Instructions
-
మెదక్, మల్కాజ్ గిరి పరిధిలోని నేతలతో మీనాక్షి సమావేశం
-
ఆత్మవిశ్వాసంతో పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: సజ్జల
-
టెస్టులు.. స్కాన్.. ఉంటాయా?
నాకు 35 ఏళ్లు. యూరిన్ టెస్ట్‌లో గర్భవతి అని తెలిసింది. మూడు నెలల తర్వాత డాక్టర్‌ను సంప్రదించమని సలహా ఇస్తున్నారు కుటుంబ సభ్యులు. అందాకా ఆగొచ్చా? ఇప్పుడేమైనా టెస్టులు, స్కాన్స్ ఉంటాయా? సూచించగలరు. – వాసవి, ఆదిలాబాద్ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే డాక్టర్ని కలవటం మంచిది. 30 ఏళ్లు దాటాక ప్రెగ్నెన్సీ వస్తే కొన్ని ముఖ్యమైన పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. థైరాయిడ్, బీపీ, సుగర్ టెస్ట్లైతే వెంటనే చేయించుకోవాలి. బ్లడ్ గ్రూప్ తెలుసుకోవాలి. రోజూ ఫోలిక్ యాసిడ్, మల్టీ విటమిన్ మాత్రలను వేసుకోవాలి. మీ లాస్ట్ పీరియడ్ తేదీ నుంచి రెండు నెలలకి వయబిలిటీ స్కాన్ అని.. ఫస్ట్ స్కాన్ చేస్తారు. ఇందులో గర్భసంచిలో సరైన ప్లేస్లోనే పిండం ఫామ్ అయిందా.. లేదా? పిండం వయసు, ఎదుగుదల ఆరోగ్యంగా ఉందా.. లేదా? వంటివన్నీ తెలుస్తాయి. కొన్నిసార్లు ట్యూబల్ ప్రెగ్నెన్సీ వంటి కాంప్లికేటెడ్ పరిస్థితులు ఉంటాయి. అలాంటి కండిషన్‌ని ఈ స్కాన్ ద్వారా గుర్తించే అవకాశం ఉంటుంది. అంతేకాదు జెనెటిక్ లేదా క్రోమోజోమల్ ఇష్యూస్ ఉంటాయి. వాటిని గుర్తించేందుకు 3వ నెలలో కొన్నిరకాల రక్తపరీక్షలు, స్కానింగ్‌ని చేయాల్సి ఉంటుంది. వీటిని చేయించుకునే తేదీని కూడా ఫస్ట్ స్కాన్లోనే కన్ఫర్మ్ చేస్తారు. ఈ స్కాన్‌ను ఇంటర్నల్/ఎక్స్టర్నల్ రెండు విధాలుగా చేస్తారు. ఇందులో బిడ్డ సైజు, హార్ట్ బీట్ తెలుస్తాయి. అండాశయాల్లో ఏమైనా సిస్ట్స్ ఉన్నాయా అని కూడా చూస్తారు. పిండానికి రక్తప్రసరణ సరిగా ఉందా? ఏమైనా బ్లడ్ క్లాట్స్ ఉన్నాయా అని చెక్ చేస్తారు. 8–9 వారాల్లో ట్విన్ ప్రెగ్నెన్సీని కనిపెట్టొచ్చు. మూడవ నెల నిండిన తర్వాత చేసే ఎన్టీ స్కాన్ ( (Nuchal Translucency)లో డౌన్‌సిండ్రోమ్ లాంటి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కూడా తెలుస్తాయి. దీంతోపాటు ఇంకా టీ18, టీ13 అనే సమస్యలనూ గుర్తించే వీలుంటుంది. డెలివరీ అయ్యే సుమారు తేదీ కూడా ఈ స్కాన్లోనే తెలుస్తుంది. ఈ ఎన్టీ స్కాన్‌ను 12–13 వారాల మధ్య చేస్తారు. ఈ టెస్ట్‌లో ఒకవేళ ఏదైనా సమస్య కనపడితే తదుపరి ఏ డాక్టర్ని కలవాలి, చెకప్స్, హై రిస్క్ అబ్‌స్టెట్రీషియన్ కేర్ వంటివి సూచిస్తారు. తొలి మూడు నెలల్లోనే బిడ్డకు అవయవాలన్నీ ఏర్పడటం మొదలవుతుంది కాబట్టి తీసుకోవలసిన పోషకాహారం, జాగ్రత్తల గురించి వివరిస్తారు. ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్‌లో ఒకవేళ బిడ్డకేవైనా ఎదుగుదల సమస్యలు కనిపిస్తే వేసుకోవలసిన మాత్రలు, తీసుకోవలసిన ఇంజెక్షన్స్‌ను ప్రిస్క్రైబ్ చేస్తారు. అందుకే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ సమయంలో లేదా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే డాక్టర్ని తప్పకుండా సంప్రదించాలి. నాకు 37 ఏళ్లు. ఇద్దరు పిల్లలు. పీరియడ్స్‌లో విపరీతమైన పెయిన్ ఉంటుంది. రొటీన్ స్కాన్‌లో లో అడినోమయోసిస్ అని తేలింది. వేరే పరీక్షలన్నీ నార్మల్‌గానే ఉన్నాయి. తెలిసిన డాక్టర్ చూసి, గర్భసంచి తొలగించాలని చెప్పారు. వేరే మార్గం లేదా?– ప్రదీప్తి, విజయనగరంపీరియడ్స్లో పెయిన్ తప్ప ఇతర ఇబ్బందులేమీ లేవంటున్నారు. కాబట్టి మేజర్ సర్జరీ అవసరం లేదు. నెలసరిలో నొప్పి తగ్గేందుకు కొన్ని మందులు వాడొచ్చు. అడినోమయోసిస్ అనేది హార్మోన్ల మార్పుల వల్ల వస్తుంది. గర్భసంచిలో ఉండే టిష్యూ గర్భసంచి గోడలోకి వెళ్లి నెలసరి సమయంలో తీవ్ర రక్తస్రావం అవటం, పొత్తి కడుపు నొప్పి, వెన్ను నొప్పి వంటివి ఉంటాయి. సాధారణమైన పెయిన్ కిల్లర్ మాత్రలతో నొప్పి తగ్గకపోతే హార్మోనల్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంది. ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్, ప్రొజెస్టిరాన్ మాత్రలు, ఇంట్రాటెరైనా డివైస్ – MIRENA లాంటివి నొప్పిని, బ్లీడింగ్నీ తగ్గిస్తాయి. మీరు డాక్టర్ని సంప్రదిస్తే.. పరీక్షించి.. మీకు ఏ ట్రీట్మెంట్ సూట్ అవుతుందో, ఏది మంచిదో చెబుతారు. అడినోమయోసిస్ అనేది దానికదే తగ్గే అవకాశం తక్కువ. అందుకని ఏడాదికోసారి స్కాన్ చేయించుకుంటూ ఫాలో అప్‌లో ఉండాలి. మెనోపాజ్ వయసుకి హార్మోన్లు తగ్గుతాయి కాబట్టి అప్పుడు ఇదీ తగ్గిపోవచ్చు. ఆల్రెడీ పిల్లలున్న వారు MIRENA కాయిల్ ఆప్షన్ని ఎంచుకోవచ్చు. హిస్టరెక్టమీ లాంటి మేజర్ సర్జరీని నివారించవచ్చు. కేవలం నొప్పి, అధిక రక్తస్రావం మాత్రమే ఉన్నవారికి (థైరాయిడ్, హై బీపీ, సుగర్ లాంటి సమస్యలేవీ లేకపోతే) ఈ కాయిల్ లేదా మాత్రలతో త్వరగానే రిలీఫ్ వస్తుంది. అలాగే మీ ఏజ్ గ్రూప్ వాళ్లు తప్పకుండా పాప్ స్మియర్ అనే సర్వైకల్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలి. ఒకసారి అన్ని పరీక్షలు చేయించుకొని ఆ రిపోర్ట్స్‌తో గైనకాలజిస్ట్‌ను సంప్రదించండి. సరైన చికిత్సను సూచిస్తారు. -
Tasty Sweet Corn: గింజ గింజలో.. రుచి!
మార్కెట్లో స్వీట్ కార్న్ రాశులుగా పోగయి ఉన్నాయి. బలవర్ధకమే... కానీ రోజూ ఉడికించి తినాలంటే బోర్. కొంచెం వెరైటీగా ప్రయత్నం చేస్తే... పిల్లలు లంచ్‌బాక్స్‌ను ప్రేమిస్తారు... ఈవెనింగ్ స్నాక్ కోసం ఎదురుచూస్తారు.చీజ్ బాల్స్..కావలసినవి:బంగాళదుంప – 150 గ్రా (పెద్దది ఒకటి);మొక్కజొన్న గింజలు – వంద గ్రాములు (స్వీట్ కార్న్ లేదా మామూలు మొక్కజొన్న లేతగా ఉండాలి;చీజ్ – 50 గ్రాములు;మిరియాల పొడి– అర టీ స్పూన్;కొత్తిమీర తరుగు – టీ స్పూన్;ఆరెగానో పౌడర్ – అర టీ స్పూన్;వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్;మైదా లేదా శనగపిండి – 4 టేబుల్ స్పూన్లు;ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచికి తగినంత;నూనె – 3 టేబుల్ స్పూన్లు;తయారీ..– బంగాళదుంపను ఉడికించి తొక్క తీసి చిదిమి పక్కన పెట్టాలి.– మొక్కజొన్న గింజలను ఉడికించి నీటిని వంపేసి పక్క పెట్టాలి. చీజ్‌ను తురమాలి.– ఒక పాత్రలో బంగాళదుంప, మొక్కజొన్న గింజలు, శనగపిండి, చీజ్ తురుము, వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, ఉప్పు, కొత్తిమీర, ఆరెగానో వేసి కలపాలి.– రుచి చూసి అవసరమైతే మరికొంత ఉప్పు, మిరియాలపొడి కలుపుకోవచ్చు.– గుంత పొంగనాల పెనం వేడి చేసి ఒక్కో గుంతలో పావు టీ స్పూన్ నూనె వేయాలి.– పెనం, నూనె బాగా వేడయ్యే లోపు బంగాళదుంప మిశ్రమాన్ని చిన్న గోళీలంత బాల్స్ చేసి పక్కన పెట్టాలి.– నూనె వేడెక్కిన తర్వాత ఒక్కో గోళీని ఒక్కో గుంతలో పెట్టి మూత పెట్టాలి.– మీడియం మంట మీద ఓ నిమిషం పాటు కాలనిచ్చి మూత తీసి ప్రతి బాల్నీ తిరగేయాలి.– తిరగేసిన తర్వాత మూత పెట్టకుండా రెండో వైపు కూడా ఎర్రగా కాలనిచ్చి తీయాలి.– వేడిగా కరకరలాడుతూ రుచిగా ఉంటాయి.గమనిక: గుంత పొంగనాల పెనం లేకపోతే మామూలు బాణలిలో నూనె వేడి చేసి చీజ్ బాల్స్‌ని ఎర్రగా ఆయిల్ రోస్ట్ చేసుకోవాలి.ఫ్రైడ్ రైస్..కావలసినవి:బాసుమతి బియ్యం – 200 గ్రాములు;నూనె – అర టీ స్పూన్;నీరు – 3 కప్పులు;మొక్క జొన్న గింజలు – 300 గ్రాములు (స్వీట్ కార్న్ లేదా మామూలు మొక్కజొన్న లేత గింజలు);ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు;ఉల్లికాడల ముక్కలు – 3 టేబుల్ స్పూన్లు;సెలెరీ లేదా కొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లు;క్యాప్సికమ్ తరుగు – పావు కప్పు;మిరియాల పొడి– టీ స్పూన్;సోయాసాస్– టేబుల్ స్పూన్;ఉప్పు – ఒకటిన్నర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;నెయ్యి లేదా నువ్వుల నూనె – 2 టేబుల్ స్పూన్లు.తయారీ..– బియ్యాన్ని కడిగి 20 నిమిషాల సేపు నానబెట్టి నీటిని వంపేసి పక్కన పెట్టాలి.– ఒక పాత్రలో మూడు కప్పుల నీరు పోసి వేడి చేసి మరిగేటప్పుడు అందులో పావు టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ ఆయిల్, కడిగి పెట్టిన బియ్యం వేయాలి.– అన్నం ఉడికిన తర్వాత వార్చి అన్నాన్ని ఒక పళ్లెంలో పోసి పక్కన పెట్టాలి.– అన్నం ఉడికేలోపు మరొక స్టవ్ మీద పాత్ర పెట్టి మొక్కజొన్న గింజలను ఉడికించాలి.– ఇప్పుడు స్టవ్ మీద వెడల్పు పాత్ర లేదా పెద్ద బాణలి పెట్టి నెయ్యి లేదా నువ్వుల నూనె వేడి చేయాలి.– అందులో ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడల ముక్కలు వేసి దోరగా వేయించాలి.– తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, సెలెరీ తరుగు వేసి అవి వేగిన తర్వాత ఉడికించిన మొక్కజొన్న గింజలు, సోయాసాస్ వేసి దోరగా వేయించాలి.– అందులో మిరియాలపొడి, ఉప్పు వేసి కలిపి ఇప్పుడు అందులో సగం అన్నం వేసి అన్నం మెతుకులు నలగనంత సున్నితంగా ఒక నిమిషం పాటు వేయించాలి.– ఇప్పుడు మిగిలిన అన్నాన్ని కూడా వేసి అంతా కలిసేటట్లు బాణలిని కదిలించి మూత పెట్టి స్టవ్ మీద నుంచి దించేయాలి. -
Earth Overshoot Day 2024: ఆగస్టు1 నాటికే.. అన్నీ వాడేశాం!
భూగోళం ప్రకృతి వనరులను పునరుత్పత్తి చేసుకోగలిగే వేగం కంటే.. ప్రకృతి వనరులను మనుషులు అధిక వేగంతో వాడుకుంటూ ఉండటం వల్ల ఈ ఏడాదంతా వాడుకోవాల్సిన వనరులు ఆగస్టు1 నాటికే పూర్తిగా వాడేసుకున్నట్లు గ్లోబల్ ఫుట్‌ప్రింట్ నెట్వర్క్ చెబుతోంది. అంటే.. రేపటి (ఆగస్టు 2) నుంచి మనం పీల్చే గాలి, తాగే నీరూ, వాడే వనరులన్నీ ప్రకృతికి పెనుభారమే! అది తెలియజెప్పేదే ‘ఎర్త్ ఓవర్ షూట్ డే’.ఒక విధంగా చెప్పాలంటే.. మనుషులు భూగ్రహంపై పర్యావరణ వ్యవస్థలు పునరుత్పత్తి చేయగల దానికంటే 1.7 రెట్లు వేగంగా ప్రకృతివనరులను ఖర్చు చేస్తున్నారని 2024 ఎర్త్ ఓవర్ షూట్ డే సూచిస్తోంది. ఈ పర్యావరణ లోటు ఎంత ఎక్కువగా ఉంటే.. అడవుల నిర్మూలన, నేలకోత, జీవవైవిధ్య నష్టం అంత వేగంగా జరుగుతున్నట్లు లెక్క.419 పిపిఎంకి పెరిగిన సీఓ2..భూవాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ సాంద్రత 2023 నాటికి 419.3 పార్ట్స్ పర్ మిలియన్(పిపిఎం) స్థాయికి పెరిగింది. 2022 – 2023 మధ్యలో 2.8 పిపిఎం పెరిగింది. ఏడాదికి 2 పిపిఎం కన్నా ఎక్కువగా పెరగటం వరుసగా ఇది 12వ సంవత్సరం. ఈ సాంద్రత వల్లే భూ తాపం పెరిగిపోతోంది. ఫలితంగా పర్యావరణం గతి తప్పి.. వాతావరణం మార్పులకు లోనవుతోంది.ఎవరు లెక్కిస్తున్నారు?కెనడాలోని యోర్క్ యూనివర్సిటీ ‘ఎకలాజికల్ ఫుట్‌ప్రింట్ ఇనీషియేటివ్’ కార్యక్రమంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి పునరుత్పత్తి సామర్థ్యాన్ని, ఏయే దేశాల్లో ప్రకృతి వనరుల వాడకం ఏ తీరులో ఉంటోందో లెక్కగడుతోంది. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రాల స్థాయిలో ఈ గణాంకాలు అందుబాటులో ఉన్నాయి. 1971లో ప్రపంచ పర్యావరణ బడ్జెట్ డిసెంబర్ ఆఖరి రోజుల వరకు సరిపోతూ ఉండేది. 1973 నుంచి లోటు పెరుగుతూ వచ్చింది. 1997 అక్టోబర్ వరకు ఉండేది. ఆ తర్వాత మరింత వేగంగా పెరుగుతూ 2024 ఆగస్టు 1 నాటికే పర్యావరణ వనరుల ఖాతా ఖాళీ అయే స్థితికి చేరింది.పర్యావరణ పాదముద్ర.. ఎంతమేరకు ప్రకృతి వనరులు వాడుతూ ఉంటే అంత పర్యావరణ పాదముద్ర (ఎకలాజికల్ ఫుట్‌ప్రింట్) ఉంటుందన్నమాట. ఇది ప్రతి మనిషికి, ప్రతి దేశానికీ వేర్వేరుగా ఉంటుంది. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అమెరికన్లలా ప్రకృతి వనరులు వాడితే 5 భూగోళాలు అవసరం అవుతాయి. అయితే ఆ విధంగా చూసుకుంటే మాత్రం ప్రకృతి వనరుల వాడకంలో భారతీయులు పొదుపరులేనని చెప్పాల్సి ఉంటుంది. ప్రపంచంలో అందరూ మనలా ఉండగలిగితే 30% వనరులు మిగిలే ఉంటాయి.మీ పర్యావరణ పాదముద్ర ఎంత?దైనందిన జీవితంలో మనం చేసే ప్రతిపనికీ ప్రకృతి వనరులు ఎంతోకొంత ఖర్చవుతూనే ఉంటాయి. మనం చేసే పనులు, తినే ఆహారం, వాడే వాహన ఇంధనం, ధరించే వస్త్రాలు.. ఇలాంటివన్నీ మన పర్యావరణ పాదముద్ర స్థాయిని నిర్ణయిస్తాయి.జీవన శైలిని మార్చుకొని సహజ వనరుల వాడకాన్ని తగ్గించుకుంటూ ప్రకృతి పరిరక్షణకు దోహదం చేయొచ్చు.. భూతలమ్మీద వాతావరణంలో కర్బన ఉద్గారాలను పెంపొందించే పనులు తగ్గించే పనులను చేపట్టగలిగితే ఆ మేరకు.. ఎర్త్ ఓవర్ షూట్ డేని వెనక్కి జరపగలం! ఏటేటా పెరిగిపోతున్న పర్యావరణ అప్పు భారాన్ని ఆ మేరకు తగ్గించుకోగలుగుతాం. అయితే, పెరుగుతున్న జనాభా నేపథ్యంలో.. స్థూల జాతీయోత్పత్తి(జిడిపి) ఎలాగైనా ఏటా పెరగాల్సిందే అనే మానవాళి ధోరణితో.. ఇదెంత వరకు సాధ్యం అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న!ఇవి చదవండి: వీడియో: ఆకతాయిల ఓవరాక్షన్.. వరద నీటిలో మహిళపై వేధింపులు! -
ప్రెగ్నెన్సీలో కాఫీ తాగడం.. ఎంతవరకూ మంచిదంటే?
నాకిప్పుడు 4వ నెల. రోజుకు అయిదారుసార్లు కాఫీ తాగుతాను. ప్రెగ్నెన్సీలో కాఫీ అంత మంచిది కాదు మానేయమని మా ఫ్రెండ్స్ చెబుతున్నారు. కానీ కాఫీ తాగకపోతే నాకు తలనొప్పి వచ్చేస్తుంది. నిజంగానే ప్రెగ్నెన్సీ టైమ్‌లో కాఫీ మంచిది కాదా? – సంగీత కృష్ణ, హైదరాబాద్కెఫీన్ అనేది చాలా ఫుడ్ అండ్ బేవరేజెస్లో ఉంటుంది. కాఫీ, టీ, చాకోలెట్, కోకో ప్రొడక్ట్స్, కోలాస్, సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, జలుబు, జ్వరానికి సంబంధించిన కొన్ని మందుల్లో, ఎలర్జీ, డైట్ పిల్స్, డైటరీ సప్లిమెంట్స్‌లో కూడా కొంత శాతం కలుస్తుంది. ప్రత్యేకించి కాఫీలో అయితే 50 నుంచి 70 శాతం కెఫీన్ ఉంటుంది. కెఫీన్ వల్ల గర్భిణీల్లో వచ్చే మార్పుల మీద చాలా థియరీలే ఉన్నాయి.కానీ వంద శాతం ఏదీ నిర్ధారణ కాలేదు. అయితే కాఫీ తీసుకోవడం వల్ల అందులోని కెఫీన్ ప్లసెంటా ద్వారా పొట్టలోని బిడ్డకూ చేరుతుంది. ఈ క్రమంలో బిడ్డ ఎదుగుదల మీద ఏదైనా ప్రభావం కనపడితే దానికి చాలా రకాల కారణాలూ తోడవుతాయి తప్ప ఆ ప్రభావానికి కెఫీనే ప్రధాన కారణమని ప్రూవ్ చేయడం కష్టం. సాధారణంగా ఒక కప్పు కాఫీలో వంద మిల్లీగ్రాముల దాకా కెఫీన్ ఉండవచ్చు. కెఫీన్ మెటబాలైట్స్ని గర్భిణీ రక్తంలో మాత్రమే చెక్ చేయగలం. కానీ అలా ప్రతిరోజూ టెస్ట్ చేయడం ప్రాక్టికల్‌గా అసాధ్యం.కెఫీన్ మీద ఇప్పటివరకు జరిగిన అన్నిరకాల అధ్యయనాల్లో .. తక్కువ నుంచి ఓ మోస్తరు వరకు కాఫీ సేవనం వల్ల గర్భిణీలకు పెద్ద హాని ఏమీ ఉండకపోవచ్చనే తేలింది. అధిక మోతాదులో అంటే రోజుకు 300 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువ కెఫీన్‌ని తీసుకునే వారిలో గర్భస్రావాలు, తక్కువ బరువుతో శిశు జననం వంటి ప్రమాదాలు ఉండవచ్చు. ఏదేమైనా ప్రెగ్నెన్సీ సమయంలో కెఫీన్‌తో పాటు పొగాకు, సిగరెట్ , మద్యం లాంటి వాటికి దూరంగా ఉండటమే క్షేమం. – డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
పత్తిసాగులో మెరుగైన యాజమాన్య పద్ధతే మేలు
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి సకాలంలో ప్రవేశిస్తాయన్న వాతావరణశాఖ సూచనలతో రైతాంగం వ్యవసాయ పనుల్లో బిజీ అవుతోంది. ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన విత్తనాలు, ఎరువులు ఇతర ఇన్పుట్స్ కోసం రైతులు సన్నద్ధమవుతున్నారు. విత్తనాల ఎంపిక, యాజమాన్య పద్ధతులపై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పత్తి రైతులకు పలు సూచనలు చేసింది. అందుబాటులో ఉన్న వివిధ పత్తి హైబ్రిడ్లలో వరి, మినుము, సోయాచిక్కుడు పంటలలో మాదిరిగా ఎక్కువగా వైవిధ్యం లేదని, మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకుడు డాక్టర్ పి.రఘురామిరెడ్డి చెబుతున్నారు. » ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో సుమారు 55 లక్షల ఎకరాలలో పత్తి సాగయ్యే అవకాశాలున్నాయి.» గతేడాదితో పోలిస్తే పత్తిసాగు 10 లక్షల ఎకరాలు అదనం. డిమాండ్ దృష్ట్యా 1.20 కోట్ల విత్తన ప్యాకెట్లు వ్యవసాయశాఖ అందుబాటులో ఉంచింది.» రైతులు కొన్నిచోట్ల ఒకటి, రెండు కంపెనీల విత్తనాల కోసం డిమాండ్ చేయడం, ఆ కంపెనీల విత్తనం మాత్రమే కావాలని అడుగుతున్నారు. కానీ యాజమాన్య పద్ధతులే దిగుబడికి కారణం అవుతాయని అధికారులు చెబుతున్నారు.» గతంలో కూడా రైతులు ఇలాగే ఒకే రకమైన విత్తనాలు కావాలని కోరితే, మార్కెట్లో అందుబాటులో ఉన్న హైబ్రిడ్లపై విశ్వవిద్యాలయం అధ్యయనం చేసింది. దిగుబడులపై అంచనా వేసింది. ఆ హైబ్రిడ్ల దిగుబడుల్లో పెద్దగా తేడా లేదని పరిశోధనలో తేలింది.» రెండుమూడేళ్లుగా అధిక సాంద్రత పత్తి సాగుకు ప్రాధాన్యం ఇచ్చారు. పొలాల్లో కూడా ప్రదర్శన క్షేత్రాలను ఏర్పాటు చేశారు. దీనివల్ల ఎకరాకు రెండున్నర నుంచి 3 క్వింటాళ్ల అధిక దిగుబడి వచ్చిందని పరిశోధనలో తేలింది. మొక్కల సంఖ్య పెంచడం, మొక్కకు సరాసరి 10–12 కాయలు ఉన్నప్పుడు ఆశించిన దిగుబడులు సాధిస్తున్నట్టు గుర్తించారు. » సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం వల్లనే ఇది సాధ్యమైందని, ఎరువుల యాజమాన్యం, పోషకాల యాజమాన్యంతో మంచి దిగుబడులను సాధిస్తున్నట్టు పరిశీలనలో వెలుగు చూసింది.» సూక్ష్మ పోషకలోపాలను సరిదిద్ది, మేలైన చీడపీడల యాజమాన్యం పాటించడం వల్ల పత్తి పంటలో అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది.» వర్షాధారంగా పత్తిని ఎవరైతే సాగు చేస్తున్నారో, ఆ రైతులు, పెద్ద కాయలు ఉన్న హైబ్రిడ్ల కన్నా, మధ్యస్థంగా కాయలు వచ్చే హైబ్రిడ్లను ఎంపిక చేసుకోవడం మంచిది.» నీటి వసతులు ఉన్నచోట, నల్ల భూములు ఉన్నచోట పెద్ద కాయలు వచ్చే హైబ్రిడ్లను ఎంపిక చేసుకోవచ్చు.» భూమి తడిసి, 50– 60 మిల్లీ మీటర్ల వర్షపాతం పడిన తర్వాతనే పత్తి గింజలు విత్తుకోవాలి.» చెలక భూములు, తేలిక భూములు, వర్షాధార భూముల్లో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేయడం వల్ల దిగుబడులు పెంచుకోవచ్చు.» ఎకరాకు 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాషియం సరైన మోతాదులో ఎరువుల యాజమాన్యం చేపట్టడం వల్ల పత్తిలో మంచి దిగుబడులు సాధించవచ్చు. » అవసరం మేరకు పోషకాల పిచికారీ (19:19:19 / 13:0:45/యూరియా) చేపట్టాలి. -
పింఛన్ దారులకు పెన్షన్ కానుక పంపిణీ..
-
5 పథకాలు.. 4 నెలలకోసారి
సాక్షి, హైదరాబాద్: ఆరు గ్యారంటీలు సమర్థవంతంగా అమలు...క్షేత్రస్థాయిలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు నాలుగునెలలకోసారి ప్రభుత్వం ‘ప్రజాపాలన’ కార్యక్రమం నిర్వహించనుంది. అయితే ఈ కార్యక్రమాన్ని ఐదు పథకాలకు మాత్రమే వర్తింపజేస్తామని ప్రభుత్వవర్గాలు స్పష్టం చేశాయి. ఈ మేరకు ఆదివారం జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ప్రజాపాలన కార్యక్రమ అమలు విధివిధానాలపై మార్గదర్శకాలు విడుదల చేశారు. దీని ప్రకారం ప్రజాపాలన కార్యక్రమాన్ని ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు ఎనిమిది పనిదినాల్లో (డిసెంబర్31, జనవరి1 మినహాయించి) నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతి రోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామపంచాయతీలోనూ, పట్టణ ప్రాంతాల్లో ప్రతి మున్సిపల్ వార్డులోనూ ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. షెడ్యూల్, నిబంధనలు ►ఈ నెల 25వ తేదీలోపు అధికారుల బృందాల ఏర్పాటు, గ్రామాల వారీగా విజిట్ షెడ్యూల్ త యారీ (మంగళవారం సాయంత్రం ఆరు గంట లకల్లా ఈ వివరాలు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది) ►ఈ నెల 26న అధికారుల బృందాలకు శిక్షణ, అవగాహన ►ఈ నెల 26,27 తేదీల్లో జిల్లా ఇన్చార్జ్ మంత్రుల ఆధ్వర్యంలో జిల్లాస్థాయి, నియోజకవర్గ స్థాయిలో అధికారులకు అవగాహన కార్యక్రమం, పథకం ఉద్దేశాల వివరణ ►ఈ నెల 28న గ్రామ, వార్డు సదస్సులు ప్రారంభం..సాయంత్రం 8 గంటల కల్లా డైలీ రిపోర్టు ఆన్లైన్లో పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి. ►సదస్సు ఏర్పాటుకు ఒక రోజు ముందే గ్రామాలు, వార్డుల్లో టాంటాం వేయించడంతో పాటు కౌంటర్లు, ఇతర ఏర్పాట్లు చేసుకోవాలి. ►రాష్ట్ర స్థాయిలో ఒక ఉమ్మడి దరఖాస్తు ఫారం రూపొందించి కలెక్టర్లకు పంపిస్తారు. వీటిని ఈ నెల 27వ తేదీ రాత్రికల్లా గ్రామాలు, వార్డులకు పంపించాలి. ముందు రోజే గ్రామాలు, వార్డుల్లో దరఖాస్తులు పంపిణీ చేసి వాటిని ప్రజలతో నింపించాలి. ►సభలు సజావుగా నిర్వహించడానికి తాగునీరు, టెంట్లు, కౌంటర్ల కోసం టేబుళ్లు, క్యూలైన్ల కోసం బారికేడ్లు ఏర్పాటు చేయాలి. ►గ్యారంటీల అమలుతో సంబంధం ఉన్న అన్ని శాఖల అధికారులు ఈ సభలకు హాజరు కావాలి. నియోజకవర్గస్థాయిలో నోడల్ అధికా రులను నియమించి కార్యక్ర మాన్ని పర్యవేక్షించాలి. ప్రతి గ్రామపంచాయతీ / వార్డుకు ప్రత్యేక అధికారిని ఇన్చార్జ్గా నియమించాలి. ►ఇతర గ్రామ స్థాయి అధికా రులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లతో సమన్వయం చేసుకొని కార్యక్రమం నిర్వ హించాలి. ►గ్రామ పంచాయతీ సర్పంచ్/కౌన్సిలర్/కార్పొరేటర్, ఇతర ప్రజాప్రతినిధులను సదస్సులకు ఆహ్వానించాలి. ►సభ ప్రారంభానికి ముందు ప్రభుత్వ సందేశాన్ని చదివి వినిపించాలి. ►దరఖాస్తులతో పాటు అవసరమైన ఆధార్, తెల్లరేషన్ కార్డు సమర్పించేలా కౌంటర్లలో ఉండే సిబ్బంది జాగ్రత్త తీసుకోవాలి. దరఖాస్తుల స్వీకరణకు మహిళలకు ప్రత్యేక కౌంటర్లు, స్త్రీ, పురుషులకు విడివిడిగా క్యూలైన్లు ఏర్పాట్లు చేయాలి. దరఖాస్తుదారులు భారీ సంఖ్యలో ఉంటే టోకెన్ విధాననం అమలు చేయాలి. ►దరఖాస్తుకు రశీదు తప్పనిసరిగా ఇవ్వాలి. ► స్వీకరించిన ప్రతి దరఖాస్తు వివరాన్ని పంచాయతీరాజ్ శాఖ రూపొందించిన ఆన్లైన్ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయాలి. ప్రతి దరఖాస్తుకు ఒక ప్రత్యేక సంఖ్య కేటాయించాలి. ► పట్టణ ప్రాంతాల్లో ఈ కార్య క్రమాన్ని జీహెచ్ఎంసీ కమిష నర్ లేదా సంబంధిత మున్సి పల్ కమిషనర్లు పర్యవే క్షిస్తారు. ► స్వీకరించిన అన్ని దర ఖాస్తులు టీం లీడర్ అధీనంలో ఉంచాలి. వాటిని భద్రపర్చడంతో పాటు కంప్యూటరీకరించేందుకు అవస రమైన కార్యాలా యాన్ని జిల్లా కలెక్టర్ కేటాయించాలి. ►ప్రతి అధికారుల బృందం రోజుకు రెండు గ్రామాల్లో సభలు నిర్వహించాలి. జనవరి ఆరో తేదీ నాటికి పూర్తి చేసుకోవాలి. ప్రతి 100 కుటుంబాలకు కనీసం ఒక కౌంటర్ ఉండేలా చూసుకోవాలి. ►దరఖాస్తుల వెరిఫికేషన్/ప్రాసెసింగ్‌కు సూచన లు ప్రభుత్వం త్వరలోనే జారీ చేస్తుంది. ►అధికారుల బృందాలు విజిట్ షెడ్యూల్‌కు 10 అంశాలతో, డైలీ రిపోర్టు కోసం 11 అంశాలతో ప్రత్యేక ఫార్మాట్ రూపొందించారు. గ్రామాలు లేదా వార్డులకు వచ్చే అధికారులు వీరే ►తహసీల్దారు లేదా రెవెన్యూ శాఖ ప్రతినిధి ►ఎంపీడీఓ లేదా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతినిధి ►మండల పంచాయతీ అధికారి లేదా పంచాయతీరాజ్ ప్రతినిధి ►మండల వ్యవసాయ అధికారి లేదా వ్యవసాయ శాఖ ప్రతినిధి ►పౌరసరఫరాల శాఖ ప్రతినిధి ► పీహెచ్‌సీలోని వైద్యాధికారి లేదా వైద్య శాఖ ప్రతినిధి ►మండల విద్యాధికారి లేదా విద్యాశాఖ ప్రతినిధి ►ఏఈ (డిస్కం) లేదా విద్యుత్‌శాఖ ప్రతినిధి ►సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి ►ఇతర సంబంధిత అధికారులు. (వీరిలో అవసరమైన అధికారులను గ్రామాల వారీ గా నియమించుకోవాల్సి ఉంటుంది.) దరఖాస్తులు స్వీకరించే పథకాలు: మహాలక్ష్మి రైతుభరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇళ్లు చేయూత -
కోవిడ్ కేసులు పైపైకి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీచేసింది. కోవిడ్ కేసుల్లో పెరుగుదల, కేరళలో కరోనా కొత్త సబ్‌వేరియంట్ జేఎన్1 (బీఏ 2.86.1.1) వెలుగుచూసిన నేపథ్యంలో కేంద్రం సోమవారం ముందస్తు చర్యలకు దిగింది. ‘‘ కోవిడ్ కేసుల్లో ఉధృతి కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చర్యలు తీసుకోవాలి. పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలన్నీ అప్రమత్తంగా ఉండాలి. భారత వాతావరణాన్ని తట్టుకుని వేరియంట్లు విజృంభించేలోపు ముందస్తు చర్యలతో సమాయత్తం అవుదాం’’ అని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సుధాన్‡్ష పంత్ రాష్ట్రాలకు లేఖ రాశారు. ఆదివారం దేశవ్యాప్తంగా ఐదుగురు కోవిడ్‌తో కన్నుమూశారు. కొత్తగా వందలాది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. -
అఫిడవిట్లతో జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో రాష్ట్రంలో శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ తెలిపారు. నామినేషన్ల దాఖలులో అభ్యర్థులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, అఫిడవిట్లకు సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ధారించుకున్న తర్వాతే సమర్పించాలని స్పష్టం చేశారు. అఫిడవిట్‌లోని అన్ని కాలమ్స్ తప్పకుండా పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు. వివరాల సమర్పణలో పొరపాట్లుంటే నామినేషన్ తిరస్కరిస్తామని, అందుకు అభ్యర్థే బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు. ఆదివారం మినహా మిగతా రోజుల్లో నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుందని వెల్లడించారు. అభ్యర్థులు గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చని, కానీ ఒకదానికి మాత్రమే డిపాజిట్ చెల్లుతుందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో శుక్రవారం బీఆర్కేఆర్ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. 13 నియోజకవర్గాల్లో 4 గంటల వరకే పోలింగ్ రాష్ట్రంలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ గంట కుదించడం జరిగిందని సీఈఓ తెలిపారు. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్. మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే జరుగుతుందని, మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని చెప్పారు. రైతుబంధుపై ప్రతిపాదనలు రాలేదు.. ప్రగతిభవన్‌లో ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి వివరణ వచ్చిందని, ఆ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించినట్లు వికాస్‌రాజ్ తెలిపారు. రైతుబంధు పథకం కింద లబ్దిదారులకు సాయం అందజేతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదన అందలేదన్నారు. కోడ్ ఉల్లంఘనలపై 137 కేసులు ఫైల్ చేశామని, ఇందులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 13, కాంగ్రెస్ 16, బీజేపీ 5, బీఎస్పీకి సంబంధించి 3 కేసులు ఉన్నాయని చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎంపీల భద్రత జిల్లా ఎస్పీలు పర్యవేక్షిస్తారన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం 4 నెలలుగా దాదాపు 22 శాఖలతో సమావేశాలు నిర్వహిస్తోందని, అందులో ఐటీ శాఖ కూడా ఉందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ శాఖ లు బాధ్యతతో పనిచేస్తున్నాయని వివరించారు. తొలిసారిగా పెద్దసంఖ్యలో యువ ఓటర్లు రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3.21 కోట్లకు చేరిందని, ఇందులో పురుషులు 1.609 కోట్లు, మహిళలు 1.608 కోట్లు ఉన్నారని సీఈఓ తెలిపారు. అక్టోబర్ 31వ తేదీ వరకు వచ్చిన ఓటరు నమోదు దరఖాస్తుల పరిశీలన నవంబర్ 10వ తేదీలోగా పూర్తి చేస్తామన్నారు. 18–19 సంవత్సరాల మధ్య ఉన్న ఓటర్లు 9.10 లక్షల మంది ఉన్నారని, ఇంత పెద్ద సంఖ్యలో యువ ఓటర్లుండడం ఇదే తొలిసారి అని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,356 పోలింగ్ స్టేషన్లున్నాయని, ఇందులో పట్టణ ప్రాంతంలో 14,458, గ్రామీణ ప్రాంతాల్లో 20,898 ఉన్నాయన్నారు. ఓటర్లకు ముందస్తుగానే ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు అందజేస్తామని, ఈ మేరకు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రూ.453.93 కోట్లు సీజ్ రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.453.93 కోట్లు సీజ్ చేసినట్లు వికాస్‌రాజ్ తెలిపారు. రూ.165.43 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.43.86 కోట్ల విలువైన వాహనాలు, కుక్కర్లు, చీరలు, సెల్ఫో న్లు తదితర వస్తువులు సీజ్ చేశామన్నారు. నగదు రవాణాకు సంబంధించి ఎన్నికల సంఘం ప్రత్యే కంగా రూపొందించిన నిబంధనలు పాటించా లని సూచించారు. సీజ్ చేసిన ప్రతి రూపాయికి రసీదు ఇవ్వడం జరుగుతుందని, ఆధారాలు చూపితే తిరిగి ఇస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 362 కేసులు నమోదు చేయగా, 256 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయన్నారు. 2,928 బైండోవర్లు ఉన్నాయని, 7,460 ఆయుధాలు డిపాజిట్ చేశామని తెలిపారు. నాన్‌బెయిలబుల్ వా రెంట్లు 238 జారీ చేశామని, ఇప్పటివరకు సీ విజిల్‌కు 2,487, 1950 నంబర్‌కు 437 ఫిర్యాదులు వచ్చాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 205 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని వికాస్‌రాజ్ తెలిపారు. -
సాంకేతికంగా బీఆర్ఎస్ ను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారు: కేసీఆర్
-
పిల్లల్లో పొరబోయిందా?.. గొంతులో ఏదైనా ఇరుక్కుందా..?
పిల్లలు తినే సమయంలో వారి గొంతులో ఏదైనా ఇరుక్కున్నపుడు పొర పోయిందని పెద్దలు అంటుంటారు. తిన్న ఆహారం కిందికి కదలడం కోసం తలపై తడుతుంటారు. కానీ గొంతులో ఇరుక్కున్న ఆహారంగానీ లేదా నాణెంలాంటి వస్తువుగానీ ఊపిరితిత్తుల్లోకి వెళ్లే వాయునాళంలోకి పోతే చాలా ప్రమాదం. ఇలా ఆహారం ఇరుక్కున్నా లేదా ఏదైనా వస్తువు గొంతులో ఇరుక్కున్నా హాస్పిటల్‌కు వెళ్లేలోపు ఈ కింద పేర్కొన్న సూచనలు పాటించాలి. పిల్లల నోరు బాగా తెరిపించి, నాలుక బాగా చాపేలా చేసి, గొంతులోకి వేళ్లుపోనిచ్చి చేతికి ఏదైనా తగులుతుందేమో చూడాలి. తగిలితే వెంటనే బయటకు తీసేయాలి. ∙పిల్లాడి వెనక పెద్దలెవరైనా నిల్చుని, వారి రెండు చేతుల్నీ పొట్టచుట్టూ బిగించి, అకస్మాత్తుగా చేతుల్తో పట్టుబిగుస్తున్నట్లుగా కదిలించాలి. ఇది క్రమపద్ధతిలో (రిథమాటిక్‌గా) చేస్తుండాలి. దాంతో పొట్ట దగ్గర ఒత్తిడి పెరిగి, గొంతులో ఇరుక్కున్నది బయటకు రావచ్చు. దీన్ని హీమ్లిచ్ మెనోవర్ అంటారు. ఇదే గనక చాలా చిన్నపిల్లల్లో / పసిపాపల్లో చేయాల్సి వస్తే... పెద్దలు కుర్చీలో కూర్చుని, చిన్నారులు తలకిందులుగా ఉండేలా, వాళ్లను తమ కాళ్లపైన బోర్లా పడుకోబెట్టాలి. ఇలా పడుకోబెట్టాక, చిన్నారుల వీపుపై అకస్మాత్తుగా ఒత్తిడి కలిగేలా నొక్కాలి. ఇది ఎలా జరగాలంటే... చిన్నారుల నడుము నుంచి వారి రెండు భుజాల మధ్య ప్రాంతంలో మృదువుగా ఒత్తిడి కలిగేలా కదిలిస్తుండాలి. ఇది కూడా క్రమపద్ధతిలో (రిథమాటిక్‌గా) చేయాలి. ఒకవైపు పొట్ట మీద పెద్దల కాళ్ల ఒత్తిడీ, మరోవైపు వీపు మీద చేతుల ఒత్తిడి కారణంగా గొంతులో అడ్డు పడ్డ పదార్థం బయటకు వచ్చే అవకాశం ఉంది. ∙ప్రథమ చికిత్సగా ఇవి చేస్తూ... వీలైనంత త్వరగా పిల్లల్ని హాస్పిటల్‌కు తరలించాలి. ఈ ప్రక్రియలతో గొంతులో ఇరుక్కున్నవి బయటకు వస్తే సరి. లేదంటే హాస్పిటల్లో అవసరాన్ని బట్టి ఎండోస్కోప్ వాడి, ఇరుక్కున్న పదార్థాన్ని డాక్టర్లు బయటకు తీస్తారు. (చదవండి: చిన్నారులను వేధించే పిన్‌వార్మ్ / థ్రెడ్ వార్మ్ ఇన్ఫెక్షన్ అంటే...? ) -
మెరుగైన వైద్యం అందించాలి.. ఎమ్మెల్యే సూచనలు..!
జగిత్యాల: ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా వైద్యులు పనిచేయాలని, పేషెంట్లకు మెరుగై న వైద్యం అందించాలని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు సూచించారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులతో శుక్రవారం ఆయన సమావేశం నిర్వహించారు. వైద్య సేవలు, ఇతర విషయాల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలకు వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు.విధి నిర్వహణలో సమయపాలన పాటించాలని సూచించారు. ప్రతీ ఆదివారం గైనకా లజిస్ట్ తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ నిధులు పక్కదారి పట్టాయ నే ఆరోపణలపై రికార్డులను పరిశీలించి పూర్తి వివరాలు ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. పలువురు ఉద్యోగులు జీతాలు సరిగ్గా రావడంలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ఆయన అ ధికారులకు ఫోన్‌చేసి జీతాలు త్వరగా వచ్చేలా చూడాలని కోరారు. పేషెంట్లకు కావాల్సిన అన్ని మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రి భవనం పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. కొత్త భవనం పూర్తయ్యాక సీటీస్కాన్‌తోపాటు మరిన్ని అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి తెస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాణవేని సుజాత, ఇన్చార్జి సూపరింటెండెంట్ సాజీద్ అహ్మద్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ వెబ్సైట్ పట్ల అప్రమత్తంగా ఉండండి
న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లు సుప్రీంకోర్టువెబ్సైట్ను కూడా వదిలిపెట్టలేదు. నకిలీ వెబ్సైట్ రూపొందించారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ న్యాయవాదులను, కక్షిదారులను గురువారం సూచనలు జారీ చేశారు. నకిలీ వెబ్సైట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. సుప్రీంకోర్టు సైతం పబ్లిక్ నోటీసు జారీ చేసింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే వెబ్సైట్ లింక్‌లపై క్లిక్ చేయొద్దని, షేర్ చేయొద్దని వెల్లడించింది. అధికారిక వెబ్‌సైట్‌ను పోలిన నకిలీ వెబ్‌సైట్‌ను సైబర్ నేరగాళ్లు రూపొందించారని, యూఆర్ఎల్లో అందుబాటులో ఉంచారని తెలిపింది. ఈ వెబ్సైట్ ద్వారా వ్యక్తిగత, రహస్య సమాచారం సేకరించి, మోసగించే ప్రమాదం ఉందన్నారు. లాయర్ల, కక్షిదారుల వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని, ఆర్థిక లావాదేవీల వివరాలను సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఎప్పుడూ కోరదని, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొంది. ఠీఠీఠీ.టఛిజీ.జౌఠి.జీn అనే వెబ్సైట్ మాత్రమే అసలైనదని స్పష్టం చేసింది. ఒకవేళ సైబర్ దాడి బారినపడితే బ్యాంకు ఆన్లైన్ ఖాతాల పాస్వర్డ్లు వెంటనే మార్చుకోవాలని, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. -
గ్రూప్-4 పరీక్ష.. అభ్యర్థులు పాటించాల్సిన రూల్స్ ఇవే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో రెండు రోజుల్లో టీఎస్పీఎస్సీ గ్రూప్-4 పరీక్ష జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం (జులై 1) నిర్వహించే ఈ పరీక్షను రాసేందుకు లక్షలాది మంది విద్యార్థులు సన్నద్ధమై ఉన్నారు. ఈ పరీక్ష కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కడ్భందీగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే హాల్ టికెట్లు విడుదల చేశారు అధికారులు. ప్రభుత్వ విభాగాల్లో 8,180 గ్రూప్-4 పోస్టులకు 9.51 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను రెండంచెల తనిఖీలు నిర్వహించనున్నారు. గ్రూప్-4 పరీక్ష అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ ఇటీవల జారీ చేసిన కొన్ని కీలక సూచనల్ని పరిశీలిస్తే ► గతంలో జరిగిన ఇబ్బందులను, లోపాలను పరిగణలోకి తీసుకున్న టీఎస్పీఎస్సీ పకడ్భందీగా ఎగ్జామ్స్ నిర్వహణకు చర్యలు చేపట్టింది. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్ల గేట్లు మూసివేస్తామని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. ►ఉదయం పేపర్-1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనుండగా.. 9.45 గంటలు దాటిన తర్వాత అభ్యర్థులను లోనికి అనుమతించరు. ►మధ్యాహ్నం పేపర్-2 పరీలో 2:30 గంటల నుంచి 5:00 గంటల వరకు నిర్వహించనుండగా.. 2.15 తరువాత ఎగ్జామ్ సెంటర్లలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని కమిషన్ స్పష్టం చేసింది. పేపర్-1కు ఉదయం 8 గంటల నుంచి, పేపర్-2కు మధ్యాహ్నం ఒంట గంట నుంచి కేంద్రంలోకి అనుమతించనున్నారు. ► ఈ నిబంధన నేపథ్యంలో అభ్యర్థులు చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా సకాలంలో ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాలని కమిషన్ పేర్కొంది. చదవండి: లోకేశ్‌కుమార్ బదిలీ.. జీహెచ్ఎంసీ నెక్ట్స్ బాస్ ఎవరో? ►ఎలక్ట్రానిక్ పరికరాలు, రిమోట్ తో కూడిన కారు తాళాలు, నిషేధిత, విలువైన వస్తువులు తీసుకురావద్దని కమిషన్ సూచించింది. ఇంకా షూ కూడా ధరించి రావొద్దని.. కేవలం చెప్పులతో మాత్రమే రావాలని తెలిపింది. ► అభ్యర్థులను తనిఖీ తరువాత కేంద్రంలోకి అనుమతించనున్నారు. దాదాపు 9.51 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్న నేపథ్యంలో వేలిముద్ర తప్పనిసరి చేశారు. అభ్యర్థులు ప్రతీ సెషన్ ఎగ్జామ్ ముగిసిన తర్వాత ఓఎంఆర్ షీట్‌ను ఇన్విజిలేటర్ కు అందించి వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ► ఎగ్జామ్ సెంటర్లలోకి ప్రవేశించే ముందు భద్రతా సిబ్బందికి, పరీక్ష గదిలోకి చేరుకున్నాక ఇన్విజిలేటర్ కు అభ్యర్థులు ఫొటో గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. ఒక వేళ.. అభ్యర్థి కాకుండా వేరే వ్యక్తులు హాజరైనట్లు గుర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని కమిషన్ స్పష్టం చేస్తోంది. అలాంటి వారిపై పోలీసు కేసు నమోదు చేయడంతో పాటు సదరు అభ్యర్ధిని మిగతా అన్ని పరీక్షలకు అనర్హుడిగా ప్రకటించనున్నట్లు తెలిపింది. ►ఓఎంఆర్ షీట్లో బ్లూ/బ్లాక్ పెన్ తో అభ్యర్థులు పేరు, కేంద్రం కోడ్, హాల్ టికెట్, ప్రశ్నపత్రం నంబరు రాయాల్సి ఉంటుందని కమిషన్ తెలిపింది. ► హాల్ టికెట్, ప్రశ్నపత్రం నంబరు సరిగా రాయకున్నా, బ్లూ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ కాకుండా ఇంక్ పెన్, జెల్ పెన్, పెన్సిల్ ఉపయోగించినా ఓఎంఆర్ షీట్ చెల్లదని కమిషన్ స్పష్టం చేసింది. -
రాష్ట్రంలో వర్షాలు అనంతరం పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష
-
కట్టుదిట్టంగా టెన్త్ పరీక్షలు
సాక్షి, అమరావతి: పదో తరగతి పరీక్షల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానందరెడ్డి మంగళవారం అధికారులకు పలు సూచనలు జారీచేశారు. పరీక్ష కేంద్రాల్లో అక్రమాలు, అవకతవకలు జరిగితే చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్, సి–సెంటర్ కస్టోడియన్లు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ♦ పరీక్ష కేంద్రాలన్నీ నో మొబైల్ జోన్లుగా ప్రకటించిన నేపథ్యంలో పరీక్ష విధుల్లో పాల్గొనే సిబ్బంది తమ మొబైల్ ఫోన్ ఇంట్లోనే ఉంచి రావాలి. లేదా సెంటర్లో పోలీస్ పికెట్ వద్ద అప్పగించాలి. ♦ఒకసారి పరీక్ష కేంద్రంలోకి వచ్చిన సిబ్బంది పరీక్ష ముగిసేవరకు బయటికి రాకూడదు. అటెండర్లు, ఇతర సహాయకులు కూడా టీ, శీతల పానీయాలు వంటి అవసరాలకు కూడా బయటకు రాకూడదు. ♦పరీక్ష విధులు లేని ఉపాధ్యాయులు పరీక్ష జరిగే సమయంలో ఆ పరిసరాల్లో ఉండకూడదు. ♦ పరీక్ష కేంద్రాలుగా ఉన్న కె.జి.బి.వి., రెసిడెన్షియల్ పాఠశాలల ఉపాధ్యాయులు పరీక్ష విధులు లేకపోతే ఆ సమయంలో పాఠశాలలో ఉండకూడదు. ♦ పరీక్ష కేంద్రంలో ప్రైవేట్ వ్యక్తులు ఎవరు ఉండకూడదు. ♦ ప్రశ్నపత్రాలు, వాటిపై వదంతులు వాట్సాప్ గ్రూప్‌లలోగానీ, సామాజిక మాధ్యమాల్లోగానీ ప్రచారం చేయకూడదు. ♦ చీఫ్ సూపరింటెండెంట్లు పరీక్షకు హాజరుకాని అభ్యర్థుల ప్రశ్నపత్రాలను, మిగిలిన ప్రశ్నపత్రాలను ఉదయం 10 గంటలలోపు అకౌంట్ రాసి సీల్ చేయాలి. ♦ ఈ నిబంధనలు అతిక్రమించిన వారికి పరీక్షల చట్టం 25/97 ప్రకారం ఏడేళ్ల వరకు జైలుశిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తారు. -
పార్టీ నేతలకు సీఎం వైఎస్ జగన్ కీలక ఆదేశాలు
-
బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు!
-
కొంపముంచిన డెలివరీ ఇన్స్ట్రక్షన్.. కేక్ చూసి షాక్ అయిన యువతి
స్విగ్గీ, జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసేవాళ్లు డెలివరీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు.. ఇందులో కొన్ని ఆర్డర్ తెచ్చే బాయ్‌కు సంబంధించి ఉంటే.. మరికొన్ని రెస్టారెంట్‌ను ఉద్దేశించి ఉంటాయి. ‘మసాలా తగ్గించండి’ లాంటివి. అయితే ఇవి ఒక్కోసారి తేడా కొడితే మనం ఆశ్చర్యపోవాల్సి ఉంటుంది. అలాంటి ఘటనలు తాజాగా మహారాష్ట్రలోని ముంబై, నాగపూర్‌లో చోటుచేసుకున్నాయి. ముంబైకి చెందిన వైష్ణవి ఇటీవల బర్త్‌డే కోసం ఒక కేక్ ఆర్డర్ ఇచ్చారు. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టారు. అందులో వచ్చేటప్పుడు రూ.500కి చిల్లర తీసుకురమ్మని బాయ్‌కు డెలివరీ ఇన్స్ట్రక్షన్ పెట్టారు. తీరా కేక్ ఇంటికొచ్చిన కేక్‌ను చూసి ఆమె షాకయ్యారు. హ్యాపీ బర్త్‌డేకి బదులు.. కేక్‌పై సదరు బేకర్ రూ.500కి చిల్లర తీసుకురా అని రాశాడు. దీన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్లు నవ్వు ఎమోజీలు పెడుతూ సరదా వ్యాఖ్యలు చేశారు. మరో ఘటనలో నాగ్‌పూర్‌కు చెందిన కపిల్ నగరంలోనే పేరొందిన బేకర్ నుంచి కేక్ ఆర్డర్ చేశారు. అందులో డెలివరీ ఇన్స్ట్రక్షన్ కింద.. ‘ఇందులో ఎగ్ ఉందన్న విషయాన్ని తెలియజేయండి’ అని పెట్టారు. ఆయన ఉద్దేశం డెలివరీ చేసినప్పుడు.. అది ఎగ్‌తో చేసిన కేక్ అని చెప్పడం కోసం ఈ బేకర్ డైరెక్టుగా కేక్ మీదే.. ఇది ఎగ్‌తో చేసినది అని రాశాడు. దాన్ని చూశాక నాకు నోట మాట రాలేదు అని కపిల్ తన అనుభవాన్ని ట్విట్టర్లో షేర్ చేసుకున్నారు. -
పాఠశాలల్లో మార్పు స్పష్టంగా కనిపించాలి: మంత్రి బొత్స
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మన బడి నాడు- నేడు రెండో దశ పనులను వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. నిర్ణీత కాలపరిమితిలో ఈ పనులన్నీ పూర్తి అయ్యేలా జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు పూర్తి సమన్వయంతో పని చేయాలని పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్‌తో కలిసి విజయవాడలోని సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయం నుంచి గురువారం నాడు జిల్లా కలెక్టర్లు, జేసీలు, జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాడు నేడు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. నాడు నేడు రెండో దశలో భాగంగా 12 వేల పైచిలుకు పాఠశాలల్లో పనులు చేపట్టనున్నామని, వీటి కోసం నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. పనుల నిమిత్తం ఈ పాటికే రివాల్వింగ్ ఫండ్ కూడా విడుదలైనందున, పనులను ప్రారంభిచాలని అధికారులను ఆదేశించారు. ఈ పనులకు అవసరమైన ఇసుక, సిమెంట్, వంటి వాటిని కూడా అందుబాటులో ఉంచామన్నారు. ఈ పనుల నాణ్యతలో ఏమాత్రం రాజీ పడవద్దని, పనులు వేగవంతంగా జరగడంలో అధికారులు, ఆయా పాఠశాలల పేరెంట్స్ కమిటీలు కూడా పూర్తి సమన్వయంతో పని చేయాలని మంత్రి పేర్కొన్నారు. పాఠశాలల్లో గతానికి ఇప్పటికీ స్పష్టమైన మార్పు కనిపించాలని అన్నారు. ఈ పనులకు సంబంధించి క్షేత్ర స్థాయిలో ఎటువంటి సమస్యలు ఎదురైనా, వాటిని వెంటనే ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. చదవండి: (అమలాపురం అల్లర్లు: మరో 20 మంది అరెస్ట్) -
మీ ఆధార్ కార్డు ఒరిజినలేనా? ఇలా చెక్ చేస్కోండి
నకిలీ వ్యవహారాలు మామూలు జనాలకు పెద్ద ఇబ్బందులే తెచ్చిపెడుతున్నాయి. ఈ క్రమంలో ప్రతీదానికి ముడిపడి ఉన్న ఆధార్ విషయంలోనూ ఫేక్ కుంభకోణాలు కనిపిస్తున్నాయి. కొత్తగా ఆధార్ తీసుకుంటున్నవాళ్లు, లేదంటే మధ్యవర్తి ద్వారా కార్డులు సంపాదించుకుంటున్న వాళ్లు.. తమ 12 డిజిట్ నెంబర్లను ఆధార్ నెంబర్‌గా ఫిక్స్ అయిపోయి అన్నిచోట్లా సమర్పిస్తుంటారు. అయితే ఈ విషయంలో యూఐడీఏఐ ప్రజల కోసం ఓ అలర్ట్‌ను జారీ చేసింది. Aadhar Card Alert: ఆధార్‌ను ఎక్కడైనా సమర్పించే ముందు అసలేనా? నకిలీనా? ఒక్కసారి తనిఖీ చేస్కోమని చెప్తోంది. లేకుంటే ఇబ్బందులు తప్పవని చెబుతోంది. ఇందుకోసం resident.uidai.gov.in/verify లింక్‌కు వెళ్లాలి. ఆపై కార్డుపై ఉన్న 12 అంకెల డిజిట్‌ను ఎంటర్ చేయాలి. కింద ఉన్న సెక్యూరిటీ కోడ్ లేదంటే క్యాప్చాను క్లిక్ చేసి వెరిఫై కొట్టాలి. అప్పుడు ఆ ఆధార్ నెంబర్ ఒరిజినలేనా? అసలు ఉందా? అనే వివరాలు కనిపిస్తాయి. చాలామంది ఆధార్ అప్డేట్స్, మార్పుల విషయంలో గందరగోళానికి గురవుతుంటారు. కానీ, చిన్న చిన్న మార్పులు, సవరణల కోసం ఆన్లైన్లోనే వెసులుబాటు కల్పిస్తోంది యూఐడీఏఐ. ఇక అప్డేషన్, మొత్తంగా మార్పుల కోసం మాత్రం తప్పనిసరిగా ఎన్రోల్మెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిందే. ► ఆధార్ కార్డ్‌పై అడ్రస్ సవరణ కోసం ఆన్లైన్లో వెసులుబాటు కల్పించింది యూఐడీఏఐ ► అడ్రస్ మార్పు కోసం ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్లైన్లోనూ అంటే.. దగ్గర్లోని ఆధార్ సెంటర్ ఈ సౌకర్యం కల్పిస్తోంది. సవరించడం ఎలాగో తెలుసా? ► ఫొటో మార్చుకోవడానికి కూడా రీజియన్ సెంటర్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నిమిషాల్లో ఫొటో మార్చుకోవచ్చు ఇలా ► ఆధార్ కార్డు మీద పేరును రెండు సార్లు మార్చుకోవడానికి వీలుంటుంది. ► డేట్ ఆఫ్ బర్త్, జెండర్(ఆడ/మగ/ట్రాన్స్‌జెండర్) ఒక్కసారే మారతాయి. పుట్టినతేదీ మార్చుకోవాలా? ► జెండర్ మార్పునకు ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదు. ► మొబైల్ నెంబర్‌కు తప్పనిసరిగా లింక్ అయ్యి ఉండాలి. లేదంటే మార్పులేవీ జరగవు. క్లిక్ చేయండి: ఇంట్లో నుండే ఆధార్ అప్డేట్ చేసుకోండి ఇలా! ► ఒకవేళ మొబైల్ నెంబర్ వేరే వాళ్లది ఉన్నా.. పాత నెంబర్‌ను మార్చుకోవాలనుకున్నా అప్డేట్ చేసుకోవచ్చు. స్థానిక పోస్ట్ మ్యాన్ లేదా పోస్టు మాస్టర్ కు ఫోన్ చేసి కోరితే ఇంటికే వచ్చి ఈ సేవలు అందిస్తారు. అయితే ప్రధాన పట్టణాల్లో మాత్రమే ఇది అమలు అవుతుండడం విశేషం. గ్రామీణ ప్రాంతాల వాళ్లు మాత్రం మండల కేంద్రాలకు ‘క్యూ’ కట్టాల్సి వస్తోంది. ► సెల్ఫ్ సర్వీస్ అప్డేట్ పోర్టల్ ద్వారా (SSUP) https://ssup.uidai.gov.in/ssup/ లింక్ క్లిక్ చేసి సంబంధిత స్కాన్ డాక్యుమెంట్లు సమర్పించి చిన్న చిన్న మార్పులు చేసుకునే వీలు మాత్రమే. సెల్ఫ్ సర్వీస్ పోర్టల్ ద్వారా యాభై రూపాయలు ఛార్జ్ చేస్తారు. ► ముఖ్యమైన విషయం ఏంటంటే.. పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మొబైల్నెంబర్, ఈ-మెయిల్, ఫింగర్ ఫ్రింట్స్, ఐరిస్, ఫొటోగ్రాఫ్.. ఇలాంటి వివరాల అప్డేషన్ కోసం పర్మినెంట్ ఎన్రోల్మెంట్ సెంటర్‌ను సంప్రదించాల్సిందే. ► సంబంధిత ఫామ్స్ అన్నీ యూఐడీఏఐ వెబ్సైట్లోనే దొరుకుతాయి కూడా. ఒకవేళ పొరపాటున పరిమితులు మించిపోతే ఎలా?.. ఆ టైంలో ఆధార్ ఎన్రోల్మెంట్ లేదంటే అప్డేట్ సెంటర్‌ను సంప్రదించడం ఉత్తమం. అక్కడ తప్పిదానికి గల కారణాలు, వివరణలు, పొరపాట్ల సవరణకు సంబంధించిన వివరాలు, సరైన ప్రూవ్స్ సేకరిస్తారు( సంబంధిత ఫామ్స్ ద్వారా). ఆ వివరాలన్నింటిని హెల్ప్ డెస్క్‌కు పంపిస్తారు. అవసరం అయితే ఆఫీసులకు పిలుస్తారు. ఆపై వెరిఫికేషన్ ప్రాసెస్ మొదలవుతుంది. అవసరం అనుకుంటే అదనపు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అప్పుడు అప్డేట్ లేదంటే మార్పులకు జెన్యూన్ రీజన్ అని తెలిస్తేనే.. ఆ రిక్వెస్ట్‌ను టెక్ సెంటర్‌కు ప్రాసెసింగ్/రీప్రాసెసింగ్ పంపిస్తారు. ఈ ప్రాసెస్ సాగడానికి కచ్చితంగా ఎన్నిరోజులు పడుతుందనేది చెప్పలేం. ఒక్కోసారి ప్రాసెస్ మధ్యలోనే ఆగిపోయినా ఆగిపోవచ్చు!. -
ఎయిర్ కూలర్‌ను నేరుగా వాడొద్దు!
ఎండలు బాగా ముదురుతున్నాయి కదా. ఇక చాలాకాలం పాటు వాడకుండా ఎప్పటినుంచో అలా ఓ మూల పడి ఉన్న వాటర్‌కూలర్ తీసి వాడాలనుకుంటున్నారా? దాన్ని అలా తీసేసి, వెంటనే ఇలా వాడేయకండి. నిద్రపోతున్నప్పుడు గదిని చల్లబరిచేందుకు వాడే ఎయిర్‌కూలర్ విషయంలోనూ ఇదే జాగ్రత్త పాటించడం అవసరం. గతేడాదో లేదా చాలాకాలం కిందటో వాటర్‌కూలర్ వాడటం మానేసిన సమయంలో దాని కింది భాగంలో ఎన్నో కొన్ని నీళ్లు ఉన్నాయనుకోండి. అక్కడ లీజియోనెల్లా అనే ఓ ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆ బ్యాక్టీరియా కారణంగా ‘వాటర్ కూలర్ నిమోనియా’ అని వాడుక భాషలో పిలిచే ప్రమాదకరమైన నిమోనియా రావచ్చు. అందుకే అట్టడుగున ఎంత మాత్రమూ చెమ్మలేకుండా చేసేందుకు ఓసారి వాటర్‌కూలర్‌ను లోపలి చెమ్మ అంతా ఇగిరిపోయేలా చూడాలి. ఆ తర్వాతే వాటర్ కూలర్‌ను వాడాలి. ఎయిర్ కూలర్ విషయంలోనూ ఇదే జాగ్రత్త పాటించాలి. ఇక ఎయిర్‌కూలర్‌లో అడుగున నీరు ఉంటే ఇదే లీజియోనెల్లా బ్యాక్టీరియా ఇక్కడ కూడా చేరవచ్చు. అందుకే ఇలా ఎయిర్ కూలర్‌ను వాడేముందు ఒకసారి ఆరుబయటకు తీసుకొచ్చి, కాసేపు ఆన్ చేసి, అడుగున ఒక్క చుక్క నీరు కూడా లేకుండా చూడాలి. ఇలా ఆన్ చేయడం వల్ల మరో ప్రయోజనం కూడా ఉంటుంది. కూలర్ తాలూకు పాత తడికల్లోనూ డస్ట్‌మైట్స్ ఉండవచ్చు. నేరుగా ఆన్ చేయడం వల్ల వాటి కారణంగా ఆస్తమా రోగుల్లో... (ఆ మాటకొస్తే కొందరు సాధారణ వ్యక్తుల్లో సైతం) దగ్గు, ఆయాసం వంటి లక్షణాలు ట్రిగర్ అయ్యే అవకాశాలుంటాయి. అందుకే ఈ జాగ్రత్తలు. చదవండి: మీ తలగడ, పరుపు సౌకర్యంగా ఉన్నాయా? -
ఆరోగ్య భద్రతకే ప్రాధాన్యం
దుబాయ్: క్రికెట్ పునరుద్ధరణ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సభ్య దేశాలకు మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా వ్యాప్తి తగ్గకపోవడంతో తగిన సూచనలు పాటిస్తూ ఆటను పున రుద్ధరించాలని పేర్కొంది. తమ మార్గదర్శకాల్లో ‘ఆరోగ్య భద్రత’కే పెద్ద పీట వేసింది. వైరస్ వ్యాప్తికి వీలులేని వాతావరణంలో మాత్రమే క్రికెట్ కార్యకలాపాలను ప్రారంభించాలని సూచించింది. శిక్షణా శిబిరాలు, మ్యాచ్‌లకు ముందు మైదానం, చేంజింగ్ రూమ్స్, క్రీడా పరికరాలు, బంతుల వాడకం తదితర అంశాల ద్వారా కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. క్రికెట్ సంఘాలు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల అనుమతి తప్పకుండా పొందాలని తెలిపింది. ఆటగాళ్లు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు, సహచరులతో టవల్స్, శీతల పానీయాలు, బంతులు పంచుకోరాదని పేర్కొంది. మరోవైపు టెస్టు స్పెషలిస్టు బౌలర్లు గాయాల బారిన పడకుండా వారికి ప్రాక్టీస్ కోసం 2 నుంచి 3 నెలల సమయం అవసరమని చెప్పింది. ‘సాధారణంగా టెస్టు బౌలర్లకు 8–12 వారాల ప్రిపరేషన్ అవసరం. చివరి 5 వారాల్లో తీవ్రమైన ప్రాక్టీస్ చేస్తే వారు గాయాల బారిన పడరు’ అని ఐసీసీ సూచించింది. -
లాక్‌డౌన్‌ను పాటించాల్సిందే: డీజీపీ
సాక్షి, విజయవాడ: వ్యక్తిగత భద్రత సామాజిక బాధ్యత అని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ కట్టడికి ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. కరోనా నియంత్రణకు చాలా అప్రమత్తంగా ఉన్నామని.. రాబోయే రోజుల్లో మరింత సీరియస్‌గా వ్యవహరిస్తామని ఆయన పేర్కొన్నారు. కొంతమంది పరిస్థితులను అర్థం చేసుకోకుండా పోలీసులను ప్రశ్నిస్తున్నారన్నారు. ప్రజల భద్రత కోసమే పోలీసులు పనిచేస్తున్నారని తెలిపారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రోడ్లపైకి అనుమతించమని డీజీపీ స్పష్టం చేశారు. (‘చంద్రబాబూ.. కరోనాపై రాజకీయాలు మానుకో’) ఉదయం 6 గంటల నుంచి 8 వరకే నిత్యావసర వస్తువుల కోసం అనుమతిస్తామని వెల్లడించారు. ఆటో, ఫోర్ వీలర్స్‌లో అత్యవసర సేవల కోసం ఇద్దరికి మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు. బీ హోమ్-బీ సేఫ్ అనేది పోలీసు శాఖ విజ్ఞప్తి అని పేర్కొన్నారు. పోలీసుల సూచనలను ప్రజలు కచ్చితంగా పాటించాల్సిందేనని.. అవసరం లేకుండా రోడ్లపై తిరిగితే వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని డీజీపీ హెచ్చరించారు. విదేశాల నుంచి వచ్చిన వారు కచ్చితంగా సమాచారం ఇవ్వాలని.. వివరాలు దాస్తే కేసులు పెడతామని డీజీపీ గౌతం సవాంగ్ స్పష్టం చేశారు. (భారీ ఊరట : త్వరలో మహమ్మారి తగ్గుముఖం) -
అవకాశాలను అందిపుచ్చుకోండి
ఉస్మానియా యూనివర్సిటీ: ‘కాలానుగుణంగా ప్రభుత్వాలు, పరిస్థితులు, వ్యవస్థలు, సాంకేతిక పరిజ్ఞానం, జీవన విధానం మారుతూనే ఉంటాయి. మనం తొందరపడి చేసే ఆందోళన కార్యక్రమాలతో తెల్లారేలోగా మార్పులు సంభవించవు. ప్రజాస్వామ్యంలో లోపాలుంటే వాటి పరిష్కారం కోసం శాంతియుత పద్ధతుల్లో నిరసనలు తెలపాలి. సమాజంలోని ప్రజల గురించి కూడా ఆలోచించాలి. నిబంధనలను ఉల్లంఘించి మరీ ఇతరులకు ఇబ్బంది కలిగేలా ఆందోళన కార్యక్రమాలు చేయకుండా ఉండటం మంచిది. పోలీసులకు ఎవరిపైనా కోపం ఉండదు. రాబోయే రోజుల్లో కాబోయే పాలకులు మీరే. సమయాన్ని వృథా చేయకుండా అవకాశాలను అందిపుచ్చు కోండి’అని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ విద్యార్థులకు సూచించారు. శనివారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద జరిగిన కార్యక్రమంలో ఓయూ విద్యార్థులు, విద్యార్థి నాయకులతో పోలీసు అధికారులు సమావేశం అయ్యారు. పలువురు విద్యార్థి నాయకులు అడిగిన ప్రశ్నలకు సీపీ సమాధా నం చెప్పారు. -
ఆ రోజు ర్యాలీలు బంద్
సాక్షి, సిటీబ్యూరో: లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో గురువారం నగరంలో నిషేధాజ్ఞలు విధించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద 144వ సెక్షన్ విధిస్తూ సీపీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో అనుమతి లేకుండా ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది ఒకచోట గుమిగూడకూడదు. విజయోత్సవ ర్యాలీలను పూర్తిగా నిషేధించారు. మద్యం విక్రయాలపై ఆంక్షలు విధించారు. గురువారం ఉదయం 6గంటల నుంచి శుక్రవారం ఉదయం 6గంటల వరకు ఇవి అమల్లో ఉంటాయి. కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లతో పాటు మిలటరీ క్యాంటీన్లు, స్టార్ హోటళ్లలోని బార్లకూ ఇది వర్తించనుంది. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదని, బహిరంగ ప్రదేశాల్లో క్రాకర్లు కాల్చొద్దని, డీజేలతో పాటు పరిమితికి మించి శబ్ధం చేసే వాటిని వినియోగించొద్దని కొత్వాల్ స్పష్టం చేశారు.ఈ నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏర్పాట్లపై వీడియోకాన్ఫరెన్స్... ఓట్ల లెక్కింపు నేపథ్యంలో గురువారం కౌంటింగ్ కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన చర్యలు, బందోబస్తు ఏర్పాట్లపై కొత్వాల్ అంజనీకుమార్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బషీర్‌బాగ్ కమిషనరేట్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ)లో జరిగిన ఈ సమావేశంలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర, రాష్ట్ర, నగర బలగాలతో మూడంచెల భద్రత ఏర్పాటు చేయాలని, బెట్టింగ్ నిర్వాహకులపై కఠినంగా వ్యవహరించాలని సిటీ పోలీసు బాస్ అధికారులను ఆదేశించారు. -
ఇన్విజిలేటర్లకూ జంబ్లింగ్
విజయనగరం అర్బన్: పదోతరగతి పరీక్షలు సక్రమంగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ సన్నద్ధమైంది. పరీక్షల విధుల్లో నిర్లక్ష్యం వహించే టీచర్లపై చర్యలకు సిద్ధమవుతోంది. పరీక్షల్లో ఇప్పటివరకు ఇన్విజిలేషన్ నిర్వహించే ఉపాధ్యాయులకు ఏ పరీక్షకు ఏ గది కేటాయించేది ఆయా పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లు నిర్ణయించేవారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఆయా కేంద్రాల సూపరింటెండెంట్లు, ఉపాధ్యాయులను మచ్చిక చేసుకుని తమకు నచ్చిన వారిని ఆయా పాఠశాలల విద్యార్ధులున్న ఫలానా గదిలో వేయాలని లాబీయింగ్ చేసుకునే వారు. చాలా పాఠశాలల్లో కష్టపడి చదివిన విద్యార్థులు ఈ తతంగంతో తీవ్రంగా నష్టపోయేవారు. మాస్ కాపీయింగ్ కూడా జోరుగా సాగేది. అయితే వీటన్నింటికి అడ్డుకుట్ట వేసేందుకు ఈ ఏడాది ఈ విధానానికి పాఠశాల విద్యాశాఖ స్వస్తి పలికింది. ఈ మేరకు ఆదేశాలు జిల్లా విద్యాశాఖకు వచ్చాయి. రోజూ పరీక్ష నిర్వహణకు అరగంట ముందు చీఫ్ సూపరింటెండెంట్ ఆయా పరీక్ష కేంద్రాల్లో లాటరీ తీసి ఇన్విజిలేటర్‌కు ఏ గది వచ్చిందో తెలియజేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ప్రభుత్వం ఈ ఏడాది అమలు చేస్తున్న నూతన విధానంతో పరీక్షలను పారదర్శకంగా నిర్వహించవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతున్నందున విధులు నిర్వహించే ఇన్విజిలేటర్లు మాత్రం గంట ముందుగానే పరీక్ష కేంద్రాల విధులకు హాజరు కావాలని కూడా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మూడు రోజులకోసారి ఇన్విజిలేటర్ల మార్పు.. ఇన్విజిలేటర్లకు లాటరీ ద్వారా గంట ముందు గదులను కేటాయించడంతో పాటు మూడు రోజులకోసారి పరీక్ష కేంద్రాన్ని మార్చుతారు. తాజాగా ఉన్నతస్థాయిలో జరిగిన సమీక్ష సమావేశంలో ఇన్విజిలేటర్‌ను మూడు రోజులకోసారి కచ్చితంగా పాఠశాలలను మార్చాలని నిర్ణయించారు. అదే విధంగా పరీక్షల నిర్వహణలో భాగంగా చీఫ్ సూపరింటెండెంట్లు, విభాగాల అధికారులు, పర్యవేక్షకులుగా వెళ్లే వారు విధుల్లో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే కఠన చర్యలు అనుభవించాల్సి వస్తుంది. 1997 చట్టం 25 సెక్షన్ 10లోని నిబంధనలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ చట్టం ప్రకారం పదో తరగతి పరీక్షల విధుల్లో సక్రమంగా పనిచేయలేదని రుజవైతే కఠిన చర్యలు తప్పవు. బాధ్యులపై క్రిమినల్ కేసు నమోదుతో పాటు ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.5 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా తప్పదు. ఈ నెల 15 నుంచి జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణలో ఇది తప్పనిసరిగా అమలు చేస్తున్నామని పరీక్షల రాష్ట్ర పరిశీలకులు, విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ బీ.భాస్కరరావు, డీఈఓ జి.నాగమణి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక డీఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పది పరీక్షల ఏర్పాట్లపై వారు వివరించారు. గంట ముందే పరీక్ష కేంద్రానికి.. పరీక్ష కేంద్రాలకు ఇన్విజిలేటర్ గంట ముందే వెళ్లాలి. విద్యార్థిని నిశితంగా తనిఖీ చేసి 30 నిముషాల ముందు గదిలోకి పంపాలి. ఓఎంఆర్ షీట్లో విద్యార్థి వివరాలను పూర్తి చేసే సమయంలోనూ జాగ్రత్తలు వహించాలి. 137 పరీక్ష కేంద్రాలకు 1,515 మంది ఇన్విజిలేటర్లు.. జిల్లాలో ఈ నెల 15 నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు 30,248 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. బాలురు 15,009, బాలికలు 15,239 మంది ఉన్నారు. మరో 264 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారు. మొత్తం 137 పరీక్ష కేంద్రాలను జిల్లాలో ఏర్పాటు చేశారు. వీటిలో స్టోరేజీ పాయింట్స్ మూడు కిలోమీటర్ల దూరం ఉన్న సీ–కేటగిరి పరీక్ష కేంద్రాలు 37 ఉన్నాయి. మొత్తం 1,515 మంది ఇన్విజిలేటర్లను, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు 137, చీఫ్ ఇన్విజేటర్లు 137 మంది, 9 ఫ్లయింగ్ స్క్వాడ్లు పనిచేస్తారు. అలాగే స్టోరేజ్ పాయింట్స్ 37, పంపిణీ రూట్స్ 16 ఏర్పాటు చేశారు. నేలపై కూర్చొనే పరీక్ష కేంద్రం ఉండదు.. జిల్లాలో పది పరీక్షలు నిర్వహిస్తున్న 137 కేంద్రాలలోనూ అభ్యర్ధులకు బెంచీలను ఏర్పాటు చేస్తున్నాం. చెంచీలు లేని పరీక్ష కేంద్రాల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేశాం. ఎక్కడా నేలకూర్చొని రాసే పరిస్థితి లేదు. పరీక్ష కేంద్రాల నిర్వాహకులు రెండు రోజుల ముందే వెళ్లి తాగునీరు, వెలుతురు వంటి మౌలిక సదుపాయాలను సమకూర్చుకుంటారు. విద్యార్థికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంత, ఆహ్లాదకర వాతావరణంలో పరీక్షలు రాసేలా చర్యలు తీసుకున్నాం. ఇందుకు అన్ని వసతులు, సదుపాయాలు ఉన్న పాఠశాలలనే పరీక్ష కేంద్రాలుగా గుర్తించాం. ముఖ్యంగా తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్తు సరఫరాను పరిగణలోకి తీసుకున్నాం. ప్రతి కేంద్రం వద్ద మట్టి కుండలను ఏర్పాటు చేసి అందులో మినరల్ వాటర్, ప్రతి పరీక్ష గదిలో రెండు ఫ్యాన్లు ఉండేలా ఏర్పాట్లు చేశాం. విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు.. పాఠశాలలకు పంపిన హాల్ టికెట్లను యాజమాన్యాలు ఇవ్వని పక్షంలో ‘బీఎస్ఈ.ఏపీ.బీఓవీ.ఇన్’ వెబ్సైట్ నుంచి తీసుకోవచ్చు. ఫిర్యాదులు, సూచనలు స్వీకరించడానికి కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఫోన్ నంబబర్ ‘08922–252253, 9493313271, 8179928099 (బొబ్బిలి డివి జన్)లకు సూచనలు, ఫిర్యాదులు ఇవ్వొచ్చని తెలిపారు. అందుబాటులో ఆర్టీసీ సర్వీసులు.. పట్టణాలకు దూరంగా ఉన్న 37 సీ–కేటగిరి పరీక్ష కేంద్రాలకు రవాణా ఇబ్బందులు కలుగకుండా ఆర్టీసీ సేవలను అందుబాటులో ఉంచాం. ఈ మేరకు ఆర్టీసీ ఆధికారులను విద్యాశాఖ అధికారులు కోరారు. సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు.. సమస్యాత్మక కేంద్రాలుగా జిల్లాలో ఆరింటిని గుర్తించారు. పార్వతీపురం ఏజెన్సీ ప్రాంతాల్లోని డోకిశీల, చినమేరంగి, టిక్కబాయి, రేగిడి, కొత్తవలస గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఏ, బీ పరీక్ష కేంద్రాలను గుర్తించారు. ఇక్కడ పక్కా ఏర్పాట్లలో భాగంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. -
టెట్ రాస్తున్నారా..
ఆరిలోవ(విశాఖ తూర్పు): ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టెట్)–2018కు హాజరయ్యే అభ్యర్థులు పూర్తిగా సన్నద్ధంకావాలని డీఈవో బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు. జిల్లాలో 18 కేంద్రాల్లో బుధవారం నుంచి మార్చి 3వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయని చెప్పారు. కంప్యూటర్ బేస్డ్గా నిర్వహించే ఈ పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో జరుగుతాయన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు కొన్ని సూచనలు పాటించాలని సూచించారు. ♦ అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు గంట ముందుగా చేరుకోవాలి. ♦ హాల్ టిక్కెట్‌పై ఉన్న పరీక్ష కేంద్రం, తేదీ, సమయం, రిజిస్టర్ నంబరు సరిచూసుకోవాలి.. ♦ అడ్మిట్ కార్డుపై ఉన్న పాస్‌వర్డ్‌ను ఉపయోగించి ‘లాగిన్’ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత కంప్యూటర్లో ఉన్న వివరాలు సరిచూడాలి. అన్నీ సరిగా ఉంటే ‘కన్ఫర్మ్’ అని, లేకుంటే ‘ఐ డెనీ’ అని క్లిక్ చేయాలి. ♦ కంప్యూటర్ బాగా పనిచేస్తుందని, వివరాలు అందుబాటులో ఉన్నాయని క్లిక్ చేయాలి. ♦ అనంతరం నేను ప్రారంభించుటకు సిద్ధంగా ఉన్నాను అని క్లిక్ చేయాలి. ♦ ఇచ్చిన నాలుగు జవాబుల నుంచి సరైన దాన్ని ఎన్నుకొని క్లిక్ చేయాలి. ♦ పరీక్ష రాస్తున్నప్పుడు మిగిలిన సమయం కంప్యూటర్లో పరిశీలించవచ్చు. ♦ జవాబు రాయని ప్రశ్నలు ఎరుపు, ప్రయత్నించని ప్రశ్నలు తెలుపు, ప్రయత్నించిన ప్రశ్నలు ఆకుపచ్చ, పునఃపరిశీలనకు గుర్తించిన ప్రశ్నలు, జవాబు ఇచ్చిన ప్రశ్నలు ఊదా రంగులలో కనిపిస్తాయి. ♦ ప్రశ్నకు జవాబు రాసిన అనంతరం ‘సేవ్’ తర్వాత ‘నెక్స్›్ట’ బటన్ నొక్కాలి. ♦ కుడివైపు సెక్స్న్ బటన్ నొక్కడం వల్ల జవాబు ఇచ్చిన, ఇవ్వని, పునఃపరిశీలన ప్రశ్నలు కనిపిస్తాయి. ♦ కంప్యూటర్లో ఇచ్చిన అక్షరాల సైజు కనిపించకపోతే వెంటనే ఇన్విజిలేటరు దృష్టికి తీసుకెళ్లాలి. ♦ పరీక్ష సమయం 2.30 గంటలు పూర్తి కాగానే ‘సబ్మిట్’ అని బటన్ యాక్టివేట్ చేయాలి. ♦ దృష్టి లోపం ఉన్నవారికి, అంగవికలాంగులకు అదనంగా 50 నిమిషాలు సమయం ఇవ్వనున్నారు. -
బార్లు, పబ్బులు నిబంధనలు పాటించాల్సిందే
హైదరాబాద్: బార్లు, పబ్బులు, వైన్ షాపులు, స్పాల యాజమాన్యాలు నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సిపి సందీప్ శాండిల్య హెచ్చరించారు. సైబరాబాద్ పరిధిలోని బార్లు, పబ్బులు, వైన్ షాపులు, స్పాల యాజమాన్యాలు/మేనేజర్లతో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మసాజ్ సెంటర్లు, పార్లర్లలో ఇటీవల అసాంఘిక కార్యకలాపాలు జరగుతుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. మసాజ్ సెంటర్లు నిర్వహించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే నియమ నిబంధనలను తప్పక పాటించాలని అన్నారు. మసాజ్ సెంటర్లను మసాజ్ సెంటర్లు గానే కొనసాగించాలని, వీటి ముసుగులో వ్యభిచారం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే నేరమని తెలిపారు. స్పాలకు నిబంధనలు స్పాలలో తప్పనిసరిగా రిజిస్టర్ నిర్వహించాలన్నారు. ఇందులో స్పాలకు వచ్చే వారి పేరు, ఫోన్ నంబర్లను విధిగా నమోదు చేయాలన్నారు. స్పాలలో పడకల వాడకం అవసరం లేదన్నారు. సాధ్యమైనంత వరకూ క్రాస్ మసాజ్‌లకు అనుమతించవద్దని, 18 ఏళ్లకు తక్కువ ఉన్నవారిని అనుమతించొద్దని, సిసి కేమరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విజిటింగ్ వీసాలపై వచ్చిన ఇతర దేశాల వారిని స్పాలల్లో నియమించుకోవద్దన్నారు. స్పాలల్లో తలుపులు పారదర్శకంగా ఉండాలన్నారు. తలుపులకు ఎలాంటి బోల్టులను బిగించరాదన్నారు. వీలుంటే గాజు పార్టిషన్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. బార్లు, పబ్బులు, వైన్ షాపులకు నిబంధనలు బార్లు, పబ్బులు, వైన్ షాపుల యజమానులు కచ్చితంగా ట్రేడ్ లైసెన్స్, లిక్కర్ లైసెన్స్, పోలీస్ లైసెన్స్‌లను తీసుకోవాలన్నారు. సమయపాలన పాటించాలని, రాత్రి 12 గంటల తర్వాత ఎట్టి పరిస్థితిలో షాపులను తెరిచి ఉంచొద్దని సూచించారు. పై నిబంధనలు అతిక్రమిస్తే మొదటిసారి సీపీ కార్యాలయానికి లేదా పోలీస్ స్టేషన్‌కు రావాల్సి ఉంటుందని, రెండోసారి అయితే 2, 3 రోజులు జైలు శిక్ష తప్పదని శాండిల్య హెచ్చరించారు. కేసుల నమోదుతోపాటు లైసెన్సుల రద్దుకు సిఫారసు చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం సమావేశంలో పాల్గొన్న వారి పేర్లు, ఫోన్ నంబర్లు, ఫోటోలు తీసుకున్నారు. వ్యాపారులు కనీస నైతికత పాటించాలని, సామాజిక హితాన్ని కొంతైనా పాటించాలని సూచించారు. సమావేశంలో జాయింట్ సీపీ షానవాజ్ ఖాసీం, మాదాపూర్ డిసిపి విశ్వప్రసాద్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
గ్రూప్-2 అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ సూచనలు
- 11, 13లలో తెలంగాణ గ్రూప్-2 పరీక్షలు - పరీక్షకు భారీ ఏర్పాట్లు - హాల్‌టికెట్‌తోపాటు గుర్తింపు కార్డు తప్పనిసరి హైదరాబాద్: తెలంగాణలో నవంబర్ 11,13 తేదీల్లో జరగనున్న గ్రూప్-2 పరీక్షలకు టీఎస్పీఎస్సీ పగడ్భందీ ఏర్పాట్లు చేస్తోంది. 1,032 పోస్టుల భర్తీకి గాను ఈ నెల 11, 13 తేదీలలో రాత పరీక్షలు జరగనున్నాయి. ఈ పోస్టులకు రికార్డు స్థాయిలో 7,89,985 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,911 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నవంబర్ 11న పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంటుంది. పేపర్-2 హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ పరీక్ష మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. నవంబర్ 13న పేపర్-3 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంటుంది. పేపర్-4 తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ పరీక్ష మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. పరీక్ష నిర్వహణను పారదర్శకంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరింది. అభ్యర్థులు ఎలాంటి అపోహలు నమ్మొద్దని సూచించింది. పూర్తిస్థాయి సూచనల కోసం టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్‌ను అభ్యర్థులు సంప్రదించాలని కోరింది. అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ సూచనలు: - అభ్యర్థులు బూట్లు, నగలు, చెవిపోగులు, చేతి గడియారాలు కూడా ధరించకూడదు. - ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, లాగ్ టేబుల్స్, చేతి బ్యాగులు, పర్సులు, నోట్‌బుక్స్, చార్టులు, రికార్డింగ్ పరికరాలకు అనుమతి లేదు. - చేతి వేళ్లపై గోరింటాకు(మెహందీ), ఇంక్ వంటివి లేకుండా చూసుకోవాలి. - అభ్యర్థులు హాల్ టికెట్‌తోపాటు ఏదైనా ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా తెచ్చుకోవాలని పేర్కొంది. హాల్ టికెట్‌పై ఫొటో కానీ, సంతకం కానీ సరిగా లేని అభ్యర్థులు తమ వెంట రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలను తెచ్చుకోవాలని టీఎస్పీఎస్సీ సూచించింది. - ఉదయం 9.45 గంటల తర్వాత, మధ్యాహ్నం 2.15 గంటల తర్వాత అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని తెలిపింది. - తనిఖీ ప్రక్రియతో పాటు బయోమెట్రిక్ విధానం ద్వారా అభ్యర్థుల వేలి ముద్ర, ఫొటో తీసుకుంటామని టీఎస్పీఎస్సీ పేర్కొంది. - ఓఎంఆర్ పత్రాన్ని బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్నుతోనే రాయాల్సి ఉంటుంది. పూర్తిస్థాయి సూచనలు, వివరాల కోసం టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్‌ను అభ్యర్థులు పరిశీలించాలని కోరింది. - పెన్సిల్, ఇంక్‌పెన్, జెల్‌పెన్‌తో రాసిన ఓఎంఆర్ జవాబు పత్రాలను అనర్హతగా ప్రకటిస్తామని పేర్కొంది. ఒరిజినల్ ఓఎంఆర్ పత్రంతో పరీక్షా కేంద్రం బయటికెళ్తే ఆ అభ్యర్థిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని హెచ్చరించింది. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని తెలిపింది. -
కొత్తజిల్లాల మార్గదర్శకాలు ప్రకటించాలి
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.నగేశ్ గొల్లపల్లి : తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలు, మార్గదర్శకాలు ప్రకటించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.నగేశ్ డిమాండ్ చేశారు. గొల్లపల్లిలో ఆదివారం మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం, కేసీఆర్ కుటుంబ ప్రయోజనాల కోసం కొత్త జిల్లాల ఏర్పాటు చేయడాన్ని ప్రజలు హర్షించరన్నారు. హేతుబద్ధంగా, శాస్త్రీయంగా, ప్రజా అవసరాలను, భవిష్యత్ అభివృద్ధిని, ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని డిమండ్ చేశారు. ఇష్టానుసారంగా జిల్లాలు ఏర్పాటుచేసి ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించొద్దని కోరారు. తెలంగాణలో ఇప్పుడు కొత్త జిల్లాలు ఎవరు అడిగారని, ఎందుకు తొందరపడుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉన్న పది జిల్లాల్లోనే పరిపాలన సరిగా లేదని విమర్శించారు. కొత్త జిల్లాలకు అవసరమైన వేల కోట్ల రూపాయలను ఎక్కడి నుంచి తెస్తారో ప్రజలకు తెలుపాలన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, ప్రజల నుంచి వచ్చిన వేలాది ఫిర్యాదులను సమగ్రంగా పరిశీలించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎల్లంకి రమేశ్, నాయకులు ఓరుగంటి జాన్, పస్తం సమ్మయ్య, లక్పత్రెడ్డి పాల్గొన్నారు. -
వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి
ఏరువాక శాస్త్రవేత్త సుధాన్షు ఇంద్రవెల్లి : రైతులు వ్యవసాయ అధికారులు ఇచ్చే సూచనలను తప్పక పాటించి, సాగు చేసిన పంటల్లో అధిక దిగుబడి సాధించాలని ఏరువక శాస్త్రవేత్త సుధాన్షు అన్నారు. శుక్రవారం ఆయన ఇంద్రవెల్లి మండలంలోని రాంపూర్, గౌరాపూర్ గ్రామాల్లో పర్యటించారు. రైతులు సాగు చేసిన సోయా పంటను పరిశీలించారు. సోయా పంటకు సోకిన కాండం తొలుచు పురుగు నివారణపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ పురుగు నివారణకు రైతులు 2 ఎం.ఎల్. పినల్పాస్తో పాటు ఒక ఎం.ఎల్. నువాన్ ఒక లీటరు చొప్పున నీటిలో కలిపి స్ప్రే చేయాలని వివరించారు. వ్యవసాయ అధికారి జాదవ్ కైలాస్, రైతులు పాల్గొన్నారు. -
సోయా పంటలో పొంచి ఉన్న చీడపీడలు
తగు సమయంలో గుర్తిస్తేనే దిగుబడులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీకోసం ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లాలో సోయా పంటను ఖరీఫ్ ఆరంభంలో కురిసిన వర్షాలతో దాదాపుగా లక్ష హెక్టార్ల వీస్తీర్ణంలో రైతులు పంట విత్తుకున్నారు. 35 రోజుల నుంచి 45 రోజుల దశలో ఉంది ప్రస్తుతం ఎదిగే దశకు చేరుకుంది. ఈ పంటలో వివిధ రకాల చీడపురుగులు ఆశించి దిగుబడులను నష్టపర్చే ప్రమాదం ఉంది. దీనికోసం సరైన సమయంలో సస్యరక్షణ చర్యలను చేపట్టి దిగుబడులను కాపాడుకోవాల్సిన అసవరం ఉందని ఏరువాక కోర్డినేటర్ శాస్త్రవేత్త రాజశేఖర్ వివరిస్తున్నారు. అయితే ముందుగా పంటను ఆశించే వివిధ రకాల చీడపీడల గురించి తెలుసుకుందాం. పల్లాకు తెగులు.. ఆకు పచ్చని రంగులో కళకళలాడాల్సిన సోయా పంట పసుపు రంగులోకి మారుతుంది. పల్లాకు తెగులు సోకిన సోయా పంట ఆకుల మీద పసుపు పచ్చని పొర ఏర్పడి మొత్తం ఆకులు పసుపు రంగులోకి మారతాయి. ఈ తెగులు సోకిన మొక్కలలో కాయలు ఏర్పడవు. తెగులు కారక వైరస్ తెల్ల దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. – దీన్ని నివారించేందుకు ముందుస్తుగా రైతులు 15 గ్రాముల కార్బోనల్ఫాన్ లేదా 3 గ్రాముల మిడా క్రోసిన్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. – వ్యాధి సోకిన మొక్కలకు వెంటనే పొలంలో నుంచి తీసి వేసి కాల్చివేయాలి. – 40 శాతం తెగులు సోకిన పంటకు తెగులు మరింత వ్యాప్తి చెందకుండా, ఉన్న వరకు కాపాడుకునేందుకు పంపునకు 5 గ్రాముల ఎసిటిమిఫ్రైడ్ లేదా 24 మి.లీ ట్రైజోఫాస్ను పిచికారీ చేసుకోవాలి. + పంటకు సోకే పల్లాకు తెగులు(ఎల్లో మొజాయిక్) తెల్లదోమ అను వైరస్ కారణంతో సోకుతుంది. విత్తన శుద్ధి చేయకపోవడం వంటి కారణాలతో సోయా పంటను నాశనం జరుగుతుంది. రసం పీల్చు పురుగులు (తామర పురుగులు, తెల్ల, పచ్చదోమలు, పేనుబంక) చిన్న పరిమాణంలో ఉండి ఆకుల నుంచి, లేత చిగురుల నుంచి లేత కాండం నుంచి రసాన్ని పీల్చి పంటకు నష్టం కలిగిస్తాయి. ఆకుల అడుగు భాగం నుంచి రసం పీల్చడం వలన ఆకులు పసుపు, గోధుమ రంగుకు మారి, మొక్క ఎదుగుదల లోపిస్తుంది. నివారణ.. తామర పురుగుల ద్వారా మొవ్వ కుళ్లు, తెల్ల దోమల వల్ల మొజాయిక్ తెగుళ్లు వ్యాప్తి చెందుతాయి. రసం పీల్చు పురుగుల నివారణకు పొలంలో పసుపు, నీలి రంగు జిగురు ఆకర్షక ఎరలను ఉంచాలి. వీటికి పురుగులు ఆకర్షించబడి జిగురుకు అతుక్కుని చనిపోతాయి. ఉధతి ఎక్కువగా ఉంటే ఎసిఫేట్ 1.5గ్రా. (లేదా) డైమిథోయేట్ 2 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఆకుతినే పరుగులు దాసరి పురుగు/ నామాల పురుగు.. వీటి రెక్కల పురుగు వెనక జత రెక్కల మధ్యలో తెల్లని చారలు ఉండి, ముదురు గోధుమల రంగు చుక్కలు వెలుపలి అంచువెండి ఉంటాయి. మీద రెక్కలు లేత గోధుమ రంగులో ఉంటాయి. ఇవి ఆకులపై గుడ్లను ఉంచుతాయి. ఇవి పొదిగి లద్దె పురుగులుగా మారి ఆకులను గీకి తింటాయి. ముదిరిన లద్దె పురుగులు ఆకులకు రంధ్రాలు చేసి తింటాయి. బాగా పెరిగిన పురుగులు భూమిలో గాని, ఆకులలో గాని కోశస్థ దశలుగా రూపాంతరం చెందుతాయి. నివారణ మొదటి దశ లార్వాలను గుర్తించిన వెంటనే వేపనూనె 5 మి.లీ/లీ పిచికారీ చేయాలి – బాక్టీరియా సంబంధిత మందులు (డైపెల్)ను 400 గ్రామ/ఎకరానికి పిచికారీ చేయాలి. – పెద్ద పురుగులను ఏరి తినేందుకు వీలుగా పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. ఎకరానికి 10 చొప్పున అమర్చాలి. – పురుగు ఉధతి ఎక్కువగా ఉంటే మోనోక్రోటోఫాస్ 1.6మీ.లీ./లీ. లేదా క్లోరిపైరిఫాస్ 2.0 మి.లీ/లీ. మందును పిచికారి చేయాలి. పొగాకు లద్దె పురుగు వీటి రెక్కల పురుగులు ఆకుల మీద సమూహాలుగా గుడ్లను ఉంచుతాయి. వీటి నుంచి పిల్ల పురుగులు పొదిగి ఆకుల మీద పత్ర హరితాన్ని గోకి తింటాయి. ముదిరిన లద్దె పురుగులు ఆకులకు రంధ్రాలు చేసి ఆకులను పూర్తిగా జల్లెడగా మారుస్తాయి. లేత ఆకులను పూర్తిగా తినేస్తాయి. పువ్వులను, కాయలను కూడా ఇవి నష్టపరుస్తాయి. ఇవి తెలుపు నుంచి బూడిద వర్ణంలో ఉండి నల్లటి మచ్చలను కలిగి ఉంటాయి. ఇవి రాత్రిపూట మాత్రమే పంట మీద తింటూ, పగటి వేళల్లో మొక్క మొదళ్ల వద్ద లేదా భూమి నెర్రెలలో దాక్కొని ఉంటాయి. బాగా ఎదిగిన లద్దె పురుగలు కోశస్థ దశలోకి మారతాయి. నివారణ: – గుడ్ల సముదాయం కనిపించిన ఆకులను గుడ్లతో సహా నాశనం చేయాలి. – లేత లార్వాల సముదాయం ఉన్న ఆకులను గమనించి కత్తిరించి దూరంగా నాశనం చేయాలి – తొలి దశలో వేపనూనె 5 మి.లీ/ లీ లేదా బ్యాక్టీరియా సంబంధిత మందులు (బి.టి) డైపెల్ను 2 గ్రా/లీ. నీటికి కలిపి పిచికారి చేయాలి. – పురుగులను తినే పక్షులను ఆకర్షించడానికి ‘‘ఖీ’’ ఆకారపు కర్రలను ఎకరానికి 10 చొప్పున ఉంచాలి. – మూడో దశ దాటిన పురుగు (10–12సెం.మీ.) అదుపు చేయడానికి విషపు ఎరలను పొలంలో ఉంచాలి. (ఎకరానికి 10 కిలోలు తవుడు, 2కిలోలు బెల్లం, 500–750 మి.లీ. క్లోరిౖఫైరిఫాస్ మందు కలిపిన మిశ్రమానికి ఉండలు చేసి సాయంత్రం వేళల్లో పొలమంతా వెదజల్లాలి. – పురుగు ఉధతి బాగా ఎక్కువగా ఉంటే– థయోడికార్డ్ 1.5 గ్రా/లీ. లేదా నొవాల్యురాన్ 1.0 మి.లీ./లీ లేదా ఎమమెక్టిన్బెంజోయేట్ 0.5 గ్రా/లీ. మందును పిచికారి చేయాలి. – పురుగు మందులను సాయంత్రం వేళల్లో పిచికారి చేస్తే నివారణ తొందరగా జరిగి మంచి ఫలితం ఉంటుంది. కాండం తినే పురుగులు: కాండపు ఈగ తల్లి ఈగలు నలుపు రంగులో మెరుస్తూ చురుగ్గా తిరుగుతూ ఉంటాయి. ఇవి లే ఆకుల మీద, చిన్న గుంటలు చేసి గుడ్లను ఉంచుతాయి. వీటి నుండి పొదిగిన లార్వాలు దగ్గరలోని ఆకు కాడల ద్వారా కాండలంలోనికి రంధ్రం చేసి ప్రవేశిస్తాయి. కాండం లోపలి పదార్థాన్ని మొత్తం తినడం వల్ల మొక్కలు వడలి ఎండి చనిపోతాయి. ఇవి కాండం నుండి వేర్ల వరకూ కూడా తింటాయి. లార్వా నుండి తల్లి పురుగు కాండానికి రంధ్రం చేసి బయటకు వస్తుంది. వడలిన మొక్కల కాండాలను కత్తిరించి చూస్తే లోపల చిన్న పసుపు రంగు లార్వా కనిపిస్తుంది. లార్వా వదలిన వ్యర్థ పదార్థం కూడా కాండంలో ఉండడం గమనించవచ్చు. ఈ పురుగు వల్ల పంటకు కనీసం 20–25శాతం నష్టం వాటిల్లుతంది. నివారణ: తొలి దశలో రక్షణ కోసం ఫోరేట్ 10గ్రా. లేదా కార్థోప్యూరాన్ 3 గ్రా. గుళికలను పొలంలో చల్లుకోవాలి. పైరుపై ఆశించినపుడు నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ./లీ. లేదా ఎసిఫేట్ 1.5 గ్రా/లీ. లేదా డైమిథోయేట్ 2 మి.లీ./లీ. నీటికి కలిపి పిచికారీ చేయాలి. పెంకు పురుగు/ కాండం తొల్చే పురుగు.. దీని వల్ల పంటకు సుమారుగా 40–50 శాతం నష్టం వాటిల్లుతుంది. ఈ పురుగు జూలై నుంచి అక్టోబర్ వరకు ఆశిస్తుంది. ముందుగా ఆడ పెంకు పురుగు కాండం మీద 10 సెం.మీ. దూరంలో కాండం చుట్టూ రంధ్రాలు చేస్తుంది. దీనివల్ల చిగురు భాగానికి పోషకాలు, నీరు అందక వడలి ఎండిపోతుంది. ఇలా చేసిన రంధ్రాల ద్వారా గుడ్లను కాండంలో ఉంచుతుంది. ఈ గుడ్లు పొదిగి లార్వాలు కాండాన్ని తొలిచి తినడం మొదలు పెడతాయి. నివారణ – చిగురులు ఎండిపోతున్న మొక్కలను పీకి నాశనం చేయడం వల్ల పురుగు వ్యాప్తిని కొంతవరకు అరికట్టవచ్చు. – తొలి దశలో కార్థోఫ్యూరాన్గుళికలు చల్లుకోవడం వల్ల కొంతవరకు తల్లి పురుగులను అదుపులో ఉండవచ్చు. – పైరుపై పురుగు ఆశించినట్లయితే, క్లోరిఫైరిఫాస్ 2 మి.లీ./లీ. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ./లీ. లేదా ట్రైజోఫాస్ 2.0 మి.లీ./లీ. నీటిని కలిపి పిచికారీ చేయాలి. -
బ్రెయిన్ ట్యూమర్‌కు ఆపరేషన్ తప్పదా?
హోమియో కౌన్సెలింగ్ మా అమ్మగారి వయసు 56. గత కొద్దికాలంగా ఆమె మెడ నొప్పితో బాధపడుతున్నారు. డాక్టర్‌కు చూపిస్తే ఆమెకు సర్వైకల్ స్పాండిలోసిస్ ఉందని చెప్పి, కొన్ని సూచనలు చేసి, మందులు రాశారు. ఆ సూచనలు పాటిస్తూ, మందులు వాడుతున్నారు. కాని అంతగా ఫలితం కనిపించడం లేదు. హోమియోలో ఈ జబ్బుకు శాశ్వత పరిష్కారం ఉందా? - బి.అమరవాణి, పిడుగురాళ్ల మారుతున్న జీవన శైలి కారణంగా సుమారు 90 శాతం మంది ప్రతి ఒక్కరూ 60 సంవత్సరాలు వచ్చేసరికి కొద్దిపాటి స్పాండిలోసిస్ సమస్యతో బాధపడతారని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఈ సమస్య ఇటీవలి కాలంలో యుక్తవయస్కుల్లోనూ కనిపిస్తోంది. దీనికి గల కారణాలు అనేకం. సర్వైకల్ స్పాండిలోసిస్ లేదా మెడనొప్పి ముఖ్యంగా గంటల తరబడి కూర్చొని పని చేయడం, సరియైన వ్యాయామం లేకపోవడం, అధిక బరువులు ఎత్తడం, పెరుగుతున్న పని ఒత్తిడి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏమిటి? మానవ శరీర వ్యవస్థలో వెన్నెముక ఒక మూలస్తంభం లాంటిది. వెన్నుపూస పలు విభాగాల సమ్మేళనం. వెన్నెముకకు తోడుగా కండరాలు, డిస్కులు, లిగమెంట్లు ఉంటాయి. ఇవి సులభంగా వంగడానికి, శరీరంలోని కదలికలకు తోడ్పడతాయి. వెన్నెముకలోని ప్రతి రెండు పూసల మధ్య మృదువైన పదార్థం ఉంటుంది. దీనినే డిస్క్ అంటారు. వెన్నుపాము (స్పైనల్ కార్డ్) నుండి అసంఖ్యాకమైన నరాలు వెళుతుంటాయి. మెడభాగం నుంచి వెళ్లే నరాలు చేతుల్లోగుండా, నడుం భాగం నుండి వెళ్లే నరాలు కాళ్లల్లో గుండా వెళుతుంటాయి. వెన్నెముక మెడ, నడుము భాగాల్లోని డిస్కులే ఎక్కువగా దెబ్బతింటాయి. కాని మెడ దగ్గర ఎక్కువగా రావడం వల్ల దీనిని సర్వైకల్ స్పాండిలోసిస్ అని పిలుస్తారు. కారణాలు: వెన్నెముకకు దెబ్బ తగలడం, అధిక బరువులు ఎత్తడం, గంటల తరబడి కూర్చొని పని చేయడం, సరైన పద్ధతులు పాటించకుండా ఎక్కువగా డ్రైవింగ్ చేయడం, వయసు పెరిగే కొద్దీ వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ అరుగుదలకు గురి కావడం, కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు: మెడనొప్పి, మెడ బిగుసుకుపోవడం, నొప్పి మెడ ప్రాంతంలో ప్రారంభమై భుజాల్లోకి, చేతుల వరకు వ్యాపించడం, తిమ్మిర్లు, చేతి కండరాలు బలహీనపడటం, భుజాలు, చేతివేళ్లలో స్పర్శ తగ్గిపోవడం, తలనొప్పి, కళ్లు తిరగడం, వాంతులు నిర్థారణ: ఎక్స్‌రే సర్వైకల్ స్పైన్, ఎమ్మారై, సీబీపీ, ఇ.ఎస్.ఆర్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ చికిత్స: హోమియో కేర్ ఇంటర్నేషనల్‌లో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ వైద్యపద్ధతి ద్వారా మెడనొప్పి తగ్గించడమే కాకుండా వెన్నుపూసలను దృఢంగా చేయడం ద్వారా మెడ, వెన్ను సమస్యలు తిరగబెట్టకుండా స్పాండిలోసిస్ సమస్యలను సంపూర్ణంగా నయం చేయవ చ్చు. - డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ న్యూరోసర్జరీ కౌన్సెలింగ్ నా వయసు 45 ఏళ్లు. నాకు ఇటీవల బ్రెయిన్లో ట్యూమర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. బ్రెయిన్ ట్యూమర్‌కు తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంటుందా? ఆపరేషన్ అంటే నాకు చాలా భయం. ముఖ్యంగా బ్రెయిన్‌కు ఆపరేషన్ చేస్తే తర్వాత మాట పడిపోతుంది, పక్షవాతం వస్తుందేమో అని చాలా భయంగా ఉంది. మందులతో బ్రెయిన్ ట్యూమర్ నయం అయ్యే అవకాశం లేదా? ఆపరేషన్ కాకుండా ఇంకా వేరే చికిత్సలు ఏమైనా అందుబాటులో ఉన్నాయా? ఆపరేషన్ పట్ల ఆందోళనతో డాక్టర్ వద్దకు వెళ్లాలంటేనే భయంగా ఉంది. దయచేసి నా సమస్యకు సరైన పరిష్కారం చూపించగలరు. - కళ్యాణి, గుంటూరు మీకు బ్రెయిన్ ట్యూమర్ నిర్ధారణ అయినట్లు తెలిపారు. అయితే మీకు మెదడులో ఏర్పడిన కణితి పరిమాణం, కణితి రకాన్ని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. అన్ని రకాల బ్రెయిన్ ట్యూమర్లకు ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. కణితి పరిమాణం మూడు సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉంటే ఆపరేషన్ లేకుండా రేడియో సర్జరీ ద్వారా సురక్షితంగా కణితిని తొలగించవచ్చు. ఒకవేళ కణితి పరిమాణం మూడు సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ముందు మీరు ఆపరేషన్‌పై ఉన్న భయాన్ని పోగొట్టుకోండి. ఒకవేళ మీకు ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి తలెత్తినా భయపడకండి. బ్రెయిన్ ట్యూమర్‌కు ఆపరేషన్ చేయించుకుంటే మాటపడిపోతుందనీ, పక్షవాతం వస్తుందనేది కేవలం అపోహ మాత్రమే. ప్రస్తుతం అత్యాధునిక శస్త్రచికిత్స విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఎలాంటి దుష్ర్పభావాలు తలెత్తకుండా సురక్షితంగా అపరేషన్ చేయవచ్చు. ఆపరేషన్‌కు భయపడి వైద్యుల వద్దకు వెళ్లకుండా ఉంటే సమస్య మరింత క్లిష్టంగా మారుతుంది. మీకు, మీ కుటుంబ సభ్యులకు అర్థమయ్యేలా కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాతనే ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ తర్వాత మళ్లీ మీరు సాధారణ జీవితం గడపగలుగుతారు. - డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణ్యం సీనియర్ న్యూరో సర్జన్, యశోద హాస్పిటల్స్,సికింద్రాబాద్ స్లీప్ కౌన్సెలింగ్ మా అమ్మాయి వయసు 12 ఏళ్లు. నిద్రలోంచి ఉలిక్కిపడి మేల్కొంటోంది. కెవ్వున అరుస్తోంది. ఆమె ప్రవర్తన చాలా భయంగొలిపేదిగా ఉంది. మా అమ్మాయి విషయంలో తగిన సలహా ఇవ్వండి. - సురేశ్‌కుమార్, నల్గొండ నిద్రలో ఉలిక్కిపడి లేవడం, భయపడటం, ఆందోళన పడటం, కెవ్వున అరవడం ఇవన్నీ నిద్రకు సంబంధించిన ఒకరకం సమస్య. దీన్నే ‘స్లీప్ టై’ అంటారు. నిద్రలో ఉండగానే ఇవన్నీ చేస్తారు. నిద్రలోని ఒక దశ అయిన... కనుపాపలు చలించని స్థితి (నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్-నాన్ ఆర్ఈఎమ్) దశలో కనిపించే సమస్య ఇది. నిద్రలో నడవడం కూడా ఈ తరహా సమస్య కిందికే వస్తుంది. ఏదైనా ఒక సమస్య గురించి తీవ్రంగా ఆలోచిస్తూ అది తాము పరిష్కరించలేని సమస్య అని బాగా ఆందోళనపడ్డప్పుడు ఒక్కోసారి ఇలా ప్రవర్తిస్తుంటారు. అలాంటి సందర్భాల్లో వాళ్లు లేచి, ఈ నైట్టై దశలో 1-2 నిమిషాలు ఉంటారు. తర్వాత మళ్లీ నిద్రలోకి జారుకుంటారు. వాళ్లకు సాంత్వన కలిగిస్తే ఈ పరిస్థితి క్రమంగా తగ్గిపోతుంది. అలాంటి స్థితిలో ఉన్న పేషెంట్‌ను చూసి, తల్లిదండ్రులు ఆందోళనపడటం చాలా సాధారణం. అయితే మీరు ఆందోళన పడాల్సిందేమీ లేదు. చాలామంది పిల్లల్లో ఈ సమస్య యుక్తవయసు రాగానే తగ్గుతుంది. వాళ్లు ఒకప్పుడు అలా ప్రవర్తించారన్న అంశమే వాళ్లకు గుర్తుండదు. అలాంటి వాళ్లలో అదేమీ మానసిక రుగ్మత కాదు. ఆరుగురిలో ఒక్కరికి మాత్రమే పెద్దయ్యాక కూడా ఈ పరిస్థితి వస్తుంటుంది. యుక్తవయస్కుల్లో కూడా ఈ సమస్య వస్తుందంటే... బహుశా వాళ్లు యాంగ్జైటీ లేదా డిప్రెషన్‌తో బాధపడుతూ ఉండవచ్చు. ఒక్కోసారి నిద్రలేమి, తీవ్రమైన ఒత్తిడి, దీర్ఘకాలికంగా ఉండే మైగ్రేన్, స్లీప్ఆప్నియా వంటి సమస్యలు కూడా ఈ పరిస్థితికి కారణం కావచ్చు. మీపాప ఏదైనా సమస్య గురించి ఆందోళన పడుతున్నా, ఏదైనా పరిస్థితి గురించి భయపడుతున్నా... ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలమనే భరోసాను ఆమెకు ఇవ్వండి. మీరు స్లీప్ స్పెషలిస్ట్‌ను సంప్రదించండి. - డాక్టర్ రమణ ప్రసాద్ కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్,కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్ -
స్థానికతపై పది రోజుల్లో మార్గదర్శకాలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం (ఫాస్ట్) పథకం వర్తింపులో పరిగణనలోకి తీసుకునే స్థానికత నిర్ధారణకు సంబంధించిన మార్గదర్శకాల జారీకి ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. వీటిని పది రోజుల్లోగా జారీ చేయాలని యోచిస్తోంది. ఫీజుల చెల్లింపు నిబంధనల కంటే ముందు స్థానికత నిర్ధారణకు మార్గదర్శకాలు ప్రధానమైనందున వాటి ని రూపొందించడంపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో విద్యార్థులకు నివాస ధ్రువీకరణ పత్రాలను జారీ చేయవద్దని రెవెన్యూ శాఖ తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా స్థానికతకు మార్గదర్శకాలను జారీ చేయాలని భావిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మార్గదర్శకాలు వెలువడితేనే రెవెన్యూ యంత్రాంగం తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది. పాత రికార్డులను అందుబాటులోకి తేవడం, స్థానికత నిర్ధారణకు పరిగణనలోకి తీసుకునే తదుపరి అంశాలపై చర్యలు చేపట్టడం సాధ్యమవుతుంది. ఆ తర్వాత విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేయడం కుదురుతుంది. అందుకే త్వరగా మార్గదర్శకాలను రూపొందించేందుకు సంక్షేమ, విద్యాశాఖ, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులతో ఒకటీ రెండు రోజుల్లో అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. ఐఏఎస్ అధికారులతో ఏర్పడే ఈ కమిటీ వారం రోజుల్లో మార్గదర్శకాలను రూపొందించి సీఎం కేసీఆర్‌తో చర్చించనుంది. అనంతరం ఉత్తర్వుల రూపంలో మార్గదర్శకాలు వెలువడనున్నాయి. ఇక ఫాస్ట్‌కు సంబంధించిన నిబంధనల రూపకల్పన చివరి దశకు చేరుకుంది. ఇందులో విద్యార్థి కనీస హాజరు, ఉత్తీర్ణత శాతం వంటి అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలి సింది. నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు, ప్రతిభావంతులైన విద్యార్థులకే పథకాన్ని వర్తింపజేసే అవకాశం ఉంది. మొదటి సంవత్సరంలో ఆర్థిక సహాయం మంజూరైన విద్యార్థికి రెండో ఏడాది ఫీజు మంజూరు చేయాలంటే ఫస్టియర్‌లోనూ కనీస మార్కులు, హాజరు శాతం ఉండాలనే నిబంధనలను మార్గదర్శకాల్లో చేర్చుతున్నట్లు సమాచారం. -
నైస్ స్థానం ఏమిటి ..?
Input-output Q(1-5): In an SSB interview for the NDA, a group testing officer allocates the following instructions to the candidates divided into 7 groups, who have to perform the ta-sks according to the input. Group I: Monkey crawling long ju-mp and rope climbing Group II: Monkey crawling rope jump and long climbing Group III: Rope crawling monkey climbing long and jump. Group IV: Climbing monkey cra-wling rope jump and long Group V: Climbing monkey and ro-pe jump crawling long and so on. The questions below are based on logic given above. 1. If the task of IInd group is "Nothing is without be achieved to determination", then which will be the VIth group ? 1) Without is nothing deter-mination to achieved 2) Achieved nothing deter-mination to is be without 3) Nothing is achieved without be to determination 4) Cannot be determined 5) None of the above Ans: 2 2. If "Terrorism Bush job incurbing remarkable did a" is Vth group task, then which is "Bush did in curbing remarkable job a terro-rism" group? 1) IV 2) III 3) II 4) VI 5) None Ans : 3 3. Asad is first selected for Ist group "you are my inspiration, guide and instructor", after some-time he was shifted to group IV. What is his new group task? 1) Instructor you are and inspiration guide my 2) You are my guide instructor and inspiration 3) Inspiration and guide instru-ctor you are my 4) Data inadequate 5) None Ans: 1 4. If the last (VIIth) group is "not job you for this selected are", then which group is Ist? 1) you are selected for this not job 2) selected for this job you are not 3) not you are selected for this job 4) you are not selected for this job 5) data inadequate Ans: 4 5. If the task of VIth group is "Polution is becoming cause of deadly diseases" then what is third (IIIrd) group? 1) Pollution is cause of deadly diseases becoming 2) Diseases becoming is cause of deadly pollution 3) Diseases of is becoming cause pollution deadly. 4) Becoming is pollution dis-eases deadly of cause 5) None Ans: 3 Explanation: From group I - II: Based on arra-ngements of words to different positions. The third word be-comes sixth and sixth becomes third, interchanging their places. Group II - III: First three words get reversed and last four are reversed. Group III - IV: Next we reverse the group of first 4 words and then last 3 words are reversed Group IV - V: Same rule follows as in group I to group II To solve more easily, we can give numbers to each word. Q (6-10): A word arrangement machine, when given a particular input rearranges it following a particular rule. The following is the illustration of the input and the steps of arrangement. Input: Date and month on year happy my dear Step I: My date and month on year happy dear Step II: My on date and month year happy dear Step III: My on and date month year happy dear Step IV: My on and date dear month year happy Step V: My on and date dear year month happy Step VI: My on and date dear year happy month (This is the last arrangement and step VI is the last step of this input) 6. If the following is the second step of an input, what will be the fourth step ? Step II: Go oh we all you went are have 1) Go oh all we are you have went 2) Go we oh all are you have went 3) Go oh we all are you have went 4) Cannot be determined 5) None Ans: 3 Explation: From the given logic they have arranged 2 letter words, 3 letter words, 4 letter words and then 5 letter words alphabetically. From the question step II: Go oh we all you went are have Step III: Go oh we all are you went have Step IV: Go oh we all are you have went 7. If the following is the third step of an input, what will be its first step ? 1) To for has been growing their demands power 2) To has been growing for their demands power 3) To for has growing been their demands power 4) Cannot be determined 5) None of the above Ans: 4 Explanation: It is not possible to find Ist step. 8. Which of the following is the third step for the following input? Input: Yes no is of name the code Neha 1) Is no of the yes name code Neha 2) is no of yes name the code Neha 3) is no of the yes code name Neha 4) there is no such step 5) None of the above Ans: 2 Explanation: Input: Yes not is of name the code Neha Step I: is yes no of name the code Neha Step II: is no yes of name the code Neha Step III: is no of yes name the code Neha Step IV: is no of the yes name code neha step V: is no of the yes code name Neha 9. How many steps will be required to get the final output from the following input? 1) IV 2) V 3) II 4) I 5) None of the above Ans: 1 Input: did of do dog cat rat animals ago Explanation: Input: did of do dog cat rat animals ago Step I: do did of dog cat rat animals ago Step II: do of did dog cat rat animals ago Step III: do of ago did dog cat rat animals Step IV: do of ago cat did dog not animals 10. If step I of an input is "is state all out to its trying increase", what step would be "is to all its out state trying increase"? 1) Six 2) Seven 3) Five 4) Eight 5) None Ans: 3 Explanation: Step I: is state all out to its trying increase Step II: is to state all out its trying increase Step III: is to all state out its trying increase Step IV: is to all its state out trying increase Step V: is to all its out state trying increase Fifth step is the answer Q (11-15): When a word and number arrangement machine is given an input line of words and numbers, it arranges them following a particular rule. The following is an illustration of input and rearran-gement. (All the numbers are two digit numbers) Input : 40 made butter 23 37 cookies salt extra 52 86 92 fell now 19 Step I: butter 19 40 made 23 37 cookies salt extra 52 86 92 fell now Step II: cookies 23 butter 19 40 made 37 salt extra 52 86 92 fell now Step III: extra 37 cookies 23 butter 19 40 made salt 52 86 92 fell now Step IV: fell 40 extra 37 cookies 23 butter 19 made salt 52 86 92 now Step V: made 52 fell 40 extra 37 cookies 23 butter 19 salt 86 92 now Step VI: now 86 made 52 fell 40 extra 37 cookies 23 butter 19 salt 92 Step VII: salt 92 now 86 made 52 fell 40 extra 37 cookies 23 butter 19 Step VII is the last step of the above arrangement as the intended arrangement is obtained. As per the rules followed in given steps, find out the appropriate steps from the given input. Input: 32 proud girl beautiful 48 55 97 rich family 61 72 17 nice life 11. How many steps will be required to complete the given input ? 1) Five 2) Six 3) Seven 4) Eight 5) None Ans: 3 12. Which of the following is the third element from the left end of step VI ? 1) Beautiful 2) Life 3) 61 4) Nice 5) 17 Ans: 4 13. Which of the following is step III of the given input ? 1) proud 72 girl 48 family 32 beautiful 17 55 97 rich 61 nice life 2) life 55 girl 48 family 32 be- autiful 17 proud 97 rich 61 72 nice 3) girl 48 family 32 beautiful 17 proud 55 97 rich 61 72 nice life 4) family 32 beautiful 17 proud girl 48 55 97 rich 61 72 nice life 5) girl 48 life 55 family 32 beautiful 17 proud 97 rich 61 72 nice Ans: 3 14. What is the position of nice from the left end in the final step ? 1) Fifth 2) Sixth 3) Seventh 4) Eighth 5) Ninth Ans: 1 15. Which element is third to the right of 'Family' in step V ? 1) Beautiful 2) 17 3) Proud 4) 97 5) 32 Explanation : Input: 32 proud girl beautiful 48 55 97 rich family 61 72 17 nice life Step I: beautiful 17 32 proud girl 48 55 97 rich family 61 72 nice life Step II: family 32 beautiful 17 proud girl 48 55 97 rich 61 72 nice life Step III: girl 48 family 32 beautiful 17 proud 55 97 rich 61 72 nice life Step IV: life 55 girl 48 family 32 beautiful 17 proud 97 rich 61 72 nice Step V: nice 61 life 55 girl 48 family 32 beautiful 17 proud 97 rich 72 Step VI: proud 72 nice 61 life 55 girl 48 family 32 beautiful 17 97 rich Step VII: rich 97 proud 72 nice 61 life 55 girl 48 family 32 beautiful 17 Ans: 2 -
పీజీ వైద్య సీట్ల భర్తీకి మార్గదర్శకాలు
సాక్షి, హైదరాబాద్: 2014-15 విద్యా సంవత్సరానికి పీజీ వైద్య సీట్లు, పీజీ డెంటల్ సీట్ల భర్తీకి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. గత ఏడాది సీట్ల భర్తీ కోసం ఇచ్చిన జీవో నెం.43కు కొన్ని సవరణలు చేస్తూ వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. స్పెషాలిటీ సీట్ల వారీగా ఈ సారి భర్తీ జరుగుతుంది. ఉదాహరణకు రాష్ట్రవ్యాప్తంగా 150 జనరల్ మెడిసిన్ సీట్లు ఉన్నాయనుకుంటే అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల కేటగిరీలతో పాటు వికలాంగ అభ్యర్థులకు సైతం ముందే సీట్లు రిజర్వ్ చేస్తారు. గతంలో అయితే ప్రతి వంద పాయింట్లను లెక్కేస్తూ అభ్యర్థులకు సీట్లు కేటాయించేవారు. అంతేకాదు గతంలో ఉన్న విధానం ప్రకారం మంచి ర్యాంకులు సాధించిన వారు బాగా ప్రాచుర్యం ఉన్న సీట్లను ఎంచుకునేవారు. దీంతో మెరిట్ విద్యార్థులు సీట్లను పొందేవారు. ఇప్పటి విధానం ప్రకారం ప్రతి స్పెషాలిటీలోనూ ప్రతి కేటగిరీకి చెందిన అభ్యర్థి ఉంటారు. కాగా గతంలో ఇచ్చిన జీవోకు చిన్న సవరణ చేశారు. గతేడాది ఆర్థోపెడిక్ సీట్లు మహిళలకు కేటాయించినప్పుడు ఎవరూ ఆసక్తి చూపలేదు. దీంతో సీట్లు మిగిలిపోయేవి. ఈ సారి అలా సీట్లు మిగిలిపోతే మిగతా వారికి కేటాయించాలని నిర్ణయించారు. కేటగిరీల వారీగా ముందే సీట్లు కేటాయిస్తే రిజర్వ్డ్ అభ్యర్థులకు ఎలాంటి నష్టమూ ఉండదని భావించారు. ఈ ఏడాది సీట్ల భర్తీలో యూనివర్శిటీల వారీగా, కాలేజీల వారీగా పక్కాగా సీట్ల విధానాన్ని అనుసరించాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. కొత్త విధానం ప్రకారం మహిళా అభ్యర్థుల సీట్లు భర్తీ కాకపోతే ఆ సీట్లను కేటగిరీల వారీగా జనరల్ అభ్యర్థులకు కేటాయిస్తారు ఎస్సీ అభ్యర్థుల సీట్లు భర్తీ కాని పక్షంలో ఆ సీట్లను ఎస్టీలకు కేటాయిస్తారు ఎస్టీ అభ్యర్థుల సీట్లు భర్తీ కాకపోతే ఆ సీట్లను ఎస్సీలకు కేటాయిస్తారు భర్తీకాని ఎస్సీ అభ్యర్థుల సీట్లు ఓసీలకు కేటాయిస్తారు బీసీ-ఏ సీట్లు భర్తీకాకపోతే బీసీ-బీకి కేటాయిస్తారు భర్తీ కాని బీసీ-బీ సీట్లను బీసీ-సీకి ఇస్తారు భర్తీ కాని బీసీ-సీ సీట్లను బీసీ-డీకి కేటాయిస్తారు భర్తీకాని బీసీ-డీ సీట్లను బీసీ-ఇకి కేటాయిస్తారు భర్తీకాని బీసీ-ఇ సీట్లను బీసీ-ఏకు కేటాయిస్తారు భర్తీకాని బీసీ సీట్లను ఓసీలకు కేటాయిస్తారు రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థి ఎవరైనా సీటు పొంది ఆ తర్వాత ఆ సీటును వదులుకుంటే ఆ సీటును ఓసీకి ఇస్తారు ఓసీ రిజర్వ్డ్ (ఉమెన్) సీట్లు ఖాళీగా ఉంటే ఆ సీట్లను ఓసీ క్యాండిడేట్లకు ఇస్తారు -
హెక్టారు పొలం.. పది నిమిషాల్లో పిచికారీ!
* అందుబాటులోకి అత్యాధునిక బూమ్ స్ప్రేయర్ * ప్రపంచ స్థాయి పరికరాన్ని రూపొందించిన సృజనశీలి సయ్యద్ సుభానీ పంట సాగుకు అదను, పదును తెలుసుకోవడంతోపాటు యాజమాన్య పద్ధతులను సక్రమంగా అర్థం చేసుకొని ఆచరించడంలోనే రైతు విజయ రహస్యం దాగి ఉంది. ఏ పంట సాగులోనైనా భూ యాజమాన్యం, విత్తన ఎంపిక, సస్యరక్షణ అనే మూడు అంశాలు దిగుబడులను ప్రభావితం చేసే కీలక అంశాలు. పంట పెరుగుదల దశలో సస్యరక్షణ అతి ముఖ్యమైనది. చాలా సందర్భాల్లో దీని నిర్వహణ రైతులకు కత్తిమీది సామే. వీపున స్ప్రే ట్యాంక్ వేలాడేసుకొని మందు కలిపిన నీళ్లను మాటిమాటికీ నింపుకొని పిచికారీ చేయడానికి గంటల కొద్దీ సమయం పడుతుంది. పెద్ద రైతులైతే అధిక విస్తీర్ణంలో సాగు చేసిన పంటలకు రోజుల తరబడి పిచికారీ చేయాల్సి వస్తుంది. భారీ మొత్తం వెచ్చిస్తే తప్ప త్వరితంగా పని ముగించుకోగలిగే యంత్ర పరికరాలు దొరకవు. సయ్యద్ సుభానీ వాణిజ్య పంటలను అధికంగా సాగు చేసే గుంటూరు జిల్లాలో సస్యరక్షణ పనుల్లో రైతుల ఇబ్బందులను ప్రత్యక్షంగా చూశాడు. విదేశాల్లో వాహనాల ద్వారా సస్యరక్షణ మందులు వెదజల్లే బూమ్ స్ప్రేయర్ పరికరాన్ని గుర్తించాడు. అదే తీరులో అత్యంత వేగంగా పనిచేసే స్ప్రేయర్‌ను తయారు చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చాడు. పెదనందిపాడు మండలం నాగభైరవపాలెంలో పుట్టి పెరిగిన సయ్యద్ సుభానీ వృత్తిరీత్యా వ్యవసాయ పనిముట్లు తయారు చేసే వడ్రంగి. వ్యవసాయ అనుబంధ వృత్తిలో ఉన్న సుభానీ సస్యరక్షణ పనుల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించాడు. ఈ సమస్యను పరిష్కరించడానికి తానుగా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు. వ్యవసాయ పరికరాలు, వివిధ రకాల స్ప్రేయర్ల మరమ్మతులో విశేష అనుభవం ఉన్న సుభానీ అత్యంత వేగంగా పని పూర్తి చేసే స్ప్రేయర్‌ను రూపొందించాలని ప్రయత్నించి విజయం సాధించాడు. మార్కెట్లో అందుబాటులో ఉన్న పైపులను, నాజిల్స్ను వెల్డింగ్ ద్వారా జత చేసి వాటిని ట్రాక్టర్‌కు ఓ ఫ్రేమ్ ద్వారా అమర్చాడు. అదే ఫ్రేమ్‌లో ట్రాక్టర్ మీదే ఏర్పాటయి ఉన్న పెద్ద సింటెక్స్ ట్యాంక్‌కు కలిపాడు. ట్రాక్టర్ పుల్లీకి మోటార్‌ను అనుసంధానం చేయడం ద్వారా ట్యాంక్‌లోని మందు ద్రావణం బూమ్ స్ప్రేయర్లోకి వెళ్లి ఒకేసారి అనేక నాజిళ్ల ద్వారా విరజిమ్మే విధంగా రూపొందించాడు. 60 అడుగుల పొడవునా ఉండే స్ప్రేయర్‌తో మందు పిచికారీ చేయడం అత్యంత వేగంగా జరుగుతుంది. పొలం పొడవు, వెడల్పును బట్టి అత్యధికంగా పది నిమిషాల్లో హెక్టారు(రెండున్నర ఎకరాల) పొలంలో మందు లేదా జీవామృతం పిచికారీని ముగించవచ్చు. 2004 నుంచి స్ప్రేయర్ రూపొందించే కృషిలో నిమగ్నమైన సుభానీని ఈ విజయం అంత తేలికగా వరించలేదు. తొలుత సైకిల్ మీద ట్యాంక్ ఏర్పాటు చేసి బూమ్ స్ప్రేయర్‌ను ఏర్పాటు చేశాడు. సైకిల్‌ను నెట్టుకుంటూ పిచికారీ చేయాల్సి వచ్చేది. 2007లో మరింత మెరుగుపరిచే ప్రయత్నం చేస్తూ జీప్ మీద ఏర్పాటు చేశాడు. వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనలో జిల్లా అధికారులు, మంత్రులు ఈ స్ప్రేయర్ పనితనం చూసి ప్రశంసలు గుప్పించారు. అయితే, నల్లరేగడి నేలల్లో జీపు వినియోగంలో కొన్ని సమస్యలొచ్చాయి. ఇదే సమయంలో వ్యవసాయ శాఖ సిఫారసుతో నాబార్డ్ వారు రూ. 2.33 లక్షల రుణం మంజూరు చేశారు. ఆర్థిక వనరులు చేకూరడంతో బూమ్ స్ప్రేయర్‌ను మరింత మెరుగుపరచి ట్రాక్టర్‌కు అమర్చాడు. తాజాగా ఈ సంవత్సరం ఇదే స్ప్రేయర్‌ను మరింత ఆధునీకరించాడు. 100 అడుగుల వెడల్పుతో స్ప్రే చేసే విధంగా.. అవసరమైనప్పుడు పొలం వెడల్పు ఉన్నంత వరకూ స్ప్రే చేసే విధంగా రూపొందించాడు. అయితే, పొలం వెడల్పును బట్టి దాన్ని మడుచుకొనే వీలు కల్పించాడు. దీంతో ఒకే స్ప్రేయర్‌తో 50 అడుగులు, 70 అడుగులు, 100 అడుగుల వెడల్పు ఉన్న చేలల్లో మందు పిచికారీ చేసే అవకాశం ఏర్పడింది. దీనికి తోడు సోలార్ విద్యుత్‌తో స్ప్రేయర్ ట్యాంక్‌లో మందు నిల్వ ఎప్పటికప్పుడు డ్రైవర్ తెలుసుకొనే విధంగా ఓ సూచిని రూపొందించి.. దాన్ని ట్రాక్టర్ డ్రైవర్ ముందున్న డాష్‌బోర్డులో అమర్చాడు. అవసరానికి తగినట్లు.. చేతితో మడుచుకోవడం ద్వారా సవరించుకొనే వీలున్న బూమ్ స్ప్రేయర్ ప్రపంచంలో ఇదొక్కటేనని స్పష్టం చేశాడు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సు బృందం దీన్ని పరిశీలించి వివరాలను నమోదు చేసింది. ఆధునీకరించిన బూమ్ స్ప్రేయర్‌ను కూడా ఈ బృందం పరిశీలించనుంది. సాధారణ గ్రామీణుడు ప్రపంచ స్థాయి పరికరాన్ని రూపొందించడం అసాధారణ విజయం. - జిట్టా బాల్‌రెడ్డి, ‘సాగుబడి’ డెస్క్ 23 స్ప్రేయర్లు తయారుచేసి ఇచ్చా..! రైతులు సస్య రక్షణ మందుల పిచికారీ సమయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు గమనించి ఏదైనా పరిష్కారం ఆలోచించాలనుకున్నాను. ఆరేడేళ్లుగా అదే పనిగా శ్రమిస్తున్నాను. తొలుత సైకిల్‌తో స్ప్రేయర్‌ను తయారు చేశాను. తరువాత జీపుపై ఏర్పాటు చేసి స్ప్రేయర్‌ను పరిశీలించాను. వ్యవసాయ ప్రదర్శనలో మంచి ప్రశంసలు వచ్చాయి. నేను చేసిన ప్రయత్నం పల్లెసృజన సంస్థ అధ్యక్షుడు గణేశం గారి దృష్టికి వెళ్లింది. ఆయన నన్ను ప్రొత్సహించడమే కాకుండా అవార్డుకు సిఫారసు చేశారు. మరింత మెరుగైన పరికరం రూపొందించడానికి నాబార్డ్ ద్వారా రుణ సదుపాయం పొందేందుకు తోడ్పడ్డారు. ఇప్పుడు మరింత ఆధునికమైన 100 అడుగుల స్ప్రేయర్‌ను తయారు చేశాను. సంవత్సరానికి కనీసం 10 స్ప్రేయర్లకు ఆర్డర్లు వస్తున్నాయి. ఇప్పటికి 23 స్ప్రేయర్లు తయారు చేసి రైతులకు ఇచ్చాను. ఒక్కొక్క స్ప్రేయర్ తయారీకి రూ.60 వేలు ఖర్చవుతుంది. అప్పటి వ్యవసాయ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చేతుల మీదుగా అభ్యుదయ రైతు అవార్డు అందుకున్నాను. పొగాకు పంట కోసం బూమ్ స్ప్రేయర్‌ను రూపొందించే ప్రయత్నంలో ఉన్నాను. - సయ్యద్ సుభానీ(98486 13687), నాగభైరవపాలెం, పెదనందిపాడు మండలం, గుంటూరు జిల్లా -
సాగుబడి.. సాగే సర్వస్వం!
అమ్మ.. అవని.. సృష్టి గతికి కేంద్ర బిందువులు. పల్లైనా, ఢిల్లీ అయినా ప్రతిరోజూ పంటిన కొరికే మెతుకు స్త్రీ మూర్తుల స్వేద బిందువుల్లో తడిసి మొలిచిన పంటే. సమాజంలో సకల విద్యలు నేర్చి అన్నింటా తాముగా ఉన్న మహిళలు.. మట్టిపోగుల్లోంచి బంగరు పంటలు సృష్టించడంలోనూ దిట్టలే. జీవన పోరాటంలో ఎన్ని ఒడిదుడుకులెదురైనా, ఎదురుదెబ్బలు తగిలినా.. కాడి కిందపడెయ్యని ధీశాలురు మహిళా రైతులు. సంక్షుభిత వ్యవసాయాన్ని మనోనిబ్బరంతో కొత్తపుంతలు తొక్కించడంలోనూ వీరి పాత్ర అమోఘం. ఒక్కమాటలో.. వ్యవసాయమే వీరి జీవన సర్వస్వం! అంతర్జాతీయ కుటుంబ వ్యవసాయ సంవత్సరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. పైరుపచ్చని జీవితేచ్ఛను నింపుకున్న వీరి గుండె చప్పుళ్లు.. ఈ వారం ‘సాగుబడి’ పాఠకుల కోసం.. - సేకరణ: పంతంగి రాంబాబు, ‘సాగుబడి’ డెస్క్ ఇటు వ్యవసాయం.. అటు ఉద్యమం.. ముగ్గురు ఆడపిల్లలు పుట్టారని మా ఆయన వేరే పెళ్లి చేసుకుంటే.. పిల్లలను తీసుకొని పుట్టింటికి వచ్చేశా. మాకున్న ఎకరం పొలంలో పదేళ్ల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. దీంతోపాటు కొంత కొండపోడులో కూడా పంటలు పండిస్తున్నాం. నీవొక్కదానికే కాదు సమస్యలు అందరికీ ఉన్నాయని నాన్న ధైర్యం చెప్పారు. గిరిజన హక్కుల ఉద్యమాన్ని పరిచయం చేశారు.. నా కాళ్ల మీద నేను నిలబడగలనన్న ధైర్యం వచ్చింది. నాన్న చనిపోయాక కూడా వ్యవసాయం చేసుకుంటూ ఉద్యమంలో కొనసాగుతున్నాను. 4 మండలాల్లో గిరిజనులతో కలసి భూమిపై శాశ్వత హక్కు కోసం పోరాడుతున్నాం. రసాయనాలు వాడకుండా చిరుధాన్యాలను పండిస్తున్నాం. రసాయనాల్లేని పంటల వల్ల మనుషులు, పశువులు, భూమి బాగుంటాయి. సొంత భూమి, సొంత విత్తనం ఉండాలి, సొంత పంట తినాలి.. సొంత సంస్కృతిని నిలబెట్టుకోవాలనేది లక్ష్యంగా పనిచేస్తున్నాను. వ్యవసాయ కుటుంబాల్లో పనులన్నీ స్త్రీపైనే ఆధారపడి ఉంటాయి. మహిళా రైతులు ధైర్యంగా నిలబడాలి.. - పడాల భూదేవి, గిరిజన రైతు, సవర స్వర్లంగి, హీర మండలం, శ్రీకాకుళం జిల్లా మనలో శక్తి మనకు తెలీదు..! మా వారు హఠాన్మరణం చెందిన తర్వాత ఉద్యోగంలో చేరకుండా వ్యవసాయంలోకి వచ్చా. ఇంకో జీవితం ఉందిలే అన్న ఆలోచనతో స్వగ్రామం చేరుకొని 18 ఎకరాల సొంత భూమిలో వ్యవసాయం ప్రారంభించా. 8 ఏళ్లుగా వరి, కూరగా యలను సేంద్రియ పద్ధతుల్లో పండిస్తున్నా. పశుపోషణ, వర్మీ కంపోస్టు తయారీ, బయోగ్యాస్ ఉత్పత్తి ద్వారా స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తూ నిలబడ్డా. మా తల్లిదండ్రులు, బంధువుల తోడ్పాటు లేకుంటే అవార్డులు సాధించే స్థితికి వచ్చేదాన్ని కాదు. మనలో శక్తి మనకు తెలీదు. కృషికి అదృష్టం తోడైతే మన శక్తి వెలికి వస్తుంది.. రైతుకు గిట్టుబాటు ధర ఏదీ? కూలీల కొరత, విద్యు త్ సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తేనే వ్యవసాయం నిలుస్తుంది. అయినా, సాగులో ఉన్న స్వేచ్ఛ, సంతృప్తి మరెక్కడా దొరకవు. స్త్రీలు ఉన్న చోటే నిలదొక్కుకొని బతకాలి. - కర్ర శశికళ, సేంద్రియ రైతు, దుగ్గిపల్లి, త్రిపురారం మండలం, నల్లగొండ జిల్లా ఎన్ని బాధలున్నా వ్యవసాయమే మేలు! మాకు 3 ఎకరాల పట్టాలేని పొలం ఉంది. దీనికి తోడు 6 ఎకరాలు కౌలుకు తీసుకొని మిర్చి, పత్తి, వేరుశనగ పండించే వాళ్లం. బావి తవ్వించడానికి రూ.లక్ష ఖర్చయింది. పత్తిలో నష్టం వచ్చింది. పిడుగుపడి పశువులు చనిపోయాయి. అప్పు రూ.2 లక్షలకు పెరిగిందని నా భర్త భిక్షపతి 28.6.2011న ఉరేసుకొని చనిపోయాడు. కాగితాలన్నీ ఇచ్చినా, ప్రభుత్వం ఇప్పటికీ పట్టించుకోలేదు. బాధలు దిగమింగుకొని.. ఒంటరిదాన్నయినా వ్యవసాయం చేయడమే మంచిదనుకున్నా. పత్తి వేయడం మానేశా. బావి కింద ఎకరంలో వరి రెండు పంటలు పండిస్తున్నా. మిగతా రెండెకరాల్లో సీడ్ మొక్కజొన్న, సీడ్ చిక్కుడు, పెసర వేశా. ముగ్గురు పిల్లలు, మా అత్త, వికలాంగురాలైన మామ చెల్లె.. కలిసే ఉంటున్నం. పిల్లలు చదువుతున్నారు. ఖాళీ ఉన్నప్పుడల్లా మా పొలంలో పని చేస్తారు లేదా కూలికెళ్తారు. బాధలెన్ని ఉన్నా ఎలాగోలా నెట్టుకొస్తున్నా. ఇంకా తీర్చాల్సిన అప్పు రూ. 30 వేలుంది.. ప్రభుత్వం సాయపడాలి. - గుడిశాల భాగ్యమ్మ, మహిళా రైతు, ఇప్పగూడెం, స్టేషన్ ఘన్పూర్ మండలం, వరంగల్ జిల్లా ఆరేడు నెలల్లో ప్రకృతి వ్యవసాయం నేర్చుకున్నా..! మా నాన్న, తాత కూడా వ్యవసాయం చేయలేదు. కానీ, బీటెక్, ఎంబీఏ చదివిన నేను పాలేకర్ రాసిన పుస్తకం చదివి ఆరేడు నెలల్లో ప్రకృతి వ్యవసాయం నేర్చుకున్నా. జీవామృతంతో మొదట ఇంటి దగ్గర కూరగాయలు సాగు చేశా. ఆరేళ్లుగా కాయని ఉసిరి చెట్టుకు కాపు రావడంతో ప్రకృతి వ్యవసాయం చేయొచ్చన్న ధైర్యం వచ్చింది. తర్వాత శిక్షణ పొందా. వందెకరాల్లో వరి, చెరకు, వేరుశనగ, శనగ, గోధుమ, బంగాళదుంప తదితర పంటలు సాగు చేస్తున్నా. మంచి దిగుబడులొస్తున్నాయి. ఆరోగ్యదాయకమైన పంట దిగుబడులను కూడా స్థానికంగా మార్కెట్ ధరకే అమ్ముతున్నా. గాలివానకు రూ.20 లక్షల పెట్టుబడిని నష్టపోయిన కౌలు రైతు ఆత్మహత్యే శరణ్యమని ఇటీవల టీవీలో చెబుతుంటే బాధనిపించింది. పెట్టుబడులు తగ్గించుకుంటే జీవితం ఇంతగా తల్లకిందులవ్వదు. అన్నీ సరిగ్గా చేస్తే పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం మంచి ఫలితాలిస్తుంది. మహిళ ఏ స్థాయిలో ఉన్నా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలగాలి. ధైర్యంగా ఉండాలి. - శిల్పా కాళేశ్వర్, యువ మహిళా రైతు, పెనుకొండ, అనంతపురం జిల్లా పొలానికెళ్లిరానిదే నిద్ర పట్టదు! మా నాన్న గారు పొలం పనులు చేయడం నేర్పించారు. మాకు ఏడెకరాల పొలం ఉంది. మా వారు సంజీవరెడ్డితో కలసి పాతికేళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నా. మనల్ని కన్న తల్లి పెంచేది 20 ఏళ్లే. ఎల్లకాలం పెంచేది నేలతల్లి. వరి, చక్కెరకేళి, పసుపు, మొక్కజొన్న, ధనియాలు, వాము, మెంతులు, ఆముదాలు, మిరప, కొబ్బరి పండించుకుంటున్నాం. మాంసం, గుడ్లు తప్ప ఏదీ కొనడం లేదు. కూరగాయలు, ఆకుకూరలు మేం తినగా నలుగురికి ఇస్తున్నాం. పొలానికెళ్లిరానిదే నిద్ర పట్టదు. అమ్మను చూడకుండానైనా కొద్ది రోజులు ఉంటా. కానీ, పొలాన్ని చూడకుండా ఉండలేను. అయినా, పొలం వెళ్లకుండా ఏం చేయాలి? టీవీ సీరియళ్లు చూడడం, ఖాళీగా కూర్చొని ముచ్చట్లాడడం నాకు నచ్చదు. స్వయంగా పొలం పనులు చేస్తూ ఉంటే.. లేబర్ మల్లే పొలం పోతున్నదని వాళ్లూ వీళ్లూ అనేవారు. ఐదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ పేరు సంపాదించాక వాళ్ల నోళ్లు మూతపడ్డాయి. నా చిన్నప్పుడు పిండి కట్టలు(రసాయనిక ఎరువులు) వేయకపోయినా ఎకరానికి పది బస్తాల మినుములు పండేవి. ఇప్పుడు పిండి వేసినా 4 బస్తాలైతే గగనం. ప్రకృతి వ్యవసాయంలో అట్లా కాదు. ఖర్చు బాగా తక్కువ.. ఆదాయం ఎక్కువ. చక్కెరకేళి పంటలో ఎకరానికి ఈ ఏడాది రూ.లక్షన్నర నికరాదాయం వచ్చింది. ఎప్పటికైనా అందరూ ప్రకృతి వ్యవసాయం దారికి రాక తప్పదు. - అన్నపురెడ్డి మల్లీశ్వరి, మహిళా రైతు, నూతక్కి, మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా మేతలో వెదురు బొగ్గుపొడి కలిపితే మేలు! మంచినీటి చెరువుల్లో చేపల పెంపకాన్ని లాభాల దిశగా నడిపించడానికి ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు నిరంతరం సాగుతూనే ఉన్నాయి. తైవాన్‌లోని ఫిషరీస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఎఫ్.ఆర్.ఐ.) చేపల మేతపై చేస్తున్న పరిశోధనల్లో ఇటీవల సరికొత్త విషయం వెలుగులోకి వచ్చింది. వెదురు బొంగుల బొగ్గును పొడిగా మార్చి చేపల మేతలో కలిపి వాడితే చేపల పెరుగుదల మెరుగైనట్లు ఎఫ్.ఆర్.ఐ. శాస్త్రవేత్తలు ‘చైనా పోస్టు’ పత్రికతో చెప్పారు. తైవాన్ తిలాపియా చేపలకు ఇచ్చే మేతలో వెదురు బొగ్గుపొడిని వాడినప్పుడు వాటి బరువు పెరిగింది. ఈ చేపల పొడవు, ఎదుగుదల కూడా సాధారణం కంటే పెరిగినట్లు గుర్తిం చారు. వెదురు బొగ్గు పొడితోపాటు వెదురు వెనిగర్‌ను కూడా కలిపి వాడితే.. ఎదుగుదల మరింత వేగవంతమైనట్లు గుర్తించారు. ఇదేవిధంగా కర్ర బొగ్గు, ఉడ్ వెనిగర్‌ను మేతలో కలిపినప్పుడు చేపల ఆరోగ్యం మెరుగ్గా ఉండడంతో పాటు రోగనిరోధక శక్తి గణనీయంగా పెరిగిందని తైవాన్ శాస్త్రవేత్తలు ప్రకటించారు. తిలాపియా చేపల్లో మాంసంతోపాటు కాలేయ పరిమాణం కూడా పెరిగినట్లు ఎఫ్ఆర్ఐ ప్రకటించింది. అయితే.. ఇదే మేతను తెల్ల(కార్ప్) చేపలకు వేసినప్పుడు చెరువుల్లో నత్రజని, భాస్వరం వలన ఏర్పడే ప్రతికూల ప్రభావాలు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. చేపల చెరువుల్లోని విషతుల్య ర సాయనాలను కరిగించడంలో మామూలు కర్రబొగ్గు పొడి కంటే వెదురు బొగ్గుపొడి మెరుగైన ఫలితాలనిచ్చిందని పరిశోధకులు తెలిపారు. వెదురు బొగ్గు పొడిని పశువుల దాణాలో కలిపినప్పుడు కూడా సత్ఫలితాలు వచ్చాయని శాస్త్రవేత్తలు తెలిపారు. కోళ్ల మేతలో వెదురు బొగ్గు పొడిని కలిపినప్పుడు కోళ్ల మాంసం మదువుగా ఉండి, గుడ్ల ఉత్పత్తి పెరిగింది. గొర్రెల దాణాలోనూ వెదురు బొగ్గు పొడి కలిపినప్పుడు.. వీటికి మాంసకృత్తులను హరాయించుకునే శక్తి పెరిగినట్లు ఎఫ్.ఆర్.ఐ. శాస్త్రవేత్తలు తెలిపారు. పేటెంట్ వచ్చాక గుట్టు విప్పేస్తా! ‘బోర్లు రెండు.. మోటారు ఒకటే!’ శీర్షికన నల్లగొండ జిల్లాకు చెందిన పందిరి పుల్లారెడ్డి అనే రైతు ఆవిష్కరణపై ‘సాగుబడి’ పేజీ(3-3-2014)లో ప్రచురితమైన కథనానికి రైతులోకం అపూర్వస్థాయిలో స్పందిస్తోంది. పుల్లారెడ్డికి ఫోన్ కాల్స్ వరదలా వస్తున్నాయి. ‘రోజుకు 8 గంటల చొప్పున ఫోన్ కాల్స్‌కు సమాధానం చెబుతున్నా ఫోన్లు వస్తూనే ఉన్నా యి. ఫోన్‌కు లౌడ్ స్పీకర్లు పెట్టి సమాధానాలు చెబుతున్నాను. పేటెంట్ మంజూరైన తర్వాత రైతు సోదరులకు దీనికి సంబంధించిన గుట్టు విప్పి పూర్తిగా విడమర్చి చెబుతాను. రెండు బోర్లను ఒక మోటారుతో ఎలా నడుపుతున్నానో స్వయంగా వచ్చి చూసెళ్లవచ్చు. ఇప్పటికే రోజూ కొందరు చూసెళ్తున్నారు..’ అని పుల్లారెడ్డి ‘సాగుబడి’తో చెప్పారు. - పందిరి పుల్లారెడ్డి, రైతు శాస్త్రవేత్త, ముకుందాపురం, నల్లగొండ జిల్లా -
సాగుబడి.. (మార్చి 4 నుంచి 17 వరకు)
ఈ వారం వ్యవసాయ సూచనలు పుబ్బ కార్తె (మార్చి 4 నుంచి 17 వరకు) రాష్ర్టంలోని వివిధ ప్రాంతాలలో ముఖ్యంగా తెలంగాణ జిల్లాల్లో అకాల వర్షాలు, వడగండ్ల వాన నేపథ్యంలో రైతులు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా నష్ట తీవ్రతను తగ్గించుకోవచ్చు. వరి: తెలంగాణ జిల్లాల్లో వరికి అగ్గి తెగులు ఇంతకు ముందే ఆశించింది. మారిన వాతావరణ పరిస్థితుల్లో ఈ తెగులు వేగంగా వ్యాపించే అవకాశం ఉంది. నివారణకు గాను లీటరు నీటికి ఇసోప్రోథాయెలిన్ 1.5 మి.లీ.లు లేదా కాసుగామైసిన్ 2.5 మి.లీ.లు లేదా 0.6 గ్రాముల ట్రైసైక్లోజోల్లలో ఏదో ఒక మందును మార్చి మార్చి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి. పైపాటుగా ఎకరానికి 15-20 కిలోల పొటాష్ ఎరువు వేయాలి. మామిడి: అకాల వర్షాలు, వడగళ్లు పడటం వలన పిందె నాణ్యతను పెంచడానికి, తెగుళ్లు ఆశించకుండా నిరోధించేందుకు చర్యలు చేపట్టాలి. సూక్ష్మపోషకాల మిశ్రమాన్ని లేదా మల్టీ-కే మిశ్రమాన్ని లీటరు నీటికి 10 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆకుమచ్చ (పక్షికన్ను) తెగులు, బూడిద తెగులు నివారణకు లీటరు నీటికి కార్బన్‌డిజమ్ 1 గ్రాము లేదా నీటిలో కరిగే గంధకము 3 గ్రాములు చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. మిరప: తడిసిన కాయలను నేరుగా నేలమీద ఆరబెడితే భూమిలోని తేమ వల్ల బూజుపట్టి తెల్లకాయలుగా ఏర్పడే అవకాశముంది. కాయలను టార్పాలిన్ మీద కానీ, గచ్చు మీద కానీ ఆరబెట్టి.. విడిగా అమ్ముకోవడం మంచిది. కూరగాయ పంటలు: వర్షాల తర్వాత గాలిలో, భూమిలో ఎక్కువ తేమ ఉంటుంది. ఎండ తీక్షణంగా కాస్తుంది. ఈ పరిస్థితుల్లో అన్ని రకాలైన కూరగాయల పంటల్లో బూడిద తెగులు, రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువయ్యే అవకాశం ఉంది. బూడిద తెగులు నివారణకు ముందు జాగ్రత్త చర్యగా ఎకరానికి 600 గ్రాముల నీటిలో కరిగే గంధకం లేదా 200 మి.లీ.లు కెరాథేన్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. రసంపీల్చే పురుగుల నివారణకు ఒక లీటరు నీటికి 1.5 గ్రాముల అసిఫేట్ లేదా 2 మిల్లీ లీటర్ల ఫిప్రోనిల్ కలిపి మార్చి మార్చి వారం-పది రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. టమాటాలో ఆకుమాడు తెగులు నివారణకు లీటరు నీటికి 2 గ్రాముల క్లోరోథాలోనిల్ లేదా 3 గ్రాముల కాప్టాన్ కలిపి పిచికారీ చేయాలి. - వ్యవసాయ విస్తరణ సంచాలకులు ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ వర్సిటీ, రాజేంద్రనగర్, హైదరాబాద్ పాలలో వెన్న శాతం పెంచుకోవడం ఎలా? * సూర్తి గేదెలు, జెర్సీ ఆవుల పెంపకం లాభదాయకం కావాలంటే పాలలో వెన్న శాతం బాగుండాలి. 1% వెన్న పెరిగితే లీటరుకు రూ. 2-3 చొప్పున రైతుకు ఆదాయం పెరుగుతుంది. * 2, 3 ఈతల పశువుల పాలల్లో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది. ఈనిన 4-5 వారాలకు వెన్న శాతం పెరుగుతుంది. * రోజూ ఒకే సమయానికి పాలు పిండాలి. పచ్చి మేత తిన్న పశువు కడుపులో అసిటిక్ ఆమ్లం తయారై వెన్న శాతాన్ని పెంచుతుంది. * పశువులకూ వ్యాయామం అవసరం. రోజుకు 3-4 కిలోమీటర్లు నడిచే పశువుల పాలలో వెన్న ఎక్కువగా ఉంటుంది. * తొలి పాల ధారలు దూడకు తాపాలి. మలి పాల ధారలు మనం పిండుకోవాలి. చివరి పాలల్లోనే వెన్న శాతం ఎక్కువ. - డా. ఎం.వి.ఎ.ఎన్. సూర్యనారాయణ (99485 90506), సీనియర్ శాస్త్రవేత్త, పశు పరిశోధన కేంద్రం, గరివిడి, విజయనగరం జిల్లా రన్నింగ్ మోర్టాలిటీని మందులు అడ్డుకోలేవు! * వెనామీ చెరువుల్లో రోజూ కొద్ది సంఖ్యలో రొయ్యలు చనిపోతుండడాన్ని రన్నింగ్ మోర్టా లిటీ(ఆర్.ఎం.) అంటారు. అయినా, అవగా హన కలిగిన రైతుకు దీని వల్ల ప్రమాదం లేదు. అవగాహన లేని రైతులు నష్టపోతున్నారు. * రసాయనిక మందులు, యాజమాన్య చర్యల ద్వారా దీన్ని అరికట్టలేం. * ఎకరానికి 5 వేల నుంచి 3 లక్షల పిల్లలు వేసిన అన్ని చెరువుల్లోనూ ఆర్.ఎం. కనిపిస్తోంది. దీనికి మూలకారణం ఏమిటో ఇదమిత్థంగా నిర్ధారణ కాలేదు. విబ్రియో బాక్టీరియా కలిగిస్తున్న నష్టం వల్ల ఇది సోకిన రొయ్యలు మేత తీసుకోవడం మానేసి చెరువు అంచుల్లోకి, ఎయిరేటర్ల కిందకు చేరి చనిపోతాయి. నీటి పైకి తేలడం తక్కువ. పునికించడం ద్వారా ఎన్ని చనిపోతున్నదీ తెలుసుకుంటూ ఉండాలి. * ఎక్కువ రొయ్యలు మేత తినడం నిలిపివేస్తే పట్టుబడి చేయక తప్పదు. - ప్రొ. పి. హరిబాబు (98495 95355), మత్స్య కళాశాల, ముత్తుకూరు, నెల్లూరు జిల్లా చేపల రోగ నిరోధక శక్తిని పెంచడం ముఖ్యం * చేపల వ్యాధులు నియంత్రణలో అతిముఖ్య వ్యూహం చేప రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం. ఆ తర్వాతే మందుల వాడకం సంగతి. * బలహీనంగా ఉన్న చేపకు ఏ వ్యాధులైనా సులభంగా సోకుతాయి. ఏ మందులు వాడినా సులభంగా నయం కావు. * బలహీనంగా ఉన్న తెల్ల చేపలకు రెడ్ డిసీజ్, తాటాకు తెగులు, చేపపేను, మొప్ప పురుగు వ్యాధులు తగ్గినట్టే తగ్గి.. అనేక సార్లు తిరగ బెడుతుండడంతో రైతులు నానా తిప్పలు పడుతున్నారు. * రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహజాహారం(ప్లాంక్టన్), మేత, ఉత్తమ నీటి యాజమాన్యం దోహదపడతాయి. - డా. రావి రామకృష్ణ (98480 90576), సీనియర్ ఆక్వా శాస్త్రవేత్త, ఫిష్‌నెస్ట్, ఏలూరు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తల సలహాలకు ఉచిత ఫోన్ నంబర్లు 1100, 1800 425 1110 కిసాన్ కాల్ సెంటర్ :1551 మీ అభిప్రాయాలు, ప్రశ్నలు, సూచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, సాక్షి (సాగుబడి), సాక్షి టవర్స, 6-3-249/1, రోడ్డు నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్- 500 034 saagubadi@sakshi.com -
సహజంగా కోళ్ల పెంపకంతో..
ఆరోగ్యం.. ఆదాయం డా. చోహన్‌క్యూ విధానంలో వ్యాక్సిన్లు, హార్మోన్లు వాడకుండానే కోళ్ల పెంపకం తక్కువ ఖర్చుతో.. రైతే సొంతంగా దాణా తయారు చేసుకోవచ్చు షెడ్డు నుంచి దుర్వాసన రాకపోవడం ఈ పద్ధతి ప్రత్యేకత ఒలపల దాపల ఒక్క తీరుగా నడిస్తేగాని బండి ప్రయాణం భద్రంగా సాగదన్నట్లుగానే.. వ్యవసాయం లాభాల సాగవ్వాలంటే ప్రధాన, అనుబంధ రంగాల మధ్య సమతుల్యం సాధించడం అవసరం. వ్యవసాయం నగదు పంటల వ్యామోహంలో పడినప్పటి నుంచి ధరలకు దొరలెవరో తెలియని పరిస్థితి. పంటల ధర పూటకో తీరుగా ఊరించి చివరికి ఊబిలో దించుతున్నాయి. ఈ పరిస్థితిలో రైతుకు ‘సాగుబాటు’ కావాలంటే సమగ్ర వ్యవసాయ విధానమే శరణ్యం. మార్కెట్ మాయాజాలం పుట్టిముంచకుండా ఉండాలంటే వ్యవసాయానికి అనుబంధంగా పాడి, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం చేపట్టాలి. మాట భారీగా ఉన్నా ఇదే సమగ్ర వ్యవసాయ విధానమంటే. నగదుల పంటల వెంట మొదలయిన పరుగు రైతులను మిగతా రంగాలను విస్మరించేలా చేసింది. పారిశ్రామిక పద్ధతుల్లో కోళ్ల పెంపకంపై సందేహాలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో దేశీ కోళ్ల పెంపకం రైతుకు బాగా లాభసాటిగా ఉంటుంది. సహజ విధానంలో కోళ్ల పెంపకంపై దక్షిణ కొరియాకు చెందిన డాక్టర్ చోహన్ క్యూ విస్తృతమైన పరిశోధన చేశారు. చో నేచురల్ పౌల్ట్రీ ఫార్మింగ్ పద్ధతిని రూపొందించారు. మార్కెట్‌పై ఆధారపడకుండా రైతుకు అందుబాటులో ఉన్న వనరులతోనే కోళ్లను పెంచగలగడం ఇందులో ప్రత్యేకత. వ్యాక్సిన్లు, హార్మోన్ల అవసరం లేకుండా రైతుకు అందుబాటులో ఉన్న వనరులతో పుష్టికరమైన కోడి మాంసం అందించడం ఇందులోని ప్రత్యేకత. వైవిధ్యభరితం చోహన్ విధానం డాక్టర్ చోహన్ విధానంలో కోళ్ల షెడ్డు నిర్మాణం సహజంగా గాలి, వెలుతురులందే విధంగా.. ఎలాంటి సిమెంట్ గచ్చు చేయని నేల మీదే నిర్మించాలి. ఈ విధానంలో ప్రతి కోడికీ గరిష్టంగా 4 అడుగుల స్థలం అవసరం అని నిర్ణయించారు. మీరు పెంచదలచిన కోళ్ల సంఖ్యకు అనుగుణంగా కొలతను నిర్ణయించుకోవాలి. ఎంపిక చేసుకున్న స్థలాన్ని దున్ని చదును చేసుకోవాలి. చుట్టూరా రెండు అడుగుల మేర గోడను నిర్మించుకొని సిమెంట్ స్తంభాల ఆధారంగా చుట్టూ ఇనుప వలను బిగించుకోవాలి. పై కప్పుకు సిమెంట్ రేకులు లేదా తాటాకు, పొరక, జమ్ముగడ్డి, వరిగడ్డి, కొబ ్బరాకులు.. ఏవైనా వాడొచ్చు. వర్షాకాలంలో నీరు పడకుండా కప్పు, చూర్ల నిర్మాణం ఉంటే సరిపోతుంది. ముందుగా తవ్విన మట్టి మీద మూడంగుళాల మేర వరిపొట్టు, చిన్నచిన్న ముక్కలుగా నరికిన గడ్డి, కొబ్బరి డొక్కు తదితరాలను మట్టితో పాటు కలపాలి. దీని మీద (పాలు, బియ్యం కడిగిన నీటితో తయారు చేసిన) ల్యాక్టో బ్యాక్టీరియా, (అన్నంతో తయారు చేసిన) ఆదిమ సూక్ష్మ జీవుల(ఐఎంఓ) మిశ్రమాన్ని నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలి. నేలలో ఉన్న మట్టిలో సూక్ష్మజీవులే కోళ్ల ఆరోగ్యానికి భరోసానిచ్చే కాపలాదారులన్నమాట. షెడ్డులో పూర్తి పొడి వాతావరణం ఏర్పడినప్పుడు ల్యాక్టో బ్యాక్టీరియా, ఐఎంఓను పిచికారీ చేయాలి. ఇవి కోళ్ల పెంటను కుళ్లింప జేసి అందులో చెడు వాసన కలిగించే బ్యాక్టీరియాను నిర్మూలిస్తాయి. ఒకసారి షెడ్డులోని నేల తయారు చేస్తే పదేళ్ల వరకు మార్చాల్సిన అవసరం ఉండదు. వ్యవసాయ అవసరాల కోసం ఎరువును తీసుకోవాల్సి వచ్చినప్పుడు పై పొర 3, 4 అంగుళాల మేర తొలగించి వాడుకోవాలి. కోడి పిల్లలను తేవడానికి ముందు షెడ్డును రెండు భాగాలుగా విభజించాలి. ఇందులో మొదటి భాగంలో కోడి పిల్లలకు గూళ్లు ఏర్పాటు చేయాలి. రాత్రి వేళ అందులోనే విశ్రాంతి తీసుకుంటాయి. పెద్దవైన తరువాత గుడ్లు అదే చోట పెట్టడం అలవాటవుతుంది. ఈ గూళ్లను పౌల్ట్రీ భాషలో బ్రూడర్లంటారు. బ్రూడర్లకు ముందు భాగంలో మెత్తటి నూలు వస్త్రం, పాత చీరలు ఇందుకు సరిపోతాయి. తెరలు కట్టడం ద్వారా కోడి పిల్లలు అటు ఇటు తిరిగేటప్పుడు తల్లి రెక్కలు తగిలిన అనుభూతి కలుగుతుంది. తెరకు ముందు భాగంలో దాణా తొట్లు ఉంచాలి. వాటికి ముందు భాగంలో నీరు తాగే వసతి కల్పించాలి. నీటి అవసరాల కోసం తొట్లు లేదా పీవీసీ పైపునకు రంధ్రాలు చేసి అందులో నీరు నింపి ఉంచాలి. ఎప్పటికప్పుడు పాత నీరు తొలగించే ఏర్పాటు చేసుకోవాలి. కోళ్లు పెరిగేకొద్దీ పెద్ద రంధ్రాలున్న పైపులను అమర్చాల్సి ఉంటుంది. రోజుకు ఒకసారే మేత! చో విధానంలో కోళ్లకు రోజుకు ఒకసారే మేత ఇవ్వాలి. చీకటి పడడానికి 2 గంటల ముందు మేత వేస్తే సరిపోతుంది. మనకు అందుబాటులో దొరికే దాణాలనే మేతగా వాడొచ్చు. చిన్న కోడి పిల్లలకు రైసు మిల్లులో దొరికే ముక్కులు, వెదురు ఆకులను ఆహారంగా అందివ్వవచ్చు. దీని వల్ల కోడి పిల్లల జీర్ణ వ్యవస్థ బలపడుతుంది. కోడి పిల్లలు ఎదిగిన తరువాత రెండోనెల నుంచి తవుడు, గోధుమ పొట్టు, మొక్కజొన్నలు, ఉలవలు వంటి పప్పుధాన్యాలను వరిగడ్డి, గరిక, కూరగాయ వ్యర్థాలు, ఇంట్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలను కూడా ఇందుకు వాడొచ్చు. ఈ పద్ధతిలో సమతుల్య ఆహారం ఇవ్వడం వలన సాధారణ కోళ్ల కంటే ఎక్కువ కాలం గుడ్లు పెడతాయి. మేతలో 30% వరకు సన్నగా తరిగిన గరిక, మునగాకు, అవిశాకు తదితరాలను కూడా ఇవ్వవచ్చు. దీని వలన దాణా ఖర్చు గణనీయంగా తగ్గిపోతుంది. దాణాలో కేజీకి ఒక మిల్లీ లీటర్ చొప్పున ఐఎంఓ, ల్యాక్టో బ్యాక్టీరియా కలిపి ఇవ్వాలి. ఐఎంఓ, ల్యాక్టో బ్యాక్టీరియా కలవడం వలన మేత తేలికగా జీర్ణమవుతుంది. అందులో ఎంజైమ్‌లు, యాంటీ బయోటిక్స్ తయారవడానికి ఇవి తోడ్పడతాయి. ఈ దాణా కోడి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. - జిట్టా బాల్‌రెడ్డి, ‘సాగుబడి’ డెస్క్ (ఇన్పుట్స్ : డా. మల్లికార్జునరెడ్డి, న్యూస్‌లైన్, ఎస్వీయూ, తిరుపతి. ఫొటోలు: మోహన కష్ణ కేతారి) మేత రెండు రకాలు: పొడి మేత, తడి మేత తడి మేతలో అరటి బోదెలు- 50%, కూరగాయ వ్యర్థాలు- 30%, వరి గడ్డి- 15%, వెదురు ఆకులు- 5% ఉండాలి. పొడి మేతలో.. వరి తవుడు 30%, మొక్కజొన్న 30%, ఉలవలు 25%, వరిగడ్డి లేదా పుట్టమన్ను 15% కలిపి ఇవ్వాలి. కాయగూరలతో పాటు అందుబాటులో ఉన్నప్పుడు బొప్పాయి, గుమ్మడి కాయలను కూడా సన్నగా తరిగి మేతలో కలపవచ్చు. షెడ్ చుట్టూరా అడుగు దూరంలో నిమ్మగడ్డి, పుదీనా వంటి మొక్కలను పెంచితే.. దోమలు, ఇతర పరాన్నజీవులు కోళ్లను బాధించవు. నీటిలో కరిగే సున్నం, గుడ్ల పెంకులు, నత్తగుల్లలు, ఎముకలు గోధుమ రంగుకు తిరిగే వరకు వేయించి, పొడి చేసి నీటిలో కలిపి మేతలో కలిపి ఇస్తే కాల్షియం లోపం తీరుతుంది. డా. చో ప్రకృతి సాగు పద్ధతులపై వేసవిలోశిక్షణ! డా. చో పద్ధతిలో కోళ్ల పెంపకం ద్వారా రైతుకు నికరాదాయం బాగా వస్తుంది. మాంసంలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి వినియోగదారులకు ఆరోగ్య సమస్యలు రావు. డా. చో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కోళ్ల పెంపకంతోపాటు పంటలూ పండించవచ్చు. ‘సర్ర’ స్వచ్ఛంద సంస్థతో కలసి ఎస్వీయూలో అధ్యయనం చేశాం. ఫలితాలు బాగున్నాయి. ఈ వేసవిలో రైతులు, విద్యార్థులు, అధ్యాపకులు, విదేశీయులకు విడివిడిగా శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాం. - ప్రొ.సాయి గోపాల్ (98496 15634), వైరాలజీ విభాగాధిపతి, ఎస్వీయూ, తిరుపతి ఇతర వివరాలకు: రోహిణీరెడ్డి (‘సర్ర’ సంస్థ)- 099859 47003, సోమశేఖర్- 99661 43361 ల్యాక్టో బ్యాక్టిరియా తయారీ ఇలా కోళ్ల ఫారమ్‌లో ఉపయోగించే ల్యాక్టో బ్యాక్టీరియాను తయారు చేసుకోవడం అతి సులభం. ఇంట్లో బియ్యం కడిగిన నీటిని ఒక ప్లాస్టిక్ టబ్‌లో లేదా కుండలో పోసి ఉంచుకోవాలి. బియ్యం కడిగిన నీరు 3 నుంచి 5 రోజుల్లో పులిసి పుల్లని వాసన వస్తుంది. ఈ నీటిని ఓ పాత్రలోకి పోసుకోవాలి. ఒక వంతు బియ్యం కడిగిన నీళ్లకు పది వంతులు పాలు కలపాలి. పాత్రలో మూడో వంతు ఖాళీ ఉండేలా చూసుకోవాలి. ఈ పాత్రకు మూతి బిగించి లేదా శుభ్రమైన తెల్లకాగితంతో కప్పి దారంతో కట్టి ఎండసోకని మూలన భద్రపర్చుకోవాలి. 3 రోజుల్లో పాత్రలోని ద్రావణం 3 పొరలుగా ఏర్పడుతుంది. పై భాగంలో పాలలోని కొవ్వు పదార్థాలు తెట్టు మాదిరిగా పేరుకుంటాయి. మధ్య భాగంలో పసుపు పచ్చ లేదా లేత పసుపు పచ్చ ద్రావణం ఉంటుంది. ఈ ద్రావణమే ల్యాక్టో బ్యాక్టీరియా. దీన్ని వడకట్టుకొని మరో పాత్రలో పోసుకోవాలి. నిలువ ఉంచుకోవడానికి ద్రావణం ఎంత ఉందో అంత బెల్లాన్ని కలుపుకోవాలి. కోళ్ల షెడ్డులో నాలుగైదు మిల్లీలీటర్ల ల్యాక్టో బ్యాక్టీరియాను ఒక లీటరు నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. -
సాగుబడి.. ఈ వారం వ్యవసాయ సూచనలు
వరి: నాట్లు వేసేటప్పుడు నీరు పలుచగా లేదా బురదగా ఉండాలి. ఎండలు ఎక్కువగా ఉంటే నాటిన వెంటనే 5 సెం.మీ. వరకు నీరు నిలువ ఉంచాలి. మూన తిరిగిన తరువాత దుబ్బ కట్టు వరకు 2-3 సెం.మీ. నీరు ఉంచాలి. నీరు ఎక్కువైతే పిలకల శాతం తగ్గుతుంది. మామిడి: బూడిద తెగులు ఆశించడానికి, త్వరగా వ్యాపించడానికి ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉంది. దీన్ని గమనించిన వెంటనే నివారణకు 3 గ్రా. నీటిలో కరిగే గంధకం లేదా 1 మి.లీ. కారాధేన్ లీటరు నీటితో పిచికారీ చేయాలి. నువ్వులు: ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఫిబ్రవరి రెండో వారం వరకు శ్వేత తిల్, రాజేశ్వరి రకాలు విత్తుకోవచ్చు. మల్లె: నాణ్యమైన, అధిక మల్లెపూల దిగుబడికి కొత్త చిగురు, మొగ్గ దశలో లీటరు నీటికి 2.5 గ్రా. జింక్‌సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్ 5 గ్రా. లీటరు నీటికి కలిపి రెండు మూడు దఫాలు పిచికారీ చేయాలి. బెండ: ఫిబ్రవరి ఆఖరి వరకు బెండ విత్తుకోవచ్చు. పల్లాకు తెగులు తట్టుకొనే రకాలైన అనామిక, ఆర్క అభయ రకాలను లేదా ప్రైవేటు హైబ్రిడ్స్‌ను ఎంచుకోవాలి. వరుస మధ్య ఒకటిన్నర అడుగు, మొక్కల మధ్య అర అడుగు దూరం ఉండాలి. వేరుశనగ: రాయలసీమ ప్రాంతంలో వేసిన వేరుశనగ పంటకు ప్రస్తుత వాతావరణ పరిస్థి తుల్లో ఆకు మచ్చ తెగులు సోకే అవకాశం ఉంది. నివారణకు మొకోజెబ్ 2 గ్రా. లేదా కార్బెండిజమ్ 2 గ్రా. లేదా హెక్సాకొనజోల్ 2 మి.లీ. లేదా క్లోరోథెలనిల్ 2 మి.లీ. లీటరు నీటికికలిపి పిచికారీ చేయాలి. ఆరుతడి పంటలు: ప్రస్తుత సీజన్లో అన్ని ఆరుతడి పంటలకు పొగాకు లద్దె పురుగు ఆశించే అవకాశం ఉంది. కాబట్టి, జాగ్రత్తగా ఉండి తొలి దశలోనే నివారణ చర్యలు చేపట్టాలి. - డా. ఎ. లలిత, రమావత్ బాలాజీ నాయక్ ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వనామీ రొయ్యల్లో మందగించిన ఎదుగుదల వనామీ రొయ్యల్లో ఇటీవల ఎటువంటి అవలక్షణాలు లేకపోయినప్పటికీ, వాటి ఎదుగుదల మందగించిందని రైతులు చెబుతున్నారు. వాతావరణం, సీడ్, ఫీడ్ సంబంధిత అంశాలే ఇందుకు కారణమని గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సూర్యోదయం సమయంలో డీవో (నీటిలో కరిగిన ప్రాణవాయువు) 4-5 పీపీఎంకు తగ్గకుండా ఉంటే.. చెరువు వాతావరణం బాగున్నట్లే. సాధారణ ఎయిరేటర్లతోపాటు లాంగ్ ఆర్మ్, గొట్టాలతో కూడిన ఎయిరేటర్లను వాడడం మంచిది. ఈ కాలమ్ రొయ్యలు సాగు చేస్తున్న రైతులకు సాంకేతిక సూచనలు అందించడానికి మాత్రమే. ఏ ప్రాంతాల్లోనైనా కొత్తగా సాగు చేయాలనుకునే వారు సాధారణ సమాచారం కోసం స్థానిక అధికారులు, టెక్నీషియన్లు, రైతులను సంప్రదించడం ఉత్తమం. - ప్రొ. పి. హరిబాబు (98495 95355), మత్స్య కళాశాల, ముత్తుకూరు, నెల్లూరు జిల్లా ఆరోగ్యంగా ఉన్న చేప పెరుగుదల ఆగదు ఆరోగ్యంగా ఉన్న చేప పెరుగుదల ఆగమన్నా ఆగదు. తెల్ల చేపల చెరువులో నెలకు (లేదా 15 రోజులకు) ఒకసారి ట్రైల్ నెట్ వేసి వివిధ జాతుల చేపల పెరుగుదల తీరును పరిశీలించాలి. ఒకే చెరువులో కొన్ని వ్యాధులు ప్రత్యేకించి రోహు లేదా కట్ల చేపలకు మాత్రమే సోకుతాయి. కొన్ని రెంటికీ సోకవచ్చు. నెలవారీ చేపల పెరుగుదల సగటుకన్నా తక్కువగా ఉంటే కారణాలు గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలి. పెరుగుదల తగ్గడం వల్ల కలిగే నష్టం ఒక్కోసారి వ్యాధుల నష్టం కన్నా ఎక్కువగా ఉంటుంది. - డా. రావి రామకృష్ణ (98480 90576), సీనియర్ ఆక్వా శాస్త్రవేత్త, ఫిష్‌నెస్ట్, ఏలూరు కొబ్బరి పిందెలు రాలకుండా జాగ్రత్తపడాలి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కొబ్బరి పిందెలు రాలకుండా రైతులు నీటి యాజమాన్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. చెట్టు పాదుల్లో నీటితడి ఆరకుండా ఉండేందుకు ఆచ్ఛాదనగా కొబ్బరి ఆకులు, డొక్కలు లేదా పీచును వేయాలి. పది రోజులకోసారి కొబ్బరి చెట్లకు నీరు పెట్టాలి. కొబ్బరి మొవ్వులో ఎలుకల ప్రభావం ఎక్కువగా ఉంటే బ్రోమో డయోలిన్ మందును నూకల్లో కలిపి మొవ్వు మొదల్లో పెట్టాలి. - డా. జి.రామానందం (94414 74967), ఉద్యాన పరిశోధన కేంద్రం, అంబాజీపేట, తూ.గో. జిల్లా 13 నుంచి ఉద్యాన ప్రదర్శన రాష్ర్ట ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో హార్టీ ఎక్స్పో-2014 హైదరాబాద్‌లో ఈ నెల 13 నుంచి 17 వరకు జరగనుంది. నిజాం కాలేజీ గ్రౌండ్స(బషీర్‌బాగ్)లో ఏర్పాటయ్యే ఈ ప్రదర్శనలో పలు స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రవేశం ఉచితం. 13న ‘పాతపంటల పండుగ’ ముగింపు ఉత్సవం మెదక్ జిల్లా జహీరాబాద్ పరిసరాల్లో జీవ వైవిధ్యంతో తులతూగే సంప్రదాయ పంటల సాగు సంస్కృతిని పాతపంటల పండుగ కళ్లకు కడుతుంది. సంక్రాంతి రోజున ప్రారంభమైన ఈ పండుగ ముగింపు ఉత్సవం ఈ నెల 13న జహీరాబాద్ సమీపంలోని మాచునూరులో జరుగుతుంది. సంప్రదాయ విత్తన సంపదను పరిరక్షించుకునే లక్ష్యంతో ఎడ్ల బండ్లు 55 గ్రామాల్లో ప్రచారం చేయడం విశేషం. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తల సలహాలకు ఉచిత ఫోన్ నంబర్లు 1100, 1800 425 1110 కిసాన్ కాల్ సెంటర్ :1551 -
ఓషియన్ ఇన్ఫర్మేషన్ సెంటర్ సూచనలు