
పూజలు చేస్తున్న ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ అభ్యర్థి రవీంద్రకుమార్
సాక్షి,పెద్దఅడిశర్లపల్లి : ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయాన్ని ఏ కూటమి ఆపలేదని నల్ల గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పీఏపల్లి మండలంలో టీఆర్‌ఎస్ దేవరకొండ ఎమ్మెల్యే అభ్యర్థి రమావత్ రవీంద్రకుమార్‌తో కలిసి చిల్కమర్రిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఏరాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసి చూ పిందన్నారు. సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్ గెలుపునకు బాటలు వేస్తాయని పేర్కొన్నారు. కూటమికి అధికారం కట్టబెట్టి ప్రజలు మోసపోయే స్థితిలో లేరన్నారు. ఎన్నికల్లో కూటమికి తగిన గుణపాఠం తప్పదని పేర్కొన్నారు. దేవరకొండ టీఆర్‌ఎస్ అభ్యర్థి రవీంద్రకుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం రమావత్ రవీంద్రకుమార్ మండలంలోని చిల్కమర్రి స్టేజీ, చిల్కమర్రి, సూర్యపల్లి, రోళ్లకల్, అంగడిపేట స్టేజీ, అంగడిపేట, అంగడిపేటతండా, భారత్‌పురం, సింగరాజుపల్లి, గుడిపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెట్పీటీసీ తేర గోవర్ధన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ముచ్చర్ల ఏడుకొండలుయాదవ్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ వంగాల ప్రతాప్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు రేటినేని ముత్యంరావు, వల్లపురెడ్డి, రంగారెడ్డి, వీరమళ్ల పరమేశ్, శీలం శేఖర్‌రెడ్డి, లచ్చిరెడ్డి, అంతిరెడ్డి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment