రమల్లా: గాజా డెత్ ప్లేస్‌గా మారిందని ఐక్యరాజ్య సమితి హ్యుమానిటేరియన్ చీఫ్ మార్టిన్ గ్రిఫిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ నిరంతర బాంబుదాడులతో గాజా ఇక నివాసానికి ఎంత మాత్రం అనుకూలమైన ప్రాంతం కాదని ఆయన చెప్పారు.
‘మూడు నెలల క్రితం అక్టోబర్ 7న గాజాకు చెందిన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులు చేసిన తర్వాత ఇజ్రాయెల్ ప్రతి దాడులు ప్రారంభించింది. అప్పటి నుంచి గాజా మరణ ప్రదేశంగా మారింది. ఇక్కడి ప్రజల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. వారు రోజూ భయంతో బతుకుతున్నారు.
ఈ దాడులను ఇజ్రాయెల్ వెంటనే ఆపేయాలని డిమాండ్ చేస్తున్నా. మానవత పునాదుల మీద జరుగుతున్న ఈ దాడులను రానున్న తరాలు కూడా మరిచిపోవు’ అని గ్రిఫిత్ అన్నారు.ఇజ్రాయెల్ దాడులతో ఇప్పటికే గాజా మొత్తం శిథిలాలతో నిండిపోయింది. గడిచిన 24 గంటల్లో గాజాలోని సుమారు 100 లక్ష్యాలపై ఇజ్రాయెల్ బలగాలు దాడులు చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment