
ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఈరోజు ఆఖరి ఆదివారం. దీంతో సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు లెక్కకుమించిన రీతిలో భక్తులు తరలివస్తున్నారు. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్ వెలుపల ఎంట్రీపాయింట్(Entry point)ల వద్ద లక్షకుపైగా వాహనాలు నిలిచివున్నట్లు సమాచారం.
శనివారం సాయంత్రం నుంచే కుంభమేళా ప్రాంతంలో అత్యంత రద్దీ నెలకొంది. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీనికితోడు రాబోయే మహాశివరాత్రికి అత్యధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్న దృష్ట్యా స్థానిక అధికారులు ముందస్తు ఏర్పాట్లుపై దృష్టి సారించారు. ప్రయాగ్‌రాజ్‌లోని ఏడు ఎంట్రీపాయింట్ల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం సంగమం మెయిన్ ఎంట్రీ పాయింట్‌లోని డాక్టర్ శ్యామా ప్రసాద్ సేతు(Dr. Shyama Prasad Sethu) చౌరస్తా వద్ద ఐదు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ నిలిచిపోయింది.
మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో రీవా పరిధిలోని చాక్‌ఘాట్‌లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాగ్‌రాజ్‌లోని ఏడు ఎంట్రీపాయింట్లను మూసివేయడంతో భక్తులు ఇక్కడి నుంచి 12 కిలోమీటర్ల దూరం నడిచి సంగమస్థలికి చేరుకుంటున్నారు. శనివారం నాటికి కుంభమేళాలో పవిత్రస్నానాలు చేసినవారి సంఖ్య 60 కోట్లు దాటింది. మహాకుంభమేళాకు ముందు సీఎం యోగి ఆదిత్యనాథ్ కుంభమేళాకు 45 కోట్లమంది వస్తారని అంచనా వేశారు. అయితే ఆ అంచనా ఇప్పటికే దాటిపోయింది. 73 దేశాల ప్రతినిధులు ప్రయాగ్‌రాజ్‌కు తరలివచ్చి పుణ్యస్నానాలు చేయడాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.
ఇది కూడా చదవండి: Mahakumbh: ముఖ్యమంత్రి యోగి మరో రికార్డు
Comments
Please login to add a commentAdd a comment