Harsimrat Kaur Badal
-
నా నియోజకవర్గమే నా పెద్ద కుటుంబం: గనీవ్ కౌర్
చండీగఢ్: పంజాబ్‌లో ఎన్నికలు సమీపిస్తున్నవేళ రాజకీయాలు ఆసక్తికరంగా వాడివేడిగా రసవత్తరంగా సాగుతున్నాయి. అందులో భాగంగానే ఫ్రిబ్రవరి 20న జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో శిరోమణి అకాలీదళ్ పార్టీ పంజాబ్ రాష్ట్ర మాజీ క్యాబినెట్మంత్రి బిక్రమ్ సింగ్ మజితియా భార్య గనీవ్ కౌర్‌ని పోటీలోకి తెరంగేట్రం చేసింది. కౌర్ రాజీకీయ కుటుంబ నేపథ్యం ఉన్న వ్యక్తిని వివాహం చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు ఆమె రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. అయితే తాను రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదని, పరిస్థితుల రీత్యా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాని కౌర్ చెప్పుకొచ్చారు. ఈ మేరకు గనీవ్ కౌర్ సోమవారం మజిత స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పైగా తాను ఎప్పుడూ తన కుటుంబ సభ్యులు లేదా తన భర్త ఎన్నికల్లో పోటీ చేసినప్పుడూ ఓటు వేయాలంటూ ఎన్నకల్లో వారికి మద్దతుగా ప్రచారం చేయకపోయినప్పటికి తన కుటుంబం తనకు మద్దతుగా నిలిచిందంటూ ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాదు కేంద్ర మాజీ మంత్రి, శిరోమణి అకాలీదళ్ పార్టీ నాయకురాలు హర్ సిమ్రత్ కౌర్ నుండి ప్రేరణ పొందానని ఆమెలా ఉండాలనుకుంటున్నానని గనీవ్ కౌర్ చెప్పారు. తాను తన పిల్లలను చూసుకుంటున్నట్లే తన నియోజకవర్గాన్ని చూసుకుంటానని మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. 2007లో తన భర్త పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో మజితా స్థానానికి ప్రాతినిధ్యం వహించినప్పుడూ ఏవిధంగానైతే మద్దతు ఇచ్చారో అలాగే తనకు మద్దతు ఇస్తారని భావిస్తున్నానని అన్నారు. తాను కళారంగం నుండి రాజకీయాల్లోకి ప్రవేశించలేదని, కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చానని, తన నియోజకవర్గమే తన పెద్ద కుటుంబం అని కౌర్ వ్యాఖ్యానించారు -
రాహుల్‌కు.. హర్సిమ్రత్ కౌర్ బాదల్ చురకలు.. అలాంటి ప్రచారాలు మానుకోవాలి
చండీగఢ్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మాజీ కేంద్ర మంత్రి, శిరోమణి అకాలీదళ్ పార్టీ నాయకురాలు హర్ సిమ్రత్ కౌర్ బాదల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె ట్విటర్ వేదికగా మండిపడ్డారు. కాగా, రాహుల్ గాంధీ గత బుధవారం పంజాబ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అమృత్ సర్‌లోని స్వర్ణ దేవాలయంను సందర్శించారు. ఈ నేపథ్యంలో రాహుల్ తన జేబులో నుంచి చోరీ జరిగినట్లు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ ఆరోపణలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దీనిపై హర్సిమ్రాత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాహుల్ గాంధీ.. ఒక జెడ్ క్యాటగిరి భద్రతను కల్గిఉన్నారని.. ఆయనతోపాటు పంజాబ్ సీఎం చన్నీ, డిప్యూటి సీఎం సుఖ్ జీందర్ సింగ్ రంధావా, ఓపీ సోనిలుకూడా ఉన్నారన్నారు. ఇలాంటి చోట చోరీ జరగటం ఏంటని ప్రశ్నించారు. పవిత్రమైన ప్రదేశానికి చెడ్డపేరు తెచ్చేల వ్యాఖ్యలు చేయకూడదని హితవు పలికారు. భక్తుల మనోభావాలు దెబ్బతీనేలా ప్రవర్తించకూడదన్నారు. అసత్య ప్రచారాలు మానుకోవాలని రాహుల్‌కు చురకలంటించారు. అయితే, రాహుల్ ఆరోపణలపై.. పూర్తి వివరాలను వెల్లడించలేదని ఎంపీ హర్సిమ్రాత్ కౌర్‌బాదల్ అన్నారు. కాగా, రాహుల్ గాంధీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. బుధవారం రోజు జలంధర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నవిషయం తెలిసిందే. హర్ సిమ్రాత్ వ్యాఖ్యలపై.. కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా ఆమె పోస్ట్‌కు రీట్వీట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. తప్పుడు వార్తలను ప్రచారం చేయడం అపచారమని అన్నారు. రాజకీయ విభేదాలకు అతీతంగా బాధ్యతతో, పరిపక్వతతో ప్రదర్శించాలని తెలిపారు. గతంలో నరేంద్రమోదీ తీసుకువచ్చిన చట్టాలు.. రైతుల జేబులు కొట్టడం లాంటివేనని అన్నారు. Who picked @RahulGandhi's pocket at Sri Harmandir Sahib?@CHARANJITCHANNI? @sherryontopp? or @Sukhjinder_INC? These were the only 3 persons allowed by Z-security to get near him. Or is it just one more attempt to bring bad name to our holiest shrine, after the 'be-adbi' incidents? — Harsimrat Kaur Badal (@HarsimratBadal_) January 29, 2022 చదవండి: ఒక వైపు నామినేషన్లు.. మరోవైపు రాజీనామాలు -
ఇక మిగిలింది అథవాలే ఒక్కరే!
న్యూఢిల్లీ: లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) అధినేత, కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ మరణంతో ఎన్డీయే మంత్రివర్గంలో బీజేపీ మిత్రపక్షాల నుంచి రాంధాస్ అథవాలే ఒక్కరే మిగిలారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) అధ్యక్షుడు అయిన అథవాలే ప్రస్తుతం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయమంత్రిగా పని చేస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే–2 ప్రభుత్వంలో మంత్రులుగా వ్యవహరించిన అరవింద్ సావంత్(శివసేన), హర్సిమ్రత్ కౌర్ బాదల్(శిరోమణి అకాలీదళ్) గతంలోనే రాజీనామా చేశారు. తాజాగా పాశ్వాన్(ఎల్జేపీ) అనారోగ్యంతో మృతిచెందారు. (చదవండి: పాశ్వాన్ కన్నుమూత ) ఇక శివసేన, శిరోమణి అకాలీదళ్ ఎన్డీయే నుంచి బయటకు వెళ్లిపోయాయి. మరో మిత్రపక్షం జేడీ(యూ) కేంద్రంలో ఎన్డీయే సర్కారుకు బయటి నుంచి మద్దతు ఇస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాకుండా 57 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో 24 మంది కేబినెట్, 9 మంది సహాయ మంత్రులు(స్వతంత్ర హోదా), 24 మంది సహాయ మంత్రులు. అరవింద్ సావంత్, హర్సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా, పాశ్వాన్ మరణంతో కేబినెట్ మంత్రుల సంఖ్య 21కి పడిపోయింది. అలాగే రైల్వేశాఖ సహాయ మంత్రి సురేశ్ అంగడి మృతితో సహాయ మంత్రుల సంఖ్య 23కు పడిపోయింది. రాజ్యాంగం ప్రకారం ప్రధాని మోదీ 80 మంది మంత్రులను నియమించుకునేందుకు అవకాశం ఉంది. -
‘ఆమె రాజీనామా అణు బాంబులా కుదిపేసింది’
సాక్షి, న్యూఢిల్లీ : వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ హర్సిమ్రత్ కౌర్ కేంద్ర మంత్రి పదవికి చేసిన రాజీనామా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కుదిపివేసిందని శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ అన్నారు. వ్యవసాయ బిల్లులకు నిరసనగా పంజాబ్‌లోని ముక్త్సర్లో శుక్రవారం జరిగిన ర్యాలీలో బాదల్ మాట్లాడుతూ గత రెండు నెలలుగా రైతుల గురించి ఎవరూ నోరెత్తలేదని, హర్సిమ్రత్ రాజీనామాతో రోజూ ఐదుగురు మంత్రులు ఈ అంశంపై మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా అణు బాంబుతో జపాన్ను కుదిపివేస్తే అకాలీదళ్ వేసిన ఒక బాంబుతో (హర్సిమ్రత్ రాజీనామా) మోదీ ప్రభుత్వం వణికిపోతోందని చెప్పారు. చదవండి : రోడ్డెక్కిన రైతన్న.. రహదారుల దిగ్భందం ఇక వ్యవసాయ బిల్లులకు నిరసనగా పంజాబ్‌లో ఎస్ఏడీ ఆందోళనలకు పిలుపు ఇచ్చింది. మరోవైపు ఈ బిల్లులను అడ్డుకోవాలని ఎస్ఏడీ ప్రతినిధి బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి అభ్యర్ధించింది. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఎంపీ, సుఖ్బీర్ బాదల్ సతీమణి హర్సిమ్రత్ కౌర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ శుక్రవారం భారత్ బంద్‌కు పలు రైతు సంఘాలు పిలుపు ఇచ్చాయి. -
అందుకే రాజీనామా చేశాను: బాదల్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా శిరోమణీ అకాలీదళ్ ఎంపీ హర్ సిమ్రత్‌కౌర్ బాదల్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాను ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో తెలిపారు. రైతులకు సంఘీభావం తెలిపేందుకు తాను రాజీనామా చేశానన్నారు బాదల్. కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలను రైతు వ్యతిరేకంగా అభివర్ణించడానికి ఆమె నిరాకరించారు. ఈ బిల్లు గురించి తాను గత కొన్ని వారాలుగా రైతులతో చర్చలు జరిపినట్లు వెల్లడించారు. తాను రైతులను ఒప్పించలేకపోయానని.. పైగా వారు చెప్పిన కారణాలు తనకు సహేతుకంగా తోచడంతో రాజీనామా చేసినట్లు తెలిపారు. బాదల్ మాట్లాడుతూ ‘ఒక రైతు నాతో ఈ విధంగా చెప్పాడు.. ప్రారంభంలో జియో లాంచ్ అయినప్పుడు తమ మార్కెట్‌ను పెంచుకోవడం కోసం ఉచిత ఫోన్లు ఇచ్చింది. జనాలు వాటికి అలవాటుపడటంతో పోటీ తుడిచిపెట్టుకుపోయింది. దాంతో జియో రేట్లను పెంచింది. ఇప్పుడు వ్యవసాయంలో తీసుకువచ్చే బిల్లులు కూడా ఇలానే ఉంటాయి. పూర్తిగా కార్పొరేట్ చేయబోతున్నారు’ అని తెలిపాడు. ఆ రైతు చెప్పిన ఉదాహరణ సబబుగా తోచింది. అందుకే నేను రాజీనామా చేశాను’ అన్నారు బాదల్. (చదవండి: అన్నదాతల ఆందోళన) లోక్‌సభ గురువారం ఆమోదించిన మూడు బిల్లులకు సంబంధించి ముందు రైతులు లేవనెత్తిన ఆందోళనలను వినాలని, వారితో బహిరంగ చర్చలు జరపాలని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని పదేపదే కోరినట్లు బాదల్ తెలిపారు. ‘దయచేసి రైతు వ్యతిరేకమని భావించే చట్టాన్ని తీసుకురావద్దని నేను చెప్తున్నాను. ప్రజల అవగాహనను పరిగణనలోకి తీసుకోకుండా మీరు ఈ బిల్లులను ఎలా ఆమోదించారు. నేను వారిని ఒప్పించటానికి ప్రయత్నించాను కాని ఫలితం లేకపోయింది. బహుశా నా వాయిస్ తగినంత బిగ్గరగా లేదు’ అన్నారు బాదల్. ఇప్పుడు రాజ్యసభ చేపట్టబోయే ఈ బిల్లులు జూన్‌లో జారీ చేసిన మూడు ఆర్డినెన్స్‌లను భర్తీ చేస్తాయి. కాని రైతుల నుంచి, ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత పంజాబ్‌లో తీవ్ర నిరసనలు రేకెత్తించాయి. ప్రతిపాదిత చట్టాలు చిన్న, ఉపాంత రైతులకు సహాయపడటానికి ఉద్దేశించినవి అని ప్రభుత్వం తెలిపింది. -
అన్నదాతల ఆందోళన
వ్యవసాయ రంగ ప్రక్షాళన కోసమంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు బిల్లులకు లోక్‌సభ ఆమోదముద్ర పడ్డాక ఎన్డీఏ ప్రభుత్వంనుంచి బీజేపీ మిత్రపక్షమైన అకాలీదళ్‌కు చెందిన మంత్రి హర్సిమ్రత్ కౌర్ రాజీనామా చేశారు. తాము ఎన్డీఏ నుంచి కూడా తప్పుకునే అవకాశం వుందని ఆ పార్టీ చెబుతోంది. దేశంలో ‘హరిత విప్లవానికి’ దారి తీసిన నిర్ణయాల తర్వాత వ్యవసాయ రంగంలో భారీ సంస్కరణలు తీసుకురావడం ఇదే ప్రథమం. రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య(ప్రోత్సాహక, సులభతర) ఆర్డినెన్సు, రైతుల(సాధికార, పరిరక్షణ) ధరల హామీ, సాగు సేవల ఆర్డినెన్సు, నిత్యావ సర సరుకుల ఆర్డినెన్సుల స్థానంలో ఈ బిల్లులు తీసుకొచ్చారు. ఇందులో నిత్యావసర సరుకుల బిల్లును రెండురోజులక్రితం ఆమోదించారు. తమ ఉత్పత్తులను ఇష్టం వచ్చినచోట అమ్ముకోవడా నికి, అవసరమైతే వేరే రాష్ట్రాల్లో కూడా నచ్చిన ధరకు అమ్ముకోవడానికి అవకాశమిచ్చే ఈ సంస్క రణల వల్ల రైతులకు లాభమే తప్ప నష్టం వుండదన్నది కేంద్రం వాదన. ఇవి అమల్లోకొస్తే రైతులకు దళారుల బెడద తప్పుతుందని కూడా చెబుతోంది. వాస్తవానికి ఈ మూడు ఆర్డినెన్సులు వచ్చిన ప్పుడే రైతుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఈ విషయంలో రైతుల అభిప్రాయాలు తెలుసుకుని, వారి సందేహాలను తీర్చేవిధంగా తగిన రక్షణలు పొందుపరిచాకే బిల్లులు తీసుకురావాలని, ఆర్డినెన్స్‌ల అమలు నిలిపేయాలని అకాలీదళ్ కోరినా కేంద్రం పట్టించుకోలేదు. సాగు రంగంలో సంస్కరణలు తీసుకురావాలని, రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించే చర్యలు తీసుకోవాలని ఆ రంగంలో పనిచేస్తున్న సంస్థలు, సాగు రంగ నిపుణులు ఎప్పటినుంచో డిమాండు చేస్తున్నారు. రెండేళ్లక్రితం మహారాష్ట్ర మారుమూల ప్రాంతాల నుంచి సీపీఎం అనుబంధ సంస్థ అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) ఆధ్వర్యంలో వేలాదిమంది రైతులు ముంబై మహానగరానికి తరలివచ్చిన దృశ్యాలు ఎవరూ మరిచిపోరు. తాము ఇప్పుడు తీసుకొచ్చిన సంస్కరణల పర్యవసానంగా రైతుల భవిష్యత్తు దివ్యంగా వుంటుందని ఎన్డీఏ ప్రభుత్వం చెబుతున్నప్పుడు వాస్తవానికి రైతుల నుంచి ఇంతగా ప్రతిఘటన రాకూడదు. ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలు ప్రధానంగా పంజాబ్, హర్యానాలకు పరిమితమైవుండొచ్చు గానీ...రైతు అనుకూల విధానాలు అవలంబిస్తున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాల రైతుల్లోనూ ఇలాంటి భయాలున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో సాగురంగానిది అత్యంత కీలక పాత్ర. కరోనా వైరస్ మహమ్మారి పంజా విసరడంతో దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ కారణంగా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో మన వృద్ధి రేటు మైనస్ 23.9 శాతానికి పడిపోయింది. నిరుడు ఇదే కాలానికి 5.2 శాతంగా వున్న జీడీపీ ఇంత దారుణంగా పడిపోయిన ఈ తరుణంలో కూడా సాగు రంగం 3.4 శాతం వృద్ధిని నమోదు చేసిందన్న వాస్తవాన్ని గమనిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు ఆ రంగం ఎంత దన్నుగా నిలబడిందో అర్థమవుతుంది. సాగురంగం ఈ స్థాయిలో వుండకపోతే మన జీడీపీ మరింత అధోగతి పాలయ్యేది. కానీ అందుకు ప్రతిఫలంగా ఈ దేశం రైతుకు ఏమిచ్చింది? అన్ని రంగాలూ పడకేసిన దశలో కూడా ఇంత మంచి పనితీరు కనబరిచినందువల్ల రైతుకు ఒరిగిందేమీ లేదు. వారి ఆదాయం రెట్టింపుకావడం సంగతలా వుంచి కొత్తగా అంతో ఇంతో పెరిగిందేమీ లేదు. గత రెండేళ్ల సంగతే తీసుకుంటే సాగు ఉత్పత్తుల ధరలు స్వల్పంగా పెరిగినా...అంతక్రితంతో పోలిస్తే పెరిగిన సాగు వ్యయానికి తగ్గట్టుగానైనా అవి లేవని నిపుణులు లెక్కలు చెబుతున్నారు. ఏతావాతా రైతుకు మిగిలేది ఎప్పుడూ అరకొరే. ప్రభు త్వాలు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)తో భారీయెత్తున సాగు ఉత్పత్తులు కొనుగోలు చేయడం, పల్లెసీమల్లో ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం వంటి చర్యలు నిరుపేదల్లో వినియోగాన్ని పెంచు తాయని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని వారి ప్రతిపాదన. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయంగా వుంది. సాగు సంస్కరణలే ధ్యేయంగా తీసుకొచ్చిన ఈ బిల్లులు చట్టాలైతే రైతులు తమ పంటల్ని దేశంలో ఏమూలనైనా అమ్ముకోవచ్చునని కేంద్రం చెబుతున్న మాటలు వినడానికి సొంపుగా వున్నాయి. కానీ మన రైతాంగంలో 86 శాతంమంది చిన్న రైతులు. వారిలో కూడా చాలామంది కౌలుదార్లు. సాగు వ్యయంతోనే నిండా మునిగివున్న రైతు వేల కిలోమీటర్ల దూరంలోని ఏదో రాష్ట్రంలో ‘మంచి ధర’ వస్తోందని విని తన ఉత్పత్తిని అక్కడికి తీసుకుపోగలడా? సాధ్యమేనా? చాలా సాగు ఉత్పత్తుల కదలికలకు ఇప్పుడు కూడా ఆంక్షలేమీ లేవు. అంతమాత్రాన రైతుకు ఒరిగిందేమిటి? ఇప్పుడున్న సాగు ఉత్పత్తుల మార్కెట్ కమిటీ(ఏపీఎంసీ)ల వ్యవస్థలోనే ఎన్నో లోపాలున్నాయని, వాటిని సవరించమంటే... అంతకన్నా అధ్వాన్నంగా వుండే విధానం అను సరించడం ఎంతవరకూ సబబని సాగు రంగ నిపుణుల ప్రశ్న. ఏపీఎంసీ వెలుపల అమ్ముకునే రైతులు మార్కెట్ సెస్, లెవీ చెల్లించనవసరం వుండదని బిల్లు చెబుతోంది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం పడిపోవడంతోపాటు సాగు ఉత్పత్తుల కొనుగోలు దారులనూ, కమిషన్ ఏజెంట్లనూ, ప్రైవేటు మార్కెట్లనూ నియంత్రించే వ్యవస్థ ఎగిరిపోతుంది. అంటే రాష్ట్రాల హక్కులకూ విఘాతం కలుగుతుంది. చివరకు ఈ రంగంలో మున్ముందు కార్పొరేట్ గుత్తాధిపత్యం వేళ్లూనుకుని శాసిస్తుంది. పర్యవసానంగా అసలు ఎంఎస్పీయే ఉండబోదన్న భయం సరేసరి. ఇలాంటి సందేహాలను నివృత్తి చేసేవిధంగా, రైతుల ప్రయోజనాల పరిరక్షించే నిబంధనలతో ఈ బిల్లులు రూపొందితే ఎవరికీ అభ్యంతరాలుండేవి కాదు. రైతు సంఘాల అభిప్రాయాలు తీసుకుని, పార్లమెంటులో విస్తృతంగా చర్చించాక బిల్లులు రూపొందిస్తే రైతుల్లో ఆందోళన వుండేది కాదు. కనీసం వీటిని సెలెక్ట్ కమిటీకైనా పంపి కూలంకషంగా చర్చించాల్సింది. రాజ్యసభలో ఇంకా ఈ బిల్లులు పెట్టాలి గనుక ఆ దిశగా కేంద్రం ఆలోచించాలి. -
భార్య రాజీనామా వెనుక భర్త వ్యూహం..!
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్డీయేలో కీలక మిత్రపక్షంగా ఉన్న శిరోమణీ అకాలీదళ్ ఎంపీ హర్ సిమ్రత్‌కౌర్ బాదల్ కేంద్రమంత్రి వర్గం నుంచి వైదొలగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లుల (వ్యవసాయ)కు వ్యతిరేకంగా రాజీనామా సమర్పిస్తున్నట్లు బాదల్ ప్రకటించారు. అంతకుముందు పార్లమెంట్లో ప్రసంగించిన ఆమె భర్త అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ సైతం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. అనంతరం పార్టీ కోర్ కమిటీలో చర్చించి ఎన్డీయేలో కొనసాగాలా వద్దా అనే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మరోవైపు బాదల్ అనుహ్య నిర్ణయంపై జాతీయ రాజకీయాల్లో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. కేంద్రమంత్రి పదవికి రాజీనామా అంశాన్ని రాజకీయ ఎత్తుగడగా కాంగ్రెస్‌తో పాటు విపక్షాలు విశ్లేషిస్తున్నాయి. గతకొంత కాలంగా బీజేపీ, శిరోమణీ అకాలీదళ్ (ఎస్ఏడీ) భేదాభిప్రాయాలు వస్తున్నాయని, అవి తాజాగా తారాస్థాయికి చేరాయని అభిప్రాయపడుతున్నారు. (బీజేపీ షాక్: రాజీనామా బాటలో డిప్యూటీ సీఎం!) వారి అంచనా ప్రకారం.. మరో 18 నెలల్లో పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ-ఎస్ఏడీ మధ్య సీట్ల పంపకాలపై ఇదివరకే చర్చలు ప్రారంభం అయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117 స్థానాలకు గాను బీజేపీ 23, ఎస్ఏడీ 94 స్థానాల్లో బరిలోకి దిగాయి. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ క్రమంలోనే బాదల్ నాయకత్వంపై బీజేపీ నేతలు బహిరంగంగానే విమర్శలకు దిగారు. ఆయనతో పొత్తు కారణంగానే బీజేపీకి తీవ్ర నష్టం జరిగిందని, తమకున్న సాంప్రదాయ ఓటు బ్యాంకును సైతం కోల్పోవల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. (కేంద్రమంత్రి హర్సిమ్రత్ కౌర్ రాజీనామా) ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో 50-50 ఫార్మాలాను బీజేపీ నేతలు ప్రతిపాదిస్తున్నారు. 50శాతం సీట్లు ఇస్తేనే పొత్తు కుదురుతుందని ఇదివరకే తేల్చిచెప్పారు. స్థానిక బీజేపీ నేతల తీరు అకాలీదళ్ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. ఇక వివాదాస్పద చట్టాలైనా సీఏఏ, ఎన్ఆర్సీపై కూడా సుఖ్బీర్ సింగ్ బాదల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై పార్లమెంట్ వేదికగా నిరసన స్వరం వినిపించారు. తాజా బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని పార్టీ నేతలకు విప్‌సైతం జారీచేశారు. అనంతరం ఓ అడుగు ముందుకేసి ఆ పార్టీ నుంచి చోటుదక్కించుకున్న ఏకైక కేంద్రమంత్రి, సుఖ్బీర్ సింగ్ భార్య హర్సిమ్రత్ కౌర్ బాదల్ చేత రాజీనామా చేయించారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతుండటం తమ మద్దతుదారుల్లో అత్యధికులు రైతులే కావడంతో, బిల్లులను వ్యతిరేకిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఎస్ఏడీకి నెలకొన్నది. ఎన్డీఏలో ఎస్ఏడీ కొనసాగేది, లేదని త్వరలో నిర్ణయిస్తామని సుఖ్బీర్ సింగ్ బాదల్ తెలిపారు. అయితే ఇదంతా సుఖ్బీర్ సింగ్ రాజకీయ ఎత్తుగడలో భాగంగానే తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రైతుల మెప్పు కోసమే రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు తాము ఇక ఎన్డీయే కూటమిలో సాగేదిలేదని అకాలీదళ్ నేతలు ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు. కాగా 100 ఏళ్ల చరిత్ర కలిగిన శిరోమణీ అకాలీదళ్ బీజేపీకి తొలినుంచీ మిత్రపక్షంగానే కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
ఎన్డీయేతో ఇక కొనసాగలేం : అకాలీదళ్ చీఫ్
సాక్షి, ఢిల్లీ : రైతుల ఆందోళనలను పట్టించుకోని ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండాలనుకోవడం లేదని ఎన్డీయే మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ తెలిపారు. పార్టీ కోర్ కమిటీ దీనిపై సమీక్ష జరిపి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. బీజేపీకి తొలి నుంచి మద్దతుగా నిలిచిన శిరోమణి అకాలీదళ్.. బీజేపీకి అత్యంత విశ్వసనీయ భాగస్వామ్య పక్షం. అయితే, వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయరంగ బిల్లులపై విపక్షాల నుంచే కాక మిత్రపక్షాల నుంచి కూడా వ్యతిరేక వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ) నేత హర్సిమ్రత్ కౌర్ బాదల్ గురువారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అంతకుముందు, ఆ బిల్లులను ఎస్ఏడీ అధ్యక్షుడు, ఆమె భర్త సుఖ్బీర్ సింగ్ బాదల్ లోక్‌సభలో తీవ్రంగా వ్యతిరేకించారు. అవి పంజాబ్‌లో వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తాయన్నారు. (హర్సిమ్రత్ కౌర్ రాజీనామా ఆమోదం) 'హర్సిమ్రత్ కౌర్ రాజీనామా ఓ జిమ్మిక్కు' గత రెండు నెలలుగా ఈ బిల్లులపై చర్చించినా ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడం భాదాకరమన్నారు. రైతుల హక్కులను కాలరాసేలా ప్రభుత్వ ధోరణి ఉందంటూ ఘాటూ వ్యాఖ్యలు చేశారు. రైతుల ఆందోళనలను పట్టించుకోని ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండాలనుకోవడం లేదని అయితే దీనిపై పార్టీ కోర్ కమిటీతో చర్చించి త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామన్నారు. రైతుల కోసం ఏ త్యాగం చేసేందుకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు.ప్రతిపక్ష పార్టీలు సైతం కేంద్రం వైఖరిని తీవ్రంగా తప్పుబట్టాయి. కాంగ్రెస్, డీఎంకె తదితర సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించేవరకు బిల్లులను నిలిపివేయాలంటూ డిమాండ్ చేశారు. ఇక పంజాబ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అమరీందర్ సింగ్ అకాలీదళ్ చర్యలపై అనుమానం వ్యక్తం చేశారు. ఆ పార్టీ ఇప్పటికీ బీజేపీతోనే భాగస్వామిగా ఉందని, హర్సిమ్రత్ కౌర్ రాజీనామా సైతం ఓ బూటకమేనన్నారు. (తృటిలో తప్పిన పుల్వామా తరహా ఘటన!) -
హర్సిమ్రత్ కౌర్ రాజీనామా ఆమోదం
సాక్షి, ఢిల్లీ : అకాలీదళ్ ఎంపీ, కేంద్రమంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామాను రాష్ర్టపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు. తక్షణం ఆమె రాజీనామాను అమల్లోకి వస్తుందని రాష్ర్టపతి భవన్ శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. కేంద్రప్రభుత్వం ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి పదవిని వదులుకోవాలని శిరోమణి అకాలీదళ్ నిర్ణయించింది. ఈ మేరకు గురువారం లోక్‌సభలో అకాలీదళ్ నేత హర్ సిమ్రత్ కౌర్ రాజీనామా తన పదవికి రాజీనామా చేశారు. లోక్‌సభలో ఈ బిల్లులపై ఓటింగ్‌కు కొద్ది గంటల ముందు ప్రధానమంత్రి కార్యాలయానికి చేరుకుని నాలుగు పేజీల రాజీనామా లేఖను సమర్పించారు. రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు హర్సిమ్రత్ కౌర్ బాదల్ ప్రకటించారు. రైతు బిడ్డగా, వారికి సోదరిలా నిలబడటం గర్వంగా ఉందని తెలిపారు. రైతు సమస్యలు పరిష్కరించకుండా వ్యవసాయరంగ బిల్లులను తీసుకువచ్చిన ప్రభుత్వంలో తాను భాగస్వామ్యం కావడం ఇష్టం లేదని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. (వ్యవసాయ బిల్లులకు నిరసనగా రాజీనామా) బిల్లులకు నిరసనగా భారత్‌బంద్ రైతలుకు మరిన్ని ప్రయోజనాలు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొంటూ వ్యవసాయ బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వీటి ద్వారా వ్యవసాయ రంగంలో భారీ సంస్కరణల దిశగా చేపట్టామని బీజేపీ పేర్కొంటోంది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకె, బీఎస్పీ సహా పలు ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించాయి. చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాలు దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ ఆరోపించాయి. ఇక ఈ బిల్లులపై పంజాబ్, హరియాణా రైతాంగం గత కొద్దివారాలుగా ఆందోళనలు చేపడుతోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయబిల్లులకు వ్యతిరేకంగా అఖిల భారత కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ (ఎఐకెఎస్సిసి) సెప్టెంబరు 25న భారతబంద్‌కు పిలుపునిచ్చింది. (ఉల్లి ఎగుమతుల నిషేధంపై ఎన్సీపీ ఫైర్) -
కేంద్రమంత్రి హర్సిమ్రత్ కౌర్ రాజీనామా
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి, శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ) నేత హర్సిమ్రత్ కౌర్ బాదల్ గురువారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ రంగానికి సంబంధించిన బిల్లులకు వ్యతిరేకంగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘కేంద్ర కేబినెట్ నుంచి వైదొలిగాను. ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక ఆర్డినెన్స్‌లు, బిల్లులకు వ్యతిరేకంగా నా పదవికి రాజీనామా చేశాను. ఒక సోదరిగా, బిడ్డగా రైతుల పక్షం నిలబడినందుకు గర్వంగా ఉంది’ అని సంబంధిత బిల్లులు లోక్‌సభ ఆమోదం పొందేందుకు కొన్ని గంటల ముందు ఆమె ట్వీట్ చేశారు. అంతకుముందు, ఆ బిల్లులను ఎస్ఏడీ అధ్యక్షుడు, ఆమె భర్త సుఖ్బీర్ సింగ్ బాదల్ లోక్‌సభలో తీవ్రంగా వ్యతిరేకించారు. అవి పంజాబ్‌లో వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తాయన్నారు. భారత్ ఆహార రంగంలో స్వావలంబన సాధించడంలో పంజాబ్ రైతుల పాత్రను మరచిపోకూడదన్నారు. ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ కేబినెట్లో తమ పార్టీ ప్రతినిధి అయిన హర్సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా చేస్తారని స్పష్టం చేశారు. ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ తాను, తమ పార్టీ పదేపదే చేసిన విజ్ఞప్తులను ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపిన తన రాజీనామా లేఖలో కౌర్ ఆరోపించారు. తమ పార్టీలోని ప్రతి సభ్యుడు రైతేనని, రైతు సంక్షేమం ధ్యేయంగా తమ పార్టీ నడుస్తోందని పేర్కొన్నారు. రైతుల ఆందోళనలను పట్టించుకోని ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండాలనుకోవడం లేదన్నారు. కౌర్ రాజీనామాను ప్రధాని మోదీ ఆమోదించారా? లేదా? అన్న విషయంపై స్పష్టత లేదు. ఎన్డీఏలో శిరోమణి అకాలీదళ్ బీజేపీకి అత్యంత విశ్వసనీయ భాగస్వామ్య పక్షం. బీజేపీకి తొలి నుంచి మద్దతుగా నిలిచిన పార్టీ. అయితే, వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ బిల్లులను ఎస్ఏడీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పంజాబ్‌లో ఈ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. తమ మద్దతుదారుల్లో అత్యధికులు రైతులే కావడంతో, బిల్లులను వ్యతిరేకిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఎస్ఏడీకి నెలకొన్నది. ఎన్డీఏలో ఎస్ఏడీ కొనసాగేది, లేదని త్వరలో నిర్ణయిస్తామని సుఖ్బీర్ సింగ్ బాదల్ తెలిపారు. రైతుల కోసం ఏ త్యాగం చేసేందుకైనా సిద్ధమేనని పార్లమెంట్ వెలుపల మీడియాతో స్పష్టం చేశారు. రెండు బిల్లుల ఆమోదం ఎస్ఏడీ, విపక్ష సభ్యుల నిరసనల మధ్య వివాదాస్పద ‘ద ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్(ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్)’ బిల్లును, ‘ద ఫార్మర్స్(ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫామ్ సర్వీసెస్’ బిల్లును గురువారం మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదించింది. బిల్లులను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, డీఎంకే, ఆర్ఎస్పీలు వాకౌట్ చేశాయి. వ్యవసాయ రంగానికే చెందిన మరో బిల్లు ‘ఎసెన్షియల్ కమాడిటీస్(అమెండ్మెంట్)’ మంగళవారం లోక్‌సభ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. గతంలో జారీ చేసిన ఆర్డినెన్స్‌ల స్థానంలో ఈ బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. ఇవి ఇంకా రాజ్యసభ ఆమోదం పొందాల్సి ఉంది. రైతుల ఆదాయం పెరుగుతుంది వ్యవసాయ రంగానికి సంబంధించిన బిల్లులు లోక్‌సభ ఆమోదం పొందడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదిత చట్టాలతో రైతుల ఆదాయం పెరుగుతుందన్నారు. రైతులకు మధ్యవర్తుల బెడద తొలగుతుందన్నారు. ఈ బిల్లుల విషయంలో రైతులను తప్పుదోవ పట్టించేందుకు చాలా శక్తులు ప్రయత్నిస్తున్నాయన్నారు. ప్రభుత్వ కొనుగోలు విధానాలు కొనసాగుతాయని రైతులకు హామీ ఇచ్చారు. -
కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా
-
కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ గురువారం తన పదవికి రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి పదవిని వదులుకోవాలని శిరోమణి అకాలీదళ్ నిర్ణయించింది. రెండు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని అకాలీదళ్ ఇప్పటికే స్పష్టం చేసింది. వ్యవసాయ బిల్లులపై ఎన్డీయేకు తన వైఖరి స్పష్టం చేసిన అకాలీదళ్ ప్రభుత్వానికి వెలుపల నుంచి మద్దతిస్తామని పేర్కొంది. హర్సిమ్రత్ కౌర్ నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి చేరుకుని రాజీనామా సమర్పించారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తామని లోక్‌సభలోనే అకాలీదళ్ తమ నిర్ణయాన్ని వెల్లడించింది. లోక్‌సభలో ఈ బిల్లులపై ఓటింగ్‌కు కొద్ది గంటల ముందు హర్సిమ్రత్ కౌర్ రాజీనామా చేశారు. కాగా ఈ బిల్లులను వ్యవసాయ రంగంలో భారీ సంస్కరణల దిశగా చేపట్టామని బీజేపీ పేర్కొంటోంది. ఈ బిల్లులపై పంజాబ్, హరియాణా రైతాంగం గత కొద్దివారాలుగా ఆందోళనలు చేపడుతోంది. చదవండి : టమాటా, ఉల్లి ధరలు పడిపోతే వెంటనే చర్యలు -
కరోనా నేపథ్యంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: ఇప్పుడప్పుడే కరోనా వైరస్ తగ్గేలా లేకపోవడంతో భారత రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే సర్వీసులపై నిషేధాన్ని సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. సాధారణ, ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు సోమవారం వెల్లడించింది. అయితే లాక్ డౌన్ సమయంలో తీసుకువచ్చిన 230 ప్రత్యేక రైళ్లను మాత్రం నడపనున్నట్లు స్పష్టం చేసింది.. రైళ్ల రాకపోకలపై గతంలో విధించిన నిషేధం ఆగస్టు 12తో పూర్తి కానున్న విషయం తెలిసిందే. ఇదిలా వుండగా దేశంలో ఇప్పటివరకు 22,15,074 కేసులు నమోదవగా 44,386 మంది మరణించారు. కినోవా రైతులకు కిసాన్ రైళ్లు.. పంటను తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో రవాణా చేసేందుక వీలుగా కేంద్రం కిసాన్ రైలు సేవలను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని దేవ్లాలీ నుంచి బిహార్‌లోని దాణాపూర్ వరకు బయలు దేరిన తొలి కిసాన్ రైలును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ క్రమంలో అబోహర్ నుంచి బెంగుళూరు, కోల్‌కతాలకు కిసాన్ రెళ్లను నడిపి కినోవా రైతులకు చేయూతనందించాలని కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ సోమవారం రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ప్రాంతాల్లో కినోవా పంట లక్ష ఎకరాల్లో పండిస్తున్నారని లేఖలో తెలిపారు. (కిసాన్ రైలుతో రైతులకు ఎంతో మేలు) వీటి ఉత్పత్తిని దక్షిణ, తూర్పు రాష్ట్రాలకు సరఫరా చేయడం వల్ల కినోవాకు విస్తృతమైన మార్కెట్ లభిస్తుందని పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌కు దీన్ని పెద్ద మొత్తంలోనే ఉత్పత్తి చేస్తున్నప్పటికీ బెంగళూరు, కోల్‌కతాలో దీనికి మంచి మార్కెట్ ఉందని ఆమె తెలిపారు. త్వరగా పాడైపోయే గుణం ఉన్న ఈ పండు ఉత్పత్తి చేసిన దాంట్లో కేవలం 35 నుంచి 40 శాతం మాత్రమే వినియోగదారునికి చేరుతుందని వెల్లడించారు. రవాణాకు ఎక్కువ సమయం పట్టడం, అధిక ఉష్ణోగ్రత వల్ల మిగిలి పండంతా పాడవుతుందని దాని వల్ల రైతులు నష్టపోతున్నారని ఆమె పేర్కొన్నారు. కిసాన్ రైళ్లను కినోవా రైతులకు కేటాయిస్తే వారు పూర్తి స్థాయిలో వినియోగించుకుంటారని కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ తెలిపారు. (రైల్వే శాఖ కీలక నిర్ణయం) -
నెంబర్ వన్ సాధించడమే లక్ష్యం: బాదల్
న్యూఢిల్లీ: చైనాలో కరోనా వైరస్ ఉద్భవించడం వల్ల ఆ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ దేశాలు వెనుకంజ వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా తర్వాత అతి పెద్ద జనాభా కలిగిన భారత్‌లో పెట్టుబడులకు అవకాశం ఏర్పడింది. చైనాలో నెలకొన్న ఈ సంక్షోభాన్ని భారత్ అవకాశంగా మార్చుకోబోతున్నట్లు కేంద్ర ఆహార శుద్ధి శాఖా మంత్రి హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్ తెలిపారు. ఇటీవల బాదల్ ఓ ఇంటర్వ్యూల్లో స్పందిస్తూ.. ఆహార రంగానికి సంబంధించిన అన్ని ఉత్పత్తులను ప్రపంచానికి ఎగుమతి చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసే దేశాలలో భారత్ రెండో స్థానంలో ఉందని ఆమె గుర్తు చేశారు. భవిష్యత్తుల్లో అన్ని దేశాలకు ఎగుమతులు చేసి.. నెంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యమని తెలిపారు. ప్రస్తుతం కేవలం 10శాతం ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నామని.. కానీ మౌళిక సదుపాయాల కొరత వల్ల ఆశించిన స్థాయిలో ఎగుమతి చేయలేక పోతున్నామని అన్నారు. ఆహార ఉత్పత్తులను నిల్వ చేసే గిడ్డంగులను భారీ స్థాయిలో నిర్మించబోతున్నట్లు పేర్కొన్నారు. కాగా కరోనా వైరస్ కారణంగా చైనాలో జంకుతున్న దేశాలకు భారత్ వరంగా మారనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. (చదవండి: టమాటా, ఉల్లి ధరలు పడిపోతే వెంటనే చర్యలు) -
టమాటా, ఉల్లి ధరలు పడిపోతే వెంటనే చర్యలు
న్యూఢిల్లీ: టమాటా, ఉల్లిపాయలు, ఆలుగడ్డల ధరలు ఉన్నట్టుండి పతనమైతే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసేందుకు రూపొందించిన పోర్టల్ (వెబ్సైట్)ను కేంద్ర ఆహార శుద్ధి శాఖా మంత్రి హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్ బుధవారం ఢిల్లీలో ఆవిష్కరించారు. ‘‘ప్రజలు అధికంగా వినియోగించే ఈ మూడు కూరగాయల టోకు ధరలను ఈ పోర్టల్ తెలియజేస్తుంది. అధిక సరఫరా కారణంగా ధరలు పడిపోతే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తుంది. దీంతో ‘ఆపరేషన్స్ గ్రీన్’ పథకం కింద ప్రభుత్వం సకాలంలో స్పందించి.. అధికంగా ఉన్న ఉత్పత్తిని కోల్డ్ స్టోరేజ్‌లకు తరలించేందుకు వీలుగా రైతులకు సబ్సిడీ ఇస్తుంది. లేదా మిగులు ఉత్పత్తిని డిమాండ్ ఉన్న చోటుకు తరలించేందుకు సాయమందిస్తుంది’’ అని మంత్రి బాదల్ తెలిపారు. క్రితం ఏడాది అదే కాలంతో పోలిస్తే ధరలు 50 శాతం పతనమైనా, మూడేళ్ల కనిష్ట స్థాయికి ఈ మూడు కూరగాయల ధరలు క్షీణించినా ప్రభుత్వం రూపొం దించిన ‘మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ (ఎంఐఈడబ్ల్యూఎస్) అనే పోర్టల్ హెచ్చరికలు పంపుతుంది. దేశవ్యాప్తంగా 1,200 మార్కెట్లలో వీటి ధరలను ఈ పోర్టల్ తెలియజేస్తుందని నాఫెడ్ అడిషనల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్కే సింగ్ తెలిపారు. -
కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి మోదీ
న్యూఢిల్లీ : గురునానక్ దేవ్ సమాధి నెలకొన్న దర్బార్ సాహిబ్‌ను కలుపుతూ భారత్, పాకిస్థాన్‌లు కర్తార్‌పూర్ కారిడార్ ప్రాజెక్టును సంయుక్తంగా చేపట్టాయి. గురునానక్ దేవ్ 550వ జయంతి సందర్భంగా నవంబర్ 8న కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. డేరా బాబా నానక్‌లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాను, పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారాను అనుసంధానించే 4.5 కిలోమీటర్ల పొడవైన రహదారి నవంబరు 8న ప్రారంభం కానుంది. ఈ విషయంపై కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ శనివారం మాట్లాడుతూ.. కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 8న ప్రారంభిస్తారని చెప్పారు. అంతకుముందు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అంగీకరించారు. కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి రాష్ర్టపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో పాటు ఆయన నేతృత్వంలో అన్ని పార్టీల సభ్యులతో కూడిన బృందాన్ని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఆహ్వానించారు. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, ఆ రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. గురు నానక్ దేవ్ 550వ ప్రకాశ్ పర్వ్ ఉత్సవాలను నవంబరులో నిర్వహిస్తారు. భారతదేశంలోని సిక్కులు కర్తార్‌పూర్ కారిడార్ గుండా పాకిస్థాన్‌లోని గురు నానక్ గురుద్వారాకు చేరుకుంటారు. పాకిస్థాన్‌లో కర్తార్‌పూర్ కారిడార్‌ను నవంబరు 9న ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భారత దేశ మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ పాల్గొంటారు. అదే రోజు భారతదేశం నుంచి కర్తార్‌పూర్ వెళ్ళే తొలి భక్త బృందంలో పాల్గొనాలని కెప్టెన్ అమరీందర్ సింగ్ డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని మన్మోహన్ సింగ్ అంగీకరించారు. పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారాకు వెళ్లనున్న తొలి అఖిలపక్ష జాబితా (సిక్కుల ప్రతినిధి బృందం)లో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ కూడా ఉండనున్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కర్తార్‌పూర్ కారిడార్‌ను వచ్చే నెలలో ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. గురునానక్ దేవ్ 550వ గురుపూరబ్ సందర్భంగా కారిడార్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
225 మంది కోటీశ్వరులేనట..!
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. రేపు ఏడో దశ ఎన్నికల పోలింగ్‌తో ఓట్ల పండుగ సమాప్తం కానుంది. మరో మూడు రోజులు ఎదురు చూస్తే.. మే 23న రాజు ఎవరో బంటు ఎవరో తేలిపోతుంది. ఈ నేపథ్యంలో ఈ సారి సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన మహిళా అభ్యర్థులు కేవలం 724 మంది మాత్రమే. చిన్న రాజకీయ పార్టీలు మహిళలకు ఎక్కువ సీట్లు కేటాయించగా.. జాతీయ పార్టీలు మాత్రం ఈ విషయంలో చాలా వెనకబడ్డాయి. బరిలో నిలిచిన మహిళా అభ్యర్థులు అఫిడవిట్లలో వెల్లడించిన వివరాలను విశ్లేషించిన నేషనల్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ సంస్థలు అభ్యర్థుల నేర చరిత్ర, విద్య, ఆర్థిక అంశాల గురించి సంయుక్తంగా ఓ రిపోర్డును విడుదల చేశాయి. మొత్తం 724 మంది బరిలో నిలవగా.. 716 మంది అఫిడవిట్లును పరిశీలించిన మీదట ఈ రిపోర్టును విడుదల చేసినట్లు సదరు సంస్థలు వెల్లడించాయి. వివరాలు సరిగా లేనందువల్ల మిగతా ఎనిమిది మంది అఫిడవిట్లను పరిశీలించలేదని పేర్కొన్నాయి. రిపోర్టులోని వివరాలు.. నేర చరితులు.. మొత్తం 724 మంది మహిళలు బరిలో నిలవగా.. వీరిలో 110 మంది మీద క్రిమినల్ కేసులుండగా.. వీరిలో 78 మంది సీరియస్ క్రిమినల్ కేసులున్నట్లు సదరు రిపోర్టు వెల్లడించింది. ఇక పార్టీలపరంగా నేరచరితుల వివరాలు.. కాంగ్రెస్ పార్టీ నుంచి 54 మంది మహిళా అభ్యర్థులు బరిలో నిలవగా.. వారిలో 14 మంది మీద కేసులుండగా.. 10 మీద సీరియస్ క్రిమినల్ కేసులున్నట్లు తెలిపింది. ఇక అధికార బీజేపీ నుంచి 53 మంది పోటీ చేయగా.. 18 మంది క్రిమినల్ కేసులుండగా.. 10 మంది మీద తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి. బీఎస్పీ నుంచి 24 మంది మహిళా అభ్యర్థులు బరిలో నిలవగా.. ఇద్దరి మీద, తృణమూల్ నుంచి 23 మంది పోటీ చేయగా.. ఆరుగురు నేర చరితులుండగా.. వారిలో నలుగురి మీద తీవ్ర క్రిమినల్ కేసులున్నట్లు తెలిసింది. ఇక 222 మంది స్వతంత్య్ర అభ్యర్థులు బరిలో నిలవగా.. వీరిలో అత్యల్పంగా కేవలం 22 మంది నేర చరితులుండగా.. 21 మంది మీద తీవ్ర నేరారోపణలు ఉండటం గమనార్హం. ఆర్థిక నేపథ్యం.. ఈ 716 మందిలో 255 మంది కోటీశ్వరులే కావడం విశేషం. అభ్యర్థుల సగటు ఆస్తి రూ.5.63 కోట్లుగా ఉంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో మథుర నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీచేస్తున్న హేమమాలిని రూ.250 కోట్ల ఆస్తులతో కోటీశ్వరులైన మహిళా అభ్యర్థుల్లో మొదటి స్థానాన్ని ఆక్రమించారు. రూ.220 కోట్ల ఆస్తులతో ఆంధ్రప్రదేశ్‌లోని రాజంపేట టీడీపీ అభ్యర్థి డీఏ సత్యప్రభ రెండో స్థానంలో ఉండగా.. శిరోమణి అకాళీ దళ్ పార్టీ తరఫున పంజాబ్ బఠిండ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ రూ. 217 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో నిలిచారు. ఎనిమిది మంది మాత్రం తమ పేరిట అసలు ఆస్తులు లేవని వెల్లడించారు. విద్యావంతులు.. ఇక 724 మందిలో 232 మంది అభ్యర్థుల విద్యార్హత ఐదు నుంచి ఇంటర్ లోపే. 396 మంది డిగ్రీ ఉత్తీర్ణులయినట్లు వెల్లడించగా.. 37 మంది అక్షరాస్యులు(రాయడం, చదవడం వరకే పరిమితం) కాగా 26 మంది నిరాక్షరాస్యులుగా ప్రకటించుకున్నారు. ఇక పోటీ చేసిన వారిలో 25 - 50 ఏళ్ల వయసు వారు 531 మంది ఉండగా.. 50 - 81 ఏళ్ల లోపు వారు 180 మంది కాగా.. ఒక్కరు మాత్రం తన వయసు 80 ఏళ్ల కన్నా ఎక్కువే అన్నారు. మరో ముగ్గురు అభ్యర్థులు తమ వయసు వివారాలు వెల్లడించకపోగా.. ఒక అభ్యర్థి తన వయసు 25 కంటే తక్కువగా ప్రకటించారు. -
‘మరి గాంధీ కుటుంబం క్షమాపణలు చెప్పదా’
చంఢీగడ్ : జలియన్ వాలాబాగ్ మారణహోమానికి నేటికి సరిగ్గా వందేళ్లు. బ్రిటీష్ - ఇండియా చరిత్రలో ఈ మారణహోమం ఓ మచ్చగా మిగిలిపోతుందని రెండు రోజుల క్రితం బ్రిటన్ ప్రధాన మంత్రి థెరిసా మే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. థెరిసా వ్యాఖ్యలు ప్రస్తుతం భారత రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ జలియన్ వాలాబాగ్ దురాగతానికి పాల్పడినందుకుగాను బ్రిటన్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పంబాజ్ సీఎం వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్.. ‘అమరీందర్ సింగ్ జలియన్ వాలాబాగ్ దురాగతానికి గాను బ్రిటన్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని కోరడం బాగానే ఉంది. మరి మీ పార్టీ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆదేశాల మేరకు జరిగిన ఆపరేషన్ బ్లూస్టార్ సంగతేంటి. దానికి గాంధీ కుటుంబం క్షమాపణలు చెప్పాల్సిన పని లేదా’ అని ప్రశ్నించారు. అంతేకాక మీరు స్వయంగా దగ్గరుండి రాహుల్ గాంధీని సిక్కుల పవిత్రంగా భావించే శ్రీ అకాళి తక్త్ సాహిబ్‌లోకి తీసుకెళ్లారు.. మరి దీనికేం సమధానం చెప్తారంటూ హర్సిమ్రత్ కౌర్ వరుస ట్వీట్లు చేశారు. 1984లోఅమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో దాక్కున్న సిక్కు ఉగ్రవాదులను ఏరిపారేసేందుకు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఆపరేషన్ బ్లూస్టార్ అమలు చేసిన సంగతి తెలిసిందే. దీన్ని ఉద్దేశిస్తూ.. హర్సిమ్రత్ కౌర్ ట్వీట్ చేశారు. అంతేకాక స్వర్ణ దేవాలయంలోకి ఆయుధాలను, ట్యాంక్‌లను తీసుకువచ్చిన గాంధీ కుటుంబాన్ని ప్రశ్నించే ధైర్యం అమరీందర్‌కు లేదని ఆమె ఎద్దేవా చేశారు. ఈ ట్వీట్‌పై స్పందించిన అమరేందర్.. ‘మీరు, మీ భర్త సుఖ్బీర్ సింగ్ బాదల్, ఆయన తండ్రి ప్రకాశ్ సింగ్ బాదల్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. ఎందుకంటే మీ ముత్తాత సర్దార్ సుందర్ సింగ్ మజిథియి జలియాన్ వాలాబాగ్ మారణకాండ అనంతరం జనరల్ డయ్యర్‌కు బ్రహ్మాండమైన విందు ఇచ్చాడు. దాంతో ఆయన ప్రభు భక్తికి మెచ్చి బ్రిటన్ ప్రభుత్వం అతన్ని నైట్‌హుడ్ బిరుదతో సత్కరించడం గుర్తులేదా’ అని రీట్వీట్ చేశారు. ప్రస్తుతం వీరి ట్వీట్ల యుద్ధం ఇంటర్నెట్లో తెగ ట్రెండ్ అవుతోంది. -
వివాదాస్పదమైన టైట్లర్ హాజరు
న్యూఢిల్లీ: ఢిల్లీ కాంగ్రెస్ విభాగం అధ్యక్షురాలిగా షీలా దీక్షిత్ బాధ్యతలు స్వీకరించిన వేడుకకు ఆ పార్టీ సీనియర్ నేత జగదీశ్ టైట్లర్ హాజరు కావడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. సిక్కు వ్యతిరేక అల్లర్ల సాక్షులను బెదిరించేందుకే టైట్లర్‌ను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించిందని శిరోమణి అకాళీదళ్ నేత, ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ జనరల్ సెక్రటరీ మజిందర్ సింగ్ సిర్సా మండిపడ్డారు. ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంచిన జగదీశ్ టైట్లర్‌ను షీలా దీక్షిత్ మళ్లీ పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించి ఆయనకు అధిక ప్రాధాన్యం ఇవ్వడాన్ని సిర్సా తీవ్రంగా విమర్శించారు. ‘‘1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన కేసులో సాక్షులను జగదీశ్ టైట్లర్ భయపెట్టారన్న సంగతి బహిరంగ రహస్యమే. అటువంటి వ్యక్తికి కాంగ్రెస్ ప్రాధాన్యం ఇవ్వడం సరికాదు. ఈ అల్లర్లకు సంబంధించి జగదీశ్ టైట్లర్ తోపాటుగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు కూడా జైలు శిక్ష పడుతుంది. సిక్కు అల్లర్ల కేసులో సాక్షులను బెదిరించేందుకు, టైట్లర్‌కు అధిష్టానం మద్దతు మెండుగా ఉందన్న సందేశాన్ని తెలియచెప్పేందుకే కాంగ్రెస్ పార్టీ ఇలా వ్యవహరించింది’’అని ఆయన తన ట్విటర్లో పేర్కొన్నారు. ఢిల్లీ కాంగ్రెస్ విభాగం అధ్యక్షురాలిగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ బుధవారం బాధ్యతల్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్ నేతలు కరణ్‌సింగ్, జనార్దన్ ద్వివేది, మీరా కుమార్, పీసీ చాకో, సందీప్ దీక్షిత్, అజయ్ మాకెన్‌తో పాటుగా పార్టీ ఇతర ముఖ్యనేతలు కూడా హాజరయ్యారు. అయితే జగదీశ్ టైట్లర్‌ను ఆహ్వానించడాన్ని షీలా దీక్షిత్ సమర్థించుకున్నారు. ‘ఆయన ఎందుకు రాకూడదు? ఆయనను ఇక్కడ మేము గౌరవించుకున్నామ’ని ఆమె వ్యాఖ్యానించారు. ఇందిర నుంచి రాహుల్ గాంధీ వరకు టైట్లర్ వారికి ప్రధాన అనుచరుడిగా ఉన్నారని కేంద్రమంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ పేర్కొన్నారు. దీన్ని బట్టే సిక్కుల పట్ల కాంగ్రెస్ వైఖరి అర్థమవుతుందన్నారు. -
రాహుల్ జీ.. స్పష్టత ఇవ్వండి!
న్యూఢిల్లీ : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరైన నాటి నుంచి తన వ్యాఖ్యలు, చర్యలతో పంజాబ్ మంత్రి, కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధు తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. పాకిస్తాన్లో కర్తార్‌పూర్ కారిడార్ శంకుస్థాపనకు హాజరైన సిద్ధు.. ఖలిస్తాన్ వేర్పాటువాద నాయకుడు గోపాల్ సింగ్ చావ్లాతో ఫోటో దిగడం తాజాగా వివాదాస్పదమైంది. ఈ విషయంపై స్పందించిన కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ సిద్ధుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మన సైనికులను చంపిన వ్యక్తిని ఆలింగనం చేసుకుంటారు. పాకిస్తాన్‌కు వెళ్లి మూడు రోజులపాటు అక్కడే ఉంటారు. అంతేకాకుండా ఉగ్రవాదులతో కలిసి ఫొటోలకు పోజులిస్తారు. ఇటువంటి చర్యల ద్వారా ఆయన నిజమైన పాకిస్తాన్ ఏజెంట్ అని నిరూపించుకున్నారు’ అని సిద్ధును ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు ఆయన ఎందుకలా ప్రవర్తిస్తున్నారో తెలియడం లేదని, ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. కాగా ఇటీవల అమృత్‌సర్‌లోని నిరంకారి భవన్ వద్ద జరిగిన ఉగ్రవాద దాడికి, గోపాల్ సింగ్ చావ్లాకు సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. చావ్లాతో తాను ఫొటో దిగడంపై తీవ్ర విమర్శలు వస్తుండటంతో సిద్ధూ స్పందించారు. గోపాల్ సింగ్ చావ్లా ఎవరో తనకు తెలియదని, పాక్‌లో తనతో వేలమంది ఫొటో దిగారని, అతను ఎవరో తాను గుర్తుపట్ట లేదని ఆయన వివరణ ఇచ్చారు. -
ఖలిస్తాన్ ఉగ్రవాదితో మంత్రి ఫొటో.. తీవ్ర దుమారం!
అమృత్సర్: కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఖలిస్తాన్ వేర్పాటువాద నాయకుడు గోపాల్ సింగ్ చావ్లాతో ఆయన ఫోటో దిగడం తాజాగా వివాదాస్పదమైంది. గురువారం గోపాల్ సింగ్ తన ఫేస్బుక్లో సిద్దూతో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. ఇటీవల అమృత్‌సర్‌లోని నిరంకారి భవన్ వద్ద జరిగిన ఉగ్రవాద దాడికి, చావ్లాతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. చావ్లాతో తాను ఫొటో దిగడంపై తీవ్ర విమర్శలు వస్తుండటంతో మంత్రి సిద్ధూ స్పందించారు. గోపాల్ సింగ్ చావ్లా ఎవరో తనకు తెలియదని, పాక్‌లో తనతో వేలమంది ఫొటో దిగారని, అతను ఎవరో తాను గుర్తుపట్ట లేదని ఆయన వివరణ ఇచ్చారు. మరోవైపు చావ్లాతో సిద్ధూ ఫొటో దిగడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఇందిరా గాంధీలాగే పంజాబ్‌ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారా?’ అని రాహుల్‌ను ఉద్దేశించి బీజేపీ ప్రశ్నించింది. ‘నాలుగు రోజుల క్రితమే అమృత్‌సర్‌లో జరిగిన ఉగవాద దాడి వెనుక ఖలిస్తాన్‌వాదుల హస్తం ఉందని పోలీసులు కనుక్కున్నారు. నిన్న నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ, చావ్లాతో కలిశారు. దీని వెనుక ఏంజరుగుతుందో రాహుల్‌గాంధీని చెప్పాలం’టూ బీజేపీ నేత తాజిందర్ బగ్గా ట్వీట్ చేశారు. సిద్దూకు దేశమంటే పట్టింపు ఉందా? లేక వేరే ఉద్దేశంతో ఉన్నారా? అని అకాలీదళ్ ఘాటుగా ప్రశ్నించింది. సిద్దూ ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతంలోనే ఉగ్రవాద దాడి జరిగిందని, దీని వెనుక చావ్లా హస్తముందని అకాలీదళ్ పేర్కొంది. చావ్లాను సిద్దూ చాలాసార్లు దూరంపెట్టారని, కానీ ఈ సారి అతడు ఎలాగోలా సిద్దూతో ఫోటో దిగగలిగారని ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు పరమజిత్ సింగ్ సర్నా చెప్పారు. సిద్దూ పాకిస్తాన్‌తో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారని, భారతీయుల కంటే పాకిస్తానీల నుంచే ఆయన ఎక్కువ ప్రేమాభిమానాలు పొందుతున్నారని కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ వ్యంగ్యంగా పేర్కొన్నారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సిద్ధూ అక్కడినుంచే పోటీ చేయించాలనుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. -
కేరళకు వరుసకట్టిన మ్యాగీ, బిస్కెట్లు, చాక్లెట్లు
న్యూఢిల్లీ : ప్రకృతి విలయతాండవానికి కేరళ అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే. వరద ప్రభావిత ప్రాంతాలకు కనీస అవసరాలు కరువయ్యాయి. వీరిని ఆదుకోవడానికి పెద్ద ఎత్తున్న విరాళాలు తరలివస్తున్నాయి. ఎఫ్ఎంసీజీ కంపెనీలు కూడా తమ వంతు సహాయ సహకారంగా ఆహారం, మంచినీళ్లు, కనీస వస్తువులను కేరళకు తరలిస్తున్నాయి. ఐటీసీ, కోకా కోలా, పెప్సీ, హిందూస్తాన్ యూనిలివర్ వంటి 12కు పైగా ఎఫ్ఎంసీజీ కంపెనీలు వచ్చే రెండు రోజుల్లో మరింత ఆహారాన్ని, మంచినీటిని, కనీస వస్తువులను సరఫరా చేస్తామని వాగ్దానం చేసినట్టు కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ చెప్పారు. దిగ్గజ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీల అధికారులతో నిన్న జరిగిన భేటీ అనంతరం, ఈ విషయాన్ని ప్రకటించారు. కేరళకు సహాయం చేసేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని, ఒక్కొక్కరూ సాయం చేయడం కంటే.. అందరూ కలిసి చేయడం ఎంతో మంచిదని ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్‌కు మంత్రి సూచించారు. హిదూస్తాన్ యూనిలివర్ ఇప్పటికే 9500 కేసుల ఉప్పు, 29వేల కేసుల గోధుమలు, 1000 కేసుల కెచప్, 250 కేసుల స్పైసస్ మిక్స్ మసాలా ఇతర ఉత్పత్తులను సరఫరా చేసింది. నెస్లే ఇండియా 90వేల ప్యాకెట్ల మ్యాగీ, 2 లక్షల ప్యాకెట్ల మచ్, 1100 ప్యాకెట్ల కాఫీ, యూహెచ్‌టీ మిల్క్‌ను అందించింది. అదనంగా మరో 40వేల ప్యాకెట్ల మ్యాగీ, లక్షల ప్యాకెట్ల మంచ్, 1100 ప్యాకెట్ల కాఫీ, యూహెచ్‌టీలను సరఫరా చేయనున్నట్టు పేర్కొంది. వీటితో పాటు 30వేల ప్యాకెట్ల రెడీ-టూ-డ్రింక్ మిలో, 10వేల ప్యాక్‌ల సెరిగోలను సరఫరా చేయనుంది. ఐటీసీ కూడా 3.30 లక్షల ప్యాకెట్ల బిస్కెట్లను, 2000 బాటిళ్ల సావ్లాన్, 3000 ప్యాకెట్ల డైరీ వైటర్న్, 9000 ప్యాకెట్ల లిక్విడ్ హ్యాండ్ వాష్, 7000 సోపులను పంపనున్నట్టు తెలిపింది. కోకా కోలా ఇప్పటికే 1.4 లక్షల లీటర్ల మంచినీటిని పంపింది. అదనంగా మరో లక్ష లీటర్ల ప్యాక్ చేసిన మంచినీటిని, దానిలోనే 20వేల బాటిళ్లను కేరళకు తరలించనున్నట్టు వెల్లడించింది. పెప్సీకో కూడా 6.78 లక్షల లీటర్ల ప్యాక్ చేసిన మంచినీటిని, 10వేల కేజీల క్వాకర్ ఓట్స్‌ను సరఫరా చేసింది. బ్రిటానియా కూడా ఇప్పటికే 2.10 లక్షల ప్యాకెట్ల బిస్కెట్లనును కొచ్చికి అందించింది. 1.25 లక్షల ప్యాకెట్లను మలప్పురం, వయనాడ్‌కు తరలించింది. వచ్చే రెండు రోజుల్లో మరో 1.25 లక్షల ప్యాకెట్ల బిస్కెట్లను కేరళ ప్రజలకు పంపించనున్నట్టు పేర్కొంది. 3000 బన్స్, 10000 ప్యాకెట్ల బిస్కెట్లను మధురైకు సరఫరా చేయనున్నట్టు వెల్లడించింది. ఎంటీఆర్ ఫుడ్ 35వేల ప్యాకెట్ల రెడీ టూ ఈట్‌ను వయనాడ్‌కు పంపించింది. డాబర్ కూడా 30 వేల నుంచి 40వేల వరకు టెట్రా-ప్యాక్ జ్యూస్‌లను, జీఎస్కే ఇండియా రూ.10 లక్షల విలువైన రిలీఫ్ మెటీరియల్స్‌ను, 10 లక్షల హార్లిక్స్ ప్యాకెట్లను, 10 లక్షల క్రోసిన్ టాబ్లెట్లను.. మెరికో 30 టన్నుల ఓట్స్‌ను కేరళ ప్రజలకు పంపించాయి. -
రాహుల్ గాంధీపై సంచలన ఆరోపణలు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై రాజ్యసభ సభ్యుడు సుబ్రమణియన్ స్వామి సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్‌కి డ్రగ్స్ అలవాటు ఉందని, డోపింగ్ టెస్ట్ నిర్వహిస్తే ఆ విషయం తేలుతుందని స్వామి పేర్కొన్నారు. తాజాగా పంజాబ్ ప్రభుత్వం ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డ్రగ్స్ టెస్ట్ నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్వామి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సాక్షి, న్యూఢిల్లీ: ‘పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ముందుగా కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకి డోపింగ్ టెస్ట్ నిర్వహించాలి. ఆయన ఖచ్ఛితంగా విఫలం అవుతారు. ఎందుకంటే ఆయన కోకైన్ తీసుకుంటారు కాబట్టి’ అని ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ స్వామి పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ కూడా స్పందిస్తూ.. ‘పంజాబ్‌లో డ్రగ్స్ అడిక్ట్స్ ఎక్కువగా ఉన్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. 70 శాతం యువత డ్రగ్స్ మత్తులో ఊగుతోందని రాహుల్ అంటున్నారు. కానీ, వారి పార్టీలోనే ఉన్న డ్రగ్ అడిక్ట్స్‌కు ముందుగా డోప్ టెస్టులు నిర్వహించండి. అది రాహుల్‌తోనే మొదలుపెడితే బాగుంటుంది’ అని ఆమె వ్యాఖ్యానించారు. కాగా, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. (సంచలన నిర్ణయం) ప్రభుత్వ ఉద్యోగులకు(పోలీస్ శాఖతోసహా) డోప్ టెస్ట్ నిర్వహించాలని, నిందితులుగా తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని పంజాబ్ సర్కార్ నిర్ణయించింది. అంతేకాదు నిషేధిత డ్రగ్స్ విక్రయించే, అక్రమ రవాణాకు పాల్పడే వారికి ఉరిశిక్ష విధించేలా కఠిన చట్టాన్ని రూపొందిస్తున్నామని కెప్టెన్, సీఎం అమరీందర్ సింగ్ ఇటీవల ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల అనంతరం చేసే ఎంపిక ప్రక్రియ సమయంలో కొత్త అభ్యర్థులకు సైతం డ్రగ్స్ టెస్ట్‌లు చేయిస్తామని ఆయన తెలిపారు. అయితే ఈ నిర్ణయాన్ని స్వాగతించిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం.. సీఎంతోసహా ప్రజా ప్రతినిధులందరినీ ఈ చట్టం పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. -
టీడీపీ పోతే పోయేదేముంది..
న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ భాగస్వామ్య పక్షం అకాలీదళ్ మోదీ ప్రభుత్వానికి అండగా నిలిచింది. ఎన్డీయే నుంచి బయటకు వస్తున్నట్టు, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి కేంద్రంలో కొనసాగలేమని టీడీపీ ప్రకటించిన నేపథ్యంలో అకాలీదళ్ స్పందించింది. టీడీపీ ఎన్డీఏను వీడినా తాము ప్రభుత్వం వెన్నంటి ఉంటామని స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా అంశంపై ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించి మళ్లీ తామే తీర్మానం పెడతామని యూటర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. ‘ఎన్నో ఏళ్లుగా బీజేపీకి మిత్ర పక్షంగా ఉన్నాం. ఇలాంటి రాజకీయ సంక్షోభాల్ని, ఇబ్బందులను ఎన్నింటినో కలిసి ఎదుర్కొన్నామ’ని అకాలీదళ్ నాయకురాలు, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి హర్సిమ్రత్ కౌర్ అన్నారు. -
’కిచిడీ’ తుఫాన్ సద్దుమణిగింది!
టీ కప్పులో తుఫాన్ తెలుసు మనకు. కానీ కిచిడీ పాత్రలో తుఫాన్ ఎప్పుడైనా చూశామా? తాజాగా ట్విట్టర్లో అదే జరిగింది. ’కిచిడీ’ని జాతీయ వంటకంగా ప్రకటిస్తున్నట్టు కథనాలు రావడంతో ఒక్కసారిగా ట్విట్టర్లో ఇది హాట్ టాపిగ్గా మారిపోయింది. ఇదే అంశంపై నెటిజన్లు పుంఖానుపుంఖాలుగా కామెంట్లు, జోకుల వరదతో ముంచెత్తడంతో ’కిచిడీ’ వైరల్ అయింది. దీంతో కేంద్ర ఆహారశాఖ మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ దిగొచ్చి.. కిచిడీని జాతీయ వంటకంగా ప్రకటించడం లేదని స్పష్టత ఇచ్చారు. ’మీరు వండిన కల్పిత ’కిచిడీ’ చాలు. వరల్డ్ ఫుడ్ ఇండియాలో కిచిడీకి రికార్డ్ ఎంట్రీ మాత్రమే ఇవ్వబోతున్నాం’ అని ఆమె ట్విట్టర్లో తెలిపారు. అంతకుముందు నెటిజన్లు ట్విట్టర్లో ’కిచిడీ’పై చేసిన ’కిచిడీ’ అంతా ఇంతా కాదు. ’కిచిడీ’ని జాతీయ వంటకంగా ప్రకటిస్తున్నారన్న కథనాలపై నెటిజన్లు జోకుల మీద జోకులు పేల్చారు. ’ఎవరైనా కిచిడీ తింటున్నప్పుడు చూస్తే.. లేచి నిలబడాలా? సినిమాకు ముందు కచ్చితంగా కిచిడీ తిని తీరాలా? కిచిడీ నచ్చనివారు దేశద్రోహులేనా’ అని ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. ’కిచిడీ తినడం వల్ల ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు పుట్టారని, రాముడు ఒకప్పుడు ప్రతిరోజూ కిచిడీ తినేవారని త్వరలోనే మెసెజ్‌లో పోటెత్తుతాయి’ అని ఓ నెటిజన్ చమత్కరించారు. Enough Khichdi cooked up on a fictitious 'National Dish’. It has only been put for a record entry in #WorldFoodIndia. — Harsimrat Kaur Badal (@HarsimratBadal_) November 1, 2017 Do we have to stand every time we see it being eaten? Is it compulsory to eat before a movie? Is it anti-national to not like the stuff? https://t.co/MkgWEBNQlH — Omar Abdullah (@OmarAbdullah) November 1, 2017 Soon we'll witness a thread about how eating Khichdi helped someone deliver Swadeshi triplets 🙄 and how Ram used to eat Khichdi everyday. 😒 — Priyanka (@autumnrainwish) November 1, 2017 If Khichdi is being accorded the status of National Food, then Ghee, Dahi, Papad and Achaar should immediately be declared National Friends. pic.twitter.com/bLX842WL1S — Roflindian (@Roflindian) November 1, 2017 No action of this government has disturbed me more than announcement of #khichdi as National Food. Matlab Aloo-Poori kya mar gayi hai? — richa singh (@richa_singh) November 1, 2017 Khichdi is like Rahul Dravid. Never flashy or flamboyant, but it's the only thing that will rescue you when you are ill & few wickets down. — Roflindian (@Roflindian) November 1, 2017