గిరిజన భవనాలు, శిక్షణ కేంద్రాలకు రూ. 50 కోట్లు మంజూరు
Published
Tue, Jul 19 2016 9:59 PM
| Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
గిరిజన భవనాలు, శిక్షణ కేంద్రాలకు రూ. 50 కోట్లు మంజూరు
దేవరకొండ : రాష్ట్రంలో గిరిజన భవనాల నిర్మాణం, ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 50 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లాపరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్ తెలిపారు. మంగళవారం దేవరకొండ పట్టణంలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో 9 గిరిజన ట్రైనింగ్ సెంటర్లకు గాను రూ. 27.50 కోట్లు విడుదల కాగా దేవరకొండ పట్టణంలో గిరిజన ట్రైనింగ్ సెంటర్ కోసం గిరిజన సంక్షేమశాఖ నుంచి రూ. 4 కోట్ల 65 లక్షలు మంజూరు చేసిందని తెలిపారు. అలాగే రాష్ట్రంలో 9 గిరిజన నియోజకవర్గాలకు 9 గిరిజన భవనాలు మంజూరు కాగా జిల్లాలోని నల్లగొండ, దేవరకొండ పట్టణాలలో గిరిజన భవనాల నిర్మాణాల కోసం రూ. 2 కోట్ల 20 లక్షలు మంజూరు చేసిందని వెల్లడించారు. జిల్లాలో హరితహారం కార్యక్రమంలో భాగంగా బుధవారం అన్ని మండలపరిషత్ కార్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలో అన్ని మండల కార్యాలయాల్లో చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఇటీవల రాష్ట్రంలో విడుదలైన అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలు నిలిచిపోయిన నేపథ్యంలో సంబంధితశాఖ మంత్రితో మాట్లాడడంతో ఆయన సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో దేవరకొండ ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మారుపాకుల సురేష్‌గౌడ్, టీఆర్‌ఎస్ పట్టణ పార్టి అధ్యక్షుడు పున్న వెంకటేశ్వర్లు, ఎంఏ. సిరాజ్‌ఖాన్, తిప్పర్తి సురేష్‌రెడ్డి, ముచ్చర్ల ఏడుకొండల్‌యాదవ్, పాపానాయక్, బైరెడ్డి కొండల్‌రెడ్డి, నాయిని మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.