విజేతలకు బహుమతుల ప్రదానం
దేవరకొండ
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేవరకొండ బ్యాడ్మింటన్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన డివిజన్ స్థాయి షటిల్ టోర్నమెంట్ విజేతలకు మంగళవారం దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్‌వీటీ బహుమతులు ప్రదానం చేశారు. టోర్నమెంట్‌లో 20 టీమ్‌లు పాల్గొనగా మొదటి బహుమతి కె. భాస్కర్, శేఖర్ టీమ్, రెండవ బహుమతి ఖాలిక్, ప్రకాష్ టీం గెలుపొందాయి. కార్యక్రమంలో దయానంద్, సురేశ్, శ్రీధర్‌గౌడ్, వెంకట్, వేణు, వినోద్, రామాచారి, మహేశ్, జగదీశ్, పరిపూర్ణా, అజహర్, శేఖర్, రవి, బాలాజీ, భాస్కర్, పూర్యా, వెంకట్ ఉన్నారు.