
బంధువని చేరదీస్తే...
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని హతమార్చిన వైనం
దేవరకొండ : స్నేహితుడు, బంధువని చేరదీసిన వ్యక్తే కాలయముడు అయ్యాడు. ఆశ్రయం ఇచ్చిన మిత్రుడి భార్యతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకొని అడ్డుగా ఉన్నాడని చివరికి దారుణంగా హతమార్చాడు. హత్య చేసిన అనంతరం మృతదేహం భాగాలను నరికి వివిధ ప్రాంతాల్లో విసిరేశాడు. ఈ భయంకర ఉదంతం దేవరకొండ మండలంలోని కోల్‌మంతల్ పహాడ్ సమీపంలో వెలుగుచూసింది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దవూర మండలం పర్వేదుల గ్రామపంచాయతీ పాల్త్యీతండాకు చెందిన పాల్త్యి రవి(31), శ్యామల దంపతులు. రోజువారి కూలిపని చేసుకుంటూ జీవనంసాగిస్తున్నారు. అదే తండాకు చెందిన శ్రీధర్ అనే వ్యక్తి రవికి సమీప బంధువు, మిత్రుడు. ఈ క్రమంలో నిత్యం రవి ఇంటికి వస్తూ ఉండేవాడు.
ఈ క్రమంలో శ్యామలతో వివాహేతర సంబంధం ఏర్పడింది. కొంత కాలం తర్వాత వీరి మధ్య గల సంబంధంపై రవికి అనుమానం వచ్చింది. దాంతో రెండేళ్ల క్రితం రవికి, శ్రీధర్‌కు మధ్య గొడవ జరిగింది. దాంతో రవి పెద్ద మనుషులను ఆశ్రయించడంతో వారు పంచాయితీ పెట్టి శ్రీధర్‌ను హైదరాబాద్‌కు పంపించారు. రవి కూడా భార్యను తీసుకొని మహబూబ్‌నగర్ జిల్లా మాడ్గుల మండలం అన్నెబోయిన పల్లి సమీపంలోని వెంకటేశ్వర ఫౌల్ట్రీఫాంలో పనికి కుదిరాడు. కాగా ఇటీవల శ్రీధర్ తిరిగి వచ్చి రవి పని చేస్తున్న ఫౌల్ట్రీఫాంలో పనికి కుదిరాడు. అనంతరం ఈ నెల 10వ తేదీన శ్రీధర్ మాయమాటలు చెప్పి రవిని మన జిల్లాలోని కొండమల్లేపల్లికి తీసుకెళ్లాడు. ఇద్దరూ ఫుల్లుగా మద్యం సేవించారు.
చీకటి పడేవరకు అక్కడే గడిపారు. రాత్రి పది గంటలు దాటినా భర్త రాకపోవడంతో శ్యామల శ్రీధర్‌కు ఫోన్ చేయడంతో రవి హైదరాబాద్‌కు వెళ్లాడని చెప్పాడు. దాంతో ఆమె భర్తకు ఫోన్ చేయగా ఎత్తలేదు. అనుమానం వచ్చిన శ్యామల 11వ తేదీన ఆమె బంధువులకు తెలియజేయడంతో వారు శనివారం మా డ్గుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలి సిన శ్రీధర్ భయంతో శనివారం రాత్రి రవితండ్రికి ఫోన్‌చేసి ‘మీ కుమారుడు హత్యకు గురయ్యాడు. మృతదేహం కోల్‌మంతల్ పహాడ్ సమీపంలో ఉంది. వెళ్లి తీసుకెళ్లండి’ అని సమాచారం ఇచ్చాడు. దాంతో మృ తుడి బంధువులు ఆదివారం సంఘటనా స్థలానికి వెళ్ల ్లగా తల, చేతులు లేని మృతదేహాన్ని గుర్తించారు. దేవరకొండ సీఐ గట్టుమల్లు సంఘటనా స్థలాన్ని పరిశీలింఆ స్థలం మాడ్గుల పరిధిలోకి వస్తుందని పేర్కొన్నారు.
అంతా మిస్టరీనే..
రవిని ఎలా హత్య చేశారనే విషయం పూర్తిగా బహిర్గతం కావడం లేదు. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో శ్రీధర్‌తో పాటు మరి కొంత మంది కలిసి రాయితో తలపై మోది హత్య చేశారని పోలీసులు భావిస్తున్నారు. అనంతరం తలను, చేతుల ను కత్తితో నరికి తీసుకెళ్లారని ప్రాథమిక అంచనాకు వ చ్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని వారు పేర్కొంటున్నారు.