సాక్షిప్రతినిధి, నల్లగొండ : మందుస్తు ఎన్నికలకు షెడ్యూలు విడుదలైనా.. పోలింగ్‌కు సుమారు రెండు నెలల గడువు చిక్కడంతో కమలనాథులు నింపాదిగా అభ్యర్థుల ఖరారుపై కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఆ పార్టీ నాయకత్వం అభ్యర్థుల ఎం పిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఆ పార్టీ నాయకులు కొందరు ఇప్పటికే తమకు పోటీచేసే అవకాశం ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వానికి దరఖాస్తు చేసుకోగా, ఆయా నియోజకవర్గాల్లోని నాయకుల సీని యారిటీని పరిగణనలోకి తీసుకుని నాయకత్వం మరి కొందరి పేర్లను పరిశీలిస్తోందని చెబుతున్నారు.
ఉమ్మ డి జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో ఎస్సీ రిజ ర్వుడు స్థానం నకిరేకల్‌కు విపరీతమైన పోటీ ఉందని, ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారని సమాచారం. అసలు మొత్తంగా ఎందరు నేతలు పోటీకి సుముఖంగా ఉన్నారు? ఏయే నియోజకవర్గాల్లో పార్టీ పరి స్థితి ఎలా ఉంది? ఆశావహుల్లో ఎందరికి కార్యకర్తల మద్దతు ఉంది .. తదితర అంశాలను పరిశీలించేందు కు జాతీయ నాయకత్వం నల్లగొండకు రానుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
24న ముఖ్య కార్యకర్తల సమావేశం ఎన్నికలకు సమయం బాగానే ఉండడంతో బీజేపీ నాయకత్వం జిల్లాల వారీగా సమావేశాలతో క్షేత్ర స్థాయిలోని కార్యకర్తల మనోభావాలను తెలుసుకునే పనిలో ఉందంటున్నారు. దీనిలో భాగంగానే ఈనెల 24వ తేదీ తర్వాత జిల్లా కేంద్రంలో జాతీయ నాయకుడు మురళీధర్ రావు, మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రత్యేక సమావేశానికి హాజరు కానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని, ఆశావహుల్లో ఎవరైతే నెగ్గుకు రాగలుగుతారన్న అంశాలను వీరు సమీక్షిస్తారని చెబుతున్నారు. ఆ తర్వాతే ఆయా స్థానాల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని సమాచారం. దీంతో ఆ పార్టీ ఆశావహులు అభ్యర్థిత్వాల ప్రకటన కోసం దసరా వెళ్లిపోయేదాకా ఎదురుచూడక తప్పని పరిస్థితి ఉంది. కాగా, కొన్ని నియోజకవర్గాల్లో కొందరు సీనియర్ నాయకులు పోటీకి సుముఖంగా లేరని, ఓడిపోతామనుకుంటున్న స్థానాల్లో పోటీ చేయడం ఎందుకన్న నిరాసక్తతలో ఉన్నారని అంటున్నారు.
ఆశావహులు వీరే..!
నల్లగొండ జిల్లా కేంద్రంనుంచి తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పార్టీ సీనియర్ నాయకుడు రామోజు షణ్ముఖా చారి ఒక్కరే దరఖాస్తు చేసుకున్నారని అంటున్నారు. అయితే, పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకల నర్సింహారెడ్డిని పోటీకి పెట్టాలని కొందరు ముఖ్య నాయకులు రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని కోరారని తెలిసింది. దీంతో నల్లగొండలో నూకల నర్సింహారెడ్డి, రామోజు షణ్ముఖ, మాజీ అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని సమాచారం.
మునుగోడులో గత ఎన్ని కల్లో పోటీ చేసిన జి.మనోహర్‌రెడ్డి, దేవరకొండలో కళ్యాణ్‌నాయక్, నాగార్జున సాగర్‌లో కంకణాల శ్రీధర్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు, మిర్యాలగూడలో పురుషోత్తంరెడ్డి, పాదూరి కరుణ, హు జూర్‌నగర్‌లో బొబ్బ భాగ్యారెడ్డి, కోదాడలో రాం నేని ప్రభాకర్, నూనె సులోచన, సూర్యాపేటలో సంకినేని వెంకటేశ్వర్‌రావు, తుంగతుర్తిలో రామచంద్రయ్య, ఆలేరులో దొంతిరి శ్రీధర్‌రెడ్డి, భువనగిరిలో శ్యాంసుందర్‌రావు తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక, ఎస్సీ రిజర్వుడు స్థానమైన నకిరేకల్‌లో టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు మిగిలిన నియోజకవర్గాల్లో కంటే ఎక్కువ మంది ఉన్నారని సమాచారం. ఇక్కడ బాకి పాపయ్య, లింగస్వామి, మరో ఇద్దరు ఎన్‌ఆర్‌ఐలు సైతం టికెట్ ఆశిస్తున్నారని పార్టీ వర్గాల సమాచారం. ఈ నెల 24వ తేదీన జరిగే సమావేశం తర్వాత బీజేపీ అభ్యర్థుల విషయంలో స్పష్టత వస్తుందని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment