చండీగఢ్: పంజాబ్ ఎన్నికల వేళ మాజీ సైనికాధిపతి జనరల్ జోగీందర్ జస్వంత్ సింగ్ మంగళవారం బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, పంజాబ్ బీజేపీ చీఫ్ అశ్వని శర్మ తదితర పార్టీ నేతలు జేజే సింగ్‌ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ ఆర్మీచీఫ్ వీకే సింగ్ అనంతరం బీజేపీలో చేరిన రెండో మాజీ ఆర్మీ చీఫ్ జేజే సింగ్ కావడం విశేషం. గతంలో సింగ్ శిరోమణి అకాలీదళ్‌లో ఉన్నారు. 2017ఎన్నికల్లో పాటీయాలా నుంచి అమరీందర్‌పై అకాలీ అభ్యర్ధిగా పోటీచేసి ఓడిపోయారు.
ఆ ఎన్నికల్లో ఆయనకు మూడో స్థానం దక్కింది. అనంతరం సింగ్ 2018లో అకాలీదళ్ నుంచి బయటకు వచ్చారు.అంతకుముందు ఆయన అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా సేవలనందించారు. 2005లో ఆయన ఆర్మీచీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవి చేపట్టిన తొలి సిక్కు ఆయనే! సింగ్‌తో పాటు మాజీ డీజీపీ ఎస్‌ఎస్ సంధు, అజ్మీర్ సింగ్ తదితరులు బీజేపీలో చేరారు. రాష్ట్రంలో అమరీందర్ పార్టీ, అకాలీదళ్(సంయుక్త్)తో కలిసి బీజేపీ పోటీ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment