
న్యూఢిల్లీ: ‘కిచిడి’ ఇకపై జాతీయ వంటకం హోదాను దక్కించుకోనుందా?. ప్రపంచ మార్కెట్లో వాణిజ్యపరంగా ఈ వంటకాన్ని ప్రోత్సాహం కల్పించే ఉద్దేశంతోనే ‘కిచిడి’కి జాతీయహోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందన్న ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
ఢిల్లీలో జరగనున్న ‘వరల్డ్ ఫుడ్ ఇండియా కాన్ఫరెన్స్’ను ఇందుకు వేదికగా చేసుకోనుంది. రేపటి నుంచి మూడ్రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ఏకంగా 800 కేజీల ధాన్యాలతో ‘బ్రాండ్ ఇండియా కిచిడి’ని తయారుచేయనున్నారు. పాకశాస్త్ర ప్రావీణ్యుడు సంజీవ్ కపూర్ పర్యవేక్షణలో ఈ వంటకాన్ని తయారుచేయనున్నారు. 60,000 మంది అనాథ పిల్లలకు, ఈ సదస్సులో పాల్గొనేందుకు వచ్చే 60 దేశాలకు చెందిన రాయబారులు, ప్రతినిధులకు ఈ కిచిడిని వడ్డిస్తారని తెలుస్తోంది.
అయితే జాతీయ వంటకం హోదా దక్కించుకున్న వార్తను కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ ఖండించారు. కేవలం రికార్డు ఎంట్రీ కోసమే కిచిడీ తయారు చేయనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
Enough Khichdi cooked up on a fictitious 'National Dish’. It has only been put for a record entry in #WorldFoodIndia.
— Harsimrat Kaur Badal (@HarsimratBadal_) 1 November 2017
Comments
Please login to add a commentAdd a comment