నిజామాబాద్‌అర్బన్: అసెంబ్లీ ఎన్నికలకు జిల్లాలోని ఆరు నియోజక వర్గాల్లో మొత్తం 67 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ గురువారం ముగియగా ఆయా నియోజక వర్గాల్లో రిటర్నింగ్ అధికారులు బరి లో నిలిచిన అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. ఈనెల 12 నుంచి 19 వరకు నామినేషన్ల స్వీకరణ, 21, 22 తేదీల్లో నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణలు కొనసాగాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 94 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయ గా 16 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 78 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందగా, అనంతరం 11 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఆయా నియోజక వర్గాల్లో టికెట్లు ఆశించిన భంగపడిన వారు పోటీనుంచి తప్పుకున్నారు.
బాన్సువాడలో కాంగ్రెస్ రెబెల్ మల్యాద్రి రెడ్డి పోటీ నుంచి తప్పుకున్నారు. రెబల్‌గా బరిలో నిలిచిన అభ్యర్థులను ఆయా పార్టీల రాష్ట్ర నాయకులు బుజ్జగించారు. కొందరు రెబల్స్ పార్టీ నాయకుల సూచనల మేరకు ఉపసంహరించుకున్నారు. నిజామాబాద్ అర్బన్‌లో కాంగ్రెస్ టికెటు ఆశించిన భంగపడిన రత్నాకర్ ఆల్‌ఇండియా ఫార్వాడ్‌బ్లాక్ పార్టీ నుంచి పోటీలో ఉంటున్నట్లు పేర్కొన్నారు. నిజామాబాద్ అర్బన్‌లో బీజేపీ నుంచి టికెటు ఆశించి భంగపడిన ధన్‌పాల్ సూర్యనారాయణ శివసేన పార్టీ నుంచి నామినేషన్ వేశారు. అనంతరం బీజేపీ రాష్ట నాయకుడు కిషన్‌రెడ్డి తదితరులు నిజామాబాద్ వచ్చి ధన్‌పాల్‌ను కలిసి పోటీనుంచి తప్పించారు. మిగిలిన నియోజక వర్గాల్లో పోటీ కొనసాగనుంది.
పోలింగ్ రోజు సెలవు ప్రకటించాలి
నిజామాబాద్ అర్బన్: వచ్చే నెల డిసెంబర్ 7న సాధారణ ఎన్నికలకు పోలింగ్‌జరుగనుందన అన్ని వాణిజ్య సంస్థలు, దుకాణాలు కార్మిక విభాగం సముదాయాలు సెలవు ప్రకటించాలని ఉప కార్మిక కమిషనర్ చతుర్వేది ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసిందని ఆయన తెలిపారు. కార్మికులందరు తమ ఓటు హక్కు వినియోగించుకునేందకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించాలన్నారు. పోలింగ్ రోజున తప్పనిసరిగా దుకాణాలు, వ్యాపారాలు మూసిఉంచాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment