ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ గాజాపై వరుస దాడులకు తెగబడుతూనే ఉంది. తాజాగా దక్షిణ గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 36 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. గాజా పూర్తిగా ధ్వంసం అయినప్పటికీ, ఇజ్రాయెల్ సైన్యం తన దాడులను ఇంకా ఆపడం లేదు.
తాజాగా ఇజ్రాయెల్ దక్షిణ గాజా స్ట్రిప్‌లో ఏకకాలంలో పలు వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 36 మందికిపైగా పాలస్తీనియన్లు మృతిచెందారు. గాజా ఆరోగ్య శాఖ అధికారులు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలిపారు. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఖాన్ యూనిస్ నగరంలో ఇద్దరు పిల్లలతో సహా ఒక కుటుంబంలోని 11 మంది సభ్యులు మృతిచెందారని నాసర్ ఆస్పత్రి అధికారులు తెలిపారు. ఖాన్ యునిస్‌తో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో మూడు వేర్వేరు దాడుల్లో 33 మంది మృతిచెందారని, వారి మృతదేహాలను ఆసుపత్రికి తీసుకువచ్చారని తెలిపారు.
ఖాన్ యూనిస్‌కు దక్షిణంగా ఉన్న రహదారిపై జరిగిన దాడిలో మరో పదిహేడు మంది మృతిచెందారని నాసర్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 2023, అక్టోబర్ 7న గాజాలో యుద్ధం ప్రారంభమైంది. హమాస్‌తో పాటు మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో దాదాపు 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతిచెందారు. నాటి నుంచి ఇజ్రాయెల్ ప్రతీకారదాడులు చేస్తూ వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment