Golden Temple
-
ఒత్తిడి తగ్గించుకునేందుకు ఆధ్యాత్మికత వైపు..
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడూ చెప్పుకొనేదే.. నగరంలో ఉరుకులు పరుగుల జీవితం.. మానసిక సమస్యలు, చిరాకులు, కుటుంబ సమస్యలకు దారి తీస్తున్నాయనే విషయం తెలిసిందే. ఒత్తిళ్లు తట్టుకోలేక ఆందోళనలకు గురవుతూ.. మత్తుపానీయాలకు బానిసలు అవుతున్నారు. కంపెనీల్లో ఒత్తిడి ఎంతలా ఉందంటే ఒత్తిడి నుంచి బయటపడేందుకు పలు కంపెనీల్లో ప్రత్యేకంగా స్మోకింగ్ జోన్స్ ఏర్పాటు చేశాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.చాలామంది ఉద్యోగులు వారాంతాల్లో కుటుంబంతో, స్నేహితులతో కలిసి జాలీగా గడిపేందుకు ప్లాన్స్ చేసుకుంటారు. సమీపంలోని ప్రశాంతంగా ఉండే రిసార్టులకు కొందరు వెళ్తుంటారు. మరికొందరు ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ కుటుంబసభ్యులతో గడుపుతుంటారు. అయితే కొందరు ఉద్యోగులు.. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు మాత్రం భక్తి చింతన, ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తున్నారు. మరీ ముఖ్యంగా చిన్న వయసులోనే యువత కొత్త దారి వెతుక్కుంటూ.. నగరంలోని, శివారు ప్రాంతాల్లోని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాల వైపు పరుగులు పెడుతున్నారు.ఎందుకిలా..? సాధారణంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ప్రాజెక్టులు, టార్గెట్లు, రిపోర్టులు, సబి్మషన్లు ఇలా ఒక్కటేమిటి ఎన్నో ఒత్తిళ్లతో రోజును భారంగా గడుపుతుంటారు. నెలాఖరు రాగానే లోన్లు, ఈఎంఐలు కట్టేందుకు నానా తిప్పలు మరింత కామన్. ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఆల్కహాల్, సిగరెట్ వంటి అలవాటు చేసుకుని, అధికంగా సేవిస్తుంటారు. దీనికి తోడు ఎలాంటి శారీరక వ్యాయామాలు లేకపోవడంతో ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. దీంతో కలల ప్రపంచం ఒక్కసారిగా నేలకు దిగిపోతుంటుంది. అప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొత్త దారి వెతుక్కుంటారు. సాధారణంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్స్ అనగానే వీకెండ్స్ పార్టీలకు వెళ్తుంటారు అని భావిస్తుంటారు. కానీ అక్కడికి వెళ్లినా కూడా తమ ఉద్యోగ జీవితాల ద్వారా వచ్చే ఒత్తిడిని తట్టుకునేంత ప్రశాంతత దొరకట్లేదని ఆధ్యాతి్మక చింతన మార్గాన్ని ఎంచుకుంటున్నారు.చిన్న వయసులోనే..వారాంతాల్లో నగరంలోని పలు దేవాలయాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు యువతీ, యువకులతో కిటకిటలాడుతున్నాయి. నగరంలోని పలు ప్రముఖ ఆలయాలు, ఆధ్మాత్మిక క్షేత్రాలతో పాటు శివారు ప్రాంతాల్లోని నగరాలకు కూడా ఉద్యోగులు క్యూ కడుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు మాత్రమే కాకుండా విద్యార్థులు కూడా ఇక్కడికి చేరుకుని చిన్న వయసులోనే వారిలో ఏర్పడిన ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ప్రయతి్నస్తున్నారు. ముఖ్యంగా ఏకాంతంగా కూర్చుని దేవుడి ముందు ధ్యానం చేసుకుంటూ కనిపిస్తున్నారు. నగరంలోని ఇస్కాన్ టెంపుల్స్, హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ వంటి క్షేత్రాల్లో నృత్యాలు చేస్తూ తన్మయత్వం చెందుతున్నారు. కృష్ణుడి సంకీర్తనలు, భజనలు చేసుకుంటూ వారిలోని ఆధ్యాత్మిక భావాన్ని చాటుకుంటున్నారు. జీవితానికి కొత్త ఒరవడిని చూపుకొంటున్నారు. జీవిత సత్యాన్ని తెలుసుకునేందుకు అన్వేషిగా బయల్దేరుతున్నారు.ఆ రోజులే బాగున్నాయి.. చాలీచాలని డబ్బులతో ఉద్యోగం కోసం వెతుక్కుంటూ హైదరాబాద్‌లో తిరిగిన రోజులే బాగున్నాయి. అప్పుడు ఉద్యో గం వస్తే చాలు అనుకునే వాడిని. ఇప్పుడు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం.. లక్షల్లో జీతం.. అయినా ఏదో పోగొట్టుకున్న వెలితి ఉంది. సవాలక్ష సమస్యలు చుట్టు ముడుతున్నట్లు ఉంది. ప్రశాంతత అనే మాటే కరువైంది. నెలాఖరు రాగానే లోన్లు.. ఈఎంఐల వెంట పరిగెత్తాల్సి వస్తోంది. డబ్బులు అన్నీ ఇవ్వదనే విషయం అవగతమవుతోంది. అందుకే భక్తి మార్గం ప్రశాంతతను ఇస్తుందనే ఉద్దేశంతో ప్రతి వారం ఏదైనా గుడికి వెళ్లి ఒంటరిగా కాసేపు గడుపుతాను. – నల్లం నవీన్, సాఫ్ట్వేర్ ఇంజినీర్మనసుకు ప్రశాంతత నాకు ఆధ్యాతి్మక భావన ఎక్కువ. చిన్నప్పటి నుంచి దేవాలయాలకు వెళ్లడం, పూజా కార్యక్రమాలు చేపట్టడం అలవాటు. పెళ్లయిన తర్వాత ఉద్యోగం, విధి నిర్వహణలో నిత్యం ఒత్తిడి ఎదుర్కొంటున్నాం. వారంలో శని, ఆదివారాలు రెండు రోజులు సెలవులు వస్తున్నాయి. పిల్లలు, ఇల్లు కుటుంబాన్ని చూసుకోవడానికే సరిపోతుంది. శని, ఆదివారాల్లో కుటుంబ సభ్యులంతా కలిసి ఆలయాలకు వెళ్తుంటాం. తిరుపతి, శ్రీశైలం, అరుణాచలం, వేములవాడ, యాదగిరిగుట్ట, ఈ మధ్య స్వర్ణగిరి వెళ్లాం. – నిహారికారెడ్డి, మియాపూర్ -
Baisakhi: పంజాబ్‌లో మొదలైన వైశాఖ మాస వేడుకలు.. (ఫోటోలు)
-
గిన్నెలు కడిగిన రాహుల్ గాంధీ.. స్వర్ణ దేవాలయంలో పూజలు..
అమృత్సర్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్వర్ణ దేవాలయంలో ప్రార్ధనలు నిర్వహించి అనంతరం 'కర సేవ'లో పాల్గొని భక్తులకు ప్రసాదాలు వడ్డించిన గిన్నెలను కడిగారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన భారత్ జోడో యాత్ర సందర్బంగా గత కొంత కాలంగా జనంతో మమేకమవుతూ వస్తున్నారు. ఇటీవల రైల్వే కూలీగానూ, వడ్రంగిగానూ సామాన్యులతో సమయం గడిపిన ఆయన ఈ రోజు స్వర్ణదేవాలయంలో పనివాడిగా మారిపోయారు. ఈ రోజు ఉదయం 11.15 గంటలకు ప్రత్యేక విమానంలో పంజాబ్ వచ్చిన ఆయన అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. దేవాలయంలో తలకు నీలిరంగు పాగాను ధరించి మొదట ప్రార్ధనలు నిర్వహించిన ఆయన అనంతరం 'కర సేవ'లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాహుల్ గాంధీ భక్తులకు ప్రసాదాన్ని అందించే గిన్నెలను కడిగారు. ఈ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లోనే వైరల్ అయ్యింది. Rahul Gandhi cleans utensils in the Golden Temple, Amritsar#RahulGandhiInGoldenTemple pic.twitter.com/G4GJaAYxG1 — Syed Z🇮🇳INDIA (@syed_zakir_1947) October 2, 2023 అంతకుముందు రాహుల్ గాంధీ పర్యటన గురించి అక్కడి కాంగ్రెస్ నేత అమరీందర్ సింగ్ రాజా వారింగ్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా కార్యకర్తలకు సందేశమిచ్చారు. రాహుల్ గాంధీ సఖ్చంద్ శ్రీ హార్మిందర్ సాహిబ్‌ను స్మరించుకునేందుకు అమృత్సర్ వస్తున్నారు. ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగత పర్యటన. ఆయన ప్రైవసీని మనం గౌరవించాలి. కాబట్టి కార్యకర్తలు ఎవ్వరూ ఆయనను కలిసేందుకు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన మళ్ళీ వచ్చినప్పుడు కలిసి మీ మద్దతు తెలపాలని కోరారు. Shri @RahulGandhi ji is coming to Amritsar Sahib to pay obeisance at Sachkhand Shri Harmandir Sahib. This is his personal, spiritual visit, let’s respect his privacy. Request all party workers to not be physically present for this visit. You all can show your support in spirit &… — Amarinder Singh Raja Warring (@RajaBrar_INC) October 2, 2023 ఇది కూడా చదవండి: వందే భారత్ రైలుకు తప్పిన పెనుప్రమాదం -
కాబోయే భర్తతో కలిసి ప్లేట్లు కడిగిన బాలీవుడ్ నటి
-
అక్కడ ప్లేట్స్ కడిగిన స్టార్ హీరోయిన్.. కారణం అదే!
ఆమె బాలీవుడ్లో వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్. ఓవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. గత నెలలో ఈమెకు నిశ్చితార్థం జరిగింది. త్వరలో తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి కూడా చేసుకుబోతుంది. అలాంటి ఆమె.. ఇప్పుడు సడన్ గా ఓ చోట ప్రత్యక్షమైంది. కాబోయే భర్తతో కలిసి ప్లేట్లు కడిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోలు వైరల్ గా మారాయి. ఇంతకీ ఏం జరిగింది? ఎవరా బ్యూటీ? బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా గురించి తెలుగు ప్రేక్షకులకు కాస్తో కూస్తో తెలుసు. శుద్ధ్ దేశీ రొమాన్స్, కేసరి తదితర చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించింది. ప్రస్తుతం 'చమ్కీలా' అనే చిత్రంలో నటిస్తోంది. మరోవైపు అక్షయ్ కుమార్ తో కలిసి 'ద గ్రేట్ ఇండియా రెస్క్యూ' సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. ఇది అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. (ఇదీ చదవండి: మెగాడాటర్ నిహారిక భర్త సంచలన పోస్ట్!) రాఘవ్‌తో పెళ్లి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాఘవ్ చద్దాతో హీరోయిన్ పరిణీతి చోప్రాకు పెళ్లి కుదిరింది. గత కొన్నేళ్లుగా వీళ్లు డేటింగ్ లో ఉన్నారు. కానీ ఈ విషయం ఎవరికీ తెలియకుండా, బయటపడకుండా చాలా జాగ్రత్తపడ్డారు. గత నెలలో అంటే మే 13న వీళ్లకు నిశ్చితార్థం జరిగింది. దీనికి కొన్ని రోజుల ముందు మాత్రమే.. ఈ జంట గురించి న్యూస్ బయటకొచ్చింది. త్వరలో రాజస్థాన్ లో వీళ్లిద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారు. గోల్డెన్ టెంపుల్లో త్వరలో పెళ్లి చేసుకోనున్న పరిణీతి-రాఘవ్.. శనివారం ఉదయం అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్(స్వర్ణ దేవాలయం)ని కనిపించారు. దర్శనానంతరం అన్నదాన సత్రంలో ప్లేట్లు కడిగే సేవలో పాల్గొన్నారు. ఈ ఫొటోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దేవాలయంలో రాఘవ్-పరిణీతి తిరుగుతున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి. (ఇదీ చదవండి: 'సామజవరగమన' బ్యూటీ ఆ తెలుగు హీరోయిన్‌కి అక్క?) -
గుర్బానీ ప్రసారాలు ఉచితం
చండీగఢ్: సిక్కులు పఠించే పవిత్ర శ్లోకం గుర్బానీ ఇకపై ఉచితంగా ప్రఖ్యాత స్వర్ణదేవాలయం నుంచి ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన బ్రిటిష్‌కాలంనాటి చట్టానికి చేసిన సవరణ ప్రతిపాదనలకు పంజాబ్ రాష్ట్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. మంగళవారం శాసనసభలో ఈ సవరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదిస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సోమవారం ప్రకటించారు. ఇన్నాళ్లూ గుర్బానీని రాష్ట్రంలో శక్తివంతమైన శిరోమణి అకాలీదళ్ పార్టీకి చెందిన ప్రైవేట్ చానెల్ పీటీసీ ప్రసారం చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయంపై శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ(ఎస్జీపీసీ) మండిపడింది. ‘ఆ చట్టాన్ని పార్లమెంట్ చేసింది. దీనికి సవరణ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. సిక్కుల మత సంబంధ వ్యవహారాలకు ఆప్ ప్రభుత్వం రాజకీయ రంగు పులుముతోంది’ అని ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘చట్ట పరిధిపై సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. ఇది రాష్ట్ర పరిధిలోనిది’ అని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘ గుర్బానీ వినిపించేటపుడు అడ్వర్ట్టైజ్మెంట్లు ఉండకూడదనే ఉద్దేశంతో∙ప్రత్యక్షంగా ఉచితంగా ఆడియో, వీడియో ప్రసారాలు చేస్తున్నాం’ అని ప్రభుత్వం ప్రకటించింది. పీటీసీ ప్రైవేట్ చానెల్‌కు అధిపతి అయిన శిరోమణి అకాళీదళ్ ఆధిపత్యాన్ని తగ్గించేందుకే సర్కార్ ఈ నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. -
స్వర్ణ దేవాలయం సమీపంలో మరో పేలుడు.. స్థానికుల భయభ్రాంతులు..
చండీగఢ్: పంజాబ్ అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం సమీపంలో మరో పేలుడు ఘటన జరిగింది. సోమవారం ఉదయం 6:30 గంటల సమయంలో హెరిటేజ్ స్ట్రీట్‌లో భారీ శబ్దంతో ఈ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక్కరు గాయపడ్డారు. శనివారం రాత్రి కూడా ఇదే ప్రాంతంలో పేలుడు జరగిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. ఒకే ప్రాంతంలో వరుస పేలుళ్లు జరుగుతుండటంతో స్థానికులు హడలిపోతున్నారు. పోలీసులు, బాంబ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని శాంపిల్స్ సేకరించారు. Punjab | Bomb Squad and FSL team at the spot after a suspected bomb explosion was reported near Golden Temple in Amritsar https://t.co/EBubbzqAFU pic.twitter.com/yx0dROANqw — ANI (@ANI) May 8, 2023 ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ప్రజలు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని పంజాబ్ డీజీపీ తెలిపారు. ఇది ఐఈడీ పేలుడు కాదని స్పష్టతనిచ్చారు. తక్కువ తీవ్రతగల పేలడు అని పేర్కొన్నారు. అయితే పేలుళ్లకు గల కారణాలు పోలీసులకు అంతుచిక్కడం లేదు. ఇది ఉగ్రవాదుల దాడి కాదని మాత్రం తెలిపారు. శనివారం జరిగిన ఘటనలో పేలుడు పదార్థాలతో పాటు మెటల్‌ను ఉపయోగించినట్లు వెల్లడించారు. రెస్టారెంట్‌లోని చిమ్నీలో ఈ పేలుడు జరిగింది. ఈ ధాటికి కిటికీ అద్దాలు ధ్వంసమై రోడ్డుపై ఆటోలో వెళ్తున్న ఆరుగురు అమ్మాయిలు గాయపడ్డారు. చదవండి: టెక్సాస్ కాల్పుల ఘటన.. హైదరాబాద్ యువతి మృతి -
స్వర్ణ దేవాలయం సమీపంలో పేలుడు.. ఆరుగురు అమ్మాయిలకు గాయాలు
చండీగఢ్: పంజాబ్ అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం సమీపంలో భారీ పేలుడు సంభవించింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఆరుగురు అమ్మాయులు గాయపడ్డారు. పేలుడు శబ్దం వినగానే ఆలయంలోని భక్తులు, స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఉగ్రదాడి జరిగి ఉంటుందని తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇది ఉగ్రదాడి కాదని చెప్పారు. పరిస్థితి అదుపులోనే ఉందని, ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. శాంతియుతంగా ఉండాలని సూచించారు. Video: Several injured in blast near #Amritsar's Golden Temple https://t.co/GWEtgJ37sH pic.twitter.com/XwLJxvg1T0 — TOIChandigarh (@TOIChandigarh) May 7, 2023 ఫోరెన్సిక్ టీం పేలుడు జరిగిన ప్రదేశానికి వెళ్లింది. అక్కడ లభించిన కొంత పౌడర్‌ను స్వాధీనం చేసుకుంది. దీనిపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని పోలీసులు పేర్కొన్నారు. పేలుడు ధాటికి కిటికీ అద్దాలు ధ్వంసమై రోడ్డుపై ఆటోలో వెళ్తున్న ఆరుగురు అమ్మాయిలకు స్వల్పగాయాలయ్యాయని ఓ స్థానికుడు తెలిపాడు. చదవండి: బైక్‌లే ఉన్నాయ్.. జనాలేరీ?.. బీజేపీ శ్రేణులపై అమిత్‌షా సీరియస్ -
స్వర్ణ దేవాలయం వద్ద మహిళకు చేదు అనుభవం..!
ఒక మహిళకు గోల్డెన్ టెంపుల్ చేదు అనుభవం ఎదురైంది. ముఖంపై జాతీయ జెండాను పెయింట్ వేసుకున్నందుకు పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయంలోకి ప్రవేశానికి నిరాకరించారు. అక్కడున్న సెక్యూరిటీ గార్డు అడ్డుకోవడంతో ఆ మహిళ ఇది భారతదేశం కాదా అని ప్రశ్నించింది. గార్డు అంతటితో ఆగకుండా ఇది పంజాబ్ అంటూ దురుసుగా ప్రవర్తించాడు. గార్డు మాటలు విని మహిళ కంగుతింది. ఈ ఘటనను సదరు బాధితురాలు ఫోన్లో రికార్డు చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత గార్డు మహిల ఫోన్‌ని లాక్కునేందుకు ప్రయత్నించడంతో ఆమె అక్కడ నుంచి వెనుదిరిగింది. కాగా ఈ ఘటనపైపై గోల్డెన్ టెంపుల్ని నిర్వహించే శిరోమణి గురుద్వార్ పర్బంధక్ కమిటీ స్పందించి గార్డు దురుసుగా ప్రవర్తించినందుకు క్షమాపణలు కోరింది. అయితే ఆ మహిళ ముఖంపై ఉన్న జెండాపై ఆశోక చక్రం లేనందున అది రాజకీయ పార్టీ జెండా అయి ఉంటుందని భావించి ఉంటాడని వివరణ ఇచ్చింది. ఈ మేరకు దేవాలయ ప్రధాన కార్యదర్శి గురుచరణ్ సింగ్ గ్రేవాల్ మాట్లాడుతూ.. ప్రతి మత స్థలానికి దానికంటూ ఒక పత్యేక విధివిధానాలు ఉంటాయి. మేము ప్రతి ఒక్కరిని స్వాగతిస్తున్నాం. ఆ అధికారి ప్రవర్తించిన తీరుకి క్షమాపణలు కోరతున్నాం అని చెప్పారు. Woman denied entry to Golden Temple because she had a India 🇮🇳 flag painted on her face! The man who denied her entry into Golden Temple said this is Punjab, not India@AmitShah @PMOIndia @narendramodi @GoldenTempleInd @ArvindKejriwal Is bande ko Pakistan ke Punjab bhejo pic.twitter.com/nSgbOxVkoN — HARSH KESHRI (@HarshKeshri2209) April 17, 2023 (చదవండి: దీన్ని ఎవరు విచారిస్తారు?: మహారాష్ట్ర విషాదంపై ఉద్ధవ్ థాక్రే ఫైర్) -
పోలీసులకు లొంగిపోయే యోచనలో అమృత్‌పాల్ సింగ్?.. వీడియో విడుదల
పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్తాన్ వేర్పాటువాది, ‘వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ తిరిగి పంజాబ్‌లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. గోల్డెన్ టెంపుల్ వద్ద పోలీసుల ముందు లొంగిపోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. తప్పించుకునే అవకాశం లేకపోవడంతో భయంతో అమృత్‌పాల్.. చివరకు తన మనసు మార్చుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పోలీసులకు లోంగిపోతాడనే ఊహాగానాల మధ్య పరారీలో ఉన్న ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృతపాల్ సింగ్ బుధవారం వీడియో విడుదల చేశాడు. ఇందులో పంజాబ్ పోలీసులపై విమర్శలు గుప్పించాడు. ఒకవేళ పోలీసులకు తనను అరెస్టు చేయాలనే ఉద్దేశ్యం ఉంటే.. ఇంటికి వచ్చి అరెస్టు చేసేవారని అన్నాడు. తను అరెస్ట్‌కు భయపడే వ్యక్తి కాదని చెప్పాడు. పంజాబ్ ప్రభుత్వం నా అరెస్ట్ కోసం కాదు.. మొత్తం సిక్కు సమాజంపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. అతని సన్నిహతులను అరెస్టు చేయడం, అస్సాం జైలులో వారిని నిర్బంధించడం గురించి కూడా వీడియోలో మాట్లాడాడు. ప్రజల మనస్సులలో ప్రభుత్వం సృష్టించిన భయాన్ని తొలగించడానికి బైస్కాహి సందర్భంగా తల్వాండి సబోలో సమావేశం నిర్వహించాలని అకల్ తఖ్త్ జాతేదార్ గియానీ హర్‌ప్రీత్ సింగ్‌ను అభ్యర్థించినట్లు తెలిపాడు. పోలీసుల నుంచి పారిపోయిన తర్వాత వారిస్ పంజాబ్ దే చీఫ్ విడుదల చేసిన మొట్టమొదటి వీడియో ఇదే కావడం గమనార్హం. అయితే అమృత్‌పాల్ ఈ వీడియోలో ప్రత్యేక రాష్ట్రం లేదా ఖలిస్తాన్ గురించి ఎటువంటి ప్రస్తావన చేయలేదు. #BREAKING: Khalistani Radical Amritpal Singh releases a new video from hiding in Punjab. Requests Jathedar of Akal Takht to call Sarbad Khalsa (congregation of Sikhs) to discuss issues to save Punjab. Dares Punjab CM Bhagwant Mann and Punjab Police. pic.twitter.com/vhcDN1lBaE — Aditya Raj Kaul (@AdityaRajKaul) March 29, 2023 కాగా ఖలిస్తాన్ సానూభూతి పరుడు అమృత్‌పాల్ సింగ్ కోసం పోలీసులు 10 రోజులుగా విస్తృతంగా గాలింపు చేపడుతున్నారు. ఈ నెల 18వ తేదీన పంజాబ్ పోలీసుల నుంచి తప్పించుకున్న అతడు వేషాలు మార్చకుంటూ పారిపోతున్నాడు. ఈ క్రమంలోనే రాష్ట్రం విడిచి వెళ్లిన్నట్లు గుర్తించారు. అయితే తాజాగా వారిస్ పంజాబ్ దే చీఫ్ మంగళవారం హోషియార్పూర్ మీదుగా అమృత్‌సర్‌కు వచ్చిన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. అమృతపాల్ సింగ్, అతని సహాయకులు మంగళవారం అర్థరాత్రి తర్వాత హోషియపూర్లోని ఓ గ్రామంలో దాక్కున్నారనే సమాచారంతో పంజాబ్ పోలీసులు సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించారు. అతన్ని పట్టుకునే ప్రయత్నం చేయగా.. మార్నియన్ గ్రామంలోని గురుద్వారా వద్ద అమృతపాల్ సింగ్ ఇన్నోవా కారును వదిలిపెట్టి అక్కడి పొలాల్లోకి పారిపోయాడు. కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు ఖలిస్తాన్ నేత కోసం విస్తృతంగా గాలింపు చేపడుతున్నారు. అనుమానితుల్ని పట్టుకునేందుకు రోడ్లపై చెక్‌పోస్టులు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. చుట్టు పక్కల ప్రాంతాల్లోని గ్రామాల్లో పోలీసులు జల్లెడ పడుతున్నారు. గోల్డెన్ టెంపుల్ చుట్టూ, అకల్ తఖ్త్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. త్వరలోనే అతను లొంగిపోయే అవకాశం ఉన్నందున అమృత్సర్ అంతటా హై అలర్ట్ కొనసాగుతోంది. చదవండి: 2025 కాదు 2050లో కూడా బీజేపీ గెలవదు.. కేజ్రీవాల్ జోస్యం.. -
భార్య బర్త్‌డేకి స్పెషల్ విషెస్...గోల్డెన్ టెంపుల్‌కి బన్నీ ఫ్యామిలీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి పుట్టిన రోజు నేడు(సెప్టెంబర్ 29). ఈ సందర్భంగా ఫ్యామిలీతో కలిసి అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ దర్శనానికి వెళ్లాడు బన్నీ. సంప్రదాయ దుస్తులు ధరించి దర్శనం చేసుకున్నారు. పాన్ ఇండియా స్టార్ స్టేటస్ ఉండి కూడా ఒక సాధారణ వ్యక్తిలా గోల్డన్ టెంపుల్ ను సందర్శించడం అల్లుఅర్జున్ లోని సింప్లిసిటీ కి నిదర్శనం అని చెప్పాలి. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ‘హ్యాపీ బర్త్‌డే క్యూటీ’ సోషల్ మీడియా ద్వారా భార్యకు బర్త్‌డే విషెస్ చెప్పాడు బన్ని. స్నేహారెడ్డి కెక్ కట్ చేస్తున్న ఫోటోని తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘హ్యాపీ బర్త్‌డే క్యూటీ’అని పోస్ట్ చేశాడు. అల్లు అర్జున్, స్నేహారెడ్డిలది ప్రేమ వివాహం. 2011 మార్చ్ లో వీరి పెళ్లి జరిగింది. 2014లో అబ్బాయి అయాన్, 2016లో అమ్మాయి అర్హ జన్మించారు. Happy Birthday Cutie 💖 pic.twitter.com/LL5nEaOmjg — Allu Arjun (@alluarjun) September 29, 2022 -
గోల్డెన్ టెంపుల్లో ఫ్యామిలీతో అల్లు అర్జున్ (ఫొటోలు)
-
బంజారాహిల్స్ లోని హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ లో కృష్ణాష్టమికి ఏర్పాట్లు
-
గోల్డెన్ టెంపుల్లో 'ఆర్ఆర్ఆర్' త్రయం.. ప్రత్యేక పూజలు
Rajamouli Ram Charan Jr Ntr Visit Amritsar Golden Temple For RRR: ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న సినిమా పేరు ఆర్ఆర్ఆర్. ఈ మూవీ కోసం అశేష ప్రేక్షక జనం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. ఎన్నో వాయిదాల అనంతరం ఎట్టకేలకు మార్చి 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ సయమం దగ్గరపడటంతో సినిమా ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచింది జక్కన్న టీం. మార్చి 19న కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో గ్రాండ్‌గా ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు మేకర్స్. మార్చి 20న గుజరాత్‌లోని బరోడా, ఢిల్లీలో ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టింది. తాజాగా సోమవారం (మార్చి 21) పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పర్యటించింది ఈ చిత్రబృందం. అమృత్‌సర్‌లో పర్యటించిన ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ అక్కడి గోల్డెన్ టెంపుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించింది. ఆర్ఆర్ఆర్ సినిమా హిట్ అవ్వాలని డైరెక్టర్ రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కోరుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆర్ఆర్ఆర్ చిత్రం బృందం ప్రకటించింది. కాగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ మూవీలో కొమురం భీంగా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతరామారాజుగా రామ్ చరణ్ నటించారు. తారక్ సరసన ఒలివియా మోరీస్, చెర్రీకి జోడిగా అలియా భట్ కనువిందు చేయనున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించాడు. The tRRRio visited the divine Golden Temple in Amritsar to seek blessings for our #RRRMovie#RRRTakeOver #RRROnMarch25th pic.twitter.com/LfZcbHnOLM — RRR Movie (@RRRMovie) March 21, 2022 -
రాహుల్‌కు.. హర్సిమ్రత్ కౌర్ బాదల్ చురకలు.. అలాంటి ప్రచారాలు మానుకోవాలి
చండీగఢ్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మాజీ కేంద్ర మంత్రి, శిరోమణి అకాలీదళ్ పార్టీ నాయకురాలు హర్ సిమ్రత్ కౌర్ బాదల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె ట్విటర్ వేదికగా మండిపడ్డారు. కాగా, రాహుల్ గాంధీ గత బుధవారం పంజాబ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అమృత్ సర్‌లోని స్వర్ణ దేవాలయంను సందర్శించారు. ఈ నేపథ్యంలో రాహుల్ తన జేబులో నుంచి చోరీ జరిగినట్లు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ ఆరోపణలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దీనిపై హర్సిమ్రాత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాహుల్ గాంధీ.. ఒక జెడ్ క్యాటగిరి భద్రతను కల్గిఉన్నారని.. ఆయనతోపాటు పంజాబ్ సీఎం చన్నీ, డిప్యూటి సీఎం సుఖ్ జీందర్ సింగ్ రంధావా, ఓపీ సోనిలుకూడా ఉన్నారన్నారు. ఇలాంటి చోట చోరీ జరగటం ఏంటని ప్రశ్నించారు. పవిత్రమైన ప్రదేశానికి చెడ్డపేరు తెచ్చేల వ్యాఖ్యలు చేయకూడదని హితవు పలికారు. భక్తుల మనోభావాలు దెబ్బతీనేలా ప్రవర్తించకూడదన్నారు. అసత్య ప్రచారాలు మానుకోవాలని రాహుల్‌కు చురకలంటించారు. అయితే, రాహుల్ ఆరోపణలపై.. పూర్తి వివరాలను వెల్లడించలేదని ఎంపీ హర్సిమ్రాత్ కౌర్‌బాదల్ అన్నారు. కాగా, రాహుల్ గాంధీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. బుధవారం రోజు జలంధర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నవిషయం తెలిసిందే. హర్ సిమ్రాత్ వ్యాఖ్యలపై.. కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా ఆమె పోస్ట్‌కు రీట్వీట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. తప్పుడు వార్తలను ప్రచారం చేయడం అపచారమని అన్నారు. రాజకీయ విభేదాలకు అతీతంగా బాధ్యతతో, పరిపక్వతతో ప్రదర్శించాలని తెలిపారు. గతంలో నరేంద్రమోదీ తీసుకువచ్చిన చట్టాలు.. రైతుల జేబులు కొట్టడం లాంటివేనని అన్నారు. Who picked @RahulGandhi's pocket at Sri Harmandir Sahib?@CHARANJITCHANNI? @sherryontopp? or @Sukhjinder_INC? These were the only 3 persons allowed by Z-security to get near him. Or is it just one more attempt to bring bad name to our holiest shrine, after the 'be-adbi' incidents? — Harsimrat Kaur Badal (@HarsimratBadal_) January 29, 2022 చదవండి: ఒక వైపు నామినేషన్లు.. మరోవైపు రాజీనామాలు -
ఆ నిందితులను బహిరంగంగా ఉరితీయాలి: నవజ్యోత్ సింగ్ సిద్ధూ
చంఢీఘడ్: పంజాబ్‌లోని స్వర్ణదేవాలయం, కపుర్త ఘటనలకు సంబంధించిన కుట్రదారులను బహిరంగంగా ఉరితీయాలని పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ డిమాండ్ చేశారు. ఆయన మాలేర్‌కోట్లలో జరిగిన సమావేశంలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొంత మంది కావాలనే మత విద్వేశాలు రెచ్చగొట్టేలా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల విశ్వాసాలను, మనోభావాలను దెబ్బతీసేలా కుట్రలతో.. పంజాబ్‌లో అశాంతిని సృష్టిస్తున్నారన్నారు. ఇప్పటికే స్వర్ణదేవాలయం ఘటనపై సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. నిన్న సీఎం చన్నీ(డిసెంబరు 19)న స్వర్ణదేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. వరుస ఘటనలతో ఆయా ప్రార్థనా మందిరాల వద్ద పోలీసులు భద్రతను పెంచాయి. ప్రజలు సంయమనం పాటించాలని సీఎం కోరారు. కాగా, స్వర్ణదేవాలయంలోని నిశిద్ధ ప్రాంతం, కపుర్త జిల్లా నిజాంపూర్ లోని గురుద్వారా పైకెక్కి పవిత్ర జెండా (నిషాన్ సాహిబ్)ను తొలగించడానికి ప్రయత్నించిన వ్యక్తులు స్థానికుల మూకదాడిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలను ఇప్పటికే పలు రాజకీయపార్టీలు ఖండించాయి. ఈ ఘటనపై ఇప్పటికే సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. చదవండి: 'పార్టీ కోసం నా జీవితం అర్పించా.. కాషాయం విడిచేది లేదు' -
సిక్కుల జెండా అపవిత్రానికి యత్నం
కపుర్తలా/అమృత్సర్/న్యూఢిల్లీ: అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలోని నిషిద్ధ ప్రాంతాన్ని అపవిత్రం చేసి, మూకదాడిలో ఒక వ్యక్తి హతమైన ఘటన జరిగి 24 గంటలైనా గడవకమునుపే పంజాబ్‌లో మరోచోట అలాంటి పరిణామమే చోటుచేసుకుంది. తాజా ఘటనకు కపుర్తలా వేదికైంది. అసెంబ్లీ ఎన్నికల వేళ పంజాబ్‌లో చోటుచేసుకుంటున్న ఈ ఘటనలపై ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) ఆందోళన వ్యక్తం చేసింది. కపుర్తలా జిల్లా నిజాంపూర్‌లోని గురుద్వారా వద్దకు ఆదివారం ఉదయం ఒక గుర్తు తెలియని వ్యక్తి చేరుకున్నాడు. గురుద్వారా పైకెక్కి అక్కడున్న పవిత్ర జెండా(నిషాన్ సాహిబ్)ను తొలగించేందుకు యత్నించాడు. గమనించిన గ్రామస్తులు అతడిని వెంటాడి పట్టుకుని తీవ్రంగా కొట్టడంతో మృతి చెందాడని పోలీసులు చెప్పారు. కపుర్తలా పోలీసులు ఈ ఘటనపై స్పందిస్తూ.. గురుద్వారా పైనున్న జెండాను తొలగించేందుకు అగంతకుడు ప్రయత్నించాడని చెప్పారు. ఏవిధమైన అపవిత్రత చోటుచేసుకోలేదని స్పష్టం చేశారు. స్వర్ణదేవాలయంలో ఘటనపై సిట్ స్వర్ణదేవాలయంలో శనివారం జరిగిన ఘటనపై సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)ను ఏర్పాటు చేసినట్లు పంజాబ్ ఉపముఖ్యమంత్రి, హోం మంత్రి సుఖ్జీందర్ సింగ్ రణ్‌ధావా వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారన్నారు. సిట్ నివేదిక రెండు రోజుల్లో అందుతుందని చెప్పారు. శనివారం నాటి ఘటనపై ఆయన మాట్లాడుతూ.. మూకదాడిలో హతమైన వ్యక్తి ఉదయం 11 గంటల సమయంలో ఆలయంలోకి ప్రవేశించినట్లు సీసీ ఫుటేజీని బట్టి తేలిందన్నారు. కానీ, అతడెవరో గుర్తించాల్సి ఉందన్నారు. అతడి లక్ష్యం ఏమిటి? ఆలయంలోకి ఏ మా ర్గంగుండా ప్రవేశించాడు? వెంట వేరెవరైనా ఉన్నా రా? అనే విషయాలపై క్షుణ్నంగా దర్యాప్తు జరుపు తామని చెప్పారు. అతడి వద్ద సెల్‌ఫోన్, పర్స్, ఐ డెంటిటీ కార్డువంటివి ఏవీ లేదని తెలిపారు. ఘట న నేపథ్యంలో రాష్ట్రంలోని గురుద్వారాలు, దేవాలయాలు, చర్చిలు, మసీదుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. ఇలా ఉండగా, ఆదివా రం సాయంత్రం సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్ని స్వర్ణదేవాలయాన్ని సందర్శించి, ప్రార్థనలు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కొన్ని స్వార్థ శక్తులు ఈ ఘటనకు కుట్ర చేసి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. అశాంతిని సృష్టించేందుకు కుట్ర.. స్వర్ణదేవాలయాన్ని అపవిత్రం చేసేందుకు జరిగిన ప్రయత్నాన్ని ఆర్ఎస్ఎస్ ఖండించింది. సమాజంలో అశాంతిని ప్రేరేపించేందుకు జరిగిన కుట్రగా పేర్కొంది. ఇలాంటి ఘటనలకు ప్రేరేపించిన వారిని కఠినంగా శిక్షించాలని ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోసబలే అన్నారు. -
స్వర్ణ దేవాలయంలో కలకలం
అమృత్సర్: అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని అపవిత్రం చేసేందుకు యత్నించిన ఓ వ్యక్తిని కొందరు కొట్టిచంపారు. శనివారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సుమారు 30 ఏళ్లున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆలయంలోపలున్న బంగారు గ్రిల్స్‌పై నుంచి దూకి నిషిద్ధ పూజా మందిరంలోకి ప్రవేశించాడు. అక్కడున్న కత్తిని పట్టుకుని, గురుగ్రంథ్ సాహిబ్‌ను పఠిస్తున్న పూజారి వైపుగా వెళ్లాడు. ప్రమాదాన్ని పసిగట్టిన శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ(ఎస్జీపీసీ) టాస్క్‌ఫోర్స్ సభ్యులు అతడిని పట్టుకుని ఎస్జీపీసీ కార్యాలయానికి తీసుకెళ్లారు. విషయం తెలిసి ఆగ్రహంతో అక్కడికి చేరుకున్న కొందరు ఆ అగంతకుడిని పట్టుకుని తీవ్రంగా కొట్టడంతో మరణించాడు. మృతుని వివరాలు, ఇంకెవరైనా అతడితోపాటు ఉన్నారా? తదితర విషయాలపై సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ భందాల్ చెప్పారు. -
గోల్డెన్ టెంపుల్ గురించి ఈ విషయాలు తెలుసా?
పంజాబ్ రాష్ట్రం, అమృత్సర్ నగరం. ప్రఖ్యాత స్వర్ణదేవాలయం, బయట రాష్ట్రాల వాళ్లకు ‘అమృత్సర్ బంగారు దేవాలయం’గానే గుర్తింపు. ఆ బంగారు ఆలయం పేరు హర్మందిర్ సాహిబ్. నిజానికి హరిమందిర్. వాడుకలో హర్మందిర్ అయింది. దర్బార్ సాహిబ్ అని కూడా అంటారు. హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు అనే అర్థాలు కావు. ‘హరి’ అంటే దేవుడు అనే అర్థంలో పెట్టిన పేరు. ఈ ఆలయం సరస్సు మధ్య ఉంటుంది. ఆ సరస్సు పేరు ‘అమృత సర’. అమృతంతో నిండిన సరస్సు అని అర్థం. ఆ ప్రదేశానికి ఆ పేరు కూడా ఈ సరస్సు పేరుతోనే వచ్చింది. ఇది ఆలయం కోసం తవ్విన సరస్సు. బంగారంటి పేరు మనకు అమృతసర్ గోల్డెన్ టెంపుల్ అనగానే గుర్తు వచ్చే సంఘటన ఆపరేషన్ బ్లూ స్టార్. ఆ తర్వాత ఇందిరా గాంధీ దారుణ హత్య. ఆ తర్వాత అల్లర్లు, ఖలిస్థాన్ ఉద్యమం. ఈ ప్రభావం మన దగ్గర ఒక తరాన్ని ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇంకా ముందుకు వెళ్తే... ఈ ఆలయ నిర్మాణం, దాడులకు గురవడం అనేది చర్విత చరణంగా సాగింది. ఎన్ని దాడులు జరిగినా మొక్కవోని దీక్షతో పునర్నిర్మించుకోవడంలో సిక్కుల సంకల్పబలం అర్థమవుతోంది. మొదట బంగారు తాపడం ఉండేది కాదు. మహారాజా రంజిత్ సింగ్ 19వ శతాబ్దంలో సిక్కు సామ్రాజ్యాన్ని స్థాపించిన తరవాత ఈ మందిరాన్ని మరోసారి పునర్నిర్మించాడు. అప్పుడు బంగారు తాపడం చేయించాడు. అప్పటి నుంచి ఆలయం స్వర్ణదేవాలయంగా గుర్తింపులోకి వచ్చింది. అప్పటి వరకు వాడుకలో ఉన్న పేర్లన్నీ మరుగున పడిపోయాయి. ఈ ఆలయం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో నామినేట్ అయి ఉంది. అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. గుడి ముందు... ఊరు తర్వాత సాధారణంగా ఊరు విస్తరించిన తర్వాత గుడి వెలుస్తుంది. ఊరందరి కలయిక కోసం, సామూహిక కార్యక్రమాల నిర్వహణ కోసం విశాలమైన గుడి ప్రాంగణం ఉపకరిస్తుంటుంది. ఇక్కడ మాత్రం ముందు మందిరాన్ని కట్టారు. మందిరం నిర్వహణకు అవసరమైన ఇతర నిర్మాణాలను కొనసాగించారు. అందుకవసరమైన పని వాళ్లు నెలల పాటు నివసించాల్సి వచ్చింది. వాళ్ల కోసం ఇళ్లు కట్టారు. మనుషుల జీవికకు అవసరమైన వస్తువులన్నీ ఉన్న చోట దొరకాలి. అందుకోసం వ్యాపారులను ఆహ్వానించారు. అలా ఊరయింది. సిక్కుల ఆరాధ్యమందిరం. ఈ ఒక్క ఆలయాన్ని సందర్శించడం వల్ల 68 ఆలయాలను దర్శించిన ఫలితం వస్తుందని చెబుతారు. ఇక్కడ సిక్కులు నిర్వహించే భోజనశాలలో సర్వమానవాళికీ అనుమతి ఉంటుంది. శాకాహార భోజనం వండి పెడతారు. రోజుకు లక్షమంది వరకు ఇక్కడ భోజనం చేస్తారు. వందేళ్ల వంటశాల ధాబా పేరు కేసర్ దా ధాబా. గోల్డెన్ టెంపుల్‌కి కిలోమీటరు దూరంలో ఉంటుంది. ఇది వందేళ్లు దాటిన వంటశాల. జాతీయ నాయకులు లాలా లజపతి రాయ్, జవహర్లాల్ నెహ్రూ ఆ తర్వాత ఇందిరా గాంధీ కూడా ఈ ధాబాలో నోరూరించే లాచ్చా పరాఠా, దాల్ మఖానీ కోసం లొట్టలు వేసేవాళ్లు. అయితే ఈ ధాబా వందేళ్ల నుంచి ఇక్కడ లేదు. లాలా కేసర్ మాల్, అతడి భార్య పార్వతి 1916లో పాకిస్తాన్‌లోని షేక్‌పురాలో మొదలుపెట్టారు. దేశవిభజన సమయంలో ఆ దంపతులు ధాబాను అమృతసర్‌కు మార్చారు. అప్పట్లో లాచ్చా రోటీ– దాల్ మఖానీ మాత్రమే వండేవాళ్లు. ఇప్పుడు వేడిగా కరకరలాడే హాట్ క్రిస్ప్ పరాఠా, మీగడ లస్సీ, పంజాబీ థాలీ, ఫిర్నీ కూడా వండుతున్నారు. ఇప్పుడు కాని మీరు కాని స్వర్ణదేవాలయాన్ని కాని చూడడానికి వెళ్లినట్లయితే... అప్పుడు ఈ ధాబాలో పంజాబీ వంటకాలను రుచి చూడడం మర్చిపోవద్దు. రోజంతా వండుతూనే ఉంటారు పంజాబీ వంటకాలను రాగి పాత్రలో ఎనిమిది నుంచి పన్నెండు గంటల సేపు ఉడికిస్తారు. రాజ్మా గింజలు, తాజా మీగడ, పెరుగుతో దాల్ మఖానీ ఉడుకుతున్న పెద్ద గుండిగ ఒక పక్క. మరో పక్క ఒక పాత్రలో ఫిర్నీ, పెద్ద పెద్ద రాగి, ఇత్తడి పాత్రలు కళ్ల ఎదురుగానే ఉంటాయి. రోజంతా తక్కువ మంట మీద వంటలు తాజాదనం కోల్పోకుండా వేడి మీద ఉంటాయి. -
గోల్డెన్ టెంపుల్‌కు విదేశీ నిధులు: అమిత్‌షా
సాక్షి, న్యూఢిల్లీ: అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌కు విదేశీ నిధులను అనుమతించడంపై హోం మంత్రి అమిత్‌షా స్పందిచారు. విదేశీ సహకార (రెగ్యులేషన్) చట్టం, 2010పై ఈ రోజు తీసుకున్న నిర్ణయం మార్గదర్శకంగా నిలుస్తుందని అమిత్‌షా అన్నారు. ఇది సిక్కు సమాజ అత్యుత్తమ సేవా స్ఫూర్తిని మరోసారి తెలియజేస్తుంది’ అని తెలిపారు. ‘శ్రీ హర్మందిర్ సాహిబ్ వద్ద విదేశీ సహకారం (నియంత్రణ) చట్టం, 2010పై ఒక మార్గదర్శకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇది మన సిక్కు సోదరీమణుల అత్యుత్తమ సేవా స్ఫూర్తిని మరోసారి ప్రదర్శిస్తుంది’ అని అమిత్ షా ట్వీట్ చేశారు. ‘శ్రీ దర్బార్ సాహిబ్ ఆశీర్వాదం మనకు బలాన్ని ఇస్తుంది. దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా సంగత్ సేవ చేయలేకపోయింది. శ్రీ హర్ మందిర్ సాహిబ్‌కు ఎఫ్సీఆర్ఏను అనుమతిస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా సంగత్, శ్రీ దర్బార్ సాహిబ్ల సేవ బంధాన్ని మరింత పటిష్టం చేసిన క్షణం’ అని అమిత్‌షా తన క్యాప్షన్‌లో జోడించారు. ਸੇਵਕ ਕਉ ਸੇਵਾ ਬਨਿ ਆਈ ॥ PM @narendramodi ji is blessed that Wahe Guru ji has taken Seva from him. The decision on FCRA at the Sri Harmandir Sahib is a pathbreaking one which will once again showcase the outstanding spirit of service of our Sikh sisters and brothers. — Amit Shah (@AmitShah) September 10, 2020 పంజాబ్‌లోని సచ్‌ఖండ్ శ్రీ హర్మాందిర్ సాహిబ్-దర్బార్ సాహిబ్‌కు 2010లో విదేశీ సహకారం (నియంత్రణ) చట్టం కింద ఐదేళ్ల వరకు చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్‌ను మంజూరు చేసినట్లు మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఇది సేవ కార్యక్రమాలు నిర్వహించడానికి విదేశీ నిధులును సేకరించడానికి వీలు కల్పిస్తుంది. కొంత మంది వ్యక్తులు లేదా సంఘాలు విదేశీ సహకారం పొందటానికి, విదేశీ నిధుల వినియోగాన్ని నియంత్రించడానికి విదేశీ సహకార చట్టాన్ని కేంద్రప్రభుత్వం రూపొందించింది. విదేశీ నిధులను పక్కదోవ పట్టించడానికి చెక్ పెట్టేందుకు 2010లో ఎఫ్సీఆర్ఏ చట్టాన్ని పార్లమెంట్ అమలు చేసింది. చదవండి: కరోనా: సర్వేలో షాకింగ్ నిజాలు -
గోల్డెన్ టెంపుల్‌ను దర్శించుకొన్న అమిర్
ప్రముఖ బాలీవుడ్ హీరో, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమిర్ ఖాన్ శనివారం అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించారు. లాల్‌సింగ్ చద్దా సినిమా షూటింగ్లో భాగంగా ప్రస్తుతం పంజాబ్‌లో ఉన్న ఈ సూపర్‌స్టార్ హర్మందిర్ సాహిబ్ గురుద్వారాలో ప్రార్థనలు జరిపారు. సిక్కుల పవిత్ర మందిరంలో అడుగీడే ముందు.. వారి ఆచారం ప్రకారం తలకు వస్త్రాన్ని చుట్టుకున్నారు. ప్రస్తుతం అమిర్ లుక్కు సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. లాల్‌సింగ్ చద్దా కోసం పంజాబీ సర్దార్‌గా ఆమిర్ ఖాన్ మారిపోయిన సంగతి తెలిసిందే. హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘ఫారెస్ట్ గంప్ సినిమాకు లాల్‌సింగ్ చద్దా హిందీ రీమేక్. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కరీనా కపూర్ కథానాయిక. Actor Aamir Khan offers prayers at Gurudwara Harmandir Sahib (Golden Temple) in Amritsar. He is in Punjab for shooting of his upcoming film #LalSinghChaddha pic.twitter.com/jyZMW6LzWQ — ANI (@ANI) November 30, 2019 View this post on Instagram Aamir Khan Offers Prayers At Golden Temple In Amritsar. . . #aamirkhan #goldentemple A post shared by Instant Bollywood (@instantbollywood) on Nov 30, 2019 at 12:33am PST -
సవ్యంగా సాగిపోవాలి
తన కొత్త సినిమా ప్రయాణం ఏ ఆటంకం లేకుండా సవ్యంగా సాగిపోవాలని ప్రార్థిస్తున్నారు హీరోయిన్ జాన్వీ కపూర్. కార్తీక్ ఆర్యన్, లక్ష్య, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా నటించనున్న హిందీ చిత్రం ‘దోస్తానా 2’. ఈ సినిమాకు కొల్లిన్ డి కున్హా దర్శకుడు. 2008లో అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహాం, ప్రియాంకా చోప్రా నటించిన ‘దోస్తానా’ చిత్రానికి ఇది సీక్వెల్. ఈ సినిమా చిత్రీకరణ పంజాబ్‌లో ప్రారంభం కానుంది. చిత్రీకరణకు ముందు కాస్త సమయం దొరకడంతో అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌ను దర్శించుకున్నారు జాన్వీ కపూర్. ‘దోస్తానా 2’ చిత్రాన్ని బాలీవుడ్ బడా దర్శక–నిర్మాత కరణ్‌జోహార్ నిర్మిస్తారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
ఆధ్యాత్మికం.. అక్షయం.. అమృతం
ఆలయాలు కేవలం ఆధ్యాత్మికతకు మాత్రమే పరిమితం కావని, సాటిమానవుడికి చేసే అనేకమైన సేవల ద్వారా కూడా భగవంతుడికి చేరువ కావచ్చునని నిరూపిస్తోంది హరేకృష్ణ ఉద్యమం. అందుకు నిదర్శనంగా నిలుస్తుంది తెలుగు రాష్ట్రాల్లోని మొట్టమొదటి స్వర్ణదేవాలయం హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌లో గల∙స్వయంభూ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం. రోడ్డు నెంబర్ 12లో గల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి విగ్రహం స్వయంభువుగా వెలసిందని ప్రతీతి. నిజాం కాలంలో అక్కన్న, మాదన్నలు ఇక్కడకు వచ్చి పూజలు చేసేవారని స్థానికులు చెబుతారు. శివుడు ఇక్కడ క్షేత్రపాలకుడిగా ఉన్నాడు. అందుకే లక్ష్మీనరసింహుడి విగ్రహానికి ఎదురుగా శివుడి విగ్రహం ఉంటుంది. శివుడు తపస్సు చేయగా శ్రీ లక్ష్మి నరసింహస్వామి శివుడి శిరస్సుపై శంఖం ఉంచి దీవించాడట. అందుకే ఇక్కడి శివలింగంపై శంఖం ఉంటుంది కనుక పాంచజన్యేశ్వరుడిగా పేరు వచ్చింది. స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వెలిసిన ప్రదేశంలో అనేక అద్భుతాలు. ఆలయ విశిష్టత స్వయంభువనూ శ్రీ లక్ష్మి నరసింహస్వామి, పాంచజన్యేశ్వర స్వామి(క్షేత్ర పాలకుడు), రాధాగోవింద, జప ఆంజనేయస్వామి, గరుడ, పురాతన నారాయణ శాలగ్రామం (జల గర్భంలో ఉండే శిల) ఈ క్షేత్రంలో కొలువుదీరారు. మొత్తం 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ దేవాలయ ప్రాంగణంలో శ్రీవారి నందనవనం, జలపాతం, ఇక్కడికి వచ్చే భక్తులకు కనువిందు చేస్తూ, సందర్శకులకు భూతల వైకుంఠంలో ఉన్నామా అన్నంత అనుభూతి కలిగిస్తాయని ఆలయ అధ్యక్షులు సత్యగౌర చంద్రదాస తెలిపారు. నేపాల్ దేశంలోని ముక్తినాథ్ ఆలయ సమీపంలోగల గండకీ నదిలో లభించిన సాలగ్రామ శిల శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి గర్భాలయంలోనే అరుదైన ‘జలగర్భ నారాయణ సాలగ్రామ శిల’ గా భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తుంది. ప్రపంచంలోగల అతిపెద్ద సాలగ్రామ శిలల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఇక్కడ హనుమంతుడి విగ్రహానికి నాలుగు చేతులుంటాయి. రెండు చేతుల్లో శంఖచక్రాలు, మూడో చేతిలో జపమాల ఉంటుంది. నాల్గవ చేతిలో అక్షమాల ఉంటుంది. ఇక్కడ శ్రీ లక్ష్మీనరసింహుడిని చూసుకుంటూ హనుమంతుడు అపురూపంగా కనిపిస్తాడు. శ్రీచతుర్భుజ జప ఆంజనేయస్వామిని భక్తులు ముందు దర్శించుకుంటారు. ఇక్కడ భక్తులు మంత్ర పీఠంలో జపం చేసి ఆలయంలోని శ్రీ రాధా గోవిందుల అర్చామూర్తుల సుందరాకృతులను మనస్సునిండా నింపుకుని హరేకృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ తన్మయత్వం పొందుతారు. తర్వాత అనంతశేషుడిపై నిల్చుని ఉన్న లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు. అనంతరం క్షేత్రపాలకుడిగా ఉన్న పాంచజన్యేశ్వరుడని దర్శించుకుంటారు. హరేకృష్ణ ఉద్యమం చేస్తున్న ఆధ్యాత్మిక, సమాజ సేవ కార్యక్రమాలలో కొన్ని... దేవాలయానికి 10 మైళ్లు లోపు ఎవరూ ఆకలితో ఉండకూడదన్న హరేకృష్ణ ఉద్యమం వ్యవస్థాపకాచార్యులు శ్రీ శ్రీ ప్రభుపాదులవారి ఆశయానికి అనుగుణంగా సంస్థ తమ ప్రణాళికలను రూపొందించింది. విద్యార్థులు ఆకలి వల్ల చదువులకు దూరం కాకూడదన్న లక్ష్యంతో సంస్ధ ఏర్పాటు చేసిన అక్షయపాత్ర తెలంగాణలో అంకురార్పణకు ఈ ఆలయమే కేంద్రస్ధానం. మరిన్ని వివరాలకు 9396956984ను సంప్రదించవచ్చునని హరేకృష్ణ ఉద్యమం తెలంగాణ అధ్యక్షులు శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస తెలిపారు. హరేకృష్ణ ఉద్యమం హైదరాబాద్ ఆధ్వర్యంలో యవతకి స్వశక్తికరణ సదస్సులు నిర్వహించి, ప్రతి ఆదివారం భగవద్గీత ద్వారా సమాజ విలువలతోపాటు వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించే కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ఈ కార్యక్రమం యువతకి ప్రస్తుత ప్రపంచం వాస్తవికతలకు వేద జ్ఞానాన్ని ఎలా అన్వయించాలో బోధిస్తుంది. అలాగే రోజువారీ జీవితంలో అనుభవించే కఠినమైన సమస్యలకు పరిష్కారాలు, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, చెడు అలవాట్లను ఎలా వదిలించుకోవాలి, జీవితంలో కుంగుబాటులను అధిగమించి, ఆత్మవిశ్వాసాలను అధిగమించటం, ఇంకా సమాజంలో ఎలా కొనసాగించాలో, ఎలా పర్యవేక్షించాలంటే ఎన్నో విషయాలకు వేదికగా మారడం ముదావహం. లౌకిక విద్యాసంస్థలు ఈ ప్రకృతిని మన ఇంద్రియ భోగాల కోసం ఎలా ఉపయోగించుకోగలమో నేర్పుతాయి. కాని మనిషి ఎదుర్కొనే ఒత్తిడి, అసంతృప్తి, కుంగుబాటు, ఆవేదనలు, జయాపజయాలు, కీర్తి, అప్రతిష్టలు మొదలైన ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొనగలమని బోధించేవి మాత్రం ఆధ్యాత్మిక కేంద్రాలే. మంచి సమాజం ఏర్పడాలంటే ఆధ్యాత్మిక బోధనలు అత్యంత ఆవశ్యకమని హరేకృష్ణ ఉద్యమ సంస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాదుల వారి నమ్మకం. మన దేవాలయాలన్నీ ఆధ్యాత్మిక విజ్ఞాన కేంద్రాలు కావాలన్నది ఆయన తపన. మనిషికి భగవంతుడికి మధ్య ఉన్న పరమార్థాన్ని తీర్చి, కలియుగ కల్మషాలన్నిటిని పారద్రోలడానికి దేవాలయాలు దోహదం చేస్తాయి. ఇందుకోసమే భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందడానికి అనువుగా ఈ స్వర్ణదేవాలయ నిర్మాణం జరిగింది. ఈ దేవాలయం నుంచే అనేక ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా చిన్నారులకు సంస్కృతీ వారసత్వ పండుగ, యువతకు జానపదం, గృహస్తులకు ‘గిఫ్ట్’, గ్రామాల్లో ఆధ్యాత్మిక బోధన, దేవాలయంలో ఏడాది మొత్తం జరిపించే పండుగలతోపాటు ప్రముఖ తీర్థయాత్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా సమాజ సేవలో భాగంగా అక్షయపాత్ర, అన్నపూర్ణ 5 రూ. భోజనం, భోజనామృతం, సద్దిమూట, అక్షయ అల్పాహారం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. -
వాటికి జీఎస్టీ రీఫండ్
సాక్షి,న్యూఢిల్లీ : జీఎస్టీ వసూళ్లపై దేవాలయాలు , ధార్మిక, మత సంస్థలకు కేంద్రం భారీ ఊరట కల్పించింది. ఆయా సంస్థల నుంచి వసూలు జీఎస్టీ పన్నులను తిరిగి వాటికి రీఫండ్ చేయనుంది. ఉచితంగా భోజనం అందించే ఆలయాలు, ధార్మిక సంస్థలకు ఈ చెల్లింపులను చేయనుంది. ఈ మేరకు సేవ భోజ్ యోజన పథకాన్ని రాష్ట్రపతి ఆమోదించారు. ఇందుకు వచ్చే రెండేళ్లలో రూ.350కోట్లను కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా చర్య మూలంగా తిరుమల తిరుపతి దేవస్థానం, స్వర్ణ దేవాలయ బోర్డులు గరిష్టంగా లబ్ది పొందనున్నాయి. ప్రజలకు ఉచిత భోజనం (లాంగర్) అందించే దాతృత్వ మత సంస్థల నుంచి ముడి ఆహార వస్తువుల కొనుగోలుపై వసూలు చేసిన సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (సీజీఎస్టీ) ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (ఐజిఎస్టీ) వాటాను తిరిగి చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ, శిరోమణి అకాలీ దళ్ల ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం ఎట్టకేలకు ఈ నిర్ణయం తీసుకుంది. జులై 1, 2017నుంచి జనవరి 31, 2018 వరకు ఈ మినహాయింపును వర్తింప చేయనున్నారు. -
‘ఖలిస్తాన్’కు మద్దతు ఇవ్వం
అమృత్సర్: భారత పర్యటనలో భాగంగా బుధవారం పంజాబ్ చేరుకున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. కుటుంబ సమేతంగా పంజాబీ సంప్రదాయ వస్త్రధారణతో స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం ట్రూడో, కెనడా రక్షణమంత్రి హర్జిత్ సజ్జన్లు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌తో ఓ హోటల్లో దాదాపు 40 నిమిషాల సేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కెనడాలో ఉంటూ పంజాబ్‌లోని యువతను విద్వేష నేరాలు, ఉగ్రవాదంవైపు రెచ్చగొడుతున్న 9 ఖలిస్తాన్ వేర్పాటువాదుల జాబితాను అమరీందర్ ట్రూడోకు అందజేశారు. వీరిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన్ను కోరారు. భారత్ సహా మరెక్కడా వేర్పాటువాద ఉద్యమాలకు కెనడా మద్దతివ్వబోదని ట్రూడో హామీ ఇచ్చినట్లు పంజాబ్ సీఎం మీడియా సలహాదారు రవీన్ థుక్రల్ తెలిపారు. క్యూబెక్‌లో వేర్పాటువాద ఉద్యమాన్ని తాను ఎదుర్కొన్నాననీ, ఇలాంటి హింసతో వచ్చే ప్రమాదాలపై తనకు పూర్తి అవగాహన ఉందని ఈ సమావేశంలో ట్రూడో చెప్పినట్లు వెల్లడించారు. ‘తమ ప్రభుత్వం ఎలాంటి వేర్పాటువాద ఉద్యమానికి మద్దతివ్వబోదని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో హామీ ఇవ్వడం నిజంగా ఆనందకరమైన విషయం. ట్రూడో వ్యాఖ్యలు భారత్‌లోని అందరికీ చాలా ఊరట కల్గించాయి. భవిష్యత్‌లో కూడా వేర్పాటువాద శక్తుల్ని ఏరివేయడానికి కెనడా ప్రభుత్వ సహకారాన్ని కోరుతున్నాం’ అని భేటీ అనంతరం అమరీందర్ ట్వీట్ చేశారు. అంతకుముందు శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుక్బీర్ సింగ్ బాదల్, శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు గోబింద్‌సింగ్ లంగోవాల్లు ట్రూడో కుటుంబానికి స్వర్ణ మందిరంలోకి ఘన స్వాగతం పలికారు. భార్య, ఇద్దరు చిన్నారులతో కలసి ఆలయంలో ప్రార్థనల్లో పాల్గొన్న ట్రూడో.. ఆ తర్వాత ఇక్కడి గురు రాందాస్‌జీ లంగర్లో కుటుంబ సభ్యులతో కలసి చపాతీలు తయారుచేశారు.