జెరూసలెం: గతఏడాది అక్టోబర్7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ చేసిన దాడులకు సంబంధించి ఐక్యరాజ్యసమితి(యూఎన్) సంచలన విషయాలు వెల్లడించింది. అక్టోబర్ 7 దాడిలో ఇజ్రాయెల్‌పై దాడి సమయంలో అక్కడి మహిళలపై అత్యాచారాలు జరిగాయనేందుకు కచ్చితమైన, ఆధారలతో కూడిన సమాచారం ఉందని యుద్ధంలో జరిగిన లైంగిక దాడులపై యూఎన్ నియమించిన ప్రమీల పాటెన్ బృందం తేల్చింది.
హమాస్ బంధీలుగా తీసుకెళ్లిన ఇజ్రాయెల్ మహిళలపై ఇప్పటికీ అత్యాచారాలు జరుగుతున్నాయని యూఎన్ బృందం తన నివేదికలో తెలిపింది. ఫిబ్రవరిలో పాటెన్‌తో పాటు నిపుణుల బృందం ఇజ్రాయెల్, వెస్ట్‌బ్యాంక్‌లో పర్యటించారు. గాజా సరిహద్దులోని ఇజ్రాయెల్‌కు చెందిన మూడు ప్రాంతాలు నోవా మ్యూజిక్ ఫెస్టివల్ సైట్,రోడ్ 232, కిబుట్జ్ రెమ్‌లలో ఇజ్రాయెలీలపై రేప్‌లతో పాటు గ్యాంగ్ రేప్‌లు జరిగినట్లు రిపోర్టు వెల్లడించింది.
చాలా వరకు కేసుల్లో ముందు రేప్ చేసి తర్వాత హత్య చేశారని తెలిపింది. చనిపోయిన మహిళల మృతదేహాలపైన కూడా రెండు చోట్ల అత్యాచారాలు జరిగినట్లు ఐక్యరాజ్యసమితి బృందం తేల్చింది. ఈ అత్యాచారాలపై సాక్ష్యం చెప్పాల్సిందిగా బృందం కోరినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. అత్యాచార ఘటనలపై యూఎన్ బృందం సభ్యులు మొత్తం 5వేల ఫొటోలు, 50 గంటల సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించడంతో పాటు రేప్‌కు గురైన బాధితులతో మాట్లాడారు.
హమాస్ వద్ద బంధీలుగా ఉండి విడుదలైన వారిని పలువురిని ఇంటర్వ్యూ చేశారు. కాగా, అక్టోబర్ 7న ఇజజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాద సంస్థ మెరుపు దాడులు జరిపి వందల మంది ఇజ్రాయెల్ పౌరులను చంపి కొంత మందిని బంధీలుగా తమ వెంట తీసుకెళ్లింది. దీనికి ప్రతీకారంగా అప్పటి నుంచి ఇజ్రాయెల్ సైన్యం పాలస్తీనాపై భీకర దాడులు చేస్తోంది. గాజాను మొత్తం చిధ్రం చేసింది. అమెరికా కోరినప్పటికీ ఇజ్రాయెల్ దాడులు ఆపడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment