
త్వరలో దేశంలో 17 ఫుడ్‌పార్క్‌లు: హర్‌సిమ్రత్
న్యూఢిల్లీ: త్వరలో దేశంలో 17 ఫుడ్ పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందని, వీటి ద్వారా రూ. 2,100 కోట్ల పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉందని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ సోమవారం చెప్పారు. చిత్తూరు ప్రాజెక్ట్‌లో పనిప్రారంభం: కాగా, ప్రభుత్వ ఆమోదం పొందిన 25 మెగాఫుడ్ ప్రాజెక్టుల్లో ఒకటైన చిత్తూరు జిల్లాలోని ప్రాజెక్టు ఇప్పటికే పని ప్రారంభించిందని కేంద్రం తెలిపింది.