చండీగఢ్: పంజాబ్‌లో ఎన్నికలు సమీపిస్తున్నవేళ రాజకీయాలు ఆసక్తికరంగా వాడివేడిగా రసవత్తరంగా సాగుతున్నాయి. అందులో భాగంగానే ఫ్రిబ్రవరి 20న జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో శిరోమణి అకాలీదళ్ పార్టీ పంజాబ్ రాష్ట్ర మాజీ క్యాబినెట్‌మంత్రి బిక్రమ్ సింగ్ మజితియా భార్య గనీవ్ కౌర్‌ని పోటీలోకి తెరంగేట్రం చేసింది. కౌర్ రాజీకీయ కుటుంబ నేపథ్యం ఉన్న వ్యక్తిని వివాహం చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు ఆమె రాజకీయాలకు దూరంగానే ఉన్నారు.
అయితే తాను రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదని, పరిస్థితుల రీత్యా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాని కౌర్ చెప్పుకొచ్చారు. ఈ మేరకు గనీవ్ కౌర్ సోమవారం మజిత స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పైగా తాను ఎప్పుడూ తన కుటుంబ సభ్యులు లేదా తన భర్త ఎన్నికల్లో పోటీ చేసినప్పుడూ ఓటు వేయాలంటూ ఎన్నకల్లో వారికి మద్దతుగా ప్రచారం చేయకపోయినప్పటికి తన కుటుంబం తనకు మద్దతుగా నిలిచిందంటూ ఆనందం వ‍్యక్తం చేశారు.
అంతేకాదు కేంద్ర మాజీ మంత్రి, శిరోమణి అకాలీదళ్ పార్టీ నాయకురాలు హర్ సిమ్రత్ కౌర్ నుండి ప్రేరణ పొందానని ఆమెలా ఉండాలనుకుంటున్నానని గనీవ్ కౌర్ చెప్పారు. తాను తన పిల్లలను చూసుకుంటున్నట్లే తన నియోజకవర్గాన్ని చూసుకుంటానని మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. 2007లో తన భర్త పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో మజితా స్థానానికి ప్రాతినిధ్యం వహించినప్పుడూ ఏవిధంగానైతే మద్దతు ఇచ్చారో అలాగే తనకు మద్దతు ఇస్తారని భావిస్తున్నానని అన్నారు. తాను కళారంగం నుండి రాజకీయాల్లోకి ప్రవేశించలేదని, కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చానని, తన నియోజకవర్గమే తన పెద్ద కుటుంబం అని కౌర్ వ్యాఖ్యానించారు
Comments
Please login to add a commentAdd a comment