చండీగఢ్: సిక్కులు పఠించే పవిత్ర శ్లోకం గుర్బానీ ఇకపై ఉచితంగా ప్రఖ్యాత స్వర్ణదేవాలయం నుంచి ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన బ్రిటిష్‌కాలంనాటి చట్టానికి చేసిన సవరణ ప్రతిపాదనలకు పంజాబ్ రాష్ట్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. మంగళవారం శాసనసభలో ఈ సవరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదిస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సోమవారం ప్రకటించారు. ఇన్నాళ్లూ గుర్బానీని రాష్ట్రంలో శక్తివంతమైన శిరోమణి అకాలీదళ్ పార్టీకి చెందిన ప్రైవేట్ చానెల్ పీటీసీ ప్రసారం చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయంపై శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ(ఎస్‌జీపీసీ) మండిపడింది.
‘ఆ చట్టాన్ని పార్లమెంట్ చేసింది. దీనికి సవరణ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. సిక్కుల మత సంబంధ వ్యవహారాలకు ఆప్ ప్రభుత్వం రాజకీయ రంగు పులుముతోంది’ అని ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘చట్ట పరిధిపై సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. ఇది రాష్ట్ర పరిధిలోనిది’ అని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘ గుర్బానీ వినిపించేటపుడు అడ్వర్ట్‌టైజ్‌మెంట్లు ఉండకూడదనే ఉద్దేశంతో∙ప్రత్యక్షంగా ఉచితంగా ఆడియో, వీడియో ప్రసారాలు చేస్తున్నాం’ అని ప్రభుత్వం ప్రకటించింది. పీటీసీ ప్రైవేట్ చానెల్‌కు అధిపతి అయిన శిరోమణి అకాళీదళ్ ఆధిపత్యాన్ని తగ్గించేందుకే సర్కార్ ఈ నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment