవేత్త, బీజేపీ అభ్యర్థి అరవింద్ ఖన్నా మూడో స్థానానికి పరిమితమయ్యారు. (క్లిక్: మమతా బెనర్జీ అనూహ్య నిర్ణయం..) లా గ్రాడ్యుయేట్ అయిన కౌర్ జనవరిలో ఎన్నికల సమయంలో తన తల్లితో కలిసి స్కూటర్‌పై వచ్చి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అప్పట్లో ఈ వీడియోలో తెగ వైరల్ అయింది. రూ. 24,000 విలువైన ఆస్తులు మాత్రమే ఉన్నట్టు నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న ఆమె.. ద్విచక్ర వాహనంపైనే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎవరెంత హేళన చేసినా లెక్కచేయక పోటీలో నిలబడి ఘన విజయం సాధించారు. బాదల్‌కు జగదీప్ బ్రేక్ శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ కంచుకోట జలాలాబాద్‌లో ఆప్ పాగా వేసింది. 2009 నుంచి అప్రతిహతంగా గెలుస్తూ వస్తున్న బాదల్‌కు ఆప్ అభ్యర్థి జగదీప్ కాంబోజ్ బ్రేక్ వేశారు. కాంగ్రెస్ నాయకుడైన జగదీప్ గతేడాది ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. తాజా ఎన్నికల్లో బాదల్‌పై దాదాపు 31,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. టిక్కెట్ నిరాకరించడంతో మూడేళ్ల క్రితం కాంగ్రెస్‌ను వీడిన కాంబోజ్ 2019 ఉపఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసినా 5,000 ఓట్లకు మించి సాధించలేకపోయారు. ఈ ఎన్నికల్లో ఆప్ మరో ‘జెయింట్ కిల్లర్’అజిత్‌పాల్ సింగ్ కోహ్లి. అకాలీదళ్ మాజీ నాయకుడైన అజిత్‌పాల్.. పటియాలా నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌ను ఓడించి అందరి దృష్టిని ఆకర్షించాడు. గతంలో మేయర్‌గా పనిచేసిన ఆయన పెద్దగా అంచనాలు లేకుండానే పోటీకి దిగి విజయం సాధించడం విశేషం. -
సోనియా సీరియస్ ఆదేశాలు.. దిగొచ్చిన సిద్ధూ.. పదవికి గుడ్ బై
ఛండీగఢ్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీని మరింత ఆందోళనకు గురి చేశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడటంతో కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశం వాడివేడిగా సాగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సంచలన ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చూసిన రాష్ట్రాల్లో అధ్యక్షులను తప్పుకోవాలని ఆదేశించారు. ఈ క్రమంలో పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ తన పదవికి బుధవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపినట్టు ట్విట్టర్ వేదికగా తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారణంగా సోనియా ఆదేశాల మేరకు తాను రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్ చీఫ్‌లు తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా.. పీసీసీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపారు. మరోవైపు.. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేస్తున్నట్టు గణేశ్ గోడియాల్ ప్రకటించారు. ఇదిలా ఉండగా, సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం.. పార్టీ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని సోనియా ప్రకటించారు. సమావేశంలో అసమ్మతి నేతలు సహా అందరి అభిప్రాయాలను ఆమె తెలుసుకున్నారు. అయితే సంస్థాగత ఎన్నికల వరకు సోనియా నాయకత్వం కొనసాగించాలని ప్రతి సభ్యుడు కోరారని సూర్జేవాలా చెప్పారు. ఆగస్టు 21– సెప్టెంబర్ 20 మధ్య కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందన్నారు. కాంగ్రెస్‌ను బలహీనపరిచేందుకు బీజేపీ– ఆర్ఎస్ఎస్ గాంధీ కుటుంబంపై బురద జల్లుతున్నాయని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. As desired by the Congress President I have sent my resignation … pic.twitter.com/Xq2Ne1SyjJ — Navjot Singh Sidhu (@sherryontopp) March 16, 2022 -
సోనియా గాంధీ కీలక నిర్ణయం.. పీసీసీ చీఫ్‌లకు షాక్!
ఢిల్లీ: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూడటంతో కాంగ్రెస్ హైకమాండ్ ప్రక్షాళన చేపట్టింది. ఆయా రాష్ట్రాల్లో పీసీసీ చీఫ్లుగా ఉన్నవారిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే మరిన్ని కఠిన నిర్ణయాలకు సమాయత్తమవుతోంది. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభావం చూపలేకపోయింది. పంజాబ్‌లో అధికారం నిలబెట్టుకోవాలని చూసిన కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పంజాబ్ కాంగ్రెస్‌లో ఏర్పడ్డ సంక్షోభం ఆ పార్టీకి తీవ్ర నష్టం చేసింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న ఆప్ అధికారంలోకి వచ్చింది. కచ్చితంగా పంజాబ్‌లో గెలుస్తామనుకున్న కాంగ్రెస్‌కు.. అక్కడ ప్రతికూల ఫలితాలు రావడం హైకమాండ్ జీర్ణించుకోలేకపోతోంది. అసలు ఏం జరిగిందో తెలుసుకునేలోపే పార్టీకి తీవ్ర నష్టం కల్గడంతో చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే ఆ ఐదు రాష్ట్రాల్లో పీసీసీ చీఫ్లుగా ఉన్నవారిని తొలగిస్తూ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌ను ముంచేసి..రాజీనామానా? -
Sakshi Cartoon: అర్జంటుగా కాంగ్రెస్ రక్షణకు ఏకతాటిపైకి తీసుకురావాలి సార్!
అర్జంటుగా కాంగ్రెస్ రక్షణకు ఏకతాటిపైకి తీసుకురావాలి సార్! -
పంజాబ్‌కు నిజాయితీపరుడైన సీఎం వస్తున్నారు
అమృత్సర్: పంజాబ్‌కు ఎన్నో ఏళ్ల తర్వాత నిజాయితీ పరుడైన వ్యక్తి ముఖ్యమంత్రిగా వస్తున్నారని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ నిజాయితీతో కూడిన పాలనను అందిస్తుందని చెప్పారు. కాబోయే ముఖ్యమంత్రి భగ్వంత్ మాన్‌తో కలిసి ఆదివారం ఆయన ఆప్ ఆధ్వర్యంలో అమృత్‌సర్‌లో చేపట్టిన రోడ్ షోలో పాల్గొన్నారు. తమ పార్టీకి ఘన విజయం సమకూర్చిన పంజాబ్ ప్రజలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘ఎన్నో ఏళ్ల తర్వాత పంజాబ్‌కు నిజాయితీ పరుడైన వ్యక్తి సీఎం అవుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది. మాన్ చాలా నిజాయితీ పరుడు. నిజాయితీతో కూడిన పాలనను ప్రభుత్వం అందిస్తుంది. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను గౌరవిస్తుంది’ అని తెలిపారు. ఆప్ ఎమ్మెల్యేలెవరైనా అక్రమాలకు పాల్పడినట్లు తేలితే జైలుకు పంపిస్తామన్నారు. మాన్ ఒక్కరేకాదు, రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ఇక ముఖ్యమంత్రేనన్నారు. ప్రకాశ్ సింగ్ బాదల్, సుఖ్ బీర్ సింగ్ బాదల్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, చరణ్‌జిత్ చన్నీ, విక్రమ్ సింగ్ మజితియా వంటి స్వార్థపూరిత రాజకీయ నేతలకు పంజాబ్ ప్రజలు ఓటమి రుచి చూపించారని, ఇది కేవలం పంజాబీలకే సాధ్యమని వ్యాఖ్యానించారు. -
సీఎంపై గెలిచి ఎమ్మెల్యే అయిన కొడుకు.. తల్లి మాత్రం స్వీపర్‌గానే.. ఎవరామె..?
ఛండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ.. జాతీయ పార్టీలకు షాకిస్తూ భారీ మెజార్టీతో విజయం సాధించింది. పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ఈనెల 16వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదిలా ఉండగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భదౌర్ నియోజకవర్గం నుంచి సీఎం అభ్యర్థి చరణ్‌జీత్ సింగ్ చన్నీపై ఆప్ అభ్యర్థి లాభ్ సింగ్ పోటీ చేసి 37వేలకు పైగా మెజారిటీతో భారీ విజయాన్ని అందుకున్నాడు. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా లాభ్ సింగ్ ఫేమస్ అయ్యాడు. కాగా, తన కొడుకు ఎమ్మెల్యే అయ్యాడని ఊరంతా సంబురాలు జరుపుకుంటుడగా.. ఆయన తల్లి మాత్రం సాదాసీదాగా తన పని తాను చేసుకుంటోంది. ఎమ్మెల్యే లాభ్ సింగ్ తల్లి బల్దేవ్ కౌర్ ప్రభుత్వ పాఠశాలలో కొన్నేళ్లుగా స్వీపర్‌గా పని చేస్తోంది. తన కొడుకు ఎమ్మెల్యే అయినప్పటికీ తాను ఇదే వృత్తిలో కొనసాగుతానని పేర్కొంది. తాజాగా ఆమె మాట్లాడుతూ.. తన కొడుకు ఎన్నికల్లో గెలుస్తాడని మొదటి నుంచి ధీమాగానే ఉన్నట్టు తెలిపింది. రానున్న రోజుల్లో లాభ్ సింగ్ కచ్చితంగా పంజాబ్‌లో మార్పులు తీసుకొస్తాడని చెప్పింది. అతడు అందరికీ వైద్యం, విద్య అందిస్తాడని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే తన కొడుకు ఎమ్మెల్యే అయినా తాను స్వీపర్‌గా పని చేస్తానని స్పష్టం చేసింది. లాభ్ సింగ్ తండ్రి దర్శన్ సింగ్ మాట్లాడుతూ.. ప్రజలకు సంక్షేమ పథకాలు అందే విధంగా తన కొడుకు పనిచేయాలని కోరుకుంటున్నానని తెలిపారు. కాగా, లాభ్ సింగ్ 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాడు. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉంటూ కొద్దికాలంలోనే కీలక నేతగా ఎదిగాడు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఇది చదవండి: ఆ సినిమాకు ప్రధాని మోదీ ప్రశంసలు.. -
వీఐపీలకు భద్రత రద్దు
చండీగఢ్: పంజాబ్ కాబోయే ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ (48) శనివారం గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత తెలిపారు. శుక్రవారం మొహాలిలో జరిగిన సమావేశంలో ఆప్ శాసనసభా పక్ష నేతగా మాన్ ఎన్నికవడం తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్, అకాలీదళ్ పార్టీలకు చెందిన 122 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా పలువురు వీవీఐపీలకు భద్రతను ఉపసంహరించుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆయన ఆదేశించారు. కేంద్ర హోం శాఖ సూచనల ప్రకారం బాదల్ కుటుంబం, మాజీ సీఎంలు కెప్టెన్ అమరీందర్ సింగ్, చరణ్‌జిత్ సింగ్ చన్నీ వంటి వారు మినహా మిగతా వారి వ్యక్తిగత భద్రతా సిబ్బందిని వెనక్కి తీసుకోవాలన్నారు. -
Sakshi Cartoon: పంజాబ్‌లో ఆప్ విజయం
పంజాబ్‌లో ఆప్ విజయం -
ఆమ్ ఆద్మీ పార్టీకి మోదీ అభినందనలు.. కేజ్రీవాల్ రిప్లై ఇదే
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందుకున్న ఆప్ పార్టీకి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. ‘పంజాబ్ ఎన్నికల్లో గెలిచినందుకు ఆప్ పార్టీకి అభినందనలు. పంజాబ్ అభివృద్ధికి కోసం కేంద్రం నుంచి సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇస్తున్నాను’ అని మోదీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై స్పందించిన ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధానికి ‘ధన్యవాదాలు సర్’ తెలిపారు. కాగా పంజాబ్‌లో ఆప్ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్‌లను ఆప్ ఊడ్చి పారేసింది. 117 స్థానాలకు గాను రికార్డు స్థాయిలో 92 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. దీంతో ఏ పార్టీలో పొత్తు లేకుండా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అంతేగాక ఇప్పటి వరకు కాంగ్రెస్ పేరిట ఉన్న రికార్డును చేరిపేస్తూ 60 ఏళ్ల తర్వాత కొత్త రికార్డును కేజ్రీవాల్ తిరగరాశారు. చదవండి: పంజాబ్ రాజకీయాల్లో కొత్త చరిత్ర.. ఫలించిన కేజ్రివాల్ ఎనిమిదేళ్ల కష్టం I would like to congratulate AAP for their victory in the Punjab elections. I assure all possible support from the Centre for Punjab’s welfare. @AamAadmiParty — Narendra Modi (@narendramodi) March 10, 2022 1962 తర్వాత పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే పార్టీ(వేరే పార్టీలతో పొత్తు లేకుండా) 92 సీట్లు గెలవడం ఈ ఎన్నికల్లో చోటుచేసుకుంది. అయితే బీజేపీ, అకాలీదళ్ కూటమి.. 1997లో 93 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి భారీ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 18, శిరోమణి అకాలీదళ్ 3, బీజేపీ 2, బీఎస్పీ 1 స్థానాల్లో గెలుపొందాయి. చదవండి: ఆప్ స్వీప్‌కి భయపడే బీజేపీ ఈసీకి లేఖ రాసింది -
పంజాబ్ రాజకీయాల్లో కొత్త చరిత్ర.. ఫలించిన కేజ్రివాల్ ఎనిమిదేళ్ల కష్టం
ఎన్నికల్లో పాజిటివ్ ఓటు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. ఒక పార్టీని గెలిపించుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించడం పంజాబ్‌లో ఆవిష్కృతమైంది. ఏడేళ్ల క్రితం రాజధాని ఢిల్లీ వీధుల్లో విపక్ష పార్టీలను ఊడ్చేసినట్టుగా ఇప్పుడు దానికి ఆనుకొని ఉన్న పంజాబ్‌లో కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్‌లను ఆప్ ఊడ్చి పారేసింది. ఎనిమిదేళ్లుగా పంజాబ్ కోటలో పాగా వేయాలన్నకేజ్రివాల్ ప్రయత్నాలు ఫలించాయి. ఢిల్లీ మోడల్ పాలన హామీలతో సామాన్యుడు చిరుదరహాసంతో మీసం మెలేశాడు. ఇది మామూలు విజయం కాదు. ఎవరి ఊహకి అందని అసాధారణ విజయం. కాంగ్రెస్ దళిత కార్డు రాజకీయాల్ని, శిరోమణి అకాలీదళ్ సంప్రదాయ వ్యూహాలను, కెప్టెన్ అమరీందర్ ప్రజాకర్షణని ఒకేసారి తుడిచిపెట్టేస్తూ కుల, మత, ప్రాంతీయ రాజకీయ సమీకరణలకి అతీతంగా ఆమ్ ఆద్మీ పార్టీ విజయభేరి మోగించింది. కాంగ్రెస్ కంచుకోటల్ని బద్దలు కొట్టి అఖండ మెజార్టీతో విజయం సాధించింది. 70 ఏళ్ల పాటు రెండు ప్రధాన పార్టీలనే ఆదరించిన పంజాబ్‌కు ఆప్ ఒక ఆశాకిరణంలా కనిపించింది. ఢిల్లీ మోడల్ పరిపాలనను చూసి ఆ పార్టీని అక్కున చేర్చుకున్నారు పంజాబీలు. చదవండి: పెరుగుతున్న 'ఆప్' గ్రాఫ్.. తర్వాత టార్గెట్ ఆ రెండే.. మార్పు కోసం పంజాబ్‌లో గత 70 ఏళ్లుగా రెండు పార్టీలే రాజ్యమేలాయి. శిరోమణి అకాలీదళ్ లేదంటే కాంగ్రెస్ ఈ రెండు పార్టీలే అధికారంలో ఉన్నాయి. ఏడు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్, శిరోమణి అకాలీ దళ్లు నాణేనికి చెరోవైపు ఉన్న పార్టీలేనని పంజాబ్ ప్రజలు భావించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. రోజు రోజుకి పడిపోతున్న ప్రజల తలసరి ఆదాయం, ఏళ్ల తరబడి రాజకీయ పక్షాలు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం చూసి చూసి విసిగెత్తిన ప్రజలు ఆప్‌వైపు మళ్లారు. ఈ సారి ప్రజలు ఫూల్స్ అవకుండా భగవంత్ మన్, కేజ్రివాల్‌కే అవకాశం ఇస్తారన్న ఆప్ ప్రచార వ్యూహం ఫలించింది. ఢిల్లీ మోడల్ ఢిల్లీలో ఆప్ చేసిన అభివృద్ధి పొరుగునే ఉన్న పంజాబ్‌ను విపరీతంగా ఆకర్షించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ గత కొన్నేళ్లుగా పంజాబ్ మీదే దృష్టి పెట్టారు. తాము అధికారంలోకి వస్తే ఢిల్లీ తరహా పాలనను పంజాబ్‌లో తీసుకువచ్చి అభివృద్ధి బాట పట్టిస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఇచ్చిన హామీలను ప్రజలు బలంగా నమ్మారు. నాణ్యమైన ప్రభుత్వ విద్య, ఆరోగ్యం, నెలకి 300 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్, తక్కువ చార్జీలకే తాగునీరు అనే నాలుగు స్తంభాల మీద ఢిల్లీ పరిపాలన సాగింది. చదవండి: ఆప్ అఖండ విజయం.. 60ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన కేజ్రీవాల్ విద్యుత్ చార్జీల భారం, ఆరోగ్యం, విద్య ప్రైవేటీకరణతో నిత్యం ఆర్థిక భారాన్ని మోస్తున్న ప్రజలు కేజ్రివాల్ హామీలకు ఆకర్షితులయ్యారు. డ్రగ్స్ మాఫియాను అరికట్టడం, గురుగ్రంథ్‌సాహిబ్‌ను అవమానించిన వారిని శిక్షిస్తామన్న చెప్పడంతో మరో ఆలోచన లేకుండా చీపురుకి ఓట్లు గుద్ది పారేశారు. రైతు ఆందోళన పంజాబ్‌లో వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సుదీర్ఘంగా ఏడాదిపాటు చేసిన పోరాటం అధికార మార్పుకి దోహద పడింది. రైతు ఆందోళనలకు మొదట్నుంచీ ఆప్ మద్దతు ఇచ్చింది. రాష్ట్రంలో 69 స్థానాలున్న అత్యంత కీలకమైన మాల్వా ప్రాంతానికి చెందిన అతి పెద్ద రైతు సంఘం బీకేయూ (ఉగ్రహాన్), ప్రజా మద్దతు అధికంగా ఉన్న ఈ సంఘం అధ్యక్షుడు జోగీందర్ సింగ్ ఉగ్రహాన్ 70 ఏళ్ల తర్వాత కూడా నాయకుల్లో మార్పు రాకపోతే ఏం చెయ్యాలంటూ ఓటర్లలో ఆలోచన రేకెత్తించేలా ప్రసంగాలు చేశారు. ఆ ప్రశ్నలన్నింటికీ ఆప్ సమాధానమైంది. సీఎం అభ్యర్థిగా భగవంత్ మన్ పంజాబ్‌లో ఆప్‌పై బయట పార్టీ అన్న ముద్ర ఉంది. పరాయివారు మనల్ని పరిపాలించడానికి అవకాశం ఇస్తారా అంటూ ఇతర పార్టీలు పదే పదే ఆప్‌పై బురదజల్లేవి. గత ఎన్నికల్లో సీఎం అభ్యర్థిని ప్రకటించకుండా ఎన్నికల బరిలో దిగి తప్పు చేసిన ఆప్ ఈ సారి దానిని దిద్దుకుంది. భగవంత్ మన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికలకు ముందే ప్రకటించి తమ పార్టీపై ఉన్న ఆ ముద్రను చెరిపేయడానికి కేజ్రివాల్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఒక కమెడియన్‌గా, రాజకీయ నాయకుడిగా భగవంత్ మన్కు పంజాబీయుల మదిలో ప్రత్యేక స్థానం ఉంది. సంప్రదాయ రాజకీయ నాయకుల్ని చూసి చూసి విసిగిపోయిన ప్రజలకి భగవంత్మన్లో హాస్యస్ఫూర్తి, ఒక మట్టి మనిషిగా ఆయన జీవన విధానం చూసి అభిమానాన్ని పెంచుకున్నారు. భగత్ సింగ్ సొంతూళ్లో ప్రమాణం చండీగఢ్: ‘పంజాబ్ కొత్త కేబినెట్ ప్రమాణస్వీకార కార్యక్రమం రాజ్‌భవన్‌లో జరగదు. స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్ కలన్‌లో నిర్వహిస్తాం’ అని ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ వెల్లడించారు. కార్యక్రమం తేదీలను తర్వాత ప్రకటిస్తామని చెప్పారు. ఏ సర్కారు ఆఫీసులో కూడా ముఖ్యమంత్రి చిత్రపటాలు ఉండవని స్పష్టం చేశారు. బదులుగా భగత్‌సింగ్, అంబేద్కర్ ఫొటోలు ఉంటాయన్నారు. ఇప్పుడిక పంజాబ్‌ను మళ్లీ పంజాబ్‌గా మారుస్తామని చెప్పారు. పంజాబ్ ప్రజలు ఆప్‌కు పట్టం కట్టారని ట్రెండ్‌ను బట్టి తెలియడంతో ధురిలో పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో మాన్ మాట్లాడారు. పాఠశాలల స్థితిగతులను మెరుగుపరచడం, ఆరోగ్య మౌలిక సదుపాయాలు పెంచడం, పరిశ్రమలను తీసుకురావడం, సాగును లాభసాటిగా మార్చడం, మహిళలకు భద్రత కల్పించడం, క్రీడా మౌలిక సదుపాయాలను పెంచడం ప్రాధాన్యాంశాలని ఆయన వివరించారు. క్రీడలను ప్రోత్సహించడానికి గ్రామాల్లో ట్రాక్స్, స్టేడియంలు ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని ప్రాంతాల్లో మంత్రులు ఎప్పటికప్పుడు పర్యటిస్తుంటారని.. ప్రజల కష్టనష్టాలు తెలుసుకుంటారని చెప్పారు. ‘ఆప్‌కు ఓటేయని వాళ్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అన్ని వర్గాల ప్రజల కోసం పార్టీ పని చేస్తుంది’ అని చెప్పారు. ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థులను తిరిగి తీసుకురావడంపై స్పందిస్తూ.. ‘మన పిల్లలు చదువుకోవడానికి బయటకు ఎందుకు వెళ్లాలి. మనమే తక్కువకు సదుపాయాలు ఎందుకు కల్పించకూడదు’ అన్నారు. యువత, మహిళలు రాష్ట్రంలో మహిళలు, యువత ఆప్ వెంట నడవడంతో ఈ స్థాయి విజయం పార్టీకి సాధ్యమైంది. అవినీతిని కూకటివేళ్లతో పెకిలిస్తామని, భారీ స్థాయిలో ఉద్యోగాలు కల్పిస్తామని కేజ్రివాల్ చేసిన హామీలతో యువతరం ఆప్ వెంటే నడిచింది. ఉద్యోగాల్లో కోచింగ్ సెంటర్లకు ఫీజులు కడతామన్న ఉచిత పథకాలు యువతని ఆకట్టుకున్నాయి. ఇప్పటివరకు మరే పార్టీ చేయని విధంగా మహిళలను ప్రత్యేకమైన ఓటు బ్యాంకుగా కేజ్రివాల్ గుర్తించారు. ఆప్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో నిరుపేద మహిళలకు ప్రతీ నెల రూ.వెయ్యి బ్యాంకులో వేస్తానన్న హామీ ఇచ్చారు. పురుషాధిక్యత ఎక్కువగా ఉండే ఈ రాష్ట్రంలో మహిళలకి కాస్తో కూస్తో ఆర్థిక స్వాతంత్య్రం వస్తుందన్న ఆశ వారిని ఆప్ వైపు మొగ్గేలా చేసింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
ఆప్ అఖండ విజయం.. 60ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ: పంజాబ్‌లో ఆమ్ఆద్మీ పార్టీ అఖండ విజయాన్ని అందుకుంది. ఈ సందర్బంగా ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల గెలుపుపై స్పందించారు. మా రాజకీయ ప్రత్యర్థులను మట్టికరి పిస్తూ ఇంతటి విజయం అందించిన పంజాబ్ ప్రజలకు ఎన్నో కృతజ్ఞతలు. ఇలాంటి విప్లవం మొదట ఢిల్లీలో సంభవించింది. పంజాబ్ తీర్పుతో మున్ముందు దేశవ్యాప్తంగా ఇదే విప్లవం సంభవించనుందని అన్నారు. ఇదిలా ఉండగా.. ఆప్ పంజాబ్‌లో మరో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పేరిట ఉన్న రికార్డును చేరిపేస్తూ 60 ఏళ్ల తర్వాత కొత్త రికార్డును కేజ్రీవాల్ తిరగరాశారు. 1962 తర్వాత పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే పార్టీ(వేరే పార్టీలతో పొత్తు లేకుండా) 92 సీట్లు గెలవడం 2022 ఎన్నికల్లో చోటుచేసుకుంది. కాగా, 1962లో క్రాంగెస్ 90 స్థానాల్లో విజయం సాధించింది. తాజాగా 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ 92 స్థానాల్లో గెలుపొంది రికార్డును తిరగరాసింది. కాగా, బీజేపీ, అకాలీదళ్ కూటమి.. 1997లో 93 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి భారీ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 18, శిరోమణి అకాలీదళ్ 3, బీజేపీ 2, బీఎస్పీ 1 స్థానాల్లో గెలుపొందాయి. ఆప్ ఢిల్లీ మోడల్‌కు పంజాబీలు ఫిదా.. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ మోడల్‌కు పంజాబ్ ప్రజలు పట్టం కట్టారు. నాణ్యమైన విద్య, వైద్య, సుపరిపాలన అందిస్తామన్న ఆప్‌కు అధికారాన్ని అప్పగించారు. పంజాబీల ఓటు దెబ్బకు కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్.. ఆప్ దరిదాపుల్లో కూడా లేకుండాపోయాయి. ఢిల్లీలో అందిస్తున్నట్లే సుపరిపాలన అందిస్తామని ప్రచారం సందర్భంగా కేజ్రీవాల్ చెప్పారు. -
పెరుగుతున్న 'ఆప్' గ్రాఫ్.. తర్వాత టార్గెట్ ఆ రెండే..
న్యూఢిల్లీ: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అనితరసాధ్యమైన విజయంతో జాతీయ రాజకీయాల్లో ఆ పార్టీ ఎలా చక్రం తిప్పుతుందన్న చర్చ మొదలైంది. కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా ఉండడంతో జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు ఆప్ ప్రత్యామ్నాయంగా మారుతుందన్న విశ్లేషణలున్నాయి. 2012లో అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన ఆప్ జాతీయ పార్టీ హోదాకి అడుగు దూరంలో ఆగిపోయింది. గుజరాత్ మోడల్ నినాదంతో ప్రధాని మోదీ జాతీయ రాజకీయాల్లోకి వచ్చినట్టుగానే ఢిల్లీ మోడల్ పాలనతో అరవింద్ కేజ్రివాల్ జాతీయ స్థాయిలో చక్రం తిప్పడానికి వ్యూహరచన చేస్తున్నారు. పంజాబ్ విజయం ఇచ్చిన కిక్కుతో ఈ ఏడాది చివర్లో జరగబోయే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల బరిలో దిగుతున్నారు. అందులోనూ ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో అడుగుపెట్టబోతున్న ఆప్ ఎలాంటి మాయ చేస్తుందన్న ఉత్కంఠ నెలకొంది. అవినీతి రహిత పాలన కార్డుతోనే కేజ్రివాల్ ఏ రాష్ట్రంలోనైనా ప్రజల విశ్వాసాన్ని చూరగొంటున్నారు. దీంతో కాంగ్రెస్‌కే ఎక్కువగా నష్టం జరుగుతోంది. అందుకే కాంగ్రెస్‌కి ప్రత్యామ్నాయంగా ఆప్ ఎదుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ పార్టీగా అడుగు దూరం జాతీయ పార్టీగా గుర్తింపు రావాలంటే మూడు వేర్వేరు రాష్ట్రాల నుంచి లోక్‌సభలో 2% అంటే 11 సీట్లు రావాలి లేదా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 6% ఓట్లు–ఏదైనా రాష్ట్రం నుంచి నాలుగు లోక్‌సభ సీట్లు వచ్చి ఉండాలి. లేదంటే నాలుగు, అంతకు మించి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు ఉండాలి. వీటిలో ఆప్ ప్రస్తుతం నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో 6% ఓట్లు, నాలుగు లోక్‌సభ స్థానాలను సాధించడం ద్వారా జాతీయ పార్టీగా ఎదగాలని ప్రయత్నిస్తోంది. గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కి 54% ఓట్లు వస్తే, పంజాబ్‌లో ఇప్పుడు 42% ఓట్లు సాధించింది. గోవాలో ఆ పార్టీ ఓటు షేర్ 6.77% కాగా, ఉత్తరాఖండ్‌లో 4శాతానికి దగ్గరలో ఓట్లు సాధించింది. ఇక యూపీలో 0.3 శాతానికే పరిమితమైంది. లోక్‌సభలో కనీసం 4స్థానాలైనా సాధించాల్సి ఉండగా ఒక్క స్థానం మాత్రమే ఉంది. ఈ ఏడాది చివర్లో జరగనున్న గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన ఓట్లు సాధిస్తామన్న ఆత్మ విశ్వాసంతో ఆ పార్టీ ఉంది. 2024 ఎన్నికల నాటికి మూడు వేర్వేరు రాష్ట్రాల నుంచి 2% ఓట్లు సాధించినా ఆ పార్టీకి జాతీయ హోదా దక్కుతుంది. ఆప్ ప్రస్థానం సాగిందిలా.. ఏప్రిల్–డిసెంబర్, 2011 సామాజిక కార్యకర్త అన్నాహజారే ఢిల్లీ వేదికగా నిర్వహించిన అవినీతి వ్యతిరేక దీక్షలో కేజ్రివాల్ అందరికీ పరిచయమయ్యారు. అక్టోబర్, 2012 అన్నాహజారే నుంచి విడిపోయి ఇతర ఉద్యమకారులతో కలిసి కేజ్రివాల్ ఆప్‌ని స్థాపించారు. డిసెంబర్, 2013 ఢిల్లీ అసెంబ్లీ బరిలో తొలిసారిగా దిగిన ఆప్ 70 స్థానాలకు గాను తొలి ప్రయత్నంలో 28 సీట్లలో నెగ్గింది. ఫిబ్రవరి, 2014 ఢిల్లీ అసెంబ్లీలో సభ్యుల మద్దతు లేక జన్ లోక్‌పాల్ బిల్లుని పాస్ చేయించుకోవడంలో విఫలమైన ఆప్ ప్రభుత్వం రాజీనామా చేసింది. ఏప్రిల్–మే, 2014 లోక్‌సభ ఎన్నికల్లో 400కిపైగా స్థానాల్లో పోటీ చేసిన ఆప్ పంజాబ్ నుంచి 4 స్థానాల్లో నెగ్గింది ఫిబ్రవరి, 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 54% ఓటు షేరుతో 70 స్థానాలకు గాను 67 స్థానాల్లో విజయ దుందుభి మోగించింది. ఫిబ్రవరి, 2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 117 స్థానాల్లో 20 సీట్లలో విజయం సాధించింది. ఏప్రిల్–మే, 2019 లోక్‌సభ ఎన్నికలు వచ్చేసరికి ఆప్ గ్రాఫ్ పడిపోయింది. ఢిల్లీ, పంజాబ్, గోవాలో మాత్రమే దృష్టి సారించినప్పటిక పంజాబ్‌లో సంగ్రూర్ స్థానంలో విజయం సాధించగలిగింది. ఫిబ్రవరి 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 62 స్థానాల్లో నెగ్గింది. మార్చి, 2022 117 స్థానాలకు గాను 92 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. -
పంజాబ్‌లో ఆప్ సంచలనం.. 5 సార్లు సీఎంగా చేసిన నేతకూ తప్పని ఓటమి
చంఢీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ సంచలనం సృష్టించింది. ఎన్నికల సింబల్‌కు తగ్గట్టుగానే ఆమ్ఆద్మీ పార్టీ ఊడ్చిపారేసింది. స్థానాలు ఉన్న పంజాబ్‌లో జాతీయ పార్టీలను వెనక్కి నెట్టిన ఆప్ విజయం వైపు దూసుకెళ్లింది. పంజాబ్‌లో అధికార పార్టీని అడ్రస్ లేకుండా చేసింది. భారత్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ తర్వాత రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న మూడో పార్టీగా ఆప్ అవతరించింది. అయితే ఆప్ చేతిలో రాష్ట్రంలోని హేమాహేమీలు దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. ఇప్పటికే పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ, డిప్యూటీ సీఎం ఓపీ సోనీ, పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, అమరీందర్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ నేతల చేతులో ఘోర ఓటమిని చవిచూశారు. ఈ జాబితాలోకి మరో ఇద్దరు సీనియర్ నాయకులు కూడా చేరారు. శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడిగా ఉన్న సుఖ్బీర్ సింగ్ బాదల్.. జలాలాబాద్ నుంచి పోటీ చేసి ఆప్ అభ్యర్థి జగదీప్ కంబోజీ చేతిలో పరాజయం పాలయ్యారు. చదవండి: హోలీ ముందుగానే వచ్చింది, 2024లోనూ ఇదే రిపీట్ అవుద్ది: మోదీ అదే విధంగా మాజీ సీఎం శిరోమణి అకాలీదళ్ అగ్రనేత, కురు వృద్ధుడు అయిన ప్రకాష్ సింగ్ బాదల్.. లంబీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఆప్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ ఖుదియాన్ చేతిలో 11,396 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 94 ఏళ్ల బాదల్.. ఈ ఏడాది పంజాబ్ ఎన్నికల బరిలో నిలిచిన అత్యధిక వయస్సున్న వ్యక్తిగా నిలిచారు. ఇక ప్రకాష్ సింగ్ బాదల్ తన 65 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు పంజాబ్ ముఖ్యమంత్రిగా అయిదు సార్లు సేవలు అందించారు. 1969 నుంచి ఎన్నికల్లో ఓటమి ఎరుగని నేతగా రికార్డు సృష్టించారు. ఇలా ఎంతోమంది ప్రముఖులను ఆప్ అభ్యర్థులు మట్టి కరిపించారు. చదవండి: మూడు జంటలు.. ముచ్చటైన విజయాలు ప్రకాష్ సింగ్ కుమారుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ దాదాపు 30,000 తేడాతో ఆప్ అభ్యర్థి జగ్దీప్ కాంబోజ్ చేతిలో జలాలాబాద్ అసెంబ్లీలో ఓడిపోయాడు. పంజాబ్ ఆర్థిక మంత్రి, సుఖ్బీర్ బాదల్ బంధువు అయిన మన్‌ప్రీత్ సింగ్ బాదల్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి బటిండా అర్బన్ సీటులో ఆప్‌కి చెందిన జగ్రూప్ సింగ్ గిల్ చేతిలో ఓడిపోయారు. కాగా బాదల్ కుటుంబమే కాదు, బాదల్ కుటుంబానికి చెందిన చాలా మంది బంధువులు కూడా ఆప్ అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు. చదవండి: ఎన్నికల ఫలితాలపై స్పందించిన రాహుల్ గాంధీ.. ఏమన్నారంటే.. సుఖ్బీర్ బాదల్ బావమరిది అయిన బిక్రమ్ సింగ్ మజిథియా, అమృత్సర్ తూర్పు నియోజకవర్గం నుంచి ఆప్‌కి చెందిన జీవన్ జ్యోత్ కౌర్ చేతిలో ఓడిపోయారు. అయితే, బిక్రమ్ సింగ్ భార్య గనీవ్ కౌర్ తన భర్త సొంతగడ్డ అయిన మజితా అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. కాంగ్రెస్ పంజాబ్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూపై పోటీ చేసేందుకు మజితియా తన స్థానాన్ని వదిలిపెట్టారు. అయితే సిద్ధూ, బిక్రమ్ సింగ్ మజితియాను ఆప్‌కి చెందిన జీవన్ జ్యోత్ కౌర్ ఓడించారు. ప్రకాష్ సింగ్ బాదల్ అల్లుడు ఆదైష్ పర్తాప్ సింగ్ కైరోన్ తర్న్ తరణ్ జిల్లాలోని పట్టి అసెంబ్లీ స్థానంలో ఆప్‌కి చెందిన లల్జిత్ సింగ్ భుల్లర్ చేతిలో ఓడిపోయారు. మిస్టర్ కైరాన్ పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి పర్తాప్ సింగ్ కైరాన్ మనవడు. -
పంజాబ్‌లో ఆప్ "స్వీప్"ను ఆర్చర్ ముందే ఊహించాడా..?
Did Archer Predict AAPs Clean Sweep In Punjab: అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 2022 ఇవాళ (మార్చి 10) వెలువడిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని బంపర్ మెజర్టీతో జయకేతనం ఎగురవేసి, ప్రత్యర్ధి పార్టీలైన కాంగ్రెస్, శిరోమణి అకాలీదల్, బీజేపీలకు షాకిచ్చింది. మొత్తం 117 అసెంబ్లీ సీట్లు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో ఆప్ 90కి పైగా సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు దిశగా సాగుతుంది. ఈ క్రమంలో ఇవాళ ఆప్ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. YES! 😎 #AAPSweepsPunjab https://t.co/MAD1Wxzca0 — AAP (@AamAadmiParty) March 10, 2022 అవును, ఆప్ పంజాబ్‌ను ఊడ్చేసింది అంటూ.. ఆ పార్టీ ఇవాళ మధ్యాహ్నం 12:55 గంటలకు ఓ ట్వీట్ చేసింది. ఆప్ నిజంగానే పంజాబ్‌ను ఊడ్చేసింది కదా.. ఇందులో విశేషమేముందని అనుకుంటున్నారా..? ఇక్కడే ఆప్ ఓ ట్విస్ట్ ఇచ్చింది. గతంలో ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జోఫ్రా ఆర్చర్ చేసిన ఓ ట్వీట్‌ను ఈ పోస్ట్‌కి ట్యాగ్ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 20న ఆర్చర్ చేసిన ఆ ట్వీట్లో స్వీప్ అని పేర్కొని ఉంది. దీన్నే పంజాబ్‌లో తాము సాధించిన విజయంతో లింక్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. March 24th ? — Jofra Archer (@JofraArcher) March 1, 2013 ఆర్చర్ గతంలో చేసిన చాలా ట్వీట్లు యాదృచ్చికంగా నిజానికి దగ్గరగా ఉండటంతో ఆప్ చేసిన ఈ ట్వీట్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. 2013 మార్చిలో ఆర్చర్.. మార్చ్ 24? అని ట్వీట్ చేయగా, 2020వ సంవత్సరం అదే రోజు కరోనా వైరస్‌కు సంబంధించి భారత్‌లో లాక్డౌన్ ప్రకటన వెలువడింది. అలాగే అదే ఏడాది మార్చి 22న ఆర్చర్ లైట్స్ ఔట్ అని ట్వీట్ చేయగా, 2020 అక్టోబర్ 30న పవర్ గ్రిడ్ ఫెయిల్యూర్ కారణంగా ముంబైని చీకటి కమ్మేసింది. Come on russia! — Jofra Archer (@JofraArcher) June 22, 2014 ఇక కమాన్ రష్యా అంటూ ఆర్చర్ 2014 జూన్ 22న ట్వీట్ చేయగా, ఈ ఏడాది ఫిబ్రవరి 24న పుతిన్ సైన్యం ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించింది. ఇలా ఆర్చర్ చేసిన ట్వీట్లు యాదృచ్చికంగా ఏదో ఒక సందర్భంతో ముడిపడి ఉండటంతో నెటిజన్లు అతన్ని అభినవ నోస్ట్రడామస్ అని ముద్దుగా పిలుచుకుంటుంటారు. ఇదిలా ఉంటే, ఇవాళ ప్రకటించిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ జయకేతనం ఎగురవేయడంతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్.. పంజాబ్ సీఎం అభ్యర్ధి భగవంత్ మాన్‌ను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా దిగిన ఫోటోను కేజ్రీవాల్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. इस इंक़लाब के लिए पंजाब के लोगों को बहुत-बहुत बधाई। pic.twitter.com/BIJqv8OnGa — Arvind Kejriwal (@ArvindKejriwal) March 10, 2022 చదవండి: IPL 2022: సంగక్కర తొండాట.. అమాంతం పెరిగిపోయిన ఆర్చర్ ధర..! -
సీఎంను ఓడించిన సామాన్యుడు.. ఎవరతను?
ఎన్నికల ముందు వరకు అతడో సామాన్య యువకుడు. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రిని మట్టికరిపించి అసామాన్యుడిగా నిలిచాడు. ఈరోజు వరకు అతడి గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలీదు, కానీ ముఖ్యమంత్రిని ఓడించడంతో అతడి పేరు పతాక శీర్షికలకు ఎక్కింది. పంజాబ్ రాజకీయాల్లో సంచలనాలకు తెరతీసిన అతడి పేరు లభ్ సింగ్ ఉగోకే. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బర్నాలా జిల్లా బదౌర్ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి లభ్ సింగ్ గెలుపొందారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ ఛన్నీపై 37 వేల పై చిలుకు మెజారితో ఘన విజయం సాధించారు. లభ్ సింగ్‌కు 63 వేలకు పైగా ఓట్లు తెచ్చుకోగా, ఛన్నీకి కేవలం 26 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. ఎవరీ లభ్ సింగ్? 35 ఏళ్ల లభ్ సింగ్ సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. 12 తరగతి వరకు చదువుకుని మొబైల్ రిపేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. అతడి తండ్రి డ్రైవర్ కాగా, తల్లి ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్‌గా పనిచేస్తున్నారు. 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో వలంటీర్‌గా లభ్ సింగ్ చేరారు. తాజా ఎన్నికల్లో తనను అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి ప్రజల మధ్య ఉంటూ ఇంటింట ప్రచారం సాగించారు. ఎమ్మేల్యేగా తనను గెలిపిస్తే దౌర్ నియోజకవర్గ ఓటర్ల సమస్యలను పరిష్కరించే బాధ్యతను భుజాన వేసుకుంటానని అని చెప్పి ప్రజల నమ్మకాన్ని పొందారు. తనపై పోటీ చేస్తున్నది ముఖ్యమంత్రి అయినా కూడా లభ్ సింగ్ ఏమాత్రం భయపడలేదు. నిరాడంబరంగా తన ప్రచారం సాగించి విజయాన్ని అందుకున్నారు. లభ్ సింగ్ విజయాన్ని కేజ్రీవాల్ ప్రత్యేకంగా ప్రస్తావించి అభినందనలు తెలిపారంటే.. ఈ గెలుపు ప్రాముఖ్యత అర్థమవుతోంది. ఆప్ కంచుకోట.. బదౌర్ బదౌర్ నియోజకవర్గంలో రెండు పట్టణాలు, 74 గ్రామాలు ఉన్నాయి. 2017 ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి పిర్మల్ సింగ్ ధౌలా ఇక్కడ విజయం సాధించారు. అయితే గతేడాది ఆయన కాంగ్రెస్‌లో చేరారు. 2012లో బదౌర్‌లో కాంగ్రెస్ విజయం సాధించగా.. 1997, 2002, 2007లో శిరోమణి అకాలీదళ్ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. కాగా, బదౌర్ నియోజకవర్గం తమ పార్టీకి కంచుకోట అని, ముఖ్యమంత్రి పోటీ చేసినా ఓడిపోవడం ఖాయమని ఎన్నికలకు ముందు లభ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయి. సామాన్యుడికి పట్టంకట్టి సీఎంను ఓడించారు బదౌర్ ఓటర్లు. (క్లిక్: గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే?) ఆమెకు డిపాజిట్ గల్లంతు పంజాబ్ డిప్యూటీ స్పీకర్, మలౌట్ ఎమ్మెల్యే అజైబ్ సింగ్ భట్టి భార్య మంజిత్ కౌర్.. బదౌర్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయగా ఆమెకు డిపాజిట్ కూడా దక్కలేదు. శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి సత్నామ్ సింగ్ రాహి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. (క్లిక్: కమెడియన్ నుంచి సీఎం స్థాయికి..) -
పంజాబ్‌లో ఆప్ భారీ విక్టరీ.. కేజ్రీవాల్ స్పందన ఇదే..
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సంచలనం సృష్టించింది. పంజాబ్‌లో జాతీయ పార్టీలకు పెద్ద షాకిస్తూ ప్రభుత్వ ఏర్పాటుకు ఆప్ రూట్ క్లియర్ చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మోజార్టీతో దూసుకుపోతోంది. ఇప్పటికే 91 స్థానాల్లో ఆప్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆప్ నేతలు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఎన్నికల ఫలితాలపై ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేశారు. పంజాబ్ ప్రజలకు అభినందనలు.. సరికొత్త విప్లవానికి నాంది పలికారు అంటూ.. పంజాబ్ సీఎం అభ్యర్థి భగవంత్ సింగ్ మాన్‌తో ఉన్న ఫొటోను షేర్ చేశారు. इस इंक़लाब के लिए पंजाब के लोगों को बहुत-बहुत बधाई। pic.twitter.com/BIJqv8OnGa — Arvind Kejriwal (@ArvindKejriwal) March 10, 2022 -
రాజకీయ పండితులకు చెక్ పెట్టిన కేజ్రీవాల్.. మనీష్ సిసోడియా కామెంట్స్ ఇవే..
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ రికార్డ్ క్రియేట్ చేసింది. జాతీయ పార్టీలను తన స్టైల్లో చెక్ పెట్టింది. పంజాబ్‌లో ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ అయిన నాటి నుంచి పంజాబ్ రాజకీయాలపై ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. పోలింగ్ విధానంలో ప్రజలనే సీఎం అభ్యర్థిని ఎన్నుకోవాలని వినూత్నంగా ఆలోచించి ఎన్నికల ఫలితాల్లో సక్సెస్ అయ్యారు. మంచి విద్య, ఆరోగ్యం, సుపరిపాలన అందిస్తామని హామీ ఇచ్చిన ఆమ్ ఆద్మీకే పంజాబ్ ఓటర్లు పట్టం కట్టారు. ఎన్నికల ఫలితాల్లో ఆప్ గెలుపుపై ఆప్ నేత మనీష్ సిసోడియా స్పందించారు. ఈ సందర్భంగా సిసోడియా మీడియాతో మాట్లాడుతూ.. ఇది ‘ఆమ్ ఆద్మీ’ (సామాన్యుడి) విజయమని అన్నారు. కేజ్రీవాల్ పాలనా విధానాన్ని పంజాబ్ ప్రజలు ఆమోదించారని తెలిపారు. ఆప్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుందని పేర్కొన్నారు. దేశ ప్రజలు సైతం కేజ్రీవాల్ ప్రభుత్వం తరహా పాలనను కోరుకుంటున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. తాము యూపీ, గోవా, ఉత్తరాఖండ్‌లో కూడా పార్టీ తరఫున అభ్యర్థులను బరిలో దింపినట్టు తెలిపారు. అక్కడ కూడా ప్రజలు తమ పార్టీపై నమ్మకంతో ఓట్లు వేశారని అన్నారు. ఆ రాష్ట్రాల్లో ఫలితాలు, పార్టీ పని తీరుపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని వెల్లడించారు. #WATCH Punjab has accepted Kejriwal's model of governance. It has gained recognition at the national level. People in the entire country will seek this model of governance, says AAP leader Manish Sisodia pic.twitter.com/iVtBjv271Q — ANI (@ANI) March 10, 2022 -
కాంగ్రెస్‌ను ముంచేసి..ఇప్పుడు రాజీనామానా?
చంఢీగఢ్: పంజాబ్‌లో అధికార పార్టీ కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలింది. ఈసారి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్న కాంగ్రెస్‌కు ఘోర పరాభవం ఎదురైంది. పంజాబ్ కాంగ్రెస్‌లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ, సీఎం చరణ్‌సింగ్ చన్నీల మధ్య విభేదాలు చోటు చేసుకున్నా చివరి నిమిషంలో వాటిని పక్కన పెట్టే వారు పోటీకి సన్నద్ధమయ్యారు. అయినా ఇది కాంగ్రెస్‌కు సత్ఫలితాలను ఇవ్వలేదు. కాంగ్రెస్ గ్రూపు రాజకీయంతో విసుగుపోయిన ప్రజలు ఆప్కే పట్టం కట్టారు. ఆది నుంచి కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టిన ఆప్ అతి పెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంది. పంజాబ్‌లో ఆప్ ఏకపక్ష విజయం సాధించగా, కాంగ్రెస్ పూర్తిగా ఢీలా పడిపోయింది. కాంగ్రెస్‌కు సిద్ధూ గుడ్ బై? పంజాబ్ సీఎం పీఠం నుంచి అమరీందర్ సింగ్ వైదొలగడానికి ప్రధాన కారణమైన సిద్ధూ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి తర్వాత రాజీనామా చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. సీఎం పదవి ఆశించే పంజాబ్ కాంగ్రెస్‌లో మంట రాజేసిన సిద్ధూ.. ఆపై సీఎం కావొచ్చనే భావించాడు. కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం చన్నీని ముఖ్యమంత్రి చేసింది. ఇది కూడా సిద్ధూకి జీర్ణించలేదు. పార్టీ మారదామనే ప్లాన్ చేశాడు. మొత్తం కాంగ్రెస్‌నే విచ్ఛిన్నం చేద్దామనే అనుకున్నాడు. తనకు దక్కనిది వేరే వాళ్ల దక్కడంతో వివాదాలకు ఆజ్యం పోశాడు. కానీ చివరకు రాహుల్ గాంధీ జోక్యంతో సిద్ధూ వెనక్కి తగ్గి కాంగ్రెస్‌తో నడిచాడు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా చన్నీని అధిష్టానం ప్రకటించినా సిద్ధూ మిన్నుకుండిపోయాడు. సీఎం క్యాండిడేట్ తనకు ప్రాబ్లమ్ లేదని, తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని చెప్పాడు. ఇప్పుడు కాంగ్రెస్ దారుణ పరాజయం దిశగా సాగుతుండటంతో సిద్ధూకు రాజీనామ ఒక్కటే మార్గంలా కనబడుతోంది. ఇవాళ సాయంత్రం ఆ రాష్ట్ర సీఎల్పీ సమావేశం నిర్వహించాలని భావించినా అందుకు పలువురు కాంగ్రెస్ నేతలు దూరంగా ఉండాలని అనుకున్నారట. అందులో సిద్ధూ కూడా ఉన్నాడని, తాను రాజీనామా చేయబోతున్నట్లు సీఎల్పీకి సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. పంజాబ్‌లో కాంగ్రెస్‌కు చేసిన నష్టమంతా చేసి ఇప్పుడు రాజీనామా డ్రామాకు తెరలేపడం మళ్లీ హాట్‌టాపిక్ అయ్యింది. చదవండి: పంజాబ్‌లో అఖండ ‘ఆప్ కీ సర్కార్’.. ఫలించిన ‘ఎక్ మౌకా’ నినాదం -
యూపీలో ఈసారి సీఎం ఆయనే!
-
కేజ్రీవాల్ కాబోయే ప్రధాన మంత్రి.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్
ఛండీగఢ్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా కీలక చర్చ నడుస్తోంది. కాగా, యూపీ, పంజాబ్ ఫలితాలపై ఎక్కువ ఉత్కంఠ నెలకొంది. యూపీలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని, పంజాబ్‌లో ఆప్(ఆమ్ ఆద్మీ పార్టీ) గెలుస్తుందని పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్ నేత, పంజాబ్ ఎన్నికల సహ ఇన్ఛార్జ్ రాఘవ్ చద్దా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. దేశ ప్రజల ఆశాకిరణమని, దేవుడి దయ, ప్రజలు అవకాశం ఇస్తే కాబోయే ప్రధాన మంత్రి ఆయనే అంటూ కామెంట్స్ చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ జాతీయ రాజకీయాల్లో కీ రోల్ పోషిస్తూ రాజకీయ శక్తిగా ఎదుగుతుందన్నారు. అయితే, గురువారం ఓట్ల లెక్కింపు నేపథ్యంలో రాఘవ్ చద్దా కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంజాబ్‌లో తమ పార్టీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే జాతీయ రాజకీయాల్లో కేజ్రీవాల్ తనదైన ముద్ర వేస్తున్నారని ప్రశంసించారు. కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యామ్నాయ పార్టీని అని తెలిపారు. రాబోయే రోజుల్లో కేజ్రీవాల్.. ప్రధాన మంత్రి స్థాయిలో హోదాలో కనిపిస్తారంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అంతటితో ఆగకుండా బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి పదేళ్లు పట్టిందని అన్నారు. కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడి.. పదేళ్లు కూడా కాకపోయినప్పటికీ రెండు రాష్ట్రాల్లో తమ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, ఎన్నికల ఫలితాల వేళ ఆయన ఇలా మాట్లాడటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. -
ఎగ్జిట్ పోల్స్ మేం నమ్మం.. మేమే అధికారంలోకి వస్తాం
చండీగఢ్: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలను శిరోమణి అకాలీదళ్ కొట్టిపారేసింది. బీఎస్పీతో కలిసి తమ పార్ట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, అవసరమైతే బీజేపీతో చేతులు కలుపుతామని శిరోమణి అకాలీదళ్ అధికార ప్రతినిధి దల్జిత్ సింగ్ చీమా అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, ఎగ్జిట్ పోల్స్‌ను తాము విశ్వసించబోమని చెప్పారు. 2017 పంజాబ్ ఎన్నికల్లో ఆప్ కేవలం 20 సీట్లు మాత్రమే గెలుచుకుందని దల్జిత్ సింగ్ గుర్తు చేశారు. ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్‌కు తమ పార్టీ ఎప్పుడూ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని తెలిపారు. ‘ఎన్నికల సమయంలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో ప్రజల మధ్య ఉన్న వారికి మాత్రమే తెలుసు. మాకు మంచి ఫలితాలు వస్తాయని, అకాలీదళ్-బీఎస్పీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మేము నమ్ముతున్నాం. మేం మెజారిటీ సాధిస్తామ’ని దల్జిత్ సింగ్ పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా అని ప్రశ్నించగా.. ‘అలాంటి ప్రశ్న అప్రస్తుతం. ఎన్నికల తుది ఫలితాలు వచ్చిన తర్వాత అప్పటి పరిస్థితిని బట్టి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. మేము పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం రాదని ఆశిస్తున్నామ’ని అన్నారు. (క్లిక్: పంజాబ్‌లో వచ్చేది ఆ పార్టీయేనా? ఆసక్తికర ఫలితాలు) -
పంజాబ్‌లో వచ్చేది ఆ పార్టీయేనా? ఆసక్తికర ఫలితాలు
పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధికారంలోకి రానుందా? అంటే అవుననే అంటోంది పీపుల్స్ పల్స్ సర్వే. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అతిపెద్ద పార్టీగా అవతరించబోతోందని అంచనా వేసింది. హైదరాబాద్‌కు చెందిన పీపుల్స్ పల్స్ సంస్థ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 1 వరకు పోస్ట్ పోల్ సర్వే నిర్వహించింది. దీని ఆధారంగా ఆమ్ ఆద్మీ పార్టీకి 59 నుంచి 66 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అధికార కాంగ్రెస్ 23 నుంచి 28 స్థానాలు గెలుచుకునే చాన్స్ ఉంది. శిరోమణి అకాలీదళ్‌కు 17 నుంచి 21 సీట్లు, బీజేపీకి 2 నుంచి 6 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఇతరులు ఒకటి నుంచి నాలుగు స్థానాల్లో పాగా వేయనున్నారు. ‘ఆప్’కు అత్యధిక ఓట్లు ఓట్ల శాతాన్ని పరిగణన లోకి తీసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి 40 శాతం ఓట్ షేర్ రానుంది. కాంగ్రెస్ పార్టీకి 30 శాతం, అకాలీదళ్‌కు 20 శాతం, బీజేపీకి 8 శాతం, ఇతరులకు 2 శాతం ఓట్లు రావొచ్చని సర్వే అంచనా వేసింది. 2017 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చిన 23 శాతం ఓట్ షేర్‌కు ఈసారి అదనంగా 17 శాతం కలుస్తుందని వెల్లడించింది. కాంగ్రెస్‌కు గత ఎన్నికల్లో 38.5 శాతం ఓట్లు రాగా, ఈసారి అందులో 8.5 శాతం తగ్గుతుందని తెలిపింది. తమ అంచనాలు ఐదు శాతానికి అటుఇటుగా ఉండొచ్చని పీపుల్స్ పల్స్ పేర్కొంది. సీఎంగా భగవంత్ మాన్! ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు భగవంత్ మాన్‌పైపు పంజాబ్ ప్రజలు మొగ్గు చూపారు. ప్రస్తుత సీఎం చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ రెండో స్థానానికి పడిపోయారు. భగవంత్ మాన్.. ముఖ్యమంత్రి కావాలని 39 శాతం మంది, ఛన్నీ సీఎం కావాలని 30 శాతం మంది కోరుకున్నారు. సుఖ్బీర్ సింగ్ బాదల్‌వైపు 20 శాతం మంది మొగ్గు చూపారు. ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన నవజ్యోత్ సింగ్ సిద్ధూకు పంజాబీలు గట్టిషాక్ ఇచ్చారు. కేవలం 6 శాతం మంది మాత్రమే ఆయన సీఎం కావాలని ఆకాంక్షించారు. మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను కోరుకునే వారి సంఖ్య 3 శాతం మాత్రమే. వీరెవరూ వద్దని 2 శాతం మంది అభిప్రాయపడ్డారు. అలా జరిగేలా లేదు! ధరల పెరుగుదల, నిరుద్యోగం, కనీస మద్దతు ధర, అక్రమ ఇసుక తవ్వకాలు, మద్యం మాఫియా, మాదకద్రవ్యాల ముప్పు, అవినీతి, పెరుగుతున్న రాష్ట్రం అప్పులు గురించి పంజాబ్ ప్రజలు ఎక్కువగా సర్వేలో ప్రస్తావించారు. ప్రభుత్వ వ్యతిరేకత.. ఆమ్ ఆద్మీ పార్టీకి సానుకూలంగా మారే సూచనలు కన్పిస్తున్నాయి. 'యాక్సిడెంటల్' ముఖ్యమంత్రిగా తెర మీదకు వచ్చిన చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ సంఖ్యాపరంగా బలమైన షెడ్యూల్డ్ కులాల (32 శాతం) ఓట్లను గణనీయంగా సంపాందించి పెడతారన్న అంచనాలు ఉన్నాయి. దళితులకు అండగా ఉంటే కాంగ్రెస్‌కు మెజారిటీ వచ్చే అవకాశముందని.. కానీ అలా జరిగేలా కనిపించడం లేదని సర్వే వెల్లడించింది. పంజాబ్‌లో అధికారి మార్పిడి జరగాలని ఆప్ చేసిన ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్లినట్టు తెలుస్తోంది. అలాగే ఢిల్లీ తరహాలో విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేస్తామని ఆ పార్టీ ఇచ్చిన ‘ఢిల్లీ మోడల్’హామీ కూడా వర్కవుట్ అయినట్టుగానే కనబడుతోంది. రీజియన్ల వారీగా చూసుకుంటే... మాల్వా ప్రాంతంలో ఆప్ హవా ఉంది. దోబా ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి ఆప్ గట్టి పోటీ ఇచ్చినట్టు సమాచారం. మజా ప్రాంతంలో అకాలీదళ్, ఆప్ హోరాహోరీ తలపడినట్టు కనబడుతోంది. సర్వే ఇలా.. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత 25 నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించినట్టు పీపుల్స్ పల్స్ వెల్లడించింది. 53 శాతం మంది పురుషులు, 47 శాతం మహిళలను సర్వే చేసినట్టు తెలిపింది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసుకుని వివిధ సామాజిక వర్గాల చెందిన 18 నుంచి 60 ఏళ్లు పైబడిన వారి అభిప్రాయాలు సేకరించారు. ఎగ్జిట్ పోల్స్ ఏమంటున్నాయి? ఆమ్ ఆద్మీ పార్టీకి 76 నుంచి 90 సీట్లు వస్తాయని ఇండియా టుడే అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 19 నుంచి 31.. అకాలీదళ్‌కు 7 నుంచి 11, బీజేపీకి ఒకటి నుంచి 4, ఇతరులకు 2 స్థానాలు దక్కే అవకాశముంది. న్యూస్-18 ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఆప్‌కు 60, కాంగ్రెస్‌కు 27, అకాలీదళ్‌కు 25 సీట్లు వస్తాయని అంచనా. ఆత్మసాక్షి అంచనా ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీకి 58 నుంచి 61, కాంగ్రెస్ పార్టీకి 34 నుంచి 38, అకాలీదళ్‌కు 18 నుంచి 21, బీజేపీకి 4 నుంచి 5 సీట్లు గెల్చుకునే అవకాశాలున్నాయి. -
కేంద్రం సంచలన నిర్ణయం.. ఆ వార్తా సంస్థ టీవీ, యాప్స్‌పై నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. సిక్కు వేర్పాటువాద సంస్థతో సంబంధాలు కలిగి ఉన్న ‘పంజాబ్ పాలిటిక్స్ టీవీ’పై కేంద్ర ప్రభుత్వం కేంద్రం కొరడా ఝుళిపించింది. సదరు వార్తా సంస్థకు చెందిన వెబ్సైట్, యాప్‌లు, సోషల్ మీడియా అకౌంట్లను నిషేధించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. అయితే, నిఘా వర్గాల సమాచారం మేరకు Sikhs For Justice (SFJ)తో ఆ వార్తా సంస్థకు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఇదిలా ఉండగా.. ఈ ఛానెల్ ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా తప్పుడు వార్తలను ప్రసారం చేసినట్టు నిఘా వర్గాలు తెలిపాయని కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో, ఐటీ నిబంధనల్లోని అత్యవసర అధికారాలను ఉపయోగించి వార్తా సంస్థపై నిషేధం విధించినట్టు కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. Ministry of Information & Broadcasting has ordered blocking of apps, website, and social media accounts of foreign-based “Punjab Politics TV” having close links with Sikhs For Justice — ANI (@ANI) February 22, 2022 -
సోనూ సూద్‌పై కేసు నమోదు.. ఎందుకో తెలుసా..?
Punjab Legislative Assembly Election 2022: ఎన్నికల ప్రవర్తనా నియామావళికి సంబంధించి పంజాబ్‌లోని మోగా అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు సినీ నటుడు సోనూ సూద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 188 కింద ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మోగా నియోజకవర్గం నుంచి సోనూ సూద్ సోదరి మాళవిక సూద్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేశారు. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రాలను సందర్శించకుండా అధికారులు ఆదివారం సోనూను అడ్డుకున్న సంగతి తెలిసిందే. -
సోనూసూద్ ఎస్‌యూవీని స్వాధీనం చేసుకున్న పోలీసులు!
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మోగా పోలింగ్ బూత్ వద్ద బాలీవుడ్ నటుడు, సామాజిక కార్యకర్త అయిన సోనూసూద్ ఎస్యూవీ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మోగా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సోనూ సూద్ సోదరి మాళవికా సూద్ సచార్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన తన సోదరి మాళవిక సూద్ సచార్ కోసం బాలీవుడ్ నటుడు మోగాలో క్యాంప్ చేస్తున్నాడు. అయితే మోగా జిల్లాలోని లంధేకే గ్రామంలో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సోనూ సూద్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాన్ని (ఎస్యూవీ) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల పరిశీలకుల సూచన మేరకు వాహనాన్ని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఎస్డీఎం-కమ్-రిటర్నింగ్ అధికారి సత్వంత్ సింగ్ కూడా సోనూ సూద్ ఇంటిపై వీడియో నిఘాను ఆదేశించారు. ఈ మేరకు సిటీ పోలీస స్టేషన్ ఆఫీసర్ దేవిందర్ సింగ్ మాట్లాడుతూ ..అనుమానాస్పద కార్యాచరణ ఆధారంగా ఎస్‌యూవీని స్వాధీనం చేసుకున్నాము. లంధేకే గ్రామంలోని పోలింగ్ బూత్ దగ్గర ఎస్యూవీ తిరుగుతున్నట్లు మాకు ఫిర్యాదు అందింది. మేము దానిని స్వాధీనం చేసుకున్నాము. అంతేకాదు అతను మోగాలో ప్రచారం చేస్తున్నప్పుడు ఆ వాహనాన్ని ఉపయోగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సోనూ సూద్‌కు మోగా నియోజకవర్గంలో ఓటు లేనందున ఆ ప్రాంతంలోకి వెళ్లడానికి వీల్లేదని ఇంట్లోనే ఉండాలని ఎస్డీఎం-కమ్-రిటర్నింగ్ అధికారి సత్వంత్ సింగ్ కూడా ఆదేశించారు. అయితే అతను ఆ ఆదేశాలను ఉల్లంఘించాడు. తదుపరి విచారణలు జరుగుతున్నాయి. అని అన్నారు. ఈ విషయమై సోనూసూద్‌ను మాట్లాడుతూ.. “శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి బర్జిందర్ సింగ్, అలియాస్ మఖన్ బ్రార్, నాపై తప్పుడు ఫిర్యాదు చేశారు. ఇది కేవలం పార్కింగ్ సమస్య మాత్రమే. వాహనం సరిగ్గా పార్క్ చేయలేదు. ఇంకేమీ లేదు" అని చెప్పారు. (చదవండి: కాంగ్రెస్‌కే ఓటు వేయండి అని బీజేపీ ప్రచారం ! తప్పుగా అర్థం చేసుకున్నారంటూ వివరణ) -
Assembly Election 2022: ముగిసిన యూపీ మూడో దశ పోలింగ్
-
ఎన్నికల వేళ కేంద్ర హెం శాఖ కీలక నిర్ణయం.. ఆయనకు ‘వై’ కేటగిరి భద్రత
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల వేళ నాయకుల మధ్య విమర్శల దాడి కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మాజీ నేత కుమార్ విశ్వాస్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్.. పంజాబ్ ముఖ్యమంత్రి లేదంటే ఖలిస్తాన్ ప్రధాని కావాలని అనుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. తాను వేర్పాటు వాదినే అయితే అరెస్ట్ చేయలేదన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఇలా నేతల మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కుమార్ విశ్వాస్‌కు వై కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్టు హోం శాఖ శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే కుమార్ విశ్వాస్‌కు ముప్పు పొంచి ఉందనే నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రత కల్పించినట్టు హోం శాఖ తెలిపింది. ‘వై’ కేటగిరీ భద్రత ఇదే.. వై కేటగిరి భద్రతలో మొత్తం 11 మంది భద్రతా సిబ్బంది ఉంటారు. వీరిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ కమాండోలు విధులు నిర్వర్తిస్తారు. అయితే, వీరిలో కొంత మంది కుమార్ విశ్వాస్ నివాసం వద్ద భద్రతలో ఉంటారు. మిగిలిన వారు కుమార్ విశ్వాస్ ఎటు వెళ్లినా ఆయనతో పాటే వెళ్తారు. -
కాంగ్రెస్‌కే ఓటు వేయండి అని బీజేపీ ప్రచారం ! తప్పుగా అర్థం చేసుకున్నారంటూ వివరణ
న్యూఢిల్లీ: పంజాబ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచార ర్యాలీలో బీజేపీ నాయకుడు అశ్వనీ శర్శ బీజేపీకి ఓటు వేయకపోతే కాంగ్రెస్‌కి వేటు వేయండి కానీ ఆప్‌కి ఓటు వేయకండి అని అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో అశ్వనీ శర్మ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. "ఆప్‌కి ఓటేస్తే ఉగ్రవాదానికి ఓటే వేయడమే.. పంజాబ్‌ను విచ్ఛిన్నం చేయడానికి వేసిన ఓటు.. ఆప్‌కి ఓటేస్తే దేశానికి, పంజాబ్‌కు ద్రోహం చేసినట్టే.. మాకు (బీజేపీ) ఓటు వేయకూడదనుకుంటే కాంగ్రెస్‌కు ఓటు వేయండి, దేశానికి ద్రోహం చేసే వారికి ఓటు వేయవద్దు" అని అన్నానంటూ వివరణ ఇచ్చారు. అంతేకాదు తన వ్యాఖ్యాలను తప్పుడు అవగాహనతో అర్థంచేసుకుంటున్నారంటూ ఆరోపించారు. అబద్దాలను ప్రచారం చేయడం కాగ్రెస్‌కు ఎప్పుడూ ఉన్న అలవాటే అని విమర్శించారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు నా ప్రకటనను వక్రీకరించారన్నారు. పంజాబ్‌కి ఆప్, కాంగ్రెస్‌లు రెండు మేలు చేయవు, ప్రమాదకరమైనవే, కమలం బటన్ నొక్కి బీజేపీకి మీ అమూల్యమైన ఓటు వేయండి అని మరోక వీడియాలో తన వ్యాఖ్యల పై వివరణ ఇస్తూ పేర్కొన్నారు. అంతేకాదు మరోవైపు శనివారం సాయంత్రంతో పంజాబ్‌లో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. (చదవండి: కేజ్రీవాల్‌పై కేసు నమోదు) -
ఎన్నికల వేళ.. కేజ్రీవాల్, చన్నీలపై కేసు నమోదు
ఛండీఘడ్: మరికొన్ని గంటల్లో పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై పోలీసు కేసు నమోదైంది. అకాలీదళ్, ఇతర రాజకీయ పార్టీలను దూషించారన్న ఆరోపణలపై పంజాబ్ ఎన్నికల పోలింగ్ అధికారి విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో కేజ్రీవాల్‌పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే దూషించినట్లు ఒక వీడియో సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతుండటంపై ఆయా పార్టీ నేతలు కేజ్రీవాల్‌పై పంజాబ్ ఈసీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరోవైపు శనివారం సాయంత్రంతో పంజాబ్‌లో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. కాగా, ప్రచార సమయం ముగిసినప్పటికీ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ ఇంటింటి ప్రచారం నిర్వాహించారంటూ కేసు నమోదైంది. చన్నీతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి, పంజాబీ గాయకుడు శుభ్ దీప్ సింగ్ పైనా కూడా కేసు నమోదు చేశారు. -
సిక్కు ప్రముఖులతో మోదీ భేటీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం పలువురు సిక్కు మత ప్రముఖులతో తన నివాసంలో సమావేశమయ్యారు. సిక్కు మతస్తుల కోసం తమ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను వారికి వివరించారు. పంజాబ్ అసెంబ్లీకి మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగనుండగా జరిగిన ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్, అకాలీదళ్ తిరుగుబాటు వర్గం నేత సుఖ్‌దేవ్ సింగ్ థిండ్సాలతో ఏర్పడిన తమ కూటమి బలమైందని చూపి, సిక్కు వర్గం ఓట్లు, వారి మద్దతు కూడగట్టేందుకు బీజేపీ శాయశక్తులా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా జరిగిన ఈ సమావేశానికి ఢిల్లీ గురుద్వారా కమిటీ అధ్యక్షుడు హర్మీత్ సింగ్ కల్కా, పద్మశ్రీ గ్రహీత బాబా బల్బీర్ సింగ్ సిచేవాల్, యమునానగర్‌కు చెందిన మహంత్ కరంజీత్ సింగ్, కర్నాల్‌కు చెందిన బాబా జోగా సింగ్, అమృత్‌సర్‌కు చెందిన సంత్ బాబా మెజోర్ సింగ్ సహా పలువురు సిక్కు ప్రముఖులు హాజరైనట్లు అధికారవర్గాలు తెలిపాయి. దేశ సేవ,, రక్షణతోపాటు, సిక్కు సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేయడంలో సిక్కు నేతలు ముందున్నారని అనంతరం ప్రధాని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. -
ఆప్‌కి ‘ఒక్క చాన్స్’ ఇస్తారా!
అన్ని పార్టీలనూ అంతర్గత సమస్యలు వేధిస్తున్నాయ్. ప్రతీ స్థానంలోనూ బహుముఖ పోటీ నెలకొని గుబులు పుట్టిస్తోంది. పంజాబ్‌లో మార్పు కోసమేనంటూ పోటాపోటీగా ఇచ్చిన హామీలు ఎవరికెంత లాభం చేకూరుస్తాయి? ఢిల్లీ మోడల్ పాలన అంటున్న ఆప్‌కు పంజాబీలు ‘ఒక్క చాన్స్’ ఇస్తారా! దళిత కార్డుతో రాజకీయం చేస్తున్న హస్తం పార్టీకే వరుసగా రెండోసారి అధికారపీఠం అప్పగిస్తారా? పంజాబ్‌లో ఇప్పుడు అందరి మదిలోనూ ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు ఎప్పుడైతే గెలుచుకుందో అప్పట్నుంచి ఢిల్లీకి వెలుపల ఆ పార్టీ విస్తరణ మొదలైంది. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోయినా 20 సీట్లు , 23.72% ఓటు షేరుతో పంజాబ్ అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేక చతికిలపడిపోయినా.. ఇప్పుడు బలం పుంజుకొని అధికార కాంగ్రెస్‌కు ప్రధాన పోటీదారుగా నిలిచి గట్టి సవాల్ విసురుతోంది. ఢిల్లీ మోడల్ పరిపాలన, అధికారంలోకి వస్తే గృహాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆప్‌కున్న క్లీన్ ఇమేజ్, ముఖ్యంగా విద్య, ఆరోగ్య రంగాల్లో ఢిల్లీలో ఆప్ చేస్తున్న అభివృద్ధి పంజాబ్‌లోని దిగువ మధ్యతరగతిని ఆకర్షిస్తోంది. తప్పుల్ని సరిదిద్దుకుంటూ.. 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేసిన తప్పుల్ని దిద్దుకుంటూ ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. ప్రాంతీయ పార్టీ కాకపోవడంతో బయటవాళ్లు అన్న ముద్ర, ప్రత్యర్థులందరూ ఇదే అంశాన్ని పదే పదే ఎత్తిచూపిస్తూ ప్రచారం చేస్తున్నప్పటికీ, ఆప్ తనదైన శైలిలో ముందుకు వెళుతోంది. మరే రాజకీయ పార్టీ చేయని విధంగా టెలి ఓటింగ్ ద్వారా పార్టీ రాజ్యసభ సభ్యుడు భగవంత్ మన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టింది. పంజాబ్ ఓటర్లలో 45 శాతం ఉన్న.. 96 లక్షల మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకుంది. 12 మంది విద్యాధికులైన మహిళలకు టికెట్లు ఇచ్చింది. అక్రమ ఇసుక తవ్వకాలపైనే ఆప్ ప్రధానంగా దృష్టి సారించింది. అక్రమ ఇసుక తవ్వకాలను అరికడితే రాష్ట్రానికి 20 వేల కోట్ల ఆదాయం వస్తుందని, దానిని సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించవచ్చునని కేజ్రివాల్ విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ ఇసుక మాఫియాలో సీఎం చన్నీ సహా కాంగ్రెస్ మంత్రులందరూ ఉన్నారని ఆయన ఆరోపిస్తూ వచ్చారు. అయితే కాంగ్రెస్, లేదంటే అకాలీల పాలనే గత కొన్ని దశాబ్దాలుగా చూసిచూసి విసిగెత్తిన ప్రజలకు ఆప్ ఒక బలమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. పంజాబ్ యువత కూడా ఆప్‌వైపే చూస్తున్నారు. అయినప్పటికీ ఆ పార్టీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. గత అయిదేళ్లలో 20 మందిలో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడారు. సంస్థాగతంగా పార్టీ బలంగా లేదు. కార్యకర్తల బలం కనిపించడం లేదు. సీఎం అభ్యర్థి భగవంత్ మన్ సమర్థుడు కాదన్న వాదనలు ఉన్నాయి. కేజ్రివాల్ క్రేజ్‌తోనే ఆ పార్టీ గట్టిగా నిలబడుతోంది. కాంగ్రెస్‌కు కాంగ్రెస్సే శత్రువు కాంగ్రెస్‌లో ముఠా తగాదాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూయే ఆ పార్టీకి ప్లస్ అవుతారో, మైనస్‌గా మారుతారో తలపండిన రాజకీయ నాయకులకి సైతం అర్థం కావడం లేదు. ‘కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ మాత్రమే ఓడించగలదు’ అని ఇటీవల బహిరంగంగా చెప్పిన సిద్ధూ సీఎం అభ్యర్థి చరణ్‌జిత్ సింగ్ చన్నీకి పక్కలో బల్లెంలా ఉన్నారు. అయితే చన్నీ దళితుడు కావడం, రాష్ట్ర జనాభాలో 32 శాతం వారే ఉండటంతో కాంగ్రెస్‌కి కాస్త అనుకూలంగా మారింది. గత ఏడాది సెప్టెంబర్‌లో సీఎం పదవిలోకి వచ్చిన చన్నీ కొద్ది కాలంలోనే తీసుకున్న నిర్ణయాలు కూడా ప్రజల్ని ఆకర్షించేలా ఉన్నాయి. స్వల్పకాలంలోనే చన్నీ ప్రభుత్వం 60 నిర్ణయాలను అమలు చేసింది దానికి సంబంధించిన రిపోర్ట్ కార్డుని కూడా విడుదల చేసింది. అసంఘటిత కార్మికులకు వేతనాలు, పెంపు, ప్రభుత్వ ఉద్యోగులకు పే కమిషన్, నిర్మాణ రంగ కార్మికులకు ప్రత్యేక సాయం, పదో తరగతి వరకు పంజాబీ భాష తప్పనిసరి, 2 కిలోవాట్ల లోడ్ వరకు గృహ వినియోగదారుల విద్యుత్ బకాయిల మాఫీ , లక్ష కొత్త రేషన్ కార్డుల జారీ వంటివెన్నో చేపట్టారు. ఇక తాము అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. మాదకద్రవ్యాలు, ఇసుక అక్రమ తవ్వకాలను అరికట్టడానికి మిషన్ క్లీన్‌ని కాంగ్రెస్ ప్రారంభించింది. నోట్ దిస్ పాయింట్స్ ► బీజేపీతో పొత్తు ఉండబట్టి రెండుసార్లు అధికారం చేపట్టింది కానీ గత ఇరవై ఏళ్లలో ఏ ఎన్నికలను తీసుకున్నా.. అకాలీదళ్‌కు సొంతంగా వచ్చిన ఓట్లు 35 శాతం దాటలేదు. ► మరోవైపు బీజేపీని తీసుకుంటే హిందువులు మెజారిటీగా ఉన్న నాలుగు జిల్లాలు, పట్టణ ప్రాంతాలకే ఆ పార్టీ పరిమితమైంది. అకాలీదళ్‌తో పొత్తు ఉన్నందువల్ల బీజేపీ గ్రామీణ పంజాబ్‌లోని 94 స్థానాల్లో (మొత్తం 117 అసెంబ్లీ స్థానాలు) ఏనాడూ పోటీచేయలేదు. ► బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో 2012లో గరిష్టంగా 7.8 శాతం ఓట్లు వచ్చాయి. కొత్త పొత్తులతో లాభం ‘ఇల్లె’! ఈసారి ఎన్నికల కోసం శిరోమణి అకాలీదశ్, బీఎస్పీలు 2021 జూన్‌లోనే కూటమి కట్టాయి. అకాలీదళ్ నేత సుఖ్బీర్సింగ్ బాదల్ చాలాముందు నుంచే టికెట్లు ఖరారు చేశారు. 20 మందికి పైగా కొత్త ముఖాలకు టిక్కెట్లిచ్చారు. అయితే బీఎస్సీ అధినేత్రి పంజాబ్‌పై దృష్టి పెట్టకపోవడం.. ఇక్కడ ప్రచారానికి రాకపోవడం అకాలీదళ్ అవకాశాలను బాగా దెబ్బతీసే అంశమే. ఇక బీజేపీ, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ లోక్ కాంగ్రెస్ కూటమి ప్రభావం నామమాత్రంగానే ఉంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. – నేషనల్ డెస్క్, సాక్షి -
కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల..
ఛండీగఢ్: అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఓటర్లపై వరాల జల్లులు కురిపిస్తున్నాయి. పంజాబ్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఆసక్తికరంగా మారింది. రెండు రోజుల్లో ఎన్నికలకు పోలింగ్ జరుగనున్న క్రమంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మాట్లాడుతూ.. గురునానక్ స్ఫూర్తితో మేనిఫెస్టోను రూపొందించినట్టు తెలిపారు. కొత్తగా ఏర్పడబోయే కాంగ్రెస్ ప్రభుత్వం.. మద్యం అమ్మకాలు, ఇసుక తవ్వకాలపై మాఫియా రాజ్‌ను అంతం చేస్తుందన్నారు. ఈ క్రమంలోనే సముద్రం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎవరైనా పైలట్ కావచ్చు, కానీ తుఫాను వచ్చినప్పుడు, మనం కష్టాలను అవకాశంగా మార్చుకోగలగాలి.. అదే కాంగ్రెస్ మేనిఫెస్టో లక్ష్యమని సిద్ధూ పేర్కొన్నారు. కాగా, నూనెగింజలు, పప్పులు, మొక్కజొన్నలను ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తున్నట్టు సిద్దూ వెల్లడించారు. మేనిఫెస్టోలోని అంశాలు.. - పంజాబ్‌లో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు. - మహిళలకు నెలకు రూ.1,100 అందజేత. - ఏడాదికి 8 ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు. -
రెండు రోజుల్లో పోలింగ్.. మోదీ ఇంట కీలక సమావేశం
ఛండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గెలుపే లక్ష్యంగా ప్రచారంలో జోరును పెంచింది. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ కమలం నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే, మరో రెండు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో దేశవ్యాప్తంగా సిక్కు మతానికి చెందిన ప్రముఖులకు ప్రధాని ఆతిథ్యమిచ్చారు. బీజేపీ గెలుపును కాంక్షిస్తూ వారితో కీలక సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా వారు.. సిక్కుల పవిత్రమైన కిర్పన్(ఖడ్గం)ను మోదీకి అందజేశారు. ఈ సమావేశంలో ఢిల్లీ గురుద్వారా కమిటీ అధ్యక్షుడు హర్మీత్ సింగ్ కల్కా, పద్మశ్రీ అవార్డు గ్రహీత బాబా బల్బీర్ సింగ్జీ సించేవాల్, తదితరులు పాల్గొన్నారు. కాగా, పంజాబ్‌లో ఫిబ్రవరి 20న ఎన్నికలకు పోలింగ్ జరుగనుండగా.. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. -
నేను ఉగ్రవాదినే.. సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ, ఆప్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శల దాడులు చేసుకుంటున్నారు. నేతల తీవ్ర ఆరోపణతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. తాజాగా ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్.. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం వేర్పాటువాదులకు మద్దతిస్తున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్ ‘పంజాబ్ సీఎం లేదా ఖలిస్తాన్ ప్రధానమంత్రి’ కావాలనుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై శుక్రవారం కేజ్రీవాల్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఉగ్రవాదినేని ఒప్పుకున్నారు. ఈ క్రమంలోనే ప్రజల కోసం ఆసుపత్రులు, పాఠశాలలు నిర్మించి స్వీటెస్టు టెర్రరిస్టును(sweetest terrorist) అయ్యానంటూ వ్యాఖ్యలు చేశారు. అనంతరం బీజేపీ, కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. తాను వేర్పాటువాదిని అని ప్రధాని మోదీకి తెలిస్తే.. ఈ ఆరోపణలను ఎందుకు నిరూపించలేదని, దర్యాప్తు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. తనను జాతీయ పార్టీల నేతలు(కాంగ్రెస్, బీజేపీ) దేశాన్ని రెండు ముక్కలుగా చేయాలని చూస్తున్నారని, ఒక భాగానికి ప్రధానిని కావాలని ఆరోపిస్తున్నారని ఎద్దేవా చేశారు. వారి వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. తాను నిజంగా వేర్పాటు వాదిని, టెర్రరిస్టుని అయితే.. కేంద్ర భద్రతా సంస్థలు ఏం చేస్తున్నాయి. ప్రధాని మోదీజీ నన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు. వారు నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కూడా 10 సంవత్సరాలు అధికారంలో ఉంది కదా అని మాటల తూటాలు పేల్చారు. ఈ సందర్భంగానే అన్ని పార్టీలు అవినీతిమయం అయ్యాయంటూ కేజ్రీవాల్ విమర్శించారు. ఆప్‌ను ఓడించేందుకు అందరూ కలిసిపోయారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు కుమార్ విశ్వాస్ చేసిన ఆరోపణలపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. కొందరు వ్యక్తులు పంజాబ్‌ను విభజించాలని కలలు కంటున్నారు. వారు అధికారంలోకి రావడం కోసం వేర్పాటువాదులతో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. మరోవైపు 'వేర్పాటువాదం' ఆరోపణలపై విచారణ జరిపించాలని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రధాని మోదీని కోరారు. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 20వ తేదీన పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగనుంది. మార్చి 10వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. -
పార్టీని విడిచిపెట్టను.. గెంటేస్తే తప్పా
న్యూఢిల్లీ: తాను కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టబోనని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మనీష్ తివారి స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన పార్టీని వీడుతున్నట్టు ఊహాగానాలు వచ్చాయి. వీటిపై ఆయన స్పందిస్తూ.. ‘నేను కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లాలని అనుకోవడం లేదు. పార్టీ నుంచి నన్ను గెంటేయాలని ఎవరైనా అనుకుంటే అది వేరే విషయం. నా జీవితంలో 40 ఏళ్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చాన’ని అన్నారు. పంజాబ్‌లోని ఆనంద్‌పూర్ సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పంజాబ్‌లో అధికారం నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్.. మనీష్ తివారి సేవలను వినియోగించుకోవడం లేదు. దీంతో ఆయన తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. (క్లిక్: సీఎం ఛన్నీ, ప్రియాంక గాంధీపై మోదీ ఆగ్రహం) గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంపై మనీష్ తివారి ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. దీంతో హైకమాండ్ ఆయనను పక్కన పెట్టింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలోనూ ఆయన చోటు దక్కలేదు. గాంధీల నాయకత్వాన్ని ప్రశ్నించినందుకు ఆయనకు అధిష్టానం విధించిన 'శిక్ష'గా ఈ పరిణామాన్ని పరిగణించారు. అయితే పార్టీలో ప్రజాస్వామ్య సంస్కరణలను తాను కోరుకుంటున్నానని తివారి చెప్పారు. (క్లిక్: పంజాబ్‌లోని ఈ ఎన్నారై బెల్ట్‌లో హోరాహోరీ పోరు) ఆయన రాజీనామా ఆందోళన కలిగిస్తోంది ఒక చిన్న పార్టీ కార్యకర్త కాంగ్రెస్‌ను వీడినా కాంగ్రెస్‌కే నష్టమని మనీష్ తివారి అన్నారు. సీనియర్ నేతలు పార్టీని వీడితే పెద్ద నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు అశ్వనీ కుమార్ మంగళవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 46 ఏళ్ల పాటు కాంగ్రెస్ కొనసాగిన అశ్వనీ కుమార్.. పార్టీని వీడటం పట్ల తివారి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన రాజీనామా దురదృష్టకరమని, కాంగ్రెస్‌కు తీవ్ర ఆందోళన కలిగించే అంశమని అన్నారు. కాగా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 25న ఒకే విడతలో జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడతాయి. -
ప్రతి సమస్యకు తొలి ప్రధాని నెహ్రునే నిందిస్తున్నారు: మన్మోహన్ సింగ్
న్యూఢిల్లీ: పంజాబ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వీడియా సందేశంలో ప్రజలను కాంగ్రెస్‌కి ఓటు వేయాలని కోరారు. ప్రతి సమస్యకు తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూనే నిందిస్తున్నారంటూ మన్మోహన్ సింగ్ ప్రధాని నరేంద్రమోదీ పై విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి పదవికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందంటూ ఆక్రోసించారు. అంతేకాదు ఆ వీడియోలో రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ఎన్నడూ దేశాన్ని విభజించలేదని మోదీకి కౌంటరిచ్చారు. దేశం ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యతో ప్రజలు సతమతమవుతుంటే గత ఏడున్నరేళ్లుగా అధికారంలో ఉన ప్రస్తుతం ప్రభుత్వం తమ తప్పులన ఒప్పుకోకుండా ప్రతి సమస్యకు తొలి ప్రధాని నెహ్రూనే కారణమంటూ ఇప్పటికీ నిందిస్తూనే ఉన్నారని ఆరోపించారు. అంతేకాదు మీరు మీ స్వంత లోపాలను తగ్గించే క్రమంలో చరిత్రను నిందించలేరంటూ వక్కాణించారు. ప్రపంచం ముందు దేశ ప్రతిష్టను పోగొట్టుకోనివ్వను, అలాగే భారతదేశ గర్వాన్ని నేనెప్పుడూ కించపరచలేదంటూ విమర్శలు గుప్పించారు. అంతేకాదు తనపై తప్పడు ఆరోపణలు చేసిన బీజేపీ, ఆ పార్టీకి సంబంధించిన బీ అండ్ సీ టీమ్‌లు గురించి దేశం ముందు బహిర్గతం అవుతున్నందుకు ఆనందంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. (చదవండి: సర్జికల్ స్ట్రైక్స్, అయోధ్య విషయంలో వారు సంతోషంగా లేరు! ప్రధాని ఆగ్రహం) -
అక్కడ అడుగుపెట్టనివ్వరా.. సీఎం, ప్రియాంక గాంధీపై మోదీ ఆగ్రహం
ఛండీగఢ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేళ నేతల మధ్య ప్రతి విమర్శల పర్వం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర పదజాలంతో విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా గురువారం ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్‌లోని రూమ్‌నగర్ వద్ద ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంజాబ్ సీఎం చరణ్‌జీత్ సింగ్ ఛన్నీ, ప్రియాంక గాంధీ వాద్రాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఛన్నీ చేసిన వ్యాఖ్యలను మోదీ తప్పుబట్టారు. అయితే, బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం చన్నీ..“Don't let UP, Bihar ke bhaiya enter Punjab.” ‘యూపీ, బీహార్ కే భయ్యాను పంజాబ్‌లోకి రానివ్వకండి’ అని పరోక్షంగా బీజేపీపై విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పక్కనే ఉండి నవ్వుతూ, చప్పట్లు కొట్టారు. దీంతో, చన్నీ, ప్రియాంకపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్‌లోని ఎవరినీ రానివ్వరా అంటూ ఘాటు వ్యాఖ్యలు సంధించారు. వారి వ్యాఖ్యలపై ఎన్నికల ప్రచారంలో మోదీ మాట్లాడుతూ.. సంత్ రవిదాస్ పంజాబ్‌లో జన్మించలేదు. యూపీలో పుట్టారు. అలాగే, గురుగోవింద్ సింగ్ కూడా పంజాబ్‌లో జన్మించలేదు. ఆయన బీహార్‌లోని పాట్నాలో జన్మించారు. వీరంతా పంజాబ్‌లో జన్మించలేదు. ఇప్పుడు మీరు వారికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. సంత్ రవిదాస్ పేరును చెడగొడతారా అంటూ విమర్శలు గుప్పించారు. గురుగోవింద్ సింగ్‌కు జరిగిన అవమానాన్ని పంజాబ్ ప్రజలు సహిస్తారా అని అన్నారు. ఇలాంటి విభజన మనస్తత్వం ఉన్న వ్యక్తులను పంజాబ్‌ను పాలించడానికి అనుమతించకూడదని ప్రధాని మోదీ పంజాబీలను కోరారు. -
దౌబాలో నువ్వా నేనా?
ముక్కోణ, చతుర్ముఖ పోటీలు దౌబాలో చాలా స్థానాల్లో త్రిముఖ, చతుర్ముఖ పోటీ నెలకొంది. అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న చమ్‌కౌర్ సాహిబ్ నుంచి సీఎం చన్నీ నాలుగోసారి బరిలో దిగారు. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన ఆప్ అభ్యర్థి డాక్టర్ చరణ్‌జిత్ మరోసారి పోటీ చేస్తున్నారు. ఇక జలంధర్ కాంట్‌లో పంజాబ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, విద్యా, క్రీడల మంత్రి పర్గత్ సింగ్ మూడోసారి బరిలో దిగారు. అకాలీదళ్ నుంచి జగ్బీర్ బ్రార్, బీజేపీ నుంచి సరబ్జిత్ సింగ్ మక్కర్, ఆప్ నుంచి సురీందర్ సింగ్ సోధి ఆయనకు గట్టి పోటీ ఇస్తున్నారు. హోషియార్పూర్, ఫగ్వారా, నవాన్షహర్ సహా పలు అసెంబ్లీ స్థానాల్లో హోరాహోరీ పోటీ ఖాయంగా కన్పిస్తోంది. దళితులను బాగా ప్రభావితం చేయగల డేరాలను ప్రసన్నం చేసుకునేందుకు కూడా పార్టీలు పోటాపోటీగా ప్రయత్నిస్తున్నాయి. ఎన్నారై బెల్ట్‌గా పేరున్న పంజాబ్‌లోని దౌబా ప్రాంతంలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు నెగ్గేందుకు కాంగ్రెస్, అకాలీదళ్, ఆప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దళిత ప్రాబల్య ప్రాంతం కావడంతో ఆ వర్గాన్ని ఆకట్టుకొనేందుకు జోరుగా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే వారికి రకరకాల వాగ్దానాలు చేశాయి. అకాలీదళ్ తన కుల సమీకరణాలను సరిదిద్దుకొనేందుకు బీఎస్పీతో పొత్తు పెట్టుకుంది. దళితులకు డిప్యూటీ సీఎం పదవి ప్రకటించింది. బీజేపీ అయితే వారికి సీఎం పదవే హామీ ఇచ్చింది. ఇక కాంగ్రెస్ దళితుడైన చరణ్‌జిత్ సింగ్ చన్నీని మళ్లీ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. జలంధర్, కపుర్తలా, హోషియార్పూర్, నవాన్షహర్ జిల్లాలతో కూడిన దౌబాలో 23 అసెంబ్లీ స్థానాలున్నాయి. 20న పోలింగ్ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, బీఎస్పీ చీఫ్ మాయావతి తదితరులు ఇప్పటికే దోబాలో ప్రచారం చేశారు. దోబాలో దళితుల రాజకీయ ఆధిపత్యం కొనసాగుతోంది. ఇక్కడి జనాభాలో 45 శాతం దాకా దళితులున్నారని అంచనా. వీరు ప్రధానంగా రెండు వర్గాలు. గురు రవిదాస్ అనుయాయులైన రవిదాసియాలు ఒక వర్గం కాగా, వాల్మీకులు మరో వర్గం. ఇక్కడ రవిదాసియాలది ఆధిపత్యం. దౌబాలోని హోషియార్పూర్, జలంధర్ లోక్‌సభ సెగ్మెంట్లను ఎస్సీలకు రిజర్వ్ చేశారు. వీటి పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో వారి ఆధిపత్యం మరింతగా ఉంది. సన్యశ్యామల ప్రాంతం కావడంతో దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే దౌబాలోని దళితులు ఆర్థికంగా బలంగా, ప్రభావశీలంగా ఉన్నారు. ఏ ఎన్నికల్లోనూ వీరు ఒకే పార్టీకి ఏకమొత్తంగా ఓట్లు వేసిన దాఖలాల్లేవు. గత ఎన్నికల్లో దౌబాలో 15 సీట్లు నెగ్గి ఆధిపత్యం ప్రదర్శించిన కాంగ్రెస్‌కు ఈసారి గట్టి పోటీ ఎదురవుతోంది. – సాక్షి, న్యూఢిల్లీ -
ప్రధాని మోదీ భద్రతపై ‘డర్టీ పాలిటిక్స్’.. సీఎం ఫైర్
ఛండీఘర్ : అసెంబ్లీ ఎన్నికల వేళ పంజాబ్ రాజకీయాల్లో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అధికార పార్టీ నేతలు, ప్రతిపక్ష నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ప్రధాని మోదీకి సైతం పంజాబ్ పర్యటనలో చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. మోడీ పర్యటన సందర్బంగా ప్రధానిని పంజాబ్ ప్రజలు ప్లై ఓవరపై అడ్డుకున్నారు. దాదాపు 20 నిమిషాలు ప్రధానిని అడ్డుకోవడంతో బీజేపీ తలపెట్టిన బహిరంగ సభకు మోడీ హాజరు కాకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. బీజేపీ నేతలు పంజాబ్ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. దేశ ప్రధానికి కూడా భద్రత కల్పించలేని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు భద్రత కల్పిస్తుందా అని ప్రశ్నించారు. ఇక, ఈసారి ఎన్నికల్లో అధికారమే లక్క్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ, ఆప్ ఎలక్షన్ బరిలో నిలిచాయి. ఇదిలా ఉండగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం లూథియానాలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని భద్రత అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని భద్రతపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలవి డర్టీ పాలిటిక్స్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని భద్రత, జాతీయ సెక్యూరిటీ అంశాలపై తాము అనవసర రాజకీయాలు చేయబోమని కేజ్రీవాల్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే ప్రతీ పంజాబీ పౌరుడికి భద్రత కల్పిస్తామన్నారు. ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాష్ట్ఱ భద్రత కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. పంజాబ్ దేశ సరిహద్దు రాష్ట్రం కాబట్టి ఇక్కడ డ్రగ్స్, డ్రోన్ల వంటి అంశాలపై తగు చర్యలు తీసుకునేందుకు నిజాయితీ కలిగిన ప్రభుత్వం అసరమంటూ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, పంజాబ్ లో ఫిబ్రవరి 20వ తేదీన అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగనుంది. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. -
పంజాబ్ పర్యటనలో చేదు అనుభవం.. మరోసారి గుర్తు చేసుకున్న మోదీ
జలంధర్: పంజాబ్ గత పర్యటనలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని మరోమారు ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. స్థానిక అధికారులు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో గతంలో తాను జలంధర్ ఆలయాన్ని దర్శించుకోలేకపోయానని చెప్పారు. కాంగ్రెస్ పాలనలోని పంజాబ్‌లో పరిస్థితులు ఇలా తయారయ్యాయని ఆయన విమర్శలు గుప్పించారు. త్వరలో తాను మరలా జలంధర్ వచ్చి దేవీ తాలబ్ మందిర్‌ను తప్పక దర్శించుకుంటానన్నారు. ఎన్నికల సందర్భంగా నగరంలో ఆయన ర్యాలీ నిర్వహించారు. జనవరి 5న పంజాబ్ వచ్చిన పీఎం కాన్వాయ్ ఒక ఫ్లైఓవర్‌పై చాలాసేపు నిలిచిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రధాని పంజాబ్ రావడం ఇదే తొలిసారి. జనవరిలో తాను గుడికి వెళ్లాలని చెప్పగా అధికారులు తనను వెంటనే హెలికాప్టర్లో వెనక్కుపొమ్మన్నారని, పంజాబ్‌లో ప్రభుత్వ పనితీరు ఇలా ఉందని ఆయన ర్యాలీలో దుయ్యబట్టారు. పంజాబ్‌లో కాంగ్రెస్ క్షీణిస్తోందని, ఆ పార్టీ నాయకులే పార్టీ బలహీనతలు బయటపెడుతున్నారని మోదీ వ్యాఖ్యానించారు. చదవండి: (Punjab Assembly Election 2022:సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఆ ఇద్దరు) ట్రిపుల్ తలాక్ రద్దుతో వేలాదిమందికి రక్షణ తమ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయడంతో వేలాది మంది ముస్లిం మహిళలకు రక్షణ లభించిందని ప్రధాని మోదీ చెప్పారు. యూపీలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కట్టుదిట్టంగా అమలు చేయడం వల్ల ముస్లిం యువత నిర్భయంగా తిరగగలుగుతున్నారని చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్రాన్ని దోచుకుందని ఆయన దుయ్యబట్టారు. హిందూ ఓట్లను విడగొట్టేందుకే తాము గోవాలో పోటీ చేస్తున్నామన్న టీఎంసీ నేత ప్రకటనను ఆయన గుర్తు చేశారు. ఈ విషయాన్ని యూపీ ప్రజలు గర్తు పెట్టుకోవాలన్నారు. -
Punjab: సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఆ ఇద్దరు
అమృత్సర్: పంజాబ్ ఎన్నికల ప్రచారంలో ఇద్దరు కూతుళ్లు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. తండ్రుల గొప్పదనాన్ని వివరిస్తూ వారు ప్రచారం చేస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ కుమార్తె రుబియా కౌర్ సిద్ధూ, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రివాల్ కూతురు హర్షిత ఈసారి తండ్రులకు తోడుగా తొలిసారి ప్రచారంలోకి దిగారు. ఎంతో అనుభవమున్నట్టుగా, ఓటర్లలో సెంటిమెంట్ రగిలేలా మాట్లాడుతున్నారు. సిద్ధూ పోటీ చేస్తున్న అమృత్సర్ తూర్పు నియోజకవర్గంలో రుబియా ప్రచారం చేశారు. సింగపూర్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ చదివిన ఆమె తన తండ్రిపై ప్రేమను అడుగడుగునా ప్రదర్శిస్తున్నారు. సిద్ధూను సీఎం అభ్యర్థిగా చేయకపోవడంపై ఆమె ప్రచారంలో కంటతడి పెట్టుకున్నారు కూడా! ‘‘ఒక కూతురిగా నేనొక్కటే చెప్పదలచుకున్నా. ప్రజాకర్షణ, నీతి నిజాయితీ ఉన్న వ్యక్తి సీఎం అభ్యర్థి కాలేకపోయారు. మున్ముందు ఏం జరగనుందో చూద్దాం. నీతిమంతుల్ని ఎవరూ ఎక్కువ కాలం ఆపలేరు. అలాగే అవినీతిపరులకు ఎదురుదెబ్బ తప్పదు’’ అన్నారు. పంజాబ్ ప్రజలు పేద సీఎంను కోరుకుంటే, చన్నీ కోట్లకు పడగలెత్తారని, ఆయన బ్యాంకు ఖాతాల్లోనే 133 కోట్లుంటాయని ధ్వజమెత్తారు. చదవండి: (కేజ్రీవాల్‌ను ఆంగ్లేయులతో పోల్చిన సీఎం.. దోచుకోవడానికే వస్తున్నాడంటూ..) కేజ్రివాల్ కుమార్తె హర్షిత ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మన్ తరఫున ధురిలో ప్రచారం చేశారు. తన తండ్రి పంజాబ్ బాలల కోసమే ఎక్కువగా ఆలోచిస్తారని, వారు బాగా చదువుకొని వృద్ధిలోకి వస్తే భావి భారతం బాగుంటుందని చెప్పుకొచ్చారు. ఐఐటీ ఢిల్లీలో చదివిన హర్షిత తనపై తండ్రి ప్రభావం చాలా ఉందని చెప్పారు. ‘‘నా స్నేహితులు చాలామంది విదేశాలకు వెళ్లిపోయారు. నేనూ వెళ్లిపోయి ఉండొచ్చు. కానీ ఇక్కడే ఉండి దేశం కోసం పని చేయాలని నాన్న చెప్పారు. ఉద్యోగమైనా, వ్యాపారమైనా దేశం కోసం చేస్తేనే తృప్తి’’ అంటూ నాన్నను ఆకాశానికెత్తేశారు. -
పంజాబ్‌లో ఆప్... ఉత్తరాఖండ్‌లో బీజేపీ?
ఐదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. పంజాబ్(ఫిబ్రవరి 20), ఉత్తరాఖండ్(నేడు)లలో ఒకే విడతలో జరగనున్న ఓటింగ్‌లో పార్టీల అంతర్గత కుమ్ములాటలు, నేతృత్వ సమస్యలు ఓటర్లను ప్రభావితం చేయనున్నాయి. మూడు కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోసం సాగిన రైతుల ఉద్యమం ఎటూ కీలకపాత్ర పోషించనుంది. పంజాబ్‌లో ఈసారి కాంగ్రెస్, బీజేపీలను ఆమ్ ఆద్మీ పార్టీ వెనక్కినెట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ సొంతంగా మెజారిటీ వస్తుందని చెప్పలేం. ఇక ఉత్తరాఖండ్‌లో బీజేపీ గెలిచే అవకాశం కనబడుతున్నా, ఆమ్ ఆద్మీ ఇక్కడా కింగ్ మేకర్ పాత్ర పోషించే వీలుంది. ఢిల్లీకి ప్రతిష్ఠాత్మక సీఎస్డీఎస్, ఎన్నికల విశ్లేషణ ‘సాక్షి’కి ప్రత్యేకం. భారతదేశ రాజకీయాల్లో పంజాబ్, ఉత్తరా ఖండ్ కొంత ప్రత్యేకం. సామాజిక వర్గాల ఆధిపత్యం పార్టీల తీరుతెన్నులపైనా ప్రభావం చూపే ప్రాంతాల్లో ఈ రెండు రాష్ట్రాలు ఉంటాయి. చరిత్రను తరచిచూస్తే పంజాబ్ జనాభాలో 58 శాతం ఉన్న సిక్కులు రాజకీయంగానూ బలవంతు లన్న విషయం స్పష్టం. ఉత్తరాఖండ్ విషయానికి వస్తే... అరవై శాత మున్న అగ్రవర్ణాలదే ఆధిపత్యం. ఈ రెండు రాష్ట్రాల ముఖ్య మంత్రులు కూడా ఈ వర్గాల వారే. ఉత్తరాఖండ్‌లో నేడు, పంజాబ్‌లో ఫిబ్రవరి 20న జరిగే ఎన్నికల్లోనూ ఇదే పంథా కొనసాగే అవకాశాలు మెండు. భారత రాజకీయాల్లో కుల, మతాధిపత్యాల ఆధారంగా వివక్ష చాలాకాలంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సమీప భవి ష్యత్తులో అంతమవుతుందని కూడా అశించలేము. పంజాబ్, ఉత్తరా ఖండ్ రెండింటిలోనూ పార్టీలు అంతర్గత కుమ్ములాటలు, నేతృత్వ సమస్యలతో కొట్టుమిట్టాడాయి. ఈ పరిణామాలతో ముఖ్యమంత్రు లనూ మార్చాల్సి వచ్చింది. కాంగ్రెస్ పంజాబ్‌లో ఒకసారి ముఖ్య మంత్రిని మారిస్తే, ఉత్తరాఖండ్‌లో బీజేపీ రెండుసార్లు ఈ పని చేయాల్సి వచ్చింది. ఢిల్లీలో ఏడాదికిపైగా సాగిన రైతు ఉద్యమం (పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రైతులు ఎక్కువగా పాల్గొ న్నారు) కారణంగా నూతన వ్యవసాయ చట్టాల రద్దు జరిగింది. ఇప్పుడు ఈ అంశం ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల అంశంగానూ మారింది. ఈ ఉద్యమం సందర్భంగా రాజధానిలో జరిగిన ఘటనలు కొన్ని పంజాబ్‌లో దళితులందరూ (32 శాతం జనాభా) ఒకవైపునకు కేంద్రీకృతమయ్యేందుకు దోహదపడింది. ముఖాముఖి నుంచి బహుముఖానికి... పంజాబ్‌లో చాలావరకూ ముఖాముఖి పోటీలే జరిగేవి. శిరో మణి అకాలీదళ్–బీజేపీల కూటమి ఒకవైపు, కాంగ్రెస్ ఇంకోవైపు నిలబడగా సాగిన పోటీలకు 2017లో ఆమ్ ఆద్మీ పార్టీ రంగ ప్రవేశంతో తెరపడినట్లు అయ్యింది. పోటీ త్రిముఖమైంది. రావి, బియాస్ నదుల మధ్యలో ఉండే మాఝా ప్రాంతంలో గురు ద్వారాలు, డేరాలు రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తూంటాయి. దోబా విషయానికి వస్తే ఇది ఎన్ఆర్ఐలు ఎక్కువగా ఉండే ప్రాంతం. బియాస్, సట్లెజ్ నదుల మధ్యలో ఉంటుంది. ఈ ప్రాంత జనాభాలో దళితులు (37 శాతం), చిన్న, సన్నకారు రైతులు ఎక్కువ. సట్లెజ్కు ఆవల ఉండే మాల్వా ప్రాంతం జమీందార్లు, పెద్ద రైతులు ఎక్కువగా ఉండే ప్రాంతం. 2017లో కాంగ్రెస్ మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో 77 గెలుచుకుని విజయం సాధించగా... వచ్చిన ఓట్లు దాదాపు 39 శాతం. మాల్వా ప్రాంతంలోని 69 స్థానాల్లో కాంగ్రెస్ 40 చేజిక్కించుకుంది. అలాగే మాజాలోని 25 స్థానాల్లో 22, దోబా ప్రాంతంలోని 23 స్థానాల్లో 15 గెలుచుకుని అధికారం చేపట్టింది. ఆ ఎన్నికల్లో 20 స్థానాలతో ఆమ్ ఆద్మీ పార్టీ రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఆసక్తి కరంగా ఈ పార్టీ మాల్వా ప్రాంతంలో 18, దోబాలో 2 స్థానాలు గెలు చుకోవడమే కాకుండా... మొత్తమ్మీద 23 శాతం ఓట్లు సాధించ గలిగింది. అప్పట్లో అధికార పక్షం శిరోమణి–బీజేపీ కూటమికి 31 శాతం ఓట్లు దక్కినా... సాధించిన సీట్లు మాత్రం 18 మాత్రమే. ఇప్పుడు పోటీ త్రిముఖ స్థాయి నుంచి బహుముఖానికి మార డంతో రాష్ట్రంలో ఓ పెద్ద రాజకీయ మార్పునకు రంగం సిద్ధమవు తోంది. ఈ ఎన్నికల్లో చర్చకు వస్తున్న అంశాలు కొత్త సీసాలో పాత సారా చందంగానే ఉన్నాయి. మాదకద్రవ్యాలు, ఇసుక, మద్యం, కేబుల్ మాఫియా సమస్య, నిరుద్యోగం, రైతు సంక్షోభం, అవినీతి, పెరిగిపోతున్న ప్రభుత్వ రుణాల వంటివి ప్రధానాంశాలుగా మారాయి. ఇటీవలి కాలంలో ప్రాధాన్యం సంతరించుకుంటున్న మరో అంశం గురుద్వారాలో మతగ్రం«థాలకు జరిగిన అవమానం. నాయ కత్వ స్థాయిలో కుమ్ములాటల వంటి సమస్యలతో కాంగ్రెస్ పార్టీ నిన్నమొన్నటివరకూ చెల్లాచెదురుగా ఉన్నా... పంజాబ్ తొలి దళిత ముఖ్యమంత్రిగా చరణ్‌జీత్ సింగ్ చన్నీ ప్రకటనతో ఈ కుమ్ములాటకు కొంతవరకూ తెరపడింది. కానీ పాలనపరమైన వైఫల్యాలు, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, చన్నీ, సిద్దూలతో కులాలు, మతాల ఆధారంగా రాజకీయ సమీకరణలు చేయడం వంటి అంశాలు ఆ పార్టీ అవకాశాలకు గండికొట్టే ప్రమాదముంది. రాష్ట్రంలో దళితులు 32 శాతం వరకూ ఉండగా... జాట్లు 20 శాతం వరకూ ఉన్న విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. దళితుడిని ముఖ్యమంత్రిగా చేయడం ద్వారా రాజకీయంగా ఒక మెట్టు పైనున్నా ఇది జాట్ల వ్యతిరేకతకు దారితీసే ప్రమాదం కాంగ్రెస్ వెన్నంటే ఉంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ తమ సీఎం అభ్యర్థి భగవంత్ సింగ్ మాన్ ద్వారా కాంగ్రెస్‌ను నేరుగా ఢీకొంటోంది. మాన్, కేజ్రీవాల్‌లు ప్రకటించిన పది అంశాల అభివృద్ధి ప్రణాళిక మాల్వా ప్రాంతంలో తన బలాన్ని పెంచుకునేందుకు, ఇతర ప్రాంతాల్లో లాభాలు తెచ్చి పెట్టేందుకు ఉపయోగపడుతుందని అంచనా. బీజేపీ మాజీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఏర్పాటు చేసిన కొత్త పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ)తో కలసి ఈసారి బరిలోకి దిగు తోంది. శిరోమణి నుంచి వేరుపడ్డ వర్గపు పార్టీ శిరోమణి (సంయుక్త) కూడా కాషాయ పార్టీ కూటమిలో భాగంగా ఉంది. బీజేపీ ఈ సారి 65 స్థానాల్లో పోటీ చేస్తూండగా పీఎల్సీ 38 స్థానాల్లో, శిరోమణి (సంయుక్త) 14 స్థానాల్లో పోటీ పడుతున్నాయి. హిందూ, సిక్కు ఓటర్లను తమవైపునకు తిప్పుకునేందుకు ఈ కూటమి ప్రయత్ని స్తోంది. కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ, బోర్డర్ సెక్యూరిటీ అంశాల ఆధారంగా మాజా ప్రాంతంలో పట్టు సాధించే దిశగా అడుగు లేస్తోంది. సుఖ్బీర్ సింగ్ బాదల్ నేతృత్వంలోని శిరోమణి ఎన్డీయే నుంచి వేరుపడ్డ తరువాత ఈసారి ఎన్నికల కోసం బీఎస్పీతో జట్టు కట్టింది. రైతు ఉద్యమంలో భాగమైన 22 యూనియన్లతో ఏర్పాటైన సంయుక్త సమాజ్ మోర్చా బి.ఎస్.రాజేవాలా నేతృత్వంలో తొలిసారి ఎన్నికల బరిలోకి దిగింది. ఎన్నికలకు ముందు నిర్వహించిన ఒపీనియన్ పోల్స్ ప్రకారం పంజాబ్‌లో ఈ సారి ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచే అవకా శాలు ఉన్నాయి. అయితే ఈ పార్టీకి సొంతంగా మెజార్టీ వచ్చే అవకా శాలు తక్కువ. కాకపోతే బహుముఖ పోటీ నేపథ్యంలో ఓట్లు ఎలా చీలతాయో చెప్పడం కొంత కష్టమే. 1972 నుంచి ఇప్పటివరకూ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఓటర్లు ఎల్లప్పుడూ ఒక పార్టీ లేదా కూటమి వైపే మొగ్గారు. ఈ సారి కూడా అదే పరిస్థితి కొనసాగుతుందా? లేదా? అన్నది వేచి చూడాలి. దేవభూమిలో రసవత్తర రాజకీయం... ఉత్తరప్రదేశ్ నుంచి వేరు చేయగా ఏర్పడ్డ పర్వతప్రాంత రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో ఈసారి రాజకీయం రసవత్తరంగా ఉండనుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. నేడు ఓటింగ్ జరగనున్న ఈ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. 2017లో మోదీ హవా కారణంగా బీజేపీ 47 శాతం ఓట్లతో మొత్తం 57 స్థానాలు దక్కించుకోగా, కాంగ్రెస్ 11 స్థానాలకు పరిమితమైంది. అయితే రాష్ట్ర నాయకత్వం విషయంలో బీజేపీ తీసుకున్న నిర్ణయాలు కొన్ని ఆ పార్టీ విశ్వసనీయతను కొంతవరకూ దెబ్బతీశాయి. ఐదు నెలల కాలంలోనే మూడుసార్లు ముఖ్యమంత్రులను మార్చడం, కుంభమేళా సందర్భంగా కోవిడ్ నిర్వ హణలో వైఫల్యాలు కాషాయ పార్టీని వెంటాడుతున్నాయి. నిరు ద్యోగం, ద్రవ్యోల్బణం, పర్వతప్రాంతాల నుంచి ప్రజల వలసలు కూడా బీజేపీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. అయితే యువ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ యువ ఓటర్లను ఆకర్శించగలడనీ, మోదీ–యోగీ వంటి అంశాలు ఓటర్లను ఆకర్షించవచ్చుననీ బీజేపీ ఆశలు పెట్టుకుని ఉంది. గత ఎన్నికల్లో ఘోర పరాభవం పొందిన కాంగ్రెస్ పార్టీ హరీశ్ రావత్ నేతృత్వంలో కొంతవరకూ కోలుకుందనే చెప్పాలి. ప్రభుత్వ వ్యతిరేకత, ఉత్తరాఖండ్ ఎన్నికల చరిత్ర తమకు అవకాశం కల్పిస్తాయన్న ఆశతో కాంగ్రెస్ ఉంది. ఒక పార్టీకి వరుసగా రెండుసార్లు అధికారం కట్టబెట్టే చరిత్ర ఇక్కడ లేకపోవడం గమనార్హం. అయితే కాంగ్రెస్ ఈ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందా అన్నది ఒక ప్రశ్న. పార్టీలో వర్గాలు, అంతర్గత కుమ్ములాటలు ఇందుకు కారణం. ఓట్‌షేర్ విషయంలో బీజేపీతో ఉన్న 13 శాతం అంతరాన్ని అధిగమిం చడం కాంగ్రెస్‌కు ఈసారి కొంత కష్టమే కావచ్చు. గాంధీ కుటుంబ సభ్యుల ప్రచారం, రైతు ఉద్యమం కారణంగా రైతుల్లో నెలకొన్న అసం తృప్తి వంటి అంశాలు రాష్ట్రంలోని టెరాయి ప్రాంతంలోని తొమ్మిది స్థానాల్లో తమకు ఓట్లు, సీట్లు తెచ్చిపెడతాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఇక్కడ రైతులు, సిక్కులు అధిక సంఖ్యలో ఉంటారు. రెండు జాతీయ పార్టీల హోరాహోరీ పోరు మధ్యలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తూండటం ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ తరహాలోనే 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు, యువతకు నెలకు ఐదు వేల రూపాయల నిరుద్యోగ భృతి, పద్ధెనిమిదేళ్ళు పైబడ్డ మహిళలకు నెలకు రూ.1000 పంపిణీ వంటి హామీలు ఆమ్ ఆద్మీ పార్టీకి కలిసి వస్తాయా అన్నది వేచి చూడాల్సిన అంశం. సీఎం అభ్యర్థిగా ఆర్మీ నుంచి పదవీ విరమణ చేసిన అజయ్ కొతియాల్ను ఎంపిక చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ మెరుగైన ప్రత్యామ్నాయంగా మారింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు నిర్వహించిన సర్వేల ప్రకారం... ఈసారి ఉత్తరాఖండ్‌లో పోటీ బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాత్రమే. కాకపోతే ప్రధాన పార్టీలు రెండూ తగినంత మెజార్టీ సాధిం చలేని పక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీ కింగ్ మేకర్‌గా మారే అవకాశం ఉంది. వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్, ఢిల్లీ -
కేజ్రీవాల్‌ను ఆంగ్లేయులతో పోల్చిన సీఎం.. దోచుకోవడానికే వస్తున్నాడంటూ..
ఛండీగఢ్ : అసెంబ్లీ ఎన్నికల వేళ పంజాబ్‌లో మాటల తూటాలు పేలుతున్నాయి. పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్దీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈసారి పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆదీ పార్టీ(ఆప్) పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యం ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై పంజాబ్ సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తనపై లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ ఓ అబద్దాల కోరు అంటూ విరుచుకుపడ్డారు. తనపై చేసిన ఆరోపణలన్నీ తప్పని తేలాయని, నిజాలేంటో బయటకు వచ్చాయని పేర్కొన్నారు. గతంలో భారతదేశాన్ని దోచుకోవడానికి ఆంగ్లేయులు ఎలాగైతే దేశానికి వచ్చారో.. ఇప్పుడు పంజాబ్‌ను దోచుకోడానికి క్రేజీవాల్‌తో సహా మరికొందరు నేతలు వస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారి గురించి పంజాబ్ ప్రజలకు బాగా తెలుసు అలాంటి వారికి ఓటర్లు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. చదవండి: కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌కు ఓటేయొద్దు.. -
డిగ్రీ అయితే రూ.4,000 నిరుద్యోగ భృతి!
BJP Manifesto 2022 Punjab: పంజాబ్ ఎన్నికల మేనిఫెస్టోలో యువతకు బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ పలు తాయిలాలు ప్రకటించింది. తమను గెలిపిస్తే ప్రభుత్వోద్యోగాల్లో 75 శాతం, ప్రైవేట్ ఉద్యోగాల్లో 50 శాతం రాష్ట్ర యువతకే దక్కేలా రిజర్వేషన్లు కేటాయిస్తామని శనివారం విడుదల చేసిన మూడో మేనిఫెస్టోలో పేర్కొంది. ప్రభుత్వోద్యోగాల్లో మహిళలకు 35 శాతం కేటాయిస్తామని చెప్పింది. డిగ్రీ పూర్తయ్యాక రెండేళ్ల దాకా నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి ఇస్తామంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు భారీ మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు చేపడతామని పేర్కొంది. -
ప్రజలతో కలిసిపోయి..వారి కష్టసుఖాలు విని
చంకూర్ సాహిబ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాలు చంకూర్సాహిబ్, బహదూర్ నుంచి పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ సామాన్యుల్లో ఒకరిగా కలిసిపోతూ ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని చెబుతున్నారు. లూథియానాలో ప్రచారం చేస్తూ ఒక ధాబాలో లారీ డ్రైవర్లతో కలిసి భోజనం చేశారు. మరోసారి ఒక ఎన్నికల సభలో వేదిక మీద నుంచి కిందకి దిగి వచ్చి ప్రజలతో కలిసిపోయి వారి కష్టసుఖాలు విన్నారు. వరుసగా నాలుగోసారి చంకూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ప్రజల్లో భావోద్వేగాలు రేగేలా ప్రసంగాలు చేస్తున్నారు. 50 వేల కంటే తక్కువ మెజార్టీ వస్తే దానిని గెలుపుగా భావించలేని చెప్పుకొచ్చారు. 111 రోజుల పాటు సీఎంగా తాను తీసుకున్న నిర్ణయాలను కూడా చన్నీ ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. ‘‘నేను మీ కుమారుడిని, సోదరుడిని. మీతో కలిసి 15 ఏళ్లుగా ఉన్నాను. ఒక్క రోజు కూడా మిమ్మల్ని విడిచి పెట్టలేదు. మీరు లేకుండా నేను లేను’’ అని చన్నీ చెప్పారు. ఇక బహదూర్ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్న చన్నీ ప్రచారంలో కాసేపు యువకులతో కలిసి క్రికెట్ ఆడారు. మొత్తంగా తాను ప్రజల మనిషిననే ముద్ర రావాలని చన్నీ ఆరాటపడుతున్నారు. -
ఆప్‌తోనే పంజాబ్ కలల సాకారం
ధురి (పంజాబ్): పంజాబ్‌లో ఆప్ గెలుపు కోసం పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రివాల్ భార్య సునీత, కూతురు హర్షిత కూడా చెమటోడుస్తున్నారు. పార్టీ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ తరఫున శుక్రవారం ధురి అసెంబ్లీ సెగ్మెంట్లో వాళ్లు ప్రచారం చేశారు. ఆయన్ను మంచి మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రతి కుటుంబ సంక్షేమం కోసం కలలు కనే, వాటిని నిజం చేసే ఏకైక పార్టీ ఆప్ మాత్రమేనన్నారు. పరిశుభ్రమైన తాగునీరు, కరెంటు, విద్య, మెరుగైన ఆరోగ్య వసతులు అందరికీ ఉచితంగా అందాలి. ఆప్ మాత్రమే దీన్ని సుసాధ్యం చేయగలదు’’ అన్నారు. ఉచిత విద్య, ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య తదితర మౌలిక సదుపాయాలకు కేజ్రివాల్ హామీ ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆయన వాగ్దానం చేసిన ప్రతి మహిళకు నెలకు రూ.1,000 కూతుళ్ల చదువుకు ఉపయోగపడుతుందన్నారు. పంజాబ్ రైతుల సమస్యలను పార్లమెంటులో చిరకాలంగా లేవనెత్తుతున్న ఏకైక ఎంపీ భగవంత్ మాన్ మాత్రమేనని చెప్పారు. రాష్ట్రంలోని చిన్నారుల భవిష్యత్తే ఆప్‌కు ముఖ్యమని హర్షిత అన్నారు. వారందరికీ నాణ్యమైన స్కూళ్లు, కాలేజీలు, ఆస్పత్రులు కావాలన్నారు. ప్రచారంలో మాన్ తల్లి హర్పాల్ కౌర్, సోదరి మన్‌ప్రీత్ కూడా పాల్గొన్నారు. యూపీ పీఠానికి అదే దారి? కస్గంజ్: ఉత్తరప్రదేశ్‌లో ఆలయాల నగరంగా పేరు పొందిన కస్గంజ్కు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ నియోజకవర్గంలో నెగ్గితే యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని స్థానికులు బలంగా విశ్వసిస్తారు. గత ఎన్నికల ఫలితాల విశ్లేషణ కూడా ఈ నమ్మకాన్ని బలపస్తుండటం విశేషం. ఈ నియోజకవర్గం ఎప్పుడూ ఏ పార్టీకి కూడా కంచుకోటగా లేదు. అక్కడ ప్రజల నాడిని పట్టుకోవడం కాస్త కష్టమే. 2007లో కస్గంజ్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థి హస్రత్ ఉల్లా షేర్వాణి విజయం సాధించారు. అప్పుడు రాష్ట్రంలో బీఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2012 ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ పార్టీకి చెందిన మన్‌పాల్ సింగ్ కస్గంజ్లో విజయం సాధించారు. ఇక 2017లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ అభ్యర్థి దేవేంద్ర సింగ్ రాజ్‌పుత్ ఏకం గా 49 వేల ఓట్ల మెజారిటీతో విజయం సా ధించారు. దీంతో ఈసారి ఎన్నికల్లో గెలుపెవరిదన్న ఉత్కంఠ నెలకొంది. బీజేపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే దేవేంద్ర సింగ్ రాజ్‌పుత్ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంటే, కాంగ్రెస్ నుంచి ప్రముఖ రైతు నాయకుడు కుల్దీప్ పాండే ఎన్నికల బరిలో ఉన్నారు. ఎస్పీ నుంచి మాజీ ఎమ్మెల్యే మన్‌పాల్ సింగ్ పోటీ పడుతూ ఉంటే, బీఎస్పీ ప్రభుదయాళ్ వర్మకు టికెట్ ఇచ్చింది. ఇక్కడ ఫిబ్రవరి 20న మూడోదశలో పోలింగ్ జరగనుంది. -
బీజేపీతో ఉంటేనే పంజాబ్‌కు మంచిది
కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రెండు పర్యాయాలు దాదాపు పదేళ్లు అధికారంలో ఉన్నపుడు ఎవరికీ పెద్దగా అందుబాటులో ఉండరనే అభియోగాలు కెప్టెన్ అమరీందర్ సింగ్‌పై ఉండేవి. అవన్నీ తప్పుడు ఆరోపణలు అంటున్న ఈ 79 ఏళ్ల పాటియాలా రాజవంశ వారసుడు... హసం పార్టీని వీడి.. ఇప్పుడు పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ) పేరిట కొత్త పార్టీ పెట్టారు. బీజేపీతో జట్టుకట్టి పంజాబ్ అసెంబ్లీ బరిలోకి దిగిన అమరీందర్ ఇప్పుడు రోజంతా ప్రచారంలో మునిగితేలుతున్నారు. అర్ధరాత్రి దాకా ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. బీజేపీతో ఉంటేనే పంజాబ్‌కు భవిష్యత్తు బాగుంటుందని.. జాతీయ పార్టీ అండ లేకుండా రాష్ట్రంలో సజావుగా పాలన సాధ్యమయ్యే పనికాదని అంటున్నారు అమరీందర్. కొత్త మిత్ర పార్టీ బీజేపీ నుంచి సంపూర్ణ సహకారం ఉందంటున్న ఆయన శుక్రవారం ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు... బీజేపీ– పంజాబ్ లోక్ కాంగ్రెస్ కూటమికి అవకాశాలెలా ఉన్నాయని మీరు భావిస్తున్నారు? అమరీందర్: ప్రజల్లో మంచి స్పందన కనిపిస్తోంది. పంజాబ్‌లో బీజేపీవైపు బయటికి కనిపించని మొగ్గు ఉంది. దానికి.. ఉజ్వల పథకం, ఉచిత రేషన్ సరఫరా, ఇతర సబ్సిడీలు కారణం. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న నా కూతురితో మోదీకే ఓటేస్తామని ప్రజలు చెబుతున్నారు. నా హయాంలోనూ పేదల కోసం ఎంతో చేశాను. ఐదు లక్షల రూపాయల ఆరోగ్యబీమా పథకాన్ని ప్రవేశపెట్టాను. దీని మూలంగా పేదవాళ్లకు పెద్దపెద్ద ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకునే అవకాశం లభించింది. పొత్తు కోసం బీజేపీనే ఎందుకు ఎంచుకున్నారు? బీజేపీతో కలిసి సాగడం పంజాబ్‌కు మంచిది. జాతీయ పార్టీ అండ లేనిదే పాలన సాధ్యం కాదు. కేంద్రం నుంచి నిధులు రాకపోతే.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బు ఉండదు. బీజేపీ నాతో బాగానే ఉంటోంది. నాకైతే వారితో సమస్యలు లేవు. 1980లో నేను కాంగ్రెస్ ఎంపీగా ఎన్నికైనపుడు... మా అమ్మగారు బీజేపీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారనేది గుర్తుపెట్టుకోండి. ఆమ్ ఆద్మీ పార్టీ గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఆప్ రాజకీయ పార్టీయా? ఉద్యమ సంస్థా? అనేది నాకిప్పటికీ స్పష్టత రావడం లేదు. సంప్రదాయ రాజకీయ పార్టీల నుంచి దూరం జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. అయితే కిందటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే అన్నారు. రాజకీయ విశ్లేషకులైతే 2017లో ఆప్ 100 పైగా సీట్లు గెలుస్తుందని జోస్యం చెప్పారు. కానీ 20 దగ్గరే ఆప్ ఆగిపోయింది. ఇప్పుడు రైతు సంఘాల రాజకీయ వేదిక.. సంయుక్త సమాజ్ మోర్చా కూడా బరిలో ఉండటం ఆప్ అవకాశాలను మరింతగా దెబ్బతీస్తుంది. ఆర్థిక అధికారాలన్నీ కేంద్ర సర్కారుకే దఖలు పడ్డాయని మీరు అన్నారు. అదెవరి తప్పు? రాజ్యాంగం మనకు సమాఖ్య వ్యవస్థను నిర్దేశించింది. కానీ ప్రతిదీ కేంద్రీకృతమైపోయింది. రాష్ట్రాల అధికారాలన్నింటినీ ఒక్కొక్కొటిగా కేంద్ర ప్రభుత్వం తీసేసుకుంది. ఇదంతా కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. కేంద్రంలో బీజేపీ వచ్చింది ఇటీవలి కాలంలోనే కదా. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ద్వారా ఏకరూప పన్ను విధానం తేవాలనేది కూడా మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ బుర్రలో పుట్టిన ఆలోచనే. జీఎస్టీలో రాష్ట్రాలకు న్యాయమైన వాటా దక్కడం లేదు. పాక్‌తో సరిహద్దును పంచుకుంటున్న పంజాబ్ రాష్ట్ర భద్రతపై మీరు తరచూ తీవ్రమైన ఆందోళన వెలిబుచ్చుతుంటారు? సరిహద్దుల అవతల నుంచి నిరంతరం డ్రోన్లు భారత భూభాగంలోకి చొరబడుతున్నాయి. చైనా– పాక్‌తో జట్టు కట్టింది. తాజాగా ఆఫ్గానిస్తాన్ నుంచీ ముప్పు పొంచి ఉంది. ఇది పంజాబ్‌కు అభిలషణీయమైన భద్రతా స్థితి కాదు. ఆధునిక ఆయుధ సంపత్తిలో శత్రుదేశాలు మనకంటే ఎంతో ముందంజలో ఉన్నాయి. 2004 నుంచి 2014 దాకా పదేళ్లకాలంలో ఆయుధ సమీకరణ, నవీకరణకు కాంగ్రెస్ చేసిందేమీ లేదు. కనీసం బీజేపీ ఇప్పుడు ఆయుధ వ్యవస్థలనైనా కొంటోంది. పంజాబ్‌లో కులం, మతం ఆధారంగా ఓట్ల పునరేకీకరణ జరుగుతుందని భావిస్తున్నారా? ఇది పూర్తి అర్థంపర్థం లేని వ్యవహారం. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటిపోయాక కూడా ఇంకా కులం, మతం అంటూ మాట్లాడుతున్నాం. ప్రస్తుత పంజాబ్ సీఎం చన్నీ కుల ప్రస్తావన ఎందుకు? దేనికైనా ప్రతిభే కొలమానం కావాలి. -
సామీ... నీకు సరిలేరెవ్వరు!
చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ నేతలు విన్యాసాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. నేతల ఫిరాయింపులు చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కేవలం రెండు నెలల వ్యవధిలోనే రెండుసార్లు బీజేపీలో చేరారు. ఇదంతా కేవలం టికెట్ కోసమే. గురుదాస్‌పూర్ జిల్లాలోని శ్రీహరగోబింద్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే బల్వీందర్‌సింగ్ లడ్డీ ప్రతిపక్ష బీజేపీలో మరోసారి చేరారు. శుక్రవారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ ఆయనను కాషాయ దళంలోకి ఆహ్వానించారు. లడ్డీ గత ఏడాది డిసెంబర్లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేవలం ఆరు రోజుల తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చారు. శ్రీహరగోబింద్పూర్ స్థానం నుంచి ఆయనకు టిక్కెట్ ఇవ్వబోమని కాంగ్రెస్ తేల్చిచెప్పడంతో తాజాగా మళ్లీ బీజేపీలో చేరిపోయారు. బీజేపీ నుంచి ఆయనకు టికెట్ ఇస్తారో లేదో ఇంకా నిర్ధారణ కాలేదు. -
మా నాన్న గెలిచే వరకు నో మ్యారేజ్.. రబియా ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, చంఢీగడ్: పంజాబ్ కాంగ్రెస్‌లో పొలిటికల్ వార్ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. ఈ ఎన్నికల్లో సీఎం స్థానం కోసం పోటీ పడి పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ భంగపాటుకు గురయ్యారు. తీవ్ర ఉత్కంఠ మధ్య చరణ్‌జిత్ సింగ్ చన్నీనే సీఎం క్యాండిడేట్ గా పార్టీ అధిష్టానం ఫైనల్ చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో చన్నీ, సిద్దూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. చదవండి: వందేళ్ల పార్టీ.. చివరి అస్త్రంగా ఆత్మగౌరవ నినాదం! ఇదిలా ఉండగా శుక్రవారం అమత్ సర్(ఈస్ట్)లో ప్రచారంలో పాల్గొన్న సిద్దూ కూతురు రబియా సిద్దూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన తండ్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ గెలిచే వరకు తాను పెళ్లి చేసుకోబోనని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం అభ్యర్థి చన్నీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చన్నీ అవినీతికి పాల్పడ్డారంటూ.. ఆయన బ్యాంకు ఖాతాను తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన బ్యాంకు అకౌంట్లో రూ.133 కోట్లు ఉన్నాయని ఆమె ఆరోపించారు. నిజంగా చన్నీ పేద కుటుంబానికి చెందిన వ్యక్తి అయితే ఆయన ఖాతాలోకి అంత డబ్బు ఎలా వచ్చిందని ఆరోపించారు. తన తండ్రి సిద్దూ 14 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేశారని తెలిపారు. పంజాబ్‌ను న్యూ మోడల్ స్టేట్ గా తీర్చిదిద్దడంలో సిద్దూ పాత్ర ప్రముఖంగా ఉందని పేర్కొన్నారు. ఎన్నికల్లో సిద్దూ భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. -
వందేళ్ల పార్టీ.. చివరి అస్త్రంగా ఆత్మగౌరవ నినాదం!
వందేళ్ల కిందట స్వచ్ఛంద సంస్థగా ప్రారంభమైప శిరోమణి అకాలీదళ్ తర్వాత శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (గురుద్వారాల పాలనా వ్యవహారాలు చూసే సంస్థ) అవసరాల నిమిత్తం రాజకీయ పార్టీగా అవతరించింది. గత ఏడాది డిసెంబర్ 14న 101 వార్షికోత్సవాన్ని జరుపుకొన్న ఈ పార్టీ ప్రస్తుతం పంజాబ్ ఎన్నికల్లో అత్యంత కఠిన పరిస్థితులకు ఎదురీదుతోంది. సిక్కుల పార్టీగా దశాబ్దాలు హవా చలాయించిన శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ)కి ఈ పరిస్థితి రావడానికి 2007 నుంచి 2017 మధ్య పదేళ్లు అధికారంలో ఉన్నపుడు ఆ పార్టీ చేసిన తప్పిదాలే ప్రధాన కారణం. అధికారం కోల్పోయి ఐదేళ్లవుతున్నా.. ఆ కాలంలో పడిన ముద్రను తొలగించుకోవడానికి ఇప్పటికీ ఎస్ఏడీ గింజుకుంటూనే ఉంది. మరోవైపు పంజాబ్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. దశాబ్దాల పాటు అకాలీదళ్– కాంగ్రెస్‌ల మధ్యే ద్విముఖ పోరు ఉండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ రంగ ప్రవేశం. బీజేపీ-అమరీందర్ కూటమి, రైతు సంఘాలతో కూడిన సంయుక్త సమాజ్ మోర్చాలతో ప్రస్తుతం పంజాబ్ రాజకీయాలు చాలా క్లిష్టంగా మారిపోయాయి. అకాలీదళ్ స్వయం కృతాపరాధానికి కారణాలేమిటి, వాటి నుంచి బయటపడటానికి ఎస్ఏడీ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్ చేస్తున్న ప్రయత్నాలు, ప్రస్తుత పార్టీ పరిస్థితిపై ‘సాక్షి’ విశ్లేషణాత్మక కథనం.. ముందు నుంచే దిద్దుబాటు చర్యలు ► జరిగిన నష్టాన్ని అంచనా వేసిన మాజీ ఉపముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్... ఎన్నికలకు ఏడాదికి పైగా సమయం ఉండగానే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తూ పోయారు. 20 మందికి పైగా కొత్త ముఖాలకు చోటిచ్చారు. ► మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతాంగం రగిలిపోతుండటాన్ని గ్రహించిన సుఖ్బీర్ బీజేపీతో రెండు దశాబ్దాల బంధాన్ని తెగదెంపులు చేసుకొని... ఎన్డీయే నుంచి బయటికి వచ్చేశారు. ► భారత్‌లో మరే రాష్ట్రంలో లేనంతగా... పంజాబ్‌లో అత్యధికంగా 32 శాతం మంది దళితులే ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సుఖ్బీర్ 2021 జూన్‌లోనే బీఎస్పీతో పొత్తును ఖరారు చేసుకున్నారు. 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్‌లో బీఎస్పీకి 20 నియోజకవర్గాలను కేటాయించారు. 2007లో 4.17 ఓట్ల శాతాన్ని, 2012 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 4.3 ఓట్ల శాతాన్ని సాధించిన బీఎస్పీ గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి దారుణంగా దెబ్బతింది. 1.59 శాతం ఓట్లు మాత్రమే పొందింది. ► అకాలీదళ్ అధికారంలోకి వస్తే ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉంటారని, ఇందులో ఒకటి బీఎస్పీకి కేటాయిస్తామని సుఖ్బీర్ ప్రకటించారు. దళిత ఓట్లను సాధ్యమైనంతగా ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా డిప్యూటీ సీఎంను బీఎస్పీకి ఆఫర్ చేశారు. ఎన్నెన్నో కారణాలు... ► ఏఎస్డీ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో తీవ్ర అవినీతి ఆరోపణల్లో కూరుకు పోయింది. ► ఇసుక మాఫియా చెలరేగిపోయింది. ► పంజాబ్ డ్రగ్స్ వాడకానికి భారత్‌లో కేంద్ర స్థానంగా మారిపోయింది. ‘ఉడ్తా పంజాబ్ (నిషాలో తేలిపోయే పంజాబ్)’గా పేరు స్థిరపడిపోయే స్థాయిలో ఇక్కడి యువత డ్రగ్స్‌కు బానిసలయ్యారు. ► 2015 ఫిబ్రవరి– ఏప్రిల్ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం.. ఎయిమ్స్, మరో స్వచ్చంద సంస్థతో కలిపి నిర్వహించిన సర్వేలో పంజాబ్‌లో 2.32 లక్షల మంది డ్రగ్స్‌కు పూర్తిగా బానిసలయ్యారని తేలింది. అంటే రాష్ట్ర జనాభాలో (మైనారిటీ తీరిన వారిలో) 1.2 శాతం మంది డ్రగ్స్ లేనిదే ఉండలేని స్థితికి చేరుకున్నారు. ఇక డ్రగ్స్ అలవాటు ఉన్న వారి సంఖ్య 8.6 లక్షలుగా ఉందని తేలింది. ► 2015లో అక్టోబరులో సిక్కుల పవిత్రగ్రంధం... గురు గ్రంధ్ సాహిబ్‌ను కొందరు దుండగులు అపవిత్రం చేశారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న సిక్కులపైకి పోలీసులు కాల్పులు జరపడంతో ఇద్దరు చనిపోయారు. ఈ ఘటన శిరోమణి అకాలీదళ్‌పై ప్రజా వ్యతిరేకతను తీవ్రంగా పెంచేసింది. ► 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఏఎస్డీ కేవలం 15 స్థానాలు మాత్రమే సాధించి... అవమానకరంగా మూడోస్థానానికి పడిపోయింది. సిక్కుల ఆత్మగౌరవ నినాదం ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ అస్తిత్వమే ప్రమాదంలో పడే పరిస్థితుల్లో ఉన్నా... పార్టీ అధినేత్రి మాయావతి ప్రచారపర్వంలో చురుకుగా పాల్గొనడం లేదు. ఇక ఆమె పంజాబ్‌పై దృష్టి సారించడంపై అకాలీదళ్ ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి. పైగా కేంద్రం వివాదాస్పద వ్యవసాయ చట్టాలను తెచ్చిన సమయంలో శిరోమణి అకాలీదళ్ నరేంద్ర మోదీ సర్కారులో భాగస్వామిగా ఉంది. ఇదే విషయాన్ని ప్రత్యర్థి రాజకీయ పార్టీలు పదేపదే లేవనెత్తుతూ ఎస్ఏడీని ఇరకాటంలోకి నెడుతున్నాయి. రైతుల్లో ఆగ్రహం తగ్గి అకాలీదళ్‌ను పూర్వస్థాయిలో ఆదరించే పరిస్థితి కనిపించడం లేదు. అంతేకాకుండా ప్రకాశ్‌సింగ్ బాదల్ హయాంలో అయితే రైతుల్లో అనేక మంది తరతరాలుగా అకాలీదళ్‌కు నమ్మకమైన ఓటు బ్యాంకుగా ఉండేవారు. కానీ నేటితరం ఆలోచన మారుతోంది. రాజకీయాల్లో వారు కొత్త మార్పును కోరుకుంటున్నారు. ఫలితంగా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించే సుఖ్బీర్ తండ్రిపై రైతుల్లో ఉన్న అభిమానాన్ని ఓట్ల రూపంలోకి మలచుకోవాలనే ఉద్దేశంతో 94 ఏళ్ల వయసులో ఆయన్ను ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో లాంబీ నియోజకవర్గం నుంచి పోటీచేయిస్తున్నారు. గతంలో ఐదుసార్లు పంజాబ్ సీఎంగా వ్యవహరించిన ప్రకాశ్ సింగ్ బాదల్ భారత్‌లో అత్యధిక వయసులో ఎన్నికల బరిలోకి దిగిన వ్యక్తిగా రికార్డులకెక్కారు. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. సంప్రదాయ ఓటు బ్యాంకు తగ్గడం, కొత్త ఓటర్లను ఆకట్టుకోలేకపోతున్నామనే అంశాన్ని గ్రహించిన సుఖ్బీర్ సిక్కుల ఆత్మగౌరవ నినాదాన్ని అందుకున్నారు. బెంగాల్‌ను బెంగాలీలే పాలించుకుంటారని, బయటివారు ఇక్కడ అక్కర్లేదంటూ ప్రచారం చేసి బీజేపీని మట్టికరిపించిన తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ నుంచి స్ఫూర్తి పొందిన సుఖ్బీర్ ఇప్పుడు అకాలీదళ్‌కు ఏకైక పంజాబీ ప్రాంతీయ పార్టీగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన అకాలీదళ్ ప్రస్తుతం ఎదురీదుతోంది. పంజాబ్‌లో ఈనెల 20 జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తక్కెడ (అకాలీదళ్ ఎన్నికల గుర్తు కూడా) ఎటువైపు మొగ్గుతుందో చూడాలి.! -
రాజకీయాల్లోకి ‘ది గ్రేట్ ఖలీ'.. ఏ పార్టీలో చేరాడో చూడండి..?
The Great Khali Joins BJP: డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్, ప్రముఖ భారత రెజ్లర్ ది గ్రేట్ ఖలీ(49) అలియాస్ దలీప్ సింగ్ రాణా రాజకీయ అరంగేట్రం చేశాడు. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో కాషాయ కండువా కప్పుకున్నాడు. ప్రధాని మోదీ విధానాల పట్ల ఆకర్షితుడై రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించాడు. త్వరలో జరగనున్న పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో ఖలీ బీజేపీలో చేరడం ఆ పార్టీకి అదనపు బలంగా మారవచ్చని రాజకీయ విశ్లేకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, హిమాచల్ ప్రదేశ్‌లో జన్మించిన ఖలీ.. పోలీస్ ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా పంజాబ్‌కు వెళ్లి అక్కడే సెటిలయ్యాడు. అక్కడ ఓ పోలీస్ ఆఫీసర్ ప్రోద్భలం మేరకు రెజ్లర్‌గా మారిన అతను వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(డబ్ల్యూడబ్ల్యూఈ)లో ఉన్నత శిఖరాలకు చేరాడు. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ హోదా నుంచి డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమర్‌గా ఎదిగాడు. ప్రొఫెషనల్ రెజ్లింగ్‌లో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఖలీ, భారత్ నుంచి డబ్ల్యూడబ్ల్యూఈ కాంట్రాక్ట్ సైన్ చేసిన మొట్టమొదటి ప్రొఫెషనల్ రెజ్లర్‌గా చరిత్ర సృష్టించాడు. #WATCH Professional wrestler Dalip Singh Rana, also known as The Great Khali, joins BJP in Delhi pic.twitter.com/BmB7WbpZzx — ANI (@ANI) February 10, 2022 7 అడుగులకు పైగా పొడవు, భారీ శరీరం కలిగిన ఖలీ, బాలీవుడ్‌తో పాటు పలు హాలీవుడ్ సినిమాల్లోనూ ప్రత్యేక పాత్రల్లో కనిపించాడు. అలాగే హిందీ రియాల్టీ షో బిగ్ బాష్ సీజన్ 4లో రన్నరప్‌గా నిలిచాడు. ఖలీకి ఈ తెర ఆ తెర అన్న తేడా లేకుండా విశ్వవ్యాప్తంగా అభిమానులున్నారు. ఇదిలా ఉంటే, గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తరఫున ఎన్నికల ప్రచారం చేసిన ఖలీ, అదే పార్టీలో చేరతాడని అంతా ఊహించారు. అయితే, ఈ అజానుబాహుడు అందరికీ షాకిస్తూ.. ఇవాళ కమల తీర్ధం పుచ్చుకున్నాడు. చదవండి: రిషబ్ పంత్‌ను వరించిన ప్రతిష్టాత్మక అవార్డు -
14 నుంచి పంజాబ్‌లో మోదీ ఎన్నికల ప్రచారం
చండీగఢ్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14, 16, 17వ తేదీల్లో పంజాబ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఆయన 14న జలంధర్‌లో, 16న పఠాన్‌కోట్‌లో, 17న అబోహర్లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని బీజేపీ వర్గాలు బుధవారం వెల్లడించాయి. పంజాబ్‌లో ఈ నెల 20 అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మోదీ జనవరి 5న పంజాబ్‌లోని ఫిరోజ్పూర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వెళ్తుండగా, ఆ మార్గాన్ని రైతులు దిగ్బంధించడంతో ఆయన కాన్వాయ్ ఓ ఫ్లైఓవర్‌పై 15–20 నిమిషాలపాటు ఆగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన వెనుదిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది. (చదవండి: యూపీ రెండోదశ: 25 శాతం మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు) -
కాంగ్రెస్‌కు పోటీయే లేదు.. పంజాబ్ మళ్లీ మాదే
కాంగ్రెస్‌దే గెలుపన్న ఆత్మవిశ్వాసం. కలిసికట్టుగా పనిచేస్తే ఎవరూ పోటీకి రాలేరన్న ధీమా, కేజ్రివాల్‌పై విమర్శలు, భగవంత్ మాన్‌పై వ్యక్తిగత దాడి.. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఒక చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో తన మనోగతాన్ని ఇలా బయటపెట్టారు. ప్రశ్న : సీఎం అభ్యర్థి కోసం పోటీ పడినపీసీసీ అధ్యక్షుడు సిద్ధూతో మీ సంబంధాలు ఎలా ఉన్నాయి? జవాబు: ముఖ్యమంత్రి అభ్యర్థిగా హైకమాండ్ ఎవరిని ఎంపిక చేసినా కట్టుబడి ఉంటానని సిద్ధూ చెప్పారు. అధిష్టానం నన్ను ఎంపిక చేసింది. ఇక మా మధ్య విభేదాలు ఎందుకుంటాయి? మేము ఈ ఎన్నికల్లో కలిసి పని చేస్తాం. టీమ్ వర్క్ చేసి మూడింట రెండు వంతుల మెజార్టీ సాధిస్తాం. ప్రశ్న : కాంగ్రెస్ గెలిస్తే మీరు మరబొమ్మ సీఎంగా మారిపోతారని మాయావతి అంటున్నారు? దళితులు ఢిల్లీ చేతుల్లో ఉండాలా అన్న ఆమె ప్రశ్నలకు మీ సమాధానం? జవాబు: మాయావతి పంజాబ్‌లో కేవలం 20 స్థానాల్లోనే పోటీ చేస్తున్నారు. మిగిలిన అన్ని సీట్లలోనూ శిరోమణి అకాలీదళ్ పోటీ పడుతోంది. అంటే దళితులు ఎవరి చేతుల్లో ఉన్నారు? ఈ విషయం ఆమె తెలుసుకోవాలి. నాకు ఈ కులాల రాజకీయాలు తెలీవు. పార్టీలో నాకు మద్దతు ఉందని సీఎం అభ్యర్థిని చేశారు. దళితుడినని చెయ్యలేదు. ప్రశ్న : ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ దూకుడుని అడ్డుకోగలరా ? జవాబు: అరవింద్ కేజ్రివాల్ పంజాబ్ ముఖ్యమంత్రి కావాలని కలలు కన్నారు. మొదట్లో ఆయన ఆబ్కీ బార్ కేజ్రివాల్ పేరిటప్రచారానికి రూ.200–400 కోట్లు ఖర్చు చేశారు. ప్రజలు దానిని ఆమోదించకపోవడంతో భగవంత్ మాన్‌ను తీసుకువచ్చారు. కేజ్రివాల్ కన్న కలలు పంజాబ్‌లో నెరవేరవు. ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్‌తో పాలించే నాయకుల్ని ప్రజలు తిరస్కరిస్తారు. ప్రశ్న : భగవంత్ మన్ మీతో పోటీ పడగలరా ? జవాబు: భగవంత్ మన్ నాకు ఎప్పటికీ పోటీ కాలేరు. పన్నెండో తరగతి పాస్ కావడానికి ఆయనకు మూడేళ్లు పట్టింది. నేను పీజీ చేశాను. ఇప్పుడు పీహెచ్డీ చేస్తున్నాను. ఆయన తాగుడు మానేశానని అంటున్నారు. ఒక్కసారి సాయంత్రం 4 గంటల తర్వాత ఆయనకి ఫోన్ చేసి చూడండి. మీకే అర్థమవుతుంది. -
కమలానికి కఠిన పరీక్ష.. దేశంలో తగ్గుతున్న బీజేపీ పట్టు!
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా మాత్రమే కాదు, బీజేపీకి అత్యంత కీలక పరీక్షగా కూడా నిలుస్తున్న ఎన్నికలివి. ఎందుకంటే వివిధ రాష్ట్రాల అసెంబ్లీలలో బీజేపీ బలం క్రమేపీ తగ్గుతున్న వేళ తిరిగి జాతీయ రాజకీయాలపై పట్టు సాధించాలంటే కమలదళానికి ఈ ఎన్నికలు అత్యంత కీలకం. రానున్న రాజ్యసభ, రాష్ట్రపతి ఎన్నికల్లోనూ వీటి ప్రభావం ఉంటుంది. అందుకే కమలనాథులకి అయిదు రాష్ట్రాల ఎన్నికలు కఠిన సవాలే విసురుతున్నాయ్.. అందరిలోనూ ఉత్కంఠని పెంచుతున్న ఉత్తరప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి ఆయా రాష్ట్రాల్లో తన పట్టు నిలుపుకోవడానికే విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. పంజాబ్‌పై అంతగా ఆశలు పెట్టుకోని కమలనాథులు ఈసారి ఎక్కువగా యూపీపైనే దృష్టి సారించారు. కనీసం నాలుగు రాష్ట్రాల్లోనైనా విజయం సాధించకపోతే జాతీయ రాజకీయాలపై బీజేపీ పట్టు తగ్గిపోయిందనే సంకేతం వెళుతుంది. పట్టు కోల్పోతోందనే భావన ప్రబలితే... ప్రమాద ఘంటికలు మోగినట్లే లెక్క. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్‌తో వరుసగా రెండోసారి కేంద్రంలో విజయకేతనం ఎగురవేసిన బీజేపీ ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలేక చతికిలపడిపోతోంది. అందుకే ప్రస్తుతం జరగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు దేశ వ్యాప్తంగా వివిధ అంశాలను ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. 19 రాజ్యసభ స్థానాలపై.. ఈ ఏడాది 73 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఏప్రిల్, జూన్లలో సభ్యులు పదవీ విరమణ చేస్తూ ఉండటంతో జూలైలో జరగాల్సిన రాష్ట్రపతి ఎన్నికల కంటే ముందే రాజ్యసభ ఎన్నికలు నిర్వహిస్తారు. వాటిలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న యూపీ నుంచి 11, పంజాబ్‌లో 7, ఉత్తరాఖండ్‌లో 1 స్థానం, అంటే మొత్తంగా 19 మంది ఈ మూడు రాష్ట్రాల నుంచి ఎన్నికవ్వాల్సి ఉంది. ఇక మిగిలిన స్థానాలన్నీ ఎన్డీయేతర పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఖాళీ అవుతున్నాయి. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపోటముల ప్రభావం ఈ రాజ్యసభ ఎన్నికలపై పడుతుంది. పంజాబ్‌లో అధికారంపై పెద్దగా ఆశల్లేని బీజేపీ 11 మందిని రాజ్యసభకు ఎన్నుకునే యూపీపైనే తన దృష్టి అంతా కేంద్రీకరించింది. రాష్ట్రపతి ఎన్నికలపై .. ఈ ఏడాది జూలైతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగిసిపోతోంది. కొత్త రాష్ట్రపతిగా బీజేపీ అభ్యర్థి ఎన్నికవ్వాలంటే యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఆ పార్టీకి మెజార్టీ వచ్చి తీరాలి. పార్లమెంటు సభ్యులు, వివిధ రాష్ట్రాల శాసనసభ సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఉత్తరప్రదేశ్‌లో జనాభా ఎక్కువగా ఉండడంతో ఎలక్టోరల్ కాలేజీలో యూపీ ఎమ్మెల్యే ఓటు విలువ ఎక్కువ. పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఒడిశా, తెలంగాణ, కేరళ, జార్ఖండ్, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు, బీజేపీ వ్యతిరేక జాతీయ పార్టీలు అధికారంలో ఉండటంతో అందరూ కలసికట్టుగా రాష్ట్రపతి అభ్యర్థిని బరిలోకి దించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక ఎన్నికలయ్యే రాష్ట్రాల నుంచి రాజ్యసభకు కూడా ఈ సారి 19 మంది సభ్యులు ఎన్నికవుతారు. వారు కూడా రాష్ట్రపతి ఓటింగ్‌లో పాల్గొంటారు. అందుకే ఈసారి ఎన్నికలు బీజేపీకి గట్టి సవాల్‌గానే మారాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికలపై .. ఢిల్లీ పీఠానికి దగ్గర దారిగా భావించే ఉత్తరప్రదేశ్‌లో విజయం సాధించడంపైనే బీజేపీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎంతవరకు సత్తా చాటగలదన్నది ఆధారపడి ఉంటుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 301 లోక్‌సభ స్థానాలు సాధించగా.. ఇందులో 62 ఒక్క యూపీ నుంచే వచ్చాయి. అందుకే యూపీలో తన పట్టు నిలబెట్టుకోవడం బీజేపీకి అత్యావశ్యకం. కానీఈసారి ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ –ఆర్ఎల్డీ కూటమి గట్టిగా సవాల్ విసురుతూ ఉండడంతో కమలనాథులు కలవరానికి గురవుతున్నారు. తదుపరి నాయకత్వం పైనా... బీజేపీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉన్న క్రేజ్ మరే నాయకుడికి లేదు. సమర్థుడైన నాయకుడిగా ఇప్పటికే ఆయన నిరూపించుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆయనకు ఎందరో అభిమానులు ఉన్నారు. అంతటి ఛరిష్మా కలిగిన మోదీకి వారసుడు ఎవరు అన్న ప్రశ్నకు బీజేపీ అభిమానులు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరే చెబుతారు. భావిభారత ప్రధాని యోగియే అంటూ బీజేపీ శ్రేణులు విశ్వాసంతో ఉన్నాయి. మోదీకి సరైన వారసుడిగా యోగి నిలవాలన్నా, జాతీయ రాజకీయాల్లో బీజేపీ పట్టును కొనసాగించాలన్నా ప్రస్తుత యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు చాలా ముఖ్యం. 2017 డిసెంబర్ నాటికి దేశంలో బీజేపీ, దాని మిత్రపక్ష పాలిత రాష్ట్రాలు, 2019 డిసెంబర్ నాటికి బీజేపీ పాలిత రాష్ట్రాలు తగ్గాయిలా.. రాష్ట్రాలపై పట్టు ... 2014లో నరేంద్ర మోదీ ప్రధాని పీఠం ఎక్కాక ఆయనకున్న క్రేజ్‌తో క్రమంగా రాష్ట్రాలపై కూడా బీజేపీ పట్టు బిగించింది. ఎక్కడ ఎన్నికలు జరిగినా మోదీ, అమిత్ షా కాంబినేషన్‌కు ఎదురే లేకుండా ఉండేది. 2018 సంవత్సరం మొదట్లో ఏకంగా 21 రాష్ట్రాల్లో బీజేపీ, లేదంటే ఆ పార్టీ మిత్రపక్షాల నేతృత్వంలో ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. దేశ జనాభాలోని 70 శాతం మంది బీజేపీ పరిపాలన కిందకి వచ్చారు. కానీ అదే ఏడాది చివర్లో తాను అధికారంలో ఉన్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో అధికార వ్యతిరేకతను ఎదుర్కొని బీజేపీ ఓడిపోయింది. ఆ ప్రభావం 2019 లోక్‌సభ ఎన్నికలపై పడుతుందని అనుకున్నారు.. కానీ అలా జరగలేదు. మోదీ తన ప్రభ తగ్గలేదని నిరూపించుకున్నారు. ఆ తర్వాత జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో జార్ఖండ్‌లో బీజేపీ అధికారాన్ని కోల్పోతే, హరియాణాలో సీట్ల సంఖ్య తగ్గిపోయింది. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక శివసేనకు అప్పగించింది. 2021లో జరిగిన అసోంలో కూడా మెజార్టీ స్థానాల్లో కోత పడింది. మొత్తంగా జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్నప్పటికీ రాష్ట్రాల్లో కూడా తన హవా కొనసాగాలంటే ఈసారి ఎన్నికల్లో బీజేపీకి గెలుపు తప్పనిసరిగా మారింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
సీఎం చన్నీని పక్కన పెడతారు
చండీగఢ్: పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైందని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి విమర్శించారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం దళిత ముఖ్యమంత్రిని వాడుకుంటోందని ధ్వజమెత్తారు. శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ)తో పొత్తు పెట్టుకుని పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మాయావతి కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. పంజాబ్‌లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న కారణంగానే దళితుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అనుకోవడం లేదని, ఒకవేళ అధికారాన్ని నిలబెట్టుకున్నా చరణ్‌జీత్ సింగ్ చన్నీని పక్కన పెడతారని జోస్యం చెప్పారు. హిమాచల్ గుడికి వెళ్లే బదులు సంత్ రవిదాస్ ఆశీస్సులు తీసుకోవడానికి సీఎం చన్నీ వెళితే బాగుండేదన్నారు. ఆయన ఆలయాన్ని సందర్శించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, దళితులకు కూడా సానుకూల సందేశం పంపి ఉండాల్సిందని మాయావతి అభిప్రాయపడ్డారు. బీజేపీ కూడా కాంగ్రెస్ బాటలోనే పయనిస్తోందని, పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తోందని మండిపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీ అబద్దపు హామీలతో ఓటర్లకు గాలం వేస్తోందని ఆరోపించారు. (క్లిక్: పంజాబ్‌లో ఆప్ టెన్ పాయింట్ అజెండా) బీఎస్పీ-ఎస్ఏడీ కూటమికి ఓటు వేయాలని ఈ సందర్భంగా పంజాబ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి రాగానే కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను రద్దు చేస్తామని హామీయిచ్చారు. పంజాబ్‌లో బీఎస్పీ-ఎస్ఏడీ కూటమి అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎంగా సుఖ్బీర్ బాదల్‌ను ఎన్నుకుంటామని మాయావతి ప్రకటించారు. (క్లిక్: పంజాబ్‌లో మోదీ చరిష్మా పనిచేసేనా!) -
పంజాబ్‌లో ఆప్ టెన్ పాయింట్ అజెండా
ఢిల్లీ అసెంబ్లీలో అధికార పీఠాన్ని వరుసగా రెండుసార్లు దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఈసారి సర్దార్ల రాష్ట్రం పంజాబ్‌లోనూ పాగా వేయాలని తహతహలాడుతోంది. ఫిబ్రవరి 20న జరగబోయే శాసనసభ ఎన్నికల్లో ప్రత్యర్థులను మట్టికరిపించి, జయకేతనం ఎగుర వేసేందుకు పటిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఆప్ నేతలు ఇంటింటి ప్రచారంలో తలమునకలయ్యారు. రైతు సంఘాలతో కూడిన ‘సంయుక్త సమాజ్ మోర్చా’తో పొత్తు పెట్టుకోవాలని ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదు. సీట్ల సర్దుబాటు కుదరకపోవడమే ఇందుకు కారణం. సంయుక్త సమాజ్ మోర్చా ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగింది. ఈ మోర్చా తమ ఓట్లను చీల్చే అవకాశం ఉందని కేజ్రీవాల్ సైతం అంగీకరిస్తున్నారు. అయినప్పటికీ విజయం తమదేనని ధీమాగా చెబుతున్నారు. పంజాబ్ ప్రజల మనసులను గెలుచుకొనేందుకు ఆమ్ ఆద్మీ ప్రధానంగా టెన్ పాయింట్ అజెండాను తెరపైకి తీసుకొచ్చింది. పంజాబ్‌లో సామాన్య ప్రజల భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. పంజాబ్ ఆప్ అధ్యక్షుడు భగవంత్ మాన్, ఇతర నాయకులు ప్రజల అభిప్రాయాలను సేకరించారు. వారు ఎలాంటి పాలన కోరుకుంటున్నారో గుర్తించారు. తమ నేతలు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో ఆప్ నాయకత్వం ‘పంజాబ్ మోడల్’ను సిద్ధం చేసింది. ఇందులో 10 పాయింట్లు ఉన్నాయని, ఇవన్నీ పంజాబ్ అభివృద్ధి కోసమేనని కేజ్రీవాల్ ఉద్ఘాటించారు. పంజాబ్ మోడల్ ఇదే.. పంజాబ్‌లో తాము అధికారంలోకి వస్తే ప్రజలకు రౌండ్ ద క్లాక్(రోజంతా) ఉచితంగా కరెంటు సరఫరా చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టమైన హామీ ఇచ్చింది. పెద్ద బెడదగా మారిపోయి, రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేస్తున్న మాదక ద్రవ్యాల భరతం పడతామని పేర్కొంది. డ్రగ్స్ నియంత్రణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపింది. యువత కోసం పెద్ద ఎత్తున ఉద్యోగావశాలు కల్పిస్తామని, విదేశాలకు వలస వెళ్లిన వారు సైతం వెనక్కి తిరిగి వచ్చేలా చేస్తామని కేజ్రీవాల్ చెప్పారు. రాష్ట్రంలో శాంతి, సామరస్యం, సోదరభావాన్ని నెలకొల్పుతామని అన్నారు. బాధిత, అణగారిన వర్గాలకు న్యాయం చేకూర్చడం తమ అజెండాలోని కీలక అంశమని చెప్పారు. సామాన్యులను ఇబ్బందులకు గురిచేసే వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసే వారిని విడిచిపెట్టబోమని పేర్కొన్నారు. అభివృద్ధికి అడ్డంకిగా మారిన అవినీతిని అంతం చేస్తామని ప్రతిన బూనారు. పనుల కోసం ప్రజలు లంచాలివ్వాల్సిన అవసరం ఇక ఉండదని భరోసా కల్పించారు. పంజాబ్ మోడల్ కింద విద్యా, వైద్య రంగాలను పూర్తిస్థాయిలో బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీ తరహాలో 16,000 మొహల్లా క్లినిక్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. మోడల్ స్కూళ్లతోపాటు విద్యాసంస్థల్లో అధునాతన మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు రూ.1,000 చొప్పున ఇస్తామని తెలిపారు. రైతన్నల సమస్యలను పరిష్కరిస్తామని, ‘రైడ్రాజ్’ను నామరూపాల్లేకుండా చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో వ్యాపారం, వాణిజ్యం పెరగడానికి, పరిశ్రమల స్థాపన కోసం పూర్తి అనుకూల వాతావరణం కల్పిస్తామని కేజ్రీవాల్ వివరించారు. షెడ్యూల్డ్ కులాలపై గురి రాష్ట్ర జనాభాలో 32 శాతం ఉన్న షెడ్యూల్డ్ కులాల ఓట్లపై ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధానంగా గురిపెట్టింది. ఆయా కులాలను మచ్చిక చేసుకుంటోంది. ఎస్సీ కులాల చిన్నారులకు నాణ్యమైన విద్య ఉచితంగా అందిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. పై చదువులకు వెళ్లేవారికి కోచింగ్ కోసం అవసరమైన ఫీజులను తామే భరిస్తామని తెలిపారు. ఇంజనీరింగ్, మెడికల్, సివిల్స్, రైల్వే తదితర పోటీ పరీక్షలకు శిక్షణ పొందితే ఆ ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తే అందుకయ్యే వ్యయాన్ని సైతం ప్రభుత్వం భరిస్తుందని వెల్లడించారు. ఎస్సీల్లో ఎవరైనా అనారోగ్యం పాలైతే ఉచితంగా చికిత్స చేయిస్తామని చెప్పారు. -
పంజాబ్‌లో మోదీ చరిష్మా పనిచేసేనా!
ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ తర్వాత రెండో అతిపెద్ద రాష్ట్రం పంజాబ్. శిరోమణి అకాలీదళ్ దూరం కావడంతో పక్కా లెక్కలు వేసి... మాజీ కాంగ్రెస్ సీఎం, పంజాబ్ లోక్ కాంగ్రెస్ అధినేత కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో జట్టుకట్టడం ద్వారా బీజేపీ సరికొత్త వ్యూహానికి తెరలేపింది., మూడు ప్రధాన పక్షాలైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, శిరోమణి అకాలీదళ్‌లకు దీటుగా వెళ్లేలా పావులు కదిపింది. కూటమిలో పెద్దన్న పాత్రను తీసుకొని.. ప్రధాని మోదీతో భారీ అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభాలకు ప్లాన్ చేసింది. ఈ ఏడాది జనవరి 5న ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో అనూహ్య భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. హుసేనీవాలాలోని అమరుల స్థూపం వద్ద నివాళులు అర్పించడానికి ప్రధాని రోడ్డు మార్గాన వెళుతుండగా పైరియాణా వద్ద ఓ ఫ్లైవర్లో మోదీ కాన్వాయ్‌ను రైతులు అడ్డగించారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే ప్రధాని నడిరోడ్డుపై 20 నిమిషాల పాటు వాహనంలో ఉండిపోవాల్సి రావడంతో తీవ్ర దుమారమే రేగింది. రాజకీయంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తాయి. ఫిరోజ్పూర్లో బీజేపీ సభకు జనం వందల్లోనే వచ్చారని, అందుకే ప్రధాని తన పంజాబ్ పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకొని వెళ్లిపోయారని కాంగ్రెస్ ఆరోపించింది. చివరకు కేసు రూపంలో బంతి సుప్రీంకోర్టులో పడింది. ఒక్కసారిగా తగ్గిన జోరు.. ఈ ఘటన తర్వాత రాజకీయంగా బీజేపీ ఒక్కసారిగా డీలా పడిపోయింది. వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు ఏడాదికి పైగా పోరాడిన రైతుల్లో అధికులు పంజాబీలే. ఈ చట్టాలను ఉపసంహరించినా వారికి బీజేపీ కోపం తగ్గలేదనే సంకేతం జనంలోకి వెళ్లింది. దానికి తోడు బీజేపీ వేసుకున్న అంచ నాలకు, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉన్నట్లు కమలనాథులు పసిగట్టారు. దానికి తోడు పదేళ్లు కాంగ్రెస్ సీఎంగా పంజాబ్‌ను పాలించిన కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని, హస్తం పార్టీని ఆయన బాగా దెబ్బతీస్తారని బీజేపీ పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యేలా ఉన్నాయి. పంజాబ్‌లో ఈనెల 20న ఎన్నికలు జరగనున్నాయి. పేరున్న పెద్ద నాయకులు గాని, ఎమ్మెల్యేలు గాని కాంగ్రెస్ నుంచి ఎవరూ అమరీందర్ పంచన చేరలేదు. అకాలీదళ్ దాదాపు ఇరవై ఏళ్ల బంధాన్ని తెంచుకొని ఎన్డీయే నుంచి వెళ్లిపోయింది కాబట్టి.. పంజాబ్‌లో సొంతంగా ఎదగడానికి దీన్నో అవకాశం వాడుకోవాలని బీజేపీ భావించింది. మొత్తం 117 నియోజకవర్గాల్లోని దాదాపు 4,000 వేల సభలు, సూక్ష్యస్థాయి ర్యాలీలు నిర్వహించాలని పథకరచన చేసింది. హిందు ఓట్లపై ఆశలు.. 2011 జనాభా లెక్కల ప్రకారం.. పంజాబ్‌లో 60 శాతం సిక్కులుంటే... 38.49 శాతం మంది హిందువులు ఉన్నారు. అకాలీదళ్‌తో రెండు దశాబ్దాల పొత్తులో బీజేపీ అధికంగా పట్టణ ప్రాంతాల్లో, అదీ హిందువుల ఓట్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల నుంచే పోటీ చేసింది. దౌబా ప్రాంతంలోని పటాన్‌కోట్, జలంధర్, హోషియార్పూర్,, షహీద్ భగత్‌సింగ్ నగర్ జిల్లాల్లో (మొత్తం నాలుగు జిల్లాలు) హిందువులే మెజారిటీగా ఉన్నారు. అకాలీదళ్‌తో పొత్తులో చిన్న భాగస్వామిగా ఉన్న బీజేపీ ఎప్పుడో తప్పితే 20 స్థానాలకు మించి డిమాండ్ చేయలేదు. పంజాబ్‌లో ఏకంగా 94 నియోజకవర్గాల్లో (మొత్తం సీట్లు 117) బీజేపీ ఏనాడూ పోటీచేయలేదంటే పార్టీ వాస్తవ బలమెంతో అర్థం చేసుకోవచ్చు. అయితే బెంగాల్‌లాగా ఇప్పుడు దృష్టి సారిస్తే.. భవిష్యత్తులోనైనా బలపడవచ్చని కమలదళం ఆశించింది. అందుకే తాము ఏకంగా 68 అసెంబ్లీ సీట్లు తీసుకొని.. కూటమిలోని ఇతర పక్షాలైన పంజాబ్ లోక్ కాంగ్రెస్‌కు 34, శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్)కు 15 స్థానాలు కేటాయించింది. హిందూ ఓటు బ్యాంకుకు సిక్కులు జత కూడితే బలపడొచ్చనే ముందస్తు ప్రణాళికతో గత ఏడాది నవంబరులోనే సిక్కుల కోసం మోదీ ప్రభుత్వం ఏమేమీ చేసిందో చెబుతూ వాటిని ప్రచారంలో పెట్టింది. గురుద్వారాలకు విదేశీ విరాళాలు అందుకునేందుకు వీలు కల్పించామని, గురుద్వారాల్లోని లంగర్లు (నిత్యాన్నదాన సత్రాలను) జీఎస్టీ పరిధి నుంచి మినహాయించామని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం గట్టిగా చేసింది. గత ఏడాది ఆగస్టులో తాలిబన్లు ఆఫ్గానిస్తాన్‌కు కైవసం చేసుకోవడంతో సిక్కుల పవిత్ర గ్రంథమైన గురుగ్రంధ్ సాహిబ్ మూడు ప్రతులను ప్రత్యేక విమానంలో డిసెంబరు 10న భారత్‌కు తీసుకొచ్చి.. దానిని విస్తృతంగా ప్రచారం చేసుకుంది. అలాగే ఆఫ్గాన్‌లో చిక్కుకుపోయిన సిక్కులను ప్రత్యేక శ్రద్ధ పెట్టి సురక్షితంగా విమానాల్లో భారత్‌కు తరలించింది. ఇవన్నీ తమ హిందూ ఓటు బ్యాంకుకు కొంతైనా సిక్కుల ఓట్లను జతచేయాలనే ప్రణాళికలో భాగంగా జరిగినవే. అయితే బలమైన జాట్ సిక్కు వర్గానికి చెందిన అమరీందర్ తుస్సుమనడం, ఇతర ప్రాంతాలకు, వర్గాలకూ విస్తరించాలని బీజేపీ చేసిన ప్రయత్నాలు పెద్దగా విజయవంతం కాకపోవడంతో కమలనాథలు ఆశలు ప్రస్తుతానికి అడియాసలుగానే మిగిలేలా కనపడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ పంజాబ్ పర్యటనకు వెళితే గనక.. ఆయన చరిష్మా ఏమేరకు పనిచేస్తుందనే దాన్ని బట్టి ఈ కొత్త కూటమికి వచ్చే సీట్లు ఆధారపడి ఉంటాయి. వ్యవసాయ చట్టాలపై గుర్రుగా ఉన్న పంజాబ్ రైతులు ఆగ్రహాన్ని చల్లార్చి... హిందూయేతరుల్లో కొన్ని ఓట్లు సాధించగలిగితే బీజేపీ గౌరవప్రదమైన స్థానంలో ఉంటుంది. హంగ్ వస్తే... కీలకమయ్యే ఛాన్స్? ఆప్ విజయావకాశాలు మెరుగుపడటం, అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతుందనుకున్న కాంగ్రెస్‌లో కీలకనేతలు.. సీఎం చరణ్‌జిత్‌సింగ్ చన్నీ, పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌సింగ్ సిద్ధూ ఏకతాటి పైకి రావడం... లాంటి పరిణామాలు పంజాబ్‌లో బలపడాలన్న బీజేపీ ఆశలను మరింతగా దెబ్బతీశాయి. మోదీ చరిష్మా పనిచేసి 20 నుంచి 30 స్థానాలను గనక ఈ కొత్త కూటమి చేజిక్కించుకొని... హంగ్ అసెంబ్లీ వస్తే అప్పుడు బీజేపీయే పంజాబ్‌లో కింగ్‌మేకర్‌గా మారే అవకాశాలుంటాయనుకోవచ్చు! అంతుకుమించి ఆశించడం మాత్రం దురాశే కావొచ్చు. -
అనూహ్య పరిణామం: ఎన్నికల వేళ డేరా బాబా బయటకు!
హత్య కేసులో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న డేరా బాబాకు స్వల్ప ఊరట లభించింది. డేరా సచ్ఛ సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు ఫర్లాగ్(తాత్కాలిక సెలవు) మంజూరు అయ్యింది. అదీ ఎన్నికల వేళ కావడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు.. 2017లో అత్యాచార కేసులో ఇరవై ఏళ్ల శిక్ష, మేనేజర్‌తో పాటు ఓ జర్నలిస్ట్ హత్య కేసులో డేరా సచ్ఛ సౌధా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు జీవిత ఖైదు విధించింది పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. అప్పటి నుంచి హర్యానాలోని రోహ్తక్ జిల్లా సునారియా జైలులో ప్రస్తుతం డేరా బాబా శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో జైళ్ల శాఖ అధికారులు 21 రోజుల ఫర్లాగ్ జారీ చేశారు. దీంతో ఈ సాయంత్రం(సోమవారం) గుర్మీత్ సింగ్ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇంతకు ముందు తన మెడికల్ చెకప్‌ల కోసం, ఆరోగ్యం బాగోలేని తల్లిని చూసుకోవడానికి 54 ఏళ్ల డేరా బాబాకు ఎమర్జెన్సీ పెరోల్ (సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం) వరకు మాత్రమే జారీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు 21 రోజులపాటు ఫర్లాగ్ జారీ కావడం విశేషం. చట్టం ప్రకారం ఫర్లాగ్ ప్రతీ ఖైదీ హక్కు.. అందుకే ఆయనకు జారీ చేశాం అని హర్యానా జైళ్ల శాఖ మంత్రి రంజిత్‌సింగ్ చౌతాలా తెలిపారు. అయితే ప్రత్యేకించి కారణం ఏంటన్నది మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం. అయితే పొరుగు రాష్ట్రం పంజాబ్‌లో ఎన్నికలకు రెండు వారాల ముందే రహీమ్‌సింగ్ విడుదలకావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. పంజాబ్ మాల్వా రీజియన్‌లో డేరా బాబాకు ఫాలోవర్లు ఎక్కువ. పైగా పంజాబ్ అసెంబ్లీ 117 స్థానాల్లో.. 69 మాల్వా రీజియన్‌లోనే ఉన్నాయి. ఇక హర్యానా బీజేపీ పాలిత రాష్ట్రంకాగా.. డేరా బాబా ఇన్‌ఫ్లూయెన్స్‌తో ఎలాగైనా పంజాబ్‌లో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్న వాదన ఇప్పుడు తెర మీదకు వచ్చింది. ఇదిలా ఉంటే డేరా సచ్ఛ సౌధా మద్దతుతోనే 2007లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ఫలితాన్ని సాధించింది. డేరా బాబా జైల్లో ఉన్నప్పటికీ.. ఆయన అనుచరులు మాత్రం భారీ ఎత్తున్న కార్యక్రమాల్ని నిత్యం నిర్వహిస్తూ.. సోషల్ మీడియాలో డేరాబాబాను, డేరా సచ్ఛ సౌధాను ట్రెండ్ చేస్తూ ఉంటారు. -
సిద్ధూ త్యాగం.. చన్నీ పాదాభివందనం
Punjab Assembly Elections 2022: పంజాబ్‌లో క్లిష్టమైన సమస్యగా భావించిన ముఖ్యమంత్రి ఎంపిక.. ప్రకటనను ఎట్టకేలకు పూర్తి చేసింది కాంగ్రెస్. ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెంచుకున్న నవజోత్ సింగ్ సిద్ధూను ఎలాగోలా పార్టీ చల్లబర్చింది. ప్రస్తుత సీఎం చరణ్‌జిత్‌సింగ్ చన్నీనే.. సీఎం అభ్యర్థిగా ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. అంతకు ముందు కొన్ని గంటలపాటు పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా.. అభ్యంతరం లేదని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానంటూ సిద్ధూ ప్రకటించడంతో ఆసక్తికరంగా మారింది సీన్. ఈ తరుణంలో.. స్టేజ్‌పై సీఎం అభ్యర్థిగా చన్నీ పేరును ప్రకటించిన వెంటనే ఆసక్తికర దృశ్యం కనిపించింది. సిద్ధూ చన్నీ కుడి చెయ్యిని పైకి ఎత్తగా.. ఆక్షణంలోనే చన్నీ తన ఎడమ చేతితో సిద్ధూకి పాదాభివందనం చేశాడు. ‘సిద్ధూజీ.. మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేసేయండి. మీ మోడల్ కచ్చితంగా అమలు అయ్యి తీరుతుంది’ అని చన్నీ ఆ వెంటనే వ్యాఖ్యానించడం విశేషం. లూథియానా: ఇక పంజాబ్‌లో ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెంచుకున్న పీసీసీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు పార్టీ నేత రాహుల్ గాంధీ పెద్ద షాక్ ఇచ్చారు. పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌సింగ్ చన్నీ పేరును రాహుల్ ఆదివారం పంజాబ్‌లో వర్చువల్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించి.. ప్రసంగించారు. నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా రావాలని రాష్ట్ర ప్రజలు ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. పేదరికాన్ని, ఆకలిని అర్థం చేసుకున్నవారే కావాలని అంటున్నారని రాహుల్ పేర్కొన్నారు. ‘‘ఇది చాలా కఠినమైన నిర్ణయం. దాన్ని మీరు సులభతరం’’ చేశారు అని ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన. అనంతరం చన్నీ, సిద్ధూ, పార్టీ నేత సునీల్ జాఖర్‌ను రాహుల్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. మీడియా, టీవీ చర్చా కార్యక్రమాల్లో నాయకులు పుట్టుకురారని తెలిపారు. కొన్ని సంవత్సరాల పోరాటంతోనే వ్యక్తులు నాయకులుగా ఎదుగుతారని వివరించారు. గొప్ప నాయకులకు తమ పార్టీలో లోటు లేదన్నారు. ప్రజల కోసం నిలబడే నాయకులు కాంగ్రెస్‌లో ఉన్నారని పేర్కొన్నారు. చన్నీ, సిద్ధూల రక్తంలో పంజాబ్ ఉందన్నారు. సీఎం అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలన్న అంశంపై కాంగ్రెస్ నాయకత్వం పార్టీ నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించింది. ప్రజల మనోభావాలను కూడా తెలుసుకుంది. ఇందుకోసం అటోమేటెడ్ కాల్ సిస్టమ్‌ను ఉపయోగించుకుంది. దళిత సిక్కు నాయకుడైన చరణ్‌జిత్‌సింగ్ చన్నీ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన పేరును రాహుల్ గాంధీ స్వయంగా ప్రకటించారు. వర్చువల్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ ప్రసంగిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. ఆయన ప్రధానమంత్రిగా కాదు, ఒక రాజులాగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మోదీ రోడ్లపై ఎవరికైనా సాయం చేయడం ఎప్పుడైనా చూశారా? ఆయన ప్రజల మధ్య ఉండడం ఎప్పుడైనా గమనించారా? అని ప్రజలను ప్రశ్నించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌పై కూడా రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. పదవుల కోసం పాకులాడలేదు: సిద్ధూ తాను ఏనాడూ పదవుల కోసం పాకులాడలేదని పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజోత్‌సింగ్ సిద్ధూ అన్నారు. ఆయన లూథియానాలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. గత 17 ఏళ్లుగా రాజకీయ జీవితం కొనసాగిస్తున్నానని, పదవులపై ఎప్పుడూ ఆశపడలేదని పేర్కొన్నారు. పంజాబ్ అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని మాత్రమే కోరుకున్నానని వివరించారు. రాహుల్ గాంధీ నాయకత్వంపై సిద్ధూ ప్రశంసల వర్షం కురిపించారు. గత ఏడాది పంజాబ్ రాష్ట్రానికి ఒక దళితుడిని ముఖ్యమంత్రిగా చేశారని కొనియాడారు. మార్పునకు సమయం ఆసన్నమైందని వెల్లడించారు. పంజాబ్ అభివృద్ధి కంటే తనకు కావాల్సింది ఇంకేమీ లేదని వ్యాఖ్యానించారు. సీఎం అభ్యర్థి ప్రకటనపై పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సిద్ధూ ట్వీట్ చేశారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. బీజేపీ శ్రుతులకు అనుగుణంగా అమరీందర్ డ్యాన్స్ చేస్తున్నారని ఆరోపించారు. పంజాబ్‌ను లూటీ చేసిన నాయకులు ఇప్పుడు డబల్ ఇంజన్ ప్రభుత్వం అంటూ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆ అధికారం రాహుల్‌కు ఎక్కడిది?: బీజేపీ చండీగఢ్: పంజాబ్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే అధికారం రాహుల్ గాంధీకి ఎక్కడుందని బీజేపీ నేత, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆదివారం ప్రశ్నించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో రాహుల్‌కు ఎలాంటి హోదా లేదని గుర్తుచేశారు. అలాంటప్పుడు ఏ అధికారంతో సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారని నిలదీశారు. పేరు చివర ‘గాంధీ’ అన్న ఒక్క అర్హత మాత్రమే రాహుల్‌కు ఉందని ఎద్దేవా చేశారు. -
పంజాబ్ సీఎం అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికలు సమీపిస్తుండటంతో పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ప్రస్తుత సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ వైపే మొగ్గుచూపింది. లుధియానాలో ఆదివారం జరిగిన వర్చువల్ ఎన్నికల ప్రచారంలో పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ఈ మేరకు ప్రకటించారు. ‘సీఎం అభ్యర్థిని నిర్ణయించడం ఇబ్బందికర పరిస్థితే. అయితే, పేదల కష్టాన్ని ఓ పేద బిడ్డ మాత్రమే అర్థం చేసుకుంటారని పంజాబ్ ప్రజలు భావిస్తున్నారు. అందుకనే చన్నీనే పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తున్నాం’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. (చదవండి: ఆరునెలల్లోనే సీఎం అభ్యర్థి రేంజ్‌కి.. ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ) -
ఆ దిగ్గజ గాయని గౌరవార్థం.. సీఎం అభ్యర్థి ప్రకటన పై సంబరాలు చేసుకోవద్దు!
చండీగఢ్: బాలీవుడ్ లెజండరీ గాయని లతా మంగేష్కర్ మరణించిన సంగతి తెలిసిందే. అంతేకాక ఈ రోజు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించనున్నారు. అయితే లతా మంగేష్కర్ గౌరవార్థం ఎటువంటి సంబరాలు చేసుకోవద్దని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కోరింది. ఇక పంజాబ్‌లో జరిగే ప్రచార ర్యాలిలో లత ఆలపించిన ‘ఏ మేరే వతన్ కే లోగోన్’ పాట ప్లే చేయనున్నారు. ఆమె మృతిపట్ల కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ప్రియంక వాద్రా ట్విట్టర్లో సంతాపం తెలిపారు. ‘ఆమె అనేక దశాబ్దాలుగా భారతదేశానికి అత్యంత ప్రియమైన గాయనిగా కమనీయమైన పాటలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. మంగేష్కర్ బంగారు స్వరం అభిమానుల హృదయాల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తుంటుంది’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ప్రియాంక వాద్రా కూడా భారత మాజీ ప్రధాని ఇందిగాంధీతో దిగిన లతామంగేష్కర్ ఫోటోని షేర్ చేస్తూ.. "ఆమె మరణం భారతీయ కళా ప్రపంచానికి కోలుకోలేని లోటు కలిగించింది. ఆమె కుటుంబ సభ్యులకు ఆ బాధను భరించే ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నా." అని ట్వీట్ చేశారు. (చదవండి: ఇరవయ్యోస్సారి!.. తగ్గేదేలే..) -
Punjab Assembly Election 2022: ఇరవయ్యోస్సారి!.. తగ్గేదేలే..
చండీగఢ్: అతని పేరు ఓంప్రకాశ్ జఖూ. వయసు 80 ఏళ్లు. పంజాబ్‌లోని హోషియార్పూర్ నివాసి. బూట్లు పాలిష్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయినా తన కోరికను తీర్చుకోవడంలో తగ్గేదేలే అంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడమంటే ఆయనకి మహా ఇష్టం. ఆయన జీవితంలో సగభాగం ఎన్నికల్లో పోటీకే సరిపోయింది. ఒక్కసారి కూడా గెలవకపోయినా పట్టు వదలని విక్రమార్కుడిలా మళ్లీ ఎన్నికల కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. ఇలా పోటీ చేయడాన్ని ఆయన గర్వంగా కూడా భావిస్తారు. ఈసారి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భరతరాష్ట్ర డెమొక్రాటిక్ పార్టీ అని పెద్దగా ఎవరికీ తెలీని పార్టీ తరఫున హోషియార్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇలా ఎన్నికల్లో పోటీ పడడం ఇది 20వ సారి. కేవలం అసెంబ్లీ ఎన్నికలే కాదు, మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఓంప్రకాశ్ పోటీ చేశారు. ఏ పూట సంపాదన ఆ పూ టకే సరిపోయే దుర్భర దారిద్య్రంలో కూడా ఆయన ఎన్నికలకి దూరం కాలేదు. ఈ విషయంలో ఆయనకి భార్యాబిడ్డల సహ కారం కూడా ఉంది. దేశంలో ఎమర్జెన్సీ సమయంలో జైలు పా లయ్యారు. ఒకప్పుడు బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్‌తో సన్నిహితంగా మెలిగారు. ఎన్నికల్లో పోటీ చేయడమంటే తనకు అత్యంత ఇష్టమైన విషయమని, శ్వాస ఆగేవరకు ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉంటానని ఓంప్రకాశ్ చెప్పుకొచ్చారు. చదవండి: (Punjab Assembly Election 2022: మాల్వా చిక్కితే అసెంబ్లీ అందినట్టే) -
Punjab Assembly Election 2022: మాల్వా చిక్కితే అసెంబ్లీ అందినట్టే
మాల్వా చిక్కితే అసెంబ్లీ అందినట్టే’ అన్నది పంజాబ్ రాజకీయాల్లో నానుడి. అందుకే ఎప్పట్లాగే ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్, ఆప్, అకాలీదళ్, బీజేపీ మాల్వా జపం చేస్తున్నాయి. తమనే కరుణించాలంటూ అక్కడి ఓటర్లను వేడుకుంటున్నాయి. హామీలపై హామీలు గుప్పిస్తున్నాయి. ఇక్కడ మొగ్గు ఆప్ వైపే ఉందని సర్వేలు చెబుతుండటంతో మిగతా పార్టీలు వ్యూహాలకు మరింత పదును పెడుతున్నాయి. పంజాబ్‌లో భౌగోళికంగా, ఓటర్లపరంగా కూడా అతి పెద్ద ప్రాంతమైన మాల్వా ప్రతి ఎన్నికల్లోనూ పార్టీల భాగ్యరేఖలను నిర్దేశిస్తూ వస్తోంది. మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో సగానికి పైగా సీట్లు (69) ఇక్కడే ఉన్నాయి. దాంతో మాల్వాలో మెజారిటీ సీట్లు గెలిచిన పార్టీకే అధికార పీఠం దక్కడం ఆనవాయితీగా మారింది. అకాలీదళ్ అడ్డాగా పేరుబడ్డ ఈ కాటన్ బెల్టు (పత్తి పంట ఎక్కువగా పండే ప్రాంతం)లో 2017లో కాంగ్రెస్ ఏకంగా 40 సీట్లు కొల్లగొట్టి అధికారాన్ని అందుకుంది. అసెంబ్లీకి రాచమార్గంగా మారిన మాల్వాలో ఎలాగైనా పట్టు సాధించేందుకు పార్టీలన్నీ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, అకాలీదళ్ వర్గాలవారీగా ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఆప్ కూడా వాటికి ఏ మాత్రమూ తగ్గకుండా హామీలు గుప్పిస్తోంది. పోటాపోటీ హామీలు పంజాబ్... మాల్వా, దౌబా, మఝా ప్రాంతాల సమాహారం. దౌబాలో 23, మఝాలో 25 అసెంబ్లీ సీట్లున్నాయి. ఇక మాల్వా బాగా వెనకబడ్డ ప్రాంతం. ముఖ్యంగా దక్షిణ మాల్వా సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా కూడా వెనకబడే ఉంది. రైతు ఆత్మహత్యలకు రాష్ట్రంలో చిరునామాగా మారింది. ఇక రాష్ట్ర దళిత జనాభాలో 31 శాతం ఇక్కడే ఉన్నారు. ఈ సమస్యలతో పాటు ఈ ప్రాంతాన్ని పీడిస్తున్న క్యాన్సర్, తీవ్ర తాగునీటి కొరత ఈ ఎన్నికల్లో ప్రధానాంశాలుగా మారాయి. దాంతో పార్టీలు వీటిపై ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. రాష్ట్ర దళిత జనాభాలో 31 శాతం మాల్వాలోనే ఉన్నా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేంతగా వీరు సంఘటితంగా నిలవడం లేదు. కానీ ఈసారి నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్న కాంగ్రెస్, బీజేపీ, ఆప్, అకాలీదళ్ వీరిని కూడా ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. అందులో భాగంగా రకరకాల హామీలు గుప్పిస్తున్నాయి. 2012 ఎన్నికల్లో అకాలీదళ్ ప్రకటించిన దాల్–ఆటా పథకం మాల్వా దళితుల్లో బాగా క్లిక్కవడంతో అలాంటి హామీలకే ప్రాధాన్యమిస్తున్నాయి మిగతా రాజకీయపక్షాలు. కాంగ్రెస్ అయితే మేనిఫెస్టోను మాల్వానే కేంద్రంగా చేసుకుని రూపొందించింది! ప్రతి ఇంటికీ ఉద్యోగం, ఇల్లు, నిర్వాసితులకు ఇంటి స్థలం, నెలవారీ పెన్షన్‌తో పాటు పంట నష్టపోయిన రైతులకు పరిహారం, ఆరోగ్య బీమా వంటి హామీలను ప్రకటించింది. ఆప్, బీజేపీ కూడా ఇదే తరహాలో హామీలిచ్చాయి. పేద ఓటర్లను దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలూ సబ్సిడీ రేషన్ పథకం ప్రకటించాయి. వీటితోపాటు ఈ ప్రాంతంలో సున్నితమైన అంశంగా నిలిచే మత సెంటిమెంట్లను రాజేసేందుకు కూడా కాంగ్రెస్, ఆప్, అకాలీదళ్ ప్రయత్నిస్తున్నా ఈసారి ఇది పెద్దగా పని చేయకపోవచ్చంటున్నారు. తమ సమస్యలను తీరుస్తుందని నమ్మే పార్టీకే మాల్వా ఓటర్లు జై కొడతారన్నది విశ్లేషకుల అంచనా. గతంలో అంత కాకున్నా డేరాల ప్రభావాన్నీ ఏ పార్టీ తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ముఖ్యంగా 2007, 2012 ఎన్నికల్లో బాగా ప్రభావం చూపిన సచ్‌ఖండ్, డేరా సచ్చా సౌదా ఈసారీ ఓటర్లను ఎంతోకొంత ప్రభావితం చేయొచ్చని అంచనా. గతంలో అకాలీల అడ్డా మాల్వా ప్రాంతం సంప్రదాయికంగా అకాలీదళ్‌కు అడ్డా. 2007లో ఇక్కడ ఆ పార్టీ 19 సీట్లతోనే సరిపెట్టుకున్నా 2012లో బాగా పుంజుకుని 34 సీట్లు సాధించగలిగింది. అలాంటిది 2017లో బీజేపీ– అకాలీ కూటమి కేవలం 8 సీట్లకు పరిమితమై కోలుకోలేనంతగా దెబ్బతింది. అకాలీ ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కు బదిలీ అయి ఆ పార్టీ 40 సీట్లు సొంతం చేసుకుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలోకి తొలిసారిగా దిగిన ఆప్ ఇక్కడ 18 సీట్లు నెగ్గిసత్తా చాటింది. – నేషనల్ డెస్క్, సాక్షి ఈసారి సర్వేల మొగ్గు ఆప్కే మాల్వాలో ఈసారి ఆప్ హవా ఉండొచ్చని సర్వేలు చెబుతున్నాయి. ఆ పార్టీకి 28 నుంచి 30 సీట్ల దాకా రావచ్చని ఇటీవలి జీ ఒపీనియన్ పోల్ తేల్చింది. కాంగ్రెస్‌కు 19 నుంచి 21, అకాలీదళ్‌కు 14 రావచ్చని, బీజేపీ 3 సీట్లకు పరిమితమవుతుందని జోస్యం చెప్పింది. రాష్ట్రంలోని దౌబా, మఝా ప్రాంతాల్లో మెజారిటీ సీట్లు తమవేనని కాంగ్రెస్ నమ్ముతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 20న జరగనున్న పోలింగ్‌పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఫలితాలు మార్చి 10న వెలువడతాయి. -
సాక్షి కార్టూన్ 05-02-2022
కొంప మునిగింది! పోటీ చేసే అభ్యర్థులందరూ సీఎం అభ్యర్థులేనట సార్! -
పంజాబ్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి పై నెలకొన్న ఉత్కంఠ!!
చండీగఢ్: పంజాబ్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఇద్దరూ ఉంటారంటూ వస్తున్న పుకార్లను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. అంతేకాదు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఒకరి పేరును మాత్రమే ప్రకటిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. పంజాబ్‌లోని కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవీ కోసం పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌సింగ్ చన్నీ, నవజ్యోత్ సిద్ధూ పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్‌గాందీ లూథీయానాలో ఈ ఇద్దర్ని పంజాబ్ ముఖ్యమంత్రులు ప్రకటిస్తున్నారంటూ ప్రచారం ఊపందుకుంది. అంతేకాదు ఈ ప్రచారం ఊపందుకున్న తర్వాత రోజే అక్రమ కేసుల తవ్వకాల్లో చన్నీ మేనల్లుడు భూపేంద్ర సింగ్ హనీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు కావడం గమనార్హం. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతుతో ముందంజలో చన్నీ ఉన్నందున సిద్దూ తన సొంత పార్టీపై దాడిని పెంచారు. మరోవైపు చన్నీ మేనల్లుడు అరెస్టు కావడంతో ప్రత్యక్ష విమర్శదాడులకు దిగారు. ఈ మేరకు సిద్దూ పార్టీ నిజాయితీ, క్లీన్ ట్రాక్ రికార్డ్ ఉన్న వారిని ఎన్నుకోవాలంటూ పిలుపునిచ్చారు. అంతేకాదు కాంగ్రెస్ చన్నీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేందుకు మెగ్గుచూపుతున్నట్లుగా పలు సంకేతాలు కూడా ఇచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలు ఏ నాయకుడికి అనుకూలంగా ఉన్నారో ఎంచుకోవడానికి ఐవీఆర్(ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్) కాల్ల ద్వారా పబ్లిక్ సర్వేను కూడా నిర్వహిస్తోంది. అయితే చన్నీ బంధువు అరెస్టు కావడంతో సిద్దూ తన వాదనను వినిపించేందుకు దీన్ని ఒక అవకాశంగా వినియోగించుకున్నారు. అంతేకాదు చన్ని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుండి నామినేట్ అవ్వడం, మరోవైపు బాలీవుడ్ నటుడు సోనూసూద్ కూడా చన్నీకి మరో అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీని కోరడం వంటి తదితర కారణాలతో చన్నీయే ముఖ్యమంత్రి అభ్యర్థి అనే ఊహాగానాలకు తెర తీసింది. మరోవైపు సిద్ధూ కూడా తనను తాను అభ్యర్థిగా చెప్పుకోవడానికి పదేపదే ప్రయత్నించడం గమనార్హం. (చదవండి: ‘సీఎం అభ్యర్థి చాయిస్.. చాన్స్ కాదు’) -
Punjab Election 2022: ‘సీఎం అభ్యర్థి చాయిస్.. చాన్స్ కాదు’
పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ స్వరం మారుతోంది. ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న ఆయన ఇన్నాళ్లూ సీఎం అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ అధిష్టానం చేతుల్లోనే ఉందని అంటూ వచ్చారు. పార్టీ ఎవరిని ఎంపిక చేసినా కట్టుబడి ఉంటానని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరహాలో సీఎం అభ్యర్థి ఎంపిక ప్రక్రియను టెలి ఓటింగ్ ద్వారా ప్రారంభించిన కాంగ్రెస్ రేపో మాపో ఒక ప్రకటన చేస్తుందనుకున్న సమయంలో ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. ఇసుక మాఫియా ఆరోపణలపై సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ మేనల్లుడు భూపేంద్ర సింగ్‌ను ఈడీ అరెస్ట్ చేసిన రోజు సిద్ధూ నేరుగా చన్నీపైనే తన అస్త్రాలను సంధించారు. ఎన్డీటీవీకిచ్చిన ఇంటర్వ్యూలో సీఎం అభ్యర్థికి నీతినిజాయితీలే ముఖ్యమంటూ కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారు. అధిష్టానం నిర్ణయం ఒక్కటే చాలదని ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉండాలంటూ తాను ఎంతకైనా తెగిస్తానని పరోక్ష సంకేతాలు ఇచ్చారు. ప్రశ్న: కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎలాంటివారై ఉండాలి ? జవాబు: కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా నీతి నిజాయితీ కలిగిన వ్యక్తిని, క్లీన్ ఇమేజ్ ఉన్నవారిని ఎంపిక చేయాలి. కనీసం 17 ఏళ్ల ట్రాక్ రికార్డు చూడాలి. నైతికత కోల్పోయిన వారిని, అవినీతి, బంధుప్రీతి, మాఫియాతో సంబంధాలున్న వారిని ఎంపిక చేస్తే ప్రజలు మార్పు కోరుకుంటారు. ఎన్నికల్లో పార్టీని నిలువునా పాతిపెడతారు. ప్రశ్న: మీరు సీఎం అభ్యర్థి అయ్యే అవకాశాలు ఏమేరకు ఉన్నాయంటారు? జవాబు: నేనే సీఎం అభ్యర్థినని అనుకోవడం లేదు. అలా చెబితే అది అహంకారమే అవుతుంది. కానీ నేను ఒక్క మాట చెప్పగలను. నవజోత్ సింగ్ సిద్ధూ అంటే అల్లాటప్పా వ్యక్తి కాదు. సెలెబ్రిటీ హోదాలో ఉండి ఆరు ఎన్నికల్లో విజయం సాధించిన వ్యక్తుల్ని మీరు ఎంతమందిని చూశారో చెప్పండి. వాస్తవానికి ప్రజలే ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలి. ప్రజావాణినే ఆ దేవదేవుడి శాసనంగా భావించాలి. ప్రశ్న: కాంగ్రెస్ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా మీకు ఆమోదయోగ్యమేనా? జవాబు: నాకు అంగీకారమా కాదా అన్నది విషయం కాదు. ఆ నాయకుడికి ప్రజామోదం లభించాలి. ఎమ్మెల్యేల మద్దతు కూడా కచ్చితంగా ఉండాలి. ఎమ్మెల్యేల మద్దతు లేకుండా ఎవరైనా సీఎం కాగలరా? కనీసం 60 మంది ఎమ్మెల్యేల మద్దతైనా ఉండాలి. ప్రశ్న: ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఎలా ఉండబోతోంది? జవాబు: ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి నీతి నిజాయితీ కలిగిన వారి నాయకత్వం అత్యంత అవసరం. సీఎం అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తుందన్న దానిపైనే పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంది. సీఎం అభ్యర్థి ఎప్పుడైనా ఛాయిస్ అవాలి. అంతే తప్ప చాన్స్ తీసుకోకూడదు (విస్తృత ప్రజామోదం ఉన్న నాయకుడు కావాలేగాని... అధిష్టానం ఎంపిక చేసిన ఎవరో ఒకరు కాకూడదు). ఎవరికి పార్టీని గెలిపించే సత్తా ఉందో కాంగ్రెస్ పెద్దలు తెలుసుకోవాలి. మాఫియా దందాలు చేసే వ్యక్తి పార్టీ కార్యక్రమాలను అమలు చేయగలరా? అవినీతిపరుల్ని కాపాడేవారికి పగ్గాలు అప్పగిస్తే, వాళ్లు మాఫియాను ఎలా అంతం చేయగలరు? ప్రశ్న: అమృత్సర్ (తూర్పు) నియోజకవర్గం అభ్యర్థిగా మీ లక్ష్యం ఏమిటి? శిరోమణి అకాలీదళ్ నాయకుడు బిక్రమ్‌సింగ్ మజితాయి ఎంతవరకు పోటీ ఇస్తారు? జవాబు: నేను భావితరం బాగోగుల కోసం పోరాటం చేస్తాను. భావితరం బాగుంటేనే దేశ భవిష్యత్ బాగుంటుంది. ఇప్పుడు జరుగుతున్నది ధర్మపోరాటం.ధర్మం ఎటువైపు ఉంటే విజయం అటువైపే ఉంటుంది. ధర్మయుద్ధంలో అకాలీదళ్ ఎప్పటికీ నెగ్గలేదు. -
దళితుల చేతిలోనే.. పంజాబ్ అధికార దండం
దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనంతగా పంజాబ్‌లో అత్యధికంగా 32 శాతం మంది దళిత ఓటర్లు ఉన్నారు. కానీ వీరి చేతిలో 2.3 శాతం భూమి మాత్రమే ఉండటం గమనార్హం. ఛండీఘడ్: పంజాబ్‌లో రాజకీయం పంచముఖ పోరుగా మారడం, కాంగ్రెస్‌కు మారుపేరుగా నిలిచిన కెప్టెన్ అమరీందర్‌సింగ్ హస్తం పార్టీకి గుడ్‌బై కొట్టి... బీజేపీతో జట్టుకట్టడంతో ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. మరోవైపు రెండు దశాబ్దాలకు పైగా బీజేపీతో ఉన్న బంధాన్ని తెగదెంపులు చేసుకున్న శిరోమణి అకాలీదళ్–కొత్తగా మాయావతి పార్టీ బీఎస్పీతో పొత్తపెట్టుకోవడం, ఆమ్ ఆద్మీ పార్టీ... దళిత ఎమ్మెల్యే హర్బాల్ సింగ్ (దిర్బా నియోజకవర్గం)ను అసెంబీల్లో ఆప్ పక్ష నేతగా నియమించడం... ఇలా ఇప్పుడు పంజాబ్ రాజకీయమంతా దళితుల చుట్టూనే తిరుగుతోంది. వాస్తవంగా చెప్పాలంటే... పంజాబ్ రాజకీయాల్లో జాట్ సిక్కులదే ఆధిపత్యమైనప్పటికీ... ప్రస్తుతం పరిస్థితి వేరుగా ఉంది. రాష్ట్ర జనాభాలోని 60 శాతం సిక్కుల్లో జాట్ల వాటా 21 శాతమే అయినప్పటికీ అదే ఆధిపత్య వర్గం. రాజకీయ నాయకత్వమంతా దశాబ్దాలుగా ఈ వర్గం చేతిలోనే కేంద్రీకృతమవుతోంది. ఆయా పార్టీల సంప్రదాయ ఓటు బ్యాంకుకు దళితుల ఓట్లు తోడైతేనే ఏ పార్టీ అయినా ప్రస్తుతం పంజాబ్ సీఎం పీఠాన్ని అందుకోగలుగుతుంది. ఎందుకంటే పంజాబ్ జనాభాలో దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఏకంగా 32 శాతం మంది దళిత ఓటర్లు ఉన్నారు. మూడింటి ఒకవంతున్న దళిత ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పుడు రాజకీయపక్షాలన్నీ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. 10 నెలల కిందటే మొదలుపెట్టిన బీజేపీ మూడు నూతన వ్యవసాయ సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దీర్ఘకాలిక భాగస్వామి అయిన శిరోమణి అకాలీదళ్ ఎన్డీయేను వీడటంతోనే కమలదళం అప్రమత్తమైంది. ప్రధానంగా వ్యవసాయాధారిత రాష్ట్రమైన పంజాబ్‌లో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో (ఫిబ్రవరి 20న జరగనున్నాయి) తాము గెలిస్తే దళిత సామాజికవర్గానికి చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రిని చేస్తామని గత ఏప్రిల్‌లోనే ప్రకటించడం ద్వారా బీజేపీ ఈ వర్గంలో కొత్త ఆశలు రేకెత్తించింది. అమరీందర్ సింగ్– సిద్ధూల మధ్య గొడవ తలకుమించిన భారం కావడంతో కాంగ్రెస్ గత ఏడాది సెప్టెంబరులో తెగించేసింది. జాట్ సిక్కు అయిన కెప్టెన్ అమరీందర్ స్థానంలో రవిదాసియా వర్గానికి చెందిన దళితుడైన చరణ్‌జిత్‌సింగ్ చన్నీని సీఎంగా నియమించి అందరికంటే ముందుగానే దళిత ఛాంపియన్ అనిపించుకునే ప్రయత్నం చేసింది. గురు రవిదాస్ జయంతిని పురస్కరించుకొని... ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 14న కాకుండా మరో ఆరురోజులు ముందుకు జరిపి ఈ నెల 20 నిర్వహించాలని పంజాబ్ సీఎం చన్నీ ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. మిగతా రాజకీయపక్షాలన్నీ ఆయన డిమాండ్‌కే మద్దతు పలకడంతో ఈసీ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను ఈనెల 20కి వాయిదా వేసింది. ఈ చర్య దళితుల్లో చన్నీ గ్రాఫ్‌ను అమాంతంగా పెంచేసిందని రాజకీయ పండితులు విశ్లేషణ. అయితే అధికార వ్యతిరేకతను అధగమించడం, పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ కొట్టే సిక్సర్లను తట్టుకోవడం లాంటి పనులతోనే పాపం చన్నీ బిజీగా గడపాల్సి వస్తోంది. దళితుల్లోనూ మళ్లీ రెండు వర్గాలు పంజాబ్‌లోని దళితుల్లో... హిందు దళితులు, సిక్కు దళితులుగా రెండు వర్గాలున్నాయి. హిందు దళితుల శాతం ఎప్పటికప్పుడు మారుతూ ఉండటానికి కారణం... వీరిలో చాలా మంది సిక్కు మతంలోకి మారిపోవడం, రవిదాసియా, ఆది ధర్మిలు మాత్రం తమను ప్రత్యేక మతంగా గుర్తించాలనే డిమాండ్లు వినిపిస్తున్నారు. 2018 సామాజిక సాధికార శాఖ గణాంకాల ప్రకారం పంజాబ్ దళితుల్లో మొత్తం 39 ఉపకులాలున్నాయి. వీటిలో ఐదు ప్రముఖమైనవి. రాష్ట్రంలోని 32 శాతం దళిత జానాభాలో వీటి వాటాయే 80 శాతం దాకా ఉంటుంది. మజ్హబీ సిక్కులు అత్యధికంగా 30 శాతం ఉండగా... తర్వాత రవిదాసియాలు 24 శాతం మేరకు ఉంటారు. కాగా ఆది ధర్మీలు 11 శాతం ఉంటారు. ఇక ప్రాంతాల వారీగా చూస్తే... దౌబాలో 37 శాతం, మాల్వాలో 31 శాతం, మజ్హాలో 29 శాతం దళితులున్నారు. మొత్తం 117 అసెంబ్లీ సీట్లున్న పంజాబ్‌లో 34 సీట్లు ఎస్సీలకు రిజర్వు చేశారు. 2017లొ ఈ 34 స్థానాల్లో కాంగ్రెస్ ఏకంగా 21 నెగ్గగా, ఆప్ 9 సీట్లు గెల్చుకుంది. డేరాల ప్రభావం క్షీణించినట్లేనా! గతంలో దళిత ఓటర్లపై డేరా సచ్చా సౌదా (సమానత్వాన్ని ప్రబోధించే ధ్యాన కేంద్రా)ల ప్రభావం తీవ్రంగా ఉండేది. డేరాసచ్చా సౌదా అధిపతి రామ్‌రహీమ్ సింగ్ అత్యాచారం, హత్య కేసులో అరెస్టయి జైల్లో ఉండటంతో దళితులపై ఈ డేరాల ప్రభావం మునుపటి స్థాయిలో లేదు. 69 సీట్లున్న మాల్వా ప్రాంతంలో గత ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ తీవ్రంగా దెబ్బతింది. అకాలీ దళిత ఓటు బ్యాంకు కాస్తా కాంగ్రెస్ బదిలీ అయింది. ఐక్యత లేదు.. పంజాబ్‌లో జనాభాలో దళితులు ఏకంగా 32 శాతం ఉన్నప్పటికీ... వారి మధ్య రాజకీయ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఐక్యత లేకపోవడమే వీరిని దెబ్బతీస్తోంది. ఏదో ఒక ఆధ్యాత్మిక బోధకుడి సూక్తులకు కట్టుబడి ఉండకపోవడం, భిన్నమైన ఆచారాలు, సంస్కృతులు ఉండటం మూలంగా పంజాబ్ దళితుల్లో ఐక్యత లోపించి బీఎస్సీ ఇక్కడ దారుణంగా విఫలమైందని, గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ కనీసం ఒక్క సీటును కూడా గెలవకపోవడానికి ఇదే కారణమని పంజాబ్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ ప్రమోద్ కుమార్ విశ్లేషించారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
నా నియోజకవర్గమే నా పెద్ద కుటుంబం: గనీవ్ కౌర్
చండీగఢ్: పంజాబ్‌లో ఎన్నికలు సమీపిస్తున్నవేళ రాజకీయాలు ఆసక్తికరంగా వాడివేడిగా రసవత్తరంగా సాగుతున్నాయి. అందులో భాగంగానే ఫ్రిబ్రవరి 20న జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో శిరోమణి అకాలీదళ్ పార్టీ పంజాబ్ రాష్ట్ర మాజీ క్యాబినెట్మంత్రి బిక్రమ్ సింగ్ మజితియా భార్య గనీవ్ కౌర్‌ని పోటీలోకి తెరంగేట్రం చేసింది. కౌర్ రాజీకీయ కుటుంబ నేపథ్యం ఉన్న వ్యక్తిని వివాహం చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు ఆమె రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. అయితే తాను రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదని, పరిస్థితుల రీత్యా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాని కౌర్ చెప్పుకొచ్చారు. ఈ మేరకు గనీవ్ కౌర్ సోమవారం మజిత స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పైగా తాను ఎప్పుడూ తన కుటుంబ సభ్యులు లేదా తన భర్త ఎన్నికల్లో పోటీ చేసినప్పుడూ ఓటు వేయాలంటూ ఎన్నకల్లో వారికి మద్దతుగా ప్రచారం చేయకపోయినప్పటికి తన కుటుంబం తనకు మద్దతుగా నిలిచిందంటూ ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాదు కేంద్ర మాజీ మంత్రి, శిరోమణి అకాలీదళ్ పార్టీ నాయకురాలు హర్ సిమ్రత్ కౌర్ నుండి ప్రేరణ పొందానని ఆమెలా ఉండాలనుకుంటున్నానని గనీవ్ కౌర్ చెప్పారు. తాను తన పిల్లలను చూసుకుంటున్నట్లే తన నియోజకవర్గాన్ని చూసుకుంటానని మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. 2007లో తన భర్త పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో మజితా స్థానానికి ప్రాతినిధ్యం వహించినప్పుడూ ఏవిధంగానైతే మద్దతు ఇచ్చారో అలాగే తనకు మద్దతు ఇస్తారని భావిస్తున్నానని అన్నారు. తాను కళారంగం నుండి రాజకీయాల్లోకి ప్రవేశించలేదని, కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చానని, తన నియోజకవర్గమే తన పెద్ద కుటుంబం అని కౌర్ వ్యాఖ్యానించారు -
పంజాబ్ సీఎం చన్నీ మేనల్లుడు అరెస్ట్
న్యూఢిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ మేనల్లుడు భూపీందర్ సింగ్ అలియాస్ హనీని మనీల్యాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం అరెస్టు చేసింది. అక్రమ ఇసుక మైనింగ్‌కు సంబంధించి హనీకి మనీల్యాండరిం గ్‌తో సంబంధాలున్నాయని ఈడీ అధికారులు తెలిపారు. గురువారం రాత్రి చాలా సేపు హనీని విచారించి అనంతరం పీఎంఎల్ చట్టం కింద అదుపులోకి తీసుకొన్నామని తెలిపారు. విచారణలో సహకరించనందుకే హనీని అరెస్టు చేసినట్లు తెలిసింది. ఆయన్ను పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు ఆయనకు ఐదురోజుల ఈడీ కస్టడీ విధించింది. గతనెల 18న హనీ నివాసాలపై ఈడీ దాడులు జరిపి రూ. 8 కోట్ల నగదు, పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ప్రత్యర్థులకు అస్త్రం హనీ అరెస్టుతో పంజాబ్ ఎన్నికల ముందు ప్రత్యర్థి పార్టీలకు, సొంతపార్టీలోని వ్యతిరేకులకు చన్నీ మేనల్లుడి అరెస్టు వరంలా మారనుందని నిపుణుల అంచనా. ఈనెల 6న పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి పేరును రాహుల్ గాంధీ ప్రకటించే నేపథ్యంలో చన్నీకి చాన్సు లభించడంపై ఉత్కంఠ నెలకొంది. హనీ అరెస్టు రాజకీయ గిమ్మిక్కని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే చన్నీ బంధువుల్లో ఒక్కరే 111 రోజుల చన్నీ పాలనలో కోట్లు కూడబెడితే, ఆయన చుట్టాలంతా కలిసి ఎంత పోగేసి ఉంటారో ఊహించవచ్చని ఆప్ పార్టీ దుయ్యబట్టింది. ఈ విషయంలో చన్నీ సమాధానం చెప్పాలని శిరోమణి అకాలీదళ్ నేత మజితియా డిమాండ్ చేశారు. -
పాకిస్తాన్‌పైనే యుద్ధం చేసిన సైనికుడు
కెప్టెన్ అమరీందర్ సింగ్ జీవనయానం ఆయన ఒక సైనికుడు.. దేశ రక్షణ కోసం పాకిస్తాన్‌పైనే యుద్ధం చేశారు. ఆపరేషన్ బ్లూ స్టార్‌కు, సిక్కుల ఊచకోతకు వ్యతిరేకంగా పోరాడారు. కాంగ్రెస్‌లోని అసమ్మతి వాదులతో యుద్ధం చేశారు. జీవితంలో అడుగడుగునా ఎదురైన సవాళ్లకు ఎదురొడ్డి నిలిచారు తప్పితే.. ఏనాడూ వెన్ను చూపలేదు. ఈ పాటియాలా రాజవంశ వారసుడు..పంజాబీల కోసం అలుపెరుగని పోరాటం చేశారు. ఎక్కడికి వెళ్లినా కెప్టెన్ అంటూ జన నీరాజనాలు అందుకున్నారు. ఇప్పుడు జీవితచరమాంకంలో తనను అవమానించిన కాంగ్రెస్‌పై కత్తి దూస్తున్నారు. కసితో రగిలిపోతున్నారు. అందుకే బీజేపీతో చేతులు కలిపి ఎన్నికల సమరంలో సై అంటున్నారు. యాదవేంద్ర సింగ్, మహరాణి మహీందర్ కౌర్ దంపతులకు పంజాబ్‌లోని పాటియాలాలో 1942 మార్చి 11న జన్మించారు. డెహ్రాడూన్‌లో డూన్ స్కూలులో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. పుణేలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి డిగ్రీ చేశారు చిన్నప్పట్నుంచి ఆర్మీ కెప్టెన్ అవాలని ఆశపడ్డారు. 1963లో ఇండియన్ ఆర్మీలో చేరారు 1965లో పాకిస్తాన్‌తో యుద్ధం జరిగినప్పుడు ఇండియన్ ఆర్మీలో కెప్టెన్‌గా ఉన్నారు. 1980లో కాంగ్రెస్ పార్టీలో చేరి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అమరీందర్ సింగ్ భార్య ప్రణీత్ కౌర్ 2009–2014 మధ్య విదేశాంగ శాఖ సహాయమంత్రిగా ఉన్నారు. వారికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. సిక్కుల చరిత్ర మీద, యుద్ధాల మీద ఎన్నో పుస్తకాలు రాశారు. ది లాస్ట్ సన్‌సెట్, ది మాన్సూన్ వార్ అన్న పుస్తకాలు ఆయనకు పేరు తెచ్చిపెట్టాయి. 1984లో ఖలిస్తాన్ ఉద్యమాన్ని అణచివేయడానికి నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ బ్లూ స్టార్‌ను నిరసిస్తూ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అదే సంవత్సరం కాంగ్రెస్‌కి గుడ్‌బై కొట్టేసి శిరోమణి అకాలీదళ్‌లో (ఎస్ఏడీ) చేరి ఎమ్మెల్యే అయ్యారు. 1992లో అకాలీదళ్‌ను వీడి సొంతంగా శిరోమణి అకాలీదళ్ (పాంథిక్) అనే పార్టీని స్థాపించారు 1998లో జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్‌లో కలిపేశారు. ఆ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గంలోనే అమరీందర్‌కు 856 ఓట్లు మాత్రమే వచ్చాయి పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా పలుమార్లు బాధ్యతలు నిర్వహించారు 2002లో తొలిసారిగా పంజాబ్ సీఎం అయ్యారు. 2017లో మార్చి 16న మళ్లీ సీఎం పగ్గాలు అందుకున్నారు. నవజోత్ సింగ్ సిద్దూతో విభేదాల కారణంగా అమరీందర్ నాయకత్వ సామర్థ్యంపైనే ప్రశ్నలు తలెత్తాయి. దీంతో 2021, సెప్టెంబర్ 18న పంజాబ్ సీఎం పదవికి రాజీనామా చేశారు కాంగ్రెస్ పార్టీకి 2021, నవంబర్ 2న గుడ్‌బై కొట్టారు. ఏడు పేజీల రాజీనామా లేఖని అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ) పేరుతో 2021, డిసెంబర్ 17న కొత్త పార్టీ స్థాపించి బీజేపీతో జతకట్టి ఎన్నికల్లో పాల్గొంటామని ప్రకటించారు. ప్రజాదరణ పుష్కలంగా ఉన్న అమరీందర్‌కు ఈ ఎన్నికలు పూల పాన్పు కాదు. ప్రజలకి ఈ మధ్యకాలంలో బాగా దూరమయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెడ్డ పేరు సంపాదించారు. ఇన్నాళ్లూ వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ వచ్చిన ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఆయన అనుచరులకి మింగుడు పడడం లేదు. కాంగ్రెస్ నుంచి ఆశించినంత సంఖ్యలో ఆయన వెంట ఎమ్మెల్యేలు రాలేదు. అమరీందర్‌కు అత్యంత సన్నిహితులైన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. దీంతో చరిత్రను పునరావృతం చేస్తూ ఎన్నికలయ్యాక ఆయన పార్టీని బీజేపీలో కలిపేస్తారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పంజాబ్‌లో రైతులు బీజేపీపై తీవ్ర ఆగ్రహంతో ఉండడంతో దాని ప్రభావం, బీజేపీ, అమరీందర్ పార్టీ పీఎల్సీ, అకాలీదళ్‌లో చీలికవర్గమైన శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్) కూటమిపై పడుతుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. రాజీవ్ ప్రేరణతో.. అమరీందర్ సింగ్ డూన్ స్కూలులో చదువుతున్నప్పుడు రాజీవ్‌గాంధీ ఆయనకు మంచి మిత్రుడు. ఆర్మీ నుంచి పదవీ విరమణ చేశాక రాజీవ్ కోరిక మేరకే కాంగ్రెస్‌లో చేరి పాటియాలా నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అప్పట్నుంచి పాటియాలా మహరాజుగా ప్రజలందరూ ఆయనను కీర్తించారు. కాంగ్రెస్ పార్టీలో అమరీందర్‌పై సిద్ధూ చేసిన అసమ్మతి యుద్ధంతో అవమానకర రీతిలో పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆయన ఈసారి ఎంత మేరకు ప్రభావం చూపించగలరన్న అనుమానాలైతే ఉన్నాయి. సరిగ్గా 30 ఏళ్ల క్రితం వేరు కుంపటి పెట్టి చేతులు కాల్చుకున్న అమరీందర్ అప్పట్లో పార్టీ జెండా పీకేసి కాంగ్రెస్‌లో కలిపేశారు. ఈసారి ఎన్నికలయ్యాక పార్టీని బీజేపీలో విలీనం చేస్తారన్న ప్రచారమైతే సాగుతోంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
పంజాబ్‌లో ఫన్నీ ఛాలెంజ్‌లు
చండీగఢ్: పంజాబ్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీల మధ్య, వ్యక్తుల మధ్య సవాళ్లు ఎక్కువయ్యాయి. అయితే వీటిలో అన్నీ సీరియస్ ఛాలెంజులు కాదు. ‘దమ్ముంటే ఒక్క సీటులో పోటీ చెయ్యి, సత్తా ఉంటే 30 నిమిషాలు ఆగకుండా బ్యాడ్మెంటెన్ ఆడు..’ లాంటి కాలక్షేపం సవాళ్లు కూడా ఉన్నాయి. కేవలం చిన్నా చితకా అభ్యర్ధులే సవాళ్లు విసురుకుంటున్నారనుకుంటే పొరపాటే! సీఎం చన్నీ, పీఎల్సీ నేత అమరీందర్, పీసీసీ చీఫ్ సిద్ధూ లాంటి వాళ్లు కూడా జోరుగా ఛాలెంజులు చేస్తున్నారు. చన్నీ రెండు చోట్ల పోటీ చేయాలని నిర్ణయించుకోవడం, సిద్ధూను ఎదుర్కొనేందుకు ఎస్ఏడీ నేత మజితియా సిద్ధపడడంతో ఈ ఛాలెంజుల వేడి పెరిగింది. చన్నీ రెండు సీట్లలో పోటీ చేయడంపై ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ, చన్నీ తప్పకుండా చమకూర్ సాహెబ్ సీటు ఓడిపోతారన్నారు. దీనిపై వెంటనే చన్నీ స్పందించి తనకు వ్యతిరేకంగా పంజాబ్‌లోని ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేయాలని కేజ్రీవాల్‌కు సవాలు విసిరారు. అదే కోవలో పాటియాల సీటు వదిలి తనపై అమృతసర్ తూర్పు నియోజకవర్గంలో పోటీ చేయాలని అమరీందర్ సింగ్‌ను నవ్‌జోత్‌సింగ్ సిద్ధూ ఛాలెంజ్ చేశారు. అంతటితో ఆగకుండా అమరీందర్ ఆపకుండా 30 నిమిషాలు బ్యాడ్మెంటెన్ ఆడితే తాను రాజకీయాలు వదిలేస్తానని ఎద్దేవా చేశారు. అలాగే తనపై పోటీకి దిగిన ఎస్ఏడీ నేత మజితియా కేవలం తనపై మాత్రమే పోటీ చేయాలని, మజితా నియోజకవర్గం వదిలిపెట్టాల ని సిద్ధూ సవాల్ చేశారు. దీన్ని మజితియా అంగీకరించి అమృత్సర్ సీటుకే పరిమితమయ్యారు. -
మావోడే... కాదు మావాడు!
చండీగఢ్ : పంజాబ్‌లోని నవాషహర్ అసెంబ్లీ నియోజకవర్గం చుట్టూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈసారి కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అంగద్ సింగ్ సైనీకి కాంగ్రెస్ టికెట్ నిరాకరించింది. గత 60 ఏళ్లలో సైనీ కుటుంబ సభ్యులకే కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 13 సార్లు టికెట్లు ఇచ్చింది. కానీ అంగద్ సింగ్ భార్య అదితి సింగ్ ఇటీవల ఉత్తరప్రదేశ్ బీజేపీలో చేరడంతో ఆయనకు పార్టీ టికెట్ దక్కలేదు. దీంతో అంగద్ సింగ్ రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. మరోవైపు అమరీందర్ సింగ్ పార్టీ నుంచి వచ్చిన సత్వీర్ సింగ్ పల్లీకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ ఆయనకు టికెట్ ఇచ్చాక అమరీందర్‌కు చెందిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ సత్వీర్ సింగ్‌ను జిల్లా అధ్యక్షుడిని చేసింది. దీంతో ఆయన ఏ పార్టీలో ఉన్నారో తెలియక కార్యకర్తల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే తనకు చెప్పకుండానే అమరీందర్ జిల్లా అధ్యక్షుడిగా నియమించారని, తాను కాంగ్రెస్ వ్యక్తినేనని సత్వీర్ సింగ్ చెప్పుకోవాల్సి వస్తోంది. ఈసారి 60 మంది సిట్టింగ్ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చినప్పటికీ తనకు టికెట్ ఇవ్వకపోవడంతో అంగద్ సింగ్ సైనీ కాంగ్రెస్‌ను ఓ రేంజ్లో తిట్టిపోస్తున్నారు. రెండు వేర్వేరు పార్టీలలో భార్యాభర్తలుండడం చాలా సహజమైన అంశమని, తన పనిని కాంగ్రెస్ గుర్తించలేదని మండిపడుతున్నారు. సైనీ కుటుంబానికి ఈ నియోజకవర్గంపై కొన్ని దశాబ్దాలుగా పట్టు ఉంది. మొత్తమ్మీద ఈ వివాదాల నడుమ ఆప్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన నవాషహర్ కౌన్సిలర్ లలిత్ మోహన్ పాఠక్ పంట పండే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. (చదవండి: నన్నే సీఎంగా ఉండమన్నారు!)