
ఆన్‌లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. ఇటీవల పాట్నాకు చెందిన ఒక మహిళ.. కాల్ చేసి వేలాది రూపాయలు పోగొట్టుకుంది. ఇంతకీ ఇదెలా జరిగిందో తెలుసుకుందాం.
పాట్నాలోని యారాపూర్ నివాసి అయిన ఒక మహిళ.. ఫిబ్రవరి 6న ఆన్‌లైన్‌లో మిక్సర్ మెషీన్‌ను ఆర్డర్ చేసింది. అయితే డెలివరీ ఫిబ్రవరి 12 నాటికి కావాల్సి ఉంది. కానీ డెలివరీ అవ్వలేదు. దీంతో ఆమె కంపెనీని సంప్రదించాలని నిర్ణయించుకుని.. సెర్చ్ ఇంజిన్‌లో కంపెనీ కాంటాక్ట్ నంబర్ కోసం వెతికి, ఒక నెంబర్ సంపాదించింది.
తెలియని నెంబర్‌కు కాల్ చేసి, స్కామర్ల ఉచ్చులో పడింది. ఇంకేముంది.. నిమిషాల్లో రూ. 52,000 పోగొట్టుకుంది. చేసేదేమీ లేక.. ఆ మహిళ పోలీసులను సంప్రదించింది. పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు.
ఆన్‌లైన్ మోసాల నుంచి తప్పించుకోవాలంటే?
➤కస్టమర్ కేర్ నెంబర్‌ల కోసం.. ఎల్లప్పుడూ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. మోసగాళ్ళు తరచుగా సెర్చ్ ఇంజన్లలో నకిలీ నంబర్‌లను జాబితా చేస్తారు. కాబట్టి ఆన్‌లైన్‌లో వెతకడం మానుకోవాలి.
➤తెలియని నెంబర్స్ నుంచి వచ్చిన కాల్స్ పట్ల జాగ్రత్త అవసరం. మోసగాళ్ళు ప్రజలను తొందరపాటు నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
➤ఎవరైనా మిమ్మల్ని చెల్లింపు వివరాలను లేదా లావాదేవీ వివరాలను చెప్పమని, లింక్‌పై క్లిక్ చేయమని అడిగితే.. అధికారిక మార్గాల ద్వారా కంపెనీతో ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి.
➤మోసపోతున్నట్లు అనుమానం వస్తే.. వెంటనే మీ బ్యాంకును సంప్రదించి సైబర్ పోలీసులకు నివేదించండి.
ఇదీ చదవండి: కొత్త ఐఫోన్ 16ఈ.. ఇలా చేస్తే రూ.4000 డిస్కౌంట్
Comments
Please login to add a commentAdd a comment