నల్గొండ : నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వాస్పత్రి వద్ద పేషెంట్లు బుధవారం ఆందోళనకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి... కాన్పు చేయించుకునేందుకు ముగ్గురు గర్భిణీలు స్థానిక ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. అయితే ప్రభుత్వ వైద్యుడు వాళ్లకు వైద్యం చేసేందుకు నిరాకరించాడు.
తాను ప్రైవేట్ ఆసుపత్రి నడుపుతున్నానని... ఆ ఆసుపత్రిలో చేరితేనే వైద్యం చేస్తానని కరఖండిగా చెప్పాడు. దీంతో ఆసుపత్రికి వచ్చిన మహిళలు వైద్యుడితో వాగ్వివాదానికి దిగారు. వైద్యుడి వైఖరికి నిరసనగా... ఆసుపత్రి ఎదుట గర్భిణీ స్త్రీలతోపాటు వారి బంధువులు ఆందోళకు దిగారు.