mla candidates
-
అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి
-
కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ అభ్యర్థులు వీళ్లే
-
ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 50 శాతం సీట్లు
-
అసెంబ్లీ బరిలో అభ్యర్థులు వీళ్ళే..
-
మూడో లిస్టు ప్రకటనకు రంగం సిద్దం చేస్తోన్న వైఎస్సార్సీపీ
-
తాజ్ కృష్ణ వద్ద కావేరి బస్సులు...కేసీఆర్ మాస్టర్ ప్లాన్..!?
-
కాంగ్రెస్ లో గెలుపొందే వీరులు వీరే..
-
Rajasthan Elections 2023: కోట్లకు పడగలెత్తారు
సాక్షి, న్యూఢిల్లీ: రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థుల్లో ఏకంగా 35 శాతం మంది కోటీశ్వరులే! బరిలో నిలిచిన 1,875 మంది అభ్యర్థుల అఫిడవిట్లను విశ్షించి అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారమ్స్ (ఏడీఆర్), రాజస్తాన్ ఎలక్షన్ వాచ్ ఈ మేరకు తేల్చాయి. వారి ఆస్తులు, క్రిమినల్ కేసుల వివరాలతో శనివారం నివేదిక విడుదల చేశాయి. బీజేపీ, కాంగ్రెస్‌ల్లో కోటీశ్వరులదే హవా ఏడీఆర్ నివేదిక ప్రకారం రాజస్తాన్‌లో బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 651 (35%) మంది కోటీశ్వరులున్నారు. ప్రధాన పారీ్టలు కాంగ్రెస్, బీజేపీ కూడా వారికే ఎక్కువగా టికెట్లిచ్చాయి. మొత్తం 200 అసెంబ్లీ స్థానాకలు గాను బీజేపీ నుంచి 176 మంది, కాంగ్రెస్ నుంచి 167 మంది రూ.కోటికి మించి ఆస్తులు ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 29 మంది, బీఎస్పీ నుంచి 36 మంది కూడా కోటీశ్వరులే. చురు కాంగ్రెస్ అభ్యర్థి రఫీక్ మండేలియా రూ.166 కోట్లతో అందర్లోనూ సంపన్నుడిగా నిలిచారు. రూ.123 కోట్లతో నీమ్ కా థానా బీజేపీ అభ్యర్థి ప్రేమ్ సింగ్ బజోర్ రెండో స్థానంలో ఉన్నారు. అయితే 8 అభ్యర్థులు తమకు ఒక్క రూపాయి ఆస్తి కూడా లేదని పేర్కొనడం విశేషం. 922 మంది తమకు అప్పులున్నట్టు వెల్లడించారు. ఇక 326 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులున్నాయి. బీజేపీ 61 మందికి, కాంగ్రెస్ 47, ఆప్ 18, బీఎస్పీ 12 మంది నేర చరితులకు టికెట్లిచ్చాయి. క్రిమినల్ కేసులున్న ముగ్గురు, అంతకంటే ఎక్కువ మంది బరిలో ఉన్న రెడ్ అలర్ట్ నియోజకవర్గాలు రాష్ట్రంలో 45 ఉన్నాయి. 643 మంది, 34 శాతం మంది అభ్యర్థులు 25–40 ఏళ్ల మధ్య వయస్కులు. 80 ఏళ్ల పై చిలుకు అభ్యర్థులు 8 మంది ఉన్నారు. 183 మంది, అంటే 10 శాతం మంది పోటీలో ఉన్నారు. 137 మంది అభ్యర్థులు కేవలం అక్షరాస్యులు కాగా 11 మంది నిరక్షరాస్యులమని ప్రకటించారు. కోటీశ్వరుల్లో చాలామంది కోట్లలో అప్పు కూడా చూపించారు. -
తెలంగాణ బీజేపీ తుది జాబితా విడుదల
-
తెలంగాణ బీజేపీ మూడో జాబితా..జనసేనకు కీలక స్థానాలు !
-
కాంగ్రెస్ రెండో జాబితలో 45 మందికి చోటు
సాక్షి, న్యూఢిల్లీ: విస్తృత సమాలోచనలు..ఎడతెగని సంప్రదింపులు..తర్జనభర్జన అనంతరం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్ శుక్రవారం రాత్రి విడుదల చేసింది. 45 మందికి టికెట్లు కేటాయించింది. అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాలేరు నియోజకవర్గం నుంచి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వర్రావు, మునుగోడు నియోజకవర్గం నుంచి గురువారం నాడే కాంగ్రెస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. కంటోన్మెంట్లో గద్దర్ కుమార్తె వెన్నెలకు అవకాశం కల్పించింది. ప్రకటించని మిగతా స్థానాలపై నేతలందరి అభిప్రాయం తెలుసుకున్నాక ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయాన్ని బట్టి తుది జాబితా విడుదల కానుంది. విస్తృత కసరత్తుతో.. ఈ నెల 15న 55 మందితో తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ రెండో జాబితా విడుదలకు విస్తృత కసరత్తు చేసింది. అనేకచోట్ల ఇద్దరు, ముగ్గురేసి అభ్యర్థులు బరిలో ఉండటం, సర్వేల్లోనూ వారికి సమాన గెలుపు అవకాశాలు ఉండటం, అభ్యర్థుల విషయంలో స్క్రీనింగ్ కమిటీలోని సభ్యుల మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు ఉండటంతో స్క్రీనింగ్ కమిటీ భేటీ మూడు నాలుగు సార్లు కావాల్సి వచ్చింది. ఈ క్రమంలో మరోసారి ఫ్లాష్ సర్వేలు సైతం నిర్వహించి, అందులో ముందంజలో ఉన్న అభ్యర్థుల పేర్లను కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)కి నివేదించింది. ఈ నెల 25న ఖర్గే అధ్యక్షతన ఒకమారు భేటీ అయిన సీఈసీ.. శుక్రవారం మరోమారు సమావేశమైంది. ఈ భేటీకి ఖర్గేతో పాటు అగ్రనేతలు సోనియాగాం«దీ, కేసీ వేణుగోపాల్, మురళీధరన్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు హాజరై 45 మంది అభ్యర్థుల జాబితా సిద్ధం చేశారు. సీపీఐకి ఇప్పటికే కొత్తగూడెం, చెన్నూరు నియోజకవర్గాలు కేటాయించగా, సీపీఎంకు కేటాయించే అవకాశమున్న స్థానాలపై (మిర్యాలగూడ, వైరా) ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. సీపీఎంకు కేటాయించే సీట్లతో పాటు మరో 15 స్థానాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతుండటంతో వీటిపై తుది నిర్ణయం చేసే అధికారం ఖర్గేకు కట్టబెట్టారు. ఈ స్థానాల్లో నెలాఖరులోగా టిక్కెట్ల కేటాయింపు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇక టికెట్ దక్కని నేతలను ముందుగానే ఢిల్లీ పిలిపించి ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే వారికి వివిధ పదవులు కట్టబెడతామని హామీ ఇచ్చారు. సస్పెన్స్‌లో కామారెడ్డి.. కమ్యూనిస్టులు పోనూ మిగిలిన మరో 15 స్థానాలను పార్టీ పెండింగ్‌లో పెట్టింది. ఇందులో అందరి దృష్టీ కామారెడ్డి నియోజకవర్గం పైనే ఉంది. ఇక్కడ రేవంత్‌రెడ్డిని బరిలో నిలపాలని పార్టీ అధిష్టానం యోచిస్తున్న నేపథ్యంలో దీన్ని పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ఇక్కడి సీనియర్ నేత షబ్బీర్ అలీని నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయించే ఆలోచన నేపథ్యంలో ఆ స్థానాన్నీ ప్రకటించలేదు. కామారెడ్డి జిల్లాలోనే ఉన్న బాన్సువాడ నియోజకవర్గం నుంచి సీనియర్ నేత వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి, పార్టీలో చేరిన ఏనుగు రవీందర్‌రెడ్డి పోటీలో ఉండటం, జుక్కల్ నుంచి సీనియర్ నేత గంగారాంతో పాటు తోట లక్ష్మీకాంతరావులు పోటీ పడుతుండటంతో ఆ స్థానాలపై ఇంకా నిర్ణయం చేయలేదు. పటాన్చెరు నియోజకవర్గాన్ని పార్టీలో చేరిన నీలం మధు కోరుతుండటం, అక్కడి నుంచి కాటా శ్రీనివాస్‌గౌడ్ పేరు ఇప్పటికే పరిశీలనలో ఉండటంతో దీన్నీ పెండింగ్‌లో పెట్టారు. ఇక నారాయణఖేడ్ నుంచి సీనియర్లు సురేశ్ షెట్కార్తో పాటు సంజీవ్రెడ్డిలు పోటీ పడుతుండగా నిర్ణయం తీసుకోలేదు. షెట్కార్ పేరును రేవంత్ ప్రస్తావిస్తుండగా, మిగతా సీనియర్లు సంజీవ్‌రెడ్డికి మద్దతుగా ఉన్నారు. తుంగతుర్తి టిక్కెట్ ఆశించి మోత్కుపల్లి నర్సింహులు, కరీంగనర్ సీటు ఆశిస్తూ మాజీ ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్‌లు పార్టీలో చేరడంతో వాటినీ పెండింగ్‌లోనే ఉంచారు. 45 టికెట్లు ఇలా.. 1. సిర్పూర్ – రావి శ్రీనివాస్ 2. ఆసిఫాబాద్ (ఎస్టీ) – అజ్మీర శ్యాం 3. ఖానాపూర్ (ఎస్టీ) – వెద్మ బొజ్జు 4. ఆదిలాబాద్ – కంది శ్రీనివాస్ రెడ్డి 5. బో«థ్(ఎస్టీ) – వన్నెల అశోక్ 6. ముధోల్ – నారాయణరావు పాటిల్ 7. ఎల్లారెడ్డి – కె.మదన్మోహన్ రావు 8. నిజామాబాద్ రూరల్ – డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి 9. కోరుట్ల – జువ్వాడి నర్సింగరావు 10. చొప్పదండి (ఎస్సీ) – మేడిపల్లి సత్యం 11. హుజూరాబాద్ – వొడితల ప్రణవ్ 12. హుస్నాబాద్ – పొన్నం ప్రభాకర్ 13. సిద్దిపేట – పూజల హరికృష్ణ 14. నర్సాపూర్ – ఆవుల రాజిరెడ్డి 15. దుబ్బాక – చెరుకు శ్రీనివాస్ రెడ్డి 16. కూకట్పల్లి – బండి రమేష్ 17. ఇబ్రహీంపట్నం – మల్రెడ్డి రంగారెడ్డి 18. ఎల్బీనగర్ – మధుయాష్కీ గౌడ్ 19. మహేశ్వరం – కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి 20. రాజేంద్రనగర్ – కస్తూరి నరేందర్ 21. శేరిలింగంపల్లి – వి.జగదీశ్వర్ గౌడ్ 22. తాండూరు – బుయ్యని మనోహర్ రెడ్డి 23. అంబర్‌పేట – రోహిన్‌రెడ్డి 24. ఖైరతాబాద్ – పి.విజయారెడ్డి 25. జూబ్లీహిల్స్ – మహమ్మద్ అజారుద్దీన్ 26. సికింద్రాబాద్ కంటోన్మెంట్ – డాక్టర్ జి.వి.వెన్నెల 27. నారాయణ్‌పేట్ – డాక్టర్ పర్ణిక చిట్టెంరెడ్డి 28. మహబూబ్‌నగర్ – యెన్నం శ్రీనివాస్‌రెడ్డి 29. జడ్చెర్ల – జె.అనిరుద్ రెడ్డి 30. దేవరకద్ర – గవినోళ్ల మధుసూదన్‌రెడ్డి 31. మక్తల్ – వాకిట శ్రీహరి 32. వనపర్తి – డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి 33. దేవరకొండ(ఎస్టీ) – నానావత్ బాలునాయక్ 34. మునుగోడు – కె.రాజగోపాల్‌రెడ్డి 35. భువనగిరి – కుంభం అనిల్‌కుమార్ రెడ్డి 36. జనగాం – కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి 37. పాలకుర్తి – యశశ్విని మామిడాల 38. మహబూబబాద్(ఎస్టీ) – డాక్టర్ మురళీనాయక్ 39. పరకాల – రేవూరి ప్రకాశ్‌రెడ్డి 40. వరంగల్ వెస్ట్ – నాయిని రాజేందర్‌రెడ్డి 41. వరంగల్ ఈస్ట్ – కొండా సురేఖ 42. వర్ధన్నపేట(ఎస్సీ) – కె.ఆర్.నాగరాజు 43. పినపాక(ఎస్టీ) – పాయం వెంకటేశ్వర్లు 44. ఖమ్మం – తుమ్మల నాగేశ్వరరావు 45. పాలేరు – పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి -
తెలంగాణ కాంగ్రెస్ రెండో జాబితాను ఖరారు చేయనున్న అధిష్టానం
-
తెలంగాణ కాంగ్రెస్ రెండో జాబితాపై ఉత్కంఠ
-
తెలంగాణ బీజేపీ ఫస్ట్ లిస్ట్ విడుదల
-
బీజేపీ ఫస్ట్ లిస్ట్ పై కన్ఫ్యూషన్
-
తీవ్ర ఉత్కంఠ.. బీజేపీ అభ్యర్థుల జాబితాపై సుదీర్ఘంగా కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ దగ్గరపడుతున్నా బీజేపీ అభ్యర్థుల విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే కొందరు అభ్యర్థులను ఖరారు చేశారని, మరికొందరి విషయంలోనూ ఏకాభిప్రాయం వ్యక్తమైందని పార్టీ నేతలు చెప్తున్నా.. అధికారికంగా జాబితా విడుదల కాకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. అయితే పక్కాగా ఖరారైన సుమారు 35–40 సెగ్మెంట్లకు సంబంధించి అభ్యర్థులకు ఫోన్ చేసి సమాచారం అందించినట్టు తెలిసింది. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఎంపికపై బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ శుక్రవారం అర్ధరాత్రి వరకు సమాలోచనలు చేసింది. ఈ క్రమంలో నేతలు.. అభ్యర్థుల ఎంపికపై ప్రధాని మోదీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపించారు. అభ్యర్థుల ఎంపిక కసరత్తు కోసం ఢిల్లీ వెళ్లిన కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, రాష్ట్ర పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ తదితరులు శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. అయితే జాబితా విడుదల కాని నేపథ్యంలో.. కచ్చితంగా ఖరారైన అభ్యర్థులకు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి స్వయంగా ఫోన్ చేసి ఎంపిక విషయాన్ని తెలియజేసిట్టు సమాచారం. సదరు అభ్యర్థులు వెంటనే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి, పకడ్బందీ కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్లాలని సూచించినట్టు తెలిసింది. పార్టీ తీసుకున్న బీసీ అజెండా, ఇతర అంశాలను ప్రజలకు వివరించాలని.. ఇతర పార్టీల కంటే బీజేపీ ఏ విధంగా భిన్నమైనదో స్పష్టంగా తెలియజేయాలని దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. -
రాజాసింగ్ కు లైన్ క్లియర్ !..రెండు స్థానాల్లో ఈటల పోటీ
-
అభ్యర్థుల ఎంపికపై మరోసారి భేటీ కానున్న టీకాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ
-
రాజాసింగ్ ఎమ్మెల్యే సీటుపై క్లారిటీ..బీజేపీ ఫస్ట్ లిస్ట్
-
బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాకు ఆమోద ముద్ర
-
బీజేపీ తొలి జాబితాకు గ్రీన్ సిగ్నల్..!
-
రేపు బీజేపీ తొలి జాబితా విడుదలయ్యే అవకాశం
-
తెలంగాణ బీజేపీ అభ్యర్థుల ప్రకటన మరింత ఆలస్యం
-
55 మందితో కాంగ్రెస్ తొలి జాబితా
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 55 మంది పేర్లను ప్రకటించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం ఉదయం ఢిల్లీలో ఈ జాబితాను విడుదల చేశారు. తొలి జాబితాలోని మొత్తం 55 స్థానాల్లో.. 17 మంది రెడ్లు, ఏడుగురు వెలమ, 12 మంది బీసీ, ముగ్గురు ముస్లిం, ఇద్దరు బ్రాహ్మణ అభ్యర్థులకు చోటు కల్పించారు. వీటితోపాటు 12 ఎస్సీ, 2 ఎస్టీ రిజర్వుడ్ స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించారు. ఇటీవల పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్‌రావు ఇద్దరికీ సీట్లు దక్కాయి. మరోవైపు ఎంపీ ఉత్తమ్‌తోపాటు ఆయన భార్య పద్మావతిలకు తొలి జాబితాలోనే సీట్లు కేటాయించారు. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎల్బీనగర్ నుంచి టికెట్ ఆశిస్తున్న మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ తదితర సీనియర్ల పేర్లు ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం. లెఫ్ట్ పొత్తు తేలాక రెండో జాబితా ఇండియా కూటమిలో భాగంగా వామపక్షాలతో పొత్తులు, సీట్ల కేటాయింపులపై చర్చలు జరుగుతున్నాయి. అవి ఒక కొలిక్కి వచి్చన తర్వాత అసెంబ్లీ అభ్యర్థుల మలి జాబితాపై కసరత్తు పూర్తిచేసి విడుదల చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ తొలి జాబితా ఇదీ.. 1) కొడంగల్: ఎనుమల రేవంత్‌రెడ్డి 2) మధిర (ఎస్సీ): మల్లు భట్టి విక్రమార్క 3) ఆందోల్ (ఎస్సీ): దామోదర రాజనర్సింహ 4) హుజూర్నగర్: ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 5) కోదాడ: ఎన్.పద్మావతి 6) నల్గొండ: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 7) మంథని: దుద్దిళ్ల శ్రీధర్‌బాబు 8) సంగారెడ్డి: తూర్పు జగ్గారెడ్డి 9) ములుగు (ఎస్టీ): ధనసరి అనసూయ (సీతక్క) 10) భద్రాచలం (ఎస్టీ): పోడెం వీరయ్య 11) కొల్లాపూర్: జూపల్లి కృష్ణారావు 12) మల్కాజ్గిరి: మైనంపల్లి హన్మంతరావు 13) మెదక్: మైనంపల్లి రోహిత్‌రావు 14) నాగార్జునసాగర్: జయవీర్‌రెడ్డి 15) జగిత్యాల: టి.జీవన్‌రెడ్డి 16) బెల్లంపల్లి: గడ్డం వినోద్ 17) మంచిర్యాల: కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు 18) నిర్మల్: కూచాడి శ్రీహరిరావు 19) ఆర్మూర్: పి.వినయ్‌కుమార్ 20) బోధన్: పి.సుదర్శన్‌రెడ్డి 21) బాల్కొండ: సునీల్‌కుమార్ ముత్యాల 22) ధర్మపురి(ఎస్సీ): అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ 23) నకిరేకల్(ఎస్సీ): వేముల వీరేశం 24) వేములవాడ: ఆది శ్రీనివాస్ 25) రామగుండం: ఎం.ఎస్.రాజ్‌ఠాకూర్ 26) పెద్దపల్లి: సీహెచ్.విజయరామారావు 27) మానకొండూరు (ఎస్సీ): కవ్వంపల్లి సత్యనారాయణ 28) జహీరాబాద్(ఎస్సీ): ఆగం చంద్రశేఖర్ 29) గజ్వేల్: తూముకుంట నర్సారెడ్డి 30) మేడ్చల్: తోటకూర వజ్రేశ్ కుమార్ 31) కుత్బుల్లాపూర్: కొలను హన్మంతరెడ్డి 32) ఉప్పల్: ఎం.పరమేశ్వర్‌రెడ్డి 33) చేవెళ్ల(ఎస్సీ): పమేన భీంభారత్ 34) పరిగి: టి.రామ్మోహన్‌రెడ్డి 35) వికారాబాద్ (ఎస్సీ): గడ్డం ప్రసాద్‌కుమార్ 36) ముషీరాబాద్: అంజన్‌కుమార్ యాదవ్ 37) మలక్‌పేట్: షేక్ అక్బర్ 38) సనత్‌నగర్: కోట నీలిమ 39) నాంపల్లి: మహ్మద్ ఫిరోజ్‌ఖాన్ 40) చాంద్రాయణగుట్ట: బోయ నగేశ్ (నరేశ్) 41) కార్వాన్: ఉస్మాన్ బిన్ మహ్మద్ అలీ హజ్రీ 42) గోషామహల్: మొగిలి సునీత 43) యాకూత్‌పుర: కె.రవిరాజు 44) బహదూర్‌పుర: రాజేశ్‌కుమార్ పులిపాటి 45) సికింద్రాబాద్: దామ్ సంతోష్‌కుమార్ 46) అలంపూర్(ఎస్సీ): ఎస్.ఏ.సంపత్‌కుమార్ 47) అచ్చంపేట(ఎస్సీ): చిక్కుడు వంశీకృష్ణ 48) గద్వాల: సరితా తిరుపతయ్య 49) నాగర్‌కర్నూల్: కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి 50) కల్వకుర్తి: కసిరెడ్డి నారాయణరెడ్డి 51) షాద్‌నగర్: కె.శంకరయ్య 52) ఆలేరు: బీర్ల ఐలయ్య 53) స్టేషన్ ఘన్పూర్: సింగాపురం ఇందిర 54) నర్సంపేట: దొంతి మాధవరెడ్డి 55) భూపాలపల్లి: గండ్ర సత్యనారాయణరావు -
51 మందికే బీ ఫామ్స్.. అభ్యర్థుల్లో టెన్షన్.. గులాబీ బాస్ వ్యూహమేంటి?
సాక్షి, హైదరాబాద్: మళ్లీ విజయం మనదే.. ఎవరూ తొందరపడవద్దు. సామరస్య పూర్వకంగా సీట్ల సర్దుబాటు జరిగింది. న్యాయపరమైన ఇబ్బందుల వల్లే వేములవాడలో అభ్యర్థి మార్పు జరిగింది’’ అని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. అనంతరం 51 మంది అభ్యర్థులకు మాత్రమే బీఫామ్‌లు అందజేసి ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశం చేశారు. ‘‘మనల్ని గెలవలేక కుయుక్తులు పన్నుతున్నారు. సాంకేతికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. కోపతాపాలను అభ్యర్థులు పక్కనబెట్టాలి. ప్రతీది తెలుసుకునే పయత్నం చేయాలి తప్ప.. మాకు తెలుసు అనుకోవద్దు. అంతా మాకే తెలుసు అనుకోవద్దు. ఎన్నికల ఘట్టంగా చాలా జాగ్రత్తగా ఉండాలి’’ అని కేసీఆర్ సూచించారు. అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేశాం. ఎన్నికల కో ఆర్డినేటర్ భరత్ కుమార్‌కు అన్ని విషయాలు చెప్పాలి. ఎలాంటి సమస్యలున్నా ఆయనను సంప్రదించాలి. బీఫామ్ నింపేటప్పుడు అభ్యర్థులంతా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కో అభ్యర్థికి రెండు బీఫామ్స్ ఇస్తాం. ఈ రోజు, రేపు అభ్యర్థులకు బీఫామ్ అందజేస్తాం. పొరపాట్లు జరగకుండా అభ్యర్థులు చూసుకోవాలి. అన్ని బీ ఫామ్స్ ఇంకా రెడీ కాలేదు. మిగతా వారికి బీఫామ్స్ రెడీ అవుతున్నాయి. అసంతృప్తులు, అసమ్మతి నేతలను బుజ్జగించే బాధ్యత ఎమ్మెల్యే అభ్యర్థులదే’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మరో వైపు, 51 మంది అభ్యర్థులకే బీఫామ్స్ అందజేయటంతో మిగతా అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. అన్ని బీ ఫామ్స్ ఇంకా రెడీ కాలేదని, మిగతా వారికి బీఫామ్స్ రెడీ అవుతున్నాయని కేసీఆర్ చెప్పినప్పటికీ అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రెండు నెలల క్రితమే 115 మందితో అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ప్రకటించారు. ఇవాళ అన్ని స్థానాలకు బీఫామ్‌లు ఇస్తారని అంతా భావించారు.. కానీ 51 మందికి మాత్రమే ఇవ్వడంతో మిగతా అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ముందుగా ప్రకటించిన అభ్యర్థుల్లో కొందరికిపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. అందుకే బీఫామ్‌లు ఇవ్వలేదని, ఆ స్థానాలను మార్చనున్నారనే ప్రచారం గుప్పుమంటోంది. దీంతో వారిలో టెన్షన్ నెలకొనగా.. వారు ఎవరనేది ఇప్పడు హాట్ టాపిక్‌గా మారింది చదవండి: బీఆర్ఎస్ మేనిఫెస్టో.. కేసీఆర్ హామీలివే..! -
51 మంది అభ్యర్థులకు బీఫారం అందజేసిన సీఎం కేసీఆర్
-
ఫస్ట్ లిస్టులో బీసీలకు మొండి చెయ్యి..
-
టీ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
-
దూసుకుపోతున్న కేసీఆర్..బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ ఫామ్
-
ఇట్లయితే కుదరదు.. కేసీఆర్ వార్నింగ్!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫుల్ ఫోకస్ సాధించింది. ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో.. అస్వస్థత నుంచి కోలుకుంటున్న అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమీక్షకు దిగినట్లు సమాచారం. ఈ క్రమంలో.. ఎన్నికల కోసం ఎమ్మెల్యే అభ్యర్థుల గ్రౌండ్ వర్క్‌పై అధినేత కేసీఆర్ ఆరా తీసి మరీ మందలించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే అభ్యర్థుల్లో కొందరిపై సీఎం కేసీఆర్ గుర్రుగా ఉన్నారు. టికెట్లు దక్కాక చాలామంది హైదరాబాద్‌కు తరచూ వస్తూ పోతుండడంపై ఆయన మండిపడినట్లు తెలుస్తోంది. పని తీరు మారని అభ్యర్థులకు ఆయన వార్నింగ్ సైతం ఇచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో జిల్లా అభ్యర్థులు ఎవరూ ఉండకూడదని.. ఎవరి నియోజకవర్గాలకు వాళ్లు వెళ్లి క్షేత్రస్థాయిలో తిరగాలని ఆయన గట్టిగానే చెప్పినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో మరింత బలంగా పని చేయాలని ఆయన వాళ్లకు సూచించినట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే అభ్యర్థుల జాబితా ప్రకటించిన బీఆర్ఎస్.. మరో ఐదు నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థులను పెండింగ్‌లో ఉంచింది. ఈ నేపథ్యంలో.. ఇవాళో రేపో అభ్యర్థుల ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. -
ఢిల్లీకి చేరిన టీకాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ
-
గులాబీ తోటలో సీట్ల పంచాయతీ సిట్టింగులకు ఫిట్టింగ్..?
-
బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను సిద్ధం చేసిన కేసీఆర్
-
ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై బీజేపీ హైకమాండ్ ఫోకస్
-
సీఎం కేసీఆర్ దూకుడు.. ఆగస్టులో బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. అభ్యర్థులపై గులాబీ బాస్ కసరత్తు ప్రారంభించారు. ఆగస్టులో అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించనున్నట్లు సమాచారం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కీలక నేతల చేరిక తర్వాత అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశముంది. మొదటి విడతలో గెలుపు గుర్రాల మొదటి జాబితా బీఆర్ఎస్ అధినేత సిద్ధం చేస్తున్నారు. ఆగస్టులో మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధతపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్.. సర్వే సంస్థల నివేదికలు, వివిధ నిఘా సంస్థల రిపోర్టుల ఆధారంగా, నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్, విపక్షాల బలాలు, బలహీనతలపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. చదవండి: కేసీఆర్‌కు అన్ని విషయాలు తెలుసు: జలగం వెంకట్రావ్ కీలక వ్యాఖ్యలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు విఫలమైన చోట ఇతరులకు టికెట్ కేటాయించే అంశంపై కూడా ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. సర్వేలు, పనితీరు ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన కేసీఆర్.. మొదటి జాబితాలో అత్యధిక స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. -
ఎమ్మెల్యే కోటా అభ్యర్థులు వీరే
సాక్షి, హైదరాబాద్: ఆశావహుల్లో ఉత్కంఠకు తెరదించుతూ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం ఖరారు చేశారు. శాసనమండలిలో ఈ నెల 29న ఖాళీ అవుతున్న మూడు ఎమ్మెల్యే కోటా స్థానాల కోసం నామినేషన్ల దాఖలుకు గడువు ఈ నెల 13న ముగియనుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుత ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్‌రావుకు మరోమారు అవకాశం ఇవ్వగా, కొత్తగా రచయిత, గాయకుడు దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డిని ఎంపిక చేశారు. ఈ నెల 9న వీరు తమ నామినేషన్ పత్రాలు సమర్పిస్తారు. ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేయాల్సిందిగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు. ‘గవర్నర్’అభ్యర్థుల ఖరారు రేపు శాసనమండలిలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు డి.రాజేశ్వర్‌రావు, ఫా రూక్ హుస్సేన్ ఈ ఏడాది మేలో ఆరేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకుంటున్నారు. ఈ స్థానాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఈ నెల 9న సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీలో అభ్యర్థులను ఎంపిక చేసి గవర్నర్‌కు సిఫారసు చేయనున్నా రు. రాజేశ్వర్‌రావు, ఫారూక్ హుస్సేన్ ఇద్దరూ మైనారిటీ వర్గానికి చెందిన వారు కావడంతో కొత్త అభ్యర్థుల విషయంలో ఉత్కంఠ నెలకొంది. రిటైర్ అవుతున్న ఇద్దరూ ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్సీలుగా పనిచేశారు. రాజేశ్వర్‌రావుకు మరోమారు అవకాశం దక్కుతుందని సమాచారం. గౌడ సామాజికవర్గం నుంచి.. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ వి.గంగాధర్‌గౌడ్ రిటైర్ అవుతుండటంతో మండలిలో గౌడ సామాజికవర్గానికి ప్రాతినిథ్యం లేకుండా పోతోంది. దీంతో గవర్నర్ కోటాలో మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ లేదా గంగాధర్‌గౌడ్‌కు అవకాశం దక్కుతుందని అంటున్నారు. గతంలో గవర్నర్ కోటాలో పాడి కౌశిక్‌రెడ్డి పేరును కేబినెట్ సిఫారసు చేసినా గవర్నర్ తిరస్కరించడాన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల ఎంపిక ఉంటుందని సమాచారం. ప్రొఫెసర్ గంటా చక్రపాణి పేరు కూడా గవర్నర్ కోటాలో సిఫారసు చేసే అంశం సీఎం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. వ్యూహాత్మకంగా అభ్యర్థుల ఎంపిక ఈ నెలాఖరులో పదవీకాలం పూర్తి చేసుకుంటున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు కుర్మయ్యగారి నవీన్‌రావు, ఎలిమినేటి కృష్ణారెడ్డి, వి.గంగా«ధర్ గౌడ్‌లో నవీన్‌రావు ఒక్కరికే రెండోసారి అవకాశం దక్కింది. జీహెచ్ఎంసీ పరిధిలో పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేస్తున్న బృందంలో ఈయ న కీలకంగా పనిచేస్తున్నారు. ఇక తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తిలో కీలకపాత్ర పోషించిన దేశపతి శ్రీనివాస్ రాష్ట్ర ఆవిర్భావం నుంచి సీఎం కార్యాలయ ఓఎస్డీగా పనిచేస్తున్నారు. ఆయనకు కేసీఆర్‌తో సాన్నిహిత్యం ఉన్నా సుదీర్ఘ కాలం తర్వాతే అవకాశం లభించింది. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వా త ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి కేసీఆర్ సమక్షంలో పార్టీ లో చేరారు. బీఆర్ఎస్లో వెంకట్రామిరెడ్డిది తొలి చేరిక కాగా, నడిగడ్డ ప్రాంతంలో రాజకీయ ప్రాబల్యం కలిగిన నేతగా ఆయనకు పేరుంది. ఆలంపూర్, కొల్లాపూర్, గద్వాల నియోజకవర్గాలతో పాటు ఏపీలోని రాయలసీమ ప్రాంతంలో బీఆర్ఎస్ విస్తరణకు చల్లా సేవలను వినియోగించుకునే ఉద్దేశంతో ఆయన్ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నేపథ్యమిదీ.. దేశపతి శ్రీనివాస్: తెలంగాణ కవి, గాయకుడైన దేశపతి శ్రీనివాస్ 1970లో సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మునిగడప గ్రామంలో దేశపతి గోపాలకృష్ణ శర్మ, బాలసరస్వతి దంపతులకు జన్మిం చారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం.. ఉద్యమ నాయకుడిగా నాడు కేసీఆర్ నిర్వహించిన వేలాది సభలు, సమావేశాలు, ర్యాలీలలో పాల్గొన్నారు. తన ఆట, పాటలు, ప్రసంగాలతో తెలంగాణ భావజాల వ్యాప్తికి కృషి చేశారు. రాష్ట్ర సాధన అనంతరం ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం సీఎం ఓఎస్డీగా పని చేస్తున్నారు. కుర్మయ్యగారి నవీన్‌రావు: హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన కుర్మయ్యగారి నవీన్‌రావు..కొండల్రావు, తిలోత్తమ దంపతులకు 1978 మే 15న జన్మించారు. నవీన్‌రావు తాత రామచంద్రరావు గతంలో మంత్రిగా పనిచేశారు. మేనమామ సుదర్శన్ రావు టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. నవీన్‌రావుకు విద్యార్థి దశ నుంచే రాజకీయాలంటే ఆసక్తి. 2001 నాటి జలదృశ్యం ఆవిర్భావ సభ మొదలుకొని టీఆర్ఎస్ నిర్వహించిన అన్ని సమావేశాల్లో క్రియాశీలంగా పనిచేశారు. తొలిసారిగా 2019 మేలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. చల్లా వెంకట్రామిరెడ్డి: మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనవడు (కూతురి కొడుకు) అయిన చల్లా వెంకట్రామిరెడ్డి 1971లో నిర్మలమ్మ, రామ్‌భూపాల్ రెడ్డి దంపతులకు జన్మించారు. గుల్బర్గాలో బీటెక్ చదివిన ఈయన పుల్లూరు గ్రామ ప్రెసిడెంట్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తర్వాత 2004 నుంచి 2009 వరకు ఆలంపూర్ ఎమ్మెల్యేగా పనిచేశారు. గత ఏడాది డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. -
టీఆర్ఎస్ నుంచి ఇద్దరి పేర్లు ఖరారు.. సీఎం నిర్ణయమే ఫైనల్..
స్థానిక సంస్థల కోటాలో ఈసారి భానుప్రసాద్, ఎల్.రమణ పేర్లు దాదాపుగా ఖరారయ్యాని సమాచారం. వీరిద్దరి పేర్లను ఖరారు చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని తెలిసింది. వాస్తవానికి ఎల్.రమణను మొన్న జరిగిన ఎమ్మెల్యే కోటాలోనే ఎమ్మెల్సీగా పంపుతారని ప్రచారం సాగినా.. ఉమ్మడి జిల్లా నుంచి పాడి కౌశిక్‌రెడ్డి, సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి నామినేషన్లు వేశారు. దీంతో మాజీ మంత్రి ఎల్.రమణ వర్గం తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. తాజాగా మరోసారి ఎల్.రమణ పేరు అధిష్టానం.. పరిగణనలోకి తీసుకుందని సమాచారం. స్థానిక సంస్థల కోటాలో ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఒకటి బీసీ, మరొకటి ఓసీలకు ఇవ్వాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ సమీకరణాల్లో భాగంగానే భానుప్రసాద్ రావు మూడోసారి ఎమ్మెల్సీ స్థానానికి పోటీ పడుతున్నారు. బీసీ కోటాలో ఈసారి మాజీ మంత్రి ఎల్.రమణకు అవకాశం ఇచ్చారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. చదవండి: తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక ఉత్తర్వులు.. సాక్షి, కరీంనగర్: మొన్నటి దాకా హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక రణరంగం నడిచిన కరీంనగర్లో రెండువారాలు తిరక్కముందే స్థానిక సంస్థల ఎన్నికల భేరీ మోగింది. జాతీయస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిన ఆ ఉప ఎన్నికలో అభ్యర్థుల ఎంపిక, రెబెల్స్, తిరుగుబాటుదారులు, బుజ్జగింపు పర్వాలు ఏ పార్టీలో అణువంతైనా కనిపించలేదు. కానీ.. ప్రస్తుతం నడుస్తున్న స్థానిక సంస్థల నామినేషన్ల ప్రక్రియలో మాత్రం ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార పార్టీకి స్థానిక ప్రజాప్రతినిధుల ఓట్ల విషయంలో తిరుగులేని బలం ఉన్నప్పటికీ.. బరిలో నిలిచేవారి సంఖ్య పెరుగుతుండటం ఇందుకు కారణం. ఈసారి టీఆర్ఎస్ ఎంపీపీ (సైదాపూర్), రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సారాబుడ్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ వేశారు. చదవండి: నిప్పులాంటి నిజం! సిలిండర్‌పై ఎక్స్ట్రా వసూళ్లు, మొత్తం లెక్కిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే! రోజురోజుకూ దిగజారిపోతున్న ఎంపీటీసీలకు పూర్వవైభవం తీసుకురావాలన్న లక్ష్యంతోనే తాను నామినేషన్ వేశానని చెబుతున్నారు. వాస్తవానికి ఇంతవరకూ తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి అభ్యర్థుల ప్రకటనపై ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. కానీ.. ఈయన మాత్రం తమ డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని, వాటిపై స్పష్టమైన హామీ దొరికే వరకు నామినేషన్ వెనక్కి తీసుకోనని ఖరాఖండిగా చెబుతున్నారు. జిల్లా నుంచి రెండుసార్లు ఎమ్మెల్సీలుగా ఎన్నికైన నారదాసు లక్ష్మణరావు, భానుప్రసాద్ ఏనాడైనా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమస్యలను మండలివేదికగా ప్రస్తావించారా? అని ప్రశ్నిస్తున్నారు. మిగిలిన ఐదుగురి డిమాండ్లు కూడా కాస్త అటూఇటూగా ఇవే కావడం గమనార్హం. బరిలో మరికొందరు... ►ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. ►ఈ నెల 16 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలైంది. నామినేషన్ల స్వీకరణకు 23వ తేదీ ఆఖరు. ► ఇప్పటిదాకా మొత్తం ఆరుగురు అభ్యర్థులు తొమ్మిదిసెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ►వీరిలో ప్రభాకర్‌రెడ్డి ఒకరు మాత్రమే పార్టీ నుంచి బరిలో ఉన్నారు. ►ఇక మునిగాల విజయలక్ష్మి, మసార్తి రమేశ్, బొమ్మరవేని తిరుపతి, నలమాచు రామకృష్ణ, పురం రాజేశం ఇండిపెండెంట్లుగా నామినేషన్లు దాఖలు చేశారు. ►మంగళవారం నామినేషన్ల స్వీకరణకు ఆఖరు రోజు కావడంతో చివరి రెండురోజుల్లో మరికొందరు నామినేషన్లు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ►ముఖ్యంగా జగిత్యాల, పెద్దపల్లి నుంచి కొందరు ఇండిపెండెంటుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ►ఇప్పటివరకూ దాదాపు 70 వరకు నామినేషన్ పత్రాలను కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం నుంచి తీసుకెళ్లడమే ఇందుకు నిదర్శనం. ఇందులో కొందరు నాలుగేసి సెట్లు, మరికొందరు ఒకటి, రెండు సెంట్లు తీసుకెళ్లినట్లు సమాచారం. నామినేషన్ దాఖలు చేసేవారిలో బలమైన అభ్యర్థులకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మద్దతిచ్చేందుకు సుముఖంగా ఉన్నాయని ఇండిపెండెంట్లు ధీమాతో ఉన్నారు. అయితే.. అన్ని పార్టీల్లో తిరుగుబాట్లు, అలకలు సహజమేనని, ఎవరికైనా పార్టీ ఆదేశాలు శిరోధార్యమని సీనియర్ టీఆర్ఎస్ నేతలు ‘సాక్షి’కి తెలిపారు. సీఎం నిర్ణయమే ఫైనల్.. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని శనివారం కరీంనగర్లో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్ నిర్వహించారు. కరీంనగర్ నగర పాలక, కొత్తపల్లి పురపాలక సంఘాలకు చెందిన డిప్యూటీ మేయర్, చైర్మన్, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు, మంత్రి గంగుల పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికను పార్టీ అధిష్టానానికి అప్పగిస్తూ, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించే అభ్యర్థికి మద్దతు తెలపాల్సిందిగా సూచించారు. సమావేశంలో పాల్గొన్న పాలకవర్గాల సభ్యులు ఈ ప్రతిపాదనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, సిరిసిల్ల నియోజకవర్గాలకు మంత్రి గంగుల ఎన్నికల ఇన్చార్జిగా, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు మంత్రి కొప్పుల ఈశ్వరు బాధ్యులుగా వ్యవహరిస్తున్నారు. సమావేశంలో కరీంనగర్ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప రాణి హరిశంకర్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు. -
కిరాయి కార్యకర్తల కోసం అన్వేషణ!
సాక్షి, అమరావతి : నామినేషన్ల పర్వం మొదలైంది. పత్రాలు దాఖలు చేయడానికి వెళ్లాలంటే.. కనీసం వందమంది కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించాలి. అక్కడ నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు క్రమం తప్పకుండా ప్రచారం చేయాలి. నామినేషన్ల తర్వాత కిరాయి కార్యకర్తలు దొరకడం కష్టం అవుతుంది. వేసవి కావడంతో భవన నిర్మాణాలకు డిమాండ్ ఉంటుంది. అలాగే ఎండలకు భయపడి కార్యకర్తలు రెట్టింపు డబ్బులు ఇస్తే కాని రారు. అందువల్ల నెల రోజులకు జీతానికి కార్యకర్తలను మాట్లాడుతున్నారు. నెల రోజులపాటు తమ వెంట ఉండేందుకు ముందుగానే మాట్లాడుకుంటున్నారు. నెలకు మాట్లాడుకున్నప్పటికీ వారానికి ఓసారి డబ్బులు తీసేసుకుంటున్నట్టు కిరాయి కార్యకర్తలను సరఫరా చేసే వన్ టౌన్‌కు చెందిన బ్రోకర్ ఒకరు తెలిపారు. ఒక్కో అభ్యర్థి కనీసం 50 మంది కిరాయి కార్యకర్తలను తమ వెంట ఉండే విధంగా మాట్లాడుకుంటున్నారు. కాగా పార్టీలో పనిచేసే ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఈ విధంగా కార్యకర్తలను సరఫరా చేస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఏ డివిజన్ లేదా గ్రామానికి వెళ్లినప్పుడు అక్కడ లోకల్‌గా పనిచేసే కార్యకర్తల సేవలను ఉపయోగించుకుంటున్నారు. కార్యకర్తలకు డబ్బులతోపాటు చీరలు, మద్యం, బిర్యానీ ప్యాకెట్లు అదనంగా సరఫరా చేస్తున్నారు. నాయకుడి మంచితనాన్ని బట్టి నెలకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు కిరాయి వసూలు చేస్తున్నారు. ముందుగా అడ్వాన్స్ తీసుకున్న తర్వాతే తమ కార్యకర్తల్ని మధ్యవర్తులు రంగంలోకి దింపుతున్నారు. తెలంగాణ నుంచి కార్యకర్తలు.. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది అభ్యర్థులు తెలంగాణ నుంచి కూడా కిరాయి కార్యకర్తలు వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తెలంగాణ ఎన్నికల సమయంలో ఇక్కడ నుంచి ప్రచారం చేయడానికి వెళ్లిన టీడీపీ ప్రజాప్రతినిధులు అక్కడ కార్యకర్తలకు ఇచ్చే రేట్ల గురించి వాకబు చేశారు. ఇక్కడ రోజుకు రూ.500 నుంచి రూ.1000 వరకూ చెల్లించాల్సి వస్తోంది. అదే తెలంగాణలోని అదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల నుంచి కార్యకర్తలు రూ.400కే వస్తుండటంతో విజయవాడ నగరానికి చెందిన ఓ అభ్యర్థి అక్కడ నుంచి సుమారు వందమందిని కిరాయికి పిలిపించారు. వారికి స్థానికంగా షెల్టర్ ఏర్పాటు చేశారు. ఉదయం పూట టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి ఖర్చులు మాత్రం కార్యకర్తలే పెట్టుకోవాల్సి ఉంటుందని తెలంగాణ నుంచి కార్యకర్తలను తీసుకువచ్చిన బీమ్లా నాయక్ తెలిపారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల నుంచి సుమారు 500 మంది కృష్ణా, గుంటూరు జిల్లాలకు వచ్చారని వివరించారు. తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, కాబట్టి ఎన్నికల రోజుకు వెళ్లిపోతామని వారు అన్నారు. వ్యవసాయ కూలీలను వదలడం లేదు.. తెలంగాణ నుంచి కృష్ణా జిల్లాకు వచ్చి ఇక్కడ చెరకు, పత్తి వంటి పంట పొలాల్లో పనిచేసి తిరిగి వెళ్లిపోతారు. ఇప్పుడు ఆ విధంగా వచ్చిన వార్ని నెల రోజులపాటు ఉండి తమకు ప్రచారం చేయమని కోరుతున్నారు. కూలికి వచ్చినవారికి రూ.300 నుంచి రూ.400 మాత్రమే చెల్లిస్తే.. ఉదయం, సాయంత్రం ప్రచారానికి తిరుగుతారని ముఠా మేస్త్రీలు చెబుతున్నారు. టికెట్ కేటాయింపుపై అనుమానాలున్న అభ్యర్థులు కూడా చివర నిమిషంలో టికెట్ లభిస్తే ఇబ్బంది పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. -
తెలుగుదేశంలో మంటలు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. టిక్కెట్లుదక్కని నేతలు భగ్గుమంటున్నారు. పార్టీ నాయకత్వం తమకు నమ్మకద్రోహం చేసిందంటూ నిప్పులు చెరుగుతున్నారు. తమ సత్తా చూపిస్తామని, టీడీపీ అభ్యర్థులను ఓడించి తీరుతామని ప్రతిజ్ఞలు చేస్తున్నారు. తమ అనుచరులతో కలిసి ఆందోళనకు దిగుతున్నారు. తమకు తీరని అన్యాయం జరిగిందని సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు టీడీపీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. 126 మంది అభ్యర్థులతో సీఎం చంద్రబాబు తొలి జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు టిక్కెట్‌ను మంత్రి జవహర్‌కు మళ్లీ ఇస్తే ఓడిస్తామని ఆయన వ్యతిరేక వర్గం చంద్రబాబుకు అల్టిమేటం జారీ చేసింది. దీంతో జవహర్‌ను కృష్ణా జిల్లా తిరువూరుకు పంపించారు. దీంతో అక్కడి ఇన్చార్జి నల్లగట్ల స్వామిదాసు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జవహర్ శుక్రవారం తిరువూరులో స్వామిదాసు ఇంటికెళ్లారు. స్వామిదాసు వర్గీయులు జవహర్‌ను నిలదీసి నానా హంగామా చేశారు. ఇక్కడ ఎలా గెలుస్తావో చూస్తామంటూ శపథం చేశారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి తనకు మళ్లీ సీటు ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఏడుసార్లు గెలిచిన తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం సిట్టింగ్ ఎమ్మెల్యే గీత కూడా మళ్లీ తనకు అవకాశం ఇవ్వకపోవడంపై మండిపడుతున్నారు. అమలాపురం టిక్కెట్‌ను తనకు కాకుండా మరొకరికి ఎలా ఇస్తారని సిట్టింగ్ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ప్రశ్నించారు. టిక్కెట్ దక్కించుకున్న వ్యక్తిని ఓడిస్తామని ఆయన వర్గం చెబుతోంది. తనకు చింతలపూడి సీటు నిరాకరించడంపై మాజీ మంత్రి పీతల సుజాత ఆవేదన చెందుతున్నారు. దళిత మహిళను కావడం వల్లే తనను దెబ్బతీశారని వాపోతున్నారు. ఇదిలావుండగా చిత్తూరు ఎమ్మెల్యే డీకే సత్యప్రభ ముఖ్యమంత్రిని కలిసి తాను రాజంపేట ఎంపీ స్థానం నుంచి పోటీ చేయలేనని, మళ్లీ చిత్తూరు ఎమ్మెల్యే సీటే ఇవ్వాలని కోరారు. రాజధానిని గుప్పిట్లో పెట్టుకోవడానికి టీడీపీ పెద్దల కుట్ర రాజధాని ప్రాంతంలోని తాడికొండ టిక్కెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌కు కాకుండా బాపట్ల ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రికి ఇవ్వడంపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. శ్రావణ్‌కుమార్ మద్దతుదారులు శుక్రవారం సమావేశమై మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తూ ఉండవల్లిలో చంద్రబాబు ఇంటి వద్ద ఆందోళన చేశారు. రాజధానిని తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి టీడీపీ ముఖ్య నేతలు కుట్రలు పన్నుతున్నారని శ్రావణ్‌కుమార్ వర్గీయులు ఆరోపించారు. టీడీపీ అధిష్టానం తమ మనోభావాలను పట్టించుకోకుండా మరో అభ్యర్థిని తీసుకొచ్చి పోటీ చేయిస్తే టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఓట్లు వేస్తారనుకోవడం అవివేకమన్నారు. శ్రావణ్కుమార్కే టీడీపీ టిక్కెట్ ఇవ్వాలని, లేదంటే టీడీపీ సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేస్తామని, తాడికొండలో టీడీపీని ఓడించి తీరుతామని హెచ్చరించారు. అధిష్టానం ఆదేశిస్తే తాడికొండ నుంచి పోటీ చేయడానికి సిద్ధమని శ్రావణ్‌కుమార్ ప్రకటించారు. నూజివీడులో ముద్దరబోయినను ఓడిస్తాం.. కృష్ణా జిల్లా నూజివీడు టిక్కెట్‌ను ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు కేటాయించడంతో నియోజకవర్గంలోని ఓ ప్రధాన సామాజికవర్గం నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ సామాజిక వర్గానికి కాకుండా బీసీలకు టికెట్ ఇవ్వాలనుకుంటే బచ్చుల అర్జునుడికి ఇవ్వాలని కోరినప్పటికీ అధిష్టానం పట్టించుకోలేదని అంటున్నారు. ముద్దరబోయినను ఓడిస్తామని తేల్చిచెబుతున్నారు. నందిగామలో తంగిరాల సౌమ్యను అభ్యర్థిగా ప్రకటించటంపై అసమ్మతి వ్యక్తమవుతోంది. ఆమెకు వ్యతిరేకంగా పనిచేయాలని నియోజకవర్గ నేతలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. తూర్పు కాపు వర్గానికే విజయనగరం టిక్కెట్ ఇవ్వాలి విజయనగరంలో మీసాల గీతకు మద్దతుగా బీసీ నేతలు సమావేశం ఏర్పాటు చేశారు. సిట్టింగ్గా ఉన్న గీతను కాదని, అశోక్‌గజపతిరాజు కుమార్తె అదితికి టిక్కెట్ ఇవ్వడం సరికాదని అంటున్నారు. నియోజకవర్గంలో అధికంగా ఉన్న తూర్పుకాపు వర్గానికి చెందిన నేతకే టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మంగళగిరిలో లోకేశ్ అభ్యర్థిత్వంపై అసంతృప్తి గుంటూరు తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా నసీర్ అహ్మద్‌ను ప్రకటించడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టిక్కెట్ ఆశించి భంగపడిన టీడీపీ సీనియర్ నేత షౌకత్ అలక బూనారు. దీంతో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా తూర్పు నియోజకవర్గానికి చెందిన మద్దాళి గిరిని ఖరారు చేయడంపై నియోజకవర్గ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వినుకొండ టిక్కెట్‌ను మళ్లీ జీవీ ఆంజనేయులుకే కేటాయించడంపై అసమ్మతివర్గ నాయకులు మండిపడుతున్నారు. ఇందుకు నిరసనగా టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కట్ట వలరాజు పార్టీ పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేశారు. తనపై అసమ్మతి వ్యక్తం చేసిన నాయకులను బుజ్జగించే పనిలో సత్తెనపల్లి అభ్యర్థి, స్పీకర్ కోడెల శివప్రసాదరావు పడ్డారు. మంగళగిరి అభ్యర్థిగా నారా లోకేశ్‌ను ప్రకటించడంతో నియోజకవర్గ టీడీపీలో అసమ్మతి సెగ రాజుకుంది. పార్టీ నేతలతో లోకేశ్ నిర్వహించిన కార్యక్రమానికి మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల గైర్హాజరయ్యారు. పార్టీ మారే యోచనలో బుట్టా రేణుక కర్నూలు జిల్లా ఆలూరు, ఆదోని నియోజకవర్గాల్లో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. ఆలూరు టీడీపీ టిక్కెట్‌ను కోట్ల సుజాతమ్మకు కేటాయించడాన్ని ఇప్పటిదాకా ఇన్చార్జిగా వ్యహరించిన వీరభద్రగౌడ్, వైకుంఠం మల్లికార్జున, మసాల పద్మజ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైఎస్సార్సీపీ టిక్కెట్‌పై కర్నూలు ఎంపీగా గెలుపొందిన బుట్టా రేణుకకు ఆ సీటు ఇవ్వకుండా ఆదోని అసెంబ్లీ టిక్కెట్ కేటాయిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ, చివరకు ఆ టిక్కెట్‌ను మీనాక్షి నాయుడికి కేటాయించారు. దాంతో బుట్టా రేణుక శుక్రవారం తను అనుచరులతో సమావేశమయ్యారు. పార్టీ మారాలని ఆమె యోచిస్తున్నట్లు సమాచారం. -
గవర్నర్‌కు ఎమ్మెల్యేల జాబితా
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికల ప్రక్రియ ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌కుమార్ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నిక ల్లో విజయం సాధించిన అభ్యర్థుల జాబితాను బుధవారం ఆయన రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు సమర్పించారు. అనంతరం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ప్రక్రియను ముగిస్తున్నామని, రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు సైతం ముగిసిందన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు 30 రోజుల్లోగా ఎన్నికల వ్యయాన్ని సమర్పించాల్సి ఉంటుందన్నారు. లక్షల ఓట్ల గల్లంతు అవాస్తవం.. ఓటర్ల జాబితాలో 24 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారం లో అవాస్తవమని సీఈఓ అన్నారు. అంత మొత్తంలో ఓట్లు గల్లంతు జరిగితే ఓట్లు కోల్పోయిన వ్యక్తులు, రాజకీయ పార్టీలు ఒప్పుకునేవారు కాదని, ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్య తలత్తేదన్నారు. ప్రతిసారి ఎన్నికల్లో కొన్ని ఓట్లు గల్లంతు కావడం సహజమేనన్నారు. కొత్త ఓటర్ల నమోదుతో పాటు చనిపోయిన, చిరునామా మారిన ఓటర్ల తొలగింపు కోసం ప్రతి ఏటా ఓటర్ల జాబితా సవరణ నిర్వహిస్తామన్నారు. ఈ నేపథ్యంలో ఏటా ప్రతి ఒక్కరూ తమ పేరు జాబితాలో ఉందో లేదో చూసుకోవాలన్నారు. 2015 లో ప్రచురించిన ఓటర్ల జాబితాలో 2.81 కోట్ల ఓటర్లు ఉండగా, ఆ తర్వాత నిర్వహించిన జాతీయ ఓటర్ల జాబితా ప్యూరిఫికేషన్ కార్యక్రమంలో భాగంగా చనిపోయిన, చిరునామా మారిన 24 లక్షల ఓట్లను తొలగించామన్నారు. 2018లో మూడుసార్లు ఓటర్ల జాబితా సవరణ నిర్వహించగా, 20 లక్షలకు పైగా కొత్త ఓటర్లను నమోదు చేశామన్నారు. ఓటర్ల తొలగింపునకు ముందు 7 రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని కోరుతూ ప్రతి ఓటరుకు స్థానిక బీఎల్ఓలు నోటీసులు జారీ చేశారన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం–2019లో భాగంగా ఓటర్ల నమోదు కోసం డిసెంబర్ 24 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, 2018, డిసెంబర్ 31 నాటి కి 18 ఏళ్లు నిండే వ్యక్తులతో పాటు ఓటర్ల జాబితాలో పేరు లేని వ్యక్తులూ దరఖాస్తు చేసుకోవాలన్నారు. మానవ తప్పిదాలతోనే ఈవీఎం సమస్యలు ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే ఓటమిపాలయ్యామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ చేసిన ఆరోపణలను సీఈవో తోసిపుచ్చారు. ఈవీఎంలను ట్యాంపర్ చేసేందుకు ఆస్కారం లేదన్నారు. పటిష్ట పోలీసు బందోబస్తు, సీసీటీవీ కెమెరాల నిఘా మధ్య ఈవీంలను భద్రపరిచామన్నారు. 100 శాతం వీవీప్యాట్ ఓట్లను లెక్కిం చాలన్న కాంగ్రెస్ విజ్ఞప్తి ఆచరణలో సాధ్యం కాదన్నా రు. మానవ తప్పిదాలతో కౌంటింగ్ సమయంలో ఈవీఎంలతో రెండు రకాల సమస్యలు తలెత్తాయన్నారు. రాష్ట్రంలోని 92 పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్‌లో వేసిన ఓట్లను తొలగించకుండానే పోలిం గ్ను ప్రారంభించడంతో మాక్ పోలింగ్, అసలు పోలింగ్ ఓట్లు కలిసిపోయాయన్నారు. మాక్ పోలింగ్ తర్వాత సీఆర్సీ (క్లియర్ రిపోర్ట్ క్లోజ్) మీటను ప్రిసైడింగ్ అధికారులు నొక్కడం మరిచిపోవడంతో ఈ సమస్య తలెత్తిందన్నారు. వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించడం ద్వారా ఈ పోలింగ్ కేంద్రాల ఓట్లను పరి గణనలోకి తీసుకున్నామన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత ‘పోల్ ఎండ్’ మీట నొక్కకపోవడంతో రెండు పోలింగ్ కేంద్రాల ఈవీఎంలను కౌంటింగ్ రోజు తెరుచుకోలేదన్నారు. స్థానిక అభ్యర్థులు, ఎన్నికల పరిశీలకుల సమక్షంలో ‘పోల్ ఎండ్’ మీటను నొక్కిన తర్వాత ఈ ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కిం చామని, ఆ తర్వాత ఆ ఓట్ల సంఖ్యను వీవీ ప్యాట్ ఓట్ల సంఖ్యతో సరి చూసుకున్నామన్నారు. ఈ రెండు సందర్భాలోనూ వాస్తవంగా పోలైన ఓట్లతో వీవీ ప్యాట్ ఓట్ల సంఖ్యతో సరిపోయాయన్నారు. ఫలితాలపై గెజిట్ నోటిఫికేషన్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 88 టీఆర్ఎస్, 19 కాం గ్రెస్, 7 ఎంఐఎం, 2 టీడీపీ, చెరొక బీజేపీ, ఫార్వర్డ్ బ్లాక్ సభ్యులతో పాటు ఓ స్వతంత్ర అభ్యర్థి పేర్లతో జాబితాను ఇందులో పొందుపరిచింది. -
‘ఫిరాయింపులకు’ ఓటమి
సాక్షి, హైదరాబాద్: గత సార్వత్రిక ఎన్నికల అనంతరం వేర్వేరు పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరిన ఐదుగురు అభ్యర్థులు ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. గతంలో 25 మంది వేర్వేరు పార్టీల ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరగా అందులో 20 మంది విజయం సాధించారు. ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మాత్రం భంగపాటు ఎదురైంది. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున గెలిచి టీఆర్ఎస్లో చేరిన పాయం వెంకటేశ్వర్లు పినపాక నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రేగా కాంతారావు చేతిలో ఓడగా, అశ్వరావుపేట నుంచి పోటీ చేసిన తాటి వెంకటేశ్వర్లు కూటమి అభ్యర్థి మచ్చా నాగేశ్వరరావు చేతిలో, వైరాలో బానోతు మదన్‌లాల్ ఇండిపెండెంట్ అభ్యర్థి రాముల్‌నాయక్ చేతిలో ఓటమి పాలయ్యారు. గతంలో ఇల్లందులో కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన కోరం కనకయ్య ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రియ చేతిలో ఓడారు. మహేశ్వరంలో టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. మరోవైపు గత ఎన్నికల్లో నర్సంపేట నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దొంతి మాధవరెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. -
ఓట్లపై నోట్ల వర్షం!
ఏం చేస్తారో, ఎంత పంచుతారో తెలీదు.. నేను గెలవాలంతే! తన అనుచరులకు ఓ అభ్యర్థి ఆదేశం..అవతలి పార్టీ పంచినదానికి మరో వెయ్యి ఎక్కువే ఇవ్వండి.. ఎక్కడా తగ్గొద్దు. నేను గెలవాలంతే! మరో అభ్యర్థి తన మనుషులకు చేసిన సూచన.. ఇదీ తెలంగాణ ఎన్నికల్లో గెలిచేందుకు ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న అభ్యర్థులు వ్యవహరించిన తీరు. ఏం చేసైనా గెలవాలన్న కసితో వీరు లెక్కలేకుండా డబ్బు పంచారు. ప్రచారం ముగిసేంత వరకు అయిన ఖర్చుతో సంబంధం లేకుండా.. పోలింగ్‌కు చివరి 36 గంటల్లోనే రాష్ట్రవ్యాప్తంగా నోట్ల పంపిణీ వెయ్యికోట్లను దాటడం ఆశ్చర్యపరుస్తోంది. నువ్వెంతంటే నువ్వెంతనే రేంజ్లో ఒకరిని మించి మరొకరు ఖర్చుపెట్టారు. ఏరులై పారిన మద్యానికైతే లెక్కే లేదు. కేంద్ర పరిశీలకులు, రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక అబ్జర్వర్లు, స్క్వాడ్లు ఎందరున్నా యథేచ్ఛగా కోట్లకు కోట్లు రాత్రికి రాత్రే పంపిణీ అయ్యాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇలా జరుగుతున్న పంపిణీ మొత్తాన్ని చూసి.. పలుచోట్ల కొందరు అభ్యర్థులు ఏడ్వటమొక్కటే తక్కువైంది. అప్పటికే రూ.10 కోట్ల వరకు ఖర్చుపెట్టిన గ్రేటర్ హైదరాబాద్‌లో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి.. తన అనుచరులతో ‘నా రక్తం తాగండ్రా’ అన్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. సాక్షి, హైదరాబాద్: ఈ ఎన్నికల్లో అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా డబ్బులను మంచినీళ్ల ప్రాయంగా పంచిపెట్టారు. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులందరూ.. పోలింగ్‌కు 36 గంటల ముందు నోట్లతో ప్రజలను ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. దీంతో ఒక్కో నియోజకవర్గంలో కనిష్టంగా రూ. 10కోట్లు మొదలుకుని.. రూ.45–50 కోట్ల వరకు ఖర్చులు దాటాయనే అంచనాలు వినిపిస్తున్నాయి. అభ్యర్థి ఆర్థిక స్థోమతను బట్టి కొన్ని చోట్ల ఓటుకు రూ.5 వేలు, అంతకంటే ఎక్కువ ఖర్చు చేశారు. కొన్నిచోట్ల ఓటుకు రూ.2,000 ఇస్తే.. మరికొన్ని చోట్ల రూ.500, రూ.300 కూడా పంచారు. పోలింగ్‌కు 36 గంటల ముందు తెలంగాణలో వెయ్యి కోట్ల రూపాయల కుపైగా పంపిణీ జరిగినట్లు ఓ అంచనా. అంతకు ముందు ప్రచార సమయంలో ఖర్చు చేసిన రూ.750 కోట్లు కలుపుకుంటే దాదాపుగా రూ.1,750 కోట్లు ఖర్చయినట్లు భావిస్తున్నారు. రాజకీయ పార్టీలు ఖర్చు చేసిన మొత్తం దీనికి అదనం. మూడు వారాల పాటు సోషల్ మీడియా, పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా రాజకీయ పార్టీలు చేసిన ఖర్చు కలుపుకుంటే మొత్తం రూ.2 వేల కోట్లు దాటే ఉంటుందని.. ఎన్నికలను దగ్గర నుంచి పర్యవేక్షిం చిన ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన ప్రతినిధి వెల్లడించారు. విచ్చలవిడిగా డబ్బుల ఖర్చును నియంత్రించేందుకు నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు ప్రేక్షక పాత్ర పోషించారని, స్వతంత్ర అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనంతగా.. ఈసారి ఖర్చుపె ట్టారని, రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీల మధ్య పోటీగా, ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందునే అభ్య ర్థులు డబ్బు వెదజల్లి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారని మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ పేర్కొన్నారు. భవిష్యత్‌లో సామాన్యు లెవ్వరూ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేని పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని, ఇది ప్రజాస్వా మ్యానికి ద్రోహం చేయడమేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆయన ఎల్బీనగర్ నియోజకరవ్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ నియోజకవర్గంలో రూ. 100 కోట్లు మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగినప్పటికీ.. పోలింగ్‌కు ముందే 110 నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా డబ్బు పంపిణీ జరిగినట్లు సమాచారం. వీటిలో 30కి పైగా నియోజకవర్గాల్లో ఓటర్లకు రూ.300 నుంచి రూ. 500 వరకు అందజేశారు. మరో 40 నియోజకవర్గాల్లో అటు కూటమి, ఇటు టీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ పడి డబ్బు పంచారు. రూ.500 నుంచి రూ.1,000 పంపిణీ చేశారు. మరో 20 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, తీవ్రమైన పోటీ కారణంగా ఓటుకు రూ.2,000 నుంచి రూ.3,000 దాకా పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన 20 నియోజకవర్గాల్లో ఓటుకు రూ.5 వేలు అంతకంటే ఎక్కువే పంపిణీ జరిగింది. ‘నేను ప్రచారం ముగించుకుని కాసేపు సేద తీరాలనుకునేలోపే నా ప్రత్యర్థి రూ.2 కోట్లు పంపిణీ చేశారు. అప్పటిదాకా నాతోనే తిరిగి ప్రచారం చేసిన పది మందికి ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ఇచ్చి ఆయన పార్టీ తరపున పోలింగ్ ఏజెంట్లుగా నియమించుకున్నారు. నేను తేరుకుని రంగంలోకి దిగి ఓటుకు రూ.3వేల చొప్పున పంచాలని ఏర్పాట్లు చేసుకున్నాను. తెల్లారేసరికి మూడు మండలాల్లో పంచేయగానే.. నా ప్రత్యర్థి అవే ప్రాంతాల్లో తను ఓటుకు రూ.2 వేలు పంచడం మొదలుపెట్టారు. తప్పని పరిస్థితిలో నేను ఓటుకు అదనంగా మరో రూ.2 వేలు ఇవ్వాల్సి వచ్చింది’ అని ఓ దక్షిణ తెలంగాణ జిల్లాకు చెందిన ఓ ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థి తన అనుభవాన్ని పంచు కున్నారు. ఆ నియోజకవర్గంలో పోలింగ్ ముగిసే టప్పటికీ రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు రూ.100 కోట్లు ఖర్చు చేశారు. ‘నా రెండు దశాబ్దాల రాజకీయ అనుభవంలో చెపుతున్నా, 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న లోక్‌సభ నియోజకవర్గంలోనూ ఇందులో నాలుగో వంతు కూడా ఖర్చు కాదు. కానీ, ప్రత్యర్థి నా ఓటమి లక్ష్యంగా పన్నుతున్న పన్నాగాలు చూసి ఒక దశలో రాజకీయాలపైనే అసహ్యం కలి గింది. కానీ ఏం చేస్తాం..బరిలో దిగాను కాబట్టి నేనూ అదేస్థాయిలో పంచక తప్పలేదు’ అని ఆ అభ్యర్థి వాపోయారు. ఖమ్మం ఫస్ట్ తెలంగాణలోని పాత పది జిల్లాల్లో భారీగా డబ్బు పంపిణీ చేసిన వాటిలో ఖమ్మం జిల్లాలోని 4 నియోజకవర్గాలు మొదటి స్థానంలో.. పాలమూ రు జిల్లాలోని 4 నియోజక వర్గాలు రెండో స్థానం లో నిలుస్తాయి. ఈ 2 జిల్లాలకు పోటీగా నల్లగొం డ, వరంగల్ జిల్లాలోని చాలా నియోజక వర్గాల్లో డబ్బు పంపిణీ జరిగింది. ఖమ్మం జిల్లాలోని 2 నియోజక వర్గాల్లో పోలింగ్‌కు ఒకరోజు ముందు రూ.30 కోట్ల చొప్పున ఖర్చు చేయగా, మిగిలిన రెండు స్థానాల్లో అభ్యర్థుల ఖర్చు రూ.25 కోట్లు దాటింది. నల్లగొండ జిల్లాలోని ఓ నియోజక వర్గంలో ఒక అభ్యర్థి రూ.40 కోట్లు, ప్రత్యర్థి రూ. 30 కోట్లు ఖర్చు చేశారు. అదే జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో అభ్యర్థి ఖర్చు సగటు రూ.20 కోట్లు దాటిం ది. పాలమూరు జిల్లాలోని 3 నియోజక వర్గాల్లో అభ్యర్థి రూ.35 కోట్లు ఖర్చు చేసినట్లు, చివరి రెండ్రోజుల్లోనే ఈ 3స్థానాల్లో ఖర్చు రూ. 120 కోట్లు దాటిందని ఆ జిల్లాలో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి చెప్పారు. వరంగల్ జిల్లాలోని ఓ నియోజక వర్గంలో అభ్యర్థులు సగటున రూ.30 కోట్లు ఖర్చు చేస్తే ఈ జిల్లాలోని మరో 4 నియోజక వర్గాల్లో అభ్యర్థుల ఖర్చు సగటున రూ.25 కోట్లుగా ఉండొచ్చని భావిస్తున్నారు. -
‘కోమటిరెడ్డి’ టాప్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఆది నుంచీ ఆసక్తికరంగా మారాయి. ముందస్తు ముచ్చట మొదలు ఆద్యంతం అనేక పరిణామాలు ఉత్కంఠ రేపాయి. తాజాగా ఎలక్షన్ వాచ్ సంస్థ అభ్యర్థుల అఫిడవిట్లను పరిశీలించగా మరిన్ని విశేషాలు వెల్లడయ్యాయి. మొత్తం 119 స్థానాల్లో 1821 మంది అభ్యర్థులు బరిలో నిలవగా... 1777 మంది అభ్యర్థుల అఫిడవిట్లను ఈ సంస్థ విశ్లేషించింది. ధనికులు, పేదలు, ఆదాయం, అప్పులు, విద్యావంతులు, మహిళలు, యువత... ఇలా విభిన్న అంశాలపై సంస్థ వెల్లడించిన గణాంకాలివీ... ధనికులు నల్లగొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధనవంతుల జాబితాలో టాప్‌లో నిలిచారు. ఈయన అఫిడవిట్లో రూ.266.86 కోట్ల చరాస్తులు, రూ.47.45 కోట్ల స్థిరాస్తులు చూపారు. మొత్తంగా ఆయనతో పాటు కుటుంబసభ్యుల పేరుతో ఉన్న స్థిర, చరాస్తుల విలువ రూ.314 కోట్లకు పైమాటే. ఇక బాల్కొండ బీఎస్పీ అభ్యర్థి ముత్యాల సునీల్‌కుమార్ స్థిర, చరాస్తులు రూ.182.66 కోట్లతో రెండో స్థానంలో, నాగర్‌కర్నూల్ టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి రూ.161.29 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో ఉన్నారు. పేదలు నిజామాబాద్ అర్బన్ స్వతంత్ర అభ్యర్థి బల్ల శ్రీనివాస్ కేవలం రూ.15 ఆస్తి చూపి అత్యంత నిరుపేదగా నిలిచారు. కోరుట్ల స్వతంత్ర అభ్యర్థి జగిలం రమేష్ రూ.500, పెద్దపల్లి సమాజ్‌వాదీ ఫార్వర్డ్‌బ్లాక్ అభ్యర్థి వేణుగోపాల్‌రెడ్డి రూ.500 ఆస్తులు చూపారు. ‘సున్న’ ఆస్తులున్నవని ప్రకటించినవారు 58 మంది ఉండడం విశేషం. అప్పులు బాల్కొండ బీఎస్పీ అభ్యర్థి ముత్యాల సునీల్‌కుమార్ రూ.144 కోట్లు వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణంగా పొందినట్లు అఫిడవిట్లో చూపి, అప్పులున్న అభ్యర్థుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డి ఆస్తులు రూ.91 కోట్లు కాగా.. అప్పులు రూ.94కోట్లుగా పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్ టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి అప్పులు రూ.63 కోట్లు. ఆదాయం అఫిడవిట్లో ఆదాయం అధికంగా చూపిన అభ్యర్థుల్లో మంచిర్యాల బీజేపీ అభ్యర్థి వీరబెల్లి రఘునాథ్ అగ్రభాగాన నిలిచారు. ఈయన అఫిడవిట్లో రూ.47 కోట్ల ఆస్తులు చూపగా.. ఐటీకి చూపిన ఆదాయం రూ.41కోట్లుగా ఉందని పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్ టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి ఐటీకి చూపిన ఆదాయం రూ.8కోట్లు కాగా.. నారాయణపేట టీఆర్ఎస్ అభ్యర్థి రాజేందర్‌రెడ్డి ఆస్తులు రూ.66కోట్లు, ఆదాయం రూ.7కోట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. విద్యావంతులు 1777 మంది అభ్యర్థుల్లో 5–12వ తరగతి చదివిన అభ్యర్థులు 799 మంది (45 శాతం), 845 మంది (48శాతం) పట్టభద్రులు (గ్రాడ్యుయేట్) ఉన్నారు. 16 మంది అభ్యర్థులు కేవలం అక్షరాస్యులమని తెలపగా, మరో 48 మంది తాము పూర్తిగా నిరక్షరాస్యులమని పేర్కొన్నారు. యువోత్సాహం 748 మంది అభ్యర్థులు(42శాతం) తమ వయస్సు 25–40 సంవత్సరాలుగా ప్రకటించగా... 845 మంది (48శాతం) 41–60 ఏళ్ల మధ్యలో ప్రకటించారు. ఇక 61–80 ఏళ్ల మధ్యలో ప్రకటించినవారు 160 మంది(9శాతం) ఉండగా.. 24 మంది అభ్యర్థులు వయసు పేర్కొనలేదు. మొత్తం స్థానాలు- 119 మొత్తం అభ్యర్థులు- 1821 ఎలక్షన్ వాచ్ పరిశీలించిన అఫిడవిట్లు- 1777 పార్టీల వారీగా... బీజేపీ నుంచి పోటీ చేస్తున్న 118 మందిలో 86మంది (73శాతం), కాంగ్రెస్ అభ్యర్థులు 99 మందిలో 79 మంది (80 శాతం), టీఆర్ఎస్ అభ్యర్థులు 119 మందిలో 107మంది (90 శాతం), బీఎస్పీ అభ్యర్థులు 100 మందిలో 26మంది (26 శాతం), టీడీపీ అభ్యర్థులు 13 మందిలో 12 మంది (92 శాతం) రూ.కోటి కంటే ఎక్కువ ఆస్తులు చూపినట్లు ఎలక్షన్ వాచ్ ప్రకటించింది. సగటు రూ.3.29 కోట్లు ఇక ఎన్నికల్లో బరిలో నిలిచిన మొత్తం అభ్యర్థుల ఆస్తులను పరిగణలోకి తీసుకుంటే సరాసరి ఒక్కో అభ్యర్థి సగటు ఆస్తి రూ.3.29 కోట్లుగా ఉందని ఎలక్షన్ వాచ్ పేర్కొంది. పార్టీల వారీగా చూస్తే టీఆర్ఎస్ అభ్యర్థుల(119) సగటు ఆస్తి రూ.12.48 కోట్లు, బీజేపీ అభ్యర్థుల (118) సగటు ఆస్తి రూ.7.79 కోట్లు, కాంగ్రెస్ అభ్యర్థుల(99) సగటు ఆస్తి రూ.16.03కోట్లు, బీఎస్పీ అభ్యర్థుల (100) సగటు ఆస్తి రూ.5.28కోట్లుగా వెల్లడించింది. మహిళలు జనాభాలో సగం ఉన్నప్పటికీ ఎన్నికల్లో మహిళలకు సముచిత ప్రాధాన్యం దక్కడం లేదు. ఈ ఎన్నికల్లో కేవలం 136 మంది (8శాతం) మహిళలు మాత్రమే బరిలో నిలిచినట్లు ఎలక్షన్ వాచ్ ప్రకటించింది. -
లేదు అలుపు.. వరుస గెలుపు..!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: క్రికెట్ ఆటలో హ్యాట్రిక్ పదాన్ని ఎక్కువగా వింటూ ఉంటాం. మూడు వరుస బంతుల్లో వికెట్లు తీసిన బౌలర్, మూడు బౌండరీలు దాటిన బ్యాట్స్‌మెన్ ఉత్సాహం నేరుగా చూడాల్సిందే.. కానీ మాటల్లో వర్ణించలేం. అదే తరహాలో ఎన్నికల్లో మూడుసార్లు, అంతకంటే ఎక్కువసార్లు విజయం సాధించిన ఎమ్మెల్యేల ఆనందానికి అవధులు ఉండవు. ఇదే సమయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో వరుస ఓటమి, వరుస విజయాలు సాధించిన నేతలు చాలామంది ఉన్నారు. హ్యాట్రిక్ చేసిన వారు ఉన్నారు. హ్యాట్రిక్ చేసి డబుల్ హ్యాట్రిక్ కోసం తహతహలాడుతున్న వారు ఉన్నారు. వరుస ఓటములను లెక్క చేయకుండా బరిలో దిగిన వారు ఉన్నారు. టికెట్ కోసం ఆశించి భంగపడటం, ఒకవేళ టికెట్ వచ్చినా ఓటమి చెందడం.. ఈ అనుభవాలు రాజకీయ పార్టీల నేతలకు మరపురానివే. గెలుపు ఓటములు దైవాధీనం.. ప్రజల్లో ఉండటమే ప్రధానం అనుకుని తరచూ ఎన్నికల్లో పోటీ చేసే నేతలది కూడ జిల్లాలో రికార్డే. డిసెంబర్ 7న జరిగే పోలింగ్ కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీల నుంచి పోటీచేసే ఐదారుగురు మినహా అందరూ అభ్యర్థులు ఓటర్లకు సుపరిచితులే. ప్రస్తుతం ఎన్నికల బరిలో నిలిచిన కొందరు నేతల గత వివరాలను పరిశీలిస్తే.. హ్యాట్రిక్వీరులు... డబుల్ హ్యాట్రిక్ రేసు ఈటల రాజేందర్.. 2004లో కమలాపూర్‌లో ఎమ్మెల్యేగా గెలిచారు. అక్కడినుంచే 2008 ఉప ఎన్నికల్లో విజేతగా నిలిచారు. ఆ తర్వాత అనూహ్యంగా హుజురాబాద్ నియోజకవర్గానికి రాజకీయ మకాం మార్చిన ఈయన 2009, 2010 (ఉప ఎన్నిక), 2014లో వరుస విజయాలతో సత్తాచాటారు. తాజాగా ఈ ఎన్నికల్లో బరిలో నిలిచి డబుల్ హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నారు. తాజామాజీ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ఏడోసారి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఒకసారి ఓడిన ఈయన వరుస విజయాలే సాధించారు. రద్దైన మేడారం నియోజకవర్గం నుంచి ఆయన టీడీపీ తరఫున 1994లో తొలిసారి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తర్వాత 2004లో రామగుండం టీఆర్ఎస్ అభ్యర్థిగా మారి ఎమ్మెల్యేగా తొలి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత 2008 ఉపఎన్నికలో విజేతగా నిలిచారు. తరువాత ధర్మపురి నియోజకవర్గానికి మారిన ఆయన 2009, 2010 (ఉప ఎన్నిక), 2014లో వరుస విజయాలతో దూసుకెళ్లారు. ఈ ఏడాది మళ్లీ పోటీలో ఉన్నారు. డబుల్ హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు. వేములవాడ తాజామాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుతోపాటు మంత్రి కేటీఆర్ 2009, 2010 (ఉప ఎన్నిక), 2014 ఎన్నికల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. హ్యాట్రిక్‌తో సరి.. ఈ సారి గెలుపే లక్ష్యం.. కోరుట్ల మాజీ ఎమ్మెల్యేగా ఉన్న కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు 2009లో కోరుట్ల నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. 2009, 2010 (ఉప ఎన్నిక), 2014లో గెలిచిన ఈయన.. రద్దైన మెట్పల్లి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఈసారి ఐదో ప్రయత్నంగా పోటీకి సై అంటున్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హ్యాట్రిక్‌తో కూడా సరి పెట్టుకున్నారు. 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. 2014లో ఓటమి చెందిన ఆయన... ఈ ఎన్నికల్లో ఐదోసారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. 1999లో పెద్దపల్లి నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన గుజ్జుల రామకృష్ణారెడ్డి తర్వాత నాలుగుసార్లు ఓటమి చెంది.. ఐదోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పెద్దపల్లి నుంచి పోటీ చేయనున్న ఈయన 1999లో ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత 2004లో 2009లో ఓటమి చెందారు. 2014లో రామగుండం నుంచి పోటీ చేసినా ఓటమి తప్పలేదు. ఈసారి మళ్లీ పెద్దపల్లి నుంచి బీజేపీ అభ్యర్థిగానే బరిలో నిలిచారు. గెలుపోటములు ఇలా.. 2004లో మంథని నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సోమారపు సత్యనారాయణ రెండోస్థానంలో నిలిచారు. తరువాత రామగుండం నియోజకవర్గం నుంచి 2009, 2014లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. నాలుగోసారి ఈ ఎన్నికల్లో ఆయన పోటీ పడుతున్నారు. 2009లో టీడీపీ నుంచి కరీంనగర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన గంగుల కమలాకర్ 2014లో టీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. ఇప్పుడు మూడోసారి పోటీలో నిలిచి హాట్రిక్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. వీరిని మినహాయిస్తే రెండోసారి పోటీలో ఉన్నవారు 10మంది వరకు ఉన్నారు. ఇందులో రసమయి బాలకిషన్, దాసరి మనోహర్‌రెడ్డి గత ఎన్నికల్లో గెలిచారు. ఇక కరీంనగర్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకులు పొన్నం ప్రభాకర్ రెండోసారి శాసనసభకు పోటీ చేస్తున్నారు. 2004లో కరీంనగర్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన 23,012 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. మూడోసారి పోటీలో ఉన్నవారు 9 మంది ఉన్నారు. ఇందులో చింతకుంట విజయరమణారావు, బొడిగె శోభ, ఆరెపల్లి మోహన్, పుట్ట మధు ఎమ్మెల్యేలుగా గెలిచినవారే. బొడిగె శోభ గతంలో కమలాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందగా.. చొప్పదండి నుంచి 2014లో టీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మేడారం నుంచి ఒకసారి.. ధర్మపురి నుంచి గతంలో రెండు సార్లు పోటీ చేసి ఓటమి చెందిన అడ్లూరి లక్ష్మ ణ్‌కుమార్ ఈ ఎన్నికల్లో అదష్టాన్ని పరీక్షించుకోబోతున్నా రు. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఒకే ఒక్క సీటును కోల్పోయిన టీఆర్ఎస్.. ఈసారి మళ్లీ అదే అభ్యర్థి సంజయ్‌కుమార్‌ను జగిత్యాల నుంచి బరిలోకి దిం పింది. అలాగే మొదటి సారిగా ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా చాలామందే ఉన్నారు. విలక్షణ నేత జీవన్‌రెడ్డి పదోసారి విలక్షణ రాజకీయవేత్తగా పేరున్న జగిత్యాల తాజామాజీ ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి పదోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. 1983 నుంచి జగిత్యాల నియోజకవర్గంలో జరిగిన ప్రతి శాసనసభ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపిన నేతగా ఆయన గుర్తింపు పొందారు. సుమారు 35 ఏళ్లుగా రాజకీయాల్లో తన ప్రాధాన్యం చూపిస్తున్నారు. టీడీపీ నుంచి మొదటగా ఆయన 1983లో పోటీ చేసి గెలిచారు. తర్వాత వరుసగా జరిగిన ప్రతి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నారు. 1983, 1989, 1996 (ఉపఎన్నిక), 1999, 2004, 2014లో విజయం సాధించారు. 1985, 1994, 2009 ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు. వరుసగా గతంలో జరిగిన తొమ్మిది ఎన్నికల్లో నామినేషన్ వేసి పోటీకి సిద్ధమైన నాయకుడిగా రాష్ట్రస్థాయిలో రికార్డు ఉంది. ఈసారి కూడా ఆయన జగిత్యాల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. -
పగలు ప్రచారం.. రాత్రి మంతనాలు..
కరీంనగర్: ఎన్నికల ప్రచారం రోజురోజుకూ ముమ్మరవుతోంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఇందులోభాగంగా అనుచరుల్లోని ముఖ్యులను రంగంలోకి దింపి ఓటర్లను ఆకర్షించేందుకు యత్నిస్తున్నారు. ప్రధానంగా సామాజికవర్గాల వారీగా ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు కుస్తీ పడుతున్నారు. కుల పెద్దలను రహస్యంగా సంప్రదిస్తున్నారు. పోలింగ్‌బూత్‌ల వారీగా ఉన్న ఓట్లను సామాజిక వర్గాల వారీగా గుర్తించి ఆకట్టుకునేందుకు బృందాలు ఏర్పాటుచేశారు. పగలు ప్రచారం.. రాత్రి మంతనాలు సాగిస్తూ అభ్యర్థులతోపాటు వారి అనుచరులు పడరాని పాట్లు పడతున్నారు. అన్ని సామాజిక వర్గాల మద్దతు లభిస్తే విజయం సునాయాసమన్న భావనలో అభ్యర్థులున్నారు. నియోజకవర్గాల వారీగా ఉన్న మొత్తం ఓట్లలో ఎక్కువ ప్రాబల్యం కలిగిన ఓట్లను పరిగణనలోకి తీసుకుంటున్న అభ్యర్థులు.. ఆయా సామాజిక వర్గాలను ఆకట్టుకునేందుకు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. ఇప్పటికే ఓటర్ల తుది జాబితాను ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నేపథ్యంలో మొత్తం ఓటర్ల ఏయే సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. గెలుపోటములను నిర్దారించే పోలింగ్ బూత్‌లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న అభ్యర్థులు సామాజికవర్గాల వారీగా ఓటర్లను గుర్తించేందుకు ప్రత్యేకంగా ఒక టీమ్ తయారు చేసుకుని తీసివేతలు, కూడికలు మొదలుపెట్టారు. గెలుపుబాటలో పయనించాలంటే తీసుకోవాల్సిన చర్యలపై మంతనాలు ముమ్మరం చేశారు. అన్ని సామాజిక వర్గాల మద్దతు కూడగట్టుకుంటే విజయం సునాయాసంగా వరిస్తుందనే భావనలో అభ్యర్థులు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ఎక్కువ ఓట్లు కలిగి ఉన్న సామాజిక వర్గాన్ని గుర్తించి వారి మద్దతు ను తమవైపు తిప్పుకునే పనిలో పడ్డారు. ప్రతి నియోజక వర్గంలో 40 నుంచి 45 శాతం ఓటర్ల మద్దతును కూడగట్టుకుంటే విజయం తథ్యమనే భావన అభ్యర్థుల్లో నెలకొంది. ఇప్పటికే పలు రాజకీయ పక్షాలకు అనుకూలంగా వ్యవహరించే ఓటర్లను మినహాయించి తటస్థంగా ఉన్న ఓటర్లపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. కులపెద్దలతో మంతనాలు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు కులాలు, మతాలవారీగా ఓటర్లను గుర్తించి ఆయా వర్గాలకు చెందిన పెద్దలతో అనుచరగణం సహాయంతో మంతనాలు చేస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని సామాజికవర్గాలకు చెందిన పెద్దల సెల్ నంబర్లను సేకరిస్తున్నారు. ప్రతిరోజు సమయం దొరికినప్పుడల్లా ఫోన్లలో వారిని ఆప్యాయంగా పలుకరించి గెలుపునకు సహకరించాలని కోరుతున్నారు. ఇదే సమయంలో స్థానిక సమస్యలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను వారితో ప్రస్తావించి గెలిచిన వెంటనే తొలి ప్రాధాన్యమిచ్చి పరిష్కరిస్తామని హామీలిస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు భిన్నరూపం దాల్చడంతో ఎన్నికల సమయంలోనే సమస్యల పరిష్కారానికి పునాది రాయి పడాలనే ముందుచూపుతో అన్ని సామాజికవర్గాలు వ్యవహరిస్తున్నాయి. పెద్దలను ముందువరుసలో నిలబెట్టి ప్రచారానికి వచ్చే అభ్యర్థులను అదిచేయాలి.. ఇది చేయాలి.. తమ ఇబ్బందులను తొలగించే వారికే ఓటేస్తామంటూ తెగేసి చెబుతున్న సందర్భాలు ఉంటున్నాయి. ప్రతి ఎన్నికల్లో కొన్ని సామాజిక వర్గాల అభ్యర్థులు గెలుపోటములను శాసిస్తున్నాయి. అలాంటి సామాజికవర్గాన్ని గ్రామాల వారీగా గుర్తించేందుకు అభ్యర్థులు పక్కా ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. తుది ఓటర్ల జాబితాలోని ఓటర్ల శాతానికి అనుగుణంగా సామాజికవర్గాలను ఆకర్షించేందుకు అభ్యర్థులు అంకెలగారడీతో కుస్తీ పడుతూ గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తుండడంతో రాజకీయ రణరంగం రసవత్తరంగా మారుతోంది. రెండు వైపులా వారే... పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరిని నమ్మాలో..? ఎవరిని దూరంగా ఉంచాలో అర్థం కాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఉదయం ఓ అభ్యర్థి ప్రచారంలో కనిపిస్తున్న వ్యక్తులు చీకటి కాగానే మరో అభ్యర్థి శిబిరంలో చేరిపోతున్నారు. తమకే ఓట్లు వేయిస్తామని నమ్మబలుకుతున్నారు. మందు, విందు పార్టీల్లో మునిగితేలుతున్నారు. ఒక్కరుగా వెళ్లకుండా కొంత మందిని పోగేసుకుని వెళ్తున్నారు. వీరిని బుజ్జగించడానికి అభ్యర్థులు తంటాలు పడుతున్నారు. మరికొందరు ఇప్పటికే ఫిరాయింపులకు పాల్పడి చేరిన పక్షం వైపు చక్రం తిప్పుతున్నారు. -
ఇక మిగిలింది 3 రోజులే
ఆదిలాబాద్‌టౌన్: అసెంబ్లీ ఎన్నికల మహా సంగ్రామంలో ప్రచార గడువు సమీపిస్తుంది. ఈనెల 5న సాయంత్రం 5 గంటల వరకు ప్రచార గడువు ఉంది. ఈ లెక్కన సోమ, మంగళ, బుధ మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా ప్రచారంలో మునిగితేలుతున్నారు. నిన్న, మొన్నటి వరకు గ్రామాలను చుట్టిన అభ్యర్థులు ప్రస్తుతం రోడ్ షోలపై దృష్టి సారించారు. మరోవైపు పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో ఆందోళన మొదలైంది. ఓటర్లను తమ వైపు తిప్పుకునేలా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమైన నాయకులను వెంటబెట్టుకుని ప్రచార జోరును పెంచారు. అభ్యర్థుల్లో టెన్షన్..టెన్షన్ ఈనెల 7న పోలింగ్ జరగనుండడంతో ఆయా పార్టీల నుంచి ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. కంటి మీద కునుకు లేకుండా ప్రచారం సాగిస్తున్నారు. ముఖ్యంగా యువకులను మచ్చిక చేసుకోవడంతో పాటు ఆయా కులసంఘాలు, ఉద్యోగ సంఘాలు, మత పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. తాము గెలిస్తే అన్నివిధాలా సహకరిస్తామని, కమ్యూనిటీ భవనాలు, తదితర వాటిని నిర్మించి ఇస్తామని హామీలు గుప్పిస్తున్నారు. కాగా ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 33 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుంచి జోగు రామన్న, కాంగ్రెస్ అభ్యర్థిగా గండ్రత్ సుజాత, బీజేపీ నుంచి పాయల్ శంకర్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. బోథ్‌లో టీఆర్ఎస్ తరపున రాథోడ్ బాపురావు, కాంగ్రెస్ నుంచి సోయం బాపూరావ్, బీజేపీ నుంచి మడావి రాజు, స్వతంత్ర అభ్యర్థి అనిల్ జాదవ్‌తో పాటు పలువురు ఎన్నికల బరిలో ఉన్నారు. అయితే ఇక్కడ కూడా త్రిముఖ పోటీ నెలకొననున్నట్లు తెలస్తోంది. ఖానాపూర్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి రేఖానాయక్, కాంగ్రెస్ నుంచి రాథోడ్ రమేశ్, బీజేపీ నుంచి సట్ల అశోక్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఉదయం 6గంటల నుంచి రాత్రి 10గంటల వరకు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి వరకు కులసంఘాల వారితో రహస్యంగా మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గెలుపుకోసం సర్వశక్తులా ప్రయత్నాలు సాగిస్తున్నారు. చివరి రోజులు కీలకం.. గత కొన్ని రోజులుగా ఆయా పార్టీల నాయకులు ప్రచారం చేసినప్పటికీ అభ్యర్థులు ప్రస్తుతం ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గంతో పాటు మిగతా నియోజకవర్గాల్లో పలు పార్టీలు గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తమ పార్టీని గెలిపిస్తే చేపట్టబోయే అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. ఇన్నిరోజుల ప్రచారం ఒకెత్తు అయితే చివరి రోజుల్లో ప్రచారంపై ఫోకస్ పెట్టారు. పోలింగ్‌కు ముందు రెండు, మూడు రోజులను కీలకంగా భావిస్తున్నారు. ఈ రెండు రోజుల్లో సమీకరణాలు ఎటు మారుతాయోనని చూస్తున్నారు. ప్రత్యేకంగా ఈ రెండు రోజులు ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి అభ్యర్థులు ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నారు. కాగా ఆఖరు రోజుల్లో మద్యం, డబ్బుల ప్రవాహం పారే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతుచిక్కని ఓటరు నాడీ.. గత ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికలు భిన్నంగా కనిపిస్తున్నాయి. ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది స్పష్టంగా కనబడటం లేదు. ఎవరినైనా అడిగితే గెలిచేవారికే ఓటు వేస్తామని సమాధానం ఇస్తున్నారు. ఆయా కూడలీలు, బస్టాండ్ ప్రాంతాలు ఎక్కడ చూసినా ఎన్నికల ప్రస్తావనే ఉంటుంది. కనబడిన వారందరిని ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది చర్చించుకుంటున్నారు. అయితే ఆయా పార్టీల కార్యకర్తలు, నాయకులు మాత్రం తమ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో వారం రోజుల్లో ఆయా పార్టీల అభ్యర్థుల భవిత తేలనుంది. ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచిచూడాల్సిందే. -
ఈ గట్టునుండాలా.. ఆగట్టుకెళ్లాలా...!
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఎన్నికలంటే నోట్ల పండగగా మారిన పరిస్థితి.. ఓటు అంగట్లో సరుకుగా మారిన దుస్థితి. ఒకప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటును వినియోగించుకునే ఓటరును స్వార్థ ప్రయోజనాలతో కొంతమంది రాజకీయ నాయకులు ప్రలోభాలకు గురిచేయడంతో ఓటుకు నోట్ల బేరం పెరుగుతోంది. ప్రస్తుతం రాజకీయాలలో నైతిక విలువలు దిగజారుతున్న తరుణంలో ప్రధాన నేతలు అవకాశాన్ని బట్టి టికెట్లను సంపాదించుకుంటున్నా ద్వితీయ శ్రేణి నాయకత్వం మాత్రం డోలాయమానంలో పడే పరిస్థితులు నెలకొన్నాయి. అధిష్టానవర్గాల నిర్ణయాల మేరకు ప్రధాన నేతలు కలుస్తున్నా ద్వితీయశ్రేణి నాయకత్వంలో మాత్రం విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు ద్వితీయశ్రేణి నాయకత్వం పరిస్థితి ఇలా ఉంటే.. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి స్వార్థ రాజకీయాలకు తెరతీసే కొంతమంది చోటామోటా నాయకులు ఏ గట్టునుంటే మంచిది... ఎంత గిట్టుబాటవుతుంది, ఉన్న నాయకుడిని నమ్ముకుంటే భవిష్యత్తు ఉంటుందా.. లేదా ప్రత్యర్థి నాయకుని పంచన చేరితే ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయా అని లెక్కలు వేసుకునే పరిస్థితి ఉంది. అంతర్గతంగా మదనపడుతూనే ఎన్నికల సమయం తప్పితే ప్రధాన నాయకులు తమ మాట వినే పరిస్థితి ఉండదనే ఆలోచనతో బేరసారాలకు కూడా తెరతీస్తున్నారు. పరోక్షంగా ప్రత్యర్థి ప్రధాన నాయకుడికి ఆ వర్గంలో ఉన్న ద్వితీయశ్రేణి నాయకత్వంతో సంకేతాలు కూడా పంపుతున్నారు. ఎన్నికలకు కేవలం 10 రోజుల గడువు మాత్రమే ఉండటంతో ఈ ఎన్నికల్లో తాము ఏమేరకు ఆర్థిక వనరులను సమకూర్చుకుంటామోననే ఆలోచనతో ప్రతి ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా తర్జనబర్జన పడుతున్నారు. స్థాయిని బట్టి రేటును ఫిక్స్ చేసుకునే పరిస్థితి ఉంది. ఈసారి కొత్తగూడెం నియోజకవర్గంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న విషయం విదితమే. తాము తప్పనిసరిగా పోటీ చేస్తామని నాయకులు కూడా అనివార్యంగా దీర్ఘకాలిక ప్రయోజనాల నేపథ్యంలో ఒక్కటికాక తప్పదని రాజీపడి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మరోవైపు అధికారపక్షం కూడా తమదైన శైలిలో ప్రచారపర్వాన్ని ప్రారంభించింది. ఇంకోవైపు ప్రతిసారి టికెట్ కోసం ఆశించి భంగపడిన నేత సైతం మరోసారి ప్రజాబలాన్ని నమ్ముకునే ఎన్నికల బరిలో దిగారు. బరితో ఉన్న ముగ్గురు బలమైన అభ్యర్థులే అయినప్పటికీ కిందిస్థాయి కేడర్ కదలికలు మాత్రం ఎవరికీ అర్థంకాని పరిస్థితి ఉంది. వీళ్లు కాకుండా మరికొంతమంది ద్వితీయశ్రేణి నాయకత్వం ఇంకా తమ మద్దతు ఎవరికీ ప్రకటించకుండా తటస్థంగా ఉన్నారు. నలుగురు గుమిగూడే ప్రతి ప్రాంతంలోనూ డబ్బుల చర్చ, అభ్యర్థులు ఎవరు గెలుస్తారనే చర్చ తప్ప మరొకటి కన్పించడంలేదు. ఇదంతా చూస్తున్న రాజకీయ విశ్లేషకులు మాత్రం ఎన్నికలంటే ఇలా కూడా ఉంటాయా అంటూ ముక్కున వేలు వేసుకునే పరిస్థితి ఉంది. -
ఆ మూడు నియోజకవర్గాల్లో నువ్వా.. నేనా..
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో బరిలో ఉండే అభ్యర్థులెవరో తేలింది. ఆయా నియోజకవర్గాల్లో పోటీ ఏయే పార్టీల మధ్య ఉంటుందనే స్పష్టత వచ్చింది. జిల్లాలో తొమ్మిది స్థానాల్లో మూడు నియోజకవర్గాల్లో నువ్వా.. నేనా.. అన్నట్లుగా పోటీ పడుతున్నారు. ఆరు స్థానాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు దీటుగా ఆరు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గట్టి పోటీని ఇస్తున్నారు. జిల్లాలో తొమ్మిది స్థానాలకు మొత్తం 119 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్, బీజేపీ తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోగా ఆయా పార్టీల అభ్యర్థులకు రెబల్స్ బెడద లేకుండా పోయింది. దీంతో ఆయా స్థానాల్లో నెలకొనే పోటీపై స్పష్టత వచ్చినట్లయిం ది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 91 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నిజామాబాద్ అర్బన్‌లో త్రిముఖ పోటీ నెలకొంది. టీఆర్ఎస్ అభ్యర్థి, తాజామాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త, కాంగ్రెస్ అభ్యర్థి, డీసీసీ అధ్యక్షులు తాహెర్‌బీన్‌హందాన్‌లు నువ్వానేనా అన్నట్లుగా పోటీ పడుతున్నారు. అనూహ్యంగా బీజేపీ తిరుగుబాటు అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణగుప్త పోటీ నుంచి తప్పుకోవడంతో బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ కూడా ఈ నియోజకవర్గంలో గట్టి పోటీనిస్తున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం రణం రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు బాజిరెడ్డి గోవర్ధన్, డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి, గడ్డం కేశ్‌పల్లి ఆనందర్‌రెడ్డిల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ముగ్గురు అభ్యర్థులు కూడా హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తుండటంతో రూరల్ రణరంగాన్ని తలపిస్తోంది. బోధన్‌లో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు షకీల్ ఆమేర్, పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డిల మధ్య పోరు రసవత్తరంగా మారింది. పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ ఇద్దరు అభ్యర్థులు కూడా గెలుపు కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తుండటంతో ఈ నియోజకవర్గంలో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఆర్మూర్‌లో త్రిముఖ పోరు కొనసాగుతోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఆకుల లలిత మధ్య హోరాహోరీ నెలకొంది. బీజేపీ అభ్యర్థులు పొద్దుటూరి వినయ్ కుమార్‌రెడ్డిలు కూడా గట్టి పోటీని ఇస్తున్నారు. గెలుపు కోసం ఎవరికి వారే పావులు కదుపుతున్నారు. బాల్కొండలో ద్విముఖ పోటీ నెలకొంది. టీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి ఈరవత్రి అనీల్‌లు గెలుపుకోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ బీఎస్పీ అభ్యర్థిగా బరిలో ఉన్న ముత్యాల సునీల్‌రెడ్డి తన సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో ప్రధానంగా మూడు పార్టీల అభ్యర్థులు బలంగా ఉండటంతో ఈ నియోజకవర్గం పోరు రసవత్తరంగా తయారైంది. టీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్, కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్‌అలీ, బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డిలు తమ గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఎల్లారెడ్డిలో మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది. టీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నల్లమడుగు సురేందర్‌ల మధ్య గట్టి పోటీ నెలకొంది. బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు బాణాల లక్ష్మారెడ్డి బరిలో ఉండటంతో ఇక్కడ పోరు జోరందుకుంది. బాన్సువాడలో ద్విముఖ పోటీ ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థి, ఆపద్ధర్మ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కాసుల బాలరాజుల మధ్య పోరు సాగుతోంది. జుక్కల్‌లో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. టీఆర్ఎస్ అభ్యర్థి హన్మంత్‌షిండే, కాంగ్రెస్ అభ్యర్థి సౌదాగర్ గంగారాంలు సై అంటే సై అంటున్నారు. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన అరుణతార బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. పలు స్థానాల్లో బీఎల్ఎఫ్, బీఎస్పీ అభ్యర్థులు కూడా ప్రధాన పార్టీలకు దీటుగా ప్రచారం నిర్వహిస్తుండగా, ఆమ్ఆద్మీ, పిరమిడ్‌పార్టీ ఆఫ్ ఇండియా, సమాజ్‌వాది పార్టీ, శివసేన, అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్, ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్ వంటి పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. -
సమరానికి సై
కీలక ఘట్టం ముగిసింది.. ఇక పోరు తుది ప్రచారానికి తెరలేచింది.. బరిలో నిలిచిన అభ్యర్థులు నిద్ర లేచింది మొదలు కాలికి, నోటికి, చేతికి పని చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.. గడప గడపకూ తిరగాలి.. ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలి.. ఓటున్న ప్రతి ఒక్కరినీ పలకరించాలి.. అయినోళ్లయినా.. కానోళ్లయినా.. ఆఖరికి ప్రత్యర్థి అయినా.. అవసరం మరి.. ఓటు విలువంటే ఇప్పుడే కదా తెలిసేది.. గెలిపిస్తే చేసే అభివృద్ధి గురించి వివరించాలి.. అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇవ్వాలి..ఓటరు నాడి పట్టుకోవాలి.. ఇలా శాసనసభ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఉన్న సమయాన్నిసాధ్యమైనంతవరకు పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులను వెంటేసుకుని ఓటర్లను కలిసే పనిలో పడ్డారు. బరిలో నిలిచే అభ్యర్థులు గురువారం ఖరారు కావడంతో ప్రచారాన్ని మరింత ఉరకలెత్తించేందుకు సిద్ధమవుతున్నారు. సాక్షిప్రతినిధి, ఖమ్మం: అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 133 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజు కావడంతో గురువారం 36 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఆయా పార్టీల నుంచి టికెట్లు ఆశించి.. రాకపోవడంతో బరిలో నిలిచిన తిరుగుబాటు, స్వతంత్ర అభ్యర్థులను పార్టీల ముఖ్య నేత లు, అభ్యర్థులు బుజ్జగించడంతో ప్రధాన పార్టీల నుంచి తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థుల్లో ఇద్దరు ప్రధాన పార్టీల అభ్యర్థులు మినహా అనేక మంది ఉపసంహరించుకున్నారు. ఖమ్మం జిల్లాలో నామినేషన్ల పరిశీలన అనంతరం 76 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వారిలో 14 మంది అభ్యర్థులు వివిధ కారణాలతో ఉపసంహరించుకున్నారు. దీంతో జిల్లాలో మొత్తం 62 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నామినేషన్ల పరిశీలన తర్వాత 93 మంది అభ్యర్థులు ఉండగా.. వారిలో 22 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో భద్రాద్రి జిల్లా నుంచి 71మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బుజ్జగింపులతో వెనక్కు.. పార్టీ టికెట్ రాకపోవడంతో నామినేషన్ వేసిన పలువురు అభ్యర్థులు బుజ్జగింపులతో వెనక్కు తగ్గారు. వీరిలో ఇల్లెందు నుంచి కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో రెబెల్‌గా నామినేషన్లు వేసిన ఇద్దరు అభ్యర్థులున్నారు. చీమల వెంకటేశ్వర్లు, దళ్సింగ్నాయక్లను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హరిప్రియనాయక్, ఇతర ముఖ్య నేతలు నామినేషన్ ఉపసంహరించుకోవాలని బుజ్జగించడం.. భవిష్యత్‌లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయే అని.. పార్టీ, ప్రభుత్వపరంగా అనేక అవకాశాలు ఉంటాయని వారికి నచ్చజెప్పారు. దీంతో ఇద్దరు నేతలు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇదే ప్రయత్నం వైరాలో కాంగ్రెస్ నేతలు చివరి నిమిషం వరకు చేసినా ఫలించలేదు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున టికెట్ ఆశించిన రాములునాయక్ తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ స్థానాన్ని సీపీఐకి కేటాయించడంతో ఆయనకు కొందరు కాంగ్రెస్ శ్రేణులతోపాటు టీఆర్ఎస్లోని అసమ్మతి వర్గం వెన్నుదన్నుగా నిలిచింది. దీంతో కాంగ్రెస్ నేతలు, ప్రజాకూటమి భాగస్వామ్య పక్షాలైన సీపీఐ వర్గాలు ఆయనతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. చివరకు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం నుంచి కొందరు కాంగ్రెస్ నేతలను దూతలుగా పంపించి.. నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేసినా ఆయన అంగీకరించలేదు. దీంతో నామినేషన్ ఉపసంహరణ గడువు వరకు వివిధ రకాల ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్ నేతలు రాములునాయక్ వినకపోవడంతో వెనుదిరిగారు. ఇక అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ ఆశించిన సున్నం నాగమణి తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు ఆమెను సంప్రదించి.. ప్రజాకూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న మెచ్చా నాగేశ్వరరావుకు మద్దతుగా నామినేషన్ ఉపసంహరించుకోవాలని అభ్యర్థించడంతో ఆమె నామినేషన్‌ను ఉపసంహరించుకుని మెచ్చా విజయానికి కృషి చేస్తానని ప్రకటించారు. అలాగే అశ్వారావుపేటలో తెలంగాణ జనసమితి అభ్యర్థిగా నామినేషన్ వేసిన మక్కా ప్రసాద్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ తిరుగు బాటు అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఫజల్ అహ్మద్‌ను నామినేషన్ ఉపసంహరించుకోవాల్సిందిగా ప్రజాకూటమి అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోర డం.. కాంగ్రెస్ పార్టీ సైతం ఆయనకు నచ్చజెప్పడంతో నామినేషన్ ఉపసంహరించుకున్నారు. అయితే నామినేషన్ల ఉపసంహరణ పూర్తి కావడం తో ఎన్నికల బరిలో ఎవరెవరు ఉంటున్నారనే అంశం స్పష్టం కావడంతో ఆయా రాజకీయ పక్షా లు ప్రచారాన్ని మరింత వేగవంతం చేశాయి. ఇక ఇల్లెందు నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య చేత నామినేషన్ ఉపసంహరింపజేసేందుకు కాంగ్రెస్, ప్రజాకూటమి భాగస్వామ్య పక్షాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బరిలో నుంచి తప్పుకునేది లేదంటూ అబ్బయ్య ప్రకటించడంతో కాంగ్రెస్ నేతలు రాష్ట్ర నాయకులతో మాట్లాడించారు. అయినా అబ్బయ్య వెనక్కు తగ్గక.. చివరికి బరిలో నిలిచారు. -
మెదక్‌లో లెక్క తేలింది..
ఎన్నికల ప్రక్రియలో రెండు ప్రధాన ఘట్టాలు ముగిసాయి. దీంతో రెండు స్థానాల నుంచి పోటీలో ఉండే అభ్యర్థులెవరో ఖరారయింది. మెదక్, నర్సాపూర్ నుంచి మొత్తం 31 నామినేషన్లు దాఖలయ్యాయి. స్క్రూటినీలో తిరస్కరించినవి, అభ్యర్థుల ఉపసంహరణ తర్వాత ఆ సంఖ్య 19గా తేలింది. ఇప్పుడు అందరి దృష్టి మెదక్ నుంచి పోటీలో ఉన్న అన్నదమ్ములు శశిధర్‌రెడ్డి, ఉపేందర్రెడ్డిలపైనే ఉంది. ప్రత్యర్థులెవరో తేలడంతో అభ్యర్థులు వారి అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికలకు ఇంకా కేవలం పట్టుమని పదిహేను రోజులు కూడా లేవు. ఈ కొద్ది సమయంలో విజయం సాధించడానికి అన్ని రకాల ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. అందరూ ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. సాక్షి,మెదక్ : ,మెదక్ జిల్లాలోని రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్న అభ్యర్థుల లెక్క తేలింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారంతో ముగిసింది. 19 మంది అభ్యర్థులు బరిలో ఉంటున్నారు. మెదక్ స్థానం నుంచి పన్నెండు, నర్సాపూర్ నుంచి ఏడుగురు పోటీలో ఉన్నారు. మెదక్ స్థానం నుంచి నామినేషన్ వేసిన టీజేఎస్ పోటీ నుంచి తప్పుకుంది. ఆ పార్టీ అభ్యర్థి జనార్దన్‌రెడ్డి నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఆయన తరఫున న్యాయవాది బాలయ్య మెదక్ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ వీరబ్రహ్మచారికి నామినేషన్ ఉపసంహరణ పత్రాలను అందజేశారు. మాజీ ఎమ్మెల్యే పి.శశిధర్‌రెడ్డి విత్‌డ్రా చేసుకుంటారని ప్రచారం జరిగినా.. ఆయన నామినేషన్ ఉపసంహరించుకోలేదు. దీంతో మెదక్ నియోకజవర్గం నుంచి అన్నదమ్ములు ఉపేందర్‌రెడ్డి(కాంగ్రెస్), శశిధర్‌రెడ్డి(ఎన్సీపీ) పోటీలో ఉన్నారు. నర్సాపూర్ నియోజకవర్గం నుంచి ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు యాదగిరి, పుర్ర ఊశయ్య నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్ నుంచి పద్మాదేవేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి అమ్మారెడ్డిగారి ఉపేందర్‌రెడ్డి, బీజేపీ నుంచి ఆకుల రాజయ్య, బీఎస్పీ నుంచి అశోక్‌కుమార్, ఎన్సీపీ నుంచి శశిధర్‌రెడ్డి పోటీలో ఉన్నారు. ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందిన పార్టీల నుంచి ఐదుగురు అభ్యర్థులతోపాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులున్నారు. నర్సాపూర్ నుంచి ప్రధానంగా టీఆర్ఎస్ నుంచి మదన్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి సునీతారెడ్డి, బీజేపీ నుంచి గోపీ, బీఎస్పీ నుంచి సోమన్నగారి లక్ష్మీ, సీపీఎం నుంచి మల్లేశం పోటీ చేయనున్నారు. వీరితోపాటు మనపార్టీ తరఫున దిగంబర్ ముదిరాజ్, స్వతంత్ర అభ్యర్థి నవీన్ పోటీలో ఉన్నారు. ఆసక్తిగా అన్నదమ్ముల పోటీ.. మహాకూటమిలో మెదక్ టికెట్ దక్కించుకున్న టీజేఎస్ చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకుంది. పొత్తులో భాగంగా మెదక్ టికెట్‌ను టీజేఎస్ అభ్యర్థి జనార్దన్‌రెడ్డికి ఇచ్చారు. అయితే కాంగ్రెస్ తరఫున ఉపేందర్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించి బీఫామ్ అందజేసింది. పొత్తు ధర్మం పాటించని కాంగ్రెస్ వైఖరిపై టీజేఎస్ నేతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అయింది. కాంగ్రెస్ అభ్యర్థిని పోటీ నుంచి తప్పుకోవాలని టీజేఎస్ కోరినప్పటికీ స్నేహపూర్వక పోటీ పేరిట ఎన్నికల బరిలో నుంచి తప్పుకునేందుకు కాంగ్రెస్ నిరాకరించంది. దీంతో టీజేఎస్ అభ్యర్థి పోటి నుంచి తప్పుకోవాని నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ వైఖరి వల్లే తాను పోటీలో నుంచి తప్పుకున్నానని, భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తారని ఆయన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకుంటారని ముందుగా ప్రచారం సాగింది. కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్‌రెడ్డి తన çసోదరుడైనా ఆయన నామినేషన్ విత్‌డ్రా చేసుకునేలా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఆయన నామినేషన్ ఉపసంహరించుకునేందుకు నిరాకరించారు. అన్నదమ్ముళ్లు ఇద్దరు ఎన్నికల్లో పోటీ చేయడంపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఊపందుకోనున్న ఎన్నికల ప్రచారం ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో శుక్రవారం నుంచి ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది. అన్ని పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించారు. ఎన్నికలకు ఇంకా రెండు వారాలు సమయం ఉండటంతో అభ్యర్థులంతా ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నమవుతున్నారు. ప్రధాన రాజకీయపార్టీల అభ్యర్థులు స్టార్ క్యాంపెయినర్లను రంగంలో దింపేందుకు సిద్ధం అవుతున్నారు నర్సాపూర్ నియోకజవర్గం.. అభ్యర్థి పేరు పార్టీ చిలుముల మదన్‌రెడ్డి టీఆర్ఎస్ వాకిటి సునీత కాంగ్రెస్ అజ్జమర్రి మల్లేశం సీపీఎం సింగాయపల్లి గోపి బీజేపీ సోమన్నగారి లక్ష్మి బీఎస్పీ మన్నె దిగంబర్ ముదిరాజ్ మన పార్టీ నవీన్ స్వతంత్ర -
బరిలో..‘వీరు’లు!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఆరు నియోజకవర్గాలు .. వంద మంది అభ్యర్ధులు. నల్లగొండ జిల్లా ఎన్నికల బరిలో వివిధ రాజకీయ పార్టీల తరఫున పోటీలో ఉన్నవారు, స్వతంత్రులు కలిపి అభ్యర్ధుల సంఖ్య సెంచరీ దగ్గర ఆగిపోయింది. ప్రధా న పార్టీలను మినహాయిస్తే వీరిలో ఇండిపెండెం ట్లు ఏకంగా ... మంది పోటీలో ఉన్నారు. గురువారం ముగిసిన నామినేషన్ల ఉప సంహరణ తర్వాత ఈ లెక్క తేలింది. అత్యధికంగా మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి 29 మంది అభ్యర్ధులు పోటీ పడుతుండగా, అతి తక్కువగా దేవరకొండనుంచి 10 మంది అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. టికెట్లు రాక అలక బూని రెబల్స్‌గా నామినేషన్లు దాఖలు చేసిన వారు ఉపసంహరణ రోజు వెనక్కి తగ్గారు. మిర్యాలగూడలో నాటకీయ పరిణామాలు మిర్యాలగూడ నుంచి సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి టికెట్ ఆశించారు. చివరి నిమిషం దాకా ఢిల్లీలో ఉండి ప్రయత్నాలు చేసినా, టికెట్ దక్కలేదు. ఇక, టీఆర్ఎస్లో టికెట్ దక్కక కాంగ్రెస్ గూటికి చేరిన అలుగుబెల్లి అమరేందర్ రెడ్డికి అక్కడా చుక్కెదురైంది. రఘువీర్‌కు టికెట్ ఇవ్వని పక్షంలో తనకు అవకాశం ఇవ్వాలని అలుగుబెల్లి కోరారు. కాంగ్రెస్ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న ఆయన చివరకు రెబల్‌గా బరిలోఉంటానని నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఈ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీలో ఇటీవలే చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే , బీసీ నేత ఆర్.కృష్ణయ్యకు కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బరిలో ఉండడంతో ఆయన తన నామినేషన్‌ను ఉప సంహరించుకోక తప్పలేదు. ఒకవేళ తెలంగాణ జన సమితి (టీజేఎస్)కు ఈ స్థానాన్ని కేటాయిస్తే మాత్రం బరిలో కొనసాగుతానని ముందే ప్రకటించారు. చివరకు ఈ సీటును కాంగ్రెస్‌కే ఇవ్వడంతో ఆయన వెనక్కి తగ్గారు. ముందు నుంచీ ఈ స్థానం తమకు కేటాయించాలని పట్టుబట్టిన టీజేఎస్ తమ అభ్యర్థిగా విద్యాధర్ రెడ్డిని ప్రకటించి బీఫారమ్ కూడా ఇచ్చింది. దీంతో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. కానీ, ఉప సంహరణ రోజు టీజేఎస్ అభ్యర్థి సైతం పక్కకు తప్పుకున్నారు. దీంతో కాంగ్రెస్‌కు రెబల్స్ బెడదతోపాటు, టీజేఎస్ నుంచి స్నేహపూర్వక పోటీ కూడా తప్పిపోవడంతో పార్టీ నాయకత్వం ఊపిరి పీల్చుకుంది. నకిరేకల్‌లో కాంగ్రెస్‌కు ‘ఇంటి’ పార్టీ మద్దతు మహాకూటమిలో చేరిన రోజునుంచి తమకు నకిరేకల్ స్థానం కావాలని డిమాండ్ చేసిన తెలంగాణ ఇంటి పార్టీ చివరకు ఆ స్థానం నుంచి పక్కకు తప్పుకుంది. ఆ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన చెరుకు లక్ష్మి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న చిరుమర్తి లింగయ్యకు మద్దతుగా పనిచేస్తామని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ ప్రకటించారు. కాగా, మునుగోడు నియోజకవర్గంలో మాత్రం ఇంటి పార్టీ అభ్యర్థి పోటీలోనే ఉన్నారు. సీట్ల కేటాయింపు సమయంలో ఒక దశలో నకిరేకల్‌ను ఇంటి పార్టీకి కేటాయించినట్లు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ కుంతియా ప్రకటన కూడా చేశారు. కానీ, కాంగ్రెస్ జిల్లా నాయకత్వంనుంచి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో చివరకు చిరుమర్తినే టికెట్ వరించింది. రాష్ట్రంలో రెండు స్థానాలు కోరిన ఇంటి పార్టీ జిల్లాలో కనీసం ఒక్క స్థానమైనా కేటాయించాలని ఒత్తిడి పెంచినా ఉపయోగం లేకపోవడంతో నకిరేకల్‌లో పోటీకి దిగింది. కానీ, చివరకు నామినేషన్‌ను ఉపసంహరించుకుని చిరుమర్తికి మద్దతు ప్రకటించింది. పోటీలో 46 మంది స్వతంత్రులు జిల్లా పరిధిలోని ఆరు నియోజకవర్గాల్లో నూరు మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, వారిలో స్వతంత్రులే 46 మంది ఉన్నారు. మిగిలిన 54 మంది ప్రధాన రాజకీయ పార్టీలు, ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. అత్యధికంగా మిర్యాలగూడ బరిలోనే 18 మంది ఇండిపెండెంట్లుగా ఉన్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఆరుగురు, నకిరేకల్‌లో ఇద్దరు, మునుగోడులో ఆరుగురు, దేవరకొండలో ముగ్గురు, నల్లగొండ నియోజకవర్గంలో పదకొండు మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. -
బరిలో 67మంది
నిజామాబాద్‌అర్బన్: అసెంబ్లీ ఎన్నికలకు జిల్లాలోని ఆరు నియోజక వర్గాల్లో మొత్తం 67 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ గురువారం ముగియగా ఆయా నియోజక వర్గాల్లో రిటర్నింగ్ అధికారులు బరి లో నిలిచిన అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. ఈనెల 12 నుంచి 19 వరకు నామినేషన్ల స్వీకరణ, 21, 22 తేదీల్లో నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణలు కొనసాగాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 94 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయ గా 16 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 78 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందగా, అనంతరం 11 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఆయా నియోజక వర్గాల్లో టికెట్లు ఆశించిన భంగపడిన వారు పోటీనుంచి తప్పుకున్నారు. బాన్సువాడలో కాంగ్రెస్ రెబెల్ మల్యాద్రి రెడ్డి పోటీ నుంచి తప్పుకున్నారు. రెబల్‌గా బరిలో నిలిచిన అభ్యర్థులను ఆయా పార్టీల రాష్ట్ర నాయకులు బుజ్జగించారు. కొందరు రెబల్స్ పార్టీ నాయకుల సూచనల మేరకు ఉపసంహరించుకున్నారు. నిజామాబాద్ అర్బన్‌లో కాంగ్రెస్ టికెటు ఆశించిన భంగపడిన రత్నాకర్ ఆల్ఇండియా ఫార్వాడ్బ్లాక్ పార్టీ నుంచి పోటీలో ఉంటున్నట్లు పేర్కొన్నారు. నిజామాబాద్ అర్బన్‌లో బీజేపీ నుంచి టికెటు ఆశించి భంగపడిన ధన్పాల్ సూర్యనారాయణ శివసేన పార్టీ నుంచి నామినేషన్ వేశారు. అనంతరం బీజేపీ రాష్ట నాయకుడు కిషన్‌రెడ్డి తదితరులు నిజామాబాద్ వచ్చి ధన్‌పాల్‌ను కలిసి పోటీనుంచి తప్పించారు. మిగిలిన నియోజక వర్గాల్లో పోటీ కొనసాగనుంది. పోలింగ్ రోజు సెలవు ప్రకటించాలి నిజామాబాద్ అర్బన్: వచ్చే నెల డిసెంబర్ 7న సాధారణ ఎన్నికలకు పోలింగ్‌జరుగనుందన అన్ని వాణిజ్య సంస్థలు, దుకాణాలు కార్మిక విభాగం సముదాయాలు సెలవు ప్రకటించాలని ఉప కార్మిక కమిషనర్ చతుర్వేది ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసిందని ఆయన తెలిపారు. కార్మికులందరు తమ ఓటు హక్కు వినియోగించుకునేందకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించాలన్నారు. పోలింగ్ రోజున తప్పనిసరిగా దుకాణాలు, వ్యాపారాలు మూసిఉంచాలన్నారు. -
వందే యువతరం
ఈ రోజుల్లో ఎన్నికల బరిలో నిలిచి గెలవడం మాటలు కాదు. అంతా నోట్లతోనే పని. అయితే ‘మనీ’తో కాదు ‘నేమ్’తోనూ నెగ్గుకు రావచ్చంటూ కొందరు యువకులు ఈ ఎన్నికల్లో పోటీకి దిగారు. తమ పేరు నలుగురికీ పరిచయమైతే చాలని కొందరంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి లక్షల్లో ఖర్చు.. చేసేందుకూ వెనుకాడబోమంటున్నారు. గెలిచే అవకాశాలున్నా లేకున్నా బరిలో నిలవడమే ధ్యేయమని అంటున్నారు. తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్న యువతే పోటీకి ముందు వరుసలో ఉండగా, జిల్లాల్లో సామాజిక ఉద్యమాల్లో క్రియాశీల పాత్ర పోషించిన యువత రెండో వరుసలో ఉన్నారు. బరిలో నిలిస్తే బలమెంతో తెలస్తుందని కొందరు, బలం నిరూపించుకొని ప్రధాన పార్టీలకు దగ్గర కావాలనే స్పృహతో ఇంకొందరు పోటీకి సై అంటున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో 25–35 ఏళ్ల వయస్సు గల యువకులు దాదాపు 250 మంది పోటీలో నిలిచారు. వీరిలో 50 మంది వివిధ పార్టీల తరఫున బరిలో ఉండగా, మిగతా వారంతా ఇండిపెండెంట్లే. పేరొస్తే చాలు.. ఎమ్మెల్యేగా పోటీ చేస్తే పేరు వస్తుందనే కొందరు యువకులు పోటీకి దిగుతున్నట్టు చెబుతున్నారు. ఈ రోజుల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడమంటే మాటలు కాదని, అయినా తమ పేరైనా పదిమందికీ తెలుస్తుందంటున్నారు. ఖర్చులకు కూడా తగిన వనరులను సమకూర్చుకుంటున్నట్టు కొందరు చెబుతున్నారు. గతంలో వివిధ పార్టీల్లో పనిచేసిన అనుభవంతో, యువతను రాజకీయాల్లోకి ఆకర్శించేందుకు తాను రాజకీయాల్లోకి దిగానంటున్నాడు గౌటే గణేశ్. గతంలో కొత్తపల్లి సర్పంచ్‌గా పోటీ చేసిన అనుభవంతో శివసేన టికెట్‌పై సిరిసిల్ల నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నట్టు చెబుతున్నాడు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన అనుభవంతో నాగర్‌కర్నూలు స్థానం నుంచి పోటీకి దిగుతున్న రాజు నేత.. ‘అమరుల ఆశయ సాధనకు, రాజకీయాల పంథాను మార్చడానికి ఒక ప్రయత్నం చేస్తున్నా’నని అంటున్నాడు. ‘నాకున్న పరిచయాలతోనే జడ్చర్ల నుంచి పోటీకి దిగుతున్నా’నని చెబుతున్నాడు కరాటే రాజు. ఇలా ఎవరికి వారు పలువురు యువకులు లక్ష్యాలను నిర్ధేశించుకుని ఎన్నికల సమరాంగణంలోకి దూకుతున్నారు. ఈసారి యువ ఓటర్లూ ఎక్కువే.. ఈ ఎన్నికల్లో యువత పెద్దసంఖ్యలో పోటీలో ఉంటే, ఓటర్లగానూ యువత అధిక సంఖ్యలో నమోదయ్యారు. గా ఉన్నారు. రాష్ట్రంలో 18–19 ఏళ్ల మధ్య వయసున్న 7,96,174 మంది కొత్త యువ ఓటర్లు త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 4,56,470 మంది యువకులు, 3,39,560 మంది యువతులు, 2,695 మంది ఇతరులున్నారు. ఇక, 20–29 ఏళ్ల మధ్య గల ఓటర్లూ పెద్దసంఖ్యలోనే ఉన్నారు. చాలాచోట్ల వీరి ఓట్లే అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయని అంచనా. నోటా గెలిస్తే.. సీటు గల్లంతే! ఓటు వేస్తున్న క్రమంలో బరిలో ఉన్న అభ్యర్థులెవరూ నచ్చకపోతే ఓటరు నోటాకే జై కొడుతున్న సంగతి తెలిసిందే. 2013లో నోటాను ప్రవేశపెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా వివిధ ఎన్నికల్లో ఈ నోటా చాలాసార్లు అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసింది. చాలా సందర్భాల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన అభ్యర్థుల ఓట్ల మధ్య తేడా.. నోటాకు వచ్చిన ఓట్లతో సమానం. ఇది నోటాకున్న శక్తి. కానీ బరిలో ఉన్న అభ్యర్థులందరికన్నా నోటాకే ఎక్కువ సీట్లు వచ్చినా.. పెద్దగా ప్రభావం ఉండదు. ఇలాంటి సమయాల్లో.. అందరికంటే ఓట్లు సంపాదించిన అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తున్నారు. కానీ ఈ పరిస్థితులను మార్చేందుకు హరియానా ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోంది. భారత ఎన్నికల చరిత్రలో తొలిసారిగా.. నోటాను కూడా అభ్యర్థిగా గుర్తించనున్నారు. అందరికన్నా ఎక్కువ ఓట్లు నోటాకు వస్తే.. మళ్లీ ఎన్నికలను నిర్వహించనున్నారు. డిసెంబర్ 16న హరియాణాలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో ఈ నిబంధనను అమలుచేయనున్నట్లు హరియాణా ఎన్నికల ప్రధానాధికారి దలీప్ సింగ్ పేర్కొన్నారు. ‘నోటాకన్నా అభ్యర్థులకు తక్కువ ఓట్లు వస్తే మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తాం. రెండోసారి కూడా నోటాకే ఎక్కువ ఓట్లు వస్తే.. ఎక్కువ సీట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తాం’ అని దలీప్ వెల్లడించారు. డిసెంబర్16న హిసార్, రోహ్తక్, యమునానగర్, పానిపట్, కర్నాల్ మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. సార్.. చిల్లరే ఇవ్వగలను! మొన్నటికిమొన్న మధ్యప్రదేశ్‌లో ఓ అభ్యర్థి నామినేషన్ ధరావతుగా నాణేలను చెల్లించిన సంగతి మరువకముందే.. రాజస్తాన్‌లో ఇలాంటి ఘటనే తెరపైకి వచ్చింది. రాజస్తాన్‌లోని పచ్పద్రా నియోజక వర్గంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న సమర్థ రామ్ అనే 35 ఏళ్ల యువకుడు.. నామినేషన్ పత్రాలను సమర్పించారు. దీంతోపాటుగా రూ.10వేల విలువైన నాణాలను రిటర్నింగ్ అధికారికి ఇచ్చారు. ‘ఈ చిల్లరమొత్తాన్ని లెక్కపెట్టలేను. నాకొద్దు’ అని ఆ అధికారి సమర్థ రామ్‌కు చెప్పేశారు. అయితే తన వద్ద నోట్లు లేవని.. చిల్లరమాత్రమే ఉందని చెప్పడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరించాల్సి వచ్చింది. -
బుజ్జగింపులు.. సంప్రదింపులు..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రచారం హోరెత్తించేందుకు ప్రధాన పార్టీలు పదును పెడుతున్నాయి. పార్టీ టికెట్లు ఆశించి భంగపడి రెబెల్స్, స్వతంత్రులుగా నామినేషన్లు వేసిన వారిని బుజ్జగించే పనిలో పడ్డారు. జిల్లాలో సీనియర్ నేతలు ఓ వైపు మంతనాలు జరుపుతూనే.. మరోవైపు హైదరాబాద్ పెద్దలతో ఫోన్లలో మాట్లాడిస్తున్నారు. పార్టీలు ప్రకటించిన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తే ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు ఇస్తామని సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నెల 19న నామినేషన్ల ఘట్టం ముగియగా, పూర్వ కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గాల నుంచి 296 మంది అభ్యర్థులు, 496 నామినేషన్లను దాఖలు చేశారు. ఇందులో టీఆర్ఎస్, మహాకూటమి, బీజేపీ, బీఎల్ఎఫ్ అభ్యర్థులతోపాటు అన్ని పార్టీల రెబెల్స్, స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. ప్రధాన పార్టీల నుంచి టికెట్లు ఆశించి భంగపడిన పలువురు అల్‌ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, బీఎస్పీ తదితర పార్టీల తరఫున కూడా నామినేషన్లు దాఖలు చేశారు. మంగళవారం నిర్వహించిన పరిశీలనలో 34 మంది నామినేషన్లను తిరస్కరించారు. నామినేషన్ల ఉపసంహరణకు నేడు చివరి రోజు కావడంతో పలుచోట్ల నామినేషన్లు దాఖలు చేసిన టీఆర్ఎస్, మహాకూటమిలకు రెబెల్స్ అభ్యర్థులతో ఆయా పార్టీల నేతలు రెండు రోజులుగా సంప్రదింపులు జరుపుతున్నారు. సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల ఆఖరి నిమిషం వరకూ టికెట్ కోసం ఆశపడిన అభ్యర్థులు చాలాచోట్ల మహాకూటమికి తలనొప్పిలా మారుతున్నారు. దీంతో మహాకూటమికి రెబెల్స్ బెడద తప్పేలా లేదు. హుస్నాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి బీ–ఫారం వస్తుందని నామినేషన్ వేశారు. చివరి నిమిషంలో ఆ సీటును సీపీఐకి కేటాయించారు. దీంతో బీ–ఫారం జత చేయని కారణంగా ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఆయన మహాకూటమి ప్రచారానికి దూరంగా ఉన్నారు. కోరుట్ల నియోజకవర్గంలో చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన జువ్వాడి నర్సింగారావు ప్రచార జోరు పెంచగా, ఇక్కడ టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి, ఆమె భర్త అయిన మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు సహకరించే పరిస్థితి లేదు. వీరిని పోటీ నుంచి తప్పుకునేలా ఒప్పించే ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి. పెద్దపల్లి నియోజకవర్గంలో హస్తం గుర్తు అభ్యర్థి విజరమణారావుకు పోటీగా ఇద్దరు నాయకులు సురేశ్‌రెడ్డి, ధర్మయ్య నామినేషన్లు వేశారు. ఇందులో సురేశ్‌రెడ్డి నామపత్రం తిరస్కరణకు గురి కాగా, పోటీకి సై అంటున్న చేతి ధర్మయ్యను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎప్పటిలాగే కాంగ్రెస్ నుంచి అర డజను మంది టికెట్ కోసం తీవ్రంగా పోటీ పడ్డారు. పాడి కౌశిక్‌రెడ్డి, ముద్దసాని కశ్యప్‌రెడ్డి తదితరులు నామినేషన్ వేశారు. చివరి నిమిషంలో నామినేషన్ల చివరి రోజు కౌశిక్‌రెడ్డికి పార్టీ బీ–ఫారం ఇవ్వడంతో మిగతా వారు అసంతృప్తితో రగిలారు. తుమ్మేటి సమ్మిరెడ్డి, పరిపాటి రవీందర్‌రెడ్డి మంగళవారం సీఎం కేసీఆర్ సభలో గులాబీ తీర్థం పుచ్చుకోగా.. అనూహ్యంగా కశ్యప్‌రెడ్డి నామినేషన్ తిరస్కరణకు గురి కావడంతో ‘రెబెల్స్’ బెడద కౌశిక్‌రెడ్డికి తప్పింది. ఆ నియోజకవర్గం నుంచి నాలుగు పర్యాయాలు ఓటమికి గురైనా.. తిరిగి ధర్మపురి టికెట్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కే ఇవ్వడంపై అక్కడి నుంచి టికెట్ ఆశించిన మద్దెల రవీందర్, కవ్వంపెల్లి సత్యనారా>యణ తదితరులు అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. వీటన్నింటినీ అధిగమించిన ఉప సంహరణల రోజున సమస్యలను అధిగమించి ప్రచారాన్ని హోరెత్తించేందుకు పార్టీ నేతలు వ్యూహం రూపొందిస్తున్నారు. టీఆర్ఎస్కు అక్కడక్కడా.. చీలిక ఓట్లకు అడ్డుకట్ట వేసే యత్నం.. పార్టీ టికెట్లు, గుర్తులు రాకపోవడంతో ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగుతున్న వారిని నిలువరించకపోతే ఓట్లు చీలే ప్రమాదం ఉందని ప్రధాన పార్టీలు అంచనా వేస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు అక్కడక్కడా రెబెల్స్ బెడద ఉన్నా.. ఓట్లు చీలికుండా అడ్డుకట్ట వేసేందుకు వ్యూహాత్మకంగా వ్యహరిస్తున్నారు. చొప్పదండి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బొడిగె శోభ.. ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అంతకుముందు ఆమె సుమారు రెండు నెలలపాటు టికెట్ తనకే వస్తుందంటూ టీఆర్ఎస్ పక్షాన ప్రచారం చేశారు. చివరకు బీజేపీ నుంచి దిగుతున్నందునా అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి ఓట్లకు చీలిక పడకుండా అధికార పార్టీ ఎత్తులు వేస్తోంది. రామగుండంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా మళ్లీ సోమారపు సత్యనారాయణ బరిలో ఉండగా.. అక్కడి నుంచి కోరుకంటి చందర్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులు ఇస్తామని అధిష్టానం కోరుకంటి చందర్‌ను వారించే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. కోరుట్ల, జగిత్యాల నుంచి టీఆర్ఎస్ ఆశించిన జువ్వాడి నర్సింగారావు.. కోరుట్లలో తాజా మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జగిత్యాలలో డాక్టర్ సంజయ్‌కుమార్‌కే మళ్లీ పార్టీ టికెట్ ఇచ్చారు. దీంతో పార్టీ మారిన నర్సింగారావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోరుట్ల నుంచి బరిలో ఉన్నారు. ఆయన వెంట టీఆర్ఎస్ శ్రేణులు వెళ్లకుండా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేçస్తున్నారు. ఇదిలా వుండగా చాలా నియోజకవర్గాల్లో స్వతంత్రులు.. చిన్న పార్టీల అభ్యర్థుల పోటీ ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావితం చేస్తుందన్న ఆందోళనలో కూడా నేతలు ఉన్నారు. 2014తో పోలిస్తే ఈసారి ప్రతీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరగ్గా, 8 నుంచి 27 మంది వరకు నామినేషన్లు వేశారు. నామినేషన్ల పరిశీలనలో మొత్తం 13 నియోజకవర్గాల్లో 34 తిరస్కరణకు గురి కాగా, ఉప సంహరణ తర్వాత కూడా 10 మందికి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో చిన్నా చితక పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే గుర్తులను బట్టి ఒక్కో నియోజకవర్గంలో వెయ్యి నుంచి పది వేల వరకు ఓట్లు అటు ఇటూగా చీలితే.. నువ్వా నేనా అన్న రీతిలో పోటీ సాగే చోట గెలుపోటములు తారుమారయ్యే అవకాశం లేకపోలేదన్న ఆందోళన కూడా కొన్ని చోట్ల ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని రెబెల్స్, స్వతంత్ర అభ్యర్థుల ఉపసంహరణకు చాలాచోట్ల ప్రయత్నం చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. కాగా.. వీటన్నింటిపై గురువారం నామినేషన్ల ఉపసంహరణ తర్వాత స్పష్టత రానుంది. -
నేటి సాయంత్రం వరకే నామినేషన్ల ఉపసంహరణకు...
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: పార్టీ టికెట్లు రాని ఆశావహులు రెబల్స్‌గా బరిలోకి దిగడంతో అభ్యర్థుల్లో ఆందోళన పెరుగుతోంది. హోరాహోరీ పోరులో రెబల్స్‌గా పోటీ చేస్తున్న నేతల వల్ల ఓట్లు చీలిపోతాయని భయపడుతున్న అభ్యర్థులు వివిధ మార్గాల ద్వారా ఇంటిపోరు లేకుండా చూసుకునే ‘ఆఖరి’ ప్రయత్నాల్లో మునిగిపోయారు. అదే సమయంలో పార్టీ అధిష్టానాలు కూడా తిరుగుబాటుదారులుగా నామినేషన్లు వేసిన వారిని బుజ్జగించే ప్రయత్నాల్లో ఉన్నాయి. గురువారం సాయంత్రానికి నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తున్న నేపథ్యంలో రాయబారాలు జోరందుకున్నాయి. పార్టీ అభ్యర్థికి సహకరిస్తే భవిష్యత్తులో మేలు జరిగేలా ఒప్పందాలు సాగుతున్నాయి. తూర్పున టీఆర్ఎస్ రెబల్స్.. టీఆర్ఎస్ అభ్యర్థిత్వాన్ని ఆశించి భంగపడ్డ నేతలు రెండు నెలల నుంచే వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా మంచిర్యాల, కుమురం భీం జిల్లాల నుంచే టీఆర్ఎస్కు రెబల్స్ బెడద ఉంది. అయితే వారిని ఉపసంహరించుకునేలా ఒత్తిళ్లు లేకపోవడం గమనార్హం. మంచిర్యాల ఎంపీపీ బేర సత్యనారాయణ బీఎస్పీ, మరో నాయకుడు ఆరె శ్రీనివాస్ బీఎల్ఎఫ్ తరుపున గత నెలన్నర రోజులుగా ప్రచారం సాగిస్తున్నారు. తాజాగా చల్లగుల్ల విజయశ్రీ అనే మహిళా నాయకురాలు ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేశారు. వీరుముగ్గురు పోటీలో కొనసాగనున్నారు. చెన్నూరు టికెట్టు ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి గడ్డం వినోద్ బెల్లంపల్లి నుంచి బీఎస్పీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆయనను ఉపంసంహరించుకునేలా సోదరుడు వివేక్ ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. అయితే ఆయన మాత్రం పోటీకే మొగ్గు చూపుతున్నారు. బెల్లంపల్లిలో మాజీ ఎమ్మెల్యే ఎ.శ్రీదేవి ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచారు. సిర్పూరులో మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఇండిపెండెంట్‌గా పోటీకి సిద్ధమయ్యారు. మిగతా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ తరుపున తిరుగుబాటు బెడద పెద్దగా లేదు. బోథ్‌లో టికెట్టు ఆశించి భంగపడ్డ ఎంపీ నగేష్ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. గురువారం నాటి సీఎం సభతో ఆయన కూడా కలిసివచ్చే అవకాశం ఉంది. రంగంలోకి కాంగ్రెస్ పెద్దలు.. కాంగ్రెస్ టికెట్టు ఆశించి భంగపడ్డ నాయకులు ఇండిపెండెంట్లుగా, వివిధ పార్టీల అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. వీరి నామినేషన్లు ఉపసంహరించుకునేలా జిల్లా ముఖ్య నాయకులు రంగంలోకి దిగారు. అయితే తాము గెలవకపోయినా, ఓడించే శక్తి ఉందని భావిస్తున్న నాయకులు తదనుగుణంగా పావులు కదుపుతున్నారు. చెన్నూరులో కాంగ్రెస్ టికెట్టు ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి బోడ జనార్ధన్ బీఎల్ఎఫ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. సిర్పూరులో రావి శ్రీనివాస్ బీఎస్పీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. వీరిద్దరు నామినేషన్లను ఉపసంహరించుకునే పరిస్థితి కనిపించడం లేదు. సిర్పూరు టీఆర్ఎస్ అభ్యర్థి కోనప్పకు సమీప బంధువైన రావి శ్రీనివాస్ పోటీ చేయడం వల్ల కాంగ్రెస్‌కు కొంతమేర నష్టం కలిగే అవకాశాలున్నాయి. ముథోల్‌లో టికెట్టు కోసం పోటీ పడ్డ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ ఎన్సీపీ నుంచి బరిలో నిలిచారు. ఖానాపూర్‌లో గత ఎన్నికల్లో పోటీ చేసిన హరినాయక్ ఈసారి టికెట్టు రాక స్వతంత్రుడిగా పోటీ పడుతున్నారు. వీరి నామినేషన్లు ఉప సంహరింపజేసేందుకు కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. టీజేఎస్ స్నేహపూర్వక పోటీనా..?. మహాకూటమిలో భాగంగా తెలంగాణ జన సమితికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీట్లు కేటాయించకపోయినా, చెన్నూరు, ఆసిఫాబాద్, ఖానాపూర్ నియోజకవర్గాల నుంచి నామినేషన్లు దాఖలు చేసింది. ఈ మూడు నియోజకవర్గాల్లో స్నేహపూర్వక పోటీలో ఉంటారా? ఉపసంహరించుకుంటారా?అనేది తేలాల్సి ఉంది. పొత్తు ధర్మంలో ఇచ్చి పుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తామని చెపుతున్న కోదండరాం తమ పార్టీ అభ్యర్థుల విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియక కాంగ్రెస్ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. చెన్నూరు నుంచి దుర్గం నరేష్, ఆసిఫాబాద్ నుంచి కొట్నాక్ విజయ్, ఖానాపూర్ నుంచి కాట్ర భీంరావు పోటీ చేస్తున్నారు. ముథోల్‌లో ముష్కం రామకృష్ణగౌడ్ ఎన్సీపీ అభ్యర్థి నారాయణరావు పటేల్‌కు మద్దతిస్తున్నారు. గురువారం సాయంత్రం లోగా టీజేఎస్ అభ్యర్థులు ఉపసంహరించుకుంటారనే భావనతో కాంగ్రెస్ అభ్యర్థులున్నారు. -
బుగ్గల జమానా
భైంసాటౌన్(ముథోల్): ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ ప్రచారానికి ఉపయోగపడే ప్రతీ సాధనాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రచార రథాలు, ఫ్లెక్సీలు, కరపత్రాలు, వాల్‌పెయింటింగ్‌లతోపాటు ప్రధాన ప్రాంతాల్లో భారీ బెలూన్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా రాజకీయ పార్టీల గుర్తులు, అభ్యర్థుల ఫొటోలతో ఏర్పాటు చేసిన భారీ బెలూన్లే దర్శనమిస్తున్నాయి. దీంతో ప్రస్తు తం ఈ భారీ బెలూన్లు అందరి దృష్టిని ఆకర్శిస్తున్నాయి. బెలూన్లలో గ్యాస్ నింపడం ద్వారా వాటిని తాడు సహాయంతో గాలిలో ఎగురవేస్తున్నారు. అందరి దృష్టిలో పడేలా భారీ బెలూన్లు ఏర్పాటు చేయడంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రచారం లభించినట్లు అవుతోంది. అన్ని పార్టీలదీ అదే దారి.. ప్రస్తుతం శాసనసభ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రచార సందడి మొదలైంది. ప్రచారం ప్రారంభించిన వారిలో టీఆర్ఎస్ అభ్యర్థులు ముందున్నారు. గడపగడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రంతోపాటు, మండల కేంద్రాల్లో, గ్రామాల్లోని ప్రధాన ప్రాంతాల్లో భారీ బెలూన్లు ఏర్పాటు చేశారు. తర్వాత బీజేపీ, బీఎస్పీ పార్టీలు సైతం వారి వారి గుర్తులు, ఫొటోలతో బెలూన్లు ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం ముథోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రామారావుపటేల్‌కు టికెట్ కేటాయించడంతో ఆయన సైతం భారీ బెలూన్లను ఏర్పాటు చేయించారు. రూ.లక్షల్లో ఖర్చు.. బెలూన్లపై ప్రచారం కోసం రాజకీయ పార్టీల నాయకులు ఆసక్తి చూపుతుండడంతో పలువురికి ఉపాధి లభిస్తోంది. స్థానికంగా ఈ వ్యాపారులు లేకపోవడంతో హైదరాబాద్ నుంచి వారిని ఇక్కడికి తెప్పించి బెలూన్లు ఏర్పాటు చేయిస్తున్నారు. ఒక్కో బెలూన్‌కు రూ.25వేలు వెచ్చిస్తున్నారు. ఈ లెక్కన మొత్తం జిల్లావ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో అన్ని ప్రధాన పార్టీలు బెలూన్లు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇందుకుగాను రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. దీంతో ఈ బెలూన్ ఏర్పాటు చేస్తున్న వ్యాపారులకు చేతినిండా పని దొరుకుతోంది. -
ఇక పోరు ఖరారు
అసెంబ్లీ ఎన్నికల పోరులో కీలకమైన టికెట్ల కేటాయింపు ప్రక్రియ వచ్చింది. ఉమ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాలకు సంబంధించి అన్ని పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు. బీజేపీ జడ్చర్ల, కొల్లాపూర్ స్థానాలకు మధుసూదన్‌యాదవ్, సుధాకర్‌రావు పేర్లు ప్రకటించింది. ఇక కాంగ్రెస్‌లో దేవరకద్ర, నారాయణపేట టికెట్ల కేటాయింపు ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. చివరకు దేవరకద్ర టికెట్‌ను పవన్‌కుమార్‌రెడ్డికి కేటాయించగా.. నారాయణపేట టికెట్ ఆశించిన కుంభం శివకుమార్‌రెడ్డికి చోటు దక్కలేదు. ఈ స్థానాన్ని గత ఎన్నికల్లో పోటీ చేసిన సరాఫ్ కృష్ణకే కేటాయించిన అధిష్టానం ఆదివారం అర్ధరాత్రి తుది జాబితాను విడుదల చేసింది. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: అసెంబ్లీ బరిలో నిలిచి పోరాడేదెవరో తేలిపోయింది. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి, బీజేపీ తరఫున అభ్యర్థులు ఖరారయ్యారు. రెండు స్థానాలను పెండింగ్‌లో ఉంచిన బీజేపీ ఆదివారం సాయంత్రం పేర్లు ప్రకటించింది. కొల్లాపూర్ నుంచి సుధాకర్‌రావు, జడ్చర్ల నుంచి మధుసూదన్‌యాదవ్‌ను ఖరారు చేసింది. మరోవైపు మహాకూటమి అభ్యర్థుల అంశం ఆద్యంతం అత్యంత ఉత్కంఠతకు గురిచేసింది. చివరికి ముందు నుంచి అనుకున్నట్లుగానే ప్రచారంలో ఉన్న వారి పేర్లనే కాంగ్రెస్ అధిష్టానం వెల్లడించన్నుట్లు తెలుస్తోంది. దేవరకద్ర నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన డోకూరు పవన్‌కుమార్, నారాయణపేట నుంచి వామనగిరి కృష్ణ(సరాఫ్ కృష్ణ) పేర్లను ఖరారు చేశారు. ఈ మేరకు జాబితా ఆదివారం అర్ధరాత్రి వెల్లడైంది. కానీ నారాయణపేట నుంచి కుంభం శివకుమార్‌రెడ్డి టికెట్ ఆశించినా ఆయనకు దక్కలేదు. ఇలా మొత్తం మీద ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు. అయితే మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానం విషయంలో కూటమి పొత్తులు, లెక్కలు అంతు చిక్కడం లేదు. ఈ స్థానం నుంచి ఇది వరకే కూటమిలో భాగంగా టీడీపీ అభ్యర్థి ఎర్రశే ఖర్కు కేటాయించగా.. తాజాగా ఇదే స్థానం నుంచి తెలంగాణ జన సమితి నుంచి జి.రాజేందర్‌రెడ్డికి పార్టీ బీ–ఫాం అందజేశారు. ఇలా ఒకే స్థానం నుంచి కూటమిలోని రెండు పార్టీలు టికెట్లు కేటాయించడంతో పాటు పార్టీ బీ–ఫాంలు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. పోరు హోరాహోరీ ముందస్తు ఎన్నికల్లో తలపడే అభ్యర్థుల విషయంలో స్పష్టత రావడంతో పోటీపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఏయే నియోజకవర్గంలో ఎవరెవరికి పోటీ ఉంటుందనేది చర్చనీయాంశమైంది. అందరికంటే ముందుగా టీఆర్ఎస్ రెండు నెలల క్రితమే అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నాలుగు విడుతలుగా అభ్యర్థులను ప్రకటించాయి. అయితే ఇప్పటి వరకు పోరు అంతా ఏకపక్షంగా ఉంటుందని భావించగా... వాస్తవ పరిస్థితి అలా లేదని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా మహాకూటమి అభ్యర్థులు చాలా చోట్ల టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఏ సూత్రాన్ని అవలంభించిందో.. కాంగ్రెస్ కూడా దాదాపు అదే దారిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులందరూ కూడా గతంలో తలపడిన వారే కావడం గమనార్హం. దీంతో ఎవరి బలాలు, బలహీనతలు ఏమిటనేది తెలుసుకున్నారు. దీంతో ఎవరికి వారు మైండ్ గేమ్‌తో తమ ప్రచారానికి పదును పెడుతున్నారు. అలాగే కొన్ని స్థానాల్లో బీజేపీ సైతం కల్వకుర్తి, నారాయణపేట, మక్తల్, మహబూబ్‌నగర్ వంటి స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చే అవకాశముంది. తీవ్ర ఉత్కంఠ రాష్ట్రంలోనే కాంగ్రెస్ కాస్త బలంగా ఉందని భావిం చే ఉమ్మడి పాలమూరు జిల్లాలో టికెట్ల ఎంపిక ప్రక్రియ ఆ పార్టీ అధిష్టానానికి కత్తి మీద సాములా తయారైంది. అభ్యర్థులను ఎంపిక చేయడానికి చివరి వరకు ఎదురుచూడాల్సి వచ్చింది. ముఖ్యం గా మూడు స్థానాల విషయంలో రెండు గ్రూపుల మధ్య పోరు తారాస్థాయికి చేరింది. దేవరకద్ర, నారాయణపేట, కొల్లాపూర్ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇరు వర్గాలు తీవ్రంగా పోటీ పడ్డాయి. కొల్లాపూర్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన బీరం హర్షవర్ధన్‌కు టికెట్ కేటాయించాలని డీకే.అరుణ, జగదీశ్వర్‌రావుకు కేటాయించాలని జైపాల్‌రెడ్డి పట్టుబట్టారు. చివరికి డీకే.అరుణ పంతమే నెగ్గింది. ఇక దేవరకద్ర, నారాయణపేట స్థానాలకు ఎంపిక విషయంలో సామాజిక సమీకరణాల ఆధారంగా ఇరువర్గాలు తలపడ్డాయి. అయి తే, చివరి జాబితాలో డీకే.అరుణ వర్గానికి చెందిన డోకూరు పవన్‌కుమార్‌కు దేవరకద్ర, జైపాల్ వర్గానికి చెందిన సరాఫ్ కృష్ణకు నారాయణపేట స్థానం ఖరారైంది. దీంతో ఈ స్థానం ఆశించిన శివకుమార్‌రెడ్డి ఏం నిర్ణయం తీసుకుంటారన్న సోమవారం తేలనుంది. మహబూబ్‌నగర్‌లో ఫ్రెండ్లీ పోటీ మహాకూటమి పొత్తులు, లెక్కలు ఎవరికీ అంతు చిక్కడం లేదు. ముఖ్యంగా మహబూబ్‌నగర్ స్థా నానికి మొదటి నుంచి తీవ్రమైన పోటీ ఉంది. పోటీకి దిగేందుకు కాంగ్రెస్ నుంచి నలుగురు పోటీ పడ్డారు. కానీ పొత్తులో భాగంగా సీటును టీడీపీకి కేటాయించారు. ఈ మేరకు ఎర్ర శేఖర్ పే రు ఖరారైంది. అయితే ఇదే స్థానం కోసం మొదటి నుంచి పట్టుబడుతున్న టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి కూడా తెరపైకి వచ్చారు. ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన రాజేందర్‌రెడ్డి.. ఆదివారం కోదండరాం చేతుల మీదుగా బీ–ఫాం సైతం అందుకున్నారు. దీంతో పోటీ విషయం మళ్లీ మొదటికి వచ్చింది. స్నేహపూర్వక పోటీలో భాగంగా రెండు పార్టీల అభ్యర్థులు కూడా బరిలో నిలుస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇరు పార్టీల అభ్యర్థులు పోటీలో ఉంటే కూటమిలో భాగంగా ఏ పార్టీకి గుర్తింపు ఇస్తారనేది రాజకీయ పరిశీలకులు కూడా తేల్చలేకపోతున్నారు. దేవరకద్ర, నారాయణపేట కాంగ్రెస్ అభ్యర్థులు డోకూరు పవన్‌కుమార్, సరాఫ్ కృష్ణ నియోజకవర్గాలు, పార్టీల వారీగా అభ్యర్థులు వీరే.. నియోజకవర్గం టీఆర్ఎస్ మహాకూటమి బీజేపీ జడ్చర్ల డాక్టర్ సి.లక్ష్మారెడ్డి డాక్టర్ మల్లు రవి మధుసూదన్‌యాదవ్ కొల్లాపూర్ జూపల్లి కృష్ణారావు బీరం హర్షవర్దన్‌రెడ్డి సుధాకర్‌రావు గద్వాల్ బి.కృష్ణమోహన్‌రెడ్డి డీకే అరుణ వెంకటాద్రిరెడ్డి కొడంగల్ పి.నరేందర్‌రెడ్డి ఎ.రేవంత్‌రెడ్డి నాగూరావు నామాజీ వనపర్తి ఎస్.నిరంజన్‌రెడ్డి జి.చిన్నారెడ్డి కె.అమరేందర్‌రెడ్డి మహబూబ్‌నగర్ వి.శ్రీనివాస్‌గౌడ్ ఎర్ర శేఖర్ / రాజేందర్‌రెడ్డి పద్మజారెడ్డి నాగర్‌కర్నూల్ మర్రి జనార్దన్‌రెడ్డి నాగం జనార్దన్‌రెడ్డి దిలీప్ ఆచారి అచ్చంపేట గువ్వల బాల్‌రాజు డాక్టర్ వంశీకృష్ణ మల్లీశ్వర్ దేవరకద్ర ఆల వెంకటేశ్వర్‌రెడ్డి డోకూరు పవన్‌కుమార్ ఎగ్గని నర్సింహులు మక్తల్ చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డి కె.దయాకర్‌రెడ్డి ఎం.కొం డయ్య నారాయణపేట రాజేందర్‌రెడ్డి సరాఫ్ కృష్ణ రతంగ్‌పాండురెడ్డి కల్వకుర్తి జైపాల్‌యాదవ్ వంశీచంద్‌రెడ్డి తన్నోజు ఆచారి అలంపూర్ డాక్టర్ అబ్రహం సంపత్‌కుమార్ రజనీరెడ్డి -
‘కారు’ సీట్లు ఖరారు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. పెండింగ్‌లో ఉన్న కోదాడ, ముషీరాబాద్ స్థానాలకు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం అభ్యర్థులను ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ నుంచి శుక్రవారం టీఆర్ఎస్లో చేరిన బొల్లం మల్లయ్యయాదవ్‌ను కోదాడ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ముషీరాబాద్‌లో ముఠా గోపాల్ పేరును ప్రకటించారు. దీంతో టీఆర్ఎస్ మొత్తం 119 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. ముషీరాబాద్ విషయంలో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి విన్నపాన్ని కేసీఆర్ పక్కనబెట్టారు. తనకుగానీ, తన అల్లుడైన కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డికిగానీ అవకాశం ఇవ్వాలని నాయిని కోరారు. పోటీ చేసే అవకాశం కల్పిస్తారని భావించారు. అయితే, ముందుగా నిర్ణయించిన ప్రకారం ఇక్కడ బీసీ వర్గానికి చెందిన ముఠా గోపాల్‌కు అవకాశం కల్పించారు. కోదాడ అభ్యర్థి ఎంపికలోనూ కొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి కె.శశిధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనెపల్లి చందర్రావు టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. అనూహ్యంగా రెండురోజుల క్రితం టీఆర్ఎస్లో చేరిన బొల్లం మల్లయ్యయాదవ్‌కు అవకాశం కల్పించారు. సోమ వారం ఉదయం బర్కత్‌పురలో జరిగే కార్యక్రమంలో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చేతుల మీదుగా ముషీరాబాద్ టీఆర్ఎస్ బీఫారాన్ని ముఠా గోపాల్ అందుకుంటారు. అనం తరం నాయిని ఆశీర్వాదం తీసుకుని నామినేషన్ దాఖలు చేస్తారు. విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చందర్రావు ఆధ్వర్యంలో మల్లయ్య యాదవ్ సోమవారం నామినేషన్ దాఖలు చేస్తారు. టీఆర్ఎస్ ప్రకటించిన మొత్తం 119 సీట్లలో ఓసీలకు 58, బీసీలు 26, ఎస్సీలు 19, ఎస్టీలు 12, ముస్లింలు 3, సిక్కు లకు 1 చొప్పున స్థానాలను కేటాయించింది. నేటి నుంచి నియోజకవర్గాలకు... కేసీఆర్ సోమవారం నుంచి పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. కేసీఆర్ గజ్వేల్‌లోని ఎర్రవల్లి నివాసంలో ఉన్నారు. సోమవారం అక్కడి నుంచి హెలికాప్టర్లో ఖమ్మం చేరుకుంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు అక్కడ జరగనున్న ఖమ్మం, పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాలసభలో మాట్లాడతారు. అక్కడి నుంచి పాలకుర్తికి చేరుకుని మధ్యాహ్నం 3.30 గంటకు అక్కడ జరగనున్న ప్రచారసభలో ప్రసంగిస్తారు. అనంతరం ఎర్రవల్లిలోని నివాసానికి చేరుకుంటారు. ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రచారానికి ఎర్రవల్లి నుంచే హెలికాప్టర్లో వెళ్లనున్నారు. -
టికెట్ రాని ఆశావహుల చర్చోపచర్చలు
ఇన్నాళ్లూ పార్టీకి సేవలు అందించారు. టికెట్ వస్తుందని కోటి ఆశలతో ఎదురుచూశారు. తీరొక్క ప్రయత్నాలు చేశారు. తమకు పరిచయం ఉన్న నేతల ద్వారా అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. తీరా జాబితాలో పేరు లేకపోవడంతో ఇప్పుడు తర్జన భర్జన పడుతున్నారు. ఒకవైపు నామినేషన్ వేసేందుకు గడువు దగ్గరపడుతుండడంతో ఏం చేద్దాం.. ఎట్ల చేద్దాం.. అంటూ కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన నేతలంతా పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలతో చర్చిస్తున్నారు. కొందరైతే రెబెల్‌గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. సాక్షి, ఖమ్మం: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు సమయం ముంచుకొస్తుండగా.. జిల్లాలో రాజకీయం రంగులు మారుతోంది. టికెట్ ఆశించి భంగపడిన నేతలంతా మరోదారి చూసుకునేందుకు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించుకునే పనిలో నిమగ్నమయ్యారు. వైరా నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన రాములునాయక్ వైరాలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నేతలు.. అభిమానులతో సమావేశం నిర్వహించారు. సమావేశానికి టీఆర్ఎస్ తరఫున పోటీచేస్తున్నఅభ్యర్థి మదన్‌లాల్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఆ పార్టీ అసంతృప్తివాదులు సైతం హాజరుకావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రాములునాయక్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల బరిలో ఉంచాలని ఏకాభిప్రాయానికి వచ్చిన సమావేశం.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడమా? ఏదైనా జాతీయ పార్టీ గుర్తుతో బరిలో నిలవడమా? అనే అంశంపై చర్చించారు. బీఎస్పీ నుంచి పోటీ చేయడం వల్ల జాతీయ పార్టీ నుంచి పోటీ చేస్తున్నట్లు ఉంటుందని, ప్రజలకు తెలిసిన గుర్తు ఏనుగు కేటాయించే అవకాశం లభించడంతో విజయావకాశాలు మరింత మెరుగుపడతాయని సమావేశంలో పలువురు అభిప్రాయపడ్డారు. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి మదన్‌లాల్‌ను వ్యతిరేకిస్తున్న ఆ పార్టీ శ్రేణులు కొందరు తాము రాములునాయక్‌కు పూర్తిస్థాయి అండదండలు అందిస్తామని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. వైరాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో రాములునాయక్‌కు వ్యతిరేకంగా ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా లొంగేది లేదని.. ఆయన గెలుపునకు కృషి చేయాలని ప్రమాణం చేసినట్లు కూడా తెలుస్తోంది. దీంతో రాములునాయక్ ఈనెల 19వ తేదీన వైరా అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. బీఎస్పీ నుంచి టికెట్ తెచ్చుకోవడమా? స్వతంత్రుడిగా కొనసాగడమా? అనే అంశంపై ఒకటి, రెండు రోజుల్లో ఒక నిర్ణయానికి రావాలని సమావేశం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. వైరా నియోజకవర్గంలోని కాంగ్రెస్ సీనియర్ నేతలు పలువురు, టీఆర్ఎస్ అసంతృప్తివాదులు కొందరు హాజరుకావడంతో సమావేశానికి రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. ఖమ్మంలోనూ.. ఖమ్మం నియోజకవర్గంలో మహాకూటమి అభ్యర్థి గా రంగంలోకి దిగిన టీడీపీ నేత నామా నాగేశ్వరరావు.. కాంగ్రెస్ నుంచి తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలోకి దిగుతారని ప్రచారం జరిగిన మానుకొండ రాధాకిషోర్‌ను ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. తనకు సహకరించాల్సిందిగా కోరగా.. పార్టీ శ్రేణులు, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరితో చర్చించి నిర్ణయం ప్రకటిస్తానని చెప్పినట్లు సమాచారం. ఇక రాధాకిషోర్, అలాగే మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు ఈనెల 19న నామినేషన్ వేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. పోట్లసైతం తన అనుచరవర్గంతో సమావేశమై ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రజాకూటమి అభ్యర్థి నామా నాగేశ్వరరావు మాత్రం కూటమిలో అసంతృప్తులు.. తిరుగుబాట్లు టీ కప్పులో తుపాను వంటివని, అన్నీ త్వరలోనే సర్దుకుంటాయని.. ఇందుకు కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషిస్తుందని శుక్రవారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భరోసా వ్యక్తం చేశారు. ఇక సత్తుపల్లి ప్రజాకూటమి అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య శనివారం నామినేషన్ వేయనున్నారు. అలాగే వైరా నుంచి కాంగ్రెస్‌నేత రాములునాయక్‌ను స్వతంత్ర అభ్యర్థి లేదా బీఎస్పీ తరఫున బరిలోకి దించేందు కు జరుగుతున్న ముమ్మర ప్రయత్నాలపై నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కొంత అలజడి రేపింది. రాములునాయక్‌కు మద్దతు ప్రకటించే నేతలను సముదాయించేందుకు టీఆర్ఎస్ అభ్యర్థి మదన్‌లాల్ ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. కాంగ్రెస్ నేతలు ప్రత్యేకంగా సమావేశమై స్వతంత్ర అభ్యర్థిగా ఒకరిని రంగంలోకి దించాలనే అంశంపై ప్రజాకూటమిలో భాగస్వామ్య పక్షమైన సీపీఐ సైతం తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న కాంగ్రెస్ నేతలు తమ పార్టీకి సహకరించేలా చూడాలని సీపీఐ నేతలు కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. మరోవైపు పాలేరు కాంగ్రెస్ అభ్యర్థిగా కందాళ ఉపేందర్‌రెడ్డి శుక్రవారం నామినేషన్ వేశారు. వైరాలో రాములునాయక్‌కు మద్దతుగా ప్రమాణం చేస్తున్న కాంగ్రెస్, టీఆర్ఎస్ అసమ్మతి నాయకులు -
చేరితే ఓ రేటు.. మద్దతు ఇస్తే మరో రేటు
సాక్షి, వరంగల్ రూరల్ : ముందస్తు ఎన్నికల్లో భాగంగా వలసలకు గిరాకీ పెరిగింది. ఇందులో భాగంగానే పలువురు నాయకులు, గ్రామ పెద్దలు, కుల సంఘ నాయకులను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు కార్యచరణ ప్రారంభించినట్లు ప్రచారం జరుగుతోంది. వారి స్థోమతను బట్టి వేల నుంచి లక్షల వరకు వెచ్చిస్తున్నట్లు గ్రామాల్లో చర్చ జరుగుతుంది. గ్రామాల్లో కీలకంగా వ్యవహరించే వారికి తమ వైపునకు తిప్పుకునేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. అందులో భాగంగానే ఉమ్మడి జిల్లా కేంద్రం నుంచే బేరసారాలు జరుపుతున్నారు. నియోజకవర్గంలో తమ బలబలాలను నిరూపించుకునేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పరకాల, నర్సంపేట నియోజకవర్గంలో ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో పోటాపోటీ చేరికలు జరుగుతున్నాయి. దీంతో నయానో బయానో చెల్లించుకుని తమ ఉనికిని చాటుకునేందుకు ప్రధాన పార్టీలకు చెందిన ప్రత్యర్థులు పోటీపడుతున్నారు. చేరితే ఓ రేటు.. మద్దతు ఇస్తే మరో రేటు అందులో భాగంగానే గ్రామ పెద్దలు, కుల సంఘ నాయకులు ప్రత్యర్థి పార్టీలకు చెందిన శ్రేణులకు రాయభారం జరిపి అనంతరం జిల్లా కేంద్రంలో చేరికలు, మద్దతు తెలిపే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. పార్టీలో చేరితే ఒక రేటు, మద్దతు ఇస్తే మరోరేటు ఇచ్చే విధంగా మాట్లాడుతన్నారనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. డబ్బులు, తాయిలాలు, బహుమతులను కొంతమందికి ఇస్తుండగా మరికొంత మందికి రాననున్న రోజుల్లో సర్పంచ్, ఎంపీటీసీల వంటి ప్రజా ప్రతినిధి వంటి అవకాశాలతో పాటు పలు రాయకీయ పదవులను ఆశ చూపుతున్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీలో చేరికలు కొనసాగగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి కుడా రాయభారం పస్తుందని రానున్న రోజుల్లో ఎవరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారో తెలి యని పరస్థితి ఉన్నదని చెబుతున్నారు. ఏది ఏమైనా గ్రామాల్లో నాయకులకు గిరాకీ ఏర్పడిందని కొందరు చెబుతుండగా, నాయకులు అభ్యర్థుల వెంట తిరిగిన వారిని చూసి ఓట్లు వేసే రోజులు లేవని మరికొందరు చెప్పుకోవడం గమనార్హం. పోటాపోటీగా.. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో పోటాపోటీగా చేరికలు కోనసాగుతున్నాయి. కొంత పలుకుబడి ఉన్న నాయకుడు పార్టీ మారకుండా ఉండేందుకు తరచూ పలకరిస్తున్నారు. పార్టీ మారకుండా ఉండాలంటే కొందరు నాయకులు డబ్బులను సైతం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రచారం ఖర్చు కంటే నాయకులను కాపాడుకునేందుకే ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. బరిలో నిలుస్తున్న నేతలు జంప్ జీలనీలతో తలలు పట్టుకుంటున్నారు. -
మరో 10 స్థానాల్లో టీఆర్ఎస్ ఆభ్యర్థుల ప్రకటన
-
‘పెండింగ్’పై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతృత్వం లోని కూటమిని దీటుగా ఎదుర్కొనే దిశగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. అభ్యర్థులను ఇంకా ప్రకటించని స్థానాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సామాజిక సమీకరణ లెక్కల ప్రకారమే టీఆర్ఎస్ జాబితా ఉండాలని భావిస్తున్నారు. ఈ నేప థ్యంలో కూటమి అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే పెండింగ్‌లో ఉన్న 12 స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించాలని ఆయన నిర్ణయిం చారు. అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడకుండా పూర్తిస్థాయిలో ప్రచారం చేసుకోవాలని పలువురు నేతలకు సూచించారు. ఏ రోజైనా నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు మూసీ నది పరీవాహక ప్రాంత అభివృద్ది సంస్థ చైర్మన్ ప్రేంసింగ్ రాథోడ్ తన పదవికి రాజీనామా చేశారు. గోషామహల్ స్థానంలో ఆయన్ను అభ్యర్థిగా ప్రకటించనున్నారు. అలాగే మిగిలిన స్థానాల విషయంలోనూ పలువురు నేతలకు ఇదే రకమైన ఆదేశాలు ఇచ్చారు. అయితే ఖైరతాబాద్, చొప్పదండి, హుజూర్నగర్ స్థానాల అభ్యర్థులను ప్రకటించే విషయంలో టీఆర్ఎస్ అధిష్టానానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ మూడు స్థానాల్లోనూ మహిళా నేతలు టికెట్లు ఆశిస్తున్నారు. చొప్పదండిలో తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, హూజూర్‌నగర్‌లో శంకరమ్మ, ఖైరతాబాద్‌లో విజయారెడ్డి టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు. కాంగ్రెస్ 65 స్థానాలకు ప్రకటించిన తొలి జాబితాలోనే పది మంది మహిళలకు అవకాశం కల్పించింది. టీఆర్ఎస్ ప్రకటించిన 107 మంది అభ్యర్థులలో నలుగురు మహిళలు మాత్రమే ఉన్నారు. దీంతో తుది జాబితాపై సీఎం కేసీఆర్ మరోసారి కసరత్తు చేస్తున్నారు. కూటమి రెండో జాబితాను పరిశీలించి వెంటనే టీఆర్ఎస్ తుది జాబితాను ప్రకటించనున్నట్లు తెలిసింది. అభ్యర్థుల రాజీనామాలు... అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు తమ పదవులకు రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను కేసీఆర్ ఆమోదించారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఎస్.నిరంజన్‌రెడ్డి(వనపర్తి), మిషన్ భగీరథ కార్పొరేషన్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి(బాల్కొండ), ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ(రామగుండం), సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్(మానకొండూరు), ఎస్టీ సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు(అశ్వారావుపేట), సెట్విన్ చైర్మన్ ఇనాయత్ అలీ బాక్రీ(బహదూర్‌పుర), ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి(సత్తుపల్లి), పౌర సరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి(నర్సంపేట) తమ పదవులకు రాజీనామా చేశారు. నామినేషన్ దాఖలు సమయంలో ఇబ్బందులు లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. నేడు కేసీఆర్ నామినేషన్... సీఎం కేసీఆర్ గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయన ఉదయం తొమ్మిది గంటలకు నంగునూరు మండలం కోనాయిపల్లిలోని వెంకన్న ఆలయానికి వెళతారు. నామినేషన్ పత్రాలను వెంకన్న చెంత పెట్టి పూజలు నిర్వహిస్తారు. అక్కడే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేస్తారు. అనంతరం గజ్వేల్‌కు వెళ్లి నామినేషన్ దాఖలు చేస్తారు. మంత్రి హరీశ్‌రావు సైతం కేసీఆర్‌తోపాటే కోనాయిపల్లి ఆలయంలో పూజలు చేస్తారు. అనంతరం సిద్ధిపేటలో నామినేషన్ దాఖలు చేస్తారు. కేసీఆర్ ప్రచార షెడ్యూల్ సిద్ధం... టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచార ప్రణాళిక సిద్ధమైంది. వాస్తవానికి గురువారం నుంచే పూర్తి స్థాయిలో ప్రచారం ప్రారంభించాలని ఆయన ముందుగా నిర్ణయించారు. అయితే కూటమి అభ్యర్థుల పూర్తి జాబితా వెల్లడైన తర్వాతే ప్రచారం మొదలు పెట్టే అవకాశం ఉంది. ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి ప్రత్యర్థిగా ఉంటారో స్పష్టత వచ్చాకే ప్రచారం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. కాగా, కేసీఆర్ ప్రచార షెడ్యూల్‌ను, పెండింగ్ స్థానాల అభ్యర్థుల జాబితాను బుధవారం విడుదల చేసే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. -
టీఆర్ఎస్ గెలుపును ఆపలేరు
సాక్షి,పెద్దఅడిశర్లపల్లి : ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయాన్ని ఏ కూటమి ఆపలేదని నల్ల గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పీఏపల్లి మండలంలో టీఆర్ఎస్ దేవరకొండ ఎమ్మెల్యే అభ్యర్థి రమావత్ రవీంద్రకుమార్‌తో కలిసి చిల్కమర్రిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఏరాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసి చూ పిందన్నారు. సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ గెలుపునకు బాటలు వేస్తాయని పేర్కొన్నారు. కూటమికి అధికారం కట్టబెట్టి ప్రజలు మోసపోయే స్థితిలో లేరన్నారు. ఎన్నికల్లో కూటమికి తగిన గుణపాఠం తప్పదని పేర్కొన్నారు. దేవరకొండ టీఆర్ఎస్ అభ్యర్థి రవీంద్రకుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం రమావత్ రవీంద్రకుమార్ మండలంలోని చిల్కమర్రి స్టేజీ, చిల్కమర్రి, సూర్యపల్లి, రోళ్లకల్, అంగడిపేట స్టేజీ, అంగడిపేట, అంగడిపేటతండా, భారత్‌పురం, సింగరాజుపల్లి, గుడిపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెట్పీటీసీ తేర గోవర్ధన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ముచ్చర్ల ఏడుకొండలుయాదవ్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ వంగాల ప్రతాప్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు రేటినేని ముత్యంరావు, వల్లపురెడ్డి, రంగారెడ్డి, వీరమళ్ల పరమేశ్, శీలం శేఖర్‌రెడ్డి, లచ్చిరెడ్డి, అంతిరెడ్డి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
తొలి జాబితా@65
-
పొన్నాలకు షాక్.. శశిధర్‌రెడ్డికి హ్యాండ్..
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రానే వచ్చింది. అన్ని లాంఛనాలు పూర్తి చేసుకుని సోమవారం రాత్రి 11 గంటల సమయంలో 65 మందితో కాంగ్రెస్ అధిష్టానం తొలి జాబితాను అధికారికంగా ప్రకటించింది. జాబితా వివరాలను పరిశీలిస్తే.... 2014 ఎన్నికల్లో పోటీ చేసిన 32 మందికి ఈ జాబితాలో అవకాశం లభించలేదు. స్థానాలు మార్చి మరో ఇద్దరిని వేరే చోటకు పంపించారు. దీంతోపాటు కూటమి భాగస్వామ్య పక్షాలు గట్టిగా పట్టుపడుతున్న స్థానాల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. తొలిజాబితాలో ప్రకటించిన 65 మందిలో 39 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అవకాశమివ్వగా, 22 మంది రెడ్డి కులస్తులకు, ముగ్గురు వెలమలకు, ఒక బ్రాహ్మణ నేతకు టికెట్లిచ్చింది. బీసీ కులాల్లో మొత్తం 13 మందికి తొలిజాబితాలో చోటు దక్కగా అందులో మున్నూరుకాపులు ఐదుగురు, గౌడ నలుగురు , పద్మశాలీ, యాదవ కులానికి చెందినవారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. మహిళల విషయానికొస్తే 65 మందిలో 10 మందికి టికెట్లు కేటాయించిన కాంగ్రెస్ అధిష్టానం మొత్తానికి తొలి జాబితాపై తన మార్కు చాటుకుంది. సగం మారాయి...! కాంగ్రెస్ అధిష్టానం తొలి జాబితాలో ప్రకటించిన 65 స్థానాలకుగాను 32 చోట్ల అభ్యర్థులను మార్చింది. మరో ఇద్దరికి స్థానచలనం కల్పించింది. స్థానచలనం కలిగినవారిలో ప్రేంసాగర్‌రావు (మంచిర్యాల), పొడెం వీరయ్య(భద్రాచలం) ఉన్నారు. గతంలో ప్రేంసాగర్‌రావు సిర్పూర్ నుంచి, పొడెం వీరయ్య ములుగు నుంచి పోటీ చేశారు. అభ్యర్థులను మార్చిన వివరాల్లోకి వెళితే... గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి టీఆర్ఎస్లోకి వెళ్లిన వినోద్(చెన్నూరు), విఠల్‌రెడ్డి (ముథోల్), సురేశ్‌రెడ్డి (ఆర్మూరు), భానుప్రసాదరావు(పెద్దపల్లి), కాలె యాదయ్య (చేవెళ్ల), కె.దామోదర్‌రెడ్డి (నాగర్‌కర్నూల్), రెడ్యానాయక్ (డోర్నకల్), మాలోతు కవిత (మహబూబాబాద్)ల స్థానంలో ఇతరులకు టికెట్లిచ్చారు. ఇందులో ఎమ్మెల్సీ ఆకుల లలిత, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ తదితరులున్నారు. మిగిలిన 24 స్థానాల్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థులను మార్చినట్టయింది. ఈ 24 స్థానాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చినవారు, పారాచూట్లకు కూడా అవకాశం కల్పించారు. ప్రముఖులకు ‘షాక్’ తొలిజాబితాలో పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు చోటు లభించకపోవడం గమనార్హం. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామ అసెంబ్లీ స్థానం టీజేఎస్‌కు కేటాయించే అవకాశం ఉండడంతో ఆ స్థానాన్ని ప్రకటించలేదు. మాజీమంత్రి శశిధర్‌రెడ్డి(సనత్‌నగర్), పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్‌రెడ్డి(జూబ్లీహిల్స్)లకు కూడా టికెట్ దక్కలేదు. మహిళల విషయానికి వస్తే... ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన మాజీమంత్రి కొండా సురేఖకు తొలి జాబితాలోనే టికెట్ ఖరారు చేశారు. ఆమెతోపాటు మాజీమంత్రులు సునీతాలక్ష్మారెడ్డి, సబితాఇంద్రారెడ్డి, గీతారెడ్డి, డి.కె.అరుణ సహా మొత్తం 10 మంది మహిళలకు తొలి జాబితాలో స్థానం దక్కింది. ఇక, ఉస్మానియా విద్యార్థి నేతల్లో మేడిపల్లి సత్యంకు మాత్రమే అవకాశమిచ్చారు. రేవంత్‌తోపాటు పార్టీలో చేరినవారిలో రేవంత్‌సహా నలుగురికి తొలి జాబితాలో చోటు లభించింది. ఇందులో సి.హెచ్. విజయరమణారావు(పెద్దపల్లి), మేడిపల్లి సత్యం(చొప్పదండి), సీతక్క(ములుగు) ఉన్నారు. కొత్త అభ్యర్థులను ఎంపిక చేసిన నియోజకవర్గాలివే... సిర్పూర్, చెన్నూరు, మంచిర్యాల, ఆదిలాబాద్, ముధోల్, ఆర్మూరు, పెద్దపల్లి, కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, గజ్వేల్, చేవెళ్ల, తాండూరు, ముషీరాబాద్, నాంపల్లి, చార్మినార్, చాంద్రాయణగుట్ట, కంటోన్మెంట్, కొడంగల్, నాగర్‌కర్నూలు, మునుగోడు, భువనగిరి, పాలకుర్తి, డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట, పరకాల, ములుగు, కొత్తగూడెం, భద్రాచలం, రామగుండం, స్టేషన్ ఘన్పూర్. తొలిజాబితాలో స్థానం పొందిన మహిళా నేతలు వీరే.. గండ్రత్ సుజాత, ఆకుల లలిత, సునీతా లక్ష్మారెడ్డి, గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, డి.కె.అరుణ, పద్మావతి, ఇందిర, కొండా సురేఖ, సీతక్క. బరిలో నలుగురుమాజీ ఎంపీలు.. కాంగ్రెస్ మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అసెంబ్లీ బరిలోకి దిగారు. పొన్నం కరీంనగర్ నుంచి, సర్వే సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి, బలరాం నాయక్ మహబూబాబాద్ నుంచి, రాజగోపాల్‌రెడ్డి మునుగోడు నుంచి పోటీలో నిలిచారు. కాంగ్రెస్ తొలి జాబితాలో వీరికి చోటు దక్కింది. మిత్రులు అడుగుతున్న స్థానాల్లోనూ... టీజేఎస్, సీపీఐలు అడుగుతున్న స్థానాల్లోనూ కాంగ్రెస్ తొలిజాబితాలోనే అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో ఆసిఫాబాద్, స్టేషన్ ఘన్పూర్, తాండూరు స్థానాలను టీజేఎస్ అడుగుతుండగా, కొత్తగూడెం సీటును సీపీఐ ఆశిస్తోంది. అయితే, కొత్తగూడెం స్థానాన్ని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావుకు కేటాయించారు. దీనికితోడు తెలంగాణ ఇంటి పార్టీకి ఇస్తారని భావించిన నకిరేకల్ స్థానంలో కూడా కాంగ్రెస్ చిరుమర్తి లింగయ్యను అభ్యర్థిగా ప్రకటించింది. మిగిలినచోట్ల మిత్రపక్షాలతో స్పష్టతలేని స్థానాలను, ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతున్న స్థానాలను ప్రకటించకుండా కాంగ్రెస్ అధిష్టానం పెండింగ్‌లో పెట్టింది. కుటుంబసభ్యుల విషయానికి వస్తే ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్లు రవి కుటుంబాల్లో ఇద్దరికి చొప్పున చోటు లభించింది. ఉత్తమ్ సతీమణి పద్మావతికి కోదాడ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోదరుడు రాజగోపాల్‌రెడ్డికి మునుగోడు, మల్లు భట్టివిక్రమార్క సోదరుడు మల్లు రవికి జడ్చర్ల స్థానాలను కేటాయించారు. జానారెడ్డి తనయుడు ఆశిస్తున్న మిర్యాలగూడ స్థానాన్ని పెండింగ్‌లో పెట్టారు. అయితే, పద్మావతి ఇప్పటికే సిట్టింగ్ కావడం, రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఉండడంతో ఈ ఇద్దరికి అవకాశమిచ్చినట్టు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. జడ్చర్ల జనరల్ సీటును మరోమారు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవికి కేటాయించారు. తొలిజాబితాలో 14 ఎస్సీ రిజర్వుడు, ఆరు ఎస్టీ రిజర్వుడు స్థానాలను ప్రకటించారు. ఇందులో ఎస్టీ నియోజకవర్గాలకుగాను నలుగురు కోయలు, ఇద్దరు లంబాడీలకు అవకాశం దక్కింది. -
ఆ 12 సీట్లెవరికి..?
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ మరో 12 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఈ స్థానాల్లో టికెట్ ఆశిస్తున్న నేతలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. సోమ వారం ఈ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి బీ ఫారాలు సైతం పంపిణీ చేస్తారని ఆశావహులు భావిం చారు. టికెట్ ఆశిస్తున్న పలువురు ఇదే విషయంపై తెలంగాణభవన్‌కు వచ్చి ఆరా తీశారు. సాయంత్రం వరకు టికెట్లు ఖరారు కాకపోవడం.. మంగళవారం ప్రకటన రావచ్చనే సమాచారంతో వెనుదిరిగారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. అయితే కూటమి అభ్యర్థులను ప్రకటించాకే వెల్లడించాలనే వ్యూహంతో ఉన్నారు. ప్రచార షెడ్యూల్ విషయంలోనూ కేసీఆర్ ఇదే వైఖరితో ఉన్నారు. ఇప్పటికే ఆలస్యమవుతుండటంతో ప్రచార షెడ్యూల్‌ను మంగళవారం వెల్లడించాలని నిర్ణయించినట్లు తెలిసింది. నాంపల్లిలో మార్పు.. : నాంపల్లి టీఆర్ఎస్ అభ్యర్థి బీఫారం పంపిణీపై ఆసక్తి పెరుగుతోంది. 105 స్థానాల అభ్యర్థుల జాబితాలో నాంపల్లి స్థానానికి ఎం.ఆనంద్‌గౌడ్ పేరు ప్రకటించింది. అయితే ఆదివారం ఆయనకు బీఫారం ఇవ్వలేదు. ఈ స్థానంలో సీహెచ్.ఆనంద్‌గౌడ్‌ను అభ్యర్థిగా ఖరారు చేసినట్లు తెలిసింది. నాంపల్లి సెగ్మెంట్లో ఒకే పేరుతో ఇద్దరు నేతలు ఉండటం వల్ల సాంకేతికంగా పొరపాటు జరిగిందని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. మిగిలిన 12 స్థానాల అభ్యర్థులతో కలిపి సీహెచ్.ఆనంద్‌గౌడ్‌కు బీఫారం ఇవ్వనున్నట్లు తెలిసింది. సుధీర్‌రెడ్డికి పార్టీ పదవి.. : మేడ్చల్ అసెంబ్లీ స్థానంలో అభ్యర్థిపై స్పష్టత వచ్చింది. మల్కాజ్గిరి ఎంపీ సీహెచ్.మల్లారెడ్డికి ఇక్కడ పోటీ చేసే అవకాశం ఇవ్వాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. తాజా మాజీ ఎమ్మెల్యేఎం.సుధీర్‌రెడ్డిని ఈ మేరకు ఒప్పించింది. టీఆర్ఎస్ అధిష్టానం ప్రతిపాదనకు సుధీర్‌రెడ్డి సైతం అంగీకరించారు. దీంతో సుధీర్‌రెడ్డిని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ అధినేత కేసీఆర్ సోమవారం ప్రకటించారు. ఖైరతాబాద్‌లో లొల్లి... ఖైరతాబాద్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఖరారు ఒకింత ఇబ్బందికరంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఈ స్థానాన్ని దానం నాగేందర్‌కు ఇవ్వాలని టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించింది. అయితే నియోజకవర్గ ఇన్చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి, కార్పొరేటర్ పి.విజయారెడ్డి ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు. తమకే పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పలుసార్లు మంత్రి కేటీఆర్‌ను కోరారు. అభ్యర్థులను ఖరారు చేస్తారనే ప్రచారం జరగడంతో గోవర్ధన్‌రెడ్డి తన అనుచరులు సోమవారం తెలంగాణభవన్‌కు వచ్చారు. గోవర్ధన్‌రెడ్డికే టికెట్ ఇవ్వాలని నినాదాలు చేశారు. పోలీసుల జోక్యంతో వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. టికెట్ ఇవ్వకుంటే కిరోసిన్ పోసుకుంటా: శంకరమ్మ హుజూర్నగర్ అసెంబ్లీ టికెట్‌ను తనకు ఇవ్వకుంటే కిరోసిన్ పోసుకుంటానని ఈ నియోజకవర్గ ఇన్చార్జి శంకరమ్మ అన్నారు. మంగళవారం తనకు టికెట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని ప్రచారం నేపథ్యంలో శంకరమ్మ సోమవారం తెలంగాణభవన్‌కు వచ్చారు. అక్కడ ఆమె మాట్లాడుతూ.. హుజూర్నగర్ టికెట్‌ను తనకు ఇవ్వాలని టీఆర్ఎస్ అధిష్టానాన్ని కోరారు. ‘తెలంగాణ కోసం నా బిడ్డ ప్రాణత్యాగం చేశాడు. రేపు నాకు టికెట్ ప్రకటించాలి. హుజూర్నగర్ టికెట్ నాకు ఇవ్వకపోతే కిరోసిన్ పోసుకుంటాను. ఎన్నారై సైదిరెడ్డికి టికెట్ ఇస్తే ఊరుకోను. హుజూర్నగర్ అభివృద్ధి విషయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి నిర్లక్ష్యం చేశారు. తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడకు ప్రాధాన్యత ఇచ్చారు..’అని వ్యాఖ్యానించారు. -
65 మందితో కాంగ్రెస్ తొలి జాబితా
సాక్షి, న్యూఢిల్లీ: నెలన్నరపాటు సుదీర్ఘంగా కసరత్తు చేసి ఎట్టకేలకు కాంగ్రెస్ తన అభ్యర్థుల తొలి జాబితాను వెల్లడించింది. 65 మంది పేర్లతో సోమవారం రాత్రి 11.15 గంటలకు జాబితా ప్రకటించింది. 119 స్థానాల్లో 26 స్థానాలు మిత్రపక్షాలకు పోను కాంగ్రెస్ పోటీ చేసే 93 స్థానాల్లో 74 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఈ నెల 8న అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే, ఆ జాబితా వెల్లడి కాకుండానే వాటిపై అనేక ఫిర్యాదులు అందడంతో పార్టీ అధ్యక్షుడు రాహుల్ స్వయంగా జోక్యం చేసుకుని సోమవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్త చరణ్‌దాస్, ఏఐసీసీ కార్యదర్శులు సలీం అహ్మద్, బోసు రాజు, శ్రీనివాసన్‌లతో రాహుల్ రెండు విడతలుగా సమావేశమయ్యారు. మధ్యాహ్నం 12.30 నుంచి 2.00 గంటల వరకు, 3 నుంచి 4 గంటల వరకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు. ఇందులో ప్రధానంగా ఇటీవలే పార్టీలో చేరి అభ్యర్థుల జాబితాలో చోటు చేసుకున్నవారు, నేతల ఒత్తిళ్లతో అభ్యర్థిత్వాలు దక్కించుకున్నవారు, సామాజిక సమతుల్యం లేనప్పటికీ అభ్యర్థిత్వాలు దక్కించుకున్నవారు, ఒకే కుటుంబం నుంచి ఇద్దరు అభ్యర్థిత్వాలు పొందినవారు తదితర వివాదాస్పద అంశాలపై దాదాపు 20 స్థానాల్లో పునఃపరిశీలన జరిపారు. కొన్ని మార్పులు, చేర్పులు చేయించారు. అనంతరం స్క్రీనింగ్ కమిటీ రాహుల్ సూచనల మేరకు వార్‌రూమ్‌లో సమావేశమై తుదిజాబితా రూపొందించింది. ఈ జాబితాపై సోనియాగాంధీ నివాసంలో రాత్రి 7.30 నుంచి 8.15 గంటల వరకు పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ మరోసారి చర్చించింది. మార్పులు, చేర్పులు ఉన్న స్థానాలపై మాత్రమే చర్చించి ఆమోదించింది. అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు కలసి ఏఐసీసీ కార్యాలయంలో జాబితాను క్రోఢీకరించారు. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఇన్చార్జి ముకుల్ వాస్నిక్ రాత్రి 10.30 గంటలకు ఏఐసీసీకి చేరుకుని దానిని పరిశీలించి అధ్యక్షుడి ఆమోదానికి పంపి చివరకు 65 మందితో కూడిన జాబితాను రాత్రి 11.15 గంటలకు విడుదల చేశారు. తొలుత అనుకున్న 74 స్థానాల్లో 9 స్థానాలు నిలిపివేశారు. మరికొన్ని మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. ఏకాభిప్రాయం ఉన్న స్థానాలకే తొలి జాబితాలో చోటు ఇచ్చారు. సిట్టింగ్ శాసనసభ్యులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు ఈ జాబితాలో చోటు దక్కింది. అయితే, మరికొన్ని ముఖ్యమైన స్థానాలను కూడా పెండింగ్‌లో పెట్టారు. సనత్‌నగర్ నుంచి మర్రి శశిధర్‌రెడ్డి, జనగామ నుంచి పొన్నాల లక్ష్మయ్య అభ్యర్థిత్వాలను ఆశించినప్పటికీ ఈ స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. మిత్రపక్షాలు కోరుతుండటంతో ఈ స్థానాలను పెండింగ్‌లో పెట్టినట్టు తెలుస్తోంది. అలాగే మిత్రపక్షాల మధ్య ఇంకా స్పష్టత రాని మేడ్చల్, పటాన్చెరు, రాజేంద్రనగర్ తదితర స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతున్న స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. రాష్ట్రనేతల తీరుపై రాహుల్ అసహనం! ప్రజాకూటమిలోని మిత్రపక్షాలకు ఇచ్చే సీట్ల వ్యవహారం ఇంకా కొలిక్కిరాకపోవడంతో రాహుల్ ఈ విషయాలపై ఆరా తీసినట్టు సమాచారం. ఈ విషయంలో రాష్ట్ర నేతల తీరుపై రాహుల్ ఒకింత అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ మిత్రపక్షాలకు ఇచ్చే సీట్ల విషయంలో స్పష్టత లేకపోవడంపై ఆయన ప్రశ్నించినట్టు తెలిసింది. మరోవైపు ఎన్నికలు సమీపించిన వేళ అకస్మాత్తుగా పార్టీలోకి వచ్చి అభ్యర్థిత్వాల తుది జాబితాలో చోటు చేసుకున్నారన్న ఫిర్యాదులను ఆయన లోతుగా చర్చించినట్టు సమాచారం. నకిరేకల్ లేదా మునుగోడు స్థానం తెలంగాణ ఇంటి పార్టీకి దక్కనుందన్న నేపథ్యంలో ఈ రెండు స్థానాలపై రాహుల్‌గాంధీకి ఫిర్యాదులు అందాయి. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట, పాలేరు, తుంగతుర్తి, ఇల్లెందు తదితర స్థానాల్లో కొత్తగా వచ్చిన వారికి సీట్లు ఇస్తున్నారన్న ఫిర్యాదులు అందాయి. బీసీలకు న్యాయం జరగలేదని, పారాచూట్‌లా వచ్చి ఊడిపడ్డవారికి టికెట్లు ఇస్తున్నారని గాంధీభవన్ వద్ద, ఢిల్లీలో ఆందోళనలకు దిగిన నేపథ్యంలో ఆయా సీట్లపై మరోసారి చర్చించారు. ఆయా స్థానాల్లో కొన్నింటిని మార్చాల్సిందిగా నేతలకు సూచించినట్టు తెలిసింది. అభ్యర్థుల ఎంపిక విషయంలో కొన్ని మార్గదర్శకాలు చేసి సామాజిక సమీకరణాలు, యువత, ప్రజలకు దగ్గరగా ఉండే నేతలను జాబితాలో చేర్చాలని ఆదేశించినట్టు తెలిసింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థుల పేర్లు ఎక్కువగా ఉంటే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉండడంతో ఈ విషయంలో జాగ్రత్తలు వహించి ఎలాంటి వివాదాలకు వీలులేకుండా జాబితాను రూపొందించాలని రాహుల్ సూచించినట్టు తెలిసింది. తొలి జాబితాను ఇక ఎంతమాత్రం ఆలస్యం లేకుండా వెల్లడించాలని ఆదేశించినట్టు సమాచారం. అందుకే హైదరాబాద్‌లో విడుదల కావాల్సిన జాబితాను ఢిల్లీలోనే విడుదల చేశారు. ఒకటి రెండు రోజుల్లో రెండో జాబితా స్క్రీనింగ్ కమిటీ, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ మొత్తం 93 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినప్పటికీ కేవలం 65 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు. మిత్రపక్షాల స్థానాలపై స్పష్టత వచ్చిన అనంతరం 28 మంది అభ్యర్థులతో రెండో జాబితాను ప్రకటించనున్నారు. మరోవైపు రెబల్స్ బెడదను తట్టుకునేందుకు, వలసలను నివారించేందుకు వ్యూహాత్మకంగా రెండో జాబితాను ఆలస్యంగా విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థులు వీరే.. 1. సిర్పూర్ – డాక్టర్ పాల్వాయి హరీశ్‌బాబు 2. చెన్నూరు(ఎస్సీ) – డా. వెంకటేశ్ నేత బోర్లకుంట 3. మంచిర్యాల – కె.ప్రేమ్‌సాగర్‌రావు 4. ఆసిఫాబాద్(ఎస్టీ) – అత్రం సక్కు 5. ఆదిలాబాద్ – సుజాత గండ్రాత్ 6. నిర్మల్ – ఆలేటి మహేశ్వర్‌రెడ్డి 7. ముథోల్ – రామారావ్ పటేల్ పవార్ 8. ఆర్మూర్ – ఆకుల లలిత 9. బోధన్ – పి.సుదర్శన్‌రెడ్డి 10. జుక్కల్ (ఎస్సీ) – ఎస్.గంగారాం 11. బాన్సువాడ – కాసుల బాల్‌రాజు 12. కామారెడ్డి – షబ్బీర్ అలీ 13. జగిత్యాల – జీవన్ రెడ్డి 14. రామగుండం – ఎం.ఎస్.రాజ్ ఠాకూర్ 15. మంథని – శ్రీధర్‌బాబు దుద్దిళ్ల 16. పెద్దపల్లి – సీహెచ్ విజయరమణారావు 17. కరీంనగర్ – పొన్నం ప్రభాకర్ 18. చొప్పదండి(ఎస్సీ) – డాక్టర్ మేడిపల్లి సత్యం 19. వేములవాడ – ఆది శ్రీనివాస్ 20. మానకొండూరు (ఎస్సీ) – ఆరేపల్లి మోహన్ 21. అందోల్æ(ఎస్సీ) – దామోదర రాజనర్సింహ 22. నర్సాపూర్ – వి.సునీతాలక్ష్మారెడ్డి 23. జహీరాబాద్ (ఎస్సీ) – డాక్టర్ జె.గీతారెడ్డి 24. సంగారెడ్డి – జగ్గారెడ్డి 25. గజ్వేల్ – ఒంటేరు ప్రతాప్‌రెడ్డి 26. కుత్బుల్లాపూర్ – కూన శ్రీశైలంగౌడ్ 27. మహేశ్వరం – పి.సబితాఇంద్రారెడ్డి 28. చేవెళ్ల (ఎస్సీ) – కేఎస్ రత్నం 29. పరిగి – టి.రామ్మోహన్‌రెడ్డి 30. వికారాబాద్ (ఎస్సీ) – గడ్డం ప్రసాద్‌కుమార్ 31. తాండూరు – పంజుగుల పైలట్ రోహిత్‌రెడ్డి 32. ముషీరాబాద్ – ఎం.అనిల్‌కుమార్‌యాదవ్ 33. నాంపల్లి – ఫిరోజ్‌ఖాన్ 34. గోషామహల్ – ఎం.ముఖేశ్‌గౌడ్ 35. చార్మినార్ – మహ్మద్ గౌస్ 36. చాంద్రాయణగుట్ట – ఈస మిస్రి 37. సికింద్రాబాద్ కంటోన్మెంట్ – సర్వే సత్యనారాయణ 38. కొడంగల్ – రేవంత్‌రెడ్డి 39. జడ్చర్ల – డా. మల్లు రవి 40. వనపర్తి – డాక్టర్ జి.చిన్నారెడ్డి 41. గద్వాల్ æ– డీకే అరుణ 42. అలంపూర్ (ఎస్సీ) – సంపత్‌కుమార్ 43. నాగర్‌కర్నూల్ – నాగం జనార్దన్ రెడ్డి 44. అచ్చంపేట(ఎస్సీ) – సీహెచ్ వంశీకృష్ణ 45. కల్వకుర్తి – డా. వంశీచంద్ రెడ్డి 46. నాగార్జునసాగర్ – కె.జానారెడ్డి 47. హుజూర్నగర్ – ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి 48. కోదాడ – ఎన్.పద్మావతిరెడ్డి 49. సూర్యాపేట – ఆర్.దామోదర్‌రెడ్డి 50. నల్లగొండ – కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 51. మునుగోడు – కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి 52. భువనగిరి – కె.అనిల్‌కుమార్‌రెడ్డి 53. నకిరేకల్(ఎస్సీ) – చిరుమర్తి లింగయ్య 54. ఆలేరు – బి.భిక్షమయ్యగౌడ్ 55. స్టేషన్‌ఘన్‌పూర్(ఎస్సీ) – సింగపూర్ ఇందిర 56. పాలకుర్తి – జంగా రాఘవరెడ్డి 57. డోర్నకల్(ఎస్టీ) – డాక్టర్ జె.రామచంద్రునాయక్ 58.మహబూబాబాద్(ఎస్టీ) –పోరిక బలరాంనాయక్ 59. నర్సంపేట – దొంతి మాధవరెడ్డి 60. పరకాల – కొండా సురేఖ 61. ములుగు(ఎస్టీ) – సీతక్క 62. పినపాక(ఎస్టీ) – రేగ కాంతారావు 63. మధిర(ఎస్సీ) – మల్లు భట్టి విక్రమార్క 64. కొత్తగూడెం – వనమా వెంకటేశ్వర్రావు 65. భద్రాచలం(ఎస్టీ) – పోడెం వీరయ్య -
పెండింగ్ స్థానాల అభ్యర్థుల ఖరారు!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎన్నికల వ్యూహాల్లో వేగం పెంచుతోంది. ఆపార్టీ విడుదల చేసిన తొలిజాబితాలో అభ్యర్థులను ప్రకటించకుండా ఆపిన 12 స్థానాలకు పోటీచేసే నేతల పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ మేరకు శనివారం కసరత్తు పూర్తి చేశారు. ఈ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తే అసంతృప్తికి గురయ్యే నేతలతో మాట్లాడాలని మంత్రి కేటీఆర్‌ను ఆదేశించగా ఆయ న కూడా అదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా పార్టీకి ఎలాంటి నష్టం జరగకుండా కేటీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. టికెట్ ఆశిస్తున్న వారితో తానే స్వయంగా మాట్లాడారు. ద్వితీయశ్రేణి నేతలతో మాట్లాడే బాధ్యతను ఆయా జిల్లాల ముఖ్యనేతలకు అప్పగించారు. టీఆర్ఎస్ అభ్యర్థులకు ఆదివారం బీఫారాలు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణ యించారు. ఎన్నికల వ్యూహంపై అందరికీ వివరించే ముందే పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆఖరి నిమిషంలో మార్పులు ఉంటే తప్ప పెండింగ్ సీట్లకు ఆదివారమే అభ్యర్థులను ప్రకటించనున్నారు. అందరు అభ్యర్థులకు కలిపి ఒకేసారి ప్రచారంపై మార్గనిర్దేశనం చేయనున్నారు. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకుగాను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సెప్టెంబరు 6న 105 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. విశ్వసనీయ సమాచారం ప్రకారం పెండింగ్ సీట్ల అభ్యర్థుల జాబితా ఇలా ఉండనుంది. ఖైరతాబాద్– దానం నాగేందర్, గోషామహల్– ప్రేమ్‌సింగ్ రాథోడ్, ముషీరాబాద్– ముఠా గోపాల్, అంబర్‌పేట– కాలేరు వెంకటేశ్, మేడ్చల్– సి.హెచ్.మల్లారెడ్డి, మల్కాజ్గిరి–మైనంపల్లి హన్మంతరావు, చొప్పదండి– సుంకె రవిశంకర్, వరంగల్‌తూర్పు– నన్నపునేని నరేందర్, హుజూర్నగర్– శానంపూడి సైదిరెడ్డి/ అప్పిరెడ్డి, కోదాడ– వేనేపల్లి చందర్రావు/కె.శశిధర్‌రెడ్డి, వికారాబాద్– టి.విజయ్‌కుమార్/ఎస్.ఆనంద్, చార్మినార్– దీపాంకర్‌పాల్/ఇలియాస్ ఖురేషీ. జీయర్‌స్వామి ఆశీస్సులు... ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటుగా రాజ్యసభ్యుడు జె.సంతోష్ కుమార్‌లు శనివారం శంషాబాద్‌లో ఉన్న జీయర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమిలోని దివ్యసాకేతాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయరుస్వామి ఆశీస్సులు తీసుకున్నారు. నేడు ఎర్రవల్లిలో సమావేశం... కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో నేడు ప్రచార సభ నిర్వహించనున్నారు. ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకు గజ్వేల్ నియోజకవర్గ టీఆర్ఎస్ ముఖ్యనేతలు, కార్యకర్తలతో సీఎం కేసీఆర్ సమావేశమవుతున్నారు. 15 వేల మంది ఈ సమావేశంలో పాల్గొననున్నారు. -
అభ్యర్థులతో రేపు కేసీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్ : ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వ్యూహంలో టీఆర్ఎస్ మరో ముందడుగు వేయనుంది. ఇప్పటికే ప్రత్యర్థి పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించిన గులాబీ దళం... బీఫారాల పంపిణీలోనూ ఇదే దూకుడును ప్రదర్శించనుంది. సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ఒకరోజు ముందే అభ్యర్థులకు బీఫారాలు పంపిణీ చేయాలని టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకుగాను ఇప్పటికే ప్రకటించిన 107 స్థానాల అభ్యర్థులతో కేసీఆర్ ఆదివారం తెలంగాణ భవన్లో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలోనే పార్టీ అభ్యర్థులకు బీఫారాలను అందించనున్నారు. బీఫారాల పంపిణీతోపాటు ప్రచార వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. ప్రచారంపై సమీక్ష... అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో సోమవారం నుంచి అసలైన ఎన్నికల పోరు మొదలు కానుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు పార్టీ అభ్యర్థులకు మరోసారి ఎన్నికల వ్యూహానికి సంబంధించిన కీలకాంశాలను వివరించే అవకాశం ఉంది. బీఫారాలను పంపిణీ చేయడంతోపాటు ఎవరెవరు ఏయే రోజుల్లో నామినేషన్ వేయాలనే విషయంలోనూ సూచనలు చేసే అవకాశం ఉందని తెలిసింది. ప్రచార షెడ్యూల్ సిద్ధం... సీఎం కేసీఆర్ ప్రచారం కోసం టీఆర్ఎస్ అభ్యర్థులు, శ్రేణులు ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 7న ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కేసీఆర్... ఆ తర్వాత నిజామాబాద్, నల్లగొండ, వనపర్తి బహిరంగ సభల్లో పాల్గొన్నారు. మహాకూటమి అభ్యర్థుల ఖరారు తర్వాతే పూర్తిస్థాయి ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించారు. కూటమి అభ్యర్థులను ప్రకటించగానే టీఆర్ఎస్ అధినేత వరుసగా బహిరంగ సభలు, రోడ్డు షోలలో పాల్గొననున్నారు. ఉమ్మడి జిల్లాల బహిరంగ సభలు, నియోజకవర్గాలవారీగా ప్రచార షెడ్యూల్‌ను ఇప్పటికే రూపొందించారు. కూటమి అభ్యర్థులు ఖరారు కాగానే ఈ షెడ్యూల్‌ను అమలు చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కూటమి అభ్యర్థులను శనివారం ప్రకటిస్తే కేసీఆర్ సోమవారం నుంచి ప్రచారం మొదలుపెట్టనున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థుల సమావేశంలో కేసీఆర్ ప్రచార షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. కేసీఆర్ ప్రచారం కోసం హెలికాప్టర్, ప్రత్యేక బస్సు సిద్ధమయ్యాయి. వాటి వాడకానికి ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. పూర్తిస్థాయి మేనిఫెస్టో రెడీ... ఇప్పటికే పాక్షిక మేనిఫెస్టోను ప్రకటించిన కేసీఆర్ పూర్తిస్థాయి మేనిఫెస్టోనూ రూపొందించారు. రుణమాఫీ, ఆసరా పింఛన్ల పెంపు, నిరుద్యోగ భృతి, ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక అభివృద్థి పథకం హామీలకు ప్రజల్లో ఇప్పటికే మంచి స్పందన వస్తోందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అందరికీ జీవిత బీమా వంటి వినూత్న పథకాలను తుది మేనిఫెస్టోలో చేర్చనున్నారు. ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి పథకం ఎలా ఉండాలనే అంశంపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలోని కమిటీ ఇప్పటికే కేసీఆర్‌కు నివేదిక ఇచ్చింది. ఈ పథకాన్ని మేనిఫెస్టోలో చేర్చనున్నారు. మేనిఫెస్టో రూపకల్పన పూర్తయినా ఇంకా ఎలాంటి అంశాలను చేర్చాలో చెప్పాలని టీఆర్ఎస్ అభ్యర్థులు, ముఖ్యనేతలకు కేసీఆర్ సూచిస్తున్నారు. ప్రచారంలో ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. తుది మేనిఫెస్టోలో అన్ని అంశాలను చేర్చే అవకాశం ఉంది. రేపు గజ్వేల్ నేతలతో కేసీఆర్ భేటీ... తాను పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ప్రచారంపై కేసీఆర్ దృష్టి సారించారు. గజ్వేల్ నియోజకవర్గ టీఆర్ఎస్ నేతలతో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో సుమారు 15 వేల మంది కార్యకర్తలు పాల్గొననున్నారు. స్టార్ క్యాంపెయినర్లు.. టీఆర్ఎస్ నుంచి అధికారికంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే వారి జాబితాను సీఎం కేసీఆర్ అభ్యర్థుల సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది. ప్రచారం కోసం 40 మందిని నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీతోపాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ నేతలను స్టార్ క్యాంపెయినర్లుగా టీఆర్ఎస్ నియమించనుంది. పెండింగ్ స్థానాలపై 2–3 రోజుల్లో నిర్ణయం అభ్యర్థులను ప్రకటించాల్సిన 12 స్థానాల విషయంలోనూ సీఎం కేసీఆర్ 2–3 రోజుల్లో నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. మహాకూటమి అభ్యర్థుల ప్రకటన తర్వాతే ఈ స్థానాలపై ప్రకటన చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. అయితే కూటమి అభ్యర్థుల ప్రకటన ఇంకా ఆలస్యమైతే మాత్రం టీఆర్ఎస్ వెంటనే ఆ స్థానాలను ప్రకటించనుందని తెలిసింది. హుజూర్నగర్, కోదాడ, వరంగల్ తూర్పు, చొప్పదండి, వికారాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, ఖైరతాబాద్, ముషీరాబాద్, అంబర్‌పేట, గోషామహల్, చార్మినార్ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. -
కమలంలో కలవరం
మెదక్ నియోజకవర్గ బీజేపీ టికెట్ విషయంలోనూ స్థానికత అంశం తెరపైకి వచ్చింది. ఈ టికెట్‌ను బీజేపీ రాష్ట్ర నాయకుడు ఆకుల రాజయ్య ఆశిస్తున్నట్లు సమాచారం. కానీ లోకల్ నాయకులకే టికెట్ ఇవ్వాలని ఆశావహులు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక ఆశావహుల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా.. కలిసి పనిచేస్తామని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అయితే కొంత మంది నాయకులు మాత్రం స్థానికేతరుడికి టికెట్ ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నారన్న విషయం బయటకు రావడంతో కలవరం మొదలైంది. లోకల్ నాయకులకు టికెట్ ఇవ్వకుంటే పార్టీ వీడేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ఆశావహులు తమ అభిప్రాయలను అధిష్టానానికి బలంగా వినిపిస్తున్నారు. సాక్షి, మెదక్ : బీజేపీ మెదక్ ఎమ్మెల్యే టికెట్ కేటాయింపు పార్టీలో అంతర్గత విభేదాలకు దారితీస్తోంది. మెదక్ ఎమ్మెల్యే టికెట్ కోసం స్థానిక నేతలు ప³లువురు పోటీ పడుతున్నారు. అయితే బీజేపీ అధిష్టానం స్థానికేతర నాయకుడిని ఎమ్మెల్యే బరిలో ఉంచేం దుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పసిగట్టిన స్థానిక ఆశావహులు అధిష్టానం తీరుపై మండిపడుతున్నట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో స్థానికులకే ఈ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని, స్థానికేతరులకు పార్టీ టికెట్ ఇస్తే తాము సహకరించేదిలేదని ఆశావహులు ఖరాఖండిగా బీజేపీ పెద్దలకు చెప్పినట్లు తెలుస్తోంది.కాగా కొంత మంది బీజేపీ నాయకులు స్థానికేతర నాయకులకు సహకరించేందుకు కూడా సుముఖత వ్యక్తం చేయటం బీజేపీ పార్టీ నేతల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ టికెట్ కోసం బీజేపీ నాయకులు రాంచరణ్‌యాదవ్, కటికె శ్రీనివాస్, నందారెడ్డి, తాళ్లపల్లి రాజశేఖర్, గడ్డం కాశీనాథ్, వనపర్తి వెంకటేశం, గడ్డం శ్రీనివా స్ తదితరులు పోటీ పడుతున్నారు. వీరంతా ఎవరికివారే టికెట్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఆకుల రాజయ్య మెదక్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. అధిష్టానం పెద్దలు కూడా రాజయ్యకు టికెట్ ఇచ్చే విషయంలో సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఇటీవల బీజేపీ అధిష్టానం నియోజకవర్గ నాయకులతో సమావేశమై ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న వారి అభిప్రాయాలను తెలుసుకుంది. ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న నాయకులంతా స్థానికులకే టికెట్ ఇవ్వాలని, స్థానికులకు ఎవ్వరికి టికెట్ ఇచ్చినా అందరం కలిసికట్టుగా పనిచేస్తామని అధిష్టానం పెద్దలకు చెప్పినట్లు తెలుస్తోంది. తెర వెనక రాజకీయం.. స్థానికేతర నాయకులకు టికెట్ ఇస్తే సహించేదిలేదని, ఎట్టి పరిస్థితుల్లో స్థానికులకే టికెట్ ఇవ్వాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాంచరణ్‌యాదవ్, ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న కటికె శ్రీనివాస్, తాళ్ల పల్లి రాజశేఖర్, నందారెడ్డి తదితరులు స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే కొంత మంది నాయకులు మాత్రం స్థానికేతర నాయకులకు టికెట్ దక్కేలా తెరవెనుక పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మెదక్ నుంచి పోటీచేసేందుకు ఆసక్తి ఉన్న రాజయ్యకు మద్దతు తెలుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న ఆశావహులు స్థానికేతర నాయకుడికి మద్దతు తెలుపుతున్న నాయకులను నిలదీయటమే కాకుండా గొడవ పడినట్లు తెలుస్తోంది. మెదక్ టికెట్ ఎట్టి పరిస్థితుల్లో స్థానికులకు ఇవ్వాలని, స్థానికేతరులకు ఇస్తే తాము పార్టీ వీడేందుకు వెనకాడేదిలేదని ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉన్న పలువురు నాయకులు సోమవారం బీజేపీ అధిష్టానం పెద్దలు నిర్వహించిన సమావేశంలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ స్థానికులకు ఇస్తుందా? లేక స్థానికేతరుడైన నాయకునికి కట్టబెడుతుందా? అన్న అంశం చర్చనీయాంశంగా మారుతోంది. -
పంతుల్లే పాలకులు..
సాక్షి, ఇచ్చోడ(బోథ్): బోథ్ ఎస్టీ నియోజకవర్గంలో ఓటర్లు విలక్షణ తీర్పు ఇస్తూ వస్తున్నారు. ఇక్కడి నుంచి చట్ట సభల్లోకి వెళ్లేందుకు అధికంగా ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన వారికే ఓట్లు వేస్తూ వచ్చారు. ఇప్పటి వరకు 12 సార్లు సాధారణ ఎన్నికలు జరిగాయి. 1962లో మొదటిసారి జరిగిన ఎన్నికల్లో నియోజకవర్గం జనరల్ స్థానం ఉంది. ఆ తర్వాత 1967లో జరిగిన పునర్విభజనలో ఎస్టీగా మారింది. ఎస్టీ రిజర్వ్ స్థానంగా 11 సార్లు ఎన్నికలు జరగగా 7సార్లు ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన వారే ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం ప్రత్యేకత. బజార్హత్నూర్ మండలంలోని జాతర్ల గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు గోడం రామారావు అనుహ్యంగా 1985లో ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి టీడీపీ తరఫు నుంచి బోథ్ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అప్పటి ఎన్టీ రామారావు మంత్రివర్గంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 1989లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రామారావు పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994 ఎన్నికల్లో రామారావు తనయుడు నగేశ్‌కు టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం లభించింది. అప్పటికే గోడం నగేశ్ బోథ్ మండలంలోని పార్టీ బిలో ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నారు. రామారావును కాకుండా అప్పట్లో టీడీపీ నగేశ్‌కు టికెట్ ఇవ్వడంతో నగేశ్ ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి బోథ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. నగేశ్ కూడా చంద్రబాబు మంత్రివర్గంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. 1999లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి పోటీ చేసి గెలుపొంది రాష్ట్ర జీసీసీ చైర్మన్‌గా పనిచేశారు. 2004 సాధారణ ఎన్నికల్లో ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సోయం బాపురావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 సాధారణ ఎన్నికల్లో మరోమారు గోడం నగేశ్ ఎమ్మెల్యే అయ్యారు. 2014 సాధారణ ఎన్నికల్లో ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి వచ్చిన రాథోడ్ బాపురావు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక్కడి ఓటర్లు ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన వారినే శాసనసభకు పంపడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. -
టెన్షన్.. టెన్షన్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్ టికెట్ల వ్యవహారంపై నేతల్లో టెన్షన్ నెలకొంది. ఒకప్పుడు జిల్లా కాంగ్రెస్‌లో అన్నీ తామై.. చక్రం తిప్పి.. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇప్పుడు టికెట్ల కోసం చక్కర్లు కొడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించిన మాజీ మంత్రులు పలువురు ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? మహాకూటమి పొత్తుల వల్ల వారు గతం నుంచి పోటీ చేస్తున్న స్థానాలను త్యాగం చేయాల్సి వస్తే పార్టీ వారికి ఎటువంటి భరోసా ఇస్తుంది? ఎలా రాజకీయ సర్దుబాటు చేస్తుందన్న అంశం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో మధిర, పినపాక నియోజకవర్గాలు మినహా మిగిలిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఎవరికి లభిస్తుందన్న అంశం ఉత్కంఠ రేపుతోంది. మధిర నుంచి టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క ఒక్కరే దరఖాస్తు చేయడంతో ఆయన పేరు ఖరారు కావడం లాంఛనంగా మిగిలింది. పినపాకలోనూ అక్కడి మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు టికెట్ ఖాయమన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఇక మిగిలిన నియోజకవర్గాల్లో రోజుకొకరి పేరు తెరపైకి రావడం, ఫలాన వారికి టికెట్ వస్తుందనే ప్రచారం జరగడం కొద్ది రోజులుగా జరుగుతున్నా.. అధిష్టానం ఆశీస్సులు లభించేదెవరికి అనే విషయం మాత్రం ఒక పట్టాన కార్యకర్తలకే అంతుచిక్కడం లేదు. ఉమ్మడి జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌లో ఉన్న ఇద్దరు రాష్ట్ర మాజీ మంత్రులు సంభాని చంద్రశేఖర్, వనమా వెంకటేశ్వరరావు, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే పార్టీ వారి పేర్లను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నా.. వారు పోటీ చేయాలనుకున్న సత్తుపల్లి, కొత్తగూడెం, ఖమ్మం స్థానాలను మహాకూటమిలో భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, సీపీఐ కోరుతుండడంతో ఆ సీట్ల కేటాయింపుపై పార్టీపరంగా పీటముడి పడినట్లయింది. దీంతో మహాకూటమి భాగస్వామ్య పక్షాల నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో ఎవరికి టికెట్ దక్కుతుందన్న అంశం ప్రశ్నార్థకంగా మారింది. ‘సండ్ర’ ప్రచారం.. ఇప్పటికే సత్తుపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య మహాకూటమి అభ్యర్థిగా నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఆ సీటును టీడీపీకే కేటాయించడానికి కాంగ్రెస్ సిద్ధపడడం, అక్కడి నుంచి గత ఎన్నికల వరకు రెండుసార్లు పోటీ చేసిన మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌ను ఈసారి కాంగ్రెస్ ఎక్కడి నుంచి బరిలోకి దించుతుందన్న అంశం ఇంకా కొలిక్కి రాలేదు. సంభాని గతంలో పోటీ చేసి.. పలు పర్యాయాలు గెలిచి తనకు పట్టున్న పాలేరు జనరల్ స్థానం నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతుండడంతోపాటు ఇందుకోసం ఏఐసీసీ స్థాయిలో తనవంతు ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పాలేరు నుంచి ఆయనను బరిలోకి దించే అంశం కాంగ్రెస్ పరిశీలనలో ఉన్నా.. సత్తుపల్లి నుంచి పోటీ చేసే అవకాశం మాత్రం లేకుండా పోయింది. అలాగే కొత్తగూడెం టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు సైతం టికెట్ కోసం పార్టీలో హోరాహోరీ పోరు జరపాల్సిన పరిస్థితి నెలకొంది. కూటమి పొత్తులో భాగంగా భాగస్వామ్య పక్షమైన సీపీఐ ఈ సీటును తమకే కేటాయించాలని పట్టుపట్టడం, 2009 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలుపొందిన సీపీఐ మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మరోసారి మహాకూటమి తరఫున పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ ఈ సీటును కూటమిలోకి భాగస్వామ్య పక్షమైన సీపీఐకి కేటాయిస్తుందా? మాజీ మంత్రి వనమానే బరిలోకి దించుతుందా? అనే అంశంపై ఇప్పటికీ స్పష్టత కొరవడింది. కాంగ్రెస్‌కు కేటాయిస్తేనే విజయం సాధ్యమని ఆ పార్టీ వర్గాలు ప్రచారం చేస్తున్నా.. సీపీఐ సైతం కొత్తగూడెం తమకు పట్టున్న ప్రాంతమని, సింగరేణి కార్మికులు, ఆ ప్రాంత ప్రజా ఉద్యమాలతో పార్టీకి ఎనలేని అనుబంధం ఉన్నందున గెలిచి తీరుతామని వాదిస్తోంది. దీంతో వనమాకు టికెట్ లభించే విషయం చివరి నిమిషం వరకు తేలని పరిస్థితి. అలాగే కాంగ్రెస్ నుంచి స్వయానా వనమా తోడల్లుడు, కాంగ్రెస్ నేత ఎడవల్లి కృష్ణ, నియోజకవర్గానికి చెందిన నాగా సీతారాములు టికెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ పోటీ చేయాలని భావించినా.. టికెట్ ఎవరికి లభిస్తుందన్న అంశం మాత్రం ఒక పట్టాన అంతుపట్టడం లేదు. ఇక ఇప్పటివరకు లోక్‌సభ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేసి రెండుసార్లు ఖమ్మం ఎంపీగా విజయం సాధించి.. కేంద్రంలో మంత్రిగా పని చేసిన రేణుకాచౌదరి ఈసారి ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. పోటీ చేయాలంటూ నియోజకవర్గ కార్యకర్తలు, సాధారణ ప్రజల నుంచి ఒత్తిడి ఉందని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించడం ద్వారా రేణుకాచౌదరి సైతం ఖమ్మం నుంచి పోటీ చేసే అవకాశాన్ని కోరుతున్నట్లు ప్రచారమవుతోంది. అయితే ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు టీడీపీ సైతం సిద్ధపడడం, కాంగ్రెస్‌లో అనేక మంది పోటీపడుతుండడంతో ఇక్కడ కూటమిలోని ఏ భాగస్వామ్య పక్షం ఎన్నికల బరిలో నిలుస్తుందనే అంశం ఉత్కంఠ రేపుతోంది. సత్తుపల్లిలో మహాకూటమి భాగస్వామ్య పక్షం పోటీ చేస్తుండడంతో అక్కడ మాజీ మంత్రి సంభాని అవకాశం కోల్పోయినట్లయింది. ఇక టికెట్ల పోరులో ఉన్న మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని చేస్తున్న ప్రయత్నాలు, ఖమ్మం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరికి ఏ మేరకు పరిస్థితులు కలిసొస్తాయనే అంశం జిల్లా రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. -
కొనసాగుతున్న కాంగ్రెస్ అభ్యర్థుల కసరత్తు
-
బీజేపీ వ్యూహాత్మకం!
భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. టీఆర్ఎస్, మహాకూటమి అభ్యర్థులకు దీటైన పోటీ ఇచ్చే అవకాశం ఉన్నచోట గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ప్రకటిస్తోంది. తొలి, మలి విడతల్లో ఇప్పటికే ఎనిమిది మంది అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ అధిష్టానం.. మిగతా స్థానాల్లో గట్టిగా తలపడి గెలిచే అవకాశం ఉన్న వలస నేతల కోసం వేచి చూస్తోంది. చొప్పదండి (ఎస్సీ), వేములవాడ, మంథని నియోజకవర్గాలకు సంబంధించి టీఆర్ఎస్, కాంగ్రెస్, కూటమిల నేతలు కొందరు అధిష్టానంతో టచ్‌లో ఉన్నట్లు బీజేపీ నేతలు చెప్తున్నారు. ఈ మూడింట్లో సొంత పార్టీ నుంచి పోటీదారులు ఉన్నా.. ప్రకటించకుండా ఉండటానికి అదే కారణంగా చెప్తున్నారు. ఇదే సమయంలో పెండింగ్‌లో హుజూరాబా ద్, హుస్నాబాద్ నియోజకవర్గాలలో వివిధ పార్టీల నుంచి నుంచి అవకాశం దక్కని ముఖ్య నేతలకు ఆయా స్థానాలను కేటాయించే విషయమై దృష్టి సారించినట్లు పార్టీవర్గాలు చెప్తున్నాయి. గత నెల 10న కరీంనగర్లో అమిత్‌షా బహిరంగ సభ అనంతరం బీజేపీ నాయకత్వం గట్టి పోటీ ఇచ్చే వలస నేతలను ఆహ్వానించి అవకాశం కల్పించే యోచనను ముమ్మరం చేసింది. ఆ మేరకు పలువురు ఈనెల 9 తర్వాత తమ నిర్ణయాన్ని తెలియజేసే అవకాశం ఉండగా, మిగతా సీట్ల కేటాయింపు విషయంలో బీజేపీ ఆచీతూచీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరో ముగ్గురు అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. అక్టోబర్ 21న తొలివిడతగా ఐదుగురు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, రెండో విడతగా మరో మూడు నియోజకవర్గాలకు శుక్రవారం ఖరారు చేసింది. జగిత్యాలకు ముదుగంటి రవీందర్‌రెడ్డి, రామగుండంకు బల్మూరి వనిత, సిరిసిల్లకు మాజీ జెడ్పీటీసీ మల్లుగారి నర్సాగౌడ్‌ను అభ్యర్థులుగా ప్రకటించారు. ఆ పార్టీలో కీలకంగా ఉం టూ, ఆయా నియోజకవర్గాల్లో మొదటి నుంచి ప్రజలను అంటిపెట్టుకున్న నేతలకు తొలి, మలి జాబితాల్లో అవకాశం కల్పించారు. తొలి జాబి తాలో గుజ్జుల రామకృష్ణారెడ్డి (పెద్దపల్లి), బండి సంజయ్‌కుమార్ (కరీంనగర్), గడ్డం నాగరాజు (మానకొండూరు), కన్నం అంజయ్య (ధర్మపురి (ఎస్సీ)), కోరుట్లకు జేఎన్ వెంకట్ (కోరుట్ల)ను ప్రకటించారు. దీంతో ఉమ్మడి జిల్లాలో మొత్తం 13 నియోజకవర్గాలకు మొదటి, రెండో విడతల్లో ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య ఎనిమిది మందిని ప్రకటించగా, మరో ఐదు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికల ప్రకటన నుంచే బీజేపీ ఉమ్మ డి కరీంనగర్ జిల్లాలో 13 స్థానాల నుంచి అభ్యర్థులను బరిలోకి దింపేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా స్థానాల్లో ఆశావహులు రోజురోజుకూ పెరుగుతుండటంతో అధిష్టానం మాత్రం వ్యూహాత్మకంగా టిక్కెట్లను ప్రకటిస్తోంది. గతంలో పోటీ చేసి గెలిచిన, ఓడిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు ఆయా ని యోజకవర్గాల్లో ప్రభావం చూపగల సామాజిక వర్గాలు, నేతల పేర్లను పరిశీలనలోకి తీసుకుం టోంది. ఇదే క్రమంలో పలువురు ఆశావహులు ప్రయత్నాలు చేస్తుండగా, మిగిలిన ఐదు స్థానాల పై మాత్రం మరింత వ్యూహాత్మకంగా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వలస నేతలకు అవకాశం కోసం.. ఐదు స్థానాలపై తర్వాతే నిర్ణయం.. అభ్యర్థులను ప్రకటించని ఐదు స్థానాల్లో మూడు చోట్ల టీఆర్ఎస్, కాంగ్రెస్ కూటమిల నుంచి టచ్‌లో ఉన్న నేతలకు బీజేపీ అవకాశం కల్పించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. వేములవాడ నుంచి టికెట్ కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, ఎన్ఆర్ఐ గోలి మోహ న్ దరఖాస్తు చేసుకున్నారు. తొలి, మలి విడతల్లో ఏకంగా జిల్లా అధ్యక్షునికే అవకాశం ఇవ్వలేదు. ఆయన గత ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ప్రచారానికి సహకరించలేదన్న ఆరోపణలు ఉండగా, ఈ స్థానం కోసం టీఆర్ఎస్లోని ఓ కీలక నేత బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారన్న చర్చ జరగుతోంది. చొప్పదండి నుంచి కొరివి వేణుగోపాల్, లింగంపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య తదితరుల పేర్లుండగా, కొరివి వేణుగోపాల్ ఇటీవలే బీజేపీకి రాంరాం చెప్పారు. మిగిలిన ఇద్దరు కాకుండా ఈ నియోజకవర్గం నుంచి సైతం టీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలకనేత కమలం గూటికి చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చొప్పదండికి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదంటున్నారు. అదేవిధంగా మంథనిలో రేండ్ల సనత్‌కుమార్, కొండపాక సత్యప్రకాష్, బోగోజు శ్రీనివాస్, ఉప్పరి శ్రీనివాస్, టీఆర్ఎస్ నుంచి బీజేపీలో ఇటీవలే చేరిన కమాన్‌పూర్ జెడ్పీటీసీ మేకల సంపత్‌యాదవ్, ఖ్యాతం వెంకటరమణ, పొన్నం సదానం దం దరఖాస్తు చేసుకోగా.. 2014, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన ఓ నేత పార్టీలో చేరే అవకాశం ఉం దంటున్నారు. ఈ నేపథ్యంలో మంథని అభ్యర్థిని ప్రకటించలేదంటున్నారు. హుజూరాబాద్ నుంచి కోమల్ల రాజేం దర్‌రెడ్డి, కటంగూరి అనిల్‌రెడ్డి, పుప్పాల రఘు, కనుమల్ల గణపతి, ఉప్పు రవి, గంగడి కృష్ణారెడ్డి, పోరెడ్డి కిషన్‌రెడ్డితోపాటు 14 మంది దరఖాస్తు చేసుకున్నారు. బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కొత్త శ్రీనివాస్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరడంతో హుస్నాబాద్ కోసం సైదాపూర్ మండలం అమ్మనగుర్తి చెందిన పల్నే ని వేణుగోపాల్‌రావు, చాడ శ్రీనివాస్‌రెడ్డి పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. విద్యార్థి దశ నుంచి ఏబీవీపీ, బీజేపీలో కీలకంగా పనిచేసిన వేణుగోపాల్ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సైదాపూర్ మండలంలో మెజార్టీ స్థానాలు రావడానికి కృషి చేశారు. అయితే.. హుజూరాబాద్, హుస్నాబాద్‌లో కూడా టీఆర్ఎస్, కాంగ్రెస్ కూట మి నుంచి కొందరు నాయకులు చేరనున్నారన్న ప్రచారంతో ఇక్కడ కూడా వ్యూహాత్మకంగా అభ్యర్థులను ప్రకటించ లేదని పార్టీ వర్గాల సమాచారం. -
ఓవర్ టు ఢిల్లీ..!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటన మరింత ఆలస్యం కానుంది. కాంగ్రెస్ అధిష్టానం, పెద్దల హడావుడి, ముందుగా చేసిన ప్రకటన మేరకు గురువారం తొలి జాబితా విడుదల అవుతుందని అందరూ భావించారు. మొత్తం ఉమ్మడి జిల్లాలోని 13 స్థానాల్లో ఆరు చోట్ల అభ్యర్థుల పేర్లు దాదాపుగా ఖరారు కాగా, మిగతా ఏడు స్థానాలకు ఒకటి, రెండు పేర్లు పంపారన్న ప్రచారం కూడా జరిగింది. ఈ సమాచారం మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన 13 నియోజకవర్గాల నుంచి పలువురు ఆశావహులు మంగళవారం రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు. అయితే.. బుధవారం, గురువారం రెండు రోజుల్లో ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ, టీపీసీసీ, కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలంతా ఢిల్లీలోని సోనియాగాంధీ నివాసంలో సమావేశమై జాబితా ప్రకటన, మహాకూటమిలో సీట్ల సర్దుబాటు విషయంపై సుదీర్ఘంగా చర్చించారు. మహాకూటమిలో భాగస్వాములైన టీడీపీ, సీపీఐ, టీజేఎస్ పార్టీల సీట్ల కేటాయింపులతోపాటు కాంగ్రెస్ పోటీ చేసే అన్ని సీట్లకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించడమే మంచిదనే నిర్ణయానికి వచ్చి పార్టీ అధిష్టానం అభ్యర్థుల జాబితాను మళ్లీ వాయిదా వేసినట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం 95 స్థానాలకు గాను మొదటి విడతగా 57 మంది జాబితా సిద్ధమైందని ప్రకటించారు. అయితే.. మరోమారు ఈనెల 8న ఢిల్లీలో జరిగే కీలక భేటీ తర్వాతే మొత్తం జాబితాను విడుదల చేయనున్నట్లు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురువారం సాయంత్రం వెల్లడించారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా వెలువడనుందనే సమాచారంతో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి హుటాహుటిన పయనమైన కాంగ్రెస్ ఆశవహులు జాబితా ప్రకటన 8, 9వ తేదీలకు వాయిదా పడడంతో తిరిగి హైదరాబాద్‌కు చేరారు. మొదటి విడతగా కొద్ది మందితో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించాలనుకున్న అధిష్టానం తమ ఆలోచనను ఉపసంహరించుకొని ఈనెల 8, 9వ తేదీల్లో ఏదో ఒకేరోజు ఒకేసారి అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. -
ఢిల్లీలో క్లైమాక్స్!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే స్థానాల సంఖ్య తేలింది. రాష్ట్రంలో 95 సీట్లలో పోటీ చేయనున్న కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బెల్లంపల్లి సీటును మిత్రపక్షానికి త్యాగం చేసింది. ఈ సీటును సీపీఐకి కేటాయించగా.. కోదండరామ్ నేతృత్వంలోని తెలంగాణ జన సమితి (టీజేఎస్)కి ఉమ్మడి జిల్లా నుంచి అవకాశం ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ కాబోతున్నారు. ఈ భేటీ తరువాత జరిగే మార్పులు తప్ప ఇప్పటి వరకున్న సమాచారం ప్రకారం టీజేఎస్‌కు ఉమ్మడి జిల్లాలో సీటు కేటాయించడం లేదు. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కూడా సిద్ధం చేసినట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే సిద్ధం చేసిన జాబితాలో ఉమ్మడి జిల్లాకు చెందిన రెండు సీట్ల విషయంలో మినహా ఏకాభిప్రాయం వచ్చినట్లు సమాచారం. సిద్ధమైన తొలి జాబితాను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పరిశీలన తరువాత ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. సిర్పూరు, ముథోల్పై తేలని సమీకరణలు ఉమ్మడి ఆదిలాబాద్‌లోని పది స్థానాలకు గాను సీపీఐకి బెల్లంపల్లి కేటాయించడం ఖరారైంది. ఈ విషయాన్ని సీపీఐ నేతలు కూడా ధ్రువీకరిస్తున్నారు. మిగతా తొమ్మిది సీట్ల విషయంలో పలు నివేదికలు, సర్వేలను పరిశీలించిన తరువాత ఏడుగురు అభ్యర్థుల విషయంలో ఏకాభిప్రాయం వచ్చినట్లు తెలుస్తోంది. ముథోల్‌లో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్, ఆయనకు వరుసకు సోదరుడైన రామారావు పటేల్ మధ్య పోటీ తీవ్రంగా ఉన్నట్లు సమాచారం. పార్టీ సర్వేలు, ఇతరత్రా నివేదికల ప్రకారం రామారావు పటేల్ వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్న నారాయణరావు పటేల్ అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలిస్తున్న ట్లు సమాచారం. అలాగే సిర్పూరులో పాల్వాయి హరీష్‌బాబుకు టికెట్టు ఖరారని భావించినప్పటికీ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి బ్యాచ్‌లో ఉన్న రావి శ్రీనివాస్ విషయంలో కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. టీడీపీ నుంచి రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌లో చేరిన వారిలో రావి శ్రీనివాస్ ఒకరు. అయితే తెలంగాణ–ఆంధ్రా అనే సెంటిమెంట్ రగిలిన సిర్పూరులో రావి శ్రీనివాస్‌కు ఇస్తే ఫలితం ఉండదని నివేదికలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు సీట్ల విషయంలో ఇంకా స్పష్టత రాలేదని సమాచారం. ఢిల్లీలో వినోద్ లాబీయింగ్ టీఆర్ఎస్లో సీటు రాక అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి జి.వినోద్ కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి చెన్నూరు కాకపోతే బెల్లంపల్లి నుంచైనా పోటీకి సిద్ధమని సంకేతాలు ఇచ్చారు. అయితే సోదరుడు వివేక్‌తో కలిసి వస్తేనే కాంగ్రెస్‌లో చేర్చుకుంటామని అధిష్టానం నుంచి సమాచారం అందడంతో ఆయన మీమాంసలో పడ్డారు. గురువారం వినోద్ ఢిల్లీలోనే ఉన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలతో లాబీయింగ్ చేసినట్లు సమాచారం. అదే రోజు వినోద్ సోదరుడు వివేక్ ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో కలిసి టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అంతకు ముందు రోజు పెద్దపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి గ్రామాల్లో ప్రచారం జరిపారు. ఈ పరిస్థితుల్లో వినోద్ పోటీ ఏ పార్టీ నుంచి అనే ప్రశ్న ఉత్పన్నమైంది. తాజాగా టీజేఎస్‌లో చేరి చెన్నూరు నుంచి పోటీ చేస్తారనే వార్తలు కూడా వ్యాపించాయి. అయితే ఈ సీటు గ్రూప్1 అధికారిగా రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన బోర్లకుంట వెంకటేష్ నేత కు ఖరారైనట్లు తెలుస్తోంది. రాహుల్‌గాంధీతో భేటీలో కోదండరామ్ ఏ విషయాలను చర్చిస్తార నే దానిపై చెన్నూరు సీటు ఆధారపడి ఉంటుంది. మరో నాలుగు స్థానాల్లో కూడా ఫైనల్ ఇప్పటికే నిర్మల్, ఆసిఫాబాద్, ఖానాపూర్ నియోజకవర్గాలలో అభ్యర్థులను ఖరారు చేసిన అధిష్టానం ఇద్దరు అభ్యర్థుల మధ్య గట్టి పోటీ ఉన్న మరో ఆరు స్థానాల్లో నాలుగు చోట్ల అభ్యర్థులను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. చెన్నూరు నుంచి వెంకటేశ్ నేతతో పాటు ఆదిలాబాద్ నుంచి గండ్రత్ సుజాత, మంచిర్యాల నుంచి మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు, బోథ్ నుంచి సోయం బాపురావు పేర్లు ఖరారయ్యాయని సమాచారం. ఏడుగురు అభ్యర్థులను తొలి జాబితాలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమీకరణల్లో తప్పనిసరి మార్పులు ఉంటే తప్ప ఈ జాబితానే వెలుగు చూస్తుందనడంలో సందేహం లేదు. -
నేడో రేపో కాంగ్రెస్ జాబితా
అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను నేడో రేపో విడుదల చేసేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో 11 అసెంబ్లీ స్థానాలకు గాను తొలి జాబితాలో ఐదు లేదా ఆరుగురు అభ్యర్థుల పేర్లుండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహా కూటమిలోని భాగస్వామ్య పార్టీల నడుమ పోటీ చేయాల్సిన సీట్ల సంఖ్యపై ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలిసింది. ప్రస్తుతానికి నాలుగు అసెంబ్లీ స్థానాలపై మహా కూటమి పార్టీల నడుమ పీటముడి పడినట్లు సమాచారం. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. గురు లేదా శుక్రవారం పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ ప్రకటించే అవకాశం ఉంది. మహా కూటమి భాగస్వామ్య పార్టీలు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నడుమ పోటీ చేయాల్సిన స్థానాల సంఖ్యపై స్పష్టమైన అవగాహన కుదిరినట్లు తెలిసింది. ఏయే స్థానాల్లో ఏయే పార్టీలు తమ అభ్యర్థులను నిలపాలనే అంశంపై ఇంకా మంతనాలు కొనసాగుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో సామాజిక వర్గాల లెక్కలు కూడా అత్యంత కీలకంగా మారాయి. ఉమ్మడి మెదక్‌జిల్లా పరిధిలో 11 అసెంబ్లీ స్థానాలకు గాను, మహా కూటమి భాగస్వామ్య పార్టీల నడుమ నాలుగు అసెంబ్లీ స్థానాలపై పీటముడి పడింది. పటాన్చెరు అసెంబ్లీ స్థానాన్ని తమకు కేటాయించాల్సిందిగా టీడీపీ గట్టిగా పట్టుపడుతోంది. దుబ్బాక లేదా మెదక్ అసెంబ్లీ స్థానాన్ని కేటాయించాల్సిందిగా తెలంగాణ జన సమితి మహాకూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్‌పై ఒత్తిడి తెస్తోంది. మరోవైపు హుస్నాబాద్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునేది లేదని సీపీఐ తెగేసి చెప్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ తొలి విడత జాబితాలో ఈ నాలుగు అసెంబ్లీ స్థానాలకు చోటు దక్కే అవకాశం లేదు. మరోవైపు టికెట్ల కోసం పార్టీలో అంతర్గత పోటీ నెలకొన్న సిద్దిపేట, నారాయణఖేడ్ అభ్యర్థుల పేర్లు కాంగ్రెస్ తొలి విడత జాబితాలో ఉండకపోవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఐదు లేదా ఆరు స్థానాల్లోనే.. సీట్ల సర్దుబాటులో కూటమి భాగస్వామ్య పక్షాలు గట్టిగా పట్టుబట్టని ఐదు అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల పేర్లు తొలి జాబితాలో కచ్చితంగా ఉండనున్నాయి. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ (అందోలు) జె.గీతారెడ్డి (జహీరాబాద్), సునీత లక్ష్మారెడ్డి (నర్సాపూర్), తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (సంగారెడ్డి) ఒంటేరు ప్రతాప్‌రెడ్డి (గజ్వేల్) అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం వ్యక్తం కావడంతో తొలి జాబితాలో వీరికి చోటు దక్కనుంది. హుస్నాబాద్ అసెంబ్లీ స్థానాన్ని కూటమి భాగస్వామ్య పక్షం సీపీఐ బలంగా కోరుతున్నా, కాంగ్రెస్ మాత్రం అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి అభ్యర్థిత్వంవైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. తాము బలంగా ఉన్న హుస్నాబాద్ స్థానాన్ని కేటాయించలేమంటూ సీపీఐకి తెగేసి చెప్పినట్లు సమాచారం. ఇటీవలే టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మా జీ కౌన్సిలర్ దరపల్లి చంద్రంకు సిద్దిపేట టికెట్ దాదాపు ఖాయమైనా, తొలి జాబితాలో ఆయనకు చోటు దక్కే సూచనలు కనిపించడం లేదు. సామాజికవర్గాల లెక్కలే కీలకం మహా కూటమిలో పీటముడి ఏర్పడిన దుబ్బాక, మెదక్, పటాన్చెరు స్థానాలు ఏ పార్టీ ఖాతాలోకి వెళ్తాయనే అంశంపై ఆధారపడి, నారాయణఖేడ్, సిద్దిపేట నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లపై స్పష్టత రానుంది. కూటమి భాగస్వామ్య పక్షాల్లో సామాజికవర్గాల లెక్కలు కూడా సీట్ల సర్దుబాటుకు ప్రధాన అవరోధంగా మారాయి. పటాన్చెరు స్థానాన్ని కాంగ్రెస్ లేదా టీడీపీ బీసీ అభ్యర్థికి కేటాయించే పక్షంలో నారాయణఖేడ్‌లో రెడ్డి సామాజికవర్గం అభ్యర్థికి టికెట్ కేటాయింపు అవకాశాలు మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. దుబ్బాకలో టీజేఎస్ బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చే పక్షంలో మెదక్‌లో కాంగ్రెస్ నుంచి రెడ్డి సామాజికవర్గం అభ్యర్థి అవకాశాలు మెరగవుతాయనే లెక్కలతో ఆయా పార్టీల ఔత్సాహిక నేతల్లో గందరగోళం నెలకొంది. ఎక్కే మెట్టు.. దిగే మెట్టు ఉమ్మడి మెదక్ జిల్లాలో అభ్యర్థుల ఎంపికపై ఏకాభిప్రాయం ఉన్న ఐదుగురు నియోజకవర్గాలు మినహా మిగతా స్థానాలకు సంబంధించి టికెట్ ఆశిస్తున్న నేతలు హైదరాబాద్‌లో మకాం వేశారు. తమ అసెంబ్లీ సీటును కాంగ్రెస్‌కు కేటాయించే స్థానాల్లో టికెట్ ఇవ్వాలంటూ ఔత్సాహికులు గాంధీభవన్ చుట్టూ తిరుగుతున్నారు. పటాన్చెరు స్థానం టీడీపీకి కేటాయించే పక్షంలో తమకే అవకాశం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్, జెడ్పీటీసీ సభ్యుడు శ్రీకాంత్ గౌడ్ ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో ప్రయత్నాలు సాగిస్తున్నారు. సిద్దిపేట, దుబ్బాక, మెదక్, సంగారెడ్డికి చెందిన టీజేఎస్ నేతలు మాత్రం తమ సెగ్మెంటును పొత్తులో భాగంగా కోరడంతో పాటు, తమకే పోటీ అవకాశం ఇవ్వాలంటూ కోదండరాం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. -
మాదంటే.. మాదే
సాక్షి, మెదక్: మెదక్ అసెంబ్లీ సీటుపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. మహాకూటమిలో భాగంగా మెదక్ సీటు ఎవరికి దక్కుతుందో ఇంకా ప్రకటించలేదు. రెండు రోజుల్లో మహాకూటమిలో చర్చలు కొలిక్కివస్తాయని తెలుస్తోంది. కూటమిలో చర్చలు తేలకముందే మెదక్ స్థానం మాకు దక్కింది.. మేమే పోటీ చేస్తామని కాంగ్రెస్ నాయకులు, కాదు.. కాదు పొత్తులో భాగంగా టిక్కెట్ మాకు వచ్చింది మేమే పోటీ చేస్తామని టీజేఎస్ స్థానిక నాయకులు ప్రకటించుకుంటున్నారు. దీంతో మెదక్ నుంచి ఏ పార్టీ బరిలోకి దిగుతుందో తెలియక కాంగ్రెస్, టీజేఎస్ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి. మెదక్ సీటు విషయమై రాష్ట్ర స్థాయిలో మాజీ ఎంపీ, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా ఎట్టిపరిస్థితుల్లో మెదక్‌ను టీజేఎస్‌కు ఇవ్వవద్దని అధిష్టానంపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. మరోవైపు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ సైతం మెదక్ స్థానం కోసం ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. మహాకూటమి పొత్తు విషయమై రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం. సీట్ల సర్దుబాటుపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో చర్చించేందుకు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీజేఏసీ అధ్యక్షుడు కోదండరామ్ బుధవారం ఢిల్లీ పయనం అయ్యారు. గురు, శుక్రవారాల్లో సీట్ల సర్దుబాటుతోపాటు అభ్యర్థులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై నిర్ణయం వెలువడకముందే మెదక్ నియోజకవర్గంలోని టీజేఏఎస్ నాయకత్వం తమకు మెదక్ సీటు దక్కిందని చెబుతున్నారు. టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి మెదక్ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు. పొత్తులో భాగంగా మెదక్ సీటు తమ పార్టీకి వచ్చిందని, తానే పోటీ చేయనున్నట్లు జనార్దన్‌రెడ్డి సొంత పార్టీ నాయకులకు రెండు రోజులుగా చెబుతున్నారు. కాంగ్రెస్ నాయకులకు సైతం తమకు మెదక్ స్థానం వచ్చినట్లు తెలియజేశారు. దీంతో మెదక్ నియోజకవర్గ కాంగ్రెస్ ఆశావహులు ఖంగుతిన్నారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణులు సైతం అయోమయానికి గురయ్యాయి. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న భట్టి జగపతి, సుప్రభాతరావు, తిరుపతిరెడ్డి, బాలకృష్ణ తదితరులు మాజీ ఎంపీ విజయశాంతిని కలిసి తమ ఆందోళన వ్యక్తం చేశారు. మెదక్ స్థానం ఎట్టిపరిస్థితుల్లో టీజేఎస్‌కు ఇవ్వవద్దని, కాంగ్రెస్ పోటీ చేసేలా చూడాలని విజయశాంతిని కోరారు. మెదక్ స్థానం ఎట్టిపరిస్థితుల్లో వదులుకునేది లేదని మాజీ ఎంపీ విజయశాంతి సైతం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ ఆశావహులు ఇదే విషయాన్ని నియోజకవర్గంలోని తమ నాయకులు, కార్యకర్తలకు తెలియజేస్తున్నారు. మెదక్ నుంచి ఎట్టిపరిస్థితుల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని స్పష్టంగా చెబుతున్నారు. కాగా టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి మాత్రం సీటు తమదేనని, మెదక్ నుంచి తానే పోటీ చేస్తానని తెలిపారు. టీజేఎస్ ఉమ్మడి మెదక్ జిల్లాలో దుబ్బాక, మెదక్ అసెంబ్లీ స్థానాలు కోరిందని, రెండు స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖత వ్యక్తి చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్, టీజేఎస్ రెండు పార్టీల నేతలు ఎవరికి వారే తామే బరిలో దిగుతామని చెబుతుండటంతో మెదక్ స్థానంపై ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. -
నేడు రెండో జాబితా విడుదల
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అభ్యర్థుల రెండో జాబితా ప్రకటించడానికి బీజేపీ కసరత్తు పూర్తిచేసింది. గురువారం ఢిల్లీలో కేంద్ర నాయకత్వం ఆమోదముద్ర వేసిన అనంతరం ఈ జాబితా విడుదల కానుంది. దసరా మరుసటి రోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు అభ్యర్థులను ఎంపిక చేసిన బీజేపీ అధిష్టానం.. తాజాగా మరికొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది. పోటీ తీవ్రంగా ఉన్న నియోజకవర్గాలను పెండింగ్‌లో పెట్టి.. మిగతావాటిని వెల్లడించనుంది. షాద్‌నగర్, కల్వకుర్తి, ఎల్బీనగర్, తాండూరు, మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్ నియోజకవర్గాలకు మొదటి జాబితాలో అభ్యర్థులను ఖరారు చేసింది. తాజాగా ఇబ్రహీంపట్నం, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కొడంగల్, రాజేంద్రనగర్ నియోజకవర్గాలను అభ్యర్థులను ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందులో రాజేంద్రనగర్‌కు మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత బద్దం బాల్‌రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అయితే, స్థానిక నాయకులు ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడి నుంచి ఇటీవల టీఆర్ఎస్కు రాజీనామా చేసిన తోకలశ్రీశైలంరెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ఇంకా పార్టీ తీర్థం పుచ్చుకోనందున ఆయన అభ్యర్థిత్వాన్ని పరిశీలించలేనట్లు కనిపిస్తోంది. కూకట్‌పల్లికి మాధవరం కాంతారావు, శేరిలింగంపల్లికి పారిశ్రామికవేత్త యోగానంద్, కొడంగల్‌కు సీనియర్ నాయకుడు నాగురావు నామోజీ, ఇబ్రహీంపట్నంకు కొత్త ఆశోక్‌గౌడ్ పేరును రాష్ట్ర నాయకత్వం సిఫార్సు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. గురువారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జీ జేపీ నడ్డా నేతృత్వంలో భేటీ అయ్యే ఎన్నికల కమిటీలో వీరి అభ్యర్థిత్వాలపై తుది నిర్ణయం తీసుకునే వీలుంది. ఇదిలావుండగా, ఇతర పార్టీల నుంచి చేరికలుంటాయని సంకేతాలందిన నియోజకవర్గాల టికెట్లను పెండింగ్‌లో పెట్టాలని యోచిస్తోంది. -
ముడి వీడుతోంది!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీ టికెట్ల ముడి వీడుతోంది. జిల్లా, రాష్ట్ర పార్టీల నుంచి వచ్చిన ఆశావహుల జాబితాలను పరిశీలించిన భక్తచరణ్‌దాస్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ ఏ నియోజకవర్గంలో ఎవరికి సీటిస్తే గెలిచే అవకాశాలు ఉంటాయనే నివేదికను ఏఐసీసీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి అందజేసింది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీతో బుధవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి , ప్రచార కమిటీ కన్వీనర్ మల్లు భట్టి విక్రమార్క తదితరులు భేటీ అయినట్లు సమాచారం. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తుది పరిశీలన తరువాత అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అభ్యర్థుల జాబితా ప్రకటించిన తరువాత రెబల్స్‌గా బరిలో నిలిచే అవకాశం లేని అభ్యర్థులను తొలి జాబితాగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన పది నియోజకవర్గాల్లో కూడా తొలి జాబితాలో ముగ్గురు నుంచి ఐదుగురి పేర్లు ఉండొచ్చని పార్టీ వర్గాల నుంచి అందిన సమాచారం. మూడు సీట్లు ఇప్పటికే ఖరారు ఉమ్మడి జిల్లాలో వివాదం లేని సీట్లలో ఇప్పటికే అభ్యర్థులు ఖరారయ్యారు. నిర్మల్ నుంచి డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఆసిఫాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో పాటు టికెట్టు హామీతోనే కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ రాథోడ్ రమేష్‌కు ఖానాపూర్ సీటును ఖరారు చేశారు. ఈ మూడు సీట్లతో పాటు బెల్లంపల్లి సీటును సీపీఐకి ఇవ్వాలని కూడా నిర్ణయించారు. మిగతా ఆరు సీట్ల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చినప్పటికీ, రెండో జాబితాలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. స్థానిక అంశాలే ప్రాతిపదిక టికెట్టు కోసం తీవ్ర పోటీ ఉన్న సీట్ల విషయంలో స్థానిక అంశాలను, సామాజిక సమీకరణాలను, ప్రజల్లో ఎవరికి పట్టు ఉందన్న అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు తెలిసింది. ఒకరికి టికెట్టు ఇచ్చినప్పుడు మరో నాయకుడు రెబల్‌గా బరిలోకి దిగే అవకాశాలున్నాయని భావించిన సీట్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని పార్టీ యోచిస్తోంది. ఇలాంటి సీట్ల విషయంలో పోటీలో ఉన్న మరో నాయకుడితో మాట్లాడి ఒప్పించి టికెట్లు ప్రకటించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్సీ కె.ప్రేంసాగర్‌రావుకు సీటిస్తే మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉం ది. అరవింద్‌రెడ్డికి టికెట్టు ఇచ్చినా అదే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరికి టికెట్టు ఇస్తున్నారో ఇద్దరికి తెలియజేసి, అందుకు గల కారణాలను వివరించాలని అధిష్టానం భావిస్తోంది. అందుకే మం చిర్యాలతో పాటు చెన్నూరు, ఆదిలాబాద్, సిర్పూ రు టికెట్లు రెండో జాబితాలో ప్రకటించాలని భావిస్తోంది. ఈ నియోజకవర్గాల్లో ప్రాధాన్యత క్రమంలో ఎవరికి సీటివ్వాలనే అంశంపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని సమాచారం. టీజేఎస్‌కు ఏ స్థానం..? ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జన సమితి ఉమ్మడి జిల్లాలో మూడు సీట్లను ఆశిస్తోంది. అయితే టీజేఎస్‌కు ఆఫర్ చేసినట్టుగా చెపుతున్న సీట్లలో ఈ మూడు లేవు. చెన్నూరు సీటు కోసం పట్టు పడుతున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ, అక్కడ కాంగ్రెస్ పోటీ చేస్తేనే టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్‌కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సర్వే నివేదికల ద్వారా తేలినట్లు సమాచారం. రాహుల్‌గాంధీ సన్నిహితుడైన కొప్పుల రాజు ఆశీస్సులతో ఇక్కడ బోర్లకుంట వెంకటేశ్ నేత ప్రచారం సాగిస్తున్నారు. ఈనేపథ్యంలో చెన్నూరు టీజేఎస్‌కు ఇచ్చే అవకాశం లేదు. ఆసిఫాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సీటు దాదాపుగా ఖరారైంది. గతంలో గెలిచిన ఈ సీటును కాంగ్రెస్ వదులుకునేందుకు సిద్ధంగా లేదు. మిగిలిన సీటు ముథోల్ ఒక్కటే. భైంసాలో రాహుల్‌గాంధీ బహిరంగసభ విజయవంతమైన నేపథ్యంలో కాంగ్రెస్ ఆశావహులు ఈ సీటు మీద ఆశలు పెట్టుకున్నారు. రామారావు పటేల్, నారాయణరావు పటేల్, విజయకుమార్‌రెడ్డి వంటి నేతలు పోటీ పడ్డారు. రామారావు పటేల్‌కు సీటొచ్చే అవకాశాలున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఉమ్మడి జిల్లాలో తమకు సీటు కావాలని టీజేఎస్ గట్టి పట్టు పడితే ముధోల్ కేటాయించే అవకాశం ఉంది.