online order
-
ఐస్‌క్రీంలో ఆ ‘ముక్క’ చూసి డాక్టర్‌కు కక్కొచ్చినంత పనైంది!
Human Finger Inside Cone Ice Cream ఫింగర చిప్స్ గురించి విన్నాం కానీ, ఐస్ కీంలో ఫింగర్ గురించి విన్నారా?ఆన్లైన్ ఆర్డర్ చేసుకొని చల్ల..చల్లగా.. ఐస్‌క్రీం తింటూ ఉండగా, గట్టిగా ఏదో తగిలినట్టైంది. దీంతో పరిశీలనగా చూడగా తెగిన మనిషి వేలు ముక్క కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాకైన సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. చదువుతోంటేనే.. యాక్ అనిపిస్తోంది కదా.. ముంబైలో జరిగిన ఈ షాకింగ్ ఘటన వైరల్‌గా మారింది. ముంబైలోని మలాడ్ ప్రాంత నివాసి డా. ఓర్లెమ్ బ్రెండన్ సెర్రావ్ (27) బుధవారం ఆన్లైన్ డెలివరీ యాప్ ద్వారా బటర్‌స్కాచ్ కోన్ ఐస్‌క్రీమ్‌ను ఆర్డర్ చేశాడు. ఆర్డర్ అందుకొని ఉత్సాహంగా తింటున్న సమయంలో నాలుకకు ఏదో గట్టిగా తగలడంతో ఏంటా? అని పరికించి చూశారు. అంతే ఒక్కసారిగా వాంతి వచ్చినంత పనైంది. 2 సెంటీమీటర్ల పొడవు ఉన్న మనిషి వేలి ముక్కను చూసి దిగ్భాంతికి లోనయ్యారు. దీనిపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఐస్‌క్రీం కంపెనీపై కేసు నమోదు చేశారు. విచారణ నిమిత్తం ఐస్‌క్రీమ్‌లో లభించిన మానవ అవయవాన్ని పోలీసులు ఎఫ్ఎస్ఎల్ (ఫోరెన్సిక్)కు పంపినట్లు మలాడ్ పోలీసు అధికారులు తెలిపారు. This #Butterscotch ice cream was ordered online by a 27-year-old doctor in Mumbai, Orlem Brendan Serrao.He found a 2 cm piece of a human finger. Serrao had asked his sister to include the ice cream in her online grocery order. While enjoying the treat, he felt something… https://t.co/3uHXqorYIu pic.twitter.com/gbXFBqtH6U— Sneha Mordani (@snehamordani) June 13, 2024 తన అనుభవాన్ని బ్రెండన్ ఇలా షేర్ చేశారు. ‘ఉదయం నాసోదరి ఆన్లైన్ డెలివరీ యాప్ ద్వారా కిరాణా సామాగ్రిని ఆర్డర్ చేస్తోంది.. దీంతో నేను మూడు బటర్‌స్కాచ్ కోన్ ఐస్‌క్రీమ్‌లను జాబితాలో చేర్చమని చెప్పాను. డెలివరీ రాగానే ఐస్‌క్రీం కోను ఆస్వాదిస్తుండగా ఈ భయంకరమైన అనుభవం ఎదురైంది’ అంటూ తెలిపారు. అయితే నిజంగానే ఇది మనషి ఫింగర్ ముక్కా, లేక మరేదైనా అనేది విచారణలో తేలనుంది. మరోవైపు ఈ వ్యవహారంపై ఐస్ క్రీం తయారీదారు ఇంకా స్పందించలేదు. -
ఫుడ్ కోసం వెయిటింగ్.. కస్టమర్‌కు షాకిచ్చిన డెలివరీ బాయ్.. ఇంత లేజీగా ఉన్నావేంటి!
ఇంట్లో ఎన్ని వెరైటీ వంటకాలు ఉన్నప్పటికీ అప్పుడప్పుడు రెస్టారెంట్లలో పుడ్ టేస్ట్ చేస్తూ ఉంటాం. టెక్నాలజీ పుణమ్యా అని ఆన్లైన్ డెలివరీ యాప్‌లు రాకతో చేతిలో మొబైల్ ఉంటే చాలు నచ్చిన పుడ్ ఇంటి దగ్గరకే డోర్ డెలివరీ అవుతున్నాయి. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా.. ఇందులో మరో కోణం కూడా దాగుంది. వివిధ కారణాలతో డెలివరీ ఏజెంట్లు కస్టమర్లు ఆర్డర్ పెట్టిన ఆహారాన్ని అందివ్వడంతో విఫలమవుతున్నారు. అలా జరిగినప్పుడు, వారు తరచుగా సాకులు చెబుతారు. మరో విషయం ఏమిటంటే.. కొన్ని సందర్భాల్లో డెలివరీ ఏజెంట్లు కస్టమర్ల ఆహారాన్ని స్వయంగా తింటున్నారు కూడా. తాజాగా ఈ తరహా ఘటనే సోషల్‌మీడియాలో ఒకటి చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి తన పిల్లల కోసం ఆన్లైన్లో పుడ్ ఆర్డర్ పెట్టి ఎదురుచూస్తుంటాడు. డెలివరీ సమయం సమీపిస్తున్న ఆహారం రాకపోవడంతో డెలివరీ ఏజెంట్‌కి ఈ విషయమై మెసేజ్ చేస్తాడు. ఆ సంభాషణలో.. సారీ బ్రదర్ మీరు ఆర్డర్ పెట్టిన ఫుడ్‌ని నేనే తిన్నట్లు కస్టమర్‌కు మెసేజ్ చేస్తాడు. దీంతో రూల్స్ ఉల్లంఘించినందుకు ఉద్యోగం నుంచి తొలగిస్తారని ఏజెంట్‌కు కస్టమర్ మెసేజ్ చేశాడు. అందుకు ఏజెంట్ వెటకారంగా స్పందిస్తూ, "మీరు దానిని నిరూపించలేరు, మిత్రమా అంటూ బదులిచ్చాడు. డెలివరీ ఏజెంట్ తమ హౌసింగ్ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించలేదని నిరూపించడానికి తమ ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఉన్నట్లు పేర్కొంటాడు కస్టమర్. అయితే, ఏజెంట్ కస్టమర్‌ను ఫుడ్ కోసం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టావ్ ఇంత సోమరిగా ఉన్నావేంటి అని పిలవడంతో వీరి మధ్య సంభాషణ కాస్త సీరియస్‌గా మారింది. చివరిలో ఆ డెలివరీ ఏజెంట్ కస్టమర్ ఆర్డర్ చేసిన ఆహారం అద్భుతంగా ఉందని, అతను ఆర్డర్ చేసిన ఆహారాన్ని తిన్నానని నిర్ధారిస్తూ సంభాషణను ముగించాడు. ప్రస్తుతం ఈ చాట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీన్నిచూసిన నెటిజన్లు డెలివరీ ఏజెంట్ చేసిన పనికి మండిపడుతున్నారు. చదవండి: Video: ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించిన వరద బాధితురాలు -
ఆన్లైన్లో కండోమ్స్ ఆర్డర్.. అడ్రస్ మార్చడం మర్చిపోయాడు..
ఒక యువకుడు తెలిసి చేశాడో తెలియక చేశాడో గాని ఆన్లైన్లో కండోమ్స్ ఆర్డర్ చేశాడు. అది తానున్న చోటికి కాకుండా ఇంటికి చేరడంతో యువకుడి తల్లి షాక్ కు గురైంది. ఈ సంఘటనను ఆ యువకుడి సోదరి సోషల్ మీడియాలో పంచుకోగా నెటిజన్ల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. ఓ యువకుడు ఆన్లైన్ షాపింగుకు బాగా అలవాటు పడ్డాడో ఏమో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో కండోమ్స్ ఆర్డర్ చేశాడు. ఆర్డర్ అయితే బాగానే చేశాడు కానీ అడ్రస్ మార్చడం మర్చిపోయాడా ప్రబుద్ధుడు. దీంతో ఆ కండోమ్స్ పార్సిల్ కాస్తా తానున్న చోటికి కాకుండా తన ఇంటికి చేరింది. ఆ యువకుడి తల్లి తన కొడుకు ఎదో సర్ప్రైజ్ ప్లాన్ చేశాడనుకుందో ఏమో ఆతృతగా పార్సిల్ తెరిచింది. లోపల కండోమ్స్ చూసి పాపం ఆ తల్లి షాక్ కు గురైంది. ఈ సంఘటనను ఆ యువకుడి సోదరి ఎలెనా ట్విట్టర్లో పోస్ట్ చేసి.. అన్నయ్య పాపం అడ్రస్ మార్చడం మర్చిపోయినట్టున్నాడు.. అమ్మ ఈ పార్సిల్ రిసీవ్ చేసుకుందని రాసి కండోమ్స్ ఫోటోను షేర్ చేసింది.. Looks like my brother forgot to change the address because my mom just received his instamart order💀💀 pic.twitter.com/BmZbLyEAtr — elena (@elena4yo) July 4, 2023 ఈ పోస్ట్ కు అతి తక్కువ వ్యవధిలోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయి. చాలా మంది తర్వాత ఏం జరిగిందని ప్రశ్నించగా.. అమ్మకు దిమ్మతిరిగి తమ ఫ్యామిలీ గ్రూపు నుంచి అన్నయ్యని తొలగించిందని చెబుతూ వాట్సప్ గ్రూపులో తన సోదరుడిని తొలగించిన స్క్రీన్ షాట్ పోస్ట్ చేసింది. దీంతో ట్విట్టరంతా నవ్వులమయమైంది. pic.twitter.com/FGU8tUIyuV — elena (@elena4yo) July 4, 2023 ఇవ్వాళ రేపు ఏమి కొనాలన్నా అంతా ఆన్లైన్లో నడుస్తోంది మరి. మొబైల్ ఆన్ చేసి మీట నొక్కితే చాలు కాళ్ళకు భారం తగ్గి అన్నీ కళ్ల ముందుకు వచ్చి వాలుతున్నాయి. అలాగని అన్నిటినీ ఆన్లైన్లో ఆర్డర్ చేయకుండా కొన్నిటిని వెళ్లి కొనుక్కోవడమే మంచిదని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇది కూడా చదవండి: బైక్ హెల్మెట్ ధరించి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్.. ఎందుకంటే.. -
ఆన్లైన్ ఆర్డర్లలో ఈ ఆర్డర్ వేరయా! రోజులు కాదు నాలుగేళ్లకు వచ్చి చేరింది
ఇప్పుడంతా ఆన్లైన్ మయమైంది. ఏం కావాలన్నా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేస్తున్నారు. ఎలాంటి కష్టం లేకుండా కావాల్సిన వస్తువులు ఇంటికి తెచ్చేసుకుంటున్నారు. ఐతే ఏదైనా వస్తువు ఆర్డర్ పెడితే.. మహా అయితే ఐదు నుంచి పది రోజుల్లో వచ్చేస్తుంది. అది కూడా ఆ వస్తువు వచ్చే ప్లేస్‌ని బట్టి కూడా డెలివరీ టైం అనేది ఉంటుంది. అంతేగాని సంవత్సరాలు పట్టదు. కానీ ఇక్కడొక వ్యక్తికి మాత్రం తాను ఆర్డర్ చేసిన వస్తువును అందుకోవడానికి రోజులు కాదు.. ఏకంగా నాలుగు సంవత్సరాలు పట్టింది. ఢిల్లీకి చెందిన నితిన్ అగర్వాల్ అనే వ్యక్తి 2019లో చైనా వెబ్సైట్ అలీబాబాకు చెందిన అలీ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ఆర్డర్ పెట్టాడు. ఐతే ఆ పార్శిల్ సరిగ్గా జూన్ 23, 2023కి అతని వద్దకు చేరుకుంది. అంటే ఆ పార్శిల్ చేరడానికే నాలుగేళ్లు పట్టింది. ప్రస్తుతం ఈ వెబ్‌సైట్‌ని ఇండియాలో బ్యాన్ చేశారు. కాగా, ఒక్కసారిగా సదరు వ్యక్తి నితిన్ అగర్వాల్ ఆ పార్శిల్ని చూసి షాక్ అయ్యాడట! పైగా ఆ పార్శిల్‌పై ఆర్డర్ చేసిన టైం డెలివరి అయ్యిన తేది రెండు కూడా ఉన్నాయి. దీంతో ఆ వ్యక్తి ట్విట్టర్లో నెటిజన్లతో ఈ విషయాన్ని పంచుకుంటూ.. ‘చివరి వరకు ఆశను వదులుకోకండి. ఆలస్యం కానిదే ఏ పని కాదు’ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో నెటిజన్లు మీరు చాలా లక్కీ అని ఒకరూ, తాను ఆర్డర్ చేసింది కూడా ఏదో ఒక రోజు ఇలానే తన వద్దకు వస్తుందన్న హోప్ వచ్చిందని మరొకరూ ట్వీట్ లు చేశారు. Never lose hope! So, I ordered this from Ali Express (now banned in India) back in 2019 and the parcel was delivered today. pic.twitter.com/xRa5JADonK — Tech Bharat (Nitin Agarwal) (@techbharatco) June 21, 2023 (చదవండి: స్నానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు..నీరు లేకుండా స్నానం చేయొచ్చు అని తెలుసా!) -
Swiggy: స్విగ్గీ నిర్వాకం.. వెజ్ బిర్యానీలో చికెన్ పీస్.. మండిపడ్డ కస్టమర్
స్విగ్గీలో వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసిన ఓ శాకాహారికి చేదు అనుభవం ఎదురైంది. పార్సిల్ ఓపెన్ చేసి తింటున్న ఆమెకు ఊహించని విధంగా బిర్యానీలో చికెన్ ముక్క కన్పించింది. దీంతో స్వచ్ఛమైన వెజిటేరియన్ అయిన ఆమె.. స్విగ్గీ నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బిర్యానీలో మాంసం ముక్క ఫొటో, ఆర్డర్ బిల్లు వంటి వివరాలను ట్విట్టర్ వేదికగా షేర్ చేసి మండిపడింది. ఈ కస్టమర్ పేరు నటాషా భరద్వాజ్. తన విశ్వాసాలకు విఘాతం కల్గించేలా చేసిన స్విగ్గీపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పులు ఎంతమాత్రము ఆమోదయోగ్యం కాదన్నారు. నిజమైన శాకాహారులు స్విగ్గీలో ఆర్డర్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి అని ఇతర కస్టమర్లకు సూచించారు. If you’re a strict vegetarian (like me) think twice before ordering from @Swiggy ! I ordered biriyani rice with aloo which is clearly MARKED AS VEGETARIAN on the platform and I found a piece of meat (could be chicken, mutton or anything!) in the rice. Such grave errors are… pic.twitter.com/h7K57CPML4 — Natasha Bhardwaj (@bhardwajnat) April 11, 2023 ఈ విషయంపై స్విగ్గీ ఎగ్జిక్యూటివ్స్‌కు ఫిర్యాదు చేస్తే వారికి అసలు బాధగా లేదని నటాషా అసహనం వ్యక్తం చేశారు. అది నాన్ వెజ్ రెస్టారెంట్ అని, అయినా స్విగ్గీలో వెజ్ రెస్టారెంట్‌గా ఎందుకు మార్క్ చేసుకున్నారో తెలియడం లేదని వారు బదులిచ్చారని చెప్పారు. ఈ మహిళ ట్వీట్‌కు స్విగ్గీ కూడా బదులిచ్చింది. మా రెస్టారెంట్లలో ఇలాంటి మిక్స్‌ప్‌లు జరుతాయని ఊహించలేదని, దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఆర్డర్ ఐడీ చెప్పాలని సూచించింది. దీంతో మహిళ ఆర్డర్ ఐడీని కూడా స్విగ్గీకి షేర్ చేసింది. చదవండి: దడ పుట్టిస్తున్న కరోనా.. 7 నెలల గరిష్టానికి కొత్త కేసులు.. మరో 7,830 మందికి పాజిటివ్.. -
వార్నీ.. రూ.650 టిప్ సరిపోలేదట! కస్టమర్‌కు షాకిచ్చిన డెలివరీ గర్ల్..
ఆన్లైన్ డెలివరీ యాప్‌లు రాకతో ఇంటి వద్దనే ఫుడ్‌ని తెప్పించుకోవడం ప్రజలకు అలవాటుగా మారింది. కరోనా నుంచి వీటికి జనాదరణ కూడా పెరిగిందనే చెప్పాలి. అయితే డెలివరీ బాయ్స్ కస్టమర్లకు ఫుడ్ డెలవరీ చేసే క్రమంలో పలు వింత ఘటనలు చోటు చేసుకోవడం చూస్తునే ఉన్నాం. తాజాగా ఓ డెలివరీ పార్టనర్ టిప్ సరిపోలేదని అసహనంతో కస్టమర్‌తో జరిపిన సంభాషణ వైరల్‌గా మారింది. ఆ టిప్ సరిపోలేదు.... ఇటీవల టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో చాలా పనుల కోసం బయటకు వెళ్లాల్సిన పని లేకుండా పోయింది. ఇక చేతిలో మొబైల్, అందులో ఇంటర్నెట్ సౌకర్యం ఉంటే చాలు నిమిషాల్లో కొన్ని సేవలు ఏదైన మన ఇంటి ముందుకు వచ్చి ప్రత్యక్షమవుతున్నాయి. ఫుడ్ సంబంధించి కూడా ఆన్లైన్ యాప్‌ల రాకతో మనం కోరుకున్న ఫుడ్ జస్ట్ ఒక క్లిక్‌తో వచ్చేస్తుంది. తాజాగా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేసిన ఓ కస్టమర్‌కు షాకిచ్చింది డెలివరీ పార్టనర్. అసలేం జరిగిందంటే.. డెలివరీ పార్ట్నర్ కస్టమర్ ఇంటి ముందుకు వచ్చి అతనితో మాట్లాడటం ప్రారంభించింది. ‘మీ ఫుడ్ ఆర్డర్ తీసుకువచ్చేందకు నేను పన్నెండున్నర మైళ్లు దూరం 40 నిమిషాల పాటు డ్రైవింగ్ చేసి వచ్చాను. అయితే మీరిచ్చిన టిప్ 8 డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.650) నేను సంతోషంగా లేనని’ ఆమె అతనికి చెబుతుంది. అయితే కస్టమర్ అదనంగా చెల్లించేందుకు నిరాకరిస్తాడు. దీంతో డెలివరీ పార్టనర్‌కు చిరెత్తుకురావడంతో ఫుడ్ ప్యాకెట్‌ను తీసుకొని కస్టమర్‌కు ఇవ్వకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయింది. డ్రైవర్‌కు, కస్టమర్‌కు మధ్య జరిగిన పరస్పర సంభాషణ ప్రస్తుతం ఆన్లైన్లో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆమె ప్రవర్తనను తప్పుబడుతూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: Guinness Record: 24 గంటల్లో 8,008 పుల్ అప్స్.. గిన్నిస్ రికార్డు బద్దలు.. -
ఆన్లైన్ ఆర్డర్.. బ్రెడ్ ప్యాకెట్లో ఎలుక ప్రత్యక్షం.. షాక్ తిన్న కస్టమర్!
ఒకప్పుడు ఇంట్లోకి ఏ సరుకులు కావాలన్నా కచ్చితంగా బయటకు వెళ్లాల్సిందే. కిరాణం షాప్‌లు, సూపర్ మార్కెట్ల వద్ద లైన్లో నిలబడి తీసుకొచ్చుకొనేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా కూరగాయలు, పప్పులు, ఉప్పులు, వండిన ఆహారం.. పర్నీచర్ ఇలా ఒక్కటేంటి అన్నీ ఆన్లైన్లోనే లభిస్తున్నాయి. చేతిలో ఒక్క ఫోన్ ఉంటే చాలు.. కోరుకున్న వస్తువులు నిమిషాల్లో మన ముందు వాలిపోతున్నాయి. ఫోన్లోని యాప్‌ల ద్వారా మనకు ఏం కావాలో క్లిక్ చేస్తే బయట ధరలకే వస్తువు డెలివరీ అయిపోతుంది. దీంతో ఎంతో సమయం, శ్రమ ఆదా అవుతోంది. అయితే ఆన్లైన్ సర్వీస్ అందుబాటులోకి వచ్చాక ప్రయోజనాలతోపాటు కొన్ని సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. ఆర్డర్లు మారిపోవడం, నాణ్యత లేని వస్తువులు రావడం లేదా పాడైపోవడం వంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఆర్డర్ చేసిన వాటిల్లో క్రిమి కీటకాలు వస్తుండటం ఆందోళన రేపుతోంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. నితిన్ అరోరా అనే వ్యక్తి బ్రెడ్ కోసం బ్లింకిట్‌లో ఆర్డర్ ఇవ్వగా అందులో ఎలుక కనిపించడంతో ఖంగుతిన్నాడు. ట్విటర్ వేదికగా తనకు ఎదురైన భయానక అనుభవాన్ని షేర్ చేశారు. ‘లెట్స్ బ్లింకిట్‌లో అత్యంత చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాను. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్డర్ చేసిన బ్రెడ్ ప్యాకెట్లో బతికున్న ఎలుక వచ్చింది. ఇది మనందరిని హెచ్చరించే అంశం. ఆర్డర్ చేసే ముందు గమనించుకోండి. వస్తువు డెలివరీ ఆలస్యమైనా పర్లేదు, కానీ, 10 నిముషాల్లో పార్సిల్ వస్తుందని ఇలాంటివి అంటగట్టడం దారుణం’.. అని వాపోయాడు. Most unpleasant experience with @letsblinkit , where alive rat was delivered inside the bread packet ordered on 1.2.23. This is alarming for all of us. If 10 minutes delivery has such baggage, @blinkitcares I would rather wait for a few hours than take such items.#blinkit #zomato pic.twitter.com/RHNOj6tswA — Nitin Arora (@NitinA14261863) February 3, 2023 అరోరా పోస్టులో ఎలుకతో కూడిన బ్రెడ్ ప్యాకెట్‌ను మాత్రమే చూపించకుండా బ్లింకిట్ కస్టమర్ సర్వీస్ స్క్రీన్‌షాట్‌ను కూడా పంచుకున్నారు. ఈ ఫోస్టు వైరల్ అవ్వడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదీ మరీ ఘోరమని, ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహిరస్తారంటూ తిట్టిపోస్తున్నారు. అయితే ఈ ఘటనపై కంపెనీ కామెంట్స్ విభాగంలో స్పందించింది. హాయ్ నితిన్! మీకు ఇలాంటి అసౌకర్యం కలగాలని తాము కోరుకోలేదని.. మీ రిజిస్టర్డ్ కాంటాక్ట్ నెంబర్ లేదా ఆర్డర్ ఐడీ పంపితే సమస్యను పరిష్కరిస్తామని బదులిచ్చింది. Hi Nitin, this is not the experience we wanted you to have. Please share your registered contact number or Order ID via DM for us to look into it. https://t.co/cmvbhHSmuW — Blinkitcares (@blinkitcares) February 3, 2023 -
చీర ఆర్డర్ చేస్తే చిరిగిన ప్యాంటొచ్చింది
పెనుగంచిప్రోలు(జగ్గయ్యపేట, ఎన్టీఆర్ జిల్లా): సోదరికి కానుక ఇద్దామని చీర ఆర్డర్ చేస్తే సగానికి చిరిగిన పాత ప్యాంటు డెలివరీ అయిన ఘటన పెనుగంచిప్రోలులో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యువకుడు పండుగకు తన సోదరికి చీర కొనిద్దామనుకున్నాడు. ఓ ఆన్లైన్ యాప్‌లో రూ.550 విలువ గల చీర బుక్ చేశాడు. శనివారం ఆర్డర్ అందింది. డెలి వరీ బాయ్‌కు డబ్బు చెల్లించి, కవర్‌ను తెరిచి చూడగా దానిలో చీరకు బదులు చిరిగిన పాత ప్యాంట్ అదీ ఒక కాలు వరకు మాత్రమే ఉండ టంతో అవాక్కయ్యారు. ఇదేమని డెలివరీ బాయ్‌ను ప్రశ్నించగా తమకేం తెలియదని, రిటన్ ఆప్షన్ ఉంటుంది చేసుకోమంటూ సలహా ఇచ్చాడు. జరిగిన దానికి తానేమీ చేయలేనని, ఆన్లైన్ వ్యాపారంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పిమరీ వెళ్లాడు. -
కొంపముంచిన డెలివరీ ఇన్స్ట్రక్షన్.. కేక్ చూసి షాక్ అయిన యువతి
స్విగ్గీ, జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసేవాళ్లు డెలివరీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు.. ఇందులో కొన్ని ఆర్డర్ తెచ్చే బాయ్‌కు సంబంధించి ఉంటే.. మరికొన్ని రెస్టారెంట్‌ను ఉద్దేశించి ఉంటాయి. ‘మసాలా తగ్గించండి’ లాంటివి. అయితే ఇవి ఒక్కోసారి తేడా కొడితే మనం ఆశ్చర్యపోవాల్సి ఉంటుంది. అలాంటి ఘటనలు తాజాగా మహారాష్ట్రలోని ముంబై, నాగపూర్‌లో చోటుచేసుకున్నాయి. ముంబైకి చెందిన వైష్ణవి ఇటీవల బర్త్‌డే కోసం ఒక కేక్ ఆర్డర్ ఇచ్చారు. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టారు. అందులో వచ్చేటప్పుడు రూ.500కి చిల్లర తీసుకురమ్మని బాయ్‌కు డెలివరీ ఇన్స్ట్రక్షన్ పెట్టారు. తీరా కేక్ ఇంటికొచ్చిన కేక్‌ను చూసి ఆమె షాకయ్యారు. హ్యాపీ బర్త్‌డేకి బదులు.. కేక్‌పై సదరు బేకర్ రూ.500కి చిల్లర తీసుకురా అని రాశాడు. దీన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్లు నవ్వు ఎమోజీలు పెడుతూ సరదా వ్యాఖ్యలు చేశారు. మరో ఘటనలో నాగ్‌పూర్‌కు చెందిన కపిల్ నగరంలోనే పేరొందిన బేకర్ నుంచి కేక్ ఆర్డర్ చేశారు. అందులో డెలివరీ ఇన్స్ట్రక్షన్ కింద.. ‘ఇందులో ఎగ్ ఉందన్న విషయాన్ని తెలియజేయండి’ అని పెట్టారు. ఆయన ఉద్దేశం డెలివరీ చేసినప్పుడు.. అది ఎగ్‌తో చేసిన కేక్ అని చెప్పడం కోసం ఈ బేకర్ డైరెక్టుగా కేక్ మీదే.. ఇది ఎగ్‌తో చేసినది అని రాశాడు. దాన్ని చూశాక నాకు నోట మాట రాలేదు అని కపిల్ తన అనుభవాన్ని ట్విట్టర్లో షేర్ చేసుకున్నారు. -
ఆన్లైన్లో అమెరికాకే ‘మత్తు’
సాక్షి, హైదరాబాద్: ఏవో మందులు, ఔషధాలు అమ్ముతామంటారు.. అవసరమైతే సైకోథెరపిక్ డ్రగ్స్‌నూ సరఫరా చేస్తామని గాలం వేస్తారు.. ఆన్లైన్లో ఆర్డర్లు, పేమెంట్లు తీసుకుంటారు.. ఫార్మా ఔషధాల ముసుగులో ఏకంగా అమెరికాకే డ్రగ్స్‌ను పార్శిల్ చేసి పంపిస్తారు.. ఇది ఎక్కడో కాదు.. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న డ్రగ్స్ రాకెట్ వ్యవహారం. ఇంటర్నెట్ అడ్డాగా కొనసాగుతున్న నిషేధిత డ్రగ్స్ రవాణా దందాను తాజాగా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఛేదించింది. హైదరాబాద్‌లోని దోమల్‌గూడ ప్రాంతానికి చెందిన కీలక సూత్రధారి ఆశిష్‌జైన్‌ను ఎన్సీబీ ఢిల్లీ బృందం తాజాగా అరెస్టు చేసింది. ఆశిష్‌జైన్ జేఆర్ ఇన్ఫినిటీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అమెరికాలోని కస్టమర్లకు సైకోథెరపిక్ డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్టుగా తేల్చింది. మూడు రోజుల పాటు ఆశిష్ కార్యాలయం, నివాసంలో సోదాలు చేసి.. కంప్యూటర్లు, ఇతర సామగ్రి, రూ.3.7 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎన్సీబీ (ఆపరేషన్స్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్‌కుమార్‌సింగ్ తెలిపారు. హైదరాబాద్ టు అమెరికా.. ఆశిష్ జైన్ డ్రగ్స్ దందా కోసం కొందరు ఉద్యోగులను నియమించుకున్నాడని.. వారితో అమెరికాలోని వినియోగదారులకు మెయిల్స్, మెసేజీలు, ఫోన్లు చేయించి ఫార్మా డ్రగ్‌తోపాటు సైకోథెరపిక్ డ్రగ్స్ ఆఫర్ చేస్తున్నాడని అధికారులు తెలిపారు. డ్రగ్స్ కావాలన్న వారి వివరాలు తీసుకుని.. బిట్‌కాయిన్, క్రెడిట్‌కార్డు, ఇతర ఆన్లైన్ మార్గాల ద్వారా డబ్బు చెల్లించాలని కోరేవాడని వివరించారు. డబ్బు చెల్లించిన కస్టమర్లకు హైదరాబాద్‌తోపాటు మరికొన్ని ప్రాంతాల నుంచి డ్రగ్స్ పార్సిల్ చేసి పంపించాడని తెలిపారు. వెయ్యికి పైగా షిప్‌మెంట్స్.. ఆశిష్‌జైన్ ఇప్పటివరకు వెయ్యికిపైగా డ్రగ్ పార్సిళ్లను అమెరికాలోని పలుచోట్లకు పంపినట్లు ఎన్సీబీ అధికారులు తెలిపారు. ఈ అంతర్జాతీయ డ్రగ్స్ రవాణా ముఠాకు ఆశిష్ జైన్ సూత్రధారి అని గుర్తించినట్టు వెల్లడించారు. అతను ఆక్సికోడోన్, హైడ్రోకోడోన్, అల్ఫ్రాజోలం, డైజోఫాం, లోరాజిపామ్, క్లోనాజిపామ్, జోల్పిడెమ్, ట్రెమడాల్ తదితర సైకోథెరపిక్ డ్రగ్స్‌ను సరఫరా చేసినట్టు తెలిపారు. ఆశిష్ కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న డిజిటల్ ఆధారాలను ఇంకా దర్యాప్తుచేయాల్సి ఉందని ఎన్సీబీ (ఆపరేషన్స్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్‌కుమార్‌సింగ్ చెప్పారు. ఎక్కడి నుంచి డ్రగ్స్ తెచ్చాడు, దేశంలో ఎక్కడెక్కడ నెట్వర్క్ ఏర్పాటుచేశాడు, ఎక్కడెక్కడి నుంచి రవాణా చేశాడన్న వివరాలను గుర్తించాల్సి ఉందన్నారు. -
ఫుడ్ ఆర్డర్లలో బిర్యానీదే హవా..సెకనుకు 2 బిర్యానీలు.. హాంఫట్
గతంతో పోలిస్తే హైదరాబాదీలలో ఆరోగ్య స్పృహ పెరిగిందనేది ఫుడ్ ఆర్డర్ల ద్వారా మరోసారి రుజువైంది. విందు వినోదాల వీకెండ్ తర్వాత రోజు ఇది మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ.. వార్షిక నివేదిక వెల్లడించిన ఆసక్తికరమైన అంశాలివీ.. – సాక్షి, హైదరాబాద్ గ్రాసరీస్‌తో సహా విభిన్న రకాల కేటగిరీ ఉత్పత్తులను స్విగ్గీ అందిస్తున్నప్పటికీ.. మొత్తం ఆర్డర్లలో 48 శాతం ఫుడ్‌కు సంబంధించినవే. ఈ ఏడాది పెట్ ఫుడ్ కూడా ఆర్డర్లు బాగా పెరిగాయి. ఆసక్తికరంగా.. 20వేల ఆర్డర్స్ పెట్ ఫుడ్ కోసం వచ్చాయి. ఫుడ్ ఫర్ హెల్త్.. ఆరోగ్యకరమైన ఆహారం కోరుతూ హెల్త్ హబ్‌కి ఆర్డర్లు ఈ ఏడాది 200 శాతం పెరిగాయి. దేశంలోనే ఆరోగ్య స్పృహ కలిగిన ఆహారం కోరే నగరాల్లో బెంగళూరు ప్రథమ స్థానంలో ఉండగా గతం కంటే మెరుగ్గా హైదరాబాద్ రెండో స్థానం దక్కించుకోవడం విశేషం. ఆ తర్వాత స్థానంలో ముంబై నిలిచింది. విందూ వినోదాలు ఎక్కువగా జరిగే వారాంతపు రోజుల అనంతరం సోమవారం ఆరోగ్యకర ఆహారం గురించి ఆర్డర్లు ఎక్కువగా వస్తుంటే.. ఆ తర్వాత స్థానం గురువారం దక్కించుకుంది. కీటో శైలి ఫుడ్‌లో 23 శాతం వృద్ధి కనిపించగా, వెగాన్ శైలి, శాకాహారపు ఆర్డర్స్‌లో 83 శాతం పెరుగుదల నమోదైంది. చదవండి: అంతరిక్షానికీ ఫుడ్ డెలివరీ.. సెకనుకు 2 బిర్యానీలు.. హాంఫట్.. నగరంలో చికెన్ బిర్యానీ ఆర్డర్లకే ఫస్ట్ ప్లేస్ దక్కుతోంది. అలాగే యాప్‌ని తొలిసారి వినియోగిస్తున్నవారిలో అత్యధికులు చికెన్ బిర్యానీతోనే అరంగేట్రం చేస్తున్నారట. దేశవ్యాప్తంగా గత ఏడాది నిమిషానికి 90 బిర్యానీల ఆర్డర్లు వస్తే.. ఈ ఏడాది అది 115కి పెరిగింది. అంటే సెకనుకు 2 బిర్యానీలుగా చెప్పొచ్చు. చికెన్ బిర్యానీ వినియోగంలో వరుసగా చెన్నై, కోల్‌కతా, లక్నో, హైదరాబాద్‌లు టాప్‌లో ఉన్నాయి. ముంబైలో మాత్రం చికెన్ బిర్యానీని దాల్ కిచిడీ దాటేసింది. చదవండి: ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి.. అక్కడ రూ.1కే మిర్చిబజ్జి ! బ్రౌనీస్ బాక్స్ డెలివరీకి 43.3 కి.మీ జర్నీ.. ► అత్యధిక దూరం ప్రయాణం చేయించిన ఆర్డర్లలో నగరానికి రెండో స్థానం దక్కింది. ఓ కస్టమర్ తన ప్రియ నేస్తానికి ఆర్డర్ చేసిన చాక్లెట్ బ్రౌనీస్ బాక్స్‌ని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అందించడం కోసం సిటీకి చెందిన డెలివరీ బాయ్ 43.3 కి.మీ ప్రయాణం చేశాడు. ► ఈ విషయంలో ప్రథమ స్థానం దక్కించుకున్న బెంగళూరులో ఫుడ్ ప్యాక్ అందించడానికి ఓ స్విగ్గీ బాయ్ ఏకంగా 55.5 కి.మీ ప్రయాణం చేశాడు. కోల్‌కతాలో ఓ బిర్యానీ ప్రేమికురాలు తనకు ఇష్టమైన మటన్ బిర్యానీ కోసం 39.3 కి.మీ ప్రయాణం చేయించింది. చదవండి: బిర్యానీ కోసం టెంప్ట్ అయ్యాడు, అలా ఆర్డర్ పెట్టి..ఇలా పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు మనసు దోసె... దోసెలు ఆర్డర్ చేయడంలో బెంగళూరు టాప్‌లో ఉంది. బటర్ దోసె ఆర్డర్లలో బెంగళూరు తర్వాత స్థానం నగరానికి దక్కగా ముంబై మూడో స్థానంలో ఉంది. నగరవాసులు అత్యధికంగా ఆర్డర్ చేసిన వాటిలో.. చికెన్ బిర్యానీ తొలిస్థానంలో ఉండగా, చికెన్ 65 తర్వాతి స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత స్థానంలో పన్నీర్ బటర్ మసాలా నిలవగా, మసాలా దోసె 4, ఇడ్లీ 5వ స్థానాల్లో నిలిచాయి. సాధారణంగా రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య ఫుడ్ ఆర్డర్స్ ఎక్కువ. రాత్రి 10 గంటల తర్వాత స్నాక్స్‌కు ఆర్డర్స్ పెరిగాయి. 80 శాతం మంది ఆన్లైన్ ద్వారా పేమెంట్స్‌కు మొగ్గు చూపుతున్నారు కొద్దిమంది మాత్రమే డెలివరీ తర్వాత నగదు చెల్లిస్తున్నారు. -
స్మార్ట్‌వాచ్ బదులు రాయి.. నటుడికి చేదు అనుభవం
ఈ-కామర్స్ పోర్టల్స్, సంబంధిత వెబ్‌సైట్స్ అలసత్వం అయితేనేం.. డెలివరీ సిబ్బంది నిర్లక్క్ష్యం అయితేనేం కొన్నిసార్లు కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవం. ఒక్కోసారి ప్రొడక్టు ఒకటి అయితే.. డెలివరీ మరొకటి వస్తుండడం చూస్తుంటాం కూడా. సరిగ్గా ఇక్కడ అలాంటి ఘటనే జరిగింది. కాకపోతే అది ఒక ఫేమస్ నటుడి విషయంలో.. బ్రెజిల్ టాప్ యాక్టర్ మురిలో బెనిసియో(50).. ఈ మధ్య యాపిల్ సిరీస్ 6 స్మార్ట్‌వాచ్‌ను ఆర్డర్ చేశాడు. అందుకోసం 530 డాలర్లు(40 వేల రూపాయలపైనే) చెల్లించాడు. అదికాస్త 12 రోజుల లేట్ డెలివరీతో ఆయన దగ్గరికి చేరింది. తీరా ఓపెన్ చేసి చూస్తే.. అందులో వాచ్‌కు బదులు బండరాయి ఉంది. దీంతో రిటైల్ కంపెనీ కర్రెఫోర్ను ఆశ్రయించాడు ఆ నటుడు. అయితే కంపెనీ వాళ్లు స్పందించేందుకు నిరాకరించారట!. దీంతో కస్టమర్ల సేవలకు అభ్యంతరం తెలిపిందంటూ కర్రెఫోర్ మీద నటుడు బెనిసియో కోర్టులో దావా వేశాడు. ఒక స్టార్ హీరో, పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్న సెలబ్రిటీని ఇలా ఇబ్బందిపెట్టడం సరికాదని ఆయన తరపున న్యాయవాది వాదించాడు. అంతేకాదు తాను చెల్లించిన డబ్బును వెనక్కి ఇవ్వాలంటూ దావాలో కోరాడు. అయితే ఆయన చెల్లించిన డబ్బుతో పాటు పరిహారం కింద మరో 1,500 డాలర్లు చెల్లించేందుకు కర్రెఫోర్ అంగీకరించింది. దీంతో వివాదం ముగిసింది. సెలబ్రిటీల విషయంలోనే కాదు.. సామాన్యుల విషయంలోనూ ఇంకోసారి ఇలా జరగకుండా చూడాలంటూ కోర్టు సదరు రిటైల్ కంపెనీని మందలించింది. ఇదిలా ఉంటే యాపిల్ 6ను కిందటి ఏడాది లాంఛ్ చేసిన యాపిల్.. ఆ తర్వాత యాపిల్ 7 రాకతో ఉత్పత్తిని ఆపేసింది. ప్రస్తుతం 7s సిరీస్‌తో పాటు, యాపిల్ వాచ్ ఎస్ఈ, యాపిల్ వాచ్ సిరీస్ 3లతో అలరించేందుకు యాపిల్ సిద్ధమైంది. చదవండి: వావ్.. క్లోజప్ షాట్లో సూర్యుడు -
బిర్యానీ కోసం టెంప్ట్ అయ్యాడు, అలా ఆర్డర్ పెట్టి..ఇలా పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు
సురేష్, రమేష్ ఇద్దరు స్నేహితులు. ఆదివారం సెలవు రోజు కావడంతో తమకు నచ్చిన బిర్యానీని ఆరగించేందుకు సరదాగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నారు. అలా వెళుతున్న ఆ ఇద్దరికి సడెన్‌గా రోడ్డు పక్కనే తాటికాయంత అక్షరాలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఆకర్షించింది. రెండు పార్శిళ్లు బిర్యానీ ఆర్డర్ ఇవ్వండి. ఒక బిర్యానీ పార్శిల్‌కే బిల్ కట్టండి' అంటూ ఫ్లెక్సీలోని ప్రకటన సారాంశం. అంతే డిస్కౌంట్లో బిర్యానీ వస్తుందని ఏమాత్రం ఆలోచించకుండా బిర్యానీ ఆర్డర్ చేశారు. సీన్ కట్ చేస్తే.. పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం..మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నరేగాన్ (Naregaon) అనే ప్రాంతంలో థామస్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అయితే థామస్ కు స్థానికంగా ప్రాచుర్యం పొందిన ఓ రెస్టారెంట్ యాజమాన్యం వెజ్, నాన్ వెజ్‌లో బిర్యానీతో పాటు పలు వంటకాలపై డిస్కౌంట్లు ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో తెలుసుకున్నాడు. అంతే బిర్యానీ ఆర్డర్ ఇచ్చాడు. అలా ఆర్డర్ ఇచ్చాడో లేదో అకౌంట్లో ఉన్న రూ.89,000 మాయమయ్యాయి. దీంతో థామస్ కంగారు పడుతూ ఎంఐడీసీ(Maharashtra Industrial Development Corporation) స్టేషన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐపీసీ సెక్షన్ 420 (చీటింగ్), ఐటీ యాక్ట్ పరిధిలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఐడీసీ పోలీస్ స్టేషన్ అధికారులు మాట్లాడుతూ..బాధితుడు తన వ్యక్తిగత వివరాల్ని ఎంటర్ చేసి ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడని, అనంతరం ఆ అకౌంట్లో ఉన్న డబ్బులు మాయమైనట్లు తెలిపారు. టెక్నాలజీ రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతుంది. మనిషి జీవన విధానాన్ని సమూలంగా మార్చేస్తుంది. అయితే ఈ టెక్నాలజీతో లాభాలు ఎన్ని ఉన్నాయో, నష్టాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయని సైబర్ నిపుణులు చెబుతున్నారు. లేదని ఏ మాత్రం అశ్రద్ధ వహించిన బ్యాంక్ అకౌంట్ల ఉన్న సొమ్ము క్షణాల్లో మాయం అవుతుందని హెచ్చరిస్తున్నారు. లేదని లైట్ తీసుకుంటే మోసపోతారని సూచిస్తున్నారు. సైబర్నేరాల్ని గుర్తించడం చాలా కష్టం. వెబ్సైట్/యాప్, బ్యాంక్/కార్డ్ డీటెయిల్స్ అడిగినప్పుడు, అది ఒరిజనల్లా లేదంటే ఫేకా అనే విషయాల్ని గుర్తించాలని అంటున్నారు. ముఖ్యంగా కొత్త వెబ్సైట్లు/యాప్‌లను ఉపయోగించే సమయంలో అలర్ట్‌గా ఉండాలని, సీవీవీ, కార్డ్ వివరాల్ని షేర్ చేయొద్దని సలహా ఇస్తున్నారు. చదవండి: నా తమ్ముడి ఫోన్ పేలింది సార్..! ట్వీట్ చేసిన అన్న -
కస్టమర్‌కి షాకిచ్చిన ఫ్లిప్‌కార్టర్ట్: ఐఫోన్ ఆర్డర్ చేస్తే...
ముంబై: మనం ఆన్లైన్లో ఏదైన ఆర్డర్ చేస్తే మనం ఆర్డర్ చేసింది కాకుండా వేరేది వచ్చి అది కూడా మనం వేలు ఖరీదు చేసే ఆర్డర్‌కి పొంతన లేకుండా కేవలం రూపాయల్లో ఖరీదు చేసే వస్తువు వస్తే మనకి ఎంతో టెన్షన్‌గా అనిపిస్తోంది కదూ. అలాంటి సంఘటనే ఒకటి ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో జరిగింది. అసలేం జరిగిందంటే దసరా పండుగ సీజన్ పురస్కరించుకొని అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ వంటి ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు బిగ్ బిలయన్ డే సేల్ ప్రారంభించి భారీగా ఆఫర్ల కురిపించిన సంగతి తెలిసిందే. చాలా మంది స్పెషల్ డిస్కౌంట్ సమయాల్లో తమకు కావాల్సిసిన వాటిని ఆర్డర్ చేసుకుంటారు. అలానే సిమ్రాన్ పాల్ సింగ్ అనే వ్యక్తి భారీ డిస్కౌంట్ లభిస్తుండటంతో 50 వేలు ఖరీదు చేసే ఆపిల్ ఐ ఫోన్12 సిరీస్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేశాడు. తన ఐఫోన్ ఎప్పుడూ వస్తుందా అని చాలా ఎగ్జాయిట్‌మెంట్‌తో ఎదురుచూస్తున్నాడు. ఆర్డర్ వచ్చాకా ఎంతో ఉత్సాహంగా ప్యాకెట్‌ని ఒపెన్ చేశాడు. దాంట్లో ఉన్న వాటిని చూసి షాకయ్యాడు. ఎందుకంటే తను ఐఫోన్ ఆర్డర్ చేస్తే.. ఫ్లిప్‌కార్ట్ నిర్మా సబ్బులు పంపింది. దీంతో ఒకస్కారిగా సింగ్ షాక్‌కి గురైయ్యాడు. వెంటన్ సింగ్ కస్టమర్ కేర్‌కి కంప్లయిట్ చేయడంతో ఫ్లిప్ కార్ట్ తన తప్పుని అంగీకరించి వెంటనే ఆ ఆర్డర్‌ని కేన్సిల్ చేసి డబ్బుని సదరు వ్యక్తి కి వాపస్ చేసింది. అయితే సింగ్ ఈ ఘటనను యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ప్రముఖ దిగ్గజ కంపెనీ ఈ విధంగా చేయడం ఏమిటంటూ నెటిజన్లు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏది ఏమైన డెలివరీని కస్టమర్లకు పంపించే ముందు ఒక్కసారి చెక్ చేసి పంపించాలి మరీ ఇలాంటి అత్యంత ఖరీదైన వస్తువుల విషయంలో తగు జాగ్రత్త అవసరం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: భారత స్పేస్ అసోసియేషన్‌ని ప్రారంభించనున్న మోదీ) -
బాక్స్ ఓపెన్ చేస్తే..
-
బాక్స్ ఓపెన్ చేస్తే.. అనుకోని అతిథి
న్యూయార్క్ : అప్పుడప్పుడు నకిలీ ఈ కామర్స్ వెబ్సైట్లను ఆశ్రయించి మోసపోతుంటాం. ఒక్కోసారి ఆర్డర్ చేసిన వస్తువుకు బదులు రాళ్లు, ఇతర పనికిరాని వస్తువులు వచ్చాయని వార్తల్లో చూశాం. కానీ, ఓ అమెరికా వినియోగదారుడికి మాత్రం వింత అనుభవం ఎదురైంది. నైక్ కంపెనీనుంచి వచ్చిన దుస్తుల ప్యాక్‌ను విప్పి చూడగా, పురుగులు బయటపడ్డాయి. ఒక్కసారి కంగుతిన్న అతడు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వివరాలు.. న్యూయార్క్‌కు చెందిన బెంజమిన్ స్మితీ ఆన్లైన్లో నైక్ కంపెనీ బట్టలను బుక్ చేశాడు. డెలివరీ బాయ్ బాక్స్ ఇచ్చి వెళ్లిపోయాడు. ఉత్సాహంగా బాక్స్ ఓపెన్ చేసిన స్మితీ ఆశ్చర్యపోయాడు. బట్టలపై పురుగులు పారుతుండడం గమనించాడు. ప్యాక్లోపల కూడా ప్రతి బట్టపై పురుగులున్నట్లు గుర్తించాడు. తన ఆవేదనను సోషల్‌మీడియాలో పంచుకున్నాడు. అనంతరం మళ్లీ ఒక పోస్ట్ పెట్టాడు. నైక్ ఎలైట్ కస్టమర్ సర్వీస్ టీం సభ్యుడితో మాట్లాడానని, అతడు తన డబ్బును వాపస్ ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలిపారు. -
ఆన్లైన్లో ఆర్డర్.. రూ.5 లక్షలు గోవిందా!
బనశంకరి: నగరంలో ఆన్లైన్ మోసాలు భారీగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఆన్లైన్ లో బుక్ చేసిన ఆర్డర్లను రద్దు చేసుకోవడానికి చేసిన ప్రయత్నంలో రూ. లక్షలు పోగొట్టుకున్న ఘటన ఉద్యాన నగరిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని అశోకనగర్కు చెందిన వెంకటేశ్ ఓ ఆన్లైన్ ద్వారా రూ. 1564 విలువైన బ్లూటూత్ హెడ్‌ఫోన్ ఆర్డర్ చేశాడు. అయితే వెంటనే ఆర్డర్ క్యాన్సిల్ యత్నించాడు. ఈ సమయంలోనే వంచకులు రంగంలోకి దిగారు. కస్టమర్ కేర్ సపోర్టింగ్ అప్లికేషన్ డౌన్ చేసుకోవాలని సలహా ఇచ్చారు. అనంతరం ఆన్లైన్ వ్యాలెట్ అప్లికేషన్ భర్తీ చేయాలని అడిగారు. కొన్ని క్షణాల్లోనే రెండు ఖాతాల నుంచి రూ. 5 లక్షల 57 వేల నగదు మరో ఖాతాలోకి బదిలీ అయ్యిందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పది రోజుల తరువాత మరోసారి నగదు బదిలీ కావడంతో అశోకన్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్రౌజర్ నుంచి ఫోన్ నెంబరు తీసుకుని ఆన్లైన్ షాపింగ్ చేసే ప్రజలు అధికారిక వెబ్సైట్లో నమోదు చేసిన నెంబర్లు మాత్రమే సంప్రదించాలి లేని పక్షంలో వారు సైబర్ వంచకులు ముఠా చేతికి చిక్కే అవకాశం ఉందని పోలీస్ అధికారి తెలిపారు. (అల్లుని కుటుంబంపై కత్తులతో దాడి) -
మదిని దోచేస్తున్న పానీపూరీ ఏటీఎం
బయటకొచ్చారంటే చాలా మంది పానీపూరీ తినకుండా ఉండరు. మార్చిలో లాక్డౌన్ ప్రకటించగానే, పానీపూరీ తినందే రోజుగడవని పానీపూరీ ప్రియులెందరో ఎంతగానో తల్లడిల్లిపోయారు. అయినా పానీపూరీ ప్రియులంతా నోటికి తాళం వేసుకోక తప్పలేదు. ఎందుకంటే అప్పటికప్పుడు చేసి ఇచ్చే తినుబండారాలు కావడంతో, వీటిని ఏ జొమాటో, స్విగ్గీ, ఉబర్ ఈట్స్‌లోనో ఇంటికి తెప్పించుకొని ఆరగించే అవకాశం కూడా లేకపోయింది. దీంతో పానీపూరీ లేని కొరత తీర్చలేనిదంటూ సోషల్ మీడియాలో చాలా జోక్స్ చక్కర్లు కొట్టాయి. అయితే సోషల్ మీడియా జోక్స్‌కి చెక్‌పెట్టేసే రోజొచ్చింది. (చదవండి: కరోనా కేళి.. జేబులు ఖాళీ!) సామాజిక దూరాన్ని పాటిస్తూ, ఎవర్నీ అంటుకోకుండా, పరిశుభ్రమైన పానీపూరీని మీ చేతుల్లో పెట్టే పానీపూరీ విక్రయ యంత్రం మార్కెట్లోకి వచ్చేస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే వీడియో నెటిజన్ల మదిని దోచేస్తోంది. పానీపూరీ వెండింగ్ మెషీన్లో 20 రూపాయల నోటుని ఉంచితే సరి, మెషీన్‌లోనుంచి కదులుతోన్న బెల్టుపై వెంటనే గోల్గప్పా ప్రత్యక్షం అవు తుంది. ఈ యంత్రం అభివృద్ధిపరిచేందుకు ఆరు నెలల కాలం పట్టిందని, ఈ యంత్రం వినియోగాన్ని గురించి వీడియోలో వివరించిన వ్యక్తి చెప్పారు. ఈ పానీపూరీ యంత్రం ఆవిష్కర్తలను అస్సాం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హార్ది సింగ్, ‘ఇది భారతీయుల నిజమైన చాతుర్యం’అని ప్రశంసించారు. (చదవండి: పానీపూరి ప్రియులను కలవరపరిచే వంటకం) -
కవర్‌పై ఓ పేరు.. లోపల చూస్తే..
కోల్‌కతా : ఆన్లైన్ స్టోర్లలో ఆర్డర్ చేసిన వస్తువు కాకుండా మరో వస్తువు వచ్చిన ఘటనలు కోకొల్లలు. ఫోన్ ఆర్డర్ చేస్తే ట్రిమ్మర్, స్కిన్ లోషన్ ఆర్డర్ చేస్తే ఖరీదైన ఇయర్ బర్డ్స్ ఇలా ఎన్నో వస్తువులు. కొన్ని కోపం, చిరాకు తెప్పిస్తే మరొకొన్ని నవ్వు తెప్పిస్తాయి. తాజాగా నవ్వు తెప్పించే సంఘటనే ఒకటి పశ్చిమబెంగాల్లో చోటుచేసుకుంది. కోల్‌కతాకు చెందిన సుతీర్థ దాస్ బుధవారం ఆన్లైన్ స్టోర్ అమెజాన్‌లో కమ్యూనిస్టు మేనిఫెస్టో ఆర్డర్ చేశాడు. ఆర్డర్ కన్ఫర్మేషన్, డెలివరీ రోజు అతడికి మెసెజ్ రూపంలో అందాయి. శనివారం 11గంటల సమయంలో అతడికి ఓ మహిళనుంచి ఫోన్ వచ్చింది.(హుర్రే: ఆర్డర్ చేసిందొకటి.. వచ్చింది మరొకటి) కమ్యూనిస్టు బుక్ కాకుండా వేరే బుక్ డెలివరీ అవ్వబోతోందని, డెలివరీ క్యాన్సిల్ చేయాలని ఆమె సుతీర్థకు చెప్పింది. అతడు ఆఫీసులో ఉన్న కారణంగా బుకింగ్ క్యాన్సిల్ చేయలేకపోయాడు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత పార్శిల్ విప్పి చూసి ఆశ్చర్యపోయాడు. దాని కవర్ మీద కమ్యూనిస్టు మేనిఫెస్టో అని రాసి ఉన్నా.. లోపల మాత్రం భగవద్గీత ఉంది. అతడు తన ఆన్లైన్ ఆర్డర్ అనుభవాలను ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేశాడు. దీంతో ఈ న్యూస్ కాస్తా వైరల్‌గా మారింది. -
హుర్రే: ఆర్డర్ చేసిందొకటి.. వచ్చింది మరొకటి
పుణె: ఆన్లైన్లో ఆర్డర్ చేసిన దానికి బదులుగా మరో వస్తువు వస్తే ఎవరైనా ఏం చేస్తారు? ఆవేశంతో, అసహనంతో ఊగిపోతారు. కస్టమర్ కేర్‌కు కాల్ చేసి చెడామడా తిట్టేస్తారు. కానీ ఇక్కడో వ్యక్తి మాత్రం ఎగిరి గంతేస్తున్నాడు. ఎందుకో తెలిస్తే... మీరు షాకవుతారు. పుణెకు చెందిన గౌతమ్ రేజ్ అనే వ్యక్తి ఆన్లైన్ షాపింగ్ సైట్ అమెజాన్‌లో స్కిన్ లోషన్ ఆర్డర్ చేశాడు. తీరా డెలివరీ అయ్యాక అందులో ఉన్న వస్తువును చూసి అవాక్కయ్యాడు. ఎందుకంటే అందులో రూ.19 వేలు విలువ చేసే బోస్ వైర్లెస్ ఇయర్‌బడ్స్ ఉంది. దీంతో అతను కస్టమర్ కేర్‌కు కాల్ చేసి అసలు విషయం చెప్పాడు. అయితే అది నాన్ రిటర్నబుల్ ఆర్డర్ అయినందున వెనక్కు తీసుకోలేమని చెప్పారు. అంతేకాదు.. స్కిన్ లోషన్‌ను ఇవ్వనందున దాని డబ్బును కూడా తిరిగి చెల్లించేశారు. (అమెజాన్‌లో 50 వేల ఉద్యోగాలు) దీంతో అతను ఇది నిజమా కళా అని నమ్మలేకపోయాడు. వెంటనే ట్విటర్లో తనకు జరిగిన అద్భుత అనుభవాన్ని రాసుకొచ్చాడు. "నేను రూ.300 విలువైన స్కిన్ లోషన్ ఆర్డర్ చేస్తే దానికి బదులు రూ.19 వేలు ఖరీదు చేసే బోస్ వైర్లెస్ ఇయర్‌బడ్స్ వచ్చాయి. కస్టమర్ కేర్‌ను సంప్రదిస్తే వీటిని నా దగ్గరే ఉంచుకోమన్నారు" అని తన సంతోషాన్ని పంచుకున్నాడు. దీనితోపాటు ఓ సర్ఫ్ ప్యాకెట్ వచ్చిందని తెలిపాడు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు "కాస్త ఆ స్కిన్ లోషన్ పేరు చెప్తారా? వీలైతే లింక్ సెండ్ చేయండి" అంటూ అతడి వెంట పడుతున్నారు. "హేయ్, నాకు ఇయర్‌బడ్స్‌కు బదులు లోషన్ వచ్చింది.. మనిద్దరం వస్తువులు మార్చుకుందామా?" అంటూ చమత్కరించారు. మరొకరు మాత్రం "ఇయర్‌బడ్స్ ఆర్డర్ చేసిన వ్యక్తికి ఏం వచ్చుంటుందో, ఏమో?"నని విచారం వ్యక్తం చేశాడు. (ఆహా ఆన్లైన్ భోజనం..) -
ఆన్లైన్లో నాసిరకం ఫుడ్!
సాక్షి, న్యూఢిల్లీ : జొమాటో, స్విగ్గీ, ఊబర్ ఈట్స్..అన్లైన్ ఆహార సరఫరా సంస్థలు కొన్ని వేల రెస్టారెంట్లను మన మునివేళ్ల ముందుకు తీసుకొచ్చాయి. వీటిలో ఏ రెస్టారెంట్ నుంచి ఆహారం కావాలన్నా అరగంటలో మన కళ్ల ముందుంటుంది. ఆన్లైన్ ద్వారా తెప్పించుకుంటున్న ఆహారంలో క్రమంగా నాణ్యతా ప్రమాణాలు పడిపోతున్నాయని, రెస్టారెంట్లో సరఫరా చేస్తున్న నాణ్యత కన్నా...ఆర్డర్ ద్వారా తెప్పించుకున్న ఆహారం నాణ్యత నాసిరకంగా ఉంటుందని మెజారిటీ వినియోగదారులు ఆరోపిస్తున్నారు. పేరెన్నికగన్న రెస్టారెంట్లే కాకుండా చిన్న చిన్న ఆహారం కొట్లు కూడా ‘యాప్స్’ పరిధిలోకి వస్తున్నాయని, వాటిలో పరిశుభ్రత సరిగ్గా ఉండదని ఆరోపిస్తున్నారు. ఎప్పటికీ తాము పరిమాణంకన్నా నాణ్యతా ప్రమాణాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని ఎక్కువ మంది వినియోగదారులు అభిప్రాయపడ్డారని ‘లోకల్ సర్కిల్స్’ అనే సామాజిక వేదిక ఆన్లైన్ ఆహారంపై నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడయింది. నాణ్యతకే ప్రాధాన్యత ఇస్తామని 66 శాతం మంది వినియోగదారులు అభిప్రాయపడగా, సకాలంలో అందించడానికే ప్రాధాన్యత ఇస్తామని 22 శాతం మంది, ప్యాకింగ్, రవాణా సందర్భంగా ఆహారం నాణ్యత పడిపోతోందని 53 శాతం మంది, రెస్టారెంట్లో ఉన్నట్లే ఆన్లైన్ ద్వారా తాము అందుకున్న ఆహారం ఉంటుందని 30 శాతం మంది, క్రమంగా నాణ్యత ప్రమాణాలు పడిపోతున్నాయని 17 శాతం మంది అభిప్రాయపడగా, ధరలు అధిక ధరలు వసూలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా 218 జిల్లాల పరిధిలో 27 వేల మంది వినియోగదారుల అభిప్రాయాలను ఈ సర్వేలో సేకరించారు. స్టార్టప్ కంపెనీలు ఏవైనా మార్కెట్ విస్తరణ, వద్ధిపైనే ముందుగా దృష్టిని సారిస్తాయని, అందుకనే నాణ్యతా ప్రమాణాలు పెద్దగా పట్టించుకోవని ఓ స్టార్టప్ కంపెనీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ స్వతంత్ర విశ్లేషకుడు హెచ్వీ హరీష్ తెలిపారు. మార్కెట్‌పై పట్టు సాధించాక ఆపరేషన్లు, వినియోగదారుల సంతప్తిపై దృష్టిని సారిస్తారని చెప్పారు. రెస్టారెంట్లు, వినియగదారుల మధ్యనున్న దూరాన్నే తగ్గించడం కోసమే ప్రస్తుతం ఈ యాప్స్ వచ్చాయని, అందులో చాలా వరకు విజయం సాధించాయని, ఇక నాణ్యతా ప్రమాణాలపై దష్టి సారించాల్సిన అవసరం ఉందని ‘టెక్‌సై రీసర్డ్’ సంస్థ కన్సల్టెంట్ సుకతీ సేథ్ వ్యాఖ్యానించారు. ప్యాకేజ్ సందర్భంగా ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు కొన్ని రెస్టారెంట్లకు జొమాటో స్వయంగా ప్యాకేజీ కవర్లను పంపిణీ చేస్తోందని ఆ కంపెనీ వర్గాలు వెల్లడించాయి. అది విస్తరించే ప్యాకింగ్ సందర్భంగా ఆహారం నాణ్యత ప్రమాణాలు దెబ్బతినే అవకాశాలు ఉండవని ఆ వర్గాలు అంటున్నాయి. ప్యాకేజీ మధ్యలో ఆహారం మారటం చాలా అరుదని, రెస్టారెంట్లే ప్యాకేజీ ఆహారానికి సరైన ప్రమాణాలను పాటించడం లేదని స్విగ్గీ, ఉబర్ ఈట్స్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఏమైనా ఇక నుంచి తాము కూడా ఆహారం నాణ్యతపై దష్టిని కేంద్రీకరిస్తామని ఆ కంపెనీలు చెబుతున్నాయి. -
వన్‌ప్లస్ 6 ఫోన్ ఆర్డర్ చేస్తే....
సాక్షి, న్యూఢిల్లీ : తల్లిని సర్ప్రైజ్ చేయడం కోసం ఓ టాప్ ఈ కామర్స్ సైట్లో వన్‌ప్లస్ 6 ఫోన్‌ను ఆర్డర్ చేసిన యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. ఫోన్‌కు బదులుగా మార్బుల్స్ రావడంతో కంగుతిన్న బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాలు... దక్షిణ ఢిల్లీకి చెందిన మానస్ సక్సేనా అనే యువకుడు ఈ కామర్స్ సైట్లో వన్‌ప్లస్ 6 ఫోన్‌ను ఆర్డర్ చేశాడు. అందుకోసం 34,999 రూపాయలు డెబిట్ కార్డు ద్వారా చెల్లించాడు. మరుసటి రోజు సాయంత్రానికల్లా ఫోన్ డెలివరీ చేయాలని రిక్వెస్ట్ చేశాడు. అయితే అడిగిన సమయాని కంటే ముందుగానే డెలివరీ బాయ్ రావడంతో సంతోష పడిన మానస్ ప్యాకింగ్ చేసి ఉన్న బాక్స్‌ను తీసుకున్నాడు. కొడుకు ఇచ్చిన గిఫ్ట్‌ను చూసేందుకు సాయంత్రం అతడి తల్లి బాక్స్‌ను తెరచి చూడగా అందులో ఫోన్‌కు బదులు మార్బుల్స్‌తో పాటు చిన్న చిన్న రాళ్లు ఉన్నాయి. దీంతో ఆమె సంబంధిత కామర్స్ సైట్‌కు ఫోన్ చేసి చేయగా... బాక్స్‌లో ఉన్న మార్బుల్స్ ఫొటోతో సహా, ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు ఫైల్ చేయమని చెప్పడంతో ఆమె అలాగే చేసింది. అయితే ఫిర్యాదు స్వీకరించిన అనంతరం తాము ఆ బాక్స్‌లో ఫోన్‌ను ఉంచి ప్యాక్ చేశామని, సీల్ తీయలేదు అంటున్నారు గనుక డెలివరీ బాయ్ తప్పు కూడా లేదంటూ బాధ్యతా రహితంగా మాట్లాడటంతో ఆమె వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఇంటి వద్దకే పూజా సామగ్రి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలుగు సంప్రదాయంలో పూజలు, వ్రతాలు, నోములు ఓ భాగం. ప్రతి పూజకూ ఒక్కో విధానం, ఒక్కో విశిష్టత ఉంది. మరి, ఏ పూజకు ఎలాంటి పూజసామగ్రిని వినియోగించాలనే దాని మీద కొంత అవగాహన ఉండట్లేదు. దీనికి పరిష్కారం చూపిస్తోంది ఈపూజస్టోర్.ఇన్. ఆన్లైన్లో పూజసామగ్రి సేవలందించడం దీని ప్రత్యేకత. ♦ కామేశ్వరీ ఈ సర్వీసెస్ ప్రై.లి. సీఈఓ కొడు కుల సోమేశ్వర రావు 2014లో రూ.25 లక్షల పెట్టుబడితో ఈపూజస్టోర్.ఇన్ను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సేవలందిస్తుంది. దేవుళ్ల ప్రతిమలు, యంత్రాలు, రుద్రాక్షలు, ఆవు నెయ్యి, అష్టమూలికా తైలం, రాగి, పంచలోహ పూజా సామగ్రి, పంచలు, కండువలు, చీరలు, జాకెట్లు వంటివి పూజస్టోర్లో లభిస్తాయి. 50 రకాల పూజలకు సంబంధించిన సామగ్రి పూజస్టోర్లో ఉంది. వీటితో పాటూ పూజారులను కూడా బుకింగ్ చేసుకోవచ్చు. భవానీ, శివ, వెంకటేశ్వర, హనుమాన్, అయ్యప్ప మాలాధారులకు అవసరమైన పూజసామగ్రి, బట్టలు ఇతరత్రా ఉత్పత్తులు లభిస్తాయి. ♦ శ్రావణ, కార్తీక మాస పూజలు, వినాయక చవితి, దసరా, దీపావళి వంటి పండుగల పూజా సామగ్రితో పాటూ వ్యాపార సంస్థలు, గృహ ప్రవేశాలు, టీవీ సీరియల్స్, సినిమా ప్రారంభోత్సవాలకు అవసరమైన పూజా ద్రవ్యాలను, పూజారులను అందిస్తాం. హైదరాబాద్‌తో పాటూ అమెరికా, జపాన్‌లో జరిగిన హోమ గుండ యాగానికి పూజస్టోర్ నుంచే సామగ్రి అందించాం. శ్రీకాళహస్తి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర వర ప్రసాద్ సూచించిన అన్ని రకాల దైవిక వస్తువులను కూడా కొనుగోలు చేయవచ్చు. ♦ ఆయా పూజ ఉత్పత్తుల కోసం తయారీ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. ఆర్డర్ వచ్చిన 3–5 రోజుల్లో సామగ్రి డెలివరీ చేస్తాం. బ్లూడార్ట్, డీహెచ్ఎఫ్ఎల్ కొరియర్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ప్రస్తుతం 8 మంది ఉద్యోగులున్నారు. గతేడాది రూ.2 కోట్ల టర్నోవర్‌ను సాధించాం. ఈ ఏడాది రూ.4 కోట్లు లకి‡్ష్యంచాం. -
సెల్‌ఫోన్ ఆర్డరిస్తే.. నడుం బెల్ట్ వచ్చింది!
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): సామ్సంగ్ సెల్‌ఫోన్ అసలు ధర రూ. 16 వేలు. మీకొచ్చిన గిఫ్ట్కూపన్తో రూ. 4 వేలకే వస్తుందని వచ్చిన ఫోన్‌కాల్‌ను నమ్మిన ఓ యువకుడు మోసపోయాడు. పెద్దపల్లి జిల్లా యైటిం క్లయిన్కాలనీ రాజీవ్‌నగర్‌తండాకు చెందిన గొడిసెల సతీష్‌కు గతనెల 26న తన మోబైల్‌కు 9848439934 నంబర్ నుంచి కాల్ వచ్చింది. సామ్సంగ్ ఫోన్ అసలు ధర రూ. 16 వేలు, ఆఫర్ ద్వారా రూ.4 వేలకే వస్తుందని ఎదుటి వ్యక్తి చెప్పడంతో సతీష్ ఆర్డర్ చేశాడు. మంగళవారం స్థానిక పోస్టాఫీస్‌కు పార్శిల్ చేరింది. పోస్టాఫీస్‌కు వెళ్లి సతీష్ రూ.4 వేలు చెల్లించి అట్టడబ్బాను తీసుకున్నారు. బాక్స్ తెరిచి చూసే సరికి నడుం బెల్ట్ కనిపించింది. ఇదేమిటని ఆయన పోస్టాఫీస్ సిబ్బందిని అడుగగా మాకేమీ సంబంధం లేదని సమాధానం ఇచ్చారు. ఆందోళన చెందిన బాధితుడు మొదట్లో కాల్వచ్చిన ఫోన్‌నంబర్‌కు కాల్చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. మోసపోయానని తెలుసుకున్న సతీష్ గోదావరిఖని టూటౌన్పోలీస్స్టేషన్ ఫిర్యాదు చేశాడు. -
రైలు ప్రయాణికులకు శుభవార్త!
న్యూఢిల్లీ: రైల్వేమంత్రిత్వశాఖ ప్రతిరోజు లక్ష మందికి ఆహారాన్ని అందించేందుకు సిద్ధమైంది. ఈ కాటరింగ్ విధానం ద్వారా రైళ్లలోనూ ప్రయాణికులకు నచ్చే ఆహారాన్ని ఆర్డర్ చేసుకునే వెసలుబాటు కల్పించనుంది. ఈ క్యాంటీన్ విధానంతో ప్రయాణికుల భోజన సమస్యలకు చెక్ పెట్టాలని గతంలోనే నిర్ణయించారు. ప్రతిరోజూ దాదాపు లక్ష భోజనాల వరకు అందించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది. 193 స్టేషన్లలో 1516 రైళ్లలో ఈ క్యాటరింగ్ ను అందుబాటులోకి తెస్తున్నారు. 2014లో కొన్ని రైళ్లలో ఈ సౌకర్యాన్ని కల్పించినా ప్రయాణికులకు అవసరాల దృష్ట్యా మరిన్ని సేవలను అందించాలని ఆ శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఈ క్యాంటిన్ విస్తరణను మొదలుపెట్టారు. ఐఆర్సీటీసీ వెబ్ సైట్, మొబైల్ యాప్, కాల్ సెంటర్, ఎస్ఎంఎస్ పద్ధతులలో తమ ఆర్డర్ ను బుక్ చేసుకోవచ్చు. హల్దిరామ్స్, డోమినాస్ పిజ్జా, బికనిర్ వాలా, వింపి, ఇతర సంస్థలతో ఈ మేరకు రైల్వేశాఖ ఒప్పందాలు కుదుర్చుకోబోతుంది.