సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. అభ్యర్థులపై గులాబీ బాస్ కసరత్తు ప్రారంభించారు. ఆగస్టులో అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించనున్నట్లు సమాచారం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కీలక నేతల చేరిక తర్వాత అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశముంది. మొదటి విడతలో గెలుపు గుర్రాల మొదటి జాబితా బీఆర్‌ఎస్ అధినేత సిద్ధం చేస్తున్నారు. ఆగస్టులో మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిసింది.
అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధతపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్.. సర్వే సంస్థల నివేదికలు, వివిధ నిఘా సంస్థల రిపోర్టుల ఆధారంగా, నియోజకవర్గాల వారీగా బీఆర్‌ఎస్, విపక్షాల బలాలు, బలహీనతలపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం.
చదవండి: కేసీఆర్‌కు అన్ని విషయాలు తెలుసు: జలగం వెంకట్రావ్ కీలక వ్యాఖ్యలు
సిట్టింగ్ ఎమ్మెల్యేలు విఫలమైన చోట ఇతరులకు టికెట్ కేటాయించే అంశంపై కూడా ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. సర్వేలు, పనితీరు ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన కేసీఆర్.. మొదటి జాబితాలో అత్యధిక స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment