మాట్లాడుతున్న ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు
జగిత్యాల: ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా వైద్యులు పనిచేయాలని, పేషెంట్లకు మెరుగై న వైద్యం అందించాలని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు సూచించారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులతో శుక్రవారం ఆయన సమావేశం నిర్వహించారు. వైద్య సేవలు, ఇతర విషయాల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలకు వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు.విధి నిర్వహణలో సమయపాలన పాటించాలని సూచించారు.
ప్రతీ ఆదివారం గైనకా లజిస్ట్ తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ నిధులు పక్కదారి పట్టాయ నే ఆరోపణలపై రికార్డులను పరిశీలించి పూర్తి వివరాలు ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. పలువురు ఉద్యోగులు జీతాలు సరిగ్గా రావడంలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ఆయన అ ధికారులకు ఫోన్‌చేసి జీతాలు త్వరగా వచ్చేలా చూడాలని కోరారు.
పేషెంట్లకు కావాల్సిన అన్ని మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రి భవనం పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. కొత్త భవనం పూర్తయ్యాక సీటీస్కాన్‌తోపాటు మరిన్ని అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి తెస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రాణవేని సుజాత, ఇన్‌చార్జి సూపరింటెండెంట్ సాజీద్ అహ్మద్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment