స్విగ్గీ, జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసేవాళ్లు డెలివరీ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తుంటారు.. ఇందులో కొన్ని ఆర్డర్ తెచ్చే బాయ్‌కు సంబంధించి ఉంటే.. మరికొన్ని రెస్టారెంట్‌ను ఉద్దేశించి ఉంటాయి. ‘మసాలా తగ్గించండి’ లాంటివి. అయితే ఇవి ఒక్కోసారి తేడా కొడితే మనం ఆశ్చర్యపోవాల్సి ఉంటుంది. అలాంటి ఘటనలు తాజాగా మహారాష్ట్రలోని ముంబై, నాగపూర్‌లో చోటుచేసుకున్నాయి. ముంబైకి చెందిన వైష్ణవి ఇటీవల బర్త్‌డే కోసం ఒక కేక్ ఆర్డర్ ఇచ్చారు. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టారు. అందులో వచ్చేటప్పుడు రూ.500కి చిల్లర తీసుకురమ్మని బాయ్‌కు డెలివరీ ఇన్‌స్ట్రక్షన్ పెట్టారు. తీరా కేక్ ఇంటికొచ్చిన కేక్‌ను చూసి ఆమె షాకయ్యారు.
హ్యాపీ బర్త్‌డేకి బదులు.. కేక్‌పై సదరు బేకర్ రూ.500కి చిల్లర తీసుకురా అని రాశాడు. దీన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్లు నవ్వు ఎమోజీలు పెడుతూ సరదా వ్యాఖ్యలు చేశారు. మరో ఘటనలో నాగ్‌పూర్‌కు చెందిన కపిల్ నగరంలోనే పేరొందిన బేకర్ నుంచి కేక్ ఆర్డర్ చేశారు. అందులో డెలివరీ ఇన్‌స్ట్రక్షన్ కింద.. ‘ఇందులో ఎగ్ ఉందన్న విషయాన్ని తెలియజేయండి’ అని పెట్టారు. ఆయన ఉద్దేశం డెలివరీ చేసినప్పుడు.. అది ఎగ్‌తో చేసిన కేక్ అని చెప్పడం కోసం ఈ బేకర్ డైరెక్టుగా కేక్ మీదే.. ఇది ఎగ్‌తో చేసినది అని రాశాడు. దాన్ని చూశాక నాకు నోట మాట రాలేదు అని కపిల్ తన అనుభవాన్ని ట్విట్టర్‌లో షేర్ చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment