devarakonda
-
అజీంగఢ్‌కు గడ్డు రోజులు
ఒకప్పుడు ఎంతోమంది ఇంజనీర్లు సహా ఇంకెందరో సేదదీరారు ఆ కోట నీడలో.. ఇంకెన్నో చిత్రాల్లోని సన్నివేశాలు చిత్రీకరించారు అక్కడే.. పురాతన చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచింది.. ప్రభుత్వ నిరాదరణతో శిథిలావస్థకు చేరింది. అదే నిజాం కాలం నాటి అజీంగఢ్ కోట. – దేవరకొండనిజాం నాటి కట్టడం1980వ దశకంలో అజీంగఢ్ కోటలో రెండు తెలుగు సినిమాల్లోని పలు సన్నివేశాలను చిత్రీకరించారు. 1940–43 సంవత్సరాల మధ్య కాలంలో అప్పటి నిజాం కాలంనాటి ఇంజనీర్ ఖాజా అజ్మొద్దీన్.. నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలో దుందుభి వాగుపై ప్రాజెక్టును నిర్మించారు. ఈ క్రమంలో ప్రాజెక్టుకు మంజూరు చేసిన నిధులు.. నిర్మాణం పూర్తయ్యాక కూడా కొన్ని మిగిలాయి. దీంతో డిండి మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలోని బాపన్‌కుంట వద్ద అజీంఘడ్ అనే పేరుతో రాతి కోటను నిర్మించారు.ఆ కోటను ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యాక కూడా ఇంజనీర్లకు విశ్రాంతి భవనంగా ఉపయోగపడింది. నిజాం పరిపాలన అనంతరం స్థానికంగా ఉన్న నీటిపారుదల శాఖ అతిథి గృహంతో పాటు అజీంగఢ్ కోట ఇరిగేషన్ శాఖ అధీనంలోకి వెళ్లాయి. అప్పటి నుంచి ఆ శాఖ పర్యవేక్షణలోనే కోట నిర్వహణ కొనసాగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు ఎనిమిదేళ్ల క్రితం జరిగిన కృష్ణా పుష్కరాల్లో భాగంగా అజీంగఢ్ మరమ్మతులకు దాదాపు రూ.20 లక్షలు కేటాయించింది. దీంతో అధికారులు అజీంగఢ్ కోటలో మెట్ల నిర్మాణం, నూతనంగా తలుపులు, కిటికీలు, భవనానికి రంగులు తదితర మరమ్మతులు చేపట్టి.. ఫర్నిచర్ ఏర్పాటు చేశారు. రాతితో పటిష్టంగా నిర్మించిన ఈ కోటను డిండి–దేవరకొండ వెళ్లే మార్గమధ్యలో రాకపోకలు సాగించేవారు చూసి అబ్బుర పడుతుంటారు. కానీ కోట నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో పర్యాటకులకు ఆహ్లాదం పంచడం లేదు.రెండు తెలుగు సినిమాల చిత్రీకరణ ఈ కోటలో 1980వ దశకంలో రెండు తెలుగు సినిమాలకు సంబంధించి పలు సన్నివేశాలను చిత్రీకరించారు. నాగేశ్వరరావు, అన్నపూర్ణ నటించిన ‘ఆత్మగౌరవం’చిత్రంలోని పలు సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. చంద్రమోహన్, విజయశాంతి జంటగా నటించిన ‘అమాయక చక్రవర్తి’ సినిమాను దాదాపు 30 శాతం ఇక్కడే చిత్రీకరించారు.వైభవం కోల్పోతున్న అజీంగఢ్ఎంతో చరిత్ర కలిగిన అజీంగఢ్ కోట ప్రస్తుతం పూర్వ వైభవాన్ని కోల్పోతోంది. అప్పటి ఇంజనీర్ల ప్రతిభతో ఎంతో సుందరంగా నిర్మించిన ఈ కోట నిర్వహణ లోపంతో పర్యాటకులకు నిరాశే మిగులుతోంది. మొత్తం రాతితో చెక్కు చెదరకుండా నిర్మించిన కోట ప్రస్తుతం చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. ప్రభుత్వాలు, అధికారులు కోట అభివృద్ధికి చర్యలు చేపట్టి.. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దాలనేది ఇక్కడి ప్రజల ఆకాంక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం అజీంగఢ్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే.. డిండి మండల అభివృద్ధి మరింత సాధ్యపడుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం. -
తాజ్‌మహల్‌లో తెలంగాణ రాళ్లు!
సాక్షి, హైదరాబాద్ : పాలరాతిని పేర్చి అద్భుత కట్టడంగా తాజ్‌మహల్‌ను మొఘల్ వంశీయులు ఎలా సృష్టించారో నిగ్గు తేల్చేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎందరో నిపుణులు అధ్యయనాలు చేస్తున్నారు. అలా కాలిఫోరి్నయాలోని విఖ్యాత జెమోలాజికల్ లైబ్రరీ అండ్ రీసెర్చ్ సెంటర్ నుంచి రిటైర్డ్ లైబ్రేరియన్ డిర్లామ్, రీసెర్చ్ లైబ్రేరియన్ రోజర్స్, సంస్థ డైరెక్టర్ వెల్డన్లు కూడా నాలుగైదేళ్లలో విడతలవారీగా వచ్చి అధ్యయనం చేపట్టారు. పైకి పాలరాతి నిర్మాణమే అయినప్పటికీ తాజ్ నిర్మాణంలో వజ్రాలు, వైఢూర్యాలు, రత్నాలు, ముత్యాలు, స్ఫటికాలు, పచ్చలు.. ఇవి కూడా పొందికగా ఒదిగిపోయాయని తెలిసి వారు అధ్యయనానికి వచ్చారు. అలా జరిగిన వారి అధ్యయనం ద్వారానే తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు పనిలోపనిగా మన దేవరకొండ, మహబూబ్‌నగర్ ప్రాంతం నుంచి వచ్చిన రాళ్లనూ మోశారని వెలుగు చూసింది. పర్చిన్కారీ పద్ధతిలో.. పాలరాతిపై వివిధ ఆకృతులతో కూడిన నగిషిలను విడిగా పేర్చినట్లుగా కాకుండా పాలరాతిలో అంతర్భాగంగా ఉండేలా చేయాలని అప్పట్లో నిర్ణయించారు. ఇందుకు పర్చిన్‌కారి పద్ధతిని అనుసరించారు. ఇటలీ, గ్రీస్‌లలో పుటిన పియెట్రా డ్యురాకు కాస్త దగ్గరి పోలికుండే ఈ పర్చిన్‌కారి కళ 16వ శతాబ్దంలో భారత్‌లో అభివృద్ధి చెందింది. ముందుగా పాలరాతిపై ఆ ఆకృతిని గీసి దాని ప్రకారం రాయిని కట్ చేశారు. అదే ఆకృతిలో రంగురాళ్లును అరగదీసి సానబెట్టి మెరుపు తెప్పించాక, పాలరాయిని కట్ చేసిన భాగంలో పొదిగారు. దీంతో ఆ డిజైన్ రాయిలో భాగమనే భ్రమ కలిగిస్తోంది. అలా తాజ్‌మహల్ కట్టడంలో పాలరాతిలో ఇలాంటి ఎన్నో ఆకృతులు ఒదిగిపోయాయి. వాటిల్లో మన తెలంగాణ ప్రాంత రాళ్లు కూడా చిరస్థాయిగా మిగిలిపోయాయి. ఇంకొన్ని రాళ్లను పియెట్రా డ్యురా పద్ధతిలో పాలరాతిపై ప్రత్యేక జిగురుతో అతికించి కళాత్మకంగా ఆకృతులద్దారు. పలుగురాయిలో భాగమే.. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో పలుగురాళ్లు కనిపిస్తాయి. అలాంటి రాళ్లలో కొన్ని క్రిస్టల్ (పారదర్శకంగా) లక్షణాలు కలిగి ఉంటాయి. వాటినే క్రిస్టల్ క్వార్ట్జ్గా పేర్కొంటారు. అవి విలువైన స్ఫటికంలో భాగమే. వాటిని నగల నగిషిల్లో వినియోగిస్తారు.మన రాళ్లే ఎందుకు?.. తాజ్ కట్టడం గోడలపై పాలరాయి పరుచుకుంది. కానీ ప్రతి నిర్మాణంలోనూ కొత్తదనాన్ని కోరుకున్న మొఘల్ వంశీయులు ఆ పాలరాతి మీదుగా పూలతో కూడిన లతలు అల్లుకున్న అనుభూతిని కలిగించాలనుకున్నారు. నగల్లో వాడే వజ్రాలు, పచ్చలు, కెంపులు.. ఇలా అన్నింటినీ ఈ నగిషిలకు వాడాలని నిర్ణయించి వాటికి ప్రపంచంలో ఏయే ప్రాంతాలు ప్రసిద్ధో గుర్తించారు. ఆయా దేశాలను గాలించి వాటిల్లో మేలిమి వాటిని సేకరించి తెచ్చి తాజ్‌మహల్ నిర్మాణంలో వాడారు. అలా వాడే విలువైన రాళ్ల జాబితాలో క్రిస్టల్ క్వార్ట్జ్ (ఓ రకమైన స్పటికం) కూడా ఒకటి. వాటికి ఏ ప్రాంతాలు ప్రసిద్ధిగాంచాయో గాలిస్తే.. గోల్కొండ మైన్ అనే సమాధానం వచ్చిoది. కృష్ణా నదీ తీరాన్ని ఆసరా చేసుకొని గోల్కొండ గనులు విస్తరించాయి. ఇది వజ్రాలతోపాటు క్రిస్టల్ క్వార్ట్ జ్ కూడా ప్రసిద్ధే. అయితే ఇది ఆ గనుల ఆమూలాగ్రంలో లభించదు. మేలిమి రాళ్లు ప్రస్తుత దేవరకొండ, మహబూబ్నగర్లలోనే దొరికేవి. దీంతో ఈ ప్రాంతం నుంచి క్రిస్టల్ క్వార్ట్జ్ రాళ్లను తెప్పించారన్నది ఇప్పుడు వెలుగుచూస్తున్న విషయం. నాణ్యత ఆధారంగా చూస్తే ఈ ప్రాంతానివే.. తాజ్మహల్లోని రాళ్లలో మేలిమి స్ఫటికంలా ఉన్నవి లభించే ప్రాంతాలు దేవరకొండ, మహబూబ్‌నగర్ పరిసరాలే. మేలిమి రాళ్లను సేకరించిన షాజహాన్.. ఈ రాళ్ల విషయంలోనూ నాణ్యమైనవే గుర్తించారు. అప్పటి వర్తకంలో కీలకంగా ఉన్న ప్రాంతాల నుంచే సేకరించినందున అవి ఈ ప్రాంతాలకు చెందినవిగానే పరిగణించాల్సి ఉంటుంది. – చకిలం వేణుగోపాలరావు, జీఎస్ఐ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ -
సప్తగిరుల దేవరాద్రి
దేవరకొండ ఖిలాకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. తెలంగాణలో ఉన్న కోటలన్నింటిలో దేవరకొండ కోట తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకుంది. 13వ శతాబ్దంలో నిర్మితమైన దేవరకొండ ఖిలాకు సురగిరి అనే పేరుంది. అంటే దేవతల కొండ అని దీని అర్థం. కోట చుట్టూ ఎనిమిది చోట్ల ఆంజనేయస్వామి రూపాన్ని చెక్కి కోటను అష్ట దిగ్బంధనం చేశారని ప్రతీతి. ఎంతో ప్రాచుర్యం పొందిన దేవరకొండ ఖిలాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష. అయినా పాలకులు దీనిపై దృష్టి పెట్టకపోవడంతో నిరాదరణకు గురవుతోంది. – దేవరకొండకోట చుట్టూ 360 బురుజులు.. కాలక్రమేణా కోట గోడలు బీటలు వారినా.. నిర్మాణ శైలి నేటికీ అబ్బురపరుస్తోంది. పది కిలోమీటర్ల పొడవు, 500 అడుగుల ఎత్తులో ఏడు కొండల మధ్య నిర్మితమైన దేవరకొండ కోట శత్రుదుర్బేధ్యంగా ఉండేది. మట్టి, రాళ్లతో కట్టిన గోడలు నేటికీ నాటి నిర్మాణ కౌశలాన్ని చాటుతున్నాయి.7 గుట్టలను చుట్టుకొని ఉన్న శిలా ప్రాకారంలో 360 బురుజులు, రాతితో కట్టిన 9 ప్రధాన ద్వారాలు, 32 ప్రాకార ద్వారాలు, 23 పెద్ద బావులు, 53 దిగుడు బావులు, కోనేర్లు, కొలనులు, సైనిక నివాసాలు, ధాన్యాగారాలు, సభావేదికలు, ఆలయాలు ఇలా.. ఎన్నో.. ఎన్నెన్నో. ప్రతీ నిర్మాణం వెనుక ఓ చారిత్రక గాథ పలకరిస్తుంటుంది.రాజదర్బార్ ఉన్న కోట ద్వారాలకు రెండు వైపులా పూర్ణకుంభాలు, సింహాలు, తాబేళ్లు, చేపలు, గుర్రాలు వంటి ఆకృతులు ఇక్కడ రాతిపై చెక్కబడి ఉన్నాయి. కోట సమీపంలో నరసింహ, ఓంకారేశ్వర, రామాలయం వంటి పురాతన దేవాలయాలు దర్శనమిస్తాయి. ఇక్కడి శిల్పకళా సంపద చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయి. పద్మనాయకుల రాజధానిగా.. 15వ శతాబ్దంనాటి ఈ కోటకు సంబంధించి ఎన్నో విశేషాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు 700 ఏళ్ల కిందట 13వ శతాబ్దంలో కాకతీయులకు సామంతులుగా ఉండి.. ఆ తర్వాత స్వతంత్రులైన పద్మనాయకుల రాజధానిగా దేవరకొండ కీర్తి గడించింది. అనపోతనాయుడు, రెండవ మాదానాయుడి కాలంలో కోట నిర్మాణం జరిగింది.మాదానాయుడి వారసులు దేవరకొండని, అనపోతనాయుడి వారసులు రాచకొండను రాజధానిగా చేసుకొని క్రీ.శ 1236 నుంచి 1486 వరకు పాలన కొనసాగించారు. తర్వాత ఈ కోటను బహమనీ సుల్తానులు, కుతుబ్‌షాహీలు వశం చేసుకున్నారు. సందర్శకుల తాకిడి.. నల్లగొండ జిల్లాలోని దేవరకొండ ఖిలా (Devarakonda Fort) సందర్శనకు హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. సెలవు రోజుల్లో ఈ ప్రాంతం బిజీగా ఉంటుంది. అంతే కాకుండా హైదరాబాద్ నుంచి పలు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు, విదేశీయులు సైతం కోటను సందర్శించి ఇక్కడి శిల్పకళా సంపదను చూసి ముగ్దులవుతున్నారు. చదవండి: చెరువులకు చేరింది సగంలోపు చేప పిల్లలేఇక తొలి ఏకాదశి, మహా శివరాత్రి పర్వదినాల్లో దేవరకొండ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున కోటకు చేరుకొని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఈ కోట సింహద్వారంపై చెక్కబడిన పూర్ణకుంభం చిహ్నం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ చిహ్నంగా తీసుకోవడం గమనార్హం.పర్యాటక ప్రాంతంగా మార్చితే.. ఖిలాను పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలన్నది ఇక్కడి ప్రాంత ప్రజల చిరకాల కోరిక. దేవరకొండ ఖిలా గతమెంతో ఘనచరిత్ర కలిగి నాటి శిల్పకళా సంపదకు నిలువెత్తు రూపంగా నిలిచింది. ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తే దేవరకొండతోపాటు చుట్టుపక్కల పట్టణాలు సైతం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతాయి. ఈ ఖిలా విశిష్టత సైతం నలుమూలల వ్యాప్తి చెందుతుందని ఇక్కడి ప్రజల కోరిక. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖిలా ఆవరణలో పార్క్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. ప్రస్తుతం పార్క్ నిర్మాణ పనులు పూర్తయినట్టు అధికారులు పేర్కొంటున్నారు.దేవరకొండ ఖిలాకు చేరుకునేదిలా.. దేవరకొండ ఖిలా హైదరాబాద్‌కు 110 కిలోమీటర్లు, నాగార్జునసాగర్‌కు 45 కి.మీ, నల్లగొండ నుంచి సాగర్‌కు వెళ్లే దారిలో కొండమల్లేపల్లి పట్టణం నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్, నల్లగొండ, సాగర్ నుంచి దేవరకొండకు నేరుగా బస్సు సౌకర్యం ఉంది. -
పోలీసుల అదుపులో దేవరకొండ సుధీర్ !
నెల్లూరు(క్రైమ్): కావలి వద్ద ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి ఘటనలో ప్రధాన నిందితుడు దేవరకొండ సుధీర్ అలియాస్ అజయ్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య స్థావరంలో విచారిస్తున్నట్లు తెలిసింది. గత నెల 26వ తేదీన కావలి మద్దూరుపాడు వద్ద సుధీర్, అతని అనుచరులు ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసి గాయపరిచిన విషయం విదితమే. ఈ ఘటనపై కావలి రూరల్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. గంటల వ్యవధిలోనే ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు సుధీర్‌తోపాటు మరికొందరి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. సుధీర్ పూటకో సిమ్‌కార్డు మారుస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతుండడంతో అతనిని పట్టుకోవడం కష్టతరంగా మారింది. దీంతో పూర్తిస్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నిందితుడిని చైన్నెలో అదుపులోకి తీసుకుని రహస్య స్థావరానికి తరలించినట్లు సమాచారం. సుధీర్, అతని అనుచరులు తక్కువ ధరకు బంగారం పేరిట పలువురిని మోసగించిన ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గత సోమవారం స్పందన కార్యక్రమంలో ముగ్గురు బాధితులు సుధీర్ మోసాలపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో సుధీర్ మోసాలపై సైతం క్షేత్రస్థాయిలో పోలీసు అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. సుధీర్ గ్యాంగ్‌పై కఠిన చర్యలు తీసుకునేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. -
బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నేత బిల్యా నాయక్
సాక్షి, హైదరాబాద్: నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత బిల్యా నాయక్ బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో మంత్రి జగదీశ్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్.. బిల్యా నాయక్, ఆయన అనుచరులకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా గమ్మత్తైన డైలాగులు, ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని విమర్శించారు. గిరిజనులకు ఆత్మ గౌరవం ఇస్తోంది కేసీఆర్ రైతులకు 24 గంటల కరెంట్ ఉచితంగా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్ చెప్పారు. విద్యుత్ రంగాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుకెళ్తున్నారన్నారు. సీఎం కేసీఆర్‌తోనే గిరిజనులకు న్యాయం జరుగుతుందని.. దశాబ్దాలు కోట్లాడిన బాగుపడని తాండాలు ఇప్పుడు సీఎం నాయకత్వంలో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. నాడు నల్గొండలో వంకర తిరిగిన కాళ్లు కనిపించేవని.. కేసీఆర్ వచ్చాక మంచి నీళ్లు అందిస్తున్నారని చెప్పారు. అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ది చెందుతుందన్నారు. గత 15 రోజుల నుంచి 32 నియోజకవర్గాలకు వరకు తిరిగానని కేటీఆర్ గుర్తు చేశారు. ఆదిలాబాద్ నుంచి వనపర్తి దాకా, సత్తుపల్లి నుంచి మెదక్ వరకు.. తెలంగాణలోని నాలుగు మూలాలను తిరిగాను. ప్రజల మూడ్ స్పష్టంగా కనబడుతోంది. ప్రజల నుంచి అసహనం వ్యక్తం కావడం లేదు. ప్రభుత్వం మీద వ్యతిరేకత కనబడకపోగా, కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అయితేనే పేదలు, రైతులు, బడుగు, బలహీన వర్గాలు బాగుపడతాయని ప్రజలు విశ్వసిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. చదవండి: ఈసీ ఆదేశం.. తెలంగాణలో పలువురు ఎస్పీలు, కలెక్టర్ల బదిలీ ఎన్నికలు రాగానే వస్తారు.. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ పార్టీ వాళ్లు వస్తారని పార్టీ కార్యాయానికి కొత్త రంగులు వేసుకుంటారని, కొత్త డ్రెస్సులు వేసుకుంటారని కేటీఆర్ విమర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి, మంత్రి తానంటే తాను అని పోటీ పడుతారు. ఇక మీడియాలో కూడా సర్వే వస్తది.. అంతా అయిపోయిందంటారు. గమ్మతైన డైలాగులు, ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తారు. 2018లో అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్‌ను ఓడించే దాకా గడ్డమే తీయను అని స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఉత్తమన్న గడ్డం ఉందో పీకిందో తెలియదు గానీ, ఇలాంటి డైలాగులు మస్తుగా విన్నాం. ఆ సన్నాసి మళ్లా పోటీ చేస్తుండు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కూడా డైలాగులు కొట్టిండు. కొడంగల్‌లో నన్ను ఓడిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆ సన్నాసి మళ్లా పోటీ చేస్తుండు.. అది వేరే విషయం కానీ.. ఇలా బేకర్ డైలాగులు కొడుతారు. ఐదారేండ్ల కింద ఓటుకు నోటు.. ఇప్పుడేమో సీటుకు నోటు.. అందుకే రేవంత్ రెడ్డిని ఇప్పుడు రేటంత రేటంత అని అంటున్నారు. వాళ్లతోటి ఏం కాదు’ అంటూ కేటీఆర్ నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి ‘భారత దేశంలో తెలంగాణ నంబర్1 లో నిలిపింది కేసీఆర్. నల్లగొండ జిల్లాకు 5లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కేవలం దేవరకొండకు ఇచ్చింది కేసీఆర్. ఏడాదిలో డిండి ప్రాజెక్ట్ పూర్తిచేసి దేవర కొండ సస్యశ్యామలం చేస్తాం. కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఛాన్స్ కాదు, 11 ఛాన్సులు ఇచ్చాం. ఇన్నేళ్లు వాళ్ళ పాలన చూడలేదా?. అప్పుడెందుకు అభివృద్ది చేయలేదు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి మేము ఎవరికి బీ టీమ్ కాదు గిరిజన విశ్వ విద్యాలయానికి స్థలం ఏనాడో ఇచ్చాం. కానీ ఇప్పుడొచ్చి దాని గురించి మాట్లాడుతున్నారు. కేంద్రమంత్రి అమిత్ షా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. రైతుల ఆత్మహత్యలు తెలంగాణ దేశంలో నంబర్ 1 అంటూ అమిత్ షా అంటున్నారు. పార్లమెంట్ళో తెలంగాణ లో రైతు ఆత్మహత్యలు లేవని చెప్పింది మీ కేంద్రమే. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అంటోంది కాంగ్రెస్, కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ బీ టీమ్ అంటూ బీజేపీ చెప్తోంది. మేము ఎవరికి బీ టీమ్ కాదు. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు, నిధులను కేంద్రం ఇవ్వలేదు. డాక్టర్ చదవాలంటే చాలా కష్టం ఉండేది. కానీ ఇప్పుడు కేసిఆర్ వచ్చాక నల్లగొండ కు కూడా మెడికల్ కాలేజీ ఇచ్చారు’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
రష్మిక లైవ్.. మధ్యలో విజయ్ వాయిస్
-
మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆరాటం.. ఎక్కడి నుంచి పోటీ?
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి కేంద్ర బిందువైన ఉమ్మడి నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీలు ఉనికి కోసం పోరాడుతున్నాయి. మునుగోడులో టీఆర్ఎస్ విజయంలో భాగస్వాములు కావడంతో ఎర్ర పార్టీల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. గులాబీ పార్టీతో పొత్తు కుదిరితే జిల్లా నుంచి మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టవచ్చన్నది వారి ఆరాటం. టీఆర్ఎస్తో పొత్తు కుదిరితే సీపీఐ, సీపీఎంలు ఎక్కడ పోటీ చేయాలనుకుంటున్నాయి? ఇదే అదను, దిగాలి బరిలోకి ఒకప్పుడు నల్గొండ జిల్లా అంటే కమ్యూనిస్టుల ఖిల్లా అనేవారు. కాల క్రమంలో అదంతా గత వైభవంగా మిగిలిపోయింది. గతంలో మిర్యాలగూడ, నకిరేకల్, నల్లగొండ, దేవరకొండ, మునుగోడు నుంచి ఉభయ కమ్యూనిస్టు పార్టీల నుంచి ఎవరో ఒకరు గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టేవారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో దేవరకొండలో సీపీఐ తరపున రవీంద్ర కుమార్ గెలిచారు. కానీ ఆయన సొంత పార్టీకి హ్యాండిచ్చి టీఆర్ఎస్లోకి జంప్ చేశారు. గత ఎన్నికల్లో కూడా గెలిచి దేవరకొండ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ముఖ్య నాయకులే కాదు.. రెండు కమ్యూనిస్టు పార్టీలకు చెందిన కేడర్ కూడా చాలావరకు అధికార పార్టీలో చేరిపోయారు. దీంతో జిల్లాలో వామపక్షాల ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఇక జిల్లా నుంచి కమ్యూనిస్టు పార్టీల ప్రతినిధులు అసెంబ్లీలో అడుగుపెట్టడం కలగానే మిగిలిపోతుంది అనుకున్నారు అంతా. ఇటువంటి క్లిష్ట సమయంలో వామపక్షాలకు మునుగోడు రూపంలో ఓ వరం లభించి పునర్జన్మ పొందినట్లు అయిందని చెప్పవచ్చు. మిర్యాలగూడ ఎవరికి? దేవరకొండ ఎవరికి? మునుగోడులో అధికార టీఆర్ఎస్కు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మద్దతుగా నిలిచాయి. బీజేపీని ఓడించే లక్ష్యంతో రెండు పార్టీలు గులాబీకి దన్నుగా ఉన్నాయి. ఇప్పుడిదే వారికి కలిసొచ్చింది. వచ్చే ఎన్నికల నాటికి లెఫ్ట్, టీఆర్ఎస్ మధ్య పొత్తగా మారే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. లెఫ్ట్ పార్టీలు గులాబీ పార్టీతో పొత్తుపై పూర్తి నమ్మకంతో ఉన్నాయి. అదే జరిగితే జిల్లాలో రెండు పార్టీలు ఒక్కో స్థానాన్ని తమకు కేటాయించాలని అడగనున్నట్లు తెలుస్తోంది. సీపీఎం మిర్యాలగూడ స్థానాన్ని, సీపీఐ మునుగోడు లేదా దేవరకొండ స్థానంలో ఒకదాన్ని తమకు కేటాయించాలని కోరనున్నట్లు టాక్ వినిపిస్తోంది. సీపీఐ మునుగోడు కంటే దేవరకొండ సీటుపైనే మక్కువగా ఉన్నట్లు సమాచారం. తమ పార్టీ నుంచి గెలిచి మోసం చేసి పార్టీ మారిన రవీంద్ర కుమార్‌ను దెబ్బ తీయాలని సీపీఐ నాయకత్వం భావిస్తోంది. అయితే జిల్లాలో సీపీఐకి అంతో ఇంతో కేడర్ ఉన్న నియోజకవర్గం అదే కావడం మరో కారణం. ఒకవేళ దేవరకొండలో అవకాశం రాకపోతే మునుగోడు సీటునే కోరనుంది. ఇక్కడి నుంచి ఇప్పటికే ఆ పార్టీ ఐదు సార్లు గెలవడం పార్టీ కేడర్ ఇంకా మిగిలే ఉండటంతో మునుగోడును ఇవ్వాలని బలంగా కోరే అవకాశం కనిపిస్తోంది. చదవండి: ఫాంహౌజ్ ఎపిసోడ్ ప్రకంపనలు.. కారు పార్టీలో తెర వెనక్కి ఇద్దరు.? జూలకంటి రెఢీ ఇక సీపీఎం కూడా నల్గొండ జిల్లాలో ఒక సీటు కోరుదామనే ఆలోచనలో ఉందని సమాచారం. మిర్యాలగూడ సీటు తీసుకుని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిని బరిలో దించాలనే ఆలోచనలో సీపీఎం ఉందని టాక్. ఇప్పటికీ అక్కడ ఆ పార్టీకి బలమైన పునాదులు ఉన్నాయి. ఎలాగూ అక్కడి సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై జనాలతో పాటు నియోజకవర్గానికి చెందిన పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం, కేడర్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈసారి అక్కడ సిట్టింగ్‌కు సీటు ఇస్తే అధికార పార్టీకి చేతులు కాలే పరిస్థితులు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో గులాబీ పార్టీ నాయకత్వం కూడా మిర్యాలగూడ సీటును సీపీఐఎం పార్టీకి కేటాయించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇప్పటికే ఓ సభలో తనకు టికెట్ రాకున్నా పార్టీ కోసం పనిచేస్తానని ప్రస్తుత ఎమ్మెల్యే భాస్కరరావు అన్నారు. అంటే ఆయనకు కూడా ఈ విషయంలో ఒక క్లారిటీ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఉనికే ప్రశ్నార్థకమైన తరుణంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మునుగోడు రూపంలో కొత్త ఊపిరి పోసుకున్నట్లయింది. ఈ బంధం అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగితే ఉబయ కమ్యూనిస్టు పార్టీలకు ఎంతో కొంత ప్రయోజనం చేకూరవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. -
హుజూరాబాద్ బరిలో బీఎస్పీ.. ప్రవీణ్ కుమార్‌పై ఒత్తిడి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ ఉపఎన్నికలో త్వరలో ఆసక్తికర పరిణామా లు చోటు చేసుకునే అవకాశాలు కనిపి స్తున్నాయి. ప్రస్తుతానికి ఇక్కడ టీఆర్ఎస్–బీజేపీల మధ్య ద్విముఖ పోరే నడు స్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇంకా తమ పార్టీ అభ్యర్థిని ఖరారు చేయనప్పటికీ.. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు ఏర్పాట్లు చేసుకుంది. తాజాగా.. హుజూరాబాద్ బరిలో బీఎస్పీ దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేయాలంటూ పలువురు బీఎస్పీ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 26వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు నేతలు బీఎస్పీలో చేరుతుండగా.. ఈ సందర్భంగా నిర్వహించే సభలో ఆయన హుజూరాబాద్ ఉపఎన్నికలో పోటీ చేయాలా? వద్దా? అన్న విషయంపై నిర్ణయం ప్రకటిస్తారని సమాచారం. (చదవండి: Huzurabad : కాంగ్రెస్ నుంచి బరిలోకి మాజీమంత్రి కొండా సురేఖ..?) బీఎస్పీతోనే బహుజన రాజ్యాధికారం: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ దేవరకొండ: బీఎస్పీ తోనే బహుజన రాజ్యా ధికారం సాధ్యమని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా దేవరకొండలో జరిగిన బీసీ కులాల చర్చా కార్యక్రమంలో ఆయ న మాట్లాడారు. బీసీలు, బీసీ ఉపకులాల భవిష్యత్తు ఇప్పటికీ అగమ్యగోచరంగానే ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. దేశంలో బహుజనులకు విముక్తి కలి్పంచే పార్టీ బీఎస్పీ అని, బీసీలంతా ఐక్యంగా ఉద్యమించి రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికీ బీసీ గణనకు భారత ప్రభుత్వం ఒప్పుకోవట్లేదని, 2014లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సకల జనుల వివరాలు ఎందుకు తెలపడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ భవన్ పేరును బహుజన భవన్‌గా మార్చాలన్నారు. ఈ సందర్భంగా పలువురు బీఎస్పీలో చేరారు. బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సిద్ధార్థ పూలే, నాయకులు రాజారావు, ప్రముఖ విద్యావేత్త వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి రాజు తదితరులు పాల్గొన్నారు. -
అమెరికాలో దేవరకొండవాసి సజీవదహనం!
సాక్షి, కొండమల్లేపల్లి: అమెరికాలో నల్లగొండ జిల్లా దేవరకొండవాసి మృతి చెందారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు కారులో మంటలు చెలరేగడంతో ఆయన సజీవ దహనమయ్యారు. దేవరకొండ మండలం కర్నాటిపల్లి గ్రామానికి చెందిన నల్లమాద నర్సిరెడ్డి, భారతమ్మ దంపతుల రెండో కుమారుడు దేవేందర్‌రెడ్డి.. 1998లో అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆయన ఐటీఎల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో తన ఇంటి వద్ద ఉన్న కారు స్టార్ట్ చేసే క్రమంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో తీవ్ర గాయాలై∙దేవేందర్‌రెడ్డి మృతి చెందినట్లు మృతుడి సోదరుడు రవీందర్‌రెడ్డి తెలిపారు. దేవేందర్‌రెడ్డికి భార్య అనురాధ, ఏడేళ్ల కుమార్తె చెర్రి ఉంది. దేవేందర్‌రెడ్డి మృతితో సొంతూరు కర్నాటిపల్లిలో విషాదఛాయలు నెలకొన్నాయి. అయితే పోలీసుల దర్యాప్తు పూర్తయితే దేవేందర్‌రెడ్డికి మృతికి గల కారణాలు తెలుస్తాయని మృతుడి బంధువులు చెప్పారు. దేవేందర్‌రెడ్డి టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం అధికార ప్రతినిధి. పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. -
తెల్లారిన బతుకులు
నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం వింజమూరు గ్రామ పంచాయతీ పరిధిలోని దేవులతండా సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్‌కు కారులో పయనమైన ఐదుగురు స్నేహితులను అతివేగం బలిగొంది. వారు ప్రయాణిస్తున్న కారు ఓ మూలమలుపు వద్ద అదుపు తప్పి మెట్రో వాటర్ బోర్డు ఎయిర్ వాల్వ్‌ను ఢీకొట్టింది. దీంతో వారంతా అక్కడికక్కడే మృతి చెందారు. సాక్షి, చింతపల్లి (దేవరకొండ): ఉత్సాహంతో బయలుదేరిన ఆ ఐదుగురు కుర్రాళ్ల విహార యాత్ర విషాదాంతమైంది. సాగర్ అందాలను వీక్షించేందుకు మొదలు పెట్టిన వారి ప్రయాణం గమ్యం చేరకుండానే మృత్యుఒడికి చేరింది. మరో గంటన్నరలో గమ్యం చేరుకోవాల్సిన వారిని అతివేగం బలిగొంది. వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి మెట్రో వాటర్ బోర్డు ఎయిర్‌వాల్వ్‌ను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం వింజమూరు గ్రామపంచాయతీ పరిధిలోని దేవులతండా సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో నివాసముంటున్న పసుపుల శివ భాస్కర్ (23), శ్రీనుయాదవ్ (24), సాకే నాగేంద్ర (25), ఎడ్ల శ్రీకాంత్‌రెడ్డి (25), వేముల భరత్ (23) స్నేహితులు. వీరంతా నాగార్జునసాగర్ అందాలను వీక్షించి సరదాగా గడపాలని అనుకున్నారు. నాగేంద్రకు చెందిన కారులో వారి ప్రయాణం మొదలైంది. మొదట నాగేంద్ర తెల్లవారుజామున 3 గంటలకు ఒక్కొక్క స్నేహితుడి వద్దకు వెళ్లి కారులో పికప్ చేసుకున్నాడు. ఐదుగురు స్నేహితులు కలసి హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్‌కు పయనమయ్యారు. మరో గంటన్నరలో గమ్యం చేరుకునేలోగా అతివేగం వీరి ఉసురు తీసింది. వీరు ప్రయాణిస్తున్న కారు ఉదయం 6 గంటల సమయంలో చింతపల్లి మండలం వింజమూరు గ్రామపంచాయతీ పరిధిలోని దేవులతండా సమీపంలోకి రాగానే వేగాన్ని మూలమలుపు వద్ద నియంత్రించలేక అదుపు తప్పి హైదరాబాద్–నాగార్జునసాగర్ రహదారి పక్కనే ఉన్న మెట్రో వాటర్ బోర్డు ఎయిర్‌వాల్వ్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. రెండు గంటలు శ్రమించి మృతదేహాల వెలికితీత ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కావడంతో మృతదేహాలు కారులోనే ఇరుక్కున్నాయి. దీం తో మృతదేహాలను వెలికితీయడం కష్టంగా మారింది. దీనికి తోడు గ్రామస్తులు కరోనా వల్ల సహాయక చర్యలకు వెనుకంజ వేశారు. దీంతో చింతపల్లి ఎస్ఐ వెంకటేశ్వర్లు సిబ్బంది, సర్పంచ్ బాల్‌సింగ్‌తో కలసి మృతదేహాల వెలికితీతకు రెండుగంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. ఘటన స్థలాన్ని దేవరకొండ డీఎస్పీ ఆనంద్‌రెడ్డి, నాంపల్లి సీఐ శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఆర్అండ్బీ డీఈ ఖాజన్గౌడ్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మూలమలుపు.. అతివేగమే కారణం హైదరాబాద్–నాగార్జునసాగర్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదానికి గల ప్రధాన కారణం మూలమలుపు, అతివేగమేనని పోలీసులు చెబుతున్నారు. దేవులతండా సమీపంలో ప్రమాదకరమైన మూలమలుపు ఉండటంతో అది గమనించని నాగేంద్ర మూలమలుపు వద్ద ఒక్కసారిగా వేగాన్ని నియంత్రించలేక వాహనాన్ని ఎడమ వైపునకు తిప్పడంతో రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడి వాహనం పక్కనే ఉన్న ఎయిర్‌వాల్వ్‌ను బలంగా ఢీకొట్టింది. ఐదుగురు పేద కుటుంబాలకు చెందిన వారే.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురు యువకులు రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబాలకు చెందినవారే. ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన శివభాస్కర్ ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. అలాగే అదే జిల్లాకు చెందిన నాగేంద్ర కూడా హైదరాబాద్‌లోని శాలివాహన కాలనీలో నివాసం ఉంటున్నాడు. నాగేంద్ర మూడు మాసాల క్రితమే కారును కొనుగోలు చేసినట్లు తండ్రి పుల్లయ్య తెలిపాడు. నాగేంద్ర ఆరు మాసాల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నాడు. వేముల భరత్‌కు ఏడాదిన్నర క్రితం వివాహం అయ్యింది. ఎడ్ల శ్రీకాంత్‌రెడ్డి ఓ రెస్టారెంట్లో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. శ్రీనుయాదవ్, శివ భాస్కర్ ప్రస్తుతం ఎంబీఏ చదువుతున్నాడు. కాగా భరత్, నాగేంద్ర తమ తల్లిదండ్రులకు ఒక్కరే సంతానం. చేతికి అందివచ్చిన కుమారులు ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మృతుల కుటుంబాల రోదనలు మిన్నంటాయి. -
ఆస్తి తగాదాలతో టీఆర్ఎస్ నేత హత్య
సాక్షి, దేవరకొండ : కుటుంబ ఆస్తి తగాదాలు చిలికి.. చిలికి గాలివానగా మారి ఒకరి ప్రాణాన్ని బలిగొంది.. మృతుడు టీఆర్ఎస్ జిల్లా నాయకుడు, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు. చందంపేట మండలంలో శని వారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పాత పోలేపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ గోప్యానాయక్ కుటుంబానికి చందంపేట మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు లాలునాయక్ (50) కుటుంబానికి కొంత కాలంగా ఆస్తి పంచాయితీ నడుస్తోంది. ఈ విషయమై పలుమార్లు ఒకరిపై ఒకరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారు. లాలునాయక్ కుమార్తె రమావత్ పవిత్ర ప్రస్తుతం చందంపేట జెడ్పీటీసీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా, చందంపేట మండలం పోలేపల్లి స్టేజీ వద్ద బస్‌షెల్టర్‌ను ఆక్రమించుకొని రోడ్డు వెంట ఏర్పాటు చేసిన దుకాణాలను శనివారం ఆర్అండ్బీ పోలీస్‌శాఖ సంయుక్తంగా తొలగించడం ప్రారంభించారు. ఈ సమయంలో అక్కడే ఉన్న గోప్యానాయక్ కుమారుడు విజయ్‌నాయక్, లాలునాయక్‌లు తారసపడడంతో మాటమాట పెరిగి ఆస్తి విషయమై తగాదా పడ్డారు. దాంతో పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. అక్కడినుంచి బిల్డింగ్‌తండా గ్రామానికి వెళ్లిన ఇరు వర్గీయులు మరోసారి ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో మారణాయుధాలతో దాడి చేయడంతో లాలునాయక్ తలకు తీవ్ర గాయమైంది. దీంతో వెంటనే అతన్ని దేవరకొండలోని ఓ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. లాలు నాయక్ మృతిచెందిన విషయం తెలుసుకున్న అతని వర్గీయులు విజయ్‌నాయక్ ఇంటిపై దాడికి దిగి సామగ్రిని ధ్వంసం చేశారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిండి రూరల్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. పోలేపల్లి, బిల్డింగ్‌తండాలలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తిన నేపథ్యంలో పికెట్ ఏర్పాటుచేసినట్లు ఎస్ఐ సందీప్‌కుమార్ తెలి పారు. శాంతిద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
దేవరకొండ ట్రస్టు వితరణ
సాక్షి,మేడ్చల్ జిల్లా: సినీనటుడు విజయ్ దేవరకొండ నిర్వహిస్తున్న దేవరకొండ ట్రస్ట్ ద్వారా ఏడు వేల డిక్షనరీలను కలెక్టర్ ఎంవీ రెడ్డికి ఆదివారం దేవరకొండ ఆనంద్ తన తల్లితో కలిసి అందజేశారు. వీటిని మేడ్చల్, శామీర్‌పేట్, కీసర మండలాలకు చెందిన విద్యార్థులకు పంపిణీ చేస్తారు. -
దేవరకొండలో ఉద్రిక్తత
కొండమల్లేపల్లి (దేవరకొండ) : గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతిచెందడంతో సోమవారం దేవరకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా యి. డ్రైవర్ మృతదేహంతో ఆర్టీసీ కార్మికులు డి పో ఎదుట ఆందోళన చేపట్టి మృతుడి కుటుం బానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వీరికి అఖిలపక్ష పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో పట్టణంలోని దుకా ణాలను మూసి వేయించారు. ధర్నాలో పాల్గొంటూనే.. నాంపల్లి మండలం పగిడిపల్లి గ్రామానికి చెంది న తుమ్మలపల్లి జైపాల్‌రెడ్డి (టి.జె.రెడ్డి) (57) దేవరకొండ డిపోలో ఆర్టీసీ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. జైపాల్‌రెడ్డి తన కుటుంబ ంతో హైదరాబాద్‌లోని ఓంకార్‌నగర్‌లో నివాసముంటూ విధులకు హాజరవుతున్నాడు. అయితే తమ డిమాండ్లను నెరవేర్చాలని నెలరోజులుగా చేస్తున్న సమ్మెలో పాల్గొంటున్నాడు. ఆదివారం ఆర్టీసీ కార్మికులు డిపో ఎదుట నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నాడు. రాత్రి జైపాల్‌రెడ్డి తమ స్వగ్రామమైన నాంపల్లి మండలం పగిడిపల్లి గ్రామానికి వెళ్లాడు. తెల్లవారు జామున అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బంధువులు తొలుత దేవరకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించా రు.పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడినుంచి హైదరాబాదుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృ తిచెందాడు. మృతుడికి భార్య,కుమారుడు ఉన్నారు. డిపో ఎదుట ఆందోళన జైపాల్‌రెడ్డి మృతి విషయాన్ని తెలుసుకున్న ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మికులు, మృతుడి కుటుంబ సభ్యులు దేవరకొండకు చేరుకున్నారు. మృతదేహాన్ని దేవరకొండ డిపో ఎదుట ఉంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై నిరంకుశంగా వ్యవహరిస్తుండడంతో జైపాల్‌రెడ్డి మనస్తాపానికి గురై హఠాన్మరణం చెందాడని ఆరోపించారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఇకనైనా ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాత్రి దేవరకొండ డిపో ఎదుట కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి జైపాల్‌రెడ్డికి నివాళులర్పించారు. నివాళులర్పించిన అఖిలపక్ష నాయకులు డ్రైవర్ మృతివిషయం తెలుసుకున్న సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే నేనావత్ బాలూ నా యక్, సీపీఐ జిల్లా కార్యదర్శి పల్లా నర్సింహారె డ్డి, బీజేపీ నాయకులు బెజవాడ శేఖర్, సీపీఎం నాయకులు నల్లా వెంకటయ్య, వివిధ పార్టీలు , ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, జేఏసీ నాయకులు డిపో వద్దకు చేరుకున్నారు. జైపాల్‌రెడ్డి మృతదేహంపై పూలమాలలు ఉంచి నివా ళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నియంత పాలన సాగుతోం దని ధ్వజమెత్తారు.తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకపాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతదేహం హైదరాబాద్‌కు తరలింపు మృతదేహాన్ని పోలీసులు, బంధువులు హైదరాబాద్‌కు తరలించేందుకు సిద్ధం కాగా అఖిలపక్ష పార్టీల నాయకులు, ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగి కొద్దిసేపు ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. జైపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లోని ఓంకార్ నగర్లో నివాసముంటున్నాడు. దీంతో అంత్యక్రియల నిమిత్తం మృతదేహాన్ని హైదరాబాద్ తరలించారు. డిపోకే పరిమితమైన బస్సులు తెల్లవారుజామునే జైపాల్‌రెడ్డి మృతదేహంతో ఆర్టీసీ కార్మికులు డిపో ఎదుట బైఠాయించారు. దీంతో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి.పలువురు తాత్కాలిక విధులు నిర్వహిస్తున్న సిబ్బంది డిపో వద్దకు చేరుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అఖిలపక్ష నాయకులు, ఆర్టీసి జేఏసీ నాయకులు దేవరకొండ పట్టణ బంద్‌కు పిలుపునివ్వడంతో విద్యాసంస్థలు, దుకాణాలను మూసివేయించారు. ఎలాం టి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా దేవరకొండ డీఎస్పీ ఆనంద్‌రెడ్డి ఆధ్వర్యంలో సబ్‌డివిజన్ పరిధితో పాటు జిల్లా నుంచి పోలీసులు భారీగా దేవరకొండ బస్ డిపో ఎదుట మోహరించారు. 11గంటల సమయంలో పోలీస్ ఎస్కార్ట్ మధ్య ప్రభుత్వ అంబులెన్స్‌లో జైపాల్‌రెడ్డి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. -
ఆర్టీసీ సమ్మె : ప్రభుత్వ తీరుతో ఆగిన మరో గుండె
సాక్షి, నల్గొండ: ప్రభుత్వ తీరుతో ఆందోళనకు గురైన మరో ఆర్టీసీ కార్మికుడి గుండె ఆగింది. దేవరకొండ బస్ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న తుమ్మలపల్లి జైపాల్‌రెడ్డి ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతిచెందారు. మృతుడి స్వస్థలం నల్గొండ జిల్లా నాంపల్లి మండలం పగిడిపల్లి. ఆయనకు ఇద్దరు సంతానం. నిన్నరాత్రి వరకు జైపాల్‌రెడ్డి సమ్మె కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అర్ధరాత్రి ఆయనకు గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు, తోటి కార్మికులు అంబులెన్సులో హైదరాబాద్‌కి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచారు. జైపాల్‌రెడ్డి మృతదేహంతో డిపో ఎదుట కార్మికులు ధర్నాకు దిగారు. పరామర్శించడానికి వచ్చిన డిపో మేనేజర్‌ను అడ్డుకున్నారు. డ్యూటీకి వస్తున్న తాత్కాలిక డ్రైవర్లను, కండక్టర్లని కూడా కార్మికులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తవాతవరణం నెలకొంది. జైపాల్‌రెడ్డి మృతితో సూర్యాపేట డిపో వద్ద కూడా ఉద్రికత్త చోటుచేసుకుంది. సీపీఎం కార్యకర్తలు బస్సులను అడ్డుకునేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకుని, ఆందోళనకారులను అరెస్టు చేశారు. మరో ఆరునెలల్లో రిటైర్ కానున్న జైపాల్‌రెడ్డి ఆర్టీసీ సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరితో తీవ్ర ఆందోళన గురయ్యాడని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. జైపాల్‌రెడ్డి మృతి నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ నేడు (సోమవారం) దేవరకొండ పట్టణ బంద్ పిలుపునిచ్చింది. -
గో బ్యాక్ నినాదాలు.. పోలీసుల రంగ ప్రవేశం
-
దేవరకొండలో ఉద్రిక్తత
సాక్షి, నల్గొండ: నల్లమల్ల అడవుల్లో యురేనియం తవ్వకాల్లో భాగంగా సర్వే కోసం వచ్చిన అధికారులకు దేవరకొండ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. జిల్లాలోని నల్లమల్ల అడవుల్లో పర్యటించేందుకు సోమవారం రాత్రి ఇక్కడి చేరుకున్న 30 మంది అధికారులు దేవరకొండ సమీపంలోని ఓ లాడ్జ్‌లో బస చేశారు. మంగళవారం ఉదయం అడవిలోకి వెళ్లేందుకు బయటకు వచ్చన వారిని విద్యావంతుల వేదిక నాయకులు అడ్డుకున్నారు. నల్లమల్లకు వెళ్లొదంటూ తీవ్రంగా ప్రతిఘటించారు. గో బ్యాక్ అంటూ నినాదాలతో దేవరకొండ సమీప ప్రాంతాలు దద్దరిల్లాయి. విషయం తెలుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేశారు. దీంతో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కాగా కృష్ణానది తీర ప్రాంతం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అటవీ పరిధిలోని పలు ప్రాంతాల్లో యురేనియం ఖనిజం తవ్వకాలు జరపాలని, అపారమైన నిల్వలు వెలికితీసి ఖర్మాగారాలను నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ ప్రదేశమంతా శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయతీరాలలోనే ఉండటంతో ఆయా ప్రాంతాలలోని నివాసితులంతా యురేనియం నిల్వలు వెలికి తీసేందుకు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో దేవరకొండకు చేరుకున్న అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. నల్లమల్లలో ప్రవేశిస్తే ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. -
సీపీఐ కార్యకర్తల ఇళ్లపై టీఆర్ఎస్ నేతల దాడి
-
సీపీఐ కార్యకర్తల ఇళ్లపై దాడి
సాక్షి, నల్గొండ : దేవరకొండ మండలం పాత్లావత్ తండాలో బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీపీఐ కార్యకర్తల ఇల్లపై కొందరు దుండగులు దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. టీఆర్ఎస్ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని సీపీఐ నేతలు ఆరోపిస్తున్నారు. -
ఎన్నికల భద్రత కట్టుదిట్టం..!
సాక్షి, చింతపల్లి : అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్‌సభ ఎన్నికలు ప్రశాంత నిర్వహించాలని పోలీస్ శాఖ భావిస్తోంది. ఇందుకోసం గత నెలరోజుల నుంచి అధికారులు క్షేత్రస్థాయిలో భద్రత ఏర్పా ట్లు పర్యవేక్షిస్తున్నారు. నియోజకవర్గంలో ఆయా కేంద్రాల పరిధిలో రూట్లు సిద్ధం చేశారు. గ్రామాల్లో పోలీస్ కవాతు నిర్వహించి ప్రజల్లో మనోధైర్యాన్ని పెంచుతున్నారు. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీస్‌శాఖ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై దృష్టి సారిస్తోంది. నియోజకవర్గంలో మొత్తం 282 పోలింగ్ కేంద్రాలు ఉండగా అందులో సుమారు 30కిపైగా కేంద్రాలను అధికారులు సమస్యాత్మకమైవిగా గుర్తించా రు. ఎన్నికల తేదీల నాటికి ఆయా గ్రామాల్లో పరిస్థితుల ఆధారంగా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. గతంలో నేర చరిత్ర కలిగిన ప్రతి ఒక్కరిని బైండోవర్ చేసే పనిలోపడ్డారు. తనిఖీ కేంద్రాలు.. మద్యం, డబ్బు అక్రమ తరలింపును నిరోధించడానికి సరిహద్దు జిల్లాల పోలీసులు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు మాల్ వెంకటేశ్వరనగర్ పంప్‌హౌజ్ వద్ద, కొండభీమనపల్లి వద్ద, పోలేపల్లి సమీపంలో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ తనిఖీ కేంద్రాలు ఎన్నికలు పూర్తయ్యే వరకు 24 గంటల పాటు పని చేయనున్నాయి. ఇతర జిల్లాల నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని ఆపి తనిఖీ చేసిన తర్వాతనే జిల్లాలోకి అనుమతిస్తున్నారు. ఓటరు చైతన్య కార్యక్రమాలు.. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గ్రామాల్లో పోలీసులు ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఓటర్లలో చైతన్యం నింపి శాంతియుత వాతావరణానికి సహకరించాలని కోరుతున్నారు. ఆయా గ్రామాల్లో ఇప్పటికే రూట్ మార్చ్‌లను సిద్ధం చేసి అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. గత ఎన్నికల సమయంలో ఘర్షణలు, కవ్వింపు చర్యలు, మద్యం, డబ్బులు పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తులను బైండోవర్ చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాం తాలకు పోలీసులు వీలైనన్ని సార్లు వెళ్లి పరిస్థితులు అంచనా వేసేపనిలో పడ్డారు. గ్రామాల్లో అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టారు. ఎన్నికల్లో అవసరమైతే అదనపు బలగాలను ఉపయోగించనున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారే కాకుండా కొన్ని రిజర్వ్ బలగాలను కూడా అందుబాటులో ఉంచుతారు. అయితే ఎన్నికల తే దీ సమిపిస్తుండడంతో పోలీస్ యంత్రాంగం పరి స్థితులను బట్టి అదనపు బలగాలను అక్కడికి తరలించే వీలుంది. ఆయా గ్రామాల్లో వీడియో చిత్రీకరణ చేస్తూ పరిస్థితిని అంచనా వేస్తున్నారు. -
అశ్రునయనాలతో అంతిమయాత్ర
ముగ్గురు విద్యార్థులకు కుటుంబ సభ్యులు, సమీప గ్రామాల ప్రజలు, క్రిస్టియన్ మత పెద్దలు, పలువురు ప్రముఖులు శనివారం కన్నీటి వీడ్కోలు పలికారు. నేరెడుగొమ్ము మండలం గుర్రపుతండాకు చెందిన శ్రీనివాస్‌నాయక్, సుజాత పిల్లలు సాత్విక(18) జై సుచిత(14) సుహాస్‌నాయక్(16) అమెరికాలోని టెన్నిస్ రాష్ట్రం కొలిరివిల్లేలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి వారి మృతదేహాలు గుర్రపుతండాకు చేరుకోగా, శనివారం క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. చందంపేట (దేవరకొండ) : డిసెంబరులో అమెరికాలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో మృతిచెందిన విద్యార్థుల మృతదేహాలు శనివారం స్వగ్రామం చేరాయి. నేరెడుగొమ్ము మండలం గుర్రపుతండాకు చెందిన పాస్టర్, అలైఖ్య బంజార ట్రస్ట్ వ్యవస్థాపకుడు శ్రీనివాస్‌నాయక్, సుజాత దంపతుల కుమార్తెలు సాత్విక(18) జై సుచిత(14) కుమారుడు సుహాస్‌నాయక్(16) అమెరికాలోని టెన్నిస్ రాష్ట్రం కొలిరివిల్లేలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. సుమారు 25 రోజుల పాటు అక్కడే ఉండడంతో సొంత గ్రామమైన గుర్రపుతండాకు తీసుకురావాలని గ్రామస్తులు కోరారు. దీంతో శుక్రవారం రాత్రి స్వగ్రామానికి మూడు ప్రత్యేక అంబులెన్స్‌లలో చిన్నారుల మృతదేహాలు తరలించారు. శనివారం గుర్రపుతండాలోని అలేఖ్య బంజార పాఠశాలలో పెద్ద సంఖ్యలో జనం రావడంతో అక్కడ ఏర్పాటు చేసిన భూస్థాపన ఆరాధన కార్యక్రమంలో క్రిస్టియన్ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. ఒకే కుటుం బానికి చెందిన ముగ్గురు చిన్నారులు మృతిచెందడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు క్రిస్టియన్ మతపెద్దలు, క్రైస్తవ సోదరులు, ప్రముఖులు, స్నేహితులు హాజరై శ్రీని వాస్ కుటుంబాన్ని పరామర్శించారు. ముగ్గురు చిన్నారులు మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో అక్కడున్న వారు కన్నీ రు పెట్టుకున్నారు. అనంతరం శ్రీనివాస్‌నాయక్‌కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో ముగ్గురి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. శ్రీనివాస్ కుటుంబాన్ని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, నిజామాబాద్ ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, జెడ్పీ చైర్మన్ బాలునాయక్, బి ల్యానాయక్, తెలంగాణ రాష్ట్ర మైనార్టీ వైస్ చైర్మన్ శంకర్లుకి, బిఎండబ్ల్యూవో వెంకటేశ్వర్లు, ఆర్డీఓ లింగ్యానాయక్, ఫ్రెండ్ క్యాంపస్ అకాడమి ప్రెసిడెంట్ అస్టోబిట్, హుమేల్, ఎలెక్స్ కోబర్ట్, మేరిమిహోలో, కొబిలి కిల్ హాజరయ్యారు. అండగా ఉంటా : ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు నా చిన్ననాటి నుంచి శ్రీనివాస్‌నాయక్ మంచిమిత్రుడు. వీరికుటుంబం చాలా మంచిది. ముగ్గురు చిన్నారులను కోల్పోవడం చాలా బాధగా ఉంది. నాతో కూడా ఎప్పుడు ఫోన్ చేసి ముగ్గురు చిన్నారులు మాట్లాడే వారు. వారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున సానుభూతి వ్యక్తం చేస్తున్నా. ప్రభుత్వం తరఫున ఆదుకుంటాం : రవీంద్రకుమార్ అలైఖ్య బంజార సంస్థను స్థాపించి ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యను చెబుతున్న శ్రీనివాస్, సుజాత దంపతుల ము గ్గురు చిన్నారులు ఉన్నత చదువులకు వెళ్లి మృతిచెందడం చాలా బాధాకరం. నా, ప్రభుత్వం తరఫున ఆ కుటుంబానికి అందుబాటులో ఉంటా. కుటుంబానికి ప్రభుత్వ అండ : ఎంపీ గుర్రపుతండాకు చెందిన శ్రీనివాస్, సుజాత దంపతుల ముగ్గురు చిన్నారులు చనిపోవడం బాధాకరం. ఇంత మంది ప్రజలు రావడం చూస్తే శ్రీనివాస్‌నాయక్‌పై ఉన్న నమ్మకం ఏంటో తెలుస్తుంది. శ్రీనివాస్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడుతుంది. తోడుగా ఉంటాం : జెడ్పీచైర్మన్, బాలునాయక్ నా చిన్నతనం నుంచి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు తెలుసు. సొంత గ్రామం కోసం పాఠశాలను ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్న శ్రీనివాస్‌నాయక్ ముగ్గురు చిన్నారులు చనిపోవడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం. పాటతో కన్నీరుపెట్టిన తల్లి తనకున్న ముగ్గురు చిన్నారులు ఉన్నత చదువుల కోసం వెళ్లి అగ్ని ప్రమాదంలో మృతిచెందడంతో తల్లి సుజాత కన్నీరుమున్నీరైంది. ఎవరు నన్ను చెయ్యి విడిచినా... అనే పాటతో చిన్నారుల జ్ఞాపకాలను తల్లి నెమరువేసుకుంది. పాట పాడినంత సేపు అక్కడున్న జనం కన్నీరును ఆపలేకపోయారు. -
ప్రాణాలు తీస్తున్న సరదా
సాక్షి, చందంపేట (దేవరకొండ) : 18 ఏళ్లు నిండిన ఓ యువకుడు ప్రేమించుకుని వివాహం చేసుకున్నాడు. చిన్నప్పుడే తల్లిదండ్రి నుంచి విడిపోయాడు. తల్లి పని చేసి సాకింది. ఆ యువకుడు ప్రయోజకుడయ్యాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త, కాళ్లపై నిలబడ్డ కొడుకు మృత్యువాతపడ్డాడు. స్నేహితులతో కలిసి వచ్చి మృత్యుఒడిలోకి వెళ్లాడు. రెండున్నరేళ్లలోపు ఇద్దరు కుమారులకు దూరమయ్యాడు. తల్లి, భార్య రోదనలు, ఆ చిన్నారులను చూస్తే పలువురిని కన్నీటి పర్యంతం చేసింది.. ఈ ఘటన ఆదివారం రాత్రి నేరెడుగొమ్ము మండలం కృష్ణా నది తీరమైన వైజాక్ కాలనీలో చోటు చేసుకుంది. హైదరాబాద్ ప్రాంతంలోని మెహిందీపట్నంకు చెందిన గడ్డం వెంకట్(23) హైదరాబాద్‌లోని సోని ట్రాన్స్‌పోర్ట్‌లో ఇన్చార్జ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. మూడేళ్ల క్రితం అదే కాలనీకి చెందిన నిర్మలతో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి రెండున్నర సంవత్సరాల లోపు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. తన కంపెనికి చెందిన ఏడుగురు మిత్రులతో కలిసి వెంకట్ ఆదివారం సుమారు 3 గంటల సమయంలో వైజాక్ కాలనీలోని ఓ బెల్టు దుకాణంలో మద్యం కొనుగోలు చేసి అక్కడే తినేందుకు కొన్ని వస్తువులను కొనుగోలు చేశారు. కృష్ణా నది పరీవాహక ప్రాంతాన్ని సందర్శించేందుకు మిత్రులతో మర బోటులో వెళ్లాడు. అక్కడే కాసేపు ఆగినీటిలో ఈత కొట్టారు. ఇదే క్రమంలో మద్యం సేవించి వెంకట్ ప్రమాదవశాత్తు నీటి గుంతలోకి వెళ్లిపోయాడు. తోటి మిత్రులు అరుపులు వేయడంతో మత్స్యకారులు అక్కడికి వెళ్లి గాలించారు. పోలీసులకు కూడా సమాచారం అందడంతో కృష్ణా నదిలో పోలీసు సిబ్బంది జల్లడ పట్టడంతో సుమారు గంట సేపటికి వెంకట్ మృతదేహం లభించింది. మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించగా, భార్య నిర్మల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పచ్చిపాల పరమేశ్ తెలిపారు. అడ్డూఅదుపు లేకుండా మద్యం విక్రయాలు తెలంగాణ రాష్ట్రంలో అరకు పర్యాటక ప్రాంతంగా గుర్తింపుపొందిన వైజాక్ కాలనీలో మద్యం విక్రయాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. గతంలో పుష్కరాల సమయంలో వచ్చిన ఓ చిన్నారి కూడా మృత్యువాతపడగా మట్టి, ఇసుక అక్రమ రవాణాకు పాల్పడడంతో మరో చిన్నారి మృతిచెందాడు. అనుమతి లేకుండా మర బోట్లలోవేలాది రూపాయలు వసూలు చేసి సాగర తీరంలో కొంత మంది వ్యాపారం చేస్తున్నారు. ప్రమాదం ఉన్నప్పటికి మరబోట్లేనే మద్యం, వంటకాల పేరుతో పర్యాటకుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తూ సరదాగ వచ్చిన వారి నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతూ ప్రాణాలు కోల్పోయేలా ప్రమాదకర ప్రయాణం చేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. నిద్రావస్థలో మత్స్యకార సంస్థ అర్హత, రక్షణ జాకెట్లు, హెచ్చరికలు, సూచనలు ఇవ్వాల్సిన మత్స్య శాఖ నిద్రావస్థలో ఉంది. ఆదివారం రాత్రి జరిగిన ఘటనలో వెంకట్ మృతి చెందినప్పటికీ ఆ శాఖ సోమవారం నాటికి కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించి పలు హెచ్చరికలు చేయాల్సి ఉంది. అనుమతి లేకుండా మరబోట్లలో ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. ఈ విషయమై నేరెడుగొమ్ము ఎస్ఐ పచ్చిపాల పరమేశ్‌ను వివరణ కోరగా నలుగురు కానిస్టేబుళ్లు, ఎస్ఐ, ఇద్దరు హోంగార్డులు ఉన్నారని, ఎన్నికల నిర్వాహణ, ఆయా గ్రామాల్లో అవాంఛనీయ సంఘటనలపై దృష్టి సారించామని, మత్స్య శాఖ, మండల పరిషత్, తహసీల్దార్ ఈ విషయాలపై దృష్టి సారించాలని, కాని వారు పట్టించుకోవడం లేదన్నారు. కన్నీరు..మున్నీరు వెంకట్, నిర్మలలు మూడేళ్ల క్రితం ప్రేమించుకున్నారు.. అందరిని ఒప్పించి వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు రెండున్నర సంవత్సరాల లోపు అభి, అఖి కుమారులు ఉన్నారు. చిన్నప్పటికి నుంచి తండ్రి తమ నుంచి దూరమైనా తల్లి ఆలనా..పాలన చూసి ప్రయోజకున్ని చేసింది. గత రెండు రోజుల క్రితం తాను సంపాదించిన డబ్బులలో ఓ ద్విచక్ర వాహనం కొనుక్కుంటానని తల్లిని కోరడంతో కొన్ని పైసలు ఇచ్చానని, రెండు రోజుల్లో బండి తెచ్చుకుంటానని చెప్పి వెళ్లిన కుమారుడు మృతిచెందడంతో ఆ తల్లి రోదన అంతా ఇంత కాదు. ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. ఈ ప్రాంతంలో చనిపోవడం ఏంటని ఆ తల్లి కన్నీరు మున్నీరైంది. నా వెంకట్...నాకు కావాలి ప్రేమించి వివాహం చేసుకున్న భార్య నిర్మల చిన్నారుల ఏడుపులతో కేకలు పెట్టడడం కలచివేసింది. -
‘షార్ట్ సర్క్యూట్ వల్లే ఆ ప్రమాదం జరిగింది’
సాక్షి, నల్గొండ : అమెరికాలోని కొలిర్‌విల్ ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నల్గొండ వాసులైన సాత్విక్ నాయక్, సుహాస్ నాయక్, జయసుచిత్ మరణించిన సంగతి తెలిసిందే. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు శ్రీనివాస్ నాయక్, సుజాత హుటాహుటిన అమెరికా బయలుదేరి వెళ్లారు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన బిడ్డలు.. ఇలా విగత జీవులుగా మారడంతో తల్లిదండ్రుల గుండెలవిసేలా రోదిస్తున్నారు. వారి స్వగ్రామం గుర్రపు తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దేవరకొండ నియోజకవర్గంలోని నేరుడుగొమ్ము మండలం గుర్రపు తండా గ్రామానికి చెందిన శ్రీనివాస్ నాయక్, సుజాతలు గ్రామంలో ‘అలితేయా’ క్రిస్టియన్ మిషనరీ ఆశ్రమంతో పాటు స్కూల్‌ను కూడా నడుపుతున్నారు. అంతేకాక శ్రీనివాస్ నాయక్ చర్చి పాస్టర్‌గా కూడా పని చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీనివాస్ నాయక్‌కు అమెరికాకు చెందిన మరో పాస్టర్‌తో పరిచయం ఏర్పడింది. అతని సాయంతో శ్రీనివాస్ నాయక్ తన ముగ్గురు పిల్లలైన సాత్విక్, జాయి, సుహాస్లను అమెరికాకు పంపి చదివిస్తున్నారు. వీరు అమెరికా వెళ్లి ఇప్పటికి 20 నెలలు అయ్యింది. ఈ క్రమంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ నెల 24 రాత్రి స్థానిక చర్చి పెద్ద డేనీ విల్లాలో జరిగిన వేడుకల్లో సాత్విక్ నాయక్, సుహాస్ నాయక్, జయసుచిత్ పాల్గొన్నారు. డేనీ కుటుంబసభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న సమయంలో విల్లాలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి.. అగ్నికీలలు ఇంటిని చుట్టుముట్టాయి. భారీస్థాయిలో జరిగిన ఈ ప్రమాదంలో సాత్విక్, సుహాస్, జయ సుచిత్తోపాటు డేనీ భార్య మంటల్లో సజీవ దహనమయ్యారు. డేనీ, అతని కొడుకు మాత్రం అగ్నిప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన గిరిజన బిడ్డలు ఇలా చనిపోవడం గ్రామంలోని ప్రతి ఒక్కరిని కంట తడిపెట్టిస్తోంది. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి : ఉత్తమ్ గిరిజన విద్యార్థుల మృతి పట్ల టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉజ్వల భవిష్యత్ ఉన్న విద్యార్థులు ఇలా మృత్యువాత పడటం అత్యంత దురదృష్టకరమన్నారు. పిల్లల తల్లిదండ్రులు శ్రీనివాస్ నాయక్, సుజాతలకు సానుభూతి తెలిపారు. బాధితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాలుగా సాయం చేయాలంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
అమెరికాలో తీవ్ర విషాదం..
కొలిర్‌విల్లి: అమెరికాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ముగ్గురు నల్గొండవాసులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కొలిర్‌విల్‌లో మంగళవారం క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్న వేళ ఇంట్లో మంటలు చేలరేగి ఈ దారుణం జరిగింది. ప్రమాద సమయంలో ఇంట్లో మొత్తం ఆరుగురున్నారు. వీరిలో ఇద్దరు ప్రాణాలతో బయటపడగా.. మిగిలిన నలుగురు సజీవ దహనమయ్యారు. చనిపోయిన ముగ్గురు నల్గొండవాసులైన సాత్విక నాయక్, జయసుచిత్ నాయక్, సుహాస్ నాయక్‌గా గుర్తించారు. వీరు నల్గొండ జిల్లా నేరేడుకొమ్మ మండలం గుర్రపు తండా వాసులు. పైచదువుల కోసం ముగ్గురు అన్నాచెల్లెళ్లూ అమెరికాలోని కొలిర్‌విల్లిలో ఉంటున్నారు. నాయక్ కుటుంబం నల్గొండలో మిషనరీస్ తరపున పనిచేస్తోంది. ఉన్నత చదువుల కోసం అగ్ర రాజ్యానికి వెళ్లిన తమ పిల్లలు అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని తెలియడంతో గుర్రపు తండాలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. పండుగ వేడుకల్లో.. అనుకోని విషాదం! క్రిస్మస్ పండుగ సందర్భంగా స్థానిక చర్చి పెద్ద డేనీ ఇంట్లో జరిగిన వేడుకల్లో సాత్విక్ నాయక్, సుహాస్ నాయక్, జయసుచిత్ పాల్గొన్నారు. డేనీ కుటుంబసభ్యులతో కలిసి మొత్తం ఆరుగురు క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు. అయితే, అర్ధరాత్రి సమయంలో షార్ట్ సర్కూట్‌థో ఇంట్లో అగ్నిప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి.. అగ్నికీలలు ఒక్కసారిగా ఇంటిని చుట్టుముట్టాయి. ఈ ప్రమాదంలో సాత్విక, జయసుచిత్, సుహాస్‌తోపాటు డేనీ భార్య మంటల్లో సజీవ దహనమయ్యారు. డేనీ, అతని కొడుకు మాత్రం అగ్నిప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. వారికి తీవ్ర గాయాలయ్యాయి. -
‘దేవరకొండను జిల్లాగా చేయాలి’
సాక్షి, హైదరాబాద్: దేవరకొండను జిల్లాగా ఏర్పాటు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డికి జిల్లా సాధనకు పోరాడుతున్న వివిధ సంఘాలు, పార్టీలు విన్నవించాయి. హైదరాబాద్ లోని ముఖ్దూంభవన్‌లో ఆదివారం ఆయా సంఘా లు, పార్టీల నేతలు సీపీఐ నేతలను కలిశారు. వెనుకబడిన గిరిజన ప్రాంతమైన దేవరకొండను జిల్లాగా ఏర్పాటు చేసేలా సీఎం కేసీఆర్‌పై ఒత్తిడి తీసుకోవాలని కోరారు. వారిని కలిసిన వారిలో జిల్లా సాధన సమితి కన్వీనర్ కేతావత్ లాలూ నాయక్, గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్యనాయక్, బీజేపీ నేత నక్క వెంకటేశ్వర్లు, ఏఐబీఎస్ కార్యదర్శి కేతావత్ హేమ్లానాయక్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అ«ధ్యక్షుడు తాటిశెట్టి నర్సింహ, బీజేపీ కార్యదర్శి వనం పుష్పలత ఉన్నారు. దేవరకొండను జిల్లాగా ఏర్పాటు చేయాలని దేవరకొండ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు లాలూ నాయక్, మాజీ మంత్రి రవీంద్ర నాయక్ ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. -
నియోజకవర్గ అభివృద్ధికి కృషి : బాలూ నాయక్
సాక్షి, చింతపల్లి : దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ప్రజాకూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నేనావత్ బాలునాయక్ పేర్కొన్నారు. మండల పరిధిలోని మదనాపురం, చాకలిశేరిపల్లి, తక్కెళ్లపల్లి, రోటిగడ్డతండా, చౌళ్లతండా, ఉమ్మాపురం, లక్ష్మణ్‌నాయక్, లచ్చిరాంతండా, దేన్యతండా, నెల్వలపల్లి, రాయినిగూడెం, ప్రశాంతపురి, గొల్లపల్లి తదితర గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధే తన ధ్యేయమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసేందుకు మరోమారు కుట్రపన్నుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, ఎంపీపీ రవినాయక్, జెడ్పీటీసీ హరినాయక్, సీపీఐ మండల కార్యదర్శి యుగేందర్‌రావు, టీడీపీ మండల కార్యదర్శి ఆర్ఎన్.ప్రసాద్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్‌యాదవ్, వెంకటయ్యగౌడ్, నాగభూషణ్, నర్సిరెడ్డి, పురుషోత్తంరెడ్డి, సంజీవరెడ్డి, జంగిటి నర్సింహ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తాలు... -
దేవరకొండ: రాజ్‌నాథ్ రాకతో కమలదళం జోష్
సాక్షి, త్రిపురారం : వేలాదిగా తరలివచ్చిన జనంతో హాలియా మండల కేంద్రం కమలమయంగా మారింది. హాలియాలో శుక్రవారం నిర్వహించిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ బహిరంగ సభ విజయవంతం కావడంతో బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కనిపించింది. హాలియాలోని దేవరకొండ రహదారికి సమీపంలోని మైదానంలో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభ జన సందోహంతో నిండిపోయింది. మహిళల కోలా టం, నృత్యాలతో బీజేపీ పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్‌ను నింపింది. ఈ సభకు పార్టీ కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని గ్రామగ్రామాల నుంచి ప్రజలు తరలివడంతో సభా ప్రాంగణమంతా నిండిపోయింది. రాజ్‌నాథ్‌సింగ్ సభకు రావడం ఆలస్యమైనప్పటికీ ప్రజలకు ఎలాంటి నిరుత్సాహం లేకుండా కళాకారులు తమ ఆటపాటలతో జోష్ నింపారు. కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా పాడిన పాటలతో పాటు కేంద్రంలో బీజేపీ ప్రభుతం అమలు చేస్తున్న పలు అభివృద్థి సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరిస్తూ కళాకారులు బృందం ఆటపాటలతో ప్రజలను అలరించారు. మరిన్ని వార్తాలు... -
కేసీఆర్ సభలు.. సక్సెస్
సాక్షిప్రతినిధి, నల్లగొండ/సాక్షి, యాదాద్రి : ఆపద్ధర్మ సీఎం, టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) జిల్లా పర్యటన విజయవంతం అయ్యింది. ఆయన బుధవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, నకిరేకల్, భువనగిరి నియోజకవర్గ కేంద్రాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఏ నియోజకవర్గంలో ఎవరెవరు ప్రధాన ప్రత్యర్థులో తెలిసిపోయాక, తమ అభ్యర్థుల తరఫున కేసీఆర్ ప్రచారానికి వచ్చారు. దేవరకొండ, నకిరేకల్ సభల్లో ఇరవై ఐదు నిమిషాలచొప్పున ప్రసంగించిన కేసీఆర్ భువనగిరి సభలో మాత్రం పది నిమిషాల్లోపే ముగించారు. ఆయా నియోజకవర్గాల అభ్యర్థుల్లో మరింతగా ధైర్యాన్ని నింపేందుకు ఈసభలు ఉపయోగపడ్డాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తమకు దక్కకుండా పోతున్న దేవరకొండపై గులాబీ జెండా ఎగురవేసేందుకు ప్రయత్నిస్తోంది. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితమైంది. కాకుంటే, ఎమ్మెల్యే హోదాలో రవీంద్ర కుమార్ గులాబీ గూటికి చేరడంతో గడిచిన రెండేళ్లు ఆ పార్టీ ఎమ్మెల్యే ఉన్నట్లు భావించింది. ఈ ఎన్నికల్లో రవీంద్ర కుమార్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఆయన గెలుపు బాధ్యతను భుజాన వేసుకుని పార్టీ నాయకత్వం పనిచేస్తోంది.దీనిలో భాగంగానే ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ దేవరకొండ అభివృద్ధి నా బాధ్యత : కొండమల్లేపల్లి/చందంపేట/ చింతపల్లి/పెద్దఅడిశర్లపల్లి : దేవరకొండ అభివృద్ధి తన వ్యక్తిగత బాధ్యతగా తీసుకుంటానని ఆపదర్ధ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అభివృద్ధి సాధించాలంటే డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. బుధవారం దేవరకొండ పట్టణంలోని ముదిగొండ ఎక్స్‌రోడ్డులో నిర్వహించిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా.. రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. సమైక్య పాలనలో ఫ్లోరైడ్ రక్కసితో ఇబ్బందిపడ్డ ఈ ప్రాంతవాసులు వలస పోయి కూలీలుగా బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే అత్యధికంగా దేవరకొండ నియోజకవర్గంలో 85 తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి అభివృద్ధికి బాటలు వేశామన్నారు. నియోజకవర్గ పరిధిలోని నేరెడుగొమ్ము ప్రాంతానికి పెద్దమునిగల్‌కు లిఫ్ట్ ద్వారా నీళ్లు అందించేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని, పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు గాను ఎంపీ గుత్తా, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రమావత్ రవీంద్రకుమార్ తనను సంప్రదించారని చెప్పారు. జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏనాడూ దేవరకొండ నియోజకవర్గాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. దేవరకొండ అభ్యర్థి రవీంద్రకుమార్‌ను 50వేల మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎంపీలు కె.కేశవరావు, గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రమావత్ రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మదర్ డెయిరీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి, నాయకులు గాజుల ఆంజనేయులు, రాంచందర్‌నాయక్, రాంబాబునాయక్, ఎం పీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, కోదాడ మాజీ ఎమ్మెల్యే చందర్రావు, మాజీ జెడ్పీటీసీ తేర గోవర్ధన్‌రెడ్డి, పాండురంగారావు, దేవేందర్‌రావు, పల్లా ప్రవీణ్‌రెడ్డి, వడ్త్య దేవేందర్, జాన్‌యాదవ్, బండారు బాలనర్సింహ, ఏరుకొండలుయాదవ్ పాల్గొన్నారు. 24 గంటల కరెంటు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ : దేశంలోనే రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ప్రాజెక్టుల నిర్మాణాల్లో సైతం దేవరకొండ ముందుందని నల్ల గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం 60 శాతం అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందించేందుకు రూ.6500 కోట్లతో డిండి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించామని గుర్తుచేశారు. నియోజకవర్గ పరిధిలోని సింగరాజుపల్లి, గొట్టిముక్కల, కిష్టరాంపల్లి రిజర్వాయర్ల పనులు కొనసాగుతున్నాయని ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఈ ప్రాంతం సస్యశామలమవుతుందన్నారు. నక్కలగండి రిజర్వాయర్ పనులు 80 శాతం పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దని పేర్కొన్నారు. అభివృద్ధికి నిరోధకులుగా మారిన మహాకూటమిని ఓడించాలని పిలుపునిచ్చారు. ఆదరించి ఆశీర్వదించండి ... డిసెంబర్ 7న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకొండ నియోజకవర్గ ప్రజలు తనను ఆదరించి ఆశీర్వదించాలని టీఆర్ఎస్ దేవరకొండ ఎమ్మెల్యే అభ్యర్థి రమావత్ రవీంద్రకుమార్ కోరారు. రానున్న ఎన్నికల్లో తనను గెలిపిస్తే దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతానని పేర్కొన్నారు. నియోజకవర్గంలో సాగు నీటి వనరుల కల్పనకు కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నామనారు. దేవరకొండ ఖిలాపై గులాబీ జెండా ఎగురవేసేందుకు ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు. దేవరకొండ సభలో మాట్లాడుతున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, చిత్రంలో పార్టీ నాయకులు కూటమి గూటంగా మారింది : నాయిని రాష్ట్రంలో కూటమి గూటంగా మారిం దని.. ఎన్నికల ప్రచారానికి వస్తున్న కూటమి నాయకులను మీరు చేసిన అభివృద్ధి ఏందని ప్రజలు నిలదీసి అడగాలని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. కాంగ్రెస్, టీడీపీ దొందూ దొందేనని ఆ రెండు పార్టీల హయాంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి శూన్యమని పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాస్తా.. గడ్డంకుమార్రెడ్డిగా మారారని, తెలంగాణలో ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదని, ఉత్తమ్ గడ్డం తీసేది లేదని ఎద్దేవా చేశారు. జిల్లాలో అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేవుడసోంటి మనిషి పైళ్ల శేఖర్‌రెడ్డి :సర్వేల్లో తేలిందని చెప్పిన కేసీఆర్ సాక్షి, యాదాద్రి : ‘దేవుడసోంటి మనిషి పైళ్ల శేఖర్‌రెడ్డి. ప్రజలంతా శేఖర్‌రెడ్డి దేవుడు, ఆత్మీయుడు, ఆదుకుంటాడు’ అని చెప్పుకుంటున్నారని సర్వేల్లో తేలిందని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఎవరి ఓటు వేస్తారని ప్రశ్నిస్తే.. పైళ్ల శేఖర్రెడ్డికని ప్రజలకు అందుబాటులో ఉంటాడని చెబుతున్నారని పేర్కొన్నారు. అలాంటి మనిషిని మనందరం గెలిపించుకోవాలని కోరారు. నాలుగున్నర ఏళ్లలో పైళ్ల శేఖర్‌రెడ్డి అద్భుతమైన ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బుధవారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ మాట్లాడారు. శేఖర్‌రెడ్డి కంటే ముందు నా ఆత్మీయ మిత్రుడు, స్నేహితుడు ఎలిమినేటి మాధవరెడ్డిఅని.. అద్భుతంగా పనిచేసి భువనగిరికే కాకుండా జిల్లాలో గొప్ప నాయకుడిగా ఎదిగాడని అన్నారు. మాధవరెడ్డిలాగా ఏ ఇతర మంత్రులు పని చేయలేదన్నారు. తాను కరువు మంత్రిగా ఉన్నప్పుడు మాధవరెడ్డి భువనగిరి ఎమ్మెల్యేగా ఉన్నాడని, మున్సిపాలిటీలో నీటి సమస్య పరిష్కారం కోసం వార్డు వార్డుకూ తిరిగి 35 బోర్లు వేయించాడని గుర్తు చేశాడు. అలాంటి మాధవరెడ్డి స్థానంలో వచ్చిన పైళ్ల శేఖర్‌రెడ్డి ఆ లోటు భర్తీ చేస్తున్నాడని తెలిపారు. తాము చేసిన పలు సర్వేల్లో ఎవరికి ఓటేస్తారని అడిగితే చదువురాని వారు సైతం పైళ్ల శేఖర్‌రెడ్డికే వేస్తామని చెప్పారన్నారు. -
కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేస్తా : కేసీఆర్
సాక్షి, దేవరకొండ : ప్రజలకు సామాజిక న్యాయం జరగాలంటే కేంద్రంపై ప్రాంతీయ పార్టీల పెత్తనం ఉండాలని టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేసి నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేస్తాన్నారు. ఎన్నికల తర్వాత ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెస్తామని తెలిపారు. బుధవారం ఆయన దేవరకొండలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కేంద్రంతో కొట్లాడి ముస్లిం, గిరిజన రిజర్వేషన్లు సాధిస్తామని హామీ ఇచ్చారు. సామాజిక న్యాయం జరగాలంటే రిజర్వేషన్లు అమలు కావాలన్నారు. ఇంకా కేసీఆర్ బహిరంగ సభలో ఏమన్నారంటే.. కచ్చితంగా రిజర్వేషన్లు తీసుకొస్తా ‘ గిరిజనుల, ముస్లింల రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే పెడచెవిన పెట్టింది. ప్రధాని నరేంద్ర మోదీని నేను 20 సార్లు కలిశా. 50 ఉత్తరాలు రాశా. అయినా పట్టించుకోలేదు. ఆయనకు హిందు, ముస్లిం అనే బీమారి ఉంది. మన రిజర్వేషన్లు మనకు ఇవ్వమంటే కేంద్రానికి ఏం రోగం. ఈ విషయంలో కాంగ్రెస్ కూడా అంతే. బీజేపీ, కాంగ్రెస్ దొందు దొందే. ఒకరిది కాషాయం జెండా, మరోకరిది మూడు రంగుల జెండా అంతే తేడా. కేసీఆర్ ఒక పని మొదలు పెడితే కొస దాక తెగిస్తాడని మీకు తెలుసు. దేవరకొండ సాక్షిగా చెబుతున్నా కేంద్రంతో కొట్లాడి కచ్చితంగా రిజర్వేషన్లు తీసుకొస్తా. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేస్తా. నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తా. దాని ద్వారా దళిత, ముస్లిం పోదరుల స్థితి మారుస్తా. రిజర్వేషన్లు కావచ్చు. రాష్ట్రాల హక్కులు కాపాడే ప్రయత్నం చేస్తా. మనకే కాదు యావత్ దేశానికే ఉపయోగ పడే కార్యక్రమాలు చేస్తాం. తెలివి ఉన్న కాంగ్రెసోళ్లు కరెంట్ ఎందుకు ఇవ్వలేదు మేము తెలిఉన్న నాయకులం అని చెప్పుకునే కాంగ్రెస్ నేతలు 35 ఏళ్లు కరెంట్ ఎందుకు ఇవ్వలేదు. ఇవాల 24గంటల కరెంట్ ఇస్తున్నాం. ఇవాల కరెంట్ పోతలేదు. తప్పిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ అంధకారం అవుతుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే చీకట్లోకి పోతారు. తెలంగాణ కొడ్లాడి తెచ్చుకున్న తర్వాత నీళ్లకోసం ఆలోచన చేశా. ఒక సంవత్సరం సర్వే చేసి ప్రాజెక్టుల డిజైన్ చేశా. అసెంబ్లీలో ఏ ప్రాజెక్టు ఎలా ఉందో చూపిస్తా అంటే కాంగ్రెస్ నాయకులు పారిపోయారు. నిజంగా వాళ్లకు తెలివి ఉంటే ఎందుకు పారిపోవాలి. వాళ్లకు ఏం తెలియదు. తెలంగాణ బాగు చేద్దాం అంటే అడ్డం పడ్డారు. ఎన్నికలకు పోదామా అంటే సై అన్నారు. ఇప్పుడేమో గోడలు గీకుతున్నారు. మళ్లీ చంద్రబాబునే తెచ్చుకుందామా.. పోరాడి మన తెలంగాణ మనం తెచ్చుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు చంద్రబాబను భూజల మీద మోస్తుకొస్తున్నారు. మళ్లీ మనకు చంద్రబాబు కావాలా? ఆయనను తెలంగాణను అప్పగిస్తామా? వచ్చినోడు మనోడు కాదు.. కానీ తెచ్చినోడు మాత్రం మనోడే. ముందు మనోడిని దంచాలి. ఓట్లలతో దంచాలి. ప్రాజెక్టులు ఆపాలని కేంద్రానికి లేఖలు రాసిన చంద్రబాబు ఏం మొఖం పెట్టుకొని వస్తున్నారు. ఇవాళ మళ్లీ వాళ్లు వస్తే ప్రాజెక్టులు ఆపుతారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అనేక పథకాలను ప్రవేశపెట్టాం. కరువుతో నలిగిపోయిన దేవరకొండకు నీళ్లను తెచ్చాం. తండాలను గ్రామా పంచాయతీలుగా మార్చినాం. ఫించన్లను రూ.1000కి పెంచాం. కేసీఆర్ కిట్, కంటివెలుగు, రైతుబంధు, రైతు బీమా ఇలా దేశంలో ఎక్కడా లేని పథకాలను ప్రవేశపెట్టాం. మళ్లీ మన ప్రభుత్వం రాగాగే ఫించన్‌ను రూ.2000లకు పెంచుతాం. రైతబంధు పథకం కిందా ఏడాదికి పదివేల రూపాయలు అందజేస్తాం’ అని కేసీఆర్ హామీ ఇచ్చారు. -
దేవరకొండ బీజేపీ అభ్యర్థిపై స్థానిక నేతల దాడి
-
ఆసక్తికరంగా.. దేవరకొండ రాజకీయం
సాక్షిప్రతినిధి, నల్లగొండ : దేవరకొండలో ఎన్నికల రాజకీయం ఆసక్తిగొల్పుతోంది. కాంగ్రెస్ తన అభ్యర్థిగా జెడ్పీ చైర్మన్ బాలునాయక్‌కు టికెట్ ప్రకటించిన వెంటనే ఆ పార్టీలో పరిణామాలు వేగంగా మారాయి. దాదాపు ఏడాది కిందట టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ కాంగ్రెస్ గూటికి చేరిన బిల్యానాయక్ అనివార్యంగా కాంగ్రెస్‌ను వీడాల్సి వచ్చింది. టీడీపీనుంచి కాంగ్రెస్‌లోకి వచ్చే ముందు టికెట్ హామీతోనే నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. రేవంత్‌రెడ్డి వెంట రాహుల్‌గాంధీ సమక్షంలో పార్టీలో చేరారు. తీరా చివరి నిమిషం దాకా ఉత్కంఠ రేపి ఆఖరికి తమ పార్టీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన, ప్రస్తుత జెడ్పీ చైర్మన్ బాలునాయక్ వైపే మొగ్గుచూపింది. వాస్తవానికి బాలునాయక్ కూడా చైర్మన్‌గా ఎన్నికై ఏడాది గడవక ముందే టీఆర్ఎస్ బాట పట్టారు. ఇన్నాళ్లూ ఆ పార్టీలో కొనసాగిన ఆయన దేవరకొండ టికెట్ ఆశించారు. కానీ, టీఆర్ఎస్ నాయకత్వం సీపీఐనుంచి తమ పార్టీలో ఎమ్మెల్యే హోదాలో చేరిన రవీంద్రకుమార్ కే టికెట్ ఇచ్చింది. దీంతో నారాజైన బాలు సెప్టెంబరు నెల మధ్యలో కాంగ్రెస్‌కు తిరిగి వచ్చారు. దీంతో కాంగ్రెస్‌లో జగన్‌లాల్‌నాయక్, బిల్యానాయక్, బాలూనాయక్ మధ్య టికెట్‌కు పోటీ ఏర్పడింది. నిన్నా మొన్నటి దాకా ఎవరికి టికెట్ వచ్చినా, అందరం కలిసి పనిచేస్తామని ప్రకటనలూ ఇచ్చారు. తీరా ఇప్పుడు బాలునాయక్‌కు టికెట్ రావడతో బిల్యా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. గత ఎన్నికల్లో రెండో స్థానం గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడినుంచి పోటీ చేయలేదు. కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ విజయం సాధిం చింది. అంతకు ముందు (2009) కాంగ్రెస్ నుంచి బాలూనాయక్ ఎమ్మెల్యేగా చేశారు. తమ సిట్టింగ్ సీటును త్యాగం చేసి మరీ కాంగ్రెస్ ఇక్కడ సీపీఐకి 2014 ఎన్నికల్లో మద్దతు ఇచ్చింది. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రవీంద్రకుమార్ టీఆర్ఎస్ బాట పట్టడం, జెడ్పీ చైర్మన్‌గా కాంగ్రెస్‌నుంచే ఎ న్నికైన బాలునాయక్ గులాబీ గూటికే చేరడంతో , భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ నుంచి బిల్యానాయక్‌ను ఆహ్వానించింది. కానీ, ఎన్నికల్లో టికెట్ మాత్రం ఇవ్వలేకపోయింది. గత ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ పోటీ చేసినా, మూడో స్థానంలో నిలిచింది. సీపీఐ, టీడీపీల మధ్యే ప్రధా న పోరు నడిచింది. టీడీపీనుంచి బిల్యా నాయక్ పోటీ పడగా, తక్కువ మెజారిటీతోనే ఆయన ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో బిల్యాకు వచ్చిన ఓట్లను చూసే, కాంగ్రెస్ బిల్యాను పార్టీలో చేర్చుకుంది. కానీ, ముందస్తు ఎన్నికల నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలు, జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో చక్రం తిప్పే నేతల మద్దతు, కాంగ్రెస్‌లో రాష్ట్ర స్థా యిలో నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరు తదితర కారణాలతో బిల్యాకు మొండి చేయిచూపింది. దీంతో ఆయన శనివారం బీఎల్ఎఫ్ కండువా కప్పుకున్నారు. బీఎల్ఎఫ్ తరఫున ఆయన దే వరకొండలో పోటీచేయడం ఖాయమంటున్నారు. దీంతో ఇక్కడి రాజకీయం రంజుగా మారింది. దేవరకొండ అభ్యర్థి.. నేనావత్ బాలునాయక్ పేరు : నేనావత్ బాలునాయక్ తండ్రిపేరు : లస్కర్ పుట్టిన తేదీ : 03–07–1972 విద్యార్హతలు : బీ.ఏ(ఎల్ఎల్బీ) స్వగ్రామం : సూర్యతండా, ముదిగొండ, దేవరకొండ మండలము, నల్లగొండ రాజకీయ ప్రస్థానం, చేపట్టిన పదవులు : ఎన్ఎస్యూఐ దేవరకొండ ప్రెసిడెంట్, నల్లగొండ జిల్లా సెక్రటరీ, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ(1999–2004), కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు(2004–05), వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, సీపీఐ అభ్యర్థి రవీంద్రకుమార్‌పై పోటీ చేసి ఎమ్మెల్యేగా(2009) గెలుపొందారు. కాంగ్రెస్, సీపీఐ పొత్తులో భాగంగా సీపీఐకు టిక్కెట్ కేటాయించారు(2014). చందంపేట నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున జెడ్పీటీసీగా పోటీ చేసి విజయం సాధించిన ఆయనకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవీ లభించింది. -
ముడిపడని ఆ..మూడు!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి ఇంకా పరిష్కారం కాలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాలకుగాను పది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పార్టీ నాయకత్వం ఇంకా దేవరకొండ, మిర్యాలగూడ, తుంగతుర్తి స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. మొదటి విడతలో కూటమి భాగస్వామ్య పక్షాలకు ఒక్క సీటు కూడా కేటాయించలేదు. దీంతో మిగిలిన ఈ మూడు స్థానాల్లో ఏ కూటమి పక్షానికి ఏ స్థానం కేటాయిస్తారు..? అసలు ఒక్క సీటన్నా వారికి విడిచిపెడతారా..? లేదంటే మూడు స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులనే ప్రకటిస్తారా అన్న ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి. నామినేషన్ల దాఖలుకు మరో మూడు రోజులే మిగిలి ఉండడంతో శనివారం ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఆఖరి విడత జాబితాను విడుదల చేయనుందని చెబుతున్నారు. దీంతో ఈ మూడు స్థానాల అభ్యర్థులు ఎవరవుతారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కూటమి కట్టిన టీడీపీ, సీపీఐ, టీజేఎస్, ఇంటి పార్టీలకు జిల్లాలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కేటాయించలేదు. రాష్ట్ర స్థాయిలో సీట్ల సర్దుబాటులో భాగంగా ఇక్కడ కేటాయింపులు జరగలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కారణంగానే కూటమి పక్షాలు తిరుగుబాటు చేస్తాయా? పోటీగా బరిలోకి దిగుతాయా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆసక్తి రేపుతున్న మిర్యాలగూడ టీజేఎస్ ముందునుంచీ మిర్యాలగూడ ఆశిస్తోంది. కానీ, ఇక్కడినుంచి సీఎల్పీ మాజీ నేత కుం దూరు జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి టికెట్ కోసం పట్టుబడుతున్నారు. రఘువీర్‌రెడ్డికి ఇవ్వలేని పక్షంలో తనకు అవకాశం ఇవ్వాలని టీఆర్ఎస్నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీజేఎస్‌కు ఇప్పటికే 8 స్థానాలను కేటాయించారు. అదనంగా తమకు మరో స్థానం కావాలని, అది మిర్యాలగూడమేనని కోరుతోంది. కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచేందుకు తాము 12 స్థానాల్లో పోటీ చేస్తామని టీజేఎస్ నాయకత్వం జాబితా కూడా ప్రకటించింది. ఆ పన్నెండు స్థానాల్లో మిర్యాలగూడ కూడా ఉండడం గమనార్హం. మరో వైపు రఘువీర్‌రెడ్డికి టికెట్ ఇవ్వలేమని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తేల్చి చెప్పారని అంటున్నా రు. దీంతో ఢిల్లీ ప్రయత్నాలను పక్కన పెట్టేశారని సమాచారం. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌నుంచి ఎవరికి అవకాశం దక్కుతుంది..? లేదంటే టీజేఎస్‌కే ఇచ్చేస్తారా..? అన్న చర్చ జోరుగా సాగుతోంది. రెబల్‌గా .. బరిలోకి అలుగుబెల్లి ? టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జీగా పనిచేసిన అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ తర్వాత కొద్దిరోజులకు ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. జానా తనయుడు రఘువీర్‌రెడ్డికి టికెట్ దక్కని పక్షంలో తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతూ వచ్చారు. ఆ హామీపైననే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారన్న అభిప్రాయం కూడా ఉంది. ఇప్పుడు అసలు మిర్యాలగూడ స్థానం ఎవరికి ఇస్తారో తెలియని సందిగ్ధంలో ఉన్న ఈ సమయంలో...‘ఒకవేళ మిర్యాలగూడ స్థానాన్ని టీజేఎస్‌కు కేటాయించినట్లయితే... ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేయాల్సిందే..’ అని అలుగుబెల్లిపై ఒత్తిడి పెంచుతున్నారని సమాచారం. ఈ ప్రాంతంలో టీజేఎస్ ఏమాత్రం బలంగా లేకపోవడం, కాంగ్రెస్ ఈ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకునే అవకాశం ఉందన్న విశ్వాసంతో కాంగ్రెస్‌లోని ఒక వర్గం రెబల్ ఆలోచనలు చేస్తోందని చెబుతున్నారు. టీఆర్ఎస్లో టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని, ప్రచారం కూడా చేసిన అలుగుబెల్లిని కాంగ్రెస్ సీనియర్లు హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకున్నారని అంటున్నారు. ఇప్పుడు అక్కడ కూడా టికెట్ రాకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికే అమరేందర్‌రెడ్డి మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు. కొనసాగుతున్న సస్పెన్స్ దేవరకొండ, తుంగతుర్తి నియోజకవర్గాల్లోనూ శనివారం దాకా సస్పెన్స్ తప్పేలా లేదు. ఇక్కడ కూటమి పక్షాల గొడవ లేకున్నా, కాంగ్రెస్‌లోనే పోటీదారులు ఎక్కువగా ఉన్నారు. దేవరకొండ స్థానాన్ని జగన్‌లాల్ నాయక్, బిల్యానాయక్, జెడ్పీ చైర్మన్ బాలునాయక్ ఆశిస్తున్నారు. రేవంత్ రెడ్డి వెంట పార్టీలో చేరిన బిల్యా నాయక్ ఆయన కోటాలోనే ప్రయత్నం సాగిస్తుండగా, కాంగ్రెస్ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన బాలునాయక్, అదే పార్టీనుంచి జెడ్పీ చైర్మన్ కూడా అయ్యారు. ఆ తర్వాత టీఆర్ఎస్కు వెళ్లినా, తిరిగి సొంత గూటికి చేరుకుని టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పుడు ఈ ముగ్గురు నాయకుల మధ్య టికెట్ దోబూచులాడుతోంది. ఇక, తుంగతుర్తిలో అద్దంకి దయాకర్ , డాక్టర్ రవి పోటీ పడుతున్నారు. ఈ స్థానం లెక్క తేలాల్సి ఉంది. -
ముడిపడని ఆ..మూడు!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి ఇంకా పరిష్కారం కాలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాలకుగాను పది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పార్టీ నాయకత్వం ఇంకా దేవరకొండ, మిర్యాలగూడ, తుంగతుర్తి స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. మొదటి విడతలో కూటమి భాగస్వామ్య పక్షాలకు ఒక్క సీటు కూడా కేటాయించలేదు. దీంతో మిగిలిన ఈ మూడు స్థానాల్లో ఏ కూటమి పక్షానికి ఏ స్థానం కేటాయిస్తారు..? అసలు ఒక్క సీటన్నా వారికి విడిచిపెడతారా..? లేదంటే మూడు స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులనే ప్రకటిస్తారా అన్న ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి. నామినేషన్ల దాఖలుకు మరో మూడు రోజులే మిగిలి ఉండడంతో శనివారం ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఆఖరి విడత జాబితాను విడుదల చేయనుందని చెబుతున్నారు. దీంతో ఈ మూడు స్థానాల అభ్యర్థులు ఎవరవుతారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కూటమి కట్టిన టీడీపీ, సీపీఐ, టీజేఎస్, ఇంటి పార్టీలకు జిల్లాలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కేటాయించలేదు. రాష్ట్ర స్థాయిలో సీట్ల సర్దుబాటులో భాగంగా ఇక్కడ కేటాయింపులు జరగలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కారణంగానే కూటమి పక్షాలు తిరుగుబాటు చేస్తాయా? పోటీగా బరిలోకి దిగుతాయా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆసక్తి రేపుతున్న మిర్యాలగూడ టీజేఎస్ ముందునుంచీ మిర్యాలగూడ ఆశిస్తోం ది. కానీ, ఇక్కడినుంచి సీఎల్పీ మాజీ నేత కుం దూరు జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి టికెట్ కోసం పట్టుబడుతున్నారు. రఘువీర్‌రెడ్డికి ఇవ్వలేని పక్షంలో తనకు అవకాశం ఇవ్వాలని టీఆర్ఎస్నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీజేఎస్‌కు ఇప్పటికే 8 స్థానాలను కేటాయించారు. అదనంగా తమకు మరో స్థానం కావాలని, అది మిర్యాలగూడమేనని కోరుతోంది. కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచేందుకు తాము 12 స్థానాల్లో పోటీ చేస్తామని టీజేఎస్ నాయకత్వం జాబితా కూడా ప్రకటించింది. ఆ పన్నెండు స్థానాల్లో మిర్యాలగూడ కూడా ఉండడం గమనార్హం. మరో వైపు రఘువీర్‌రెడ్డికి టికెట్ ఇవ్వలేమని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తేల్చి చెప్పారని అంటున్నా రు. దీంతో ఢిల్లీ ప్రయత్నాలను పక్కన పెట్టేశారని సమాచారం. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌నుంచి ఎవరికి అవకాశం దక్కుతుంది..? లేదంటే టీజేఎస్‌కే ఇచ్చేస్తారా..? అన్న చర్చ జోరుగా సాగుతోంది. రెబల్‌గా .. బరిలోకి అలుగుబెల్లి ? టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జీగా పనిచేసిన అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ తర్వాత కొద్దిరోజులకు ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. జానా తనయుడు రఘువీర్‌రెడ్డికి టికెట్ దక్కని పక్షంలో తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతూ వచ్చారు. ఆ హామీపైననే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారన్న అభిప్రాయం కూడా ఉంది. ఇప్పుడు అసలు మిర్యాలగూడ స్థానం ఎవరికి ఇస్తారో తెలియని సందిగ్ధంలో ఉన్న ఈ సమయంలో... ‘ ఒకవేళ మిర్యాలగూడ స్థానాన్ని టీజేఎస్‌కు కేటాయించినట్లయితే... ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేయాల్సిందే..’ అని అలుగుబెల్లిపై ఒత్తిడి పెంచుతున్నారని సమాచారం. ఈ ప్రాంతంలో టీజేఎస్ ఏమాత్రం బలంగా లేకపోవడం, కాంగ్రెస్ ఈ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకునే అవకాశం ఉందన్న విశ్వాసంతో కాంగ్రెస్‌లోని ఒక వర్గం రెబల్ ఆలోచనలు చేస్తోందని చెబుతున్నారు. టీఆర్ఎస్లో టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని, ప్రచారం కూడా చేసిన అలుగుబెల్లిని కాంగ్రెస్ సీనియర్లు హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకున్నారని అంటున్నారు. ఇప్పుడు అక్కడ కూడా టికెట్ రాకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికే అమరేందర్‌రెడ్డి మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు. కొనసాగుతున్న సస్పెన్స్ దేవరకొండ, తుంగతుర్తి నియోజకవర్గాల్లోనూ శనివారం దాకా సస్పెన్స్ తప్పేలా లేదు. ఇక్కడ కూటమి పక్షాల గొడవ లేకున్నా, కాంగ్రెస్‌లోనే పోటీదారులు ఎక్కువగా ఉన్నారు. దేవరకొండ స్థానాన్ని జగన్‌లాల్ నాయక్, బిల్యానాయక్, జెడ్పీ చైర్మన్ బాలునాయక్ ఆశిస్తున్నారు. రేవంత్ రెడ్డి వెంట పార్టీలో చేరిన బిల్యా నాయక్ ఆయన కోటాలోనే ప్రయత్నం సాగిస్తుండగా, కాంగ్రెస్ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన బాలునాయక్, అదే పార్టీనుంచి జెడ్పీ చైర్మన్ కూడా అయ్యారు. ఆ తర్వాత టీఆర్ఎస్కు వెళ్లినా, తిరిగి సొంత గూటికి చేరుకుని టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పుడు ఈ ముగ్గురు నాయకుల మధ్య టికెట్ దోబూచులాడుతోంది. ఇక, తుంగతుర్తిలో అద్దంకి దయాకర్ , డాక్టర్ రవి పోటీ పడుతున్నారు. ఈ స్థానం లెక్క తేలాల్సి ఉంది. -
పోలింగ్‌కు..యంత్రాలు సిద్ధం
సాక్షి,నల్లగొండ : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారులు ఓటింగ్ యంత్రాల ర్యాండమైజేషన్ (మిక్సింగ్) మొదటి విడత పూర్తి చేశారు. పోలింగ్‌లో ఉపయోగించే బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లకు మూడు విడతల్లో ర్యాండమైజేషన్ చేయాల్సి ఉంది. బెల్ కంపెనీకి సంబంధించిన ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లను గోదాముల్లోనే ఉంచి రాజకీయ పార్టీల సమక్షంలో పరిశీలించారు. అనంతరం గట్టి బం దోబస్తుతో భద్రపర్చారు. ఆ యంత్రాలకు సం బంధించి ఆన్లైన్లో నంబర్లను అన్నింటినీ ర్యాం డమైజేషన్ చేశారు. ఆ విధంగానే ఓ బాక్స్‌లోని 10 యంత్రాలను మార్చివేరే బాక్స్‌లలోకి మార్చారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా యంత్రాలను సిద్ధం చేసి పెట్టారు. ఒక్కో బాక్సులో 10 ఓటింగ్యంత్రాలు ఉంటాయి. అందులో ఏ నియోజకవర్గానికి సంబంధించిన యంత్రం ఉంటుందో కూడా ఎవరికీ తెలియదు. ఆ విధంగా మొదటి విడత ర్యాండమైజేషన్ చేశారు. ఆయా బాక్సుల్లో ఉన్నవాటన్నింటినీ బార్కోడ్ ఆధారంగా ఆయా నియోజకవర్గాలకు కేటాయిస్తారు. అనంతరం వాటిని నియోజకవర్గాల్లోని స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపరుస్తారు. అక్కడ రెండో విడత ర్యాండమైజేషన్ జరుగుతుంది. ఆ సందర్భంలో ఏయే యంత్రం ఎక్కడ వెళ్తుందో కూడా ఎన్నికల సిబ్బందికి తెలిసే అవకాశం లేదు. ఆ విధంగా అధికారులు ఆన్లైన్లో యంత్రాల బార్ కోడ్ఆధారంగా రాజకీయ పక్షాల ముందే మిక్సింగ్ చేస్తారు. ఆ తర్వాత తిరిగి పోలింగ్‌ముందు రోజు డ్రిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ర్యాండమైజేషన్ చేసి ఏ పోలింగ్ బూత్‌కు ఏ ఈవీఎం, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్ వెళ్లాల్సి ఉందో ఆ విధంగా ఆయా పోలింగ్‌బూత్‌లకు కేటాయించిన ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులకు అందిస్తారు. అక్కడినుంచి నేరుగా ఎన్నికల విధులలో భాగంగా పోలింగ్ స్టేషన్లకు తీసుకెళ్తారు. అప్పటివరకు కూడా ఏ యంత్రం ఎటు వెళ్తుందో కూడా తెలియనివ్వరు. నియోజకవర్గాల వారీగా పోలింగ్ యంత్రాల కేటాయింపు : దేవరకొండ 338 నాగార్జునసాగర్ 329 మిర్యాలగూడ 288 మునుగోడు 318 నకికరేకల్ 337 నల్లగొండ 316 18శాతం అదనంగా యంత్రాలు.. ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉన్న పోలింగ్‌బూత్‌లను బట్టి అదనంగా ప్రతి నియోజకవర్గానికి 18 శాతం యంత్రాలను అందిస్తున్నారు. అదనంగా తీసుకున్న వాటిని నియోజకవర్గ కేంద్రంలోని రిటర్నింగ్ కార్యాలయంలో ఉంచుతారు. పోలింగ్ సమయంలో ఎక్కడైనా సాంకేతిక లోపం తలెత్తి ఓటింగ్‌కు అంతరాయం ఏర్పడితే వీటిని ఉపయోగించనున్నారు. జిల్లాలోని 6 నియోజకవర్గాల పరి«ధిలో అదే విధంగా ఉపయోగిస్తారు. నియోజకవర్గాల వారీగా పోలింగ్ బూత్‌లు, యంత్రాలు... దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించి 286 పోలింగ్‌బూత్‌లు ఉండగా 18శాతం అదనంగా కలుపుకుంటే అదనంగా మరో 52 యంత్రాలు ఇవ్వనున్నారు. అంటే ఆ నియోజకవర్గానికి బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్యూనిట్లు, వీవీ ప్యాట్లు 338 అందనున్నాయి. అదే విధంగా నాగార్జున్ సాగర్ నియోజకవర్గంలో 278 పోలింగ్‌బూత్‌లు ఉండగా 18శాతం కలుపుకుంటే అదనంగా మరో 51 యంత్రాలు ఇవ్వనున్నారు. దీంతో 329 యంత్రాలు సాగర్ నియోజకవర్గానికి అందనున్నాయి. మిర్యాలగూడ నియోజకవర్గంలో 244 పోలింగ్‌బూత్‌లు ఉండగా అదనంగా 44 యంత్రాలు ఇవ్వనున్నారు. దీంతో 288 యంత్రాలు సాగర్ నియోజకవర్గానికి అందనున్నాయి. మునుగోడు నియోజకవర్గంలో 269 పోలింగ్‌బూత్‌లు ఉండగా 49కలుపుకొని మొత్తం 318 యంత్రాలు కేటాయించారు. నకికరేకల్లో నియోజకవర్గంలో 285 పోలింగ్‌బూత్‌లు ఉండగా 337 యంత్రాలు కేటాయించారు. నల్లగొండ నియోజకవర్గానికి సంబం«ధించి 267 పోలింగ్ స్టేషన్లకు 316 బ్యాలెట్, కంట్రోల్, వీవీ ప్యాట్లను కేటాయించారు. -
టీఆర్ఎస్ గెలుపును ఆపలేరు
సాక్షి,పెద్దఅడిశర్లపల్లి : ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయాన్ని ఏ కూటమి ఆపలేదని నల్ల గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పీఏపల్లి మండలంలో టీఆర్ఎస్ దేవరకొండ ఎమ్మెల్యే అభ్యర్థి రమావత్ రవీంద్రకుమార్‌తో కలిసి చిల్కమర్రిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఏరాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసి చూ పిందన్నారు. సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ గెలుపునకు బాటలు వేస్తాయని పేర్కొన్నారు. కూటమికి అధికారం కట్టబెట్టి ప్రజలు మోసపోయే స్థితిలో లేరన్నారు. ఎన్నికల్లో కూటమికి తగిన గుణపాఠం తప్పదని పేర్కొన్నారు. దేవరకొండ టీఆర్ఎస్ అభ్యర్థి రవీంద్రకుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం రమావత్ రవీంద్రకుమార్ మండలంలోని చిల్కమర్రి స్టేజీ, చిల్కమర్రి, సూర్యపల్లి, రోళ్లకల్, అంగడిపేట స్టేజీ, అంగడిపేట, అంగడిపేటతండా, భారత్‌పురం, సింగరాజుపల్లి, గుడిపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెట్పీటీసీ తేర గోవర్ధన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ముచ్చర్ల ఏడుకొండలుయాదవ్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ వంగాల ప్రతాప్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు రేటినేని ముత్యంరావు, వల్లపురెడ్డి, రంగారెడ్డి, వీరమళ్ల పరమేశ్, శీలం శేఖర్‌రెడ్డి, లచ్చిరెడ్డి, అంతిరెడ్డి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
టిక్కెట్ కోసం బస్సులో ఢిల్లీకి
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ల కోసం నేతల పాట్లు వర్ణణాతీతంగా ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల కోసం పోటీ హోరాహోరీగా సాగుతోంది. కొంతమంది నేతలు హైదరాబాద్‌లోని గాంధీ భవన్ వద్ద ఆందోళనకు దిగగా.. మరికొందరు ఢిల్లీలో స్ర్కీనింగ్ కమిటీ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా మాజీ ఎంపీ రవీంద్రనాయక్ టిక్కెట్ కోసం వినుత్నంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగా సోమవారం ఢిల్లీలోని రాహుల్ నివాసానికి లంబాడి మహిళతో బస్సులో వెళ్లి ఆయనను కలిశారు. తనకు దేవరకొండ టిక్కెట్ ఇవ్వాలని రాహుల్ వద్ద డిమాండ్ చేశారు. తెలంగాణలో అభ్యర్థుల పేర్లు నేడోరేపో తేలే అవకాశం ఉన్నా.. నేతల మాత్రం ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. టీపీసీపీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియాలు రాహుల్‌తో భేటీ అనంతరం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. బీసీలకు టిక్కెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నేత మణెమ్మ రాహుల్ నివాసం వద్ద ప్లకార్డులు ప్రదర్మించారు. ఆమె నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేయాలనే యోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తనకు ఆ టిక్కెట్‌ను కేటాయించాలని రాహుల్ నివాసం వద్ద నిరసనకు దిగారు. స్టేషన్ ఘన్పూర్ టిక్కెట్ తనకే ఇవ్వాలని ఆపార్టీ సీనియర్ నేత విజయ రామారావు డిమాండ్ చేశారు. వరంగల్ టిక్కెట్ ఆశిస్తున్న ఆశోక్‌గౌడ్ కూడా ఢిల్లీలో మంతనాలు చేస్తున్నారు. -
సీట్ల సర్దుబాటు పై ఉత్కంఠ !
సాక్షి,చింతపల్లి : గిరిజన నియోజకవర్గమైన దేవరకొండ సీటును దక్కించుకునేందుకు మహాకూటమిలోని పార్టీలు పోటీ పడుతున్నాయి. సీట్ల సర్దుబాటుతోపాటు శనివారం అభ్యర్థుల ప్రకటన వెలువరిస్తామని మహా కూటమి ముఖ్యనేతలు తాజాగా అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో స్థానిక పార్టీల నాయకులు, ఓటర్లలో ఉత్కంఠ నెలకొంది.మహాకూటమి సీట్ల సర్దుబాటు వ్యవహారం కొద్ది రోజులుగా ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. మహాకూటమిలోని కాంగ్రెస్, సీపీఐ పార్టీలు దేవరకొండ స్థానాన్ని కోరుకుంటున్నాయి. గెలిచే జాబితాలో తాము ఉన్నామంటూ కాంగ్రెస్ ఈ స్థానాన్ని కా వాలని పట్టుబడుతుండగా, తమ సిట్టింగ్ స్థానం వదులుకోమంటూ సీపీఐ పట్టుదలతో ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో దేవరకొండ స్థానం ఢిల్లీ స్థాయిలోనే చర్చ కు దారితీసింది. కూటమిలోని ఇరుపార్టీలు ఇదే స్థానం కోరుతుండడంతో దీనిపై కొద్ది రోజులుగా ఆసక్తికరంగా చర్చ సాగుతోంది. మరోవైపు సీపీఐ నేతలు సైతం దేవరకొండకు తమకు కేటాయించారనే సంకేతాలను కొద్ది రోజులుగా ఇచ్చినప్పటికి అధికారిక ప్రకటనకాదని కాంగ్రెస్ కొట్టి పారేసింది. చివరకు దీపావళి రోజు తో పాటు మరుసటి రోజున జరిగిన పరి ణామాలు కూటమిలో ప్రధాన చర్చగా మా రాయి. కొన్ని ప్రసార మాద్యమాల్లో మహా కూటమి అభ్యర్థుల జాబితా ఇదేనంటూ ప్రచారం చేయడంతో పలానా పార్టికి çఫలా నా టిక్కెట్టు దక్కిందన్న విషయం నియోజకవర్గ వ్యాప్తంగా వ్యాపించింది. ఈ విష యం ఆశావాహుల్లో కంగారు రేపింది. ఈ నేపథ్యంలో మహాకూటమిలో దేవరకొండ స్థానం చివరికి ఏ పార్టికి, ఏ అభ్యర్థికి దక్కించుకుంటారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నేడు ఖరారయ్యే అవకాశం మహాకూటమి పొత్తులతోపాటు ఆయా పార్టీల అభ్యర్థుల జాబితాను శనివారం వెలువరిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలి సిందే. ఇప్పటివరకు జరిగిన ప్రచారాన్ని నమ్మవద్దని అధికారిక జాబితాను ఎట్టకేలకు శనివారం వెలువరించనున్నట్లు వారు ప్రకటించారు. ఈ నేపథ్యంలో దేవరకొండ స్థానం ఎవ్వరికి కేటాయించారనే అంశంపై స్పష్టత రానుంది. దీంతో పాటు అభ్యర్థి ప్రకటన ఖరారు కానుండడంతో ఇటు మహాకూటమితో పాటుప్రత్యర్థి పార్టీ టీఆర్ఎస్, బీజేపీలోనూ ఉత్కంఠ నెలకొంది. మహాకూటమిలోని కాంగ్రెస్ సహా సీపీఐ ఉండడంతో తమ ప్రత్యర్థి ఎవరనే అంశంపై ఇప్పటికే బరిలో ఉన్న పార్టీలు ఎదురు చూస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ నుంచి సీటు ఆశిస్తున్న ఆశావాహులు తెరవెనుక తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఏడు మండలాలకు చెందిన ఆయా పా ర్టీల శ్రేణులు తమ పార్టీ అధిష్టానం వెలువరించే ప్రకటన ఎదురు చూస్తున్నారు. నామినేషన్‌కు సమయం దగ్గరపడుతుండడంతో మహాకూటమి నుంచి అభ్యర్థి ప్రకటన వెలువడితే తుది పోరులో ఎవరు ఉం టారనే అంశంపై స్పష్టత రానుంది. -
అభ్యర్థుల ఎంపికపై చర్చ.. వార్‌రూమ్ వద్ద రచ్చ
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు వేగవంతం చేసింది. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ వార్‌రూమ్‌లో సమావేశమైన కీలక నేతలు ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరి పేర్లను పరిశీలిస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో ఇద్దరికి మించి అభ్యర్థుల పోటాపోటీ ప్రతిపాదనలు రావడంతో అభ్యర్థి ఎంపిక నేతలకు తలనొప్పిగా మారింది. కొన్ని స్థానాలపై అభ్యర్థుల పేర్లు కొలిక్కివచ్చినా.. పలు నియోజకవర్గల్లో చిక్కుముడి వీడడంలేదు. టిక్కెట్ దక్కదని భావిస్తున్న అసంతృప్తి నేతలు ఢిల్లీలోని కాంగ్రెస్ వార్‌రూమ్ వద్ద ధర్నాకు దిగారు. నల్గొండ జిల్లా దేవరకొండ టికెట్ తనకే కేటాయించాలని రవీంద్రనాయక్ తన మద్దతుదారుతో ధర్నా చేశారు. చర్చజరగుతున్న సమయంలోనే స్కీృనింగ్ కమిటీ సమావేశం వద్ద ఆయన నిరసన చేపట్టడంతో పరిస్థితి ఉద్రికత్తంగా మారింది. ఈ నేపథ్యంలో బరిలోకి దిగిన టీకాంగ్రెస్ నేతలు రవీంద్రనాయక్‌ను బుజ్జగించే ప్రయత్నం చేశారు. -
దేవరకొండ ఆదర్శంగా నిలుస్తుంది
కొండమల్లేపల్లి(దేవరకొండ) : రానున్న రోజుల్లో రిజర్వాయర్ల నిర్మాణాలతో రాష్ట్రంలోనే దేవరకొండ నియోజకవర్గం ఆదర్శంగా నిలుస్తుందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం నల్గొండ జిల్లా దేవరకొండ మండల పరిధిలోని కొండభీమనపల్లి వద్ద పద్మనాయక వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్మించనున్న దొంతినేని సంపతమ్మ కల్యాణ మండప నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తయితే 1లక్షా 60 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ప్రసుతం డిండి ప్రాజెక్టు నుంచి సాగు నీరందిస్తున్నామన్నారు. వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పేద పిల్లలకు సహయ సహకారాలు అందించాలని సూ చించారు. ట్రస్ట్ ఏర్పాటు చేసి సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ఖిల్లా అభివృద్ధికి సహకరించాలని మంత్రిని కోరగా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నిధులు కేటాయించేలా చూస్తానని çహామీ ఇచ్చారు. అనంతరం నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బాలూనాయక్, ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం సకాలంలో వానలు పడకపోవడంతో రైతులు ఇబ్బందులు పడకుండా ఉం డేందుకు గాను కల్వకుర్తి నుంచి నీటిని విడుదల చేయాలన్నారు. అంతకు ముందు మంత్రి హరీశ్‌రావుకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘ నంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎ మ్మెల్సీ భానుప్రసాద్‌రావు, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, నోముల న ర్సింహ్మయ్య, రవీందర్రావు, ఉజ్జిని యాదగిరి రావు, బాబూ రావు ,శ్రీనివాసరావు, శ్రీకాంత్‌రావు, రవీందర్రావు, జగన్మోహన్రావు, ప్రభాకర్‌రావు, రామ్మోహన్రావు, వెంకటేశ్వరరా వు, నరేం దర్రావు, వెంకటేశ్వరరావు, రామేశ్వరరావు, నరేందర్‌రావు, రాంచందర్‌నాయక్, మా ర్కెట్ చైర్మన్ బాలనర్సింహ, ఎంపీపీ శ్రీని వాస్‌యాదవ్, జెడ్పీటీసీ నర్సింహ, మున్సిపల్ చైర్మన్ దేవేందర్, జనార్దన్‌రావు, కృష్ణ కిశోర్‌రావు పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
కుటుంబాన్ని గాలికొదిలేశాడని..
దేవరకొండ : అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న భర్త మరో మహిళ మోజులో పడి కుటుంబాన్ని వదిలేశాడు... ముగ్గురు పిల్లల పెంపకాన్ని పట్టించుకోలేదు. పిల్లల చదువులు, బాధ్యత ఆ తల్లిపై పడింది... ఇదేమిటని భర్తను నిలదీసినా, పెద్ద మనుషులను ఆశ్రయించినా ప్రయోజనం లేకపోయింది. ఇక చావే శరణ్యమని భా వించి ఇద్దరు కూతుళ్లతో సహా ఆ తల్లి ఆత్మహత్యకు పా ల్పడింది.. ఈ ఘటనలో తల్లి కూతురు మృతిచెందగా, మరో కూతురు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన దేవరకొండలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు... నేరెడుగొమ్ము మండలం కాచరాజుపల్లికి చెందిన బొమ్ము అచ్చయ్య మాజీ ఉప సర్పంచ్. ఆయనకు పదహారేళ్ల క్రితం రాములమ్మ అనే మహిళతో వివాహామైంది. వారికి పదిహేనేళ్లలోపు ఇద్దరు కూతుళ్లు, తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నారు. అచ్చయ్య గ్రామంలోనే వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. అచ్చయ్యకు గ్రామంలో ఉన్న మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ సంబంధం కాస్తా రెండో వివాహం చేసుకోవడానికి దారితీసింది. దీంతో ఆమెను అచ్చయ్య నాలుగేళ్ల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు. వారికి నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అచ్చయ్య మొదటి భార్యని పట్టించుకోకపోవడం, పిల్లల ఆలనా, పాలనను చూడకపోవడంతో రాములమ్మ మానసికంగా కుంగిపోయింది. ఎన్నిసార్లు ఇదేమిటని ప్రశ్నించినా ప్రయోజనం లేకపోయింది. మరో మహిళను రెండో వివాహం చేసుకున్నా పట్టించుకోని రాములమ్మ పిల్లలను అచ్చయ్య దూరం చేస్తుండడం, వారి చదువు, పెంపకం, బాధ్యతను కూడా మరవడంతో జీర్ణించుకోలేకపోయింది. తరచూ అచ్చయ్యను నిలదీస్తోంది. ఇదే క్రమంలో పెద్ద మనుషులను ఆశ్రయించినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. ము గ్గురు పిల్లలను చదివించలేని రాములమ్మ ఇద్దరు కూతుళ్లను ప్రభుత్వ హాస్టల్లో చేర్పించింది. కొడుకును దేవరకొండలోని రాములమ్మ చెల్లెలి ఇంట్లో ఉంచుతూ చదివిస్తోంది. అచ్చయ్య కొన్ని రోజులుగా ఇంటికి రాకపోవడంతో పాటు పట్టించుకోకపోవడంతో మంగళవారం భర్త దేవరకొండలో ఉన్నాడని తెలిసి కలిసేందుకు వచ్చింది. దేవరకొండలో భర్తను కలిసి మాట్లాడింది. అయితే వారిద్దరి మధ్య ఏం జరిగిందనేది తెలియరానప్పటికీ తన ఇద్దరు కూతుళ్లతో సహా సీపీఐ పార్టీ కార్యాలయం సమీపంలో క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారిని దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సను అందించే క్రమంలో రెండో కూతురు ప్రియాంక(11), రాములమ్మ(30) మృతిచెందారు. మొదటి కుమార్తె లతమ్మ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్‌కు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. అచ్చయ్య పిల్లలను పట్టించుకోకపోవడం, వల్లనే రాములమ్మ ఆత్మహత్యకు పాల్పడిందని రాములమ్మ తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. -
హయత్‌నగర్‌లో యువతి దారుణ హత్య
-
‘విగ్రహ లొల్లి’లో మూడో వ్యక్తి..
►దేవరకొండకు వెళ్లిన వారిలో పరిచారకుడు ►ఆయనపైనా చర్యలకు బాసర గ్రామస్తుల డిమాండ్ ►ఉన్నతాధికారులకు రిపోర్టు చేశామన్న ఈవో ►బాసర ఆలయ పరిధి వివాదాల నేపథ్యం.. నిర్మల్‌రూరల్: పవిత్ర బాసర సరస్వతీ క్షేత్రంలో అమ్మవారి ‘విగ్రహ లొల్లి’ మరో మలుపు తిరిగింది. జూలై 28న నల్గొండ జిల్లా దేవరకొండకు అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్లి.. అక్కడ ప్రైవేటు స్కూళ్లలో పూజలు చేయించింది ఇద్దరు కాదని.. ముగ్గురని తేలింది. ఇప్పటికే ఈ ఘటనలో ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్ పూజారి, సప్తశతి పారాయణధారుడు ప్రణవ్‌శర్మలకు దేవాదాయశాఖ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాజాగా ఈ ఘటనలో మూడో వ్యక్తి కూడా ఉన్నట్లు బయటపడింది. దేవరకొండకు సంజీవ్ పూజారి, ప్రణవ్‌శర్మలతో పాటు ఆలయ పరిచారకుడు విశ్వజిత్ కూడా వెళ్లినట్లు ఫొటోలు బయటకు వచ్చాయి. కాగా, అధికారులకు విశ్వజిత్ కూడా వెళ్లినట్లు ముందే తెలిసినా బయటపెట్టలేదని, అసలు దేవరకొండకు వెళ్లిన విషయాన్ని పరిచారకుడే అధికారులకు చెప్పాడని సమాచారం. ఈ మేరకు ముందుగా విశ్వజిత్ ఉన్న ఫొటోలను, ఆయన పేరును బయట పెట్టకుండా జాగ్రత్త పడ్డట్లు తెలిసింది. తీరా ఇప్పుడు మూడో వ్యక్తిగా విశ్వజిత్ కూడా దేవరకొండ పూజలో పాల్గొన్నట్లు తేలడంతో అధికారులు నీళ్లు నములుతున్నారు. చర్యలకు డిమాండ్ అసలు.. ఆలయంలో ఏం జరుగుతోందని బాసర గ్రామస్తులు మండిపడుతున్నారు. దేవరకొండకు విగ్రహం తీసుకెళ్లడంతో పాటు పూజలు చేయించిన పరిచారకుడు విశ్వజిత్ పైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఈవో సుధాకర్‌రెడ్డిని సంప్రదించగా, దేవరకొండ పూజలో పరిచారకుడు విశ్వజిత్ కూడా పాల్గొన్నట్లు తేలిందని, ఆయనపైనా చర్యలకు ఉన్నతాధికారులకు రిపోర్టు పంపించామని పేర్కొన్నారు. -
సులువుగా సాగునీటి భద్రత సాధిస్తున్న రైతు
-
పెండింగ్‌లో మార్కెట్ కమిటీ
దేవరకొండ : రెండేళ్లుగా ఖాళీగా ఉన్న దేవరకొండ మార్కెట్ చైర్మన్ పదవికి ఎవరిని నియమించాలన్న అంశం ఇంకా డోలయామానంగా ఉంది. ఈ పదవికి పోటీ ఉండడంతో ఇప్పటికే రెండు కమిటీలు ముగియాల్సి ఉండగా ఇప్పటికీ చైర్మన్ సీటు ఖాళీగానే ఉంది. గత ఎన్నికల అనంతరం తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రద్దయిన కమిటీ స్థానంలో మరో నూతన కమిటీని ఎంపిక చేయాల్సి ఉండగా, పదవీ కాలం పొడగించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ కమిటీ కార్యవర్గాలన్నీ కోర్టును ఆశ్రయించాయి. దీంతో వారి పదవీ కాలాన్ని ఆరు నెలలకు పొడగించారు. 2015 చివర నుంచి చైర్మన్ సీటు ఖాళీగానే ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో చాలాచోట్ల మార్కెట్ కమిటీల ఎంపిక జరిగింది. కానీ దేవరకొండ స్థానంలో ఉన్న పోటీ కారణంగా మార్కెట్ కమిటీకి ఎవరిని నియమించాలన్న అంశంపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి రాకపోవడం, రాజకీయ జోక్యం బాగా ఉండడంతో ఈ కమిటీపై తాత్సారం నడుస్తోంది. ముందు ఇచ్చిన మాటకే.. గతేడాది నుంచి మార్కెట్ కమిటీ కోసం చాలా మంది పోటీపడుతూ వచ్చారు. అయితే మార్కెట్ కమిటీ చైర్మన్ స్థానానికి గతంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకరికి మాట ఇచ్చి ఉండడం, స్థానికంగా టీఆర్ఎస్ నాయకులు ఆ పేరును ప్రతిపాదించకపోవడంతో కొంత జాప్యం జరుగుతూ వచ్చింది. అయితే స్థానిక నాయకులు ఇప్పటికే మంత్రి, కేసీఆర్‌కు ఈ స్థానంపై తమకు ఆమోదయోగ్యమైన వ్యక్తుల పేర్లను ప్రతిపాదించారు. కానీ ముందుగానే సీఎం ఒక నిర్ణయానికి రావడంతో ఆ పదవి స్థానిక నేతలు ఆశించిన వారికి దక్కకుండాపోయింది. దాదాపు ఖరారైన కమిటీ అయితే దేవరకొండ మార్కెట్ కమిటీకి స్థానికంగా హన్మంతు వెంకటేశ్‌గౌడ్, ఏవీ రెడ్డి, బండారు బాలనర్సింహా, గాజుల ఆంజనేయులు, నాయిని మాధవరెడ్డి, రాంబాబు తదితరులు పోటీ పడుతూ వచ్చారు. కానీ ప్రభుత్వం మొదటి నుంచి టీఆర్ఎస్లో కొనసాగుతున్న బండారు బాలనర్సింహాకు ఇవ్వడానికి మొగ్గుచూపుతూ వచ్చింది. అయితే స్థానిక ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్లు మాత్రం చెరో వ్యక్తుల పేర్లను మంత్రి, ముఖ్యమంత్రి వద్ద ప్రతిపాదించారు. అయినప్పటికీ ఈ పదవి బండారు బాలనర్సింహాకు ఇవ్వడానికే హైకమాండ్ మొగ్గుచూపింది. ఇందులో భాగంగానే ఎమ్మెల్యే రవీంద్రకుమార్, జెడ్పీ చైర్మన్లు మార్కెట్ కమిటీ చైర్మన్ మినహా మిగతా కార్యవర్గాన్ని సూచించాల్సిందిగా కోరడంతో వారిరువురూ మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్, డైరెక్టర్లు, ట్రెడర్ల పేర్లను ప్రతిపాదించారు. ఈ క్రమంలో వైస్‌చైర్మన్ పదవిని నాయిని మాధవరెడ్డికి, మరో ఆరుగురు డైరెక్టర్లను, ట్రెడర్లను సూచిస్తూ ఏడీఎం కార్యాలయం నుంచి స్థానిక మార్కెట్ కార్యదర్శికి ఒక లేఖతో పాటు సదరు వ్యక్తులకు సంబంధించి వ్యవసాయ ధ్రువీకరణ పత్రాలను పంపాల్సిందిగా కోరుతూ రాతపూర్వక ఆదేశాలు పంపారు. -
దేవరకొండ చూసొద్దాం.. రండి
జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రాల్లో దేవరకొండ ఒకటి. జిల్లా కేంద్రం అనంతపురానికి ఐదు కిలోమీటర్ల దూరంలో బుక్కరాయసముద్రం మీదుగా సిద్దరాంపురం రోడ్డు మార్గంలో ఉన్న ఈ కొండపై శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి కొలువుదీరాడు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో దేవరకొండ శిఖర భాగాన వెలిసిన ఈ ఆలయం వద్ద పూర్వం గార్గేయ మహర్షి తపస్సు చేసినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. మూలవిరాట్ వెనుక ఉన్న గుహ గురించి పలు కథనాలు ఉన్నాయి. గుహ ప్రవేశద్వారం చిన్నగాను.. పోనుపోను విశాలంగాను ఉన్నట్లు సమాచారం. విజయనగర రాజుల పాలన కాలం నుంచి ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. కొండపై చేరుకునేందుకు మెట్ల దారితో పాటు వాహనాలు వెళ్లేందుకు ఇటీవల రోడ్డు కూడా వేశారు. కొండ చుట్టూ గిరిప్రదక్షణ కోసం రోడ్డు మార్గం ఉంది. మెట్లదారి గుండా వెళుతుంటే తిరుమల గిరిని ఎక్కుతున్నంత అనుభూతిని భక్తులు పొందుతుంటారు. కొండ కింద ఆంజనేయస్వామి ఆలయంలోనూ నిత్యపూజలు జరుగుతుంటాయి. - బుక్కరాయసముద్రం (శింగనమల) -
దేవరకొండలో దొంగల బీభత్సం
దేవరకొండ(నల్లగొండ): నల్లగొండ జిల్లా దేవరకొండలో దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టణంలోని బీఎన్ఆర్ కాలనీ, హనుమాన్‌నగర్‌లో శుక్రవారం రాత్రి దొంగలు హల్చల్ చేశారు. బీఎన్ ఆర్ కాలనీలోని ఓ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు రూ. 1.70 లక్షల నగలు ఎత్తుకెళ్లారు. మరో ఇంట్లో కూతురి పెళ్లి కోసం దాచి ఉంచుకున్న 6 తులాల బంగారు ఆభరణాలు దొంగలించుకెళ్లారు. హనుమాన్‌నగర్‌లో తాళం వేసి ఉన్న ఇంట్లో నుంచి బీరువా ఎత్తుకెళ్లి.. సమీప అటవీ ప్రాంతంలో దాన్ని పగలగొట్టి విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
13 ఏళ్ల బాలికకు 51 ఏళ్ల వ్యక్తితో పెళ్లి
దేవరకొండ/కొండమల్లేపల్లి: 13 ఏళ్ల విద్యార్థిని ప్రేమలో పడిందని, పరువు పోతుందని కన్న తల్లిదండ్రులే 51 ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేశారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా దేవరకొండలో ఆలస్యం గా వెలుగుచూసింది. త్రిపురారం మండలం రాగడప పరిధిలోని మిట్యతండాకు చెందిన బాలిక (13) దేవరకొండలోని ఎస్టీ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. తమ కూతురు ఓ యువకుడితో ప్రేమలో పడిందని, నాంపల్లి మండలం రాజ్య తండాకు చెందిన 51 ఏళ్ల వివాహితుడైన రమావత్ రవికి ఇచ్చి పెళ్లి చేయాలని ఏడాది క్రితం నిశ్చయించారు. అప్పట్లో అధికారులు, పోలీసులు పెళ్లిని ఆపి వారిపై కేసు నమోదు చేశారు. రమావత్ రవి, బాలిక తల్లిదండ్రులు జైలు శిక్షను అనుభవించారు. ఆ తర్వాత సదరు బాలికను హాస్టల్లో చేర్పించారు. సెప్టెంబర్ 29న హాస్టల్ నుంచి బాలిక అన్న ఆమెను బయటకు తీసుకెళ్లాడు. కొండమల్లేపల్లిలో ఉంటున్న అక్క ఇంట్లో బంధించారు. అక్టోబర్ 4న కొంతమంది సమక్షంలో ముష్టిపల్లిలోని ఓ దేవాలయంలో గుట్టుచప్పుడు కాకుండా అదే వ్యక్తితో పెళ్లి చేశారు. అప్పటి నుంచి బయటి వ్యక్తితో మాట్లాడనివ్వకుండా కట్టడి చేశారు. గురువారం ఇంట్లో నుంచి బయటికి వచ్చిన బాలిక ఉపాధ్యాయులకు ఫోన్ చేసి జరిగిన విషయమంతా చెప్పింది. ఈ విషయం ఐసీడీఎస్, పోలీసు అధికారులకు తెలియడంతో ఆమెను పాఠశాలకు తీసుకొచ్చారు. ఈ విషయంపై జిల్లా శిశు సంక్షేమ శాఖ పీడీ పుష్పలత, డీటీడబ్ల్యూఓ నరోత్తమరెడ్డి, దేవరకొండ ఆర్డీఓ లింగ్యానాయక్, ఇతర అధికారులు పాఠశాలలో విచారణ చేపట్టారు. -
357 క్వింటాళ్ల బియ్యం పట్టివేత
దేవరకొండ : ఉన్నతాధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. ఎన్ని యాక్టులు వచ్చినా.. క్రిమినల్ కేసులు నమోదవుతున్నా.. వ్యాపారులు బెదరడం లేదు. కేసులను కూడా లెక్క చేయని బియ్యం వ్యాపారులు ఈ దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు..దేవరకొండ డివిజన్లో కొన్నేళ్లుగా బియ్యం అక్రమ రవాణా వ్యాపారం మూడు క్వింటాళ్లు.. ఆరు టన్నులు అన్న చందంగా సాగుతోంది. వ్యాపారులు డీలర్లు, గ్రామాల్లో చిరు వ్యాపారుల నుంచి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు సరఫరా చేస్తూ లక్షల్లో దండుకుంటున్నారు. పక్కదారి పడుతోంది.. ఇలా.. వ్యాపారులు నిత్యం నియోజకవర్గ పరిధిలోని గ్రామాల డీలర్ల నుంచి, కిరాణ షాపుల నుంచి, వినియోగదారుల నుంచి 10 కేజీల నుంచి మొదలు పెట్టి 100 కేజీల వరకు సేకరిస్తున్నారు. ఆ బియ్యాన్ని దేవరకొండలోని తమ ఇళ్లల్లో నిల్వ ఉంచుతున్నారు. అనంతరం రాత్రికిరాత్రి డీసీఎంల్లో కల్వకుర్తి, హైదరాబాద్, మాల్ ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గ్రామాల్లో కేజీకి రూ.5 నుంచి రూ.10 వరకు కొనుగోలు చేసి తాము మాత్రం మిల్లు యాజమాన్యాలకు రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు. ఇలా దేవరకొండలో ఉన్న వ్యాపారులు నెలలో ఒక్కొక్కరు 4 నుంచి 6లోడ్ల వరకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. నేరుగా గోదాము నుంచే.. గతంలో దేవరకొండలో పీడీఎస్ బియ్యం పలుమార్లు సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నప్పటికీ అవి కేవలం చిన్న మొత్తంలో మాత్రమే ఉన్నాయి. కానీ ఈ సారి అధికారులు నిఘా వేసి నేరుగా గోదాం నుంచి తరలిస్తుండగా మాటు వేసి దాడులు నిర్వహించి పట్టుకున్నారు. ఈ సారి అధికారులు 357 బస్తాలను దేవరకొండకు సమీపంలోని బ్రిడ్జి తండాలోని ఓ ఇంట్లో నిల్వ ఉంచగా పక్కా సమాచారంతో దాడి చేసి పట్టుకున్నారు. అయితే తరలించిన బియ్యం మాత్రం రేషన్ షాపుల నుంచి కాకుండా నేరుగా దేవరకొండలోని స్టాక్ పాయింట్ నుంచే తరలించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దేవరకొండలోని డిండి రోడ్డులో అడ్డా ఏర్పాటు చేసుకున్న ఓ వ్యాపారి డీలర్ల నుంచి తక్కువ మొత్తానికి బియ్యాన్ని కొనుగోలు చేశాడు. ఆ బియ్యం బస్తాలను మార్చేందుకు వీలుగా దేవరకొండ సమీపంలోని ఓ తండాలో నిల్వ ఉంచాడు. సదరు సివిల్ సప్లై ముద్రలున్న బస్తాల నుంచి గోనే బస్తాల్లోకి మార్చేందుకు ఖాళీ బస్తాలను డీసీఎంలో తరలిస్తుండగా అనుమానం వచ్చి రెక్కీ నిర్వహించి ఈ బియ్యాన్ని పట్టుకున్నారు. గత ఏడాదిలో ఆరు నెలల క్రితం మాల్లో 16 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత ఆర్టీసీ బస్సులో లోయపల్లి నుంచి మాల్‌కు అక్రమంగా తరలిస్తున్న 13 క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. ఏడాది క్రితం చింతపల్లి మండలం మధనాపురంలో పీడీఎస్ బియ్యం పట్టుకున్న అధికారులు. చందంపేట మండలం బుగ్గతండాలోని ఓ ఇంట్లో 16 క్వింటాళ్లు.. ఇదే మండలంలోని కొత్తపల్లిలోని ఓ మిల్లులో 16 క్వింటాళ్లు.. దేవరకొండ మండలం ముదిగొండలో ఆరు నెలల క్రితం 15 క్వింటాళ్ల బియాన్ని అధికారులు సీజ్ చేశారు. -
దేవరకొండలో కార్డన్ సెర్చ్
దేవరకొండ పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున డీఎస్పీ చంద్రమోహన్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పట్టణంలోని సంతోషిమాతా కాలనీలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నలుగురు సీఐలు, 10 మంది ఎస్ఐలు, 100 మంది పోలీస్ సిబ్బందితో కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 26 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, రెండు కాటన్ల బీర్లు, రెండు కాటన్ల చీప్ లిక్కర్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చంద్రమోహన్ తెలిపారు. ఈ కార్డన్ సెర్చ్‌లో సీఐలు ఎంజీఎస్ రామకృష్ణ, వెంకటేశ్వర్‌రెడ్డి, బాలగంగిరెడ్డి, శివరాంరెడ్డి, ఎస్ఐలు రాఘవేందర్‌రెడ్డి, శేఖర్, నాగభూషణ్‌రావు, సర్ధార్, క్రాంతికుమార్, సర్ధార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
అమ్మా.. నన్ను అమ్మకే ..!
పోలీసుల ఆధ్వర్యంలో నేడు అవగాహన సామాజిక బాధ్యతను తీసుకున్న ఖాకీలు దేవరకొండ : దేవరకొండ ప్రాంతంలో వెలుగు చూస్తున్న శిశు విక్రయాల నిర్మూలనకు డీఎస్పీ జి. చంద్రమోహన్ ఓ కార్యక్రమాన్ని చేపట్టారు. శిశు విక్రయాలు, బ్రూణ హత్యలు, బాల్య వివాహాలు, స్త్రీ రక్షణ చట్టాలు అనే అంశాలపై గురువారం దేవరకొండలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో వివిధ శాఖల అధికారులతో కలిసి ‘అమ్మా నన్ను అమ్మకే’ పేరిట అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. అయితే గతంలో ఇటువంటి అవగాహన సదస్సులను స్వచ్ఛంద సంస్థలు, ఐసీడీఎస్ అధికారులు, శిశు విక్రయాల నియంత్రణ కమిటీలు చేపట్టగా ఈ సారి మాత్రం పోలీసులు ఈ సామాజిక బాధ్యతను గుర్తించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రోజు రోజుకూ ఎక్కువవుతున్న శిశు విక్రయాలను అరికట్టడానికి సంబంధిత శాఖ అధికారులు కూడా పట్టించుకోకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరక్షరాస్యులకు అవగాహన కల్పించేందుకే.. దేవరకొండ డివిజన్ వ్యాప్తంగా నిరక్షరాస్యత, అధిక సంతానం, ఆర్థిక స్థోమత లేని కారణంగా ఆడపిల్లలను విక్రయిస్తున్నారు. ఈ పరిస్థితి దారుణం. ఇలాంటి పరిస్థితుల్లో నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ‘అమ్మా... నన్ను అమ్మకే’ అనే పేరుతో దేవరకొండ సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం కార్యక్రమం చేపట్టనున్నాం. ఈ కార్యక్రమానికి కలెక్టర్, ఎస్పీ, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. ముఖ్యంగాా ఈ సమస్య దేవరకొండ ప్రాంతంలో ఉంది కాబట్టి ఇక్కడే చేపట్టాలనుకున్నాం. ఈ అవగాహన సదస్సులు దశలవారీగా మండలాలు, గ్రామాల్లో కూడా చేపట్టడానికి ప్లాన్ తయారు చేస్తున్నాం. - చంద్రమోహన్, దేవరకొండ డీఎస్పీ -
బోలెరో బోల్తా : ఇద్దరి మృతి
దేవరకొండ : నల్గొండ జిల్లా దేవరకొండ శివారులో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బోలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బోలెరోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా..మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతులు గుంటూరు జిల్లా కారంపూడి వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దేవరకొండను జిల్లాగా ప్రకటించాలి
కొండమల్లేపల్లి : దేవరకొండను జిల్లాగా ప్రకటించాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కేతావత్ బీల్యానాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని బస్టాండ్ సమీపంలో టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. వెనుకబడిన గిరిజన ప్రాంతమైన దేవరకొండను జిల్లాగా ఏర్పాటు చేస్తే మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. జిల్లాగా ప్రకటించకుంటే నేటి నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేపడుతానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు నేనావత్ వశ్యానాయక్, గాజుల మురళి, గాజుల రాజేష్, యాదయ్య, కృష్ణయ్య, అమరేందర్‌రెడ్డి, ఇమ్రాన్, నీలా రవికుమార్, ఇలియాస్, యాదగిరి, శివ, కొండల్, లక్ష్మికాంత్, మోతీలాల్, తౌఫిక్, రాందాస్, నాగార్జున, జావెద్ పాల్గొన్నారు. -
దేవరకొండను జిల్లాగా ప్రకటించాలి
కొండమల్లేపల్లి : దేవరకొండ నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించాలని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చారిత్రక నేపథ్యం కలిగిన దేవరకొండను జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు ఇప్పటికే హైపవర్ కమిటీని కలిసి నివేదించినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని దేవరకొండ, చింతపల్లి, పీఏపల్లి, చందంపేట, డిండి, కొండమల్లేపల్లి, నేరడుగొమ్ము, అచ్చంపేటలోని సిద్ధాపురం, కల్వకుర్తిలోని వంగూరు, చారగొండ, సాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలాలను కలుపుతూ జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో మరికొన్ని కొత్త జిల్లాలను ఏర్పాటు చేయబోయే క్రమంలో దేవరకొండకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో దేవరకొండ జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, మట్టిపల్లి వెంకటయ్య, నల్లగాసు జాన్‌యాదవ్, శిరందాసు కృష్ణయ్య, చీదెళ్ల గోపి, సుభాష్‌గౌడ్, రేణుగౌడ్, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ పాల్గొన్నారు. -
ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు న్యాక్ గుర్తింపు
దేవరకొండ : స్థానిక మునగాల కొండల్రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు బీ ప్లస్‌ప్లస్ (న్యాక్) గుర్తింపు వచ్చినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జగదీశ్ చంద్రసితార తెలిపారు. శనివారం కళాశాలలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత నెలలో న్యాక్ బృందం కళాశాలలో మూడు రోజుల పాటు అన్ని వసతులను పరిశీలించిందని తెలిపారు. శనివారం యూజీసీ మెయిల్లో ఎంకేఆర్ కళాశాలతు న్యాక్ ఇచ్చినట్లు తెలిపిందన్నారు. ఈ సందర్భంగా అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో అధ్యాపకులు ప్రేమ్పాల్రెడ్డి, కౌండిన్య, రజినీష్, ఉత్తన్నకుమార్, నజీమొద్దీన్, సత్యనారాయణ, జానయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణ కౌండిన్య, లక్ష్మీ ప్రభావతి, శారదాదేవి, నాగోజి, రాజారావు, కృష్ణ పాల్గొన్నారు. -
రూ.లక్షలు పలికిన లడ్డూలు
దేవరకొండ : నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు మండపాల వద్ద పూజలందుకున్న గణేశ్ విగ్రహాలను నిమజ్జనానికి తరలిస్తున్నారు. దీంతో వివిధ మండపాల వద్ద బుధవారం ఉత్సవ కమిటీల నిర్వాహకులు లడ్డూల వేలం పాటలు నిర్వహించారు. పట్టణంలో కొండల్రావునగర్లో ఏర్పాటు చేసిన గణనాథుని వద్ద ఉన్న లడ్డూను పట్టణానికి చెందిన నేనావత్ కిషన్‌నాయక్ లక్షా 25వేల 116 రూపాయలకు వేలం పాడి దక్కించుకున్నాడు. అదేవిధంగా పట్టణంలోని పాత రామాలయం వద్ద నిర్వహించిన లడ్డూ వేలం పాటలో పట్టణానికి చెందిన ఏలె యాదయ్య లక్షా 16వేల రూపాయలకు దక్కించుకున్నాడు. అలాగే శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుని వద్ద లడ్డూను పట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పంగునూరి శేఖర్ లక్షా 2వేల 116 రూపాయలకు దక్కించుకున్నాడు. హనుమాన్‌నగర్‌లో లడ్డూను శ్రీనివాసాచారి రూ.55వేలకు దక్కించుకున్నాడు. -
జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం
దేవరకొండ : దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్, బ్యాడ్మింటన్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు శనివారం డీఎస్పీ ఎంజీ. చంద్రమోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గిరిజన ప్రాంతమైన దేవరకొండలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గానూ జిల్లా స్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం కొద్దిసేపు డీఎస్పీ బ్యాడ్మింటన్ ఆడారు. కార్యక్రమంలో అధ్యక్షుడు ఎన్వీటీ, తాళ్ల శ్రీధర్‌గౌడ్, కాశిమల్ల భాస్కర్, కృష్ణకిషోర్, తాళ్ల సురేష్, పంతులాల్, బాబా, ఖాలేక్, సురేష్, శేఖర్, వెంకట్ పాల్గొన్నారు. -
ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాస్తారోకో
దేవరకొండ : పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక బస్టాండ్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ డివిజన్ కన్వీనర్ బొమ్ము రామాంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా సంవత్సరం పూర్తి కావస్తున్నా విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, అనిల్, వెంకటేష్, శివ, సిద్ధు తదితరులున్నారు. -
మాఫీ నిధులిచ్చేందుకు మనసొప్పడం లేదా?
దేవరకొండ ‘రైతు రణభేరి’ద్వారా కేసీఆర్‌ను ప్రశ్నించిన ఉత్తమ్ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘అధికారంలోకి రాగానే రైతులకు రూ.లక్ష రుణమాఫీ అన్నా రు. మాట మార్చి విడతల వారీగా చెల్లిస్తామన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 27 నెలలవుతోంది. కానీ, మూడో దఫా రుణమాఫీ కింద రూ.4 వేల కోట్లు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మనసొప్పడం లేదా? అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. కేంద్రం ఇన్పుట్ సబ్సిడీ కింద ఇచ్చిన రూ.980 కోట్లను కాంట్రాక్టర్లకు మళ్లించిన ప్రభుత్వం.. రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. ‘రైతు రణభేరి’ పేరిట గురువారం నల్లగొండ జిల్లా దేవరకొండలో జరిగిన సభలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలోని 37లక్షల మంది రైతాంగాన్ని ఈ ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. మూడో విడత రుణమాఫీ కింద ఇవ్వాల్సిన రూ.4 వేల కోట్ల నిధులను ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. రెండేళ్లలో ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కట్టలేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు, ఆరోగ్యశ్రీకి నిధులివ్వడం లేదని, కనీసం ఉద్యోగుల వేతన బకాయిలు చెల్లిం చేందుకూ ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న వారు కనీసం ఊరికో ఉద్యోగం అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. ‘ఇదేం ఖర్మో కానీ.. వీళ్లు అడుగుపెట్టిన దగ్గరి నుంచి తెలంగాణలో వ్యవసాయం భ్రష్టు పట్టిపోయింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న చివరి ఏడాది తెలంగాణలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 107 లక్షల టన్నులుంటే, గతేడాది 49 లక్షలకు తగ్గింది. ఇదేనా అభివృద్ధి?’ అని ఉత్తమ్ ప్రశ్నించారు. కరీంనగర్‌ను లండన్ చేస్తానని, హైదరాబాద్‌ను డ ల్లాస్ చేస్తానని, వరంగల్‌ను న్యూయార్క్ చేస్తానని, ట్యాంక్‌బండ్ చుట్టూ ఆకాశ హర్మ్యాలు కట్టిస్తానని చెబుతున్న కేసీఆర్ గ్రామీణ తెలంగాణ గురించి పట్టించుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని విమర్శించారు. రైతు ఆత్మహత్యలను కూడా చెప్పుకోలేనంత నామోషీగా ఈ ప్రభుత్వం తీరు ఉందని దుయ్యబట్టారు. తప్పులను ఎండగడితే జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారని, తనను ఏం చేసినా ఫర్వాలేదని, కాంగ్రెస్‌పార్టీ రైతాంగం పక్షాన నిలబడి పోరాడుతుందని ఉత్తమ్ స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్ పాత్ర లేదు: జానా తెలంగాణను తీసుకురావడంలో కానీ, అభివృద్ధి చేయడంలోకానీ కేసీఆర్ పాత్ర ఏమీలేదని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే అధికారులు పరుగెత్తికెళ్లి రూ.1.5 లక్షల పరిహారం ఇచ్చి ఆ కుటుం బాన్ని ఆదుకునేవారని, ఇప్పుడు రూ.6 లక్షలు ఇస్తామని మాటలు చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతవరకు ఒక్క రైతుకు కూడా పరిహారం చెల్లించలేదన్నారు. ప్రభుత్వానికి కళ్లు మూసుకుపోయాయని, రైతు రణభేరి ద్వారానైనా కనువిప్పు కలగాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు భిక్షమయ్యగౌడ్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ వైఎస్సార్ అధికారంలో ఉండగా, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడిగిందే తడవుగా నక్కలగండి మంజూరు చేసి నల్లగొండ జిల్లాలో కరువు పీడిత ప్రాంతాలను సస్యశ్యామలం చేసేం దుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేసిం దన్నారు. కానీ, ఇప్పుడు దానినే డిండి ఎత్తిపోతలగా మార్చి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోంద న్నారు. మాజీ మంత్రి ఆర్.దామోదర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భారతీ రాగ్యానాయక్, రైతు సంఘం నేత ఎం.కోదండరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విజేతలకు బహుమతుల ప్రదానం
దేవరకొండ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేవరకొండ బ్యాడ్మింటన్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన డివిజన్ స్థాయి షటిల్ టోర్నమెంట్ విజేతలకు మంగళవారం దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్వీటీ బహుమతులు ప్రదానం చేశారు. టోర్నమెంట్లో 20 టీమ్‌లు పాల్గొనగా మొదటి బహుమతి కె. భాస్కర్, శేఖర్ టీమ్, రెండవ బహుమతి ఖాలిక్, ప్రకాష్ టీం గెలుపొందాయి. కార్యక్రమంలో దయానంద్, సురేశ్, శ్రీధర్‌గౌడ్, వెంకట్, వేణు, వినోద్, రామాచారి, మహేశ్, జగదీశ్, పరిపూర్ణా, అజహర్, శేఖర్, రవి, బాలాజీ, భాస్కర్, పూర్యా, వెంకట్ ఉన్నారు. -
అపురూపమైన దృశ్యాలకు కేరాఫ్ చందంపేట
చందంపేట అంటేనే గుర్తుకొచ్చేది.. మారుమూల అటవీ ప్రాంతమని..! సామాజిక వెనుకబాటుకు, శిశు విక్రయాలకు కేరాఫ్ అని. అత్యధిక గిరిజనులున్న మండలం అని..!! కానీ, బాహ్య ప్రపంచానికి తెలియని రహస్యాలున్నాయని, చిత్రవిచిత్రమైన దృశ్యాలున్నాయని కొందరికే ఎరక. ఒళ్లు గగుర్పొడిచే గుహలు, అరకును తలపించే అందాలు, ఆధ్మాత్మికతకు నెలవైన ఆలయాలు, అలరించే కోటి తాటివనాలు, బృహత్కాలం నాటి సమాధులు.. ఇలా మరెన్నో ఈ పేటకు మరో కోణంగా ఉన్నాయని ఇప్పుడిప్పుడే తెలుసు. పుష్కరాల నేపథ్యంలో ప్రత్యేకతను సంతరించుకోనున్నాయి.. ఆయా అంశాలు. –దేవరకొండ దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో విస్తరించి ఉన్న చందంపేట మండలం అన్ని విధాలా వెనుకబడిన ప్రాంతం. సామాజిక వెనుకబాటుకు గురైన ఈ మండంలో గిరిజనులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ శిశు విక్రయాలు కూడా ఎక్కువగానే జరుగుతుంటాయి. ఇదంతా ఒక ఎత్తయితే ఈ మండలం కృష్ణా పరివాహక ప్రాంతంలో సుమారు 50 కిలో మీటర్ల మేర ఉండడం మరో ఎత్తు. నక్కలగండి ప్రాజెక్టు పురుడు పోసుకుంటున్న చందంపేట మండలంలో మరో కోణం కూడా ఉంది. గాజుబిడం గుహలు, దేవరచర్ల మునిస్వామి ఆలయంతో పాటు ఆశ్చర్యం కొలిపే దృశ్యాలు అనేకం ఉన్నాయి. ఈనెల 12 నుంచి ఆగస్టు 22వ తేదీ వరకు జరగనున్న కృష్ణా పుష్కరాల కోసం మండలంలోని కాచరాజుపల్లి, పెద్దమునిగల్ బ్యాక్ వాటర్ ప్రాంతంలో రెండు పుష్కర ఘాట్లు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడికి వచ్చే భక్తులకు అనేక దృశ్యాలు కనువిందు చేయనున్నాయి తెలంగాణలో వైజాగ్ తెలంగాణలో వైజాగ్ ఏంటి అనుకుంటున్నారా ? కాచరాజుపల్లి ఘాట్ సమీపంలో ఈ కాలనీ ఉంది. వైజాగ్ ప్రాంతానికి చెందిన కొన్ని కుటుంబాలు చేపల వేటలో భాగంగా దాదాపు యాబై ఏళ్ల క్రితం సాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతానికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. అందుకే ఈ కాలనీకి వైజాగ్ కాలనీ అని పేరొచ్చింది. తాజా చేపలు కావాలన్నా, చేపల పులుసు తినాలన్నా ఇక్కడకు వెళ్లాల్సిందే. ఈ కాలనీ నుంచి ఇతర ప్రాంతాలకు చేపలు ఎగుమతి చేస్తుంటారు. వీరు తెలంగాణలో ఉన్న ఆంధ్రా ప్రాంతంతో మంచి సంబంధాలున్నాయి. కోటి తాటి వనాలు.. చందంపేట మండలంలో అటవీ ప్రాంతమే కాదు తాటి వనాలు కూడా అలరిస్తాయి. చిత్రియాల పరిధిలో సుమారు 500 ఎకరాల పరిధిలో చుట్టూ గుట్టల నడుమ తాటి వనమే ఉంది. ఇక్కడ కోటి తాటి చెట్లు ఉన్నట్లు ఇక్కడి గ్రామస్తులు చెబుతుంటారు. అందుకే ఈ వనాన్ని కోటి తాటి అంటారు. వందల ఏళ్ల మామిడి.. చిత్రియాల అటవీ ప్రాంతంలో ఉన్న ఓ మామిడి చెట్టుకు వందల ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఈ చెట్టు వయస్సు కచ్చితంగా తెలియకపోయినా శతాబ్దాలనాటిదని పూర్వీకులు చెబుతుంటారు. దీని ఎత్తు, వ్యాసార్థం ఎంతో తెలుసా? సుమారు 100 మీటర్ల ఎత్తు, ఏడు మంది దాని చుట్టూ చేతులు చాచి నిలబడినా అందనంత వ్యాసార్థం. అంటే దాదాపు 14 మీటర్ల వెడల్పు ఉంటుంది. నక్కలగండి టన్నెల్ దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీశైలం నుంచి జిల్లాలోని దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందించాలన్న ప్రధాన ఉద్దేశంతో చేపట్టిందే నక్కలగండి టన్నెల్. శ్రీశైలం నుంచి నక్కలగండి వరకు సుమారు 43 కిలో మీటర్ల మేర అటవీ మార్గం నుంచి ఈ సొరంగాన్ని తవ్వుతున్నారు. సుమారు 28 కిలో మీటర్ల మేర ఈ టన్నెల్ పూర్తి కాగా, టన్నెల్–2 ఏడు కిలో మీటర్లు పూర్తయింది. బృహత్ కాలం నాటి సమాధులు ఇటీవల చందంపేట మండలంలో పర్యటించిన పురావస్తుశాఖ అధికారులు ఇక్కడ బృహత్ కాలం నాటి సమాధులు ఉన్నట్లు గుర్తించారు. వందల ఏళ్ల కాలం నాటి ఈ సమాధులు ప్రస్తుతం పుష్కర ఘాట్లు నిర్మిస్తున్న పెద్దమునిగల్, కాచరాజుపల్లి, వైజాగ్ కాలనీ పరిధిలో ఉన్నాయి. చిత్రవిచిత్రాల భద్రగిరి బానాలపట్నం చిత్రియాల గ్రామానికి మరో పేరు చిత్రవిచిత్రాల భద్రగిరి బానాలపట్నం. ఇక్కడ కోట బురుజుతో పాటు రాజులు పరిపాలించిన ఆనవాళ్లు చాలా ఉన్నాయి. ఇక్కడ గుప్త నిధుల కోసం చాలా చోట్ల తవ్వకాలు జరిపారు. ఈ ప్రాంతం నుంచి ఓ బావి ద్వారా శ్రీశైలానికి సొరంగమార్గం ఉన్నట్లు గ్రామస్తులు చెబుతుంటారు. ఇక్కడి అటవీ ప్రాంతాల్లో వందల ఏళ్ల కాలం నాటి పురాతన ఆలయాలతో పాటు అక్కడక్కడా దేవతల విగ్రహాలు, పెద్దపెద్ద బండలపై చెక్కిన చిత్రాలు కనిపిస్తుస్తాయి. వీటి ఆధారంగా ఈ ప్రాంతానికి ప్రాచీన నేపథ్యం ఉన్నట్లు తెలుస్తోంది. -
కేన్సర్ నివారణే ప్రధానం
దేవరకొండ : కేన్సర్ వ్యాధి నివారణే ప్రధానమని, వ్యాధి లక్షణాలు గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఆంకోటెలిగెంట్, నీలగిరి ఫౌండేషన్, యశోద కేన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కేన్సర్ నిర్ధారణ శిబిరాన్ని ఆయన దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేన్సర్ వ్యాధిని మొదట దశలోనే గుర్తిస్తే మేలు జరుగుతుందని అన్నారు. క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వం తరుపున చికిత్సకు కావాల్సిన సహాయాన్ని తన వంతుగా అందిస్తానని అన్నారు. అనంతరం దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మాట్లాడుతూ క్యాన్సర్ మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, నగర పంచాయతీ చైర్మన్ మంజ్యానాయక్, వైస్ ఎంపీపీ దూదిపాల వేణుధర్‌రెడ్డి, వైస్ చైర్మన్ నల్లగాసు జాన్‌యాదవ్, పాశం రాంరెడ్డి, రేపాల హరి, తేలుకుంట్ల జయశ్రీ, సుజాత స్టీఫెన్, తాళ్లపల్లి రఘు, రాంబాబు, సుజాత, శ్రీకాంత్‌రెడ్డి, విజయ్‌కాంత్, కౌన్సిలర్లు ఆసిఫ్, వడ్త్య దేవేందర్, నాయకులు బండారు బాలనర్సింహ, చింతపల్లి సుభాష్, పొన్నెబోయిన సైదులు, చిత్రం ఏసోబు, బొడ్డుపల్లి కృష్ణ తదితరులున్నారు. -
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
దేవరకొండ : గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కోరారు. ఆదివారం పట్టణంలోని బాలికల ప్రభుత్వ పాఠశాలలో ఆంకోటెలిగెంట్, నీలగిరి ఫౌండేషన్, యశోద క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. క్యాన్సర్ బాధితులకు ప్రభుత్వం తరుపున సహాయం అందించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో దేవరకొండ ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మారుపాకుల సురేష్‌గౌడ్, ఆసిఫ్, పొన్నెబోయిన సైదులు, ముచ్చర్ల ఏడుకొండల్, మధునాయక్, రాజుపేట శ్రీను, కొర్ర రాంసింగ్‌నాయక్, పీపీఆర్, బాబురాంనాయక్, పాండునాయక్, రేపాల హరి, తేలుకుంట్ల జయశ్రీ, సుజాత స్టీఫెన్, రఘు, విజయ్‌కాంత్, రాంబాబు, శ్రీకాంత్‌రెడ్డి తదితరులున్నారు. -
దొంగ దొరికాడు..!
దేవరకొండ పది రోజుల క్రితం కొండమల్లేపల్లి ఆంధ్రా బ్యాంకు ఎదుట ఓ మహిళకు మాయమాటలు చెప్పి రూ.70వేలు దోచుకెళ్లిన ఘరానా దొంగ పోలీసులకు చిక్కాడు. అమాయక ప్రజలే లక్ష్యంగా ఎంచుకుని బ్యాంకుల ముందు రెక్కీ నిర్వహించి వారితో మాటలు కలిపి బ్యాంకు ఉద్యోగినంటూ సహాయం చేస్తానంటూ దోచుకెళ్లే దొంగను మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు దేవరకొండ డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి డీఎస్పీ చంద్రమోహన్ వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా చాగల్లుకు చెందిన షేక్ నాగూర్ మీరావలిని పోలీసులు దొంగగా గుర్తించారు. దేవరకొండలోని విష్ణు కాంప్లెక్స్‌లో ఉన్న బ్యాంకుల ముందు మరో దొంగతనం చేయడానికి కాపుకాసిన నాగూర్ మీరావలిని అనుమానించి తమదైన శైలిలో పోలీసులు విచారించడంతో కొండమల్లేపల్లిలో బ్యాంకు దొంగతానికి పాల్పడింది తానేనని ఒప్పుకున్నాడు. ఇదిలా ఉండగా నాగూర్‌వలీ అభిరామ్, అభి, బాబ్జి అనే వివిధ రకాల పేర్లతో గతంలో వివిధ బ్యాంకుల సమీపంలో డబ్బు కాజేసిన కేసుల్లో నిందితుడు. ఇతనిపై గణపవరం, చేబ్రోలు, విజయనగరం, గుడివాడతో పాటు నల్లగొండ జిల్లా చౌటుప్పల్ పరిధిలోని పోలీస్స్టేషన్లలో కూడా బ్యాంకు దొంగతనం కేసులున్నాయి. షేక్ నాగూర్మీరావలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని నుండి లక్షా 13వేలతో పాటు నానో కారు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన ఐడీ పార్టి సిబ్బందిని ఆయన అభినందించారు. సమావేశంలో సీఐ గట్టుమల్లు, ఎస్ఐలు ఖలీల్‌ఖాన్, సర్ధార్, సిబ్బంది రామారావు, నర్సింహ్మారావు, మేగ్యానాయక్, సింహాద్రి తదితరులున్నారు. -
దొంగ దొరికాడు..!
దేవరకొండ పది రోజుల క్రితం కొండమల్లేపల్లి ఆంధ్రా బ్యాంకు ఎదుట ఓ మహిళకు మాయమాటలు చెప్పి రూ.70వేలు దోచుకెళ్లిన ఘరానా దొంగ పోలీసులకు చిక్కాడు. అమాయక ప్రజలే లక్ష్యంగా ఎంచుకుని బ్యాంకుల ముందు రెక్కీ నిర్వహించి వారితో మాటలు కలిపి బ్యాంకు ఉద్యోగినంటూ సహాయం చేస్తానంటూ దోచుకెళ్లే దొంగను మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు దేవరకొండ డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి డీఎస్పీ చంద్రమోహన్ వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా చాగల్లుకు చెందిన షేక్ నాగూర్ మీరావలిని పోలీసులు దొంగగా గుర్తించారు. దేవరకొండలోని విష్ణు కాంప్లెక్స్‌లో ఉన్న బ్యాంకుల ముందు మరో దొంగతనం చేయడానికి కాపుకాసిన నాగూర్ మీరావలిని అనుమానించి తమదైన శైలిలో పోలీసులు విచారించడంతో కొండమల్లేపల్లిలో బ్యాంకు దొంగతానికి పాల్పడింది తానేనని ఒప్పుకున్నాడు. ఇదిలా ఉండగా నాగూర్‌వలీ అభిరామ్, అభి, బాబ్జి అనే వివిధ రకాల పేర్లతో గతంలో వివిధ బ్యాంకుల సమీపంలో డబ్బు కాజేసిన కేసుల్లో నిందితుడు. ఇతనిపై గణపవరం, చేబ్రోలు, విజయనగరం, గుడివాడతో పాటు నల్లగొండ జిల్లా చౌటుప్పల్ పరిధిలోని పోలీస్స్టేషన్లలో కూడా బ్యాంకు దొంగతనం కేసులున్నాయి. షేక్ నాగూర్మీరావలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని నుండి లక్షా 13వేలతో పాటు నానో కారు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన ఐడీ పార్టి సిబ్బందిని ఆయన అభినందించారు. సమావేశంలో సీఐ గట్టుమల్లు, ఎస్ఐలు ఖలీల్‌ఖాన్, సర్ధార్, సిబ్బంది రామారావు, నర్సింహ్మారావు, మేగ్యానాయక్, సింహాద్రి తదితరులున్నారు. -
గిరిజన భవనాలు, శిక్షణ కేంద్రాలకు రూ. 50 కోట్లు మంజూరు
దేవరకొండ : రాష్ట్రంలో గిరిజన భవనాల నిర్మాణం, ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 50 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లాపరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్ తెలిపారు. మంగళవారం దేవరకొండ పట్టణంలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో 9 గిరిజన ట్రైనింగ్ సెంటర్లకు గాను రూ. 27.50 కోట్లు విడుదల కాగా దేవరకొండ పట్టణంలో గిరిజన ట్రైనింగ్ సెంటర్ కోసం గిరిజన సంక్షేమశాఖ నుంచి రూ. 4 కోట్ల 65 లక్షలు మంజూరు చేసిందని తెలిపారు. అలాగే రాష్ట్రంలో 9 గిరిజన నియోజకవర్గాలకు 9 గిరిజన భవనాలు మంజూరు కాగా జిల్లాలోని నల్లగొండ, దేవరకొండ పట్టణాలలో గిరిజన భవనాల నిర్మాణాల కోసం రూ. 2 కోట్ల 20 లక్షలు మంజూరు చేసిందని వెల్లడించారు. జిల్లాలో హరితహారం కార్యక్రమంలో భాగంగా బుధవారం అన్ని మండలపరిషత్ కార్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలో అన్ని మండల కార్యాలయాల్లో చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఇటీవల రాష్ట్రంలో విడుదలైన అంగన్వాడీ భవనాల నిర్మాణాలు నిలిచిపోయిన నేపథ్యంలో సంబంధితశాఖ మంత్రితో మాట్లాడడంతో ఆయన సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో దేవరకొండ ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మారుపాకుల సురేష్‌గౌడ్, టీఆర్ఎస్ పట్టణ పార్టి అధ్యక్షుడు పున్న వెంకటేశ్వర్లు, ఎంఏ. సిరాజ్‌ఖాన్, తిప్పర్తి సురేష్‌రెడ్డి, ముచ్చర్ల ఏడుకొండల్‌యాదవ్, పాపానాయక్, బైరెడ్డి కొండల్‌రెడ్డి, నాయిని మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలి
దేవరకొండ ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని తెలంగాణ రైతు సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి. చంద్రకుమార్ అన్నారు. ఆదివారం దేవరకొండ పట్టణంలోని ఐబీ ఆవరణలో జరిగిన రైతుల, ప్రాజెక్టుల భూనిర్వాసితుల సమస్యలపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భూమిని నమ్ముకుని జీవిస్తున్న రైతులు ఆ భూమే పోతే రైతు జీవితం పోయినట్లేనని, రిజర్వాయర్ల నిర్మాణం పేరుతో భూములు తీసుకుంటున్న ప్రభుత్వం జీఓ నంబర్ 123ను రద్దు చేసి 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్య, వైద్యాన్ని ప్రాథమిక హక్కుగా ప్రతి ఒక్కరికి అందించాల్సి ఉండగా అవి నేడు ప్రైవేట్ పరం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. తెలంగాణ ప్రజలు కోటి ఆశలతో ఉద్యమించి తెలంగాణ సాధించుకున్నారని అలాంటి ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తూ కాలం వెళ్లదీస్తుందన్నారు. భూనిర్వాసితుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం తెలంగాణ ఉద్యమ వేదిక చైర్మన్ డాక్టర్ చెరుకు సుధాకర్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు తమకు ఓట్లేసి గెలిపించిన జనాన్ని మరిచిపోయారని ఆరోపించారు. ప్రజలను ఎవరైతే హీనంగా చూస్తారో వారిని సహించేది లేదని హెచ్చరించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్‌ల చుట్టూ హెలికాప్టర్లో చక్కర్లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలను కొనుగోలు చేసి సొంత పార్టీలో చేర్చుకున్నా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ప్రభుత్వానికి ప్రతిపక్షంగా నిలబడతారన్నారు. తెలంగాణ రైతు సంక్షేమ సమితి రాష్ట్ర కోశాధికారి పోలె విష్ణు అధ్యక్షత వహించిన ఈ సదస్సులో తెలంగాణ నవనిర్మాణ వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మురళీధర్‌గుప్తా, రాంనర్సయ్య, రైతు సంక్షేమ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగుల శ్రీనివాస్‌యాదవ్, సమితి రాష్ట్ర కార్యదర్శి ఆకుల భిక్షపతి, నల్లగంటి రామకృష్ణ, లొడంగి గోవర్ధన్‌యాదవ్, సమితి జిల్లా బాధ్యులు ఎర్ర విజయ్‌కుమార్, జిల్లా బాధ్యులు ఎర్ర కృష్ణ, రమేష్, తిరుపతి తదితరులున్నారు. -
బ్యాంకు ఉద్యోగినని చెప్పి..
నల్లగొండ : బ్యాంకు ఉద్యోగినని నమ్మించి ఓ అమయాకురాలి నుంచి రూ. 75 వేలతో ఉడాయించాడో ఆగంతకుడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం చిన్న అడిశర్లపల్లిలో బుధవారం వెలుగు చూసింది. స్థానికంగా నివాసముంటున్న వినోద అనే మహిళ గతంలో ఆంధ్రాబ్యాంక్‌లో బంగారం కుదవ పెట్టి రూ. 2.65 లక్షలు రుణం తీసుకుంది. నగదు చెల్లించేందుకు ఈ రోజు తన నగలను తీసుకెళ్లడానికి బ్యాంకు వెళ్లింది. ఆ సమయంలో బ్యాంకు మూసి ఉండటంతో.. పక్కనే ఉన్న బడ్డీ కొట్లో కూర్చుంది. మాటల మధ్య తాను బ్యాంక్‌లో నగదు జమ చేయడానికి వచ్చానని స్థానికులతో చెప్పింది. ఆ విషయం విన్న ఆగంతకుడు తాను బ్యాంక్ ఉద్యోగినని.. మేనేజర్ గారు రూ. 75 వేలు ముందు ఇవ్వమన్నారని.. ఆ తర్వాత మిగతా అప్పు రెన్యువల్ చేస్తారని చెప్పాడు. అతని మాటలు నమ్మిన వినోద రూ. 75 వేలను అతని చేతిలో పెట్టింది. వెంటనే అతడు నీ పాస్ పుస్తకాలు జీరాక్స్ తీసుకురమ్మని చెప్పాడు. జిరాక్స్ తీసుకొని బ్యాంక్ వద్దకు వచ్చేసరకే దుండగుడు అక్కడి నుంచి ఉడాయించాడు. కొద్దిసేపటి తర్వాత సదరు మహిళ బ్యాంకు అదికారులకు జరిగిన విషయం చెప్పింది. ఈ విషయంపై తనకు ఏమి తెలియదని బ్యాంకు మేనేజర్ వెల్లడించాడు. దాంతో బ్యాంకు మేనేజర్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు బ్యాంకు వద్దకు చేరుకుని... బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అందులోభాగంగా సీసీ టీవీ ఫూటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. -
చిన్నారుల సజీవ సమాధి
దేవరకొండ : దేవరకొండ మండలం దుబ్బతండాకు చెందిన ఇస్లావత్ లక్ష్మణ్, ఇస్లావత్ పాపాలు అన్నదమ్ములు. వీరిద్దరూ తండాలోనే వ్యవసాయం చేస్తుండగా, పాపా పది నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. లక్ష్మణ్, చంద్రి దంపతులకు ఇద్దరు కుమారులు కాగా వారిలో చిన్నకుమారుడు పవన్(7). లక్ష్మణ్ తమ్ముడు పాపా మృతిచెందడంతో అతడి భార్య భారతి తన ఇద్దరు చిన్నారులతో తండాలోనే ఉంటోంది. ఆమెకు అయిదేళ్ల కుమార్తె, కుమారుడు సిద్ధు (7) ఉన్నారు. ఇది ఇలా ఉండగా లక్ష్మణ్ దంపతులు మంగళవారం ఇంకుడు గుంతలు నిర్మించుకోవడానికి తండాకు సమీపంలో ఉన్న మడమడక మైనంపల్లి వాగుకు ఇసుక కోసం వెళ్లారు. అయితే వారికి భోజనం తీసుకెళ్లడానికి వారి కుమారుడైన పవన్, సిద్ధుతో కలిసి వెళ్లాడు. అక్కడ వారి తల్లిదండ్రులు ఇసుక తోడుతుండగా ఆ సమీపంలోనే ఉన్న ఇసుక దిబ్బ వద్ద ఆడుకుంటున్నారు. వాగులో గతంలో ఇసుక తోడేయగా సుమారు 10 ఫీట్ల గోతి ఏర్పడగా పై నుంచి మాత్రం స్లాబ్ మాదిరిగా దిబ్బ పేరుకుపోయి ఉంది. దాని కింద నీడతో పాటు చల్లగా ఉండటంతో పవన్, సిద్ధులిద్దరూ అక్కడ ఆడుకుంటున్నారు. ఆ సమయంలోనే దిబ్బ కూలిపడటంతో వారిద్దరూ ఆ ఇసుకలో కూరుకుపోయారు. ఈ లోపు పవన్, సిద్ధులు కనిపించకపోవడంతో వారి తల్లిదండ్రులు ఆ సమీపంలో ఉన్న వారిని ఆరా తీశారు. అక్కడే ఉన్న తండాకు చెందిన మరో వ్యక్తి కొద్ది సేపటి క్రితం కొద్ది దూరంలోని ఇసుక దిబ్బ వద్ద ఆడుకుంటున్నట్లు తెలిపారు. అక్కడికి వచ్చి చూడటంతో ఇసుక దిబ్బ కూలిపోయి ఉండటంతో అనుమానం వచ్చిన వారు అక్కడ తవ్వే ప్రయత్నం చేసినప్పటికీ వారికి వీలు కాలేదు. దీంతో దేవరకొండ సమీపంలోని ఒక జేసీబీని తీసుకెళ్లి దిబ్బ ఉన్న ప్రాంతంలో తవ్వి చూడగా అప్పటికే వారిలో సిద్ధు మృతిచెందగా పవన్ మాత్రం కొన ఊపిరితో ఉన్నట్లు గమనించారు. వెంటనే 108కు సమాచారం అందించగా సిబ్బంది అక్కడికి వచ్చి ఆక్సీజన్ అందించి దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లే లోపే పవన్ మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ కుటుంబంలో అంతులేని విషాదం 10 నెలల క్రితమే మృతుడు సిద్ధు తండ్రి పాపా అనారోగ్యంతో మృతి చెందడంతో కన్న తల్లి భారతే ఆ కుటుంబానికి పెద్ద దిక్కై సాకుతోంది. అయిదేళ్ల కుమార్తెతో పాటు కన్న కొడుకు సిద్ధే అన్నీ అనుకుని తల్లి భారతి కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఈ పరిస్థితుల్లో 10 నెలల కాలంలోనే మళ్లీ కన్న కొడుకును కూడా పోగొట్టుకున్న ఆ తల్లి ఆవేదనకు అంతు లేకుండా పోయింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులను పోగొట్టుకున్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. కొన్ని నిమిషాల కిందే తమ కళ్ల ముందే ఆడుకుంటూ కనిపించిన ఆ చిన్నారులిద్దరూ నిమిషాల వ్యవధిలోనే విగతజీవులుగా పడి ఉండటాన్ని ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతుంది. ఆసుపత్రిలో ఆ ఇద్దరు చిన్నారులపై పడి లక్ష్మణ్, భారతిలు రోదించిన తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది. ప్రభుత్వాస్పత్రిలో మిన్నంటిన రోదనలు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృతిచెందడంతో దేవరకొండ ప్రభుత్వాసుపత్రిలో బంధువుల రోదనలు మిన్నంటాయి. తల్లిదండ్రుల రోదనలు పలువురిని కంట తడిపెట్టించాయి. చిన్నారుల మృతదేహాలపై పడి బోరున విలపించారు. తండావాసులు అధిక సంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు. ఆర్డీఓ గంగాధర్ ప్రభుత్వాసుపత్రికి చేరుకుని సంఘటనకు సంబంధించిన వివరాలను బంధువులను అడిగి తెలుసుకున్నారు. -
ఇసుక దిబ్బ విరిగిపడి..
దేవరకొండ: ఇసుక గుంతల వద్ద ఆడుకుంటూ ఇద్దరు బాలురు ప్రాణాలు కోల్పోయారు. నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణ శివారులో నివాసం ఉండే ఇస్లావత్ సిద్ధు(7), ఇస్లావత్ మోహన్(7) తమ ఇళ్లకు సమీపంలోనే ఉన్న మైనంపల్లి వాగులో ఆడుకునేందుకు వెళ్లారు. అక్కడ ఇసుక కోసం తవ్విన గుంతలోకి దిగిన వారిద్దరిపై ఒడ్డు విరిగిపడింది. కొద్దిసేపటి తర్వాత వారి కోసం వెదికిన కుటుంబసభ్యులు గుంతలో ఇసుక కింద కూరుకుపోయినట్లు గుర్తించి వెంటనే బయటకు తీశారు. దేవరకొండ ఆస్పత్రికి తరలించగా వారు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
ఇద్దరు చిన్నారులు సజీవ దహనం
దేవరకొండ రూరల్ (నల్లగొండ) : నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం పెండ్లిపాకల గ్రామంలో గురువారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సైదయ్య, లక్ష్మమ్మ ఇంటి వద్ద బంధువుల పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంటి ముందున్న పందిరికి కట్టిన ఊయల వద్ద బంధువుల పిల్లలు కార్తీక్(2), అశ్విని(5) ఉండగా పందిరిపై ఉన్న కరెంటు తీగలు షార్ట్‌సర్క్యూట్ అయ్యి మంటలు లేచాయి. ఒక్కసారిగా ఎగసిపడిన మంటలు చిన్నారులపై పడటంతో వారు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. స్థానికులు రక్షించటానికి యత్నించినా వీలుకాలేదు. సంఘటన స్థలాన్ని సీఐ గట్టుమల్లు, తహశీల్దార్ గణేష్‌నాయక్ పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. -
ప్రభుత్వాస్పత్రి ఎదుట గర్భిణీ స్త్రీల ఆందోళన
నల్గొండ : నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వాస్పత్రి వద్ద పేషెంట్లు బుధవారం ఆందోళనకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి... కాన్పు చేయించుకునేందుకు ముగ్గురు గర్భిణీలు స్థానిక ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. అయితే ప్రభుత్వ వైద్యుడు వాళ్లకు వైద్యం చేసేందుకు నిరాకరించాడు. తాను ప్రైవేట్ ఆసుపత్రి నడుపుతున్నానని... ఆ ఆసుపత్రిలో చేరితేనే వైద్యం చేస్తానని కరఖండిగా చెప్పాడు. దీంతో ఆసుపత్రికి వచ్చిన మహిళలు వైద్యుడితో వాగ్వివాదానికి దిగారు. వైద్యుడి వైఖరికి నిరసనగా... ఆసుపత్రి ఎదుట గర్భిణీ స్త్రీలతోపాటు వారి బంధువులు ఆందోళకు దిగారు. -
బంధువని చేరదీస్తే...
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని హతమార్చిన వైనం దేవరకొండ : స్నేహితుడు, బంధువని చేరదీసిన వ్యక్తే కాలయముడు అయ్యాడు. ఆశ్రయం ఇచ్చిన మిత్రుడి భార్యతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకొని అడ్డుగా ఉన్నాడని చివరికి దారుణంగా హతమార్చాడు. హత్య చేసిన అనంతరం మృతదేహం భాగాలను నరికి వివిధ ప్రాంతాల్లో విసిరేశాడు. ఈ భయంకర ఉదంతం దేవరకొండ మండలంలోని కోల్‌మంతల్ పహాడ్ సమీపంలో వెలుగుచూసింది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దవూర మండలం పర్వేదుల గ్రామపంచాయతీ పాల్త్యీతండాకు చెందిన పాల్త్యి రవి(31), శ్యామల దంపతులు. రోజువారి కూలిపని చేసుకుంటూ జీవనంసాగిస్తున్నారు. అదే తండాకు చెందిన శ్రీధర్ అనే వ్యక్తి రవికి సమీప బంధువు, మిత్రుడు. ఈ క్రమంలో నిత్యం రవి ఇంటికి వస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో శ్యామలతో వివాహేతర సంబంధం ఏర్పడింది. కొంత కాలం తర్వాత వీరి మధ్య గల సంబంధంపై రవికి అనుమానం వచ్చింది. దాంతో రెండేళ్ల క్రితం రవికి, శ్రీధర్‌కు మధ్య గొడవ జరిగింది. దాంతో రవి పెద్ద మనుషులను ఆశ్రయించడంతో వారు పంచాయితీ పెట్టి శ్రీధర్‌ను హైదరాబాద్‌కు పంపించారు. రవి కూడా భార్యను తీసుకొని మహబూబ్‌నగర్ జిల్లా మాడ్గుల మండలం అన్నెబోయిన పల్లి సమీపంలోని వెంకటేశ్వర ఫౌల్ట్రీఫాంలో పనికి కుదిరాడు. కాగా ఇటీవల శ్రీధర్ తిరిగి వచ్చి రవి పని చేస్తున్న ఫౌల్ట్రీఫాంలో పనికి కుదిరాడు. అనంతరం ఈ నెల 10వ తేదీన శ్రీధర్ మాయమాటలు చెప్పి రవిని మన జిల్లాలోని కొండమల్లేపల్లికి తీసుకెళ్లాడు. ఇద్దరూ ఫుల్లుగా మద్యం సేవించారు. చీకటి పడేవరకు అక్కడే గడిపారు. రాత్రి పది గంటలు దాటినా భర్త రాకపోవడంతో శ్యామల శ్రీధర్‌కు ఫోన్ చేయడంతో రవి హైదరాబాద్‌కు వెళ్లాడని చెప్పాడు. దాంతో ఆమె భర్తకు ఫోన్ చేయగా ఎత్తలేదు. అనుమానం వచ్చిన శ్యామల 11వ తేదీన ఆమె బంధువులకు తెలియజేయడంతో వారు శనివారం మా డ్గుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలి సిన శ్రీధర్ భయంతో శనివారం రాత్రి రవితండ్రికి ఫోన్‌చేసి ‘మీ కుమారుడు హత్యకు గురయ్యాడు. మృతదేహం కోల్‌మంతల్ పహాడ్ సమీపంలో ఉంది. వెళ్లి తీసుకెళ్లండి’ అని సమాచారం ఇచ్చాడు. దాంతో మృ తుడి బంధువులు ఆదివారం సంఘటనా స్థలానికి వెళ్ల ్లగా తల, చేతులు లేని మృతదేహాన్ని గుర్తించారు. దేవరకొండ సీఐ గట్టుమల్లు సంఘటనా స్థలాన్ని పరిశీలింఆ స్థలం మాడ్గుల పరిధిలోకి వస్తుందని పేర్కొన్నారు. అంతా మిస్టరీనే.. రవిని ఎలా హత్య చేశారనే విషయం పూర్తిగా బహిర్గతం కావడం లేదు. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో శ్రీధర్‌తో పాటు మరి కొంత మంది కలిసి రాయితో తలపై మోది హత్య చేశారని పోలీసులు భావిస్తున్నారు. అనంతరం తలను, చేతుల ను కత్తితో నరికి తీసుకెళ్లారని ప్రాథమిక అంచనాకు వ చ్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని వారు పేర్కొంటున్నారు. -
'ఎస్ఐని చంపి ఉరి తీశారు'
దేవరకొండ(నల్లగొండ జిల్లా): యలాల ఎస్సై రమేశ్ అంత్యక్రియల్లో ఉద్రిక్త పరిస్థితి తలెత్తంది. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని రమేశ్ కుటుంబ సభ్యులు, బంధవులు పట్టుబట్టారు. రమేశ్ అనుమానాస్పద మృతిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. అంత్యక్రియలకు హాజరైన జిల్లా ఎస్పీని అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. రమేశ్ ను చంపి ఉరి తీశారని కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ఆరోపించారు. పోస్టుమార్టం నివేదిక అన్యాయంగా ఉందని అన్నారు. సీఎం సీరియస్ గా తీసుకుని సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. రమేశ్ మృతిపై సీబీఐతో దర్యాప్తు చేయించకుంటే తెలంగాణ గిరిజనులతో ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. కాగా, రమేశ్ కు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని అతడి మిత్రులు తెలిపారు. రమేశ్ మృతి వెనుక ఇసుక మాఫియా హస్తం ఉందని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా యలాల ఎస్సైగా పనిచేస్తున్న రమేశ్ మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. -
'ఎస్ఐని చంపి ఉరి తీశారు'
-
దీపావళి వరకుమళ్లొస్తా..
దేవరకొండ/చింతపల్లి : అనుకున్న సమయం కంటే మంత్రి రెండు గంటలు ఆలస్యంగా వచ్చినా... 8 గంటల పాటు దేవరకొండ నియోజకవర్గంలో గడిపారు. పొలిటికల్ లీడర్ గెటప్‌లో కాకుండా టీ షర్ట్, ఫార్మల్ పాయింట్లో గ్రామసభకు వచ్చిన రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ గ్రామస్తులతో ఉల్లాసంగా గడిపారు. మాట్లాడుతామన్న ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించి వారు చెప్పుకున్న ప్రతి కష్టాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించాలని అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. గ్రామస్తులు అడిగిన సమస్యల పరిష్కారంతోపాటు వరాల జల్లు కురిపించారు. తన ప్రసంగంతో ప్రజలను ఆకట్టుకున్నారు. శుక్రవారం జిల్లాలోని చింతపల్లి మండలం నెల్వలపల్లి గ్రామం, చందంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గ్రామసభల్లో పాల్గొనడంతోపాటు దేవరకొండలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. నాయకులను, కార్యకర్తలను ఉత్తేజపరిచారు. టీఆర్ఎస్ ఇన్చార్జ్, జెడ్పీ చైర్మన్ నేనావత్ బాలునాయక్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 3 మండలాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు హాజరైన మంత్రి కేటీఆర్ 8 గంటల పాటు నియోజకవర్గంలో గడిపారు. 11 గంటలకు రావాల్సిన ఆయన కొంచెం ఆలస్యంగా వచ్చి రాత్రి 8 గంటల వరకు నియోజకవర్గంలోనే గడిపారు. చింతపల్లి మండలం నెల్వలపల్లి గ్రామంలో సుమారు గంటన్నరపాటు కాలి నడకన ప్రతి వీధిని తిరిగి పరిశీలించారు. పాఠశాల, వైద్యశాల, మిషన్ కాకతీయ కింద చేపట్టిన చెరువు పనులతో పాటు గ్రామంలోని పలు కుటుంబాల ఇళ్లలోకి వెళ్లి మరీ పరిశీలించారు. వారి ఆర్థిక పరిస్థితి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామసభలో కూర్చున్న ఆయన గ్రామస్తులు తెలిపిన పలు సమస్యలను ప్రశాంతంగా విన్నారు. వాటికి అక్కడికక్కడే పరిష్కార మార్గాలు చూపించారు. నెల్వలపల్లి గ్రామానికి సంబంధించి రానున్న నాలుగు సంవత్సరాల కాలంలో 4 కోట్ల 79 లక్షల రూపాయలు గ్రామజ్యోతి కార్యక్రమం కింద వెచ్చించనున్నట్లు తెలిపారు. గ్రామంలో మిగిలి ఉన్న 310 మరుగుదొడ్లను 2 నెలల్లో పూర్తి చేయాలని సర్పంచ్ అంగిరేకుల నాగభూషణం నుంచి మాట తీసుకున్నారు. గ్రామంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపడుతూ మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మించిన గ్రామానికి చెందిన బూరుగు రవిని ఆయన అభినందించారు. సభలో ఆయనకు మాట్లాడే అవకాశం కల్పించారు. చందంపేటలోనూ పెండింగ్‌లో ఉన్న 620 మరుగుదొడ్లను పూర్తి చేయాలని వీటిని పరిశీలించడానికి రెండు నెలల తర్వాత మళ్ళీ దీపావళి వరకు మళ్లి నియోజకవర్గానికి వస్తానన్నారు. అప్పటిలోగా మార్పు తీసుకురావాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. జిల్లాపరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్ మాట్లాడుతూ రాబోయే నాలుగేళ్లలో దేవరకొండ నియోజకవర్గాన్ని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సహకారంతో సిరిసిల్ల నియోజకవర్గంతో సమానంగా ముందుకు తీసుకెళ్తానన్నారు. దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో ఫ్లోరోసిస్ నిర్మూలన కోసం శివన్నగూడెంలో నక్కలగండి ఎత్తిపోతలకు సంబంధించి ప్రాజెక్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గత నెలలోనే శంకుస్థాపన చేశారని, ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులు పూర్తయ్యాయని తెలిపారు. దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎంపీడీఓ విజయలక్ష్మి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీపీ రవి, జెడ్పీటీసీ హరినాయక్ తదిరులున్నారు. మంత్రి హామీలివే : ఙ్ట్చఛగ్రామ అభివృద్ధికి సహకరించాలని నెల్వలపల్లి సర్పంచ్ అంగిరేకుల నాగభూషణంతో పాటు పలువురు అడిగిన హామీలను మంత్రి పరిష్కార మార్గాలు సూచించారు. గ్రామంలో ఇప్పటికే కొం త మేరకు పూర్తయిన సీసీ రోడ్ల పొడవు వెంటనే పెంచాలని అడగటంతో వెంటనే ఒకే చెప్పారు. పస్నూరు వాగు కింద 2 చెక్ డ్యాంల నిర్మాణానికి సంబంధిత శాఖల అధికారులతో అక్కడే మాట్లాడారు. నెల్వలపల్లి పంచాయతీ పరిధిలోని తిరుమలాయపాలెంలో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుకు ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఏఈని ఆదేశించారు. …లో 250 ఎకరాల మేర దళితులు కాస్తులో ఉన్నప్పటికీ పట్టాలు ఇవ్వలేదని ఓ యువకుడి ఆరోపణ మేరకు కాస్తులో ఉన్న వారికి క్షేత్ర పర్యటన చేసి నిబంధనల ప్రకారం వెంటనే 3 ఎకరాల చొప్పున పట్టాలివ్వాలని ఆదేశించారు. తిరుమలాపురంలో 11కెవి విద్యుత్ లైన్ షిఫ్టింగ్ కోసం గ్రామస్థులు అడగగా లైన్ షిఫ్ట్ చేయడానికి విద్యుత్‌శాఖ అధికారులతో మాట్లాడి వెంటనే అది తొలగించాలన్నారు. -
నేడు జిల్లాకు కేటీఆర్
దేవరకొండ : రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె.తారకరామారావు మొట్టమొదటిసారిగా దేవరకొండ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గతంలో జిల్లాలో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ప్రజలతో భాగస్వామ్యం పంచుకునే కార్యక్రమాల్లో పాల్గొనడం మాత్రం ఇదే మొదటిసారి కావడం, అదీ మారుమూల మండలమైన చందంపేట మండలంలోనూ పర్యటించనుండటంతో దేవరకొండ ప్రజాప్రతినిధులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతోపాటు టీఆర్ఎస్ దేవరకొండ నియోజకవర్గ ఇన్చార్జ్గా జిల్లాపరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్ బాధ్యతలు వహిస్తుండటంతో మంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను ఆయన దగ్గరుండి చూస్తున్నారు. కలెక్టర్ సత్యనారాయణరెడ్డితో కలిసి బాలునాయక్ మంత్రి పర్యటించే చందంపేట, దేవరకొండ, చింతపల్లి మండలాల్లో గురువారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం 11 గంటలకు చింతపల్లి మండలం నెల్వలపల్లి గ్రామంలో ఏర్పా టు చేసే గ్రామసభ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడినుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు దేవరకొండలో నిర్వహించే బైక్ ర్యాలీలో పాల్గొంటారు. ఆ తర్వాత నేరుగా చందంపేటకు వెళ్తారు. మండల కేంద్రంలోని పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసే గ్రామసభ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా జిల్లాపరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్ గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి రాకకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. బంగారు తెలంగాణను సాధించే క్రమంలో కేటీఆర్ కృషి అభినందనీయమని, ఆయన నియోజకవర్గంలో పర్యటించడం దేవరకొండ ప్రజల అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన పర్యటన సందర్భంగా దేవరకొండ నియోజకవర్గంలోని టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు, ప్రజలు తరలి రావాలని ఆయన కోరారు. -
దేవరచర్లలో ప్రకృతి అద్భుతం
-
దేవరచర్లలో ప్రకృతి అద్భుతం
దేవరకొండ: చుట్టూ కొండలు.. దట్టమైన అడవులు.. నింగి నుంచి జాలువారే నీటి పరవళ్లు.. గంగమ్మ శివలింగాన్ని అభిషేకించే అద్భుత దృశ్యాలు.. మనసును ఇట్టే కట్టి పడేసే ఈ ప్రకృతి సోయగాలు చూడాలంటే నల్లగొండ జిల్లా చందంపేట మండలం దేవరచర్లకు వెళ్లాల్సిందే! ఈ గ్రామానికి సమీపంలోని ముని స్వామి గుట్టలు రమణీయ దృశ్యాలకు ఆలవాలంగా నిలుస్తున్నాయి. దేవరకొండ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుగ్రామం దేవరచర్ల. అక్కడ్నుంచి సుమారు 5 కి.మీ. నడిస్తే చేరుకునే ప్రాంతం మునిస్వామిగుట్ట. ఇక్కడ జలపాతం జాలువారే చోటే కొలువైన శివలింగం, వందల ఏళ్ల నాటి పురాతన ఆలయం కనువిందు చేస్తున్నాయి. గుట్టల నడుమ ఆలయం, ఆ పక్కనే సొరంగ మార్గం ఉంది. ఈ నిర్మాణాలు ఎప్పటివో ఎవరికీ తెలియదు. ఈ ప్రాంతం చుట్టు ప్రక్కల ఉండే గిరిజనులు మాత్రం.. తాత ముత్తాతల కాలం నాటి నుంచి ఆ ప్రాంతంలో శివాలయం, జలపాతం ఉన్నాయని చెబుతున్నారు. ఏటా శివరాత్రి, ఏకాదశి పర్వదినాల్లో ఏడాదికి రెండుసార్లు మాత్రమే ఇక్కడ పూజలు జరుగుతుంటాయి. ఈ పర్వదినాల్లో గుట్టపై నిర్వహించే జాతరకు వందల మంది భక్తులు వచ్చి పూజలు నిర్వహిస్తారు. వాస్తవంగా దేవరకొండ ఖిల్లా దుర్గాన్ని 13వ శతాబ్దంలో రేచర్ల పద్మనాయక వంశానికి చెందిన రాజులు పాలించారు. ఆలయంలోని స్తంభాలపై చెక్కిన పద్మాలను (పుప్పాలు) బట్టి ఈ నిర్మాణాలు పద్మనాయక కాలం నాటివని తెలుస్తోంది. ప్రస్తుతం చెట్లు పడడంతో ఆలయం కొంతమేర కూలిపోయి కనిపిస్తోంది. ఎన్నెన్నో విశేషాలు: కొండపై కొలువైన శివలింగంపై ఎప్పుడూ గుట్టల నుంచి జాలు వారుతున్న నీటి పరవళ్లు అభిషేకిస్తూనే ఉంటాయి. మునుస్వామి ఆలయాన్ని గుట్ట కింది భాగంలో నిర్మించారు. ముందు స్తంభాలను మాత్రమే నిలబెట్టి వెనుక భాగంలో గుట్టనే ఆలయంగా మలిచారు. ఓచోట చతురస్రాకారంలో ఉన్న ఇటుకలతో ఒక నిర్మాణం ఉంది. ఆ ఇటుకలు కేవలం 200 నుంచి 300 గ్రాముల బరువున్నాయి. ఈ ఆలయానికి అపవిత్రంగా వెళ్తే అక్కడి కందిరీగలు, గబ్బిలాలు హాని చేస్తాయని ఇక్కడి గిరిజనులు విశ్వసిస్తారు. గుడిలోనే కాకుండా శిథిలావస్థకు చేరిన మరొక ఆలయ ఆనవాళ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ శివలింగం చుట్టూ చిన్న సైజులో మరో 18 చిన్న లింగాకారాలున్నాయి. ఆలయం పక్కనే ఒక గుహ లాంటి నిర్మాణం ఉంది. ఇక్కడి నుంచి శ్రీశైలం వరకు రహస్య సొరంగ మార్గం ఉందని స్థానికులు చెబుతుంటారు. ఏటా ఇక్కడ గోపా బావోజీ పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయాన్ని అభివృద్ధి పరిచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని గిరిజనులు కోరుతున్నారు. -
బైక్‌ను ఢీకొన్న లారీ
దేవరకొండ (నల్లగొండ) : రోడ్డుపై వెళ్తున్న బైక్‌ను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన గురువారం సాయంత్రం నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం ఇద్దంపల్లి గ్రామం సమీపంలో జరిగింది. వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా వంగూరు మండలానికి చెందిన ధరావత్ దీపక్, లలిత దంపతులు బైక్‌పై నల్లగొండ జిల్లా పీఎ పల్లి మండలం బాలాజీనగర్ తండాకు వెళ్తున్నారు. కాగా మార్గ మధ్యంలో వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో లలిత(22) అక్కడికక్కడే మృతి చెందగా, దీపక్ కాలు విరిగింది. గాయపడిన దీపక్‌ను 108లో దేవరకొండ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గుప్త నిధుల కోసం దేవాలయంలో తవ్వకాలు
దేవరకొండ (నల్లగొండ జిల్లా) : గుప్త నిధుల కోసం గుర్తుతెలియని దుండగులు ముత్యాలమ్మ దేవాలయంలో తవ్వకాలు జరిపారు. ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన నల్లగొండ జిల్లా దేవరకొండ మండల పరిధిలోని నసర్లబావి తండా సమీపంలో ఉన్న ముత్యాలమ్మ దేవాలయంలో జరిగింది. పురాతన దేవాలయం కావడంతో ఎన్నో ఏళ్లుగా చుట్టుపక్కల ఉన్న తండా వాసులు ముత్యాలమ్మను కొలుస్తున్నారు. ప్రతి ఏడాది దసరా సందర్భంగా గిరిజనులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జాతర నిర్వహిస్తుంటారు. కాగా గుర్తుతెలియని దుండగులు గుప్త నిధుల కోసం జరిపిన తవ్వకాలలో చెట్టు కింద ఉన్న ముత్యాలమ్మ విగ్రహం స్వల్పంగా ధ్వంసమైంది. అయితే సోమవారం అటుగా వెళ్లిన గ్రామస్తులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలను సేకరించారు. కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
కుందేలు.. వనవాసం
దేవరకొండ: చందంపేట మండలం కొత్తపల్లి గ్రామపరిధిలో జరిగిన ఈ సంఘటన పలువురిని విస్మయానికి గురిచేస్తోంది. కొత్తపల్లి గ్రామం అటవీ ప్రాంతానికి సమీపంలోనే ఉంది. చుట్టూ కొండలు, గుట్టలు ఉన్నాయి. నాలుగు రోజుల క్రితం ఓ కుందేలు గ్రామ పరిధిలోని మెగావత్‌తండాలో హల్చల్ చేసింది. తండాలో అటూ ఇటూ పరుగెత్తడం, బిత్తర చూపులు చూడటాన్ని పలువురు తండావాసులు గుర్తించారు. ఈ విషయమై తండావాసులు మాట్లాడుకునే లోపే అదే కుందేలు తండాకు సమీపంలో ఉన్న కొత్తపల్లి గ్రామంలోకి కూడా చొరబడింది. గ్రామంలో అక్కడక్కడా గ్రామస్తులకు కనిపించింది. ఇది గ్రామ, తండా ప్రజలకు వింతగా తోచింది. కుందేలు ఊళ్లోకి రావడం ఏంటని అందరూ నోళ్ళు నొక్కుకున్నారు. అరిష్టంగా భావించారు. ఇదే క్రమంలో మూడు రోజుల క్రితం గ్రామానికి చెందిన వరికుప్పల ఇద్దమ్మ అనే మహిళ మృతి చెందింది. ఈ మూడు రోజుల కాలంలోనే గ్రామ పంచాయతీ పరిధిలోని కృష్ణతండాకు చెందిన మంగ్లా అనే వ్యక్తి గుండెపోటుతో హైదరాబాద్‌లో మరణించాడు. ఈ రెండు ఘటనలూ వారిని మరింత కలవరానికి గురి చేశాయి. ఊరంతా ఒక్కటయ్యింది. ఇటు కుందేలు రావడం..వరుస మరణాలు వారికి మరింత కీడు చేస్తాయేమోనన్న భావనను కలిగించాయి. దీనికి తోడు గత పదిహేను రోజుల కాలంలోనే ఆ గ్రామానికి చెందిన మరో ముగ్గురు కూడా మృతి చెందారు. 15 రోజుల కాలంలోనే ఒక్కసారిగా గ్రామానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడటంతో ఊరంతా ఇది అరిష్టమేనన్నారు. ఈ కీడు తొలగాలంటే ఏం చేయాలని నలుగురినీ వాకబు చేశారు. దీనికి పరిష్కారం వనవాసమేనని భావించిన వారంతా గ్రామ సర్పంచ్ దృష్టికి విషయాన్ని తీసుకొచ్చారు. వనవాసం వెళ్ళాలన్నారు. మంచి జరుగుతుందంటే కాదనడమెందుకని ఆయన కూడా సరేనన్నారు. ఊరు, తండా అంతా ఏకమై గురువారం వనవాసానికి వెళ్లారు. ప్రజల విశ్వాసానికి విలువనివ్వాలనే గ్రామాల్లో ఇలాంటివి సహజం. అయితే కుందేలు వచ్చిందని వనవాసం వెళ్ళడం కంటే జనాల్లో మంచి జరుగుతుందంటే వనవాసమే వెళ్ళాలన్నప్పుడు కాదనడమెందుకు ? ప్రజల విశ్వాసానికి కూడా విలువనివ్వాలనే వనవాసం వెళ్ళడానికి టముకు వేయించా. కుందేలు రావడం మంచిదా... చెడ్డదా అని ఆలోచించడం కంటే ప్రజల్లో ఉన్న ఆ భయాన్ని పోగొట్టడం ఇక్కడ ముఖ్యం కదా. - లోకసాని కృష్ణయ్య, సర్పంచ్, కొత్తపల్లి