గాజా: యుద్ధంలో సర్వస్వం కోల్పోయిన పాలస్తీనా శరణార్థులకు సాయం చేసేందుకు వెళ్లిన ఐక్యరాజ్య సమితి(యునైటెడ్ నేషన్స్) బృందానికి చెందిన కాన్వాయ్‌పై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరిపింది. కాన్వాయ్ గాజా వెళ్లి తిరిగి వస్తుండగా ఈ కాల్పులు జరిగాయి. అయితే ఈ కాల్పుల్లో ఎవరూ మృతి చెందలేదని యూఎన్ అధికారులు తెలిపారు.
‘ఉత్తర గాజాలో సహాయక చర్యల కోసం వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో మా కాన్వాయ్‌పై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరిగింది. సైన్యం చెప్పిన రూట్లోనే మేం ప్రయాణిస్తున్నాం. ఈ కాల్పుల్లో మా సిబ్బంది ఎవరూ గాయపడలేదు. అయితే ఒక వాహనం మాత్రం డ్యామేజ్ అయింది’ అని యూఎన్ బృందం డైరెక్టర్ ఎక్స్(ట్విటర్)లో తెలిపారు.
గాజా ప్రజలకు, వారికి సాయం చేయాలనుకున్న వారికి అసాధ్యమైన పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయని యూఎన్ హ్యుమానిటేరియన్ చీఫ్ మార్టిన్ గ్రిఫిత్‌ఎక్స్‌లో తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 7న పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడులు జరిగినప్పటి నుంచి గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా గాజాలోని కొంత భాగాన్ని కూడా ఇజ్రాయెల్ సైన్యం తన ఆధీనంలోకి తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment