havoc
-
గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 36 మంది మృతి
ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ గాజాపై వరుస దాడులకు తెగబడుతూనే ఉంది. తాజాగా దక్షిణ గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 36 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. గాజా పూర్తిగా ధ్వంసం అయినప్పటికీ, ఇజ్రాయెల్ సైన్యం తన దాడులను ఇంకా ఆపడం లేదు. తాజాగా ఇజ్రాయెల్ దక్షిణ గాజా స్ట్రిప్‌లో ఏకకాలంలో పలు వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 36 మందికిపైగా పాలస్తీనియన్లు మృతిచెందారు. గాజా ఆరోగ్య శాఖ అధికారులు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలిపారు. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఖాన్ యూనిస్ నగరంలో ఇద్దరు పిల్లలతో సహా ఒక కుటుంబంలోని 11 మంది సభ్యులు మృతిచెందారని నాసర్ ఆస్పత్రి అధికారులు తెలిపారు. ఖాన్ యునిస్‌తో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో మూడు వేర్వేరు దాడుల్లో 33 మంది మృతిచెందారని, వారి మృతదేహాలను ఆసుపత్రికి తీసుకువచ్చారని తెలిపారు.ఖాన్ యూనిస్‌కు దక్షిణంగా ఉన్న రహదారిపై జరిగిన దాడిలో మరో పదిహేడు మంది మృతిచెందారని నాసర్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 2023, అక్టోబర్ 7న గాజాలో యుద్ధం ప్రారంభమైంది. హమాస్‌తో పాటు మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో దాదాపు 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతిచెందారు. నాటి నుంచి ఇజ్రాయెల్ ప్రతీకారదాడులు చేస్తూ వస్తోంది. -
పాక్‌లో మండుతున్న ఎండలు.. 4 రోజ్లులో 450 మంది మృతి
కరాచీ: పొరుగు దేశం పాకిస్తాన్లో వడగాడ్పులు బీభత్సం సృష్టిస్తున్నాయి. దేశంలోని అతిపెద్ద నగరంగా పేరొందిన కరాచీలో వడగాడ్పులకు 450 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య అధికంగా ఉండటంతో మృతదేహాలను భద్రపరిచేందుకు మార్చురీల్లో స్థలం దొరకని పరిస్థితి నెలకొంది.పాక్‌లోని పలు స్వచ్ఛంద సంస్థలు దేశంలో విలయతాండవం చేస్తున్న ఎండల గురించి, వడగాడ్పుల కారణంగా మృతి చెందినవారి గురించి చెబుతున్నప్పటికీ పాక్ ప్రభుత్వం ఇంకా దీనిపై స్పందించలేదు. పాక్‌లోని ఓడరేవు నగరమైన కరాచీలో మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటుతున్నాయి. తాజాగా ఈధి ఫౌండేషన్ కరాచీలో నాలుగు రోజుల్లో 427 మృతదేహాలు లభ్యమయ్యాయని, సింధ్ ప్రభుత్వం మంగళవారం 23 మృతదేహాలను మూడు ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిందని తెలియజేసింది.ఫౌండేషన్ చీఫ్ ఫైసల్ ఈధి మాట్లాడుతూ కరాచీలో నాలుగు మార్చురీలు ఉన్నాయని, మృతదేహాలను ఉంచేందుకు ఈ మార్చురీలలో స్థలం సరిపోవడం లేదని అన్నారు. వీధులలో ఈ మృతదేహాలు లభ్యమయ్యాయని ఈధి తెలిపారు. వడగాడ్పుల కారణంగానే వీరంతా మరణించి ఉంటారన్నారు. మంగళవారం135 మృతదేహాలు, సోమవారం 128 మృతదేహాలు తమకు లభ్యమయ్యాయని అన్నారు. ఈధి ట్రస్ట్ పాకిస్తాన్లో పేదలు, నిరాశ్రయులు, అనాథ వీధి పిల్లలు, బాధిత మహిళలకు సేవలను అందిస్తుంటుంది. -
సిక్కింలో వర్ష బీభత్సం.. చిక్కుకుపోయిన పర్యాటకులు
సిక్కింలో వర్ష బీభత్సం నెలకొంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పర్యాటకులు పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. బుధవారం రాత్రి ఉత్తర సిక్కింలో 220 మి.మీకు మించిన వర్షం కురిసింది. దీంతో తీస్తాలో వరదలు సంభవించాయి. ఫలితంగా ఈ ప్రాంతంలో 1,200 మందికి పైగా స్వదేశీ, విదేశీ పర్యాటకులు చిక్కుకుపోయారు. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. తీస్తా నదిలో నీటిమట్టం పెరగడంతో ఒడ్డున ఉన్న ఇళ్లలోకి భారీగా నీరు చేరింది.వాతావరణం అనుకూలించిన అనంతరం పర్యాటకులను ఇక్కడి నుంచి తరలించే ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. రోడ్డు మరమ్మతులకు ఐదు నుంచి ఆరు రోజులు పట్టవచ్చని సమాచారం. ఉత్తర సిక్కింలో శుక్రవారం కూడా భారీ వర్షం నమోదయ్యింది. ఈ విపత్తు బారిన పడి మృతిచెందినవారి సంఖ్య ఆరుకు చేరింది. గురువారం ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ముగ్గురు గల్లంతయ్యారు.సిక్కింలోని సంక్లాంగ్ ప్రాంతంలో వంతెన కొట్టుకుపోవడంతో చుంగ్తాంగ్, లాచుంగ్ ప్రాంతాల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ విపత్తు పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. బాధిత ప్రాంతాలకు సంబంధించిన పరిస్థితులపై సమాచారం సేకరించి, సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో చిక్కుకుపోయిన పర్యాటకులను ప్రత్యేక విమానంలో తరలించేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయ్ భూషణ్ పాఠక్ తెలిపారు. #WATCH | One person dead, five missing and houses damaged due to heavy rain in Mangan, Sikkim (Video source: SSP Mangan) pic.twitter.com/lo7iD8tAFH— ANI (@ANI) June 13, 2024 -
‘మధ్యాహ్నం 12 నుంచి 3 వరకూ బయటికెళ్లొద్దు’
ఢిల్లీ-ఎన్సీఆర్తో సహా ఉత్తర భారతదేశం అంతటా వేడిగాలులుల వీస్తున్నాయి. మరికొద్ది రోజుల పాటు ఢిల్లీలో వేడిగాలులు విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం మే 28 వరకు ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్‌లలో వేడిగాలుల ప్రభావం కనిపిస్తుంది. అలాగే జమ్మూ, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, మధ్య మహారాష్ట్ర, గుజరాత్‌లలోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి.వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం గడచిన శనివారం ఢిల్లీలో ఉష్ణోగ్రత 46.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది. ఇది సాధారణం కంటే 7 డిగ్రీల అధికం. రానున్న నాలుగు రోజుల్లో ఢిల్లీ ఎన్సీఆర్తో సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో వేడిగాలుల వీయనున్న కారణంగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.మే 28 వరకు రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్‌లలో రాత్రిపూట అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దేశంలోని పలు ప్రాంతాల్లో వేడిగాలులు వీయనున్న దృష్ట్యా ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఇళ్లలోనే ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఆ సమయంలో వేడిగాలులు ఉధృతంగా ఉంటాయని, వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు ఇంట్లోనే ఉండడం ఉత్తమమని సలహా ఇచ్చింది. -
ఇండోనేషియాలో భారీ వరదలు.. 14 మంది మృతి!
భారీ వరదలు, విరిగిపడిన కొండచరియలు ఇండోనేషియాలో విధ్వంసం సృష్టించాయి. ఇక్కడి సులవేసి దీవిలో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 14 మంది మృతి చెందారు. వివిధ ఘటనల్లో పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.అక్కడి అధికారులు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం దక్షిణ సులవేసి ప్రావిన్స్‌లోని లువు జిల్లాలో గురువారం నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఇండోనేషియాలో ఇప్పటి వరకు 13 జిల్లాలు వరదల బారిన పడ్డాయి. సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ రబ్బరు పడవలు, ఇతర వాహనాలను ఉపయోగించి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 100 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రతినిధి అబ్దుల్ ముహారి తెలిపారు.ఇండోనేషియా కంటే ముందు బ్రెజిల్లో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో దక్షిణ రాష్ట్రం రియో గ్రాండే దో సుల్లో 37 మంది మృతి చెందారు. అల్ జజీరా నివేదిక ప్రకారం విపత్తు కారణంగా మరణించిన వారి సంఖ్య 37. 74 మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో వర్షాలు, కొండచరియలు విరిగిపడడంతో జన జీవనం అస్తవ్యస్తమయ్యింది. కూలిన ఇళ్లు, వంతెనలు, రోడ్ల శిథిలాల మధ్య చిక్కుకున్న బాధితులను అదుకునేందుకు ప్రభుత్వం సహాయ చర్యలను ముమ్మరం చేసింది.ఇటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గవర్నర్ ఎడ్వర్డో లైట్ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రెసిడెంట్ లూయిస్ ఇనాసియో ప్రభావిత ప్రాంతాలకు సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. -
యూరప్ దేశాలను వణికిస్తున్న పారెట్ ఫీవర్
యూరప్‌లోని అనేక దేశాల్లో పారెట్ ఫీవర్ విజృంభిస్తోంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకూ ఐదుగురు మృతి చెందారు. పారెట్ ఫీవర్‌ను సిటాకోసిస్ అని కూడా అంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పారెట్ ఫీవర్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే హెచ్చరించింది. యూరప్ దేశాల్లో నివసించే వారిపై పారెట్ ఫీవర్ తీవ్ర ప్రభావం చూపుతోంది. 2023 ప్రారంభంలో విధ్వంసం సృష్టించిన ఈ వ్యాధి.. ఇప్పుడు 2024 ప్రారంభంలో ఐదుగురి ప్రాణాలను బలిగొంది. గత ఏడాది ఆస్ట్రియాలో 14 పారెట్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 27 నాటికి డెన్మార్క్‌లో ఈ అంటువ్యాధికి సంబంధించిన 23 కేసులు నిర్ధారితమయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. డెన్మార్క్‌లో ఒక వ్యక్తిలో ఈ వ్యాధి కనిపించింది. ఈ ఏడాది ఇప్పటికే జర్మనీలో ఐదు కేసులు నమోదయ్యాయి. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపిన వివరాల ప్రకారం పెంపుడు జంతువులు లేదా అడవి పక్షులతో అనుబంధం కలిగిన వారే అధికంగా ఈ వ్యాధి బారి పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. పారెట్ ఫీవర్ అనేది క్లామిడియా ఇన్ఫెక్షన్ కారణంగా వస్తుంది. ఇది వివిధ రకాల అడవి జంతువులు, పెంపుడు పక్షులు, కోళ్లలో కనిపిస్తుంది. ఈ వ్యాధి సోకిన పక్షులు అనారోగ్యంగా కనిపించకపోవచ్చు. కానీ అవి శ్వాస లేదా మలవిసర్జన చేసినప్పుడు బ్యాక్టీరియాను విడుదల చేస్తాయి. ఇదే వ్యాధి వ్యాప్తి చెందడానికి కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోనే రెండవ చిన్న ఖండమైన యూరప్‌లో 50 వరకూ సర్వసత్తాక దేశాలు ఉన్నాయి. -
‘బంగ్లా’లో డెంగ్యూ విధ్వంసం.. వెయ్యి దాటిన మృతులు!
మన పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో డెంగ్యూ విధ్వంసం సృష్టిస్తోంది. ఈ ఏడాది బంగ్లాదేశ్‌లో డెంగ్యూ బారిన పడి 1000 మందికి పైగా మరణించగా, రెండు లక్షల మందికి పైగా ప్రజలు ఈ వ్యాధి బారిన పడ్డారు. అల్ జజీరా నివేదిక తెలిపిన వివరాల ప్రకారం బంగ్లాదేశ్‌లో 2023లో డెంగ్యూ జ్వరం కారణంగా 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాదికంటే ఈ సంఖ్య దాదాపు నాలుగు రెట్లు ఎక్కువని ఆ నివేదిక పేర్కొంది. 2023 మొదటి తొమ్మిది నెలల్లో (జనవరి నుండి సెప్టెంబర్ వరకు) కనీసం 1,017 మంది మరణించారని నివేదిక పేర్కొంది. దాదాపు 2,09,000 మంది వ్యాధి బారిన పడ్డారు. వీరిలో 2000 మంది రోగులు రెండోసారి ఈ వ్యాధి బారిన పడ్డారు. మరణించిన వారిలో ఎక్కువ మంది 15 ఏళ్లలోపు వారే ఉండటం విశేషం. బంగ్లాదేశ్‌లోని పలు ఆసుపత్రులు డెంగ్యూ బాధితులతో నిండిపోయాయి. మరోవైపు బాధితులకు సరైన వైద్యం అందడం లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. జనసాంద్రత అధికంగా ఉన్నఈ దక్షిణాసియా దేశంలో డెంగ్యూ వేగంగా విస్తరిస్తోంది. డెంగ్యూ అనేది ఉష్ణమండల ప్రాంతాలలో కనిపించే వ్యాధి. అధిక జ్వరం, తలనొప్పి, వికారం, వాంతులు, కండరాల నొప్పి, రక్తస్రావం మొదలైనవి ఈ వ్యాధి లక్షణాలు. వాతావరణ మార్పుల వల్ల డెంగ్యూ, చికున్‌గున్యా, ఎల్లో ఫీవర్, జికా వంటి దోమల వల్ల వచ్చే వైరస్లు వేగంగా వ్యాప్తి చెందుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. డెంగ్యూ వ్యాధికి ప్రత్యేకంగా చికిత్స అందించే టీకా లేదా మందు ఇంతవరకూ అందుబాటులో లేదు. డెంగ్యూని వ్యాప్తి చేసే ఏడిస్ ఈజిప్టి దోమ నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో వృద్ధి చెందుతుంది. అందుకే మన ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. ఇది కూడా చదవండి: అమెజాన్‌లో వందల డాల్ఫిన్ల మృతదేహాలు ఎందుకు తేలుతున్నాయి? -
విజయవాడ బెంజి సర్కిల్ లో ప్రమాదం
-
దూసుకొస్తున్న రాయ్ తుఫాన్! 8 ప్రాంతాల్లో హై అలర్ట్..
Rai Typhoon Update: ఫిలిప్పీన్స్ దేశానికి మధ్య, దక్షిణ భాగాల వైపు సూపర్ టైఫూన్ వేగంగా కదులుతోంది. రానున్న రోజుల్లో ఈదురు గాలుల్తోపాటు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు, ఇది ఈ ఏడాది దేశాన్ని తాకిన 50వ తుఫాను మాత్రమేకాకుండా అత్యంత శక్తివంతమైన తుఫానుగా వాతావరణ శాఖ పేర్కొంది. తుఫాను కారణంగా ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు ఇప్పటికే వేలాది మంది ప్రజలను ఆ దేశ ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. చాలా మంది ప్రజలు భయంతో ఇళ్లను వదిలి వెళ్లిపోయారు కూడా. సూపర్ టైఫూన్‌గా అమెరికా ప్రకటన కాగా ఫిలిప్పీన్స్ వైపు దూసుకుపోతున్న రాయ్ టైఫూన్‌ను అమెరికా నేవీ జాయింట్ టైఫూన్ వార్నింగ్ సెంటర్ ‘సూపర్ టైఫూన్'గా అభివర్ణించింది. దేశంలో ఈ యేడాది సంభవించిన తుఫానుల్లో ఇది అత్యంత శక్తివంతమైన తుఫానుగా మారబోతోందని తెల్పింది. గంటకు 185 కి.మీ వేగంతో.. ఫిలిప్పీన్స్‌లో రాయ్ హరికేన్ 185 కి.మీ వేగంతో కదులుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. విపత్తు నిర్వహణ బృందం అన్ని నౌకలను ఓడరేవులో ఉంచాలని కోరింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రం వైపు వెళ్లవద్దని హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో హై అలర్ట్ నివేదికల ప్రకారం.. ఫిలిప్పీన్స్‌లోని 8 ప్రాంతాల్లో అత్యవసర సన్నాహాలు పూర్తయ్యాయి. దీంతో అన్ని ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. టైఫూన్ కారణంగా పసిఫిక్ మహాసముద్రం సమీప ప్రాంతాల్లోని సుమారు 98,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఐతే 8 ప్రభావిత ప్రాంతాల్లో 30 మిలియన్ల మంది నివసిస్తున్నారు. ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాలు విసాయా - మిండనావో ఐలాండ్ల మధ్య ఉన్నాయి. విమానాలు, ఓడరేవులు పూర్తిగా మూసివేయబడ్డాయి తుఫాను సమయంలో, ఆ తర్వాత కూడా దేశవ్యాప్తంగా భారీ వర్షం, బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నట్లు సమాచారం. పలు ప్రాంతాల్లో వరద ముప్పు పొంచి ఉన్నట్లు ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. ఈ ఘోర విపత్తు దృష్ట్యా ఫిలిప్పీన్స్‌కు వెళ్లే అన్ని విమానాలు రద్దు చేయబడ్డాయి. అన్ని పోర్టులు తాత్కాలికంగా మూసివేయబడ్డాయి. చదవండి: పచ్చనికాపురంలో చిచ్చురేపిన అనుమానం! భార్యను హతమార్చి భర్త ఆత్మహత్య.. -
దిల్‌సుఖ్‌నగర్‌లో కారు బీభత్సం
-
దేవరకొండలో దొంగల బీభత్సం
దేవరకొండ(నల్లగొండ): నల్లగొండ జిల్లా దేవరకొండలో దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టణంలోని బీఎన్ఆర్ కాలనీ, హనుమాన్‌నగర్‌లో శుక్రవారం రాత్రి దొంగలు హల్చల్ చేశారు. బీఎన్ ఆర్ కాలనీలోని ఓ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు రూ. 1.70 లక్షల నగలు ఎత్తుకెళ్లారు. మరో ఇంట్లో కూతురి పెళ్లి కోసం దాచి ఉంచుకున్న 6 తులాల బంగారు ఆభరణాలు దొంగలించుకెళ్లారు. హనుమాన్‌నగర్‌లో తాళం వేసి ఉన్న ఇంట్లో నుంచి బీరువా ఎత్తుకెళ్లి.. సమీప అటవీ ప్రాంతంలో దాన్ని పగలగొట్టి విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
యూపీలో వర్ష బీభత్సం
-
చైనాలో వరద బీభత్సం...
-
లంకలో వరద విలయం
-
స్కూల్‌బస్సు బీభత్సం
-
బీహార్ దొంగల బీభత్సం
భీమవరం అర్బన్ :భీమవరంలో బీహార్ దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టుకోవడానికి ప్రయత్నించిన స్థానికులు, పోలీసులపై నాటుతుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ధైర్యంతో ముందుకు దూకిన పాలకోడేరు కానిస్టేబుల్ వై.వెంకటేశ్వరరావు వెంట్రుక వాసిలో బుల్లెట్ నుంచి తప్పించుకున్నాడు. తుపాకీ కాల్పుల శబ్దాలకు ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు ఒక దొంగ పోలీసులకు చిక్కగా, మరో ఇద్దరు పరారయ్యారు. అప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారమందించి అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలతో స్థానిక పోలీసులు భీమవరం సరిహద్దుల్లో మోహరించి, వాహనాల తనిఖీ ప్రారంభించారు. వివరాలు ఇవి.. విజయవాడకు చెందిన విస్సంశెట్టి కనకదుర్గ అనే 65 ఏళ్ల వృద్ధురాలు స్థానిక కారుమూరి వారి వీధిలో నివసిస్తున్న తన కుమారుడు గోపాలకృష్ణ ఇంటికి వచ్చారు. ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో మావుళ్లమ్మ ఆలయానికి ఒంటరిగా వెళ్లి వస్తూ మధ్యతో తటవర్తి వారి వీధిలో చెరుకురసం తాగేందుకు ఆగాడు. బీహార్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చి చెరుకురసం తాగారు. కనకదుర్గ అక్కడ నుంచి సమీపంలోని తన కుమారుని ఇంటికి బయలుదేరడంతో ఆమె వెనుకనే వచ్చిన వారు అదను చూసి ఆమె మెడలోని బంగారు గొలుసును తెంచుకుని పరారయ్యారు. దీంతో కిందపడిన కనకదుర్గ కేకలు వేయడంతో స్థానికులు విషయం తెలుసుకుని బైక్‌ను వెంబడించారు. నాచువారి సెంటర్ వద్ద వారు కనిపించడంతో స్థానికులు పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఇంతలో అటునుంచి వస్తున్న పాలకోడేరు పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు కూడా వారిని వెంబడించాడు. మరో వైపు వన్‌టౌన్ పోలీసులు కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఇద్దరు దొంగలు బైక్‌పై పరార్ కాగా ఒకడు పరుగు తీశాడు. బీవీ రాజు మునిసిపల్ పార్క్ సమీపంలోని పావని గార్మెంట్స్ రోడ్లో అతను పరిగెత్తటంతో వెంబడించిన స్థానికులను దగ్గరకు రావద్దంటూ హెచ్చరించాడు. అయినా కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు, స్థానికులు వెంటపడ్డారు. తన వద్ద ఉన్న నాటుతుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపిపాడు. ఒక బుల్లెట్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు తలపక్కగా దూసుకువెళ్లింది. అప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై విజయకుమార్, సిబ్బంది, పోలీసులు కూడా తోడు కావడంతో ధైర్యం చేసి దొంగను పట్టుకోగలిగారు. అతడిన వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి వివరాలు సేకరిస్తున్నారు. టౌటౌన్ సీఐ జయసూర్య స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. బీహార్ నుంచి ఎంతమంది వచ్చారు, తప్పించుకున్న వారు ఎక్కడికి వెళ్ళారు తదితర వివరాలను చెప్పించే ప్రయత్నం సీఐ జయసూర్య చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న నరసాపురం డీఎస్సీ రఘువీరారెడ్డి హుటాహుటిన భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. నిందితుడు బీహార్‌కు చెందినవాడైనప్పటికీ తెలుగులో మాట్లాడుతున్నాడు. దీంతో చాలా కాలంగా నిందితులు ఈ ప్రాంతంలోనే నివశిస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దొంగలు తుపాకీతో కాల్పులు జరపడం ఈ ప్రాంతంలో సంచలనం కలిగించింది. -
చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం.
-
కాళ్లూ చేతులు కట్టేసి మహిళ దారుణ హత్య
కాళ్లూ చేతులు కట్టేసి మహిళ దారుణ హత్య 60 తులాల బంగారం అపహరణ లంగర్‌హౌస్: దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను కాళ్లు, చేతులు కట్టేసి కిరాతకంగా హత్య చేశారు. ఇళ్లంతా లూఠీ చేశారు. 60 తులాల బంగారు నగలు, ఒకటిన్నర కిలోల వెండి ఆభరణాలతో పాటు విలువైన వస్తువులను దోచుకుపోయారు. ఈ దారుణ సంఘటన బుధవారం లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఒంగోలు జిల్లాకు చెందిన సత్యనారాయణ, లక్ష్మీ తులసి దంపతులు నగరంలోని లంగర్‌హౌస్ ఓంనగర్‌లో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఒక కుమార్తె అమెరికాలో, మరో కుమార్తె బాచ్‌పల్లిలో ఉంటున్నారు. సత్యనారాయణ కూకట్పల్లి జేఎన్టీయూలో ఫ్రొఫెసర్‌గా పనిచేశారు. ఉద్యోగ విరమణ తర్వాత బంజారహిల్స్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో లైబ్రేరియన్‌గా పని చేస్తున్నారు. ఆయన బుధవారం ఉదయం 10 గంటలకు విధులకువెళ్లి తిరిగి సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చారు. ఇంటి ప్రధాన ద్వారం బయట గడియ పెట్టి ఉండడంతో తలుపులు తెరుచుకొని లోపలికి వెళ్లారు. ల్యాప్‌టాప్, ఐప్యాడ్ కనిపించలేదు. లోపల గదుల్లోకి వె ళ్లి పరిశీలించగా, బీరువా విరగ్గొట్టి ఉండడంతో పాటు వస్తువులు చిందర వందరగా పడి ఉన్నాయి. రక్తం మడుగులో ఉన్న భార్యను చూసి హతాశులయ్యారు. దుండగులు లక్ష్మీతులసి కాళ్లు, చేతులను దుస్తులతో కట్టివేసి దారుణంగా హత్యచేశారు. తలపై బలమైన గాయాలయ్యాయి. మెడ, గొంతుపై కత్తి గాట్లు ఉన్నాయి. ఆమె ఛాతి, కడుపులో కత్తితో పొడిచారు. భారీ దోపిడీ ఇంట్లో ఒంటరిగా ఉన్న లక్ష్మీతులసిని హత్య చేసిన దుండగులు బీరువాలోని 60 తులాల బంగారు, ఒకటిన్నర కిలోల వెండి ఆభరణాలను అపహరించుకుపోయారు. ఖరీదైన ల్యాప్‌టాప్, ఐపాడ్లతో పాటు విలువైన వస్తువులు, నగదును ఎత్తుకెళ్లినట్లు సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన తీరును పరిశీలిస్తే దుండగులు ఇంట్లో చాలా సమయం గడిపినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి ఒంటిపై ఉన్న నగలు మాత్రం అలాగే ఉండడం గమనార్హం. హత్య, దోపిడీకి పాల్పడింది తెలిసిన వారిపనేనా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. జనవరి నెలలోనూ వీరి ఇంట్లో దొంగతనం జరిగింది. అప్పుడు లక్ష్మీతులసి టీవీ చూస్తుండగా ఆ గదికి గడియ పెట్టిన దొంగలు ఇంట్లోని డాలర్లు, విలువైన వస్తువులను అపహరించుకుపోయారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సంఘటన తర్వాత ఇంటికి ఎవరు వచ్చినా తెలిసిన వారు అయితేనే తలుపులు తెరిచే వారని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. మధ్యాహ్నం మంచి నీరు పట్టుకోవడానికి మాత్రమే ఆమె బయటికి వ చ్చేదని అంటున్నారు. సంఘటనకు ముందు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో స్థానికులతో మాట్లాడిందని తెలిసింది. సమయం చూసుకుని దుండగులు ఈ దురాగతానికి పాల్పడినట్టు తెలుస్తోంది. దుండగులు పక్కాగా రెక్కీ నిర్వహించినట్టు తెలుస్తోంది. నాలుగు రోజులు కిందట ఓ మహిళ వీరి ఇంటి ప్రాంగణంలోని ప్రహరీ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో స్థానికులు నిలదీశారు. తన పేరు సుల్తానా అని, సత్యనారాయణ ఇంట్లో పనిమనిషిగా చేరానని చెప్పి వెళ్లి పోయింది. బుధవారం మధ్యాహ్నం నలుగురు వ్యక్తులు ఇద్దరిద్దరుగా కాలనీలో సంచరించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కొత్తగా కనిపించిన ఇద్దరిని అడుగగా తమకు ఒక ఇంటి చిరునామా కావాలంటూ వెళ్లిపోగా, మరో ఇద్దరు విద్యుత్ శాఖ నుంచి వచ్చామని తెలిపారు. రెండు నెలల కిందట పనిమనిషి మానేసిందని, తర్వాత ఎవరినీ నియమించలేదని సత్యనారాయణ తెలిపారు. దీంతో నాలుగు రోజులు కిందట సంచరించిన మహిళతో పాటు, ఈ రోజు వీధిలో అనుమానంగా సంచరించిన వారిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ మండల డీసీపీ సత్యనారాయణ, సీసీఎస్ డీసీపీ పాల్, అదనపు డీసీపీ కె.ఆర్.నాగరాజు, ఆసిఫ్‌నగర్ ఏసీపీ డి.శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ ఎన్.బి.రత్నం సంఘటన స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించారు. క్లూస్‌టీం రంగంలోకి దిగి ఆధారాలను సేకరించింది. డాగ్ స్క్వాడ్‌ను తీసుకురాగా ఇంటి పరిసరాల్లో పలుమార్లు తిరిగి ఆ ఇంట్లోకే వెళ్లింది. -
కళింగపట్నం పోర్ట్ లో 7వ నెంబర్ ప్రమాద హెచ్చరిక
విశాఖ : హుదూద్ తుఫాను నేపథ్యంలో ప్రధాన ఓడరేవుల్లో హై-అలర్ట్ ప్రకటించారు. కళింగపట్నం, గంగవరం ఓడరేవుల్లో శనివారం 7వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాకినాడ, మచిలీపట్నం పోర్ట్ల్లో అయిదో నెంబర్, కృష్ణపట్నం, నిజాంపట్నం ఓడరేవుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక సూచికలను ఎగురవేశారు. ఓడ రేవుల్లో మొత్తం 11వ నెంబర్ వరకూ ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తారు. సాధారంగా అయిదో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ అయితేనే తుఫాను ప్రభావం భారీగా ఉన్నట్లు లెక్క. ఇక 11వ నెంబర్ జారీ అయితే మొత్తం సమాచార వ్యవస్థే స్తంభించిపోతుంది. -
భారీ విధ్వంసం తప్పదు
విపరీతమైన వేగంతో దూసుకొస్తున్న హుదూద్ తుఫాను భారీ విధ్వంసం సృష్టించక తప్పదని జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం ఉదయం వరకు విశాఖ వైపు కదిలిన తుఫాను.. ఆ తర్వాత ఉత్తరంవైపు.. అంటే శ్రీకాకుళం వైపు పయనిస్తున్నట్లు అధికారులు చెప్పారు. వాస్తవానికి ఆదివారం మధ్యాహ్నం తర్వాత తీరం దాటుతుందని అనుకున్నా, దానికంటే మూడు గంటల ముందే తీరాన్ని తాకొచ్చని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాకు విస్తారంగా 192 కిలోమీటర్ల సముద్రతీరం ఉంది. ఇక్కడ ప్రభావం ఎక్కువ ఉంటుందని చెప్పడంతో.. 11 మండలాలు, 231 గ్రామాలకు చెందిన అందరినీ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయంటున్నారు. ఈ సమయంలో ప్రజలెవరూ బయట తిరగొద్దని స్పష్టం చేశారు. రేకులు పైకి ఎగిరిపడతాయని, అందువల్ల గాయాల పాలయ్యే అవకాశం ఉందని తెలిపారు. కిటికీలు, తలుపులు వేసుకోవాలని, ఏ పని ఉన్నా బయటకు రావద్దని హెచ్చరించారు. పూరిళ్లలో కూడా ఉండొద్దన్నారు. మట్టిగోడల ఇంట్లో ఎవరైనా ఉంటే బలవంతంగానైనా వారిని తరలించాలని కలెక్టర్ చెప్పారు. వాస్తవానికి లోతట్టు ప్రాంతాలు, తీరప్రాంతాల్లో ఉన్న ప్రజలను శనివారం రాత్రి తరలించాలని అనుకున్నారు. కానీ తుఫాను ముందుగానే వస్తోంది కాబట్టి వెంటనే అప్రమత్తం కావాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఇతర అధికారులు హెచ్చరించారు. దాంతో అందరినీ వెంటనే అక్కడినుంచి తరలించేస్తున్నారు. పోలీసు స్టేషన్లలో అదనపు సిబ్బందిని మోహరించారు. తుఫాను తీరం దాటిన తర్వాత కూడా అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే జరిగితే నాగావళి, వంశధార నదులకు వరద వచ్చే ప్రమాదం ఉంది. ఆయా నదీ పరివాహక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవాళ్లను ఎత్తయిన ప్రాంతాలకు తరలిస్తున్నారు. -
అగంతకుల బీభత్సం
హుజూరాబాద్ : తాళం వేసి ఉన్న ఇంట్లోకి గుర్తుతెలియని అగంతకులు చొరబడి నానా బీభత్సం సృష్టించి న సంఘటన హుజూరాబాద్ కాకతీయ కాలనీ లో మంగళవారం చోటుచేసుకుంది. పట్టణంలో సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధిం చిన వివరాలిలా ఉన్నాయి. పూల్గం రాజయ్య అనే రిటైర్డ్ ఉద్యోగి కాకతీయకాలనీలో నివాసముంటున్నాడు. ఆయన కుమారుడు పూల్గం సతీశ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. సతీశ్‌కు హైదరాబాద్‌లో కిడ్నీ ఆపరేషన్‌కాగా కుటుంబసభ్యులంతా మూడురోజులక్రితం అక్కడకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది అగంతకులు ఆ ఇంట్లోకి చొరబడి బీభత్సం సృష్టించారు. దుస్తులు, వస్తువుల దహనం దుండగులు బీరువాలను పగులగొట్టగా నగదు, ఆభరణాలు, విలువైన వస్తువులు లభించలేదు. ఇంట్లోని కంప్యూటర్ను ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో బీరువాలోని దుస్తులు, మంచాలు, ఇతర ఫర్నిచర్‌కు నిప్పంటించారు. దీంతో దుస్తులు, వస్తువులన్నీ బూడిదగా మారాయి. ఇంట్లో నుంచి పొగలు రావడంతో స్థానికులు గమనించి తలుపులు తీయడంతో ఇంట్లో ఎవరూ లేరు. వెంటనే మంటలు ఆర్పివేసి పోలీసులకు సమాచారమిచ్చారు. చంపుతామంటూ గోడలపై రాతలు వస్తువులను దహనం చేయగా ఇంటిగోడలన్నీ నల్లగా మసిబారాయి. ఈ గోడలపై ‘మిమ్మల్ని చంపుతా’ అంటూ పలుచోట్ల బెదిరింపు రాతలు రాశారు. అయితే ఇటీవలికాలంలో దొంగల బెడ ద ఎక్కువకావడంతో ఈ సంఘటనకు పాల్పడింది దొంగలా? లేక ఈ కుటుంబంతో శత్రుత్వం ఉన్నవారు ఎవరైనా చేశారా? అనే కోణం లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని సీఐ శ్రీనివాస్ చెప్పారు. -
గజరాజుల బీభత్సం
రైతును తొక్కి చంపి వేసిన ఏనుగుల మంద రైతు మృతదేహంతో అటవీశాఖ కార్యాలయం వద్ద గ్రామస్తుల ఆందోళన ఫర్నీచర్ ధ్వంసం హొసూరు: క్రిష్ణగిరి జిల్లాలో గజ సమూహం బీభత్సం సృష్టించింది. దాదాపు 30 ఏనుగులు పంటలను తొక్కి ధ్వంసం చేయడంతోపాటు మునియప్పన్ కొటాయ్ గ్రామానికి చెందిన రైతును పొట్టనబెట్టుకున్నాయి. ఈ ఘటనను జీర్ణించుకోలేని రైతులు అటవీ శాఖ కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు. బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. క్రిష్ణగిరి తాలూకా, మహారాజగడ ప్రాంతంలో సంచరిస్తున్న గజరాజులు బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో గుంపులుగా విడిపోయాయి. ఓ మంద మునియప్పన్ కొటాయ్ గ్రామం వద్దకు చేరుకున్నాయి. దీంతో గ్రామస్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. అనంతరం ఏనుగులు పొలాల్లోకి చొరబడి టమాట, రాగి, వరి, పంటలను తొక్కి ధ్వంసం చేశాయి. దీంతో రైతులు దివిటీలు వెలిగించి, టపాకాయలు పేల్చి ఏనుగులను తరిమేందుకు ప్రయత్నించగా తిరగబడ్డాయి. ఈ క్రమంలో పారిపోయేందుకు యత్నించి విఫలమైన మునియప్పన్కొటాయ్ గ్రామానికి చెందిన చిన్నపయ్యన్ (55)ను ఏనుగులు తొక్కివేసి వెళ్లిపోయాయి. రాత్రి 10.30 గంటలకు రైతులు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా చిన్నప్పయ్యన్ విగతజీవిగా కనిపించాడు. ఎనుగుల దాడులను అరికట్టడంలో అటవీఅధికారులు విఫలం చెందినందువల్లే ఈ ఘటన చోటు చేసుకుందని ఆరోపిస్తూ రైతులు దాదాపు 300 మంది క్రిష్ణగిరి -కుప్పం రహదారి పక్కన ఉన్న అటవీశాఖ కార్యాలయం వద్దకు వెళ్లి చిన్నప్పయ్యన్ మృతదేహంతో ఆందోళనకు పూనుకున్నారు. కార్యాలయ తాళాలు పగులగొట్టి లోపలకు చొరబడి కుర్చీలు, బల్లలు ధ్వంసం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకొన్నిష్ణగిరి ఆర్డీఓ శాంతి, క్రిష్ణగిరి డీఎస్పీ రాజేంద్రన్, సీఐలు శేఖర్, తంగవేలు వారితో చర్చించి ఆందోళనను విరమింప చేశారు. తర్వాత రైతు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
అకాల వర్షం,అపార నష్టం
-
బలపడీన అల్పపీడనం