govt hospital
-
సర్కారుకు నిర్లక్ష్యపు సుస్తీ 'ఈ రోగానికి మందేదీ'?
ప్రభుత్వ నిర్లక్ష్యానికి తల్లీ కొడుకు మృతివిజయనగరం జిల్లా గుర్ల గ్రామానికి చెందిన కలిశెట్టి సీతమ్మ ఇటీవల డయేరియాతో మృతి చెందింది. ఆమె మృతితో కొడుకు రవి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రవి అప్పటి నుంచి విధులకు వెళ్లకుండా ఊరి బయటే ఉండిపోయాడు. అక్కడే మృతిచెందాడు.రాష్ట్రంలో నాలుగు నెలలుగా అటు అనంతపురం నుంచి ఇటు శ్రీకాకుళం వరకు ఏ ప్రభుత్వ ఆస్పత్రిని తీసుకున్నా దయనీయ పరిస్థితి కనిపిస్తోంది. విలేజ్ క్లినిక్‌లకు దిక్కు లేకుండా పోయింది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్‌్టకు తిలోదకాలిచ్చింది. 104 వ్యవస్థనూ నిర్వీర్యం చేసింది. పీహెచ్‌సీల్లో అక్కర్లేదంటూ స్పెషలిస్ట్ వైద్యులనూ తొలగించింది. చాలా చోట్ల వైద్యులు, వైద్య సిబ్బంది స్పందించాల్సిన రీతిలో స్పందించడం లేదు. మందుల కొరత వేధిస్తోంది. ఏ చిన్న మందు కావాలన్నా బయటకు రాసిస్తున్నారు. ఇక పరీక్షల సంగతి అయితే మాట్లాడుకోక పోవడమే మంచిది. కొంచెం క్రిటికల్ కేసు వస్తే చాలు.. రెఫర్ చేయడమే పరిపాటిగా మారింది. ఇదేంటయ్యా.. అని అడిగితే ఇష్టమొచ్చిన చోట చెప్పుకోండని సీరియస్ అవుతున్నారు. నాలుగవ తరగతి సిబ్బందిపై నియంత్రణ కరువైంది. ఏ అర్ధరాత్రుళ్లో ఎవరికైనా సీరియస్ అయితే దేవుడే దిక్కు అన్నట్లు పరిస్థితి మారిపోయింది. ఫీవర్ సర్వే ఊసే లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆస్పత్రుల నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసింది. ప్రజారోగ్యాన్ని దీన స్థితికి తీసుకొచ్చింది.బడి బల్లలే బెడ్లు... కిటికీలే సెలైన్ స్టాండ్లు సాక్షి, అమరావతి/తాడేపల్లిగూడెం: రాష్ట్రంలో జూన్ నుంచి ప్రజలు జ్వరాలతో తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రులపాలవుతున్నారు. పెద్ద ఎత్తున డయేరియా కేసులు వెలుగు చూశాయి. తాజాగా విజయనగరం జిల్లా గుర్ల మండలంలో డయేరియా పంజా విసిరింది. 450 మందికిపైగా డయేరియా బారిన పడగా, వారిలో 11 మంది మృత్యువాతపడ్డారు. వెంటనే బాధితులకు మెరుగైన వైద్య సేవలు కల్పించి ప్రాణనష్టం జరగకుండా చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వాస్పత్రుల్లో సరైన వైద్యం అందక ప్రైవేట్ ఆస్పత్రులకు వెళితే అక్కడా ప్రజలకు ఆరోగ్యశ్రీ కింద సక్రమంగా ఉచిత వైద్యం లభించడం లేదు. ఆరోగ్యశ్రీ స్థానంలో బీమా ప్రవేశపెట్టాలని నిర్ణయించిన చంద్రబాబు ఆ పథకాన్ని ఇప్పటికే గాలికి వదిలేశారు. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో గ్రామాల్లో బీపీ, సుగర్ ఇతర జబ్బులతో బాధపడే వారికి క్రమం తప్పకుండా వైద్యం అందేది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారి ఇంటి వద్దకే వెళ్లి వైద్యం అందించే వారు. ఇప్పుడు ఆ వ్యవస్థ ఏమైందో ఎవరికీ తెలియదు. అసలు 104 వ్యవస్థ పని చేస్తోందా? లేదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పీహెచ్‌సీల్లో ఉన్న 150 మంది స్పెషలిస్ట్ వైద్యులనూ తొలగించి కూటమి ప్రభుత్వం పేదలకు వైద్యాన్ని దూరం చేసింది. భయం గుప్పెట్లో గిరిజనం గిరిజన ప్రాంతాల్లోని ప్రజలను డెంగీ, మలేరియా, విష జ్వరాలు, ఇతర వ్యాధులు చుట్టుముట్టాయి. ఉత్తరాంధ్ర, ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో ఏ ఇంట్లో చూసినా ఒకరిద్దరు వ్యాధులతో బాధపడుతున్నారు. పీహెచ్సీ, సీహెచ్‌సీల్లో మందులు, పరీక్షలు సక్రమంగా అందుబాటులో ఉండటం లేదు. దీంతో ప్రైవేట్ వైద్యులను ఆశ్రయించాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. ఇంట్లో ఒకరికి విష జ్వరం వస్తే వైద్యానికి కనీసం రూ.5 వేలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆశ్రమ పాఠశాలల్లో మరణ మృదంగం కొనసాగుతోంది. ఈ ఏడాది జూలై నుంచి మూడు నెలల వ్యవధిలో పార్వతీపురం మన్యం జిల్లాలో ఐదుగురు విద్యార్థులు సీజనల్ వ్యాధుల బారినపడి మృతి చెందారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వంలో మాత్రం చలనం లేకుండా పోయింది. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణను గాలికి వదిలేయడంతో పాటు, తాగునీటిని సరిగా శుద్ధి చేయకపోవడంతో జూన్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 60కి పైగా డయేరియా ప్రబలిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది జూన్ నెలలో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో డయేరియా విజృంభణ మొదలైంది. జగ్గయ్యపేట, వత్సవాయి ప్రాంతాల్లో 107 మంది డయేరియా బారినపడటంతో ఆరుగురు మృతి చెందారు. తిరుపతి జిల్లా కాట్రపల్లిలో డయేరియాతో రెండేళ్ల చిన్నారి, జూలైలో కర్నూలు జిల్లాలో నాలుగేళ్ల చిన్నారిని మృత్యువు కబళించింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో కలుషిత నీటి సరఫరా కారణంగా 250 మంది డయేరియా బారినపడ్డారు. వారిలో ఏడుగురు మరణించారు. ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు ఇక్కట్లు జన్యు సంబంధమైన హీమోఫీలియా బాధితులకు మందులు సరిగా దొరకడం లేదు. వ్యాధిగ్రస్తుల్లో రక్తస్రావాన్ని నియంత్రించడానికి యాంటి హీమోఫీలియా ఫ్యాక్టర్ ఇంజెక్షన్లను చికిత్సల్లో వినియోగిస్తారు. ఫ్యాక్టర్ 7, 8, 9 ఇలా వివిధ రకాల ఇంజెక్షన్లు అవసరం ఉండగా, చాలా వరకు జీజీహెచ్‌లలో ఇవి లేవని తెలుస్తోంది. అలాగే రోగ నిరోధకత బాగా తక్కువగా ఉండే క్యాన్సర్, న్యూరో, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కోసం వాడే ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్లు కూడా అన్ని జీజీహెచ్‌లలో లేవు. కేసులు వచ్చినప్పుడు అప్పటికప్పుడు స్థానికంగా కొనుగోలు చేస్తున్నారు. ఇన్ఫెక్షన్ వ్యాధులకు చికిత్సల్లో వినియోగించే అన్ని రకాల యాంటిబయోటిక్స్ సీడీసీ (సెంట్రల్ డ్రగ్ స్టోర్)లో ఉండటం లేదు. వైరల్ జ్వరాలకు వాడే ఎమాక్సిలిన్, మలేరియా చికిత్సకు అవసరమైన ఆర్టిసినేట్ ఇంజెక్షన్ చాలా ఆస్పత్రులకు సరఫరా కావడం లేదు. చర్మ సంబంధిత వ్యాధిగ్రస్తులకు పలు రకాల క్రీములు ఆస్పత్రుల్లో లేకపోవడంతో బయటకు రాస్తున్నారు. డీ అడిక్షన్ సెంటర్లలో మందులు సరిపడా లేవు. పెరిగిపోతున్న ఖాళీలు ⇒ ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరతకు తావులేకుండా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జీరో వేకెన్సీ పాలసీని అమలు చేసింది. ఇందులో భాగంగా ఆస్పత్రుల్లో ఏర్పడిన, కొత్తగా మంజూరైన పోస్టులను ఎప్పటికప్పుడే భర్తీ చేస్తూ వచ్చారు. ఇలా ఐదేళ్లలో 54 వేల పోస్టులు ఒక్క వైద్య శాఖలోనే భర్తీ చేశారు. ⇒ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక జీరో వెకెన్సీ పాలసీకి బ్రేక్ వేసింది. గత ప్రభుత్వంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పారా మెడికల్, ఇతర సపోర్టింగ్ స్టాఫ్ నియామకాల కోసం డిస్టిక్ సెలక్షన్ కమిటీలు 2 వేలకుపైగా పోస్టుల భర్తీకి 18 నోటిఫికేషన్లు విడుదల చేశాయి. నియామక ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలోనే ఎన్నికల కోడ్ రావడంతో ఈ నోటిఫికేషన్లను రద్దు చేశారు.⇒ ఓ వైపు ఆస్పత్రుల్లో ఎఫ్ఎన్వో, ఎంఎన్‌వో ఇతర వైద్య సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉంటే, ఆ పోస్టులు భర్తీ చేయకుండా ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది. ఇక సెకండరీ హెల్త్, బోధనాస్పత్రుల్లో స్పెషలిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ వైద్య పోస్టులు ఖాళీలు ఏర్పడ్డాయి. వాటిని కూడా ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. గతంలో గిరిజన, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో సైతం స్పెషలిస్ట్ వైద్యుల కోసం పలు దఫాలుగా ఇంటర్వ్యూలు నిర్వహించి, వైద్యులు అడిగినంత వేతనాలు ఇచ్చి మరీ పోస్టులు భర్తీ చేశారు. ⇒ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటయ్యాక సెకండరీ హెల్త్‌లోని గిరిజన, మారుమూల ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్‌ల కొరత ఉన్నప్పటికీ ఒక్క పోస్టు భర్తీ చేయలేదు. గత ప్రభుత్వంలో ఉద్యోగాల్లో చేరిన వారు సైతం వెళ్లిపోవడం, ఇటీవల కాలంలో పదవీ విరమణలు, పదోన్నతుల అనంతరం డీఎంఈ ఆస్పత్రుల్లో 500కు పైగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఏర్పడ్డాయి. అదే విధంగా 900కుపైగా సీనియర్ రెసిడెంట్, 250కి పైగా అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయడానికి చర్యలు తీసుకోలేదు. మరోవైపు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయడం కోసం మన విద్యార్థులకు అన్యాయం చేసింది. ఈ ఒక్క ఏడాదే 700 ఎంబీబీఎస్ సీట్లను కోల్పోయేలా చేసింది.అత్యవసర మందులూ బయటే⇒ 2019కి ముందు చిన్నారిని ఎలుకలు పీక్కుతిన్న దీనస్థితికి ప్రభుత్వాస్పత్రులు మళ్లీ దిగజారుతున్నాయా.. అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనాలను పీకల వరకూ తాగించి ఆరోగ్యాలను గుల్ల చేయడంపై పెట్టిన శ్రద్ధ.. ప్రజారోగ్య పరిరక్షణపై చంద్రబాబు ప్రభుత్వం పెట్టలేదని మండిపడుతున్నారు. గ్రామాల్లోని విలేజ్ క్లినిక్‌ల నుంచి బోధనాస్పత్రుల వరకూ అన్ని ఆస్పత్రులను మందుల కొరత వేధిస్తోంది. ⇒ జిల్లా, బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులు ఉంచాలని వైద్య శాఖ నిర్ణయించింది. 372 మేర సర్జికల్స్, వ్యాధి నిర్ధారణ కిట్లు కూడా ఉండాలి. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలోని బోధనాస్పత్రులన్నింటినీ మందులు, సర్జికల్స్ కొరత వేధిస్తోంది. గురువారం (17వ తేదీ) అన్ని బోధనాస్పత్రుల సూపరింటెండెంట్లతో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్లు అందరూ మందుల కొరత అంశాన్ని ప్రధానంగా లేవనెత్తినట్లు తెలిసింది. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్‌లో ఎసెన్షియల్ డ్రగ్స్ అన్నీ అందుబాటులో ఉండటం లేదని, లేని మందులను స్థానికంగా కొనుగోలు చేసుకోవాలని మంత్రి కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది. స్థానికంగా కొనుగోలు చేయడానికి నిధులు ఎక్కడ ఉన్నాయని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. అంటే దీని అర్థం రోగులను బయట తెచ్చుకోమని చెప్పడమే. ⇒ ల్యాబ్‌లలో వైద్య పరీక్షలు నిర్వహించడానికి సరిపడా రసాయనాలు అందుబాటులో ఉండటం లేదు. పాడైన పరికరాలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. కూటమి పాలనలో ప్రభుత్వాస్పత్రుల్లో మార్చురీల్లోని శవాలకు కూడా భద్రత లేకుండాపోయింది. ఏలూరు ఆస్పత్రిలో అనాథ మృతదేహాలు మాయమైన ఘటన వెలుగు చూసింది. పారిశుధ్య నిర్వహణను గాలికి వదిలేయడంతో డయేరియా విలయతాండవం చేస్తోంది. ఈ నిర్లక్ష్యం.. గర్భిణికి ఎంతకష్టం..పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఎల్.అగ్రహారానికి చెందిన గర్భిణి యర్రా శకుంతల జ్వరంతో బాధ పడుతుండటంతో ఆమె తల్లి కంటిపాటి ధనలక్ష్మి మంగళవారం తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. చికిత్స పొందుతుండగానే శనివారం ఉదయం ఆరు గంటలకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. తన కుమార్తెకు పురిటినొప్పులు వస్తున్నాయని ధనలక్ష్మి నర్సులకు చెప్పగా వారు పట్టించుకోలేదు. ఈలోగా శకుంతల బాత్రూమ్కు వెళ్లగా, అక్కడే తీవ్ర రక్తస్రావమై కడుపులోని బిడ్డ తల బయటకు వచ్చింది. ప్రాణాపాయ పరిస్థితుల్లోకి శకుంతల వెళ్లిపోయింది. ఇది గమనించిన తల్లి.. గట్టిగా కేకలు వేయగా, శిక్షణలో ఉన్న నర్సులు వచ్చి.. గర్భిణిని డెలివరీ రూమ్‌కు కాకుండా ప్రసూతి వార్డుకు తరలించారు. మంచంపై పడుకోబెట్టగా ఆ మంచంపైనే శకుంతల ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తీరిగ్గా నర్సులు శకుంతలను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లి మాయ తొలగించి, కుట్లు వేశారు. నర్సింగ్ విద్యార్ధినులు సకాలంలో పట్టించుకోకపోయి ఉంటే గర్భిణి ప్రాణాలకే ముప్పు వచ్చేది. ఆస్పత్రిలో శకుంతల పడిన నరకయాతనను చూసిన వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కళ్లెదుటే అంత జరుగుతున్నా, సిబ్బంది చీమ కుట్టినట్లు కూడా స్పందించక పోవడం దారుణమని మండిపడ్డారు. ఎంతలో ఎంత మార్పు అంటూ నిట్టూర్చారు. కాగా, ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని, ఆస్పత్రి ఆర్ఎంవో డాక్టర్ ఏవీఆర్ఎస్ తాతారావు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.పట్టించుకోరా అంటే.. బయటికి పొమ్మన్నారు విధుల్లో ఉన్న నర్సుల వల్లే నా బిడ్డకు ప్రాణాపాయ పరిస్థితి వచ్చింది. అదృష్టవశాత్తు నా బిడ్డ ప్రాణాలతో దక్కింది. పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతున్న నా కూతురిని పట్టించుకోకపోవడంపై సిబ్బందిని ప్రశ్నించగా.. బయటకు పొమ్మంటూ దుర్భాషలాడారు. ఆస్పత్రిలో మూడురోజుల నుంచి నా కుమార్తె నొప్పులతో బాధపడుతోందని, పరీక్షించమని వేడుకున్నా ఒక్క నర్సు కూడా పట్టించుకోలేదు. డాక్టరు వస్తారు.. సమాచారం ఇస్తాం... అంటూ మమ్మల్ని పంపేశారు. ఆస్పత్రిలో సిబ్బంది గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – ధనలక్ష్మి, గర్భిణి శకుంతల తల్లి, ఎల్.అగ్రహారం, తాడేపల్లిగూడెం మండలం -
విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత
-
విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత
-
ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవంటూ చంద్రబాబు ప్రకటనలు
-
బాబు నిర్వాకం.. ప్రభుత్వ ఆసుపత్రులు ఇక ప్రై‘వేటు’పరం!
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులన్నీ ప్రైవేటుపరం కానున్నాయి. ఏపీలోని ఆసుపత్రులను అన్నింటినీ పీపీపీ విధానంలోకి తీసుకువస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.కాగా, సీఎం చంద్రబాబు ఏపీ ప్రజలకు మరో షాకిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటుపరం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలోనే ప్రతీ నియోజకవర్గంలో పీపీపీ పద్దతిలో ఆసుపత్రి ఉండాలని చంద్రబాబు.. వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. అన్ని ఆసుపత్రులను ఒకే గొడుగు కిందకు తేవాలని నిర్ణయించారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ సమీక్షలో చంద్రబాబు ఆదేశాలిచ్చారు. దీంతో, పేదలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం దూరం కానుంది. వైద్యం మెత్తం ప్రైవేటు చేతుల్లోకి వెళ్లనుంది.ఇక, ఇప్పటికే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని కొత్త వైద్య కళాశాలలను ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ)లో నిర్వహించేందుకు ‘గుజరాత్ పీపీపీ మోడల్’ను అధ్యయనం చేయాలని చంద్రబాబు సూచించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు నియోజకవర్గ స్థాయి ఆసుపత్రులను పీపీపీ పద్దతిలో పెట్టాలని నిర్ణయించారు. -
డ్యూటీలో ఉండగానే.. నర్సులు చేసిన పని చూస్తే షాక్ అవుతారు
-
నగరి గవర్నమెంట్ హాస్పిటల్ పై ఆర్కే రోజా ఎమోషనల్..!
-
Fact Check: రుచీపచీ లేని రాతలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలు మారాయి. అత్యాధునిక వైద్యం అందుతోంది. గ్రామాలు, వార్డుల చెంతకు వైద్యం చేరింది. డాక్టర్లే ప్రజల గుమ్మం వద్దకు వచ్చి ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. మందులకు కొదవ లేదు. విలేజ్, వార్డు క్లినిక్‌లు ఏర్పడ్డాయి. ఇక ప్రధానాసుపత్రుల్లో సేవలు కార్పొరేట్ స్థాయిని తలపిస్తున్నాయి. గడచిన ఐదేళ్ల సీఎం జగన్ పాలనలో నాడు–నేడు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ బలోపేతం, డైట్ చార్జీల పెంపు ఇలా అనేక సంస్కరణలతో ప్రభుత్వాస్పత్రులు అభివృద్ధి చెందాయి. ప్రభుత్వ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచి్చన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో అభిమానం వెల్లువెత్తుతోంది. ఇది రుచించని ఈనాడు రామోజికి ఆసుపత్రుల్లో అందిస్తున్న రుచికరమైన భోజనం నచ్చలేదు. తన బాబు పాలనలో రుచీపచీలేకుండా వండినా, ఆ ఐదేళ్లలో రోగుల మెనూ ఛార్జీ రూ.40 మించకపోయినా, మూడుపూటలా భోజనం అందించకపోయినా ఈ ‘పచ్చ’రోగికి వెచ్చగా ఉంది. జగన్ పాలనలో మెనూ చార్జి రూ.80కి పెంచి రుచితో పాటు పౌష్టికాహారాన్ని అందిస్తున్నా రామోజీకి చప్పగానే ఉంది. అందుకే ‘బటన్ల బడాయి.. రోగుల బువ్వకూ బకాయి’ అంటూ రుచీపచీలేని ఓ కథనాన్ని వండేశారు. బాబు పాలనలో ఇదీ గతీ 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం ఒక్కో రోగికి రూ.40తో భోజనం పెట్టేది. ఇది కూడా 2011లో నిర్దేశించిన ఖర్చు. ఇంత తక్కువ ధరతో ఎలా వీలవుతుందన్న ఆలోచన కూడా అప్పట్లో బాబుకు రాలేదు. ఆ ఐదేళ్లలో ఒక్కసారి కూడా డైట్ చార్జీల పెంపుపై బాబు దృష్టి పెట్టిన పాపాన పోలేదు. రోజులో ఒక పూట మాత్రమే కోడిగుడ్డు అందించేవారు. ఇక అప్పట్లో వైద్య సేవల గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. గుంటూరు జీజీహెచ్‌లో చిన్నారిని ఎలుకలు కొరికి చంపిన దుర్ఘటనే బాబు పాలనలో కునారిల్లిన వైద్య రంగానికి పెద్ద నిదర్శనం. జగన్ పాలనలో ఇదీ పురోగతి 2019లో సీఎం జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఈ క్రమంలో ఆస్పత్రుల్లో చేరిన రోగులు త్వరగా కోలుకోవాలంటే నాణ్యమైన వైద్య సేవలతో పాటు, పౌష్టికాహారం అవసరమని గుర్తించారు. ఇందులో భాగంగా రూ.80కు డైట్ చార్జీలను పెంచారు. రోగులకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అందించేందుకు ప్రత్యేకంగా ఒక మెనూ రూపొందించారు. రూ.100 తో గర్భిణులకు నిర్దేశించిన మెనూతో పాటు, అదనంగా చిక్కీలు, రాగి జావ, టీబీ, ఎయిడ్స్, మానసిక రోగులకు హై ప్రొటీన్ డైట్‌ను అందిస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు పూటలా రోగులందరికీ కోడిగుడ్డు ఇస్తున్నారు. మెనూలో మార్పులు ఇలా టీడీపీ ప్రభుత్వంలో రోగికి రోజుకు మూడు పూటలా ఆహారం కోసం రూ.40 బ్రేక్ ఫాస్ట్: బ్రెడ్, పాలు మధ్యాహ్న భోజనం: అన్నం, సాంబారు, వెజ్ కర్రీ, గుడ్డు, అరటిపండు, మజ్జిగ రాత్రి భోజనం: అన్నం, సాంబారు, వెజ్ కర్రీ, మజ్జిగ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రోగికి రోజుకు మూడు పూటలా ఆహారం కోసం రూ.80 ఖర్చు బ్రేక్ ఫాస్ట్: ఉప్మా, కిచిడీ, ఇడ్లీ, పొంగలి, కోడిగుడ్డు, పాలు మధ్యాహ్న భోజనం: అన్నం, సాంబారు, ఆకుకూర పప్పు, అరటిపండు, మజ్జిగ, వెజ్ కర్రీ, గుడ్డు రాత్రి భోజనం: అన్నం, సాంబారు, పప్పు, అరటిపండు, మజ్జిగ, వెజ్ కర్రీ, సంగటి, చపాతీ(డయాబెటీస్ రోగులకు), గుడ్డు -
ఏసీబీవలకు చిక్కిన ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లచ్చునాయక్
-
కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగిని ఎలుకలు కొరికిన ఘటనపై ప్రభుత్వం చర్యలు
-
ఐసీయూలో పేషెంట్లను కొరికిన ఎలుకలు..
-
మెరుగైన వైద్యం అందించాలి.. ఎమ్మెల్యే సూచనలు..!
జగిత్యాల: ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా వైద్యులు పనిచేయాలని, పేషెంట్లకు మెరుగై న వైద్యం అందించాలని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు సూచించారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులతో శుక్రవారం ఆయన సమావేశం నిర్వహించారు. వైద్య సేవలు, ఇతర విషయాల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలకు వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు.విధి నిర్వహణలో సమయపాలన పాటించాలని సూచించారు. ప్రతీ ఆదివారం గైనకా లజిస్ట్ తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ నిధులు పక్కదారి పట్టాయ నే ఆరోపణలపై రికార్డులను పరిశీలించి పూర్తి వివరాలు ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. పలువురు ఉద్యోగులు జీతాలు సరిగ్గా రావడంలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ఆయన అ ధికారులకు ఫోన్‌చేసి జీతాలు త్వరగా వచ్చేలా చూడాలని కోరారు. పేషెంట్లకు కావాల్సిన అన్ని మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రి భవనం పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. కొత్త భవనం పూర్తయ్యాక సీటీస్కాన్‌తోపాటు మరిన్ని అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి తెస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాణవేని సుజాత, ఇన్చార్జి సూపరింటెండెంట్ సాజీద్ అహ్మద్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. -
బాన్సువాడ దవాఖాన సరికొత్త రికార్డు.. ఒకే నెలలో 504 ప్రసవాలు
కామారెడ్డి: బాన్సువాడ మాతాశిశు సంరక్షణ ఆస్పత్రిలో అగస్టులో 504 ప్రసవాలు జరిగాయని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్‌ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శనివారం ఆస్పత్రిలో కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆస్పత్రి ప్రారంభించి రెండేళ్లవుతోందన్నారు. గత నెలలో రికార్డు స్థాయిలో 504 ప్రసవాలు జరిగాయన్నారు. వైద్యులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. వైద్యులు సుధ, సిబ్బంది ఉన్నారు. -
సీఎం వైఎస్ జగన్ వైద్యరంగానికి పెద్దపీట వేశారు: ఎమ్మెల్యే కడుబండి
-
అరుదైన సమస్య.. ఆరు నెలల్లో మాయం!
జగ్గయ్యపేట అర్బన్ : వంకరకాళ్లతో జన్మించిన చిన్నారిని జగ్గయ్యపేట పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి వైద్యులు ఆరు నెలల్లోనే మామూలు స్థితికి తెచ్చారు. చిన్నారి తల్లిదండ్రుల మోముల్లో సంతోషాన్ని నింపారు. జగ్గయ్యపేట మండలం షేర్‌మహ్మద్‌పేటకు చెందిన సాయి తారక్, శ్రీలత దంపతులకు ఆరు నెలల కిందట మహన్వితశ్రీ జన్మించింది. జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రిలోనే జన్మించిన ఆ చిన్నారికి కాళ్లు వంకర్లు తిరిగి ఉన్నాయి. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు కఠారి హరిబాబు సలహాతో వారు అదే ఆస్పత్రిలో ఆర్థోపెటిక్‌గా పనిచేస్తున్న డాక్టర్ హరీష్‌ను కలిసి తమ బిడ్డ పరిస్థితిని వివరించారు. బాలికను పరీక్షించి తల్లిదండ్రులకు ఆయన ధైర్యం చెప్పారు. ఆరు నెలల్లో చిన్నారి కాళ్లు మామూలు స్థితికి చేరుకుంటాయని భరోసా ఇచ్చి.. 21వ రోజు నుంచి చికిత్స మొదలెట్టారు. వారం వారం ఆ చిన్నారి కాళ్లకు కట్లు కడుతూ మధ్యలో ఇంజక్షన్లు ఇస్తున్నారు. మధ్యలో విజయవాడ ప్రభుత్వాస్పత్రి వైద్యుల ద్వారా కొంత వైద్య సాయం తీసుకున్నారు. ఆరు నెలలు పూర్తి కావస్తుండటంతో చిన్నారి కాళ్లు దాదాపుగా మామూలు స్థితికి వచ్చాయని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ హరీష్ మాట్లాడుతూ చిన్న పిల్లల్లో ఇలాంటి లోపాలు వస్తుంటాయని, దీనిని క్లబ్ ఫుట్(సీటీఈవీ) అంటారని తెలిపారు. పుట్టిన వెంటనే చికిత్స మొదలెడితే ఫలితం ఉంటుందని చెప్పారు. -
అమృత హస్తాలు
33 ఏళ్ల సర్వీసు. 10 వేల డెలివరీలు. విలుప్పురం ప్రభుత్వాస్పత్రి నుంచి గత నెలలో రిటైర్ అయిన నర్సు ఖతీజాబీని తమిళనాడు ప్రభుత్వం సత్కరించి మరీ వీడ్కోలు పలికింది.కారణం ఆమె మొత్తం సర్వీసులో ఒక్క శిశువు కూడా కాన్పు సమయంలో మృతి చెందలేదు. ప్రాణం పోసే పని ఎంతటి బాధ్యతాయుతమైనదో ఖతీజాను చూసి తెలుసుకోవాలంటారు సాటి నర్సులు. ఇలాంటి నర్సులే ప్రతిచోటా కావాలి. ‘ఆ రోజుల్లో ప్రయివేటు ఆస్పత్రులు చాలా తక్కువ. ఎంతటి వాళ్లయినా ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి రావాల్సిందే. క్షణం తీరిక ఉండేది కాదు’ అని గుర్తు చేసుకుంది 60 ఏళ్ల ఖతీజాబీ. ఆమె గత నెలలోనే విల్లుపురం ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి పదవీ విరమణ పొందింది. తమిళనాడు ఆరోగ్య శాఖామంత్రి సుబ్రమణియన్ ప్రత్యేక పురస్కారం అందించి మరీ ఆమెను సత్కరించాడు. ‘అందుకు కారణం నా మొత్తం సర్వీసులో ఒక్క పసికందు కూడా కాన్పు సమయంలో ప్రాణం పోగొట్టుకోకపోవడమే’ అంటుందామె సంతృప్తిగా. ► తల్లి కూడా నర్సే ఖతీజాబీ ఏదో వేరే పని దొరక్క నర్సు కాలేదు. ఆ వృత్తి పట్ల ప్రేమతోనే అయ్యింది. ‘మా అమ్మ జులేఖా కూడా నర్సుగా పని చేసేది. కాని ఆమె కాలంలో కాన్పు సమయాలు చాలా ఘోరంగా ఉండేవి. తల్లి, బిడ్డ క్షేమంగా బయటపడతారనేది చెప్పలేము. నేను ఆమెను చూస్తూ పెరిగాను. చిన్నప్పుడు సిరంజీలతో ఆడుకున్నాను. అమ్మ వెంట హాస్పిటల్‌కు వెళుతూ హాస్పిటల్ వాసనకు అలవాటు పడ్డాను. 1990లో నేను కూడా నర్సుగా ఉద్యోగం ప్రారంభించాను. అయితే అప్పటికే నాకు పెళ్లయ్యి ఏడు నెలల గర్భిణిగా ఉన్నాను. అలా ఉంటూనే కాన్పులు చేయడం ప్రారంభించాను. నా కాన్పు అయ్యాక కేవలం రెండు నెలలు బ్రేక్ తీసుకుని మళ్లీ డ్యూటీకి హాజరయ్యాను’ అంది ఖతీజా. ► స్త్రీల వేదన 1990లలో మన దేశంలో ప్రతి లక్ష కాన్పుల్లో 556 మంది శిశువులు మరణించేవారు. నవజాత శిశువుల్లో ప్రతి 1000 మందికి 88 మంది మరణించేవారు. ‘సిజేరియన్ ఆపరేషన్లు చాలామటుకు స్త్రీలను, శిశువులను కాపాడాయి. నేను పని చేసే ఆస్పత్రిలో కేవలం ఒక డాక్టరు, ఇద్దరు నర్సులు ఉండేవాళ్లం. సిజేరియన్ చేసే సామాగ్రి మా దగ్గర ఉండేది కాదు. అందుకే కాన్పు కాంప్లికేట్ అవుతుందని డౌట్ రాగానే జిల్లా (కడలూర్) ఆస్పత్రికి పంపేసేదాన్ని. ఆ తర్వాత కూడా సిజేరియన్‌కు స్త్రీలు భయపడితే ధైర్యం చెప్పేదాన్ని. కానీ ఇవాళ మామూలు నొప్పులు వద్దని స్త్రీలు సిజేరియనే కోరుకుంటున్నారు’ అని తెలిపింది ఖతీజా. ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వసతులు పెంచడం, స్త్రీల అక్షరాస్యత కోసం శ్రద్ధ పెట్టడం తదితర కారణాల వల్ల ప్రసూతి మరణాలు తగ్గుముఖం పట్టాయని ఖతీజా అంటోంది. ‘ఇవాళ మన దేశంలో ప్రతి లక్ష కాన్పుల్లో కేవలం 88 మంది పిల్లలే మరణిస్తున్నారు. నవజాత శిశువుల్లో వెయ్యికి 27 మంది మరణిస్తున్నారు’ అందామె. ► ఎంతో సంతృప్తి ‘2008 మార్చి 8 నా జీవితంలో మర్చిపోలేను. ఆ రోజు డ్యూటీకి రావడంతోటే ఇద్దరు స్త్రీలు నొప్పులతో ఉన్నారు. వారి కాన్పుకు సాయం చేశాను. రోజులో ఇద్దరు సాధారణమే. కాని ఆ తర్వాత ఆరు మంది వచ్చారు. వారంతా కూడా ఆ రోజే కాన్పు జరిగి పిల్లల్ని కన్నారు. బాగా అలసటగా అనిపించింది. కాని సాయంత్రం డ్యూటీ దిగి వెళుతుంటే ఎనిమిది మంది చంటి పిల్లలు తల్లుల పక్కన పడుకుని కేరుకేరు మంటుంటే ఏడుస్తుంటే చాలా సంతోషం కలిగింది. కాన్పు సమయంలో స్త్రీలు ఎంతో ఆందోళనగా ఉంటారు. వారికి ముందుగా ధైర్యం చెప్పడంపై నేను దృష్టి పెట్టేదాన్ని. బిడ్డను కనే సమయంలో వారు ఎంత బాధ అనుభవించినా బిడ్డ పుట్టి కేర్మన్నాక తప్పనిసరిగా నవ్వు ముఖంతో బిడ్డవైపు చూసేవారు. వారి ఆ నవ్వు నాకు ఎంతో సంతృప్తినిచ్చేది. రిటైరయ్యానన్న మాటేగాని నా మనసు మాత్రం అలాంటి తల్లుల సేవలోనే ఉండమని చెబుతోంది’ అని ముగించింది ఖతీజా. మారిన దృష్టి ‘నేను కాన్పులు చేసిన కొత్తల్లో రెండో సంతానంగా, మూడో సంతానంగా కూడా ఆడపిల్లే పుడితే ఆ తల్లులు అంతులేనంతగా ఏడ్చేవారు. అసలు తండ్రులు చూడ్డానికి కూడా వచ్చేవారు కాదు. ఇవాళ ఆ ధోరణిలో మార్పు వచ్చింది. అమ్మాయిలు పుట్టినా అబ్బాయిలు పుట్టినా కేవలం ఇద్దరు చాలని ఎక్కువమంది అనుకుంటున్నారు. నా మొత్తం సర్వీసులో 50 మంది కవలలకు పురుడు పోశాను. ఒక కాన్పులో ట్రిప్లెట్ పుట్టారు’ అందామె. -
ఏడో నెలలో పుట్టిన శిశువు.. 750 గ్రాములే బరువు.. ప్రాణం పోసిన డాక్టర్లు..
జగిత్యాల: తక్కువ బరువుతో పుట్టిన శిశువుకు 40 రోజులపాటు చికిత్స అందించి.. ప్రాణాలు నిలిపారు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు. బతుకుతుందో లేదోనన్న బిడ్డ ఆరోగ్యంగా బయటికి రావడంతో తల్లిదండ్రులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని కథలాపూర్ మండలం తక్కళ్లపల్లికి చెందిన శ్రీలత డెలివరీకోసం మార్చి 29న కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యింది. బ్లీడింగ్ అధికంగా కావడంతో అదేరోజు సిజేరియన్ చేయగా పాప జన్మించింది. ఏడో నెలలో పుట్టిన శిశువు కావడంతో 750 గ్రాముల బరువే ఉంది. శ్వాససంబంధ రుగ్మత, రక్తం ఇన్ఫెక్షన్, తీవ్ర రక్తహీనతతో ఉంది. బతుకుతుందా లేదా అనే ఆందోళన మొదలైంది. అయితే బంధువులు కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంక్షేమ కేంద్రానికి తరలించారు. పాపను వెంటనే పరీక్షించిన వైద్యులు.. కంటికి రెప్పలా కాపాడుతూ 40 రోజులపాటు వైద్యం అందించారు. దీంతో శిశువు 1,100 గ్రాముల బరువుకు చేరడంతోపాటు, ఆరోగ్యంగా తయారైంది. దీంతో సోమవారం తల్లీబిడ్డను డిశ్చార్జి చేశారు. తమ పాపను కాపాడిన వైద్యులు, సిబ్బందికి దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. శిశువుకు మెరుగైన చికిత్స అందించిన వైద్యులు, సిబ్బందిని ఆస్పత్రి సూపరింటెండెంట్ రాములు ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది ఉన్నారని, జిల్లావాసులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఆర్ఎంవో శశికాంత్‌రెడ్డి, ప్రొఫెసర్ అజామ్, డాక్టర్ స్నేహలత, నర్స్‌లు పాల్గొన్నారు. చదవండి: అమెరికాలో కాల్పులు.. రాష్ట్ర యువతి మృతి -
నిజామాబాద్ ఆసుపత్రిలో దారుణం.. హరీష్ రావు సీరియస్
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగిని స్ట్రెచర్‌లో వార్డుకు తరలించేందుకు సిబ్బంది ఎవరూ లేక పోవడంతో బంధువులే కాళ్లు పట్టుకుని ఈడ్చుకు వెళ్లిన ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. ఘటనకు సంబంధించిన పూర్తి నివేదిక ఇవ్వాలని డీఎంఈ రమేశ్‌రెడ్డిని ఆదేశించారు. ఆస్పత్రి నిర్వహణకు రూ.లక్షల్లో వెచ్చిస్తున్నప్పటికీ రోగులకు స్ట్రెచర్లు, వీల్చైర్లు అందుబాటులో ఉంచకపోవడంపై మంత్రి సీరియస్ అయినట్లు తెలిసింది. జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు సైతం ఆస్పత్రి సిబ్బందిపై తీవ్రంగా సీరియస్ అయ్యారు. స్ట్రెచర్ లేకుండా రోగిని బంధువులే కాళ్లు పట్టు కుని లిఫ్ట్ వరకు ఈడ్చుకెళ్లిన వీడియో ఫుటేజీని పరిశీలించా రు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్‌ను ఆదేశించారు. కాగా, ఈ ఘటనపై డాక్టర్ ప్రతిమారాజ్ మీడియాతో మాట్లాడుతూ ఆస్పత్రిలో స్ట్రెచర్లు, వీల్చైర్ల కొరత లేదన్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి 10 సెకండ్ల పాటు వీడియో తీసి 15 రోజుల తర్వాత వైరల్ చేయటం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో తనకు తెలియదన్నారు. ఈనెల 1న ఆస్పత్రికి వచి్చన రోగి బోధన్ మండలం అచన్పల్లి గ్రామానికి చెందిన హన్మాండ్లుగా భావిస్తున్నట్లు తెలిపారు. అయితే.. సూపరింటెండెంట్ తన తప్పును సరిదిద్దుకోకుండా కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు దేగాం యదాగౌడ్ ఆధ్వర్యంలో సూపరింటెండెంట్ చాంబర్ ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. మారని తీరు.. కాగా, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిపై ఎన్ని ఆరోపణలు వచి్చనా సిబ్బంది తీరు మారడం లేదు. స్ట్రెచర్, వీల్ చైర్లపై రోగులను తరలించాల్సి ఉండగా వాటర్ బాటిళ్లు, వాటర్ క్యాన్లు, బెడ్ షీట్లు తరలిస్తున్న దృశ్యం శనివారం ఆస్పత్రికి వెళ్లిన ‘సాక్షి’ కి కనిపించింది. రోగులను వార్డులోని డాక్టర్ల వద్దకు తుప్పు పట్టిన వీల్ చైర్లపై బంధువులే తోసుకుంటూ వెళ్తున్న దృశ్యం కంటపడింది. -
స్ట్రెచర్ లేక రోగి కాళ్లు పట్టుకుని ఈడ్చుకెళ్లిన బంధువులు
-
ప్రసూతి వార్డులోకి ప్రవేశించిన కుక్క.. శిశువును నోటకరుచుకుని..
బెంగళూరు: కొద్ది నెలల క్రితం తెలంగాణలో కుక్కల దాడిలో ఓ బాలుడు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. అయితే, ఇలాంటి దారుణ ఘటనే తాజాగా కర్నాటకలో చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రి ప్రసూతి వార్డులోకి వచ్చిన ఓ వీధి కుక్క నవజాత శిశువును నోటితో పట్టుకుని ఈడ్చుకెళ్లింది. అనంతరం ఈ ఘటనలో నవజాత శిశువు మృతి చెందింది. వివరాల ప్రకారం.. శివమొగ్గ జిల్లాలోలని ప్రభుత్వ ఆసుపత్రి ప్రసూతి వార్డులో శనివారం ఉదయం ఓ మహిళ.. శిశువు జన్మించింది. అయితే, శనివారం ఉదయం 7 గంటల సమయంలో ఓ విధి కుక్క.. ప్రసూతి వార్డులోకి ప్రవేశించింది. అక్కడే ఉన్న శిశువును నోటకరుచుకుని బయటకు ఈడ్చుకెళ్లింది. దీన్ని చూసిన ఆసుపత్రి సిబ్బంది.. వెంటనే కుక్కను తరిమికొట్టారు. దీంతో, శిశువును అక్కడే వదిలేసి.. కుక్కు బయటకు పరుగులు పెట్టింది. అనంతరం, సిబ్బంది శిశువును ఆసుపత్రిలోకి తీసుకెళ్లారు. ఈ క్రమంలో శిశువును పరిశీలించిన వైద్యులు.. బిడ్డ చనిపోయినట్టుగా గుర్తించారు. అయితే, కుక్క కాటుకు ముందే నవజాత శిశువు చనిపోయాడా లేదా అంతకుముందే చనిపోయాడా? అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక, శిశువు మృతిలో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. మరోవైపు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఆలస్యంగా వస్తున్న డాక్టర్లు
-
ప్రసూతి మరణాలపై విచారణ
సాక్షి, హైదరాబాద్: మలక్‌పేట ప్రాంతీయ ఆసుపత్రిలో ఇటీవల జరిగిన ప్రసూతి మరణాలపై ప్రభుత్వం విచారణ కమిటీని నియమించింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు, పేట్లబురుజు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాలతిలతో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. వారం రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదికను సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. అసలేం జరిగిందంటే ... నాగర్ కర్నూల్ జిల్లా వెల్లండ మండలం చెదుమ పల్లికి చెందిన సిరివెన్నెల (23), హైదరాబాద్ పూసలబస్తీకి చెందిన శివాని (24) మలక్‌పేట ప్రభుత్వ ఆసుపత్రిలో వారం కిందట సిజేరియన్ చేయించుకున్నారు. అనంతరం వారి ఆరోగ్యం విషమించడంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు 12వ తేదీన, మరొకరు 13వ తేదీన మరణించారు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారి తీరును నిరసిస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. బాలింతల మృతికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లే కారణమన్న వాదనలు వినిపించాయి. పోస్ట్‌మార్టం రిపోర్టులో కూడా ఇన్ఫెక్షనే కారణమని తేలినట్లు సమాచారం. ఇందుకు ఆసుపత్రిలో పరిశుభ్రత లోపమే ప్రధాన కారణమని గుర్తించారు. కాగా, ఈ ఘటనలకు ముందు సిజేరియన్ చేయించుకున్న మరో 18 మందిని నిమ్స్ అత్యవసర విభాగానికి తరలించారు. అందులో ఇద్దరు బాలింతల కిడ్నీలకు ఇన్ఫెక్షన్ సోకడంతో వారికి డయాలసిస్ చేశారు. ప్రస్తుతం వీరి ఆరోగ్యం నిలకడగా ఉందని, అధికార వర్గాలు వెల్లడించాయి. కొందరిని డిశ్చార్జి కూడా చేశామని చెబుతున్నారు. అధిక మోతాదు యాంటీబయోటిక్స్ వాడారా? బాలింతలకు అధిక మోతాదు యాంటీబయోటిక్స్ వాడటం వల్లే ఇన్ఫెక్షన్కు దారితీసిందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శస్త్రచికిత్స సమయంలో ఉపయోగించిన పరికరాలను స్టెరిలైజేషన్ చేయడంలో కొంత నిర్లక్ష్యం ఉన్నట్లు కూడా చెబుతున్నారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలేదన్న విమర్శలు వస్తున్నాయి. గత ఆగస్టులో ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న నలుగురు మహిళలు మరణించిన తర్వాత కూడా ఇటువంటి సంఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇబ్రహీంపట్నం మరణాల తర్వాత రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆసుపత్రి ఇన్ఫెక్షన్ నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయిందనడానికి మలక్‌పేట సంఘటన నిదర్శనంగా చెబుతున్నారు. -
ప్రైవేట్ ప్రాక్టీస్ రద్దన్నా... ప్రభుత్వ ఉద్యోగమే ముద్దు
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ పూర్తి చేసినవారి చూపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యపోస్టుల వైపు మళ్లింది. ప్రైవేట్ ప్రాక్టీసు కన్నా ప్రభుత్వ ఆసుపత్రే మిన్న అని భావిస్తున్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో వేతనాలు ఆశాజనకంగా లేకపోవడం కూడా దీనికి మరో కారణం. ప్రైవేట్ ప్రాక్టీసుపై ప్రభుత్వం నిషేధం విధించినా ప్రభుత్వ పోస్టుల వైపే ఎక్కువగా మొగ్గు చూపడం గమనార్హం. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లో భాగంగా సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు వస్తున్న దరఖాస్తుల సంఖ్యే అందుకు నిదర్శనమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. అంతా కార్పొరేట్ వైద్యమయం అయిన పరిస్థితుల్లో ప్రైవేట్ ప్రాక్టీసు అసాధ్యమన్న భావనలో చాలామంది వైద్యులు ఉన్నారు. కొందరికైతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ. 25 వేలు కూడా ఇవ్వడంలేదు. విదేశీ ఎంబీబీఎస్‌లకైతే కొందరికి రూ. 20 వేలు కూడా ఇవ్వడం లేదన్న చర్చ జరుగుతుంది. సివిల్ అసిస్టెంట్ పోస్టులకు ఐదు రెట్ల డిమాండ్ వైద్య, ఆరోగ్య శాఖలో మొత్తం 12,755 పోస్టుల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు చేసింది. అందులో 10,028 పోస్టులను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేస్తారు. ఇప్పటివరకు ఎంబీబీఎస్ అర్హతతో ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో 734 పోస్టులు, వైద్య విధాన పరిషత్ పరిధిలో 209 పోస్టులు, ఐపీఎం పరిధిలో ఏడు సివిల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీచేశారు. మొత్తం 950 పోస్టులకు 4,800 దరఖాస్తులు వచ్చాయి. అంటే ఏకంగా ఐదురెట్ల దరఖాస్తులు వచ్చాయి. వీరికి బేసిక్ వేతనం రూ.58,850 ఉంది. డీఏ, హెచ్ఆర్ఏ అదనం. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ వారికే 90 శాతం మేరకు ఇందులో పోస్టులు దక్కాయి. అనుభవం లేనివారికి, ఇప్పుడే ఎంబీబీఎస్ పూర్తయినవారిలో 90 శాతం మందికి అవకాశమే రాలేదు. కాగా, మొత్తం పోస్టులు పొందినవారిలో అధికంగా మహిళాడాక్టర్లు 509 మంది, పురుష డాక్టర్లు 441 మంది ఉన్నారు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేందుకు మహిళలే ముందుకు వస్తున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, బోధనాసుపత్రుల్లో 1,147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ జారీచేయగా, ఇప్పటికే 2 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయని వైద్య, ఆరోగ్య సేవల నియామక సంస్థ(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌ఏ) సభ్యకార్యదర్శి గోపికాంత్‌రెడ్డి చెబుతున్నారు. ఇంకా మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశముందని ఆయన తెలిపారు. స్టాఫ్‌నర్సు పోస్టులకైతే 30 వేల మంది పోటీ? రాష్ట్రంలోని వివిధ వైద్య, ఆరోగ్య విభాగాల్లో 5,204 స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ అయిన సంగతి విదితమే. ఈ పోస్టులకు పేస్కేల్ రూ.36,750– రూ. 1,06,990 మధ్య ఉండటంతో దాదాపు 30 వేల మంది దరఖాస్తు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అంటే ఆరురెట్ల డిమాండ్ ఉంటుందని అంటున్నారు. 1,500 ఏఎన్ఎం పోస్టులకు కూడా త్వరలో నోటిఫికేషన్ జారీ కానుంది. వాటికి పదిరెట్లు పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
ప్రభుత్వ ఆసుపత్రులకు రెయిన్బో సాయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.1.2 కోట్ల విలువైన అత్యాధునిక పరికరాలను రెయిన్బో ఆసుపత్రి విరాళంగా అందజేసింది. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని ఆపరేషన్ థియేటర్లలో ఎయిర్ పెట్రి శాంప్లింగ్ సిస్టమ్‌లను అమర్చేందుకు సహకారం అందించిన రెయిన్‌బోను అభినందించారు. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ కె.రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ..మొత్తం ఇన్ఫెక్షన్లలో మూడోవంతు పోస్ట్–ఆపరేటి వ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నట్లు అధ్యయనాలు రుజువు చేశాయని తెలిపారు. ఈ ఎయిర్ పెట్రీ శాంప్లర్ల ద్వారా గాలిలో బ్యాక్టీరియా ఫంగస్ 13 రెట్లు తగ్గించొచ్చన్నారు. పరికరాలను హోంశాఖ మంత్రి మహమూద్ అలీకి అందజేసిన అనంతరం.. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ చైర్మన్, ఎండీ డాక్టర్ రమేశ్ కంచర్ల మాట్లాడుతూ.. కార్పొరేట్ సామాజిక బాధ్యత లో భాగంగా ఈ విరాళం అందించామన్నారు. -
కుమార్తె సీమంతం.. గంటల్లోపే మృత్యు ఒడికి తండ్రి
కళ్యాణదుర్గం: కుమార్తె సీమంతం ఘనంగా జరిపిన 24 గంటల్లోపే ఆ ఇంట విషాదం నెలకొంది. వివరాలు... కళ్యాణదుర్గం మండలం బోరంపల్లికి చెందిన గంగవరం గంగన్న (52) ఒక్కగానొక్క కుమార్తె జయంతి సీమంతం వేడుకను బుధవారం బంధువుల నడుమ అట్టహాసంగా నిర్వహించారు. రాత్రి పొద్దుపోయాక గంగన్న ఛాతినొప్పితో విలవిల్లాడుతుంటే కుటుంబసభ్యులు వెంటనే కళ్యాణదుర్గంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం ఆయన మృతి చెందారు. కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్న అతను ఛాతి నొప్పి రావడంతో మృతి చెందినట్లు అల్లుడు ప్రవీణ్ తెలిపారు. కాగా, గంగన్న గతంలో ఆర్డీటీ ఉపాధ్యాయుడిగా, ఆయన భార్య హంపమ్మ గ్రామ సర్పంచ్‌గా సేవలు అందించారు. (చదవండి: విజయవాడలో దారుణం.. స్నేహితు పనేనా..?) -
హైదరాబాద్: ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రికి విచారణ కమిటీ
-
111 రోజులు చికిత్స.. ప్రభుత్వాసుపత్రి ప్రాణం పోసింది
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఆ పాప ఆరు నెలలకే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చింది.. అదీ కేవలం 600 గ్రాముల బరువుతో! పుట్టగానే కదలిక లేదు. దాదాపు ఆశలు వదులుకున్న శిశువుకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నారు సంగారెడ్డిలోని ప్రభుత్వాస్పత్రి వైద్యులు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 111 రోజులపాటు చికిత్స అందిస్తూ శిశువు ఆరోగ్యాన్ని మెరుగుపరచగలిగారు. ప్రస్తుతం ఈ శిశువు బరువు 1.30 కిలోలకు పెరిగి ఆరోగ్యం మెరుగుపడింది. ప్రైవేటు ఆస్పత్రి వైద్యులే చేతులెత్తేస్తే.. ప్రభుత్వాస్పత్రి వైద్యులు ప్రతిష్టాత్మకంగా చికిత్స అందించి శిశువును కాపాడారు. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు మంగళవారం ఆ ఆస్పత్రికి వెళ్లి వైద్యులను అభినందించారు. పాప తల్లిదండ్రులను పలకరించి ధైర్యం చెప్పారు. నిలోఫర్ వైద్యులూ కష్టమేనన్నారు.. సంగారెడ్డి పట్టణానికి చెందిన అరుంధతి గర్భం దాల్చిన ఆరు నెలలకే ఉమ్మనీరు బయటకు వచ్చింది. పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే.. తక్షణం ఆపరేషన్ చేయాలని నిర్ణయించిన వైద్యులు సిజేరియన్ చేసి పాపను బయటకు తీశారు. ఆరు నెలలకే పుట్టడంతో పరిపక్వత లేని అవయవాలతో ఉన్న శిశువుకు ఊపిరి పీల్చడమే ఇబ్బందిగా ఉంది. బతకడం కష్టమని వైద్యులు తేల్చేయడంతో తల్లీబిడ్డను సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్రిటికల్ కేసు కావడంతో హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అంబులెన్స్‌లో అక్కడికి తరలించి చికిత్స చేయించగా పాప బతకడం కష్టమని అక్కడి వైద్యులు తేల్చిచెప్పారు. అప్పుడప్పుడు కాళ్లు, చేతులు మాత్రమే ఆడిస్తున్న పాపను తిరిగి తల్లి చికిత్స పొందుతున్న సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డా.అశోక్, డా.షబ్బీర్, డా.శశికళ, డా.సతీశ్‌లతో కూడిన చిన్న పిల్లల ప్రత్యేక వైద్య నిపుణుల బృందం పాపను నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచి చికిత్స అందించారు. తీవ్ర రక్తహీనతతో ఉండటంతో శిశువుకు ఆరుసార్లు రక్తం ఎక్కించారు. శిశువు అవయవాలు అపరిపక్వతతో ఉండటంతో ఇన్ఫెక్షన్ సోకే పరిస్థితి ఏర్పడింది. ఫిట్స్ కూడా వచ్చే పరిస్థితి ఉన్న ఈ శిశువుకు ప్రత్యేక వైద్య చికిత్స అందించారు. బరువు పెరిగేందుకు స్పెషల్ న్యూట్రిషిన్ సప్లిమెంటరీలు ఇచ్చారు. 111 రోజుల తర్వాత శిశువు ఆరోగ్యం కుదుటపడింది. ప్రస్తుతం 1.30 కిలోలకు చేరిన శిశువుతోపాటు, తల్లిని కూడా కొద్దిరోజుల్లోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయాలని వైద్యులు భావిస్తున్నారు. ఇలాంటి క్రిటికల్ కేసు ఈ మధ్యకాలంలో జిల్లాలో మొదటిసారని డా.సతీష్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. మెరుగైన చికిత్స అందించిన వైద్యులకు, వైద్య సిబ్బందికి తల్లి అరుంధతి కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరిగిన ఆరోగ్యశ్రీ సేవలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు ఎనిమిది శాతం పెరిగాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. దీంతో సంబంధిత వైద్యులను, అధికారులను ఆయన అభినందించారు. ఈ సేవలను మరింత పెంచాలని పిలుపునిచ్చారు. సర్జరీలు పెరగాలని, అన్ని వైద్య పరికరాలు పూర్తిస్థాయి వినియోగంలో ఉండాలని ఆదేశించారు. ఆకస్మిక తనిఖీలు చేయాలని వైద్యాధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యశ్రీ పథకం అమలు, పురోగతిపై మంత్రి నెలవారీ సమీక్ష గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఆరోగ్యశ్రీ సీఈవో రిజ్వీ, డీఎంఈ డాక్టర్ రమేష్‌రెడ్డి, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, ఆరోగ్యశ్రీ అధికారులు, జిల్లా కో–ఆర్డినేటర్లు, టీమ్ లీడర్లు, అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, 2019–20లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అరోగ్యశ్రీ సేవలు 35 శాతం ఉంటే, 2021–22లో అవి 43 శాతానికి పెరిగాయన్నారు. ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలి.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు పేదలకు వైద్య ఖర్చుల భారం లేకుండా చేయాలని, అన్ని జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో కాటరాక్ట్ ఆపరేషన్లు చేయాలని సూచించారు. 26 సీఆర్మ్ మెషీన్లు పంపిణీ చేశామని, చిన్న చిన్న పరికరాలు అవసరం ఉంటే కొనుగోలు చేసుకోవాలని తెలిపారు. సమీప ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆర్థో సర్జరీలు పెరగాలని, మోకాలు ఆపరేషన్లు అన్ని జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో చేయాలని, అందుకు గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల సహకారం తీసుకోవాలని సూచించారు. సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, అదే రీతిలో మాతా, శిశు మరణాలు పూర్తిగా తగ్గించాలని చెప్పారు. -
గాలి సరిపోక.. ఉక్క తట్టుకోలేక..
ఖమ్మం : వేసవిలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మధ్యాహ్న సమయాల్లో జిల్లాలోని జనం ఉక్కపోతకు తట్టుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యాన ఖమ్మం జిల్లా ప్రభుత్వాస్పత్రి మాతా,శిశు కేంద్రంలోని ప్రసూతి వార్డులో బాలింతలు, చిన్నారులు ఉక్కపోతకు తల్లడిల్లిపోతున్నారు. ఆస్పత్రిలో ఉన్న ఫ్యాన్ల గాలి సరిపోకపోవడంతో బాలింతల ఇళ్ల నుంచి టేబుల్ ఫ్యాన్లు తీసుకొచ్చి ఇదిగో ఇలా ఏర్పాటు చేసుకున్నారు. కొందరు విద్యుత్‌తో నడిచేవి తీసుకొస్తే.. మరికొందరు సోలార్ పవర్, బ్యాటరీలతో నడిచే ఫ్యాన్లను తీసుకొచ్చి సేదదీరుతున్నారు. -
ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ రద్దు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌ను రద్దు చేయాలని సర్కారు నిర్ణయించింది. అయితే ఇకపై సర్కారు ఆసుపత్రుల్లో నియమితులయ్యే వైద్యులకు మాత్రమే ఈ నిర్ణయాన్ని వర్తింపజేయనుంది. ఈ అంశంపై వైద్య, ఆరోగ్యశాఖ చేసిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపినట్లు ఆ శాఖ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, పారామెడికల్ సిబ్బందిని నియమించాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకోసం కసరత్తు చేపడుతోంది. నియామక మార్గదర్శకాలను 2–3 రోజుల్లోగా విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మార్గదర్శకాల్లో ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేటు ప్రాక్టీస్ రద్దు అంశం కీలకమైందని చెబుతున్నాయి. మరోవైపు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఆయా పోస్టుల భర్తీలో గతంలో ఇచ్చినట్లుగానే వెయిటేజీ ఉంటుందని ఒక కీలకాధికారి తెలిపారు. సర్వీస్ రూల్స్‌ల్లో మార్పులు... రాష్ట్రంలో మొత్తం 12,755 వైద్య సిబ్బంది పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవగా వాటిలో 10 వేలకుపైగా పోస్టులను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ ఆర్బీ) భర్తీ చేయనుంది. డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎం పోస్టులను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు భర్తీ చేయనుండగా ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను మాత్రం టీఎస్పీఎస్సీ భర్తీ చేయనుంది. పోస్టుల భర్తీకి సంబంధించి సుమారు 20 ఏళ్ల నాటి సర్వీస్ రూల్స్‌ను మార్చే ప్రక్రియ దాదాపు పూర్తయింది. గతంలో స్టాఫ్ నర్సులు, ఇతర పారామెడికల్ పోస్టుల భర్తీ సమయంలో తలెత్తిన న్యాయ చిక్కుల వంటివి ఈసారి తలెత్తకుండా పకడ్బందీగా వ్యవహరించాలని వైద్య యంత్రాంగం భావిస్తోంది. గతంతో పోలిస్తే ఇప్పుడు వైద్య కోర్సుల్లో, పోస్టుల్లో మార్పులు ఎన్నో మార్పులు ఉండటంతో పాత సర్వీస్ రూల్స్ ప్రకారం కొత్త కోర్సులు చేసిన వారు అనర్హులయ్యే పరిస్థితులు న్నాయి. ముఖ్యంగా ల్యాబ్ టెక్నీ షియన్లలో దాదాపు 30 రకాల విభాగాలు, కోర్సులు వచ్చాయి. అంటే కార్డియో టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, న్యూరోకు సంబంధించి టెక్నీషియన్, వివిధ కొత్త యంత్రాలకు టెక్నీషియన్లు వచ్చారు. వాటికి కోర్సులు కూడా వచ్చాయి. ఇలా 30 రకాల కోర్సులు చేసిన వారందరూ అర్హులు కాబట్టి వేర్వేరు కోర్సులకు వేర్వేరు సిలబస్ తయారు చేయాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన సర్వీస్ రూల్స్‌ను మార్చారు. స్టాఫ్ నర్సుల పోస్టులకు 20 వేల మంది పోటీ! వైద్య, ఆరోగ్యశాఖలో పోస్టులను ప్రకటించిన తర్వాత స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఏఎన్ఎంల కోసం అభ్యర్థులు పెద్ద ఎత్తున సన్నద్ధం అవుతున్నారు. స్టాఫ్ నర్సుల భర్తీ దాదాపు నాలుగేళ్ల తర్వాత జరుగుతుండటంతో 4,722 స్టాఫ్ నర్సు పోస్టుల కోసం 20 వేల మంది పోటీ పడే అవకాశముంది. అలాగే 1,520 ఏఎన్ఎం పోస్టుల కోసం 6 వేల మంది పోటీ పడే అవకాశం ఉందని అంటున్నారు. దాదాపు 2 వేల వరకున్న ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు 8 వేల మంది పోటీ పడొచ్చని వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
‘నీ పని అవ్వాలంటే రూ.2000 ఇవ్వాల్సిందే.. లేదంటే..’
‘జిల్లా కేంద్రానికి చెందిన చంద్రశేఖర్ తన కూతురు జనన ధ్రువీకరణ పత్రం తీసుకునేందుకు ప్రభుత్వాసుపత్రికి వెళ్లాడు. అక్కడ కనిపించిన ఓ సిబ్బందిని బర్త్ సర్టిఫికెట్లు ఇచ్చే కార్యాలయం అడ్రస్ అడగగా, సర్టిఫికెట్ తీసుకోవడం పెద్ద ప్రాసెస్ ఉంటుందని.. తనకు రూ.2000 ఇస్తే వారం రోజుల్లో సర్టిఫికెట్ చేతులో పెడతానని నమ్మబలికాడు. చేసేది లేక చంద్రశేఖర్ డబ్బులు ఇచ్చి వారం రోజుల తర్వాత సర్టిఫికెట్ తీసుకున్నాడు.’ కరీంనగర్‌టౌన్: జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. గతంలో మ్యాన్వల్గా ఇచ్చే సర్టిఫికెట్లను ఏడాది కాలంగా నుంచి ఆన్‌లైన్‌కు మార్చారు. మీసేవలో దరఖాస్తు చేసుకొని ఉచితంగా పొందాల్సిన సర్టిఫికెట్‌కు వందలు, వేలు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది చేతి వాటం ప్రదర్శిస్తూ అమాయకుల వద్ద అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారు. మ్యాన్వల్గా ఇచ్చిన సర్టిఫికెట్లు అన్ని ప్రాంతాలలో చెల్లడం లేదనే ఉద్దేశంతో మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో డెలివరీ అయిన పిల్లలకు సైతం జనన ధ్రువీకరణ పత్రాలు మీసేవలోకి మార్చారు. మ్యాన్వల్గా ఉన్నప్పుడు దందా నడిపించిన కేటుగాళ్లు ఆన్‌లైన్‌కు మార్చినా వదలడం లేదు. అమాయకులు సర్టిఫికెట్ల కోసం ఆసుపత్రికి వస్తే వారిని మోసం చేస్తూ డబ్బులు వసూళ్లకు తెగబడుతున్నారు. కొంత మంది సిబ్బంది ఆసుపత్రి ముందు తిష్ట వేసి సర్టిఫికెట్ల కోసం వచ్చేవారి అవసరాన్ని ఆసరాగా చేసుకొని వేలల్లో వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నేరుగా మీసేవకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటే వారం రోజుల్లో సర్టిఫికెట్ వస్తుంది. అది తెలియని వారిని దళారులు బోల్తా కొట్టిస్తున్నారు. ఇలా ఉచితంగా పొందాల్సిన సర్టిఫికెట్లకు వేలల్లో వసూలు చేస్తుండడంతో సర్టిఫికెట్లు పొందే వారు ఆందోళన చెందుతున్నారు. మరణ ధ్రువీకరణాల పరిస్థితి దారుణం జనన ధ్రువీకరణ సర్టిఫికెట్లకే ఇంత ఇబ్బంది అవుతుంటే ఇక మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్ల విషయంలో చుక్కలు చూపిస్తున్నారు. ఏకంగా సిబ్బందితో కుమ్మక్కై దళారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఆన్లైన్లో రికార్డు లేకపోతే ఆసుపత్రి నుంచి మరణ నివేదికను తీసుకెళ్లి మున్సిపల్ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకొని రికార్డులను దాచిపెట్టి దొరకడం లేదంటూ ఆసుపత్రి చుట్టూ తిప్పుకుంటున్నారు. చివరకు బేరం కుదిరితే రికార్డులు దొరికాయంటూ మరణ నివేదిక రాసి ఇస్తున్నారు. ఫిర్యాదు చేస్తే చర్యలు చేపడతాం.. జనన, మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్ల కోసం వచ్చేవారు ఎవరికీ డబ్బులు ఇవ్వద్దు. సర్టిఫికెట్లు ఆన్లైన్ ద్వారా ఉచితంగా పొందాలి. ఎవరైనా డబ్బులు అడిగితే నేరుగా ఆసుపత్రిలో ఫిర్యాదు చేస్తే చర్యలు చేపడతాం. ఆసుపత్రి సిబ్బంది డబ్బులు తీసుకున్నట్లు నిరూపణ అయితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ జ్యోతి, జిల్లా ఆసుపత్రి ఆర్ఎంవో చదవండి: అబ్దుల్లాపూర్ మెట్లో దారుణం.. జంట మృతదేహాల కలకలం -
సెక్యూరిటీ గార్డే డాక్టరైండు.. పేషెంట్‌కు ఇంజెక్షన్
భువనేశ్వర్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైద్యులపై ప్రజల్లో గౌరవం పెరిగింది. ప్రత్యక్ష దైవంగా వారిని భావించారు. అలాంటి భావనను కొందరు వైద్యులు తమ నిర్లక్ష్యంతో పోగొట్టుకుంటున్నారు. అలాంటి ఘటనే ఒడిశాలో చోటుచేసుకుంది. విధులపై నిర్లక్ష్యం వహించారు. ఆస్పత్రి గేటు వద్ద సెక్యూరిటీ విధులు నిర్వహించే గార్డుతో ఇంజెక్షన్ ఇప్పించారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. చదవండి: భిక్షమెత్తుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి మరదలు అంగుల్‌లోని జిల్లా ఆస్పత్రికి మంగళవారం ప్రమాదంలో గాయపడిన వ్యక్తితో పాటు అతడి బంధువులు వచ్చారు. ఈ సమయంలో ఆస్పత్రిలో వైద్యులు, నర్సులు ఎవరూ లేరు. దీంతో సెక్యూరిటీ గార్డే వైద్యం చేశారు. క్షతగాత్రుడికి ఇంజెక్షన్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను అతడి బంధువులు సెల్ఫోన్లో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ పరిణామంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవడంతో ప్రభుత్వం స్పందించింది. ‘ఆ రోజు ఆస్పత్రిలో ఇన్చార్జ్ ఎవరో తెలుసుకుంటున్నాం. ఈ ఘటనపై విచారణ చేపడుతున్నాం. విచారణ అనంతరం కారకులపై చర్యలు తీసుకుంటాం’ అని అసిస్టెంట్ చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ మానస్ రంజన్ తెలిపారు. చదవండి: మహిళలు జన్మనివ్వడానికే.. మంత్రులుగా పనికి రారు -
CM KCR: ‘టాలెస్ట్ టవర్ ఆఫ్ వరంగల్’గా ఆస్పత్రి
కెనడాను తలదన్నేలా.. ప్రపంచంలోనే అధునాతన వైద్య సదుపాయాలు కెనడాలో ఉన్నాయి. వైద్యాధికారులు కెనడాను విజిట్ చేసి.. అక్కడి ఆస్పత్రులను తలదన్నేలా వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీని నిర్మించాలి. ప్రపంచంలోని అన్ని విభాగాల వైద్య సేవలు ఒకేచోట రావాలి. ఇకపై హన్మకొండ, వరంగల్ జిల్లాలు వరంగల్ అర్బన్ జిల్లా పేరును హన్మకొండ జిల్లాగా, వరంగల్ రూరల్ జిల్లా పేరును వరంగల్ జిల్లాగా మార్చుతాం. స్థానికుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. అక్టోబర్ తర్వాతే థర్డ్ వేవ్.. లాక్డౌన్ మరిన్ని రోజులు పెడితే ప్రజలకు ఉపాధి పోతుంది. అన్ని అంశాలను పరిశీలించాకే ఎత్తేశాం. ప్రస్తుతం కేసులు పెరగట్లేదు. థర్డ్‌వేవ్ వస్తే గిస్తే అక్టోబర్ తర్వాతే వస్తుంది. ఈ మధ్య కాలంలో రాదు. తగిన జాగ్రత్తలు పాటిస్తే నియంత్రించొచ్చు. కడుపు నిండా పరిహారం.. యాదాద్రిలో రింగ్‌రోడ్డు భూ నిర్వాసితులకు భూమికి భూమి ఇవ్వడంతోపాటు నిర్మాణాల విలువను చెల్లిస్తాం. కడుపునిండా పరిహారం అందిస్తాం. ఆందోళన చెందే అవసరం లేదు. టెంపుల్ సిటీలో షాపులు కేటాయించడంలో ప్రాధాన్యత ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తాం. సాక్షి ప్రతినిధి, వరంగల్: హైదరాబాద్ కంటే వరంగల్ తక్కువేమీ కాదని.. వరంగల్ దేశంలోనే గొప్ప విద్యా కేంద్రం, వైద్య కేంద్రం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేర్‌రావు అన్నారు. తూర్పు తెలంగాణకు ఈ నగరం హెడ్ క్వార్టర్ కావాలని, అత్యంత అధునాతన వైద్య సేవలు ఇక్కడ అందాలని చెప్పారు. వరంగల్‌లో నిర్మించే మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి టాలెస్ట్ టవర్ ఆఫ్ వరంగల్‌గా ఉండాలని.. ఏడాదిన్నరలోగా పూర్తయ్యేలా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సీరియస్‌గా పనిచేయాలని ఆదేశించారు. తానే మళ్లీ వచ్చి కొబ్బరికాయ కొట్టి ఆస్పత్రిని ప్రారంభిస్తానని చెప్పారు. సోమవారం వరంగల్‌లో పర్యటించిన సీఎం కేసీఆర్.. తొలుత హన్మకొండలోని ఏకశిలా పార్కులో జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తర్వాత వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో నిర్మించే మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాపన చేసి.. సమీకృత కలెక్టరేట్, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. మాతా, శిశు సంరక్షణ కేంద్రం వరంగల్ ఎంజీఎం, ప్రాంతీయ కంటి వైద్యశాల, సెంట్రల్ జైలు, మెడికల్ కాలేజీ కలిపి చూస్తే 200 ఎకరాలు అందుబాటులో ఉన్నట్లే. ప్రస్తుత ఎంజీఎం ఆస్పత్రి భవనాలు పాతబడినందున కూల్చివేసి భవనాలు నిర్మించాలి. దీనిని అత్యాధునికంగా మాతా, శిశు సంరక్షణ కేంద్రంగా మారుస్తాం. దానికి రెండు మూడు వేల కోట్లు ఖర్చయినా వెనుకాడం. వైద్య విభాగంలో ఉన్న అన్ని రకాల సేవలు హబ్‌గా వరంగల్‌లో అందుబాటులో ఉండేలా చేస్తాం. తెలంగాణ మొత్తం ఇంకా నాగరికంగా మారాలి. ప్రతీ పాత తాలుకా సెంటర్లో మాతాశిశు సంరక్షణ కేంద్రాలు రావాలి. ఒక మినీ నీలోఫర్ సెంటర్ రావాలి. ఇందుకోసం ఉన్నతాధికారులకు ఆదేశాలిస్తాం. పెట్టుబడులు రావాలి.. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరంగల్ అతి పెద్దనగరం. ఇది గొప్ప విద్యా, వైద్య కేంద్రంగా మారాలి. వరంగల్‌కు డెంటల్ కాలేజీ, డెంటల్ హాస్పిటల్‌ను మంజూరు చేస్తున్నం. వరంగల్‌కు పెట్టుబడులు రావాలి. ఐటీ కంపెనీలను విస్తరించాలి. ఇందుకోసం పెట్టుబడులను ఆకర్షించేలా అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం. త్వరలోనే మామునూర్ ఎయిర్‌పోర్టు రాబోతోంది. చైనా లాంటి టెక్నాలజీ రావాలి చైనాలో 28 గంటల్లోనే 10 అంతస్తుల భవనం నిర్మించారు. ఆ తరహా నిర్మాణ పరిజ్ఞానం మనదగ్గర కూడా రావాలి. ప్రజల పనులు వేగంగా జరిగితేనే ప్రజాస్వామ్యానికి సార్థకత. ప్రజలు పైరవీలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండొద్దు. మిగతా 30 కలెక్టరేట్లు కూడా త్వరగా పూర్తి కావాలి. కలెక్టర్ హోదా పేరు కూడా మారిస్తే బాగుంటుంది. ఒకప్పుడు భూమి శిస్తు వసూలు చేసేవారిని కలెక్టర్ అనేవారు. ఇప్పుడు కలెక్టర్లకు శిస్తు వసూలు చేసే అవసరం లే దు. అందువల్ల వారి పేరు మారిస్తే బాగుంటుంది. జిల్లాలు అభివృద్ధి చెందాలి హైదరాబాద్‌లో జనాభా విపరీతంగా పెరిగిపోయింది. రాష్ట్రం మొత్తం హైదరాబాద్‌పై ఆధారపడితే జిల్లాలకు నష్టం కలుగుతుంది. జిల్లాలు కూడా అభివృద్ధి చెందితే హైదరాబాద్‌పై భారం తగ్గుతుం ది. అందుకే హైదరాబాద్ ఈర్ష్య పడేలా వరంగల్ ను వైద్య, విద్య, ఐటీ రంగాల్లో అభివృద్ధి చేస్తాం. జూలై 1 నుంచి పల్లె ప్రగతి రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాలను బాగు చేసేందు కు యజ్ఞంలా పనిచేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా జూలై 1 నుంచి 10 వరకు పల్లెప్రగతి కార్యక్రమం చేపడతాం. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కలిపి నిర్వహిస్తాం. స్థానిక సంస్థలకు ముందే నిధులు విడుదల చేస్తాం. ఈనెల 26న మంత్రులు, కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, అడిషనల్ కలెక్టర్లు, డీఆర్డీవో అధికారులతో సమావేశం ఉంటుంది. ఆ రోజు మొత్తం అజెండా ఫైనల్ చేస్తాం. ప్రతిష్టాత్మక దేవాదుల ప్రాజెక్టు నీరు వరంగల్‌కే అంకితం. ఉమ్మడి వరంగల్‌లో మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలి. మిగిలిన పనుల పూర్తికి రూ.100 కోట్లు కేటాయిస్తాం. కరోనాపై అతిగా ఆందోళన వద్దు కరోనాపై ఊహాగానాలతో ప్రజలను భయపెట్టేలా వార్తలు ఇవ్వొద్దు. ఇది మంచిది కాదు. కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రసారం చేస్తే మంచిది. చాలా మంది భయాందోళనలతో మందులు, ఆక్సిజన్ సిలిండర్లు కొని పెట్టుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు సామర్థ్యానికి మించి వస్తున్నారు. వచ్చిన రోగులను తిరిగి పంపించకుండా వీలున్న చోట పడుకోబెట్టి చికిత్స అందించాల్సి వస్తది. ప్రభుత్వ వైద్యులు, సిబ్బందికి సెల్యూట్ చేస్తున్నా. వారు ఉత్తమ సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ వైద్యులపై దాడులు సరికాదు. సిబ్బంది కరోనా ఉధృతి ఉన్నా ఇంటింటికీ తిరిగి జ్వర సర్వే చేశారు. కిట్లు అందించారు. -
గిరాకీ లేదని... ఏకంగా ఆక్సిజన్ సరఫరానే నిలిపేశారు..
సాక్షి, నిజామాబాద్: కొన్ని రోజులుగా తమకు పేషెంట్లు దొరకడం లేదనే కారణంతో గిరాకీ కోసం ముగ్గురు ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు దుర్మార్గానికి ఒడిగట్టారు. ప్రభుత్వాస్పత్రి సిబ్బంది గమనించడంతో పెను ప్రమాదమే తప్పింది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగులకు సంబంధించి ఆక్సిజన్ సరఫరాను ముగ్గురు ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు నిలిపేశారు. ఆక్సిజన్ సరఫరా ఆగి పోవడాన్ని వార్డు బాయ్ గమనించారు, ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్‌ను ప్రభుత్వాసుపత్రి సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరు డ్రైవర్ల కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: ఇంట్లో మంటలు: మహిళ సజీవదహనం Hyderabad: ‘చేపలు అయిపోయాయి.. తప్పక చికెన్ తీసుకున్నా’ -
తల్లి ప్రాణం గిలగిల.. గర్భంలో బిడ్డ మృతి
ఖమ్మం వైద్య విభాగం: వైద్యుల నిర్లక్ష్యానికి గర్భస్థ శిశువు బలైంది. నిండు గర్భిణి అనే కనికరం లేకుండా వ్యవహరించడం.. ఆ తల్లికి కడుపు కోతను మిగిలి్చంది. గురువారం ఖమ్మంలో ఈ అమాననీయ సంఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఖానాపురం యూపీహెచ్ కాలనీకి చెందిన ముసుకుల అశ్విని నిండు గర్భిణి కావడంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతాశిశు సంరక్షణ కేంద్రానికి వచి్చంది. ఆమెను పరీక్షించిన వైద్యులు కాన్పు చేసేందుకు కొన్ని టెస్టులు రాశారు. దీంతో కుటుంబ సభ్యులు పరీక్షలు చేయించి డాక్టర్‌కు చూపించారు. పరీక్షల్లో ఆమెకు కామెర్లు ఉన్నట్లు తేలింది. దీంతో ఆపరేషన్ చేయడం కుదరదని, వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లాలని చెప్పారు. తాము నిరుపేదలమని, లాక్డౌన్లో అంతదూరం తీసుకెళ్లలేమని అశ్విని కుటుంబ సభ్యులు డాక్టర్లను వేడుకున్నా ససేమిరా అన్నారు. ఈ క్రమంలో అశ్విని పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కడుపులో ఇబ్బందిగా ఉందని కుటుంబసభ్యులకు తెలపడంతో డాక్టర్లు మరోసారి పరీక్షించారు. ఈ దశలో ఆమె కడుపులో బిడ్డ మృత్యువాత పడింది. దీంతో కుటుంబ సభ్యులు, అశ్విని కన్నీరు మున్నీరయ్యారు. కనీసం కడుపులోని మృత శిశువును అయినా తీయాలని కుటుంబ సభ్యులు డాక్టర్లను వేడుకున్నా కనికనించలేదు. దీంతో చేసేది లేక నగరంలోని వివిధ ప్రైవేటు ఆస్పత్రులను సంప్రదించారు. అయినా ఎవరూ వైద్యానికి అంగీకరించకపోవడంతో చివరి ప్రయత్నంగా మమత ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు తీవ్రంగా శ్రమించి మృత శిశువును బయటకు తీశారు. కాగా తల్లి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులపై కఠినచర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కామెర్లు ఉండడంతో ఎంజీఎంకు వెళ్లమన్నాం ఈ సంఘటనపై ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి ఆర్ఎంఓ బి. శ్రీనివాసరావు వివరణ కోరగా.. ఆమెకు కామెర్లు ఉం డటంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి డాక్టర్లు రిఫర్ చేశారన్నారు. కానీ కడుపులో శిశువు మాత్రం ఆస్పత్రిలో మృతి చెందలేదని స్పష్టం చేశారు. దానికి తమ వైద్యులు బాధ్యులు కాదని తెలిపారు. చదవండి: పాపం! అయినా అమ్మ దక్కలేదు.. చదవండి: ఇంట్లోనే కరోనా పరీక్ష చేసుకోవడం ఇలా.. -
కొన ఊపిరితో ఉన్న తల్లి కోసం కుమార్తె అగచాట్లు
నల్లగొండ జిల్లా గట్టుపల్ మండలానికి చెందిన రాజ్యమ్మ శ్వాసలో ఇబ్బందితో నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలో చేరింది. పరిస్థితి విషమించడంతో గురువారం హైదరాబాద్‌కు తరలించడానికి ఆమె కుమార్తె అంబులెన్స్, ఆక్సిజన్ సిద్ధం చేసింది. అయితే రాజ్యమ్మలో చలనం లేకపోవడంతో.. వైద్యులతో మాట్లాడి స్ట్రెచర్‌పై ఉన్న తల్లిని తిరిగి అదే ప్రభుత్వాస్పత్రిలోకి తీసుకెళ్లింది. కొద్దిసేపటికే తల్లి కన్నుమూసింది. కొన ఊపిరితో తల్లి.. ఎలాగైనా ఆమెను దక్కించుకోడానికి కుమార్తె పడిన ఆరాటం.. చివరకు తల్లి కన్నుమూయడంతో ఆమె విలపించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. - సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నల్లగొండ -
ఎయిర్‌పోర్టుకు చేరుకున్న 2 లక్షల కోవిషీల్డ్ డోసులు
గన్నవరం: రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిమిత్తం బుధవారం మరో రెండు లక్షల కోవిషీల్డ్ టీకా డోసులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్కు చెందిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ బాక్స్‌లను ఉదయం విమానంలో ఇక్కడికి తరలించారు. అనంతరం వ్యాక్సిన్ డోసులను గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోని రాష్ట్ర వ్యాధి నిరోధక టీకాల భవనానికి తీసుకువచ్చి నిల్వ చేశారు. గత 2 రోజుల్లో ఇక్కడికి మొత్తం 4 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. వీటిని ప్రత్యేక కంటైనర్లలో 13 జిల్లాలకు తరలించినట్లు శీతలీకరణ అధికారి దేవానందం తెలిపారు. -
నిరూపిస్తే.. ఎలాంటి శిక్షకైనా సిద్ధం
సాక్షి, పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో మనిషి అవశేషాలున్న డబ్బా సోమవారం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ వివరణ ఇచ్చారు. ఆరు నెలల క్రితం పాల్వంచ మండలం బండ్రుగొండలో గుర్తుతెలియని మృతదేహానిదని తెలిపారు. క్షుద్రపూజల కోసం ఆస్పత్రి అధికారులే తరలిస్తున్నారనేది అవాస్తవమన్నారు. (చదవండి: ముక్కలైన ట్రాక్టర్.. ఒళ్లు గగుర్పుడిచే ప్రమాదం) ఆస్పత్రిలో మానవ అవశేషాలు అమ్ముతున్నట్లు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. మార్చురి గదిలో స్థలం లేకపోవడం వల్లే సిబ్బంది.. పవర్‌కు సంబంధించిన గదిలో అవశేషాలున్న బాక్స్ పెట్టారని వివరించారు. పుర్రెకు సంబంధించి పీఎస్‌లో ఫిర్యాదు చేయని మాట వాస్తవమే.. అందుకే తప్పుడు ప్రచారం జరిగిందని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. (చదవండి: 'స్నేహం చేయకపోతే అశ్లీల ఫోటోలను షేర్ చేస్తా') -
మినీ ప్రభుత్వ ఆస్పత్రిగా మారుస్తాం: వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: నగరంలోని కొత్తపేట రాజ సాహెబ్ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. శనివారం ఆస్పత్రిని సందర్శించిన ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేస్తే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చి వైద్యానికి పెద్దపీట వేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఆస్పత్రిని త్వరలోనే మినీ ప్రభుత్వ ఆస్పత్రిగా తీర్చిదిద్దుతామని గతంలో హామీ ఇచ్చామనీ, అందుకు అనుగుణంగానే పట్టణ వన్-టౌన్ వాసుల చిరకాల వాంఛ నెరవేరబోతోందని అన్నారు. వైద్యవిధాన పరిషత్ అధికారులతో చర్చించి కొద్దిరోజుల్లోనే ఆస్పత్రి పనులు ప్రారంభిస్తామన్నారు. అంబులెన్స్, వాహనాలు రావడానికి అనువుగా మున్సిపల్ కమిషనర్‌తో చర్చలు జరిపి రహదారి వెడల్పు, అభివృద్ధి పనులు చేయిస్తామని తెలిపారు. -
రోగుల పట్ల దురుసుగా ప్రవర్తించిన మహిళా అటెండర్
-
‘చెప్పుతో కొడతా.. ఎవరికీ భయపడను’
సాక్షి, గజ్వేల్: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగుల పట్ల మహిళా అటెండర్ దురుసుగా ప్రవర్తించిన ఘటన సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లో చోటుచేసుకుంది. వైద్యం కోసం వచ్చిన వారిని దూషిస్తూ దాడి దిగింది స్వరూప అనే మహిళా అటెండర్. అక్కడితో ఆగకుండా చెప్పుతో కొడతానని హెచ్చరించింది. ఎవరికి చెపుకుంటారో, చెప్పుకోండి అంటూ ఎదురుదాడికి దిగింది. తన మాటలను సెల్ఫోన్లో రికార్డు చేసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా భయపడబోనని హుంకరించింది. ఆమెపై బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఉన్నతాధికారులు ఆగమేఘాల మీద స్పందించారు. విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. పోలీస్ కేసు కాకుండా చూసేందుకు బాధితులను ఆస్పత్రి నుంచి పంపించివేశారు. మీడియాకు ఏమీ తెలపొద్దని చెప్పినట్టు తెలుస్తోంది. రోగుల పట్ల అమర్యాదగా ప్రవర్తించిన మహిళా అటెండర్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి. -
పెద్దాసుపత్రికి... గర్భిణులు రావద్దట...!
భద్రాచలం ఏజెన్సీ ప్రజల ఆరోగ్యావసరాలకు ఇదే పెద్ద దిక్కు. గర్భిణులంతా వైద్య సేవలకు, కాన్పులకు ఇక్కడికే వస్తుంటారు. మణుగూరు, పాల్వంచ తదితర ప్రాంతాల్లోని వైద్యులు కూడా అత్యవసర కేసులను ఇక్కడికే పంపిస్తుంటారు. కాన్పులు చేయటంలో ఈ ఆస్పత్రికి మంచి రికార్డ్ ఉంది. జాతీయ స్థాయి పురస్కారాలు కూడా అందుకుంది. ఇదంతా గతం...! మరి, వర్తమానం..? ఈ ఆస్పత్రి గత కీర్తి గతించింది. రెండొందల పడకలున్న ఈ పెద్దాసుపత్రి పరిస్థితి.. ‘పేరు గొప్ప–ఊరు దిబ్బ’ సామెతను తల పిస్తోంది. ‘‘గర్భిణులారా...! దయచేసి, మా ఆస్పత్రికి రావద్దు. మేమిక్కడ కాన్పు లు చేయడం లేదు. మరేదైనా ఆస్పత్రికి వెళ్లండి’’ అని, ఇక్కడి వైద్యులు చేతులెత్తి (చేతులెత్తేసి) వేడుకుంటున్నారు. భద్రాచలం: భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రసవ సేవలు నిలిచిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. స్త్రీ వ్యాధి నిపుణులు (గైనకాలజిస్ట్) అందుబాటులో లేకపోవటంతో కాన్పులు చేయటం మా వల్ల కాదంటూ విధుల్లో ఉన్న వైద్యులు చేతులెత్తేస్తున్నారు. ఆసుపత్రిలో వైద్యుల కొరత తీవ్రంగా ఉండటంతో రోగులకు సకాలంలో సరైన వైద్యసేవలు అందటం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వివిధ ప్రాంతాలతోపాటు, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాల నుంచి ఇక్కడికి ప్రసవ సేవల కోసమని గర్భిణులు వస్తుంటారు. భూపాలపల్లి జిల్లాలోని వాజేడు, వెంకటాపురం నుంచి కూడా రోగులు వస్తుంటారు. రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రులన్నింటికంటే అత్యధిక ప్రసవాలు చేయటం ద్వారా వరుసగా మూడుసార్లు రాష్ట్రస్థాయిలో అవార్డు సాధించిన భద్రాచలం ఆసుపత్రిలో ప్రస్తుత పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. కాన్పుల కోసమని వచ్చే గర్భిణులను వేరే ఆసుపత్రులకు వెళ్లిపొమ్మంటూ ఇక్కడ వైద్యులు సూచిస్తున్నారు. దీంతో, సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న పేద, మధ్యతరగతి కుటుంబాల వారు తీవ్ర ఆందళన వ్యక్తం చేస్తున్నారు. ప్రసవ సేవలు పూర్తిగా బందయ్యే పరిస్థితులు ఏర్పడినప్పటికీ, ఉన్నతాధికారులెవ్వరూ దీనిపై తగిన దృష్టి సారించకపోవటంపై విమర్శలు, ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. భద్రాచలం ఏరియా వైద్యశాలకు మూడు రాష్ట్రాల నుంచి వైద్య సేవల కోసమని రోగులు వస్తుంటారు. జిల్లాలోని మణుగూరు, పాల్వంచ వంటి ప్రాంతాల నుంచి కూడా ఇక్కడకే అత్యవసర కేసులను రిఫర్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే, 100 పడకల సామర్థ్యంగల భద్రాచలం ఆసుపత్రిని ఇటీవలనే 200 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేశారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా వైద్య సేవల అందిటమే లక్ష్యంగా నూతన భవనాలను నిర్మించటంతో పాటు, అధునాతన వైద్య పరికరాలను కూడా అందుబాటులో ఉంచారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ, సరిపడినంతమంది వైద్యులను, సిబ్బందిని నియమించకపోవటంతో ఆసుపత్రికి వచ్చే రోగులకు సకాలంలో సరైన వైద్యం అందటం లేదు. కాన్పులు చేయటం మా వల్లకాదు... భద్రాచలం ఏరియా ఆసుపత్రికి కాన్పులు చేయటంలో మంచి రికార్డు ఉంది. డాక్టర్ కోటిరెడ్డి నాయకత్వంలోని ఇక్కడి వైద్యుల పనితీరుకు జాతీయ స్థాయి పురస్కారాలు కూడా అందాయి. కానీ, స్త్రీ వ్యాధి నిపుణులు(గైనకాలజిస్ట్) లేకపోవటంతో కాన్పుల కోసమని వచ్చే వారిని ఇక్కడ చేర్చుకునేందుకు వైద్యులు నిరాకరిస్తున్నారు. కాన్పుల సంఖ్యనుబట్టి ఇక్కడ వాస్తవంగా ఐదుగురు గైనకాలజిస్టులు ఉండాలి. ఇటీవల నిపుణులైన వైద్యుల నియామకంలో భద్రాచలానికి ప్రాధాన్యమిచ్చి, ఐదుగురిని పంపించారు. ఆ తరువాత కొన్ని రోజులకే, ఇక్కడి పని భారాన్ని తట్టుకోలేక, ఇద్దరు రాజీనామా చేసి వెళ్లిపోయారు. మరో ఇద్దరు వైద్యులు.. ఎటువంటి సమాచారం లేకుండా సెలవు తీసుకున్నారు. ఇక మిగిలింది.. ఒకే ఒక్క గైనకాలజిస్ట్. ఆమె కూడా ప్రసూతి సెలవులో ఉన్నారు. దీంతో, కాన్పులు చేసే వారు ఇక్కడ లేకుండాపోయారు. తప్పనిసరి పరిస్థితుల్లో కాన్పులు చేసేందుకు ప్రైవేటు గైనకాలిజిస్టులను రప్పిస్తున్నారు. వారికి ఒక్కో కాన్పుకు రూ.2500లు చెల్లిస్తున్నారు. వారు కూడా.. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. గతంలో 500 నుంచి 600 వరకు కాన్పులు చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. గత నెలలో 435 కాన్పులు చేయగా, ఈ నెలలో ఇప్పటివరకూ 100 చేశారు. ప్రస్తుతం కాన్పులకు వచ్చే వారిని చేర్చుకోవటం లేదు. ఈ ఉద్యోగం.. మాకొద్దు... భద్రాచలం ఏరియా ఆసుపత్రి సామర్ధ్యం మేరకు 66 మంది వైద్యులు ఉండాలి. కానీ, ప్రస్తుతం ఇక్కడ 16 మంది మాత్రమే ఉన్నారు. ఇటీవలి నియామకాల్లో 19 మంది స్పెషలిస్ట్ డాక్టర్లను ఇక్కడకి పంపించారు. ఇందులో ఎనిమిది చెప్పాపెట్టకుండా వెళ్లిపోయారు. ఏరియా ఆసుపత్రికి రోజుకు 600 వరకూ రోగులు వస్తుండం, ఇందులో 160 వరకూ ఇన్పేషంట్స్గా ఉంటుండటంతో వైద్యులపై తీవ్రమైన పని భారం పడుతోంది. ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో కూడా ఒకరిద్దరు మరికొన్ని రోజుల్లో ఇక్కడ నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో, సాధారణ వైద్య సేవలను కూడా స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ అందిస్తున్న పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ వంటి చోట్ల నుంచి వచ్చి క్షణం తీరిక లేని ఉద్యోగం చేయటం తమ వల్లకాదని ఓ వైద్యుడు ‘సాక్షి’తో అన్నారు. నిబంధనలు కూడా మరీ కఠినతరంగా ఉండటంతో ఇక్కడ పనిచేయలేమన్నారు. వీరికి సహాయకారులుగా నర్సింగ్ సిబ్బంది కూడా లేరు. 64 మంది నర్సింగ్ సిబ్బంది ఉండాలి. కానీ ఇందులో 15 మంది మాత్రమే ఉన్నారు. నర్సింగ్ శిక్షణ కోసమని వచ్చే విద్యార్థుల సహకారంతో ఓపీ విభాగాన్ని నెట్టుకొస్తున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పటికీ ఉన్నతాధికారులు ఎందుకు దీనిపై దృష్టి సారించటం లేదనేది అంతుపట్టని ప్ర«శ్నగా మిగిలింది. -
హెచ్ఐవీ లేకున్నా ఉన్నట్లు రిపోర్టు
సాక్షి, రాజమండ్రి : ఓ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైంది. చికిత్స నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో చేరిన ఓ గర్భిణీ మహిళకు హెచ్ఐవీ లేకున్నా ఉందంటూ వైద్యులు రిపోర్టు ఇచ్చారు. ఊహించని రిపోర్టు రావడంతో బాధిత కుటుంబం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఐతే వైద్యుల రిపోర్టుపై నమ్మకం లేకపోవడంతో ప్రైవేటు ల్యాబ్‌లో మరోసారి పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టులో మహిళకు హెచ్ఐవీ లేనట్లు తేలింది. దీంతో ఊపిరి పీల్చుకున్న మహిళ.. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు మరీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అంటూ బాధిత కుటుంబం ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగింది. ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ వారి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. వారి నిర్లక్ష్యం కారణంగా ఇలా ఎంతమందికి తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారో అంటూ ఆసుపత్రి వర్గాలపై మండిపడుతున్నారు. కాగా ఘటనతో రోగులు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటేనే తీవ్ర భయాందోళనకు గురైతున్నారు. -
ప్రభుత్వాస్పత్రిలో బెడ్‌పై నుంచి పడి బాలింత మృతి
-
ప్రభుత్వ ఆస్పత్రా.. మద్యం దుకాణమా?
సాక్షి, అనంతపురం : పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు బరితెగించారు. పట్టపగలు ప్రభుత్వ ఆస్పత్రిలోనే మద్యం తాగుతూ అడ్డంగా దొరికిపోయారు. ప్రభుత్వ డాక్టర్ ఆనంద్ బాబు, మరో నలుగురు సిబ్బంది వైద్య సేవలు పక్కనపెట్టి.. రోగులను గాలికొదిలేసి.. ఆస్పత్రిలోనే పేకాట ఆడుతూ, మద్యం సేవిస్తూ జల్సా చేశారు. దీంతో ఆస్పత్రిలో ఎటుచూసినా మద్యం బాటిళ్లు, పేకాట కార్డులు దర్శనమిస్తున్నాయి. వైద్యుల తీరుపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రోగుల అవస్థలను పట్టించుకోకుండా ఆస్పత్రిలోనే అసాంఘిక కార్యకలాపాలకు దిగడం దారుణమని, ఇది ఆస్పత్రా.. మద్యం దుకాణామా? అని నిలదీశాయి. ఆస్పత్రిలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
మార్చురీ పక్కన అన్నా క్యాంటీన్‌పై తీవ్ర విమర్శలు
-
గర్భక్షోభ
-
నాణ్యత నగుబాటు
సాక్షి, కర్నూలు : ఉన్నట్టు తెలుస్తోంది. వేస్తున్న రోడ్డు కూడా క్రమబద్ధంగా కాకుండా వంకర టింకర్లుగా సాగుతోంది. ఇందుకు అధికారులు కూడా అభ్యంతరం తెలపడం లేదు. వారు కనీసం పనులు జరిగే ప్రదేశాన్ని తనిఖీ చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కంకర వేశారు... రోడ్డు మరిచారు! పెద్దాసుపత్రి అంతటా అంతర్గతంగా సీసీ రోడ్లను వేసేందుకు రూ.2 కోట్లతో మొదటిసారి టెండర్ పిలిచారు. అయితే, ఒక్కరే వచ్చారనే కారణంగా రెండోసారి టెండర్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఈసారి షెడ్యూళ్లు దాఖలు చేసిన ఇద్దరు, ముగ్గురు కాంట్రాక్టర్లను రింగు చేసి.. అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరుడికే దక్కేలా చేశారనే ఆరోపణలున్నాయి. మరోవైపు రోజులు గడుస్తున్నప్పటికీ పనులను ప్రారంభించకుండా జాప్యం చేస్తూ వచ్చారు. ఉన్న రోడ్లనూ తీసేయడంతో రోగులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఎన్టీఆర్ వైద్య సేవతో పాటు వివిధ పరీక్షల కోసం మెడాల్ యూనిట్ వద్దకు వెళ్లేందుకు ఉన్న దారిలో కంకర వేసి నెల రోజులు గడుస్తున్నాయి. రోగులే రోలర్లు! ఏదైనా సీసీ రోడ్డును వేసే సమయంలో మొదట జేసీబీతో ఒక లెవల్‌గా చేస్తారు. అనంతరం కంకర, డస్ట్ వేస్తారు. దీనిపై రోలర్‌తో రోల్ చేస్తారు. ఈ విధంగా నాలుగైదు రోజులు చేసిన తర్వాత సీసీ రోడ్డు నిర్మాణాన్ని చేపడతారు. అయితే, ఇక్కడ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా జరుగుతోంది. మొదటగా కంకర వేశారు. అది కూడా చిన్నరకం కంకర వాడుతున్నారు. దీనిపై కనీసం డస్ట్ కూడా వేయలేదు. రోడ్డు రోలర్‌తో తిప్పిన దాఖలాలు అసలే లేవు. ఈ కంకర మీద రోగులు, స్ట్రెచర్లు, రోగుల సంబంధీకులు నడవడంతో రోలింగ్ అవుతున్న పరిస్థితి కన్పిస్తోంది. కనీసం రోలింగ్ చేస్తే రోడ్డు పూర్తయ్యే వరకూ కనీసం నడిచేందుకు రోగులకు ఇబ్బంది ఉండదు. అధికారులు మాత్రం ఆ వైపు కనీస చర్యలు తీసుకోవడం లేదు. కాంట్రాక్టర్‌ను ఏమైనా అంటే ఎక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే నుంచి చీవాట్లు ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని జంకుతున్నట్టు ప్రచారం సాగుతోంది. నాణ్యతలో రాజీ లేదు పెద్దాసుపత్రి అంతర్గత రోడ్ల నిర్మాణం నాణ్యతలో ఎటువంటి రాజీ లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం ఒక లేయర్లో రోడ్డు నిర్మాణం జరుగుతోంది. దీనిపై మరో లేయర్ వస్తుంది. ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి.. నిబంధనల మేరకు ఉండేలా చూస్తాం. – విజయభాస్కర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఏపీఎంఎస్ఐడీసీ -
జన్మదిన వేడుకల్లో అపశ్రుతి
సాక్షి, కశింకోట : కశింకోటలోని హౌసింగ్ కాలనీలో జరిగిన ఓ జన్మదిన వేడుకల్లో ఆహారం విషపూరితమై సుమారు 18 మంది చిన్నారులు శనివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. వారిని అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. హౌసింగ్ కాలనీలో ఒక చిన్నారికి జన్మదిన వేడుకలు జరగ్గా దానికి హాజరైన పిల్లలు కేక్ తిని, రస్నా తాగిన తర్వాత వాంతులై అస్వస్థతకు గురయ్యారు. వీరిలో వినయ్, డి.గణేష్, డి.సాయి, డి.మనోహర్, మానశ్రీ, లేఖిని, దుర్గా, వినయ్, తదితరులు ఉన్నారు. వీరంతా రెండు నుంచి పదేళ్లలోపు వయస్సు వారే. వీరిని తల్లిదండ్రులు, స్థానికులు వెంటనే అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, చికిత్స అందించి పంపించామని అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. -
విజయవాడ: పాత ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం
సాక్షి, విజయవాడ : నగరంలోని పాత ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రి వచ్చిన ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వైద్యులు నిర్లక్ష్యంగా చికిత్స అందించడంతో.. వైద్యం వికటించి చిన్నారులు ప్రాణాలు కోల్పోయరని చిన్నారుల బంధువులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రి ముందు బైఠాయించి.. వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతిచెందిన చిన్నారుల్లో ఒకరిది జీకొండూరు కాగా, మరొక చిన్నారిది విజయవాడ. గత నాలుగు రోజులుగా అస్వస్థతతో ఉండటంతో చిన్నారులను ఆస్పత్రికి తీసుకొచ్చామని, వైద్యులు నిర్లక్ష్యంగా వైద్యం అందించడంతో పిల్లలు ప్రాణాలు కోల్పోయారని వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరై విలపిస్తున్నారు. మరోవైపు ఆస్పత్రి వైద్యులు మాత్రం.. ఇద్దరు పిల్లలు అనారోగ్యంతోనే చనిపోయారని అంటున్నారు. పిల్లలకు అనారోగ్యంగా ఉన్న సంగతి ముందుగానే వారి తల్లిదండ్రులకు తెలియజేశామని, ఈ ఘటనలో ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం లేదని చెప్తున్నారు. -
తల్లిపై కిరోసిన్ పోసిన కూతురు
సిద్దిపేటరూరల్ : పేగు తెంచుకొని పుట్టిన కూతురు.. కన్నపేగుపైనే నిప్పులు కురిపించింది. తల్లిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఈ ఘటన సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్‌లో చోటుచేసుకుంది. రాఘవాపూర్కి చెందిన గ్యార లచ్చవ్వ (55), భర్త మల్లయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు. కుమారులు సిద్దిపేటలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుండగా, ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేశారు. మూడో కూతురైన గ్యార సునీత ఇంటి దగ్గరే ఉంటూ ఓ ఆసుపత్రిలో పనిచేస్తోంది. గురువారం ఉద యం తల్లి కూలీ పనికి, సునీత ఆసుపత్రికి వెళ్లారు. రాత్రి పని ముగించుకొని ఇంటికి వచ్చిన కూతురుతో కుటుం బానికి సంబంధించి విషయమై లచ్చవ్వ గొడవ పడింది. గొడవ పెద్దది కావడంతో, విచక్షణ కోల్పోయిన సునీత పక్కనే ఉన్న కిరోసిన్ డబ్బాను తీసుకుని తల్లిపై కిరోసిన్ గుమ్మరిం చింది. ఆపై అగ్గిపుల్ల గీసి నిప్పంటిం చింది. ఒక్కసారిగా ఇంటినిండా మం టలు వ్యాపించాయి. కాలిన గాయాల తో లచ్చవ్వ కేకలు వేసింది. ఇరుగుపొరు గు వారు వచ్చి మంటలను ఆర్పారు. అప్పటికే సగానికిపైగా కాలిపోయిన లచ్చవ్వను అంబులెన్స్‌లో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. 90 శాతం కాలిన గాయాలతో ఆమె చికిత్స పొందుతోంది. 24 గంటలు గడిచే వరకు ఏం చెప్పలేమని వైద్యులు చెప్పారు. -
ప్రభుత్వాస్పత్రిలో పురుటి కష్టాలు
-
ఆస్పత్రి డ్రైనేజిలో ప్రసవించిన మహిళ
కొరాపుట్ : ఓ ఆదివాసీ మహిళ అత్యంత దయనీయ స్థితిలో ఆస్పత్రి ప్రాంగణంలోని డ్రైనేజీలో ప్రసవించిన సంఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. కొరాపుట్ జిల్లా దస్మంత్పూర్ బ్లాక్, జానిగూడకు చెందిన మహిళ.. తన తల్లి, సోదరితో కలిసి శుక్రవారం జిల్లా కేంద్రంలోని లక్ష్మణ్ నాయక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (ఎస్ఎల్ఎన్ఎంసీహెచ్)కు వచ్చారు. జ్వరంతో బాధపడుతూ అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న తన భర్తను చూసేందుకు వచ్చిన ఆమెకు ఒక్కసారిగా నొప్పులు మొదలయ్యాయి... కుటుంబీకులు ఆమెను గైనకాలజీ వార్డుకు తీసుకెళ్లగా.. చికిత్స అందించేందుకు సిబ్బంది నిరాకరించారు. నొప్పులను దిగమింగుతూ ఆస్పత్రి బయటికి వచ్చేసిన ఆ మహిళ.. పక్కనున్న డ్రైనేజీలో పాపకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కొద్దిసేపటికి సిబ్బంది స్పందించి, వారిని లోనికి తీసుకెళ్లారు. ‘‘పిల్లకు నొప్పులుస్తున్నాయని ఎంత ప్రాధేయపడినా వాళ్లు వినలేదు. ఇంతకుముందు డాక్టర్ దగ్గర చూపించుకున్న కాగితాలు తెమ్మని అడిగారు. మా ఊరు చాలా దూరం అప్పటికప్పుడు తేలేమన్నా వినిపించుకోలేదు’’ అని బాధిత మహిళ తల్లి మీడియాతో చెప్పారు. మూత్రవిసర్జనకు వెళ్లి.. : కాగా, డ్రైనేజీలో ప్రసవం ఘటనపై ఉన్నతాధికారులు భిన్నంగా స్పందించారు. వారసలు గైనకాలజీ వార్డుకే రాలేదని, మూత్రవిసర్జన కోసం వెళ్లి డ్రైనేజీలో బిడ్డను కన్నారని కొరాట్పూర్ జిల్లా వైద్య అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ప్రసవం తర్వాత మహిళను ఆస్పత్రిలోకి తీసుకెళ్తున్న సిబ్బంది -
నాన్నతో సర్కార్ ఆసుపత్రికి
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అధికార హడావుడి లేదు. ఎలాంటి హంగామా లేదు. కారు నుంచి దిగిన ఓ వ్యక్తి తన తండ్రిని తీసుకొని అత్యంత సాధారణంగా సర్కారు దవాఖానకు వెళ్లారు. అప్పటికే విరిగిన చేతికి పట్టీ కట్టి ఉండడంతో అవసరమైన పరీక్షలు, ఇతర సేవలకు సంబంధించి డాక్టర్లతో మాట్లాడి కలెక్టరేట్లో జరిగే సమావేశం కోసం కారెక్కి వెళ్లిపోయారు. డాక్టర్, ఇతర సిబ్బంది చేయి విరిగిన వ్యక్తిని పరీక్షల కోసం ల్యాబ్‌కు తీసుకెళ్లారు. ఇది మంచిర్యాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద మంగళవారం ‘సాక్షి’ కంటికి చిక్కిన దృశ్యం. కారులో తండ్రితో కలిసి వచ్చిన వ్యక్తి... మంచిర్యాల జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో ఆర్వీ.కర్ణన్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరుగుదలలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపి ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి అభినందనలు అందుకొన్న కర్ణన్ ఇప్పుడు స్వయంగా ఆచరించి చూపారు. మారుమూల గ్రామాల ప్రజలను ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లేలా చేయడమే కాదు... తనే స్వయంగా తన తండ్రిని మంచిర్యాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కలెక్టర్ కర్ణన్ తన తండ్రి వీరరాఘవన్‌ను ఆసుపత్రికి తీసుకొస్తూ మంగళవారం ‘సాక్షి’ కంట పడినప్పటికీ... ఆదివారం నుంచి మూడు రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతిరోజు తీసుకొస్తూ ఆర్థో స్పెషలిస్ట్ డాక్టర్ అరవింద్ వద్ద చికిత్స చేయిస్తున్నారు. తండ్రి చేయికి ఫ్యాక్షర్ కావడం... తమిళనాడులో నివసించే కలెక్టర్ కర్ణన్ తండ్రి వీరరాఘవన్ ఇంట్లో కింద పడడంతో చేయి ఎముక విరిగినట్లయింది. ఈ విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ ఆయనను మంచిర్యాలకు రప్పించారు. గత ఆదివారం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ఆర్థో స్పెషలిస్ట్ డాక్టర్ అరవింద్‌కు చూపించారు. చేయి ఎముక తొలగినట్లు (డిస్లొకేట్) అయినట్లు తేలడంతో చేతికి సిమెంట్ పట్టీ వేసి పంపించారు. సోమ, మంగళవారాలు కూడా కలెక్టరే స్వయంగా తండ్రిని తీసుకొని ఆసుపత్రికి వచ్చినట్లు డాక్టర్ అరవింద్ ‘సాక్షి’తో మాట్లాడుతూ ధ్రువీకరించారు. బుధవారం చేతికి శస్త్రచికిత్స జరుపనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తన తండ్రికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్న విషయాన్ని కూడా కలెక్టర్ గోప్యంగానే ఉంచడం గమనార్హం. తండ్రికి సేవ చేయడం తన విధి తప్ప ప్రచారం కాదు... అనే ధోరణిలోనే ఆయన వ్యవహారశైలి కనిపించింది. ఫొటో తీయడానికి కూడా కలెక్టర్ ఒప్పుకోలేదు. -
సేవలు.. అపస్మారకం
తని పేరు భాస్కర్(30). నగరంలోని నాయక్‌నగర్ నివాసి. తీవ్ర అనారోగ్యంతో ప్రభుత్వాసుపత్రిలోని ఏఎంసీలో చికిత్స పొందుతున్నాడు. శనివారం ఉదయం నుంచి విద్యుత్ సరఫరాలో అంతరాయం వల్ల వెంటిలేటర్ పనిచేయకపోవడంతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థిని అంబూబ్యాగ్ సహాయంతో శ్వాసను అందించడంతో పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చింది. అనంతపురం న్యూసిటీ: సీజనల్ వ్యాధులు.. డెంగీ.. డయేరియా.. ఇతరత్రా రోగాలు జిల్లా ప్రజలను పట్టిపీడిస్తున్నాయి. ప్రతి రోజూ మరణాల సంఖ్య పదుల సంఖ్యలో ఉంటోంది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి సేవలే పెద్దదిక్కు. ఇక్కడ రోజూ 2వేల మంది ఔట్ పేషెంట్లు, 1200 వరకు ఇన్‌పేషెంట్లు చికిత్స పొందుతుంటారు. ఇటీవల ఇక్కడ గంటల వ్యవధిలో తొమ్మిది మంది మృత్యువాత పడటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వైద్యుల కొరతతోనే ఈ పరిస్థితి నెలకొందనే విషయం ఆ సందర్భంగా బట్టబయలైంది. ఇప్పటికీ ఆసుపత్రిలో వైద్యుల కొరత అలానే ఉండిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు తన సొంత నియోజకవర్గం రాయదుర్గంలో తల్లి స్మారకార్థం శనివారం ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న శిబిరం అభినందనీయమే అయినా.. ప్రభుత్వ విధుల్లోని వైద్యుల సేవలను వినియోగించుకోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌తో పాటు 51 మంది వైద్యులు ఆ శిబిరంలో సేవలందిస్తున్నారు. వీరిలో 32 మంది రెగ్యులర్ వైద్యులు కాగా.. 19 మంది హౌస్ సర్జన్లు. వాస్తవానికి ప్రభుత్వ వైద్య కళాశాలకు 255 మంది వైద్యులు అవసరం కాగా.. ప్రస్తుతం 174 మంది వైద్యులు మాత్రమే ఉన్నారు. వీరిలో 80 నుంచి 90 మంది సర్వజనాసుపత్రిలో పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కళాశాల నుంచి ముగ్గురు మాత్రమే డెప్యూట్ కాగా.. ఆసుపత్రి నుంచే అధిక సంఖ్యలో వైద్యులను తరలించడం గమనార్హం. స్తంభించిన వైద్య సేవలు వైద్యులు లేకపోవడంతో ఆస్పత్రిలో వైద్య సేవలు స్తంభించాయి. ఏఎంసీ, ఎమర్జెన్సీ, లేబర్, ఆంటీనేటల్, చిన్న పిల్లల విభాగం, ఆర్థో, ఐడీ తదితర వార్డుల్లో వైద్యులు పూర్తి స్థాయిలో లేరు. ఇక హౌస్ సర్జన్ల బాధ్యత స్టాఫ్‌నర్సులు నిర్వహించడం గమనార్హం. రేడియాలజీ, రక్త పరీక్షలకు బ్రేక్ పడింది. రోజూ 40 నుంచి 50 స్కానింగ్, 180 ఎక్స్‌రేలు, 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో సగం సేవలు కూడా శనివారం అందకపోవడం చూస్తే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతోంది. చివరకు అత్యవసర స్కానింగ్‌లను బయటకు పంపారు. కరెంటు కష్టాలు ఆస్పత్రిలో ఉదయం నుంచి కరెంటు కష్టాలతో రోగులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఏఎంసీ, ఎమర్జెన్సీ వార్డు, కాన్పుల వార్డు, చిన్నపిల్లల విభాగం, గైనిక్, రేడియాలజీ విభాగాల్లో కరెంటు పోయింది. ఆస్పత్రికి విద్యుత్ సరఫరా చేసే కేబుల్ కాలిపోవడంతో ఈ సమస్య తలెత్తింది. ఇద్దరు టెక్నీషియన్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడటంతో సమస్య ఓ కొలిక్కి వచ్చింది. ట్రాన్స్‌కో అధికారులు కూడా ఆలస్యంగా స్పందించినట్లు తెలుస్తోంది. అదే సూపరింటెండెంట్ అందుబాటులో ఉంటే సకాలంలో వైద్య సేవలు అందడంతో పాటు సమస్యను త్వరితగతిన పరిష్కరించే అవకాశం ఉండేదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఎలాంటి సమస్యా లేదు తక్కువ సంఖ్యలోనే వైద్యులను శిబిరానికి డిప్యూట్ చేశాం. రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. హౌస్‌సర్జన్లనే అధికంగా శిబిరానికి పంపాం. రేపు ఎలానూ ఆదివారమే. ఇబ్బందేమీ లేదు. – డాక్టర్ జగన్నాథ్, సూపరింటెండెంట్, సర్వజనాస్పత్రి -
ప్రభుత్వాస్పత్రిలో ఒక్క నెలలో 245 మంది మృతి
-
ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టిన మరోబస్సు
16 మందికి గాయాలు... స్తంభించిన ట్రాఫిక్ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : కర్నూలు నగర శివారులోని రేడియో స్టేషన్ వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న సంఘంటనలో 16 మంది గాయాలకు గురయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు నుంచి వెళ్తున్న ఎమ్మిగనూరు డిపో బస్సును కర్నూలు–2 డిపో బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఎమ్మిగనూరు బస్సు బోల్లా పడగా..కర్నూలు బస్సు ముందు భాగం దెబ్బతింది. ఈ ప్రమాదంలో రెండు బస్సుల్లోని 16 మంది ప్రయాణికులు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎమ్మిగనూరు డిపో బస్సు ఆకస్మికంగా ఆగడంతోనే ప్రమాదం జరిగినట్లు కర్నూలు డిపో బస్సు డ్రైవర్ ఈశ్వరయ్య తెలిపారు. ఈ ప్రమాదంతో ట్రాఫిక్ స్తంభించగా పోలీసులు క్రమబద్ధీకరించారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని రాత్రి జిల్లా ఎస్పీ గోపీనాథ్‌జెట్టీ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. -
ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం!
-
ఎమ్మెల్యే భార్యే అయినా...
సాలూరు: ఆయనో ఎమ్మెల్యే. ఆయనకు గానీ... ఆయన కుటుంబ సభ్యులకు గానీ చికిత్స చేయించాలంటే ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లొచ్చు. కానీ సహజంగానే నిరాడంబరుడైన సాలూరు ఎమ్మెల్యే(వైఎస్సార్సీపీ) పీడిక రాజన్నదొర మాత్రం స్థానిక ప్రభుత్వాస్పత్రిలోనే తన సతీమణికి చికిత్స చేయించిన సంఘటన ఇది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రాజన్నదొర సతీమణి రోజారాణి పాచిపెంట మండలంలో పాఠశాల ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. ఆమె మంగళవారం ఉదయం పాఠశాలకు ద్విచక్రవాహనంపై వెళుతుండగా రోడ్డుపై అకస్మాత్తుగా పాము కనిపించడంతో కంగారుపడి కిందపడ్డారు. ఈ దశలో ఆమె తల వెనుకభాగం, కాలు, చేతులకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఏమాత్రం సంకోచించకుండా ఆమెను సాలూరు పట్టణ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు రామ్మూర్తి, అప్పలనాయుడు ప్రధమచికిత్స చేసి, తదుపరి వైద్యపరీక్షల కోసం విజయనగరం తరలించాలని సూచించడంతో ఆయన విజయనగరానికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే భార్యను వైద్యం కోసం సామాన్యుడిలా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. పట్టణంలో ప్రైవేటు ఆసుపత్రులున్నా, ఆక్కడికి వెళ్లకుండా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురావడంపై ఆయన్ను విలేకరులు ప్రశ్నించగా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యంపైనా, వైద్యులపైనా వున్న నమ్మకమే కారణమని బదులిచ్చారు. -
డాక్టర్ల నిర్లక్ష్యంతో వడదెబ్బ బాధితుల మృతి
పాలకొల్లు సెంట్రల్ : వడదెబ్బ తగిలిన ఇద్దరు బాధితులు పాలకొల్లు ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యంతో మృతి చెందిన ఘటన శనివారం వెలుగుచూసింది. పట్టణంలోని వెలమగూడెంకు చెందిన అంగ కామేశ్వరరావు (60) వడదెబ్బతో కళ్లుతిరిగి పడిపోవడంతో శుక్రవారం మధ్యాహ్నం బంధువులు ఆస్పత్రిలో చేర్చారు. యలమంచిలి మండలం మేడపాడు గ్రామానికి చెం దిన యార్లగడ్డ ఏసురత్నం (50) అనే రిక్షా కార్మికుడు కూడా వడదెబ్బతో సొమ్మసిల్లి పడిపోవడంతో బంధువులు ఇక్కడికి తరలించారు. వీరిద్దరినీ వైద్యులు సాధారణ వార్డుల్లో ఉంచి చికిత్స చేశారు. అయితే ఐసీయూలో ఉంచినట్టు రికార్డుల్లో చూపించారు. ఈ క్రమంలో శనివారం వేకువ జా మున 4.30 గంటలకు అంగ కామేశ్వరరావు, 6.30 గంటలకు ఏసురత్నం మృతి చెందినట్టు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే వీ రిద్దరూ మృతిచెందినట్టు బంధువులు ఆరోపించారు. -
అత్యవసరమైతే నరకమే!
► క్యాజువాలిటీలో కుట్టు వేసే కిట్లకు కొరత ► ఏఎంసీలో పడకల కొరత ► అందుబాటులో లేని స్ట్రెచ్చర్లు, వీల్చైర్లు ► వార్డుబాయ్‌ల సంఖ్య అంతంతే.. ► స్పందించని అధికారులు ఏదైనా ప్రమాదంలో, దాడిలో గాయపడి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు అత్యవసర చికిత్సకు వెళ్లారా? అయితే మీలో సహనం కాస్త ఎక్కువగా ఉండాల్సిందే. ఎందుకంటే.. మరో నలుగురైదుగురు అక్కడ అప్పటికే చికిత్స పొందుతుంటే మీరు వేచి ఉండకతప్పదు. కారణం.. అత్యవసరంగా కుట్లు వేయాల్సిన కిట్లు అవసరమైనన్ని లేవు మరి. దీనికి తోడు పడకల కొరతతో రోగులకు ప్రత్యక్ష నరకం కనిపిస్తోంది. కర్నూలు(హాస్పిటల్): ఆసుపత్రిలోని క్యాజువాలిటీకి ప్రతిరోజూ అత్యవసర చికిత్స కోసం 100 నుంచి 150 మంది దాకా వస్తుంటారు. వీరికి అక్కడ ఉండే క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్‌తో పాటు డ్యూటీ డాక్టర్లైన ఫిజీషియన్లు, సర్జన్లు, ఆర్థోపెడిస్ట్, ఇదే విభాగాల నుంచి పీజీలు, హౌస్ సర్జన్లు సేవలందించాల్సి ఉంటుంది. ఒకేసారి ఎక్కువ మంది అత్యవసర చికిత్స నిమిత్తం వస్తే వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని బట్టి చికిత్స అందిస్తూ వస్తారు. కొన్నిసార్లు రక్తగాయాలైన వారు అధిక సంఖ్యలో వస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు. గాయాలకు కుట్లు వేసే కిట్లు(సూటు ప్యాక్స్) లేదా 10, 20, 30 ప్రోలైన్లు కొరత ఉండటంతో రోగులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వీటిని కొనుగోలు చేయాలని ఆసుపత్రి సిబ్బంది పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నా స్పందన కరువైంది. ఒక్కో కిట్టు ధర రూ.500లకు మించదు. ఆసుపత్రిలో అత్యవసరం కాని పరికరాలకు లక్షల రూపాయలు వెచ్చిస్తుండగా.. రోగులకు అత్యవసర చికిత్సనందించే ఇలాంటి కిట్లకు మాత్రం నిధుల కొరతను సాకుగా చూపడం విమర్శలకు తావిస్తోంది. దీనికితోడు క్యాజువాలిటీలోని ఎమర్జెన్సీ ఓపీలో ఏసీ, ఫ్యాన్లు సరిగ్గా పనిచేయకపోవడంతో అటు చికిత్స అందించే వైద్యులు, రోగులు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. ఏఎంసీలో బెడ్ల కొరతతో పడిగాపులు అత్యవసర చికిత్స కోసం వచ్చిన రోగులకు ముందుగా క్యాజువాలిటీలో ప్రాథమిక వైద్యం అందిస్తారు. అనంతరం వీలును బట్టి రోగులను అక్యూట్ మెడికల్ కేర్(ఏఎంసీ)లో చేరుస్తారు. ఏఎంసీలో 40 పడకలు ఉన్నాయి. అయితే నిత్యం ఈ పడకలు రోగులతో నిండి ఉంటాయి. క్యాజువాలిటీకి అత్యవసర చికిత్స నిమిత్తం వచ్చిన రోగిని ఏఎంసీలో చేర్చాలంటే అక్కడున్న రోగులను సాధారణ వార్డులకు తరలించాల్సి ఉంటుంది. ఒక్కోసారి రోగులందరూ ఏఎంసీలో ఉండాల్సిన పరిస్థితి నెలకొన్న సమయంలో ఎవరిని సాధారణ వార్డుకు తరలించాలో వైద్యులకు అర్థం కాని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ధైర్యం చేసి కాస్త బాగైన రోగులను సాధారణ వార్డుకు తరలించి పడకలు ఖాళీ చేసి, క్యాజువాలిటీ రోగుల కోసం ఉంచుతున్నారు. ఏఎంసీలో బెడ్లు ఖాళీగా మారేంత వరకు క్యాజువాలిటీలోనే అవసరమైన చికిత్స అందక రోగులు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడాల్సి వస్తుంది. ఏఎంసీకి ప్రభుత్వ గుర్తింపు లేకపోవడంతో ఇప్పటికీ ఇది అనధికారికంగానే కొనసాగుతోంది. గుర్తింపు లేకపోవడంతో మెడికల్ విభాగాల నుంచి వైద్యులు రెఫరల్ పద్ధతిలో ఇక్కడ సేవలు అందిస్తున్నారు. ఎమెర్జెన్సీ మెడిసిన్ విభాగం మంజూరైతే గానీ రోగులకు ఇబ్బందులు తీరని పరిస్థితి నెలకొంది. స్ట్రెచ్చర్లు, బాయ్స్ కొరత క్యాజువాలిటీకి అత్యవసర చికిత్స కోసం వచ్చి వార్డు బాయ్ వస్తాడు, స్ట్రెచ్చర్ తెస్తాడని ఎదురుచూస్తే రోగి ప్రాణం బయటే పోయినట్లే. అందుకే చాలా మంది క్యాజువాలిటీకి వెళ్లాలంటే రోగులను నడిపించుకుంటూనో.. లేదా చేతులపై, భుజాలపై మోసుకుని వెళ్తుంటారు. క్యాజువాలిటీ నుంచి ఇతర వార్డులకు, వైద్యపరీక్షలకు వెళ్లాలన్నా స్ట్రెచ్చర్లు, వీల్చైర్ల కొరత తీవ్రంగా ఉంది. ఈ కారణంగా గంటల తరబడి రోగులు స్ట్రెచ్చర్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా వార్డుబాయ్స్ కొరత కూడా ఉండటంతో శానిటేషన్ వర్కర్లు రోగులను పరీక్షలకు, వార్డులకు తరలిస్తూ కనిపించడం ఇక్కడ పరిపాటిగా మారింది. -
ప్రసవాలపై ప్రభుత్వ ఆసుపత్రి ప్రత్యేక శ్రద్ధ
-
ప్రభుత్వాసుపత్రిలో యువకుల విధ్వంసం
కొవ్వూరు : కొవ్వూరు ప్రభుత్వాసుపత్రిలో గురువారం అర్ధరాత్రి సమయంలో పట్టణానికి చెందిన యువకులు కర్రలతో అద్ధాలు పగలకొట్టి విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనను నిరసిస్తూ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది శుక్రవారం నల్లరిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలో రెండు వర్గాల యువకుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఒక వర్గం యువకులు చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరారు. తమపై దాడి చేసి ఆసుపత్రికి వచ్చారని, పోలీసులకు ఫిర్యాదు చేశారనే ఆరోపణతో మరో వర్గానికి చెందిన యువకులు ముకుమ్మడిగా ఆసుపత్రికి చేరుకున్నారు. కర్రలు పట్టుకుని ఆసుపత్రి ప్రవేశ ద్వారం వద్ద ఉన్న అద్ధాలు పగలకొట్టారు. లోపలికి ప్రవేశించి హల్చల్ చేశారు. ఆసుపత్రి బయట ఉన్న మోటారు సైకిళ్లను ధ్వంసం చేసి వెళ్లిపోయారు. ఈ పరిణామాలపై వైద్యులు, సిబ్బంది ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్ఎస్వీ రామకృష్ణారావు మాట్లాడుతూ ఆసుపత్రిలో విధి నిర్వహణలో ఉన్న వైద్య సిబ్బందిని, రోగులను భయబ్రాంతులకు గురిచేసిన యువకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిబ్బంది మోటారు సైకిళ్లను ధ్వంసం చేయడం అమానుషమన్నారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వైద్య ఉద్యోగుల సంఘం నాయకురాలు హెప్సిబా మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్య సిబ్బందికి రక్షణ లేకుండా పోయిందన్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కంఠమణి రామకృష్ణ, నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, కమిటీ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. పట్టణ సీఐ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని నాయకులు, వైద్యులకు ఆయన హామీ ఇచ్చారు.సీసీ కెమెరా పుటేజీలను సీఐ పరిశీలించారు. -
ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగించాలి
► మహిళల పక్షపాతి సీఎం కేసీఆర్ ► మంత్రి గుంటకండ్ల గర్భిణులకు సామూహిక శ్రీమంతం సూర్యాపేట : ప్రభుత్వ వైద్యంపై దశాబ్ధాల నుంచి నెలకొన్న అనుమానాన్ని తొలగించి.. నమ్మకం కలిగించే ప్రక్రియలో ఎన్జీఓలు, ఎస్‌హెచ్‌జీ సంస్థలు కృషి చేయాలని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని 12వ వార్డు అంబేద్కర్‌నగర్ ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. పేద, మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు తెలిపారు. గుండె మార్పిడీ శస్త్రచికిత్స మనదేశంలో మొదటగా ప్రభుత్వ ఆస్పత్రిలోనే చేశారని గుర్తుచేశారు. ఆధునిక పరికరాలు, నిపుణులు ప్రభుత్వ రంగంలోనే ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి కంటి పరీక్ష చేయించుకున్నారు. అనంతరం గర్భిణులకు నిర్వహించిన సామూహిక శ్రీమంతంలో ఆయన పాల్గొని పూలు, పండ్లు అందజేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ మహిళల పక్షపాతి అని.. సృష్టికి మూలమైన స్త్రీ ఆరోగ్యంగా ఉంటేనే భవిష్యత్ తెలం గాణ సమాజం ఆదర్శంగా ఉంటుం దన్న.. సంకల్పంతో ప్రభుత్వాçస్పత్రుల్లో ప్రసవం చేసుకునే వారికి రూ.12 వేల ఆర్థికసాయం అందించాలని నిర్ణయించారని అన్నారు. తల్లీబిడ్డకు మూడు నెలల పాటు ఉపయోగపడే 16 రకాల వస్తువులతో కూడిన సీఎం కేసీఆర్ కిట్‌ను అందించనున్నట్లు తెలి పారు. కలెక్టర్ సురేంద్రమోహన్ మాట్లాడుతూ జిల్లాలోని 23 పీహెచ్సీ, రెండు ఏరియాస్పత్రులు, ఒక కమ్యూనిటీ ఆస్పత్రిని ఏడాదిలో ఆధునికీకరించనున్నట్లు తెలిపారు. రాజీవ్‌నగర్, గిరినగర్, అంబేద్కర్‌నగర్ అర్బన్ హెల్త్ సెంటర్లను ఆధునికీకరించేందుకు మం త్రి తన నిధుల నుంచి రూ.50 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగా రక్తాన్ని సరఫరా చేసేందుకు ముం దుకు వచ్చిన రెండ్‌క్రాస్ సొసైటీని అభినందించారు. వైద్యులు, రోగులకు సహకరించేందుకు వలంటీర్లను నియమిస్తున్న స్ఫూర్తిక్లబ్ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిప ల్ చైర్పర్సన్ గండూరి ప్రవళిక, ఏఎంసీ చైర్మన్ వైవి, డీఎంహెచ్ఓ తండు మురళీమోహన్, నాయకులు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, గండూరి ప్రకాష్ పాల్గొన్నారు. -
చస్తే యాభై వేలు వస్తుందిలే..!
మచిలీపట్నంలో ప్రభుత్వ డాక్టర్ నిర్లక్ష్యానికి చిన్నారి బలి మచిలీపట్నం టౌన్(మచిలీపట్నం): స్థానిక జిల్లా ప్రభుత్వాసుపత్రి వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగా ఓ పసివాడి ప్రాణం గాల్లో కలిసిపోయింది. పాము కాటేసిం దని తీసుకెళ్తే.. పుల్లలు గుచ్చుకుని ఉంటా యని వైద్యం అక్కర్లేదంటూ ఇంటికి పంపించడంతో ఆ చిన్నారి మృత్యువాత పడ్డాడు. ఏపీలోని కృష్ణాజిల్లా మచిలీప ట్నం మండలం నెలకుర్రుకి చెందిన పుట్టి రవి, ధనలక్ష్మి దంపతుల ఏకైక కుమారుడు సుశాంత్(6)ను ఆదివారం ఇంటి వద్ద ఆడుకుంటుండగా పాము కాటేసింది. గుర్తించిన తల్లిదండ్రులు బాలుడ్ని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. డ్యూటీలో ఉన్న గైనకాలజిస్టు డాక్టర్ నీలిమ... ఇది పాము కాటు కాదని, బాలుడికి పుల్లలు గుచ్చుకుని ఉంటాయని, వైద్యం అక్కర్లే దని చెప్పి పంపించేశారు. తమ బాబును పాము కరిచింది నిజమేనంటూ తల్లిదండ్రులు మొరపెట్టుకున్నా నీలిమ పట్టించుకో లేదు. దీంతో తల్లిదండ్రులు బాలుడిని ఇంటికి తీసుకెళ్లిపోయారు. తెల్లారేసరికి కాలు వాచి, తీవ్ర నొప్పితో సుశాంత్ విలవిలలాడుతుండటంతో తల్లిదండ్రులు సోమవారం మళ్లీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పుడూ డ్యూటీలో ఉన్న డాక్టర్ నీలిమ.. పిల్లాడు పోతే రూ.50 వేలు వస్తుందిలే అంటూ వ్యంగ్యంగా మాట్లాడి వైద్యం చేయలేదు. ఇంతలో చిన్నారి మృతిచెందాడు. సమయానికి వైద్యం అందిస్తే తమ బాబు తమకు దక్కేవాడని తల్లిదండ్రులు విలపించారు. -
ప్రభుత్వాస్పత్రి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచండి
విజయవాడ(లబ్బీపేట) ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంతోపాటు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్వచ్చ్ ఆంధ్రప్రదేశ్ మిషన్ ఎగ్జిక్యూటీవ్ వైస్ చైర్మన్ డాక్టర్ సీఎల్ వెంకట్రావు అన్నారు. ఆయన మంగళవారం కొత్త ప్రభుత్వాస్పత్రితోపాటు, పరిసరాలను పరిశీలించారు. ఓపీ బ్లాక్ పక్కన నిరుపయోగంగా ఉంచిన స్క్రాప్‌ను పరిశీలించి, దీనిని వీలైనంత త్వరగా తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్పత్రి ప్రాంగణంలోని క్యాంటిన్‌ను పరిశీలించారు. ఆస్పత్రి ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచాలని, ప్రతి నెలా నాలగవ శనివారం స్వచ్చ్ ఆస్పత్రి కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. అనంతరం ఆస్పత్రి ప్రధాన గేటు ఎదురుగా అపరిశుభ్ర వాతావరణంలో ఉన్న తోపుడు బండ్లను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఆస్పత్రిలో చికిత్సకోసం వచ్చిన రోగులు, అటెండెంట్లకు పరిశుభ్రమైన ఆహారం అందేలా చూడాలని సూచించారు. ఆస్పత్రికి అవసరమైన పరికరాలతో నివేదిక ఇస్తే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ ఎండీ భీమేష్, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జి రవికుమార్, డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ నరసింహనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
అదుపుతప్పి 108 వాహనం బోల్తా
వేంపల్లె: వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి చెందిన 108 వాహనం మంగళవారం అలిరెడ్డిపల్లె రహదారిలో పాపాఘ్ని నది వంతెన వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. అయితే అదృష్టవశాత్తు అందులో ఉన్న గర్భిణి, ఆమె బంధువులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బాధితుల కథనం మేరకు అలిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన బడుగు రవి భార్య కుమారి పురిటి నొప్పులతో బాధపడుతోంది. మంగళవారం ఉదయం 108 వాహనానికి సమాచారం అందించగా అక్కడికి చేరుకుంది. గర్భిణి కుమారితోపాటు ఆమె తల్లి పార్వతమ్మ ఆశా వర్కర్ మహేశ్వరి, బంధువు రాజమ్మలు ఆ వాహనంలో వేంపల్లెకు బయలుదేరారు. పాపాఘ్ని నదిలో ఇటీవల తాత్కాలిక వంతెన నిర్మించారు. అక్కడ స్కూటర్ అడ్డు వచ్చిందని.. పెద్ద రాయిని తప్పించబోయి అదుపు తప్పిందని డ్రైవర్ శ్రీనివాసులు తెలిపాడు. అయితే బాధితులు మాత్రం డ్రైవర్ వాహనాన్ని అంతకు మునుపు 5నిమిషాలు నిలబెట్టి ఫోన్లో మాట్లాడాడని.. మళ్లీ ఫోన్ వదలకుండా మాట్లాడుతూనే వాహనాన్ని నడపడంతో అదుపు తప్పిందని చెబుతున్నారు. అలిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన శ్రీనివాసులరెడ్డి తన బొలేరో వాహనంలో గాయపడిన వారిని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. గర్భిణి ప్రభుత్వాసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. -
భార్య చనిపోయిందని శవాన్ని వదిలేసిన భర్త
-
ఆస్పత్రుల్లో పరిశుభ్రమైన వాతావరణం అవసరం
విజయవాడ (లబ్బీపేట) : ఆస్పత్రుల్లో స్వచ్ఛమైన వాతావరణం ఉన్నప్పుడు రోగి ప్రశాంతంగా చికిత్స పొందే అవకాశం ఉంటుందని, అందుకు ప్రతిఒక్కరూ తమవంతు కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీ హంస) రాష్ట్ర అధ్యక్షులు యోగేశ్వరరెడ్డి అన్నారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం స్వచ్ఛ్ ఆస్పత్రి కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. జగన్మోçßæనరావు మాట్లాడుతూ ఆస్పత్రి పరిసరాలు శుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపట్టామన్నారు. రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జి. రవికుమార్, డెప్యూటీ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరసింహనాయక్, మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ మాధవి, అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అరవ పాల్, ఉపాధ్యక్షులు కొండపల్లి నాగేశ్వరరావు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండపల్లి శ్రీనివాసరావు, జిల్లా, సిటీ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలోని పిచ్చిమొక్కలు తొలగించి శుభ్రం చేశారు. -
గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చోరీ
-
శస్త్రచికిత్సల్లో ఆధునిక పద్ధతులపై అవగాహన
విజయవాడ (లబ్బీపేట) : డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సహకారంతో ప్రభుత్వాస్పత్రిలోని డయాగ్నోస్టిక్ బ్లాక్ సెమినార్ హాలులో ఆదివారం శస్త్ర చికిత్సల నిర్వహణలో ఆధునిక పద్ధతులపై వర్క్‌షాపు నిర్వహించారు. ఈ వర్క్‌షాపులో పేగుల శస్త్ర చికిత్సల్లో కుట్లు లేకుండా స్టాప్లర్ పద్ధతిలో అతికించడంపై వైద్యులు, వైద్య విద్యార్థులకు నిపుణులు అవగాహన కల్పించారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్) సర్టికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ వెంకటేష్‌రెడ్డి, హైదరాబాద్ అపోలో ఆస్పత్రికి చెందిన డాక్టర్ కిషోర్ ఆలపాటి డెమో ద్వారా ఆధునిక పద్ధతుల్లో శస్త్రచికిత్సలు చేసే విధానాన్ని వివరించారు. శస్త్ర చికిత్స అనంతరం స్టాప్లర్స్ను ఉపయోగించి పేగులను అతికించే విధానాన్ని తెలియజేశారు. సిద్ధార్థ వైద్య కళాశాల సర్జరీ విభాగాధిపతి డాక్టర్ కె.శివశంకరరావు మాట్లాడుతూ స్టాప్లర్స్ పద్ధతిలో పేగులు అతికించే అడ్వాన్స్డ్ టెక్నాలజీని ప్రభుత్వాస్పత్రుల్లో కూడా అమలు చేసేందుకు ఈ వర్క్‌షాపు నిర్వహించినట్లు తెలిపారు. డెప్యూటీ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరసింహనాయక్, సిద్ధార్థ వైద్య కళాశాల సర్జరీ విభాగ వైద్యులతోపాటు పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థులు, ఎన్ఆర్ఐ, పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాలల సర్జరీ విభాగ వైద్యులు పాల్గొన్నారు. -
ఆసుపత్రికి నిర్లక్ష్యపు జబ్బు
* నిధులు ఫుల్.. పరికరాలు నిల్ * శస్త్ర చికిత్సలు చేసేందుకు ఆసక్తి చూపని వైద్యులు * అవస్థలు పడుతున్న పేదలు తెనాలి జిల్లా వైద్యశాలను నిర్లక్ష్యపు జబ్బు పట్టిపీడిస్తోంది. సమృద్ధిగా నిధులున్నా.. వాటిని ఉపయోగించే విషయంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా వైద్యులు, సిబ్బంది, రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెనాలి అర్బన్: తెనాలి జిల్లా వైద్యశాల 200 పడకల వైద్యశాలగా 2001లో అప్‌గ్రేడ్ అయ్యింది. అనంతరం దానిలో ఎన్టీఆర్ వైద్య సేవ, ఎస్ఎన్సీయూ, డయాలసీస్ వార్డులను ఏర్పాటు చేశారు. తెనాలి నియోజకవర్గ పరిధిలోని తెనాలి పట్టణం, తెనాలి, కొల్లిపర మండలాలు, వేమూరు నియోజక వర్గ పరిధిలోని వేమూరు, అమృతలూరు, చుండూరు, భట్టిప్రోలు, కొల్లూరు, రేపల్లె నియోజకవర్గ పరిధిలో రేపల్లె, నిజాంపట్నం, నగరం, మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల, కృష్ణాజిల్లా పరిధిలోని అవనిగడ్డ, అడవులదీవీ తదితర ప్రాంతాల నుంచి పేదలు చికిత్స నిమిత్తం జిల్లా వైద్యశాలకు వస్తుంటా రు. రోజుకు ఓపీ కింద 1000 నుంచి 1200 మంది చికిత్స పొందుతున్నారు. వీరు కాకుం డా 200 మంది సాధారణ రోగులు, ఎన్టీఆర్ వైద్యసేవ, ఎస్ఎన్సీయూ తదితర వార్డులలో మరో 50 మంది వరకు వైద్య సేవలు పొందుతూ ఉంటారు. జిల్లాలో గుంటూరు తర్వాత అతి పెద్ద వైద్యశాలగా పేరుంది. ఎస్‌ఎన్‌సీయూలో నిలిచిన రక్త పరీక్షలు ఎస్ఎన్సీయూ వార్డులో రక్త పరీక్షలు నిలిచిపోయాయి. అప్పుడే పుట్టిన చిన్నారులను ఇక్కడ ఉంచి చికిత్స అందిస్తారు. వారికి రక్తపరీక్షలు చేసేందుకు ప్రత్యేక పరికరం అవసరం. వాటిని అధికారులు అందుబాటులో ఉంచకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది, ఎస్ఎన్సీయూకు ప్రత్యేక నిధులున్నా వాటిని వినియోగించకపోవడంతో ఈ సమస్య తలెత్తింది. సాధారణంగా ఆస్పత్రి అభివృద్ధి కమిటీకి ఆస్పత్రి స్థాయిని బట్టి కొంత నిధులను ప్రభుత్వం అందిస్తుంటుంది. అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ కింద వచ్చిన నిధులను మందుల కొనుగోలుకు, ఆపరేషన్ థియేటర్లో వస్తువుల కొనుగోలుకు, ఆస్పత్రి అభివృద్ధికి వినియోగించుకునే వెసులుబాటు ఉంది. కానీ అధికారులు వాటిని వినియోగించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందనే విమర్శ విన్పిస్తోంది. గతంలోని ఆస్పత్రి అధికారులు నెలకు సుమారు రూ.2లక్షలు వెచ్చించి మందులు, ఇతర పరికరాలు కొనుగోలు చేసేవారనేది సిబ్బంది మాట. ప్రస్తుతం నెలకు రూ.10వేలు కూడా లోకల్ పర్చేజ్‌కు వినియోగించడం లేదని సిబ్బంది చెబుతున్నారు. హెచ్‌డీఎస్ కింద సుమారు రూ.20 లక్షలకు పైగా నిధులు ఉన్నాయనేది సమాచారం. ఇప్పటికైన అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి జిల్లా వైద్యశాలలో నెలకొన్న సమస్యలు అతి త్వరగా పరిష్కరించకపోతే అపరేషన్లు కూడా నిలిచిపోయే అవకాశం ఉందనేది వైద్యుల మాట. ఆస్పత్రిలో లభించని బ్లేడ్, ఇతర పరికరాలు.. జిల్లా వైద్యశాలలో గైనిక్, ఆరో్థపెడిక్, ఈఎన్టీ, ఆప్తమాలజీ, డెంటల్, సాధారణ సర్జరీలు ఎక్కువగా జరుగుతుంటాయి. నెలకు సుమారు 500కు పైగా సర్జరీలు చేస్తుంటారు. అయితే సర్జరీ చేయాలంటే రకరకాల బ్లేడ్లు అవసరం అవుతుంటాయి. బ్లేడ్లతో పాటు క్యాట్గట్స్, ప్రాలిన్, వైక్రిల్, ఎథిలాన్ వంటి వస్తువులు అవసరం. వీటిని తెప్పించాలని పలువురు వైద్యులు కోరుతున్నా వైద్యశాల అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణ విన్పిస్తోంది. సాధారణంగా ఇలాంటి పరికరాలు గుంటూరులోని సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో లభించకపోతే లోకల్‌గా కొనుగోలు చేసే వెసులుబాటు ఉంది. కానీ లోకల్‌గా కొనటానికి అధికారులు ఆసక్తి కనపర్చడం లేదనే విమర్శ విన్పిస్తోంది. అలాగే పేద రోగులకు పంపిణీ చేసేందుకు అవసరమైన మందుల కొరత ఇక్కడ ఏర్పడింది. వాటిని లోకల్‌గా కొనుగోలు చేసి రోగులకు ఉచితంగా అందించే వెసులుబాటు ఉన్నా అలా చేయడం లేదు. దీంతో వైద్యులు ఉన్న మందులనే రాస్తున్నట్లు సమాచారం. పరికరాల కొనుగోలుకు అనుమతిస్తున్నాం.. ఆస్పత్రిలో అవసరమైన మందులు, పరికరాలు కొనుగోలు చేసేందుకు అవసరమైన అనుమతులు ఇస్తున్నాం. మిగిలిన వాటిని త్వరలో కొనుగోలు చేయిస్తాం. డాక్టర్ సులోచన, సూపరింటెండెంట్ -
డెంగ్యూ మరణాలపై చంద్రబాబుదే పూర్తి భద్యత
-
అనంత ప్రభుత్వాస్పత్రిలో చిన్నారుల నరకయాతన
-
మోసగాడి అరెస్టు
ఘోషాస్పత్రిలో ఘటన విజయనగరంఫోర్ట్: పారితోషికం ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించిన ఓ మోసగాడిని ఘోషాస్పత్రి సెక్యూరిటీ గార్డు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే ఘోషాస్పత్రిలో గంట్యాడ మండలం మధుపాడ గ్రామానికి ఓ గర్బిణి రెండు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరి మంగళవారం ప్రసవించింది. విషయం తెలుసుకున్న గంట్యాడ మండలం కొర్లాం గ్రామానికి చెందిన రంభదేముడు అనే వ్యక్తి గర్బిణి భర్త దగ్గరకు వెళ్లి తనకు డాక్టర్ తెలుసనీ... పారితోషికంగా రూ. 36వేలు ఇప్పిస్తాననీ.. అందుకు అధార్ కార్డు, బ్యాంకు ఖాతా, రేషన్ కార్డు జెరాక్సులు, రూ.1800 కట్టాలని చెప్పాడు. వాటిని నమ్మి డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నించగా ఆస్పత్రి ద్వారం వద్ద సెక్యూరిటీ గార్డు దేముడును అడ్డుకున్నారు. గత నెల 16వతేదీన కూడా దేముడు ఓ రోగి బంధువు నుంచి ఇదే మాదిరిగా రూ. 2500 దండుకుని పరారయ్యాడు. అది సీసీ కెమెరాలో రికార్డు అయింది. అదిగమనించి సెక్యూరిటీ గార్డు పట్టుకుని రెండవ పట్టణ పోలీసులకు అప్పగించారు. ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ రవిచంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘోషాస్పత్రిలో రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తామన్నారు. ఏ ఒక్కరికి డబ్బు చెల్లించనవసరం లేదనీ, అపరిచిత వ్యక్తులు డబ్బులు అడిగితే 8008553404, 8008553390 సెల్ నంబర్లకు ఫోన్ చెయ్యాలని డిప్యూటీ సూపరింటెండెంట్ తెలిపారు. -
ప్రైవేటు అడ్డా..!
– జిల్లా ఆస్పత్రిని అడ్డాగా మార్చుకున్న వైద్యులు, సిబ్బంది – ఉదయం 10గంటలు దాటినా ఆస్పత్రికి రాని వైద్యులు – ఆదివారం అసలే కనిపించరు?! జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో వైద్యసిబ్బంది తీరు రోగులకు శాపంగా మారింది. మెరుగైన వైద్యం కోసం జిల్లా నలుమూలల నుంచి నిత్యం వస్తున్న వారికి వైద్యసేవలందించడంపై దష్టిపెట్టకుండా, ప్రైవేటు ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. అక్కడ తమసొంత క్లినిక్‌లో చికిత్స చేసి అందినకాడికి డబ్బు గుంజుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిని వీరి వైద్యవ్యాపారానికి అడ్డాగా మార్చుకున్నారు. – మహబూబ్‌నగర్ క్రైం రెండు నెలలుగా జిల్లా వ్యాప్తంగా జ్వరాలు, వివిధ వ్యాధుల విజంభించడంతో పేదలు అందుబాటులో వైద్యం లేక మహబూబ్‌నగర్ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి వస్తున్నారు. జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లా నుంచి మరికొంత మంది రోగులు ఇక్కడికి వైద్యం కోసం వస్తున్నారు. దీంతో కొన్నిరోజులుగా వెయ్యి వరకు ఓపీ నమోదవుతోంది. ఉదయం 9గంటలకు రావాల్సిన వైద్యులు మాత్రం తాపీగా 10గంటల తర్వాత కానీ విధులకు రావడం లేదు. ఆలస్యంగా వచ్చి అవసరం అయిన సమయం వరకు పేదలకు వైద్య సేవలను అందిస్తున్నారా అంటే అదీలేదు. మధ్యాహ్నం 12గంటల ఇలా అయ్యిందంటే ఏ ఒక్కరూ కనిపించరు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఉదయం పూట వైద్యం కోసం వచ్చినవారు వైద్యున్ని కలిసి ఆయన చెప్పిన వైద్య పరీక్షలు చేయించుకుని వచ్చే సరికి అందుబాటులో ఉండటంలేదు. ఈ నేపథ్యంలో రోజుల తరబడి ఉండలేక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కొన్నిసార్లు రోగుల ప్రాణాలమీదికి తెస్తోంది. కార్పొరేట్ ఆస్పత్రులకు వత్తాసు.. నిత్యం వైద్యంకోసం ప్రభుత్వ ప్రధానాస్పత్రికి వచ్చే పేదలకు అందుబాటులో ఉండాల్సిన ప్రభుత్వ వైద్యులే పలు ప్రైవేట్ ఆస్పత్రులకు వత్తాసు పలుకుతున్నారు. వార్డుబాయ్‌లు, అంబులెన్స్ డ్రైవర్ల సాయంతో రోగులను ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లేలా ప్రోత్సహిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పర్యవేక్షణాధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తమకు ఫిర్యాదు అందితే స్పందిస్తామంటూ తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకుంటున్నారు. సొంత ఆస్పత్రుకి వెళ్లాలన్న ఆత్రుతే అధికం : జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న పలువురు ప్రభుత్వ వైద్యులు సొంతంగా ఆస్పత్రులు, నర్సింగ్ హోంలు నిర్వహిస్తున్నారు. మరికొందరు ప్రైవేట్ ఆస్పత్రుల్లో కన్సల్టెంట్లుగా వ్యవహరిస్తున్నారు. అక్కడి నుంచి ఫోన్ వస్తే ఒక్కసెకన్ కూడా ఆగకుండా వెళ్లిపోతున్నారు. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వ ఆస్పత్రిలోని రోగులను పైపైన పరీక్షించి ప్రైవేటులో డబ్బుల ఆశతో వత్తికి ద్రోహం చేస్తున్నారని పలువురు వాపోతున్నారు. -
చెట్టును ఢీకొన్న బస్సు: 15 మందికి గాయాలు
-
త్వరలో డయాలసిస్ యూనిట్
తెనాలిఅర్బన్: తెనాలి జిల్లా వైద్యశాలలో రోగులకు ఆధునిక వైద్య సేవలు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ డయాలసిస్ విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా వైద్యశాలలో ఉన్న ఫిమేల్ మెడికల్ వార్డును ఖాళీ చేయించి రోగులను బుధవారం వివిధ వార్డుల్లోకి తరలించారు. ఆ వార్డును గురువారం డయాలసిస్ విభాగానికి అప్పగించనున్నారు. ఈ విభాగంతో తెనాలి, వేమూరు, మంగళగిరి, రేపల్లె నియోజకవర్గాల పరిధిలోని అనేక వేల మంది పేద రోగులకు ఉపయోగకరంగా మారనుంది. జిల్లా వైద్యశాలలో డయాలసిస్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్ కమిషనర్ భావించారు. దీనిలో భాగంగా రాష్ట్రంలోని తెనాలి, గూడూరు, మచిలీపట్నం వైద్యశాలల్లో ఈ విభాగాన్ని ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అందుకు అవసరమైన పరికరాలను కూడా పంపారు. గురువారం హైదరాబాద్ నుంచి వచ్చే డయాలసిస్ నిపుణులు వార్డును పరిశీలించి దానిలో పరికరాల ఏర్పాటు చేయనున్నారు. కొద్ది రోజుల్లో డయాలసిస్ విభాగం పేద ప్రజలను అందుబాటులోకి రానుంది. తెనాలి ఏరియా వైద్యశాలను 2000 సంవత్సరంలో జిల్లా వైద్యశాలగా అప్‌గ్రేడ్ చేశారు. 200 పడకల వైద్యశాలగా తీర్చిదిద్ది అధునాతన పరికరాలు, వసతులను ఏర్పాటు చేశారు. సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, బ్లడ్ బ్యాంక్, నవజాత శిశుకేంద్రం, అన్ని రకాల రక్త, మూత్ర పరీక్షలు తదితర సేవలను అందుబాటులోకి తెచ్చారు. అధునాతన ఆపరేషన్ థియేటర్లను కూడా ఏర్పాటు చేసి పరికరాలను కూడా సమకూర్చారు. ఇటీవల వైద్యుల కొరత ఎక్కువగా ఉండడంతో పాలకులు, అధికారులు స్పందించి అన్ని రకాల వైద్య నిపుణులను బదిలీపై తీసుకువచ్చారు. దీంతో ప్రస్తుతం జిల్లా వైద్యశాలలో ప్రతి రోజూ 1000 మంది ఔట్ పేషెంట్లు వైద్య సేవలు పొందుతున్నారు. ఇటీవల తక్కువ నెలలతో, తక్కువ బరువుతో జన్మించిన చిన్నారులకు అందించే ఆక్సిజన్ పరికరాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. -
పెద్దాస్పత్రికి మానవ హక్కుల కమిషన్ నోటీసులు
నెల్లూరు(అర్బన్) : నెల్లూరులోని పెద్దాస్పత్రి (డీఎస్సార్)కి మానవ హక్కుల కమిషన్ నుంచి నోటీసులు అందాయి. ఆస్పత్రిలో వైద్యసేవలు సరిగా అందడంలేదని, కనీస వసతులులేవని తదితర అంశాలపై పలు పత్రికల్లో వచ్చిన కథనాలను పరిగణలోకి తీసుకున్న కమిషన్ నోటీసులు జారీచేసింది. దీనిపై ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ మంగళవారం మాట్లాడుతూ ఆస్పత్రిలో అందుతున్న సేవలు గురించి నివేదిక తయారుచేసి పంపుతున్నామని చెప్పారు. కనీస వసతులు, డాక్టర్ల హాజరు తదితర అంశాల గురించి మానవహక్కుల కమిషన్ వివరాలు అడిగిందని తెలియజేశారు. -
చితకబాదారు
సర్వజనాస్పత్రిలో సెక్యూరిటీ సిబ్బంది ఓవర్ యాక్షన్ బంధువును చూసేందుకు వచ్చిన యువకుడిపై దాడి అనంతపురం సిటీ: సర్వజనాస్పత్రిలో సెక్యూరిటీ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువును చూసేందుకు సోమవారం వచ్చిన ఓ వ్యక్తిని చితకబాదారు. వివరాల్లోకి వెళితే.. ఆర్థోవార్డులో చికిత్స పొందుతున్న తన బంధువును చూసేందుకు యల్లనూరు మండలానికి చెందిన రామాంజి సర్వజనాస్పత్రికి వచ్చాడు. అయితే సిబ్బంది అతన్ని వార్డులోకి అనుమతించలేదు. అరగంట పాటు అక్కడే పడిగాపులు గాసిన యువకుడు, తనను లోపలకు పంపితే బంధువును పలకరించి వస్తానని సెక్యూరిటీని ప్రాధేయపడ్డాడు. అయినా వారు వినిపించుకోకపోవడంతో వారితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే రెచ్చిపోయిన ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది యువకుడిపై దాడి చేశారు. ఈ ఘటనలో యువకుడికి రక్తగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న సెక్యూరిటీ ఇన్చార్జ్ సంఘటనా స్థలానికి వచ్చి రామాంజినేయులు అక్కడి నుంచి పంపించివేశారు. తానేం తప్పుచేశానని తనపై దాడి చేశారో చెప్పాలని రామాంజనేయులు వాదించినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో సెక్యూరిటీపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక, బంధువులు ఎక్కడున్నారో అర్థం కాక రామాంజనేయులు తిరిగి గ్రామానికి బయలు దేరాడు. ఈ ఘటన చూసిన ఆస్పత్రిలోని వారంతా సెక్యూరిటీ తీరుపై పెదవి విరిచారు. -
ఈ బాబు ఎవరు ?
-
మందుల్లేవ్!
♦ ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత ♦ రోగులకు సక్రమంగా అందని వైద్యం ♦ ఆందోళన చెందుతున్న ప్రజలు రాజాం/రాజాం రూరల్: జిల్లాలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు నిండుకున్నాయి. దీంతో వైద్యం కోసం వచ్చేవారు ఇబ్బంది పడుతున్నారు. రాజాం సామాజిక ఆస్పత్రిలో నాలుగు నెలలుగా కొన్ని రకాల మందులు లేకుండా పోయాయి. ఇక్కడ రోజూ 300 మందికి పైగా ఓపీ రోగులతో పాటు సుమారు 60 మందికి పైగా ఐపీ రోగులు వస్తుంటారు. వీరిలో సుమారు వంది మంది వరకూ మందుల కొరత ఉన్నట్టు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. – ప్రధానంగా సర్జికల్ వస్తువులైన దూది, బ్యాండేజీ, యాంటీ సెప్టిక్ ఆయిల్స్, యాంటీబయాటిక్ ఇంజక్షన్లు, మాత్రలతో పాటు ఇతరత్రా మందులు, ఇంజక్షన్లు, సిరంజీల కొరత వేధిస్తోంది. శస్త్ర చికిత్సలు జరిగినప్పుడు, గాయాలపాలైన బాధితులకు కట్టు కట్టడానికి అవసరమయ్యే దూది, బ్యాండేజ్, సూదులు, సిరంజీలు, ఐవీ సెట్లు ఇతరత్రా వస్తువులు పూర్తిగా అయిపోవడంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆయాసం తగ్గించే డెరీఫ్లిన్, గ్యాస్ట్రిక్ తగ్గించడానికి రాంటాక్, పాంటాప్ ఇంజక్షన్లు లేవు. కుక్కకాటుకి సంబంధించిన ఏఆర్వీ ఇంజక్షన్లు కూడా అరకొరగానే ఉన్నాయి. అలాగే ప్రతి సామాజిక, ఏరియా ఆస్పత్రుల్లో ప్రతి నెలా వందకు తక్కువ లేకుండా ప్రసవాలు, 30 వరకూ ఎన్టీఆర్ ఆరోగ్యవైద్యసేవ శస్త్ర చికిత్సలు జరుపుతున్నారు. వీరికి నిత్యం అవసరమయ్యే దూది, బ్యాండేజ్, సూదులు, సిరంజీలు, ఐవీ సెట్లు లేకపోవడంతో బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బయట కొనుక్కుందామంటే తడిపిమోపెడు అవుతోందని వాపోతున్నారు. మందులు లేకపోవడం, రోగుల నుంచి వ్యతిరేకత వస్తుండడంతో వైద్య సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు నెలల క్రితం కూడా.. మూడు నెలల క్రితం కూడా జిల్లాలోని చాలా ఆస్పత్రుల్లో సిరంజీలు, సూదుల కొరత ఏర్పడింది. దీంతో సిబ్బంది సూచనల మేరకు రోగులు బయట దుకాణాల్లో కొనుగోలు చేసుకోవడం అలవాటుగా మార్చుకున్నారు. యాంటీబయోటిక్ ఇంజక్షన్లు సెఫోటాక్సిమ్సోడియం–1జీ, ఎమికాసిన్–500 ఎంజీ, యాంప్సిలిన్, సెఫట్రయోక్సిన్, ఓండమ్ తదితర ఇంజక్షన్ల కొరత కూడా తీవ్రంగా ఉండేది. అయితే కొద్ది రోజుల తరువాత సమస్య తీరింది. ఇంతలోనే మళ్లీ అదే పరిస్థితి. సొమ్ము చేసుకుంటున్న ఫార్మసిస్ట్‌లు! అత్యవసర మందులను ప్రభుత్వం సరఫరా చేయకపోవడంతో ఆస్పత్రి అభివృద్ధి నిధులను వినియోగించుకోవచ్చునని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. అవసరమైన మందులను కొనుగోలు చేయాలని వైద్యులు ఫార్మసిస్ట్‌లకు సూచించారు. దీంతో తమ ఇష్టానుసారంగా మందులు కొనుగోలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు మందుల దుకాణదారులతో ఒప్పందం కుదుర్చుకొని అరకొర మందులు కొనుగోలు చేసి భారీగా బిల్లులు పెడుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. తాత్కాలింగా సమకూరుస్తున్నాం ప్రతీ రోజూ అవసరానికి సరిపడా సర్జికల్ వస్తువులతో పాటు మందులను తాత్కాలికంగా సమకూరుస్తున్నాం. ఇంకా చాలకపోవడంతోనే ఈ సమస్య నెలకొంటుంది. అయినా మందులు కోసం ఇండెంట్ పంపించాం. వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తాం. – గార రవిప్రసాద్, సూపరింటెండెంట్, సీహెచ్‌సీ, రాజాం -
కరీంనగర్ ప్రభుత్వాస్పత్రి దుస్థితి
-
చల్లపల్లి ప్రభుత్వాసుపత్రి ఎదుట ఆందోళన
చల్లపల్లి ప్రభుత్వాసుపత్రి ఎదుట మంగళాపురం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. వివరాలు..చల్లపల్లి మండలం మంగళాపురం గ్రామంలో నాగేశ్వరరావు(35) అనే వ్యక్తిని సోమవారం రాత్రి పాము కాటేసింది. కుటుంబసభ్యులు నాగేశ్వరరావును చికిత్సనిమిత్తం చల్లపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు కాసింత ఆలస్యం చేసి బందరుకు రిఫర్ చేశారు. బందరులో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందాడు. డ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యం వల్లే నాగేశ్వరరావు మృతిచెందాడని, వెంటనే అతడిని సస్పెండ్ చేయాలని మంగళాపురం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. -
ప్రేమించి.. పెళ్లాడి.. కట్నం కోసం
► చంపాలనుకున్నాడు భద్రాచలంలో భార్యపై హత్యాయత్నం ► మంచిర్యాల వాసి నిందితుడు భద్రాచలం టౌన్(ఖమ్మం) : భద్రాచలం పట్టణంలోని కరకట్టపై ఓ వ్యక్తి తన భార్య గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. అక్కడి పోలీసుల కథనం ప్రకారం... జిల్లాలోని మంచిర్యాలకు చెందిన యలకుర్తి సంతోష్, కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరుకు చెందిన సంతోషి ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంతకాలం తర్వాత కట్నంగా డబ్బు కావాలని సంతోషిని అడగటంతో ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో ఆమెను హత్య చేసేందుకు పథకం పన్నాడు. తన దగ్గర బంధువైన శివతో కలిసి భద్రాచలం రామయ్యను దర్శించుకునేందుకని మంగళవారం భద్రాచలం చేరుకున్నారు. తెల్లవారుజామునే స్వామి వారి దర్శనం చేసుకుందామనుకుని ఆ రాత్రే ఆమెను కరకట్ట వద్దకు తీసుకెళ్లి ఇద్దరు కలిసి గొంతు కోశారు. చనిపోయిందనుకుని భావించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. తర్వాత కొంత సమయానికి స్పహలోకి వచ్చిన ఆమె స్థానికుల సహాయంతో భద్రాచలం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ఆమెకు చికిత్సను అందించారు. బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారు ఇక్కడికి చేరుకుని ఆమెను వరంగల్ ఆస్పత్రికి తరలించారు. నిందితులు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రభుత్వాస్పత్రి ఎదుట గర్భిణీ స్త్రీల ఆందోళన
నల్గొండ : నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వాస్పత్రి వద్ద పేషెంట్లు బుధవారం ఆందోళనకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి... కాన్పు చేయించుకునేందుకు ముగ్గురు గర్భిణీలు స్థానిక ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. అయితే ప్రభుత్వ వైద్యుడు వాళ్లకు వైద్యం చేసేందుకు నిరాకరించాడు. తాను ప్రైవేట్ ఆసుపత్రి నడుపుతున్నానని... ఆ ఆసుపత్రిలో చేరితేనే వైద్యం చేస్తానని కరఖండిగా చెప్పాడు. దీంతో ఆసుపత్రికి వచ్చిన మహిళలు వైద్యుడితో వాగ్వివాదానికి దిగారు. వైద్యుడి వైఖరికి నిరసనగా... ఆసుపత్రి ఎదుట గర్భిణీ స్త్రీలతోపాటు వారి బంధువులు ఆందోళకు దిగారు. -
మంత్రి మృణాళినికి చుక్కెదురు
ఆస్పత్రి నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నిలదీసిన గ్రామస్తులు చీపురుపల్లి: రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి కిమిడి మృణాళినికి సొంత నియోజకవర్గ కేంద్రమైన విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఎదురు దెబ్బ తగిలింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ప్రభుత్వ ఆస్పత్రి నిర్మించాలని భావించిన మంత్రి మృణాళిని నిర్ణయాన్ని మేజర్ పంచాయతీ పరిధిలో గల వంగపల్లిపేట గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చిన మంత్రి మృణాళినిని ఈ విషయమై గ్రామస్థులు, మహిళలు నిలదీశారు. తొలుత మంత్రిని కలిసేందుకు వచ్చిన మహిళలను పోలీసులు అడ్డుకోవడంతో వారిని తోసుకుని లోపలికి వెళ్లి కార్యాలయంలో బైఠాయించారు. మంత్రి వారివద్దకు వచ్చి దీని కోసం సిక్స్మ్యాన్ కమిటీ వేస్తామని చెప్పినప్పటికీ శాంతించని గ్రామస్థులు.. ఏ కమిటీలు వేసినా తమకు ప్రయోజనం లేదని, ఊరు ఖాళీ చేయించి ఆస్పత్రి నిర్మించుకోవాలి తప్ప తాముండగా నిర్మాణం జరగనివ్వమని స్పష్టం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని మహిళలు, గ్రామస్థులను అక్కడి నుంచి పంపించేశారు. -
సర్కారుకు చీమ కుట్టినట్టయినా లేదు
ఉన్నతస్థాయి విచారణపై మీనమేషాలు న్యాయం జరగదంటున్న బాధిత కుటుంబం అందుకు కలెక్టర్ ప్రకటనే నిదర్శనం శిశువు మరణంతోనైనా మారని తీరు విజయవాడ : ప్రభుత్వాస్పత్రిలో చీమలు కుట్టి పసివాడి ప్రాణం గాల్లో కలిసిపోయినా పాలకులకు చీమ కుట్టినట్టు కూడా లేదు. కేవలం సర్కారు నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని పసికందు బంధువులు, విపక్షాలు ఆరోపిస్తూ ఆందోళన చేసినప్పటికీ అధికారులు మొద్దునిద్ర వీడలేదు. విదేశాల్లో ఉన్న వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఉన్నత స్థాయి విచారణ జరిపిస్తామంటూ ప్రగల్భాలు పోతూ ప్రకటనలు చేసినా.. ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. లేక లేక పుట్టిన పండంటి బిడ్డ మృత్యువాత పడగా శోకంలో ఉన్న ఆ కుటుంబంపై పాలకులు కనికరం చూపడం లేదు. ఇంతజరిగినా తప్పు కప్పిపుచ్చుకునేందు కు.. విపక్షాలది అనవసర రాద్ధాంతమంటూ ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేయడాన్ని పలువురు ఖండిస్తున్నారు. మాఫీ చేసే ప్రయత్నం శిశువు మరణంపై ఉన్నత స్థాయి విచారణకు ప్రభుత్వం సుముఖత చూపడం లేదని వైద్య వర్గాలు చెబుతున్నాయి. విచారణ జరిపితే లోపాలు బయటపడి ప్రభుత్వ వైఫల్యమే కారణమన్న విమర్శలు వస్తాయనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కలెక్టర్‌తో ప్రాథమికంగా విచారణ జరిపి శిశువుకు వైద్యం బాగానే చేశారని, చీమలే లేవని నిర్ధారించినట్లు చెబుతున్నారు. వాస్తవంగా ప్రభుత్వాస్పత్రిలో ఏదైనా మృతి ఘటన జరిగినప్పుడు ఇద్దరు లేదా ముగ్గురు వైద్య నిపుణులతో కమిటీ వేసి విచారణ చేస్తారు. కానీ ఇక్కడ దానికి భిన్నంగా ఎలాంటి విచారణా లేకుండా ఘటనను మాఫీచేసే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అందుకే విచారణ కమిటీని నియమించలేదని తెలుస్తోంది. సర్కారు వైఫల్యాన్ని కప్పిపుచ్చేలా.. ప్రసూతి విభాగంలో ఉన్న ప్రత్యేక నవజాత శిశు విభాగాన్ని జిల్లా కలెక్టర్ బాబు.ఎ సందర్శించిన సమయంలో సైతం ఒక్కో ఇంక్యుబేటర్‌లో ఇద్దరు, ముగ్గురు చిన్నారులను ఉంచారు. అలా ఉంచడం వల్ల ఒకరి నుంచి మరొకరికి ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అప్పుడే పుట్టిన బిడ్డలకు ఇన్ఫెక్షన్ సోకితే ప్రాణాంతకమని అంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వార్డును సందర్శించిన కలెక్టర్.. లోపాలను ప్రత్యక్షంగా చూసి కూడా బాగానే వైద్యం జరుగుతోందని మీడియాకి చెప్పారు. అంటే ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చడమేనని వాదనలు వినిపిస్తున్నాయి. ప్రసూతి విభాగంలోనూ అదే దుస్థితి.. ప్రభుత్వాస్పత్రిలో సౌకర్యాల కల్పన విషయంలో ప్రభుత్వ వైఫల్యంపై విపక్షాలతోపాటు పలు స్వచ్ఛంద సంస్థలు దుమ్మెత్తిపోస్తున్నా వారి తీరులో మాత్రం మార్పు రాలేదు. ప్రతి నిరుపేదకూ మెరుగైన వైద్యం అందిస్తామంటూ ఊదరగొట్టే నాయకులు ఒక్కసారి ప్రసూతి విభాగానికి వెళితే అక్కడి పరిస్థితి అర్థమవుతుంది. సిజేరియన్ అయిన మహిళలు, పురిటినొప్పులతో బాధపడి అప్పుడే ప్రసవమైనవారు ఒకే బెడ్‌పై ఇద్దరు పడుకుని ఉండడం చూపరులను కలచివేస్తుంది. అక్కడ మంగళవారం కూడా అదే స్థితి నెలకొంది. -
కరెంటు లేక ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల అవస్థలు
విజయనగరం పట్టణంలోని గోస ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యుత్ లేక గర్భిణులు, శిశువులు తీవ్ర అవస్థులు ఎదుర్కొన్నారు. మంగళవారం 13 గంటల పాటు జిల్లా కేంద్రంలో పవర్ కట్ ఉండగా, బుధవారం మూడు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విశాఖలో 400కేవీ పవర్‌గ్రిడ్ ట్రిప్ అవడంతో ఈ పరిస్థితి నెలకొందని అధికారులు చెబుతున్నారు. అయితే, ఆస్పత్రిలో జనరేటర్ కూడా పనిచేయకపోవడంతో ఉక్కపోతకు రోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. -
అదృశ్యమైన యువకుడు.. శవమై తేలాడు!
► ప్రేమ వ్యవహారమే కారణం : పోలీసులు ► సుంకేసుల బ్యారేజీ నుంచిమృతదేహం వెలికితీత శాంతినగర్ : ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రెండురోజుల క్రితం బయటకు వెళ్లిన అతను చివరకు సుంకేసుల బ్యారేజీలో శవమై తేలాడు. దీనికి ప్రేమ వ్యవహారమే కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన రమ, చంద్రారెడ్డి దంపతులకు కుమారుడు పవన్‌రెడ్డి (21), కూతురు ఉన్నారు. సుమారు పదేళ్లక్రితం బతుకుదెరువు నిమిత్తం వడ్డేపల్లి మండలం శాంతినగర్‌కు వలస వచ్చారు. ఆరేళ్లక్రితం మనస్పర్థలు రావడంతో భర్త స్వగ్రామానికి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి కుమారుడు స్థానికంగా పాలకేంద్రం, వస్త్ర దుకాణాల్లో పనిచేస్తూ తల్లిని పోషిస్తూ వచ్చాడు. రెండేళ్లక్రితం స్థానిక మీసేవా సెంటర్లో ఆధార్ నమోదు ఆపరేటర్‌గా చేరాడు. ఆమె ఈనెల 14న సొంత పనిమీద ఖమ్మంలోని అక్క వద్దకు చేరుకుంది. ఎప్పటిలాగే ఈనెల 16వ తేదీ రాత్రి వరకు అతను అక్కడ పనిచేసి బయటకు వెళ్లి మంగళవారం ఉదయం వరకు తిరిగిరాలేదు. దీంతో మీసేవా నిర్వాహకుడు రవి ఇరుగుపొరుగు వారిని విచారించాడు. చివరకు రాజోలికి చెందిన జాలర్లు సుంకేసుల బ్యారేజి సమీపంలో పవన్‌రెడ్డి మృతదేహం కనిపించిందని సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పుట్టి, జాలర్ల సాయంతో వెలికితీశారు. ప్రేమ వ్యవహారం వల్లే ఆదివారం సాయంత్రం అందులో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. కాగా కాళ్లకు చెప్పులు, వాచ్, ఏటీఎం కార్డు జేబులోనే ఉండటం, ఒడ్డున బైక్ హ్యాండిల్లాక్ వేసి ఉండటం పలు అనుమానాలకు దారితీసింది. ఈ మేరకు ఎస్ఐ జయశంకర్ కేసు దర్యాప్తు చేపట్టి అనంతరం మృతదేహాన్ని అలంపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. -
కారును ఢీకొట్టిన బస్సు: నలుగురికి గాయాలు
చంద్రగిరి(చిత్తూరు జిల్లా): ఆర్టీసీ బస్సు టైరు పంక్చర్ కావడంతో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ సంఘటన సోమవారం ఉదయం చిత్తూరు జిల్లా చంద్రగిరి కోట సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు గాయపడ్డారు. బెంగుళూరు నుంచి తిరుపతికి వస్తున్న ఆర్టీసీ బస్సు టైరు పంక్చరైంది. దాంతో అదుపు తప్పిన బస్సు బెంగుళూరు వైపు వెళుతున్న కారును ఢీకొట్టింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సాక్షి ఎఫెక్ట్ : తెరుచుకున్న వెయిటింగ్ హాల్
విజయవాడ: విజయవాడ ప్రభుత్వాస్పత్రి వెయిటింగ్ హాల్ ఎట్టకేలకు తెరుచుకుంది. ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రారంభించిన గంటకే వెయిటింగ్ హాల్‌కు సిబ్బంది తాళాలు వేశారు. తీవ్ర ఎండాల కారణంగా పేషెంట్ సహాయకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సాక్షి వెలుగులోకి తీసుకొచ్చింది. సాక్షి కథనాలపై స్పందించిన అధికారులు తక్షణమే వెయిటింగ్ హాల్ తెరవాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజల ఇబ్బందులపై అధికారుల్లో కదలిక తెప్పించిన సాక్షికు పేషెంట్ సహాయకులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రభుత్వ ఆస్పత్రిలో సేవలు కరువు
నిజామాబాద్‌అర్బన్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. ముఖ్యంగా అత్యవసర విభాగం, గైనిక్ విభాగాల్లో వైద్యులు లేక సరైన సేవలు అందడం లేదు. వైద్య కళాశాల అసిస్టెంట్లు ప్రొఫెసర్లు సేవలందించడానికి ముందుకు రాకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆస్పత్రికి రాని అసిస్టెంట్ ప్రొఫెసర్లు అత్యవసర విభాగంలో 16 మంది వైద్యులు ఉండాల్సి ఉంది. కాగా కాంట్రాక్టు ముగియడంతో ఎనిమిది మంది విధులకు రావడం లేదు. మరో ఆరుగురు రెగ్యులర్‌గా విధులకు హాజరు కావడం లేదు. దీంతో ఇద్దరు మాత్రమే అందుబాటులో ఉన్నారు. రోజుకు 20 నుంచి 25 కేసులు వస్తున్నాయి. పనిభారంతో ఈ ఇద్దరు వైద్యులు ఒత్తిడికి గురవుతున్నారు. గైనిక్ విభాగంలో తొమ్మిది మంది వైద్యులు అవసరం కాగా.. ఇద్దరే అందుబాటులో ఉన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు 16 మందిని అత్యవసర విభాగంలో వైద్యసేవలు అందించాలని కళాశాల ప్రిన్సిపాల్ సూచించారు. కానీ ఆస్పత్రిలో సేవలందించడానికి వీరు నిరాకరిస్తున్నారు. అత్యవసర సేవలు అందించడం మా బాధ్యత కాదంటూ తప్పించుకుంటున్నారని తెలిసింది. ఒకరికి పదిరోజులకు ఒకసారి విధుల కేటాయింపు జరుగుతున్నా.. సేవలు అందించడానికి ముందుకు రావడం లేదు. దీంతో వైద్యం అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వైద్యుల కొరతతో అత్యవసర విభాగం, గైనిక్ సేవలతోపాటు పోస్టుమార్టం సేవలు సైతం త్వరగా అందడం లేదు. సూపరింటెండెంట్ ఒక్కరే ఈ బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తోంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు చాలా మంది ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌లు నిర్వహిస్తున్నారని, కొంతమంది ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేస్తున్నారని తెలుస్తోంది. అందుకే వారు సర్కారు దవాఖానాలో సేవలందించడానికి ముందుకు రావడం లేదన్న ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి, ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవల మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
ప్రేమించిన అమ్మాయి దక్కదేమోనని..
ధర్మవరం అర్బన్: తాను ప్రేమించిన అమ్మాయి తనకు దక్కదేమోనన్న ఆవేదనతో మంగళవారం సాయంత్రం ఐటీఐ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలిలా.. నార్పల మండలానికి చెందిన గణేష్ మండల కేంద్రం చెన్నేకొత్తపల్లిలోని తన పెద్దనాన్న రామాంజనేయులు వద్ద ఉంటూ ఐటీఐ చదువుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో పుట్టపర్తిలో ఉన్న తమ బంధువుల అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అయితే తమ ప్రేమను పెద్దలు అంగీకరించరేమోనన్న భయంతో ఇంట్లో ఉన్న విష రసాయన పదార్థాన్ని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. చెన్నేకొత్తపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యార్థినిపై అత్యాచారం
తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి 108 అంబులెన్సలో ఆస్పత్రికి తరలింపు మిడ్జిల్ : డిగ్రీ విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో విద్యార్థిని అపస్మారకస్థితిలోకి వెళ్లింది. ఈ ఘటన మిడ్జిల్ మండలంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నా యి. మసిగొండ్లపల్లికి చెందిన విద్యార్థిని (18) షాద్‌నగర్‌లో ఓపెన్ డిగ్రీ చదువుతోంది. బుధవారం ఉదయం మిడ్జిల్‌కు వచ్చి ఇంటికి వెళ్లేందుకు ఆటోలో ఎక్కింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న తన ఇంటర్ క్లాస్మేట్ అయిన మిడ్జిల్‌కు చెందిన ఆంజనేయులు చూసి ఇంటి దగ్గర దిగబెడతానని బైక్‌పై ఎక్కించుకున్నాడు. జగబోయిన్‌పల్లి సమీపంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్ప డ్డాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ విద్యార్థిని అపస్మారకస్థితిలోకి వెళ్లింది. ఆమెను అక్కడే వదిలి వెళ్లే ప్రయత్నం చేస్తుండగా, పొలాల నుంచి ఇంటికి వస్తున్న తండావాసులు గమనించి యువకుడిని పట్టుకుని పోలీ సులకు అప్పగించారు. బాధితురాలి 108 అంబులెన్సలో కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని కల్వకుర్తి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిసింది. ఈ విషయంపై మిడ్జిల్ పోలీసులను వివరణ కోరగా ఫిర్యాదు అందిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. -
9నెలల చిన్నారిపై లైంగికదాడికి యత్నం
నిర్భయ చట్టం కింద కేసు నమోదు రిమాండ్‌కు నిందితుడి తరలింపు వెల్దండ : కామంతో ఉన్న అతడికి కన్నుమిన్ను కానరాలేదు. తొమ్మిది నెలల చిన్నారిపై లైంగికదాడికి యత్నించాడు. ఈ ఘటన వెల్దండలో బుధవారం వెలుగులోకి వచ్చింది. నింది తుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. కల్వకుర్తి సీఐ వెంకట్, ఎస్ఐ జానకీరాంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం తన తొమ్మిది నెలల చిన్నారికి తల్లి స్నానం చేయించి ఉయ్యాలలో పడుకోబెట్టింది. అనంతరం అరుబయట దుస్తులు ఉతికేందుకు వెళ్లింది. అంతకుముందు పాప తండ్రి, బంధువు అయిన 26ఏళ్ల లక్ష్మణ్ (పాపకు వరుసకు మామ) ఇద్దరూ కలిసి భోజనం చేశారు. అనంతరం తండ్రి పనిమీద బయటకు వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో లక్ష్మణ్ ఉయ్యాలలో ఉన్న పాపను బయటకు తీసి లైంగికదాడికి యత్నించాడు. పాపకు రక్తస్రావం కావడంతో గుడ్డతో తుడిచి పడుకోబెట్టి వెళ్లిపోయాడు. పాప ఏడుపును గమనించిన తల్లి ఇంట్లోకి వెళ్లి చూడగా రక్తస్రావం కావడంతో వెంటనే కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరిశీలించగా లైంగికదాడి యత్నానికి గురైనట్లు గుర్తించారు. దీంతో తల్లిదండ్రులకు లక్ష్మణ్‌పై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు..సైకోగా అనుమానం నిందితుడు లక్ష్మణ్ది తలకొండపల్లి మండలం జంగారెడ్డిపల్లి గ్రామం. అతని అమ్మమ్మ గ్రామం వెల్దండ. ఆమెకు జ్వరం రావడంతో నాలుగు రోజుల క్రితం ఇక్కడికి వచ్చాడు. అయితే ఇతనికి..పాప తండ్రి బావ అవుతాడు. దీంతో రోజూ వీరి ఇంట్లోనే భోజనం చేస్తున్నాడు. లక్ష్మణ్‌కు పెళ్లి అయింది. ఇతని చేష్టలతో విసిగిపోయిన భార్య వదిలిపెట్టి పోయినట్లు బంధువులు తెలిపారు. సైకోగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కల్వకుర్తి సీఐ విచారణ కల్వకుర్తి సీఐ వెంకట్ బుధవారం సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాధితురాలి త ల్లిదండ్రుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారి ఫిర్యాదు మేరకు నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
జీజీహెచ్‌లో 1,251 ఎలుకల పట్టివేత
గుంటూరు మెడికల్ : ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో ఎలుకల వేట కొనసాగుతోంది. బుధవారం నాటికి 1,251 ఎలుకలను పట్టుకున్నారు. గత ఏడాది ఆగస్టు 26న ఎలుకల దాడిలో పసికందు మృతి చెందిన సంఘటనతో అధికారులు ఎలుకల నిర్మూలన కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించారు. జిల్లాలోని వట్టిచెరుకూరుకు చెందిన సీహెచ్ హనుమంతురావు, నాగలక్ష్మి దంపతులు ప్రతి రోజూ వార్డుల్లో ఎలుకలను పట్టే బోన్లు అమర్చుతున్నారు. బోనులో ఉన్న ఆహారం కోసం వచ్చిన ఎలుకలు వాటిలో ఇరుక్కొని చనిపోతున్నాయి. చనిపోయిన వాటిని వెంటనే అధికారులకు లెక్క చూపించి మళ్లీ నూతనంగా బోన్లు ఏర్పాటు చేస్తున్నారు. వీరికి ఆస్పత్రి అధికారులు ఎలుకను పట్టినందుకు రూ.20 చొప్పున అందిస్తున్నారు. శానిటేషన్ కాంట్రాక్టర్ నుంచి నెలకు రూ.6 వేలు వేతనం ఇప్పిస్తున్నారు. ఎలుకలు పూర్తిగా నిర్మూలన అయ్యేవరకు ఎలుకల వేట ఆస్పత్రిలో కొనసాగుతుందని అధికారులు తెలిపారు. -
ఇద్దరూ వాగ్దాన కర్ణులే!
కేసీఆర్ రెండు పడక గదుల ఇళ్లను, మంచినీళ్లని నమ్మారే కానీ ప్రభుత్వ బడులలో అయ్యవార్లను నియమిస్తామని గాని, దవాఖానాల్లో వైద్యమందేట్లు చూస్తామని గాని కోతలు కొయ్య లేదు. అదే 99 వైపు పరుగులు తీయించి పరువు నిలిపింది. తొంభై తొమ్మిది ఒక తమాషా సంఖ్య. వంద సంఖ్య పూర్ణత్వాన్ని ధ్వనింపచేస్తుంది. 99లో ఒక రాజసం ఉంది. దీనికి ఒక్కటి కలిస్తే చాలు- వంద, వెయ్యి, పదివేలు, లక్ష అయిపోవడానికి. కొన్ని సార్లు ఈ తమాషా సంఖ్య భలే ఉపయోగపడుతుంది. వాహనంలో వంద లేదా అంతకు మించి ప్రయాణికులను ఎక్కించరాదు అనే నిబంధన ఉంటే, తొంభై తొమ్మిదితో సరిపెడతారు. మొత్తం సొమ్ము లక్ష రూపాయలైతే విధిగా చెక్కు ద్వారా చెల్లించాలని రూలు ఉంటుంది. అప్పుడు, ఐదు తొమ్ముదుల లక్కీ నెంబర్‌తో చెక్కు రాసి రూల్‌ని గౌరవిస్తారు. ఒకానొక సన్నివేశంలో సుయోధనుడు, ‘‘... నూర్గురు సహోదరులకు అగ్రజుండనై’’ అంటూ వాపోతాడు. నిజానికి రాజరాజుకి సహోదరులు తొంభైతొమ్మిది మందే! వత్సల సహోదరి. మరీ కచ్చితంగా పోకుండా రౌండ్‌ఫిగర్ చెప్పి బాధపడ్డాడు. ‘‘తొంభైతొమ్మిదిపాళ్లు అవుతుంది’’ అంటే అయిపోతుందనే అర్థం. కాకపోతే ఆ ఒక్కపాలు దేవుడిమీద భారం వేస్తారు. వచ్చాడు, దిగాడు, సాధించాడన్నట్టుగా కేసీఆర్ కోటలో పాగా వేశారు. కోటమీద జండా ఎగరేశారు. అందరం ఇక్కడికి వలస వచ్చిన వాళ్లమే! ఏం భయపడొద్దు. మిమ్మల్ని కడుపులో పెట్టుకు చూసుకుంటానని ఆంధ్రోళ్లకి అభయం ఇచ్చారు. పరమ శివుణ్ని కడుపులో పెట్టుకున్న గజాసురుడు గుర్తుకు వచ్చాడు. ఎన్నికల్లో వాగ్దా నాలు అందరూ చేస్తారు. ఎవరో ఒక్కరివే పేలాల్లా పేల్తాయ్. ఓట్లుగా రాల్తాయ్. కేసీఆర్ రెండు పడక గదుల ఇళ్లు పంట గడి చేరడానికి ఊతమి చ్చింది. మంచినీళ్లని నమ్మారు. అంతేగాని నగ రంలో వీధి కుక్కల బెడ దను తొలగిస్తామని కాని, ప్రభుత్వ బడులలో అయ్య వార్లను నియమిస్తామని గాని, దవాఖానాల్లో వైద్యం అందేట్లు చూస్తా మని గాని లేనిపోని కోతలు కొయ్యలేదు. అదే 99 వైపు పరుగులు తీయించి పరువు నిలిపింది. తెలుగుదేశం తొలి అంకెతో సరిపెట్టుకుని భంగపడింది. దేశాన్ని పాలిస్తున్న కమలం గుప్పెడు కార్పొరేటర్లను గెలిపించుకోలేకపోయింది. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సభలు, సమావేశాలు, అధిక ప్రసంగాలు, రోడ్‌షోలు చేసినా బూడిదలో పన్నీరుగా, అడవి గాచిన వెన్నెలగా మిగిలాయి. ముప్పవరపు ముప్పతిప్పలు పడ్డా- నొప్పులు రొప్పులు తప్ప చేర్పుకూర్పుల నేర్పుని జనం చప్పరించారు. చంద్రబాబు యువరాజుని రంగంలోకి దింపారు. ఇంకేముంది సొంత భజన కత్తులు ‘‘చినబాబు అరంగేట్రం! ప్రమోదంగా ప్రసంగం! వాక్కులు వడగళ్లు! పలుకులు పకోడీలు!’’ అంటూ ఆకాశానికి ఎత్తేశాయి. తీరా ఫలితాలు వచ్చాక’’ ఐరన్ లెగ్’’ అంటూ చెవులు కొరుక్కుంటున్నారు. బాబుకి అంత సీన్ లేదంటున్నారు. తెలుగు సీఎంలిద్దరికీ వాగ్దాన కర్ణులుగా మంచిపేరుంది. రాజకీయాల్లో ఎవరు ఓటర్లని నమ్మించి బుట్టలో వేశారన్నదే ముఖ్యం. ఆవు మాట నమ్మి పులి దాన్ని వదిలేసిందని తెలిసిన ఓ ఎద్దు అలాగే నమ్మించబోయింది. పులి అడవి దద్దరిల్లేలా గాండ్రించి, నిన్ను వదల.. నేన్నీకు గాడిదలా కనిపిస్తున్నా కదూ.. దూడకి పాలిచ్చి వస్తానంటే నమ్మేంత దద్దమ్మలా ఉన్నానా...’ అంటూ పంజా విసిరింది. అందుకని ఎజెండా కథలు వినసొంపుగా ఉండాలి. ఆసక్తికరంగా చెప్పగలగాలి. అప్పుడు తొంభై తొమ్మిది పాళ్లు విజయం వరిస్తుంది. లేకపోతే ఒక్కటితో ఆగిపోతుంది. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) - శ్రీరమణ -
కలగానే నిరంతర రక్త పరీక్షలు
మంత్రులు, అధికారుల హామీలు హుళక్కేనా? ప్రభుత్వాస్పత్రిలో రోగుల జేబులకు చిల్లు బయట ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్న రోగులు విజయవాడ(లబ్బీపేట): నగరంలో పెద్దాస్పత్రి పరిస్థితి పేరు గొప్ప.. ఊరు దిబ్బగా మారింది. పేరుకు బోధనాస్పత్రే కాని, ఇక్కడ సౌకర్యాలు ఏరియా ఆస్పత్రి స్థాయిలో కూడా లేవు. మెరుగైన వైద్యం అందుతుందని దూర ప్రాంతాల నుంచి ఎంతో ఆశతో వస్తే నిరాశే మిగులుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట దాటితే రక్తపరీక్షలు చేసేవారు ఉండారు. రూ.వంద లు వెచ్చించి ప్రైవేటు లాబోరేటరీల్లో చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఆస్పత్రిలను మార్చేస్తాం.. సౌకర్యాలు మెరుగు పరుస్తాం అంటూ వంద రోజుల ప్రణాళికలు.. మూడు నెలలు ప్రణాళికలతో ప్రభుత్వం ఊదరగొట్టే ప్రకటనలు మినహా రోగులకు ఒరగబెట్టిందేమీ లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవే నిదర్శనాలు.. ఏలూరుకు చెందిన 50 సంవత్సరాల వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అక్కడి జిల్లా ఆస్పత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతనికి అత్యవసర శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు. సర్జరీకి ముందు హెచ్ఐవీ, హెచ్‌బీఎస్ ఏజీ, హెచ్‌సీవీ పరీక్షలు చేయాల్సి వుంది. అప్పటికే మధ్యాహ్నం ఒంటిగంట దాటడంతో ల్యాబ్ మూసివేశారు. రూ.వెయ్యి వెచ్చించి ప్రవేటు ల్యాబ్‌లో చేయించారు. రాజీవ్‌నగర్‌కు చెందిన గర్భిణీ ప్రసవం కోసం రాత్రి ఏడు గంటల సమయంలో పాత ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. ఆమెకు సిజేరియన్ చేయాలా, సాధారణమా నిర్ధారించేందుకు గైనకాలజిస్ట్లు స్కానింగ్ చేశారు. శిశువు పరిస్థితి తెలియలేదు. రేడియాలజిస్ట్‌లు చేయాలి. ఆ సమయంలో ఆస్పత్రిలో రేడియాలజిస్ట్‌లు లేరు. రాత్రివేళ ప్రవేటు స్కానింగ్‌సెంటర్‌కు పంపాల్సిన దుస్థితి నెలకొంది. ఇలా వీరిద్దరే కాదు. నిత్యం పదుల సంఖ్యలో రోగులు పడే ఇబ్బందులివి. మధ్యాహ్నం 12 గంటలు దాటితే ప్రభుత్వాస్పత్రిలో రక్తపరీక్షలు అందుబాటులో ఉండవు. అత్యవసర వైద్యానికి 24 గంటల ఆస్పత్రి పనిచేస్తుంది. వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఒక షిప్టుకే పరిమితం కావడంతో రోగుల జేబుకు చిల్లులు పడుతున్నాయి. అమలుకు నోచని 24 గంటల పరీక్షలు.. ప్రభుత్వాస్పత్రిలో 24 గంటలు రక్తపరీక్షలు అందుబాటులోకి తీసుకురావాలనే ప్రతిపాదన కలగానే మిగిలిపోతుంది. ఐదేళ్ల కిందటే నిరంతరం వైద్య పరీక్షలు నిర్వహించాలనే ప్రతిపాదన చేయగా అది బుట్టదాఖలైంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 జూన్ అభివృద్ధి కమిటీ సమావేశంలో జిల్లాలోని ముగ్గురు మంత్రులు, ముగ్గురు ఎంపీలు, ఎమ్మెల్యేలు 24 గంటలు పరీక్షలు తక్షణమే అందుబాటులోకి తెస్తామన్నారు. వైద్యుల పరిస్థితి దయనీయం.. వైద్యుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా మారింది. ఇక్కడ సౌకర్యాలు లేకుండా బయటకు మందులు, పరీక్షలేమి రాయొద్దని జిల్లా కలెక్టర్, మంత్రులు ఆదేశాలిచ్చారు. ఒకానొక సమయంలో అత్యవసరమైతే బయటి నుంచి రక్తం తీసుకు వచ్చి ఎక్కిస్తే, వైద్యురాలి జీతం నుంచి రక్తం కొనుగోలు చేసిన బిల్లు కట్‌చేయాలని కలెక్టర్ పేర్కొనడంతో వైద్యులు బిత్తర పోయారు. ఇక్కడ సౌకర్యాలు లేనప్పుడు మేమేం చేయాలని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పిస్తే బయటకు ఎందుకు రాస్తామని వారు అంటున్నారు. ప్రభుత్వం స్పందించాలి.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 24 గంటలు రక్తపరీక్షలు, ఆల్ట్రాసౌండ్ స్కాన్ అందుబాటులోకి తీసుకు రావాలని పలువురు కోరుతున్నారు. అప్పుడే రోగులకు అన్ని వేళలా మెరుగైన వైద్యం అందుతుందని నిపుణులు చెబుతున్నారు. -
ప్రభుత్వాసుపత్రుల కోసం స్థలాలు పరిశీలించిన లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల స్థాయిలో నగరంలో మరో రెండు ప్రభుత్వాసుపత్రులను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన మరుసటి రోజే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి ఆ పనిలో పడ్డారు. శ నివారం వైద్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. రంగారెడ్డి కలెక్టర్, జాయింట్ కలెక్టర్లతో మాట్లాడారు. సమావేశం అనంతరం నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న స్థలాలను, పాత భవనాలను మంత్రి పరిశీలించారు. గచ్చిబౌలి స్టేడియం పక్కన ఉన్న 14 అంతస్తుల పాత భవనాన్ని పరిశీలించారు. వెయ్యి పడకలతో రెండు పెద్ద ఆసుపత్రులు, లేదా 500 పడకలతో హైదరాబాద్‌కు నలు దిక్కులా నాలుగు ఆసుపత్రులు నిర్మించాలని సర్కారు యోచిస్తోంది. ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, గచ్చిబౌలి, కూకట్పల్లి ప్రాంతాల్లో వీటిని నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. కింగ్‌కోఠి ఆసుపత్రిని స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఆదివారం ఉదయం కూడా ఎల్బీనగర్ ప్రాంతంలో ఉండే ఖాళీ స్థలాలను మంత్రి పరిశీలిస్తారు. -
ఐసీయూని ప్రారంభించిన మంత్రి లక్ష్మారెడ్డి
మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఐసీయూ, డయాగ్నోస్టిక్ ల్యాబ్‌ను రాష్ట్ర వైద్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి బుధవారం ప్రారంభించారు. ఆసుపత్రికి మెరుగైన పరికరాల కోసం రూ.16కోట్లు విడుదల చేస్తున్నట్లు లక్ష్మారెడ్డి ప్రకటించారు. అనంతరం ఆయన జడ్చర్లలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. -
నర్సులా వచ్చి పిల్లాడిని ఎత్తుకెళ్లింది
మధుర: నర్సులా వచ్చిన ఓ మాయాలేడి ప్రభుత్వ ఆస్పత్రి నుంచి మూడురోజుల పసికందును దొంగలించింది. ఉత్తరప్రదేశ్ లోని మధుర ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. నవనీత్ నగర్ కు చెందిన నస్రీన్ జనవరి 29న మగబిడ్డను ప్రసవించింది. అయితే సోమవారం ఓ మహిళ నర్సులా పిల్లాడికి వాక్సిన్ వేయిస్తానని మాయామాటలు చెప్పి నస్రీన్ నుంచి పసికందును తీసుకుంది. పిల్లాడిని తీసుకువెళ్లిన ఆమె ఎంతకు రాకపోవడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డీ భాస్కర్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై వారు ఇరుగుపొరుగుతో కలిసి ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. దీంతో జిల్లా మెజిస్ట్రేట్ రాజేశ్ కుమార్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. పిల్లాడి చోరీకి కారణమైన ముగ్గురు ఆస్పత్రి సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు.ఆస్పత్రి సూపరింటెండెంట్ పైనా చర్య తీసుకోవాల్సిందిగా మెజిస్ట్రేట్ సూచించారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదుచేసిన పోలీసులు పిల్లాడిని ఎత్తుకెళ్లిన మహిళ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. -
ప్రభుత్వాసుపత్రి స్థలంపై.. ‘పచ్చ’గద్దలు!
ఎక్కడైనా కాస్త ఖాళీ జాగా కనిపిస్తే చాలు..శవాన్ని పీక్కుని తినే రాబందుల్లా.. ‘పచ్చ’గద్దలు వాలిపోతున్నాయి. ప్రజాప్రయోజనాలను ఆశించి జిల్లాలోని పలుచోట్ల దాతలు ఇచ్చిన స్థలాలకు.. వాటి పుణ్యమా అని రక్షణ కరువవుతోంది. కంచే చేను మేసిన చందంగా రక్షించాల్సిన ప్రజాప్రతినిధులే.. అధికార బలంతో వాటిని తన్నుకుపోవాలని ప్రయత్నిస్తున్నారు. చట్టంలో లొసుగులను ఆసరా చేసుకొనో.. లేదంటే తమకు అనుగుణంగా నిబంధనలు మార్పించుకునో.. కన్నేసిన స్థలాలను కబ్జా చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ/తుని :పిఠాపురం పట్టణంలో క్రిస్టియన్ ఆసుపత్రి స్థలం కబ్జా యత్నాలను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చి వారం రోజులు తిరగకముందే.. మరో వ్యవహారం తెరపైకి వచ్చింది. పేదలకు వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలనే మహోన్నత ఆశయంతో ఎప్పుడో వందేళ్ల కిందట తుని సంస్థానానికి చెందిన రాణి సుభద్రయమ్మ.. తుని పట్టణం నడిబొడ్డున రాజా ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సమీపంలోని పోస్టాఫీసు వీధిలో సుమారు ఎకరా స్థలం దానంగా ఇచ్చారు. అక్కడ ఆసుపత్రి నిర్మించారు. తుని నియోజకవర్గంలో తొలి ప్రభుత్వాసుపత్రి ఇదే. రోజుకు సగటున 400 నుంచి 500 మంది వరకూ ఇక్కడ వైద్య సేవలు పొందేవారు. కొన్నేళ్ల క్రితం సూరవరం రోడ్డులో ఘోషాసుపత్రి ఏర్పాటు చేయడంతో.. పోస్టాఫీసు వీధిలోని ఈ ఆసుపత్రిని పురుషులకోసం ప్రత్యేకంగా కేటాయించారు. 15 ఏళ్ల క్రితం ఘోషాస్పత్రిని ఏరియా ఆస్పత్రిగా మార్చడంతో ఈ పురుషుల ఆస్పత్రిని తాత్కాలికంగా మూసేశారు. కబ్జాదారుల కన్ను ప్రస్తుతం తుని పట్టణంలోని పాతపోస్టాఫీసు వీధిలో చదరపు గజం స్థలం విలువ రూ.60 వేల వరకూ ఉంది. అనధికార లెక్కల ప్రకారం చూసినా ఈ ఆసుపత్రి స్థలం విలువ కనిష్టంగా రూ.18 కోట్ల పైమాటే. అంత విలువైనది కాబట్టే దీనిని ఆక్రమించుకోవడానికి ఒకటిన్నర దశాబ్దాల క్రితమే ప్రయత్నాలు మొదలయ్యాయి. దీనికి బీజం వేసింది కూడా టీడీపీ నాయకులే. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో కీలక నేత ఒకరు ఈ స్థలాన్ని ఆక్రమించుకుని, సొంత వ్యాపార అవసరాల నిర్వహణకు వాడుకున్నారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్థానిక ముఖ్య నేత ఒకరు ఆసుపత్రి స్థలాన్ని ఆక్రమించారు. అక్కడి నుంచే వ్యాపార కార్యకలాపాలు నిర్వహించారు. ఆసుపత్రి సముదాయంలోని మూడు పెంకుటిళ్లను పాతసంచుల మరమ్మతులకు వినియోగించేవారు. అసలు ఆసుపత్రి స్థలంలో ఎటువంటి అనుమతులూ లేకుండానే షాపు నిర్మించి, దానిని ఓ వ్యాపారికి అద్దెకు ఇచ్చారు. దీనికి నెలకు రూ.30 వేల చొప్పున పదేళ్ల పాటు అద్దె వసూలు చేసుకున్నారు. బలవంతంగా ఖాళీ చేయించి.. ఈ వ్యవహారాన్ని పదేళ్లపాటు చూస్తూ ఏమీ చేయలేక కూర్చున్న స్థానిక టీడీపీ నేత.. ఏడాదిన్నర క్రితం టీడీపీ అధికారంలోకి రాగానే రెచ్చిపోయారు. దందాల్లో ఆరితేరిన ఆయనకు కాంగ్రెస్ నేతను ఖాళీ చేయించడం పెద్ద కష్టం కాలేదు. యథాప్రకారం పోలీసుల సహకారంతో పని పూర్తి చేయించారు. గతానుభవాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో మరే ఇబ్బందీ తలెత్తకుండా ఆ స్థలాన్ని సొంతం చేసుకోవడానికి ఇప్పుడు చక్రం తిప్పుతున్నారు. రెవెన్యూ రికార్డులు తిరగరాసేందుకు.. పట్టాదారు పాసు పుస్తకంలో చిన్న తప్పు దొర్లితే చాలు.. దానిని సరిదిద్దడానికి సామాన్య రైతులను రెవెన్యూ అధికారులు నిబంధనల పేరుతో రోజుల తరబడి తిప్పుతారు. అటువంటివారిలో కొందరు అధికార పార్టీ నేతలకు మాత్రం దాసులైపోతున్నారు. ‘లేదంటే దూరప్రాంతానికి బదిలీ చేయించేస్తా’ అని హుంకరిస్తున్న ఆ టీడీపీ నాయకుడి బెదిరింపులకు భయపడి.. చెప్పిందానికల్లా తలాడిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి గ్రామకంఠం స్థలాలను లీజు విధానంలో పొందేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది. ఈ నిబంధనను ఆసరాగా చేసుకోవడానికి టీడీపీ నాయకుడు పావులు కదుపుతున్నారు. ఆసుపత్రి స్థలాన్ని రెవెన్యూ రికార్డుల్లో గ్రామకంఠం భూమిగా చూపించేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తద్వారా దానిని 33 ఏళ్లపాటు లీజు రూపంలో కైంకర్యం చేయడానికి రెవెన్యూ శాఖ అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నట్టు సమాచారం. ప్రజావసరాలకే వినియోగించాలి.. ప్రజాప్రయోజనాలకోసం తుని సంస్థానాధీశులు ఆ స్థలాన్ని ఆసుపత్రికి కేటాయించారు. ఆ స్థలాన్ని ఎప్పటికైనా ప్రజాప్రయోజనాల కోసం మాత్రమే వినియోగించాలి. వాణిజ్య అవసరాలకు వినియోగించడానికి వీల్లేదని నాటి రాణిగారి వీలునామాలో ఉన్నట్లు తెలిసింది. ఏదేమైనా ఆసుపత్రి స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తే మేం ఆందోళనకు దిగుతాం. - దాడిశెట్టి రాజా, ఎమ్మెల్యే, తుని -
మృతదేహన్ని మార్చి ఇచ్చారు
చెన్నై : చెన్నై ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాన్ని మార్చి ఇవ్వడంతో కలకలం చెలరేగింది. దీంతో పాతిపెట్టిన శవాన్ని వెలికితీశారు. చెన్నై మేడవాక్కం, రంగనాథపురం, ఏరికరై వీధికి చెందిన రామదాస్. ఇతని కుమారుడు మణికంఠన్ (20). మాదకద్రవ్యాలకు అలవాటుపడిన మణికంఠన్ అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో చెన్నై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మణికంఠన్ మృతిచెందాడు. దీంతో మణికంఠన్ మృతదేహాన్ని బంధువులు తీసుకొచ్చి గురువారం సాయంత్రం మేడవాక్కం శ్మశానవాటికలో పాతిపెట్టారు. ఈ క్రమంలో క్షయతో మృతి చెందిన వేలూరు వాసి మనోజ్ మృతదేహాన్ని తీసుకునేందుకు అతని కుటుంబీకులు, బంధువులు చెన్నై జీహెచ్ చేరుకున్నారు. ఆ సమయంలో మణికంఠన్ మృతదేహానికి బదులుగా మనోజ్ మృతదేహాన్ని బంధువులు తీసుకువెళ్లినట్లు తెలిసింది. దీంతో దిగ్భ్రాంతి చెందిన మనోజ్ బంధువులు ఆస్పత్రి ఉద్యోగులతో తగాదాకు దిగారు. దీనిగురించి ఆస్పత్రి ప్రాంగణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వెంటనే మేడవాక్కం పోలీసు స్టేషన్‌కు సమాచారం తెలిపారు. పోలీసులు మణికంఠన్ బంధువులతో శుక్రవారం ఉదయం మేడవాక్కం శ్మశానవాటిక చేరుకున్నారు. అక్కడ పాతిపెట్టిన మనోజ్ మృతదేహాన్ని వెలికితీసేందుకు నిర్ణయించారు. తాంబరం తహవీల్దార్ జయకుమార్ ఆధ్వర్యంలో మనోజ్ మృతదేహాన్ని శుక్రవారం వెలికితీశారు. జీహెచ్ మార్చురీ నుంచి శవాన్ని మార్చి ఇవ్వడం గురించి తాంబరం ఆర్డీవో, ప్రభుత్వ ఆస్పత్రి అధికారులు విచారణ జరుపుతున్నారు. -
వినాయక నిమజ్జనంలో అపశ్రుతి
బుక్కరాయసముద్రం: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల పరిదిలోని రేకులకుంట గ్రామంలో వినాయక నిమజ్జనంలో శనివారం అపశ్రుతి చోటు చేసుకుంది. మండలంలోని రేకులకుంట గ్రామానికి చెందిన సాయికుమార్(18) పట్టణంలోని ఓ సెల్ పాయింట్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం గ్రామంలో వినాయక నిమజ్జనం జరుగుతుండగా.. అందులో పాల్గొన్న సాయికుమార్ ప్రమాదవశాత్తూ.. నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన ట్రాక్టర్ కింద పడ్డాడు. దీంతో ట్రాక్టర్ కాళ్లపై నుంచి వెళ్లడంతో రెండు కాళ్లు విరిగిపోయాయి. ఇది గమనించిన స్థానికులు అతన్ని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఐసీయూల ఏర్పాటుపై అధ్యయన కమిటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ల (ఐసీయూ) ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. వైద్య విద్యా డెరైక్టర్.. చైర్మన్‌గా ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. 45 రోజుల్లోగా మౌలిక సదుపాయాలు, సిబ్బంది తదితర పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. -
సర్కారు దవాఖానాల్లో నరకయాతన
-
సర్కారు దవాఖానాల్లో నరకయాతన
* ఎక్కడ చూసినా దారుణ పరిస్థితులే.. * సిబ్బంది ఉండరు.. పరికరాలుండవు.. అన్నీ ఉంటే రోగులకు బెడ్లు ఉండవు * రోగులంటే సిబ్బందికీ లోకువే.. నానా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని తీరు * రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ‘సాక్షి’ పరిశీలన కల్పనకు నెలలు నిండాయి. ఆదివారం సాయంత్రం ఆమె భర్త రాజు హన్మకొండలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చాడు. సిబ్బంది పరీక్షించారు. అడ్మిట్ చేయాలని చెప్పారు కానీ.. బెడ్ ఇవ్వలేదు. చేసేదేమీ లేక నొప్పులు పడుతూనే ఆసుపత్రిలో రాత్రంతా ఓ మూలన పడుకుంది. సోమవారం ఉదయం మళ్లీ బెడ్ అడిగినా ఇచ్చేవారు లేరు. మధ్యాహ్నం రక్తస్రావం మొదలైంది. డ్యూటీ డాక్టర్ దగ్గరకు వెళితే... బయట కూర్చోమంటూ ఈసడింపు. అక్కడ నిల్చునే ఓపిక లేక.. వరండాలో మరో రోగి బెడ్‌పై కూర్చుండిపోయింది. చివరికి అక్కడకు వచ్చిన ‘సాక్షి’ విలేకరి ఆ ఫొటోలన్నీ తీస్తుండటంతో సిబ్బంది గమనించి.. కల్పనను బెడ్ మీదికి చేర్చారు. ఇదీ... హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో సోమవారం నాటి పరిస్థితి! (సాక్షి ప్రత్యేక బృందాలు) ఒళ్లంతా కాలినా... సూది మందు, సెలైన్ బాటిల్ తప్ప గతిలేదు కొన్ని ఆసుపత్రుల్లో. ఎక్స్‌రే యంత్రాలున్నా కమీషన్ల కోసం పక్కనున్న ప్రైవేటు డయాగ్నస్టిక్స్‌కు పంపిస్తున్నారు మరికొన్ని ఆసుపత్రుల్లో. అంబులెన్సు ఉంటే డ్రైవరుండడు... స్కానింగ్ మెషిన్లున్నా టెక్నీషియన్లుండరు.. ఏడుగురు వైద్యులుంటే ఐదుగురు లీవులోనే ఉంటారు... అన్నీ ఉన్నచోట బెడ్లు ఫుల్!. ఇలా చెప్పుకుంటూ పోతే సర్కారీ ఆసుపత్రుల్లో సమస్యలకు అంతుండదు. సోమవారం ఒక్కరోజు... ‘వైద్య విధ్వంసాన్ని’ ప్రత్యక్షంగా చూడటానికి రాష్ట్రంలోని పలు ప్రభుత్వాసుపత్రులకు వెళ్లిన ‘సాక్షి’ విలేకరులకు కొన్ని గంటల వ్యవధిలోనే ఈ దారుణాలన్నీ కనిపించాయి. దీన్నిబట్టి ఆసుపత్రుల్లో ప్రతిరోజూ ఎంతమంది నిస్సహాయంగా వెనుదిరుగుతున్నారో తెలుసుకోవచ్చు. రోగులను సాటి మనుషుల్లా చూసి.. వారి బాధను గమనించి... తక్షణ చికిత్స అందించిన ఆసుపత్రి ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించదెందుకు? ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలు లేకపోవటమన్నది కొత్త విషయం కాదు. కానీ ఉన్న సౌకర్యాలను పూర్తిస్థాయిలో వాడకపోవటం... కనీసం రోగుల్ని సాటి మనుషుల్లా చూసి వారికి సాధ్యమైన రీతిలో తక్షణ చికిత్స అందించకపోవటం... అసలు స్పందన అనేది లేకపోవటం... వీటిని పీడిస్తున్న జబ్బులు. అసలు ‘ప్రభుత్వమనేది ఉందా?’ అని డౌటొచ్చే స్థాయిలో ఆసుపత్రుల్ని పీడిస్తున్న ఈ జబ్బులకు... చికిత్స కావాలి. ఇదిగో... వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో సోమవారం ఒక్కరోజే కనిపించిన సంఘటనల సమాహారం... ఎంజీఎం ఆస్పత్రి అవుట్ పేషెంట్ విభాగంలో ఎంత పెద్ద రోగానికైనా మందు బిళ్లలే దిక్కవుతున్నాయి. సోమవారం ఆస్పత్రిలో ఓపీ ఆవరణలో చాలప కాంతమ్మ అనే వృద్ధురాలు వచ్చిపోతున్న వారిని ఆపుతూ.. ‘‘ఓ బిడ్డా.. ఇవి గుండెనొప్పి గోళీలేనా? గుండెల్లో నొప్పి ఉందని ఈడికి వచ్చిన. మందు బిళ్లలే ఇచ్చిళ్లు. దీనితోని తక్కువైత లేదు. మూడు సార్లు వచ్చినా ఈ గోళీలే (డైక్లోఫినాక్) ఇస్తున్నరు’’ అని దీనంగా అడ గడం కనిపించింది. ‘‘ఆర్నెళ్ల కిందట యాక్సిడెంట్ అయ్యింది. వెన్నుపూసల చీలిక వచ్చిందని చెప్పిళ్లు. నెల సంది ఈడ తిరుగుతున్నం. మందు బిళ్లలే ఇస్తుళ్లు.. నొప్పితో కూసోనికే వస్తలేదు. రోజుకు యాభై కిలోమీటర్లు పోయి వచ్చుడు కష్టమైతంది’’ అని కరీంనగర్ జిల్లా కమలాపురం మండలం పెద్ద పాపాయ్యపల్లికి చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఎక్కడ చూసినా అరకొర వసతులు.. బెడ్ల కోసం తిప్పలు ఎంజీఎంలో మందుబిళ్లలే దిక్కు.. వరంగల్ జిల్లా ప్రజలకు ఎంజీఎం, హన్మకొండలోని ప్రసూతి ఆసుపత్రులే పెద్దదిక్కు. ఇతర జిల్లాల నుంచి కూడా రోగులు వస్తుంటారు. రోగుల పట్ల ఆస్పత్రి సిబ్బంది నిర్దయగా వ్యవహరిస్తున్నారు. అడుగడుగునా సెక్యూరిటీ సిబ్బందికి లంచాలు సమర్పించాల్సి వస్తోంది. ఇంత కష్టపడి లోపలికి వెళ్లిన రోగులకు సరిపడా బెడ్లు అందుబాటులో లేవు. వేయి పడకల సామర్థ్యం ఉన్న ఎంజీఎం ఆస్పత్రిలో మహిళల వార్డులో రోగులకు సరిపడా బెడ్లులేక నేలపైనే పడుకోబెడుతున్నారు. అత్యవసర వైద్య సేవల విభాగంలో సరిపడా స్ట్రెచర్లు, వీల్చైర్లు లేవు. నడవలేని స్థితిలో ఉన్న రోగులను వారి బంధువులే మోసుకెళ్తూ తీసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. మంచిర్యాలకు చెందిన ఆరేళ్ల నరేశ్‌ను బైక్ ఢీకొంది. కాలు విరిగింది. ఎముక వేలాడుతోంది. దగ్గర్లోని పసరు వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. బద్దలు పెట్టి కట్టు కట్టి... పెద్దాసుపత్రికి తీసుకుపొమ్మన్నాడు. అప్పటికప్పుడు అప్పులు చేసి కరీంనగర్ పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చూసే వారే లేరు. అదేంటి! ఎమర్జెన్సీకి ఎవరూ ఉండరా? అని నరేశ్ తండ్రి చంద్రయ్య అమాయకంగా అడగ్గా.. 9 గంటలకు వస్తారన్నారు. కానీ 10 గంటల తరవాతే చీటీ రాశారు. ఎవ్వరూ సాయం చేయకపోతే తన బిడ్డను తానే స్ట్రెచర్‌పై పడుకోబెట్టి డాక్టర్ దగ్గరికి.. అక్కడ్నుంచి ఎక్స్‌రే రూమ్‌కి... అక్కడి నుంచి పట్టీ వేసే దగ్గరికి తీసుకెళ్లాడు. చివరకు బ్లడ్ టెస్టులూ అవీ చేసి... అన్నీ బాగుంటే రేపు ఆపరేషన్ చేస్తామన్నారు. లేకుంటే టైమ్ పడుతుందట!! వైద్యం కోసం ‘ప్రసవ’ వేదన.. ఏటూరు నాగారం, మంగపేట, తాడ్వాయి మండలాల్లోని దళిత, గిరిజన గర్భిణులు పురుడు పోసుకోవాలంటే చేతి నిండా డబ్బులు పట్టుకొని పట్టణాలకు పరుగులు తీయాల్సిందే! ఏజెన్సీలోని సామాజిక ఆస్పత్రిలో వైద్యాధికారుల కొరత తీవ్రంగా ఉంది. రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా అదే పరిస్థితి. సామాజిక ఆస్పత్రిలో ప్రసూతి ఆపరేషన్ గది ఉన్నా.. ఆపరేషన్ చేయడానికి వైద్యుడు, మత్తు మందు ఇచ్చే డాక్టర్ లేడు. చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం ‘‘స్త్రీలకు వచ్చే రోగాలను చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం. మహిళా డాక్టర్ ఉంటే మా బాధను చెప్పుకొని చికిత్స పొందే వాళ్లం. ఇక్కడ వారు లేక వరంగల్‌కు లేక ప్రైవేటు ఆస్పత్రికి పోవాల్సిన పరిస్థితి ఉంది’’ - కర్నె దివ్య, చెల్పాక, గర్భిణి. ఏటూరునాగారం రాజధానిలో ఇదీ పరిస్థితీ.. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి వెళితే ఎటువంటి జబ్బు అయినా నయం అవుతుందని, సకల సదుపాయాలు ఉంటాయనే ఆశతో ఎక్కడెక్కడి నుంచో రోగులు వస్తుంటారు. అయితే వాస్తవాలు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంటున్నాయి. డాక్టర్ల రాక కోసం రోగులు పడిగాపులు కాయాల్సిందే. వైద్య పరీక్షల కోసం చాలా దూరం నడిచి వెళ్లాల్సి ఉంటుంది. స్ట్రెచర్లు కూడా దొరకని పరిస్థితి అక్కడిది. డబ్బులుంటేనే పడకలు.. ఆరోగ్య శ్రీ పేషంట్లకు నెల రోజులు ఎదురు చూసినా దొరకవు. దీంతో చేసేదేం లేక ఆస్పత్రి ప్రాంగణంలోనే పడుకుంటున్నారు. నాలుగు రోజులుగా పడిగాపులు.. భార్యకు సపర్యలు చేస్తున్న ఈ వృద్ధుడి పేరు తిగుళ్ల బాలకిష్టారెడ్డి. మెదక్ జిల్లా తోగుట మండలం క్రిష్టాపురం గ్రామానికి చెందిన ఆయన.. తీవ్ర నడుంనొప్పితో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్న తన భార్య రామవ్వ (65)ను నాలుగు రోజుల కింద ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ఆస్పత్రిలో చేర్పించుకోవాలని డాక్టర్ల కాళ్లా వేళ్లా పడ్డాడు. అయితే ఓపీ చిట్టీ లేదని వైద్యులు అడ్మిట్ చేసుకోలేదు. ఓపీ చిట్టీ కోసం వెళితే రోగి లేనిదే ఇచ్చేది లేదని సిబ్బంది చెప్పారు. దీంతో ఏమీ చేయలేక నాలుగు రోజులుగా అక్కడే పడిగాపులు పడుతున్నారు. బయట దాతలు పెడుతున్న ఆహారం తిని అక్కడే ఎదురు చూపులు చూస్తున్నారు. వీరిని చూసి అక్కడి వారు చలించిపోతున్నారు. పేట్లబురుజులో ప్రసవ వేదన! రాజధానిలోని పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో నిండు గర్భిణులకు ప్రసవ వేదన తప్పడం లేదు. ఔట్ పేషంట్(ఓపీ) టోకెన్ల కోసం నానా తిప్పలు పడాల్సి వస్తోంది. తెల్లవారుజామున నాలుగు గంటలకు వెళ్లి క్యూలో నిలబడితే కానీ టోకెన్ దొరకని దుస్థితి. అసలే పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళలకు చాంతాండంత క్యూలైన్లు నరకం చూపుతున్నాయి. 600 పడకల సామర్థ్యం ఉన్న పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి నగరం నలుమూలల నుంచే కాకుండా రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, మహ బూబ్‌నగర్ జిల్లాల నుంచి కూడా రోగులు వస్తుంటారు. రక్త, మూత్ర పరీక్షల కోసం ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయించాల్సి వస్తోంది. వెళ్లిపొమ్మంటుండ్రు... ‘‘నా పెనిమిటి లేడు. కొడుకులు లేరు. అన్నింటికి కూతురే దిక్కు. కూలీనాలీ చేసుకుంటూ పొట్టనింపుకునేటోళ్లం. వారం రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్న. ఐదు రోజుల కిందట మంచిర్యాల ఏరియా ఆస్పత్రికి వచ్చిన ఇక్కడికి అచ్చిన తర్వాత డాక్టర్లు సరిగా చూస్తలేరు. కూర్చుందామన్నా.. కూర్చోవస్తలేదు. నిన్నట్నుంచి నన్ను ఆస్పత్రి నుంచి వెళ్లిపోమంటుండ్రు. ప్రైవేటు దవాఖానాలో చూపించుకునేంత డబ్బుల్లేవ్’’ - కంపెల దుర్గక్క. రోగి. పడకలు ఖాళీ లేవట.. గుంటూరు జిల్లాకు చెందిన నాగమణి గత రెండు నెలలుగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతోంది. పది రోజుల కింద వైద్యం కోసం నిమ్స్‌కు వచ్చింది. ఆరోగ్య శ్రీ కార్డులో ఉన్న పలు వైద్య పరీక్షలు చేశారు. కాలేయానికి క్యాన్సర్ వచ్చిందని, శస్త్రచికిత్స చేయాలని డాక్టర్లు నిర్ధరించినా ఇప్పటివరకు ఆస్పత్రిలో చేర్పించుకోలేదు. ఇదేంటని ప్రశ్నిస్తే పడకలు ఖాళీ లేవని సమాధానమిస్తున్నారు. చేసేదేం లేక రోగుల విశ్రాంతి శాలలో పదిరోజుల నుంచి ఉంటున్నారు. నో అడ్మిషన్ డెంగీ, విష జ్వరాలతో బాధపడుతున్న రోగులతో కరీంనగర్‌లోని ప్రభుత్వాసుపత్రి కిక్కిరిసిపోయింది. తగినన్ని బెడ్స్ లేకపోవడంతో రోగులకు ప్లాస్టిక్ మంచాలే దిక్కయ్యాయి. సెలైన్ ఎక్కించడానికి స్టాండ్లు కూడా లేవు. కిటికీ చువ్వలకే సెలైన్ బాటిళ్లు కట్టారు. ఒక కుటుంబంలో ఇద్దరు వస్తే వారికి ఒకే మంచం మీద చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నా మందులు రాసి పంపుతున్నారే తప్ప.. అడ్మిట్ చేసుకోవడం లేదు. అడిగితే.. ‘బెడ్ ఖాళీ లేదు. ఏం చేయాలే..’ అని చెబుతున్నారు. పరీక్షలు లేవు.. పారాసిటమాలే దిక్కు.. ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో మందులకు తీవ్ర కొరత ఉంది. కొత్తగూడెంలోని వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో సమస్యలు తిష్ట వేశాయి. రోగులకు సరైన సేవలు అందడం లేదు. మలేరియా, టైఫాయిడ్, డెంగీ జ్వరాలతో రోగులు బాధపడుతున్నా పారాసిటమాల్ మందుబిళ్లలిచ్చి పంపిస్తున్నారు. దీంతో పేదలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. - సాక్షి, నెట్వర్క్ రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రులు ఇవీ.. ఆసుపత్రులు సంఖ్య బోధనాసుపత్రులు 18 ప్రసూతి ఆసుపత్రులు 05 జిల్లా ఆసుపత్రులు 10 ప్రాంతీయ ఆసుపత్రులు 42 సామాజిక ఆరోగ్య కేంద్రాలు 115 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 740 ఆరోగ్య ఉప కేంద్రాలు 4,905 ప్రత్యేక నవజాత సంరక్షణ కేంద్రాలు 18 నవజాత స్థిరీకరణ కేంద్రాలు 61 నవజాత సంరక్షణ కేంద్రాలు 587 పోషకాహార పునరావాస కేంద్రాలు 13 అన్ని ఆసుపత్రుల్లో పడకల సంఖ్య 17,239 కదులుదాం.. కదిలిద్దాం.. సర్కారీ, కార్పొరేట్ వైద్యంలో మీకెదురైన చేదు అనుభవాలను.. మీరు చూసిన మంచి డాక్టర్ల గురించి ‘సాక్షి’తో పంచుకోండి. వైద్య దుస్థితిని మార్చడానికి సూచనలు కూడా తెలియజేయండి. వీటిని ప్రచురించటం ద్వారా నిర్మాణాత్మకమైన చర్చకు అవకాశమిద్దాం. మీ అనుభవాలు, ఆలోచనలను ఈమెయిల్స్, లేఖల ద్వారా ‘సాక్షి’కి పంపేటపుడు... మీ పేరు, మీకు చికిత్స చేసిన ఆసుపత్రి లేదా డాక్టరు పూర్తి పేరును, మొబైల్ నంబర్లను తప్పనిసరిగా తెలియజేయండి. మీ పేరు రహస్యంగా ఉంచాలని భావిస్తే అది కూడా రాయండి. లేఖలు, మెయిల్ పంపాల్సిన చిరునామా: ఎడిటర్, సాక్షి, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 sakshihealth15@gmail.com -
బల్లి పడిన నీళ్లు తాగి ఏడుగురికి అస్వస్థత
రాయచోటిటౌన్/చిన్నమండెం : బల్లి పడిన నీళ్లు తాగి ఏడు మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చిన్నమండెం మండలం మల్లూరు పంచాయతీ పాత వట్టెవాండ్లపల్లెకు చెందిన వేమల రాధ, రామక్రిష్టలతో పాటు వారి పిల్లలు భవ్యశ్రీ, యువరాజులు మరో ముగ్గురు సోమవారం ఇంటిలోని బానలో నీళ్లు తాగారు. పిల్లలు ముందుగా తాగారు. తరువాత పొలం వద్ద నుంచి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు కూడా అవే నీళ్లు తాగారు. అలాగే ఇంటిలోని మిగతా వారు కూడా ఒకరి తర్వాత ఒకరు ఈ నీళ్లే తాగారు. సుమారు గంట వ్యవధి తరువాత వీరిలో ముందుగా పిల్లలిద్దరికీ వాంతులు మొదలయ్యాయి. తరువాత మరో గంట వ్యవధిలో పెద్దలకు కూడా వాంతులయ్యాయి. ఇలా వరుస క్రమంలో అందరికీ వాంతులు కావడంతో ఏమి జరిగిందో తెలుసుకొనే లోగా వాంతులు అయిన వారు బానలోని నీళ్లు తీసుకుని నోరు కడిగే ప్రయత్నం చేయగా నీళ్లలో నుంచి చనిపోయి ఉబ్బిన బల్లి చేతిలో పడింది. అప్పటికి కాని వారికి ఆ నీళ్లలో బల్లి పడిన విషయం తెలియలేదు. వెంటనే అందరూ రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. -
అపోలోకు చిత్తూరు ఆస్పత్రి
- నిర్ణయం తీసుకున్న రాష్ట్ర మంత్రివర్గం - హెల్త్‌సిటీ స్థాపన పేరుతో ప్రకటన చిత్తూరు (అర్బన్): చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిని అపోలో వైద్య సంస్థలకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శనివారం విజయవాడలో జరిగిన మంత్రివర్గ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే దీన్ని నేరుగా చెప్పకుండా చిత్తూరులో హెల్త్‌సిటీ స్థాపన పేరిట మంత్రులు చెప్పడం విశేషం. నగరంలోని మురకంబట్టు వద్ద అపోలో వైద్య సంస్థలకు కేటాయించిన స్థలంలో మెడికల్ కళాశాలతో పాటు కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందించడానికి హెల్త్ సిటీని ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అపోలో హెల్త్‌సిటీ ప్రారంభం కావాలంటే ముందుగా చిత్తూరు ప్రభుత్వ వైద్యశాలను ఐదేళ్ల పాటు అపోలో సంస్థలకు లీజుకు ఇవ్వాల్సి ఉంటుంది. అపో లో వైద్య సంస్థలకు సొంత కళాశాల లేకపోవడంతో మెడిసిన్‌లో సీట్లు పొందిన విద్యార్థులు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాక్టీస్ చేయనున్నారు. ఇందుకోసం చిత్తూరు ఆస్పత్రిని క్లినిక ల్ అటాచ్మెంట్ కింద ఉపయోగించుకుంటా రు. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రిని ప్రైవేటుపరం చేయడానికి సర్కులర్ ఇవ్వడం, ఓ కమిటీని ఏర్పాటు చేసి ఇక్కడున్న వసతులు, వైద్యుల వివరాలను సేకరించిన ప్రభుత్వం తాజా నిర్ణయంతో తన వైఖరిని తేల్చేసింది. మురకంబట్టు వద్ద అపోలో సంస్థల వైద్య కళాశాలలు ప్రారంభమయ్యేంత వరకు ప్రభుత్వ ఆస్పత్రిని ఉపయోగించుకోనున్నారు. ఇందుకు తొలిగా మురకంబట్టులో ఉన్న ఖాళీ స్థలంలో హెల్త్‌సిటీ కి శంకుస్థాపన చేయడానికి అపోలో సంస్థ ఏర్పాట్లు చేసుకుంటోంది. ప్రభుత్వ పెద్దలు తేదీలు చెప్పగానే అటు శంకుస్థాపన.. ఇటు ఆస్పత్రి అప్పగింత ఒకే సారి జరిగిపోతుంది. -
పచ్చని సంసారంలో సెల్‌ఫోన్ చిచ్చు
♦ ఫోన్‌కాల్స్‌పై భార్యాభర్తల మధ్య ఘర్షణ ♦ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న భార్య ♦ చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి ♦ తాటిపల్లిలో ఘటన మునిపల్లి : అన్యోన్యంగా జీవిస్తున్న దంపతుల మధ్య సెల్‌ఫోన్ చిచ్చు పెట్టింది. ఓ ఇల్లాలి నిండు జీవితాన్ని బలితీసుకుంది. మునిపల్లి మండలం తాటిపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన గొల్ల జగన్, శోభారాణి(24) నిరుపేద దంపతులు. జగన్ సదాశిపేటలోని ఎంఆర్ఎఫ్ కంపెనీలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. శోభారాణి పిల్లలను చూసుకుంటే ఇంటి వద్దే ఉంటుంది. సదాశివపేటలోని గురునగర్ కాలనీలో చాలా ఏళ్లపాటు నివాసం ఉన్న వీరు ఆరు నెలల క్రితం స్వగ్రామమైన తాటిపల్లికి వచ్చి ఇక్కడే ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో గురువారం కూరగాయలు కొనేందుకు సంతకు వెళ్లిన శోభారాణి సాయంత్రానికి ఇంటికి వచ్చింది. అక్కడే ఉన్న భర్త సెల్‌ఫోన్‌ను పరిశీలించగా గుర్తుతెలియని ఫోన్ నంబర్లు కనిపించాయి. ఈ విషయమై భర్త జగన్‌ను నిలదీయగా అతను సమాదానం చెప్పకుండా వాటిని డిలిట్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. తీవ్ర మనస్థాపానికి గురైన శోభారాణి అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుంది. గమనించిన ఇరుగుపొరుగు వారు 108 అంబులెన్సలో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి మరింత విషమించడంతో గాంధీకి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బుదేరా ఎస్ఐ కోటేశ్వర్రావు తెలిపారు. కాగా మృతురాలికి కొడుకు, కుమార్తె ఉంది. -
ప్రభుత్వాస్పత్రిలో గర్భస్త శిశువు మృతి
కంబాలచెరువు(రాజమండ్రి) : ప్రభుత్వాస్పత్రిలో గర్భస్త శిశువు మృతి ఆందోళనకు దారి తీసింది. వైద్యుల నిర్లక్ష్యంపై బాధితులు మండిపడ్డారు. బాధితుల కథనం ప్రకారం.. కాపవరానికి చెందిన కొత్తపల్లి శాంతిదుర్గ కాన్పు కోసం పుట్టిల్లైన హుకుంపేట బాపూనగర్‌కు వచ్చింది. పురిటి సమయం దగ్గరపడడంతో రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి బుధవారం తల్లి సుగుణ, భర్త కొవ్వూరమ్మతో కలిసి వచ్చింది. సాయంత్రానికి శాంతిదుర్గకు నొప్పులు అధికంగా వస్తుండడంతో విషయాన్ని వైద్యులకు తెలిపారు. వారు ‘ఫర్వాలేదు ఫ్రీ డెలివరీ అవుతుంది, ఆపరేషన్ అవసరంలేదు’ అని చెప్పారు. మర్నాడు ఉదయం 10 గంటలకు పురిటినొప్పులు మరింత ఎక్కువయ్యాయి. విషయాన్ని మళ్లీ డ్యూటీ సిబ్బందికి తెలిపారు. వారు దురుసుగా సమాధానమిచ్చారు. దీంతో శాంతిదుర్గ కుటుంబసభ్యులు ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తామని అడిగారు. దీంతో వైద్యులు ‘ఏం మేం చెప్పేది వినరా డబ్బులు ఎక్కువగా ఉంటే తీసుకుపోండి, మాకు రూ.5 వేలు ఇస్తే ఆ ఆపరేషన్ మేమే చేసేస్తామం’ అంటూ మొదలుపెట్టారు. మధ్యాహ్నానికి ఆమెను పరీక్షించిన వైద్యులు బిడ్డకుకానీ, లేదా తల్లికి ఇద్దరిలో ఎవరోఒకరికి ప్రమాదముందని సాఫీగా చెప్పారు. మరికొద్దిసమయం గడిచేసరికి గర్భంలో శిశువు మృతిచెందాడంటూ చెప్పారు. చివరకు ప్రభుత్వాస్పత్రి వైద్యులు మృతశిశువును బయటకు తీశారు. దీంతో ఆగ్రహించిన శాంతిదుర్గ బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. మహిళలపై మగపోలీసుల జులుం ఆస్పత్రి అధికారుల తీరుకు ఆగ్రహించిన శాంతిదుర్గ కుటుంబీకులు, బంధువులు ఆస్పత్రి బయట రోడ్డుపై ధర్నా చేశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ట్రైల్ రన్ నిర్వహిస్తున్న పోలీసులకు ధర్నా కనిపించింది. ఆందోళనకారులు రోడ్డుపైనుంచి వెళ్లిపోవాల్సిందిగా పోలీసులు చెప్పారు. దీంతో ఆందోళనకారులు తమకు న్యాయం కావాలంటూ నినదించారు. దీంతో పోలీసులు జులుం ప్రదర్శించారు. ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈక్రమంలో పోలీసులు నిబంధనలను మరిచారు. రోడ్డుపై ఆందోళన చేస్తున్న మహిళలను మగ పోలీసులు చేతులుపట్టుకుని రోడ్డుపైనుంచి బయటకు లాగేశారు. స్థానిక సీఐ జోక్యం తో చివరకు ఆస్పత్రి అధికారులు బయటకువచ్చారు. జరిగిన ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
శిశువు కోసం రగడ
-
ఏడు నెలల బాలుడు కిడ్నాప్
గుంటూరు: ఇప్పుడే వస్తాను.. బాబును కొంచెం చూస్తుండమ్మా... అని చెప్పి తన ఏడు నెలల బాబును గుర్తు తెలియని మహిళకు అప్పగించి వెళ్లిన ఓ తల్లి, తిరిగివచ్చి చూసేసరికి బాబుతో సహా ఆ మహిళ మాయమైంది. ఈ సంఘటన గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు నల్లచెరువు పరిధిలోని చాకలి కుంటకు చెందిన ధనలక్ష్మి ఒంట్లో నలతగా ఉండటంతో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది. వైద్యుడిని కలవడానికి ఓపీ లోకి వెళ్లే ముందు ఆస్పత్రి ఆవరణలో ఉన్న ఒక మహిళ చేతిలో తన ఏడు నెలల బిడ్డ (రవితేజ)ను ఉంచి.. కొంచెం చూస్తుండమ్మా, వెంటనే వస్తానని చెప్పి లోపలికి వెళ్లింది. వైద్యుడిని సంప్రదించిన అనంతరం బయటకు వచ్చి చూసేసరికి సదరు మహిళ బిడ్డతో సహా కనిపించలేదు. దాంతో లబోదిబోమన్న ఆ తల్లి పోలీసులను ఆశ్రయించింది. -
ఇద్దరు పిల్లలతో బావిలోకి దూకిన తల్లి
శ్రీకాకుళం(రేగిడి): మండలంలోని లింగాలవలస గ్రామంలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను బావిలోకి తోసి తాను ఆత్మహత్యానికి పాల్పడింది. ఈ ఘటనలో తల్లి రాణి(30), కూమార్తెలు నిఖిత(8), రేష్మ(6)లు మృతిచెందారు. కుటుంబకలహాలతోటే రాణి ఈ పనికి పాల్పడినట్లు స్ధానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘కు.ని.’లో ఇంత నిర్లక్ష్యమా..?
బిచ్కుంద : మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం నిర్వహించిన కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స శిబిరంలో వైద్యుల స్పందన కరువైంది. ఆపరేషన్ చేయించుకుంటామని పలువురు బాలింతలు ముందుకు వచ్చినా.. శస్త్రచికిత్స చేసేందుకు వైద్యులు ముందుకు రాలేదు. బిచ్కుందలో బుధవారం నిర్వహించిన క్యాంపునకు సుమారు 200 మంది మహిళలు ఆపరేషన్ కోసం తరలివచ్చారు.వైద్యులు 60 మందికే ఆపరేషన్ చేస్తామని టోకెన్లు ఇచ్చారు. మిగత వారికి చేయమని చెప్పడంతో మహిళలు, వారి కుటుంబ సభ్యలు ఆందోళనకు దిగారు. ఆపరేషన్ కోసం మూడు నెలలుగా ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నామని, ఏఎన్ఎంలు, వైద్యులు పట్టించుకోవడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం... ప్రభుత్వం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకోవడానికి ముందుకు రావాలనే ఉద్దేశంతో మహిళలకు ప్రోత్సాహకంగా వెయ్యి రుపాయలు నగదు అందిస్తోంది. వారికి కు.ని.పై అవగాహన కల్పించేందుకు లక్షలు వెచ్చించి ప్రచారం నిర్వహిస్తోంది. అరుుతే ఇక్కడ మహిళలు స్వచ్ఛందంగా ముందుకొచ్చినా వైద్యులు ససేమిరా అనడం గమనార్హం. జుక్కల్, బిచ్కుంద, మద్నూర్ మండలాలకు కలిపి నెలలో ఒకేసారి క్యాంపు నిర్వహిస్తున్నారు. ప్రతీ నెల సుమారు 100 నుంచి 150 మంది మంది మహిళలు వస్తున్నా వైద్యులు మాత్రం నెలలో 60 మందికే ఆపరేషన్ చేస్తామని చెబుతున్నారు. మారుమూల గ్రామాలైన జుక్కల్, మద్నూర్ మండలాల మహిళలు సౌకర్యాలు లేకపోవడంతో బాన్సువాడ ఆస్పత్రికి వెళ్లలేక పోతున్నారు. అరుుతే నెలలో రెండు క్యాంపులు నిర్వహించాలని ప్రజా ప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. -
శిశువు తొడల్లో మంటలు
శిశువు తొడల్లో మంటలు వచ్చి చర్మం కాలిపోయే వ్యాధి ఏమిటో అంతు చిక్కడం లేదు. ఇది వైద్య వర్గాలకు ఓ సవాల్‌గా మారింది. విల్లుపురం నుంచి ఆ శిశువును కీల్పాకం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రత్యేక వార్డులో కెమెరా పర్యవేక్షణలో ఐదుగురు వైద్య బృందం ఆ శిశువుకు చికిత్స అందిస్తోంది. సాక్షి, చెన్నై : రాష్ట్రంలోని విల్లుపురం జిల్లా మైలం సమీపం నొడి గ్రామానికి చెందిన కర్ణన్, రాజేశ్వరి దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. వీరిలో నర్మద పెద్దది. కుమారుడు రాహుల్ పుట్టగానే వార్తల్లోకి ఎక్కాడు. ఆ శిశువు శరీరం నుంచి మంటలు రావడంతో ఆ వ్యాధి ఏమిటో వైద్యులకు అంతు చిక్కలేదు. వైద్య పరీక్ష అనంతరం రాహుల్ బాగానే ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఈనెల 9న మూడో బిడ్డకు జన్మనిచ్చిన రాజేశ్వరి మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఆ శిశువు శరీరంలోనూ మంటలు చెలరేగడంతో వైద్య శాస్త్రానికి మళ్లీ పరీక్ష ఎదురైంది. ఆ శిశువు కాళ్లు, తొడ భాగంలో మంటలు రావడం, ఆ భాగాలు కాలిపోవడంతో మైలం ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. రాజేశ్వరి, కర్ణన్ దంపతులకు మళ్లీ వింత శిశువు జన్మించిన సమాచారం మీడియాల్లో చూసిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత స్పందించారు. సీఎం పన్నీరు సెల్వం ద్వారా ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్ ఆ శిశువు పరిస్థితిని పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక వార్డు : ఆ శిశువును మైలం ఆస్పత్రి నుంచి శనివారం రాత్రి చెన్నై కీల్పాకం ప్రభుత్వ ఆసుపత్రికి ప్రత్యేక అంబులెన్స్‌లో తరలించారు. ఆ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు కేటాయించారు. ఆ వార్డులో ఆ శిశువును ఫోకస్ చేస్తూ ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కాలిన గాయాలకు వైద్య పరీక్షలు అందించారు. మెరుగైన వైద్య పరీక్షలను అత్యాధునిక టెక్నాలజీ ద్వారా వైద్య బృందం అందిస్తోంది. ఆ ఆసుపత్రి డీన్ గుణ శేఖరన్ నేతృత్వంలో ఐదుగురు వైద్యుల బృందం ఆ శిశువును 24 గంటల పాటుగా పరీక్షిస్తోంది. మంత్రి విజయ భాస్కర్ ఆ శిశువును పరిశీలించారు. తల్లిదండ్రుల్ని పరామర్శించి ఓదార్చారు. ఆందోళన వద్దని, అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా తమ వేదనను పరిగణించిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు ఆ దంపతులు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అంతు చిక్కని వింత : గతంలో రాహుల్ శరీరంలో మళ్లీ మంటలు రాకుండా కట్టడి చేసిన వైద్యులు, ఆ వ్యాధికి గల కారణాల అన్వేషణలో తలలు పట్టుకుంటున్నారు. అంతు చిక్కని ఈ వ్యాధి మళ్లీ రాహుల్ సోదరుడిని వెంటాడడంతో పరిశోధనల్ని తీవ్రతరం చేశారు. రాజేశ్వరికి ప్రత్యేకంగా వైద్య పరీక్షల్ని నిర్వహించి పరిశోధనకు నిర్ణయించారు. ఆమెలో ఏదేని లోపం ఉన్నదా? తద్వారా, ఈ మంటలు వస్తున్నాయూ? అన్న అన్వేషణ మొదలైంది. రాజేశ్వరి, కర్ణన్ స్వగ్రామంలో అయితే, కొత్త ప్రచారం ఊపందుకుంది. తమ గ్రామంలో దుష్ట శక్తి తిష్ట వేసిందని, ఆ కుటుంబంలో పుట్టిన మగ బిడ్డల మీద ఆ శక్తి తన ఆగ్రహాన్ని చూపుతోందన్న ప్రచారం బయలు దేరడం కొసమెరుపు. -
వైద్యోవివేకానంద
వైద్యాన్ని కూడా వ్యాపారం లాగా చేసే వైద్యులు ఉన్న ఈ రోజుల్లో... అందుకు భిన్నంగా ఓ పదిహేను మంది డాక్టర్లు స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని వైద్యులుగా తమ బాధ్యతలు నిర్వర్తిస్తూనే తమ వంతుగా సమాజ సేవ కూడా చేస్తున్నారు. వికారాబాద్ మండల పరిధిలోని ధన్నారం గ్రామ సమీపంలో ఓ అనాథ ఆశ్రమాన్ని నెలకొల్పి గత ఏడేళ్లుగా అనాథ పిల్లలకు ఆసరాగా నిలుస్తున్నారు. నేడు వివేకానందుడి జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం. - మొరంగపల్లి శ్రీనివాస్ ముదిరాజ్ సాక్షి, వికారాబాద్ సాధారణ, మధ్యతరగతి వ్యవసాయ కుటుంబానికి చెందిన డాక్టర్ రాజశేఖర్ ఈ ఆశ్రమ ఏర్పాటుకు ప్రధాన సూత్రధారి. ఈయన స్వగ్రామం మహబూబ్‌నగర్ జిల్లా, ఇటికల మండలం, మునుగాల గ్రామం. ఈయన ఎంఎస్ పూర్తి చేసి మొదట తాండూర్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్‌గా విధులు నిర్వహించారు. ఆనాటి నుంచే పలు సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. గత ఐదేళ్లుగా వికారాబాద్ ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్‌గా, సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్త్తూ సామాజిక సేవను కొనసాగిస్తున్నారు. తన ఇంటి దగ్గర కూడా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ఎవరైనా ఫీజు ఇవ్వబోతే... పక్కనే ఏర్పాటు చేసుకున్న స్వామి వివేకానందుడి పేరుమీద ఉన్న హుండీలో వేయించి, ఆ డబ్బును అనాథ పిల్లల భోజనానికి, దుస్తులకు ఖర్చు చేస్తారు. వివేకానందుడే ప్రేరణ డాక్టర్ రాజశేఖర్‌కు బాల్యం నుంచి స్వామి వివేకానంద పుస్తకాలు చదవడం అలవాటు. స్వామి వివేకానంద జీవితం డాక్టర్ రాజశేఖర్ మనస్సును మార్చేసింది. ఆయన మార్గంలోనే నడవాలని తపించేవారు. చిన్నతనంలో చదువుకునేందుకు కష్టాలు ఎదురవడంతో తనలా కష్టాల్లో ఉన్న కొందరికైనా తనవంతు సహాయాన్ని అందించాలనుకున్నారు. అందుకు వివేకానందుడి మార్గమే సరైనదని నమ్మారు. తనతోపాటు ఆ సంస్థను కొనసాగించేందుకు సహకరిస్తున్న స్నేహితులకు సేవా దృక్పథాన్ని కలిగించారు. వికారాబాద్ మారుమూల గ్రామాల్లో రోజుకు ఒకరిద్దరు ఆర్థిక కారణాలతో, కుటుంబ కలహాలతో ఆత్మహత్యా యత్నాలకు పాల్పడటం, వారు ఆస్పత్రికి వచ్చాక చికిత్స చేస్తుండగానే ప్రాణాలు కోల్పోవడం, వారి పిల్లలు అనాథలు కావడం వంటి ఎన్నో సంఘటనలు రాజశేఖర్ మనస్సును కలచివేశాయి. ఇలాంటి విషాదకరమైన ఎన్నో సంఘటనలు ‘యజ్ఞ’ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటుకు పునాదులు వేశాయి. అనాథ పిల్లలకు అండగా నిలవాలనే ఆయన తపనే ఆ ఆశ్రమం ఏర్పాటుకు దారి తీసింది. డాక్టర్ రాజశేఖర్‌కు వచ్చిన ఆలోచనను హైదరాబాద్‌లోని తన వైద్యమిత్రులు సతీష్, శైలజ, విజయ్, సురేందర్, రామకృష్ణలతో పంచుకున్నారు. రాజశేఖర్ ఆలోచనతో ఏకీభవించిన వారందరూ ‘యజ్ఞ ఫౌండేషన్’గా ఏర్పడ్డారు. అనుకున్నదే తడవుగా వీరంతా కలిసి ఆలోచనను ఆచరణలో పెట్టారు. అందుకు ప్రతిరూపమే 2007లో వెంకటాపూర్ తండా సమీపంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన అనాథాశ్రమం. నేడు మండల పరిధిలోని దన్నారం గ్రామం సమీపంలో రెండు ఎకరాలను కొనుగోలు చేసి పూర్తి స్థాయిలో భవనం నిర్మించి అక్కడే పాఠశాలను, వసతిగృహాన్ని ఏర్పాటు చేసి, యజ్ఞ అనాథ ఆశ్రమం నిర్వహిస్తున్నారు. ఇటీవలే ఎండీ పూర్తి చేసిన డాక్టర్ రాజశేఖర్ భార్య శైలజ కూడా అనాథ పిల్లలకు ఆసరాగా నిలుస్తున్నారు. ఆటపాటల్లోనూ శిక్షణ ప్రస్తుతం యజ్ఞ ఆశ్రమంలో 58 మంది అనాథ పిల్లలు విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. పదిమంది ఉపాధ్యాయులతో ఎనిమిదవ తరగతి వరకు అక్కడ పాఠాలు బోధిస్తున్నారు. ఈ ఆశ్రమంలో ఉన్న పిల్లలంతా మూడు నుంచి పదమూడు లోపు వారే. ప్రతిరోజు వీరికి విద్యాబోధనతో పాటు ఆటపాటల్లో శిక్షణ ఇస్తున్నారు. తాము అనాథలమనే భావన వారి దరి చేరకుండా ప్రేమానురాగాలను పంచుతున్నారు. -
అయ్యో పాపం.. ఏమయ్యిందో!
యలమంచిలి: యలమంచిలిలో గురువారం రాత్రి చోటుచేసుకున్న సంఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసింది. స్థానిక బస్‌కాంప్లెక్స్ సమీపంలో నడిరోడ్డుపై సుమారు 28 ఏళ్ల మహిళ రోడ్డుపై పాక్కుంటూ కనిపించింది. అతికష్టం మీద పక్కన ఉన్న వాణిజ్య సముదాయం మెట్లపైకి చేరుకుంది. తరువాత స్పృహ కోల్పోయింది. మద్యం వాసన వస్తోంది. ఆమె శరీరంపై దుస్తులు చెదిరిపోయి ఉండటాన్ని గమనించిన కొందరు మహిళలు దుస్తులు సరిచేశారు. ఆమె వెంట సుమారు ఏడాది చిన్నారి కూడా ఉంది. ఇది గమనించిన విలేకరులు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఫిర్యాదు ఉంటేగాని తాము పట్టించుకోలేమని చెప్పడం విశేషం. సాక్షి విలేకరి ద్వారా విషయం తెలుసుకున్న యలమంచిలి ఐసీడీఎస్ సీడీపీవో విజయ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అప్పటికి స్పృహలోకి వచ్చిన ఆ మహిళ నుంచి వివరాలు సేకరించే ప్రయత్నం చేసినప్పటికీ ఏమీ చెప్పలేకపోయిది. ఆ మహిళ చిన్నారికి తాత్కాలిక ఆశ్రయం కల్పించి, తరువాత యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి సీడీపీవో తరలించారు. ఎవరో ఆమెకు పూటుగా మద్యం తాపించి అత్యాచారం చేసి వెళ్లిపోయి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. అంతకు ముందు ఆమెను ఎవరో కొందరు వ్యక్తులు ఆటోలో తీసుకొచ్చి యలమంచిలి బస్‌కాంప్లెక్స్ సమీపంలో నడిరోడ్డుపై వదిలి వెళ్లిపోయారని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. -
చికిత్స కోసం వస్తే... చూపు పోయేలా...
* పీహెచ్సీ సిబ్బంది నిర్వాకం * ఆందోళనకు దిగిన బాధితుల బంధువులు దుగ్గొండి : కంటికి దురద ఉందని చికిత్స కోసం సర్కారీ దవాఖానకు వెళితే సిబ్బంది ఇచ్చిన చుక్కల మందుతో ఉన్న చూపే పోయే పరిస్థితి నెలకొంది. దుగ్గొండి మండలంలోని మైసంపల్లి గ్రామానికి చెందిన దళితుడు బోయిన మల్లేష్‌కు కంటి దురదతోపాటు మంట ఉండడంతో ఈ నెల 8న మండల కేంద్రంలోని పీహెచ్‌సీకి వెళ్లాడు. అక్కడ అప్పటికి వైద్యుడు లేడు. డ్యూటీలో ఉన్న స్టాఫ్ నర్సు భోజనానికి వెళ్లిన సమయంలో ఆస్పత్రి సిబ్బందికి చూపించుకున్నాడు. వారు ఓపీ రిజిస్టర్లో పేరు రాసి కంటికి సంబంధించిన డిసీజ్‌గా గుర్తించి చుక్కల మందుతో పాటు 10 ఏవిల్ ట్యాబ్లెట్లు ఇచ్చారు. జెంటామైసిన్ చుక్కల మందుకు బదులు మలేరియా వ్యాధి నిర్ధారణ కోసం రక్త పరీక్షలో ఉపయోగించే మలేరియా ఏజీ.పీ.ఎప్.పీవీ చుక్కల మందును నిర్లక్ష్యంగా అందించారు. బాధితుడు ఇంటికి వెళ్లి చుక్కల మందు కంట్లో వేసుకున్నాడు. కొంత సేపటి తర్వాత కండ్లు విపరీతంగా మంటలు వచ్చాయి. ఆ తర్వాత మరుసటి రోజు 9న దుగ్గొండి పీహెచ్‌సీకి రాగా సిబ్బంది పరిశీలించి వరంగల్‌కు వెళ్లాలని సెలవిచ్చారు. దీంతో ఆయన పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. కళ్ల శుక్లాలకు ప్రమాదం ఉందని 10 రోజుల పాటు ఆస్పత్రిలో అడ్మిట్ కావాలని సూచించాడు. చేతిలో చిల్లిగవ్వలేక తిరిగి ఇంటికి వచ్చి బుధవారం ఉదయం దుగ్గొండి పీహెచ్‌సీకి బంధువులతో కలిసి వచ్చి ఆందోళనకు దిగాడు. వైద్యాధికారి కొంరయ్యతో వాగ్వాదానికి దిగారు. తాను వైద్యం చేయలేదని తప్పుడు వైద్యం అందించిన వ్యక్తిని గుర్తించి చర్య తీసుకుంటానని చెప్పారు. వెంటనే బాధితుడిని 108 వాహనంలో వరంగల్ ప్రాంతీయ కంటి ఆస్పత్రికి పంపించారు. ఈ ఆందోళనలో టీఎమ్మార్పీఎస్ నాయకులు కొమ్ముక సంజీవ, బొట్ల నరేష్, బట్టు సాంబయ్య ఉన్నారు. -
యమ ధర్మపురి
చెన్నై, సాక్షి ప్రతినిధి : ఏడాది పొడవునా కొనసాగుతున్న పురిటి బిడ్డల మరణాలపై అటు ప్రభుత్వం, ఇటు ధర్మపురి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రి సైతం భగవ ద్గీత బాటపట్టాయి. ఇవన్నీ సహజమరణాలేనని తేల్చేశాయి. ఆరోగ్యంపై అవగాహనా లేమే కారణమంటూ ప్రజలపై నెట్టేశాయి. ఈ ఏడాది నవంబరు వరకు 321 మంది చిన్నారులు మృత్యువాత పడడం ఆస్పత్రి యంత్రాంగం బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోంది. పెరుగుతున్న శిశుమరణాలు సంఖ్యాపరంగా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్న రాష్ట్రంలోని ఆస్పత్రులు శిశుమరణాలను అరికట్టలేకపోతున్నాయి. నాలుగేళ్ల వివరాలను పరిశీలిస్తే ఇది తేటతెల్లం అవుతోంది. 2011లో 2,350 శిశువులు జన్మించగా 270 మంది (11.4శాతం) మృత్యువాత పడ్డారు. 2012లో 3,623కు గానూ 374 మంది (10.3శాతం), 2013లో 4,155కు గానూ 445 మంది (11శాతం) కన్నుమూశారు. ఇక ఏడాది నవంబరు వరకు 4,143 పిల్లలు జన్మించగా 445 మంది (10.74 శాతం) ప్రాణాలు విడిచారు. శిశువుల పాలిట నరకంప్రస్తుతం వార్తల్లోకి ఎక్కిన ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రిలో 2011 ఫిబ్రవరి 23న చిన్నపిల్లల అత్యవసర విభాగాన్ని ప్రారంభించారు. ఆక్సిజన్, వెంటిలేటర్, ఇంక్యుబులేటర్ తదితర అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులో ఉంచారు. ధర్మపురి జిల్లాతోపాటూ హోసూరు, కృష్ణగిరి, వేలూరు తదితర జిల్లాల నుంచి రోజుకు సగటున 2500 మంది ఔట్‌పేషెంట్లుగా, 900 మంది ఇన్పేషెంట్లుగా వైద్యసేవలు పొందుతుంటారు. అయినా ఆ ఆస్పత్రిలో శిశుమరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో 539 మంది జన్మించగా 34 మంది ప్రాణాలు విడిచారు. మేలో 514కు 39 మంది, జూన్‌లో 444 మందికి 48 మంది, జూలైలో 518కి 41, ఆగస్టులో 485కి 35, సెప్టెంబరులో 504కు 41, అక్టోబరులో 579 మందికి 48మంది, నవంబరులో ఇప్పటి వరకు 35 మంది చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అంటే ఈ ఒక్క ఏడాదిలోనే ధర్మపురి ఆస్పతిలో 321 మంది మృత్యువాత పడ్డారు. గత ఐదు రోజుల్లో 12 మంది చిన్నారులు విగతజీవులుగా మారి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు. మరో 16 మంది చిన్నారులు మృత్యువుతో పోరాడుతున్నారు. అవగాహనే లోపమట ఈ శిశుమరణాలకు ప్రజల్లో అవగాహనలేమే కారణమంటూ ప్రభుత్వం వాదిస్తోంది. రాష్ట్రంలో అటవీ సమీప గ్రామాల సంఖ్య గణనీయంగానే ఉంది. అక్కడి ప్రజలకు ఇప్పటికీ సరైన విద్యా, వైద్య సౌకర్యాలు లేవు. కుటుంబ నియంత్రణ, ఆరోగ్యం, అక్షరాస్యత, బాల్యవివాహాల వల్ల ఒనగూరే నష్టాలపై అవగాహన వారు అక్కడ లేరు. కడుపేదరికం వారిపాలిట మరోశాపంగా ఉంది. దీంతో అక్కడి గృహిణులు బిడ్డ బిడ్డకు పాటించాల్సిన వ్యవధిని అవలంభించరు. దీంతో తల్లీ బిడ్డకు పౌష్టికాహారం కరువైపోతుంది. ఈ పరిణామాలు కాన్పు సమయంలో బిడ్డను రోగగ్రస్తం చేస్తున్నాయి. నెలలు నిండకుండానే జన్మించడం, కనీస బరువులేకుండానే పుట్టడం మృతికి దారితీస్తున్నారుు. ఇది కొంతవరకు నిజమైనా ఈ లోటును సరిదిద్దేందుకు ఇన్నాళ్లూ ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయనేది ప్రశ్నగా మిగిలింది. తమిళనాడు వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ గీతాలక్ష్మి సైతం ఇవే విషయాలను ధృవీకరించారు. చనిపోతున్న చిన్నారులు 1.25 కిలోల నుంచి 2 కిలోల బరువుంటున్నారని, వారి శరీరం చికిత్సకు సైతం సహకరించడం లేదని చెప్పారు. భారత దేశంలో సగటున వెయ్యిమందికి 21 మంది చిన్నారులు, రాష్ట్రంలో వెయ్యిమందికి 15 మంది చిన్నారులు పుట్టిన నాలుగువారాల్లోనే మరణిస్తున్నట్లు ఆమె చెప్పారు. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సైతం ప్రభుత్వ తప్పిదం ఏమీ లేదని సమర్థించుకున్నారు. మరి కొనసాగుతున్న శిశుమరణాలను అరికట్టేవారెవరో? చిన్నారుల మృతిపై గగ్గోలు ధర్మపురి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వరుస శిశు మరణాలతో ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యవసర చిన్నపిల్లల విభాగంలో గత కొంతకాలంగా చికిత్స పొందుతున్న పురిటిబిడ్డలు వరుసకట్టి ప్రాణాలు విడుస్తున్నారు. ఈ నెల 14న ఐదుగంటల వ్యవధిలో వరుసగా ఐదుగురు, 15వ తేదీ మరో చిన్నారి, 16,17 తేదీల్లో ముగ్గురు మగ, ఇద్దరు ఆడ శిశువులు మృతి చెందారు. అంటే కేవలం నాలుగురోజుల్లో మొత్తం 11 మంది చిన్నారులు కన్నుమూశారు. ఈనెల 17వ తేదీ నాటికి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 70 చిన్నారుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా మారడంతో సేలం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అక్కడ మరో బిడ్డ కన్నుమూసింది. గత వారం పది రోజుల్లో అక్కడ 10 మంది చిన్నారులు మృత్యువాతపడ్డారు. ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రస్తుతం 73 మంది చిన్నారులుండగా వారిలో 14 మందికి అత్యవసర చికిత్స చేస్తున్నారు. మరో నలుగురి పరిస్థితి సీరియస్‌గా ఉంది. ఆరోగ్యమంత్రి డాక్టర్ విజయభాస్కర్ బుధవారం ఆస్పత్రిని సందర్శించారు. వైద్య మంత్రి రాజీనామా చేయాలి : బీజేపీ వరుస శిశుమరణాలకు నైతికబాధ్యత వహించి వైద్య ఆరోగ్యశాఖా మంత్రి డాక్టర్ విజయభాస్కర్ పదవికి రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం డిమాండ్ చేశారు. ఒక వైద్యురాలిగా చెబుతున్నా, అక్కడ కనీస వసతులు లేవు, తగిన సిబ్బంది లేరని ఆమె తప్పుపట్టారు. ప్రభుత్వాసుపత్రుల్లో వాస్తవ స్తితిపై శ్వేతపత్రం ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. చిన్నారుల చావుకు కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డీఎంకే అధినేత కరుణానిధి డిమాండ్ చేశారు. -
అయ్యో.. పాపం
అనంతపురం రూరల్ : అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో పది రోజుల వయసున్న పాప గుక్కపట్టి ఏడుస్తోంది.. ఎవరీ పాప అని ఆరా తీస్తే ఎవరూ ముందుకు రాలేదు. పోస్టునేటల్ వార్డులో 3వ నంబర్ మంచంలో శుక్రవారం సాయంత్రం ఓ పాపను వదిలేసి వెళ్లారు. అసలు పోస్టునేటల్ వార్డులోనే ఆ పసికందును ఎందుకు వదిలేసి వెళ్లారో అర్థం కావడం లేదు. నిత్యం రద్దీగా ఉండే వార్డులో బయటి వ్యక్తులు వచ్చి పాపను వదిలి వెళ్లే అవకాశమే ఉండదు. ఆ యూనిట్ బాలింతలు, వారి బంధువులతో కిటకిటలాడుతుంటుంది. అటువంటిది ఆ వార్డులో బయటి వ్యక్తులు ఏవిధంగా వచ్చారో అర్థం కావడం లేదు. అడ్మిషన్లో ఉండే ఎవరైనా వదిలి వెళ్లారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆడపిల్ల కావడంతో వదిలేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. వార్డులోని నర్సులు విషయాన్ని గైనిక్ హెచ్ఓడీకి తెలిపారు. పాపను ఎస్సీఎన్యూలో ఉంచాలని వైద్యులు ఆదేశించారు. బేబికి 10 నుంచి 15 రోజుల వయసు ఉండవచ్చని, ఆరోగ్యంగా ఉందని తెలిపారు. ఆస్పత్రిలో పాల కోసం పాప అల్లాడిపోయింది. అక్కడున్న స్టాఫ్‌నర్సులే డబ్బా పాలనందించారు. టూటౌన్ పోలీసులు పసికందు గురించి ఆరా తీశారు. కే షీట్లను పరిశీలించారు. ఎస్ఎన్సీయూ, పోస్టునేటల్, లేబర్ వార్డులలోని సిబ్బందిని ప్రశ్నించారు. -
వైద్యాధికారులూ.. పద్ధతి మార్చుకోండి
నరసరావుపేటవెస్ట్: ప్రజలు ఆస్పత్రికి వచ్చేది రోగాలు తగ్గించుకునేందుకా.. లేని జబ్బులు తగిలించుకునేందుకా..? అని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట ప్రభుత్వాస్పత్రి వైద్యాధికారులను నిలదీశారు. వైద్యశాలలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండటం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోకుంటే పై అధికారులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. గురువారం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి చైర్మన్‌గా హాజరయ్యేందుకు వెళ్లిన ఆయన వైద్యశాల పరిసరాలను, పలు విభాగాల తనిఖీ చేశారు. ఏఆర్టీ సెంటర్ సమీపంలో మృతుల శరీర భాగాలు ప్లాస్టిక్ కవర్లలో చుట్టి పడేసి ఉండటం చూసి సూపరిండెంట్ టి.శ్రీనివాసరావును ప్రశ్నించారు. కనీసం రోజుకు ఒక అరగంటైనా వైద్యశాల పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టమని ఆర్ఎంవో మోహనశేషుప్రసాదు, సూపరిండెంట్లకు ఆదేశాలు జారీచేశారు. పైపులు పగిలి మల, మూత్రాలు బయట కన్పించటం, ఏఆర్టీ సెంటర్ వద్ద కుండీల్లో చెత్త పేరుకుపోయి ఉండటం గమనించి ‘రోజు చూడటంలేదా.. నీకు కన్పించటంలేదా..వైద్యశాలకు రోగులు వచ్చేది రోగాలు తగిలించుకునేందుకా’..అని పారిశుద్య సూపర్వైజర్పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిరోజూ చెత్తను తీసేయాలని సూచించార. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పారిశుద్ధ్యం నిర్వహణ బాగాలేదన్నారు. వైద్యశాలలో వైద్య సిబ్బంది కొరత కారణంగా పేదలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వంద పడకల వైద్యశాలకు మరో వందపడకలకు అనుమతి లభించిందని చెప్పారు. బ్లడ్ బ్యాంకు నిర్వాహణ బాగుందని ప్రశంసించారు. రాబోయే రోజుల్లో వైద్యశాలను మరింత అభివృద్ది చేస్తామని చెప్పారు. అనంతరం అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు పిల్లి ఓబుల్‌రెడ్డి, కె.శంకరయాదవ్, కందుల ఎజ్రా, ఎస్.సుజాతాపాల్, పంగులూరి విజయకుమార్, పాలపర్తి వెంకటేశ్వరరావు, బొమ్ము జయరావు, ఎం.రమణారెడ్డి, హుస్సేన్, డాక్టర్లు పాల్గొన్నారు. -
కర్నూలులో 200 ఎకరాల్లో రిమ్స్ స్థాయి ఆసుపత్రి
కర్నూలు (హాస్పిటల్) : రాష్ట్ర విభజన నేపథ్యంలో కర్నూలులో 200 ఎకరాల్లో రాయలసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (రిమ్స్)గా కర్నూలు సర్వజన ప్రభుత్వాసుపత్రిని తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. శుక్రవారం కర్నూలులోని వైద్య కళాశాల కొత్త ఆడిటోరియంలో 37వ రాష్ట్ర స్థాయి శస్త్ర చికిత్స నిపుణుల(సర్జన్ల) సదస్సు నిర్వహించారు. ఆంధ్ర, తెలంగాణ జిల్లాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో పని చేసే సర్జన్లు, టీచింగ్ ఫ్యాకల్టీ, పీజీ వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉప ముఖ్యమంత్రి సదస్సును జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1956 సంవత్సరంలో 50 మంది వైద్య విద్యార్థులతో ప్రారంభమైన కర్నూలు మెడికల్ కళాశాల, ప్రభుత్వాసుపత్రి ఇప్పుడు 200 మంది విద్యార్థులకు చేరుకోవడంలో తనవంతు సహాయ సహాకారాలు ఉన్నాయన్నారు. పీజీ వైద్య విద్యార్థులకు ఆధునిక భవనాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రాష్ట్రాన్ని ఏ ఒక్కరూ వేలెత్తి చూపకుండా సింగపూర్, మలేషియాలాగా అభివృద్ధి చేస్తామన్నారు. సదస్సులో సర్జన్లు మరిన్ని మెలకువలు, ఆధునిక చికిత్సా విధానాలు తెలుసుకుని పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ జి.శాంతారావు మాట్లాడుతూ కర్నూలు చరిత్రలోనే కర్నూలు వైద్య కళాశాలకు ఎంతో పేరుందన్నారు. వచ్చే ఏడాది నుంచి సూపర్ స్పెషాలిటీ పీజీ కోర్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. రోగులకు అవసరానికి మించి యాంటీబయాటిక్ మందులు ఇవ్వడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందన్నారు. -
మంత్రి కామినేనికి చుక్కెదురు
-
క్షణాల్లో దుర్ఘటన.. ఐదుగురి దుర్మరణం
రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది. లారీ రూపంలో పొంచి ఉన్న మృత్యువు ఐదుగురిని బలితీసుకుంది. విధి నిర్వహణలో ఉన్న రెవెన్యూ ఉద్యోగులతో పాటు స్థానికుడు దుర్మరణం చెందారు. కలెక్టర్ రాక కోసం నిరీక్షిస్తూ పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్న వీరిపై అతి వేగంగా వస్తున్న లారీ దూసుకెళ్లి.. బోల్తా పడింది. క్షణాల్లో ఆ ప్రాంతం రక్తసిక్తమైంది. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఘటనా స్థలంలో విషాదం అలుముకుంది. - విధుల్లో ఉన్న ఉద్యోగులపైకి దూసుకొచ్చిన లారీ - ఆర్ఐ, ముగ్గురు తలారులు, మరో వ్యక్తి మృతి - తహశీల్దార్, వీఆర్వో, తలారికి తీవ్ర గాయాలు - నన్నూరు గ్రామ సమీపంలో ఘటన - కలెక్టర్ కోసం ఎదురుచూస్తుండగా ప్రమాదం సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు పెద్దాసుపత్రి కన్నీటి సంద్రమైంది. ఐదుగురు మృతి వార్తతో కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో రోదనలు మిన్నంటాయి. ఘటనా స్థలంలోనే ముగ్గురు మరణించగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు తనువు చాలించారు. ఆసుపత్రిలో హడావుడి.. అధికారులు, నేతల పరామర్శల నడుమ ఏమి జరుగుతుందో తెలియని దయనీయ స్థితి. ఒకరు చనిపోయారంటే.. మరొకరు ఇంకా బతికే ఉన్నారంట అనే సమాచారం గందరగోళానికి గురి చేసింది. ‘చివరి’ వరకు తమ కుటుంబ పెద్ద కోలుకుంటారనే ఆశ. ఘటనా స్థలం నుంచి ఆసుపత్రికి తరలించే వరకు ఎందరు శ్రమించినా.. వైద్యులు శక్తివంచన లేకుండా కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఆ కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ఇక మాకు దిక్కెవరంటూ తలారి రామకృష్ణ భార్య ఈశ్వరమ్మ.. కుమారుడు, కవలలైన ఇద్దరు ఆడ పిల్లలతో కలసి రోదించడం అక్కడున్న వారిని సైతం కంటతడి పెట్టించింది. అంబులెన్స్ డ్రైవర్‌గా పని చేస్తూ ఎందరో ప్రాణాలు కాపాడిన హుసేనాపురం గోపాల్ మృతితో ఆయన స్వగ్రామం కన్నీరుమున్నీరైంది. ‘‘పెద్ద సారోళ్లు వచ్చారంట. పని అయిపోగానే మధ్యాహ్నానికి తిరిగొస్తాం’’ అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన నిరుపేద తలారులు శివరాముడు, వెంకటేశ్వర్లు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారనే విషయం తెలిసి వారి కుటుంబ సభ్యులు కుప్పకూలారు. విధి నిర్వహణలో విషాదం రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర జిల్లాల్లో విద్యాసంస్థల ఏర్పాటుకు అనువైన స్థలాల వివరాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సేకరిస్తున్నాయి. ఆ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) ఏర్పాటుకు సుమారు 300 ఎకరాల భూమి అవసరమని ప్రభుత్వం కోరగా.. అధికారులు భూ సేకరణలో నిమగ్నమయ్యారు. జిల్లాలోని ఓర్వకల్లు మండలం నన్నూరు సమీపంలో అనువైన భూములు ఉండటంతో జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి బుధవారం ఉదయం పరిశీలన నిమిత్తం ఓర్వకల్లుకు బయలుదేరారు. విషయం తెలుసుకున్న ఓర్వకల్లు తహశీల్దార్ సునీతాబాయి, ఆర్ఐ శ్రీనివాసులు, తలారులు శివరాముడు, రామకృష్ణ, వెంకటేశ్వర్లు కర్నూలు-నంద్యాల రహదారిలోని గడెంతిప్ప వద్ద రోడ్డు పక్కన వేచి చూస్తున్నారు. హుసేనాపురానికి చెందిన గోపాల్ కర్నూలుకు వెళ్తూ తన స్నేహితుడు, అధికారులు కనిపించడంతో వారి వద్దకు వెళ్లి పలకరించాడు. కలెక్టర్ రాక కోసం ఎదురుచూస్తున్న వీరంతా పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఓ మృత్యు వాహనం వారి వైపునకు దూసుకొచ్చింది. మహారాష్ట్రకు చెందిన లారీ సిలికా లోడ్‌తో కర్నూలు వైపునకు వస్తూ రోడ్డు పక్కన నిల్చొన్న ఉద్యోగుల మీదుగా వెళ్లింది. ఘటనలో గ్రామ సేవకులు శివరాముడు(36), వెంకటేశ్వర్లు(43), హుసేనాపురం గోపాల్(28) అక్కడికక్కడే మరణించగా.. రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు(45), గ్రామ సేవకుడు రామకృష్ణ(45)లు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన తహశీల్దార్ సునీతాబాయి, పూడిచర్ల వీఆర్వో తిమ్మయ్య, నన్నూరు తలారి నాయుడును కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరితో పాటు అక్కడే ఉన్న సర్వేయర్ మల్లికార్జున, పత్రికా విలేకరులు గోపాల్, రాజేంద్రలు తమవైపునకు దూసుకొస్తున్న లారీని గమనించి పక్కకు దూకడంతో ప్రాణాలతో బయటపడ్డారు. లారీ డ్రైవర్, క్లీనర్ పరారీలో ఉన్నారు. 45 మీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ అధికారుల మీదుగా వెళ్లిన లారీ వారిని 45 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. వేగంగా వస్తున్న లారీ తమ వైపునకు వస్తుందని గ్రహించలేక భూముల వివరాలు మాట్లాడుతూ ఉండిపోయారు. తప్పించుకోవాలన్నా వెనుక ముళ్లకంచె ఉండటంతో సాహసం చేయలేకపోయారు. లారీ ముందుగా తహశీల్దార్‌ను ఢీకొనగా.. తలారులు ఒకరినొకరు పట్టుకుని తప్పించుకోవాలని ప్రయత్నించినా రెప్పపాటులో లారీ కింద నలిగిపోయారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల రోదనలు ఘటనా స్థలంలో మిన్నంటాయి. ఆసుపత్రికి భారీగా తరలిన రెవెన్యూ ఉద్యోగులు... ప్రమాదంలో గాయపడి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించేందుకు రెవెన్యూ ఉద్యోగులు భారీగా తరలివెళ్లారు. సహచరులు మరణించడంపై ప్రతి ఒక్కరిలో ఆందోళన వ్యక్తమయింది. కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి, జేసీ కన్నబాబు, ఏజేసీ అశోక్‌కుమార్, డీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి రమణరావు, జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సంపత్‌కుమార్, రెవెన్యూ సంఘం నాయకులు రామన్న, సుధాకర్‌రావు, సిరాజ్ ఉద్దీన్, రాజశేఖర్‌బాబు, సుబ్బరాయుడు, సత్యదీప్, పలువురు.. మృతుల కుటుంబాలను, గాయపడి చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం కర్నూలు(కలెక్టరేట్): రోడ్డు ప్రమాదంలో మరణించిన రెవెన్యూ ఉద్యోగుల కుటుంబాలకు రూ.10 వేల ప్రకారం ఆర్థిక సహాయం అందిస్తున్నట్లుగా జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సంపత్‌కుమార్ తెలిపారు. ఈ ఆర్థిక సహాయాన్ని అసోసియేషన్ ద్వారా తక్షణం ఇస్తున్నట్లు చెప్పారు. భూములను సర్వే చేస్తున్న రెవెన్యూ ఉద్యోగులపై భారీ వాహనం దూసుకురావడంతో ఒక ఆర్ఐతో పాటు ముగ్గురు వీఆర్ఏలు మరణించారని, ఈ సంఘటన రెవెన్యూ శాఖలో తీవ్ర విషాదాన్ని నింపిందన్నారు. మృతిచెందినవారి కుటుంబాలను, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించినట్లు పేర్కొన్నారు. విధి నిర్వహణలో మరణించినవారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరణించిన వారి కుటుంబాల్లో చదువుకున్న పిల్లలకు తక్షణం ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలన్నారు. బాధిత కుటుంబాలకు ఇంటి స్థలాలు కూడా ఇవ్వాలన్నారు. అన్ని విధాలా ఆదుకుంటాం : కలెక్టర్ సుదర్శన్ రెడ్డి కర్నూలు(కలెక్టరేట్): మృతుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదం తనకు తీవ్ర దిగ్భ్రాంతిని కల్గించిందని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు తక్షణ సహాయం కింద రూ.25 వేల ప్రకారం ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. తగిన పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చే విధంగా వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగా అందాల్సినవన్నీ త్వరలోనే అందజేస్తామని పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన తహశీల్దార్ సునీతాబాయి పరిస్థితి విషమంగానే ఉందని, ఆమె కోలుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చనిపోయిన కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు. -
టేస్ట్ అదుర్స్!
వేసవి తాపం మొదలైంది.. బయటికెళ్లిన వారు దారిలో ఏదో ఒక పానీయం తాగి కడుపు చల్లబరుచుకోవాలనుకునే రోజులివి. అవీ ఇవీ ఎందుకు.. ఎంచక్కా పుదీనా జ్యూస్ తాగి కొత్త రుచి ఆహ్వానించండంటున్నారు పద్మావతి, వీరేష్ దంపతులు. గుత్తికి చెందిన వీరు కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో పుదీనా జ్యూస్ సెంటర్ నిర్వహించారు. వ్యక్తిగత కారణాలతో ఈ ఏడాది అనంతపురం వచ్చారు. ప్రభుత్వాస్పత్రి సమీపంలోని తెలుగుతల్లి సర్కిల్లో తోపుడు బండిపై మజ్జిగతో పాటు పుదీనా జ్యూస్ విక్రయిస్తూ నగరవాసులను ఆకట్టుకుంటున్నారు. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం అంటూ పలువురు లొట్టలేసుకుంటూ తాగేస్తున్నారు. -
రైలు బెర్తులు కాదు...
సరుబుజ్జిలి, న్యూస్‌లైన్ :ఇదేమిటి ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చున్నారు. ఇదేమైనా రైలు బెర్తులపై కూర్చుని ప్రయాణిస్తున్నారు అని మనం అనుకుంటే పప్పులో కాలేసినట్టే. సరుబుజ్జిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ఆశ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. వసతి ఇరుకుగా ఉండడంతో తప్పని సరిస్థితుల్లో ఆస్పత్రి బెడ్లపై ఇలా ఎదురెదురుగా కూర్చున్నారు. వసతి సమస్య కారణంగా పీహెచ్సీలో ఏ సమావేశం నిర్వహించినా ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది -
ముర్ు పర్ రహం కరో..!
ముర్ు పర్ రహం కరో..! అరచేతిలో వైకుంఠం చూపడం అధికారులకు అలవాటే. సంక్షేమ ఫలాలు అందరికీ అందిస్తున్నామంటూ ప్రకటనల ద్వారా ప్రగల్భాలు పలకడం వారికి పరిపాటే. పలువురు పేదల జీవితాల్లో తొంగిచూస్తే అధికారులు చెప్పుకుంటున్నదంతా ఉత్తిదే అనిపిస్తుంటుంది. నగరానికి చెందిన జాన్‌బీ పరిస్థితి అలాంటిదే. పుట్టుకతో మూగ అయినప్ప టికీ ఆమెను కనికరించే వారు కరువయ్యారు. ‘ముర్ు పర్ రహం కరో..’ (నాపై కరుణ చూపండి) అంటూ పలకని గొంతుకతో ఆమె వేడుకుంటోంది. నగరంలోని ఆర్డీఓ కార్యాలయం సమీప హైమద్నగర్కు చెందిన జాన్‌బీ పుట్టుకతో మూగ. నిరుపేద కుటుంబంలో ఆమె 1978లో జన్మించింది. తండ్రి షేక్ హిదాయతుల్లా. బండరాళ్లు, కంకర సరఫరా చేస్తూ పిల్లలను పోషించుకున్నాడు. జాన్‌బీకి ఇద్దరు పిల్లలు. భర్త షేక్ మునీర్‌పాషా వెల్డింగ్‌షాపులో పనిచేస్తున్నాడు. చాలీచాలని రోజువారీ వేతనంతో బతుకుబండిని లాగుతున్నాడు. జాన్‌బీకి వంద శాతం వైకల్యం ఉందంటూ 1990లో జిల్లా ప్రభుత్వాస్పత్రి సర్టిఫికెట్ మంజూరు చేసింది. అనంతరం ఆమెకు రైల్వే శాఖ రాయితీ పాస్ కూడా ఇచ్చింది. తనకు పింఛను కూడా ఇవ్వాలంటూ జాన్‌బీ అధికారులకు పలుమార్లు కోరింది. గ్రీవెన్స్‌సెల్‌లో దరఖాస్తు చేసుకుంది. అయినప్పటికీ పట్టించుకున్న దాఖలాలులేవు. ఈ నేపథ్యంలో ఎంపీ నామా నాగేశ్వరరావును కలిసి జాన్‌బీ తన గోడు వినిపించింది. భర్త పనిచేయగా వచ్చే డబ్బుతో కుటుంబం గడవడం కష్టంగా ఉందని, పిల్లల చదువులు భారంగా మారాయని సైగలతో వివరించింది. అయినా ఆమెకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. దీంతో జాన్‌బీ కన్నీటి పర్యంతమవుతోంది. తనకు పింఛను ఇప్పిస్తే ఆసరాగా ఉంటుందని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పెడచెవిన పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. చివరకు వికలాంగుల శాఖ సంక్షేమ అధికారిని కూడా జాన్‌బీ కలిసిందని, అయినా పింఛను మంజూరు కాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. తన పట్ల ఇప్పటికైనా అధికారులు కనికరం చూపాలని జాన్‌బీ మూగభాషతో వేడుకుంటోంది. -
ప్రభుత్వాసుపత్రిలో ఎంపీ పొన్నం హల్ చల్
-
మహిళపై లైంగిక దాడికి యత్నం
పెద్దపల్లి, న్యూస్‌లైన్: మహిళలపై కామాం దుల అకృత్యాలు ఆగడంలేదు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా వారిలో వణుకు రావడంలేదు. రోజు రోజుకూ మహిళలపై దాడులు పెరుగుతూనే ఉన్నాయి. నాలు గు రోజుల క్రితం మండలంలోని గుర్రాం పల్లిలో ఓ మహిళపై అదే గ్రామానికి చెంది న మాదిరెడ్డి రాంరెడ్డి అనే వ్యక్తి లైంగిక దాడికి యత్నించగా గ్రామ పెద్దలు నింది తుడితో బాధితురాలి కాళ్లు మొక్కించి వది లేశారు. అయితే అకృత్యాన్ని జీర్ణించుకోలేని బాధితురాలి భర్త మంగళవారం రాత్రి రాంరెడ్డిపై హత్యాయత్నం చేశాడు. కొంత మందితో కలిసి ఆయనను గ్రామం లో తరుముకుంటూ కొట్టాడు. అడ్డుకున్న తిరుపతిరెడ్డి అనే వ్యక్తిని కూడా చితకబాదారు. దెబ్బలకు తాళలేక రాంరెడ్డితో పాటు ఆయన కూడా కిందపడిపోయాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న వారిని గ్రామస్తులు కరీంనగర్‌లోని ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో చర్చనీ యాంశం కావడంతో అవమానంగా భా వించిన లైంగిక దాడి యత్నానికి గురైన మహిళ క్రిమి సంహారకమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన బం ధువులు ఆమెను పెద్దపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమయానికి చికిత్స చేయడంతో ఆమెకు ప్రాణాపా యం తప్పింది. రాంరెడ్డిపై, ఆయనను కొట్టిన బాధితురాలి భర్తపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిషోర్ తెలిపారు. -
ప్రభుత్వాస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రమైన ప్రభుత్వ ఆస్పత్రిలో పని చే స్తున్న సిబ్బంది పనితీరులో ఏ మాత్రం మార్పు రావడం లేదు. ఇక్క డ విధులు నిర్వహిస్తున్న వార్డుబాయ్ మొదలుకుని ఆస్పత్రి సూపరింటెండెంట్ వరకు రోగుల ఇక్కట్లను పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. వారం రోజులుగా వరుసగా చోటు చేసుకుంటున్న సంఘటనలే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఈ నెల 18న ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన సదరన్ క్యాంప్ నిర్వహణలో వైద్యాధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కని పించడంతో కలెక్టర్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో పాటు డీసీహెచ్‌ఎస్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇలా హెచ్చరించి రెండు రోజులు గడవక ముందే ఆస్పత్రి సిబ్బంది నిలువెత్తు నిర్లక్ష్యం మరో సంఘటనలో కొట్టొచ్చినట్లు కనిపించింది. రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేటకు చెందిన పోలీసులు అ నారోగ్యానికి గురైన గుర్తు తెలియని మహిళకు వైద్యం చేయించేందుకు గాను మానవతా దృక్పథంతో విరాళాలు వేసుకుని ఆస్పత్రికి తీసుకువచ్చారు. అయితే ఇక్కడి వార్డుబాయ్‌లు ఆమెను ఆస్పత్రిలోకి తీసుకెళ్లేందుకు కనీసం స్ట్రెక్చర్‌ను కూడా తీసుకురాకపోవడంతో ఆటో డ్రై వరు, హోంగార్డు జగదీశ్వర్‌రెడ్డి స్వయంగా ఆమెను లోనికి తీసుకెళ్లారు. అయితే రెండు గంటలైనా ఆమెకు వైద్యు చికిత్సలు ప్రారంభించలేదు. తాజాగా గురువారం రాత్రి శివ్వంపేట మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన రేణుక, శివకుమార్ దంపతులు ప్రసవం కోసం జిల్లా ఆస్పత్రికి వచ్చి 24 గంటలు గడిచినా వైద్యం ప్రారంభించలేదని బాధితుడు ఆరోపించిన విషయం తెలిసిందే. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వై ద్యుల, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిం చినా జిల్లా ఉన్నతాధికారులు ఏ ఒక్కరిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లే వు. దీంతో తాము చేసిందే వైద్యం, చె ప్పిందే వేదం అన్న చందంగా ఇక్కడి సిబ్బంది వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. బాయ్‌లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ప్రమాదం, అనారోగ్యానికి గురైన వారి ని అత్యవసర వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తీసుకువస్తే ఇక్కడికి వచ్చాక వార్డు బాయ్‌లు కనీసం రోగులను తీసుకెళ్లేందుకు రావడం లేదని 108 పెలైట్ వి జయ్‌కుమార్ తెలిపారు. మంగళవారం అందోల్ మండలం కోడెకల్ గ్రామానికి చెందిన మహిళకు కడుపునొప్పి రావడం తో వాహనంలో తీసుకువచ్చినా బాయ్ లు ఆమెను ఆస్పత్రిలోకి తీసుకెళ్లలేదన్నా రు. రోడ్డు ప్రమాద సంఘటనలో తమ కు సాయం చేయాలని కోరితే ఎవరు మిమ్మలను తీసుకురమ్మన్నారని మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య సోమవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రి ప్రాంగణంలో అపరిశుభ్రతపట్ల ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యం కోసం ఆసుపత్రికి వస్తే సిబ్బంది తమపై వ్యవహారించే తీరుపై ఈ సందర్భంగా రోగులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో ఆసుపత్రి సిబ్బందిపై కలెక్టర్ మండిపడ్డారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన శానిటరీ ఇన్స్పెక్టర్, వాటర్మెన్లను సస్పెండ్ చేస్తు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఆర్‌ఎంవోకు మెమో జారీ చేశారు.