చండీగఢ్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మాజీ కేంద్ర మంత్రి, శిరోమణి అకాలీదళ్ పార్టీ నాయకురాలు హర్ సిమ్రత్ కౌర్ బాదల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె ట్విటర్ వేదికగా మండిపడ్డారు. కాగా, రాహుల్ గాంధీ గత బుధవారం పంజాబ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అమృత్ సర్‌లోని స్వర్ణ దేవాలయంను సందర్శించారు. ఈ నేపథ్యంలో రాహుల్ తన జేబులో నుంచి చోరీ జరిగినట్లు వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ఈ ఆరోపణలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దీనిపై హర్సిమ్రాత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాహుల్ గాంధీ.. ఒక జెడ్ క్యాటగిరి భద్రతను కల్గిఉన్నారని.. ఆయనతోపాటు పంజాబ్ సీఎం చన్నీ, డిప్యూటి సీఎం సుఖ్ జీందర్ సింగ్ రంధావా, ఓపీ సోనిలుకూడా ఉన్నారన్నారు. ఇలాంటి చోట చోరీ జరగటం ఏంటని ప్రశ్నించారు. పవిత్రమైన ప్రదేశానికి చెడ్డపేరు తెచ్చేల వ్యాఖ్యలు చేయకూడదని హితవు పలికారు.
భక్తుల మనోభావాలు దెబ్బతీనేలా ప్రవర్తించకూడదన్నారు. అసత్య ప్రచారాలు మానుకోవాలని రాహుల్‌కు చురకలంటించారు. అయితే, రాహుల్ ఆరోపణలపై.. పూర్తి వివరాలను వెల్లడించలేదని ఎంపీ హర్సిమ్రాత్ కౌర్‌బాదల్ అన్నారు. కాగా, రాహుల్ గాంధీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. బుధవారం రోజు జలంధర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నవిషయం తెలిసిందే.
హర్ సిమ్రాత్ వ్యాఖ్యలపై.. కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా ఆమె పోస్ట్‌కు రీట్వీట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. తప్పుడు వార్తలను ప్రచారం చేయడం అపచారమని అన్నారు. రాజకీయ విభేదాలకు అతీతంగా బాధ్యతతో, పరిపక్వతతో ప్రదర్శించాలని తెలిపారు. గతంలో నరేంద్రమోదీ తీసుకువచ్చిన చట్టాలు.. రైతుల జేబులు కొట్టడం లాంటివేనని అన్నారు.
Who picked @RahulGandhi's pocket at Sri Harmandir Sahib?@CHARANJITCHANNI? @sherryontopp? or @Sukhjinder_INC? These were the only 3 persons allowed by Z-security to get near him. Or is it just one more attempt to bring bad name to our holiest shrine, after the 'be-adbi' incidents?
— Harsimrat Kaur Badal (@HarsimratBadal_) January 29, 2022
చదవండి: ఒక వైపు నామినేషన్లు.. మరోవైపు రాజీనామాలు
Comments
Please login to add a commentAdd a comment