హమాస్‌ను అంతం చేయటమే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దాడులను తీవ్రం చేస్తోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహకు రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ వార్ కేబినెట్ మంత్రి బెన్నీ గాంట్జ్ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు.
గాజాపై యుద్ధం చేయాలని దేశీయంగా వస్తున్న ఒత్తిడి కారణంగానే ఆయన నెతన్యాహు ప్రభుత్వం నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. యుద్ధం అనంతర ప్రణాళికను ప్రధాని నెతన్యాహు ఆమెదించపోవటం వల్లనే తాను రాజీనామా చేసినట్ల బెన్నీ గాంట్జ్ తెలిపారు.
అయితే గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న 8 నెలల యుద్ధ కాలంలో బెన్నీ గాంట్జ్ రాజీనామా ద్వారా నెతన్యాహుకు రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలింది. దీంతో నెతన్యాహు రైట్ వింగ్ పార్టీలపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుందని రాజకీయ ప్రముఖులు పేర్కొంటున్నారు.
గాంట్జ్‌కు చెందిన ఇజ్రాయెల్ రెసిలెన్స్ పార్టీలోని మరో నేత గాడి ఐసెన్‌కోట్ వార్ కేబినెట్ నుంచి వైదోలిగారు. దీంలో కీలకమైన వార్ కేబినెట్‌లో ముగ్గురు సభ్యులు మాత్రమే మిగిలారు. వార్ కేబినెట్.. హమాస్‌పై చేస్తున్న యుద్ధంలో ఇజ్రాయెల్ సైన్యానికి ఆదేశాలు ఇవ్వటంలో కీలకమైన నిర్ణయలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.
‘ప్రధాని నెతన్యాహు మమ్మల్ని నిజమైన విజయం వైపు వెళ్లనివ్వకుండా అడ్డకుంటున్నారు. అందుకే భరమైన హృదయంలో ఎమర్జెన్సీ కేబినెట్ నుంచి వైదొలుగుతున్నాం’ అని గాంట్జ్ అన్నారు. గాంట్జ్ రాజీనామా చేసిన నిమిషాల వ్యవధిలో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు.
‘బెన్ని..యుద్ధాన్ని విడిచిపెట్టడానికి ఇది సరైన సమయం కాదు. ఇది బలగాలను ముందుడి నడిపించే సమయం. రాజీనామా చేయోద్దని కోరుతున్నా’అని అన్నారు. కీలకమైన సమయంలో ఇంకా బంధీలను హమాస్ చెరనుంచి విడుదల కాకముందే ఇలా గాంట్జ్ రాజీనామా చేయటంపై నెతన్యాహు రైట్ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment