నల్లగొండ జిల్లా దేవరకొండలో దొంగలు బీభత్సం సృష్టించారు.
దేవరకొండ(నల్లగొండ):
నల్లగొండ జిల్లా దేవరకొండలో దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టణంలోని బీఎన్‌ఆర్ కాలనీ, హనుమాన్‌నగర్‌లో శుక్రవారం రాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. బీఎన్ ఆర్ కాలనీలోని ఓ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు రూ. 1.70 లక్షల నగలు ఎత్తుకెళ్లారు. మరో ఇంట్లో కూతురి పెళ్లి కోసం దాచి ఉంచుకున్న 6 తులాల బంగారు ఆభరణాలు దొంగలించుకెళ్లారు.
హనుమాన్‌నగర్‌లో తాళం వేసి ఉన్న ఇంట్లో నుంచి బీరువా ఎత్తుకెళ్లి.. సమీప అటవీ ప్రాంతంలో దాన్ని పగలగొట్టి విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.