అగంతకుల బీభత్సం | Helps havoc | Sakshi
Sakshi News home page

అగంతకుల బీభత్సం

Published Wed, Oct 8 2014 3:15 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 PM

అగంతకుల బీభత్సం

అగంతకుల బీభత్సం

హుజూరాబాద్ :
 తాళం వేసి ఉన్న ఇంట్లోకి గుర్తుతెలియని అగంతకులు చొరబడి నానా బీభత్సం సృష్టించి న సంఘటన హుజూరాబాద్ కాకతీయ కాలనీ లో మంగళవారం చోటుచేసుకుంది. పట్టణంలో సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధిం చిన వివరాలిలా ఉన్నాయి. పూల్గం రాజయ్య అనే రిటైర్డ్ ఉద్యోగి కాకతీయకాలనీలో నివాసముంటున్నాడు. ఆయన కుమారుడు పూల్గం సతీశ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. సతీశ్‌కు హైదరాబాద్‌లో కిడ్నీ ఆపరేషన్‌కాగా కుటుంబసభ్యులంతా మూడురోజులక్రితం అక్కడకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది అగంతకులు ఆ ఇంట్లోకి చొరబడి బీభత్సం సృష్టించారు.

 దుస్తులు, వస్తువుల దహనం
 దుండగులు బీరువాలను పగులగొట్టగా నగదు, ఆభరణాలు, విలువైన వస్తువులు లభించలేదు. ఇంట్లోని కంప్యూటర్‌ను ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో బీరువాలోని దుస్తులు, మంచాలు, ఇతర ఫర్నిచర్‌కు నిప్పంటించారు. దీంతో దుస్తులు, వస్తువులన్నీ బూడిదగా మారాయి. ఇంట్లో నుంచి పొగలు రావడంతో స్థానికులు గమనించి తలుపులు తీయడంతో ఇంట్లో ఎవరూ లేరు. వెంటనే మంటలు ఆర్పివేసి పోలీసులకు సమాచారమిచ్చారు.

 చంపుతామంటూ గోడలపై రాతలు
 వస్తువులను దహనం చేయగా ఇంటిగోడలన్నీ నల్లగా మసిబారాయి. ఈ గోడలపై ‘మిమ్మల్ని చంపుతా’ అంటూ పలుచోట్ల బెదిరింపు రాతలు రాశారు. అయితే ఇటీవలికాలంలో దొంగల బెడ ద ఎక్కువకావడంతో ఈ సంఘటనకు పాల్పడింది దొంగలా? లేక ఈ కుటుంబంతో శత్రుత్వం ఉన్నవారు ఎవరైనా చేశారా? అనే కోణం లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని సీఐ శ్రీనివాస్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement